అంబేడ్కర్‌ను అవమానించిన షా వైదొలగాల్సిందే
సీడబ్ల్యూసీ భేటీ తీర్మానం
2025లో సంస్థాగతంగా సమూలమార్పులు: ఖర్గే
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది.
పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని
కోరింది.
మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ
మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment