discontent
-
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్‌లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
కాంగ్రెస్ వల్లే ‘ఇండియా’లో వేడి తగ్గింది: నితీశ్ కుమార్
పట్నా: విపక్ష ‘ఇండియా’ కూటమి స్తబ్ధుగా మారిపోయిందని, ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పారీ్టయే అందుకు కారణమని జేడీ(యూ) సీనియ ర్ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మునిగిపోయిందని, దాంతో ఇండియా కూటమిలో వేడి తగ్గిందని అన్నా రు. గురువారం బిహార్ రాజధాని పట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన సభలో నితీశ్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ పాలనను వ్యతిరేకించే పారీ్టలు ఒకే వేదికపైకి వచ్చాయని, ఆ కూటమిలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. -
‘మై లార్డ్’ అనకండి..సగం వేతనం ఇచ్చేస్తా!
న్యూఢిల్లీ: కోర్టులో వాదోపవాదాల సమయంలో పదేపదే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు? ఇలా అనడం ఆపేస్తే, నా వేతనంలో సగం మీకిచ్చేస్తా’అని జస్టిస్ పీఎస్ నరసింహ పేర్కొన్నారు. బుధవారం జస్టిస్ ఏఎస్ బొపన్నతో కలిసి ఆయన ఓ కేసు విచారణలో పాల్గొన్నారు. వాదోపవాదాల సమయంలో ఓ సీనియర్ లాయర్ పదేపదే ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్స్’ అంటుండటంపై పైవిధంగా ఆయన స్పందించారు. వాటికి బదులుగా సర్ అని అనొచ్చు కదా అని తెలిపారు. లేకుంటే ఆ మాటలను ఎన్నిసార్లు వాడేదీ లెక్కపెడ తానని చెప్పారు. ‘మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్’అనే మాటలు వలస పాలన ఆనవాళ్లని, కోర్టు ప్రొసీడింగ్స్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
తాలిబన్లకు నిరసనల సెగ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్‌తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్‌జజీరా ఛానెల్ వెల్లడించింది. మహిళల నుంచే తొలి నిరసనలు కాబూల్‌లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. హిజాబ్ లేదని మహిళని కాల్చి చంపారు! పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్ ప్రావిన్స్‌లో ఒక మహిళ హిజాబ్ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్‌పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
కమలంలో కలకలం
జయపురం: మొదటి నుంచి పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తూ వస్తున్న పాత నేతలు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో స్థానం కల్పించడం లేదని జయపురం అసెంబ్లీ నియోజక వర్గం పార్టీ నాయకులు, శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని అధిష్టానం అందలం ఎక్కిస్తోందని విమర్శిస్తున్నారు. స్థానిక స్టేడియం గ్రౌండ్లో పలువులు పాత బీజెపీ శ్రేణులు బుధవారం సమావేశమై రాష్ట్ర బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను తూర్పారబట్టారు. ఈ సందర్భంగా సీనియర్ బీజేపీ నేత, జయపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి అసంతృప్తి వెలిబుచ్చారు. గత ఎన్నికల నుంచి పార్టీలో ఇటువంటి పోకడలు పొడచూపాయన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారికి పార్టీ పట్టం గడుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తున్న పాత వారిని పక్కకు నెడుతోందని ఆవేదన వెళ్లగక్కారు. గత ఎన్నికలలో పలు పార్టీలు మారి బీజేపీలో చేరిన గౌతమ సామంత రాయ్‌కు పార్టీ టికెట్ ఇచ్చారని మొదట్నుంచి తామంతా పార్టీలో ఉన్నామని ఇతర పార్టీ నుంచి వచ్చి చేరి తమకు తమకు పాఠాలు చెబితే సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ, కొరాపుట్ జిల్లా పార్టీ నేతలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టక పోతే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. జయపురం నియోజకవర్గంలో గౌతమ సామంతరాయ్ ప్రవేశాన్ని పాత బీజేపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారు నిర్వహించే ఏ సభకు గాని సమావేశానికి గాని సామంతరాయ్‌ను ఆహ్వానించడం లేదు. అయినా రాష్ట్ర నాయకత్వం గౌతమ సామంతరాయ్‌ను అక్కున చేర్చుకుంది. గత సాధారణ ఎన్నికల్లో జయపురం ఎమ్మెల్యే టికెట్ కోసం పలువురు పాత నేతలు ప్రయత్నించినా గౌతమ సామంతరాయ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పటినుంచే పార్టీ పాత శ్రేణులలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. అయితే గౌతమ సామంతరాయ్‌ను బీజేపీ శాశ్వత ఆహ్వానితునిగా ఇటీవల పార్టీ అధిష్ఠానం నియమించడంతో పాత నేతల్లో గతంలోనే రాజుకున్న అసంతృప్తి సెగ తీవ్రస్థాయికి చేరుకుంది. జయపురంలో బీజేపీ అంతంత మాత్ర ఇప్పటికే అంతంతమాత్ర బలం ఉన్న జయపురం నియోజకవర్గం బీజేపీలో ప్రస్తుతం తలెత్తిన అసంతృప్తి పార్టీని మరింత దిగజారుస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సమావేశంలో సీనియర్ నేతలు అరుణ భటమిశ్రా, పట్టణ పార్టీ అధ్యక్షుడు అమర్లాల్ అహుజ, లలిత అగర్వాల్, మీనకేతన పరిచ, శుభేంద్ర బ్రహ్మ, విజయ సాహు, మోహన దొర, శంకర మహంతి, త్రినాథ్ రావు, మనోజ్ నాయక్, సుధాంశు జెన, జగదీష్ పాఢి, దుర్గా ప్రసాద్ ఎర, మోహన్ మఝి, గౌర దాస్, శ్యామ మోహన్, లక్ష్మీనరసింహ పాఢి, వసంత స్వంయి, సంతోష్ మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
‘కూటమి’ తేలాకే మనం
సాక్షి, హైదరాబాద్: మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఈ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలుండగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 6న ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అక్టోబర్ 21న మలక్‌పేట, జహీరాబాద్ స్థానాల అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. మరో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పెండింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. వరంగల్ తూర్పు, ఖైరతాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, అంబర్‌పేట, చొప్పదండి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తే అసంతృప్తులు పోటీగా కార్యక్రమాలను నిర్వహించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికలో సామాజిక లెక్కల పరంగానూ మహాకూటమి కంటే మెరుగ్గా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అందుకే కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో మహాకూటమి బాగా జాప్యం చేస్తే అప్పుడు మరో వ్యూహం అమలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. వరంగల్ తూర్పు, చొప్పదండి, మల్కాజ్గిరి, వికారాబాద్, మేడ్చల్, అంబర్‌పేట, ముషీరాబాద్, గోషామహల్, ఖైరతాబాద్, హుజూర్నగర్, కోదాడ, చార్మినార్ అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ► ఖెరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్‌ను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి టికెట్‌పై ధీమాతో ఉన్నారు. ► గోషామహల్ టికెట్‌ను ప్రేంసింగ్ రాథోడ్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నందకిశోర్ బిలాల్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్‌కు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే తనకుగానీ, తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికిగానీ ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం ఇవ్వాలని టికెట్ ఇవ్వాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరుతున్నారు. ► అంబర్‌పేట అభ్యర్థిగా కాలేరు వెంకటేశ్ పేరును ఖరారు చేసింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చా ర్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కృష్ణయాదవ్, గడ్డం సాయికిరణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ► మేడ్చల్ స్థానాన్ని మల్కాజ్గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మరోసారి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ► మల్కాజ్గిరి అభ్యర్థిత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ఇవ్వాలని నిర్ణయించింది. ► చొప్పదండిలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ను అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. ప్రచారం చేసుకోవాలని ఆదేశించింది. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సైతం ప్రచారం చేస్తున్నారు. ► వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ పేరును ఖరారు చేసింది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ► హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పోటీగా శానంపూడి సైదిరెడ్డిని బరిలో నిలపాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జి శంకరమ్మ తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ► కోదాడలో వేనేపల్లి చందర్రావుకు అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నియోజకవర్గ ఇన్చార్జి కె.శశిధర్‌రెడ్డి టికెట్‌పై ఆశతో ఉన్నారు. ► వికారాబాద్ టికెట్ టి.విజయ్‌కుమార్‌కు దాదాపుగా ఖరారైంది. మరో నేత ఎస్.ఆనంద్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఆ పార్టీ నేతలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. వీరిలో అవకాశం దక్కని నేతను టీఆర్ఎస్ తరుఫున బరిలో దింపాలని కూడా టీఆర్ఎస్ భావిస్తోంది. ► చార్మినార్‌లో దీపాంకర్‌పాల్‌కు టికెట్ దాదాపుగా ఖరారు చేసింది. ఇలియాస్ ఖురేషీ పేరును పరిశీలిస్తోంది. ఎంఐఎం కంచుకోట అయిన ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ నామమాత్రంగానే ఉండనుంది. -
అహాన్ని వదిలేయాలి
అతను ఓ గొప్ప ధనవంతుడు. ఎందుకనో క్రమంగా అతని మనసులో ఏదో అసంతృప్తి ఆవరించింది. . దాంతో మనశ్శాంతికోసం రకరకాల గురువుల వద్దకు వెళ్లడం మొదలు పెట్టాడు. కానీ, వారు ఏదైనా చెప్పడం మొదలు పెట్టగానే ఇది తనకు తెలిసిందేగా, ఇందులో తెలుసుకోవలసింది ఏముంది? అనుకుంటూ ఏదో అత్యవసరమైన పని ఉన్నట్లు బయటకు వచ్చేసేవాడు. అయితే, మనశ్శాంతి లేక చివరకు ఓ గురువును కలిశాడు. తనలో తలెత్తిన అసంతృప్తి గురించి చెప్పి, తనకు సరైన మార్గం చూపెట్టమన్నాడు. అతని మాటలు విన్న ఆ గురువు ‘మీకు నేను పాఠాలు చెప్పేముందు మీరు వెళ్లి మూత్రవిసర్జన చేసిరండి’ అని చెప్పాడు.ఆయన మాట విన్న ధనవంతుడు ‘ఏమిటీయన ఇలా చెబుతాడు? బుద్ధుందా అసలు’ అని అనుకుంటూనే బయటకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత మళ్ళీ లోపలికొచ్చి గురువుగారి ముందు కూర్చున్నాడు.‘ఏంటీ అర్థమైందా?’ అని అడిగారు గురువు.‘‘నాకేమీ అర్థం కాలేదు..’’ అన్నాడతను కాస్త వ్యంగ్యంగా.. దానికాయన ‘ఎంత పెద్ద ధనికుడైనా, గొప్పవాడైనా కావచ్చు లేదా వారి దగ్గర పని చేస్తున్న వారో లేదా పేదవాడు కావచ్చు. అందరూ కూడా ఇప్పుడు నువ్వు చేసొచ్చిన పనిని ఎవరికి వారు చేయాల్సిందే తప్ప ఒకరి తరఫున మరొకరు వెళ్ళి చేసొచ్చేది కాదు. అంతేకాదు, ఎవరి వద్దనైనా ఏమైనా తెలుసుకోవాలని అనుకునేముందు నీలో ఉన్న వ్యర్థాలను, నాకే తెలుసుననే అహంకారాన్ని విసర్జించాలి. తెలియని విషయాన్ని ఎంత చిన్నవారు చెప్పినా వినాలి. అడ్డుపడకూడదు’ అని అన్నారు. తనకు విషయం అర్థమైందన్నట్లుగా తలూపి, ఆయనకు నమస్కరించి, అక్కడినుంచి సంతృప్తితో బయటపడ్డాడా ధనవంతుడు. -
టీఆర్ఎస్లో చల్లారని అసంతృప్తి..!
గులాబీ గూటిలో అసంతృప్తి జ్వాలలు ఆరడం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన వెలువడి వారంరోజులు దాటినా.. అధికార పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి దక్కని నేతలు అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి వర్గంగా జట్టు కడుతున్నారు. ఆరునూరైనా బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరిమోఖా అని, చావోరేవో తేల్చుకుంటామనీ స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని ఆపేందుకు అధిష్టానం ప్రయత్నించడం లేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి నేతలుగా ఆందోళనబాట పట్టిన చర్యలు లేవు.. బుజ్జగింపులూ లేవు. దీంతో ‘రెబెల్స్’గా పోటీ చేస్తామంటున్నవారు ఇప్పుడు అధిష్ఠానం పిలిచినా ససేమిరా అంటామంటున్నారు. తమకు టికెట్ దక్కలేదని కొందరు, దక్కిన వారి టికెట్ రద్దు చేయాలంటూ మరికొందరు పలుచోట్ల నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అభ్యర్థుల ప్రకటన నుంచే అసమ్మతికి ఆజ్యం‘ముందస్తు’ ఖాయమని తేలడంతో ఆశావహులంతా ఎవరికీ వారుగా టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఎవరూ ఊహించనివిధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 6న ప్రకటించిన 105 మందిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క చొప్పదండి మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో పాతకాపులకే మళ్లీ అవకాశం కల్పించారు. కొత్తగా టికెట్ ఆశించిన వారు, గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు, ఈ సారి టికెట్ ఖాయమనుకున్నవారు తమ పేర్లు కానరాక పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అభ్యర్థుల ప్రకటన వెలువడిన రోజే రామగుండం, వేములవాడలో అసంతృప్తి నేతలు నిరసన స్వరం వినిపించారు. ఆ తర్వాత మానకొండూరు, మంథని, పెద్దపల్లిలో అభ్యర్థులను మార్చాలని, తమకే అవకాశం ఇవ్వాలని ఆందోళనలు చేపట్టారు. రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టికెట్ ప్రకటించడంపై ఏకంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారు. వేములవాడలో వెయ్యిమందికిపైగా హాజరై సభ నిర్వహించి చెన్నమనేని రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మానకొండూరు, మంథనిలో ఆశావహుల అనుచరులు కిరోసిన్ డబ్బాలతో వాటర్‌ట్యాంక్‌లు, విద్యుత్ టవర్లు ఎక్కి ఆత్యాహత్యాయత్నం చేశారు. మరికొన్ని చోట్ల అసంతృప్తి ఉన్నా... చాపకింద నీరులా సాగుతోంది. వీటన్నింటిపై అధిష్టానం స్పందించకపోవడంతో రోజు రోజుకు నిరసనలు ఆందోళనలు పెరుగుతున్నాయి. ‘అసమ్మతి’పై చర్చలు లేవు.. చర్యలూ లేవు ఉమ్మడి జిల్లాలో రామగుండం, వేములవాడ, మానకొండూరు, మంథని, పెద్దపల్లి తదితర చోట్ల టీఆర్ఎస్ టికెట్ల కోసం ఆశావహులు చేస్తున్న అసమ్మతి ఆందోళనలు, కార్యకలాపాల విషయంలో ఇంకా ఎలాంటి చర్చలూ స్థానికంగా చేపట్టలేదు. వేములవాడలో తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుబడుతోంది. శనివారం మేడిపెల్లి మండలకేంద్రంలో గల పీఎన్ఆర్ గార్డెన్లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2500 మంది ఇందులో పాల్గొన్నారు. వేములవాడ వరకు పాదయాత్ర కూడా చేపట్టారు. అలాగే రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు. వారం క్రితం ఎన్టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్లో అసమ్మతి నేతలంతా సమావేశం నిర్వహించారు. చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. అధినేత కేసీఆర్ చొప్పదండిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఎవరికి టికెట్ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీమంత్రి గడ్డం వినోద్, తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారిణి వొల్లాల వాణి సైతం టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో చొప్పదండి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొం ది. చివరి నిమిషంలో హైదరాబాద్‌లో మకాం వేసి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. -
ఇదేం న్యాయం?
న్యూఢిల్లీ: భారత్‌లో నిర్వహించే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో బిడ్లు దాఖలు చేసిన రెండు కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన చెల్లింపులపై చివరి నిమిషంలో బీసీసీఐ మార్పులు చేయడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఏప్రిల్ 3న బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా... పోటీపడ్డ స్టార్ ఇండియా, ఎస్పీఎన్ (సోనీ కార్పోరేషన్)లు ఈ అంశంపై బీసీసీఐకి లేఖ రాశాయి. ప్రసార హక్కులు పొందిన సంస్థ... సొంత గడ్డపై నిర్వహించే అన్ని మ్యాచ్‌లకు ఒకే మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమని అందులో పేర్కొన్నాయి. టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ముక్కోణపు టోర్నీల వంటి సిరీస్‌లలో భారత్ పాల్గొనే మ్యాచ్‌కు, పాల్గొనని మ్యాచ్‌కు ఒకే మొత్తం చెల్లించాల్సి రావడం ఇబ్బందికరం అని స్పష్టం చేశాయి. భారత్ బరిలో ఉంటే చూసే ప్రేక్షకుల సంఖ్యకు, లేకుంటే చూసేవారికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇది సబబు కాదని... తక్షణమే దాన్ని సవరించాలని కోరాయి. -
బొబ్బిలి రాజులపై తిరుగుబాటు
టీడీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీని, కార్యకర్తలను కాదని వ్యక్తిపూజకే బొబ్బిలి రాజులు ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పార్టీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు పెనుదుమారాన్నే లేపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఆయన కళ్లెదుటే విమర్శలు చేయడం... రాజులపై తిరుగుబాటు చేయడం జిల్లాలో సంచలనం రేపింది సాక్షిప్రతినిధి, విజయనగరం/బొబ్బిలి: బొబ్బిలి కోట..తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా మారుతుందని భావించి వైఎస్సార్సీపీ టిక్కెట్టుతో గెలిచిన ఆర్.వి.సుజయకృష్ణ రంగారావును టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు అదే బొబ్బిలిలో టీడీపీకి బీటలు వారుతున్నాయి. సుజయ్ ఆ పార్టీలోకి వెళ్లిన వెంటనే ఆయన సత్తా ఏమిటో టీడీపీ అధిష్టానానికి, కార్యకర్తలకు అర్థమయ్యింది. ఇక అప్పటి నుంచి ఆయన చేత పనిచేయించడానికి నానా తంటాలు పడుతున్నారు. మంత్రి పదవి ఇస్తే సీరియస్గాపట్టించుకుంటాడనుకుని రాష్ట్ర గనులశాఖ అప్పగించారు. అయినా సుజయ్‌లో మార్పు రాలేదు. వివాదాలకు వేదికైన ఆవిర్భావ సభ ఎన్నికల్లో గెలిపించిన పార్టీకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన ఆయనపై టీడీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. పార్టీ కోసం కష్టపడుతున్న వారికి గుర్తింపు లేదని, కొంత మంది తొత్తులు చుట్టూ చేరి పబ్బం గడుపుకుంటుంటే మాకెందుకీ కష్టాలని టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు తూమురోతు వెంకట్ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా గురువారం ఉదయం బొబ్బిలి కోటలో జరిగిన సమావేశంలో మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా ఆయన అడ్డుపడ్డారు. ‘మా పరిస్థితి ఇంతేనా’ అంటూ పెద్దగా కేకలేస్తూ నెత్తీనోరూ బాదుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో వెంకట్ ఇలా ప్రవర్తించేసరికి అవాక్కయిన మంత్రికి నోటమాటరాలేదు. మంత్రి అనుచరులు వెంకట్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించడంతో కాసేపు తోపులాట జరిగింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని, అసలు కార్యక్రమాలే చేయడం లేదని, తమ వంటి కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉందని వెంకట్ నిలదీశా రు. రాష్ట్ర ఆర్ధిక మండలి సభ్యుడు తూముల భాస్కరరావు, ఇతర నాయకులు కల్పించుకుని ఆయన్ను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను అనునయించాలని ప్రయత్నించి నా కుదరలేదు. చాలాసేపు టీడీపీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని వెంకట్ వెళ్లగక్కారు. తనతో పాటు చాలా మంది ఇదే ఆవేదనలో ఉన్నారన్నారు. గైర్హాజరయిన తెంటు పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ ఇన్‌ఛార్జి తెంటు లక్ష్ముమ్ నాయుడు గైర్హాజరయ్యారు. వాస్తవానికి ఇన్చార్జి హోదాలో కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నా ఆయన రాలేదు. ప్రతీ సమావేశానికి హాజరయ్యే ఆయన ఈసారి హాజరు కాకపోవడంతో పార్టీలో సుదీర్ఘచర్చ జరుగుతోంది. పార్టీలో నెలకొన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. మంత్రి అనుయాయులంతా రాజులకే ప్రాధాన్యమివ్వడం, పార్టీ కార్యక్రమాలకు, పార్టీకి విలువనివ్వకపోవడంతో తెంటు కూడా మనస్థాపం చెందుతున్నట్టు చర్చించుకుంటున్నారు. అదే విషయాన్ని ఆయన అనుచరుడయిన తూమురోతు వెంకట్ ఒక్కసారిగా మంత్రి సమావేశంలోనే బయటపెట్టినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ ఉదయం వివాదం ముగిసిందనుకుంటే సాయంత్రం మళ్లీ మొదలైంది. బొబ్బిలి కోట దక్షిణ దేవిడీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెంకట్ చేరుకుని తాను భార్యాపిల్లలతో కలసి ఆత్మహత్యాయత్నం చే కుంటున్నానని హల్ చల్ చేశారు. తెంటు లక్ష్ముమ్ నాయుడు తదితరులు ఫోన్ చేసి వారించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రాంబార్కి శర వచ్చి ఏమైందంటూ అడగ్గా తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెంకట్ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం కౌన్సిలర్ ఆర్.ఎల్.వి.ప్రసాద్ వచ్చి ఆయన్ను తీసుకెళ్లిపోవడంతో అప్పటికి కథ సుఖాంతమైంది. బొబ్బిలి టీడీపీలో భగ్గుమన్న విభేదాలపై ఇంటిలిజెన్స్ వర్గాలు పార్టీ అధిష్టానానికి, పోలీసు ఉన్నతాధికారులకూ సమాచారమందించారు. -
వారికి నో చాన్స్ ...
వారు పేరుకు మాత్రమే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. వారి మాట ఎక్కడా సాగదు. మంత్రివర్గ విస్తరణలో కానీ, కీలక పదవులు పొందడంలో కానీ.. వారికి నో చాన్స్. కనీసం వారు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోదు. దీంతో విజయవాడ సిటీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం ఆరంభమైంది. అధికార పార్టీలో ఉన్నా ఏం సాధించుకోలేకపోతున్నామన్న నైరాశ్యం చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి, విజయవాడ: ఓ అక్రమ నిర్మాణానికి సహకరించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్ చేసిన సిఫారసును మేయర్ కోనేరు శ్రీధర్ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. కార్పొరేషన్లో మేయర్ ఏకపక్షంగా ఉంటూ తమ సిఫారసులను పట్టించుకోకపోవడంతో గుర్రుతో ఉన్న సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంతర్గతంగా గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా నిలిచారు. పలువురు కార్పొరేటర్లు మేయర్ శ్రీధర్ అవినీతిపై రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలంతా మేయర్‌ను మార్చాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే చినబాబు కోనేరు శ్రీధర్‌కు అండగా నిలవడంతో మార్పు ప్రతిపాదన పక్కకు పోయింది. మంత్రి పదవి భంగపడ్డ బొండా ఉమా గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజధాని నుంచి తనకు అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆశపడ్డారు. అయితే, ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కాపుల గొంతు కోస్తున్నారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్ అయ్యారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో రవాణాశాఖ కార్యాలయం వద్ద వివాదం జరిగినప్పుడు కూడా ఉమాపై చంద్రబాబు ఆగ్రహించారు. ఆ తరువాత ఎంపీ కేశినేని శ్రీనివాస్‌తో కలిసి బొండా ఉమా సదరు అధికారికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్వాంత్రంత్య్ర సమరయోధుడికి చెందిన స్థలం కబ్జాలోనూ ఎమ్మెల్యే బొండా ఉమా పాత్ర ఉండటంతో సీఎం సీరియస్ అయ్యారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవి దక్కని జలీల్‌ఖాన్ మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన నైతిక విలువలను పక్కనపెట్టి పచ్చ కండువా కప్పుకున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం మొండిచేయి చూపించారు. కనీసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవితోనైనా సరిపెట్టుకునేందుకు జలీల్ సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచి ఒకరిని వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటారు. ఆ సభ్యుడితో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరిని మిగిలిన సభ్యులు చైర్మన్‌గా ఎన్నికుంటారు. అయితే, ఎమ్మెల్సీ గురించి పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు జలీల్ఖాన్ను మాత్రమే సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు ప్రస్తుతానికి హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో జలీల్‌ఖాన్‌కు కనీసం చైర్మన్ పదవి కూడా దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మేయర్ వెనుక మాస్టారు త న భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే ఈవెంట్స్ సంస్థకు మేయర్ పుష్కరాల వర్క్స్ కట్టబెట్టారని, మిగిలిన సంస్థల కంటే ఆ సంస్థకుæ బిల్లులు ముందుగానే మంజూరు చేయించి అవినీతికి పాల్పడ్డారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే, అదే కేఎంకే సంస్థలోని కీలక డైరెక్టర్లతో చినబాబుకు పరిచయాలెక్కువే. కేఎంకే సంస్థ డైరెక్టర్ల నుంచి తమ వాటా పర్సంటేజ్‌లు రావడం వల్లే మేయర్ మార్పునకు ఎమ్మెల్యేలు పట్టుబట్టినా చినబాబు పదవి నుంచి తప్పించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్‌నే కొనసాగిస్తూనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌పై పెత్తనం చేయాలని చినబాబు భావిస్తున్నారు. రాబోయే ఏడాదిలో వీఎంసీలో జరిగే అభివృద్ధి పనుల్లో తమకు రావాల్సిన వాటాలను మేయర్ ద్వారానే తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. చినబాబే తన వెనుక ఉండటం వల్ల మేయర్ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లెక్క చేయట్లేదు. -
మిత్రభేదం
సాక్షి, తిరుపతి: టీడీపీ, బీజేపీ నేతల మధ్య దూరం పెరుగుతోంది. అవకాశమిస్తే ఇబ్బందికరమని టీడీపీనేతలు తమ మిత్రపక్ష నాయకులను దూరంగా ఉంచుతున్నారు. తమను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. కాంట్రాక్ట్ పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అడుగడుగునా బీజేపీ నేతలకు అవమానాలు, అన్యాయం జరుగుతుండటంతో చేసేది లేక ఢిల్లీ అధినాయకత్వానికి లేఖలు ద్వారా గోడును వెళ్లబోసుకుం టున్నారు. సాధారణ ఎన్నికలకు ముం దు అధికారం కోసం బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత కేంద్రంలో బీజేపీ... ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నా జిల్లా నేతల మధ్య సఖ్యత లేదు. పైకి మిత్రులమని చెప్పుకోవటానికి తప్ప ‘పొత్తు’ ఏ రకంగా తమకు ఉపయోగపడలేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావటంతో తమ ప్రాభవాన్ని చాటులేకపోతున్నామనే భావన కమలనాథుల్లో ఉంది. పార్టీ అధ్యక్షులుగా, కేంద్ర మంత్రివర్గం లో కీలక పాత్ర పోషించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్నా జిల్లాలో ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేకపోయామనే దిగులు వారిని వేధిస్తోంది. అడుగడుగునా అవమానాలే.. బీజేపీ నేతలు జిల్లాలో ఇటీవల అడుగడుగునా అవమానాలు ఎదుర్కొం టున్నారు. కుప్పం నియోజకవర్గంలో తాము బలంగా ఉన్నా ఏ రోజూ ప్రభు త్వ కార్యక్రమాలకు ఆహ్వానించిన దాఖ లాలు లేవని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్మభూమి కమిటీల్లో ప్రాధాన్యత కల్పించమని అడిగినా పట్టించుకోలేదంటున్నారు. కుప్పంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా జన్మభూమి కమిటీల్లో బీజేపీ శ్రేణులకు ఏ ఒక్కరికీ చోటు కల్పించలేదనే విమర్శలు ఉన్నా యి. కుప్పం పరిధిలో ఓ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు కాంట్రాక్ట్ పని బీజేపీ నేత కావాలని ప్రాధేయపడినా... టీడీపీ నేతలు తిరస్కరించినట్లు సమాచారం. రైతు రథం పేరుతో జిల్లా వ్యాప్తం గా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ పథకంలో ఒక్క బీజేపీ కార్యకర్తకు ట్రాక్టర్ ఇచ్చిన దాఖలాలు లేవని బీజేపీ నాయకులంటున్నారు. వారు ప్రతిపాదించిన పేర్లలో ఏ ఒక్కరికీ ఇచ్చిన దాఖ లాల్లేవు. కాంట్రాక్టు పనుల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘మీకు ఇస్తే మా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంటి’ అని ఎదురు తిరిగినట్లు సమాచారం. పాలకమండళ్లు... మార్కెట్ కమిటీల్లోనూ అన్యాయం.. తుడా పాలకమండలిలో సుబ్రమణ్యం యాదవ్‌కు స్థానం కల్పించమని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. టీడీపీ నేతలకు మాత్రమే స్థానం కల్పిం చారు. బోయకొండ దేవస్థానం చైర్మన్ కోసం ప్రయత్నించినా భంగపాటు ఎదురవుతోంది. శ్రీకాళహస్తి ఆలయ పాలకమండలిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించాలని కోలా ఆనంద్ ప్రయత్నించారు. నిరాశే ఎదురైంది. మార్కెట్ కమిటీల కోసం బీజేపీ నేతలు అనేకమంది ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ పాలకమండలిలో బీజేపీ నేతలకు ప్రాధాన్యత కల్పించాలని పట్టుబడుతున్నారు. టీటీడీ చైర్మన్ పదవి ఈసారి బీజేపీ వారికి కేటాయించాలని అధిష్టానం దృష్టి కి తీసుకెళ్లినట్లు సమాచారం. వైద్య, దేవా దాయ శాఖలో కమిటీ సభ్యులుగా నియమించడానికి కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని తిరుపతికి చెందిన బీజేపీ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రెండు శాఖలకు సంబంధించి మంత్రులు బీజేపీ వారే ఉన్నా టీడీపీ నేతల పెత్తనమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. బడ్జెట్ తర్వాత ఈ రెండు పార్టీల నేతలు వాగ్బాణాలు విసురుకుంటున్నారు. -
ద్వైపాక్షిక విశ్వాసానికి దెబ్బ: పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై పోరులో ఆర్థిక సాయం పొంది మోసం చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని దెబ్బతిస్తాయని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ నేతృత్వంలో మంగళవారం జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశమైంది. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్, హోం మంత్రి అశాన్ ఇక్బాల్, రక్షణ మంత్రి ఖుర్రమ్ ఖాన్, త్రివిధ దళాల చీఫ్‌లు హాజరయ్యారు. ట్రంప్ ఆరోపణలు పూర్తి అసంబద్ధంగా, వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ తరువాత వెలువడిన ప్రకటనలో మండలి పేర్కొంది. -
తాళి, బొట్టు తీయించారు
న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాధవ్, అతని కుటుంబ సభ్యుల సమావేశం ఆద్యంతం పాకిస్తాన్ వ్యవహరించిన తీరు పట్ల భారత్ తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ భేటీకి సంబంధించి ఇరు దేశాలు ముందుగా ఏర్పరచుకున్న అవగాహనలను, స్ఫూర్తిని పాక్ తుంగలో తొక్కిందని మండిపడింది. సమావేశాన్ని స్వేచ్ఛా వాతావరణంలో కాకుండా అడుగడుగునా కట్టదిట్టమైన నియంత్రణలతో నిర్వహించారని తెలిపింది. గూఢచర్య కేసులో పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్ సోమవారం ఇస్తామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయంలో తన తల్లి అవంతి, భార్య చేతాంకుల్‌ను కలిశారు. అయితే, జాధవ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు, వేధింపులకు గురవుతున్నట్లు కనిపించారని భారత్ పేర్కొంది. జాధవ్ పరిస్థితిని చూస్తే ఆయన ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపిస్తోందని ఆనుమానం వ్యక్తంచేసింది. ‘పాక్ చాలా దారుణంగా వ్యవహరించింది. జాధవ్‌ను కలవడానికి వెళ్లే ముందు అతని తల్లి, భార్య మంగళసూత్రాలు, గాజులు, బొట్టును తొలగించారు. దుస్తులు మార్చుకోమన్నారు. మహిళల మత, సంప్రదాయ విలువలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. పాక్ విడుదల చేసిన వీడియోలో జాధవ్ మాట్లాడిన మాటలు కూడా ఎవరో అల్లిన కట్టుకథలా ఉన్నాయి. తాను పాక్‌లో భారత గూఢచారిగా పనిచేసినట్లు బెదిరించి ఆయనతో చెప్పించారు. జాధవ్æ భార్య, తల్లితో మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలో అతని చెవి, మెడ వద్ద గాయాలు కన్పించాయి. దీన్ని బట్టి చూస్తే జాధవ్‌ను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది’ అని భారత విదేశాంగ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో ఆక్షేపించింది. ‘సమావేశం జరిగిన తీరు భయానకంగా ఉంది. జాధవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అయితే వారు ఈ విపత్కర పరిస్థితిని ధైర్యంతో, సాహసంతో ఎదుర్కొన్నారు’ అని తెలిపింది. జాధవ్ తల్లిని మాతృ భాష మరాఠీలో మాట్లాడనివ్వలేదని, ఆమెకు అడ్డుతగిలారని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశం అనంతరం జాధవ్ భార్య తన బూట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియాను లోనికి అనుమతించకూడదనే నిబంధనను పాటించలేదని, పాక్ విలేకరులు పదే పదే జాధవ్ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చి అనవసర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని భారత్ అసహనం వ్యక్తం చేసింది. కాగా, జాధవ్ కుటుంబ సభ్యులు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను మంగళవారం కలిశారు. భారతీయులకు అవమానం: కాంగ్రెస్ జాధవ్, అతని కుటుంబ సభ్యుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో అవలంబిస్తున్న అసంబద్ధ, ఊగిసలాట ధోరణి వల్ల అనిశ్చిత వాతావరణం నెలకొంది’ అని కాంగ్రెస్ విమర్శించింది. -
టీడీపీలో ‘కళా’కలం!
► కళాకు మంత్రి పదవిపై రేగిన అసంతృప్తి ► అలకబూనిన సీనియర్ నాయకుడు శివాజీ ► గౌతు కుటుంబం రాజీనామాపై వదంతులు ► ‘కాళింగు’లకు ప్రాధాన్యలోపంపైనా చర్చలు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: టీడీపీలో వర్గపోరు మొదలైంది. కింజరాపు కుటుంబానికి బద్ధ వ్యతిరేకిగా ముద్ర పడిన కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ఇద్ద రు మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరా వుల మధ్య వైరం చూస్తే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు ‘ఒక్క చాన్స్’ అంటూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకుడు గౌతు శ్యామసుందర శివాజీకి భంగపాటు కలగడంతో ఆయన అలక పాన్పు ఎక్కారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, గతంలో ఒక్కసారి మంత్రిగా పనిచేసినా కనీసం ఆయన పేరును కూడా అధిష్టానం పరిశీలనలోకే తీసుకోకపోవడం గమనార్హం. అలాగే తమకు సరైన గుర్తింపు ఇవ్వలేదంటూ జిల్లాలో బలమైన సామాజిక వర్గాల్లో ఒకటైన కాళింగులు కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారిని పక్కనబెట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో పార్టీలోకి వెళ్లి తర్వాత సొంతగూటికి చేరినవారికే అధిష్టానం గుర్తింపు ఇస్తోందంటూ టీడీపీ వర్గాలు రగిలిపోతున్నాయి. కింజరాపు కుటుంబంతో దీర్ఘకాల వైరం ఉన్న కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌తో సాన్నిహిత్యం పెంచుకోవడంతో కళా సఫలమయ్యారు. దీంతో జిల్లాలో ఎంతమంది వ్యతిరేకించినా కళాకు మంత్రి పదవి ఖాయమైంది. అంతవరకూ బాగానే ఉన్నా పోర్టుపోలియో ఏమి దక్కుతుందనేదీ చర్చనీయాంశమైంది. గతంలో ఎన్టీ రామారావు కేబినెట్లో హోమ్ మంత్రిగా పనిచేసిన కళాకు మళ్లీ హోంశాఖ ఇస్తారనే ధీమాలో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడమే ప్రాతిపదికగా మార్కులు ఇస్తున్న అధిష్టానం... ఆ కోణంలో చూస్తే అచ్చెన్నాయుడికి హోంశాఖ కట్టబెట్టి అధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచర వర్గం గట్టిగా నమ్ముతోంది. పాత తగదాలు తెరపైకి... దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి సొంతపార్టీలోనే కళా వెంకటరావు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండేది. వాస్తవానికి ఎచ్చెర్ల నుంచి గెలిచిన కళాకు ప్రారంభంలోనే మంత్రి పదవి దక్కుతుందని అంతా ఆశించారు. కానీ ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడికి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఇది సీనియర్ నాయకుడు శివాజీ వర్గానికి అశనిపాతమైంది. అప్పుడే ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని, ఈ ఒక్కసారి మంత్రి పదవి ఇవ్వాలని 2014 ఎన్నికల సమయంలోనే శివాజీ షరతు పెట్టినా అధిష్టానం పట్టించుకోకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయన కుమార్తె శిరీషకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి తాత్కాలికంగా శాంతింపజేశారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో నూ శివాజీకి మొండిచేయి చూపడాన్ని గౌతు కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీ పదవికి రాజీ నామా చేయడానికి సైతం శిరీష సిద్ధమయ్యారంటూ వదంతులు వచ్చాయి. తనకు కాకుండా కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇవ్వడంతో శివాజీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన కాళింగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విప్‌కు కూన రవికుమార్‌కు మంత్రి పదవి లేదా ప్రభుత్వ చీఫ్ విప్ పదవి అయినా ఇస్తారని ఆ శించినా అవేవీ నెరవేరలేదు. ఇక హోంశాఖ కోసం కళా వెంకట రావు, అచ్చెన్నాయుడి మధ్య తీవ్ర పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం కళా వెంకటరావు ప్రమాణస్వీకారం చేసినా రాత్రి వరకూ పోర్టుపోలియో ప్రకటించకపోవడంతో ఎవ్వరికి హోం దక్కుతుందనే విషయంలో జిల్లాలో ఆసక్తిగా మారింది. ఒకవేళ కళా కే హోంశాఖ ఇస్తే కింజరాపు కుటుంబంపై ఆయన ఆధిపత్యానికి గండి పడుతుందనే చర్చ నడుస్తోంది. అలాగే ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసిన అచ్చెన్నాయుడికే హోంశాఖతో ప్రమోషన్ ఇస్తారని ఆయన అనుచర గణం గట్టిగా చెబుతోంది. ఎవ్వరికి ప్రాధాన్యం లభిస్తుందో చూడాలి మరి. -
ప.గో.జిల్లా టీడీపీలో అసమ్మతి జ్వాలలు
-
ట్రాన్స్ ఫార్మర్ల కష్టాలు
పైసలిస్తేనే మరమ్మతులు రవాణా ఖర్చూ రైతులే భరించాలి ప్రశ్నిస్తే నిబంధనల పేరుతో వేధింపులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్న వైనం విద్యుత్ శాఖ అధికారుల తీరుపై రైతుల అసంతృప్తి తాడిపత్రి : వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినా, చెడిపోయినా 24 గంటల్లో వాటి స్థానంలో మరొకటి కానీ, నూతన ట్రాన్స్ ఫార్మర్లు కానీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులది. రైతులు ఫిర్యాదు చేసిన వెంటనే సదరు ట్రాన్స్ ఫార్మర్ ను లైన్మెన్ స్వయంగా మరమ్మతుల కేంద్రానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో తరలించారు. మరమ్మతు చేయించి.. తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో అమర్చాలి. ఇందుకోసం రైతుల నుంచి రూపాయి కూడా వసులు చేయరాదు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా రైతులే స్వయంగా మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు కూడా వారే భరిస్తున్నారు. పోనీ ట్రాన్స్ ఫార్మర్ సకాలంలో మరమ్మతు చేసి పంపిస్తారా అంటే అదీ లేదు. సవాలక్ష కారణాలు చెబుతూ రైతులను తిప్పుకుంటున్నారు. రూ.వేలల్లో అధికారులకు, సిబ్బందికి ముట్టజెబితే గానీ పని కావడం లేదు. ఈలోపు ట్రాన్స్ ఫార్మర్ లేక నీటి సరఫరా ఆగిపోయి పంటలు ఎండిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాడిపత్రిలో రెండు మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. విద్యుత్ శాఖ తాడిపత్రి సబ్‌డివిజన్ పరిధిలోని యల్లనూరు, పుట్లూరు, తాడిపత్రి రూరల్, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్ పాడైతే రైతులే వాటిని మరమ్మతు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఆటోలు లేదా ఇతర వాహనాల్లో తీసుకొచ్చి.. ఇక్కడ డబ్బిచ్చి పని చేయించుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు కోసం రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. డబ్బు ఎందుకు ఇవ్వాలని అడిగితే.. మీరు అధిక విద్యుత్ వాడుతున్నారని, అసలు కనెక్షన్లే లేవని..ఇలా పలువిధాలుగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు. -
టీఆర్ఎస్లో నిరసన గళం!
జెండా పండుగ సందర్భంగా బయటపడిన విభేదాలు మూడు గ్రామాల్లో అదే పరిస్థితి గీసుకొండ : మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యాన జరుగుతున్న జెండా పండుగ సందర్భంగా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, నందనాయక్ తండాల్లో శని, ఆదివారాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యాన జెండా పండుగ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి బహిర్గతమైంది. తమకు సమాచారం అందించకుండానే జెండా ఎలా పండుగ నిర్వహించడం సరికాదని.. ముఖ్య ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే ఏకపక్షంగా నిర్వహించడంపై కొమ్మాల టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో జెండా పండుగను అక్కడ వాయిదావేశారు. ఇక ఆదివారం విశ్వనాథపురంలో జెండా పండుగకు వచ్చిన టీఆర్ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులను స్థానిక నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. పదవులు లేవు. పనులు లేవు, స్థాని క ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు.. కలవడానికి వెళ్లినా పట్టించుకోవడం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే స్వయంగా వారం రోజుల్లో వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని నాయకులు చెప్పడంతో స్థానికులు శాంతించారు. అలాగే, నందనాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జెండా పండుగ కొత్త సమస్యలకు తెర తీసినట్లయింది. కాగా, జెండా పండుగపై గ్రామాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలకంగా పని చేసిన వారికి గుర్తింపు లేకపోవడంతో వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. -
ప్రణాళిక లేకుండానే పనులా..?
పురోగతి లేదని అధికారులపై ధ్వజం ప్రతి వారం నివేదిక సమర్పించాలని ఆదేశం ఇందూరు: జిల్లాలో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులపై పనులపై కలెక్టర్ యోగితారాణా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని అధికారులపై మండిపడ్డారు. కార్యాచరణ ప్రణాళిక లేకుండానే పనులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ఆర్డబ్ల్యూఎస్, వాటర్‌గ్రిడ్ ఇంజినీర్లను ఆదేశించారు. మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ బుధవారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జూలై 29న నిర్వహించిన సమీక్ష నాటికి, ఇప్పటికి పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించడం లేదని మండిపడ్డారు. కనీసం ఏయే పనులు చేయాలో కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన పైపులైన్ల నిర్మాణానికి ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు సీసీరోడ్లు, బీటీరోడ్డు కట్ చేయాల్సి వస్తుందో స్పష్టంగా గ్రామాల వారీగా నివేదికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. పైపులైన్ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమయ్యే మెటీరియల్‌ను ముందస్తుగా నిర్మాణ సంస్థ నుంచి తెప్పించుకోవాలని సూచించారు. పనులు కాంట్రాక్టర్‌కు వదిలేస్తే కుదరదని, వారం వారం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పనుల పురోగతిని బట్టే ఇంజినీరింగ్ అధికారులకు జీతాలను విడుదల చేయాలని ఎస్ఈలను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న మిషన్ భగీరథ పనులపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. పెద్దరెడ్డిపేట, అర్గుల్, ఇందల్వాయి, మల్లన్నగుట్టల్లో చేపట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు వచ్చే మార్చి కల్లా కానున్నాయని యోగితారాణా వెల్లడించారు. మొత్తం 3,454 కిలోమీటర్ల పైపులైన్ పనుల్లో 901 కిలోమీటర్లకు సరిపడా పైపులు వచ్చాయని, వాటిలో 429 కిలోమీటర్ల పొడవు పైపులైన్ల నిర్మాణం పూర్తయినట్లు వివరించారు. అక్టోబర్ 31 నాటికి 121 గ్రామాల్లోని 60 వేల ఇళ్లకు ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు 718 కిలోమీటర్ల పైపులైన్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్రవిలేజ్ పైపులైన్ల నిర్మాణంతో పాటు ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసే నల్లా కనెక్షన్లు కూడా ఇవ్వాలని తెలిపారు. ఈ పథకంలో భాగంగా 100 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను నిర్మించాలని, అందులో 62 పనులు ప్రారంభయ్యాయని చెప్పారు. వారంలోపు మిగిలిన పనులను గ్రౌండింగ్ చేయాల, పనుల నాణ్యతను మానిటరింగ్ చేయాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ప్రజారోగ్య ఈఈ శ్రీనివాస్, డీఈఈలు, ఏఈలు, నిర్మాణ సంస్థ ఐహెచ్పీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
‘మహా’ విభజన
♦ కొత్త జిల్లాలపై ప్రభుత్వం స్పష్టత ♦ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి ♦ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో శివార్లు ♦ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ♦ జిల్లా యూనిట్‌గా విభజనకు పట్టు ♦ మూడు జిల్లాలు చేయాలని తీర్మానం ♦ పునర్విభజనలో మార్పులకు అవకాశం కొత్త జిల్లాలపై ప్రభుత్వ అంతరంగం బయటపడింది. జిల్లాల పునర్విభజనపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ప్రస్తుత జిల్లాను వికారాబాద్ కేంద్రంగా కొనసాగించేందుకు లైన్‌క్లియర్ చేసిన సర్కారు.. శివార్లలోని పది నియోజకవర్గాలను హైదరాబాద్, కొత్తగా ఏర్పాటుచేస్తున్న సికింద్రాబాద్ జిల్లాల్లో కలిపేందుకు మొగ్గు చూపింది. బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో జిల్లాల విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా, మండల, రెవెన్యూ డివిజన్ల విభజనకు సంబంధించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని తెలుసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ పరిశీలనలోని జిల్లాల మ్యాపులను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అందజేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై అధికారపార్టీ ప్రతినిధులు పెదవి విరిచారు. జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియను చేపట్టాలనే తమ అభ్యర్థనను పట్టించు కోకపోవడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత జిల్లాను మూడు ముక్కలుగా విభజించాలని, జిల్లాలోని ప్రాంతాలను ప్రతిపాదిత సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావుకు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా విభజన అంశం ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేదు. పునర్విభజనపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తాజా జాబితాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లా విభజనపై స్పష్టత రాకపోవడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని కేశవరావు స్పష్టం చేశారు. కొడంగల్ మనదరికే.. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్ (మహబూబ్‌నగర్)ను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అధికారయంత్రాంగం ఈ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌ను మాత్రమే ప్రతిపాదించ గా.. తాజాగా ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు మిగిలిన కోస్గి మండలాన్ని కూడా విలీనం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంగా ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మ హర్దశ పట్టనుంది. హైదరాబాద్ జిల్లాకు కేంద్రంగా ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. యాకుత్పు రా, మలక్‌పేట, చార్మినార్, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, అంబర్‌పేట, గో షామహల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగ ర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో కలిపి హైదరాబాద్ జిల్లా ను ప్రతిపాదించారు. ఇవేకాకుండా పొ రుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా క ల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లోని మాడ్గుల, ఆమన్‌గల్ మండలాలు రానున్నాయి. గచ్చిబౌలి కేంద్రంగా లష్కర్ జిల్లా సికింద్రాబాద్ కొత్త జిల్లాగా అవతరించనుంది. ఈ మేరకు సీసీఎల్ఏ రూపొందించిన మ్యాపును టీఆర్ఎస్ ప్రతినిధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ జిల్లా పరిధిలోకి రంగారెడ్డి జిల్లా ఉత్తర భాగాన ఉన్న ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సనత్‌నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పటాన్చెరు (రామచంద్రరావు మండలం) రానున్నాయి. ఈ జిల్లా కేంద్రంగా ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన గచ్చిబౌలిని ప్రతిపాదించారు. కొత్త మండలాలకు పచ్చజెండా కొత్తగా ఎనిమిది మండలాల ప్రతిపాదనలకు టీఆర్ఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కోట్‌పల్లి, ఎల్బీనగర్, మేడిపల్లి, దుండిగల్, గండిపేట, జ వహర్‌నగర్, మీర్పేట్, పెద్దఅంబర్పే ట్ మండలాల ఏర్పాటుకు ఓకే చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల ప్రతిపాదనలు.. రంగారెడ్డి జల్లా : జిల్లా కేంద్రం వికారాబాద్ : చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్‌పేట , షాబాద్, శంకర్పల్లి, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, యాలాల, బంట్వారం, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్, వికారాబాద్ హైదరాబాద్ జిల్లా : జిల్లా కేంద్రం ఇబ్రహీంపట్నం: హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆమన్‌గల్, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, అంబర్పేట్, ఆసిఫ్‌నగర్, బహదుర్‌పురా, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, సైదాబాద్ సికింద్రాబాద్ జిల్లా : జిల్లా కేంద్రం గచ్చిబౌలి : మల్కాజిగిరి, ఘట్కేసర్, కీసర, మేడ్చల్, శామీర్‌పేట్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, అమీర్‌పేట్, బాలానగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి. ఎవరేమన్నారంటే.. జిల్లాలోనే పునర్విభజన ప్రస్తుత జిల్లా పరిధిలోనే విభజన జరగాలి. ఇతర జిల్లాలో రంగారెడ్డి జిల్లాను విలీనం చేసే ప్రక్రియ సరికాదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఏకాభిప్రాయం సాధించాం వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొన సాగనుంది. ఈ జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్ మండలాలను కలపడానికి అంగీకరించాం. ఆ జిల్లా ప్రతినిధుల విజ్ఞాపన మేరకు కోస్గి మండలాన్ని కూడా అక్కున చేర్చుకుంటున్నాం. - పి.నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మూడుగా విభజించాలి జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలి. మూడు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనలకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ , సికింద్రాబాద్‌లో శివారు ప్రాంతాలను విలీనం చేయడం సహేతుకంగా లేదు. ఈ ముసాయిదాను సవరించాలని నివేదించాం. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
అసంతృప్తి చల్లారేనా?
రాజీనామా గళాన్ని విప్పిన కొంతమంది అసంతృప్తులు సీఎం సిద్ధును పదవి నుంచి తప్పించాలంటున్న మరికొందరు అసంతృప్తిని చల్లార్చేందుకు ‘ఆస్కార్’ ప్రయత్నాలు బెంగళూరు: పాలనను పరుగులు పెట్టించేందుకు సీఎం సిద్ధరామయ్య చేసిన మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణపై నిరసన సెగలు ఇంకా చల్లారడం లేదు. ఇటీవల మంత్రి పదవులను పోగొట్టుకున్న వారితో పాటు ప్రక్షాళనలో చోటు దక్కని ఎమ్మెల్యేలు సైతం సీఎం సిద్ధరామయ్య పై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. వీరంతా కలిసి సీఎంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మంత్రి పదవులను కోల్పోయిన అంబరీష్‌తో పాటు శ్రీనివాస ప్రసాద్, ఖమరుల్ ఇస్లామ్, బాబూరావ్ చించనసూర్తో పాటు మంత్రి మండలిలో స్థానాన్ని ఆశించి భంగపడిన మాలకరెడ్డి, ఎస్.టి.సోమశేఖర్ తదితరులు సీఎం సిద్ధరామయ్య పై గుర్రుగా ఉన్నారు. సీఎంను ఆ పదవి నుంచి తప్పిస్తే తప్ప వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. వీరంతా బెంగళూరులోని శ్రీనివాస ప్రసాద్ నివాసంలో బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెబల్‌స్టార్ అంబరీష్ ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, తాజా మాజీ మంత్రి బాబూరావ్ చించనసూర్ సైతం తన నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలతో చర్చించి రాజీనామా పై నిర్ణయం తీసుకుంటానని బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసమ్మతిని చల్లార్చే బాధ్యతలను అధిష్టానం పార్టీ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండజ్‌కు అప్పగించగా ఆయన బుధవారం మద్యాహ్నం తాజా మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ నివాసానికి చేరుకొని గంటపాటు చర్చించారు. ‘వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, అందువల్ల మీ సమస్య ఏదైనా సరే దాన్ని పార్టీ వేదికలపై చర్చించండి తప్పితే బహిరంగ వ్యాఖ్యలు చేయకండి’ అని ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్రీనివాస ప్రసాద్‌తో పేర్కొన్నట్లు సమాచారం. అంతకుముందు అసంతృప్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులతో చర్చల అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ....‘మంత్రి మండలి పునర్ వ్యస్థీకరణ సరిగా జరగలేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి మండలి పునర్వ్యవస్థీకరన జరిపారు. మంత్రి మండలి నుండి మమ్మల్ని తప్పించే సమయంలో ఒక్క మాట కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధ కలిగించింది. ఇప్పట్లో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసే ఆలోచన ఏదీ లేదు. కర్ణాటకను కాంగ్రెస్ ముక్త రాష్ట్రంగా కాంగ్రెస్ హైకమాండే మారుస్తుందేమో అనిపిస్తోంది. అయితే అందుకు అవకాశం కల్పించరాదనేదే మా అందరి అభిమతం’ అని పేర్కొన్నారు. -
‘మధ్యాహ్న భోజన’ తీరు అధ్వానం
రాష్ట్రంలో పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో భోజనాన్ని ఆలస్యంగా అందిస్తున్నారని, తల్లిదండ్రులెవరూ కూడా ఆ భోజనాన్ని రుచి చూడటంలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. చిత్తూరు జిల్లాలో ఒక ఎన్జీవో తమ వంట గది నుంచి దాదాపుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తోందని, దీనివల్ల రెండు గంటల ఆలస్యంగా పిల్లలకు భోజనం అందుతోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉందని తెలిపింది. 2015-16 సంవత్సరానికి గాను ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలును కేంద్ర మానవ వనరుల అభివృధ్ది మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేవలం 37 శాతం స్కూళ్లలోనే తల్లిదండ్రులు భోజనాన్ని రుచిచూడటం పట్ల కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించే సమయంలో ప్రతి స్కూల్లో కనీసం ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. -
అసంతృప్తి సెగ
కొందరు ముఖ్యనేతల తీరుతో రగిలిపోతున్న స్థానిక టీడీపీ నేతలు {పాధాన్యత ఇవ్వలేదంటూ ఆక్రోశం కుప్పం, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజకవర్గాల్లో తారస్థాయికి చేరిన వైనం జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతల తీరుపై స్థానిక నాయకులు రగిలిపోతున్నారు. నీరు-చెట్టు పనులు, అంగన్వాడీ పోస్టుల భర్తీల్లో నిజమైన కార్యకర్తలకు లబ్ధి చేకూరలేదనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. కొన్ని నియోజక వర్గాల్లో పర్సెంటేజీలు తీసుకుని పనులు, పోస్టులు కట్ట బెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం సైతం సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. తిరుపతి: జిల్లాలో కొందరు ముఖ్యనేతల తీరుపై స్థానిక టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టా నానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఆయన పీఏ వైఖరి దేశంపార్టీ నేతలకు చెంపపెట్టుగా మారినట్టు చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోలేదనే భావ న ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో చూపిన ప్రేమ ఇప్పుడు కనిపించడం లేదని, కనీసం ఫోన్ చేసి కూడా స్పదిండం లేదని ఆ పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అక్కడ పనులను పర్సెంజీలు తీసుకుని పక్క జిల్లాల వారికి కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి పార్టీ అధినేత కూడా చూసీచూడనట్టు వ్యవహారిస్తున్నారని అక్కడి ప్రజలు రగిలిపోతున్నారు. మిగతా నియోజకవర్గాల్లో.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నచోట ప్రధానంగా పార్టీ క్యాడర్ గుర్రు గా ఉంటోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆపార్టీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, నియోజకవర్గ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని అక్కడి ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీనికితోడు ఫోన్ చేసేందుకు కూడా అం దుబాటులో ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే తండ్రి కర్రపెత్తనంతో అక్కడి ముఖ్యనేతలు విసిగిపోయారు. ఇందు లో భాగంగానే ఆ నియోజకవర్గ ప్రధాన నేతలు ఇటీవల తిరుపతిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి బహిరంగ విమర్శలకు దిగడం దీనికి మరింత బలా న్ని చేకూర్చుతోంది. నీరు-చెట్టు పనుల అప్పగింత, అంగన్వాడీ కార్యకర్తల నియామకాల్లో ప్రధానంగా ఆ పార్టీ నేత ల్లో అసంతృప్తి తెచ్చినట్టు సమాచారం. తిరుపతిలో.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు స్థానిక నేతలను పిలవడం లేదనే అసంతృప్తి నగరంలోని నేతల్లో చోటుచేసుకుంటోంది. కార్పొరేషన్ పరిధిలోని బండ్లవీధిలో గత మంగళవారం డ్రైనేజీ కాలువ పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే సుగుణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు చైర్మన్ గ్రూపుల మధ్య సమన్యయం కొరవడినట్టు తెలుస్తోంది. ఈ గ్రూపుల మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకొవాల్సిదేనా.. పార్టీలో గ్రూపుల మధ్య విభేదాలు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం, ప్రతి పక్ష పార్టీ బలపడుతుండడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎదురీత తప్పదనే భావన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
జన్మభూమి కమిటీలపై బాబు అసంతృప్తి !!
విజయవాడ: జన్మభూమి కమిటీల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో శనివారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసే కమిటీలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపికను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జిల్లాల నుంచి ఆ కమిటీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జన్మభూమి కమిటీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే విధంగా టీడీపీ జిల్లా ఇంఛార్జ్ ల పనితీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా ఇంఛార్జ్ లు బాధ్యతలు తీసుకోవడంలేదని.. మొక్కుబడిల వ్యవహరించవద్దని నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జ్‌లకు బాధ్యతలు అప్పగించడం వల్ల పథకాలు లబ్దిదారులకు అందుతాయని మంత్రులు చంద్రబాబుకు సూచించారు. దీంతో విపక్షాల విమర్శలు, కోర్టు కేసుల నేపథ్యంలో కమిటీలు రద్దు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. -
తీసుకున్నందుకు తలబొప్పి!
♦ చంద్రబాబు నిర్వాకంపై విమర్శల వెల్లువ ♦ పార్టీ అన్నాక విలువలు పాటించాలనే అభిప్రాయం ♦ చెప్పిన సుద్దులు బాబు మరిచిపోయారా అంటూ ఎద్దేవా ♦ తెలుగుదేశం పార్టీలోనూ రగులుతున్న అసంతృప్తి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : అష్టకష్టాలు పడీ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఐదుగురు ప్రజా ప్రతినిధులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఆనందం అప్పుడే ఆవిరైపోతోంది. చంద్రబాబు, చినబాబు లోకేశ్‌లు గత కొద్దికాలంగా నిత్యం మంతనాలు సాగించి, అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి పదవులు ఇవ్వడానికి, అడిగినంత నగదు అందజేయడానికి, గనులు, కాంట్రాక్టు పనులు కట్టబెట్టడానికి, కేసులు తదితరాలు ఎత్తివేయడానికి ప్రభుత్వాధినేత సిద్ధం కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. దిగజారుడు రాజకీయాలపై మిత్రపక్షమైన బీజేపీ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కొన్ని విలువలున్నాయి. వాటిని ఏ పార్టీ అయినా పాటించాలి..’ అంటూ చంద్రబాబు వైఖరిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తప్పుబట్టారు. టీడీపీ తరహాలో తమ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.. తెలంగాణలో టీఆర్ఎస్లో చేరిన టీడీపీ వారిని చంద్రబాబు దుమ్మెత్తిపోయడం, మూడు వారాలు కూడా తిరక్కుండానే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ..‘సత్య హరిశ్చంద్రా.. ఇప్పుడేమంటావ్?’ అంటూ చంద్రబాబును నిలదీయడం టీడీపీ వర్గాల్లో సైతం చర్చకు తెరతీసింది. అధినేత వైఖరితో తలసాని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ సీనియర్లు పలువురు వాపోతున్నారు. వచ్చిన ఆ ఐదుగురితో పోయేదే తప్ప ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. చేరికలపై స్వపక్షంలో అసంతృప్తి, అన్నివైపుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు చూస్తుంటే.. చంద్రబాబు కోరి మరీ తలనొప్పి తెచ్చుకున్నారనే అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లోనే వినిపిస్తోంది. అంత ఆగత్యం ఏమొచ్చింది? ‘పార్టీకి తక్షణ ఇబ్బందులు కనిపించకపోయినా నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా ఫిరాయింపుల ప్రోత్సాహకునిగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది?’ అని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ‘పార్టీని ఎంతోకాలంగా నమ్ముకుని ఉన్న వాళ్లు ఎందరో ఉన్నారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన వారున్నారు. ఎమ్మెల్సీ తదితర పదవులకు అర్హులు మరెందరో ఉన్నారు. వారందరినీ వదిలేసి ఇతర పార్టీల వారిని అక్కునచేర్చుకుని పదవులు కట్టబెడతామనే హామీలు ఇవ్వాల్సిన పనేముంది?’ అని ఓ సీనియర్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘మొన్నటి ఎన్నికలకు రూ.20 కోట్లు ఖర్చయ్యింది. నెలకు కనీసం వడ్డీ కూడా రావడంలేదు. ఇసుక వ్యాపారం చేసుకుందామనుకున్నా కుదరడంలేదు. అంతోఇంతో చేసుకున్నా వచ్చిన దాంట్లో చినబాబుకు తప్పనిసరిగా వాటా పంపాలి. లేదంటే మాపై అవినీతి ముద్ర వేసేస్తారు. పోలీసులనైనా ఉసిగొల్పుతారు. ఏం మావి డబ్బులు కావా? పదవులకు మేం అర్హులం కామా?’ అని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు అసహనం వ్యక్తం చేశారు. ‘కడప, కర్నూలు జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు పార్టీ అధినేతకు తెలియవా? శిల్పా, పేర్ల వర్గాలు వద్దంటున్నా భూమా నాగిరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డిలను పార్టీలో ఎలా చేర్చుకుంటారు..’ అని సీమ జిల్లాలకు చెందిన నేతలు ప్రశ్నిస్తున్నారు. భూమా, దేవగుడిలకు ఇవ్వదలచుకుంటున్న పదవులేవో మాకే ఇస్తే ఇక్కడ మేం బలపడమా?’ అని వాపోతున్నారు. ‘పేర్ల శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ కన్నీటిపర్యంతమయ్యారంటే ఆమె ఎంత ఆవేదనకు లోనై ఉంటారో చంద్రబాబు గుర్తించలేరా?’ అని జమ్మలమడుగు నియోజకవర్గం సీనియర్ నేత ప్రశ్నించారు. జలీల్ఖాన్ను తీసుకునే విషయంలో తమను సంప్రదించకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడి బీజేపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగంగానే ప్రశ్నలు సంధించడం గమనార్హం. -
అజ్ఞాతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే
వరంగల్: ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వస్తున్న నేతలతో పార్టీ అధినాయకత్వం మంచి జోష్ మీద ఉంది. అయితే వలసలతో పార్టీలో ఉన్న నేతలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పార్టీలో వరుస చేరికలపై నేతలు అలక పూనుతున్నారు. తాజాగా వరంగల్ వెస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృఫ్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీలోకి వరుస చేరికలతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆవేదన చెందినట్లు సమాచారం. కార్పొరేషన్ టికెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని వినయ్ భాస్కర్ సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు, తాజాగా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. -
అంపైర్ కులకర్ణిపై అసంతృప్తి!
ఇండోర్: తొలి టి20లో భువనేశ్వర్ బౌలింగ్‌లో డుమిని అవుట్ నిరాకరణ... మొదటి వన్డేలో మోర్కెల్ బౌలింగ్‌లో ధావన్ అవుట్... ఈ రెండు నిర్ణయాల్లోనూ అంపైర్ వినీత్ కులకర్ణి పనితీరుపై అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టి20లో డుమిని ఆ క్షణంలో అవుటైతే ఫలితంగా భిన్నంగా ఉండేదని కెప్టెన్ ధోని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో కులకర్ణిపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలని భారత టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ‘అంపైరింగ్ బాగా లేదని అందరికీ అర్థమవుతోంది. అందుకే నేను అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నా. సిరీస్ చివర్లో ఇచ్చే నా నివేదికలో మా కెప్టెన్ విమర్శలు కూడా చేరుస్తాను’ అని జట్టు మేనేజర్ వినోద్ ఫడ్కే వెల్లడించారు. -
గడువు దాటితే నిధులకు బ్రేక్
గంట్యాడ: మండలంలోని తాటిపూడి రిజర్వాయర్ సాగునీటి కాలువల అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయకపోవడంపై జపాన్ బృంద సభ్యులు కాంట్రాక్టర్, సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపల పనులు పూర్తి చేయకపోతే నిధులను నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. జపాన్ నిధులు రూ.23కోట్లతో మండలంలో అభివృద్ధి చేస్తున్న తాటిపూడి ఆయకట్టు సాగునీటికాలువ పనులను జపాన్ బృంద సభ్యులు మరియామా,కిమోవా,ఢిల్లీకి చెందిన సిన్హాలు బుధవారం పరిశీలించారు. 2011లో మంజూరైన అయకట్టు కాలువల అభివృద్ధి పనులు గడువులోపల పూర్తి కాకపోవడంతో ఒకసారి గడువు అడిగారు. 2015 ఖరీఫ్ ప్రారంభం నాటికి ఇచ్చిన గడు వు పూర్తి అయినప్పటికీ పనులు 60 శాతం మాత్రమే జరిగాయి. దీనిపై మళ్లీ 2016 మార్చి వరకు సంబంధిత కాంట్రాక్టర్ గడువు కోరారు.ఈమేరకు వళ్లీ గడువు ఇస్తే పనులు పూర్తి చేయగలరా, లేదోనని జపాన్ బృంద సభ్యులు కాలువను పరిశీలించారు. మార్చివరకు కోరిన గడువును డిసెంబర్ వరకు మాత్రమే ఇస్తామని అప్పటిలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల నాన్యతపై వేరే సిబ్బంది పర్యవేక్షిస్తారన్నా రు. అనంతరం తాటిపూడి రిజర్వాయర్‌ను పరిశీలించి రిజర్వాయర్ నిర్మా ణం, రిజర్వాయర్ అయకట్టు,విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుక న్నారు. అనంతరం సీఈఓ శివరామ ప్రసాద్ మాట్లాడు తూ జపాన్ నిధులతో చేపట్టిన అభి వృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని బృంద సభ్యులు సూచించారన్నా రు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చే సేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ రమణమూర్తి,డీఈ అప్పలనాయుడు, ఏఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అక్టోబర్‌కు పనులు పూర్తిచేయాల్సిందే వేములాపల్లి (శృంగవరపుకోట): వేములాపల్లి గ్రోయిన్ పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని జపాన్ నుంచి వచ్చిన జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(జె.ఐ.సి.ఏ) సభ్యులు బుధవారం నిర్ద్వంద్వంగా చెప్పారు. తాటిపూడి రాజర్వాయర్ ఆధునికీకరణకు జపాన్ నిధుల్లో భాగంగా 2012లో రూ.24.64కోట్లు కేటాయించగా వాటిలో వేములాపల్లి ఆనకట్ట నిర్మాణానికి రూ.3.5కోట్లు కేటాయించారు. గత ఏడాది ప్రారంభించిన వేములాపల్లి గ్రోయిన్ పనులను జపాన్ బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. ముందుగా ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ ఆనకట్ట ఆయకట్టు, నిర్మాణం, పనులు ప్రగతి, ఆనకట్ట వల్ల గ్యాప్ ఆయకట్టు 2326 ఎకరాల్లో భాగంగా చివరి భూములకు నీరు అందింస్తామంటూ జపాన్ బృందానికి చెప్పారు. పనులకు సంబంధించిన రిపోర్టులు, డ్రాయింగ్లు చూపారు. ఈసందర్భంగా జపాన్ బృంద సభ్యులు మాట్లాడుతూ పనులు ఎప్పుడు పూర్తిచేస్తారని అడగ్గా ఇరిగేషన్ అధికారులు మార్చినాటికి పూర్తిచేస్తాం అంటూ చెప్పారు. దీంతో వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి పూర్తిచేయాలి. లేకుంటే ఫండింగ్ చేయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జపాన్ ప్రతినిధి బృందంతో పాటు ఇరిగేషన్ సీఈ శివరామప్రసాద్, ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ ఎం.వి.రమణ, డీఈ అప్పలనాయుడు, జేఈ శివరామకృష్ణ తదితర ఉద్యోగులు, కాంట్రాక్టరు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. -
ఆందోళనలో టీడీపీ మాజీ మంత్రి వర్గం
►వాడుకుని వదిలేస్తున్నారని ► టీడీపీపై అసంతృప్తి ►జెడ్పీ చైర్‌పర్సన్‌తో ►ముప్పు తప్పదన్న భావన ► వ్యూహాత్మకంగా ► దెబ్బతీస్తున్నారన్న అనుమానం జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఇవ్వలేదని కొందరు, చెప్పిన పనులు చేయడం లేదని మరికొందరు, తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఇంకొంతమంది నేతలు ఆవేదనలో ఉన్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వర్గీయుల పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. వ్యూహాత్మకంగా తమను దెబ్బ తీస్తున్నారని ఆసంతృప్తి చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అటు శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, ఇటు జిల్లాలో కురుపాం నియోజకవర్గాలకు తమకంటూ ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన శత్రుచర్ల విజయరామరాజు వర్గీయులు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్ ఓటమి పాలైనప్పటికీ పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడానికి తమ బలమే కారణమని చెబుతున్నారు. అయితే తమకు గుర్తింపు ఉండటం లేదని బాధపడుతున్నారు. బాహాటంగా చెప్పకపోయినా.... తమకు జరుగుతున్న అన్యాయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. పొరుగు జిల్లాలోని పాతపట్నం సంగతి పక్కనపెడితే కురుపాం నియోజకవర్గంలోనూ శత్రుచర్ల వర్గీయులు ఉనికి చాటుకోలేకపోతున్నారు. తమ నేతకు వస్తుందనుకున్న ఎమ్మెల్సీ రాకపోగా... జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి నియోజకవర్గంలో పెత్తనం చేస్తుండడం వల్లే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విజయరామరాజు వర్గీయులు భావిస్తున్నారు. పార్టీ పరంగా జగదీష్ పెత్తనం చేస్తుండగా, అభివృద్ధి పనుల విషయంలో జెడ్పీ చైర్పర్సన్ హవా సాగుతోందని అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ పరంగా జగదీష్‌తో ఇబ్బంది ఉండకపోయినా జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాత్రం తప్పనిసరిగా ముప్పు ఉంటుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏంటని వారు అంతర్మధనం చెందుతున్నారు. ఎస్టీ రిజర్వుడు కోటాలో కురుపాం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామన్న వ్యూహాత్మక ఎత్తుగడతోనే జెడ్పీ చైర్పర్సన్ పావులు కదుపుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. క్రమేపి ఎదిగేందుకు, నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు జెడ్పీ చైర్పర్సన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలో తమ వర్గాన్ని దెబ్బతీస్తున్నారన్న అనుమానంతో శత్రుచర్ల వర్గీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చెప్పిన పనులు చేయడం లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను సైతం ఖరారు చేయడం లేదని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో శత్రుచర్ల కేడర్ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. -
మెజార్టీ ఉన్నా...టీడీపీలో వణుకు
► ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో అభద్రతా భావం ► అసంతృప్తితో చేజారుతారేమోనని భయపడుతున్న నాయకులు ► కలవరం సృష్టిస్తున్న మారుతున్న రాజకీయ పరిణామాలు ► వైఎస్సార్సీపీలో బొత్స చేరిక ప్రభావం చూపుతుందేమోనని తర్జనభర్జన సాక్షి ప్రతినిధి, విజయనగరం: స్థానిక సంస్థల్లో మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ వణుకు పుడుతోంది. ఏడాది కాలంలో ఏం చేయాలేకపోయామన్న అసంతృప్తితో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కడ చేజారిపోతారేమోనని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీని మరింత డిఫెన్స్‌లో పడేశాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీలో చేరనుండటంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు టీడీపీలో ఉన్న ఆయన అనుయాయులు కూడా పార్టీ మారవ చ్చని, అదే జరిగితే తమకిఇబ్బంది తప్పదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని స్థానిక సంస్థల ప్రతినిధులు జారిపోకుండా ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక శిబిరం నిర్వహించే యోచనలో ఉన్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఇప్పటికే బలంగా ఉంది. చంద్రబాబు మోసపూరిత విధానాలు, హామీలు గాలికొదిలేయడం తదితర పరిణామాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. రోజురోజుకీ పార్టీ బలోపేతమవుతుంది. దీంతో భవిష్యత్ వైఎస్సార్సీపీదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉండి ఏం చేయలేకపోతామన్న బాధ కూడా టీడీపీ ప్రజాప్రతినిధుల్లో ఉంది. దీంతో కొందరు సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా వైఎస్సార్సీపీలో చేరనుండటంతో పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఇదే టీడీపీని భయాందోళనకు గురి చేస్తోంది. స్థానిక సంస్థల పరంగా మెజార్టీ బలం ఉన్నా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీలోకి జంప్ చేసి,ఆ పార్టీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచి, అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకులు అనేక మంది వైఎస్సార్సీపీలో చేరవచ్చన్న అభిప్రాయం ఉంది. ఇక్కడికి సాధించేదేమి లేదని, గతంలో అండగా నిలిచిన నేతతో కలిసి పనిచేయడమే మేలన్న ఆలోచనలో కొందరు ఉన్నారు. ఇప్పటికే బొత్సతో సంప్రదింపులు చేసినట్టు కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే పార్టీ బలం తగ్గడమే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్సీపీలో బొత్స చేరికపైనే టీడీపీ దృష్టి సారించింది. బుధవారం అశోక్ బంగ్లాలో జిల్లా ముఖ్య నేతల సమావేశంలో ఇదే విషయంపై చర్చించినట్టు తెలిసింది. జాగ్రత్తగా ఉండాలన్న నిర్ణయానికొచ్చారు. ముందుగా నియోజవర్గాల వారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలన్న సందేశం పంపించాలని మంత్రి మృణాళిని, ఇతర కీలక నేతలు నియోజకవర్గ నాయకులకు సూచించినట్టు తెలిసింది. అవసరమైతే ప్రత్యేక శిబిరం నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు తెలిపినట్టు సమాచారం.అందులో భాగంగా గురువారం విజయనగరం నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో ఎమ్మెల్యే మీసాల గీత, ఐవీపీ రాజు, సైలా త్రినాథరావు, బొద్దుల నర్సింగరావు తదితరులు సమావేశమయ్యారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన విషయాలపై చర్చించారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించేలా స్థానిక నేతలకు సమాచారం పంపించారు. -
సమాచారం త్వరగా ఇప్పించండి!
శాఖాధిపతుల నుంచి స్పందన ఉండడం లేదు ఫలితంగా ఉద్యోగుల పంపిణీ జాప్యమవుతోంది ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కమలనాథన్ లేఖ హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా రాష్ట్రాల శాఖాధిపతుల నుంచి అందకపోవడంపై కమలనాథన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల స్థానికత, ప్రత్యేక కేసుల్లో ఆప్షన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను, సీనియారిటీ సర్టిఫికెట్లను ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉద్యోగుల పంపిణీ వ్యవహారం మరింత ఆలస్యమవుతోంది. శాఖాధిపతులు ఉద్యోగుల సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. అనంతరం ఆయా పత్రాలను విభజన విభాగం వెబ్సైట్లో ఉంచుతుంది. కమలనాథన్ కమిటీ ఇప్పటికే 10 విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేసిం ది. మిగిలిన విభాగాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారం ఆయా శాఖాధిపతుల నుంచి ఆన్లైన్లో రావడం లేదు. ఈ నేపథ్యంలో కమలనాథన్.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులకు లేఖ రాశారు. శాఖాధిపతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని త్వరగా ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని విభాగాలకు సంబంధించి స్థానికత, ఇతర అంశాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అలాంటి సమాచారాన్ని సరి చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులపై ఉందని, ఈ క్రమంలో ఆలస్యం జరగకుండా సమాచారం అందించాలని సూచించారు. వాటిపై ఏకాభిప్రాయానికి రావాలి ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి, డెంటల్ కాలేజీ ఆస్ప త్రి, నర్సింగ్ కాలేజీలను రాష్ట్ర యూ నిట్లుగా పరిగణించి ఇరు రాష్ట్రాలకు ఉద్యోగులను పంపిణీ చేయాలని ఏపీ ప్ర భుత్వం కోరుతోంది. దీనిపై కమలనాథన్ స్పందిస్తూ ఇరు రాష్ట్రాల శాఖాధిపతులు ఒక అభిప్రాయానికి వస్తే అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొంది. భార్య, భర్తల విషయంలో కేంద్ర ఉద్యోగి ఒక రాష్ట్రంలోను మరో ఉద్యోగి మరో రాష్ట్రంలో ఉన్నా ఇద్దరినీ ఒకే రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు కమిటీ అంగీకరించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కావాల్సి ఉందని కమిటీ పేర్కొంది. సచివాలయంలో నాలుగో తరగతి ఉద్యోగులు 637 మంది ఉండగా అందులో ఏపీ స్థానికత గలవారు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 592 మంది తెలంగాణ వారేనని కమిటీ గుర్తించింది. నాలుగో తరగతి ఉద్యోగులను వారిచ్చే ఆప్షన్ల ఆధారంగా పంపిణీ చేయాలని మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల ఈ విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
అయినా అసంతృప్తే
సంతృప్తి అన్నది లేకుంటే మనిషిలో అశాంతి రగులుతుంది. మందులకు కూడా తగ్గని మాయరోగం అది. ఆశించడంలో తప్పులేదు. దక్కని దాని కోసం దిగులు పడటం ఒంటికి, ఇంటికి మంచిది కాదు. ఇది గ్రహించకనే నటి కాజల్ అగర్వాల్ అశాంతితో రగిలిపోతున్నారట. కోలీవుడ్ వరకు చూసుకుంటే కాజల్ పొజిషన్ మునుపటి కంటే బెటరే. తొలి రోజుల్లో ఎంతగా పోరాడి నా విజయాన్ని చేరుకోలేకపోయారు. కార్తీ సరసన నటించిన నాన్ మహన్ అల్ల చిత్రం ఆమె కోలీవుడ్ కెరీర్లో ఆనందాన్ని నింపిన చిత్రం. ఆ తరువాత తుపాకీ, జిల్లా చిత్రాలు సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలబెట్టాయి. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్ అంటూ నటిగా బిజీగానే ఉన్నారు. తమిళంలో ధనుష్, విశాల్‌తో నటిస్తున్నారు. అయినా కాజల్‌ను నిరాశనే వెంటాడుతోందట. కారణం ఏమిటబ్బా అని ఆరా తీస్తే అజిత్ తాజా చిత్రంలో అవకాశం దక్కించుకోవడానికి చాలానే ప్రయత్నించి విఫలం అయ్యారట. అజిత్ 56వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఈ చిత్రంలో హీరోయిన్ అవకాశం తనకే వస్తుందని కాజల్ ఆశించార ట. అది కాస్త చివరి దశలో నటి శృతిహాసన్ తన్నుకుపోవడమే కాజల్ అసంతృప్తికి కారణం అని తెలిసింది. -
‘థర్మల్’పై అచ్చెన్న అసంతృప్తి!
కోటబొమ్మాళి : కాకరాపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసంతృప్తితో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ప్లాంటు చుట్టూ ఉన్న పంట పొలాలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లింపులోనూ, ఉపాధి కల్పనలోనూ ప్లాంటు అధికారులు స్థానిక యువతకు మొండిచెయ్యి చూపి ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులకు అవకాశం కల్పించడ ంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో పవర్‌ప్లాంట్ చుట్టూ ఉన్న గ్రామాలకు సంబంధించిన కొంతమంది టీడీపీ సర్పంచ్‌లు, ఎమ్పీటీసీలు, ముఖ్యమైన కార్యకర్తలతో చర్చించి పవర్‌ప్లాంట్ పనులకు సహాయ నిరాకరణ చేయాలని సూచించినట్టు భోగట్టా. పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడిన సమయంలో మంత్రిని, తెలుగుదేశం నాయకులను పావులుగా వాడుకొని, ఇప్పుడు స్థానికులను, రైతులను విస్మరించడం ఏమిటని పలువురు దేశం నాయకులు ఆక్షేపిస్తున్నారు. వడ్డితాండ్ర గ్రామం వద్ద మత్స్యకారులు రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి థర్మల్ వాహనాలను అడ్డుకుంటుండగా, కోటబొమ్మాళి, కొత్తపేట మీదుగా భారీ వాహనాలు తరలించి ఆ రెండు గ్రామాలను దుమ్ము ధూళితో ఇబ్బంది పాలు చేస్తున్నా అభ్యంతరం చెప్పక పోవడానికి కారణం మంత్రిపై ఉన్న గౌరవమేనని కోటబొమ్మాళికి చెందిన దేశం నాయకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థర్మల్‌ప్లాంట్ అధికారులపై మంత్రి ఆగ్రహంతో ఉన్నారన్న విషయం తెలియడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కమలనాథుల్లో కలహాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రశాఖలో ఆధిపత్యపోరు నేపథ్యంలో కమలనాథుల మధ్య కలహాల కాపురంగా మారింది. రాష్ట్రశాఖ పనితీరుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా సైతం అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో కొత్త నియామకాలు సాగడం మరింత కల్లోలానికి దారితీసింది. రాష్ట్రంలో 60 వేల పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రానికి వందమంది చొప్పున 60 లక్షల మంది సభ్యులను చేర్పించడం ద్వారా తమిళనాడులో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చన్నది అమిత్‌షా వ్యూహంగా ఉంది. అయితే ఇప్పటి వరకు 30 లక్షల మంది మాత్రమే సభ్యత్వాన్ని స్వీకరించి ఉన్నారు. వాస్తవానికి ఈ నెలాఖరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగుస్తుండగా, లక్ష్యానికి 50 శాతం దూరంగా ఉన్నందున మరోవారం పొడిగించారు. రాష్ట్ర బీజేపీలో అనేక వర్గాలు ఉండగా, వీరిలో కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ బలమైన వర్గానికి నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు, ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజు మధ్య సఖ్యత లేదు. పొన్ రాధాకృష్ణన్ వర్గంలోనే మోహన్‌రాజులు కొనసాగుతున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల మధ్య విభేదాల వల్ల ఎవరి పంచన చేరితే ఏమో అనే మీమాంస కారణంగా తటస్తులు సభ్యత్వం తీసుకోవడంలో వెనకాడుతున్నారు. అంతేగాక ఇద్దరు ప్రధాన వ్యక్తుల కారణంగా పార్టీ బలహీన పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు సహజంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారై ఉండడం ఒక సంప్రదాయంగా వస్తోంది. 25 ఏళ్లకు ముందు ఆర్ఎస్ఎస్ నిర్వాహకుడిగా ఉన్న ఇల గణేషన్‌ను జాతీయ పార్టీ సేవలకు వినియోగించుకుంటున్నారు. అకస్మాత్తుగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నిర్వాహకుడిగా నియామకం జరిగినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కోసం పూర్తిగా పాటుపడేవారు బ్రహ్మచారులుగానే ఉండాల్సి ఉంటుంది. ఇల గణేశన్ కూడా నేటికీ బ్రహ్మచారిగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రశాఖలో సైతం మార్పులు చేర్పులు చేయడం ద్వారా బీజేపీని బలోపేతం చేయాలని అమిత్‌షా వ్యూహంగా ఉంది. అందుకే దక్షిణ తమిళనాడు ఆర్ఎస్ఎస్ నిర్వాహుకుడు కేశవ వినాయకంను రాష్ట్ర నిర్వాహకుడిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. పొన్, మోహన్‌రాజుల ఆధిపత్యాన్ని అదుపుచేసేందుకే కేశవ వినాయకంను వర్గాల మధ్యలోకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీకి మరో ఎడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఈ ఏడాది చివరిలోనే నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అమిత్‌షా అంచనాగా ఉంది. ఈ కారణంగా రాష్ట్ర బీజేపీ అధికారం దిశగా వాయువేగంలో ముందుకు సాగాలని అన్ని వర్గాల నేతలకు అమిత్‌షా నుంచి ఆదేశాలు అందాయి. -
పంచాయతీ.. పాడుగాను!!
అధికారుల ఉదాసీనత... ప్రశ్నించేతత్వం లేని పాలకవర్గం... పట్టించుకోని ఉన్నతాధికారుల నైజం... వెరసి దేవరకొండ నగర పంచాయతీ పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలన పేలవంగా మారడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీకి ఆదాయ వనరులున్నా... అభివృద్ధికి నిధులున్నా... వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. అనుమతి లేని వెంచర్లు, పంచాయతీ ఫైళ్ల మాయం, అనధికార నల్లా కనెక్షన్లతో తాగునీటి కష్టాలు, యోచన లేని పన్నుల విధానంతో ఒక్కసారిగా ప్రజలపై పడే పెను పన్నుభారం, మాయాబజార్ దుకాణాల వ్యవహారం, పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ఇలా సమస్యలు నగర పంచాయతీని పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాడి తప్పిన దేవరకొండ నగర పంచాయతీ వ్యవహారంపై ఈ రోజు నుంచి సాక్షి ప్రత్యేక కథనాలు... దేవరకొండ... ఒకప్పుడు గ్రామపంచాయతీ. ఇప్పుడు నగర పంచాయతీ.. కానీ పరిస్థితిలో కించిత్తు మార్పు లేదు. చెప్పాలంటే పంచాయతీ వ్యవస్థ కంటే నగర పంచాయతీ వ్యవస్థ దుర్భరంగా మారింది. నగర పంచాయతీ కమిషనర్, పాలకవర్గం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తాగునీటి కష్టాలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయి. దేవరకొండ పట్టణంలో సుమారు 40వేల జనాభా ఉండగా 3500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇది అధికారులు చెప్పే లెక్క. కాని అనధికారికంగా ఈ లెక్క 4వేలను మించిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకీ పరిస్థితి.. దేవరకొండకు కృష్ణా జలాలు సరఫరా అవుతుండగా దేవరకొండ మండలం పెండ్లిపాకల ప్రాజెక్టు నుంచి నిత్యం 10 లక్షల లీటర్ల నీరు దేవరకొండ నీటి సరఫరా సంప్‌కు చేరుతుంది. అదే సమయంలో చింతపల్లి మండలం నసర్లపల్లి వాటర్‌ప్లాంట్ నుండి సుమారు 25 లక్షల లీటర్లు ప్రతి నిత్యం సరఫరా అవుతుండగా రోజుకు 35 లక్షల లీటర్ల నీరు కొండకు చేరుతుంది. దీంతోపాటు అదనంగా పట్టణంలో ఉన్న పలుబోర్ల నుంచి వాడుకకు మరికొన్ని నల్లాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సుమారు 40 వేల జనాభా ఉన్న దేవరకొండ పట్టణంలో 35 లక్షల లీటర్ల నీటిని సరాసరిగా పంచితే ఒక్కో ఇంట్లో ఒక్కో వ్యక్తికి సుమారు 80 లీటర్ల నీరు అందాల్సి ఉంది. ఆ ప్రకారం దేవరకొండకు సరఫరా అవుతున్న నీటితో దేవరకొండ ప్రజలకు నిరంతరాయంగా నీరందించే అవకాశం ఉంది. కానీ దేవరకొండ ప్రజలకు కనీసం 10 రోజులకొకసారి కూడా నల్లా నీటిని అందించలేని పరిస్థితి ఉందంటే కేవలం అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ప్రణాళిక లేకపోవడంతో నీరు వృథాగా మారిపోతుంది. అనుమతి లేని నల్లా కనెక్షన్లు నీటిని దోచేస్తున్నాయి. అధికారులు చెబుతున్నట్లు పట్టణంలో 3500 నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెబుతున్నా అనధికారికంగా ఈ సంఖ్య మరో 500 కనెక్షన్లను పెంచుతుంది. నీటి కష్టాలు అన్నీ...ఇన్నీ కావు దేవరకొండ పట్టణంలో ప్రజలు నీటికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం పది పదిహేను రోజులకొకసారి కూడా కృష్ణా జలాలు సరఫరా కావడం లేదు. దీంతో పట్టణ ప్రజలు కూడా బోరుబావులు, నీటి ట్యాంకర్ల కొనుగోలుపై ఆధాపడుతున్నారు. ఇదిలా ఉండగా నెల రోజుల కాలంలోనే సుమారు 500 బోర్లకు పైగా వట్టిపోయాయి. అలాగే చాలామంది మళ్ళీ బోర్లు వేయించినప్పటికీ భూగర్భ జలాలు అడుగంటడంతో 500 నుంచి 600 ఫీట్ల మేర లోతు వేయించినా నీరు పడని పరిస్థితి ఉంది. దీంతో చాలా మంది ట్యాంకర్లను ఆశ్రయిస్తుండగా ఒక్కో ట్యాంకర్‌ను రూ. 500 నుంచి 600 వరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. నాలుగు పోర్షన్లు ఉన్న ఒక్కో ఇంటికి మూడురోజులకొకసారి ట్యాంకు నీటిని కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు నీటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కనీసం వాడుకోవడానికి కూడా నీరు లేక జనం అలమటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దేవరకొండలో సంప్ హౌస్‌లో బోర్లు ఇటీవల కాలిపోగా నీటికి అంతరాయం ఏర్పడుతుందని తెలిసినా అధికారులు తక్షణమే స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువుటద్దం. నగర పంచాయతీలో అదనపు బోర్లు వేయడానికి నిధులు వచ్చి ఉన్నా.. వాటిని ఖర్చు చేసేందుకు అధికారులు లేరన్న వంకతో చోద్యం చూస్తున్నారు. నీరు వృథా..రూ.లక్షలో హెచ్ఎండబ్ల్యూస్కు నీటి బకాయిలు అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్నా అధికారులు వాటిని తొల గించేందుకు నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. దీంతో కొంత నీరు వృధా అవుతుండగా దేవరకొండలో పైప్‌లైన్ వ్యవస్త అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ స్విచ్ వేస్తే ఎటు నీరు పోతుందో, ఎన్ని స్విచ్‌లు, ఎన్ని మోటర్లు ఉన్నాయో కూడా పంచాయతీ అధికారులకు సరిగ్గా తెలియదంటే అతిశయోక్తి లేదు. దీంతో నీరు వృథాగా పోతున్నది. నసర్లపల్లి నుంచి దేవరకొండకు నీరు వస్తుండగా చాలాచోట్ల నీరు పక్క దారిపడుతోంది. మధ్యలో ఉన్న గ్రామాలకు, తండాలకు కొంత దేవరకొండ పట్టణానికి వస్తున్న నీరు చేరుతుండగా మరికొంత లీకేజీలతో వృథాగా పోతున్నాయి. పైప్‌లైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో సంప్ నుంచి నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీన్ని సరిచేయాలన్న ఆలోచన కూడా అధికారులకు రావడం లేదు. గతంలో పైప్‌లైన్ వ్యవస్తను సరిచేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నా.. నిధులు, తీర్మానం వంటి ఆటంకాలు ఏర్పడటంతో ఆ ఊసే మరిచారు. సుమారు రోజు 35 లక్షల లీటర్ల నీరు దేవరకొండకు అందుతుండగా హిందుస్తాన్ మెట్రో వాటర్ స్కీం అధికారులకు కిలో లీటర్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా ప్రజలపై భారంగానే పడుతుంది. నల్లా బిల్లుల రూపంలో వేల రూపాయలు వసూలు చేస్తున్నా పంచాయతీ నీటిని అందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జెడ్పీటీసీల్లో అసంతృప్తి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌పై ఎమ్మెల్యేల ఆధిపత్యం విషయంలో అధికార పార్టీ జెడ్పీటీసీలు సైతం ప్రారంభం నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. తాజాగా జిల్లా పరిషత్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో కూడా ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వడంపై జెడ్పీటీసీలు అంతర్గతంగా రగులుతున్నారు. ఇటీవల కేంద్రం 13వ ఆర్థిక సంఘం నిధులను జెడ్పీకి విడుదల చేసింది. సుమారు రూ.17 కోట్లు జిల్లాకు వచ్చాయి. అయితే ఇందులో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్‌పై ఎమ్మెల్యేలు ఒత్తిడి తేవడంతో ఈ కేటాయింపులు తప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం నిర్వహిస్తున్న జెడ్పీ సమావేశంలో ఈ నిధుల కేటాయింపులకు ఆమోద ముద్ర వేయాలని నిర్ణయించారు. అదేవిధంగా జెడ్పీ సమావేశంలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం మాట్లాడుతుండటంతో తమ మండలాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాలేక పోతున్నామని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఒక్కరోజు జరిగే సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఏ సమస్యలు చర్చకు వచ్చేనో..! వేసవికి ముందే తాగునీటి కటకట.. గొంతులు తడవాలంటే కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి.. అర్హులకు అందని ఆహార భద్ర త కార్డులు.. పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు.. ఇలా జిల్లా వాసులు ప్రధాన సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 50కిపైగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని ఎజెండాలో పొందుపరిచినా, ప్రధానంగా పొంచి ఉన్న తాగునీటి సమస్యపైనే సభ్యులు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వందకు పైగా నివాసిత ప్రాంతాల వాసులు ఇప్పటికీ తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి పలుచోట్ల నిర్మించిన తాగునీటి పథకాలు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాగునీటి ఇబ్బందులకు తాత్కాలికంగానైనా పరిష్కారం చూపాలంటే కనీసం కొత్తగా ఒక్క బోరు కూడా తవ్వించలేని పరిస్థితి. వేసవిలో నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి వసతి కల్పించడంతో ఆర్డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటి సరఫరా) విభాగం సంసిద్ధంగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కాంటిజెన్సీ యాక్షన్ ప్లాన్ జాడ లేదు. ఈ తరుణంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చితే తాము గ్రామాల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుందని సభ్యులు సమావేశంలో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి జెడ్పీ సమావేశం ఒక్క రోజుతోనే సరిపెట్టారు. రైతుల సమస్యలపైనా.. సమావేశంలో రైతుల సమస్యలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నెల రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. చేతికందే దశలో పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్టాండింగ్ క్రాప్ లేదనే కారణంగా రైతులు పంట నష్ట పరిహారానికి నోచుకోలేదు. అలాగే పత్తికి మద్దతు ధర అందలేదు. వీటన్నింటిపై సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది. -
అసంతృప్తితోనే రాజీనామా
జారకీహోళీ నిర్ణయాన్ని మార్చుకుంటారు శాఖ మార్పుపై పరిశీలిస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బళ్లారి(కొప్పళ) : తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తితోనే మంత్రి పదవికి సతీష్ జారకీహోళీ రాజీనామా చేశారని, త్వరలోనే ఆ నిర్ణయాన్ని ఆయన మార్చుకుంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కొప్పళ జిల్లా కుష్టిగిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం విచ్చేసిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సతీష్ జారకిహొళీతో చర్చలు జరి పామన్నారు. ఆయన ఎలాం టి షరతులు విధించలేదన్నారు. ఆయనతో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవన్నారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో కచ్చితం గా తెలియలేదని, అయితే శాఖల మార్పు విషయమై రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన శాఖ మార్పు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ అబద్ధాలకోరని విమర్శించారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడంలో ఆయన మహాదిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవెగౌడ మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులు పొందడం వెనుక దేవెగౌడ ఆశీస్సు లు కాదని, అప్పట్లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తనను బలపరచడం వల్లనే ఆ పదవులు తనను వరించాయన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఎక్కడైనా మంచి స్థానం దొరుకుతుందన్నారు. గృహనిర్మాణ శాఖా మంత్రి అం బరీష్తో తనకు వాగ్వాదం జరిగినట్లుగా మీడియాలో వెలువడిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఇటీవల మీడియాలో ఊహాజనిత వార్తలు, కథనాలు వెలువడుతున్నాయన్నారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్ ఉదంతంలో తాను ‘రీడూ’ అనే పదాన్ని ఉపయోగించలేదని, అది హైకోర్టు ఉపయోగించిన పదమని పేర్కొన్నారు. -
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..
సీఎం తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి సీఆర్డీఏ చర్చలో నేను మాట్లాడదామంటే బాబు వారించారు భూములు కోల్పోతున్న రైతుల పక్షాన మాట్లాడిన జగన్ ప్రతిష్ట పెరిగింది హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లోని తన చాంబర్లో కేఈ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. గత శాసనసభ సమావేశాల సమయంలోనూ రాజధాని ఎంపిక విషయంలో మంత్రి పి.నారాయణ చేస్తున్న ప్రకటనలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మం త్రులు మాట్లాడాల్సిన అంశాలపై కూడా సీఎం స్పందిస్తున్నారని కేఈ పేర్కొన్నారు. మంత్రుల్లో కూడా యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయు డు లాంటి వారికి మాత్రమే అవకాశం వస్తోందన్నారు. మంత్రులు ఒకరిద్దరికి అవకాశం వచ్చినా సీఎం జోక్యం చేసుకొని ఇచ్చే ప్రసంగాలు ప్రతి పక్ష నేతకు ఉపయోగపడేలా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూ సమీకరణ, సేకరణలను కలగలిపి మాట్లాడారని, రెవెన్యూ మంత్రిగా తాను జోక్యం చేసుకుందామని భావించినా సీఎం వారించారని అసంతృప్తి వ్యక్తపరిచారు. నేను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదు...: విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత తాను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదని కేఈ పేర్కొన్నారు. అక్కడ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చన్నారు. నది ఒడ్డున రాజధాని ఏర్పాటులో కొంత ఇబ్బం ది ఉంటుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జగన్ ప్రతిష్ట పెరిగింది...: ప్రస్తుత సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ైవె .ఎస్.జగన్మోహన్రెడ్డి బాగా ‘షైన్’ అయ్యారని, ఇదే విషయాన్ని బయ ట కూడా చెప్పుకుంటున్నారని కేఈ వ్యాఖ్యానిం చారు. రాజధాని నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతుల తరఫున గళమెత్తిన జగన్మోహన్రెడ్డి వారిలో ప్రతిష్ట పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో కేం ద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో సీఎం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారం చేపట్టిన నేపథ్యంలో తన భాషను మార్చుకోవాలని హితవుపలికారు. కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంటూ.. ఏపీ కూడా గట్టిగా లాబీయిం గ్చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రభుత్వం, సీఎంను ఇరుకున పెట్టేలా మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు తలెత్తవా?’ అని ప్రశ్నించగా.. తాను మామూలుగానే ఈ వ్యాఖ్య లుచేశానని కేఈ చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడి వ్యవహారం పత్రికల్లో వచ్చింది కదా అపుడు లేని ఇబ్బంది ఇపుడు ఏమి వస్తుందని ప్రశ్నించారు. -
వెలుగుల నివేదికలపై అసంతృప్తి చీకట్లు!
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ప్రభుత్వంతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారా ...? అధికారులు ప్రతి రోజూ అందిస్తున్న నివేదికలపై నమ్మకం కుదరలేదా...? అంటే అవుననే ఆయా వర్గాల నుంచి సమాధానం వినిపిస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు ఇస్తున్న నివేదికలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.దాదాపు పక్షం రోజులుగా జరుగుతున్న పునరుద్ధరణపనులపై ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు వ్యక్తం చేశారు. ఆదివారం నాటికి విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నాలుగు మున్సిపాలిటీలతో పాటు 34 మండల కేంద్రాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. జిల్లావ్యాప్తంగా మరో 226 గ్రామాలకు మాత్రమే విద్యుత్‌సరఫరా పునరుద్ధరించవలసి ఉందని అధికారులు ప్రకటించారు. సోమవారం నాటికి పరిశ్రమలకు విద్యుత్‌సరఫరాను చేస్తామని కలెక్టర్ ప్రకటించగా.. ఈనెలాఖరు నాటికి వ్యవసాయ విద్యుత్ కనక్షన్లకు సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారలు చెబుతున్న లెక్కలపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులకు నమ్మకం కుదరలేదు. ఈనేపథ్యంలోనే వారికి అనుగుణంగా ఉండే బృందాలతో ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో దీపావళి ముందు రోజుకే విద్యుత్‌సరఫరాను పునరుద్ధరిస్తామని చేసిన విద్యుత్ శాఖ అధికారుల ప్రకటన ఎంతవ రకు ఇది అమల్లో సాధ్యమైందన్న విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఇంటిఇంటికి వెళ్లి సర్వే చేశారు. అయితే ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు చేసిన ప్రకటనలకు సరఫరా అవుతున్న తీరుకు పొంతన లేకపోవడంతో అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించి నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజు నుంచి ప్రతి రోజు ఈ విషయంపై పలు సర్వే బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు, స్పెషల్ బ్రాంచి యంత్రాంగం పని చేస్తోంది. ఇది కాకుండా జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహరాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజూ విద్యుత్ శాఖ అధికారుల నుంచి నివేదికలను రప్పించుకుని ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరా జరుగుతుందో లేదో తెలుసుకుంటున్నారు. ఇందుకోసం మండలాభివృద్ధి అధికారుల నేతృత్వంలో సంబంధిత గ్రామాల రెవెన్యూ అధికారుల ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచి అధికారులతో పాటు గ్రామ స్థాయిలో మండల అభివృద్ధి అధికారులు ప్రతి రోజు ఇస్తున్న నివేదికల ఆధారంగా విద్యుత్ శాఖ అధికారుల పని తీరును పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరైతే కచ్చితమైన సమాచారం ఇస్తారో వారికి పదోన్నత కల్పించి... తప్పుడు నివేదికలు ఇచ్చే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం లేకపోలేదు. ఇదంతా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో జరిగిన తరువాతనే చర్యలు ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది. -
అంతా తానై... అయిన వారికి దూరమై..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కానీ రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తన నియోజకవర్గంలోని పార్టీ నాయకులతోనే ఆమెకు పొసగడం లేదు. ఇక జిల్లా నేతలతో ఎలా నెట్టుకొస్తారో తెలియడం లేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆమె తీరుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. పార్టీ నేతలనే పట్టించుకో నప్పుడు మిగతా వారికేం చేస్తారని టీడీపీ నేతలు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే ఇంటి పోరుతో మంత్రి సతమత మవుతున్నారు. నియోజకవర్గ నేతలు దాదాపు ఆమెకు దూరమవుతున్నారు. పట్టించుకోని నేత చుట్టూ తిరగడం అనవసరమని అభిప్రాయానికొచ్చేశారు. ఇప్పటికే కొంతమంది నేతలు కలవడం మానేశారు. తమకు విలువ లేకుండా చేశారని ఇంకొంతమంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి కిమిడి మృణాళినికి, అక్కడి టీడీపీ నేతలకు ఏమాత్రం పొసగడం లేదు. వారి మధ్య స మన్వయం లోపించింది. ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి నెలకొన్నా.. ఇప్పుడు అది ముదిరి పాకాన పడింది. అంతా తానై మంత్రి వ్యవహరిస్తుండడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు వాపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని కనీసం గౌరవించ డం లేదని, అసలు ఆమెను కలిసే అవకాశం లభించ డం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ పెద్ద దిక్కుగా ఉన్న త్రిమూర్తులరాజును పూర్తిగా విస్మరించారని, ఓ మాజీ ఎమ్మెల్యే సూచనల మేరకు నడుచుకుంటున్నారని, తరుచూ పార్టీలు మారిన నేతను నమ్ముతున్నారే తప్ప పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారిని పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే అడుగు ముందుకేసి యూజ్ అండ్ త్రో పాలసీని అమలు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించినప్పుడు స్థానిక ఎంపీపీకి గానీ, జెడ్పీటీసీకి గానీ సమాచారం ఇవ్వరని, వారిని కలుపుకొని పర్యటించరని, తమ సమస్యలను, అభివృద్ధి పనుల విషయమై చెప్పుకోవడానికి ఎంపీపీ, జెడ్పీటీసీ స్థాయి నేతలకు అవకాశమివ్వ డం లేదని మంత్రిపై విమర్శలొస్తున్నాయి. కింది స్థాయి నాయకులకు తాము పనులు ఎలా చేయగలమని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాలతో ఎవరితో చర్చించగలమని మండల స్థాయి ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అంగన్వాడీలు, పాఠశాలలు, వసతి గృహా ల్లో తనే నేరుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నారని, తమకెటువంటి సమాచారం ఇవ్వనివ్వడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పరిస్థితులు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమతో ఒక్కసారైనా సంప్రదిస్తే వాస్తవ పరిస్థితులు చెప్పడానికి అవకాశం ఉంటుందని, అదేమీ లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహించినప్పుడు తమను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారని,కొన్ని సమావేశాలకైతే హాజరు కాని వ్వడం లేదని, సీక్రెట్ అని చెప్పి దగ్గరకు కూడా రాని వ్వడం లేదని ఆ పార్టీ మండల స్థాయి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి వేదికే లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చీపురుపల్లి, గరివి డి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక విసిగి వేశారి పోయిన గుర్ల నేతలు ఏకంగా రచ్చకెక్కారు. ఆమె తీరును బాహాటంగానే దుయ్యబట్టారు. గౌరవం లేని చోటికి వెళ్లడం మంచిది కాదని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. ఆమెకెంతసేపు కలెక్టర్‌కు ఆదేశాలి చ్చాం, ఎస్సీకి సూచనలిచ్చాం అనుకోవడమే తప్ప స్థానికులను పట్టించుకోవాలన్న ధ్యాస లేదని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వీరి బాటలోనే మిగతా మండలాల నాయకులు ఒకటి రెండు రోజుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని, తమ ఆవేదనకు వెళ్లగక్కే యోచనలో ఉన్నారు. మంత్రిని నమ్ముకుంటే అబాసుపాలైపోతామన్న భావనలో ఉన్నారు. -
టీడీపీలో కాపు నేతల అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్ పీఠానికి సామాజిక వర్గాలు ‘కాపు’కాస్తున్నాయి. ఇప్పటికే జెడ్పీ చైర్పర్సన్ పదవిని కాళింగ సామాజిక వర్గానికి కట్టబెట్టేందుకు టీడీపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలి సిందే. అయితే మంత్రివర్గ నిర్మాణం తర్వాత జిల్లా నుంచి తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కొరవడిందని అసంతృప్తి చెందిన కాపు సామాజికవర్గ నాయకులు జెడ్పీ పదవిపై కన్నేశారు. అధినేత చంద్రబాబుపై ఒత్తిడి ప్రారంభించారు. మరోవైపు ఆ పదవి చేజారిపోకుండా ఇప్పటికే హామీ పొందిన కాళింగ నేతలు ప్రయత్నాలు చేపట్టడంతో టీడీపీ అధినేతకు కొత్త తలనొప్పి ప్రారంభమైంది. జిల్లాలో కాపు, వెలమ, కాళింగ కులాల జనాభా అధికంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో వారికి ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ పదవిని కాళింగ సామాజికవర్గానికి ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఆ మేరకు చౌదరి ధనలక్ష్మి పేరును దాదాపు ఖరారు చేశారు. కాగా రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు, వెల మ సామాజికవర్గానికి చెందిన అచ్చెన్నాయుడులకు చోటు లభిస్తుందని భావించారు. కానీ ఒక్క అచ్చెన్నకే మంత్రి పదవి దక్కడంతో కాపు సామాజిక వర్గం చిన్నబోయింది. మంత్రి పదవి వెలమలకు, జెడ్పీ పీఠం కాళింగులకు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ నేత కళా వెంక ట్రావుకు మంత్రి లేదా స్పీకర్ పదవి రావాల్సి ఉన్నా.. ఆయన కుటుంబానికే చెందిన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వడంతో కళా అవకాశం కోల్పోయారు. ఇదే కారణంతో భవిష్యత్తులోనూ ఆయనకు పెద్ద పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దాంతో ఆయన వర్గం సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చి అధినేతపై ఒత్తిడి ప్రారంభిం చింది. అయితే చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొని ఓడించిన మృణాళినికి మంత్రి పదవి ఇవ్వక తప్పలేదని.. ఆమె విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేసినా వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు చెందినవారేనని.. ఆ విధంగా కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించి నట్లేనని కాళింగ, వెలమ సామాజిక వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ వాదనను కాపు నేతలు తిరస్కరి స్తున్నారు. మృణాళిని పదవి విజయనగరం జిల్లా కోటాలోకే వెళుతుందని, పదేళ్లపాటు పార్టీని నమ్ముకున్న శ్రీకాకుళం జిల్లా నేతలకు అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గ నేతలు ఇటీవల చంద్రబాబును కలిసి మొరపెట్టుకున్నారు. తాజాగా కొంతమంది కాపు నేతలు తమ సామాజిక వర్గానికి కనీసం జడ్పీ వైస్ చైర్మన్ పదవైనా ఇప్పించాలని కోరుతూ అందుకు సంతకవిటి మహిళా జెడ్పీటీసీ పేరును ప్రతిపాదిస్తున్నారు. వాస్తవానికి ఆ పదవి అంత ముఖ్యమైనదేమీ కాదు. అయినా ఏమీ లేనిదానికంటే కొంత నయం కదా అని వారు భావిస్తున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణ జరిగితే జిల్లా నుంచి తమ వర్గానికి అవకాశం కల్పించాలని, అలా కాని పక్షంలో కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవైనా ఇవ్వాలని జిల్లా కాపు నేతలు అధినేతను కోరుతున్నారు. ఇతర సామాజిక వర్గ నేతలు మాత్రం దీనికి అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో కింజరాపు, కళా వర్గాల మధ్య మొదటినుంచీ ఉన్న విభేదాలు ప్రభావం చూపుతున్నాయి. ఈ వర్గాలన్నీ తమ వాదనలకు మద్దతుగా చంద్రబాబుకు ఫ్యాక్సులో వినతులు పంపినట్లు సమాచారం. దీంతో పార్టీలో తలెత్తిన ఈ సామాజిక సంక్షోభాన్ని అధినేత ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
మీకు మళ్లీ మళ్లీ పెళ్లవుతోందా?!
స్వప్నలిపి పెళ్లి వయసుకు రాని వాళ్లకు, వృద్ధులకు ‘పెళ్లి’ అయినట్లు కల వస్తుంటుంది. ‘‘ఈ వయసులో ఇలాంటి కలలు ఏమిటి?’’ అని ఆశ్చర్యపోతుంటారు. కలలో ‘పెళ్లి’కి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా ఆమోదించాల్సి వస్తుంది. కారణం ఏదైనా ‘‘ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను? తీసుకోవాల్సింది కాదు...’’ ఇలా మనసులో ఆలోచనలు సుడి తిరుగుతుంటాయి. ఈ ఆలోచన తీవ్రత కలగా మారుతుంది. కలలో... పెళ్లి పందిరి చుట్టుపక్కల ఆనందం వెల్లివిరుస్తుంటుంది. ఇందుకు విరుద్ధంగా వరుడి (లేదా వధువు) ముఖంలో విషాదం తాండవిస్తుంటుంది. ఇక్కడ ‘పెళ్లి’ అనేది ఒక నిర్ణయమైతే, దాని మీద ‘అనిష్టం’ అనేది వరుడు (లేదా వధువు) ముఖంలో కనిపించే ‘విషాదం’. రెండు మన జీవితంలో పెళ్లి అనేది అపురూపమైన విషయం. ‘‘నా పెళ్లి ఇలా జరగాలి. అలా జరగాలి’’ అని భావుకంగా ఊహించుకుంటాం. పరిస్థితులు కుదరక... మన ఊహల్లో లాగా నిజజీవితంలో పెళ్లి ఉండకపోవచ్చు. ఆ రకమైన అసంతృప్తి ఒకటి సున్నితంగా బాధ పెడుతుంటుంది. ‘‘పెళ్లి గురించి గొప్పగా ఊహించుకున్నాను. కానీ, పేలవంగా జరిగింది’’ అనే భావన అసంతృప్తుల జాబితాలో ఏదో ఒక మూల చేరిపోతుంది. కాలక్రమంలో దీన్ని మరిచిపోతాం. కానీ, అసంతృప్తి జాబితాలో ఉన్న ‘పేలవంగా పెళ్లి’ మళ్లీ కలలోకి వస్తుంది. అందుకే...ఒకవైపు పెళ్లిసందడి కనిపిస్తున్నా దాన్ని పట్టించుకోకుండా మరోవైపు వరుడి ముఖంలో విషాదం కనిపిస్తుంటుంది. మూడు కలలో పెళ్లి కనిపించడమనేది ఒక కొత్త ప్రారంభానికి సూచనప్రాయమైన వ్యక్తీకరణ కూడా. -
ఓటరు నమోదుపై అసంతృప్తి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమంపై ఆయన కలెక్టర్లతో శని వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఓటరు నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూరు శాతం ఫొటోతో కూడిన ఓటరు జాబితా తో పాటు, అర్హులైన వారందరికీ ఓటు ఇవ్వాలన్న లక్ష్యాన్ని నీరుగార్చవద్దని ఆయన సూచించారు. ఓటరు నమోదు గడువు ఈ నెల 17 వరకు పొడిగించి నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రదానంగా పోలింగ్ బూత్‌ల వద్ద బీఎల్ఓల నంబర్లు సక్రమంగా అందు బాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఫోన్ నంబర్లు పని చేసినవి మాత్రమే అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. ఇం టింటి సర్వే చేసినప్పుడే డబుల్ ఎంట్రీ లు, మరణించిన వారి ఓటర్ల పేర్లను తొలగించాలని సూచిస్తున్నా సక్రమంగా జరగడం లేదన్నారు. బీఎల్ఓలు, ఎన్యుమరేషన్ అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయూలని ఆదేశించారు. ఓటరు నమోదుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిం చాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆయూ కేటగిరీల్లోని వయస్సు గల వారు నమోదు కావాలన్నారు. జిల్లా లో యువ ఓటర్లు నమోదు అంతంతమాత్రంగానే ఉండడంపై సీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. జిల్లాకు అసోం, కొల్కత్తా నుంచి ఈవీఎంలు వస్తాయని చెప్పారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. యువ ఓటర్ల నమోదు పెరిగేందు కు కళాశాలలతో పాటు అన్ని ప్రదాన కేంద్రాల్లో డ్రాప్‌బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు నియోజకవర్గానికో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమించడం జరిగిందన్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీలో ఇంటి నంబ ర్లు సక్రమంగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ, డీఆర్ఓ బి.హేమసుందర వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, ఆర్డీఓ జె.వెంకటరావుతో పాటు ఎస్డీసీలు, తహశీల్దార్లు, ఎన్నికల డీటీలు పాల్గొన్నారు. 17వరకు ఓటరు నమోదు ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 17వరకు కొనసాగుతుందని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ నెల 8, 15 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బంది ఓటరు నమోదు ఫారాలతో సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ఓటర్లు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.