
సాక్షి, కర్నూలు: ఏపీలో ఎన్నికలకు మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో టీడీపీలో విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. పలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ సీట్ల కేటాయింపు విషయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. డోన్ సీటు తమకే కేటాయించాలని కోట్ల సుజాతమ్మ పట్టుబట్టారు. దీంతో ఆ సీటుపై తమకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్న కేఈ కుటుంబం తీవ్ర అసహనానికి గురవుతోంది.(కేఈ కుటుంబానికి రెండు సీట్లు)
దీంతో కర్నూలులో కేఈ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఈ ప్రతాప్ హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. చంద్రబాబు బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేఈ వర్గీయుల్లో కలవరం మొదలైంది. కాగా, కేంద్ర మాజీ మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment