సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి.
ఇక ఈరోజు (శనివారం) సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హోటల్‌లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
ఇవాళ cwc సమావేశం తర్వాత కానీ, రేపు సమావేశం ముందు కానీ అగ్ర నేతల సమయాన్ని భట్టి చేరకలుఉ ండనున్నాయి. పార్టీలో చేరనున్న నాయకులను సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పీసీసీ సమాచారం ఇచ్చింది.
చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక
Comments
Please login to add a commentAdd a comment