
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.
మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.

ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.
దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.
Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC
🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025
Source: The Hindu