ke krishnamurthy
-
మద్యం మత్తులో కేఈ కుమారుడి హల్ చల్
కర్నూలు: టీడీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుని కుమారుడు మద్యం మత్తులో సుంకేసుల రోడ్డులో హల్చల్ సృష్టించాడు. కార్తీక్ హాస్పిటల్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తారు. ఇన్నోవా వాహనంలో హైదరాబాద్ జాతీయ రహదారి వైపు వెళ్తూ కార్తీక్ హాస్పిటల్ సమీపంలో వరుసగా 4 బైకులు, ఒక ఆటోను ఢీకొట్టాడు. అప్పటికీ వాహనం అదుపు కాక డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన తిరుమలేష్ కర్నూలులో కిరాణం సరుకులు తీసుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుకవైపు నుంచి ఇన్నోవా వాహనంతో ఢీకొట్టాడు. దీంతో అతను కింద పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. తిరుమలేష్ వెన్నెముక విరిగిపోవడమే కాక వీపు, తలకు గాయాలయ్యాయి. అలాగే ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన బెస్త నాగరాజు కూడా అదే మార్గంలో వెళ్తుండగా ఇన్నోవా వాహనంతో ఢీకొట్టడంతో గాయాలకు గురయ్యాడు. ఈయన టీజీవీ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే పుల్లారెడ్డి కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం(మెకానికల్) చదువుతున్న రాజేష్ కూడా ఇదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఇక బాలాజీ నగర్‌కు చెందిన షాషావలికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. వెనుక నుంచి ఆటోను ఢీకొట్టగా ఆటో ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సెకండ్ల వ్యవధితో వరుసగా మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వాహనదారులంతా మద్యం మత్తులో ఉన్న కేఈ తనయుడిని కారులో నుంచి బయటకు లాగి దేహశుద్ధి చేశారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు స్వయాన అన్న కుమారుడు కావడంతో విషయం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులందరినీ వేర్వేరు వాహనాల్లో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. పోలీసులు అక్కడికి చేరుకోక ముందే మద్యం మత్తులో ఉన్న అతడిని అక్కడినుంచి తప్పించారు. అయితే బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనకు కారణమైన ఇన్నోవా వాహనం డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా ఉండటంతో రికవరీ వాహనం సహాయంతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రమాదంలో ఇన్నోవా వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్ డీఎస్పీ నాగభూషణం ఆదేశాల మేరకు ఎస్ఐ గిరిబాబు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుపై సీసీ ఫుటేజీ సేకరించారు. అయితే ఇంతవరకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని డీఎస్పీ తెలిపారు. -
టికెట్‌కి వెల కడతారా?.. మా కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తారా?
పచ్చపార్టీ బాస్ డబ్బుకు తప్ప మనుషులకు విలువ ఇవ్వడని తెలిసిందే. ఎన్నికల్లో కూడా కార్యకర్తల మద్దతు ఉన్నవారికంటే డబ్బున్నవారికే ప్రాధాన్యమిస్తారు చంద్రబాబు. ఇప్పుడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కూడా ఒక అనామకుడికి నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చారంటూ కేడర్‌లో నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ అధ్యక్షుడ తీరుపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. బాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బందిపడుతున్న నేత ఎవరో మీరే చదవండి. ఆక్ పాక్ కరివేపాక్ నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినేత చంద్రబాబు మీద మండిపడుతున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న తమ కుటుంబాన్ని చంద్రబాబు కరివేపాకులా తీసేసారని కేఈ కుటుంబం మదనపడుతోంది. చంద్రబాబు తమను సంప్రదించకుండా.. ఎలాంటి సమాచారం లేకుండా డోన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు ధర్మవరం సుబ్బారెడ్డికి అప్పగించడం కెఇ కుటుంబం ఆందోళన చెందుతోంది. మాజీ మంత్రి కెఇ ప్రభాకర్ పుట్టిన రోజున తెలుగు తమ్ముళ్లు సెలబ్రేషన్స్ జరిపారు. ఇదే అవకాశంగా భావించిన కెఇ ప్రభాకర్ చంద్రబాబుపై ఘాటుగా స్పందించారు. చదవండి: (మరోసారి సంచలనాలకు వేదికగా హుజూరాబాద్) డోన్ టికెట్‌కు వెల కడతారా? ధర్మవరం సుబ్బారెడ్డిని డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఏమాత్రం సరికాదని చంద్రబాబు నిర్నయాన్ని నేరుగా తప్పుపట్టారు కేఈ ప్రభాకర్. ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి వెళ్ళాలంటే రాజకీయంగా అనుభవం ఉండాలి, కనీసం వార్డ్ మెంబర్‌గా కూడా అనుభవం లేని వ్యక్తిని.. కేవలం డబ్బున్నదన్న ఒకే కారణంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ మండిపడ్డారు. తమను పక్కన పెట్టి వేరే వ్యక్తిని అక్కడ నిలబెట్టడం ఏమాత్రం సరికాదని చంద్రబాబును ఉద్దేశించి స్పష్టంగా చెప్పేశారు ప్రభాకర్. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న కుటుంబాన్ని కాదని కేవలం డబ్బును చూసి తీసుకువస్తారా అంటూ అసహనం వ్యక్తంచేశారు. ఏ బాబు మాట విననంటే వినను అసలే పడిపోయిన పచ్చ పార్టీ ప్రతిష్టను చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత లోతుకు నెట్టేస్తున్నాయని కేడర్ ఆందోళన చెందుతోంది. చంద్రబాబు ఎవరిని తీసుకువచ్చినా.. తమకు సీటివ్వకపోయినా.. పత్తికొండ, డోన్ నియోజకవర్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తమ కుటుంబం నుంచి కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటించి తమ బాస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేశారు ప్రభాకర్. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలికి వేధింపులు
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్‌కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది.. రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (సీఎం జగన్ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలం) -
కోట్ల, కేఈ కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు
సాక్షి, కర్నూలు: ఎన్నికల్లో వరుస పరాజయాలను మూట కట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. బలమైన వైఎస్సార్సీపీని ఎదుర్కొనలేక కుదేలైన టీడీపీ లో తాజాగా ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో ముసలం మొదలైంది. జిల్లా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాల మధ్య మళ్లీ ఆధిపత్యపోరు రగిలింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు.. రెండేళ్ల క్రితం టీడీపీ వేదికగా కలిసి పని చేసినా వైఎస్సార్సీపీ ప్రభంజనంతో ఘోర ఓటమి ఎదురైంది. తాజాగా రాజకీయ ఉనికిలో భాగంగా ఎవరికి వారు ఆధిపత్యపోరుతో సొంత పార్టీలోనే కుంపటి రగిల్చారు. ఈ పంచాయితీ ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లడం, ఇరువర్గాలకు ఆయన చేసిన సూచనలతో ఇటు కోట్లతో పాటు కేఈ వర్గం కూడా డీలా పడింది. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా కోట్ల సుజాతమ్మ కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల అనంతరం కూడా పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అయితే ఇటీవల కేఈ ప్రభాకర్ ఆలూరు నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. హాలహర్వి మండలం అమృతాపురం మారెమ్మ గుడిలో మొక్కు ఉందనే కారణంతో భారీగా టీడీపీ శ్రేణులకు విందు ఇచ్చారు. ఈ విందు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల పరిచయ వేదికగా ప్రభాకర్ మలుచుకున్నారు. ఆపై దేవనకొండ మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆలూరుకు పదే పదే వస్తున్నారు. ఇక్కడి టిక్కెట్ ఆశిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నిస్తే ‘పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా!’ అని బదులిచ్చారు. దీంతో ఆలూరు టిక్కెట్ ఆశావహుల జాబితాలో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత కూడా ఈ నియోజకవర్గంలోని కీలక నేతలను పిలిపించుకుని మాట్లాడటం, వచ్చే ఎన్నికల్లో తాను ఆలూరు బరిలో ఉంటానని, అందరూ సహకరించాలని కోరుతున్నారు. కోట్ల కుటుంబానికి ఒక సీటే? కేఈ ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో సుజాతమ్మ చంద్రబాబును కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులు వివరిస్తూ ఆలూరు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆలూరులో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీ తరఫున ఆయన జోక్యాన్ని అరికట్టేలా ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. దీనికి చంద్రబాబు బదులిస్తూ ‘ఆలూరు కంటే మీకు డోన్ బాగుంటుందని, డోన్ బాధ్యత మీకు అప్పగిస్తా’నని చెప్పినట్లు సమాచారం. 2004లో డోన్ ఎమ్మెల్యేగా గెలిచావని, నియోజకవర్గంలో పరిచయాలు కూడా ఉన్నందున డోన్ బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. అయితే ఎంపీగా తన భర్త కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి, ఆలూరు అయితే పార్లమెంట్‌కు కూడా కలిసొస్తుందని చెప్పినా.. చంద్రబాబు ఆమె మాటను పెడచెవిన పెట్టి డోన్‌ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆయన మాటల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోట్ల కుటుంబానికి డోన్ ఇస్తే సూర్యప్రకాశ్‌రెడ్డి, సుజాతమ్మలో ఎవరు నిలబడినా పార్టీకి అభ్యంతరం లేదని, ఆ కుటుంబానికే ఒక సీటు మాత్రమే అనేది తేటతెల్లమవుతోంది. కేఈ ప్రతాప్‌కు టిక్కెట్టు లేనట్టే.. డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019లో కేఈ ప్రతాప్ పోటీ చేశారు. 2014 ఎన్నికలకు ముందు వ్యాపారవేత్తగా ఉన్న ప్రతాప్ ఆర్థికంగా బాగా బలపడిన తర్వాత రాజకీయాలపై ఆసక్తి ఏర్పడి డోన్ టిక్కెట్ ఆశించారు. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సోదరుడే కావడంతో ఆయన ప్రమేయంతో డోన్ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే రెండుసార్లు వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2024లో కోట్ల కుటుంబానికి డోన్ టిక్కెట్ ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉండటంతో ప్రతాప్‌కు టిక్కెట్టు దక్కనట్లేనని తెలుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం.. కేఈ, కోట్ల కుటుంబాల మధ్య నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తోంది. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాం నుంచి కోట్ల కుటుంబం కాంగ్రెస్‌లో, కేఈ కుటుంబం టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్యప్రకాశ్‌రెడ్డి రాజకీయ ప్రత్యామ్నాయం లేక విధిలేని పరిస్థితిలో టీడీపీలో చేరారు. దీంతో కేఈ, కోట్ల కుటుంబాలు ఒకేపార్టీ వేదికగా పనిచేయాల్సి వచ్చింది. అయితే రెండేళ్లలోనే తిరిగి రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. ఇప్పటికే జిల్లాలోని రెండు ఎంపీ, 14 అసెంబ్లీ స్థానాల్లో ఘోర ఓటమితో టీడీపీ ఉనికి లేకుండా పోయింది. దీనికి తోడు అన్ని మునిసిపాలిటీలు, అన్ని మండల పరిషత్‌లతో పాటు జిల్లా పరిషత్ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రాజకీయ ప్రయాణం సాగిస్తోన్న తెలుగు తమ్ముళ్లకు కేఈ, కోట్ల కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆశించిన టిక్కెట్లు దక్కనపుడు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీలో ఉంటూ, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని, అవి ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత 20 ఏళ్లలో టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఫలితాలు సాధించలేదని, కర్నూలు జిల్లాలో అత్యంత బలహీనంగా టీడీపీ ఉందని, ఎవరు ఏ స్థానం ఆశించినా, ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినా ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కర్నూలులో టీడీపీకి షాక్..
-
కర్నూలులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ..!
సాక్షి, కర్నూలు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీకి మనుగడ లేదని విమర్శించారు. ఓ బీజేపీ నాయకుడి మాటలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారని... కనీసం తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని దుస్థితిలో పార్టీ ఉందని మండిపడ్డారు. త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. (కడపలో టీడీపీకి మరో బిగ్‌షాక్) ఇక కర్నూలుతో పాటు అనంతపురం జిల్లాలోనూ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామిని బాల టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు దళితులను పక్కన పెడుతున్నారనే మనస్తాపంతో పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరగుతోంది.(టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలోకి కరణం వెంకటేశ్) టీడీపీకి మరో షాక్.. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే -
జిల్లాలో హైట్రిక్ వీరులు..
సాక్షి, కర్నూలు (అర్బన్) : హ్యాట్రిక్... క్రికెట్, సినిమా, పాలిటిక్స్ ... ఇలా ఏ రంగంలోనైనా ఈ ఘనత సాధిస్తే చరిత్రలో నిలిచిపోతారు. కర్నూలు జిల్లాలో 1952 నుంచి 2009 వరకు జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పలువురు వరుసగా మూడు సార్లకు పైగా ఎన్నికై చరిత్రలో నిలిచిపోయారు. వారిలో భూమా నాగిరెడ్డి, శాసనసభకు సంబంధించి బుడ్డా వెంగళరెడ్డి, వి రాంభూపాల్‌చౌదరి, బీవీ సుబ్బారెడ్డి, కర్రా సుబ్బారెడ్డి, కేఈ క్రిష్ణమూర్తి, ఎస్వీ సుబ్బారెడ్డి, దామోదరం మునిస్వామి, ఎం శిఖామణి, బీవీ మోహన్‌రెడ్డి, కే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. అయితే పలువురు పార్లమెంట్ సభ్యులు, శానససభ్యులు ఐదు సార్లకు పైగా ఎన్నికైనా, వారు వరుసగా విజయం సాధించలేక పోయిన నేపథ్యంలో వారు హ్యాట్రిక్ లీడర్స్‌గా మిస్సై పోయారు. వి. రాంభూపాల్‌చౌదరి కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వి రాంభూపాల్‌చౌదరి 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కాంగ్రెస్ అభ్యర్థి దావూద్‌ఖాన్‌ను ఓడించారు. అలాగే 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కే నాగిరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎంఏ గఫూర్‌ను ఓడించారు. భూమా నాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై విజయం సాధించారు. అలాగే 1998, 1999లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు. బుడ్డా వెంగళరెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం శ్రీశైలం) నుంచి 1978, 1983,1985,1989 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దివంగత బుడ్డా వెంగళరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా వరుసగా టీ రంగసాయి, బీజే రెడ్డి, జి నాగలక్ష్మిరెడ్డి, శివరామిరెడ్డిలను ఓడించారు. బీవీ సుబ్బారెడ్డి కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1955లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బీవీ సుబ్బారెడ్డి 1962,1967,1972 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా గెలుపొందారు. కాగా 1962, 1972లో బీవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేఈ కృష్ణ్ణమూర్తి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి 1978లో ఇందిరా కాంగ్రెస్, 1983లో కాంగ్రెస్, 1985లో తెలుగుదేశం, 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. అలాగే 2009లో డోన్ నుంచి, 2014లో పత్తికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. కర్రా సుబ్బారెడ్డి కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత కర్రా సుబ్బారెడ్డి వరుసగా 1985, 1989, 1994 వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బీ రామస్వామిరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డిపై విజయం సాధించారు. ఎం. శిఖామణి కోడుమూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత ఎం శిఖామణి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థులు బంగి అనంతయ్య, వై జయరాజు, ఆకెపోగు ప్రభాకర్‌ను ఓడించారు. ఎస్వీ సుబ్బారెడ్డి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థులు పి. శేషిరెడ్డి, కె. సాంబశివారెడ్డి, పి. నీరజారెడ్డిని ఓడించారు. బీవీ మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి టీడీపీ ఆవిర్భావం 1983 నుంచి వరుసగా 1985, 1989, 1994, 1999 వరకు విజయం సాధిం చారు. ఈయన చేతిలో హనుమంతరెడ్డి, దేవేంద్రగౌడు, ఎంఎస్ శివన్న,కేశవరెడ్డి ఓటమి చెందారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కే చెన్నకేశవరెడ్డి 2004, 2009, 2012లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రాజకీయ భీష్ముడైన బీవీ మోహన్‌రెడ్డిని ఓడించారు. రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, ఒకసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. -
కేఈ, కోట్ల కుటుంబాల మధ్య సీట్ల ఫైట్
సాక్షి, కర్నూలు: ఏపీలో ఎన్నికలకు మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో టీడీపీలో విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. పలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ సీట్ల కేటాయింపు విషయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. డోన్ సీటు తమకే కేటాయించాలని కోట్ల సుజాతమ్మ పట్టుబట్టారు. దీంతో ఆ సీటుపై తమకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్న కేఈ కుటుంబం తీవ్ర అసహనానికి గురవుతోంది.(కేఈ కుటుంబానికి రెండు సీట్లు) దీంతో కర్నూలులో కేఈ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఈ ప్రతాప్ హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. చంద్రబాబు బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేఈ వర్గీయుల్లో కలవరం మొదలైంది. కాగా, కేంద్ర మాజీ మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. -
ఉప ముఖ్యమంత్రి కేఈకి తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తీరని అవమానం జరిగింది. స్వయానా తన శాఖ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి కూడా ఆయనకు సరైన ఆహ్వానం లేకుండా చేశారు. టీడీపీలో సీనియర్‌నేత, బీసీవర్గానికి చెందిన కేఈని కనీసం పట్టించుకోకుండానే గురువారం శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముగించారు. దీనిపై బీసీ వర్గాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ బీసీ నాయకుడికే తెలుగుదేశం పార్టీలో కనీస విలువ దక్కడం లేదని, ఇక సామాన్య బీసీ నేతలకు విలువేముంటుందని దుయ్యబడుతున్నారు. రాజధాని నిర్మాణంలోనూ, రెవెన్యూ బదిలీలల్లోనూ కేఈని పక్కన పెట్టడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. పార్టీలో బీసీ నేతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందంటూ విమర్శలు గుప్పించారు. తనకు జరిగిన అవమానంపై కేఈ కృష్ణమూర్తి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉన్నతాధికారులను ప్రభుత్వ పెద్దలు వెనుకేసుకొస్తుండటం వల్లనే తనలాంటి సీనియర్లకు సైతం కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆయన బాధ వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన వెంకటపాలెం సమీపంలో టీటీడీకి 25 ఎకరాలను ఎకరా రూ.25 లక్షల చొప్పున విక్రయించింది. ఈ స్థలంలో ఆలయం నిర్మాణానికి టీటీడీ అధికారులు భూకర్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మరికొందరు టీడీపీ ముఖ్యులను ఉన్నతాధికారులు స్వయంగా ఆహ్వానించారు. దేవదాయ శాఖ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిని మాత్రం పట్టించుకోలేదు. సాధారణ నాయకులకు పంపిన రీతిలో కిందిస్థాయి అధికారితో ఒక ఆహ్వానపత్రాన్ని పంపించి చేతులు దులుపుకొన్నారు. సచివాలయం పక్కనే జరుగుతున్న ఈ కార్యక్రమానికి తమ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి వస్తున్నారా? లేదా? అని కూడా ఉన్నతాధికారులు వాకబు చేయలేదు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులు రాజధానిలోనే ఉన్నా కేఈకి ఏర్పాట్లపై సమాచారం ఇవ్వలేదు. సంబంధిత శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కేఈ ఎందుకు రాలేదన్న అంశాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. కేఈ పట్ల సీఎం చంద్రబాబు చిన్నచూపు చూడడం, అధికారులు అవమానించడం గతంలో కూడా పలుమార్లు జరిగింది. మరో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కూడా ఇలాంటి అవమానాలే పలుమార్లు ఎదురయ్యాయి. తన శాఖకు సంబంధించి డీజీపీ కార్యాలయంలోని టెక్ భవన్ ప్రారంభోత్సవానికి కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించి ఉన్నతాధికారులు హోంమంత్రిని అవమానించారు. ఎందుకు ఈ శాఖ నాకు: కేఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి కేఈ వచ్చిన సందర్భంలోనూ ఉన్నతాధికారులు ఆయన్ను పట్టించుకోలేదు. భూకర్షణ కార్యక్రమానికి కేఈ వెళ్లని విషయం తెలుసుకొని మీడియా ప్రతినిధులు ఆయనతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలోని కొందరు అధికారులు ప్రభుత్వాన్నే శాసిస్తున్నారన్నారు. వారెన్ని ఆగడాలు చేస్తున్నా అనేక ఆబ్లిగేషన్లు ఉండడం వల్లనే ప్రభుత్వ పెద్దలు ఆ అధికారులను దారికి తేవడం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం సీఎంకు ఫైలు పంపి 3 నెలలైనా పరిష్కారం కాలేదన్నారు. దేవదాయ శాఖను ఎందుకు తీసుకున్నానా అనిపిస్తోందని, అనేక సందర్భాల్లో దీన్ని వదులుకోవాలని కూడా అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా కేఈ వ్యాఖ్యలు ప్రసారమాధ్యమాల్లో రావడంతో సీఎం, సీఎంవో అధికారులు హడావుడి చేశారు. టీటీడీ ఈఓ, జేఈఓలను పిలిచి మాట్లాడారు. అయితే తాము మంత్రికి కిందిస్థాయి అధికారితో ఆహ్వానాన్ని పంపామని సీఎంఓ అధికారులకు వారు వివరించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కొత్త రాష్ట్రంలో ఎలాంటి సందర్భంలోనూ బలహీన వర్గాలకు చోటు కల్పించిన చరిత్ర సీఎం చంద్రబాబుకు లేదు. రాజధానిలో శ్రీవారి ఆలయం భూకర్షణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కూడా అయిన కేఈ కృష్ణమూర్తిని ఆహ్వానించకపోవడానికి కారణం బలహీనవర్గాలను అవమానించే ఉద్దేశమే. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలోనూ బలహీన, దళిత, మైనార్టీ నాయకులకు చోటు కల్పించలేదు. రాజధాని భూ సమీకరణ కమిటీలోనే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చోటు కల్పించలేదు. బలహీనవర్గాల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారు. – వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్థసారథి -
డిప్యూటీ సీఎం కేఈకి అందని ఆహ్వానం
-
అందని ఆహ్వానం.. డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి!
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో టీటీడీ వారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈకి ఆహ్వానం అందలేదు. దేవాదాయశాఖ అధికారులు కూడా ఆయనకు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూఆకర్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఏడు ఎకరాల్లో రూ. 150 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఇక్కడ నిర్మించనుంది. అయితే, పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం, కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కేఈ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. -
విశ్వాస ఘాతకుడు కేఈ
డోన్: డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విశ్వాస ఘాతకుడని డోన్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నట్లు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక జిల్లాపరిషత్ అతిథి గృహంలో శనివారం ప్యాపిలి, డోన్ జెడ్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి, శ్రీరాములుతో కలిసి బుగ్గన విలేకరులతో మాట్లాడారు. తనను మాజీ ఎమ్మెల్యేగా చేయడమే జీవిత లక్ష్యమని ఇటీవల కేఈ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. తాను మాజీ కావాలంటే ప్రజల చేతుల్లో ఉందే తప్ప.. కేఈ కుటుంబీకుల చేతుల్లో లేదనే వాస్తవాన్ని డిప్యూటీ సీఎం గ్రహించకపోవడం విచారకరమన్నారు. స్థాయి దిగజారి మాట్లాడడాన్ని బట్టి చూస్తే ఆయన మానసికస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు. ఏరుదాటాక బోడిమల్లన్న... ఆరుసార్లు ఎమ్మెల్యేగా కేఈని గెలిపించి.. రాష్ట్రంలో అత్యున్నత పదవి చేపట్టేందుకు కారణమైన డోన్ ప్రజలను డిప్యూటీ సీఎం నట్టేట ముంచారని బుగ్గన విమర్శించారు. డోన్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి.. తన కుమారుడిని ఎమ్మెల్యేగా చేసేందుకు పత్తికొండకు మకాం మార్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేరన్నారు. కేఈ వైఖరి ఏరుదాటక ముందు ఏరుమల్లన్న ఏరుదాటక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ పాపం మీది కాదా? పట్టణంలో నాయీబ్రాహ్మణుల బేస్‌మట్టాలను దౌర్జన్యంగా ఆక్రమించి టీడీపీ నాయకులు ఇళ్లు కట్టుకున్న విషయంపై కేఈ ఏనాడైనా నోరు మెదిపారా అని బుగ్గన నిలదీశారు. గంగపుత్రుల మాన్యాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకులను మందలించిన పాపాన పోలేదన్నారు. టైలర్స్ కాలనీ, పేరంటాలమ్మ, మాన్యం భూముల్లో నిరుపేదలు నిర్మిస్తున్న బేస్ మట్టాలను దౌర్జన్యంగా తొలగించడంపై కేఈ ఎందుకు మాట్లాడడంలేదో సమాధానం చెప్పాలన్నారు. సాయిబాబా గుడి స్థలంలో కొంతభాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి ఆ సొమ్మును గుడి నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నామని ప్రకటించడం వాస్తవం కాదా అన్నారు. ఇవన్నీ చాలవంటూ శివారు ప్రాంతా ల్లోని వంకలు, వాగులను సైతం టీడీపీ నాయకు లు ఆక్రమిస్తుంటే కేఈ ఎందుకు అడ్డుకట్ట వేయలేదని బుగ్గన ప్రశ్నించారు. టెండర్ల కోసం కక్కుర్తిపడి విపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను టీడీపీ నాయకులు దారుణంగా చంపేందుకు ప్రయత్నిస్తే కేఈ నోరు మెదపలేదన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి దమ్ము, ధైర్యం, నిజాయితీ ఉంటే చేసిన తప్పులను అంగీకరించి నియోజకవర్గ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలన్నారు. అవినీతి పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయి.. బేతంచెర్ల: టీడీపీ అవినీతి పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బలపాలపల్లె గ్రామంలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు వర్షాలు పడవన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తుజావలి, మండల కన్వీనర్ సీహెచ్ లక్ష్మీరెడ్డి, గ్రామ నాయకులు పొట్టారెడ్డి, సుబ్రమణ్యం, ఎద్దులన్న, తిమ్మయ్య , పార్టీ నాయకులు బుగ్గన నాగభూషణం రెడ్డి , చంద్రారెడ్డి, బాబుల్‌రెడ్డి, బుగ్గన ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బెదిరింపులతో సీనియర్లకు చెక్
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్ నాయకులను దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు బెదిరింపు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరైనా తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తానని హెచ్చరించడమేకాక అందుకు తగినట్లే పావులు కదుపుతున్నారు. తన సమకాలికుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్ పొత్తుపై తమ వైఖరిని మార్చుకుని చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయాల్సి రావడానికి బెదిరింపులే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో జట్టుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసి.. కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరు సీనియర్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే తాను ఉరి వేసుకుంటానని చెప్పిన కేఈ.. తాజాగా చంద్రబాబు నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని, ఆ పార్టీతో కలిస్తే తమను ప్రజలు బట్టలు ఊడదీసి తంతారని చెప్పిన అయ్యన్న ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్‌తో పొత్తు తప్పుకాదని ప్రకటించారు. కుమారుల కోసం చంద్రబాబుకు జై.. ఈ ఇద్దరు సీనియర్లు మాట మార్చడం వెనుక చంద్రబాబు బెదిరింపు రాజకీయం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పేర్కొని తన కుమారుడు శ్యాంబాబును వారసుడిగా ప్రకటించారు. కానీ శ్యాంబాబుపై ఇసుక అక్రమ తవ్వకాలు, హత్య కేసు కోర్టు విచారణలో ఉన్నాయి. వీటిని సాకుగా చూపిన చంద్రబాబు.. శ్యాంబాబుకు బదులు కేఈ మరో సోదరుడు ప్రతాప్‌కు సీటిస్తానని పరోక్షంగా తన కోటరీ ద్వారా లీకులిప్పించారు. చంద్రబాబు వ్యూహం తెలిసిన కేఈ.. వెంటనే స్వరం మార్చారు. పార్టీ కంటె తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ప్రధానమని భావించి చంద్రబాబు నిర్ణయానికి మద్దతు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అయ్యన్నపాత్రుడిని సైతం చంద్రబాబు ఇలాగే కుటుంబ వ్యూహంలో ఇరికించారని చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్ను పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కుటుంబంలో రేగిన చిచ్చును చంద్రబాబు ఉపయోగించుకున్నారు. నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా (ఆయన భార్య అనిత చైర్మన్) ఉన్న అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడితో విజయ్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. సన్యాసిపాత్రుడిని చంద్రబాబు కోటరీ ప్రోత్సహించడంతోపాటు తన కొడుక్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించడంతో అయ్యన్నకు వ్యూహం అర్థమై వెంటనే బాబుకు అనుకూలంగా స్వరం మార్చేశారని తెలుస్తోంది. ఇలా వారి కుటుంబాల్లో విభేదాలు సృష్టించి, బెదిరించి లొంగదీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. -
కాంగ్రెస్ అంటే.. చచ్చేంత ప్రేమ!
-
టీడీపీతో పొత్తు పెట్టుకోం : కోట్ల
కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. కర్నూలులోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. కాంగ్రెస్‌ను దరిద్రంగా పేర్కొనడం సబబు కాదన్నారు. కాంగ్రెస్‌ను వీడినందుకు అలా అంటున్నారని, రేపు టీడీపీని వీడినా అలా చెప్పరనే నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. విజ్ఞులై ఉండి అలాంటి పదాలు వాడటం మంచిది కాదన్నారు. -
వర్ల రామయ్య వర్సెస్ కేఈ కృష్ణమూర్తి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు విషయంపై టీడీపీలో సెగ పుడుతోంది. కాంగ్రెస్ దౌర్భాగ్యం తమకెందుకని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇటీవల వ్యాఖ్యానించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. పార్టీ వేదికల్లో అభిప్రాయం చెప్పాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీ కేడర్‌కు ఏం సందేశమిస్తున్నారని కేఈని ఉద్దేశించి వర్ల వ్యాఖ్యానించారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికని డిప్యూటీ సీఎం కేఈ మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కిందిస్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారనే విషయం తమ మనస్సుల్లో హత్తుకుపోయిందన్నారు. కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడినందుకు సీఎం చంద్రబాబు తనను మందలించారనడంలో నిజం లేదన్నారు. ధర్మపోరాటం సభలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ నేతలు ఇరువురు మీడియాతో మాట్లాడారు. -
కాంగ్రెస్‌తో టీడీపీ పోత్తు మాకు సమ్మతం కాదు
-
గౌడ కులస్తులు ఆత్మన్యూనత వీడాలి: కేఈ
సాక్షి, హైదరాబాద్: గౌడ కులస్తులు ఆత్మన్యూనతాభావం వీడాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆకాశం నుంచి తీసుకువచ్చే అమృతంగా నీరాను భావించాలని సూచించారు. గౌడ్లు మరుగునపడిన బంగారమని, సానబెట్టినకొద్దీ రాటుదేలుతారని తెలి పారు. సర్దార్ సర్వాయి పాపన్న త్యాగధనుడు, అభిమానధనుడని కొనియాడారు. సర్వమత రక్షకుడిగా పాపన్న తన కాలంలో పనిచేశారని చెప్పారు. ‘జై గౌడ్’ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ మహారాజ్ 368 జయంతి వారోత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణమూర్తి మాట్లాడు తూ లండన్ మ్యూజియంలో పాపన్న ప్రతిమ ఉందని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పాపన్న చరిత్ర పదిలంగా ఉందన్నారు. పాపన్న స్ఫూర్తితో గౌడ కులస్తులు ముందుకు సాగాలన్నారు.‘కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయిలో గతంలో గౌడ కులస్తులైన ప్రసాద్ లాంటివారు పని చేశారు. మనం ఎవరికీ ఎందులోనూ తక్కువ కాదు’అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, బడుగు, బలహీన వర్గాలే తనకు అండగా నిలిచారని అన్నారు. ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ పాపన్న అని అన్నారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టడమే ధ్యేయంగా జైగౌడ్ ఉద్యమం ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో రాబోయే కాలం మనదే. మళ్లీ నేను, మధుయాష్కీ గౌడ్ ఎంపీలుగా గెలుస్తాం’అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం సముచిత పోస్టులు కల్పించడంలేదని విమర్శించారు. ఈ నెల 16న గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను గుంటూరులో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు, జైగౌడ్ ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి. రామారావు, నేతలు బూర మల్సూర్, బొమ్మగాని శ్రీనివాస్, ఎం.ఏడుకొండలు, తెలుగు యువత అధ్యక్షుడు తూళ్ల వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాలన్నీ టీడీపీ వారికేనా?
డోన్ రూరల్: ‘‘ఏమన్నా.. మేమేం తప్పు చేశాం.. నాలుగేళ్లుగా అడుగుతున్నా ఇళ్లు మంజూరు కాలేదు..తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు..ప్రభుత్వ పథకాలన్నీ టీడీపీ వారికేనా? పేదలకు అందించారా’’ అంటూ టీడీపీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌ను మహిళలు నిలదీశారు. డోన్ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ ప్రతాప్.. గ్రామంలో ఇంటింటికి తిరుగుతుండగా మహిళలు నిలదీశారు. నాలుగేళ్లుగా ఇళ్లు మంజూ రు కాలేదని, మరుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు రావడం లేదని, అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అధికార పార్టీ నాయకులకు తప్ప ఎవరికీ అందడం లేదని ఆరోపించారు. గ్రామంలో తాగు నీటి సమస్య ఉన్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు. సమస్యలు తీరుస్తామని కేఈ ప్రతాప్ హామీ ఇవ్వడంతో శాంతించారు. అబద్ధాలు చెప్పకండి..సమస్యలు తీర్చండిఎమ్మెల్సీ కేఈని నిలదీసిన పల్లెదొడ్డి గ్రామస్తులు దేవనకొండ: ‘‘ సమస్యలు పరిష్కరిస్తామని ప్రతి సమావేశం, సభల్లో చెబుతున్నారు... ఇంతవరకు చేసిందేమీ లేదు.. అబద్ధాలు చెప్పకండి..సమస్యలు తీర్చండి’’ అంటూ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్‌ను ప్రజలు నిలదీశారు. గురువారం మండల పరిధిలోని పల్లెదొడ్డి, గద్దెరాళ్ల, వెంకటాపురం, బుర్రకుంట గ్రామాల్లో గ్రామదర్శిని–గ్రామవికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా పల్లెదొడ్డి గ్రామంలో ప్రజల నుంచి నిరసనలు, నినాదాలు వెల్లువెత్తాయి. ఒక్కసారిగా గ్రామస్తులంతా ఏకమై ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, వీరభద్రగౌడ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. నాలుగేళ్లుగా తమ గ్రామానికి రేషన్‌షాపు కావాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కార్యక్రమంలో ఎంపీపీ రామచంద్ర నాయుడు పాల్గొన్నారు. -
దళిత మహిళ ఎంపీపీ కావడంతో చిన్నచూపు
-
‘పవన్ అంటే గాలి వార్తలే..’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై విరుచుకుపడ్డారు. ‘ పవన్ అంటే గాలి. గాలి వార్తలు నమ్మడం తప్ప ఆయనకు ఆలోచించే శక్తి లేదు. పవన్ ఒక అజ్ఞాతవాసి. రీల్ లైఫ్.. రియల్ లైఫ్ వేరని గుర్తించాలి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం ఆయనకు అలవాటైంది. ప్రజా క్షేత్రంలో ఉండేవారు బాధ్యతగా మెలగాలి కానీ తప్పుడు ప్రచారాలు చేయకూడదు. అమరావతి భూముల విషయంలో కూడా పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజధానికి 99 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధానిలో పవన్ పర్యటిస్తే అక్కడి ప్రజలే బుద్ధి చెబుతారు. రమణదీక్షితులు విశ్వనీయత లేని వ్యక్తి. అలాంటి వ్యక్తులకు పవన్ మద్దతు తెలపడం రాజకీయ కుట్రే. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాతనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’ అని తెలిపారు. -
కేఈతో క్షురకుల చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట తపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలతో పాటు, బార్బర్ షాపులు కూడా బంద్ పాటించాలని సూచించాయి. ఆలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
అదే జరిగితే ఉరి వేసుకుంటా: కేఈ
సాక్షి, కర్నూల్: కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరి వేసుకోవడానికి సిద్ధం.. ఇది నా వ్యక్తిగతం కాదు.. పార్టీ తరపునే చెప్తున్నా.. జిల్లాలో బీసీలపై కేఈ కుటుంబ పెత్తనమేమీ లేదు. ప్రజల ఆదరణతోనే నేను రాజకీయంగా ఎదిగాను. ధైర్యం ఉంటే నాతో, నా కుటుంబంతో పోటీ చేసి గెలవాలి. నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం మానాలి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా ఓ నాటకం. వైఎస్సార్సీపీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే రాజీనామాలు ఇప్పటివరకు ఆమోదం కాలేదు’ అని వ్యాఖ్యానించారు. -
మినీ మహానాడులో రచ్చకెక్కిన విభేదాలు
-
టీడీపీలో రచ్చ : మహానాడులో కేఈ, తుగ్గలి మాటల యుద్ధం
సాక్షి, తుగ్గలి : టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలిలో టీడీపీ నియోజవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద ఆశీనులయ్యారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న ఎమ్మెల్సీ కేఈ.. తన ముందుగా వెళుతున్న నాగేంద్రను ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కేఈ ఘాటుగా మాట్లాడడంతో ప్రతిగా నాగేంద్ర..‘‘ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’ అని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసు కోవడంతో కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ తతంగం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎదుటే జరగడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. సోమిశెట్టి, శ్యాంబాబు, పోలీసులు, వేదిక మీద ఉన్న నాయకులు ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా సమావేశం ముగిసే వరకు మధ్యమధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పత్తికొండలో ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని ఇక్కడికి ఎవరూ రారని, కేఈ శ్యాంబాబే పోటీ చేస్తారన్నారు. రక్తమోడైనా విజయం కోసం పని చేస్తానన్నారు. తుగ్గలిలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు టీడీపీకి 23 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని, 2014లో వైఎస్సార్సీపీకి 240 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఎవరూ ఏమీ పొడిచింది లేదంటూ పరోక్షంగా కేఈ నాగేంద్రను అనడంతో మరోసారి వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మొదటి నుంచి రికార్డులు చూసుకోవాలని నాగేంద్ర వాదించారు. ఇలా ఇద్దరి మధ్య పలుమార్లు మాటల తూటాలు పేలాయి. వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కావని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. -
హడావుడిగా మార్పు వెనుక..
సాక్షి, అమరావతి: దేవదాయ ధర్మధాయ శాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగించారు. బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు ఈ నెల 8వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత దేవదాయ శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖలు రెండింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే ఉంచుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న పదవుల్లో దేవదాయ శాఖను మాత్రం కేఈ కృష్ణమూర్తికి అదనంగా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, దేవదాయ శాఖ హడావుడిగా మరొకరి అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ వర్గాల్లో అసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచీ దేవదాయ శాఖ బాధ్యతలు చేపట్టిన నాయకులు పలువురు కొద్ది కాలానికే పదవీచ్యుతులు అవుతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పదవిని తన వద్ద ఉంచుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలే అంటున్నాయి. -
నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుటుంబానికి షాక్
-
నారాయణ రెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి షాక్ తగిలింది. ఈ కేసులో డిప్యూటీ సీఎం కుమారుడు శ్యామ్ బాబుతో సహా మరో ఇద్దరిని నిందితులుగా చేర్చి, అరెస్ట్ చేయాలని డోన్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. కాగా తన భర్త హత్య కేసు విచారణలో అన్యాయం జరిగిందంటూ చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. (చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22న దారుణ హత్యకు గురైన విషయం విదితమే) తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం చేస్తూ... నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని పేర్కొంటూ కర్నూలు జిల్లా డోన్ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు, బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్ఐ నాగప్రసాద్‌లను నిందితులుగా చేర్చాలని సూచించింది. -
ఆశగా ఎదురు చూస్తాం: కేఈ
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ జాతీయస్థాయిలో వివిధ పార్టీలు గళం విప్పుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కేంద్రానికి కనబడ్డం లేదా? విభజన చట్టం అమలు కోసం కేంద్రం ముందు ఏపీ మోకరిల్లాలా?.. సమాఖ్య వ్యవస్థలో ఇదేం దుస్థితి అని వాపోయారు. మిత్రపక్షమైన తమకే ఇంతటి వివక్ష వుందని గ్రహించిన ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సందిగ్ధంలో పడ్డాయన్నారు. మార్చి 5 వరకు సహనంతో, ఆశగా ఎదురు చూస్తామని.. ఐదు అంశాల్లో కొన్నైనా నెరవేరతాయన్న నమ్మకం టీడీపీ ఎంపీలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పవన్‌పై విరుద్ధ ప్రకటనలు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చేందుకు నిజనిర్ధారణపై కమిటీ ఏర్పాటుచేయనున్నట్టు జనసేన పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ నాయకులు భిన్నంగా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుపుకుపోతామని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయని జనసేన కమిటీ వేయడం ఏమిటన్న అభిప్రాయాన్ని కేఈ కృష్ణమూర్తి వ్యక్తం చేశారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినవాళ్లు, చేయనివాళ్లు కమిటీలు వేస్తే ఏం మాట్లాడతామ’ని ఆయన వ్యాఖ్యానించారు. -
భూములకు ‘భూధార్’
సాక్షి, అమరావతి: పౌరులకు ఆధార్ నంబర్ కేటాయిస్తున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా పొలాలు, స్థలాలకు ‘భూధార్’ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూముల లావాదేవీల్లో అక్రమాలను నిరోధించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి స్థిరాస్తికి దీన్ని వర్తింపచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబర్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూధార్ అమలు తీరు, ఉపయోగాలపై బుధవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు పవర్‌పాయింట్ ద్వారా రెవెన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వివరించారు. ప్రభుత్వ భూములకు రెండు సున్నాలు ప్రభుత్వ భూములు, స్థలాలకు మొదట రెండు సున్నాలతో నంబరు కేటాయిస్తారు. జియోట్యాగింగ్ చేయడం వల్ల భూదార్ నంబరు నొక్కగానే ఆ భూమి ఎక్కడ ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది. అందులోనే భూ యజమాని పేరు, భూమి విస్తీర్ణం, ఏ తరహా భూమి, మార్కెట్ విలువతోపాటు 20 అంశాలు కనిపిస్తాయి. ఈ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే ఆటో మ్యుటేషన్ అయిపోతుంది. రుణాలు తీసుకున్నా అందులోనే డేటా కనిపిస్తుంది. క్రయ విక్రయాలకు కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు (క్రయ విక్రయ లావాదేవీలు), దస్తావేజు నకళ్లు లాంటివి తీసుకోవాల్సిన పని ఉండదు. జగ్గయ్యపేట, ఉయ్యూరులో పైలెట్ ప్రాజెక్టు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన భూధార్ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భూములు, స్థలాలు, ఇళ్లకు భూధార్ నంబరు కేటాయించి డిజిటలైజ్ చేస్తే తప్పుడు, డబుల్ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత రుణాలు పొందేందుకు ఆస్కారం ఉండదని అధికారులు పేర్కొన్నారు. 4.19 కోట్ల ఆస్తులకు భూధార్ ఈ ఏడాది అక్టోబరు నెలాఖరుకల్లా రాష్ట్రంలో 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులు, 85 లక్షల గ్రామీణ ఆస్తులు కలిపి మొత్తం 4.19 కోట్ల స్థిరాస్తులకు భూధార్ నంబరు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా భూసేవ పేరుతో భూధార్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేఈ కృష్ణమూర్తి వివరించారు. రైతుల సమయం, డబ్బు ఆదా చేయాలనే ఆటోమ్యుటేషన్కు శ్రీకారం చుట్టామని చెప్పారు. భూధార్ ఇలా - భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరు కేటాయిస్తారు. - ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించిన సెన్సెస్ కోడ్ కాగా తర్వాత తొమ్మిది అంకెలు ఉంటాయి. - ఒకవేళ ఈ ప్రాజెక్టును దేశమంతా చేపడితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు మొదటి రెండు అంకెలు రాష్ట్ర సెన్సెస్ కోడ్ (28) కోసం కేటాయిస్తారు. - తప్పులు దొర్లకుండా జాగ్రత్తల్లో భాగంగా తొలుత 28కి బదులు 99తో ఆరంభించి 11 అంకెల తాత్కాలిక నంబరు ఇస్తారు. - భూ వివరాలను సమగ్రంగా విశ్లేషించి అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్ర సెన్సస్ కోడ్ 28తో ప్రారంభమయ్యే శాశ్వత భూధార్ నంబరు కేటాయిస్తారు. -
కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జెండా వందనం చేసే మంత్రుల జాబితాను సర్కార్ మంగళవారం విడుదల చేసింది. అయితే కేఈ కృష్ణమూర్తికి జెండా వందనం చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులే జెండా ఎగురవేస్తారంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కేఈ సొంత జిల్లా కర్నూలులో కాల్వ శ్రీనివాసులు జెండా వందనం చేయనున్నారు. ఇప్పటికే కేఈకి అన్ని అధికారాల్లోనూ చంద్రబాబు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా జెండా ఎగురవేసే అవకాశాన్ని కేఈ కృష్ణమూర్తికి ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేఈ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ కేబినెట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయనకు అవమానాలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో కేఈకి చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్లో అందరికంటే సీనియర్ అయినా కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. -
రాహుల్ గాంధీకి ఏపీలో పర్యటించే హక్కు లేదు: కేఈ
అమరావతి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే హక్కు లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్‌గాంధీ పర్యటన చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఒక్కసారైనా ప్రస్తావించారా అని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగసభను ప్రజలే బహిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఆయన తెలిపారు. -
నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములుకండి
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అగ్రికల్చర్): నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా రాజ్‌విహార్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్బంగా కేఈ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయిందని, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ధైర్యం కోల్పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మూడేళ్లలోనే ప్రగతి పథంలోకి తెచ్చారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కర్నూలు నుంచే ప్రారంభమై రాష్ట్రం మొత్తానికి వ్యాపించిందన్నారు. రాయలసీమ నుంచి ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర విభజనను కొంతకాలం పాటు ఆపిందన్నారు. ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసివుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మూడేళ్లలో సాధించిన ప్రగతిని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జరిగే సమావేశాలు, సెమినార్లలో వివరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు ముందుండి జీతాలు లేకపోయినా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఎన్జీఓ అసోసియేషన్‌కు దక్కుతుందని వివరించారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, తెలుగుదేశం నేతలు బి.టి.నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్ బాబు, మసాల పద్మజ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెరకులపాడు నారాయణరెడ్డి హత్య ఘటనను వైఎసఆర్ సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, పైలా సోమినాయుడు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మనవడి చేతికి బలపం ఇచ్చి టీడీపీ రౌడీలకు కత్తులిచ్చారని ధ్వజమత్తారు. 132 జీవోలు జారీ చేసి టీడీపీ నేతలపై కేసులు ఎత్తేశారని అన్నారు. నారాయణరెడ్డి హత్యకేసులో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఏ-1 ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరగాలంటే కేఈని తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకుని పని చేస్తున్నారని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధిస్తే కానీ ఏపీలో హత్యాకాండ ఆగదని అన్నారు. -
ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం ఎదురైంది. జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్లో అందరికంటే సీనియర్ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన కేబినెట్ పునర్వ్యస్థీకరణలో శాఖలు మారిన మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత కూడా పరాభవం తప్పలేదు. వీరికి కూడా జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో చోటు దక్కలేదు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావును పూర్తిగా విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ-బీజేపీ విభేధాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులను పక్కనపెట్టారన్న వాదనలు విన్పిస్తున్నాయి. అనంతపురం ఇన్చార్జిగా కామినేని శ్రీనివాస్ స్థానంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్థానం కల్పించారు. జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ సీఎస్ దినేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాకు యనమల రామకృష్ణుడు, వైఎస్సార్ జిల్లాకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లాకు అచ్చెన్నాయుడిని ఇన్ చార్జి మంత్రిగా నియమించారు. ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తారు. -
మెజార్టీ ఎందుకు తగ్గిందో అర్థంకావట్లేదు: కేఈ
అమరావతి: కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ రాలేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరకముందు ఎక్కువ మెజార్టీ సాధించామన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మెజార్టీ తగ్గిందో అర్థం కావడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. కాగా బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడానికి టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘ఓటుకు కోట్లు’ తంత్రాన్ని విజయంతంగా అమలు చేసింది. అడ్డగోలుగా సంపాదించిన అవినీతి డబ్బును విచ్చలవిడిగా వెదజల్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 62 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం విదితమే. -
సీమలో బీసీలకు ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు
నా తమ్ముడికి సమాధానం చెప్పలేకపోతున్నా: కేఈ సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీగా రాయలసీమ లో ఒక్క బీసీ నాయకుడికీ టీడీపీ అవకాశం ఇవ్వలేదని ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. తన సోదరుడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలే దని, దీనిపై తాను అతనికి సర్దిచెప్పలేక పోతున్నానని తెలిపారు. మంగళవారం వెలగపూడి అసెంబ్లీలోని తన కార్యాలయంలో కేఈ విలేకరులతో మాట్లాడారు. పరోక్షంగా అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రస్తావిస్తూ వారికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు తమకు ఒక ఎమ్మెల్సీ ఎందుకివ్వరని ప్రభాకర్ వాదిస్తు న్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో ఐదుగురు రెడ్టిలకు, ఎమ్మెల్యేల కోటాలో ఇద్దరు కమ్మవారికి ఎమ్మెల్సీ సీట్లిచ్చారని, సీమలో ఓ బీసీకి అవ కాశముంటుందని అను కున్నా అది జరగలేదన్నారు. కర్నూలు ఎంపీ సీటు తమ కుటుంబానికి ఇస్తేనే గెలుస్తామ న్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎంపీ సీటును బీసీలకే ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం మూడ్ బాగోలేదు..! కర్నూలు రాజధానిగా ఉండగా అసెంబ్లీ జరి గినప్పుడు మంత్రివర్గంలో ఎవరున్నారు, తదితర వివరాలతో నోట్ సీఎంకిచ్చినా పట్టించుకోలేదని కేఈ తెలిపారు. సుప్రీం కోర్టు ఓటుకు కోట్లు కేసును విచారణకు స్వీక రించడంతో సీఎం మూడ్ బాగోలేదన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్ల మంజూరు
అనంతపురం అర్బన్ : రాబోవు వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ.10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గురువారం ఈ మేరకు విజయవాడలో ప్రకటించారు. ఈ నిధులతో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. -
చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు
రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కర్నూలు (లీగల్): ముఖ్యమంత్రి చంద్రబా బు ఎన్టీఆర్‌లా ముక్కుసూటి మనిషి కాదని, అన్నింటికీ చూద్దాం.. చేద్దాం అంటూ ఆలోచించే మనిషి అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూ ర్తి వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనకు వస్తే ఏమడు గుతారో అని ఆలోచిస్తున్నారన్నారు. శనివారం కర్నూలు లో నిర్వహించిన రాష్ట్ర న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘గతంలో నేను ఎన్టీఆర్ మంత్రివర్గంలో నాలుగున్నరేళ్లు మంత్రి గా పని చేశాను. ఆయనకు సన్నిహితంగా ఉండి జిల్లాకు కావాల్సిన పనులను చేయించుకున్నా. ప్రస్తుతం బాబును జిల్లా అభివృద్ధి గురించి ఏమైనా అడిగితే ఆలోచిద్దాం.. కొత్త రాష్ట్రం కదా.. నిధుల కొరత అంటున్నారు. జిల్లాకు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు మంజూరైనా జిల్లాకు వస్తే మళ్లీ ఏమడుగుతారోనని సీఎం అనుకుంటున్నారు. దాదాపు ఏడు పరిశ్రమలు మంజూరైనా ప్రారంభోత్సవాలు చేద్దామంటే సీఎం స్పందించట్లేదు. ఈ విషయాలన్నీ ఎంపీ టి.జి.వెంకటేష్‌కే తెలియాలి’ అన్నారు. -
చంద్రబాబు వైఖరిపై కేఈ పరోక్ష వ్యాఖ్యలు
-
'రెవెన్యూలో సర్వే వ్యవస్థ కీలకం'
విజయవాడ: రెవెన్యూలో సర్వే వ్యవస్థ అత్యంత కీలకమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో సర్వే అధికారులతో క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూలో రూపొందించిన నూతన సంస్కరణలలో భాగంగా సర్వే వ్యవస్థను ఆదునీకరించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వేసిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 623 ఈటీఎస్ (ఎలక్ట్రానిక్ టోటల్ స్టేసన్స్) మిషన్లు సరఫరా చేస్తున్నామన్నారు. వీటి ద్వారా నూతన పరిజ్ఞానంతో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. సర్వే వ్యవస్థ బలోపేతానికి మండల స్థాయిలో లైసెన్స్డు సర్వేయర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో సర్వేయర్లకు ల్యాప్టాబ్లు సరఫరా చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 200 డిప్యూటీ సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఖాళీలను భర్తీ చేయండి ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు సర్వేయర్లు, అసోసియేషన్ల నాయకులు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయాలన్నారు. గ్రామాల్లో కరణం, మునసబు వ్యవస్థ రద్దయ్యాక సర్వే రాళ్లు కనుమరుగయ్యాయన్నారు. దాదాపు సర్వే వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. అందువల్ల గ్రామాల్లో వీఆర్ఓలకు సర్వే ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. గ్రామ స్థాయిలో సర్వే అధికారి లేకపోతే వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. సమావేశంలో సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ) అనిల్ చంద్ర పునీత, రెవెన్యూ కార్యదర్శి ఏ. వాణిమోహన్ తదతరులు పాల్గొన్నారు. -
పార్టీ కంటే కులమే ముఖ్యం: కేఈ
ఒంగోలు సెంట్రల్: పార్టీ కంటే కులమే ముఖ్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గౌడ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి చెందుతారన్నారు. శనివారం రాజ్యసభలో ఏపీకి అవమానం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు విజయవాడలో ఆదివారం ఎంపీలతో సమావేశం నిర్వహించారని చెప్పారు. ఇందులో ఎంపీలంతా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని రాష్ర్ట పరిస్థితిని వివరించి, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని సీఎం సూచించినట్టు తెలిపారు. ప్రధాన మంత్రి ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపొతే పార్లమెంటులో లేచి నిలబడి ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని చెప్పారన్నారు. -
గుండ్రేవులను పూర్తి చేస్తాం
సి.బెళగల్: గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి తాగు,సాగునీటి అవసరాలు తీరుస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. సి. బెళగల్ మండలంలో వివిధ శాఖలకు సంబంధించి నిర్మించిన నూతన భవనాలను సోమవారం కేఈ ప్రారంభించారు. గురుకులంలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం జెడ్పీ స్కూల్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. సి.బెళగల్ చెరువును ఎత్తిపోతల పథకం ద్వారా నదినీటితో నింపాలని, జెడ్పీ పాఠశాలకు క్రీడామైదానం మంజూరు చేయాలని ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు పాండురంగన్న గౌడ్ కోరగా మండల ప్రజలకు అవసరమైన మేరకు అభివృద్ధి పనులు చేపడతామని కేఈ హామీ ఇచ్చారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టి సత్వరమే పూర్తి చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం.. తమ ప్రభుత్వం 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు సభలో కేఈ చెప్పిన కొద్దిసేపటికే కరెంట్ పోవడం గమనార్హం. ఈ కారణంగా సభలో ఉన్న జనం నవ్వుకున్నారు. అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి కరెంటు సరఫరాకు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోవిందు గౌడ్, ఎంపీపీ నాగమనెమ్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. విష్ణువర్గం దూరం.. కోడుమూరు టీడీపీ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం సోమవారం కేఈ పర్యటనకు దూరంగా ఉండిపోయింది. ఈ పరిస్థితి పార్టీలో వర్గ విభేదాలను బహిర్గతం చేసింది. విష్ణువర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్ కూడా కేఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీనిపై ఆయన వివరణ ఇస్తూ కేఈ పర్యటనపై అధికారులు, మండల టీడీపీ నాయకులు తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. -
నా ఆదేశాలకే దిక్కులేదు: ఏపీ మంత్రి
- రెవెన్యూలో అలసత్వం పెచ్చుమీరిపోయింది - జేసీల కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - జిల్లాల్లో అర్జీలు ఏళ్ల తరబడి పెండింగ్ - హైకోర్టు నిర్ణయాలకూ విలువ ఇవ్వడంలేదు హైదరాబాద్: రెవెన్యూ శాఖలో అలసత్వం పెచ్చుమీరుతోందని తన ఆదేశాలపై కూడా సక్రమంగా సమాధానాలు రావడంలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏళ్ల తరబడి అర్జీలు పరిష్కారం కావడంలేదని, దీనిపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ల (జేసీల)తో మంగళవారం సచివాలయంలో జరిగిన కాన్ఫరెన్సులో కేఈ మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలో తాము ఎన్ని సంస్కరణలు తెచ్చినా కొందరి అలసత్వం వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము 700 ఎండార్స్మెంట్లు జిల్లాలకు పంపితే 51కి మాత్రమే జవాబులు వచ్చాయి.. వాటిని కూడా పరిష్కరించలేదని కేవలం లెటర్లు మాత్రమే పంపించారు. మేం పంపిన వాటికి కూడా ఏడాది దాటినా సమాధానం రాకపోతే ఎలా? ఒక స్వాతంత్య్ర సమరయోధుని భార్య విశాఖ జిల్లాలో 40 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆమె ఎన్వోసీ కోసం దరఖాస్తు చేస్తే మన వాళ్లు అక్కడ చెట్లకు 40 ఏళ్లు లేవని రిపోర్టు ఇచ్చారు. ఆఫీసులో కూర్చుని రిపోర్టు ఇచ్చినట్లు ఉంది. చిత్తూరు జిల్లాలో వనజ అనే మహిళ.. భర్త, మామపై కేసు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె వస్తే నేను ఎండార్స్ చేయగా, దానికి రెండు నెలలుగా నాకు జవాబే లేదు. హైకోర్టు నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వడంలేదు. రాత్రిళ్లూ ఫోన్లు వస్తున్నాయి.. దళారులవల్లే తహశీల్దార్లు ఎన్వోసీలు ఇవ్వడంలేదని మాకు ఫిర్యాదులు వస్తున్నాయని రిపోర్టు కూడా ఉంది. ఆర్డీవోలు, తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏళ్లయినా అర్జీలు పరిష్కరించడంలేదు. కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోండి అని అధికారులే కొందరికి చెబుతున్నారు. అనుకున్న ఫలితాలు రావడంలేదని ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ కూడా చెప్పారు. దీనిని బట్టి జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతోంది. అలసత్వంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దు. కాగా, మీ ఇంటికి మీ భూమి ద్వారా రెవెన్యూ రికార్డులు అప్డేట్ అయ్యాయని సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునేతా వివరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ సూచించారు. అర్బన్ ల్యాండ్ రికార్డులతో ఇంటిగ్రేషన్ పూర్తయితే మోసపూరిత, డ్యూయల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే విభాగం కమిషనర్ వాణీమోహన్, తదితరలు పాల్గొన్నారు. -
కరువు సీమపై ఇంత నిర్లక్ష్యమా?
► ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ► ఎమ్మెల్సీ గేయానంద్ ► కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా కర్నూలు (న్యూసిటీ): వరుస కరువులతో అల్లాడుతున్న సీమ ప్రాంతంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మెల్సీ గేయానంద్ విమర్శించారు. తాగునీరు కూడా లభించక ప్రజలు నిత్యం బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులకు ఏ మాత్రం పట్టడం లేదన్నారు. కలెక్టరేట్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా గేయానంద్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు ఇంత అన్యాయం జరుగుతుండడం ఆయన చేతకాని తనమేనని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద యం త్రాల వినియోగం తగ్గించి కూలీలకు పనులు కల్పించాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో రైతు సంఘం నేతలు ఆంజనేయుడు, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, నగర నాయకులు పుల్లారెడ్డి, రాజశేఖర్, వివిధ సంఘాల నాయకులు వెంకట్రాముడు, సి.గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం నీటి ముంపు బాధితుల ధర్నా కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 98 ప్రకారం తమకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో శ్రీశైలం నీటి ముంపు బాధితులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధితుల సంఘం నాయకుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 1996లో జీఓ నెంబర్ 98 జారీ చేశారన్నారు. దీని ప్రకారం కేటగిరీల వారీగా జిల్లాలో పలువురికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం చాలా మందిని పట్టించుకోలేదన్నా రు. ఇదే జీఓ ప్రకారం ఇటీవలే ప్రకాశం జిల్లాలో బాధితులకు ఉద్యోగాలిచ్చారని, ఇక్కడ మాత్రం వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం ఎమ్మెల్సీ డా.గేయానంద్‌కు వినతిపత్రం అందించారు. మండలిలో చర్చించి న్యాయం చేయాలని కోరా రు. బాధితులు ఎస్ మక్బూల్‌బాషా, మోహీన్‌బాషా, ఏ జనార్దన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వీరుడా.. సలాం..
అమరజవాను ముస్తాక్‌కు తుదివీడ్కోలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: సియాచిన్ మంచుతుపానులో ప్రాణాలు కోల్పోయిన జవాను ముస్తాక్ అహ్మద్ పార్థివదేహానికి ఆయన స్వగ్రామమైన పార్నపల్లె (కర్నూలుజిల్లా) లో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముస్తాక్ మృతికి సంతాపసూచకంగా అటు ఆర్మీతో పాటు స్థానిక పోలీసులు చెరో మూడు రౌండ్లు కాల్పులు జరి పారు. సైనిక బ్యాండు శబ్దాల మధ్య 9 పటాలాల సైనికాధికారులు ముస్తాక్ పార్థివదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్నపల్లె వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. ముస్తాక్ కుటుంబానికి రూ.25 లక్షల పరి హారాన్ని అందజేశారు. నంద్యాల లేదా కర్నూలులో 300 గజాల స్థలాన్నిస్తామని, అర్హతను బట్టి భార్యకు ఉద్యోగం ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, కలెక్టర్ విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్తాక్ కుటుంబానికి చెక్కు అందజేసిన కేఈ
కర్నూలు : సియాచిన్‌లో మరణించిన ఆర్మీ జవాన్ ముస్తాక్ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పార్నపల్లెలో ముస్తాక్ భౌతికకాయాన్ని కేఈ సందర్శించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ముస్తాక్ కుటుంబసభ్యులకు రూ. 25 లక్షల చెక్కును కేఈ కృష్ణమూర్తి అందజేశారు. -
'హోదా' మరచి విదేశీ పర్యటనలా: భూమా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) ఆరోపించారు. గురువారం ఆయన కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్న ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ కోసం హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తుంటూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమర్థించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోటార్లను తరలించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో రిజర్వాయర్లను కూడా తరలిస్తుందని భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. -
గైర్హాజరుపై స్పందించిన కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్ : రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఈ నెల తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని, ముఖ్యమంత్రి అనుమతితోనే ఇంటి దగ్గర నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాపై స్పష్టత ఇవ్వాలని కేఈ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కాగా గోదావరి పుష్కరాలకు కేఈ దూరంగా ఉన్నారంటూ కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు. -
'రేవంత్ విజయవంతంగా బయటకు వస్తారు'
-
ఏమిటో.. ఈ మాయ!
కలకలం రేపిన ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి వ్యాఖ్యలు పదవుల కేటాయింపులపై నేతలు గుర్రు ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో భారీఎత్తున అభివృద్ధి సాగుతోందంటూ ఇతర జిల్లాల్లో గోబెల్స్ ప్రచా రం సాగుతుండటం జిల్లా ప్రజలను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. జిల్లాలో చెప్పుకోదగిన ఒక్క కార్యక్రమం చేపట్టకపోయినా ఇక్కడ నిధులు కుమ్మరిస్తున్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. శనివారం కర్నూలులో జరిగిన టీడీపీ మినీ మహానాడు సభలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించడం చ ర్చనీయాంశమైంది. దీనిపై ఆదివారం స్పందించిన సీఎం చంద్రబాబు కర్నూలును సైతం అభివృద్ధి చేశామనడాన్ని చూస్తుంటే టీడీపీ నేతలు హైడ్రామాకు తెరలేపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు చంద్రబాబు ఎనిమిది సార్లు వచ్చినా ఒరిగిందేమీ లేదు. ఒక్క నిట్ కేటాయింపు మినహా ఏదీ ముందుకు సాగలేదు. చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుంటే అభివృద్ధి జరిగిపోతుందనే హైడ్రామా నడుస్తోంది. ఏడాది పాలనపై వేదికలెక్కి అసంతృప్తి వెళ్లగక్కడం ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా ప్రజల వద్ద మంచి మార్కులు కొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. పాలకొల్లులో శనివారం జరిగిన మినీ మహా నాడులో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఇతర ప్రజాప్రతినిధులు ఏడాది పాలన తమకు సంతృప్తినివ్వలేదని మొసలి కన్నీరు కార్చారు. రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు అండగా నిల వాలని కోరటం చర్చనీయాంశమైంది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా పదవుల విషయంలో చంద్రబాబు తమకు న్యాయం చేయలేకపోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు, వారి అనుచర గణం వాపోతోంది. ఆదివారం భీమవరం మండలం రాయలంలో జరిగిన సమావేశంలో గాదిరాజు బాబు మాట్లాడుతూ చంద్రబాబు పార్టీ శ్రేణులను మభ్యపెడుతున్నారే తప్ప పదవుల విషయంలో సీనియర్ నాయకులకు న్యాయం చేయటం లేదని వాపోయారు. ప్రజల్లో వ్యక్తిగత ప్రాపకం పెంచుకునేందుకు ఇలాంటి మాటలు చెబుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడాది పాలనలో ఏమీ చేయలేకపోయామన్న అపప్రద నుంచి బయటపడేందుకే నాయకులు ఈ వ్యూహం పన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చంద్రబాబు చూపంతా 'ఆ జిల్లా' పైనే..
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఈ. కృష్ణమూర్తి మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. చంద్రబాబు చూపంతా పశ్చిమ గోదావరి జిల్లాపైనే ఉందని ఎద్దేవా చేశారు. తన సొంత జిల్లా కర్నూలుపై ఆయన దృష్టి పెట్టడం లేదని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కర్నూలులో కేఈ కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ముచ్చటగా మూడంటే మూడే సీట్లు గెలిచామంటే అందులో తమ తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు. జిల్లా టీడీపీ కొత్త అధ్యక్షుడు... జిల్లాలో ఏ వీధి ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. చాలా శ్రమ పడాల్సి ఉందని జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు మార్పు చాలా సాహసవంతమైన చర్య అని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. చంద్రబాబుపై అసంతృప్తిని వెళ్లగక్కడం కేఈ కృష్ణమూర్తికి కొత్త కాదు. ఏపీ నూతన రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కేఈ మొదట్లోనే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. -
‘స్మార్ట్’గా గ్రామాల అభివృద్ధి!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో ప్రతీ గ్రామం, వార్డు ఇక నుంచి పచ్చని చెట్లతో కళకళలాడనుంది. ఏ ఇంటి ముందు కూడా చెత్తకుప్పలు ఇక మీదట కన్పించవు. ప్రతీ ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి ఏర్పాటుకానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్మార్ట్ విలేజ్/వార్డు కార్యక్రమం అమలు తీరుపై జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అధికారికంగా ప్రారంభించనున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళిక! జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఏకంగా 9,951 ఎకరాల్లో 99,33,112 మొక్కలను నాటాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మొక్కలు నాటడంపై ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా పరిషత్ తీర్మానం చేసి, పరిపాలన అనుమతి ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించి.. మార్చి నెలాఖరునాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి స్మార్ట్ విలేజీ/వార్డు కార్యక్రమం కింద ప్రతీ కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. జిల్లావ్యాప్తంగా వ్యక్తిగత మరుగుదొడ్డి లేని కుటుంబాల వివరాలను జన్మభూమి- మా ఊరు కార్యక్రమం సందర్భంగా జిల్లా యంత్రాంగం సేకరించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 44,832 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని లెక్క తేల్చి, నిర్మాణానికి జిల్లా అధికార యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి మొత్తం రూ. 12 వేల మేరకు మంజూరు చేస్తున్నారు. ఇందులో కేంద్రం రూ.9 వేలు కాగా... రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేలు భరిస్తోంది. భారీగా డంపింగ్‌యార్డులు స్మార్ట్ విలేజ్/ గ్రామంలో భాగంగా ఎక్కడపడితే అక్కడ చెత్త ఉండకుండా, జిల్లావ్యాప్తంగా 898 డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. ఇందులో అత్యధికంగా ఆదోనిలో 37, కర్నూలు, పాణ్యంలో చెరో 26, కౌతాళంలో 23, రుద్రవరం, ఓర్వకల్లు, నంద్యాలలో చెరో 20 చొప్పున, ఉయ్యాలవాడలో 17, అవుకులో 19.. ఇలా జిల్లావ్యాప్తంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తించారు. ప్రతీ ఇంటి నుంచీ చెత్త సేకరణ... స్మార్టు వార్డు కార్యక్రమంలో భాగంగా కర్నూలు మునిసిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లోనూ ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు మునిసిపల్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన పరికరాల కోసం టెండర్లను కూడా పిలిచారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 450 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ప్రతీ వర్షపు బొట్టును కాపాడుకునేందుకు వీలుగా వాటర్ హార్వెస్టింగ్ అండ్ కన్జర్వేషన్ కింద జిల్లావ్యాప్తంగా 8174 ఇంకుడు గుంతలు, నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లను చేపడతారు. దీనితో పాటు పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు ఖాతాలు లేవు. వీరందరికీ కూడా స్టార్ట్ విలేజ్/ వార్డు కింద బ్యాంకు ఖాతాలను ఏర్పాటు చేయనున్నారు. వెంటనే కార్యాచరణ ప్రారంభం స్మార్ట్ విలేజ్/ వార్డు కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తాం. అయితే, ఎక్కడ అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమం కింద డంపింగ్ యార్డుల ఏర్పాటు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు వెంటనే మొదలు పెడతాం. మూడు నెలల్లో కోటి మొక్కట నాటే కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. అయితే, వీటిపై శనివారం ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని భావిస్తున్నాం. - సీహెచ్. విజయమోహన్, జిల్లా కలెక్టర్ -
బాబు చేతిలోనే ఉప ముఖ్యమంత్రి పదవి
ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల గుంతకల్లు:పేరుకు బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఆ హోదా గౌరవాన్ని మంత్రి కేఈ కృష్ణమూర్తికి సీఎం నారా చంద్రబాబునాయుడు ఇవ్వలేదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు డెప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు. డెప్యూటీ సీఎం పదవిని కేఈ కృష్ణమూర్తికి ఇచ్చారే కానీ అధికారాలను బాబు తన చేతుల్లో ఉంచుకున్నారన్నారు. చంద్రబాబునాయుడు ఆరు నెలల పాలనలో అనేకసార్లు విదేశీ పర్యటన చేసి కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారన్నారు. విదేశీ పర్యటన ఖర్చులు, కొత్త వాహనాలు, గృహ వాస్తు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆయన ఖర్చులతో డ్వాక్రా మహిళల రుణాలు కొంతలోకొంత మాఫీ అయ్యేవన్నారు. ఎలాంటి షరతులు విధించకుండా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
నేను మాట్లాడదామంటే బాబు వారించారు..
సీఎం తీరుపై డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి సీఆర్డీఏ చర్చలో నేను మాట్లాడదామంటే బాబు వారించారు భూములు కోల్పోతున్న రైతుల పక్షాన మాట్లాడిన జగన్ ప్రతిష్ట పెరిగింది హైదరాబాద్: శాసనసభలో మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటంలేదంటూ సీఎం చంద్రబాబు వ్యవ హారశైలిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మరోసారి తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒకరిద్దరు మాట్లాడేందుకు అవకాశం వచ్చినా మధ్యలో సీఎం జోక్యం చేసుకోవడంతో అది ప్రతిపక్షానికి లాభించేదిగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం శాసనసభ లాబీల్లోని తన చాంబర్లో కేఈ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేఈ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. గత శాసనసభ సమావేశాల సమయంలోనూ రాజధాని ఎంపిక విషయంలో మంత్రి పి.నారాయణ చేస్తున్న ప్రకటనలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మం త్రులు మాట్లాడాల్సిన అంశాలపై కూడా సీఎం స్పందిస్తున్నారని కేఈ పేర్కొన్నారు. మంత్రుల్లో కూడా యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయు డు లాంటి వారికి మాత్రమే అవకాశం వస్తోందన్నారు. మంత్రులు ఒకరిద్దరికి అవకాశం వచ్చినా సీఎం జోక్యం చేసుకొని ఇచ్చే ప్రసంగాలు ప్రతి పక్ష నేతకు ఉపయోగపడేలా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. సీఆర్డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భూ సమీకరణ, సేకరణలను కలగలిపి మాట్లాడారని, రెవెన్యూ మంత్రిగా తాను జోక్యం చేసుకుందామని భావించినా సీఎం వారించారని అసంతృప్తి వ్యక్తపరిచారు. నేను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదు...: విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటన చేసిన తరువాత తాను ఇంతవరకూ అక్కడ పర్యటించలేదని కేఈ పేర్కొన్నారు. అక్కడ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మరో రెండేళ్లు పట్టొచ్చన్నారు. నది ఒడ్డున రాజధాని ఏర్పాటులో కొంత ఇబ్బం ది ఉంటుందని, దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జగన్ ప్రతిష్ట పెరిగింది...: ప్రస్తుత సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ైవె .ఎస్.జగన్మోహన్రెడ్డి బాగా ‘షైన్’ అయ్యారని, ఇదే విషయాన్ని బయ ట కూడా చెప్పుకుంటున్నారని కేఈ వ్యాఖ్యానిం చారు. రాజధాని నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతుల తరఫున గళమెత్తిన జగన్మోహన్రెడ్డి వారిలో ప్రతిష్ట పెంచుకున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో కేం ద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో సీఎం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించి అధికారం చేపట్టిన నేపథ్యంలో తన భాషను మార్చుకోవాలని హితవుపలికారు. కేసీఆర్ కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారంటూ.. ఏపీ కూడా గట్టిగా లాబీయిం గ్చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రభుత్వం, సీఎంను ఇరుకున పెట్టేలా మీరు చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు తలెత్తవా?’ అని ప్రశ్నించగా.. తాను మామూలుగానే ఈ వ్యాఖ్య లుచేశానని కేఈ చెప్పారు. మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడి వ్యవహారం పత్రికల్లో వచ్చింది కదా అపుడు లేని ఇబ్బంది ఇపుడు ఏమి వస్తుందని ప్రశ్నించారు. -
ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఎంపీ కొనకొళ్ల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడుగా మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు కొనకొళ్ల నారాయణరావు ఎన్నికయ్యారు. రెండు రోజల కిత్రం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంట్లో జరిగిన సమావేశంలో కొనకొళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ పీఎస్ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘం అధ్యక్షుడిగా కొనకొళ్ల పేరును కేఈ ప్రతిపాదించగా, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, గౌతు శ్యాంసుందర శివాజీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీహెచ్ వేణుగోపాలకృష్ణ ఆమోదం తెలిపారన్నారు. -
కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్ బృందంలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర పోలీస్ సిబ్బంది ఉంటారు. ** -
రాజధాని సబ్‌కమిటీలో లేనిది అందుకే..!
-
రాజధానిపై ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు!
-
ఆ సబ్ కమిటీలో సభ్యుడిగా ఉండనని సీఎంకు చెప్పా!
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో తాను సభ్యుడిగా ఉండనని సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయంలో స్పష్టత రావడానికి ఒకటి, రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాజధాని విషయంలో్ రైతులను సంతృప్తి పరిచి 30 వేల ఎకరాలు సమీకరించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గతంలోనే అన్ని పంటలకు ఒకే పరిహారం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఆ ఉపసంఘలోని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
పట్టించుకోరా?
సాక్షి, కర్నూలు : పని భారంతో సతమతమవుతున్నా.. సహనంతో సేవలందిస్తున్నప్పటికీ 15 నెలలుగా వేతనాలు అందక ఐకేపీ విలేజ్ అర్గనైజేషన్ అసిస్టెంట్లు(వీవోఏ-యానిమేటర్లు) అవస్థలు పడుతున్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తొలినాళ్లలో ప్రయాణ భత్యాల రూపంలో కొద్ది మొత్తంలో ముట్టజెప్పినా వేతనాలకు కాలక్రమంలో కేవలం గ్రామ సంఘాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లాలో మొత్తం 39,500 డ్వాక్రా సంఘాలు ఉండగా 1,920 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో గ్రామ సమాఖ్యలోని సంఘాల కార్యకలాపాలు, ఫైళ్ల నిర్వహణ, ఇతర ఆమ్ ఆద్మీ, అభయ హస్తం, బీమా యోజన, జన్‌ధన్, మొబైల్ బుక్ కీపింగ్ వంటి దాదాపు 19 రకాలకు పైగా విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో తొలుత 1,400కు పైగా వీఓఏలు ఉండగా ఇటీవల మరికొన్ని డ్వాక్రా సంఘాలు నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో వీరి సంఖ్య 1,585కు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత తదితర విషయాలపై వీరి డిమాండ్ల నేపథ్యంలో సీఏలకు నెలకు రూ. 2 వేల వ ంతున వేతనాలను చెల్లించేలా నిర్ణయిస్తూ 2013 మే నెలలో సెర్ఫ్ సీఈవో ఉత్తర్వులు వెలువరించారు. దీనికి అదనంగా గ్రామ సంఘం నుంచి రూ. 1,500, గ్రామ సంఘం రికార్డులకు రాసినందుకు రూ. 3,00 అంటే మొత్తం రూ. 3,800లను వేతనంగా చెల్లించేలా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి అదే ఏడాది జూన్, జూలై వరకు వేతనాలపై గంపెడాశతో ఎదురుచూసిన తమకు తీవ్ర నిరాశ మిగిలిందని వీఓఏలు వాపోతున్నారు. కేవలం కొందరికి మాత్రమే రూ. 2 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన అధికారులు మిగిలిన వారి వేతనాల చెల్లింపు ప్రక్రియను గాలికొదిలేశారని ఆరోపిస్తున్నారు. అదేమంటే బ్యాంకు ఖాతాల వివరాలను సిబ్బంది ఆన్లైన్ చేయడంలో జరిగిన జాప్యమే కారణమంటున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామ సంఘాల నుంచి చెల్లించాల్సిన రూ. 1,500కు సంబంధించి నిర్దిష్ట ఉత్తర్వులు లేకపోవడంతో కొన్నిచోట్ల చెల్లింపులకు వ్యతిరేకత తలెత్తుతోందని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు వేతనాలు లేక, ఇటు గ్రామ సంఘాల సొమ్ము అందక రెంటికీ చెడ్డ చందాన పరిస్థితి తయారైందని వాపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోతోందని, సెర్ఫ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కర్నూలులోని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంటి ఎదుట యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. వెట్టిచాకిరీ.. డ్వాక్రా సంఘాలకు సంబంధించి 19 రకాల పనులను వీవోఏలకు అప్పగించారు. వీటి నిర్వహణకు సంఘాల సభ్యులు ఇంటింటికి తిరిగి అవసరమైన వివరాలను సేకరిస్తున్నాం. ఇది చాలక కులగణన సర్వేకు కూడా వీఓఏలను వినియోగిస్తున్నామంటున్నారు. అదనపు పనులకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలను చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. ఏడాదిన్నరగా వేతనాలు లేకుండా పడరాని పాట్లు పడుతున్నా ఇంకా అదనంగా పనులను అప్పచెప్పుతున్నారు. వేతనాల చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. - టి. మద్దిలేటి, జిల్లా యానిమేటర్ల సంఘం అధ్యక్షుడు బడ్జెట్ కేటాయింపులేదు.. యానిమేటర్ల వేతనాల చెల్లింపునకు సంబంధించి బడ్జెట్ కేటాయించ లేదు. దీంతో వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. 1,585 మంది యానిమేటర్లకు సంబంధించి కొందరికి గత ఏడాది జూన్, జూలై నెలల్లో రూ. 2 వేల వంతున బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. వేతన బకాయిల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామని సెర్ఫ్ అధికారి ఒకరు తెలిపారు. -
పుట్టిన రోజు గుర్తుగా మొక్కలు నాటండి
విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపు కర్నూలు(జిల్లా పరిషత్): ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజు నాడు గుర్తుగా ఒక మొక్క నాటి సంరక్షించాలని, ఇలా ప్రతి విద్యార్థి బాధ్యతగా నిర్వర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం వెంకటరమణ కాలనీ ప్రధాన రహదారిలోని రామలింగేశ్వరనగర్ రోడ్డు-2 నుంచి పార్కు వరకు నలువైపులా, రామలింగేశ్వర్ నగర్ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కేఈ మాట్లాడుతూ వంద బావులు తవ్వితే ఒక చెరువు తవ్వినట్లు, ఒకచెరువు తవ్వితే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ఎంత పుణ్యం వస్తుందో అలాగే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచితే ఒక బిడ్డను పెంచినంత పుణ్యం వస్తుందన్నారు. ఇలా ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని, మొక్కల ప్రాదాన్యత గురించి వివరించాలని చెప్పారు. నాలుగు లైన్ల రోడ్ల విస్తరణలో భాగంగా చెట్లను నరికేశారని, కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచలేదన్నారు. మొక్కలు నాటేందుకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు మున్సిపల్ కమిషనర్ సిద్దంగా ఉన్నారని తెలిపారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ జనాభా పెరగడం, అడవులు తగ్గడంతో వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ఎక్కువైందన్నారు. ఈ సమయంలో చెట్లు లేకపోతే జీవుల మనుగడ కష్టమవుతుందన్నారు. టెక్నాలజీ వైపు ముందుకు వెళ్తూ ప్రాణవాయువును విస్మరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధి మాట్లాడుతూ ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలని, తద్వారా వ్యాధులు రాకుండా సమాజాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మొక్కలు పెంచడం భావి భారత పౌరులైన చిన్నారులు బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ సమాజానికి వారే స్ఫూర్తిగా మొక్కలు నాటాలని చెప్పారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ మొక్కలు పెంచడం వల్ల సామాజిక అడవులు పెరిగి వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలానికి జిల్లాలో కోటి మొక్కలు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వనమహోత్సవమైన ఈ రోజున జిలాల వ్యాప్తంగా 3లక్షల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు, కాలనీల్లో నాటుతున్నామన్నారు. స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్ తాంతియా మాట్లాడుతూ వైజాగ్‌లో హుదూద్ తుఫాను సృష్టించిన విలయం కారణంగా నేడు మొక్కల నాటడం అనే ప్రాదాన్యత అందరికీ తెలిసి వస్తోందన్నారు. కార్తీక మాసంలో వనమహోత్సవం ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. వచ్చే కార్తీక మాసానికి ఈ మొక్కలు చెట్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు అందరి సహకారం తీసుకుంటున్నామన్నారు. ఇందులో బాగంగా మొక్కలు నాటి వదిలేయకుండా దాతల సహాయంతో వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, రాయలసీమ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతి కోయా పాండే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు హనుమంతచౌదరి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకాసురుల ఆటలు సాగనివ్వం
కర్నూలు(రూరల్): జిల్లాలో తుంగభద్ర నది నుంచి అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారని, ఇకపై వారి ఆటలు సాగనివ్వబోమని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నిడ్జూరులో ఆ గ్రామ డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇసుక అమ్మకాల రీచ్ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎం.రాజశేఖర్, కలెక్టర్ విజయమోహన్, జేసీ కె.కన్నబాబు, ఎస్పీ రవికృష్ణలు పాల్గొన్నారు. రీచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్లలో ఇసుక రవాణా అలజడులు సృష్టిస్తోందన్నారు. అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి పోవడంతో, ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి డ్వాక్రా మహిళలను ఆదుకునేందుకు.. వారి కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు కేటాయించారన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం పనిచేస్తుందన్నారు. జిల్లాలో నిడ్జూరు, బావాపురం, జి.శింగవరం, ఎదురూరు, దేవమాడ, పడిదెంపాడు, మంత్రాలయం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఇసుకను ట్రాన్స్‌పోర్టు చేసేందుకు అవసరమైన వాహనాల కోసం టెండర్లు పిలిచి ఖరారు చేస్తామన్నారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్లే 5 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. నవ్యాంధ్ర కోసం చంద్రబాబు నాయుడు చేపడుతున్న ప్రాజెక్టులను ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్రకు అన్యాయం చేసిన తెలంగాణకు ఇసుక తరలించొద్దన్నారు. ఆగస్టు 15న జిల్లాకు వచ్చిన సీఎం జిల్లా అభివృద్ధికి 28 పథకాలను ప్రకటించారని, వీటి అమలుకు కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 5 కి.మీ దూరంలోనే 5 వేల ఎకరాలు పరిశ్రమల స్థాపనకు భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు తైవాన్ దేశం ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారన్నారు. అనంతరం కలెక్టర్, జేసీలు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కేటాయిస్తుందన్నారు. వారం రోజుల్లో పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేసి వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ అమర్చి అక్రమ రవాణాపై నిఘా పెడతామన్నారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుక రూ.500 కాగా, భవిష్యత్‌లో ఇంకా చౌక ధరకే ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డీపీఓ శోభస్వరూప రాణి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ నాగేశ్వరరావు, మైనింగ్ ఏడీ నరసింహ ఆచారి, జెడ్పీ సీఈఓ జయరామిరెడ్డి, ఈఓఆర్డీ దేవగ్లోరి, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, సర్పంచ్ లావణ్య, జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.కె.మాధవి, ఆర్డీఓ రఘుబాబు, తహశీల్దార్ శేషఫణి తదితరులు పాల్గొన్నారు. -
మా శవాలపై రాజధాని కట్టుకోండి...
-
మా శవాలపై రాజధాని కట్టుకోండి..
సర్కారుపై ‘రాజధాని గ్రామాల’ రైతుల ఆగ్రహం స్వతంత్రంగా బతుకుతున్న మమ్మల్ని రోడ్డున పడేస్తారా? ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. సెంటు భూమి కూడా ఇవ్వం వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఎదుట స్పష్టంచేసిన రైతులు సాక్షి, గుంటూరు: రాజధాని కోసమంటూ తమ భూములను అప్పనంగా కాజేసే కుయుక్తులపై కర్షక లోకం కన్నెర్ర చేస్తోంది. కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని భూమిలో బంగారం పండించే భూమిపుత్రులంతా పోరాటానికి సన్నద్ధమయ్యారు. భూసమీకరణ పేరుతో అడ్డగోలుగా భూములను సొంతం చేసుకుకోవాలనుకుంటున్న సర్కారు పెద్దలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సెంటు భూమి ఇచ్చేదిలేదని.. తమ భూములు తీసుకునే రాజధాని నిర్మించాలనుకుంటే తమ శవాలపైనే ఆ రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ‘‘రైతులను మోసం చేశావు... జనాల్ని మోసం చేస్తున్నావు... ఇప్పుడు హైటెక్ మోసంతో మా భూములు తీసుకోవాలని చూస్తున్నావు. మీకు ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగింది. 200 వాగ్దానాలు చేశావు, ఇక్కటైనా నెరవేర్చావా?’’ అంటూ.. రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల రైతులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా పొలాలు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేద్దామనా?’’ అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.ఆదివారం ఆ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పర్యటించి రైతుల మనోగతాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే పోరాడతాం: వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లాలో రాజధాని కడితే ఆనందమే.. కానీ రైతులు నష్టపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టంచేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బడాబాబులు బినామీ భూములను జాగ్రత్త చేసుకుని.. రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అయిదడుగుల్లోనే నీరు పడే ప్రాంతాల్లో రాజధాని నిర్మించాలంటే ఖర్చుతో కూడిన పనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు పార్టీలతో పనిలేదని, పేద రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రైతుల కు నచ్చేవిధంగా ఉండాలి గానీ, ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే పోరాడతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రైతులకు హామీ ఇచ్చారు. -
ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు:కేఈ
హైదరాబాద్: ముందు చూపుతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ మొండి వైఖరి వల్లే రాయలసీమకు నీటి కష్టాలు వచ్చాయని తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడం తప్పు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూరుస్తుందన్నారు. అనంతపురంలో విమానాశ్రయం నిర్మాణానికి అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు కృష్ణమూర్తి తెలిపారు. ** -
రాజమండ్రిలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కోటగుమ్మం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి విశాఖపట్నం పర్యటన ముగించుకుని బుధవారం మధ్యాహ్నం రాజమండ్రి వచ్చారు. మధురపూడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లేందుకు ఇక్కడకు వచ్చిన నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత అతిథి గృహంలోని భోజనం చేసి అనంతరం మధురపూడి వెళ్లారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. మంత్రిని కలిసి హుదూద్ తుపాను సహాయక కార్యక్రమాలపై చర్చించారు. -
సీఎం.. డిప్యూటీ డిష్యుం డిష్యుం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మధ్య అగాధం రోజురోజుకూ పెరిగిపోతోంది. రెవెన్యూ శాఖకు చెందిన బదిలీల విషయంలో తాజాగా చెలరేగిన చిచ్చు.. కేఈని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. ఈ విషయంలో లోకేష్ బృందం డిప్యూటీ సీఎం మీద ఫిర్యాదు చేయడంతో చంద్రబాబు ఆయనను పిలిచి క్లాస్ తీసుకున్నారని, దాంతో కేఈ తీవ్రంగా కలత చెందారని అంటున్నారు. వాస్తవానికి ఉపముఖ్యమంత్రి పదవి అయితే ఇచ్చినా.. తనకు ఏ విషయంలోనూ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేఈ కృష్ణమూర్తి ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు. రాజధాని విషయంలో రాయలసీమను అసలు పరిగణనలోకి కూడా తీసుకోలేదన్న ఆగ్రహంతో ఆ విషయమై వేసిన కమిటీలో కూడా తనకు చోటు అవసరం లేదని ఆయన ఇంతకుముందు చెప్పేశారు. రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని కొంతమంది మంత్రులు బహిరంగ ప్రకటనలు చేయడంపైనా పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తాజాగా వారం రోజుల క్రితం రెవెన్యూశాఖ బదిలీల విషయంలో మరో చిచ్చు రేగింది. బదిలీల ఫైలు విషయంలో చంద్రబాబు కేఈని పిలిచి క్లాస్ తీసుకోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చివరకు బదిలీల ఫైలు తెప్పించి, దాన్ని నేరుగా ముఖ్యమంత్రికే ఇచ్చేసినట్లు తెలిసింది. రాజకీయాల్లో తాను చంద్రబాబు కంటే సీనియర్ని అయినా.. తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. మొత్తమ్మీద బదిలీల వ్యవహారం, లోకేష్ బృందం జోక్యం... ఇవన్నీ కలిసి సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మధ్య పెను అగాధాన్ని సృష్టించాయి. -
పారిశ్రామిక నగరంగా ఓర్వకల్లు
ఓర్వకల్లు: కర్నూలు నగరానికి అతి సమీపంలోని ఓర్వకల్లు మండలాన్ని పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రితో పాటు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ విజయమోహన్, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, ఎన్ఎండీ ఫరూక్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా స్థానిక అల్లాబకాష్ దర్గా వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుంచి దర్గా పక్కనే గల ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మండల సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విజయభారతి అధ్యక్షతన నిర్వహించిన మహిళా బ్యాంకు విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. సభను ప్రారంభించిన కొద్దిసేపటికే వర్షం కురవడంతో ఉపముఖ్యమంత్రి ప్రసంగానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎంఎంఎస్ కార్యాలయ భవనంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్న ఓర్వకల్లు పొదుపు మహిళల పురోగతి ప్రశంసనీయమన్నారు. పొదుపు సంఘాల నిర్వహణ, పాలన సౌలభ్యం కోసం అన్ని గ్రామాల్లో సొంత భవనాలు నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం మండలంలోని ఓర్వకల్లు, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె గ్రామాల్లో ఐక్య సంఘం భవన నిర్మాణాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరైన రూ.కోటి చెక్కును ఉపముఖ్యమంత్రి వారికి అందజేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి పొదుపు మహిళలు రూ.10 లక్షలు ఈ సందర్భంగా విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, ఎంఎంఎస్ గౌరవ సలహాదారురాలు విజయభారతి, పలువురు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కర్నూలులో 200 ఎకరాల్లో రిమ్స్ స్థాయి ఆసుపత్రి
కర్నూలు (హాస్పిటల్) : రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలులో 200 ఎకరాల్లో రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)గా కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. శుక్రవారం కర్నూలులోని వైద్య కళాశాల కొత్త ఆడిటోరియంలో 37వ రాష్ట్ర స్థాయి శస్త్ర చికిత్స నిపుణుల(సర్జన్ల) సదస్సు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో పని చేసే సర్జన్లు, టీచింగ్ ఫ్యాకల్టీ, పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1956 సంవత్సరంలో 50 మంది వైద్య విద్యార్థులతో ప్రారంభమైన కర్నూలు మెడికల్ కళాశాల, ప్రభుత్వాసుపత్రి ఇప్పుడు 200 మంది విద్యార్థులకు చేరుకోవడంలో తనవంతు సహాయ సహాకారాలు ఉన్నాయన్నారు. పీజీ వైద్య విద్యార్థులకు ఆధునిక భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రాన్ని ఏ ఒక్కరూ వేలెత్తి చూపకుండా సింగపూర్, మలేషియాలాగా అభివృద్ధి చేస్తామన్నారు. సదస్సులో సర్జన్లు మరిన్ని మెలకువలు, ఆధునిక చికిత్సా విధానాలు తెలుసుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ కర్నూలు చరిత్రలోనే కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుందన్నారు. వచ్చే ఏడాది నుంచి సూపర్ స్పెషాలిటీ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. రోగులకు అవసరానికి మించి యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందన్నారు. -
ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు అందాలనే ప్రధాన ఉద్దేశంతో ‘జన్‌ధన్ యోజన’ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనిని జిల్లాలో వంద శాతం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా జీరో బ్యాలెన్స్‌తో 75 వేల బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతో బ్యాంకు అధికారులను అభినందించారు. ఈ పథకం కింద ప్రారంభించిన ఖాతాల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు, నందికొట్కూరు ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఐజయ్య, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కలెక్టర్ విజయ్‌మోహన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇంతవరకు బ్యాంకు ఖాతాలేని వారందరూ వెంటనే జన్‌ధన్ యోజన కింద ప్రారంభించాలన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు చీటీల పేరుతో డబ్బు కట్టి మోసపోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని, అదే డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటే సురక్షితంగా ఉంటుందన్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింకప్ చేయడంతో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ఈ ఖాతాలకే జమ చేస్తారన్నారు. ఖాతాను సక్రమంగా నిర్వహించే ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణమాఫీ అమలును సాధ్యమైనంత త్వరలో చేపడుతామని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నిర్మాణం కోసం అనేకమంది విరాళం ఇస్తున్నారని, స్త్రీలు నగలు కూడా ఇస్తున్నారని తెలిపారు. వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో ప్రపంచం గర్వించే స్థాయిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు.. జిల్లాకు 13 వరాలు ప్రకటించారని, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జిల్లాలో 35 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో మరో పది వేల ఎకరాల భూమి ఉందని, ఇప్పటికే బిర్లా, విప్రోతో పాటు వివిధ కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని వివరించారు. జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ.. జన్‌ధన్ యోజన కింద ఖాతా ప్రారంభించిన కుటుంబానికి రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ.. బ్యాంకులో ఖాతా ప్రారంభించుకుంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకులు అప్పులు ఇస్తాయన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా ఖాతాలు ప్రారంభించే కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. సెప్టెంబర్ 5 లోపు బ్యాంకు ఖాతాలు లేని కుటుంబాలను గుర్తిస్తామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ లోపు వారితో ఖాతాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు జీఎం దుర్గా ప్రసాద్, ఎల్‌డీసీఎం నరసింహారావు, జేసీ కన్నబాబు, ఎస్పీ ఆకే రవిక్రిష్ణ, ఏపీజీబీ జీఎం రాజశేఖర్, ఆర్ఎం రంగన్న, డీసీసీబీ సీఈఓ వివి.సుబ్బారెడ్డి, పాల్గొన్నారు. -
కర్నూలులో ఇండస్ట్రియల్ హబ్
కర్నూలు : కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధిపరిచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ విజయమోహన్‌తో కలిసి గురువారం ఏపీఎస్పీ క్యాంప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సారిగా కర్నూలులో జాతీయజెండా ఎగురవేయడం సంతోషకర విషయమన్నారు. కర్నూలుకు ఏదో ఒక మంచి ప్రాజెక్టు మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో సంపూర్ణమైన ముడి సరుకు, పుష్కలంగా నీరు, విస్తారమైన ప్రభుత్వ భూమి ఉన్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. హెదరాబాద్ స్థాయిలో కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. మన ప్రాంతంలో ప్రస్తుతం సిమెంటు కర్మాగారాలు, పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటివి మరిన్ని ఏర్పాటుకు విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. కర్నూలు నగరంలో ఆటో నగర్, భారీ వాహనాల పార్కి ంగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయింపునకు చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజధాని ఏర్పాటు కోసం కర్నూలుతో పాటు అనేక ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే నిర్మాణం జరుగుతుందన్నారు. చెన్నై-ముంబయి వంటి ప్రాంతాలు ఒక మూలకు ఉన్నప్పటికీ అవి రాజధానిగా చలామణి అవుతున్నాయని కేఈ చెప్పారు. -
జెడ్పీ సీఈఓగా జయరామిరెడ్డి
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సీఈఓగా ఎం.జయరామిరెడ్డి ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈఓగా పనిచేసిన ఎ.సూర్యప్రకాష్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి పీఎస్‌గా బదిలీ కావడంతో ఆయన స్థానంలో జయరామిరెడ్డి నియమితులయ్యారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆమోదంతో ఆయన సూర్యప్రకాష్ చేతుల మీదుగా స్వీకరించారు. జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన జయరామిరెడ్డి 1979లో టైపిస్టుగా పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1985లో యూడీసీ, 1996లో ఈవోఆర్డీ, 1999 నుంచి ఎంపీడీఓగా పని చేస్తూ 2013లో ఇన్చార్జి డిప్యూటీ సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ తదితర ఉన్నతాధికారులు, ఎంపీడీఓలు, జెడ్పీ ఉద్యోగులందరి సహకారంతో జెడ్పీని ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. జయరామిరెడ్డికి జెడ్పీ గణాంకాధికారి టి.భాస్కర్‌నాయుడు, కార్యాలయ సూపరెంటెండెంట్లు దస్తగిరిబాబు, క్రిష్ణమూర్తి, నరసింహమూర్తి, జ్యోతి, ఆనందకుమారి, వెంకటేశ్వరరావు, నూర్జహాన్, రాణెమ్మ, సురేష్, హక్, భరత్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సీఈఓ పదవి సంతృప్తినిచ్చింది: ఎ.సూర్యప్రకాష్ జెడ్పీ సీఈఓగా పని చేయడం సంతృప్తినిచ్చిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి పీఎస్‌గా బదిలీ అయిన సీఈఓ ఎ.సూర్యప్రకాష్ అన్నారు. ఆదివారం ఆయన జయరామిరెడ్డికి బాధ్యతలు అప్పగించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోని సమస్యలను అధిక శాతం పరిష్కరించామన్నారు. వివిధ సమస్యలతో జిల్లా పరిషత్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలను నిరాశ పరచకుండా న్యాయం చేకూర్చామన్నారు. విధి నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగులు, ఇంజనీరింగ్ అధికారులను ఎప్పటికీ మరువలేనని తెలిపారు. -
తెలంగాణవారికి మాపై విపరీతమైన ద్వేషం
విజయవాడ: తెలంగాణ వారికి ఆంధ్రా ప్రాంతవాసులపై విపరీతమైన ద్వేషం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవోల అభినందన సభలో ఆయన శనివారం మాట్లాడుతూ తమని ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి తరుముదామా అని చూస్తున్నారన్నారు. మంత్రులన్న ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందరూ కష్టపడితేనే హైదరాబాద్ ఇంత స్థాయికి వచ్చిందని కేఈ అన్నారు. తెలంగాణవారు ఆశ్చర్యపడేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశంలో చంద్రుడు 12 గంటలు ప్రకాశిస్తే ....చంద్రబాబు నాయుడు 24 గంటలు ప్రకాశిస్తారని ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి ప్రశంసలతో ముంచెత్తారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
సంపూర్ణ రుణమాఫీ సాధ్యమేనంటున్న టీడీపీ
హైదరాబాద్ : రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదని ఓ వైపు ఆర్బీఐ తేల్చి చెప్పినా.... తెలుగు దేశం పార్టీ మాత్రం ఇప్పటికీ రుణమాఫీ సాధ్యమేనంటూ కథలు చెబుతోంది. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో మాట్లాడి సంపూర్ణ రుణమాఫీ చేస్తామంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఊహాగానాలు వద్దని కేఈ కృష్ణమూర్తి సూచించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సమీక్షలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాయలసీమను ఇండస్ట్రీస్ హబ్‌గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని కేఈ వెల్లడించారు. కాగా రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్బీఐ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది. ఇదంతా తెలిసినా టీడీపీ మాత్రం రుణమాఫీ సాధ్యమే అంటూ రైతుల్ని నమ్మించే యత్నం చేస్తోంది. -
'ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఇంకా స్పష్టత రాలేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాజధాని ఎక్కడనేది రోజుకొక ప్రాంతం తెరమీదకు వస్తోందని ఆయన బుధవారమిక్కడ అన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి స్థలం అందుబాటులో ఉందని, అయితే ఒకేచోట ఎక్కువ స్థలం లేదని కేఈ పేర్కొన్నారు. భూ సేకరణ ప్రస్తుతం పెద్ద సమస్యగా మారనుందని, ప్రభుత్వం, రైతుల మధ్య 55:45 ప్రతిపాదన ద్వారా భూ సేకరణ చేయాలనే ఆలోచన ఉందని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. రాజధానితో పాటు ఏడు స్మార్ట్ సిటీలకు అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా తగ్గిందని కేఈ వెల్లడించారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే విధంగా భూములను తీర్చిదిద్దుతామని, రైతులకు, ప్రజలకు మేలు కలిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు. -
'ఖాళీ భూమల కోసం జిల్లాల్లో పర్యటన'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాళీ భూముల కోసం జిల్లాల్లో పర్యటించనున్నట్లు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పర్యటన అనంతరం ఖాళీ భూములపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన సోమవారమిక్కడ చెప్పారు. గత ప్రభుత్వంలో సెజ్‌లు, పరిశ్రమలకు కేటాయించిన భూములు వినియోగించకుండా ఉన్న భూములు ఎలా స్వాధీనం చేసుకోవాలో తర్వాత నిర్ణయిస్తామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. వినియోగంలో లేని భూములను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కెఇ కృష్ణమూర్తి భాద్యతలు స్వీకరణ
-
తంతారో, కొడతారో మీ ఇష్టం...
డోన్ : 'తంతారో, కొడతారో మీ ఇష్టం... అధికారులతో మీకు అవసరమైన పనులు చేయించుకోండని' ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవసరమొచ్చినా అధికారులను కలిసి పనులు చేయించుకోవాలన్నారు. తన పని అయిపోయిందని ప్రచారం చేసినవారు ఇప్పుడు తాను చేపట్టిన పదవిని చూసి భయాందోళన చెందుతున్నారన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అయిదు పర్యాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న డోన్ ప్రజలను ఎన్నటికీ వీడనని అన్నారు. ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తానన్నారు. రాయలసీమను కాపాడి కర్నూలు జిల్లాను సింగపూర్ చేస్తావో....మలేషియాగా తీర్చిదిద్దుతావో నీ ఇష్టమని బాబు చెప్పారని ఈ సందర్భంగా కేఈ తెలిపారు. -
నువ్వా.. నేనా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరికి తెలియకుండా మరొకరు అధినేత వద్ద తమ ప్రాబల్యం చాటుకునే ప్రయత్నంలో పోటీపడుతున్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన ఇద్దరు నేతల కారణంగా తమ్ముళ్లు విభేదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. చాపకింద నీరులా సాగుతున్న ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పదేళ్ల తర్వాత అధికార పగ్గాలు చేపట్టబోతున్న టీడీపీని అభద్రతాభావం వెంటాడుతోంది. ఆ కారణంతోనే బలమైన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలోని నేతలను ప్రలోభాలతో తమవైపు తిప్పుకునేందుకు మైండ్‌గేమ్ ఆడుతోంది. అందులో భాగంగానే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి పచ్చ కండువా కప్పి నీచ రాజకీయానికి తెర తీశారు. అదేవిధంగా మరికొందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా అధినేత వద్ద మెప్పు పొందేందుకు మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పనిలో పనిగా జిల్లా టీడీపీలో బలమైన నాయకులుగా పేరున్న కేఈ కృష్ణమూర్తి ప్రాబ ల్యాన్ని తగ్గించేందుకు తమ వంతు శ్రమిస్తున్నారు. ఇందుకు ఆ పార్టీ ముఖ్యనేత సీఎం రమేష్ పూర్తి మద్దతిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ, కోడుమూరుకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులకు టీడీపీ తీర్థం ఇప్పించేందుకు వారిరువురూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాాటసాని రాంభూపాల్‌రెడ్డి టీడీపీలో చేరకుండా మాజీ మంత్రులు ఇద్దరూ అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఆయన చేరితే తమ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని వారు భావిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. జెడ్పీ పీఠం, ఎమ్మెల్సీ కోసం తమ్ముళ్ల అడ్డదారి జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ్ముళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యులు లక్ష్యంగా టీడీపీ నేతలు పలు రకాల ప్రలోభాలకు పాల్పడుతున్నారు. బెదిరింపులకూ వెనుకాడటం లేదు. ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులను గౌర్హాజరు చేయించి లబ్ధి పొందే కుట్రకు పావులు కదుపుతున్నారు. ఇందుకు సీఎం రమేష్, అనంతపురం జిల్లాకు చెందిన మరికొందరు టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీపైనా టీడీపీ శ్రేణులు కన్నేశారు. ఈ పదవి కైవసం చేసుకునేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల సహకారం తప్పనిసరి. దీంతో జిల్లాలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై గురిపెట్టారు. పార్టీలోకి వస్తే లక్షల రూపాయలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ‘పార్టీ మారినా మీపై అనర్హత వేటు వేసే అవకాశం లేదు’ అని మభ్యపెడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మభ్యపెట్టి పార్టీ ఫిరాయింపునకు ఉసిగొల్పి పదవీచ్యుతులను చేయడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.