Congress Working Committee
-
తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం
బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ వర్కింగ్ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్ చేసింది. అమిత్ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్ఎస్ఎస్–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది. పోలింగ్ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని కోరింది. మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. -
పార్టీ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయాలంటే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగా పార్టీ నేతలు ఐకమత్యంతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోవడం మానాలని హితవు పలికారు. అదేవిధంగా, ఈవీఎంల వల్లే ఎన్నికల ప్రక్రియను అనుమానించాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల కమిషన్‌దేనని ఖర్గే నొక్కి చెప్పారు. అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై ఈ సమావేశంలో ప్రధానంగా నేతలు చర్చించారు. ఈ భేటీలో ఖర్గే ప్రసంగించారు.నేతల మధ్య కలహాలతోనే పార్టీకి చేటుకాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఖర్గే మండిపడ్డారు. నేతల్లో ఐకమత్యం లేకపోవడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పెడపోకడలు పార్టీకి చేటు తెస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కతాటిపై నిలబడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే రాజకీయ ప్రత్యర్థులను ఎలా ఓడించగలం?అని ప్రశ్నించారు. ‘ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని, లోపాలను సరి చేసుకోవాలి. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, సరైన వ్యూహంతో ముందుకు సాగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఐకమత్యం, క్రమశిక్షణ కలిగి ఉండటం ఎంతో ముఖ్యమైంది. పార్టీ గెలుపును తమ గెలుపుగా, ఓటమిని సొంత ఓటమిగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉంది. పార్టీ బలమే మన బలం’అని ఖర్గే చెప్పారు. అదే సమయంలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడరాదని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ‘అట్టడుగు స్థాయి నుంచి ఏఐసీసీ స్థాయి వరకు సమూలంగా మార్పులు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలి. ఈ ప్రక్రియలో ఏఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అవి ఊహించని ఫలితాలులోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించి, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు పార్టీని ఒక్కసారిగా కుదిపేశాయని ఖర్గే అన్నారు. ‘మహా వికాస్ అఘాడీ సాధించిన ఫలితాలు రాజకీయ పండితులు సైతం ఊహించనివి. ఇలాంటి ఫలితాలు ఏ అంచనాలకూ అందనివి. నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసిన ఇండియా కూటమి పార్టీలు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ, మనం సాధించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. మన పార్టీ భవిష్యత్తుకు ఇదో సవాల్. ఈ ఫలితాలు మనకో గుణపాఠం. వీటిని బట్టి సంస్థాగతంగా మనకున్న బలహీనతలను, లోపాలను సరిచేసుకోవాలి. ఎన్నికల సమయంలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపించినా ఆ మేరకు విజయం సాధించలేకపోయాం. అనుకూల వాతావరణాన్ని అనుకూల ఫలితాలను సాధించేలా మనం మార్చుకోలేకపోయాం.దీనిపై ఆత్మ విమర్శ చేసుకోవాలి’అని ఖర్గే తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జై రామ్ రమేశ్ పాల్గొన్నారు.ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై ఉద్యమంయావత్తూ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దారుణంగా దెబ్బతిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఈ అంశంపై త్వరలో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక తీర్మానం ఆమోదించింది. ‘సమాజంలోని అన్ని వర్గాల్లో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. ప్రజల ఆందోళనలకు కాంగ్రెస్ జాతీయ స్థాయి ఉద్యమ రూపం తీసుకువస్తుంది’అని ఆ తీర్మానం తెలిపింది. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరపాలనే రాజ్యాంగ నిర్దేశం అమలు ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రశ్నార్థకంగా మారిపోయిందని తీర్మానం పేర్కొంది.దాదాపు నాలుగున్నర గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించి, తీర్మానం ఆమోదించిందని జైరాం రమేశ్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్ మీడియాకు చెప్పారు. సంస్థాగత అంశాలు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా సమావేశం నిర్ణయించిందని వివరించారు. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కీలక సమావేశం శనివారం ఢిల్లీలోని అశోక హోటల్లో జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ అగ్రనేతలు చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. సమావేశం తర్వాత విందు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులు సైతం ఈ భేటీలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాం«దీని ఎన్నుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. -
పంచ ‘న్యాయ్’లతో ప్రజలకు న్యాయం చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువత, శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చాలని నిర్ణయించింది. పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాం«దీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ‘భారత్ వెలిగిపోతోంది’ నినాదానికి ఏ గతి పట్టిందో, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు అదే గతి పడుతుంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
25 గ్యారంటీల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మూడున్నర గంటలకుపైగా ఈ సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించారు. మొత్తం 25 గ్యారంటీల అమలుకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ‘పాంచ్ న్యాయ్’ పేరుతో అయిదు అంశాలతో మొత్తం 25 గ్యారంటీల మేనిఫెస్టోను ఖరారు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొన్నారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘హిస్సేదారి న్యాయ్’, ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’ పేరిట హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టోలోని 25 గ్యారంటీలు హిస్సేదారి న్యాయ్: 1. సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు కులాల ఆధారంగా జన గణన. 2. రాజ్యాంగ సవరణ ఆధారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రస్తుతమున్న 50 శాతం గరిష్ట పరిమితి తొలగింపు. 3. జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్. 4 అటవీ హక్కుల వివాదాలకు ఏడాదిలోపు పరిష్కారం. 5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాగా గుర్తింపు. కిసాన్ న్యాయ్ : . 1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత. 2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు. 3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు. 4. రైతులు లబ్ధి పొందేలా సుస్థిర ఎగుమతి దిగుమతి విధానం 5. వ్యవసాయ ఇన్‌పుట్స్‌పై జీఎస్టీ మాఫీ. శ్రామిక్ న్యాయ్ : 1. రైట్ టు హెల్త్ చట్టం 2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు 4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా యాక్సిడెంట్ భీమ 5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల యువ న్యాయ్: 1. 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ 2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు,(నెలకు 8,500 చెల్లింపు) 3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం 4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 5. యువత స్టార్టప్ కోసం ఐదు వేల కోట్లు కేటాయింపు నారీ న్యాయ 1. ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం. 2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు. 3. ఆశ, అంగన్వాడి, మిడ్ డే మీల్ వర్కర్లకు ఇచ్చే జీతంలో కేంద్రం వాటా రెట్టింపు. 4. మహిళల హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలో అధికారి మైత్రి ఏర్పాటు 5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో హాస్టళ్ల పెంపు #YuvaNYAY 1. #BhartiBharosa : 30 lakh new central government jobs, according to a jobs calendar 2. #PehliNaukriPakki : One year apprenticeship for all educated youth, at Rs. 1 lakh/year (Rs. 8,500/month) 3. Paper Leak se Mukti: Law to completely end all paper leaks… pic.twitter.com/Pc4OvYgFdG — Jairam Ramesh (@Jairam_Ramesh) March 18, 2024 -
CWC Meeting: సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’(భాగస్వామ్య న్యాయం), ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక.. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఈసీ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 19న జరిగే భేటీలో తెలంగాణలోని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోగా, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. -
వచ్చే వారంలో కాంగ్రెస్ కీలక భేటీలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెట్టి, వాటిని అమలు పరిచే చర్యల్లో భాగంగా వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ కీలక భేటీలు నిర్వహించనుంది. దేశ వ్యాప్తంగా పారీ్టకి తన లక్ష్యాలను వివరించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ), ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ, ప్రచారాస్త్రాల ఖరారుకు మేనిఫెస్టో కమిటీలు వారం రోజుల్లో భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో అభ్యర్థుల జాబితా, ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలపై నేతలకు వివరించే అవకాశాలున్నాయి. రానున్న వారం రోజుల్లో కనీసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. -
CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్‌ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు. -
21న సీడబ్ల్యూసీ కీలక భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) డిసెంబర్ 21వ తేదీన సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ పూర్తయిన రెండు రోజులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో కూటమి పారీ్టలతో సీట్లు పంపకం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమిపై సమీక్ష జరగొచ్చు. నిరుద్యోగం, పెరిగిన ధరలను ప్రధాన విమర్శనా్రస్తాలుగా తీసుకుని పశి్చమ–ఈశాన్య భారతాల మధ్య రాహుల్‌గాంధీ మరోమారు పాదయాత్ర చేసే అంశాన్నీ చర్చించే వీలుంది. 19న ఇండియా ‘కీలక’ భేటీ ‘ఇండియా’ కూటమి విపక్ష పార్టీలు ఢిల్లీలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం జరిగిన చోట్ల ఉమ్మడిగా ప్రచార ర్యాలీలు చేపట్టడం వంటి సవాళ్లు నేతలకు స్వాగతం పలకనున్నాయి. వీటిపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘నేను కాదు, మనం’’ అనే కొత్త నినాదంలో జనంలోకి వెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించిన సంగతి తెల్సిందే. -
అధికారంలోకి రాగానే కుల గణన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేద వర్గాల, దళిత, బీసీల సాధికారత కోసం కుల గణన చేపట్టాలని పేర్కొంది. కుల గణన కోసం అధికార బీజేపీపై ఒత్తిడి పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహిస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కలి్పస్తామని వెల్లడించింది. కుల గణనకు మద్దతు ఇస్తూ సీడబ్ల్యూసీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ అన్నా రు. కుల గణన అనేది ఇండియాకు ఎక్స్–రే అని అభివరి్ణంచారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను సీడబ్ల్యూసీ స్వాగతించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. ప్రభావవంతమైన వ్యూహం కావాలి: ఖర్గే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ప్రభావవంతమైన వ్యూహం అవసరమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా, క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు సీడబ్ల్యూసీ భేటీలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబి్ధదారులకు అందాలంటే కేంద్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించాలని అన్నారు. కుల గణనకు తాను వంద శాతం మద్దతు ఇస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సోనియా గాంధీ చెప్పారు. దానికోసం పోరాడుదామని సూచించారు. కులాల వారీగా జనాభా లెక్కలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
9న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఈ నెల 9న ఢిల్లీలో భేటీ కానుంది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సహా, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేయడంతో పాటు కులగణన, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో చిక్కులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రాల వారీగా ఇండియా కూటమి పక్షాలతో పొత్తులు వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రధానంగా తెలంగాణ సహా మధ్యప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అధికారం కాపాడుకోవడం లక్ష్యంగా సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. -
దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా..
హైదరాబాద్: రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి ప్రస్తావిస్తూ ఎటువంటి ఎజెండా లేకుండా పిలుపునివ్వడం చూస్తుంటే దేశంలో చట్టం పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని అన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో గెలవడమే మా ప్రధాన ఎజెండా అని తద్వారా ఇండియా కూటమిని గెలిపించుకోవడమే మా ముందున్న లక్ష్యమని అది తప్ప మాకు వేరే ఏ ఎజెండా లేదని అన్నారు. ఇక సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి స్పందించారు. ఎటువంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని దీన్ని బట్టే దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. రెండు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటాన్ని స్వాగతిస్తూనే దీన్ని ప్రధాన మంత్రి తోపాటు బీజేపీ శ్రేణులు కూడా జీరించుకోలేకపోతున్నాయని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశాన్ని విభజన రాజకీయాలు, విద్వేష పాలన నుండి విముక్తి కలిగించడానికి సైద్ధాంతిక సిద్ధపాటుతో ఇండియా కూటమి ముందుకొచ్చిందని చెబుతూ సామాజిక సమానత్వాన్ని సాధించి న్యాయాన్ని బలపరిచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, సున్నితమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని అందించాలని కమిటీ తీర్మానించింది. ఈ సందర్బంగా అటవీరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా కమిటీ చర్చించింది. ✅ Telangana implements... Nation follows 🇮🇳 🔹Karnataka Deputy CM DK Shiva Kumar all praise for the best practices adopted in #Telangana 🔹Dy. CM was in #Hyderabad as a part of the Solid Waste Management study tour 🔹 Shiva Kumar said generating energy out of waste at… pic.twitter.com/xNanN6gzU3 — Mission Telangana (@MissionTG) September 17, 2023 ఇది కూడా చదవండి: న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం -
ఎన్నికలకు సై..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని, త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇస్తారనే విశ్వాసాన్ని ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో రెండోరోజు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌గహ్లోత్, సిద్ధరామయ్య, భూపేశ్‌భగేల్, సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు పాల్గొన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, దేశ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఐదు రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న వ్యూహాల గురించి వివరించారు. తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నామని, ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, పదేళ్ల బీజేపీ పాలనా వైఫల్యాలు, పార్టీ అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై ఖర్గే దిశానిర్దేశం చేశారు. యుద్ధానికి సిద్ధం చర్చ అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఎన్నికల యుద్ధానికి సంసిద్ధం కావాలని నిర్ణయించింది. దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పింది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ మధ్యాహ్నం 4 గంటలకు ముగిసింది. అనంతరం ప్రియాంక ఢిల్లీ వెళ్లిపోగా, సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు మిగిలిన సీడబ్ల్యూసీ సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తుక్కుగూడ బహిరంగ సభకు వెళ్లారు. జోడో యాత్ర ఉన్నట్టా లేనట్టా? ఖర్గే చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరోమారు ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమావేశంలో భారత్‌జోడో యాత్రపై చర్చించిన సందర్భంగా రాహుల్ అన్ని శక్తులు అప్పుడే ఉపయోగించాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు ఆయన శక్తియుక్తులు పార్టీకి ఉపయోగపడతాయని ఖర్గే చెప్పారు. ఈ నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్ నుంచి చేపట్టాలని భావించిన 2.0 యాత్రపై ఉత్కంఠ నెలకొంది. మీరు కాంగ్రెస్‌ను ఎందుకు ఎంచుకున్నారు: ఖర్గేకు రాహుల్ ప్రశ్న సీడబ్ల్యూసీలో చర్చ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీరు యువకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ను ఎందుకు ఎంచుకున్నారని ఖర్గేను రాహుల్ ప్రశ్నించారు. ‘అప్పుడు అందరూ కాంగ్రెస్‌ను వదిలి కాంగ్రెస్(ఓ)లో చేరుతున్నారు. కానీ, పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన పని చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్న భావనతో కాంగ్రెస్ లో చేరా. 1969, నవంబర్‌లో పార్టీ బ్లాక్ అధ్యక్షుడి గా బాధ్యతలు చేపట్టా. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిని అయ్యా’ అని ఖర్గే బదులిచ్చారు. -
మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు సోనియా హితవు
హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నియంతృత్వ పాలనకు స్వస్తిపలికేందుకు ప్రజల్లో ఐక్యత తీసుకుని రావాలని క్యాడర్‌కు సూచించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మీడియాతో ముఖాముఖి వెళ్లవద్దని సూచించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 30 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 15 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. కలిసికట్టుగా రావాలి.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు రెండో రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలంతా కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపారు. పదేళ్ల బీజేపీ నిరంకుశ పాలనలో ప్రజల సమస్యలు రెట్టింపయ్యాయని ప్రధాని పేదలు, రైతులు, మహిళలు, యువత, కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే మానేశారని అన్నారు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని.. ప్రేక్షక పాత్ర వహించకుండా ఐక్యతతో నియంతృత్వ పాలనను అంతమొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. మీడియాతో జాగ్రత్త.. అనంతరం సోనియా గాంధీ మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలని వీలయితే మీడియాకు దూరంగా ఉండాలని లేదంటే పొరపాటుగా చేసిన చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చెయ్యాలని కోరారు. ఐక్యత క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు. Sharing opening remarks at the historic Congress Working Committee Meeting at Hyderabad. • I extend you all a very warm welcome to this First Meeting of the newly constituted CWC in this brimming city of Hyderabad. • Indian National Congress has been playing a pivotal role… pic.twitter.com/rSIJ7hQ2Ho — Mallikarjun Kharge (@kharge) September 16, 2023 ఇది కూడా చదవండి: సోనియా గాంధీ ప్రకటించబోయే ఆరు గ్యారెంటీ స్కీంలు ఇవే..! -
కాంగ్రెస్ పెద్దలకు బహిరంగ లేఖ
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికీ, సీడబ్ల్యూసీ సభ్యు లకూ –తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం వదిలి, హైదరాబాద్ నగరంలో నిర్వ హించాలని నిర్ణయించడం, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న కీలక నాయకులు సైతం ఈ సమావేశాలకు రావడం హర్షణీయం. మీరు పొలిటికల్ టూరిస్టులుగాకాకుండా, తెలంగాణ అభివృద్ధిపై అధ్యయనం చేయ డానికి వస్తున్న పరిశోధకులుగా, ఈ పర్యటనను ఒక స్టడీ టూర్‌గా సద్వినియోగపరుచుకోవాలని కోరుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ముందుగా మీరు ‘విశ్వనగరం’ హైదరాబాద్‌లోకి అడుగుపెడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నివసిస్తున్న సబ్బండ వర్గాల ప్రజలకూ, పరిశ్ర మలకూ సకల వసతులూ కల్పిస్తూ, విభిన్న జీవన శైలు లకు నిలయమైన హైదరాబాద్ కున్న ‘గంగా జమునా తెహజీబ్’ ప్రత్యేక వారసత్వ సంస్కృతిని కేసీఆర్ ఎలా కాపాడుతున్నారో గమనించండి. మంత్రి కేటీఆర్ సార థ్యంలో ఐటీ రంగం విప్లవాత్మకమైన ప్రగతి సాధిస్తూ దూసుకుపోతున్న తీరు పరిశీలించండి. మీ పర్యటనలో తెలంగాణ కొత్త సచివాలయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125 అడుగుల అతి పెద్ద విగ్ర హాన్ని చూసి తరించండి. తెలంగాణ అమరవీరులస్మృత్యర్థం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రపంచ స్థాయి అమరవీరుల స్మారకకేంద్రాన్ని సందర్శించండి.మీ పర్యటనలో గ్రామాలకు వెళ్ళినప్పుడు ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో చూడండి. మీరు ‘మిషన్ భగీరథ’ ఘనత తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 24 వేల పల్లెలకు, 121 నగర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికీ పైపు లైనులు ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తూ, ప్రజల దాహార్తిని తీరుస్తోంది ప్రభుత్వం. దాదాపు 80 వేల కోట్ల రూపాయలతో కేవలం 3–4 ఏళ్లలో రికార్డ్ స్థాయిలో నిర్మించిన అతి పెద్ద బహుళ దశల ఎత్తి పోతల పథకం ‘కాళేశ్వరం ప్రాజెక్ట్’ను సందర్శించండి. అంతే కాదు ఒక పక్క మీరు రాజకీయాలు చేస్తుంటే మరోపక్క కేసీఆర్ ‘పాలమూరు– రంగారెడ్డి’ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించి– 13 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి బీళ్లు పడ్డ భూములను కృష్ణా నదీ జలాలతో తడుపుతున్న విషయాన్ని గుర్తించండి. ‘రైతుబంధు’, రైతులకు బీమా, పంటరుణాల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ, ‘ఉచిత విద్యుత్’ సరఫరా వంటి పథకాలు రైతులను ఎలా ఆదుకొంటున్నాయో తెలుసు కోండి.బీఆర్ఎస్ ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులా లను ఏర్పాటు చేసింది. ఆ విద్యాలయాలకు వెళ్ళండి. వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సాగే బోధనను గమనించండి. ‘కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ’, తెలంగాణ ‘గిరిజన సంక్షేమ గురుకులాల’నూ దర్శించండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు, కొత్త జూని యర్ కళాశాలల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు మౌలిక సదుపాయాల కల్పన లాంటి కార్యక్రమాలని ప్రభుత్వం ఎంత నిబద్ధతతో చేపడుతుందో గ్రహించండి. ‘మన ఊరు– మనబడి’, ‘మన బస్తీ–మన బడి’ పథకంలో నిర్మించిన స్కూల్స్ ని సందర్శించండి. ‘కేసీఆర్ కిట్’, ‘బస్తీ దవాఖానాలు’, ‘తెలంగాణ డయాగ్నోస్టిక్స్’, ‘ఆరోగ్యశ్రీ’ ఇలాంటి అద్భుతమైన పథకాల అమలూ; 34 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన గణనీయమైన వృద్ధిని అధ్యయనం చేయండి. తండాలు, గూడేల్ని పంచాయతీలుగా మార్చా లని ఎన్నో ఏళ్లనుంచి కోరుకుంటున్న గిరిజనుల కలని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం దళితుల జీవితాలు ఎంత అద్భుతంగా మార్చిందో మీరు తెలుసుకోవాలి. వ్యవసాయం తరువాత ఎక్కువ శాతం ప్రజలకు జీవనోపాధి ఇస్తున్న వృత్తి చేనేత. నేతన్నల జీవితాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుత మైన మార్పుని పరిశీలించండి. దేశంలో ఎక్కడాలేని విధంగా గొల్ల, కురుమలకు వేలకోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ‘సబ్సిడీ గొర్రెల పంపిణీ’ పథకం, అదే విధంగా కోట్లకొద్దీ చేప పిల్లలను పంపిణి చేసి మత్స్యకారుల ఆదాయానికి తోడ్పడ్డ విషయం తెలుసుకోండి. అలాగే మీ పర్యటనలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళని సందర్శించండి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలు తెచ్చిన కల్యాణ కాంతులు చూడండి. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల గాథ గురించి చెప్పలంటే ఇంకా చాల విషయాలు ఉన్నాయి. మీ సీడబ్లు్యసీ సమావేశాల్లో తెలంగాణలో పదేళ్ళలో జరిగిన అభివృద్ధి దేశంలో అరవై ఏళ్లలో ఎందుకు జరగలేదో లోతుగా చర్చించండి. ఒక విశాల దృక్పథంతో ఆలో చించి, తెలంగాణ అభివృద్ధి సంక్షే మాన్ని మీ రాష్ట్రాలలో అమలు చేసి మీ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించండి. ఇట్లు మీ శ్రవణ్ వ్యాసకర్త బీఆర్ఎస్ నాయకుడు -
ఈనెల 16న హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం..
సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లుత తెలిపారు. 16 తేదీ సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 17 తేదీ విస్తృత స్థాయి వర్కింగ్ కమిటీ సమావేశం ఉందని తెలిపారు. ఆరోజు సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరువతారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. చదవండి: తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్లమెంటరి పార్టీ అధ్యక్షులు సోనియాగాంధీ ,రాహుల్ గాంధీని కలిశారని, చాలా మంచి సమావేశం జరిగిందన్నారు కేసీ వేణుగోపాల్. అయితే షర్మిల చేరిక, పార్టీ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షర్మిల చేరికపై వేచి చూడాలని తెలిపారు. Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 🔥Team @INCTelangana is extremely thankful to AICC President shri @kharge ji for convening the first meeting of the newly constituted CWC in #Telangana. We shall all make it a huge success and work towards the betterment of the people. https://t.co/F306R4Wlf3 — Revanth Reddy (@revanth_anumula) September 4, 2023 Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 -
పేర్లు చూసి టిక్కు పెట్టాలా?..నామ్ కే వాస్తే లిస్ట్..!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వడపోతపై మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం వాడీవేడిగా జరిగింది. సీనియర్ నేతలు కొందరు పలు అంశాలపై సందేహాల పేరిట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఇచ్చిన ఆశావహుల జాబితాలో పేర్లు తప్ప ఎలాంటి సమాచారం లేకపోవడంపై జానారెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న వారి వివరాలేవీ లేకుండా కేవలం జాబితా ఇచ్చేసి టిక్కులు పెట్టమంటే ఎలా అంటూ మండిపడ్డారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ టికెట్ల అంశంపై సీనియర్ నేతల మధ్య వాగి్వవాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పీఈసీ వడపోత కార్యక్రమాన్ని సెపె్టంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాం«దీభవన్‌లో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బలరాం నాయక్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సునీతారావ్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్రావు, మిద్దెల జితేందర్లు పాల్గొన్నారు. అభ్యర్థుల ఖరారులో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, వచ్చే ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలు రూపొందించాలి, ఇతర పారీ్టలతో పొత్తులు తదితర అంశాలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చర్చించారు. పేర్లిస్తే సరిపోతుందా? విశ్వసనీయ సమాచారం మేరకు.. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులందరికీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తుదారుల పేర్లతో కూడిన జాబితా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి మూడు పేర్ల చొప్పున టిక్ చేయాలని కోరారు. అయితే జాబితాలో కేవలం పేర్లు మాత్రమే ఉండటంపై జీవన్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నాల తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలకు, మహిళలకు ఎన్ని సీట్లు ఇస్తారన్న అంశంపై ఎలాంటి స్పష్టత లేకుండా, ఆయా నియోజకవర్గాల్లో ఏ వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు? అనే వివరాలు కూడా లేకుండా అభ్యర్థులను ఎలా షార్ట్ లిస్ట్ చేయాలని ప్రశ్నించారు. ఆశావహుల సీనియార్టీ, పారీ్టలో హోదా, పూర్వ అనుభవం, పార్టీ కోసం చేసిన సేవ, కులం లాంటి వివరాలేవీ లేకుండా కేవలం పేర్లు చూసి టిక్ పెట్టాలంటే ఎలా పెడతామని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జానారెడ్డి, పొన్నాల కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సామాజిక వర్గాల విశ్లేషణ లేకుండా, ఏ ప్రాతిపదికన ఏ కులానికి టికెట్లు ఎన్ని ఇవ్వాలో నిర్ధారించకుండా, ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక వర్గాల ఓటర్లను అంచనా వేయకుండా టిక్కులు చేయడం ఎలా కుదురుతుందని వారు ప్రశ్నించారు. ఆశావహుల పూర్తి వివరాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల సామాజిక వివరాలు ఇవ్వాలని, ఇందుకోసం సమగ్ర సర్వే వివరాలను కానీ, ఇప్పటికే ఏఐసీసీకి పంపిన వివరాలను కానీ జత చేయాలని పొన్నాల సూచించారు. యూత్‌కు ఎన్ని టికెట్లు? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలకు ఇచ్చే టికెట్లను తొలి జాబితాలోనే ప్రకటించాలని అన్నారు. నియోజకవర్గాల్లో పని చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని, ఎన్నికల్లో అన్ని విధాలా వారికి సాయం చేయాలని సూచించారు. యువకులకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే పక్షంలో తన కుమారుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేస్తున్నందున తనతో పాటు తన కుమారుడికి అవకాశం కలి్పంచాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కోరారు. బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారో తేల్చాలని వీహెచ్, మహిళలకు తగిన అవకాశాలు కలి్పంచాలని రేణుకా చౌదరి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముగ్గురిని షార్ట్‌లిస్ట్ చేసే ప్రక్రియను వాయిదా వేయాలని, సెప్టెంబర్ 2న మరోమారు సమావేశమై అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించి వడపోత చేపట్టాలని పీఈసీ నిర్ణయించింది. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి టికెట్లు, బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? మహిళలకు ఎలాంటి ప్రాతినిధ్యం కలి్పంచాలనే అంశాలపై వచ్చే నెల 2న జరిగే సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని పీఈసీ నిర్ణయించింది. బీఆర్ఎస్కు కౌంటర్ వ్యూహం ఉండాలి బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచార రంగంలోకి దిగిపోయిందని, దళిత బంధు లాంటి పథకాల ద్వారా కొత్తగా నియోజకవర్గానికి మరో 10 వేల ఓటు బ్యాంకు తయారు చేసుకుంటోందని, ఈ ఓటు బ్యాంకును కౌంటర్ చేసేలా పార్టీ వ్యూహం ఉండాలని, వీలున్నంత త్వరగా అభ్యర్థుల వడపోత ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే మొదటి జాబితా విడుదల చేయాలని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పినట్లు సమాచారం. కాగా కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏఐసీసీని కోరుతూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో తొలి జాబితా: మహేశ్‌కుమార్‌గౌడ్ సమావేశానంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పీఈసీ సమావేశంలో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించినట్టు చెప్పారు. దరఖాçస్తుదారుల అన్ని వివరాలతో కూడిన నివేదికలపై చర్చించేందుకు సెపె్టంబర్ 2న పీఈసీ మరోమారు సమావేశమవుతుందని తెలిపారు. 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వస్తుందని, కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీలు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని స్థాయిల్లోని నాయకత్వంతో మాట్లాడి నివేదికలు రూపొందిస్తారని చెప్పారు. తొలి జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారి పేర్లు ఉండాలని పీఈసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పొత్తు పొరపాట్లు చేయొద్దు ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్‌తో పాటు ఇతర పారీ్టలతో పొత్తుల అంశంపై కూడా పీఈసీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పొరపాట్లకు తావివ్వద్దని సూచించారు. ‘గతంలో లాగా ఒక పార్టీ నుంచి ఇంకో పారీ్టకి ఓట్ల బదిలీ జరగడం లేదు. మనం పొత్తుల పేరుతో వెళ్లి సీట్లు త్యాగం చేయడం వల్ల ప్రయోజనం లేదు. పొత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి..’ అని వారు చెప్పినట్టు తెలిసింది. 60 చోట్ల భారీగా దరఖాస్తులు కాంగ్రెస్ టికెట్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలిస్తే.. 60 నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 45 నియోజకవర్గాల్లో 10 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, 5 నియోజకవర్గాల్లో 9 చొప్పున, 10 నియోజకవర్గాల్లో 8 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, జగిత్యాలలో కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా, మిగిలిన చోట్ల 2 నుంచి 7 వరకు వచ్చాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 32 దరఖాస్తులు రావడం గమనార్హం. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఖర్గే.. తెలంగాణకు మొండిచేయి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు విడుదల చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఈ కమిటీలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలకు అవకాశం దక్కింది. వీరితో పాటు గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై ముభావంగా ఉంటోన్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే 39 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరిలో 32 మందిని శాశ్వత సభ్యులుగా ప్రకటించగా 13 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు , చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ , ఉత్తం వర్గాలను నిరాశపరిచింది. ఇది కూడా చదవండి: నాన్నా.. మీ బాటలోనే నేను: రాహుల్ గాంధీ -
యాతరో యాతర.. పోటా పోటీ జాతర
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రల నిర్వహణలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీలు పడుతున్నారు. తొలుత రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో యాత్రలు నిర్వహించాలనుకున్నా... కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆయన తాత్కాలిక షెడ్యూల్ రూపొందించుకుని హాథ్‌సే హాథ్ జోడో యాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పోటీగా కొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు షెడ్యూల్ రూపొందించుకుని ఇతర నియోజకవర్గాల్లో యాత్రలకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఎవరి ’దారి’వారిదే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పోటీగా శుక్రవారం రాష్ట్రంలో మరో యాత్ర ప్రారంభమయింది. ‘తెలంగాణ కాంగ్రెస్ పోరు యాత్ర’పేరుతో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ యాత్రలను ప్రారంభించారు. ఏఐసీసీ అనుమతితో బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్ వరకు తాను యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఏలేటికి కాంగ్రెస్ సీనియర్లు కూడా మద్దతిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ఈ యాత్రలో పాల్గొనడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చకు తావిస్తోంది. మహేశ్వర్‌రెడ్డి కంటే ముందే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా యాత్రకు ప్లాన్ చేశారు. ఆయన కూడా రేవంత్‌కు సమాంతరంగా బాసర పుణ్యక్షేత్రం నుంచి హైదరాబాద్‌కు యాత్ర చేయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు ఏలేటి ఆ యాత్రకు ఉపక్రమించారు. అయితే, భట్టి ఇప్పటికే పీపుల్స్ మార్చ్ పేరుతో తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న మధిర నియోజకవర్గంలో పాదయాత్ర గతంలోనే పూర్తి చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా మళ్లీ ‘పీపుల్స్ మార్చ్’పేరుతో రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మాణిక్‌రావ్ ఠాక్రే చేతుల మీదుగా.. మరోవైపు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కూడా తనదైన శైలిలో హాథ్ సే హాథ్ జోడో యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకం మద్దతు కాంగ్రెస్ పారీ్టకి కూడగట్టేందుకు గాను ఆయన విశ్వవిద్యాలయాల్లో ఈ యాత్ర చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్ కూడా తయారవుతోంది. మరోవైపు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనతో పాటు తన సతీమణి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో యాత్రకు ఉపక్రమించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈ యాత్రలను ప్రారంభించడం గమనార్హం. ఇక, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో తాను బైక్ యాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల నేతలందరూ రెండు నెలల పాటు పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా ఈ యాత్రలు జరుగుతుండడం గమనార్హం. కరీంనగర్లో 9న సభ హాథ్ సే హాథ్ జోడో యాత్రల్లో భాగంగా ఈనెల 9న కరీంనగర్లో భారీ బహిరంగసభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తామని అప్పట్లో కరీంనగర్లో సభలోనే సోనియాగాంధీ హామీ ఇచ్చి అమలు చేసిన నేపథ్యంలో ఆ సభ జరిగిన ప్రదేశంలోనే భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలను కూడా ఆహా్వనించనున్నారు. రేవంత్‌కు సీనియర్లు దూరంగా.. సీఎల్పీ నేత మల్లు భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు రేవంత్ యాత్రకు హాజరై అందరం కలిసే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆ తర్వాత సీనియర్ నేతలు ఆయన యాత్ర వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంమీద ఏఐసీసీ ఉద్దేశానికి భిన్నంగా రాష్ట్రంలో యాత్రలు జరుగుతున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలంతా కలిసికట్టుగా ఉన్నామన్న భావన ప్రజల్లో కలిగించేందుకు సిద్ధంగా లేరనే చర్చ జరుగుతోంది. ఇక, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి యాత్రపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ హాథ్ సే హాథ్ జోడో యాత్రలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేయాలని ఏఐసీసీ చెప్పిందని, చేయకపోతేనే ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
Congress: ఎన్నికల్లేవ్.. ఖర్గేకు ఫ్రీహ్యాండ్? అయినా లుకలుకలు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) విషయంలో సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా?. అలాంటి కమిటీకి సభ్యుల ఎంపిక కోసం ఎన్నిక నిర్వహించకూడదని పార్టీ చీఫ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారా?. రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పార్టీ ప్లీనరీ వేదికగా మరోసారి కాంగ్రెస్ లుకలుకలు బయటపడ్డాయా?.. సీడబ్ల్యూసీకి ఎన్నికతో కాకుండా.. నేరుగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన అభ్యర్థులను కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని సీనియర్ నేత, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంచార్జి సెక్రటరీ జైరాం రమేశ్ శుక్రవారం వెల్లడించారు. మొత్తం 45 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరైన సమావేశం.. మూడు గంటలపాటు వాడీవేడిగా సాగినట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ ఎన్నిక విషయంలో ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వివరించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు నిర్ణయం.. ఏకగ్రీవ ఆమోదం పొందలేని కాంగ్రెస్ వర్గాల సమాచారం. అజయ్ మాకెన్, అభిషేక్ మను సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ల సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని రాయ్‌పూర్(ఛత్తీస్‌ఘడ్)లో జరిగిన 85వ ప్లీనరీ సందర్భంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సింఘ్వీ మాత్రం 2024 ఎన్నికల తర్వాత అయినా పర్వాలేదని ప్లీనరీలో సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఖర్గే ఎంపిక చేసిన జాబితానే సీడబ్ల్యూసీ కోసం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ద్వారా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో.. దళారీ సంస్కృతిని తొలగించేందుకు పార్టీ చేస్తున్న పోరాటానికి మరోసారి ద్రోహం జరిగిందంటూ కొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. స్టీరింగ్ కమిటీకి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వనప్పుడు.. అభిప్రాయ సేకరణ ఎందుకని నిలదీస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదన్న విషయం బయటకు పొక్కడంతో.. కాంగ్రెస్ నేతలు మీడియాకు వివరణలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంపై నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలనే యత్నంలో ఉన్నాం. అని సీనియర్ నేత దినేశ్ గుండు రావు తెలిపారు. ఇదిలా ఉంటే రాయ్‌పూర్ ప్లీనరీకి స్టీరింగ్ కమిటీ సభ్యులైన.. సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్, తనయ ప్రియాంక గాంధీ వాద్రా దూరంగా ఉన్నారు. ఖర్గేకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్లు దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే శని, ఆదివారాల్లో జరగబోయే ప్లీనరీకి ఈ కీలక నేతలంతా హాజరుకావొచ్చని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ రాజ్యాంగానికి 30 సవరణలు చేసింది రాయ్‌పూర్ ప్లీనరీలో. అందులో గ్రామ, మండల, వార్డ్ స్థాయిలో పార్టీ యూనిట్ల ఏర్పాటు అనే ప్రధాన అంశం కూడా ఉంది. -
తెలంగాణలో " కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ "
-
కాంగ్రెస్‌లో ఖర్గే మార్క్.. సీడబ్ల్యూసీ కనుమరుగు!
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే. తొలి రోజే తన మార్క్‌ను చూపించేలా నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో అంతర్గత మార్పులకు నాంది పలుకుతూ.. సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ సహా మొత్తం 47 మందితో స్టీరింగ్ కమిటీని నియమించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో ఈ స్టీరింగ్ కమిటీ పని చేయనుంది. బుధవారం ఉదయమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు రాజీనామా చేశారు. ‘సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీలు, ఇంఛార్జులు తమ రాజీనామాలను కాంగ్రెస్ అధ్యక్షుడికి అందించారు.’ అని తెలిపారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్. ప్లీనరీ సెషన్ నిర్వహించే వరకు స్టీరింగ్ కమిటీ కొనసాగనుందని, తదుపరి ఏఐసీసీ(ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) సెషన్లో వర్కింగ్ కమిటీ కొత్త సభ్యులను ఎన్నుకోనున్నారని సమాచారం. ఇదీ చదవండి: కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే.. అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సోనియా.. -
45 ఏళ్ల తర్వాత.. సీడబ్ల్యూసీ పోస్టులకు ఎన్నికలు
ఢిల్లీ: గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేనంత సంక్షోభ స్థితి కనిపిస్తోంది. గాంధీ కుటుంబం డామినేషన్‌పై వ్యతిరేకత.. అసమర్థ నిర్ణయాల వల్లే ఇవాళ్టి పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు కూడా మరికొందరిని దూరం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా.. పార్టీ కీలక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ఎన్నికలు ఉండొచ్చని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 45 ఏళ్ల తర్వాత.. సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహిస్తుండడం గమనార్హం. మొత్తం 23 మంది సభ్యులుండే సీడబ్ల్యూసీలో 12 మందిని ఎన్నుకోవాలని, మిగతా 11 మందిని నామినేట్ చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయాన్ని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసుధన్ మిస్త్రీ ప్రకటించారు. CWCకి చివరిసారిగా 1997లో AICC కలకత్తా ప్లీనరీ సెషన్లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి, ప్లీనరీ సమావేశాలు నామినేషన్లను ఆహ్వానించడానికి బదులుగా సీడబ్ల్యూసీ పునర్మిర్మాణం పేరిట అధ్యక్ష హోదాలో ఉన్నవాళ్లే నిర్ణయం తీసుకునే అధికారం కొనసాగింది. కానీ, పరిస్థితులు ఇప్పుడలా లేవు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో నెలకొంటున్న పరిణామాల నేపథ్యం, అసమ్మతి గ్రూప్-G23ను పరిగణనలోకి తీసుకుని.. నామినేషన్ల స్వీకరణ ద్వారా ఎన్నికలే నిర్వహణకే కాంగ్రెస్ మొగ్గుచూపుతోంది. -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక తేదీపై ఊహాగానాలకు తెరపడింది. అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ తర్వాత రెండు రోజుల్లో విజేత పేరును ప్రకటించనున్నట్లు తెలిపాయి. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నాయి. పార్టీ నూతన సారథి ఎన్నిక కోసం సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు. ఎన్నిక షెడ్యూల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసింది. సోనియా గాంధీ నేతృత్వంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సోనియా వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక కోసం చివరిసారిగా 2000 నవంబర్‌లో ఎన్నిక నిర్వహించారు. సోనియా గాంధీ మధ్యలో రెండేళ్లు(2017–2019) మినహా 1998 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈసారి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. చదవండి: (ఆ ప్రాంతాల్లో రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే: ఎంపీ కోమటిరెడ్డి) -
కాంగ్రెస్ చీఫ్ ఎన్నికకు 3–4 రోజుల్లో షెడ్యూల్!
న్యూఢిల్లీ/జైపూర్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేతను ఎన్నికొనేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ మరో 3–4 రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు సోమవారం తెలిపాయి. సెప్టెంబర్ 20లోగా నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఎన్నిక తేదీపై తుది నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని(సీడబ్ల్యూసీ) వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని తాము కోరుకుంటున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు పార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని రాహుల్ గాంధీకి అశోక్ గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయన నిరాకరిస్తే కార్యకర్తలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారు. ఆనంద్ శర్మను బుజ్జగించే యత్నాల్లో కాంగ్రెస్ హిమాచల్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఆనంద్ శర్మను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా సోమవారం ఆయన్ను కలిసి, పార్టీ పదవిలో కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా శర్మతో ఫోన్లో మాట్లాడి, అనేక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే అంతిమ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. -
ఆగస్టు 21 తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త బాస్?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చాలా కాలంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు సోనియా గాంధీ. కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 21 నుంచి కొత్త అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ పదవికి పోటీ పడే అంశంపై పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయకపోవటంపై ఉత్కంఠ నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన క్రమంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం మరోమారు పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. గాంధీయోతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. అయితే, ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. కాంగ్రెస్ నేతల్లో చాలా మంది అధ్యక్ష పదవి గాంధీ కుటుంబంలోని వ్యక్తే చేపట్టాలని, అదే పార్టీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఓడిపోయిన సందర్భంలో పార్టీ సీనియర్ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు రాజీనామా చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ 2017లో సోనియా గాంధీ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 543 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 52 స్థానాలకే పరిమితం కావటంతో మే నెలలో పార్టీ పగ్గాలను వదులుకున్నారు రాహుల్ గాంధఈ. పార్టీ అధ్యక్షుడి ఎన్నికల తర్వాతే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఇతర పోస్టులకు ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం సెప్టెంబర్ 7న ప్రారంభించనున్న భారత్ జోడో యాత్రపైనే దృష్టిసారించారు. ఇదీ చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి -
Congress Chintan Shivir: ప్రారంభమైన కాంగ్రెస్ చింతన్ శిబిర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. కాంగ్రెస్‌లో భారీ మార్పులను తేనున్నట్లు ఆశిస్తున్న ఈ శిబిర్.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతోంది. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15వ తేదీన రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ శిబిర్‌లో మిషన్ 2024 కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్ సిధ్దం చేయనున్నారు. అంతేకాదు యాభై ఏళ్లలోబడిన వాళ్లకు సీడబ్ల్యూసీ సహా అన్నింటా ప్రాధాన్యంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చే అంశంపైనా ప్రధానంగా చర్చ జరగనుంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ కీలక సంస్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో రెండో వ్యక్తికి టికెట్ రావాలంటే ఐదేళ్లకు పైగా పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని రూల్. అంతేకాదు పార్టీ పదవిలో ఐదేళ్లకు మించి కొనసాగరాదని నిబంధనపై సంకేతాలు ఇచ్చారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అజయ్ మాకెన్. నిబంధనల నుంచి గాంధీ కుటుంబానికి వెసులు బాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తప్పనిసరి తంతు కావొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న చింతన్ శిబిర్ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి. అట్టడుగు స్థాయి నుంచి పటిష్టంగా పునర్నిర్మాణం జరగాలి. చింతన్ శిబిర్ అందుకు వేదిక కావాలి. పార్టీపరంగా చేపట్టాల్సిన చర్యలతో పాటు చేయాల్సిన మార్పుచేర్పులు తదితరాలను ప్రతి ఒక్కరూ నిర్మొహమాటంగా వెల్లడించాలి. కష్టకాలాన్ని దాటింటి పార్టీని అమేయ శక్తిగా మార్చాలి. మీరంతా చిత్తశుద్ధితో శాయశక్తులా కృషి చేస్తేనే అది సాధ్యం’’ అని సీనియర్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. రెండు గంటల పాటు జరిగిన భేటీలో సీనియర్లను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. ఒక్క రోజులోనే సమస్యలన్నింటినీ పరిష్కరించే మంత్రదండమేదీ లేదని, క్రమశిక్షణ, నిస్వార్థంగా కష్టించే గుణం, సమష్టి కృషి ద్వారానే ఏదైనా సాధ్యమని ఉద్బోధించారు. ‘‘మనలో ప్రతి ఒక్కరి జీవితాలకూ కాంగ్రెస్ పార్టీయే జీవనాధారం. ఇంతకాలంగా మనందరి బాగోగులూ చూసుకుంటూ వచ్చిన పార్టీ రుణాన్ని తీర్చుకోవాల్సిన సమయమిది. కష్టకాలంలో ఉన్న పార్టీని తిరిగి బలోపేతమైన శక్తిగా నిలబెట్టాలి’’ అని పిలుపునిచ్చారు. స్వీయ విమర్శ ఉండాలి గానీ... రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 13 నుంచి 15 దాకా జరిగే చింతన్ శిబిర్‌లో 422 మంది సభ్యులు పాల్గొంటారని సోనియా వివరించారు ‘‘పార్టీ వేదికలపై స్వీయ విమర్శ అవసరమే. కానీ అది ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. సవాళ్లన్నింటినీ కలసికట్టుగా అధిగమిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఇదంతా జరగాలంటే చింతన్ శిబిర్ నామ్ కే వాస్తే ప్రహసనంలా మారకూడదన్నారు. చింతన్ శిబిర్‌లో తీర్మానాలకు సీడబ్ల్యూసీ అంగీకారం అనంతరం మే 15న ‘ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్’ పేరుతో ఆమోదం లభిస్తుందని వివరించారు. సభ్యుల్లో 21 శాతం మహిళలు సీడబ్య్లూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా మీడియాకు వివరించారు. ‘‘చింతన్ శిబిర్‌లో పాల్గొనే 422 మంది సభ్యుల్లో సగం మంది 50 ఏళ్లలోపువారే. మహిళలు 21 శాతం’’ అని చెప్పారు. హాజరవని ప్రియాంక, మన్మోహన్ సీడబ్ల్యూసీ భేటీకి ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్ హాజరవలేదు. ఆజాద్, ఆనంద్ శర్మ, భూపేంద్ర సింగ్ హుడా, కేసీ వేణుగోపాల్, ఖర్గే, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, అధిర్ రంజన్, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: చిక్కుల్లో నవనీత్ కౌర్ దంపతులు.. బెయిల్ రద్దయ్యే చాన్స్! కారణం ఏంటంటే.. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముహుర్తం ఫిక్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 9న సమావేశం కానుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే నవ్ సంకల్ప్ శిబిర్‌పై ఇందులో చర్చిస్తారన్నారు. -
కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రాహుల్ చెంతకు రెబల్స్!
సాక్షి, న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ.. తిరిగి జవసత్వాలు నింపే ప్రయత్నాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. బుధవారం పద్దెనిమిది మంది రెబల్స్ నేతలు సమావేశమై ‘కలుపుగోలుగా ముందుకు వెళ్లే నాయకత్వం’ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో జీ-23గా పిల్చుకునే నేతలు కొందరితోపాటు, యువ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ తరుణంలో.. రెబల్ గ్రూప్ నుంచి నేతలు ‘గాంధీ’ కుటుంబ సభ్యుల దగ్గరికి క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల తమ విధేయతను ప్రస్తావిస్తూనే.. తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టుకుంటున్నారు. గురువారం ఉదయం హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. హర్యానా కాంగ్రెస్ ఛీఫ్ పదవిని తనకి, తన తనయుడు దీపిందర్ హూడాకు ఇవ్వకుండా షెల్జా కుమారీకి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు హుడా. షెల్జా, సోనియాగాంధీకి దగ్గర అయినందునే ఆమెకు పదవి కట్టబెట్టారని, అందుకే హర్యానా కాంగ్రెస్‌లో కుమ్ములాట కొనసాగుతోందని ఆయన రాహుల్‌కి వివరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..భూపిందర్ హూడా బాటలోనే మరికొందరు రెబల్స్.. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా నాయకత్వ మార్పుపైన జీ-23 నేతలు గట్టిగా గళం వినిపిస్తున్నారు. అయితే ఆ గ్రూప్‌ను రెబల్స్‌గా పరిగణిస్తూ.. దూరం పెడుతోంది అధిష్టానం. మరోవైపు ఐదు రాష్ట్రాల ఓటమి తర్వాత జరిగిన జీ-23 సమావేశంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఓడిన ఐదు రాష్ట్రాల చీఫ్‌లను రాజీనామా సమర్పించమని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కోరారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో మార్పుల కోసం ఐదుగురు నేతల పేర్లను సైతం ఆమె ప్రతిపాదించారు. అయితే ఆ నేతల వల్లే పార్టీ పతన స్థితికి చేరుకుందనేది రెబల్స్ ఆరోపణ. తమపై ఎలాంటి నిందలు వేసినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీ కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారు. ఇందుకోసం అధిష్టానంతో ఎన్నిసార్లు చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. -
ప్రస్తుతానికి సోనియానే!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలయ్యేవరకు సోనియా గాంధీనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నాలుగున్నర గంటల పాటు వాడీవేడీగా జరిగింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమీక్ష జరిపారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమావేశంలో సోనియా చెప్పారు. సోనియా నాయకత్వంపై కమిటీ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేలా, పార్టీని బలోపేతం చేసేలా తక్షణ మార్పులకు శ్రీకారం చుట్టాలని ఆమెను కోరింది. రాహుల్ పార్టీ నాయకత్వం వహించాలన్నది ప్రతిఒక్క కార్యకర్త కోరికని, అయితే సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున వీటిలోనే కొత్త అధ్యక్షుడిని నిర్ణయిస్తామని పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనంతరం పార్టీలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామని, పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షురాలు తక్షణ చర్యలు చేపడతారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ శిబిరాన్ని రాజస్థాన్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సూచించారు. పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ సీడబ్ల్యూసీ ముందు ప్రస్తావించగా, వారి ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫలితాలు తీవ్ర ఆందోళనకరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారి తీసిన కారణాలపై సీడబ్ల్యూసీ చర్చించిందని, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలు సూచనలు చేశారని సూర్జేవాలా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి ‘తీవ్ర ఆందోళన కలిగించేవి’లా ఉన్నాయన్న అంశాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. కాంగ్రెస్ తన వ్యూహంలో లోపాల కారణంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళలేకపోయినట్లు అంగీకరించారు. వీటితో పాటు పంజాబ్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించలేకపోయిందని, పార్టీ అంతర్గత కలహాలు కొంప ముంచాయని సీడబ్ల్యూసీ అంగీకరించింది. అదే సమయంలో శక్తివంతమైన ప్రతిపక్షంగా కొనసాగుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఈ ఏడాదితో పాటు, 2023, 2024లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికల సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సిద్ధమవుతుందని సీడబ్ల్యూసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, హరీష్ రావత్, మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, చిదంబరం, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా కారణంగా ఏకే ఆంటోని హాజరుకాలేదు. మీరే దిక్కు పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. పార్టీని బలోపేతం చేసే మార్గాలపై రాహుల్ సూచనలిచ్చారన్నారు. పార్టీ ఓటమికి కారణాలను సభ్యులు విశ్లేషించినట్లు తెలిపారు. సమావేశానికి జీ 23 కూటమికి చెందిన ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ మాత్రమే హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి తాము కూడా కృషి చేస్తామని, తమకు ప్రత్యేక కూటమి ఏదీ లేదని, జీ23 అనేది మీడియా సృష్టని వీరు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశానికి ముందు రాహుల్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ పలువురు కార్యకర్తలు, నాయకులు నినాదాలిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే బాధ్యతలు స్వీకరించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ అన్నారు. గత మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని, కేంద్ర మంత్రికాలేకపోయారని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఐక్యతకు గాంధీ కుటుంబం కీలకమని నాయకులు అర్థం చేసుకోవాలని గహ్లోత్ పేర్కొన్నారు. యాక్టివ్‌గా అసమ్మతి గ్రూప్ ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానికి కంటే ముందే, కాంగ్రెస్‌లోని అసంతప్తి వర్గానికి చెందిన సీనియర్ నేతలు శుక్రవారం గులాం నబీ ఆజాద్ నివాసంలో భేటీ అయి భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ వంటి ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ పార్టీ అన్ని నిర్ణయాలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలాలు తీసుకుంటున్నారని జీ23 లోని నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి వీడినప్పటికీ, తెర వెనుక నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తామంతా పార్టీ శ్రేయోభిలాషులమే కానీ శత్రువులం కాదు అని ఈ నేతలు పలుమార్లు స్పష్టం చేశారు. -
Sonia Gandhi: నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని
సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై జీ–23 నేతలు ప్రశ్నలు లేవనెత్తడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కఠినవైఖరి ప్రదర్శించారు. తానే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, అందరూ అనుమతిస్తే ఉంటానని శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఐదున్నర గంటల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్రప్రభుత్వ విధానాలు, మూడు వ్యవసాయ చట్టాలు– రైతు ఉద్యమం, లఖీమ్‌పూర్ ఖేరి ఘటన, జమ్మూకశ్మీర్‌లో మైనార్టీలపై దాడులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను, ఆందోళనలను తాము చూసీ చూడనట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదని, ప్రతీ అంశంపై చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. కాగా సోనియా చేసిన ఈ ప్రకటన పార్టీ అసంతృప్త నేతల గ్రూప్ అయిన జీ–23కి తగిన సమాధానం ఇచ్చినట్లేనని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా సహా 23 మంది నాయకులు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలో కీలక మార్పులు జరగాలని, సమర్థవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి ఏదో ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం కపిల్ సిబల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించే అంశంపై స్పష్టతనిచ్చారు. సోనియా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేక స్వరంపై మాట్లాడిన సోనియాగాంధీ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, అయితే పార్టీలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, ప్రతి సవాలును ఎదుర్కోగలమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై ఈ ఏడాది జూన్ 30 లోపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రోడ్‌మ్యాప్ తయారు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పూర్తి సమాచారం ఇస్తారని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నాయకులకు సోనియా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐక్యత, పార్టీ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచడం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరింత అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రస్తావనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన అభిప్రాయానికి మద్దతు ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు సంస్థాగత ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మినహా ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకోని పరిస్థితుల్లో మరోసారి పార్టీలో అంతర్గత అలజడి చెలరేగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్గత పోరును బయటపడనీయకుండా ఉండేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వెంటనే అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీలో ఒడిదుడుకుల కారణంగా సోనియా అలా చెప్పవలసి వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పటికీ రాహుల్,ప్రియాంక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం జీ–23 నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలిస్తే పార్టీపై గాంధీ కుటుంబం పట్టు మరింత బలపడుతుంది. లఖీమ్‌పూర్ హింస కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసిందని సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్లౖపైకెక్కినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ జరుగుతున్న ఉగ్ర దాడులకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సోనియా అన్నారు. దేశ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక సంస్కరణల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటోందని, ప్రతిదీ విక్రయించాలన్న ఒకే ఒక ఎజెండా ప్రస్తుతం కేంద్రానికి ఉందని సోనియా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఒక రాజకీయ తీర్మానాన్ని చేసింది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ ఆ తీర్మానంలో ప్రస్తావించింది. లద్దాఖ్ ఘటన జరిగి 18 నెలలు అయినప్పటికీ చైనా సైనికులు ఇప్పటికీ భారత భూభాగంలో ఆక్రమణలు కొనసాగిస్తున్నారని సీడబ్ల్యూసీ విమర్శించింది. పాకిస్తాన్ చొరబాట్లు జమ్మూకశ్మీర్ భద్రతను గణనీయంగా దిగజార్చాయని ఆరోపించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో భద్రతకు ముప్పు పెరుగుతోందని, సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అంతర్ రాష్ట్ర వివాదాలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ పతనం చాలా ఆందోళన కలిగిస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కల్పనపై కేంద్రం దృష్టి సారించలేదని, ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర అధిక ధరలతో కష్టాలను ఎదుర్కొంటున్నారని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. సంస్థాగత షెడ్యూల్ ఇదీ.. సీడబ్ల్యూసీ నిర్ణయాలను సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా మీడియాకు వివరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి కార్యకర్తల వరకు పెద్దఎత్తున శిక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు చేస్తారు. ప్రాథమిక కమిటీలు, బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపికకు ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ఎన్నిక జరుగనుంది. వచ్చే ఏడాది జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి,íపీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీ్నరీ సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ధరల పెరుగుదలపై నవంబర్ 14 నుంచి 29 వరకు పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుందని పేర్కొన్నారు. పరివార్ బచావో వర్కింగ్ కమిటీ: బీజేపీ ఎద్దేవా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ‘పరివార్ బచావో(కుటుంబాన్ని కాపాడే) వర్కింగ్ కమిటీ’ అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అంతర్గత వైషమ్యాలకు ఈ సమావేశం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది. పార్టీ నాయకత్వ వైఫల్యంపై చర్చించడానికి బదులు అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికే సీడబ్ల్యూసీ భేటీ జరిగినట్లు బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సోనియా సీరియస్ అయ్యారు. 'కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పునరుజ్జీవనమే అంతా కోరుకుంటున్నారు. అందుకోసం నేతల మధ్య, ఐక్యత, క్రమశిక్షణ అవసరం. పార్టీ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కరోనా వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైందని' సోనియా గాంధీ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై సీడబ్ల్యూసీలో ముఖ్యంగా చర్చిస్తున్నారు. చదవండి: (నేడు అమ్మ సమాధి వద్దకు శశికళ.. కీలక ప్రకటన చేసే అవకాశం..!) -
16న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా. -
అతిత్వరలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
-
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన అనంతరం 2019 ఆగస్ట్ నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతుండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని గత కొంతకాలంగా సోనియాగాంధీ భావిస్తున్నారు. అందులోభాగంగా జూన్‌లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. సోమవారం వర్చువల్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై చర్చించారు. అయితే దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు విషమించిన కారణంగా అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయడమనే సబబు అని సీడబ్ల్యూసీ సభ్యులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. దీంతో సంక్షోభం సద్దుమణగగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడితే మూడు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు. మోదీ తన తప్పులు సరిదిద్దుకోవాలి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా విస్తృత వ్యాప్తిపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిన తప్పుకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మోదీ తన తప్పులను సరిదిద్దుకోవాలని, వ్యక్తిగత ఎజెండాను పక్కనబెట్టాలని దేశానికి సేవ చేయాలని సీబ్ల్యూసీ హితవుపలికింది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం వాస్తవ గణాంకాలను బహిర్గతంచేయడంలేదని ఆరోపించింది. నిజాన్ని దాచేస్తే సరిపోదని, సవాళ్లను ఎదుర్కొంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, కరోనా కట్టడి కోసం చేపట్టే చర్యలు, కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీబ్ల్యూసీ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్థితి చాలా భయంకరంగా మారిందని సోనియా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా వైఫల్యాలు ఎక్కువై పరిస్థితులు మరింత కష్టతరంగా మారాయని వ్యాఖ్యానించారు. వైరస్ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను ప్రభుత్వం వారి ప్రయోజనం కోసం ఆమోదించిందని విమర్శించారు. నత్తనడకన కోవిడ్ వ్యాక్సినేషన్ ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోనియా గాంధీ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ ప్రభుత్వం తన బాధ్యతను విరమించుకుందని, ఆ బాధ్యతను రాష్ట్రాలపై వదిలేసిందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం ఆర్థికంగా మరింత సమర్థించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కోవిడ్ కారణంగా దేశంలో పరిస్థితి మరింత భయంకరంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. పాలన వైఫల్యాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోందన్నారు. ప్రజాభిప్రాయాలు, సద్విమర్శలను పక్కకునెట్టి మోదీ సర్కార్ తన స్వప్రయోజనాలు, ఇతర భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాభీష్టానికి తగ్గట్లు కోవిడ్ చర్యలు చేపట్టాలని సోనియా కోరారు. ఢిల్లీలో కోవిడ్కాలంలోనూ కొనసాగుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వృథాగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం దేశానికి సహాయం చేయడానికి ముందుకొస్తున్న అన్ని దేశాలకు, సంస్థలకు కాంగ్రెస్ తరపున సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరును సమీక్షించారు. ఎన్నికల ఫలితాలతో చాలా నిరాశ చెందుతున్నామని చెబితే సరిపోదని, ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సోనియా తెలిపారు. కేరళ, అస్సాంలో మనం ఎందుకు ఓడిపోయామో, పశ్చిమ బెంగాల్లో కనీసం ఒక్క సీటు ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. మనం వాస్తవికతను అర్థంచేసుకోకపోతే, భవిష్యత్తు కోసం ఎలా పాఠాలు నేర్చుకుంటామని సోనియా గాంధీ సభ్యులను ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. పార్టీ ఓటమికి గల వాస్తవ కారణాలను తెలపాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లను సోనియా ఆదేశించారు. కోవిడ్ కారణంగా ఈ చర్చలో రాహుల్‌గాంధీ పాల్గొనలేదు. -
జూన్‌లో నూతన అధ్యక్షుడు
సాక్షి,న్యూఢిల్లీ: రాబోయే రెండు మూడు నెలల్లో ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేప«థ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ఏకగ్రీవంగా నిర్ణయించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సిఫార్సుల మేరకు మేలో అ«ధ్యక్ష ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉన్నప్పటికీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు వాయిదా వేశారు. శుక్రవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా ప్రసంగంతో ప్రారంభమైంది. రైతు ఆందోళ నలపై కేంద్రం అత్యంత దారుణంగా, అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని సోనియా విమర్శించారు. రైతు ప్రతినిధులతో చర్చల్లో ప్రభుత్వ అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెం ట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సోనియా దిశానిర్దేశం చేశారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబ డాలని, దేశవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతంగా చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అంతేగాక కోవిడ్–19 విషయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను అభినందించడంతో పాటు, పంపిణీ ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రజలు వాక్సినేషన్‌కు ముందుకు రావాలని తీర్మానం చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా పంపిణీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళికలను బహిర్గత పరచాలని కోరింది. దేశ రక్షణకు సంబం ధించిన వ్యాఖ్యలతో బహిర్గతమైన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి వాట్సాప్ చాట్ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసింది. గహ్లోత్ సీరియస్ సీడబ్ల్యూసీ సమావేశంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలపై రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని సమాచారం. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదా అని గహ్లోత్ ప్రశ్నించారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన సమావేశంలోనూ ఆజాద్, శర్మ తదితర నాయకులు పార్టీ అధినేత్రిని ఉద్దేశించి రాసిన ఒక లేఖలో లేవనెత్తిన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ లేఖ బహిర్గతం అయినప్పటినుంచి పార్టీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కొనసాగుతున్న విష యం తెలిసిందే.ఆ లేఖపై సంతకం చేసిన నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని గత సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆజాద్, కపిల్ సిబల్ అభ్యంత రం వ్యక్తం చేసిన తరువాత, కాంగ్రెస్ అధిష్టా నం డ్యామేజ్ కంట్రోల్ మోడ్‌లోకి వెళ్లింది. -
ఆజాద్‌పై వేటు.. ప్రియాంకకు చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జీలను మారుస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అదేవిధంగా ఇటీవల పార్టీపై లేఖాస్త్రం సంధించిన బృందం నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు. ఆజాద్‌తో పాటు సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్ పటేల్ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలాలకు చోటు కల్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లోకి రెగ్యులర్ సభ్యులుగా చిదంబరం, రణ్‌దీప్ సూర్జేవాలా, తారిఖ్ అన్వర్, జితేంద్ర సింగ్‌లను తీసుకున్నారు. లుజిన్హొ ఫెలిరియో, మోతీలాల్ వోరా, ఆధిర్ రంజన్ చౌధురి, తామ్రధ్వజ్ సాహులను సీడబ్ల్యూసీ సభ్యత్వం నుంచి తొలగించారు. లిరియోను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తొలగించారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. ఆజాద్‌ను హరియాణా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించి, వివేక్ బన్సాల్‌ను ఆ పదవిలో నియమించారు. సూర్జేవాలాను కర్నాటకకు, జితిన్ ప్రసాదను పశ్చిమబెంగాల్‌కు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి్జలుగా నియమించారు. కాంగ్రెస్‌పార్టీలో సంస్కరణలు అవసరమని, క్రియాశీల అధ్యక్షుడి అవసరం పార్టీకి ఉందంటూ సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో.. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగుతారు. సీడబ్యూసీ కొత్త సభ్యుల్లో దిగ్విజయ్, రాజీవ్ శుక్లా, మానికం టాగోర్, ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, హెచ్‌కే పాటిల్, సల్మాన్ ఖుర్షీద్, దినేశ్ గుండూరావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉమెన్ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్ ఎంపీ మాణిక్కం టాగూర్ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలో మరో ఐదుగురు సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని నియమించారు. -
అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిని ఎన్నుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సదస్సు ఏర్పాటు చేసిన అనంతరం అధ్యక్ష ఎన్నిక జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా సీనియర్ నేతల లేఖతో పార్టీలో విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగుతూ, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది. (‘చదవండి: మనసు నొప్పించి ఉంటే క్షమించండి’) ఇందుకు ఆమె సమ్మతించడంతో అసమ్మతి నేతల తిరుగుబాటు తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించేలా లేఖ ఉందన్న ఎంపీ రాహుల్ గాంధీ.. ఇందులో బీజేపీ హస్తం ఉందంటూ సీనియర్ నేతలపై మండిపడిన నేపథ్యంలో వారు సైతం ఇందుకు దీటుగానే బదులిచ్చారు. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలు అందించిన తమను ఇలా కించపరచడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా తాత్కాలిక చీఫ్‌గా సోనియాను కొనసాగిస్తూనే.. సాధ్యమైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. (చదవండి: పార్టీ కోసమే మా లేఖాస్త్రం ) ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి! కానీ రాహుల్ సహా గాంధీ కుటుంబ విధేయులు ఆర్నెళ్లపాటు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో.. జనవరిలో ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క బిహార్ అసెంబ్లీకి తప్ప, ఈ ఏడాది మరే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం.... తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి తదితర ఐదు రాష్ట్రాలకు 2021 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ ఆరు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త సారథి నేతృత్వంలో ఓ పర్ఫెక్ట్ టీంను తయారు చేసుకుని, ముందుకు సాగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన 23 మంది సీనియర్ నాయకుల్లో పలువురు తమ ఉద్దేశం గురించి వివరణ ఇస్తూ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే విధంగా సోనియా గాంధీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో ఆమె కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కోసమే తాము రాసిన లేఖ రాశామని, ఈ విషయం సోనియా మనసును గాయపరిచి ఉంటే ఆమె క్షమాపణ చెబుతున్నామని పేర్కొన్నారు. -
‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించే తాము లేఖ రాశామని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ‘అసంతృప్త నేతలపై చర్యలు లేవు’) కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని.. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. శశి థరూర్, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఏకగ్రీవంగా తీర్మానించడంతో.. పార్టీలో చెలరేగిన ప్రకంపనలు చప్పున చల్లారిపోయాయి.(చదవండి: గాంధీలదే కాంగ్రెస్..!) ఈ పరిణామాల గురించి వీరప్ప మొయిలీ మంగళవారం మాట్లాడుతూ.. ‘‘‘‘పార్టీ కోసం సోనియాజీ చేసిన త్యాగం గురించి మాకు తెలుసు. అందుకు మేం ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఎన్నో ఏళ్లుగా మేం కూడా అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాం. కాబట్టే పార్టీ ప్రస్తుత పరిస్థితుల గురించి అధినాయకత్వ దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం. అంతేతప్ప సోనియా గాంధీ మనోభావాలను కించపరచుకోవాలనుకోలేదు. ఆమెపై గౌరవం అలాగే ఉంటుంది. అయితే అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కేవలం దానిని ఆశించే మేం లేఖ రాశాం. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. ఆమె మాకు తల్లిలాంటి వారు. తొలుత అధ్యక్షురాలిగా కొనసాగేందుకు నిరాకరించినా తర్వాత ఆమె అంగీకరించారు. ఆమె మార్గదర్శకత్వంలో ముందుకు నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆమె పట్ల మా ప్రేమ తగ్గదు. అయితే మేం రాసిన లేఖ ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అనేకసార్లు ద్రోహం చేసిన వాళ్లే.. పార్టీ విధేయులుగా నటిస్తూ తమ విధేయతనే ప్రశ్నించేలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా సీడబ్ల్యూసీ సమావేశంలో భాగంగా సీనియర్ నాయకుల తీరుపై ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం సరికాదంటూ సీనియర్ నేతలు ఆవేదన చెందారు. ఒకానొక సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి. -
‘ఇంకెన్నాళ్లు కాంగ్రెస్‌కు బానిసత్వం చేస్తారు?’
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్ నేతల మధ్య వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ వార్తలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకెన్నాళ్లు కాంగ్రెస్ నాయకత్వంలో బానిసలుగా ఉంటారంటూ ఒవైసీ, ఆజాద్‌ను ప్రశ్నించారు. పొయెటిక్ జస్టిస్ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఆజాద్ కొన్నేళ్ల క్రితం మీరు ఇదే విషయం గురించి నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు అవే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మీరు మమ్మల్ని బీజేపీ బీ జట్టు అన్నారు. ఇప్పుడు మీ పార్టీ నేతలే మీరు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌లోని ముస్లిం నాయకులు సమయం వృధా చేస్తున్నారు. ఇంకా ఎంత కాలం ఇలా కాంగ్రెస్ నాయకత్వానికి బానిసలుగా ఉంటారో ఆలోచించుకోండి’ అంటూ ఒవైసీ సంలచన వ్యాఖ్యలు చేశారు. -
సోనియా రాజీనామా : సీడబ్ల్యూసీ భేటీలో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో సోనియానే పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని సీనియర్ నేతలు మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీలు కోరారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని 23 మంది పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖరాసిన నేపథ్యంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా మరికొన్ని నెలల పాటు కొనసాగుతారని సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజే సత్వర నిర్ణయం వెలువడుతుందని ఆశించరాదని, పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు, ఎంపికకు సమయం పడుతుందని తెలిపాయి. పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియాను తాము కోరామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్ని నెలలపాటు పార్టీ తాత్కాలిక చీఫ్‌గా ఆమె కొనసాగుతారని పేర్కొన్నాయి. ఆరు నెలల్లో తదుపరి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని తెలిపాయి. ఇక అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది. నాయకత్వ మార్పుపై బీజేపీ ప్రోద్బలంతోనే సీనియర్లు లేఖ రాశారన్న రాహుల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్, ఆజాద్ వంటి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నేతలను అనునయించేందుకు స్వయంగా రాహుల్ వివరణ ఇచ్చారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. మరోవైపు పార్టీ నాయకత్వపై సోనియా గాంధీకి లేఖ రాసిన వారిపై పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నేత అంబికా సోనీ కోరగా, తాము పార్టీ పరిధికి లోబడే ఆయా అంశాలను లేవనెత్తామని గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనే అని భావిస్తే తమపై చర్యలు చేపట్టవచ్చని అన్నారు. కాగా పార్టీ యువనేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు, పార్టీ ముఖ్యమంత్రులు తాజా పరిణామాల నేపథ్యంలో గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. చదవండి : సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు -
‘కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో అగ్రనాయకత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తాను సీనియర్ నేతలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇస్తూ వారిని అనునయిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు శ్రుతిమించడంపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యానించింది. గతంలో పార్టీ వ్యవహారాలపై జ్యోతిరాదిత్య సింధియా గళమెత్తితే ఆయనను బీజేపీతో కుమ్మక్యయ్యారని ఆరోపించారని, ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబాల్ వంటి సీనియర్ నేతలు పార్టీకి పూర్తికాల అధ్యక్షుడిని నియమించాలని డిమాండ్ చేస్తే వారినీ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఎవరూ కాపాడలేరని చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుమరుగే : ఉమాభారతి గాంధీ-నెహ్రూ కుటుంబ ఉనికి సంక్షోభంలో పడిందని, వారి రాజకీయ ప్రాబల్యం ముగిసిపోయిందని బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలు ఇక ఎవరికి అప్పగిస్తారనేది చూడాలని, కాంగ్రెస్‌ను తిరిగి విదేశీ శక్తుల చేతిలో కాకుండా స్వదేశీ గాంధీ కనుసన్నల్లో ఉండాలని అన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కోరారు. సీనియర్ నేతలు లేఖలు రాయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కాగా రాహుల్ తిరిగి పార్టీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాలని యూత్ కాంగ్రెస్ నేతలు కోరారు. మరోవైపు పార్టీ చీఫ్ బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు -
సీడబ్ల్యూసీ భేటీలో ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ : నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్ నేతలు లేఖ రాసిన నేపథ్యంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ పార్టీలో పెను ప్రకంపనలు రేపింది. సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం బాగాలేని సమయంలో సీనియర్లు లేఖ రాయడం సరికాదన్న రాహుల్ వారి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించడంతో సమావేశం వాడివేడిగా సాగింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నాయకత్వ మార్పుపై సీనియర్లు లేఖ రాయడం అసంబద్ధమని రాహుల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీతో సంబంధాలున్నాయని రాహుల్ వ్యాఖ్యానించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం జీవితం అంకితం చేశామని, ఇన్లాళ్ల తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో కపిల్ సిబల్, ఆజాద్ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. రాహుల్ వివరణ సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్ సిబల్‌తో రాహుల్ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్ వెల్లడించారు. సోనియా రాజీనామా ఇక అంతకుముందు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను వైదొలగుతున్నట్టు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం గాంధీ కుటుంబానికి బాసటగా నిలిచారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకత్వంలో మార్పు అనివార్యమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం కావాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాశారు. -
రాజీనామాకు సిద్ధపడ్డ గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో సీనియర్ నేతల మధ్య వాడివేడి చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి సీనియర్ల లేఖ బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తోందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ అనారోగ్య పరిస్థితులు, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ సృష్టిస్తున్న అననుకూల పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదంటూ లేఖ రాసిన తీరును ఖండించినట్లు సమాచారం. (కాంగ్రెస్ పార్టీలో విభేదాలు!) ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన రాజీనామాకు సైతం సిద్ధపడినట్లు సమాచారం. మరోవైపు తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు సోనియా గాంధీ సీడబ్ల్యూసీకి స్పష్టం చేశారు. తన స్థానంలో మరో నేతను ఎంపిక చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబ విధేయుడిగా పేరొందిన ఏకే ఆంటోని రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాల్సిందిగా కోరారు. అదే విధంగా.. పార్టీ అధినాయకత్వాన్ని తక్కువ చేసి చూపేలా లేఖ రాయడం సరికాదంటూ సహచరులపై అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సైతం ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీలో మార్పులు కోరుతూ రాసిన ఈ లేఖ తనను బాధించిందన్నారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం సోనియా గాంధీ తన పదవీ కాలాన్ని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా పార్టీ నాయకత్వంలో మార్పు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. బీజేపీతో కలిసి కుట్రపన్నామా?: కపిల్ సిబల్ ‘‘మేము బీజేపీతో కలిసి కుట్ర చేశామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడి రాజస్థాన్ హైకోర్టులో విజయం సాధించాం. 30 ఏళ్లలో మేము బీజేపీకి అనుకూలంగా ఎప్పుడూ మాట్లాడలేదు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాం. అయినప్పటికీ మేము బీజేపీతో కుట్రపన్నామా ?’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నల వర్షం కురిపించారు. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
-
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. పార్టీ నాయకత్వానికి సంబంధించి విభేదాలు బయటపడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి.పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సోనియా సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి అధ్యక్షురాలిగా సోనియా కొనసాగడమా? లేదా నూతన వ్యక్తి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమా సీడబ్ల్యూసీ నిర్ణయించనుంది. సీడబ్ల్యూసీ సభ్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇదిలాఉండగా.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద కొందరు కార్యకర్తలు సోమవారం ఉదయం నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ఉండాలని డిమాండ్ చేశారు. వేరే వ్యక్తుల చేతుల్లోకి పగ్గాలు వెళ్తే కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోతుందని హెచ్చరించారు. (చదవండి: కాంగ్రెస్ పార్టీలో విభేదాలు!) -
సోనియాకు పార్టీ సీనియర్ల లేఖ
-
కాంగ్రెస్ పార్టీని పూర్తి ప్రక్షాళన చేయండి..
సాక్షి, న్యూఢిల్లీ: గతమెంతో ఘనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనకబారుతోంది. అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేని స్థితిలో చుక్కాని లేని నావలా తయారైంది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి నెలలు కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనేలేదు. ఈ అంతర్గత సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారు. అధినాయకత్వంతోపాటు, అంతర్గత సమస్యలపైనా చర్చించాల్సిందిగా 20 మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం ఆన్లైన్ సమావేశం నిర్వహించనుంది. (త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నిక) కాగా వరుసగా రెండో సారి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలవడంతో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ చీఫ్‌గా కొనసాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరినా ఆయన దిగిరాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్ట్ 9న తాత్కాలిక చీఫ్ బాధ్యతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కట్టబెట్టింది. ఆ తర్వాత మహారాష్ట్ర, హరియాణ, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు తన ఆరోగ్యం దృష్ట్యా అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు సోనియా గాంధీ విముఖ చూపిస్తున్నారు. దీంతో దారి తప్పిన కాంగ్రెస్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు మళ్లీ రాహుల్‌నే నియమిస్తారా? లేదా అన్న అంశం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. (ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్) -
మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోంది
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టాల్సిన బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను వ్యాప్తి చేస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో ఆమె మాట్లాడారు. ‘అందరం కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. దీనిని అడ్డుకోవడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి’అని పిలుపునిచ్చారు. ‘లాక్డౌన్ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై కేంద్రం భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలి. కోవిడ్‌తో తలెల్తిన సమస్యల పరిష్కారంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలి’ అని ప్రభుత్వాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. -
వీడని ఉత్కంఠ.. రాష్ట్రపతి పాలన తప్పదా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం రాత్రి 8:30లోగ తుది నిర్ణయం తెలపాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఎన్సీపీకి గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ముందుకు రాకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమయిందని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారని తెలుస్తోంది. దీనిపై మంగళవారం ఎన్సీపీకి ఇచ్చిన గడువు వరకు వేచి చూసే అవకాశం ఉంది. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ కూడా నో చెబితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే సూచనలు కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ ముందుకు రావాలి అంటే మిత్రపక్షం కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఇటు శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై హస్తం నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీనిపై సోమవారంమే పార్టీ వర్కింగ్ కమిటీ గంటల తరబడి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా తమ నిర్ణయాన్ని వెల్లడించడంలో మాత్రం ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ మరోసారి భేటీ అయింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై నేడు పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం పీఠం ఎన్సీపీకి అప్పగిస్తేనే మద్దతు తెలపాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు కోరినట్లు తెలిసింది. మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌తో శరద్ పవార్ భేటీ అయ్యారు. అయితే సమావేశం అనంతరం భేటీ వివరాలను వెల్లడించడానికి పవార్ నిరాకరించారు. మంగళవారం వరకు గడువు ఉండటంతో మరోసారి ఎన్సీపీ, కాంగ్రెస్ నిర్ణయం కోసం సేన నేతలు ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా.. తాజా పరిణామాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. మరోవైపు ఎన్సీపీ నేతలు కూడా మరోసారి కీలక భేటీ నిర్వహణకు సిద్ధమయ్యారు. గవర్నర్ ఇచ్చిన గడువుకు సమయం దగ్గర పడుతుండటంతో నేటి మధ్యాహ్నాంలోపు ఇరు పార్టీల నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదిలావుండగా.. సీఎం కుర్చీని అధిష్టించాలనుకున్న శివసేన ఆశలు అడియాశలుగానే మిగిలేలా ఉన్నాయి. సోమవారంమే కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తుందని ఆశించిన శివసేన చివరి నిమిషం వరకు ఎదురుచూసింది. అయితే దీనిపై మరింత లోతుగా చర్చించిన అనంతరమే తమ నిర్ణయం ప్రకటిస్తామని హస్తం నేతలు ప్రకటించారు. దీంతో సేన నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. కేంద్రమంత్రి పదవికి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో భారీ పరిశ్రమల శాఖను మరోమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. -
కొత్త చీఫ్ ఎంపిక: తప్పుకున్న సోనియా, రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. నేడు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో రాష్ట్రాల నేతలతో పార్టీ అధిష్టానం విస్తృత సంప్రదింపులు అనంతరం ముగిసింది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో పార్టీ పెద్దలు చర్చించారు. పార్టీ నేతలందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే ఏఐసీసీ అధ్యక్షుడిని ఎంపికపై ఓ నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ నిర్దేశించారు. అలాగే నూతన అధ్యక్షుడి ఎన్నికలో తాము భాగస్వామ్యం కాబోమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. సమావేశం మధ్యలోనే వారద్దరూ బయటకు వెళ్లిపోయారు. దీంతో పార్టీ పీసీసీలే కొత్త చీఫ్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఐదు గ్రూపులు.. మరోవైపు ఈసారి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ముఖ్యనేతలను ఐదు గ్రూపులుగా విభజించి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నేతలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంప్రదింపులు జరపనున్నారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నేతలతో ప్రియాంక గాంధీ, పశ్చిమ రాష్ట్రాల నేతలతో రాహుల్ గాంధీ, తూర్పు రాష్ట్రాలతో సోనియాగాంధీ, ఈశాన్య రాష్ట్రాల నేతలతో అంబికా సోని సంప్రదింపులు జరిపి ఓ అభిప్రాయానికి రానున్నారు. కేవలం సీడబ్ల్యూసీ నేతలతోనే కాకుండా రాష్ట్ర నేతలతో కూడా సంప్రదింపులు జరిపి కొత్త అధ్యక్షుడి ఎంపిక చేయాలన్న రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. దీంతో పార్టీ నూతన చీఫ్ ఎన్నికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత తాత్కాలిక ప్రాతిపదికన అధ్యక్షుడిని ఎన్నుకుని, ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి పూర్తిస్థాయి అధ్యక్షుడిని ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు నిర్వహించేందుకు కొందరు సీనియర్లు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్ వాస్నిక్. మరోవైపు పార్టీ యువ నేతలు జ్యోతిరాధిత్య సింధియా, సచిన్ ఫైలెట్లు కూడా రేసులో ఉన్నారు. -
నేడే సీడబ్ల్యూసీ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు ఎవరో మరికొన్ని గంటల్లో తెలియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడం, ఆ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండటం తెలిసిందే. కొత్త సారథిని ఎన్నుకునేందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంపై ఓ ఉన్నతస్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారమే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ఇంట్లో నిర్వహించారు. ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ ప్రధాన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్ వాస్నిక్. ఖర్గేకే ఎక్కువ అవకాశం.. మల్లికార్జున ఖర్గే తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఆయనకు వయస్సు ఎక్కువగా ఉండటం తప్ప మరో ప్రతికూలత ఏదీ లేదు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న ఖర్గే.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నప్పుడు బీజేపీని చేతనైన మేరకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక ముకుల్ వాస్నిక్ కూడా కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నప్పటికీ, ఆయనకు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ముకుల్ వాస్నిక్ సమర్థుడు కాడనీ, వివాదాలకు కేంద్ర బిందువని పార్టీ నాయకులే చాలా మంది ఫిర్యాదు చేశారు. మళ్లీ రాజ్యసభకు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్‌ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు కాగ్రెస్ సిద్ధమైంది. బీజేపీ రాజస్తాన్ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభ ఎంపీ అయిన మదన్ లాల్ సైనీ ఇటీవలే కన్నుమూయడంతో ఆయన స్థానం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ఇప్పుడు రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ సీటు కాంగ్రెస్‌కు దక్కనుంది. మన్మోహన్ 1991 నుంచి ఈ ఏడాది జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
ఆమె అంగీకరిస్తే.. పార్టీ అధ్యక్షురాలు అవుతారు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా సమర్పించిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా పార్టీ బాధ్యతలు చేపట్టాలన్న వాదనకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత కరణ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక బాధ్యతలు చేపడితే బలమైన నాయకురాలవుతారని, పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక సరైన అభ్యర్థియేనా అని అడిగిన ప్రశ్నకు ‘ప్రియాంక చాలా తెలివైన మహిళ. సోన్‌భద్ర వ్యవహారంలో బాధితులను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె వ్యవహరించిన తీరు అభినందనీయం. చాలా బాగా మాట్లాడింది. తను అంగీకరిస్తే కచ్చితంగా పార్టీ పగ్గాలు చేపడుతుంది’ అని బదులిచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ స్థానంలో యువ నేత అయితే బాగుంటుందని ఇటీవల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ సింగ్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్ నేతలంతా దీనిపై వీలైనంత త్వరగా ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా, దీనిపై సీడబ్ల్యూసీ ఈనెల 10వ తేదీన సమావేశం కానున్నట్లు పార్టీ ఆదివారం ప్రకటించింది. -
నేడు టీపీసీసీ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక భేటీ గురువారం జరగబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమీక్షతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ఆహ్వానించినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
రాహుల్‌ను బుజ్జగించిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)సమావేశం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు శనివారం సీడబ్ల్యూసీ సభ్యులు భేటీ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశంలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నాలుగు గంటలపాటు నేతలు చర్చించారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేస్తానని ప్రదిపాదించారు. పార్టీ కోసం పనిచేస్తానని, అధ్యక్షుడిగా కొనసాగలేనని రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. అయితే రాహుల్ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించింది. ఈ ఓటమి బాధ్యత అందరిది అని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రాహుల్‌ను బుజ్జగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడానికి రాహుల్ గాంధీ అంగీకరించినట్లు సమాచారం. -
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
-
మోదీ పతనం మొదలైంది : సోనియా గాంధీ
న్యూఢిల్లీ : ఏపీ, తెలంగాణలోని అంశాలను ఎన్నికల సందర్భంగా పార్టీ తీసుకోవాల్సిన చర్యలను కాంగ్రెస్ విస్తృతస్థాయి వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలుగు రాష్ట్రాల పీసీసీలు ప్రస్తావించారు. రాహుల్ గాంధీయే ప్రతిపక్షాల ఐక్య కూటమికి నేతృత్వం వహించాలని, సచిన్ పైలట్, శక్తి సింగ్ గోహిల్, రమేశ్ చెన్నితల తదితర నేతలు సూచించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జరిగిన తొలి సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. సుమారు ఐదు గంటల పాటు సమావేశంలో 2019 ఎన్నికలకు సన్నద్ధం కావడంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఏఏ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలో రాహుల్ గాంధీకి అధికారం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 12 రాష్ట్రాల్లో బలంగానే ఉందని, ఆ రాష్ట్రాలపై మరింత దృష్టిపెట్టి పనిచేస్తే 150 లోక్‌సభ స్థానాలు సాధించవచ్చని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు వెళ్లడం వల్ల మరికొన్ని స్థానాల్లో గెలుపొందవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్పుపై నాయకుల్లోని సందేహాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివృత్తి చేశారు. ప్రస్తుత కమిటీ అనుభవం, యువశక్తి మేళవింపుగా ఉందని, ఇది గతం, వర్తమానం, భవిష్యత్తుకు నడుమ వారధిగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును పెంపొందించుకోవడమే పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్ అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీకి ఓటు వేయని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వారి మనసు గెలుచుకునే విధంగా, వారిలో భరోసా కల్పించే విధంగా బూత్‌స్థాయి వరకు నాయకులు పని చేయాలని సూచించారు. మరోసారి ప్రధాని కావాలన్న వాంఛతోనే నరేంద్ర మోదీ పతనం మొదలైందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడానికి రాష్ట్రస్థాయి చర్చలు జరపాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ను సంస్థాగతంగా, ఆర్ధికంగా ఎదుర్కొనేందుకు వ్యక్తిగత ఎజెండాలను పక్కనపెట్టి, ప్రతిపక్షాలన్నీ ఐక్య కూటమిగా కొనసాగాలని సోనియా సూచించారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ఆజాద్, మోతీలాల్ వోరా, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్, పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, కీలక నేతలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
-
వాయిస్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ భారత ప్రజల వాణి (వాయిస్ ఆఫ్ ఇండియా) అని, దేశ వర్తమానం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని రాహుల్‌గాంధీ ఈ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆయన అధ్యక్షతన జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇది. వారం కిందట కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 23 మంది సభ్యులతో ఏర్పాటైన సీడబ్ల్యూసీ దృష్టంతా ప్రస్తుతం ఎన్నికల సన్నద్ధతపైనే ఉంది. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఎజెండాను, వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. రాహుల్ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలను ఎదుర్కోవాలని సీడబ్ల్యూసీ భావిస్తోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నం మేం రాహుల్‌గాంధీకి అండగా ఉంటా. భారత ప్రజాస్వామిక విలువలను దెబ్బతీస్తున్న ఈ ప్రమాదకరమైన పరిపాలన నుంచి మన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనేందుకు సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలతో అవగాహన వంటి కీలక బాధ్యతలు రాహుల్ భుజాన వేసుకున్నారు. ప్రస్తుత సీడబ్ల్యూసీలో సోనియా, మన్మోహన్, ఆజాద్, మోతీలాల్ వోరా, ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు. -
మహిళల పట్ల రాహుల్‌కూ చిన్న చూపే!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఈసారి రాష్ట్ర అసెంబ్లీలో, అలాగే క్యాబినెట్లో ఎక్కువ మంది మహిళలను చూడదల్చుకున్నాను’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత ఫిబ్రవరి 24వ తేదీన బెంగళూరులోని బీఎల్డీ స్కూల్ గ్రౌండ్స్‌లో జరిగిన మహిళా శక్తి సమ్మేళనంలో వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పరమేశ్వరల వైపు తిరిగి ఈసారి ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వడంటూ సభా ముఖంగానే వారిని ఆదేశించారు. చివరకు కర్ణాటక అసెంబ్లీలో 244 సీట్లకుగాను 15 మంది మహిళలకు మాత్రమే పార్టీ టిక్కెట్లు లభించాయి. దాదాపు ఐదు నెలల అనంతరం రాహుల్ గాంధీ జూలై 17వ తేదీన 51 మంది సభ్యులతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాను విడుదల చేశారు. వారిలో 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 10 మంది ప్రత్యేక ఆహ్మానితులు ఉన్నారు. మొత్తం 51 శాతం సభ్యుల్లో ఏడుగురంటే ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మహిళలకు 13.7 శాతం ప్రాతినిధ్యం లభించింది. ఆ ఏడుగురు మహిళల్లో కూడా నలుగురు శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఆహ్వానితులను తీసివేస్తే మొత్తం 23 మంది సీడబ్ల్యూసీ సభ్యులో ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. వారు ఎవరంటే సోనియా గాంధీ, అంబికా సోని, కుమారి సెల్జా. ఈ రకంగా చూస్తే మహిళలకు 13 శాతమే ప్రాతినిధ్యం లభించినట్లు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, రజనీ పాటిల్, ఆశా కుమారిలను శాశ్వత ఆహ్వానితులుగా తీసుకోగా అఖిల భారత మహిళా కాంగ్రస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్‌ను ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. అంతకు 72 గంటల ముందే రాహుల్ గాంధీ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు సత్వర ఆమోదానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇక్కడ గమనార్హం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వలేక పోయామని సమర్థించుకున్నారు. మరి పార్టీ విషయంలో ప్రాతినిధ్యం కల్పించక పోవడాన్ని రాహుల్ గాంధీ ఎలా సమర్థించుకుంటారు? -
జైపాల్‌రెడ్డి పేరునూ పక్కన పెట్టిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది! ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఒక్క నేతకు కూడా చోటు కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు మొన్నటివరకూ సీడబ్ల్యూసీ కోటాలో వినిపించినప్పటికీ ఆయన పేరును కూడా రాహుల్‌గాంధీ పక్కన పెట్టేయడం గమనార్హం. దీంతో రెండు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలు అధిష్టానంపై ఒకింత కినుక వహించారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు కొందరు ఈ విషయంపై ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారాలు పంపారని, కనీసం ఒక్కరికయినా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. 51 మందిలో ఒక్కరు లేరు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు మంగళవారం ప్రకటించిన సీడబ్ల్యూసీలో దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది నేతలకు అవకాశం కల్పించారు. 28 మందిని సీడబ్ల్యూసీ సభ్యులుగా, 18 మందిని శాశ్వత ఆహ్వానితులుగా, 10 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఐదుగురే ఉన్నారు. కేవలం కేరళ, కర్ణాటక రాష్ట్రాల నేతలకు అవకాశమిచ్చిన అధిష్టానం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు మొండిచేయి చూపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియాను శాశ్వత ఆహ్వానితుల జాబితాలో, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. కానీ ఆ ఇద్దరికీ తెలంగాణ కోటాలో స్థానం లభించలేదు. కుంతియాను ఒడిశా కోటాలో నియమించగా, సంజీవరెడ్డికి ఐఎన్టీయూసీ అధ్యక్ష హోదాలో అవకాశం కల్పించారు. తమిళనాడు, తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు అయినా సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని టీపీసీసీ నేతలు భావించారు. కానీ అధిష్టానం మాత్రం అవకాశం కల్పించకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేతలకు అవకాశం కల్పించినట్టయితే పార్టీకి కొంత ఊపు వచ్చి ఉండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్న పీసీసీ నాయకుడొకరు దీనిపై మాట్లాడుతూ.. ‘‘అసలు తెలుగు రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీలోకి తీసుకునే స్థాయి ఉన్న వారు లేరన్న అభిప్రాయంతోనే ఇలా జరిగి ఉంటుంది. జైపాల్ ఉన్నా ఆయన అనుభవాన్ని మరో విధంగా ఉపయోగించుకునే యోచనలో అధిష్టానం ఉంది. అందుకే ఆయన పేరును చేర్చలేదు’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పులు లేనట్టేనా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులుంటాయన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల్లో ఒకరిని మారుస్తారని, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, ప్రచార కమిటీలను నియమిస్తారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం ఉంది. పలువురి పేర్లతో లీకేజీలు సైతం వచ్చాయి. కానీ ఈ కమిటీల ప్రస్తావన, మార్పుచేర్పులను ప్రస్తుతానికి ఏఐసీసీ పక్కన పెట్టిందని సమాచారం. జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో అవకాశం రాకపోతే రాష్ట్రా నికి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డిని తీసుకోవాలనే చర్చ అధిష్టానం వద్ద జరిగిందని తెలుస్తోంది. ఆయన్ను సీడబ్ల్యూసీలోకి తీసుకు ని, సీఎల్పీ నేతగా ఇంకొకరిని నియమించాలని అధిష్టానం భావించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఆయన్నే కొనసాగించాలన్న నిర్ణయం జరిగిందని సమాచారం. ఇక ఇప్పట్లో పార్టీ సంస్థాగత మార్పులు ఉండే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
కొలువుదీరిన కొత్త సీడబ్ల్యూసీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం ఏర్పాటైంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ పగ్గాలు చేపట్టాక ఏర్పడిన తొలి సీడబ్ల్యూసీ ఇదే కావడం గమనార్హం. ఈసారి యువత, సీనియర్లకు సమాన ప్రాధాన్యమిస్తూ రాహుల్ జాబితా రూపొందించారు. ఇందులో 23 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. రాష్ట్రాలకు పార్టీ ఇండిపెండెంట్ ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న నాయకులు తమ పదవీరీత్యా శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. పార్టీ అనుబంధ సంస్థలైన ఐఎన్టీయూసీ, సేవా దళ్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ చీఫ్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. కొత్త సీడబ్ల్యూసీ తొలి సమావేశాన్ని జూలై 22న నిర్వహించాలని రాహుల్ నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుల్లో ఎవరికీ చోటు దక్కకపోవడం ఊహించని పరిణామం. ఏపీలో కాంగ్రెస్ చాలా బలహీనపడినా, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం. సీడబ్ల్యూసీలో తెలంగాణ, ఏపీల ను విస్మరించే పరిస్థితే రాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని, త్వరలోనే సరిచేస్తామని చెప్పాయి. అయితే, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ అధ్యక్షుడి హోదాలో సంజీవరెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం దక్కింది. సీడబ్ల్యూసీ సభ్యులు.. 1.రాహుల్ గాంధీ 2. సోనియా గాంధీ 3. మన్మోహన్ సింగ్ 4.మోతీలాల్ వోరా 5.గులాం నబీ ఆజాద్ 6.మల్లికార్జున్ ఖర్గే 7.ఏకే ఆంటోనీ 8.అహ్మద్ పటేల్ 9.అంబికా సోని 10.ఊమెన్ చాందీ 11.తరుణ్ గొగోయ్ 12.సిద్దరామయ్య 13.ఆనంద్ శర్మ 14.హరీశ్ రావత్ 15.కుమారి సెల్జా 16.ముకుల్ వాస్నిక్ 17.అవినాశ్ పాండే 18.కేసీ వేణుగోపాల్ 19.దీపక్ బాబారియా 20.తామ్రద్వాజ్ సాహు 21. రఘువీర్ మీనా 22.గైకాంగమ్ గాంగ్మె 23.అశోక్ గెహ్లాట్ శాశ్వత ఆహ్వానితులు.. 1.షీలా దీక్షిత్ 2.పి.చిదంబరం 3.జ్యోతిరాదిత్య సింధియా 4. బాలసాహెబ్ థోరాట్ 5.తారిక్ హమీద్ కర్రా 6.పీసీ చాకో 7.జితేంద్రసింగ్ 8.ఆర్పీఎన్ సింగ్ 9.పీఎల్ పూనియా 10.రణదీప్ సుర్జేవాలా 11.ఆశాకుమారి 12.రజనీ పాటిల్ 13.ఆర్సీ కుంతియా 14.అనుగ్రహ నారాయణ్ సింగ్ 15.రాజీవ్ ఎస్ సాతవ్ 16.శక్తిసిన్హా గోహిల్ 17.గౌరవ్ గొగోయ్ 18.ఎ.చెల్లాకుమార్ ప్రత్యేక ఆహ్వానితులు.. 1.కేహెచ్ మునియప్ప 2.అరుణ్ యాదవ్ 3.దీపేందర్ హుడా 4.జితిన్ ప్రసాద్ 5.కుల్దీప్ బిష్ణోయ్ 6. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు 7.ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు 8. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు 9. సేవాదళ్ ప్రధాన నిర్వాహకుడు. చోటు కోల్పోయిన ప్రముఖులు.. దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్ షిండే, కరణ్‌సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, హరియాణా మాజీ సీఎం భూపిందర్ హుడా, హిమాచల్ మాజీ సీఎం వీరభద్రసింగ్, సీనియర్ నాయకులు మోహన్ ప్రకాశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, సీపీ జోషి, మొహసినా కిద్వాయ్. -
సీడబ్ల్యూసీని రద్దు చేసిన రాహుల్
న్యూఢిల్లీ: సోనియా హయాంలో ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ రద్దు చేశారు. దాని స్థానంలో 34 మంది సభ్యులుండే తాత్కాలిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ త్వరలో నిర్వహించే పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సీడబ్ల్యూసీ సభ్యులందరూ స్టీరింగ్ కమిటీలోనూ ఉన్నారు. శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న అమరిందర్ సింగ్, విలాస్ ముత్తెంవార్, ఆర్కే ధావన్, శివాజీరావ్ దేశ్‌ముఖ్,, ఎంవీ రాజశేఖరన్, మొహ్సినా కిద్వాయితోపాటు ప్రత్యేక ఆహ్వానితులను కమిటీ నుంచి మినహాయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో కూడిన స్టీరింగ్ కమిటీ శనివారం సమావేశమై ప్లీనరీ షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ నియామకాన్ని ప్లీనరీ లాంఛనంగా ఆమోదించటంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లవుతుంది. ప్లీనరీ మార్చి 16 లేదా 17 తేదీల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్లీనరీ ముగిశాక తిరిగి కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటవుతుంది. దీనిని ప్లీనరీలో కానీ, ఆ తర్వాత కానీ ఎన్నుకుంటారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సీడబ్ల్యూసీలోని 25 మంది సభ్యుల్లో ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ కాకుండా 12 మందిని ఎన్నుకుంటారు. -
‘భారత్’ను రక్షించాల్సిన అవసరం ఉంది’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సున్నిత విమర్శలు చేశారు. భారతదేశం అనే భావనను ప్రస్తుత ప్రభుత్వం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం తిరోగమన పరిస్థితుల్లో ఉందని, అది కూడా కేవలం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే పరిమితమైకాక శాంతియుత పరిస్థితులకు, భిన్నత్వ భావనకు పాకుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అసలైన భావనను తుడిచేయాలనుకుంటున్న వారి నుంచి భారత్‌ను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేతలతో(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)తో ఢిల్లీలో అత్యున్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఆమె ఈ సందర్భంగా వారితో పలు విషయాలు చర్చించారు. ‘ఒకప్పుడు ఎక్కడైతే సామరస్యం ఉందో అక్కడ నేడు అది కనిపించకుండా పోతోంది. ఎక్కడైతే ఆర్థికసామర్థ్యం ఉందో ఇప్పుడక్కడ స్తబ్ధత నెలకొంది. ఒకప్పుడు ఎక్కడ సహనం ఉందో ఇప్పుడు అక్కడ రెచ్చగొట్టుతత్వం ఏర్పడుతోంది. అందుకే భారతదేశం అసలు ఏ భావనతో ఏర్పడిందో దానిని మనం ఇప్పుడు తప్పకుండా రక్షించాల్సినవసరం ఉంది’ అని సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు సూచించారు. ఇక 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎవరికీ వారుగా వ్యక్తిగత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. -
రాహుల్... పగ్గాలు అందుకోండి!
-
రాహుల్... పగ్గాలు అందుకోండి!
ముక్తకంఠంతో కోరిన సీడబ్ల్యూసీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పే తరుణం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో.. ‘పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉండాలి’ అంటూ సభ్యులు ముక్తకంఠంతో రాహుల్‌ను కోరారు. 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ సారథ్యానికి ఆయనే అన్ని విధాలా అర్హుడని తేల్చిచెప్పారు. పార్టీలో నిర్ణయాధికారం కలిగిన సీడబ్ల్యూసీలో దీనిపై చర్చ జరగడం తొలిసారి. సీనియర్ నేత ఏకే ఆంటోనీ తొలుత ఈ అంశాన్ని లేవనెత్తారు. మాజీ ప్రధాని మన్మోమోహన్సింగ్తో పాటు సీనియర్ నేతలందరూ ఏకగ్రీవంగా సమర్థించారు. ‘రాహుల్ పార్టీ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాలని కోరుకుంటున్న కోట్లాది మంది కార్యకర్తల అభీష్టాన్ని సీడబ్ల్యూసీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అందుకు ఇదే సరైన సమయం. మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై అన్ని వర్గాలనూ చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లే సత్తా రాహుల్‌కు ఉందని మన్మోహన్ సహా ఇతర సీనియర్లందరూ విశ్వాసం వ్యక్తం చేశారు’ అని సమావేశం అనంతరం ఆంటోనీ తెలిపారు.. దేశ ప్రయోజనాల కోసం పోరాడేందుకు పార్టీ అధినేత, సీడబ్ల్యూసీ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని భేటీకి అధ్యక్షత వహించిన రాహుల్ చెప్పినట్టు సమాచారం. రాహుల్ పట్టాభిషేకంపై యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రకటన ఉంటుందా అన్నదానికి ‘మేమూ అదే ఆశిస్తున్నాం’ అని బదులిచ్చారు పార్టీ నాయకుడొకరు. అనారోగ్య కారణాలతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశానికి హాజరు కాలేదు. కాంగ్రెస్ చరిత్రలో సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా ఉన్న సోనియా 1998లో సీతారాంకేసరి నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. 2013లో రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. సమావేశ వివరాలను సోనియాకు తెలియజేస్తామని, ఆమె నిర్ణయం వెలువరించిన తరువాత మళ్లీ సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని రణదీప్ వెల్లడించారు. ‘తన వారసుడిని సోనియా నియమించరు. సీడబ్ల్యూసీ నిర్ణరుుస్తుంది’ అని ఆంటోనీ అన్నారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల గడువును మరో ఏడాది పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాలని సీడబ్ల్యూసీ తీర్మానించిందన్నారు. చీకటి రోజులు: రాహుల్ తన ప్రసంగంలో రాహుల్ మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యానికి కారు చీకట్లు కమ్ముకున్నాయని టీవీ చానళ్లపై నిషేధాన్ని ఉద్దేశించి అన్నారు. ఎన్డీటీవీ ఇండియాపై నిషేధం ఉత్తర్వులు నిలుపుదల న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ఇండియా చానల్ ప్రసారాలను ఒక్కరోజుపాటు నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నిర్ణరుుంచింది. నిషేధాన్ని పునస్సమీక్షించాలని ఎన్డీటీవీ కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. చానల్ అప్పీలును పరిష్కరించే వరకు నిలుపుదల అమలులో ఉంటుంది. ఎన్డీటీవీ కో-చైర్మన్ ప్రణయ్ రాయ్ సోమవారంమంత్రి వెంకయ్య నాయుడును కలసి చర్చించారు. అనంతరం నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అంతకుముందు తమపై విధించిన నిషేధం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని ఎన్డీటీవీ ఇండియా చానల్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లో ఆరోపించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి దృశ్యాలను ప్రసారం చేశారంటూ ఈ చానల్‌పై ఒక్కరోజు(నవంబర్ 9) నిషేధం విధించడం తెలిసిందే. -
బ్రేకింగ్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరే ఉండాలి!
-
బ్రేకింగ్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరే ఉండాలి!
రాహుల్‌ను ఏకగ్రీవంగా కోరిన సీడబ్ల్యూసీ న్యూఢిల్లీ: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వెనువెంటనే చేపట్టాల్సిందిగా గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా కోరింది. ప్రస్తుతం తన తల్లి సోనియాగాంధీ చేతుల్లో ఉన్న అధ్యక్ష పదవిని అధిష్టించాల్సిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తాజాగా ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే, ఎప్పటిలాగే రాహుల్‌గాంధీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరో ఏడాదిపాటు పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని కొనసాగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అనారోగ్యం కారణంగా కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకాలేకపోయారు. అయితే, ఆమెనే పార్టీ చీఫ్‌గా కొనసాగించాలని సీడబ్ల్యూసీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని త్వరలోనే ఎన్నికల సంఘానికి తెలియజేయనున్నారు. అయితే, ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించాలన్న విజ్ఞప్తి తెరపైకి వచ్చిందని, కానీ, కీలక అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్టీ పగ్గాల మార్పు జరగలేదని తెలుస్తోంది. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దగా కోలుకోలేదు. కేరళ, అసోంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో కీలకమైన యూపీలో చావో-రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నది. -
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశం
-
సీడబ్ల్యూసీ భేటీ 8న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈనెల 8న ఢిల్లీలో సమావేశం కానుంది. భూ సేకరణ ఆర్డినెన్స్‌పై మోదీ సర్కారు వెనక్కి తగ్గడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, సీఎంలు రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌ను ఎలా తీవ్రతరం చేయాలనే అంశాలు చర్చకు రావొచ్చని తెలుస్తోంది. వర్తమాన రాజకీయ పరిస్థితిపై చర్చించడానికి ఈనెల 8న సీడబ్ల్యూసీ భేటీ అవుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది వెల్లడించారు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీన్ని మళ్లీ మూడేళ్లకు తగ్గిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. -
రంగు వెలిసిందోచ్..!
అధిష్ఠానం ఇక్కడి ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీ పెద్దలకు చూపిద్దాం. పంచెకట్టులోనే కాదు.. చీరకట్టులో కూడా తెలుగువారి పౌరుషం ఉంది. ఎన్ని రోజులైనా సరే ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచుతాం. గత జూలై 30న తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుత విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ చిందులివి. అది నిజమేననుకొని వేలాదిమంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి మండుటెండలో ధర్నాలు, ప్రదర్శనలు చేశారు. వీరికి ముందుండి అలుపెరగని పోరు చేస్తున్నట్టు తెగ ఫోజులివ్వడంతో అదంతా నిజమేననుకున్న జనం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటలీ సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామంటూ ఉద్యోగులు, ఇతర సంఘాల నేతలు ఆరోపణలు చేసిన వేదికను అవినాష్ పంచుకున్నారు. ఈయన మాట కూడా అదే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇలా యూ టర్న్ తీసుకుంటారని అప్పట్లో అనుకోలేదు. ఇది నాటి సంగతి.. మరి నేడో... విభజన జరిగిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిన తరుణంలో అవినాష్ కూడా పక్క పార్టీలవైపు చూశారు. అయితే ఏ పార్టీలోనూ సముచిత స్థానం లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయారు. తండ్రి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ చక్రం తిప్పారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోటీలో లేకపోవడంతో విజయవాడ ఎంపీ టికెట్ కోసం ఇలా దరఖాస్తు చేశారో.. లేదో ... అలా ఇచ్చేశారు. రాష్ట్రం రెండు ముక్కలైతే విద్యార్థులు పడే బాధల్ని కథలు కథలుగా చెప్పిన అవినాష్.. ఆ సమస్యలకు అధిష్ఠానం పరిష్కారం చూపకపోయినా ఈయన మాత్రం రంగుమార్చేశారు. -సాక్షి, విజయవాడ -
‘లోక్‌సభ’కు వ్యూహమెలా?
-
‘లోక్‌సభ’కు వ్యూహమెలా?
* రాహుల్ గాంధీ సారథ్యంలో సీడబ్ల్యూసీ అనధికార భేటీ * ఎన్నికల ప్రచారంలో ఏయే అంశాలు ప్రస్తావిద్దాం * సూచనలు కోరిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు * హాజరుకాని ప్రధాని, సోనియా న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రస్తావించాల్సిన అంశాల గురించి చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పనలో ఏఐసీసీ నేతలు తలమునకలైన నేపథ్యంలో రాహుల్ సారథ్యంలో సీడబ్ల్యూసీ అనధికారికంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ భేటీలో ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొనలేదు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీ అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ విలేకరులతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతోపాటు ఇతర రాజకీయ అంశాలపై సభ్యుల సలహాలను రాహుల్ కోరినట్లు చెప్పారు. పార్టీ మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహిస్తున్న రక్షణశాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీ ఈ సూచనలను పరిశీలిస్తారని చెప్పారు. పార్టీ ఎటువంటి ఆలోచనలు, వ్యూహంతో ముందుకెళ్లాలని నేతలు కోరుకుంటున్నారో రాహుల్ తమ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారని వివరించారు. కాగా, ఆదివారం హర్యానాలోని సోనిపట్‌లో రైతులతో రాహుల్ భేటీకానున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై నేరుగా వివిధ వర్గాల ప్రజల నుంచి వివరాలు సేకరించే ప్రయత్నంలో భాగంగానే రాహుల్ రైతులతో భేటీ కానున్నట్లు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారనేందుకు ఈ భేటీ సంకేతమని వివరించాయి. -
సీఎం రాజీనామాపై కోర్‌కమిటీ చర్చ!
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా సంకేతాలపై కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ రాజీనామా చేస్తే ఏం చేయాలనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. లోక్‌సభలో మంగళవారం రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం అనంతరం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్సింగ్, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, ఏకే ఆంటోనీ తదితరులు సమావేశమయ్యారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలపైనా వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేస్తారని సంకేతాలు అందడంతో ఈ అంశంపైనా వారు చర్చించినట్లు తెలిసింది. కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? లేక రాష్ట్రపతి పాలన విధించాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం అనంతరం రాష్ట్రపతి వద్దకు బిల్లు వెళుతున్నందున ఈ నెలాఖరులోగా గెజిట్ వెలువడే అవకాశ ం ఉందని, అదే సమయంలో వచ్చే నెల తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కోర్‌కమిటీ చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్రపతి పాలన విధించాలా? లేక ప్రభుత్వాన్ని కొనసాగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలా? అనే అంశంపై కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసిన తరువాతే తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమై సీఎం రాజీనామా, పార్టీలో పరిణామాలు, వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు తెలిసింది. -
ఎంపీలు రాజీనామా చేయకే ఈ విపత్తు: అశోక్‌బాబు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయం సీఎం రాజీనామాతో ప్రయోజనం ఉండదు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం చేసినరోజే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసుంటే విభజన జరిగుండేది కాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. వారు రాజీనామా చేయనందునే ఈ విపత్తు ఏర్పడిందన్నారు. రాజకీయ వ్యూహంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీల నేతలు విఫలమయ్యారన్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ అంతకు అంత అనుభవిస్తుందని, కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమని అన్నారు. సీమాంధ్ర నేతలు సమయం అయిపోయాక యుద్ధం చేశారని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన విజయ్‌చౌక్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే. ఎంపీలను కొట్టించి, తలుపులు మూసి, ప్రసారాలను నిలిపివేసి నిర్ణయం చేశారు. దీనికి యూపీఏ మూల్యం చెల్లించాల్సిందే. ఇందులో బీజేపీకి భాగస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే బీజేపీ మద్దతిచ్చింది. బిల్లువద్దని వందరోజులు ఉద్యమం చేశాక కూడా దాని తీవ్రతను గుర్తించకపోవడం జాతీయ పార్టీల వైఫల్యం’’ అని అన్నారు. సీఎం కిరణ్ రాజీనామా చేస్తారంటున్నారు, దీన్నెలా చూస్తారని ప్రశ్నించగా.. ‘‘ఇంత ప్రక్రియ ముగిశాక సీఎం రాజీనామాతో ప్రయోజనం లేదు’’ అని ఆయన బదులిచ్చారు. సీఎం వద్ద ఆఖరుబంతి ఉందన్నారు కదా? అని అడగ్గా.. ఆయనవద్ద ఆఖరు బంతి ఉందో, లేదో మీకే తెలుసు అని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌కు మద్దతిస్తారా? అని అడగ్గా.. బంద్‌లతో ప్రయోజనం ఉంటుందని అనుకోవట్లేదని బదులిచ్చారు. ముగిసిన ధర్నా: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఢి ల్లీలోని రాంలీలామైదానంలో నిర్వహించిన రెండురోజుల ధర్నా మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. టీ-బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిందని తెలియడంతో శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకుంది. కాగా ఉదయం పదిగంటలకు ప్రారంభమైన ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెలువడడానికి కొన్ని నిమిషాలముందే ముగిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రకటించారు. నిరాశచెందకుండా తుదివరకు పోరాటంలో ఉండాలని ఉద్యోగులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ తదితరులు ధర్నాకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. ధర్నాలో చలసాని శ్రీని వాస్, సమైక్యవిద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అడారి కిశోర్‌బాబు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమైక్యవాదుల రైళ్లు మంగళవారం రాత్రి బయలుదే రాయి. -
టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ
-
టీ బిల్లుపై చర్చలో పాల్గొనండి: రాహుల్‌గాంధీ
* సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ సూచన * సీమాంధ్రకు న్యాయం చేస్తామని హామీ * విభజనకే ఒప్పుకున్నాం.. హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ అయినా చేయమని సీమాంధ్ర నేతల విన్నపం * భేటీలో పాల్గొన్న జీవోఎం సభ్యులు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామన్నారు. వాస్తవాలను అర్థం చేసుకుని విభజనపై పార్లమెంట్లో జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్రుల సమస్యలను లేవనెత్తాలని వారికి సూచించారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కిశోర్‌చంద్రదేవ్, కావూరి సాంబశివరావు, ఎం.ఎం.పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, చిరంజీవి, పనబాక లక్ష్మి, ఎంపీలు హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజులతో రాహుల్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని ఆహ్వానించినా వారు గైర్హాజరయ్యారు. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశానికి జీవోఎం సభ్యులు కూడా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న కొందరు నేతలు చెప్పిన వివరాల ప్రకారం.. రాష్ట్ర విభజనపై లోక్‌సభలో మంగళవారం జరిగే చర్చలో పాల్గొని సీమాంధ్ర సమస్యలను లేవనెత్తాలని సీమాంధ్ర నేతలకు రాహుల్ సూచించారు. వాటి పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, సీమాంధ్రకు అన్యాయం చేయబోమని హామీ ఇచ్చారు. అదే తనతో పాటు, సోనియాగాంధీ అభిమతమని వెల్లడించారు. అనంతరం జీవోఎంకు తాము గతంలో సమర్పించిన ప్రతిపాదనలను సీమాంధ్ర నేతలు రాహుల్ ముందుంచారు. మంత్రులు కావూరి, పల్లంరాజు, జేడీ శీలం మాట్లాడుతూ తాము చేసిన విజ్ఞప్తులేవీ జీవోఎం పట్టించుకోలేదని, అలాంటప్పుడు జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని ప్రశ్నించారు. రాష్ర్ట విభజనకే తాము ఒప్పుకుంటున్నప్పుడు హైదరాబాద్‌ను తాత్కాలిక కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. దీంతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రాష్ర్టం విడిపోతే సీమాంధ్రలో రెవెన్యూ లోటు తీవ్రమవుతుందని, దీనిని అధిగమించేందుకు హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఇవ్వాలని, సీమాంధ్ర లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రాయితీలివ్వాలని కోరారు. అనంతరం రాహుల్ జీవోఎం సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్‌ను యూటీ చేయడం సాధ్యం కాదని, అలా చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని తెలిపారు. పైగా ఎంఐఎం పార్టీ సహా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేలందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారని సీమాంధ్ర నేతలకు వివరించారు. అయితే, తాము కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకే హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మాత్రమే కోరుతున్నామని కేంద్ర మంత్రులు చెప్పడంతో.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ హామీ ఇచ్చారు. విడిపోయిన తరువాత సీమాంధ్రకు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా ప్రత్యేక హోదా కల్పించాలని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీమాంధ్ర నేతలు పేర్కొన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల్లో అత్యధికులు తెలంగాణలో కలవాలని కోరుతున్నందున రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళతానని రాహుల్ వారికి చెప్పారు. ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తేయండి సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని ఆ ప్రాంత నేతలు రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. రాష్ర్ట విభజనపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంత ప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోతే అప్రజాస్వామికం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై రాహుల్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. సమావేశానంతరం జేడీ శీలం మీడియాతో మాట్లాడుతూ.. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను తాత్కాలిక యూటీ చేస్తే జనంలోకి వెళ్లి వారిని మెప్పించగలమని చెప్పామన్నారు. -
ఘోరం... దారుణం!
సంపాదకీయం: ప్రజాస్వామ్యాన్ని స్వీయ ప్రయోజన చట్రంలో బంధించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో గురువారం లోక్‌సభలోని విషాదకర పరిణామాలు వెల్లడించాయి. సభలో మైక్రోఫోన్లు విరిగాయి. కంప్యూటర్ను విసిరేశారు. పత్రాలు చించేశారు. కొన్నేళ్లుగా...మరీ ముఖ్యంగా గత ఏడు నెలలుగా రాష్ట్రంలో సంభవిస్తున్న అనేకానేక ఘటనలకు ఇవి పరాకాష్ట. తీవ్ర గందరగోళం మధ్య, కనీవినీ ఎరుగని తోపులాటలు, పెప్పర్‌స్ప్రే వినియోగం, ముష్టిఘాతాలు, పరస్పర దూషణలమధ్య విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆయనను ఎవరూ నిరోధించకుండా చూసేందుకు ఇతర రాష్ట్రాల ఎంపీలను షిండేకు రక్షణగా ఉంచారు. మరికొందరిని సభలో ఇతరచోట్ల మోహరించారు. ‘మీరు మీ సభ్యులను అదుపు చేసుకోండి. సభను సజావుగా నడపండి. బిల్లు ప్రవేశపెట్టేందుకు మేం సహకరిస్తా’మని బీజేపీ ఇచ్చిన హామీకి కాంగ్రెస్ నాయకత్వం చేసిన ‘ఫ్లోర్ మేనేజ్మెంటు’ఇది! దేశంలోనే అత్యున్నతమైన చట్టసభను గ్రామ పంచాయతీ సమావేశం స్థాయికి దిగజార్చిన ఈ నేరంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెస్. సభలో షిండే బిల్లు ప్రవేశపెట్టడాన్ని దేశ ప్రజలకు చూపలేని దుస్థితికి పార్లమెంటు చేరుకున్నదంటే అది యూపీఏ ప్రభుత్వ పాలనా నిర్వహణకు బండగుర్తు. బిల్లు ప్రవేశపెడుతూ షిండే మాట్లాడిన నాలుగు ముక్కలూ వినబడటమే తప్ప దృశ్య మాధ్యమంలో ఆయన జాడలేదు. అలా చూపవలసివస్తే చుట్టూ రక్షణగా ఉన్న ఎంపీలూ కనబడతారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. గతంలో ఇటలీ, బల్గేరియా, ఉక్రెయిన్ పార్లమెంట్లలో సంభవించిన పరిణామాలను మన పార్లమెంటుకు కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అన్నది దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్య. అలాంటి జటిలమైన అంశాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ నాయకత్వం ఆదినుంచీ అత్యంత అప్రజాస్వామికంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది. ఈ విషయంలో వచ్చే పేరుప్రతిష్టలూ, ఓట్లూ తనకు మాత్రమే లభించాలన్న కుట్రపూరిత ధోరణిని ప్రదర్శించింది. పార్టీ అత్యున్నత స్థాయి విధాన నిర్ణాయక వేదిక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలియజేసే ముందు పార్టీలో అందరినీ కలుపుకుపోదామనుకోలేదు. పోనీ, తీర్మానం ఆమోదించాకైనా ఆ విధానానికి కట్టుబడితీరాల్సిందేనని సభ్యులకు చెప్పలేదు. ఇందుకు భిన్నంగా రెండు ప్రాంతాల నేతలనూ ఎగదోశారు. ఆయా ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా చేతనైనంత చేయమని, డ్రామాను సాధ్యమైనంతగా రక్తికట్టించమని నూరిపోశారు. సరిగ్గా తెలుగుదేశం కూడా ఈ విషయంలో కాంగ్రెస్ అడుగుజాడల్లో నడిచింది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి అభ్యంతరంలేదంటూ ఆ పార్టీ అధినేత స్పష్టమైన లేఖ ఇచ్చికూడా ఇరువైపులా ఉన్న నేతలను భిన్నస్వరాలు వినిపించమని ప్రోత్సహించారు. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలుండటం తప్పేమీ కాదు. అయితే, సూత్రబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే ఏ పార్టీ అయినా ఆ భిన్నాభిప్రాయాలను పార్టీ వేదికల్లోనే పరిష్కరించుకుంటుంది. వ్యతిరేకిస్తున్న నాయకులకు నచ్చజెప్పటమో, వారిని వెళ్లగొట్టడమో...ఏదో ఒకటి చేస్తుంది. ప్రజల ముందు ఒకే స్వరాన్ని వినిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటున్న సీపీఎం, వైఎస్సార్కాంగ్రెస్లు... రాష్ట్రాన్ని విభజించాలని కోరుతున్న టీఆర్ఎస్, సీపీఐలు ఈ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వారి వైఖరిలో లోటుపాట్లుండవచ్చు. అవగాహనలో లోపాలుండవచ్చు. కొందరి మనోభావాలను వారు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. కానీ...అలాంటి వైఖరి ప్రజాస్వామ్యయుతమైనది. ఇందుకు భిన్నంగా... పార్టీ నిర్ణయమేదైనా ప్రాంతీయ వాదనలను వినిపించవచ్చునని గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, పరస్పరం తలపడినట్లు నటించమనడం అవకాశవాదానికి, దివాలాకోరు రాజకీయానికి పరాకాష్ట. ఇలాంటి రాజకీయానికి కాంగ్రెస్, టీడీపీలు బరితెగించిన పర్యవసానమే గురువారంనాటి లోక్‌సభ పరిణామాలు. ఇందులో సన్నాయినొక్కులు నొక్కిన బీజేపీ బాధ్యతా ఉంది. బుధవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ మంత్రులు వెల్‌లోకి రావడాన్ని గమనించాకైనా ముందు సొంతింటిని చక్కదిద్దుకోమని చెప్పాల్సిన బీజేపీ...కాంగ్రెస్ కపటనాటకాన్ని కొనసాగించేందుకు దోహదపడింది. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని స్పీకర్ మీరా కుమార్ వ్యాఖ్యానించడంతోపాటు 16మంది ఎంపీలను సస్పెండ్ కూడా చేశారు. అయితే, కాంగ్రెస్ పన్నిన ‘ఫ్లోర్ మేనేజ్మెంటు’ వ్యూహంలో ఈ దుస్థితికి బీజాలున్నాయి. తనకు సొంతంగా బలం లేదనుకున్నప్పుడు విపక్షంనుంచి అరువు తెచ్చుకోవడం తప్పుకాదు. కానీ, తన సభ్యులను నిభాయించుకోలేకపోవడం, బౌన్సర్లను నియమించుకున్నట్టు హోంమంత్రి రక్షణార్ధం రాష్ట్రేతర ఎంపీలను తెచ్చుకోవడం కూడా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చే. ఆ విషయంలో యూపీఏ ప్రభుత్వాన్ని అభిశంసించాకే తప్పుచేశారనుకుంటున్న సభ్యులపై చర్యలకు ఉపక్రమించాలి. అసలు ఇంత గొడవ జరుగుతుందని సర్కారు ముందే ఊహించిందా? అందుకు అనుగుణంగా ఇతరేతర దృశ్యాలు మాత్రమే తెరపై సాక్షాత్కరించాయా? అదే నిజమైతే, అది లోక్‌సభ నిర్వహణా తీరును సైతం సంశయించేలా చేస్తుంది. అందుకే, కొందరు సభ్యులు డిమాండు చేస్తున్నట్టు అన్ని దృశ్యాలనూ సంపూర్ణంగా వీక్షించి, సమగ్రమైన చర్యకు ఆమె పూనుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదనుకుంటే ఇది తప్పనిసరి. -
ఆర్నెల్ల ముందే చేయాల్సింది: బొత్స
ఇప్పుడు రాజీనామా చేస్తే లాభమేంటి?: బొత్స సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకున్నప్పుడే తామంతా రాజీనామా చేయకపోవడం చారిత్రక తప్పిదమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అప్పుడే అందరం రాజీనామా చేద్దామని తాను ప్రతిపాదించినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. బుధవారమిక్కడ బొత్స మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంలో ఇప్పుడు రాజీనామా చేయడం బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుంది తప్ప.. ప్రజలకు ఎలాంటి మేలూ జరగబోదని వ్యాఖ్యానించారు. రాజీనామా చేసే వారికీ ఎలాంటి ప్రయోజనమూ దక్కబోదన్నారు. ఆర్నెల్ల ముందు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఉంటే సమైక్యవాదం దేశవ్యాప్తంగా తెలిసేదని.. సమైక్యం కోసం త్యాగం చేసినవారమయ్యేవారమన్నారు. మెజార్టీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేదని తెలిపారు. అధిష్టానం సీమాంధ్ర నేతలందరినీ పిలిచి మాట్లాడేదని, సమస్యలకు పరిష్కారం లభించేదని వివరించారు. ‘ఒకవేళ అప్పట్లో రాజీనామా చేస్తే, పార్టీ అధిష్టానంవారిలో చీలిక తెచ్చి విభజనకనుకూలంగా ఉండే వేరొకరికి సీఎం బాధ్యతలు అప్పగిస్తే...’ అని విలేకరులు ప్రశ్నించగా... సమైక్య ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న ఆ సమయంలో సీఎం పదవి ఇస్తామని అధిష్టానం ఆశచూపినా ఇంగిత జ్ఞానమున్న వారెవ్వరూ ముందుకొచ్చేవారు కాదని బొత్స అన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరేగా మారిందన్నారు. కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఓ ప్రముఖ సామాజిక వర్గం ఆడుతున్న నాటకం వల్లనే.. రాష్ట్రానికీ దుర్గతి ఏర్పడింద న్నారు. అయితే ఆ సామాజిక వర్గం పేరు చెప్పేందుకు నిరాకరించారు. ‘19 తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మె’ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు హెచ్ఆర్ పాలసీ అమలు, వేతనం రూ.10 వేలకు పెంపుసహా 10 డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19వ తేదీ తర్వాత ఎప్పుడైనా నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ బుధవారం ప్రకటించింది.