అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
వరంగల్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలతో పార్టీ అధినాయకత్వం మంచి జోష్ మీద ఉంది. అయితే వలసలతో పార్టీలో ఉన్న నేతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీలో వరుస చేరికలపై నేతలు అలక పూనుతున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.