మంగళవారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్
ఐదు ‘న్యాయ్’ గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ నేతల నిర్ణయం
దేశం మార్పు కోరుతోంది: ఖర్గే
మోదీ గ్యారంటీలకు ‘ఇండియా షైనింగ్’ గతేనంటూ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువత, శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చాలని నిర్ణయించింది.
పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాం«దీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్‌డీఏ కూటమి ఇచ్చిన ‘భారత్ వెలిగిపోతోంది’ నినాదానికి ఏ గతి పట్టిందో, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు అదే గతి పడుతుంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment