
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..
సీఎం తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి
సీఆర్‌డీఏ చర్చలో నేను మాట్లాడదామంటే బాబు వారించారు
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన మాట్లాడిన జగన్ ప్రతిష్ట పెరిగింది
హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లోని తన చాంబర్‌లో కేఈ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. గత శాసనసభ సమావేశాల సమయంలోనూ రాజధాని ఎంపిక విషయంలో మంత్రి పి.నారాయణ చేస్తున్న ప్రకటనలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మం త్రులు మాట్లాడాల్సిన అంశాలపై కూడా సీఎం స్పందిస్తున్నారని కేఈ పేర్కొన్నారు. మంత్రుల్లో కూడా యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయు డు లాంటి వారికి మాత్రమే అవకాశం వస్తోందన్నారు. మంత్రులు ఒకరిద్దరికి అవకాశం వచ్చినా సీఎం జోక్యం చేసుకొని ఇచ్చే ప్రసంగాలు ప్రతి పక్ష నేతకు ఉపయోగపడేలా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఆర్‌డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూ సమీకరణ, సేకరణలను కలగలిపి మాట్లాడారని, రెవెన్యూ మంత్రిగా తాను జోక్యం చేసుకుందామని భావించినా సీఎం వారించారని అసంతృప్తి వ్యక్తపరిచారు.
నేను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదు...: విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత తాను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదని కేఈ పేర్కొన్నారు. అక్కడ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చన్నారు. నది ఒడ్డున రాజధాని ఏర్పాటులో కొంత ఇబ్బం ది ఉంటుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జగన్ ప్రతిష్ట పెరిగింది...: ప్రస్తుత సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ైవె .ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాగా ‘షైన్’ అయ్యారని, ఇదే విషయాన్ని బయ ట కూడా చెప్పుకుంటున్నారని కేఈ వ్యాఖ్యానిం చారు. రాజధాని నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతుల తరఫున గళమెత్తిన జగన్‌మోహన్‌రెడ్డి వారిలో ప్రతిష్ట పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో కేం ద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో సీఎం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారం చేపట్టిన నేపథ్యంలో తన భాషను మార్చుకోవాలని హితవుపలికారు. కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంటూ.. ఏపీ కూడా గట్టిగా లాబీయిం గ్‌చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రభుత్వం, సీఎంను ఇరుకున పెట్టేలా మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు తలెత్తవా?’ అని ప్రశ్నించగా.. తాను మామూలుగానే ఈ వ్యాఖ్య లుచేశానని కేఈ చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడి వ్యవహారం పత్రికల్లో వచ్చింది కదా అపుడు లేని ఇబ్బంది ఇపుడు ఏమి వస్తుందని ప్రశ్నించారు.