kotla suryaprakash reddy
-
రాళ్ల దాడులు.. పిడిగుద్దులు.. తమ్ముళ్ల డిష్యుం.. డిష్యుం!
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్‌లో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. కోట్ల సూర్యప్రకాశ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబు వచ్చి సర్ది చెప్పి పోయినా సొంత క్యాడర్ సహకరించలేదు.తాజాగా ప్యాపిలి మండలం పెద్దపూదెళ్లలో తెలుగు తమ్ముళ్లు దారుణంగా తన్నుకున్నారు. 'కోట్ల' ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాన్వాయ్ ఎవరెక్కాలనేదానిపై ఘర్షణ మొదలైంది.రాళ్లదాడులు, పిడిగుద్దులతో రెండు వర్గాలు విరుచుకుపడ్డాయి. సమన్వయం పాటించాలని కోట్ల సూర్యప్రకాశ్ కోరినా తెలుగు తమ్ముళ్లు లెక్కచేయలేదు. ‘కోట్ల’ చెప్పినా ఓ వర్గం మరింత రెచ్చిపోయి రాళ్లు రువ్వి దాడులకు దిగింది.ముందే ప్లాన్ చేసి టీడీపీలోని ఓ వర్గం దాడికి పురిగొల్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు డోన్ బహిరంగ సభలో పదే పదే సుబ్బారెడ్డి పేరు పలకడంపైనా ఓ వర్గం తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'కోట్ల' కన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంపై కోట్ల వర్గం కూడా అసంతృప్తితో ఉంది.టీడీపీకి వలసలుగా వెళ్లిన వారు కూడా ఎందుకొచ్చాం రా బాబూ అనుకునేలా కూటమిలో పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల బాహాబాహీతో తెలుగుదేశం బండారం బయటపడింది. -
కోట్ల చెప్పిన మాటే నిజం కానుందా?
సాక్షి, కర్నూలు : నేను కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్లే.. ఇవీ ఆయన ఒకప్పుడు కోటలు దాటేలా చెప్పిన మాటలు. అయితే మునిగిపోయే నావలో ఎందుకులే అనుకున్నారో ఏమో... తన ఒట్టు తీసి గట్టుమీద పెట్టి సైకిలెక్కేశారు. ఆ సైకిల్ ప్రయాణమైనా సక్రమంగా సాగిందా అంటే... టైర్లో గాలిలేదు.. ఎదురుగా చూస్తే గతుకుల రోడ్డు అన్నట్టే ఉంది. అవును.. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అక్షరాలా అదే. గెలుపు ఆశలు లేవు సరికదా.. ఓటమి భయం నిద్రపోనివ్వడం లేదు. ఇది ఫలితాల కాలం.. విద్యార్థులకే కాదు.. రాజకీయ నాయకుల ఫలితాలూ రిలీజయ్యే కాలం ఎంతటి ముదుర్లయినా టెన్షన్ పడే కాలమిది ఎవరు పాస్.. ఎవరు ఫెయిల్ ? విద్యార్థులు ఫెయిలయితే సప్లిమెంటరీ ఉంటుంది. నాయకులు ఫెయిల్ అయితే ఐదేళ్ల తర్వాతే మళ్లీ అందుకే విద్యార్థుల్ని మించి భయపడిపోతున్నారు రాజకీయ నాయకులు కర్నూలు జిల్లాలోని సీనియర్ నాయకుడు కోట్లకూ ఈ టెన్షన్ తప్పడం లేదు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏ పార్టీ అని అడిగితే ఇప్పటికీ టక్కున కాంగ్రెస్ అనే చెప్తారు చాలామంది. తర్వాతే.. అయ్యో టీడీపీలోకి వెళ్లారు కదా అని ముక్తాయిస్తారు. అంతలా కోట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీతో మమేకమైంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీని వీడటం అంటే నేను రాజకీయ సన్యాసం చేసినట్లేనని ఓ సందర్భంలో ఆయన ప్రకటించారు. అంతటి కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుణ్ని తెలుగుదేశంలోకి రప్పించారు చంద్రబాబు నాయుడు. తద్వారా కర్నూలు జిల్లాలో తిరుగులేకుండా వీస్తున్న ఫ్యాన్ గాలిని అడ్డుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. అందుకే.. ఎప్పట్నుంచో శత్రు శిబిరాలుగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కుటుంబం, కోట్ల కుటుంబాల మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. రెండు కుటుంబాలు కలిస్తే ఓట్లే ఓట్లు అని చంద్రబాబు లెక్కలేసుకున్నారు. కానీ జనం అందరి లెక్కలూ తేల్చేంత విజ్ఞత కలవారు. రంగులు మార్చే నాయకుల్ని దూరం పెట్టి నమ్మకమైన నాయకత్వానికే జై కొట్టారు. ఫలితంగా కోట్ల కుటుంబానికి రాబోయే ఫలితాలు ఏంటో ఇప్పటికే అర్థమైపోయాయి. దీంతో ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఎక్కడ ఫెయిలయ్యామబ్బా అని తలపట్టకున్నారు. చంద్రబాబు చెప్పాడని కలిసినట్లే కనిపించిన కోట్ల, కేఈ వర్గీయుల మధ్య క్షేత్రస్థాయిలో విద్వేషాలు అలాగే ఉన్నాయి. దీంతో పాటు 2014 ఫలితాల్లోనే కర్నూలులో వైఎస్సార్సీపీ ప్రభంజనం కనిపించింది. ఇప్పుడు ఆ జోష్ పెరిగిందేగానీ ఏమాత్రం తగ్గలేదు. దీనికి తోడు.. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డకి కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాలు అనుకూలమని చంద్రబాబు భావించారు. కానీ ఆ నియోజకవర్గాలు ఎప్పుడో జగన్ మానియాలోకి వెళ్లిపోయాయి. కోడుమూరులో టీడీపీ నాయకులు కోట్లకు ఏమాత్రం సహకరించలేదనే టాక్ ఉంది. ఎదురూరు విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే కోట్లకు ఓటు వెయ్యకండి అని పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. ఆదోని నియోజకవర్గంలో ఇంతకుముందు కోట్లతోపాటు ఉన్నా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీలు అడ్డం తిరిగారు. ఎవరికైనా వెయ్యండి కాని కోట్లకు మాత్రం ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేశారు. ఇక కర్నూలు, ఎమ్మిగనూరులో చెప్పక్కర్లేదు. అక్కడంతా జై జగనే.. మొత్తం మీద చూసుకుంటే చాలాచోట్ల కోట్లకు వ్యతిరేక గాలులు వీచాయి. పోలింగ్ సమయంలోపైకి బాగానే ఉన్నట్టు కనిపించిన పరిస్థితి ఆ తర్వాత కొద్దిరోజులకే ఓట్లు పడలేదని అర్థమైపోయింది. ఇప్పుడు కోట్ల ఫ్యామిలి పూర్తిగా అంతర్మథనంలోకి వెళ్లిపోయింది. ఇక, కాంగ్రెస్ పార్టీని వీడితే.. రాజకీయాల నుండి తప్పుకున్నట్లేనని ఒకప్పుడు కోట్ల చెప్పిన మాటలే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత నిజమయ్యేలా ఉన్నాయని కర్నూలు ప్రజలు చెప్పుకుంటున్నారు. -
కోట్లకు ఓటమి కలవరం
-
తెగుతున్న నోట్లకట్టలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేక భావనను నోట్ల కట్టలతో మేనేజ్ చేసేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ప్రధానంగా ఒకస్థాయి నేతలతో పాటు డ్వాక్రా సంఘాలను లక్ష్యంగా చేసుకుని డబ్బుల వరద పారించాలని నిర్ణయించింది. కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏకంగా రూ.100 కోట్ల మేర వెచ్చించేందుకు సిద్ధమయ్యారు. వైరిపక్షంలోని ఒక స్థాయి నేతలను లక్షలకు లక్షలు పోసి కొనుగోలు చేస్తుండగా.. ఇక గ్రూపుగా ఉన్న వారికి వేలల్లో ఆఫర్లు ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల లీడర్లకు రూ.50 వేల చొప్పున అందజేస్తున్నారు. అంటే సంఘంలో ఉండే పది మంది సభ్యులకు తలా రూ.5 వేల చొప్పున పంపిణీ చేస్తూ గాలం వేస్తున్నారన్న మాట. చిన్న చిన్న కాలనీలు, గ్రామాల్లో చీరలు, ముక్కెర్లను కూడా పంపిణీ చేస్తూ మహిళలను ప్రలోభపెడుతున్నారు. కర్నూలులో ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థి టీజీ భరత్ డ్వాక్రా సంఘాలతో మూడు రోజులుగా సమావేశాలు నిర్వహించి.. డబ్బుల పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక పత్తికొండలో ప్రతిపక్ష పార్టీలోని నేతలకు లక్షలతో గాలం వేస్తున్నారు. ఇందుకు అంగీకరించకపోతే... బెదిరింపులకూ దిగుతున్నారు. రెండు గ్రూపులు ఒక్కటయ్యాయని.. మీరు అటువైపు ఉంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కర్నూలులో కోట్ల వరద.. కర్నూలు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఏకంగా రూ.100 కోట్ల వ్యయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక స్థాయి నేతలకు కూడా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఒక్కో బూత్‌లో రోజువారీ ఖర్చుల కోసం రూ.25 వేల చొప్పున వారం రోజులుగా పంపిణీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు గ్రూపునకు రూ.50 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు కూడా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నగరంలోని కొన్ని వాడల్లో చీరల వ్యాపారుల ద్వారా చీరలను కూడా మహిళలకు పంపిణీ చేయిస్తున్నారు. ముక్కుపుడకల పంపిణీకి సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పత్తికొండలోనూ అదే తీరు.. కర్నూలుతో సమానంగా పత్తికొండలోనూ రూ.100 కోట్ల మేర ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం తన కుమారుడిని గెలిపించుకోవడం అనివార్యంగా మారింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తమ కుటుంబ రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అయితే, చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఆరోపణలతో పాటు ప్రజల పట్ల కనీస మర్యాదగా ప్రవర్తించలేదనే చెడ్డపేరు కూడా ఉంది. ఇక నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని పరిస్థితి. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ క్రమంలో గ్రామాల్లో ఒక స్థాయి నాయకులకు కూడా రూ.లక్షలు ఇచ్చి తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల బడ్జెట్ రూ.50 కోట్ల మేర ఉంటోంది. ప్రజా బలాన్ని సంపాదించలేని అధికార పార్టీ నేతలు.. ఈ విధంగా కోట్లతో ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
కర్నూలు..అదే జోరు
సాక్షి, కర్నూలు : రాష్ట్ర తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కర్నూలులో ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కర్నూలు లోక్‌సభ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆభ్యర్థి హెచ్.సీతారామిరెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఆరుసార్లు లోక్‌సభ సభ్యునిగా గెలుపొందారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కూడా అలంకరించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కర్నూలు లోక్‌సభ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మంత్రాలయం అసెంబ్లీ సెగ్మెంట్ కలిసింది. డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ కర్నూలు నుంచి విడిపోయి నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైంది. అంతకుముందు రెండుసార్లు కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి, టీడీపీ తరఫున బీటీ నాయుడు, వైఎస్సార్ సీపీ తరఫున బుట్టా రేణుక పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిపై బుట్టా 44,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున, డాక్టర్ ఎస్.సంజీవకుమార్ వైఎస్సార్ సీపీ తరఫున ప్రస్తుతం బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు స్థానం వైఎస్సార్ సీపీ ఖాతాలోనే ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశం. బీసీలే అధికం రాయలసీమలో అనంతపురం జిల్లా తరువాత బీసీలు అత్యధికంగా ఉన్నది కర్నూలు జిల్లాలోనే. ముఖ్యంగా, కర్నూలు పార్లమెంటరీ పరిధిలో అధిక శాతం బీసీ కులాలు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ఈ పార్లమెంట్ స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దింపారు. టీడీపీ బీసీలను కేవలం ఓటర్లుగానే చూస్తోంది. సీట్ల కేటాయింపులో మాత్రం వారికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. డాక్టర్ శింగరి సంజీవకుమార్ (వైఎస్సార్ సీపీ) సానుకూల అంశాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం. బీసీ ఓటు బ్యాంకు అధికంగా ఉండటం. ప్రముఖ వైద్యునిగా గుర్తింపు పొందటం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం. ప్రతి అంశంపై సూటిగా, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలగటం. పోటీ పరీక్షలకు వెళ్లే వందలాది యువతకు ఉచితంగా కోచింగ్ ఇప్పించి, ఉద్యోగాలు పొందేలా ప్రోత్సాహం అందించటం. పేదలకు వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి.. పెళ్లిళ్లకు సహాయం అందించటం. జిల్లాలో వైఎస్సార్ సీపీ క్యాడర్ బాగా కలిసిరావటం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై చెక్కు చెదరని ప్రజాభిమానం, వైఎస్ జగన్‌పై ప్రజలకు నమ్మకం ఉండటం. కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి (టీడీపీ) సానుకూలాంశాలు : కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటం. మాజీ ఎంపీ కావటం. కేంద్ర మంత్రిగా పనిచేయటం. ఆర్థికంగా స్థితిమంతుడు కావటం. బలహీనతలు : ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఉండి ఇటీవల టీడీపీలో చేరడం.రాజకీయంగా గుర్తింపు పొంది కూడా ప్రజాసమస్యలు పరిష్కరించకపోవడం. కేంద్ర మంత్రిగా పనిచేసినా కరువు నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. సాగునీటి ప్రాజెక్టుల కోసం పట్టించుకోకపోవటం. సొంత నియోజకవర్గమైన కోడుమూరు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాçశ్వత పరిష్కారం చేయకపోవడం. అనుచరుల అరాచకాలు, హత్యలు చేశారనే అపనిందలు. రాజకీయంగా విరోధం గల వ్యక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం. కుటుంబ సభ్యులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వేర్వేరు పార్టీల్లో ఉండటం. ఇది ‘రాజు’ల కోటనే.. ఆ పాంత్రంలో ముగ్గురు మినహా అంతా ‘రాజు’లే పరిపాలిస్తున్నారు. అందుకే అది ‘రాజు’ల కోటగా భావిస్తారు. అంటే, ఉండి నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులంతా పేరు చివర రాజు అని ఉన్నవారే.. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన వి.శివరామరాజు, పాతపాటి సర్రాజు, కె. రామచంద్రరాజు, గోకరాజు రంగరాజు, జి. జగన్నాధరాజు, డి. నారాయణ రాజు అందరి పేర్లలో రాజు ఉండటం గమనార్హం. 1962 లో కె. కుసుమేశ్వరరావు గెలవగా ఆయన మరణాంతం ఆతని భార్య పోటీ చేసి గెలుపొందారు. 1972లో డి. పేరయ్య గెలిచారు. కోర్టు తీర్పుతో ఎన్నికైన దొర సాలూరు నియోజకవర్గానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కోర్టు తీర్పు ద్వారా ఎన్నికైన రాజన్నదొర వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని పార్టీలు.. వైఎస్పార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, పి.ఎస్.పి, కె.ఎల్.పి, స్వతంత్ర అభ్యర్థులను పోటీలో గెలిపించి, ప్రజలు కూడా ఎన్నికల్లో వైవిధ్యతను చాటారు. 2004లో సాలూరులో టీడీపీ అభ్యర్థి భంజ్‌దేవ్ గెలుపొందగా, ఇతను ఎస్టీ కాదని రాజన్నదొర కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. తత్ఫలితంగా రాజన్నదొరనే గెలిచిన అభ్యర్థిగా కోర్టు ప్రకటించింది. అనంతరం భంజ్‌దేవ్ గిరిజనుడిగానే నిర్ధారణ కావడంతో ఆయన తిరిగి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. మొత్తం ఓటర్లు : 14,22,542 పురుషులు : 7,12,160 మహిళలు : 7,10,209 ఇతరులు : 173 – కె.రామకృష్ణ, కర్నూలు -
కేఈ, కోట్ల కుటుంబాల మధ్య సీట్ల ఫైట్
సాక్షి, కర్నూలు: ఏపీలో ఎన్నికలకు మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో టీడీపీలో విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. పలు జిల్లాలో సీట్ల కేటాయింపుపై అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో టీడీపీ సీట్ల కేటాయింపు విషయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి కుటుంబాల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. డోన్ సీటు తమకే కేటాయించాలని కోట్ల సుజాతమ్మ పట్టుబట్టారు. దీంతో ఆ సీటుపై తమకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్న కేఈ కుటుంబం తీవ్ర అసహనానికి గురవుతోంది.(కేఈ కుటుంబానికి రెండు సీట్లు) దీంతో కర్నూలులో కేఈ కుటుంబ ఆధిపత్యానికి గండికొట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఈ ప్రతాప్ హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. చంద్రబాబు బీసీలను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కేఈ వర్గీయుల్లో కలవరం మొదలైంది. కాగా, కేంద్ర మాజీ మంత్రి అయిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి అమ్ముడుపోయిన కోట్ల
కర్నూలు సీక్యాంప్: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో గురువారం టీడీపీపై పోరుసభ కార్యక్రమం వైఎస్సార్సీపీ కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కె.రోజా మాట్లాడుతూ..గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్‌లను రూ. 8,118 కోట్లతో నిర్మిస్తానని 2014 సాతంత్య్ర దిన వేడుకల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లవుతున్నా ఆ ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్‌ల సాధన పేరుతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయి.. అభివృద్ధి కోసమే పార్టీ మారానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం తగదన్నారు. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల ఆధిపత్య పోరులో పేదలు సమిధలయ్యారన్నారు. ప్రజలూ..అప్రమత్తంగా ఉండండి.. అరాచక పనులు చేసి కొన్ని నెలలపాటు దేశాన్ని అతలాకుతలం చేసిన డేరా బాబా లాగే ఇప్పుడు రాష్ట్రంలో డేటా బాబా సంచరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోజా పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే మరో 20 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కిపోతుందన్నారు. ఉప ఎన్నికల్లో నంద్యాలను అమరావతి చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు.. ఎన్నికల అనంతరం మర్చిపోయారన్నారు. వైఎస్సార్సీపీ పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయం బాగుండాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల వస్తున్న తరుణంలో డ్వాక్రా మహిళలు, రైతులు ప్రభుత్వానికి గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు. నందికొట్కూరు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల ఆధిపత్య పోరులో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని, వారికి ఏం సమాధానం చెబుతారన్నారు. కోడుమూరులో ఉల్లి రైతులు అల్లాడిపోతుంటే అండగా నిలవాల్సిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు పంచన చేరి రైతులకు ద్రోహం చేశారన్నారు. కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ప్రజలు కరువుకోరల్లో చిక్కుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, చెరుకుచెర్ల రఘరామయ్య, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కొంతలపాడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ముఖ్యనేతలు డాక్టర్ శశికళ, మల్లికార్జునరెడ్డి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గార్గేయపురం రైతు సంఘం అధ్యక్షుడు సీతారామిరెడ్డి, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కోడుమూరు మైనార్టీ సెల్ కన్వీనర్ కొట్టముల్లా మహబూబ్‌బాషా, కర్నూలు మండల కన్వీనర్ రేమట కాల్వముని స్వామి, ఎస్సీసెల్ కన్వీనర్ పసుపల నాగరాజు, నాయకులు మునగాలపాడు వెంకటేశ్వర్లు, సోలమోన్,చందు, అనీల్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా
సాక్షి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొంది, ఆ తరువాత టీడీపీ గూటికి చేరిన బుట్టా రేణుక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టికెట్ హామీతో టీడీపీలో చేరిన బుట్టాకు తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపిణీలో తనకు తగుస్థానం కల్పించడంలేదంటూ గతకొంత కాలంగా ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. (నా పరిస్థితేంటి?!) ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు సభకు బుట్టా డుమ్మా కొట్టారు. దీంతో బుట్టా రేణుకా పార్టీ మారుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్‌సభ స్థానుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సూర్య ప్రకాష్ ఎంట్రీతో రేణుకను పక్కనబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎంటా అని ఆమె సతమవుతున్నారు. మరోవైపు కర్నూలులో కేయి, కోట్ల వర్గీయుల విభేదాలు భయపడపడుతున్న విషయం తెలిసిందే. -
ఎస్వీకి ఝలక్.. కోట్లకు టికెట్ ?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాకను ముందుగానే స్వాగతించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు కేఈ సోదరులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఏకంగా ఎస్వీ టికెట్‌కే టెండర్ వేసేందుకు పావులు కదుపుతున్నారు. కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం ముందు కేఈ సోదరులు కొత్త ప్రతిపాదన చేశారు. పత్తికొండ, డోన్ టికెట్లు తమ కుటుంబానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరినట్టు తెలిసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు పరిధిలో కోట్లకు చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన అంశాన్ని వీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు కూడా ఈ పరిణామం దోహదపడడమే కాకుండా ఇక్కడ పార్టీ గెలుపునకు ఉపయోగపడుతుందంటూ అధిష్టానం ముందు ప్రతిపాదన ఉంచనున్నట్టు సమాచారం. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎస్వీ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు భరత్ మధ్య ఉన్నపోటీని పరిష్కరించే వీలు కూడా కలుగుతుందనేది వీరి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలో కోట్ల రాకను స్వాగతించిన ఎస్వీకి అసలు సీటే లేకుండా చేయాలనేది కేఈ సోదరుల ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది. డోన్, పత్తికొండ మాకే! జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమతో కనీసం సంప్రదించకుండానే కోట్లతో నేరుగా సీఎం చర్చలు జరపడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు కర్నూలు ఎంపీతో పాటు ఆలూరు, డోన్ టికెట్లు తమకే వస్తాయని కోట్ల కుటుంబం తన అనుచరులతో భేటీ సందర్భంగా చెప్పుకుంటోంది. ఇది కాస్తా కేఈ కుటుంబానికి ఆగ్రహం తెప్పిస్తోంది. కాగా.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ కుటుంబం మొదటి నుంచి సహకరించింది. ఎంపీ టీజీ వెంకటేష్‌పై ఉన్న వ్యతిరేకత కొద్దీ ఎస్వీని ప్రోత్సహించింది. అలాగే పత్తికొండలో తమకు ఎస్వీ తన బంధువైన రామచంద్రారెడ్డి ద్వారా సహకరిస్తారని ఆశించింది. ఇందుకు భిన్నంగా కోట్ల రాకను ఎస్వీ స్వాగతించారు. కర్నూలులో మైనార్టీల్లో కోట్లకు అంతో ఇంతో పట్టుంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఎస్వీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ ఉన్న కేఈ సోదరులను కాదని.. వారికి వ్యతిరేక వర్గమైన కోట్ల రాకను స్వాగతించారు. కోట్లతో కలసి సాగితే కర్నూలులో తనకు మైనార్టీ ఓటు బ్యాంకు ఏమైనా కలిసొస్తుందనే ఆలోచనతో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్యే ఎస్వీ వైఖరిపై కేఈ వర్గం మండిపడుతోంది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్న చందంగా.. కోట్ల సుజాతమ్మను కర్నూలులో పోటీ చేయించే ప్రతిపాదన తెచ్చారు. తద్వారా డోన్ టికెట్‌ను తామే దక్కించుకోవడమే కాకుండా.. అటు టీజీ, ఇటు ఎస్వీలను దెబ్బతీయొచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. మొత్తంగా అధికార పార్టీలో ఈ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి. -
అతిథిగానే సీఎం వద్దకు వెళ్లా: కోట్ల
కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గౌరవంగా విందుకు ఆహ్వానించగా అతిథిగా వెళ్లొచ్చానని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బుధవారం కర్నూలులోని స్వృగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేక హోదా తదితర సున్నిత అంశాలపై చర్చించామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధి కోసం తనతో సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కోరినట్లు వెల్లడించారు. పార్టీ మారతారని ప్రచారం జరుగుతోందన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. -
ఏంది రెడ్డీ.. ఇట్ల సేత్తివి?!
‘ఏంది రెడ్డీ ఇట్ల సేత్తివి. మీ కుటుంబాన్ని నమ్ముకుని తెలుగుదేశం నాయకుల అరాచకాలపై కొట్లాడి మా కుటుంబాలు కూడా ఆగమాయనే. జైలుకు కూడా పోయొస్తిమే. అధికారం ఉన్నా,లేకపోయినా మీ వెంటే ఉంటిమే. చివరాఖరుకు నీవు కూడా ఇట్ల చేస్తే ఎట్ల రెడ్డీ?’– ఇదీ ఇప్పుడు కోట్ల అనుచరుల నుంచి వ్యక్తమవుతున్న ఆవేదన. ‘ఇట్లనే కాంగ్రెస్‌లో ఉన్నా నీ వెంటే ఉంటుంటిమి. కుటుంబాలను ఆగమాగం చేసిన టీడీపీతో కలిస్తే మీతో మేమురాలేమ’ని తెగేసి చెబుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో చేరితే మీ దారి మీదే.. మా దారి మాదేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం విజయవాడలో సమావేశమయ్యారు. అమావాస్య వెళ్లిన తర్వాత అంటే ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కోట్ల నిర్ణయంపై అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. మరోవైపు కోట్ల రాకను టీడీపీలోని కేఈ వర్గం బలంగా వ్యతిరేకిస్తోంది. నాతో వచ్చేదెవరు? వాస్తవానికి ఇప్పటికే కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వెంట వైఎస్సార్సీపీలో చేరేందుకు అనేక మంది సిద్ధమయ్యారు. మరికొందరు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తుది నిర్ణయం కోసం ఎదురుచూశారు. తీరా ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైపోవడంతో తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఆయన అనుచరుల్లో అత్యధిక భాగం వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కొద్ది మంది ఏకంగా రాజకీయాలకు దూరమయ్యేందుకు నిర్ణయించుకున్నారు. పుట్టినప్పటి నుంచి టీడీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, కుటుంబాలను సైతం కోల్పోయి, జైలు జీవితం గడిపిన తాము ఇప్పుడు ఆ పార్టీలో ఎలా చేరుతామని నేరుగా కోట్లను ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలకైనా దూరంగా ఉంటాం తప్ప.. టీడీపీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆచితూచి స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదని పత్రికా ప్రకటన ఇవ్వడమే కాకుండా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు. అయితే, వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. డిప్యూటీ సీఎంకే సమాచారం లేకుండా చేరికలు జరగడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ వైరి వర్గంగా ఉన్న తాము ఆయన ఎంపీగా పోటీ చేసినా సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు. మొదటి నుంచి బుట్టా రేణుకతో వైరం ఉన్న కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాత్రం కోట్ల రాకను స్వాగతించారు. మరోవైపు ఎస్వీ ప్రకటనపైనా కేఈ వర్గం మండిపడుతోంది. మొన్నటివరకు తమ సహకారం తీసుకుని ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కోట్ల పంచన చేరుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ ముఖ్యమంత్రితో కోట్ల కుటుంబం కలవడం జిల్లా అధికార పార్టీలో అలజడి రేపిందనే చెప్పవచ్చు. -
నా పరిస్థితేంటి?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. కర్నూలు పార్లమెంట్ సీటును కోట్లకు కేటాయించే అవకాశముంది. దీంతో తన పరిస్థితి ఏమిటంటూ బుట్టా రేణుక నేరుగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అడిగినట్లు తెలుస్తోంది. ఇంకా సీట్ల విషయం ఖరారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో ఆమె మరింతగా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. కాగా.. బుట్టా పార్టీ మారేటప్పుడు టీడీపీలోఎంతో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా తిరిగి ఎంపీ సీటు కేటాయిస్తామని చెప్పారని ఆమె వర్గీయులు అంటున్నారు. స్వయంగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటన సందర్భంగా ఎంపీగా బుట్టాను తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ‘జయహో బీసీ’ అని నినదిస్తూనే ఒక బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని అధికార టీడీపీ వైఖరిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎలా వెళతాం! వాస్తవానికి బుట్టా రేణుక రాజకీయాలకు కొత్త. అయినప్పటికీ ఆమెను గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఉన్న బలంతో ఆమె ఎంపీగా గెలిచారు. తీరా గెలిచిన తర్వాత ఆమె భర్త తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమె మాత్రం వైఎస్సార్సీపీలో కొనసాగారు. అయితే, టీడీపీ ఆకర్ష్ పథకంలో భాగంగా రూ.50 కోట్ల నగదుతో పాటు ఆమె పాఠశాలకు అమరావతిలో భూ కేటాయింపునకు హామీ పొందారు. తీరా టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఎంపీ సీటు కూడా లేకుండా పోతోంది. అయితే.. ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఆశతో వర్గీయులు ఉన్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి మంత్రి లోకేష్ అండదండలున్నాయి. దీంతో ఆయనకే టికెట్ ఇస్తారని అంటున్నారు. ఫలితంగా రెంటింకీ చెడ్డ రేవడిలా బుట్టా పరిస్థితి తయారైంది. ఇదే తరుణంలో బీసీ మహిళకు టీడీపీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాన్ని బీసీ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ వైఖరిపై నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పెద్దన్నగా పిలవబడే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి కనీసం కోట్ల చేరికపై సమాచారం కూడా లేకపోవడాన్ని ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మౌనంగా కేఈ వర్గం జిల్లాలో మొదటి నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఇరువర్గాలకు చెందిన అనేక మంది నేతలు, కార్యకర్తలు ఫ్యాక్షన్‌కు బలైపోయారు. గ్రామాల వారీగా వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు కోట్ల టీడీపీలో చేరనుండడంతో కేఈ వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచి రాజకీయ వైరుధ్యంతో ఉన్న కోట్లతో ఎలా సర్దుకుపోతామంటూ పార్టీ వైఖరిపై ఆగ్రహిస్తున్నారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా గుమ్మనంగా స్పందించారు. కోట్ల చేరికపై తనకు సమాచారం లేదన్నారు. అంతేకాకుండా తమ సీటు అడిగితే అప్పుడు స్పందిస్తానని పరోక్షంగా సంకేతాలు పంపారు. మొత్తమ్మీద ప్రస్తుత పరిణామాలను కేఈ వర్గం సునిశితంగా గమనిస్తోంది. కోట్లకు ఏయే సీట్లు ఇవ్వనున్నారనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని భావిస్తున్నారు. -
టీడీపీ నేతలు చేతకాని దద్దమ్మలు: కోట్ల
డోన్ (కర్నూలు): జిల్లా రైతాంగానికి ఉపయోగపడాల్సిన సాగునీటిని 272 జీవో ద్వారా రాష్ట్రప్రభుత్వం అనంతపురం జిల్లాకు తరలిస్తుంటే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు దద్దమ్మలాగా చోద్యం చూస్తున్నారని కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. నీరు–చెట్టు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఎన్ఆర్ఈజీఎస్ పనుల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలను దిగమింగారని ఆరోపించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలు చెలరేగిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హంద్రీనీవా కాల్వనీటితో చెరువులను నింపే హామీని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నాలుగేళ్లు గడిచినా నెరవేర్చలేకపోయామన్నారు. కర్నూలులో ఆగస్టు 18న నిర్వహించే మహాసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతున్నట్లు తెలిపారు. -
‘2019లో టీడీపీ గెలవదు.. పార్టీ మారను’
-
‘2019లో టీడీపీ గెలవదు.. పార్టీ మారను’
సాక్షి, కర్నూలు: తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తోసిపుచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలోకి మరే ప్రసక్తే లేదని, కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2019లో టీడీపీ అధికారంలోకి రాదని ఆయన జోస్యం చెప్పారు. కోట్ల కుటుంబానికి కొన్ని విలువలు ఉన్నాయని.. వాటికి కట్టుబడి ఉంటానని, పార్టీ మారబోనని ఆయన స్పష్టం చేశారు. సూర్యప్రకాశ్ రెడ్డి పార్టీ మారతారని గతంలో కూడా వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, తన కుటుంబ సభ్యులు కూడా పార్టీ మారబోరని ఆయన వెల్లడించారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ రైతుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలమై, సీమ ద్రోహిగా మిగిలిపోయారని గతంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకులు దోచుకోవడానికే పరిమిత మయ్యారని ఆయన ఆరోపించారు. -
ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఓటమి భయంతోనే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిదా వేస్తూ వస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కళావెంకట్రావ్ భవనం, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదులన్నారు. పార్టీలను ఫిరాయించిన వారిని ప్రజలు క్షమించబోరన్నారు. ప్రభుత్వం జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. 20 సూత్రాల పథకం మాజీ చైర్మన్, జిల్లా ఇన్చార్జి తులసి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్అలీఖాన్లు తదితరులు.. కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీని, వార్డు కమిటీ ఇన్చార్జీలను ప్రకటించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి , డీసీసీ ఉపాధ్యక్షులు వై.వి.రమణ, ప్రధాన కార్యదర్శులు కె.పెద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్
-
చంద్రబాబుకు కోట్ల సూర్యప్రకాశ్ సవాల్
హైదరాబాద్: రెయిన్ గన్ లతో రాయలసీమలో పంటలను కాపాడానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెయిన్ గన్ల వల్ల రాయలసీమలో ఎక్కడా పంటలు పండలేదని ఆయన తెలిపారు. పంటలు పండకపోగా లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అక్కడికి వచ్చి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని సీఎం చంద్రబాబుకు సూర్యప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న కర్నూలు జిల్లా కొడుమూరులో రైతు సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. -
'ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది'
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం హరికేర గ్రామంలో ఎండిన పంటలను మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఈ నెల 2వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ గ్రామంలో పర్యటించారన్నారు. సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టి రెయిన్గన్లు కొనుగోలు చేసి 7.5 లక్షల ఎకరాల పంటను కాపాడామని బూటకపు మాటలు చెప్పాడని విమర్శించారు. పరిస్థితిని చూస్తే ఇక్కడ పంటలన్నీ ఎండిపోయాయన్నారు. పంటలు ఎండిపోయి ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో టీడీపీ పూర్తిగా విఫలమైందన్నారు. తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అక్కడి మహిళలు మాజీ కేంద్రమంత్రి ఎదుట ఆవేదన వెలిబుచ్చారు. -
రైతులకు చంద్రబాబు బకాయిపడ్డారు
హిందూపురం అర్బన్ : రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బకాయి పడ్డారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. హిందూపురం పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం ప్రజా పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ స¿¶ లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.650 కోట్లు వెచ్చించి శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే సక్రమంగా నిర్వహణ చేయకుండా టీడీపీ నాయకులు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ కావాలంటే పచ్చ చొక్కా వేసుకోవాలనేంత దయనీయమైన పాలన చేస్తున్నామని ఎద్దేవా చేశారు. 2013లో కాంగ్రెస్ హయంలో రూ.1,600 ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసినా ఇంతరవకు ఇవ్వలేదన్నారు. మూడేళ్లు పంట చేతికందకున్నా పంట నష్టపరిహారంగా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని వాపోయారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హంద్రీనీవాకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాల్సిందేనన్నారు. అసెంబ్లీ స్థానాలు పెంచారని చంద్రబాబు చెబుతున్నారు.. అదే బిల్లులో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని గుర్తుచేశారు. సభలో ఏపీ కిసాన్lసెల్ రాష్ట్ర కార్యదర్శి రవికిషోర్, పీసీసీ సహాయ కార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ అబ్దుల్వహిద్, స్థానిక నాయకులు పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, యువజన కాంగ్రెస్ కన్వీనర్ రెహమత్ ప్రసంగించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు పోరుబాట డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. -
కోట్లను అవమానించారంటూ నిరసన
కర్నూలు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నేతలు అవమానించారని ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురం జిల్లాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న సభ వేదికపైకి కోట్లను ఆహ్వానించనందుకు నిరసన తెలిపారు. బుధవారం కర్నూలు డీసీసీ కార్యాలయానికి కోట్ల వర్గీయులు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కోట్లను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన బహిరంగ సభలో మన్మోహన్, రాహుల్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే. -
రండి.. రండి.. కోట్లకు ఆహ్వానం!
*టీడీపీలోకి రావాలని కోట్లకు లోకేష్ ఆహ్వానం *ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు *ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవీ * ఇస్తామంటూ బేరసారాలు * రాబోయే ఎన్నికల్లో ఒక ఎంపీ, * రెండు ఎమ్మెల్యే సీట్లకు హామీ *ససేమిరా అంటున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి? కర్నూలు: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులను పార్టీలో చేర్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుమారుడు రాఘవేంద్రారెడ్డితో పలు దఫాలుగా హైదరాబాద్‌లో భేటీ అయినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి వస్తే... జిల్లాలో పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని కూడా ఆశ చూపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అవసరమైతే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగా కోట్ల రాఘవేంద్ర ఒక దశలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, తెలుగుదేశం పార్టీలోకి చేరేది లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. కోట్ల చేరితే... దివంగత కోట్ల విజయభాస్కర రెడ్డి కేంద్ర మంత్రిగా, రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేశారు. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో ఆయన కుటుంబానికి మంచి పేరు ఉంది. జిల్లా ప్రజలు ఆయన్ను ముద్దుగా ‘పెద్దాయన’ అని పిలుస్తుంటారు. అలాంటి కుటుంబాన్ని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలనేది నారా లోకేష్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అయితే, తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్‌తోనే ఉందని... వేరే పార్టీలోకి వెళ్లేది లేదని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నట్టు సమచారం. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలు పట్టువదలడం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికే మంచి ఓట్లు దక్కాయి. కోట్ల కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పార్టీ పటిష్టతకు కోట్ల కుటుంబం చేరితే మంచి ఊపు వస్తుందనేది నారా లోకేష్ ఆలోచన. ఇందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రి సుజనాచౌదరిని కూడా రంగంలోకి దించినట్టు సమాచారం. ఏదైమైనప్పటికీ తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన తన కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మా నాయకుడు వెళ్లడు..తెలుగుదేశం పార్టీలోకి కోట్ల కుటుంబం చేరికపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం రాష్ట్రస్థాయి నేతలు మాత్రం తమ పార్టీలోకి మరికొన్ని రోజులకైనా వస్తాడని అంటుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. తమ నేత ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలో చేరరని స్పష్టం చేస్తున్నారు. అయితే, టీడీపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారనే వార్తలను మాత్రం వీరు అంగీకరిస్తుండటం గమనార్హం. 'మా నేతను తమ పార్టీలోకి చేరమని తెలుగుదేశం నేతలు పైస్థాయిలో చర్చలు జరిపిన మాట వాస్తవం. ఆయన మాత్రం వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ మా నేత వెళ్లే ప్రసక్తే లేదు' అని కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. అయితే, కోట్ల-కేఈ కుటుంబాల మధ్య ఉన్న దీర్ఘకాల వైరుధ్యాల నేపథ్యంలో టీడీపీలోకి కోట్ల ఒకవేళ వచ్చినా... కేఈ వర్గీయులు అంగీకరిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. -
టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారమే పరమావధిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. డీసీసీబీ చైర్మన్ గిరి కోసం అధికార పార్టీ నేతలు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. సోమవారం స్థానిక కళావెంకట్రావు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోట్ల మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలో భాగంగా డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మాన ప్రక్రియను టీడీపీ నాయకులు వాయిదా వేయించారని ఆరోపించారు. డెరైక్టర్లను భయపెట్టి క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. డీసీఓ సుబ్బారావుకు గుండెపోటు రావడం, కలెక్టర్ విజయమోహన్ సెలవులో వెళ్లడం.. ఇదంతా టీడీపీ నాయకుల వ్యూహమన్నారు. ఏ సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డి, డీసీసీబీ శ్రీదేవిలపై తప్పుడు కేసులు పెట్టడం ఆ పార్టీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. అడ్డదారిలో పదవులు చేజిక్కించుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి హైడ్రామా నడుపుతున్నారని ఆరోపించారు. తాను కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే కర్నూలుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించానని, బడ్జెట్ కేటాయింపులను ఎవరూ ఆపలేరని చెప్పారు. కోడుమూరు, దేవనకొండ రహదారులు కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసినవేనని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేకున్నా నాడు వైఎస్ఆర్సీపీ నుంచి జెడ్పీ పీఠం లాక్కున్నారని, నేడు కాంగ్రెస్ వారి నుంచి కేడీసీసీ చైర్మన్ పదవి పొందేందుకు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు మాట్లాడుతూ టీడీపీ నాయకులు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి, కర్నూలులో యథేచ్ఛగా ఇసుక తరలింపు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు తప్పడు వాగ్ధానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాకా ఆదర్శరైతులను ఇంటికి పంపించారని, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లు రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో డీసీసీ సెక్రటరీ ఎస్.ఖలీల్‌బాష, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీఎంఎస్ చైర్మన్ లక్కసాగరం లక్ష్మిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఎం.పి.తిప్పన్న, చున్నుమియ్య, సలాం, భాస్కరరెడ్డి, ఇమాంపటేల్ పాల్గొన్నారు. -
కర్నూలును రాజధానిగా చేయాలని కోరాం: కోట్ల
-
వ్యాపారులే కాంగ్రెస్ నుంచి వెళుతున్నారు: కోట్ల
-
రైల్వేమంత్రి బడ్జెట్.. సహాయ మంత్రి నిరసన
పార్లమెంటులో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాక్షాత్తు రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతుంటే, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి మాత్రం వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సాధారణంగా ఒక శాఖకు చెందిన మంత్రి ఏవైనా బిల్లులు ప్రవేశపెడుతుంటేనే ఆ శాఖకు చెందిన సహాయ మంత్రులు అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండి, తోటి సభ్యుల ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు, అలాగే సీనియర్ మంత్రికి ఏమైనా అవసరమైతే సహాయపడుతుంటారు. కానీ బుధవారం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన లోక్‌సభ సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దంటూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. అదే జాబితాలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి కూడా ఉన్నారు. రైల్వే బడ్జెట్‌ను తన సీనియర్ మంత్రి ప్రవేశపెడుతున్నా దానికంటే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకోవడం, నిరసన తెలియజేయడమే ముఖ్యంగా భావించారు. దాంతో తోటి సీమాంధ్ర ఎంపీలు, మంత్రులతో కలిసి తాను సైతం వెల్‌లోకి దూసుకెళ్లారు. సీమాంధ్ర ఎంపీలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందినవారు కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో అచ్చం మన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లాగే రైల్వే బడ్జెట్ కూడా పది నిమిషాల్లోనే ముగించి, మిగిలినది కూడా చదివినట్లు భావించాలని చెప్పి వదిలేశారు. బడ్జెట్ ప్రతులను మాత్రం సభ్యులందరికీ పంచిపెట్టారు!! -
హడావుడి సృష్టిస్తున్న నాయకులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపోటములపై నేతల్లో గుబులు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మార్చి మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చనే సంకేతాలు వెలువడటంతో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. అధికార పార్టీ నేతలు మరోసారి తమ సీటు పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రజల్లో పరపతి పెంచుకునేందుకు గీత దాటేందుకూ వెనుకాడటం లేదు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాల పేరిట హంగామా సృష్టిస్తున్నారు. గత వారం కర్నూలులో రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. అదే రోజు కల్లూరులో ఇంటి పట్టాలను కూడా పంపిణీ చేశారు. ఇకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో ఢిల్లీకి పరిమితమైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సైతం ఇప్పుడిప్పుడే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శనివారం నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటి వద్దే వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం చర్చనీయాంశమైంది. ఇదేవిధంగా నాయకులంతా ఏదో ఒక రూపంలో ప్రజల ముంగిట వాలిపోతున్నారు. కార్యక్రమం చిన్నదైనా నలుగురు ప్రజలు కలుస్తున్నారంటే.. ఆ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం వారిని అడుగు బయటపెట్టనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచేందుకు దాదాపుగా అభ్యర్థులు కరువయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చే నాయకుల కోసం ద్వారాలు తెరిచి ఉంచారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే వచ్చే వారు కూడా రారేమోననే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా అధికారుల్లోనూ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చేలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పలువురు అధికారులు నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన నాయకుల జాబితాను ఇప్పటికే ముఖ్యమంత్రి ముందుంచినట్లు చర్చ జరుగుతోంది. -
టీజీ Vs కోట్ల
-
కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై టీజీ ఫైర్
కర్నూలు: కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిక్కెట్టు ఇవ్వలేదని కార్యాలయానికి నిప్పంటించే సంస్కృతి ఒక్క సూర్య ప్రకాశ్ రెడ్డికే ఉందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో ఎవరుపడితే వారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. ఓవైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని టీజీని ఉద్దేశించి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీని వీడతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టీజీ వెంకటేష్ తెలిపారు. పార్టీ కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమని టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు: కోట్ల
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే తెలంగాణ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయానికి నిరసనగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన వారి గురించి తనకు తెలియదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్టున్నట్టు తెలిపారు. ఈ సాయంత్రం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తన రాజీనామా లేఖ ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు. -
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో సమావేశమైన కోట్ల రాజీనామా లేఖను అందజేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొందరు మంత్రులు, ఎంపీలు ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం. -
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
-
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరామని కాంగ్రెస్ నాయకుడు, రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తెలిపారు. తమ ప్రాంత నేతలతో పాటు సోనియాను కలిసిన తర్వాత ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకుంటే మూడు రాష్ట్రాలు చేయాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల తమ ప్రాంతంలో తాగునీటి సమస్య వస్తుందని తెలిపామన్నారు. హైకమాండ్ ముందు రాయల తెలంగాణ ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజీనామాలతో సమస్యలు పరిష్కారమైతే తాను రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించారు. హైపవర్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించనున్నట్టు తెలిపారు. త్రిసభ్య కమిటీ తమ సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మకాన్ని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలిపేందుకు వారు మొగ్గు చూపుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే తాము సమైక్యాంధ్రకు కట్టుబడ్డామని, కలిసుండేందుకు వీలుకాకపోతే తమకు ప్రత్యేకంగా గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది. -
విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
-
విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
ఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. రాయల్-తెలంగాణ అంశం వెనక్కు వెళ్లిపోయింది. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం - మరో పక్క హైదరాబాద్ అంశంపై చర్చ - ఇంకోవైపు సీమాంధ్ర కావాలన్న వాదం ... ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా నేతలు తమ జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎస్పివై రెడ్డి, రాభూపాల్ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని వారు కోరారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా వారు కోరారు. తమ జిల్లాను తెలంగాణలో కలపమని ఆమెను కూడా వారు కోరనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అని సమైక్యాంధ్రవాదులు విమర్శిస్తున్నారు. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో ఒక్క కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపమని కోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు.