టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తితో నిందితుడు వెంకటరమణ ఆచారి (ఫైల్)
సాక్షి, డోన్: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతానికి చెందిన టీడీపీ నేత చండ్రపల్లె వెంకటరమణ ఆచారి.. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిని లొంగదీసుకునేందుకు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నాడు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు సోమవారం పోలీసులను కలిసి వెంకటరమణ ఆచారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
డోన్ సీఐ మల్లికార్జున తెలిపిన వివరాలు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పీఏనంటూ వెంకటరమణఆచారి విశాఖకు చెందిన బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లుగా అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతూ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమె విసుగు చెంది సోమవారం కొందరు మహిళా ప్రతిని«ధులను వెంట తీసుకుని వైజాగ్ నుంచి డోన్‌కు వచ్చి వెంకటరమణ ఆచారిని నిలదీసే ప్రయత్నం చేయగా.. ఆచారి, ఆయన కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు.
సొంత పార్టీలోనే మహిళా నేతకు రక్షణ కరువైంది..
రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్న తన పట్ల ఆచారి ప్రవర్తించిన తీరుపై పలు మార్లు పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్నత పదవిలో ఉన్న తనకే సొంత పార్టీ నేతల నుంచి రక్షణ కరువైందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment