విశాఖ రైల్వే జోన్‌ వదంతులపై రైల్వే మంత్రి స్పందన | Union Railway Minister Clarity Vishaka Railway Zone | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వే జోన్‌కి కట్టుబడి ఉన్నాం.. వదంతులు నమ్మొద్దు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి

Published Wed, Sep 28 2022 4:02 PM | Last Updated on Wed, Sep 28 2022 4:23 PM

Union Railway Minister Clarity Vishaka Railway Zone - Sakshi

రైల్వే జోన్‌ హామీకి కట్టుబడి ఉన్నామని, వదంతులు నమ్మాల్సిన అవసరం లేదని.. 

సాక్షి, ఢిల్లీ: రైల్వే జోన్‌ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. 

‘‘విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దు. రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది’’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా తెలియజేశారు.

ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్‌.. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement