ప్రేమ పేరుతో CISF అధికారిణి వంచన.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య | UP It Man Abhishek Dies In Mangaluru For blames girlfriend | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో CISF అధికారిణి వంచన.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

Published Tue, Mar 4 2025 10:39 AM | Last Updated on Tue, Mar 4 2025 10:39 AM

UP It Man Abhishek Dies In Mangaluru For blames girlfriend

యశవంతపుర: సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది. సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసి సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఘటన చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. ఉత్తర‌ప్రదేశ్‌లోని ఘాజిపురకు చెందిన అభిషేక్‌ సింగ్‌(40).. చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌ చెందిన మోనిక సింగ్‌తో అభిషేక్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె బెళగావిలో సీఐఎస్‌ఎఫ్‌లో సహాయక కమాండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే, ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని అభిషేక్‌ ఆరోపించారు. సోమవారం మంగళూరు రావ్‌ సర్కిల్‌లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్‌ సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అంతకుముందు ఆయన రాసిన లేఖలో సదరు మహిళకు వివాహం అయినప్పటికీ, వివాహం కాలేదని నమ్మించి తన లైంగిక అవసరాలు తీర్చుకున్నారని ఆరోపించారు. పెళ్లి చేసుకుందామని అడిగితే బెదిరించి మానసికంగా హింసిస్తోందని వీడియోలో చెప్పాడు. ఈ సందర్భగా తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పోస్టు చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement