CWC meeting
-
రేపటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురష్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేక భేటీ నిర్వహింనుంది. మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించిన కర్ణాటకలోని బెలగావిలోనే ఈ నెల 26, 27 తేదీల్లో రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీకి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేసింది. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ సీఎంలు హాజరుకానున్నారు. మొత్తంగా 200ల మంది కీలక నేతలు హాజరవుతారని ఏఐసీసీ ప్రకటించింది. 26న మహాత్మాగాంధీ నగర్లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై ఇందులో కీలక చర్చలు చేయనున్నారు. దీంతో పాటే రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అంశంపైనా చర్చించనున్నారు. ‘1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, వివిధ వర్గాల మధ్య ఐక్యత, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రసంగించారు. ఈ భేటీకి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నాం. 200 మందికి పైగా నాయకులు దీనికి హాజరవుతారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో కీలక నేతలతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొంటారు’అని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఆర్ధిక అసమానత, ప్రజాస్వామ్య ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సవాళ్లు వంటి అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. -
AICC: ఈవీఎంలపై ఇక దేశవ్యాప్త ఆందోళనలు
సాక్షి, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, సుఖ్ విందర్ సింగ్ సుఖు, దీపా దాస్ మున్షి సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భట్టి విక్రమార్క, గిడుగు రుద్ర రాజు, పళ్లం రాజు, రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. . వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ, నాందేడ్ ఎంపీ రవీంద్ర వసంతరావు చౌహన్‌కు సీడబ్ల్యుసీ అభినందనలు తెలిపింది. సమావేశంలో నేతలకు ఖర్గే దిశా నిర్దేశం చేస్తూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు...నాలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఇది పార్టీకి ఒక సవాల్. ఎన్నికల ఫలితాల నుంచి తక్షణమే గుణపాఠాలు నేర్చుకోవాలి. పార్టీ బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాలి. నేతల మధ్య పరస్పర ఐక్యత లేకపోవడం, వ్యతిరేక ప్రకటనలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. పార్టీలో కఠినమైన క్రమశిక్షణ పాటించడం ముఖ్యం. ఎన్నికల్లో ఐక్యంగా ఉంటేనే పార్టీ విజయం సాధిస్తుంది. పార్టీ బలంగా ఉంటేనే వ్యక్తులు బలంగా ఉంటారు. సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి...ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు సమస్యలు గానే, కుల గణన కూడా ఒక ముఖ్యమైన అంశం. జాతీయ సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి సమస్యలను ఎజెండాగా పోరాటం చేయాలి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సన్నాహాలు చేసుకోవాలి. విజయాలకు నూతన పద్ధతులను అవలంబించాలి. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల తీరు అనుమానాస్పదంగా ఉంది. మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఫలితాల్లో ప్రతికూలంగా రావడం రాజకీయ పండితులకు సైతం అర్థం కావడం లేదు. రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది, సామాన్య ప్రజలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే’’ అని ఖర్గే పేర్కొన్నారు.ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ కార్యచరణ రూపొందించనున్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు ఖర్గే డిమాండ్ చేసిన తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శనతోపాటు రాబోయే ఢిల్లీ ఎన్నికల సన్నద్ధత, పొత్తుల అవకాశాలపై పార్టీ కీలక నేతలంతా చర్చించారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా చర్చించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైన సమీక్షించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నలు లెవనేత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈసీకి లేఖ.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అలాగే కౌంటింగ్‌కు సంబంధించిన డేటాలో ‘తీవ్రమైన వ్యత్యాసాలు’ ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి లేఖ రాసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వ్యక్తిగతంగా విచారణ జరపాలని పార్టీ అభ్యర్థించింది.మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చూస్తూ.. అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.కాంగ్రెస్ తన లేఖలోఓటర్లను ఏకపక్షంగా తొలగించిన ఈసీ.. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా ఓటర్లను తుది ఓటర్ల జాబితాలో చేర్చినట్లు ఆరోపించింది. మహారాష్ట్ర ఓటర్ల జాబితాకు సంబంధించి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేవనెత్తిన ఆందోళనలను కూడా పార్టీ లేవనెత్తింది.నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని కోరింది. -
నేడు కాంగ్రెస్ కీలక భేటీలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) కీలక సమావేశం శనివారం ఢిల్లీలోని అశోక హోటల్లో జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ అగ్రనేతలు చర్చించనున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ వాద్రాతోపాటు వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. సమావేశం తర్వాత విందు ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అలాగే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం సాయంత్రం 5.30 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతోపాటు రాజ్యసభ సభ్యులు సైతం ఈ భేటీలో పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాం«దీని ఎన్నుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. -
పంచ ‘న్యాయ్’లతో ప్రజలకు న్యాయం చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో రైతులు, మహిళలు, యువత, శ్రామికుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఇచ్చిన ఐదు ప్రధాన గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. భాగీదారి న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ ఐదు ‘న్యాయ్’ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి, అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పిం చాలని నిర్ణయించింది. పి.చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సీడబ్ల్యూసీ, మరో మూడు, నాలుగు రోజుల్లో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి, ఆమోదించేందుకు సీడబ్ల్యూసీ మంగళవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాందీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోనీ, ప్రియాంక గాం«దీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ‘దేశం మార్పును కోరుకుంటోంది. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ‘భారత్ వెలిగిపోతోంది’ నినాదానికి ఏ గతి పట్టిందో, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలకు అదే గతి పడుతుంది’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. -
సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు.. నాగపూర్‌లో భారీ బహిరంగ సభ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(CWC)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నదం కావాలని సమావేశంలో తీర్మానించారు. ఇండియా కూటమి కూడా ఎన్నికలకు రెడీ కావాలని ప్లాన్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎన్నికల రంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు. ఇంకా, నాగపూర్‌లో వచ్చే వారం కాంగ్రెస్ స్థాపన దినోత్సవం రోజున హే తయ్యార్ హమ్ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రేపరేషన్ కోసం ఇప్పటికీ రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్ట చెప్పారు. పార్లమెంట్లో 140 మంది ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. విపక్షాలు లేకుండానే కీలకమైన క్రిమినల్ బిల్లులను పాస్ చేశారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరలు, నిరుద్యోగం పెరిగిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేశారని విమర్శలు చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం సందర్బంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో ఆశించిన ఫలితాలు రాలేదు. భవిష్యత్తులో మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన పార్టీ నేతలకు అభినందనలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. వచ్చే లోకసభ ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన సహచరులతో సమన్వయం చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి. మేము ఐదుగురు సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఏర్పాటు చేశాము. ఇది ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించిన రూపురేఖలను నిర్ణయిస్తుంది. త్వరలో లోక్‌సభ స్థానాలపై సమన్వయకర్తలను కూడా నియమిస్తాం. డిసెంబర్ 28న కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. #WATCH | After the CWC meeting, Congress MP KC Venugopal says, "We had discussed various issues. First is the last assembly elections, results. Second is the Parliament elections of 2024 and third is the current political situation in the country, including the parliament issues.… pic.twitter.com/YYIJgA3g1D — ANI (@ANI) December 21, 2023 చర్చలు లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదిస్తూ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్న బీజేపీని దేశం మొత్తం చూస్తోంది. పార్లమెంటును అధికార పార్టీకి వేదికగా మార్చే కుట్ర జరుగుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటి వరకు మన ఇండియా కూటమికి చెందిన 143 మంది ఎంపీలను ఉభయ సభల్లో సస్పెండ్ చేసిన తీరు దురదృష్టకరం. ప్రతిపక్షాలు లేకపోయినా ముఖ్యమైన బిల్లులన్నింటినీ ఆమోదిస్తూ పార్లమెంట్ గౌరవానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మాట్లాడుతూ..‘76 మంది నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు అంశాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది. తెలంగాణలో ఏడాది క్రితం మేము మూడో స్థానంలో ఉన్నాము, అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. పలు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించాం, కానీ ఓడిపోయాం. #WATCH | On reports of an invitation to CCP chairperson Sonia Gandhi for Ram temple opening, Congress MP KC Venugopal says, "They invited us. We are very much, thankful to them for inviting us..." pic.twitter.com/FzaCgnNl4V — ANI (@ANI) December 21, 2023 మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్‌కు నిరాశ కలిగించింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో బలంగా ఉంది మా ఓటు శాతం పదిలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడం ఆందోళన కలిగించడం లేదు. పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాం, ఆలస్యం చేయకుండా అభ్యర్థులను ప్రకటిస్తాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒకటి రెండు రోజుల్లోనే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం ఇండియా కూటమి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. గెలుపే లక్ష్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతుంది. రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పడమరకు చేయాలని అనేక మంది నేతలు రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నారు. భారత్ జోడో రెండో విడతపై త్వరలోనే నిర్ణయం ఉంటుంది. ఇండియా కూటమి పార్టీలతోని పొత్తు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఈ నెలలోనే పొత్తులపై చర్చలు ప్రారంభమవుతాయి. ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని నిర్ణయించాం. కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం సూచించిన పేర్లను సీఈసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Congress Working Committee (CWC) meeting underway at AICC headquarters in Delhi pic.twitter.com/CaueMMtQX4 — ANI (@ANI) December 21, 2023 -
అభ్యర్థుల ఖరారుపై చర్చ.. సచిన్ పైలెట్‌కు అందని ఆహ్వానం
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుంటున్నట్లు కనిపిస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీనియర్ నాయకుడు సచిన్ పైలెట్‌ను ఆహ్వానించలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సుఖ్జీందర్ రాంధావా, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గోవింద్ దోతస్రా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాజస్థాన్ స్క్రీనింగ్ కమిటీ చీఫ్ గౌరవ్ గొగోయ్ తదితరులను ఆహ్వానించారు. సచిన్ పైలెట్, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషిల పేర్లు ఇందులో లేవు. बचत, राहत, बढ़त, हिफ़ाज़त और उत्थान, कांग्रेस के सुशासन से ऐसे बदला राजस्थान ! भरोसा है हमें कि जनता फ़िर से देगी आशीर्वाद। आज राजस्थान के परिप्रेक्ष्य में केंद्रीय चुनाव समिति की महत्वपूर्ण बैठक हुई। pic.twitter.com/ygR5auUdUf — Mallikarjun Kharge (@kharge) October 18, 2023 రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. పొదుపు, ఉపషమణం, వృద్ధి, రక్షణలతో కాంగ్రెస్ గుడ్ గవర్నెన్స్ రాజస్థాన్‌లో సమూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు మరోసారి దీవిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమైన సమావేశం ఉందని ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) అక్టోబర్ 13 ఢిల్లీలో ఇప్పటికే సమావేశమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా? -
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..
Updates.. 19: 20PM తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే.. 1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ 3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం 5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ 6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా 18.02 PM ► తుక్కుగూడలో జరుగుతున్న విజయ భేరీ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభాప్రాంగణానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేరుకున్నారు. ►తాజ్‌కృష్ణలో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► సోనియా గాంధీ ప్రకటించబోయే 6 గ్యారెంటీ స్కీంలు ఇవే.. 1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్. 2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ. 3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ. 4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం. 5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం. 6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి. ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణను పాటించాలి. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ► హోటల్ తాజ్‌కృష్ణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తాం. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ► డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండా. విద్వేష రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యం. సరైన ఎజెండా చెప్పకుండా పార్లమెంట్ ప్రత్యేక సోషన్ పెడుతున్నారు. ► కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక. ► నగరంలోని తాజ్‌కృష్ణ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాలు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ► ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు. ► తొలిరోజు సమావేశంలో 14 జాతీయ అంశాలపై తీర్మానం. ► ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ► కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. రెయిన్ ఫ్రూప్ టెంట్లు.. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ►సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ►స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. ►సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ►ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. భారీ బందోబస్తు.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు. -
‘సెప్టెంబర్ 17’: బీజేపీ Vs కాంగ్రెస్.. తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు
హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో శనివారం నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిటీలోనే ఉన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి వీరు హాజరవుతారు. మరోపక్క తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు దృష్టిలో పెట్టుకుని నగర వాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి కంటే ముందే బయలుదేరాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా .. ►ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్ నుంచి ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు. ► నాపంల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్ టీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. ►నిరంకారి నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్ భవన్ వైపు పంపిస్తారు. ► బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్ల వైపు నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో పంపిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ కేంద్రంగా.. ►ప్లాజా ఎక్స్ రోడ్ నుంచి ఎస్బీఐ చౌరస్తా మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. వైఎంసీఏ ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే ట్రాఫిక్ అనుమతిస్తారు. ► బోయిన్పల్లి–తాడ్‌బండ్ వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఓ వైపు మళ్ళిస్తారు. కార్ఖానా–జేబీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను స్వీకార్ ఉపకార్ నుంచి టివోలీ వైపు పంపిస్తారు. ► ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు చూపించాలి... ఆదివారం నగరం వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న చోట్లా ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు చూపించిన వారిని బారికేడింగ్ పాయింట్లు దాటి ముందుకు పంపాలని ఆదేశించారు. -
‘బ్యాలెట్’ రూట్లో.. ఆరు గ్యారంటీలు!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. బ్యాలెట్ రూట్లో ఆరు గ్యారంటీ హామీలను ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ ‘విజయభేరి’ సభా వేదికగా అగ్రనేత సోనియాగాంధీ ఈ గ్యారంటీ కార్డు స్కీమ్‌లను ప్రకటించనున్నారు. ఈ హామీలేమిటనే దానిపై టీపీసీసీ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘మహాలక్ష్మి, చేయూత, అంబేడ్కర్ అభయ హస్తం, యువ వికాసం, రైతు భరోసా’తోపాటు మరో గ్యారంటీ కార్డు స్కీమ్‌ను వెల్లడించనున్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు నెలకు రూ.3వేల నగదు సాయం.. చేయూత పథకం కింద నెలకు రూ.4 వేల సామాజిక పింఛన్లు.. అభయ హస్తం పేరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం.. యువ వికాసం కింద 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. రైతు భరోసా పేరుతో ఏటా రైతులకు రూ.15వేల పెట్టుబడి సాయం వంటి హామీలను ఇవ్వనున్నట్టు తెలిసింది. వీటితో పాటు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, రూ.2లక్షల రైతు రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులకు విద్యా సాయం, బీసీ కులవృత్తులకు ఆర్థిక చేయూత వంటి హామీలనూ ఇవ్వనున్నట్టు సమాచారం. నిజానికి ఈ నెల 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. కానీ గ్యారంటీ కార్డు స్కీమ్‌లపై ఫోకస్ చేసి, వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో.. ఆరు గ్యారంటీలకు పరిమితమవుతున్నామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని అంటున్నాయి. నేటి కాంగ్రెస్ షెడ్యూల్ ఇదీ.. రెండో రోజు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు ఇందులో పాల్గొంటారు. సాయంత్రం 4:45 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. అనంతరం సీడబ్ల్యూసీకి హాజరైన నాయకులంతా తుక్కుగూడలో జరిగే విజయభేరి బహిరంగ సభకు బయల్దేరుతారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సభ జరుగుతుంది. సభ ముగిశాక జాతీయ, వివిధ రాష్ట్రాల నాయకులు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళతారు. నేతలు ఆయా నియోజకవర్గాల్లోనే రాత్రి బస చేస్తారు. సోమవారం నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ కార్డు స్కీమ్‌ల గురించి ప్రచారం చేస్తారు. మూడు వేదికలు.. భారీగా ఏర్పాట్లు తుక్కుగూడ బహిరంగ సభ కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభా స్థలిలో మూడు వేదికలు సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సుఖ్వీందర్సింగ్ సుఖు, సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్‌తోపాటు 84 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూర్చోనున్నారు. కుడివైపున ఏర్పాటు చేసిన రెండో వేదికపై మాజీ కేంద్ర మంత్రులు, మాజీ సీఎంలు, పీసీసీ చీఫ్‌లు ఆసీనులవుతారు. ఎడమవైపు ఏర్పాటు చేసిన మూడో వేదికను డీసీసీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కళాకారులకు కేటాయించారు. మొత్తంగా మూడు వేదికలపై కలిపి 320 మందికిపైగా ఉంటారు. ♦ సభలో సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్, భట్టి విక్రమార్క ఐదుగురు మాత్రమే ప్రసంగించనున్నారు. ♦ సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు ఐదు లక్షల మందికిపైగా తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నేతలకు జనసమీకరణ టార్గెట్లు పెట్టారు. ♦ తుక్కుగూడకు వచ్చి పోయే నాలుగు ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో నింపేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ఇటు ఫ్యాబ్‌సిటీ నుంచి అటు ఓఆర్ఆర్ వెంట ఖాళీగా స్థలాలను సిద్ధం చేశారు. ♦ కాంగ్రెస్ అగ్రనేతలు, సీఎంలు హాజరవుతుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్సైలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ♦ సాయంత్రం ఐదు గంటలకు బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్, ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. ఒకే వేదికపై ముగ్గురు గాంధీలు రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే పార్టీ సమావేశాలు, టెన్ జన్‌పథ్‌లో జరిగే కార్యక్రమాలకు మాత్రమే ఈ ముగ్గురు కలసి హాజరవుతారని.. ఢిల్లీ వెలుపల ఒకే కార్యక్రమంలో, అదీ ఓ బహిరంగ సభలో పాల్గొంటుండటం అరుదైన ఘటన అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం సాయంత్రం తుక్కుగూడ సభలో ఈ ముగ్గురితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఇతర జాతీయ నాయకత్వమంతా పాల్గొంటుండటం గమనార్హం. -
చైనా దురాక్రమణ పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశ ఉత్తర సరిహద్దులోని భూభాగాన్ని చైనా దురాక్రమణ చేస్తోందని, దీన్ని ఆపడానికి భారత్ చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. 2020లో జూన్ 19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని చెప్పిన మాటలే చైనా దురాక్రమణకు కారణమవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో జైరాం రమేశ్, పవన్ఖేరాలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, భద్రతా వైఫల్యం గురించి సమావేశంలో చర్చించినట్టు చెప్పారు. దేశంలో రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి సవాల్ ఏర్పడిందని, ఓ పద్ధతి ప్రకారం వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అంశాల వారీగా చిదంబరం ఏం చెప్పారంటే.. ♦ దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ... ఇవ్వాల్సిన నిధులను కూడా కేంద్రం ఇవ్వట్లేదు. ఉదాహరణకు కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని అమలు చేయడంలో భాగంగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఎఫ్‌సీఐ బియ్యం ఇవ్వడం లేదు. బియ్యం ఇవ్వొద్దని పైనుంచి ఆదేశాలిచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా తీవ్ర నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, విపత్తు సహాయం కింద కూడా కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు. దీనికి కారణం అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే. ♦ మే 5 నుంచి మణిపూర్ తగలబడుతోంది. అప్పటి నుంచి దాదాపు 157 రోజులుగా ప్రధాన మంత్రి చాలాసార్లు చాలా దేశాలకు వెళ్లివచ్చారు. ఏషియా సమిట్, జీ8 దేశాల సమావేశాలకు హాజరయ్యారు. కానీ, ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్లేందుకు రెండు గంటలు మాత్రమే పడుతుంది. అయినా అక్కడకు వెళ్లేందుకు సమయం దొరక్కపోవడం బాధ కలిగిస్తోంది. ♦ ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో అసత్యాలు చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేవు. తాజాగా ఉగ్రవాదులు అక్కడ సైన్యంపై దాడి చేసి కల్నల్, మేజర్, డీఎస్పీ, రైఫిల్‌మెన్‌ను హత్య చేశారు. ఆ సమయంలో కేబినెట్ సమావేశం నిర్వహించి జీ20 సమావేశాలు విజయవంతం చేశామని సంబురాలు చేసుకున్నారు. ♦ మణిపూర్, కశ్మీర్లో అంతర్గత భద్రతకు భంగం ఒకవైపు, చైనా ఆక్రమణ మరోవైపు. భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు చర్చలు జరిపినా ఉపయోగం లేదు. చైనా ఇంచు కూడా వెనక్కు తగ్గలేదు. చైనా పూర్వ స్థితిలోనే ఉందని మొన్నటివరకు అనుకున్నాం. కానీ నానాటికీ చైనా ఆక్రమణ ప్రమాదకర స్థాయికి వెళుతోంది. మనం భూభాగాన్ని కోల్పోతున్నాం. ♦ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే రాజ్యాంగంపై దాడి చేయడమే. మేం దాన్ని తిరస్కరిస్తున్నాం. ఇది జరగాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇలా చేసేందుకు తగిన సంఖ్యాబలం కావాలని బీజేపీకి కూడా తెలుసు. కానీ, ప్రజల దృష్టిని సమస్యల నుంచి మరల్చేందుకే ఇలాంటి చర్చను కేంద్రం తెరపైకి తెస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామక బిల్లుకు సవరణను ఈ సమావేశాల్లో పెడుతున్నారని తెలిసింది. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీసే ఈ బిల్లును మేం వ్యతిరేకిస్తాం. ♦ రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పశ్చిమ దిశగా జరగాలని సీడబ్ల్యూసీ సభ్యులు అడిగారు. దీన్ని సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంటుంది. ♦ సీడబ్ల్యూసీ సభ్యులందరూ ఇండియా కూటమి ఏర్పాటును స్వాగతించారు. సీట్ల సర్దుబాటు త్వరగా చేయాలని ఒకరిద్దరు సభ్యులు చెప్పారు. కానీ, ఆ సర్దుబాటు పని సీడబ్ల్యూసీది కాదు. 14 మంది సభ్యుల ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీది. ♦ తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇక్కడ సమావేశాలు నిర్వహించడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నాయకులందరూ సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడారు. వారి రాష్ట్రాల పరిస్థితుల గురించి చెప్పారు. ♦ సనాతన ధర్మంపై సీడబ్ల్యూసీలో ఎలాంటి చర్చ జరగలేదు. మేము సర్వధర్మ సంభావ్ను నమ్ముతాం. తాము మాట్లాడింది మతాల గురించి కాదని, కుల వ్యవస్థ, కులాల పేరుతో అణచివేత, మహిళలు, దళితుల అణచివేత గురించి మాట్లాడామని డీఎంకే వర్గాలు చెప్పాయి. మేం ఆ వివాదంలోకి వెళ్లం. ♦ ఇండియా అంటేనే భారత్. ఇండియా భారత్‌గా మారినందుకు మీ జీవితాల్లో, మీ పిల్లల జీవితాల్లో, మీ ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇవన్నీ తప్పుడు వివాదాలు. అంబేడ్కర్ చెప్పినట్టు ఇండియా అంటేనే భారత్. మేం దాన్నే నమ్ముతాం. ♦ గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. క్రూడ్ ఆయిల్, అసోసియేటెడ్ గ్యాస్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించవచ్చు. కానీ ఈ ధరలు పెంచడం ద్వారా కేంద్రం లబ్ధిపొందింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. అందుకే ఆ వాగ్దానాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం. -
కాంగ్రెస్ CWC మీటింగ్‌లో కీలక అంశాలపై చర్చ
-
తుమ్మల చేరిక.. కాంగ్రెస్ అంచనా ఇది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ కీలక నేతల సమక్షంలో.. కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ పరిణామానికి కొన్ని గంటల ముందే.. ఆయన బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం కీలక నేత అయిన తుమ్మల అధికార పార్టీ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డారు. బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో కారు దిగి హస్తం గూటికి చేరారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది. 1983 ఎన్నికల్లో ఓడారాయన. ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు. 2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారాయన. ఎమ్మెల్సీగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కూడా. అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారు. 2016లో పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా.. తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తుమ్మల కాంగ్రెస్ చేరికతో ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాల రాజకీయానుభవం. ఖమ్మం రాజకీయాలను చక్రం తిప్పడంలో సిద్ధహస్తుడు. ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే వ్యక్తి. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలతోనూ పని చేసిన నేత. అక్కడి అభివృద్ధి విషయంలోనూ ఆయనకు మంచి పేరుంది. పైగా సొంతంగా.. బలమైన క్యాడర్ కూడా ఉంది. అందుకే తుమ్మల ప్రభావంతో కాంగ్రెస్ మరిన్ని సీట్లు పెంచుకోవచ్చని ఆశిస్తోంది. ప్రత్యేకించి.. కమ్మ సామాజిక వర్గం నుంచి ఓట్లు రాబట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. గతంలో లాగానే ఈసారి కూడా ఖమ్మంను కంచుకోటగా నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. -
హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం
-
విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి. ఇక ఈరోజు (శనివారం) సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హోటల్లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ cwc సమావేశం తర్వాత కానీ, రేపు సమావేశం ముందు కానీ అగ్ర నేతల సమయాన్ని భట్టి చేరకలుఉ ండనున్నాయి. పార్టీలో చేరనున్న నాయకులను సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పీసీసీ సమాచారం ఇచ్చింది. చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక -
హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక..
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. హైదరాబాద్‌లో పోస్టర్ల వార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా హస్తం నేతలంతా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్ల వార్ చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సీడబ్య్లూసీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ రాజధాని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, వారు పాల్పడిన కుంభకోణాలకు సంబంధించిన వివరాలను వాటిలో పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు అంటించారు. ఈ సందర్భగా స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి (బివేర్ ఆఫ్ స్కామర్స్) అంటూ టాగ్ లైన్‌తో గుర్తుతెలియన వ్యక్తులు పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీంతో, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌పై కూడా పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఫొటోతో ఓ స్కానర్‌ను రూపొందించారు. దీనిపై బుక్ మై సీఎం.. డీల్స్ అవాలబుల్.. 30 శాతం కమీషన్ అని రాసుకొచ్చారు. దీంతో, ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, రెండు పార్టీలకు చెందిన పోస్టర్లు అంటించడంపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ.. హస్తం నేతలు బిజీబిజీ -
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
తొలిరోజు ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ
Updates.. హైదరాబాద్‌లో తాజ్ కృష్ణా హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇవాళ భేటీ కొనసాగింది. పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ లాంటి కీలక నేతలు భేటీలో మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలతో పాటు ఇండియా కూటమి ఐక్యత ప్రధానంగా ఇవాళ్టి చర్చ నడిచింది. రేపు.. ఆదివారం కూడా సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎన్నికల నేపథ్యం.. పార్టీలో సమన్వయంపై ఇంకా చర్చించాల్సి ఉంది. 07:30PM స్కాంసృతిక కార్యక్రమాల అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, కీలక నేతలు పాల్గొన్నారు. 06:49PM బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్కింగ్ కమిటీ సభ్యులతో అన్నారు. 05:05PM ►ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు 04:49PM అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి: ఖర్గే 04:40PM మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు: ఖర్గే 04:34PM ►ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగుతోందని CWC సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. 03:56PM ► ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న సీడబ్ల్యూసీ భేటీ 03:15PM ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ ► హైదరాబాద్ తాజ్ కృష్ణ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యకతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం ► 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ,మణీపూర్ ఇష్యూ ,ఇండియా కూటమి లో సీట్ల సర్దుబాటు అంశం తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల పై చర్చ. ► హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు. ► తాజ్ కృష్ణ కు చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. మరి కొద్దిసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక ► హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్. ► తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన విందుకు హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక మిగతా సీడబ్ల్యూసీ సభ్యులు.. #WATCH | Congress president Mallikarjun Kharge, Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Rahul Gandhi, Congress General Secretary Priyanka Gandhi Vadra, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh CM Bhupesh Baghel and party leader Sachin Pilot arrive at Hyderabad airport to… pic.twitter.com/2fyvAA20n1 — ANI (@ANI) September 16, 2023 ► ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave for Hyderabad to attend the Congress Working Committee (CWC) meeting, from Delhi airport. pic.twitter.com/hgSb9LTn4R — ANI (@ANI) September 16, 2023 ►తాజాగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ.. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ఉంటుంది. ఆరు గ్యారెంటీ హామీల కోసమే బహిరంగ సభ. రేపు విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు. తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరికలు ఉంటాయి. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉంది. ►కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రధాని అజెండాగా సీడబ్ల్యూసీ భేటీ. మణిపూర్ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. తెలంగాణ ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలుసు. ►కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ►తాజ్‌కృష్ణ హోటల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. ►శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుంది. ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. ►శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ►త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా ►కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి. ►ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారమే చేరుకున్న 52 మంది ►సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. ►హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. ►పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారు. బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు ►సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ►సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ►ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ► ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. -
నేడు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం
-
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీకి సర్వం సిద్ధం
-
‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్‌కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. -
హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశానికి సర్వం సిద్ధం
-
CWC: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రఘువీరా సహా వీరికి చోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు.. సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్నట్లు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. తెలుగు నేతలకు చోటు.. కాగా, ఈ సమావేశం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగనున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీన సమావేశానికి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని మల్లికార్జున ఖర్గే పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలోనే సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నేతలకు చోటు కల్పించారు. ఇక, సీడబ్ల్యూసీలో మొత్తం 39 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇన్ఛార్జ్లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. రఘవీరాకు స్థానం అయితే, రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డికి సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అలాగే, శాశ్వత ఆహ్వానితుల జాబితాలో సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనరసింహకు చోటు కల్పించగా.. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో పళ్లం రాజు, వంశీచంద్ రెడ్డి, రాజస్థాన్ అసమ్మతి నేత సచిన్ పైలట్, వివాదాస్పద నేత శశి థరూర్‌కు చోటు దక్కింది. ఈ కమిటీలో ముందు నుంచి సభ్యులుగా ఉన్న అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, దిగ్విజయసింగ్, పి.చిదంబరం, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ ఉన్నారు. కాంగ్రెస్ మెగా ర్యాలీ.. ఇక, సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం హైదరాబాద్‌కు సమీపంలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ ర్యాలీలో మల్లికార్జున ఖర్గేతో సహా పార్టీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొంటారని తెలిపారు. కాగా సెప్టెంబర్ 17 మెగా ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. ఈ ర్యాలీలోనే ఎన్నికలకు 5 గ్యారెంటీ స్కీమ్స్ ప్రకటించనుందని తెలిపారు. అదే రోజు 119 నియోజకవర్గాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీలు బస చేయనున్నారని, సెప్టెంబర్ 18న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారన్నారు. Congress president Shri @kharge will convene the first meeting of the newly constituted Working Committee on September 16 in Hyderabad, Telangana. On September 17, there will be an extended Working Committee meeting. All CWC members, PCC Presidents, CLP leaders and Parliamentary… pic.twitter.com/VjwmZ5fEgx — Congress (@INCIndia) September 4, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో భారీ విజయంతో కాంగ్రెస్ పార్టీ జోరుపెంచింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హస్తం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో తొలిసారి సీడబ్ల్యూసీ భేటీ కానుంది. వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని ఏఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీడబ్ల్యూసీ సభ్యులు రానున్నారు. ఇక, సెప్టెంబర్ 18న ఎన్నికల శంఖారావంగా కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అలాగే, తెలంగాణ ఎన్నికల టార్గెట్‌గా కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. మరోవైపు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కారణంగా తేదీలు మారే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సీడబ్ల్యూసీ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత తొలి భేటీ హైదరాబాద్‌లో జరగనుంది. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికలే టార్గెట్‌గా పలు కార్యక్రమాలను రూపొంచాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లోకి క్యూ కట్టిన నేతలు.. పొంగులేటి పోటీ ఎక్కడ? -
అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు.. 28న సీడబ్ల్యూసీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల నిర్వహణ తేదీలను ఖరారు చేయడానికి ఈ నెల 28, ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడినుంచే ఆమె వర్చువల్‌గా భేటీలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ వెల్లడించారు. సోనియా వెంట రాహుల్, ప్రియాంక విదేశాలకు వెళ్లారు. దీంతో ఇతర పార్టీ నాయకులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరవుతారు. రాజస్థాన్ సీఎం రాజేశ్ గెహ్లాట్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరిగింది. గెహ్లాట్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చివరి నిముషం వరకు రాహుల్‌కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తామన్నారు. రాహుల్ అధ్యక్షుడు కాకపోతే ఎంతో మంది నిరాశ నిస్పృహలకు లోనై ఇంటికే పరిమితం అవుతారని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా వినిపిస్తున్న పేర్లలో కమల్‌నాథ్, కె.సి. వేణుగోపాల్, మీరా కుమార్, కుమారి సెల్జా ఉన్నారు. ఇదీ చదవండి: Sonia Gandhi: అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. ఆయన ఏమన్నారంటే? -
50 ఏళ్లలోపు వారికే... సగం టికెట్లు
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు కల్పించడం, కింది స్థాయి నుంచి బలోపేతం కావడం, ప్రజలకు దగ్గరవడమే లక్ష్యంగా ‘చింతన్ శిబిర్’ పలు తీర్మానాలు చేసింది. యువ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటు, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో సగం టికెట్లు 50 ఏళ్ల లోపు నేతలకే కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ సగం వారికే కట్టబెడతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఎన్నికైన పదవులకు పార్టీపరంగా రిటైర్మెంట్ వయసును ఖరారు చేస్తారు. వీటన్నింటినీ 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి అమలు చేయాలని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం ముగిసిన మూడు రోజుల కాంగ్రెస్ ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ నిర్ణయించింది. పార్టీ ప్రక్షాళన కోసం చేపట్టాల్సిన మార్పుచేర్పులు తదితరాలపై అంశాలవారీగా ఏర్పాటైన రాజకీయ, సామాజిక న్యాయ–సాధికారత, ఆర్థిక, సంస్థాగత వ్యవహారాల, వ్యవసాయ, యువజన ప్యానళ్లు రెండు రోజులుగా చర్చించి పలు ప్రతిపాదనలతో అధినేత్రి సోనియాకు నివేదికలు సమర్పించాయి. ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూలంకషంగా చర్చించి వాటికి ఆమోదముద్ర వేసింది. ఒక వ్యక్తికి పార్టీలో ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్ వంటి పలు తీర్మానాలతో ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ప్రవేశపెట్టిన ఉదయ్‌పూర్ నవ్ సంకల్ప్ డిక్లరేషన్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదించిన తీర్మానాలు... నమో యువత... ► 2024 నుంచి లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, మండలి ఎన్నికల్లో 50 శాతం టికెట్లు 50 ఏళ్ల లోపువారికే. ప్రభుత్వ పదవుల్లోనూ సగం వారికే. చట్టసభల్లో రిటైర్మెంట్ వయసు ఖరారు. ► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ 50 శాతం పదవులు 50 ఏళ్లలోపు వారికే ► యువతకు ఉద్యోగాల డిమాండ్‌తో ఆగస్టు 15 నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘ఉపాధి దో’ పాదయత్ర. సంస్థాగత, సామాజిక అజెండాలు ► ఇకపై పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకే టికెట్. కుటుంబంలో రెండో సభ్యుడు రాజకీయంగా చురుగ్గా ఉంటే ఐదేళ్ల సంస్థాగత అనుభవం తర్వాతే టికెట్‌కు అర్హత. ► పార్టీ పదవిలో ఎవరూ ఐదేళ్ల కంటే ఉండొద్దు. ► పబ్లిక్ ఇన్సైట్, ఎన్నికల నిర్వహణ విభాగాలు, నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. ► పార్టీలో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం. ► అధ్యక్షునికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు సీడబ్ల్యూసీ సభ్యలతో అడ్వైజరీ గ్రూప్ ఏర్పాటు. ► ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల గొంతుక విన్పించేందుకు సామాజిక న్యాయ సలహా మండలి. ► కులాలవారీ జనగణనకు జాతీయ స్థాయి పోరు ► చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి. ► రైతులకు ఉచిత విద్యుత్తు, గిట్టుబాటు ధరతో పాటు 50 శాతం అదనంగా చెల్లించాలి. ► జాతీయ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. ► రైతుల రుణ ఉపశమన కమిషన్ తేవాలి. ► పేద విద్యార్థులకు కాలేజీలు, వర్సిటీల్లో ఉచిత విద్య అందించాలి. ► పేదరికం, ఆర్థిక అసమానతలను రూపుమాపే ఆర్థిక విధానాల రూపకల్పనకు కాంగ్రెస్ కట్టుబడింది. సమయానుకూలంగా పొత్తులు డిక్లరేషన్‌లో కాంగ్రెస్.. బీజేపీపై నిప్పులు బీజేపీది కుహనా జాతీయవాదమంటూ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ దుయ్యబట్టింది. తమదే సిసలైన జాతీయవాదమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ‘ఆర్ఎస్ఎస్ అజెండాతో రాజ్యాంగంపై మోదీ సర్కారు దాడి చేస్తోంది. మత విభజనను వ్యాప్తి చేస్తోంది. రాష్ట్రాల అధికార పరిధిని ఆక్రమిస్తోంది. గవర్నర్ పదవినీ దుర్వినియోగం చేస్తోంది. ప్రమాదకర ఆర్థిక విధానాలకు తెర తీసింది’’ అంటూ దుమ్మెత్తిపోసింది. దేశ ప్రయోజనాల కోసం భావ సారూప్య పార్టీలతో సమయానుకూల పొత్తులకు కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించింది. ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మాణిక్ సాహా -
సంస్థాగత ఎన్నికలయ్యే వరకు అధ్యక్షురాలిగా సోనియానే
-
తూతూ మంత్రమేనా?
దేశంలోని గ్రాండ్ ఓల్డ్ పార్టీ. దశాబ్దాలు దేశాన్ని ఏలిన పార్టీ. వరుస పరాజయాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రతిపక్షమైన పార్టీ. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘ ప్రతినిధులందరూ సమావేశమైతే? అదీ ఏకంగా రెండేళ్ళ పైచిలుకు తర్వాత భేటీ అయితే? పార్టీ సభ్యులే కాదు... పరిశీలకులూ అనేక కీలక నిర్ణయాల కోసం చూస్తారు. అలా చూసినప్పుడు శని వారం నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిరాశపరిచింది. కీలకమైన నిర్ణయాలేమీ జరగలేదు. ఏడాది తరువాతెప్పుడో, వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలుంటాయని మాత్రం చాలా ఉదారంగా ప్రకటించింది. పార్టీలోని అనేక లోపాలను లేవనెత్తుతూ, ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలంటున్న 23 మంది సీనియర్ నేతల అసమ్మతి బృందం ‘జీ–23’కి కూడా పరోక్ష సమాధానాలతోనే సోనియా గాంధీ సరిపెట్టారు. వెరసి, కీలకమైన సీడబ్ల్యూసీ సైతం పార్టీ కన్నా సోనియా పరివారానికే ప్రాధాన్యమిస్తూ, పార్టీ పగ్గాలు మళ్ళీ రాహులే అందుకోవాలన్న వినతులు చేస్తూ తూతూమంత్రంగా ముగియడం ఓ విషాదం. ఆత్మ పరిశీలన అవకాశాన్ని కాంగ్రెస్ చేతులారా వదులుకొని, ‘పరివార్ బచావో వర్కింగ్ కమిటీ’ అనే బీజేపీ విమర్శకు తావిచ్చింది. పార్టీకి అత్యున్నతమైన సీడబ్ల్యూసీ 2019 ఆగస్టు తర్వాత సమావేశమవడం ఇదే తొలిసారి. ఇన్ని రోజుల తరువాతి ఈ సమావేశం సాధించినదేమిటంటే చెప్పడం కష్టం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైనప్పుడే యువనేత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. అప్పటి నుంచి సోనియాయే పార్టీకి ఆపద్ధర్మ సారథి. అంటే, దేశంలోని అతి పెద్ద వయసు పార్టీకి, దాదాపు రెండున్నరేళ్ళుగా ఆపద్ధర్మ అధ్యక్షురాలే ఉన్నట్టు! ఇదో విచిత్ర పరిస్థితి. సోనియా మాత్రం ‘నేను ఫుల్‌టైమ్ ప్రెసిడెంట్‌ని’ అంటూ మొన్న సీడబ్ల్యూసీలో హూంకరించారు. ‘అందరికీ అందు బాటులో ఉండే ప్రెసిడెంట్‌ని’ గనక ఏదైనా మీడియాకు ఎక్కకుండా, తనకే నేరుగా చెప్పవచ్చంటూ జీ–23కి పరోక్షంగా చురకలేశారు. కానీ, అధ్యక్ష పీఠంలో లేకున్నా, కీలక నిర్ణయాలు తీసుకుంటూ తప్పులు చేస్తున్న సొంత కొడుకుపైనా, పంజాబ్‌లో సీఎం మార్పు లాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్న కూతురిపైనా విమర్శలు చెబితే, వినేంత సహనం సోనియాకుంటుందా అన్నది ప్రశ్న. పార్టీ పగ్గాలు చేతిలో లేకుంటేనేం... కాంగ్రెస్ పార్టీకి కిరీటంతో పాటు బాధ్యత కూడా లేని రాకుమారుడిగా రాహుల్ చలామణీ అవుతున్నారు. నిజానికి, 2014 నుంచి ఇప్పటి దాకా పార్టీకి జరిగిన అనేక నష్టాలకు కుదురులేని ఈ కుర్ర నేత బాధ్యత కూడా చాలానే ఉందనేది స్వపక్షీయుల్లోనే కొందరి భావన. రాహుల్ బరిలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా రెండుసార్లు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని స్థానాలనైనా కాంగ్రెస్ గెలవనేలేదు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ గెలవనైతే గెలిచింది కానీ, పార్టీ పెద్ద అప్రయోజకత్వం కారణంగా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రాహుల్ తమ కుటుంబానికీ, పార్టీకీ కంచుకోట లాంటి అమేథీ నుంచే ఓడిపోయారు. కనీసం ఈ ఏడాది మేలో అస్సామ్, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలలోనూ రాహుల్ తన సమర్థతను చూపలేకపోయారు. పార్టీలో ‘సమూలమైన మార్పులు’ తేవాలని జీ–23 బృందం గత ఏడాది ఆగస్టులోనే సోనియాకు తొలి లేఖాస్త్రం సంధించింది అందుకే! పార్టీకి కంచుకోటగా మిగిలిన పంజాబ్‌లో సైతం సీఎం మార్పుతో సంక్షోభం తెచ్చింది – తల్లి చాటు బిడ్డలే. జీ–23 మరో లేఖాస్త్రం విసిరి, పత్రికా సమావేశం పెట్టి మరీ తమది ‘జీ హుజూర్’ బృందం కాదని తొడగొట్టారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరై భేటీ అయిన సీడబ్ల్యూసీ కాంగ్రెస్ పతనావస్థకు కారణాలు విశ్లేషించుకొని, దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుండేది. ఆ పని చేయలేదు. పూర్తికాలం అధ్యక్షురాలినని చెప్పుకోవడానికి సోనియాకు ఇంత కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడల్లా కన్నబిడ్డల్ని పరిష్కారం కోసం పంపి, పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తేలా చేశారామె. ఇప్పుడిక తప్పక తానే అధినేత్రినని ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. ఆ మేరకు అస్మదీయులకు మేళం కొట్టి, అసమ్మతీయుల నోటికి తాళం వేశారు. సంస్థాగతంగానూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రత్యేకత. వారసుల మోజులో పడి పోగొట్టుకున్న ఆ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికీ, పార్టీలో పునరుత్తేజం తేవడానికీ ఇది కీలక సందర్భం. ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలంటే, చురుకైన ప్రతిపక్షం అవసరం. పైపెచ్చు, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లలో వచ్చే ఏడాదే ఎన్నికలున్నాయి. మరి, కాంగ్రెస్, దానికి వారసులమని భావిస్తున్న గాంధీ పరివారం ఇప్పటికైనా మారతాయా? స్తబ్ధతను పోగొట్టుకొని, సరైన కార్యాచరణలోకి దిగుతాయా? కరోనాలో వైఫల్యం, రైతుల ఆందోళన, లఖింపూర్ ఖేడీ లాంటి ఘటనలు అనుకూలించినా, బీజేపీకి బలమైన ప్రత్యర్థిననే నమ్మకం జనంలో తేగలిగితేనే కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయని మర్చిపోకూడదు. అధినేత్రిని తానే అన్న సోనియా ప్రకటన రాహుల్, ప్రియాంకలకు రిలీఫ్. యూపీ, పంజాబ్ లాంటి చోట్ల ఫలితాలెలా ఉన్నా ఆ భారం వారు మోయక్కరలేదు. అయితే పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా అధికారం చేతిలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు. బాధ్యతల బాదరబందీ లేని అధికారాన్ని ఆశిస్తేనే పెద్ద చిక్కు! -
Sonia Gandhi: నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని
సాక్షి, న్యూఢిల్లీ: కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వంపై జీ–23 నేతలు ప్రశ్నలు లేవనెత్తడంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కఠినవైఖరి ప్రదర్శించారు. తానే పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షురాలినని, అందరూ అనుమతిస్తే ఉంటానని శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. శనివారం ఐదున్నర గంటల పాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశంలో కేంద్రప్రభుత్వ విధానాలు, మూడు వ్యవసాయ చట్టాలు– రైతు ఉద్యమం, లఖీమ్‌పూర్ ఖేరి ఘటన, జమ్మూకశ్మీర్‌లో మైనార్టీలపై దాడులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను, ఆందోళనలను తాము చూసీ చూడనట్లుగా ఎప్పుడూ వ్యవహరించలేదని, ప్రతీ అంశంపై చర్చించే నిర్ణయం తీసుకున్నామని, అయితే మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని సోనియా స్పష్టం చేశారు. కాగా సోనియా చేసిన ఈ ప్రకటన పార్టీ అసంతృప్త నేతల గ్రూప్ అయిన జీ–23కి తగిన సమాధానం ఇచ్చినట్లేనని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా సహా 23 మంది నాయకులు గత ఏడాది సోనియా గాంధీకి రాసిన లేఖలో పార్టీలో కీలక మార్పులు జరగాలని, సమర్థవంతమైన నాయకత్వం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి ఏదో ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం కపిల్ సిబల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. దీంతో శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. అయితే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించే అంశంపై స్పష్టతనిచ్చారు. సోనియా నాయకత్వంపై ఎలాంటి ప్రశ్నలు లేవని ఆయన వ్యాఖ్యానించారని సమాచారం. కాంగ్రెస్‌లో పెరుగుతున్న వ్యతిరేక స్వరంపై మాట్లాడిన సోనియాగాంధీ, ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, అయితే పార్టీలో ప్రతీ ఒక్కరు ఐక్యంగా ఉండి, పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, ప్రతి సవాలును ఎదుర్కోగలమని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ పూర్తిస్థాయి అధ్యక్ష నియామకంపై ఈ ఏడాది జూన్ 30 లోపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు రోడ్‌మ్యాప్ తయారు చేసినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా అమలు చేయలేకపోయామని పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ సిద్ధంగా ఉందని, మొత్తం ప్రక్రియ గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ పూర్తి సమాచారం ఇస్తారని సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ నాయకులకు సోనియా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలబడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐక్యత, పార్టీ ప్రయోజనాలను అగ్రస్థానంలో ఉంచడం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరింత అవసరమని సోనియా వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. ఈ ప్రస్తావనకు సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆయన అభిప్రాయానికి మద్దతు ఇచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు సంస్థాగత ఎన్నికల వాయిదా విషయంలో కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మినహా ఇతర రాష్ట్రాలలో పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకోని పరిస్థితుల్లో మరోసారి పార్టీలో అంతర్గత అలజడి చెలరేగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సోనియా చేసిన ఈ వ్యాఖ్యలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతర్గత పోరును బయటపడనీయకుండా ఉండేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ వెంటనే అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని, అందుకే పార్టీలో ఒడిదుడుకుల కారణంగా సోనియా అలా చెప్పవలసి వచ్చిందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగినప్పటికీ రాహుల్,ప్రియాంక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం జీ–23 నేతలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలిస్తే పార్టీపై గాంధీ కుటుంబం పట్టు మరింత బలపడుతుంది. లఖీమ్‌పూర్ హింస కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనస్తత్వాన్ని బహిర్గతం చేసిందని సోనియా గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు రోడ్లౖపైకెక్కినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ జరుగుతున్న ఉగ్ర దాడులకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని సోనియా అన్నారు. దేశ ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక సంస్కరణల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలనుకుంటోందని, ప్రతిదీ విక్రయించాలన్న ఒకే ఒక ఎజెండా ప్రస్తుతం కేంద్రానికి ఉందని సోనియా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దేశంలోని రాజకీయ పరిస్థితులను సమీక్షించి ఒక రాజకీయ తీర్మానాన్ని చేసింది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని సీడబ్ల్యూసీ ఆ తీర్మానంలో ప్రస్తావించింది. లద్దాఖ్ ఘటన జరిగి 18 నెలలు అయినప్పటికీ చైనా సైనికులు ఇప్పటికీ భారత భూభాగంలో ఆక్రమణలు కొనసాగిస్తున్నారని సీడబ్ల్యూసీ విమర్శించింది. పాకిస్తాన్ చొరబాట్లు జమ్మూకశ్మీర్ భద్రతను గణనీయంగా దిగజార్చాయని ఆరోపించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్, మిజోరంలలో భద్రతకు ముప్పు పెరుగుతోందని, సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య అకస్మాత్తుగా అంతర్ రాష్ట్ర వివాదాలు చెలరేగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడ్డ పతనం చాలా ఆందోళన కలిగిస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మహమ్మారి కారణంగా కోల్పోయిన ఉద్యోగాల కల్పనపై కేంద్రం దృష్టి సారించలేదని, ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు ఇతర అధిక ధరలతో కష్టాలను ఎదుర్కొంటున్నారని సీడబ్ల్యూసీ తీర్మానం పేర్కొంది. సంస్థాగత షెడ్యూల్ ఇదీ.. సీడబ్ల్యూసీ నిర్ణయాలను సమావేశం అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా మీడియాకు వివరించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయి కార్యకర్తల వరకు పెద్దఎత్తున శిక్షణ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు చేస్తారు. ప్రాథమిక కమిటీలు, బూత్ కమిటీలు, బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపికకు ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ఎన్నిక జరుగనుంది. వచ్చే ఏడాది జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు పీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి,íపీసీసీ కార్యవర్గం, ఏఐసీసీ సభ్యులకు ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీ్నరీ సందర్భంగా సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ కమిటీల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ధరల పెరుగుదలపై నవంబర్ 14 నుంచి 29 వరకు పార్టీ దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనుందని పేర్కొన్నారు. పరివార్ బచావో వర్కింగ్ కమిటీ: బీజేపీ ఎద్దేవా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ‘పరివార్ బచావో(కుటుంబాన్ని కాపాడే) వర్కింగ్ కమిటీ’ అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీ అంతర్గత వైషమ్యాలకు ఈ సమావేశం ఎలాంటి పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది. పార్టీ నాయకత్వ వైఫల్యంపై చర్చించడానికి బదులు అబద్ధాలను ప్రచారం చేసుకోవడానికే సీడబ్ల్యూసీ భేటీ జరిగినట్లు బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. -
కాంగ్రెస్ జోరు పెంచనుందా..? సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మళ్లీ పాత వైభవం కోసం ప్రణాళికలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సీరియస్ అయ్యారు. సమావేశంలో సోనియా గాంధీ.. 'కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది. అనంతరం సమావేశంలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేయగా, అందుకు రాహుల్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతులపై జరుగుతున్న దాడులపై ఆమోదం తెలిపింది. త్వరలో కాంగ్రెస్ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు భారీగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన విధానం పై ఈ శిక్షణ ఉండనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ పై వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల పై నవంబర్ 14 నుంచి 29 వరకు దేశవ్యాప్త ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీలో సమావేశంలోని ముఖ్యాంశాలు: ►2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ► 2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు కానున్న డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా ► ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ప్రాధమిక కమిటీలు, బూత్ కమిటీలు ,బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక ►జులై 21 నుంచి 20 ఆగస్ట్ వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పిసిసి కార్యదర్శి వర్గం, ఏఐసిసి సభ్యులు ఎన్నిక ►2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు సాగనున్న ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక ►సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీనరీ సమావేశం సందర్భంగా సిడబ్ల్యుసి సభ్యులు, ఏఐసిసి కమిటీల అధ్యక్షుల ఎంపిక చదవండి: కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని: సోనియా గాంధీ -
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై రచ్చ
-
గాంధీలదే కాంగ్రెస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్‌గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్ సిబల్ కూడా బహిరంగంగా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు. ఉదయం నుంచి హైడ్రామా.. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు. ఒక్క తరుణ్ గొగోయ్ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది. దీనికి గులాం నబీ ఆజాద్ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్ నేతలు మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్సింగ్ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్‌ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్ ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు. సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్‌లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్ దుమారం రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్‌కు కపిల్ సిబల్ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలికంగా సద్దుమణిగాయా? పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్‌ని అనలేదని, ఇతర కాంగ్రెస్ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్ చేసిన ట్వీట్ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్ వెంటనే స్పందించి ట్వీట్ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ స్వయంగా సిబల్‌తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్ వెంటనే ట్వీట్ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్ పటేల్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది. నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే చీఫ్‌గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా ‘మనది పెద్ద కుటుంబం. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్ సిబల్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు. బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది. సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ స్వరం వినిపించారు. ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ట్వీట్ మీటింగ్ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్ ఒక ట్వీట్ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్‌ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్ చేశారు. సోనియానే కొనసాగాలి పార్టీ ప్రెసిడెంట్‌గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్ బలహీనమయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు. అందుకే ఆ ట్వీట్‌ను తొలగించా!: సిబల్ రాహుల్ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ఆ తరువాత సీనియర్ నేత కపిల్ సిబల్ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్‌ను తొలగిస్తున్నానని సిబల్ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారు. రాజస్తాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్లో సిబల్ పేర్కొన్నారు. పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు ► ఇతరులు 13 మంది ► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్‌కు 18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్‌లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యు.ఎన్.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్‌దయాళ్ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. -
అంచనా వేయండి.. అందరూ పంచుకోండి..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో గత ఏడాది కురిసిన భారీ వర్షాలతో చాలా రాష్ట్రాలు అతలాకుతలం అయిన నేపథ్యంలో..ఈ ఏడాది అలాంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నదీ బేసిన్ల పరిధిలో గుర్తించిన వరద ప్రభావిత ప్రాంతాల పరీవాహక రాష్ట్రాలను ముందుగానే మేల్కొలిపే చర్యలకు దిగింది. గతేడాది మాదిరే ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అందుకు తగ్గట్టే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంది. వాతావరణ పరిస్థితి, వర్షపాతం, ప్రాజెక్టుల్లో చేరుతున్న ప్రవాహాలు, నదుల్లో నమోదవుతున్న వరద, రిజర్వాయర్లలో నిల్వల సమాచారాన్ని పరీవాహక రాష్ట్రాలతో పంచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిద్వారానే విపత్తు నిర్వహణ సాధ్యమవుతుందని వెల్లడించింది. గత భయానక అనుభవాల దృష్ట్యానే.. దేశ వ్యాప్తంగా గతేడాది భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, అస్సోం, కేరళ, ఉత్తరాఖండ్, పంజాబ్, బిహార్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నదులు, రిజర్వాయర్లు అధిక వర్షాలతో ఉప్పొంగాయి. అధికంగా నమోదైన ఈ వర్షపాతాన్ని అంచనా వేయడంలో విఫలం కావడంతో చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల కింద తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సం భవించింది. దీంతోపాటే ఎగువ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని దిగువ రాష్ట్రాలకు ఇవ్వడంలో చూపిన నిర్లక్ష్యం, పూర్తిగా ప్రాజెక్టుల గేట్లు ఎత్తేవరకు దిగువ ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేయకపోవడం, ప్రధాన నదుల్లో కలిసే ఉపనదుల ప్రవాహా సామర్థ్య లెక్కలు గణించే యంత్రాంగం లేకపోవడంతో ముంపు ప్రభావం దిగువ రాష్ట్రాలపై అధికంగా పడింది. దక్షిణాదిలో కృష్ణా బేసిన్లోనే ఆల్మట్టి రిజర్వాయర్‌కు ఒకే రోజులో 10 లక్షలకు మించి వరద రావడం, ఎగువ మహారాష్ట్ర నుంచి వచ్చే వరదలపై సరైన అంచనా లేకపోవడంతో దిగువ ప్రాం తాలు ముంపునకు గురయ్యాయి. తుంగభద్ర నదిలోనే అకస్మాత్తుగా వచ్చిన వరదతో మహ బూబ్‌నగర్ జిల్లాలో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. కృష్ణాబేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు గతం కంటే భిన్నంగా ఆగస్టు నెలలో కేవలం 25 రోజుల్లో ఏకంగా 865 టీఎంసీల మేర వరద వచ్చింది. దీన్ని నియంత్రించేందుకు ఎగువ రాష్ట్రాలతో సమన్వయం అత్యంత కీలకమైంది. సమాచారం ఇచ్చిపుచ్చుకునేలా... ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ గుర్తించిన నదీ బేసిన్లు, ప్రాజెక్టులతోపాటు ఏవైనా ముప్పు ప్రాంతాలు ఉన్నట్లయితే వాటి వివరాలను తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా వారం కిందట కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో ఇక్కడి హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ అధికారులు సమీక్షించారు. వరదలపై పొరుగున ఉన్న, లేక ఆ బేసిన్ పరీవాహకం ఉన్న రాష్ట్రాలతో మిగతా రాష్ట్రాలు సమాచార మార్పిడి చేసుకోవాలని, ప్రాజెక్టుల నీటి నిల్వ, ప్రవాహాల పరిస్థితులను ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకు తెలియజేయాలని ఆదేశించారు. వాతావరణ, విపత్తు నిర్వహణ, నీటి పారుదల శాఖల మధ్య సమన్వయం ఉండేలా లైసెన్సింగ్ అధికారులను నియమించాలని, వారి ఫోన్ నంబర్లను అన్ని రాష్ట్రాల అధికారులకు అందు బాటులో ఉంచాలని సూచించారు. ఇక రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి, కడెం, మూసీ, మున్నేరు, ప్రాణహిత, ఇంద్రావతి తదితర బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టుల వరదపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, నిజాంసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, తుపాకులగూడెం, మూసీ ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఆటోమేటిక్ రెయిన్ గేజ్ స్టేషన్లు, ఆటోమేటిక్ వాటర్ లెవల్ రికార్డులు, డిజిటల్ వాటర్ లెవల్ రికార్డుల ఏర్పాటు పక్కాగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం పరిధిలో 15 గేజ్ మీటర్లు.. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఏడాదికి కనీసం 530 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఇందులో ప్రధానంగా వరద అంచనా, మోటార్ల ఆపరేషన్‌కు వీలుగా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సెన్సార్ల ద్వారానే గోదావరి ప్రవాహ సామర్థ్యాన్ని అంచనావేసేలా 15 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. సీడబ్ల్యూసీ వద్ద జరిగిన సమీక్షలో మేడిగడ్డ బ్యారేజీతో పాటు కంతనపల్లి వద్ద నమోదయ్యే ప్రవాహ లెక్కలను ఎప్పటికప్పుడు తెలిపేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారు. -
సవాళ్లను అధిగమిస్తారా?
న్యూఢిల్లీ: 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ(72) తాజాగా ఎన్నికయ్యారు. ఈ ఏడాదిలో హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్లూసీ) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాజకీయ సవాళ్లను సోనియానే సమర్థవంతంగా ఎదుర్కోగలరనీ, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ అగ్రనేత అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతిలో వరుస ఓటములు ఎదురైనా కుంగిపోకుండా కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు సోనియా విజయతీరాలకు చేర్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో సోనియా నాయకత్వం కాంగ్రెస్‌కు అత్యంత ఆవశ్యకమనీ, పలువురు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతికస్థైర్యం నింపాలంటే సోనియాగాంధీయే సరైన వ్యక్తని చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలు త్వరగా జరపాలి అయితే సోనియా మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై మరికొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. ‘గాంధీ కుటుంబం చేతిలో అధికారం ఉన్నంతకాలం పార్టీలో నాయకత్వ మార్పు సాధ్యం కాదు. తాజా నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని నడపాలంటే గాంధీ కుటుంబమే దిక్కన్న వాదనలకు బలం చేకూరింది. ఇందులోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకెళ్లాల్సిన అవసరముంది’ అని వారంతా చెబుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలను త్వరగా చేపట్టడంతో పాటు పార్టీ కార్యకలాపాలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్ల టైమ్ వచ్చింది.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగిన 20 నెలల్లో రాహుల్ పార్టీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేశారు. సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ నేతలను ప్రోత్సహించారు. మూసవిధానాలను మార్చుకుని పార్టీ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన రాహుల్, గుజరాత్లో చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లకు పరిమితం కావడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ ఏడాది మే 25వ తేదీన రాజీనామా చేశారు. తాజాగా సోనియాగాంధీ రంగప్రవేశం నేపథ్యంలో మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, కమల్‌నాథ్, మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్, మురళీ దేవరా, అంబికా సోనీ, కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్షీద్, పి.చిదంబరం, ఖర్గే వంటి సీనియర్లు పార్టీలో కీలకపాత్ర పోషించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సింధియా, పైలట్ వంటి యువనేతలు పక్కకు తప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు. సీనియర్, యువ నాయకత్వం మధ్య సమన్వయం పాటిస్తూ సోనియా గాంధీ కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లే అవకాశముందని ఆ పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. అలాగే యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న పాత మిత్రుల(రాజకీయ పార్టీల)ను కలుపుకుని వెళ్లడం, కొత్తవారిని ఆహ్వానించడం సోనియాగాంధీ వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్ర ఈఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని పుంజుకునేలా చేయడం సోనియా ముందున్న ప్రధాన సవాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించడంతో పాటు గెలుపుగుర్రాలకు టికెట్ ఇవ్వడం సోనియా ముందున్న మరో సవాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సోనియా ఇటలీ మూలాలను బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకుని విమర్శలదాడికి దిగే అవకాశముందని కూడా ఆయన పేర్కొన్నారు. -
నేడే సీడబ్ల్యూసీ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడు ఎవరో మరికొన్ని గంటల్లో తెలియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయడం, ఆ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉండటం తెలిసిందే. కొత్త సారథిని ఎన్నుకునేందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంపై ఓ ఉన్నతస్థాయి సన్నాహక సమావేశాన్ని శుక్రవారమే కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ఇంట్లో నిర్వహించారు. ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ ప్రధాన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నూతన సారథి రేసులో ఇద్దరి పేర్లే వినబడుతున్నాయి. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పనిచేసిన ఖర్గే కాగా, మరొకరు ముకుల్ వాస్నిక్. ఖర్గేకే ఎక్కువ అవకాశం.. మల్లికార్జున ఖర్గే తదుపరి అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఆయనకు వయస్సు ఎక్కువగా ఉండటం తప్ప మరో ప్రతికూలత ఏదీ లేదు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న ఖర్గే.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్నప్పుడు బీజేపీని చేతనైన మేరకు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక ముకుల్ వాస్నిక్ కూడా కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నప్పటికీ, ఆయనకు ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ముకుల్ వాస్నిక్ సమర్థుడు కాడనీ, వివాదాలకు కేంద్ర బిందువని పార్టీ నాయకులే చాలా మంది ఫిర్యాదు చేశారు. మళ్లీ రాజ్యసభకు మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని మన్మోహన్‌ను మరోసారి రాజ్యసభకు పంపేందుకు కాగ్రెస్ సిద్ధమైంది. బీజేపీ రాజస్తాన్ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభ ఎంపీ అయిన మదన్ లాల్ సైనీ ఇటీవలే కన్నుమూయడంతో ఆయన స్థానం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ఇప్పుడు రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ సీటు కాంగ్రెస్‌కు దక్కనుంది. మన్మోహన్ 1991 నుంచి ఈ ఏడాది జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. -
రాహుల్ రాజీనామాకు సోనియా అంగీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్లను రాహుల్ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్ చెప్పారు. తొలుత రాహుల్ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తా.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్ దూతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, ప్రియాంకలు సీనియర్ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. నెహ్రూకు నివాళులు.. భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు రమేశ్ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ చీఫ్ అజయ్ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు. -
మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీలోని అగ్రనాయకులందరూ తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒంటరివాడిని చేశారనీ, ఎవ్వరూ ఆయనకు తోడుగా నిలవలేదని రాహుల్ చెల్లెలు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించినట్లు సమాచారం. అలాగే రాహుల్ కూడా ముగ్గురు సీనియర్ నేతలు పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి, తాను వద్దని చెబుతున్న తమ కొడుకులను పోటీలోకి దింపారని ఆరోపించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తన కొడుక్కి టికెట్ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని పి.చిదంబరం బెదిరించారనీ, ముఖ్యమంత్రి కొడుక్కే టికెట్ ఇవ్వకపోతే ఎలా అని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మాట్లాడారనీ, ఇక రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా తన కొడుక్కి టికెట్ తెప్పించుకుని, ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేసి మిగతా ప్రాంతాలను ఆయన విస్మరించా రని రాహుల్ ఆరోపించినట్లు సమాచారం. చిదంబరం, కమల్‌నాథ్ కుమారులు ఎన్నికల్లో గెలవగా, గెహ్లాట్ కొడుకు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీ అపజయాన్ని మూటగట్టుకోవడం తెలిసిందే. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను విశ్లేషించేందుకు అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం జరిగింది. ఎన్నికల్లో తీవ్ర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేస్తాననీ, తమ కుటుంబ సభ్యులకు కాకుండా వేరే వాళ్లకు ఈ పదవి ఇవ్వాలని రాహుల్ ప్రతిపాదించగా, పలువురు నేతలు వ్యతిరేకించడం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ప్రియాంకలు నిర్మొహమాటంగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటమికి కారకులంతా ఇక్కడే ఉన్నారు.. సీడబ్ల్యూసీ భేటీలో ప్రియాంక మాట్లాడుతూ పార్టీ అగ్రనేతలెవరూ తన అన్నకి మద్దతుగా నిలవలేదనీ, మోదీపై ఆయన ఒంటరిగా పోరాడారని అన్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆమె మాట్లాడుతూ ‘పార్టీ ఓటమికి కారణమైన వాళ్లంతా ఈ గదిలో కూర్చున్నారు’ అని అన్నట్లు సమాచారం. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా రాహుల్‌ను కొందరు నేతలు ఒప్పిస్తుండగా ప్రియాంక కలగజేసుకుని, ‘మా అన్న ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు. రఫేల్ కుంభకోణం, కాపలాదారుడే దొంగ అన్న నినాదాన్ని రాహుల్ మినహా కాంగ్రెస్ నేతలెవరూ ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరెవరూ మద్దతు తెలుపలేదు’ అని ప్రియాంక అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ చీఫ్‌గా ఉండలేను
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమావేశం తిరస్కరించింది. అయితే, రాహుల్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు గంటలపాటు భేటీ దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్, ఆజాద్, షీలా దీక్షిత్, ఖర్గే తదితర 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యానికి కారణాలు, ప్రజలను మెప్పించడంలో వైఫల్యానికి దారి తీసిన పరిస్థితులను చర్చించారు. ఆయనే కొనసాగాలన్న సీడబ్ల్యూసీ ‘రాహుల్ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి నాయకత్వం, మార్గదర్శకత్వం వహించాలని ఆయన్ను కోరింది’అని సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు. ‘పార్టీని అన్ని స్థాయిల్లోనూ పార్టీ బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టాలని, దేశంలోని యువత, రైతులు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన పనిచేసేందుకు పార్టీకి నేతృత్వం వహించాలని సీడబ్ల్యూసీ కోరింది. పార్టీకి ఓట్లేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది’అని ఆయన తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా కొనసాగాలన్న సీనియర్ నేత చిదంబరం సమావేశంలో కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు. బాధ్యతల నుంచి వైదొలగాలన్న రాహుల్ నిర్ణయం నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను వివరిస్తూ సమావేశంలో ప్రియాంక, మన్మోహన్ మాట్లాడారు. తన ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్య 44 నుంచి 52కు పెరిగినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ పరాజయానికి తమదే బాధ్యతంటూ యూపీ, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ బబ్బర్, నిరంజన్ పట్నాయక్ ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా మరికొందరూ అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా ‘నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి’ అంటూ రాహుల్ వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కంచుకోట వంటి అమేథీ నుంచి ఓటమి చవిచూడటంతో రాహుల్ రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో తల్లి సోనియా, చెల్లి ప్రియాంక ఎంతగా నచ్చజెప్పినా వెనక్కి తగ్గేందుకు ఆయన అంగీకరించలేదు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియా భేటీలో పాల్గొనకుండానే రాహుల్ వెళ్లిపోయారు. దీంతో వైదొలిగే యోచనలోనే రాహుల్ ఉన్నట్లు భావిస్తున్నామని నేతలు అంటున్నారు. -
రాహుల్ రాజీనామా.. తిరస్కరించిన సీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, షీలా దీక్షిత్ తదితరులు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల్లో ఓటమికి, మరీ ముఖ్యంగా అమేథీలో ఓటమికి పూర్తి బాధ్యత తనదే అని రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రకటించారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దాంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవికి రాజీనామా చేశారు. -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ ధాటికి హస్తం అభ్యర్థులు కొట్టుకుపోయారు. రాహుల్ నాయకత్వ పటిమకు పరీక్షగా నిలిచిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన పూర్తిగా తేలిపోయారు. కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వకుండా బీజేపీ చరిత్రలోనే అత్యధిక స్థానాలకు ఆ పార్టీకి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ దారుణమైన ఓటమి చవిచూడడం మరోవైపు ఆ పార్టీకి కంచుకోట వంటి అమేథిలో రాహుల్ ఓడిపోవడం అధిష్టానం జీర్ణించుకోలేని అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు ఢిల్లీలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా రాహుల్ నాయకత్వంపై విమర్శలు రాకముందే.. పార్టీ పదవి నుంచి వైదొలగాలని రాహుల్, సోనియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సోనియా గాంధీ విముకత వ్యక్తం చేశారని, పదవికి రాజీనామా చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా రాహుల్ రాజీనామా వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు. కాగా యూపీలో ఆపార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
12న సీడబ్ల్యూసీ భేటీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారం, వ్యూహాలను చర్చించనున్నారు. భేటీ అనంతరం గాంధీనగర్‌లోని అదాలజ్‌లో బహిరంగ సభ ఉంటుంది. 1961లో తొలిసారిగా గుజరాత్లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తిరిగి 58 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి అహ్మదాబాద్ వేదిక కాబోతోంది. ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్‌లతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. -
మోదీ అవినీతిని బయటపెడదాం
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అనధికారికంగా ప్రారంభించింది. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రజాఉద్యమాలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనమైన దేశ ఆర్థిక స్థితి, బ్యాంకు కుంభకోణాలు, రాఫెల్ ఒప్పందం తదితర అంశాలపై దూకుడుగా బీజేపీని ఎదుర్కొనాలని శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్ణయించింది. పార్టీ చీఫ్ రాహుల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలకమైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) అంశంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారు. రాహుల్‌తోపాటుగా మాజీ ప్రధాని మన్మోహన్, ఏకే ఆంటోనీ, ఆజాద్, ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. యూపీఏ చైర్పర్సన్, మాజీ అధ్యక్షురాలు సోనియా వ్యక్తిగత కారణాలతో సీడబ్ల్యూసీ భేటీకి గైర్హాజరయ్యారు. పార్లమెంటు లోపలా, బయటా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలో విపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయించారు. ‘నేటి సీడబ్ల్యూసీ సమావేశంలో దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించాం. అవినీతి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇదే మంచి తరుణం’ అనంతరం రాహుల్ ట్వీట్ చేశారు. చోక్సీ, రాఫెల్‌లపై దూకుడుగా.. సమావేశ వివరాలను పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ప్రజాందోళనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పీసీసీల సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 2017లో మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చినపుడు భారత విచారణ సంస్థలు క్లీన్చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకునే దేశం నుంచి చోక్సీని బయటకు పంపించిందని సుర్జేవాలా విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై ప్రధాని గానీ, రక్షణ మంత్రి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదని సుర్జేవాలా అన్నారు. ఎన్నార్సీపై జాగ్రత్తగా.. అస్సాం ఎన్నార్సీ వివాదంపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నార్సీ కాంగ్రెస్ పార్టీ మదిలో పుట్టిన గొప్ప ఆలోచన అని.. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ చేసుకున్న అస్సాం ఒప్పందంలో భాగంగా ఎన్నార్సీ రూపకల్పన జరిగిందని సుర్జేవాలా తెలిపారు. భారతీయ పౌరుల్లో ఒక్కరు కూడా ఈ జాబితానుంచి తప్పిపోకుండా పార్టీ తరపున భరోసా ఇస్తున్నామన్నారు. 2005 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ 82,728 మంది బంగ్లాదేశీయులను బహిష్కరిస్తే.. ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్లలో 1,822 మంది బంగ్లాదేశీయులను మాత్రమే బయటకు పంపిందన్నారు. -
పొత్తులకు సై..!
-
2019 ప్రధాని అభ్యర్థి రాహుల్
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకుంది. విపక్షపార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ తమ పార్టీ తరపున రాహులే ప్రధాని అభ్యర్థని స్పష్టం చేసింది. దీంతోపాటుగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు నిర్ణయించే విషయంలో సంపూర్ణ అధికారాన్ని రాహుల్‌కే కట్టబెడుతూ ఆదివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా సీడబ్ల్యూసీనుద్దేశించి రాహుల్ ఆదివారం ప్రసంగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశంలోని పీడిత, బాధిత జనాలకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తిగా నవీకరించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పార్టీలోని గత, ప్రస్తుత, భవిష్యత్ తరాలకు వారధిగా నిలవాలన్నారు. అనుభవంతోపాటు పరిగెత్తే శక్తి ఉన్న గొప్ప నాయకుల పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కొత్త సీడబ్ల్యూసీ కూడా ఇలాంటి స్ఫూర్తితోనే దూసుకెళ్లాలన్నా రు. బీజేపీ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, పేదలపై దాడులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాఫెల్ రహస్య నిబంధనపై.. ఫ్రాన్స్‌తో కుదిరిన వివాదాస్పద రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో కుంభకోణం జరిగిందని రాహుల్ ఆరోపించారు. ‘రాఫెల్ ఒప్పందంలోని రహస్య నిబంధన విషయంలో రక్షణమంత్రి తీరు అనుమానాస్పదంగా ఉంది. ఒకసారి అది రహస్యమని మరోసారి ఇందులో రహస్యమేదీ లేదని ఆమె చెబుతున్నారు. రాఫెల్ ధర ఎంతని అడిగితే.. ప్రధాని తటపటాయిస్తున్నారు. నా కళ్లలోకి కళ్లుపెట్టి చూడలేకున్నారు. ఇదంతా చూస్తుంటే భారీ కుంభకోణమే జరిగినట్లనిపిస్తోంది’ అని రాహుల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు, దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా దేశంలో పాలన సాగుతోందని సోనియా ఘాటైన విమర్శలు చేశారు. సమాజంలో విభేదాలు, భయాందోళనలు సృష్టించేలా మోదీ పాలన సాగుతోందన్నారు. ఈ పోరాటంలో రాహుల్‌కు మద్దతుగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాహుల్ నాయకత్వం వహించాలి ఆదివారం నాటి సమావేశంలో మాట్లాడిన 40–50 మంది నేతలంతా.. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అవసరమని నొక్కిచెప్పారు. మరికొందరైతే.. ఈ కూటమికి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో విద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్ పిలుపునిచ్చారని సమావేశ వివరాలను పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో 42 సీట్లు గెలుస్తామన్న మమతా బెనర్జీ వ్యాఖ్యలను తుది నిర్ణయంగా భావించనక్కర్లేదన్నారు. రాహుల్ నేతృత్వంలోనే కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని సుర్జేవాలా స్పష్టం చేశారు. దేశంలో సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధి పునరుద్ధరణకు దుర్భర ప్రయత్నం చేస్తున్న రాహుల్‌కు కాంగ్రెస్ సీనియర్లంతా అండగా నిలుస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. గొప్పలు చెప్పుకోవడం, గిమ్మిక్కులు చేసే సంస్కృతికి వ్యతిరేకంగా ఓ బలమైన విధివిధానంతో దేశాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు రాహుల్‌ను ఆదరించరు: బీజేపీ పార్లమెంటులో ప్రధానిని హత్తుకున్న రాహుల్‌పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. రాహుల్ మోదీని ఆలింగనం చేసుకున్నా ప్రజలు మాత్రం రాహుల్‌ను ఆదరించబోరని విమర్శించింది. సీడబ్ల్యూసీ భేటీని, రాహుల్‌ను ‘కాంగ్రెస్ పనిచేయని కమిటీకి.. పనిచేయని చీఫ్’గా, ఒక కుటుంబాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ దర్బార్‌గా బీజేపీ నేత సంబిత్ పాత్రా అభివర్ణించారు. దేశం వెనుకబడుతోందన్న సోనియా వ్యాఖ్యలపై తిప్పికొడుతూ.. ‘మీ పాలనలో 10ఏళ్ల పాటు దేశం రివర్స్ గేర్‌లోనే ఉంది. ఇప్పుడు మేం రివర్స్ గేర్ వేశాం’ అని పేర్కొన్నారు. ‘నిరాశలో ఉన్న కాంగ్రెస్ నేతలు కనీసం 150 స్థానాల్లో పోటీ చేయాలని అడిగినట్లు తెలిసింది. వీటితోనే ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన మంత్రి కావాలని వాళ్ల కోరిక’ అని అన్నారు. -
అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం వద్దు
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆలస్యం చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ నేతలు సూచించారు. నామినేషన్ గడువు ముగిసే రెండు, మూడు రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంటుందని వివరించారు. ఇబ్బందులు లేని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను వీలైనంత ముందే ఖరారు చేయాలని కోరారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, సీనియర్ నేతలు చిన్నారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, సంపత్‌కుమార్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరువాత మేనిఫె స్టోను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామనే విషయాన్ని వివరించామన్నారు. అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల ఆలస్యం వల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే ప్రమాదముందని చెప్పామన్నారు. ఎన్నికలకు ముందే ఐదు ప్రధాన హామీలను నిర్దేశించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీతోపాటు పంట బీమా కూడా ప్రకటించాలని కోరామన్నారు. పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేలా నిబంధనలను రూపొందించి మేనిఫెస్టో విడుదల చేయాలని చెప్పామన్నారు. మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా సంఘాలకు ఆకర్షణీయ పథకాలను పొందుపరచాలని సూచించినట్లు పేర్కొ న్నారు. ఆర్మీలో పనిచేసిన వ్యక్తిగా తనకున్న అనుభవం మేరకు యుద్ధవిమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా ఆ ఒప్పందాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన ఉండదని చెప్పారు. దీనిపై రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రస్తావించిన విషయం సరైందేనన్నారు. జన్మ ధన్యమైంది: సంపత్ సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలోకి ప్రవేశించిన రాహుల్‌కు సంపత్‌కుమార్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాసనసభ సభ్యత్వ అనర్హత కేసు ఏమైందని అడిగారని సంపత్ చెప్పారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను సీడబ్ల్యూసీ సమావేశానికి ఆహ్వానించడం, ఆ సమావేశంలో తాను పాల్గొనడం ఊహించలేదని, తన జన్మ ధన్యమైందని సంపత్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని రాహుల్‌కు చెప్పానన్నారు. -
నేడు కొత్త సీడబ్ల్యూసీ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో నేడు జరగనుంది. వారం క్రితం కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 23 మంది సభ్యులతో ఏర్పాటైన సీడబ్ల్యూసీ దృష్టంతా ఎన్నికల సన్నద్ధతపైనే ఉంది. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఎజెండాను, వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనేందుకు సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలతో అవగాహన వంటి కీలక బాధ్యతలు రాహుల్ భుజాన వేసుకున్నారు. ప్రస్తుత సీడబ్ల్యూసీలో సోనియా , మన్మోహన్, ఆజాద్, మోతీలాల్ వోరా, ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ తదితరులున్నారు. -
అబద్ధాలే బీజేపీ పునాదులు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అధికార బీజేపీకి అబద్ధాలే పునాదులని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ విరుచుకుపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్ తొలిసారిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో..లక్షలాది కోట్ల రూపాయల 2జీ స్కాం అంటూ మోదీ,æజైట్లీ తప్పుడు సమాచారంతో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని కల్పించటం, దానిని ప్రచారం చేయటం, ప్రజలు నమ్మేదాకా పదేపదే అదే అబద్ధాన్ని చెప్పటం..ఇదే బీజేపీ కుట్ర అని చెప్పారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశాజనకమైన ఫలితాలను సాధించటం, యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన భారీ కుంభకోణం 2జీ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన మర్నాడే ఈ సమావేశం జరగటం గమనార్హం. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధతపైనా చర్చించారు. పార్టీలో క్రమశిక్షణ అంశం, నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిన పార్టీ నేతల వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా పార్టీకి మార్గదర్శకత్వం వహించి, ఎనలేని సేవలు అందించిన మాజీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ ఒక తీర్మానంచేసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై రాహుల్ సీడబ్ల్యూసీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, తదితరులతోపాటు రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. -
6న రాహుల్ పదోన్నతిపై చర్చ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) జూన్ 6న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పదోన్నతి కల్పించడంతో పాటు ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు ఏడు నెలల అనంతరం జరుగనున్న ఈ భేటీలో సంస్థాగత ఎన్నికల తేదీలపై కూడా స్పష్టత రావచ్చని వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికపై కూడా చర్చించనున్నారు. విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే!
-
రాహుల్ కొంతకాలం ఆగాల్సిందే!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఆమె పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ మంగళవారం సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలను ఏడాది పాటు వాయిదా వేయాలని, అన్ని విభాగాలకు ఓకే సభ్యత్వం ఉండాలని తీర్మానించారు. పార్టీలో 50 శాతం పదవులను ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మహిళలకు కేటాయించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. సోనియా పదవీకాలం పొడిగించడంతో అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ గాంధీ మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది. రాహుల్ నాయకత్వాన్ని సీనియర్లు గట్టిగా వ్యతిరేకించడంతో సోనియా కొనసాగాల్సి వచ్చింది. -
'ఆర్ ఎస్ ఎస్ డైరెక్షన్ లో మోదీ సర్కార్'
న్యూఢిల్లీ: మంగళవారం ఢిల్లీలో ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీలో సోనియా మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుందనడానికి భూసేకరణ బిల్లు ఉపసంహరించుకోవడమే నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం పుంజుకోలేదని, ఉపాధి కల్పన పెరగలేదని తెలిపారు. ధరలు పెరిగాయని, స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని ధ్వజమెత్తారు. పాకిస్థాన్ తో సంబంధాలపై కేంద్రానికి స్పష్టమైన విధానం లేదని దుయ్యబట్టారు. కాగా పార్టీ సంస్థాగత మార్పులపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. -
సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి విడత జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ...రెండో విడత జాబితపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించటంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రాల్లో వరుస పరాజయాలపైనా నేతలు దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం, అహ్మద్ పటేల్ సహా ఇతర నేతలు హాజరు అయ్యారు. -
రాజీనామాకు సిద్దపడ్డ సోనియా, రాహుల్
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశం దానిని తిరస్కరించింది. అంతేకాకుండా వారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాదాపు మూడు గంటలసేపు సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికలలలో ఓటమిపై సమావేశంలో సమీక్షించారు. కారణాలను విశ్లేషించారు. ఓటమికి గలకారణాల అన్వేషణకు ఓ కమిటీ ఏర్పాటు చేసే విషయమై చర్చించారు. ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి సోనియా, రాహుల్ సిద్దపడ్డారు. అయితే సమావేశం అందుకు అంగీకరించలేదు. వారే కొనసాగాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఫలితాలు నిరాశకలిగించినట్లు సోనియా చెప్పారు. -
సీడబ్ల్యూసీ విస్తృతస్థాయి సమావేశం పై చర్చ
-
ఇట్లు.. మీ విధేయులు
=సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవించాలంటున్న బాలరాజు =సీమాంధ్ర అభివృద్ధికి పోరాడాలంటున్న చిన్నమ్మ =తాజాగా ఇద్దరి నోటా విభజన ఆలాపన విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : ‘కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి బాల రాజుకు ప్రజాభీష్టం కంటే పార్టీ నిర్ణయమే శిరోధార్యమైంది. తాజాగా వీరిద్దరూ కొత్త పల్లవి అందుకున్నారు. విభజన జరిగిపోయిందంటూ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు. కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు బాలరాజు సమైక్య రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమని ప్రకటించారు. తీరా ప్రజలు పట్టుబట్టితే రాజీనామా చేసేదే లేదని మాట మార్చారు. గిట్టని వారు తనను విభజన వాదిగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ తెగ బాధపడ్డారు. తన రాజీనామాతో విభజన ఆగదని, తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడించడానికి పదవిలో వుండక తప్పదని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. బుధవారం ఆయన తన వాణి మరోసారి మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వున్న వారు సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని గౌరవించాలనీ, రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన అంశాలపై పోరాడాలని సెలవిచ్చారు. ఏజెన్సీలో ఇప్పటికీ గిరిజనులు సమైక్యాంధ్ర కోసం గట్టిగా పోరాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రి విభజన అనుకూల ప్రకటన చేయడం ద్వారా తనకు ప్రజల కంటే పార్టీయే ముఖ్యమనే విధంగా వ్యవహరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు సమైక్య వాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు శాసనసభ్యులు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు పార్టీ ఫిరాయిస్తారనే సంకేతాలు వున్నాయి. భవిష్యత్తులో పార్టీని చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహంతోనే బాలరాజు అధిష్టాన విధేయుడిగా ముద్ర వేసుకునే పనిలో పడ్డారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చిన్నమ్మదీ అదే దారి విభజన జరక్కూడదని కోరుకుంటున్నానని ప్రకటించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం బుధవారం విజయవాడలో విభజన అనంతర అంశాల గురించి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశానని ఇటీవల ఆమె ప్రకటించారు. అయితే ఈ రాజీనామాలన్నీ డ్రామాలే అనే విషయం తేలిపోయిన పరంపరలో ‘‘ సీమాంధ్ర ప్రయోజనాల కోసం పోరాడాలి’’ అని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆమె మనసులోని మాటను చెప్పకనే చెప్పాయి. 2014లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచే పోటీకి దిగుతానని మూడు రోజుల కిందట ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పురందేశ్వరి ప్రకటించారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి పోటీ పడుతున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండేట్లుగానే ఆమె వ్యవహరించారు. రాజకీయ ప్రయోజనం ఆశించే ఆమె పార్టీ పట్ల విధేయత చాటుకుంటున్నారనే అభిప్రాయాలు జనంలో వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పార్లమెంటు స్థానం పరిధిలోనూ సమైక్య ఉద్యమం రగులుతూనే వున్న సమయంలో ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ వర్గాల్లోనే కలవరం పుట్టించింది. చిన్నమ్మ కూడా విభజనకు జనాన్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
బహుళ ప్రయోజనాల పోలవరం
న్యూఢిల్లీ, సాక్షి: రబీతో పాటు సాధారణ పంటల నీటి అవసరాలను తీర్చడం, సాగు, తాగునీటి వంటి ఇతర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్టుగా సీడబ్ల్యూసీ పేర్కొందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యామ్నాయ డిజైన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా పరిశీలించినట్లు తెలి పారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ఈ ప్రతిపాదన రూపొందించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇటు సాంకేతికంగా అటు ఆర్థికంగానూ అది సాధ్యం కాదనే నిర్ణయానికొచ్చింది. గోదావరి నదిపై వరుసగా బ్యారేజీలు నిర్మిం చాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనే, ఎంపీ పాల్వా యి గోవర్ధన్‌రెడ్డి ద్వారా జల వనరుల మంత్రిత్వ శాఖకు కూడా అందింది. ఈ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ పరిశీలించింది..’ అని రావత్ చెప్పారు. బ్యారేజీలనేవి నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు పరిమితంగా నిల్వ చేసేందుకు ఉపయోగపడే మళ్లింపు నిర్మాణాలుగా సీడబ్ల్యూసీ అభిప్రాయపడినట్లు తెలిపారు. -
సీఎం కిరణ్‌పై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, న్యూస్‌లైన్ : సీడబ్ల్యూసీ సమావేశం సమయంలో తెలంగాణపై కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించి ఆనక సమైక్యవాదినని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్‌రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ ప్రకటన వచ్చిన అనంతరం ఏడు రోజులు చీకటి గదుల్లో కూర్చు న్న సీఎం కుట్రలు పన్ని సమైక్యవాద కృత్రిమ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో చెప్పిన సమస్యలన్నీ ఆయనకు గతంలో తెలియ దా? అని వారు ప్రశ్నించారు. సోనియా భిక్షతో సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆమె ఇచ్చిన మాటనే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసిన సీఎం ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. -
10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ Part 1
-
రాయల-తెలంగాణ ఊహాగానమే:పాల్వాయి
-
కాంగ్రెస్, యూపీఏ నిర్ణయమే మిగిలింది: దిగ్విజయ్
-
తెలంగాణ సెగలు