Union Railway Minister
-
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
Odisha tragedy: 51 గంటల నాన్‌స్టాప్ ఆపరేషన్.. ఆయన వల్లే ఇదంతా!
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన తీరు.. అక్కడి దృశ్యాలను చూసిన వాళ్లెవరైనా.. అది ఎంత తీవ్రమైందో అంచనా వేసేయొచ్చు. అలాంటిది సహాయక చర్యల దగ్గరి నుంచి.. తిరిగి పట్టాలపై ఆ రూట్లో రైళ్లు పరుగులు తీయడం దాకా.. అంతా జెట్స్పీడ్తో జరిగింది. మునుపెన్నడూ లేనంతగా కేవలం 51 గంటల్లో ఈ ఆపరేషన్ ముగిసింది. ఎలా?.. అందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాన కారణమని చెప్పొచ్చు. గతంలో మన దేశంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా.. రైల్వే మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం, అందుకు తగ్గట్లే కొందరు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, బాలాసోర్ ఘటన వేళ.. అశ్విని వైష్ణవ్ త్వరగతిన స్పందించిన తీరు, స్వయంగా ఆపరేషన్‌ను ఆయనే దగ్గరుండి పరిశీలించడం లాంటివి ఆయన మీద ప్రతికూల విమర్శలు రాకుండా చేశాయి. ⛑️ ప్రమాదం జరిగిన గంటల్లోపే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. సీఎం నవీన్ పట్నాయక్ కంటే ముందుగానే.. వేకువ ఝామున అక్కడికి చేరుకుని ప్రమాద తీవ్రతను, సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సహాయ, పునరావాస చర్యల వేగం ఊపందుకుంది. అశ్వినీ వైష్ణవ్ ఒకప్పుడు బాలాసోర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే.. 1999లో ఒరిస్సా(ఇప్పటి ఒడిశా) భారీ తుఫాను ముప్పును సమర్థంగా ఎదుర్కొన్న అనుభవమూ ఆయనకు ఈ సందర్భంగా పనికొచ్చాయి. ⛑️ జరిగింది భారీ ప్రమాదం. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటిది ఎరిగింది లేదు. ఒకవైపు శవాల గుట్టలు.. మరోవైపు పెద్ద సంఖ్యలో బాధితులు. పకడ్బందీ కార్యాచరణ, ప్రణాళిక లేకుండా ఈ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లడం కష్టం. ఆ స్థానంలో ఎవరున్నా ఇబ్బందిపడేవాళ్లేమో!. కానీ, విపత్తుల నిర్వహణపై ఆయనకున్న అవగాహన, గత అనుభవం.. బాలాసోర్ ప్రమాద వేళ సాయపడింది. అధికారులతో మాట్లాడి, సాంకేతిక సమస్యలను అధిగమించే వ్యూహ ప్రణాళిక సిద్ధం చేశారు. స్వయంగా ఆయనే దగ్గరుండి అంతా పర్యవేక్షించారు. VIDEO | Union Railway Minister Ashwini Vaishnaw inspects the restoration work at the triple train accident site in Odisha’s Balasore. pic.twitter.com/U7Xno9BDpt — Press Trust of India (@PTI_News) June 4, 2023 ⛑️ 2, 300 మంది సిబ్బంది.. రైల్వే శాఖ నుంచి ఎనిమిది బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ప్రతి రెండు బృందాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు వేర్వేరుగా పర్యవేక్షించారు. ఆ సీనియర్ సెక్షన్ ఇంజనీర్లపై డివిజనల్ రైల్వే మేనేజర్, జనరల్ మేనేజర్ పర్యవేక్షణ కొనసాగింది. వారిని రైల్వే బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. #WATCH | Odisha: Union Railway Minister Ashwini Vaishnaw takes stock of the restoration work that is underway overnight at the site where #Balasoretrainaccident took place pic.twitter.com/TkulNKv3H7 — ANI (@ANI) June 3, 2023 ⛑️ బాధితులను వేగంగా ఆసుపత్రులకు తరలించడం, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూసేందుకు కూడా మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాలు ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్ ను కటక్ హాస్పిటల్ కు, డైరెక్టర్ జనరల్ హెల్త్ ను భువనేశ్వర్ హాస్పిటల్ కు పంపించారు. ⛑️ నాలుగు కెమెరాలను క్షేత్రస్థాయి సిబ్బందికి అందించారు. ప్రమాద స్థలంలో సహాయక కార్యక్రమాల తీరును ఆ కెమెరాల సాయంతో సీనియర్ అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పురోగతిని మంత్రికి అందించారు. సాధ్యమైనంత మేర మరణాలను తగ్గించడం, ! బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టడం.. ⛑️ ఇవే లక్ష్యాలుగా ఆయన ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అలా 51 గంటల్లోనే మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో రైలు సేవలను పునరుద్ధరించగలిగారు. ఈ నెల 2న రాత్రి ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 130 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టింది. బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో మెయిల్ లైన్ లో వెళుతున్న యశ్వంత్ పూర్ హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి 288 మంది మరణించారు. -
రైల్వేలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు: కేంద్రమంత్రి
హైదరాబాద్: హైదరాబాద్‌లో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కవచ్' కేంద్రాన్ని పరిశీలించారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ బలమైన జాతి నిర్మాణం కోసం పెట్టాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని చెప్పారు. ప్రపంచం అంతా ద్రవ్యోల్బణం వైపు వెళ్తుంటే మన దేశం అభివృద్ధి వైపు వెళ్తుందన్నారు. 2014లో ఇండియా 10 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. అతి త్వరలో టాప్-3 లో ఇండియా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కేటాయింపులు రూ.886 కోట్లు ఉంటే.. ఇప్పుడు ఒక్క తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. రూ.29 ,581 కోట్ల ప్రాజెక్ట్ లు తెలంగాణ లో పురోగతిలో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులు, అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి సహకారం లేదని, ఒకవేళ ఉంటే.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. 'తెలంగాణలో మరో 39 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తాం. విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం ఉంది. కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు 521 కోట్లు కేటాయించాం. మొత్తం 160 ఎకరాలు కావాలి. 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చింది. తెలంగాణలో 20 ఎంఎంటీఎస్ కొత్త ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్య నడుస్తాయి. రైల్వేలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు. తెలంగాణకు రెండు ఎక్సలేన్సీ కేంద్రాలు కేటాయించాం. కేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడం దురదృష్టకరం. కేంద్రం ఒంటరిగా అభివృద్ధి చేయలేదు.' అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. చదవండి: స్పీడ్ పెంచిన కాంగ్రెస్.. ముఖ్యనేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం -
విశాఖ రైల్వే జోన్ వదంతులపై రైల్వే మంత్రి స్పందన
సాక్షి, ఢిల్లీ: రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దు. రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది’’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా తెలియజేశారు. ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్.. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయ్! -
ఏపీకి ప్రత్యేక సాయం చేయండి
రైల్వే కేటాయింపులపై కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కేటాయింపుల్లో ఏపీకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లను మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన సుబ్బారెడ్డి.. ఏపీకి, ఒంగోలు జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రెండో టికెట్ బుకింగ్ కౌంటర్, రెండో ఎస్కలేటర్, లిఫ్ట్ సదు పాయం కల్పించాలని కోరారు. ఒంగోలు– సికింద్రాబాద్ మధ్య నడికుడి మీదుగా అమరావతిని కలుపుతూ పగలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని కోరారు. ఒంగోలు స్టేషన్లో కేరళ, జోధ్‌పూర్, జైపూర్, పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలపాలని విజ్ఞప్తి చేశారు. టంగుటూరులో తిరుమల, హైద రాబాద్, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వా లని అభ్యర్థించారు. అలా గే సింగరాయకొండ స్టేషన్లో పద్మావతి, చార్మినార్, మచిలీపట్నం, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు, దొనకొండలో హౌరా ఎక్స్ ప్రెస్, కురిచేడులో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. గుంటూరు– ముంబై రైలును నడపాలని, సికింద్రాబాద్–గుంటూరు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టడం, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్–గుంటూరు ప్యాసింజర్ రైలు ను ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, మచిలీ పట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడపాలని, సికింద్రాబాద్‌లో రాత్రి 10.55 గంటలకు బయల్దేరే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 10 గంటలకు మార్చాలని అభ్యర్థిస్తూ వినతిప్రత్రాన్ని సమర్పించారు. -
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో సమావేశమైన కోట్ల రాజీనామా లేఖను అందజేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి కూడా అంతకుముందు తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొందరు మంత్రులు, ఎంపీలు ఇదే బాటలో ఉన్నట్టు సమాచారం.