ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే తామేందుకు ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జనార్థన్ ద్వివేది ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తే తామేందుకు ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు జనార్థన్ ద్వివేది ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీని పార్టీ తరపున లోక్సభ ఎన్నికల ప్రచార సారథిగా ప్రకటిస్తూ సమావేశంలో తీర్మానం ఆమోదించామని తెలిపారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ పనిచేస్తానని రాహుల్ చెప్పారన్నారు.
రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు కోరానని తెలిపారు. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదని సోనియా గాంధీ అన్నట్టు వెల్లడించారు.