కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆయన నివాసంలో సమావేశమైన కోట్ల రాజీనామా లేఖను అందజేశారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొందరు మంత్రులు, ఎంపీలు ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం.