new joinings
-
విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవని టీపీసీసీ పేర్కొంది. ఆ సభ కేవలం ఆరు గ్యారంటీల ప్రకటన కోసం ప్రత్యేకించినది తెలిపింది. కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న నేతలు ఎక్కడికక్కడ చేరికలు జరగాలని వెల్లడించింది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోమటిరెడ్డి. ఇక ఈరోజు (శనివారం) సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల పార్టీలో చేరనున్నారు. అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో తుమ్మల కలవనున్నారు. మరికొందరు తాజ్ కృష్ణ హోటల్లోనే కాంగ్రెస్ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇవాళ cwc సమావేశం తర్వాత కానీ, రేపు సమావేశం ముందు కానీ అగ్ర నేతల సమయాన్ని భట్టి చేరకలుఉ ండనున్నాయి. పార్టీలో చేరనున్న నాయకులను సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పీసీసీ సమాచారం ఇచ్చింది. చదవండి: Live: సీడబ్ల్యూసీ.. హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక -
నేతల రాకతో కొత్త సమస్య ?
-
హస్తం గూటికి చేరేందుకు నేతల ఆసక్తి
-
అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో పరిధిలోకి 12.94 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కింద అక్టోబర్ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్‌తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు. యువత ఎక్కువ.. నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్‌లో న్యూస్‌పేపర్ పరిశ్రమ, షుగర్, రైస్ మిల్లింగ్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
డీఎన్ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్ సిద్ధమా?
సాక్షి, వికారాబాద్: ‘బండి సంజయ్ అసలైన హిందువు కాదు, డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని టీఆర్ఎస్లోని కొంత మంది మొరుగుతున్నారు. నేను డీఎన్ఏ పరీక్ష చేసుకునేందుకు సిద్ధం, మరి పెద్ద హిందువును అని చెప్పుకున్న నీవు డీఎన్ఏ పరీక్షకు సిద్ధమా? హిందువు ఎవరో, బొందుగాడు ఎవరో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తేల్చుకుందామా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. ‘హిందుత్వ ఎజెండాపై నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీకి వెళ్దాం.. సిసలైన హిందువు ఎవరో అక్కడ తేలుతుంది’అని అన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్.. కండువా కప్పి చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రశేఖర్‌తోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అమరుల త్యాగాల పునాదుల మీద కేసీఆర్ సీఎం పదవిని అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: (లక్షన్నర మందితో కేసీఆర్ సభ!) 2023లో బీజేపీ జెండా ఎగురవేస్తాం.. 2023లో గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తామని సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో 80 శాతం కృషి కేసీఆర్‌దే ఉన్నట్లు ప్రచారం చేసుకోవటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 13,500 కంపెనీలు తీ సుకువచ్చి 3 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు కేసీఆర్ చెబుతున్నారని, ఇది రుజువు చేస్తే కేసీఆర్‌కు పాదపూజ చేస్తానని అన్నారు. లేదంటే బడితె పూజచేస్తానని హెచ్చరించారు. మాఫియాతో పోల్చటం సిగ్గుచేటు బీజేపీ మాఫియా పార్టీ అని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి గురించి ప్రశ్నిస్తే బీజేపీని మాఫియాగా అభివర్ణించటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీనేత స్వామిగౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 1న కేసీఆర్ ఓ దళితున్ని సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని, వివరాలు త్వరలో బహిర్గతం చేస్తానని తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ నాయకులు ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బంగారు శ్రుతి, సాయన్న, సదానందరెడ్డి, నరసింహారెడ్డి, ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ మంత్రి
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ బీజేపీలోకి చేరారు. వికారాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సర్పించ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేసే జీవో తెచ్చిన కేసీఆర్..సీఎంను కూడా సీఎస్ సస్పెండ్ చేసే జీవో తేవాలని డిమాండ్ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటా అన్నారు..ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని తెలిపారు. వికారాబాద్‌ని చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేశారు. -
బీజేపీకి ఏక్నాథ్ ఖడ్సే గుడ్‌బై
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే పార్టీని వీడారు. శరద్ పవార్ నాయకత్వంలో పని చేసేందుకు ఆయన ముందుకొచ్చారని, శుక్రవారం తమ పార్టీలో చేరబోతున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో నంబర్ 2గా గుర్తింపు పొందిన ఖడ్సే 2016లో భూకబ్జా ఆరోపణలతో రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయనకు బీజేపీలో ప్రాధాన్యం లభించడం లేదు. ఖడ్సే లాంటి ప్రముఖ నాయకుడి చేరికతో మహారాష్ట్రలోని ఖాందేష్ ప్రాంతంలో తమ పార్టీ(ఎన్సీపీ) మరింత బలోపేతం అవుతుం దని జయంత్ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఖడ్సేతోపాటు ఎంతోమంది బీజేపీలో ఎమ్మెల్యేలు ఎన్సీపీలో చేరేందుకు అసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం చాలా ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతుందని జయంత్ తేల్చిచెప్పారు. ఏక్నాథ్ ఖడ్సే నిర్ణయంపై బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. ఖడ్సే రాజీనామాను ఊహించలేదన్నారు. ఖడ్సే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోతుండడం తమకు ఒక చేదు నిజం అని వ్యాఖ్యానించారు. -
వైఎస్ఆర్సీపీలో పెరుగుతున్న చేరికలు
-
అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
వరంగల్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలతో పార్టీ అధినాయకత్వం మంచి జోష్ మీద ఉంది. అయితే వలసలతో పార్టీలో ఉన్న నేతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీలో వరుస చేరికలపై నేతలు అలక పూనుతున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.