
రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రకటన
విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: రైల్వేలో పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయినా నియామకాలపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. రైల్వేలో రిక్రూట్‌మెంట్ జరగలేదని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్యసభలో సోమవారం ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగుల్లో గత పదేళ్లలోనే 40 శాతం నియామకాలు జరిగాయని వెల్లడించారు.
నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఇటీవల జరిగిన లోకో పైలట్ల పరీక్షకు 156 నగరాల్లోని 346 కేంద్రాల్లో 18.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. లెవల్ 1 నుంచి లెవల్ 6 నియామకాలకు 2.32 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భర్తీ చేశామని తెలిపారు. రైల్వే, రక్షణ వంటి శాఖలపై రాజకీయాలు సరికాదన్నారు. మంత్రి స్పందన సరిగా లేదంటూ విపక్షాలు అభ్యంతరం వెలిబుచ్చాయి. నిరసన వాకౌట్ చేశాయి.
అత్యాధునిక భద్రతా చర్యలు
మహాకుంభ్ మేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా డేటా భద్రంగా ఉందని మంత్రి అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోందని, దాదాపు 300 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు దేశ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 60 స్టేషన్లను గుర్తించామని వైష్ణవ్ తెలిపారు. వీటన్నింటిలోనూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు.
నిలకడగా ఆర్థిక పరిస్థితి
రైల్వే ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందన్న మంత్రి.. కోవిడ్ మహమ్మారి సందర్భంగా ఎదురైన సవాళ్లను విజయవంతంగా అధిగమించిందని చెప్పారు. ప్యాసింజర్ రైళ్లు, కార్గో ట్రాఫిక్ రెండింటిలోనూ వృద్ధి నమోదైందన్నారు. 2023 –24 మధ్య సుమారు రూ 2,78,000 కోట్ల ఆదాయం వచి్చందన్నారు. సిబ్బంది వ్యయం, పెన్షన్ చెల్లింపులు, ఇంధన వ్యయాలు, ఫైనాన్సింగ్‌పై రైల్వే ఖర్చు చేసిందన్నారు. తన సొంత ఆదాయంతోనే వ్యయాన్ని భరిస్తోందని, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
కార్గో, సరుకు రవాణా ఆదాయంతో ప్రయాణికుల చార్జీల సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే మన రైల్వేలో అన్ని కేటగిరీల్లో టికెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మార్చి 31 నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణాతో మన దేశం ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. 50 వేల కిలోమీటర్ల ట్రాక్‌ల నిర్మాణం, 12 వేల అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, 14 వేల వంతెనల పునరి్నర్మాణం మన రైల్వే సాధించిన విజయాలని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు.
ఎగుమతుల రంగంలో..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వస్తువుల ఎగుమతులను రైల్వే ఎలా పెంచుతోందో వివరించారు ఆ్రస్టేలియాకు మెట్రో కోచ్‌లు ఎగుమతి చేస్తున్నామన్నారు. బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆ్రస్టేలియాలకు బోగీలు, ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీలకు ప్రొపల్షన్‌లు, మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ప్రయాణికుల బోగీలు ఎగుమతి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు లోకోమోటివ్‌లను ఎగుమతి చేస్తున్నామని, సమీప భవిష్యత్‌లో బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న మర్హోరా వద్ద తయారైన 100కు పైగా లోకోమోటివ్‌లను ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆయా రాష్ట్రాల సహకారాన్ని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రైల్వేలు విఫలమయ్యాయన్న ఆరోపణలు వైష్ణవ్ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment