clarity
-
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్ క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్‌తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. -
రైతు భరోసాకు సర్వం సిద్ధం.. వాళ్లకే పెట్టుబడి సాయం..!
-
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
TG: బస్సు ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ
సాక్షి,హైదరాబాద్: దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు.ఈ విషయమై సోమవారం(అక్టోబర్14) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. టికెట్ ధరలు పెంచారన్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ‘ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. ఈ ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోంది. జీవో నెంబర్ 16 ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలను సంస్థ సవరించింది.రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు లేదు.స్పెషల్ బస్సుల్లో డీజిల్ ఖర్చులకు అనుగుణంగా ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు జీవో నెంబర్ 16 ప్రకారం’ఉంది అని సజ్జనార్ తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణ గ్రూప్1పై హైకోర్టు తీర్పు రేపు -
మహిళలపై వ్యాఖ్యలు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఫ్రీ బస్సు స్కీమ్‌కు సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (ఆగస్టు16) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్ ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు. కాగా, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఫ్రీ బస్సు స్కీమ్‌పై మాట్లాడారు.నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.— KTR (@KTRBRS) August 16, 2024బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బబ్రేక్డ్యాన్సులు కూడా వేసుకోండి’ అని కేటీఆర్ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టలేదు: అమెరికా
వాషింగ్టన్: తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్‌హౌజ్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జీన్పియెర్రె సోమవారం(ఆగస్టు12) మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదు. ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవీ నిజం కావు. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటాం’అని పియెర్రె తెలిపారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను అప్పగించనందుకే తనను పదవి నుంచి అమెరికా దించిందని షేక్‌హసీనా ఆరోపించినట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే తన తల్లి అలాంటి ఆరోపణలేవీ చేయలేదని షేక్‌హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చెప్పడం గమనార్హం. -
అసత్యపు వార్త ప్రచారాలపై స్పందించిన కేతిరెడ్డి
-
USA: ఎన్నికల్లో పోటీ.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కవవుతోంది. సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌పై అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించినప్పటి నుంచి బైడెన్ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం(జులై 12) డెట్రాయిట్లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ‘రేసులో నేను పరిగెడుతున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు, అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి. నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తేనే ఇవి సాధ్యమవుతాయి’అని బైడెన్ తెలిపారు. ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
నీట్ వివాదం.. ధర్మేంద్ర ప్రదాన్ కీలక కామెంట్స్
భువనేశ్వర్: ‘నీట్’పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవేళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులది తప్పని తేలితే వదిలేది లేదని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఆదివారం(జూన్16) ఒడిశాలోని సంబల్పూర్లో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పేపర్‌లీక్‌కు సంబంధించి రెండు చోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేరెంట్స్, తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నా. ఇందులో ఎంత పెద్దస్థాయి అధికారులున్నప్పటికీ వదిలేది లేదు. ఎన్టీఏలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. బిహార్ ఆర్థిక నేరాల విభాగం తొమ్మిది మంది నీట్ అభ్యర్థులకు పేపర్‌లీక్ కేసులో నోటీసులిచ్చింది. వారిని విచారణకోసం పిలిచాం’అని ప్రదాన్ తెలిపారు. -
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్‌ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్‌కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్‌లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్‌లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
‘అగ్నిపథ్’ స్కీమ్‌పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్‌పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం. ఈ స్కీమ్‌ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు. -
కంచరపాలెం ఘటనలో ఏం జరిగిందో చెప్పిన DCP
-
విడాకులకు సిద్ధమవుతున్న హీరోయిన్? క్లారిటీ ఇచ్చిన భర్త
టీ-సిరీస్ అధినేత, ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్,నటి దివ్య ఖోస్లా కుమార్ జంట విడాకులకు సిద్ధమతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లవ్ టుడేతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన దివ్యా ఖోస్లా ఇన్‌స్టా ఐడీలో ‘కుమార్’ అనే ఇంటిపేరును తొలగించడంతో విడాకుల పుకార్లకు తెర లేచింది. అంతేకాదు పేరుకు ముందు 's' ని కూడా జోడించడంతో మరిన్నిసందేహాలు వెల్లువెత్తాయి. అంతేకాదు భర్త భూషణ్ కుమార్ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ సోషల్ మీడియా ఖాతాను కూడా అన్‌ఫాలో చేసింది. అయితే ఇవన్నీ పుకార్లేనని భరత్‌భూషణ్ టి-సిరీస్ టీం క్లారిటీ ఇచ్చింది. దివ్య ఖోస్లా తన ఇంటిపేరు తొలగింపునకు కారణం జ్యోతిష్య శాస్త్రం, ఇది వ్యక్తిగత నిర్ణయమని దీన్ని గౌరవించాలని టీ సిరీస్‌కి ప్రతినిధి వెల్లడించారు. పేరు ముందు 's' చేర్చడం వెనకాల కూడా ఇదే కారణమని స్పష్టతనిచ్చారు. ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. 90ల నాటి పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన ముద్దుగుయ్యే దివ్యా ఖోసలా. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘అయ్యో రామ’ పెద్ద సంచలనమే సృష్టించింది.తన గ్లామర్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహా అనేక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత దివ్య ఖోస్లా కుమార్ ప్రధాన పాత్రలో ‘హీరో హీరోయిన్’ మూవీ,తెలుగు, హిందీలో విడుదల కానుంది. సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ సినిమాఫస్ట్ లుక్ పోస్టర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by Divyakhossla (@divyakhossla) 2005 ఫిబ్రవరి 13న భూషణ్ కుమార్‌ను పెళ్లాడింది. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు ద బ్రేక్ తీసుకున్న దివ్య 2016లో సనమ్ రే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. చివరిగా మీజాన్ జాఫ్రీ , పెరల్ వి పూరితో కలిసి రొమాంటిక్ డ్రామా 'యారియన్ 2'లో కనిపించింది. నటిగానే కాదు నిర్మాతగా కూడా అవతరించింది. -
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనపై ఇటీవల సోషల్‌మీడియాలో పలు అవినీతి ఆరోపణలు వ్యాప్తి చెందాయి. దీంతో మహేందర్‌రెడ్డి మంగళవారం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నవని తెలియజేశారు. ‘నేను 36 ఏళ్ళకు పైగా ఎలాంటి కళంకం లేకుండా పదవీ విరమణ వరకు అంకిత భావంతో పనిచేశా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో పోలీసు శాఖలో సుధీర్ఘ కాలం పనిచేశా. నా కెరీర్ మొత్తంలో.. నేను క్లీన్ రికార్డ్, ఖ్యాతిని కొనసాగించాను. పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధాలు, నిరాధారమైనవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్న/ సర్క్యులేట్ చేస్తున్న వారందరిపై క్రిమినల్ చర్యలు, పరువునష్టం దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
‘పార్టీ మారను.. సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’
సాక్షి, కాకినాడ జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మార్పుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘‘పార్టీ మారను.. రాజీనామా చేయను.. వైఎస్సార్సీపీ, సీఎం జగన్‌తోనే నా ప్రయాణం’’ అని దొరబాబు స్పష్టం చేశారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు,అభిమానులతో పిఠాపురం ఎమ్మెల్యే ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం టికెట్ ఇస్తారని సీఎం జగన్‌పై నమ్మకం ఉందన్నారు. తాను ఏ పార్టీని కలవలేదని దొరబాబు అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు -
సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్ క్లారిటీ
సహారా గ్రూపు ఫౌండర్ చైర్మన్ సుబ్రతా రాయ్ మరణంతో, సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంగతి, వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతాయనే ఆందోళన నెలకొంది. అయితే తాజాగా దీనిపై మార్కెట్ రెగ్యులేటరీ సెబీ క్లారిటీ ఇచ్చింది. చట్టపరమైన చర్యలు, విచారణ వ్యక్తిపై కాదని, గ్రూపుపై అని, ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ కొనసాగుతుందని సెబీ చైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ గురువారం స్పష్టం చేశారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా దర్యాప్తు కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ FICCI నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ సందర్భంగా బుచ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారులకు రీఫండ్ చేయాల్సింన మొత్తం రూ. 25,000 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, మార్చి 31 నాటికి సెబీ మొత్తం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్ చేసింది. పెట్టుబడి రుజువుతో ముందుకు వస్తున్న వారికి చెల్లింపులు జరిగాయని ఆమె చెప్పారు. కాగా సెబీ-సహారా కేసులో మద్య సుదీర్ఘ న్యాయ పోరాటం జరుగుతోంది. ఈ కేసులో రెండు సహారా గ్రూప్ సంస్థలు– సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించారనేది అభియోగం. సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ జారీ చేసిన హౌసింగ్ బాండ్ల వ్యత్యాసాలను చార్టర్డ్ అకౌంటెంట్ రోషన్ లాల్ ఫిర్యాదుతో సహారా గ్రూప్ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై 2008లో సెబీ దర్యాప్తు ప్రారంభించింది. సెబీ విచారణ తర్వాత సుబ్రతా రాయ్ కూడా జైలు పాలయ్యారు సహారా కన్వర్టబుల్ డిబెంచర్లు (OFCDలు) జారీ ద్వారా సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. సుమారు 3 కోట్ల మంది పెట్టుబడిదారుల నుండి సేకరించిన ఈ నిధులను తిరిగి చెల్లించాలని సహారా గ్రూప్ సంస్థలైన SIREL, SHICLలకు 2011లో సెబీ ఆదేశించింది. ఆగస్టు 31, 2012న, సెబీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, సేకరించిన మొత్తాన్ని 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. -
ఆనంద్ మహీంద్రపై చీటింగ్ కేసు: కంపెనీ క్లారిటీ ఇది
తన కుమారుడికి మరణానికి కారణమంటూ ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలైన కేసుపై సంస్థ స్పందించింది. మృతుడు నడిపిన స్కార్పియో వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్‌లో ఎలాంటి లోపం లేదంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. సెప్టెంబర్ 23, 2023న దాఖలైన ఎఫ్ఐఆర్కు సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటన జారీ చేసింది. దాదాపు రూ. 20 లక్షల ఖరీదు చేసే కారులో భద్రతా ఫీచర్లపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తిన నేపథ్యంలో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. సంబంధిత కారులో ఎయిర్‌బ్యాగులు ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే వాహనం బోల్తా పడిన కారణంగా కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కాలేదని తెలిపింది.అంతేకాదు ఈ కేసు 18 నెలలకు పైగా పాతది ఈ సంఘటన జనవరి 2022లో జరిగిందని తెలిపింది. 2020లో తయారైన స్కార్పియో S9 వేరియంట్లో ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయని ధృవీకరింకరించింది. తమ పరిశీలనలో ఎయిర్‌బ్యాగ్‌ల లోపం లేదని తేలిందని వాహనం బోల్తా పడినపుడు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావని తెలిపింది. దీనిపై గత ఏడాది అక్టోబర్‌లో తమ టీం వివరణాత్మక సాంకేతిక పరిశోధన నిర్వహించినట్టు కూడా తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది, విచారణకు తాము పూర్తి సహకరిస్తున్నామని పేర్కొంది. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. కాగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజేష్ మిశ్రా ఫిర్యాదు మేరకు మిశ్రా తన కుమారుడు అపూర్వ్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బ్లాక్ స్కార్పియో కారును బహుమతిగా ఇచ్చారు. 2022 జనవరి 14న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లనే తనకు తీరని నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదు చేశారు.కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్ మహీంద్రాతో పాటు, ఇతర కీలక ఉద్యోగులపై చీటింగ్ కేసు, 506 (నేరపూరిత బెదిరింపు), 102-B (నేరపూరిత బెదిరింపు)కేసులుపెట్టిన సంగతితెలిసిందే. -
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది. 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
టీసీఎస్‌లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ
ఐటీ దిగ్గజం టీసీఎస్‌లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆంగ్ల పత్రికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దీనిపై స్పందించింది. తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని స్పష్టం చేసింది. తమ నుంచి కీలక వ్యక్తులు ఎవరూ ఇందులో లేరని తెలిపింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగాల కుంభకోణంపై స్పందించింది. సంస్థలోని కీలక ఉద్యోగులు రూ.100 కోట్ల కమిషన్లను వసూలు చేశారనే ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర ఏదీ లేదని వివరించింది. శుక్రవారం పలు మీడియాల్లో వచ్చిన వార్తలు సత్యదూరమైనవని తెలిపింది. ఈ మేరకు టీసీఎస్ కీలక ప్రకటన జారీ చేసింది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) రిక్రూట్మెంట్ స్కాంపై అందిన ఫిర్యాదు మేరకు అంశాన్ని పరిశీలించామని అయితే తమ రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎలాంటి మోసం జరగలేదని తేలిందని వెల్లడించింది. ఇందులో తమ ఉద్యోగుల పాత్ర లేని తెలిపింది. అంతేకాదు టీసీఎస్ నియామకాల్లోరిక్రూట్మెంట్ విభాగం పాత్ర ఉండదని వివరించింది. ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి అందుబాటులో ఉన్న వనరులను ఉద్యోగులకు చూసుకునే బాధ్యత మాత్రమే ఆర్ఎంజీ అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన వార్తలన్నీ సంస్థ ప్రధాన నియామక బృందానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వివరించింది. (అపుడు తప్పింది..ఇపుడు మింగేసింది: పాకిస్తాన్ టైకూన్ విషాద గాథ) -
మినిమమ్ బ్యాలన్స్ తప్పుడు వార్తల పై క్లారిటీ..!
-
విజయ్ తో తమన్నా ప్రేమాయణం
-
మహా విషాదంపై రైల్వే మంత్రి క్లారిటీ
-
ధోని నోట రిటైర్మెంట్ మాట ఎప్పటికి క్లారిటీ వచ్చింది..
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రైనా..
-
వీడియో: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!
-
సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ
శరత్ బాబు చనిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంపై ఆయన సోదరి స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది. శరత్ బాబు చనిపోలేదని.. ఆయన ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం.' అని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో పలువురు శరత్ బాబు చనిపోయినట్లు వైరల్ చేయడంతో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు!) శరత్ బాబు సోదరి మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం రికవరీ అయి.. వేరే రూముకు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీ అందరితో మాట్లాడుతారని ఆశిస్తున్నా.' అని అన్నారు. కాగా.. ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. (ఇది చదవండి: చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉంది: స్టార్ హీరోయిన్) మూడు సార్లు నంది అవార్డులు శరత్ బాబు హీరోగా నటించిన తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నెవయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. తర్వాత తెలుగులో బాలచందర్ దర్శకత్వంలో విడుదలైన చిలకమ్మ చెప్పింది సినిమాలో నటించారు. కొన్నేళ్ల పాటు వెండితెరపై కనిపించిన శరత్ బాబు ప్రస్తుతం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. శరత్ బాబు దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించారు. మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. -
బీఆర్ఎస్తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు
సాక్షి, సంగారెడ్డి: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండబోదని రాహుల్‌గాంధీ గతంలోనే చెప్పారని మాణిక్‌రావుఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయనీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు. ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి సోమవారం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సంగారెడ్డికి వచ్చిన ఠాక్రే మీడియాతో మాట్లాడారు. దళిత సీఎం అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఠాక్రే వెంట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్, నేతలు వి.హన్మంత్‌రావు, అజారుద్దీన్, పొన్నాల లక్ష్మయ్య, రోహిత్‌చౌదరి, మధుయాష్కిగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్, కుసుమ్‌కుమార్ ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక విషయమై విలేకరులు అడగగా, పారీ్టలోకి ఎవరైనా రావచ్చని, పొంగులేటి వస్తే ఆహా్వనిస్తామన్నారు. చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్ -
రామబాణం బడ్జెట్ రుమౌర్స్ ఫై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్
-
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదు : కేంద్రం
-
ఉపాసన బరువు పెరగకపోవడానికి కారణం..?
-
జూపల్లి కృష్ణరావును బీజేపీలోకి ఆహ్వానించా : డీకే అరుణ
-
బీజేపీతో కాపురం.. టీడీపీతో లవ్.. క్లారిటీ ఎప్పుడొస్తుంది పవన్?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సాధారణంగా ఏ విషయంలోనూ పెద్ద క్లారిటీ ఉండదన్నది ఆయనపై జన సామాన్యంలో ఉన్న భావన. దానిని ఆయన ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన చూడండి. ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. పవన్‌కు ఒక సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలో లేకుండా చేయడమెలా అన్నదే ఆయన ఆలోచన. అదే సిద్ధాంతం. బాగా నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇందుకోసం టీడీపీతో కలవడానికి చేయని ప్రయత్నం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా పదే పదే లవ్ సంకేతాలు పంపుతున్నారు. కానీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం పవన్ తాను బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో లవ్‌లో ఉండడమే. ముందుగా బీజేపీతో విడాకులు తీసుకుంటే కానీ, టీడీపీతో కలవడానికి వీలు ఉండదు. బీజేపీతో నిమిత్తం లేకుండా తనదారిన తాను చంద్రబాబు చెంతకు వెళ్లవచ్చుకానీ, బీజేపీ వారికి ఎక్కడ కోపం వస్తుందోనని ఈ రెండు పార్టీలు భయపడుతున్నాయి. అలా చేస్తే టీడీపీతో జనసేన లేచిపోయిందన్న విమర్శ రావచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కానీ, ఆయన సహచరుడు ,మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కానీ పలు విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని ఉప ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇవ్వడం, మరో సందర్భంలో స్థానిక ఎన్నికలలో కొన్ని చోట్ల టీడీపీకి మద్దతు ఇవ్వడం వంటివి చేశారు. ఈ రకంగా ఈ విషయంలోను జనసేనకు క్లారిటీ లేదని తేలుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో కొత్త కోణం తీసుకున్నారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. తద్వారా మళ్లీ తనకు క్లారిటీ లేదని పవన్ కళ్యాణ్ రుజువు చేసుకున్నారు. తన రాజకీయ పార్టనర్ అయిన బీజేపీ అభ్యర్ధి మాధవ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్నప్పుడు ఆయనకు ఎందుకు పవన్ మద్దతు ఇవ్వలేదు? అంటే బీజేపీకి ఓటు వేయనవసరం లేదని ఆయన భావిస్తున్నారా? పోనీ అలా అని తాను ప్రేమలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పారా? అంటే అదీ చేయలేదు. దానికి కారణం బీజేపీ వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న సంశయమే. బీజేపీని కూడా టీడీపీ వైపు తీసుకు వెళ్లాలని చాలా గట్టి ప్రయత్నమే చేశారు కానీ, ఆ పార్టీ అధినేతలు అందుకు అంగీకరించలేదు. 2019లో జనసేన ఘోర పరాజయం చెందిన తర్వాత డిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి బతిమలాడి మరీ ఆ పార్టీతో స్నేహం కుదుర్చుకున్నారు. అది కూడా చంద్రబాబు సలహా మేరకే జరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తర్వాత జనసేన తరఫు రాజకీయం అంతా కూడా చంద్రబాబే నడిపారని అంటారు. ఆయన ఏమి చెబితే అదే పవన్ మాట్లాడారని, ప్రకటనలు చేశారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అదే విధానాన్ని కొనసాగిస్తుండవచ్చు. బహుశా ఈ విషయంలో మాత్రం పవన్‌కు క్లారీటీ ఉండవచ్చు. కానీ ఆ క్రమంలో ఆయన తన అభిమానులను గందరగోళంలో పడవేస్తున్నారు. ఇంతకీ తాము మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలా? లేదా ? అన్నది వారికి అర్థం కాకుండా పోయింది. అలాగనీ టీడీపీకి ఓటు వేయమని చెప్పకపోవడంతో వారు అయోమయానికి గురి అవుతున్నారు. పవన్‌కు టీడీపీతో ప్రేమ ఉంది కనుక ఆ పార్టీకి ఓటు వేయాలని కొందరు భావించవచ్చు. లేదా బీజేపీతో మితృత్వం ఉంది కనుక ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలని మరికొందరు భావించవచ్చు. లేదా పైకి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినా, లోలోపల బీజేపీకి కాకుండా టీడీపీకే ఓటు వేయాలని సందేశాలు పంపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బీజేపీని మరోసారి ఆయన వెన్నుపోటు పొడిచినట్లు అవుతుందన్నమాట. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఎంతమంది జనసేన మద్దతుదారులు ఉంటారో తెలియదు కానీ, బహుశా టీడీపీ, బీజేపీలలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారికి తాము మద్దతు ఇచ్చామని చెబితే చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను వైఎస్సార్సీపీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఆ పార్టీకే విజయావకాశాలు ఉండవచ్చు. అందువల్ల ఆ పార్టీని గెలవనివ్వరాదన్న లక్ష్యంతో పవన్ ఈ ప్రకటన చేశారు. అయినా దీనివల్ల సరైన క్లారిటీ లేక జనసేన గ్రాడ్యుయేట్లు ఎవరికి నచ్చిన అభ్యర్థులకు వారు ఓటు వేసుకుంటారేమో చూడాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
షాకింగ్ డెసిషన్‌పై మౌనం వీడిన గౌతం అదానీ: వీడియో
సాక్షి,ముంబై: అదానీ గ్రూపు, హిండెన్‌బర్గ్ వివాద సునామీలో అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎప్‌ఫీవో కచ్చితంగా ఉండి తీరుతుందని ప్రకటించింది అదానీ. ఈ మేరకు ఎఫ్‌పీవో పూర్తిగా సబ్‌స్క్రైబ్ తరువాత కూడా అనూహ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్‌పీవో విషయంలో అదానీ గ్రూప్ వెనక్కి తగ్గింది. అతిపెద్ద 20000 కోట్ల మలి విడత పబ్లిక్ ఆఫర్‌ను ఉపసంహరించుకున్నామంటూ అందరికీ షాకిచ్చింది. అయితే ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇచ్చేస్తామని అదానీ గ్రూపు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ తొలిసారి స్పందించారు. తాము తీసుకున్న నిర్ణయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ వోలటాలీటీనేతమ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్వెస్టర్లు నష్టాలకు గురి కాకూడదనే షేర్ల విక్రయానికి పిలుపునివ్వాలని గ్రూప్ నిర్ణయించినట్లు అదానీ గురువారం తెలిపారు. బుధవారం నాటి మార్కెట్ అస్థిరతను పరిగణనలోకి తీసుకుంటే, ఎఫ్‌పిఓతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు గట్టిగా భావించిందని అదానీ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇది అదానీ గ్రూప్ సంస్థల ప్రస్తుత కార్యకలాపాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగానూ ప్రభావితం చేయదంటూ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. తమ బ్యాలెన్స్ షీట్ బలంగానే ఉందని, సంస్థ రుణ బాధ్యతలను నెరవేర్చటంలో సంస్థకున్న ట్రాక్ రికార్డు కూడా బాగుందంటూ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. Chairman @gautam_adani's address to investors after withdrawal of the fully subscribed AEL FPO#GrowthWithGoodness #NationBuilding #AdaniGroup pic.twitter.com/f9yaYrxCzx — Adani Group (@AdaniOnline) February 2, 2023 -
80 సీట్లను బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుంది: మంత్రి ఎర్రబెల్లి
-
తాను పోటీచేసే అసెంబ్లీ స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
పెన్షన్లపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సచ్చివాలయ సిబ్బంది
-
మహేష్, జక్కన్న మూవీ పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..
-
మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన
న్యూఢిల్లీ: బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తయితే సంస్థలో 75 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నారనే వార్తలు కలకలం రేపాయి. ట్విటర్ కొనుగోలుకు మరోసారి పావులు కదుపుతున్న తరుణంలో ఉద్యోగాల తొలగింపు అనే నివేదికలు ఆందోళన రేపాయి. ఇదీ చదవండి: JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్, వారికి బంపర్ ఆఫర్ ఒక వేళ మస్క్ ట్విటర్ బాస్ అయితే ఆ తరువాత భారీగా సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. కంపెనీలోని 7,500 మంది కార్మికులలో దాదాపు 75శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు, కొనుగోలు డీల్‌లో కాబోయే పెట్టుబడిదారులతో మస్క్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. అయితే, ట్విటర్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అసలు అలాంటి ప్లాన్ ఏదీ లేదని గురువారం సిబ్బందికి సమాచారాన్ని అందించింది. ఈ మేరకు జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ గురువారం ఉద్యోగులకు ఇమెయిల్ పంపించారు. (JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్, వారికి బంపర్ ఆపర్) -
విశాఖ రైల్వే జోన్ వదంతులపై రైల్వే మంత్రి స్పందన
సాక్షి, ఢిల్లీ: రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ‘‘విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దు. రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. జోన్ ఏర్పాటుకు సంబధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది’’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంగా తెలియజేశారు. ఇదీ చదవండి: విశాఖ రైల్వే జోన్.. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయ్! -
Raj Kiran: ‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’
సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ కూతురు బుల్లితెర నటుడు మునీష్రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వారి పెళ్లి ఇప్పుడు చర్చకు దారి తీసింది. బుల్లితెర నటుడు మునీష్రాజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన కూతురే కాదని నటుడు రాజ్‌కిరణ్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో తన కూతురు ఒక టీవీ నటుడిని పెళ్లి చేసుకుందనే తప్పుడు ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంలో నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు టిప్పుసుల్తాన్ అనే ఒక కొడుకు మాత్రమే ఉన్నాడని.. తాను హిందూ మతానికి చెందిన ప్రియ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆమెను సంతోష పెట్టడానికి దత్తత పిల్ల అని బయట ఎవరికీ చెప్పలేదని, సొంత కూతురుగానే పెంచుకున్నామన్నారు. చదవండి: (Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం) అలాంటిది ఒక బుల్లితెర నటుడు ఫేస్బుక్ ద్వారా ప్రియతో పరిచయం పెంచుకుని మాయమాట చెప్పి పెళ్లి చేసుకునేంత వరకు తీసుకొచ్చాడన్నారు. ఈ విషయం తన చెవిన పడడంతో అతని గురించి విచారించగా చాలా మోసగాడని, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసిందన్నారు. అతను ప్రియను పెళ్లి చేసుకుని జీవితాన్ని గడపాలని కాకుండా తన పేరు వాడుకుని సినీ అవకాశాలను పొందాలని, తన నుంచి డబ్బులు కాజేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతో ఆమెను ప్రేమించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయాన్ని ప్రియకు వివరించి మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తామని తాను తన భర్య నచ్చచెప్పామన్నారు. తాను కూడా అతను వద్దని, మీ ఇష్ట ప్రకారమే మీరు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందన్నారు. అలాంటిది కొన్ని రోజుల తరువాత తన భార్య స్నేహితురాలు పార్వతి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లిందన్నారు. నాలుగు నెలలైనా ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఇప్పుడు ఆ టీవీ నటుడిని పెళ్లి చేసు కుని ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం తన భార్యనేనని ఆ అమ్మాయి నిందలు వేస్తోందని అన్నారు. ఈ తప్పుడు ప్రచారంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని నటుడు రాజ్‌కిరణ్ పేర్కొన్నారు. -
నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి
సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్‌తో ఎంతో మంది స్టార్లు అయ్యారు. అలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన పాట 'కచ్చా బాదమ్'. ఈ సాంగ్‌కు ఎంతోమంది రీల్ చేసి అదరగొట్టారు. అయితే ఈ పాటపై అంజలి అరోరా చేసిన రీల్ నెట్టింట్లో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. దీంతో అంజలి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్' షోలో పాల్గొంది కూడా. ఈ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాందించుకుంది అంజలి అరోరా. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అంజలి అరోరా ఎమ్ఎమ్ఎస్ పేరిట ఒక ఫేక్ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఆ వీడియోలో అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం, అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగా అందరు భావిస్తున్నారు. అయితే ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. అది ఎవరు సృష్టించారో? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని ఎమోషనల్ అయింది. ''ఆ వీడియోలో ఉంది నేను కాదు. అసలు నాకు సంబంధం లేని వీడియోకు నా పేరును యాడ్ చేశారు. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ వీడియోలో నా ఫొటో అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. నన్ను ఒకప్పుడు మెచ్చుకున్న ప్రేక్షుకులే ఇప్పుడు తిడుతున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణం. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు'' అని ఎమోషనలై కన్నీరు పెట్టుకుంది అంజలి అరోరా. -
AP: అప్పులపై తప్పుడు రాతలు.. దువ్వూరి కృష్ణ క్లారిటీ
సాక్షి, అమరావతి: కేంద్ర నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి గత ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా ఏపీకి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తిస్థాయిలో రాలేదన్నారు. చదవండి: పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ ఏపీలో ద్రవ్యలోటు చాలా తక్కువని వివరించారు. చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15.77 శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.39 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని దువ్వూరి కృష్ణ తెలిపారు. -
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
Upasana Konidela Gave Clarity On Childrens: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మెగా కోడలిగానే కాకుండా సామాజిక అంశాల్లో చురుగ్గా పాల్గొంటుంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పిల్లలపై తనకు వచ్చే ప్రశ్నల గురించి సద్గురు వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందులో సద్గురు 'ఆమెకు సమాధానంగా ప్రస్తుతం పెరిగిపోతున్న జనాభా వల్ల పిల్లలను కనకపోవడమే మంచింది. ఇలా పిల్లలను వద్దనుకునేవారికి అవార్డు ఇస్తాను' అని తెలిపారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు జనాభా తగ్గించడం కోసమే ఉపాసన దంపతులు పిల్లలను వద్దనుకుంటున్నారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. అయితే తన గురించి ఈ కామెంట్లపై ఉపాసన తాజాగా స్పందించారు. 'ఓ మై గాడ్, ఇది నిజం కాదు. దయచేసి నేను ఏమన్నానో నిర్ణయానికి వచ్చే ముందు పూర్తి వీడియోను చూడండి' అని రాసుకొచ్చారు. అలాగే పిల్లలు వద్దనుకునే వాళ్లకు సద్గురు అవార్డు ఇస్తానని చెప్పారు. అయితే 'ఆ అవార్డు తీసుకునేందుకు మా తాతయ్య ఒప్పుకోవడం లేదు' అని ఇదివరకే ఉపాసన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ బహుమానం వద్దంటే పిల్లలు కావాలని అర్థం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ రామ్ గోపాల్ వర్మ 'లడ్కీ'కి హిట్ టాక్.. మరిన్ని థియేటర్లలో.. An absolute honour to be in conversation with @SadhguruJV amazing as usual, every topic made so much sense. Truly practical considering the circumstances the world is facing today. A must watch ! Sadhguru-Thatha’s not letting me accept your award 🤗❤️ Thank you #ATA pic.twitter.com/Xvl7K9W3Yb — Upasana Konidela (@upasanakonidela) July 4, 2022 -
బిందు మాధవితో లవ్ ట్రాక్.. క్లారిటీ ఇచ్చిన శివ
Anchor Shiva Gave Clarity On Love Story With Bindu Madhavi: బిగ్‌బాస్.. ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది ఈ రియాలిటీ షో. గంట ఎపిసోడ్ కోసం రోజంతా ఎదురుచూసే ప్రేక్షకుల కోసం బిగ్‌బాస్ నాన్స్టాప్పేరుతో ఓటీటీలో ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసేయండంటూ షోపై మరింత ఆసక్తి పెంచారు. ఈసారి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో వచ్చిన గొడవలు ఏ బిగ్‌బాస్ సీజన్లో రాలేదు. ఎంతలా అంటే ప్రేమలు, ఆప్యాయతలు కంటే కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలతోనే మోస్ట్ పాపులర్ అయ్యారు. ఈ ఓటీటీ మొదటి సీజన్లో మొత్తం 18 మంది (ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా) పాల్గొన్నారు. వీరిలో అనిల్ రాథోడ్, అరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్, బిందు మాధవి, శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. బిందు మాధవి విన్నర్‌గా నిలవగా అఖిల్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు. ఇక కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శివ టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే హౌజ్‌లో ఉన్నప్పుడు యాంకర్ శివ, బిందు మాధవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అనేక రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకొచ్చాడు శివ. చదవండి: అనిల్, సునిల్‌ను దొంగసచ్చినోళ్లు అంటూ అరియానా తిట్లు.. బిందుతో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని అడిగిన ప్రశ్నకు 'అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా. నిజానికి నేను బిందుతో ఉన్నది లవ్ ట్రాక్ కాదు. మా ఇద్దరిది ఫ్రెండ్షిప్ మాత్రమే. అసలు లవ్ ట్రాక్ అయితే కానేకాదు.' అని తెలిపాడు శివ. తర్వాత బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎలా ఉందన్న ప్రశ్నకు 'కాంట్రవర్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న నేను మొదట్లో భయపడ్డాను. ఎక్కడ నెగెటివిటీ వస్తుందో అని. నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నా. కానీ హౌజ్‌లోపలికి గెస్ట్‌లు, పేరెంట్స్ వచ్చి ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ అంటే సంతోషంగా అనిపించింది. ఇంత మంచి పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉంది.' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటి మహిళా విజేతగా బిందు మాధవి.. -
సన్నీ డియోల్ తనయుడికి నిశ్చితార్థమంటూ వార్తలు.. ఇదిగో క్లారిటీ
Karan Deol Engaged To Bimal Roy Great Granddaughter Here is The Truth: సన్నీ డియోల్ కుమారుడు కరణ్ డియోల్ ప్రస్తుతం వార్తల్లో ప్రధానాంశంగా మారాడు. హిందీ పరిశ్రమతోపాటు సోషల్ మీడియాలో అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించి చర్చ నడుస్తోంది. ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మునిమనువరాలు ద్రిశాతో కరణ్ డియోల్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందని బాలీవుడ్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను కరణ్ డియోల్ బృందం కొట్టిపారేసింది. కరణ్ డియోల్‌కు నిశ్చితార్థం జరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. 'కరణ్ డియోల్, ద్రిశలు ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని వస్తున్న వార్తలు అవాస్తవం.' అని పేర్కొంది. కాగా 'పల్ పల్ దిల్ కే పాస్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కరణ్ డియోల్. త్వరలో అనిల్ శర్మ దర్శకత్వంలో వస్తున్న 'అప్నే 2' చిత్రంలో అతని తండ్రి సన్నీ డియోల్‌తోపాటు ధర్మేంద్ర, బాబీ డియోల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇంతుకుముందు 2013లో వచ్చిన 'యమ్లా పగ్లా దివానా 2'లో సన్నీ, బాబీ, ధర్మేంద్ర ముగ్గురు నటించారు. ఈ మూవీకి రెండో యూనిట్ డైరెక్టర్‌గా కరణ్ డియోల్ పనిచేశాడు. చదవండి: బాలీవుడ్‌పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్ ఖాన్ తమ్ముడి విడాకులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మంత్రి కాకాణితో ఎలాంటి విభేదాలు లేవు: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
-
పార్టీ విలీనంపై కోదండరాం క్లారిటీ
-
ఆ లేఖ భారతమ్మ రాసినది కాదు
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఓ లెటర్ రాశారంటూ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్‌లలో సర్క్యులేట్ అవుతోంది. ఆ లెటర్ వైఎస్ భారతి రాసినది కాదు. అది నకిలీది’ అని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రరాష్ట్ర ప్రజలకు, వైఎస్సార్సీపీ అభిమానులకు, తన మనసులోని భావాలు, ఆందోళనలు, భయాలు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చినట్లు లేఖను సృష్టించారని, వైఎస్ భారతి ఎలాంటి లెటర్ రాయలేదని, ఎవరో కావాలని అలాంటి లేఖలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు అని సూచించారు. ఆమెకు అటువంటి లెటర్ రాయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరారు. -
ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
-
బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. 103 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. సోషల్‌మీడియాలో జరిగే తలాతోకా లేని ప్రచారాన్ని నమ్మవద్దని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈ క్రమంలో ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: పనికిమాలిన పసలేని బడ్జెట్ ఇది: సీఎం కేసీఆర్ బడ్జెట్లో పేదల సంక్షేమానికి కేటాయింపులు లేకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి తనకు తాను ఆత్మ వంచన చేసుకుని.. దేశ ప్రజలను ఘోరంగా వంచించారని తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులు, గిరిజన సంక్షేమంపై కేంద్రానికి చిత్త శుద్ధి లేదన్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు ఊసే లేదని తెలిపారు. యూరియా సబ్సిడీ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కొరత పెట్టారని మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ
-
‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’
బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు -
కోవాగ్జిన్ : భారత్ బయోటెక్ క్లారిటీ
సాక్షి హైదరాబాద్: కరోనా వైరస్ నివారణలో తమ టీకా దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ టీకా సమర్ధత, స్పందించింది. కొవాగ్జిన్‌పై వస్తున్న అపోహలు, వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను తాము దాచిపెట్టలేదని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనీ మార్చి నాటికి ఈ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, టీకాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా ఫైజర్ కంటే తామేమీ తక్కువ కాదన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రక్రియపై ఐదు వ్యాసాలను ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. దేశంలోతాము ప్రతిదీ క్రమపద్ధతిలో చేస్తామనీ, కానీ ప్రస్తుతవివాదం ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోందన్నారు. (12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్) హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. ఎటువంటి డేటా ఇవ్వకుండా ఈ టీకాకు ఎలా అనుమతి ఇస్తారని విమర్శించాయి. దీంతో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడారు. తమ సంస్థకు అనుభవం లేదని ఆరోపణలు చేయడం సరికాదు అని ఆయన అన్నారు. తమది గ్లోబల్ కంపెనీ అని, ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 16 రకాల టీకాలను తయారు చేసినట్లు చెప్పారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. అంతేకాదు ఎబోలా వ్యాక్సిన్ అసలు మానవ క్లినికల్ ట్రయల్ పూర్తి చేయలేదనీ, అయినా లైబీరియా, గినియాలో అత్యవసర అధికారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?) అలాగే తమ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదనీ, ఈ నేపథ్యంలో కోవాగ్జిన్‌పై రాజకీయాలు చేయవద్దని కృష్ణ కోరారు. బ్రిటన్‌తో పాటు 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామనీ, పాకిస్థాన్, నేపల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ తమ టీకా ట్రయల్స్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. తమది కేవలం ఇండియన్ కంపెనీ మాత్రమే కాదు, నిజమైన గ్లోబల్ కంపెనీ అని భారత్ బయెటెక్ సీఎండీ స్పష్టం చేశారు. -
నిషేధంపై టిక్‌టాక్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ దాడి ముప్పు ఉందన్న అంచనాల మధ్య చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. (ప్లేస్టోర్ నుంచి టిక్‌టాక్ తొలగింపు) ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు" గా అభివర్ణించించిన గాంధీ 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు సహా ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులే అన్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నట్లు తెలిపారు. (టిక్‌టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) చదవండి : టిక్‌టాక్ బ్యాన్ : ఇన్‌స్టా, యూట్యూబ్ ఉందిగా! -
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటూ చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాలు చెప్పాలని కృష్ణా బోర్డు తెలంగాణను కోరింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టులతో పాటు మరింత నీటిని వినియోగించుకునేలా విస్తరించిన ప్రాజెక్టుల డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) ఇవ్వాలని సూచించింది. బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే తెలంగాణ పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్త రామదాస ఎత్తిపోతలతో పాటు మిషన్ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతలు చేపట్టిందని ఏపీ చేసిన ఫిర్యాదుపై కృష్ణా బోర్డు స్పందించింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలు వెంటనే తెలపాలని తెలంగాణను కోరుతూ బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ చేపట్టిన 5 కొత్త ప్రాజెక్టులతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని, ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టిన ప్రాజెక్టులకు నీటి అవసరాలు తీరడం కష్టతరంగా మారుతుందని ఏపీ ఫిర్యాదు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునే సామర్థ్యాన్ని సైతం పెంచారని ఏపీ చేసిన ఫిర్యాదును గుర్తుచేసింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న ప్రాజెక్టులపై గతేడాది అక్టోబర్‌లో తెలంగాణ వివరణ కోరామని, ప్రాజెక్టుల డీపీఆర్ ఇవ్వాలని అడిగినా స్పందించని విషయాన్ని బోర్డు దృష్టికి తెచ్చారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 85(8)(డీ) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టినా బోర్డుకు ప్రతిపాదన పంపాలని, జల వివాదాల ఉల్లంఘనæ జరగట్లేదని తేలాకే బోర్డు అనుమతులు ఇస్తుందని పేర్కొన్నారు. బోర్డు అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టులపై ముందుకు పోవాల్సి ఉంటుందని తెలిపారు. పదో షెడ్యూల్ పేరా–7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై చేపడితే అపెక్స్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా తెలంగాణ.. అభ్యంతరాలు చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది. నీటి విడుదలను ఆపండి.. ఏపీ ఈఎన్సీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి లేఖ నాగార్జునసాగర్ కుడి కాల్వ, హంద్రీ–నీవా ఎత్తిపోతల, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడాన్ని ఆపేయాలని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎ.పరమేశం కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన లేఖ రాశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు 158.225 టీఎంసీలు కేటాయిస్తే 158.264 టీఎంసీలు వాడుకున్నారని, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 47.173 టీఎంసీలు కేటాయిస్తే 47.328 టీఎంసీలు వినియోగించుకున్నారని లేఖలో పేర్కొన్నారు. కేటాయించిన నీటి కంటే అధికంగా వాడుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదలను ఆపేయాలని కోరారు. రుతుపవనాలు ప్రవేశించి.. వర్షాలు కురిసే వరకూ అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. నీటి కేటాయింపు ఉత్తర్వులను విధిగా పాటించాలని.. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని సూచించారు. -
వదంతులకు చెక్ పెట్టిన రైల్వే శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఏప్రిల్ 15 నుంచి రైల్వే రిజర్వేషన్ సంస్థ ఐఆర్ సీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టిందని పలు నివేదికలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. అసలు తాము ఏప్రిల్ 15 (అంటే లాక్ డౌన్ తరువాతి సమయానికి సంబంధించి) నుంచి బుకింగ్‌లను నిలిపి వేసిందని లేదనీ అది పాత ప్రకటన అనే గమనించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నందున తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. లాక్ డౌన్ ఆదేశాలకు మేరకు తాము లాక్ డౌన్ సమయం వరకే టికెట్ రిజర్వేషన్లను ఆపేశామని వెల్లడించింది. అంటే ఏప్రిల్ 14 వరకు ఇది అమలులో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి రైల్వే టికెట్లు 120 రోజుల ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, దాన్ని చూసి కొంతమంది అపోహ పడుతున్నారని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ సమయం తర్వాతి ప్రయాణాల కోసం తాము ఎప్పుడూ టికెట్ రిజర్వేషన్లు ఆపలేదని స్పష్టం చేసింది. ఒకవైపు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు రైల్వే టికెట్ల రిజర్వేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి తిరిగి ప్రారంభించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చదవండి: కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్ Certain media reports have claimed that Railways has started reservation for post-lockdown period. It is to clarify that reservation for journeys post 14th April was never stopped and is not related to any new announcement. pic.twitter.com/oJ7ZqxIx3q — Ministry of Railways (@RailMinIndia) April 2, 2020 -
కేకే ఓటు హక్కుపై ఎన్నికల ట్రిబ్యునల్‌కెళ్లండి
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును ఎన్నికల అధికారి అనుమతించిన వ్యవహారాన్ని ఎన్నికల ట్రిబ్యునల్‌లోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత వాటికి సంబంధించి ఏ అభ్యంతరాలున్నా, వాటిపై ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలని రాజ్యాంగం, తెలంగాణ మునిసిపాలిటీల చట్ట నిబంధనలు చె బుతున్నాయని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేశవరావును ఓటు హ క్కు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ తరఫున ఎన్నికైన మోనిరాజు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ పి.కేశవరావు మరోసారి విచారణ జరిపారు. రాష్ట్ర ఎన్ని కల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఎన్నికలు ముగిశాక వచ్చిన అభ్యంతరాల విచారణకే ట్రి బ్యునళ్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. జిల్లా జడ్జి స్థాయి అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. తరువాత పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదిస్తూ, ఈ వివాదం ఎన్నికల పి టిషన్ పరిధిలోకి రాదని, అందువల్ల ట్రిబ్యునల్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా అధికరణ 226 కింద హైకోర్టు విచారణ జరపవచ్చునని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వివాదంపై ఎన్నికల ట్రిబ్యున ల్ను ఆశ్రయించాలంటూ ఉత్తర్వులిచ్చారు. -
రూ. 2000 నోటు రద్దుపై కేంద్ర మంత్రి క్లారిటి
-
రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన 2 వేల రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకుంటుందనే ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. రూ.2000 నోట్లను రద్దు చేస్తామని సాగుతున్న ప్రచారం అవాస్తవమని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాబోయే రోజుల్లో రూ. 2000 నోటును ప్రభుత్వం ఉపసంహరిస్తుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రూ. 2000 నోటును ప్రవేశపెట్టడంతో దేశంలో నల్లధనం పెరిగిపోయిందని, దాని స్ధానంలో ప్రభుత్వం తిరిగి రూ.1000 నోటును ప్రవేశపెడుతుందని ప్రజల్లో ఓ ప్రచారం సాగుతోందని ఎస్పీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నల్లధనాన్ని నిర్మూలించి నకిలీ నోట్లను తొలగించేందుకే నోట్ల రద్దును ప్రభుత్వం చేపట్టిందని మంత్రి ఠాకూర్ చెప్పారు. అసంఘటిత రంగాన్ని సంఘటితపరచడంతో పాటు తీవ్రవాద నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం ద్వారా ఆన్లైన్ లావాదేవీలను నోట్ల రద్దు ద్వారా పెంచగలిగామని తెలిపారు. -
ఏటీఎం లావాదేవీలు..ఆర్బీఐ వివరణ
సాక్షి, ముంబై: బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఊరటనిచ్చింది. ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం కోటాలో విఫలమైన లావాదేవీలను లెక్కించవద్దని ఆర్బీఐ బుధవారం బ్యాంకులను ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటున్నాయనే ఫిర్యాదులతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ వసూలు చేయరాదని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
వెల్లూరులో లోక్‌సభ ఎన్నికల రద్దుపై ఈసీ క్లారిటి
-
రపేల్ డీల్‌లో రిలయన్స్ భాగస్వామ్యంపై డిసో ఏపియేషన్ క్లారిటీ
-
బ్యాంకుల వరుస సెలవులు, క్లారిటీ
సాక్షి,ముంబై: సెప్టెంబరు మొదటివారంలో బ్యాంకులు మూతపడనున్నాయనే పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించింది. బ్యాంకులకు ఆరో రోజులు సెలవు అనే వదంతుల్లో ఏమాత్రం నిజంలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరణ ఇచ్చింది. అటు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు స్పందించారు. వాట్సాప్, తదితర గ్రూపుల్లో విపరీతంగా షేర్ అవుతున్న మెసేజ్‌లను తోసిపుచ్చారు. దీనికి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడుతుందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించిపోనుందన్న వస్తున్న వార్తల్లోనూ ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. అంతేకాదు బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వరసగా 3రోజులకు మించి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి బ్యాంకులు ఆరు రోజులపాటు మూతపడనున్నాయనే వార్తల్లో నిజం లేదని సంఘం ఉపాధ్యక్షుడు అశ్వానీ రాణా వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సమ్మెమూలంగా బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే జన్మాష్టమి ఐచ్ఛిక సెలవేనని, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకులకు మాత్రమే సెప్టెంబర్ 3న సెలవు అని రాణా తెలిపారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ఆ రోజు బ్యాంకులు తెరిచే ఉంటాయన్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జన్మాష్టమి సందర్భంగా చాలా బ్యాంకులు సోమవారం సెలవు ప్రకటించాయి. కాగా సెప్టెంబర్ 2 ఆదివారం సెలవు, సెప్టెంబర్ 3 జన్మాష్టమి. ఆ తరువాత 4, 5 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారనీ, దీంతోపాటు 8, 9 తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో వరస సెలవులంటూ మెసేజ్‌లు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు, జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. Government rubbishes rumours on social media that "banks will be closed for 6 days in the first week of September 2018". Says banks will remain open all days except Sunday in most states. pic.twitter.com/n7errYGCXu — PIB India (@PIB_India) August 31, 2018 -
ప్రభాస్‌తో గొడవపై దర్శకుడి క్లారిటీ
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. గత కొద్ది రోజులు ప్రభాస్‌కు చిత్ర దర్శకుడు సుజిత్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మేకింగ్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేడంటూ సాగుతున్న ప్రచారంపై సుజిత్ స్పందించారు. ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా ‘అలాంటిదేమీ లేదు గురువా! హై కిక్‌లో వర్క్ చేస్తున్నాం.. మధ్యలో ఇలాంటి న్యూస్ మాకు ఎంటర్టైన్మెంట్ అనుకో’ అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Lol! Nothing is wrong guruva! High kick lo work chestunam.. madhyalo ilanti news maku entertainment anuko. — Sujeeth (@sujeethsign) 14 March 2018 -
పెళ్లా.. ఇప్పుడా!
ఇదిగో అమ్మాయ్! పెళ్లెప్పుడు? ఇప్పుడు నీ వయసెంతో తెలుస్తుందా?... పెళ్లీడు దాటిన ప్రతి అమ్మాయికి ఏదొక టైమ్‌లో ఇంచు మించు ఇటువంటి ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. చుట్టాలో... చుట్టుపక్కల వాళ్లో... ఎవరొకరు అడుగుతారు. వాళ్లందరికీ ఏదొకటి చెప్పి తప్పించుకోవచ్చు లేదా ‘నీకెందుకు?’ అని ఎదురు తిరగొచ్చు. అదే ఇంట్లోవాళ్లు అడిగితే? సమాధానం చెప్పడం కొంచెం కష్టమే కదూ! సరిగ్గా ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారు కాజల్ అగర్వాల్. వచ్చే నెలాఖరుకు కాజల్ సిస్టర్ నిషాకు పెళ్లై నాలుగేళ్లు! నిషా పెళ్లి టైమ్‌లో అడిగిన వాళ్లకు ‘చెల్లికి నచ్చిన అబ్బాయి దొరికాడు. పెళ్లి చేసుకుంది. నా పెళ్లికి ఇంకా బోల్డంత టైముంది’ అని కాజల్ క్లారిటీ ఇచ్చారు. అయితే... ఇప్పుడామె తల్లిదండ్రులే పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారట! కాజల్ అంత త్వరగా ఒప్పుకోలేదులెండి! ‘‘ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. నేను మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటున్నా. అందుకే, నా దగ్గరకు వచ్చిన కథల్లోంచి నచ్చినవాటిని ఎంపిక చేసుకుంటున్నా. కొన్నేళ్లు సినిమాల్లో కొనసాగుతా’’ అని తల్లిదండ్రులకు చెప్పేశానని కాజల్ తెలిపారు. ఇప్పుడు కాజల్‌కి 32 ఏళ్లు. కానీ, అంత వయసున్నట్టు కనిపిస్తుందా? సో... ఈజీగా ఇంకో ఐదారేళ్లు సినిమాలు చేస్తారేమో!! -
మొబైల్ ఆధార్ లింకింగ్‌పై కేంద్రం స్పష్టత
-
వైస్సార్సీపీలో స్పష్టత
– టీడీపీలో కొనసాగుతున్న సందిగ్ధత – బీజేపీతో తెగని పంచాయతీ – టీడీపీ మెట్టుదిగుతున్నా వెనక్కి తగ్గని బీజేపీ నేతలు – చివరికీ ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు అంగీకారం – 12 ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న బీజేపీ సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీలో స్పష్టత వచ్చేసింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అన్ని డివిజన్లలోనూ బరిలోకి దిగుతోంది. టీడీపీలో ఇంకా కొలిక్కి రాలేదు. టీడీపీ, బీజేపీ పొత్తు పంచాయతీ తెగలేదు. నిన్నటి వరకు మూడు డివిజన్లు ఇస్తామని చెప్పుకొచ్చిన టీడీపీ ఎనిమిది డివిజన్లు కేటాయించేందుకు ముందుకొచ్చింది. కానీ 12 కావాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో వ్యవహారం అదిష్టానం వద్దకు వెళ్లింది. గురువారం నామినేషన్లు భారీ ఎత్తున పడ్డాయి. ఈ ఒక్కరోజే 381 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు అభ్యర్థుల తాకిడితో కిటకిటలాడాయి. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన కార్యకర్తల కోలహలంతో నగర వీధులు సందడితో రద్దీగా కనిపించాయి. ఎక్కడ చూసినా రాజకీయ పక్షాల హడావుడి కనిపించింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా పోటీపడి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రత్యర్ధి పార్టీల నుంచి ఎవరేస్తున్నారో చూసుకుని అప్పటికప్పుడు ధీటైన అభ్యర్థులు దాఖలు చేసిన సందర్భాలు బయటపడ్డాయి. మొత్తంగా చూస్తే కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లకుగాను 493 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తర్జనభర్జన టీడీపీలో ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. కొన్ని డివిజన్లకు సరైన అభ్యర్థులు దొరకకపోవడంతో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించడంతో డివిజన్‌కు ముగ్గురు చొప్పున పేర్లు రాసి పంపించినట్టు తెలిసింది. ఒక డివిజన్కైతే ఒక్కరిపేరే ప్రస్తావించగా ఏమిటీ పరిస్థితని నేతలను చంద్రబాబు గట్టిగా ఆరాతీసినట్టు సమాచారం. ముఖ్యంగా కాకినాడ 14వ డివిజన్లో అధికార పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా కరువయ్యాడు. దీంతో మరో 10 నిమిషాల్లో నామినేషన్ల ఘట్టం పూర్తవుతుందనుకున్న సమయంలో చివరి క్షణంలో ఎమ్మెల్యే అన్న కొడుకు వనమాడి ఉమాశంకర్, మరో అభ్యర్థి చేత నామినేషన్ వేయించారు. మెట్టు దిగినా పట్టువదలని బీజేపీ టీడీపీతో బీజేపీ ఒక ఆట ఆడుకుంటోంది. అధికార పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం, మిత్రపక్షాన్ని వదులుకునే ధైర్యం చేయలేక బీజేపీ ఏమి చెబితే అదే చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆ పార్టీ బలం కన్నా ఎక్కువ సీట్లు అడుగుతుండగా, ఇవ్వకపోతే ఇబ్బంది అన్నట్టుగా టీడీపీ సాగిలా పడిపోతోంది. బీజేపీ తొలుత 20 సీట్లు అడగ్గా కేవలం రెండే ఇస్తామని టీడీపీ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించింది. ఆ తరువాత బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి గట్టిగా హెచ్చరించడంమే కాకుండా అమీతుమీ తేల్చుకుంటామని అల్టిమేటం జారీ చేయడంతో టీడీపీ వెనక్కి తగ్గింది. ఐదిస్తామని బేరం పెట్టింది. కానీ బీజేపీ ససేమిరా అనడంతో తాజాగా ఎనిమిది ఇచ్చేందుకు అధికార పార్టీ అంగీకరించింది. దానికి బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. 12 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో నామినేషన్ల ఘట్టం ముగిసినా సీట్ల పంపకాల పంచాయతీ కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థులు 20 డివిజన్లకుగాను 35మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఒకవేళ టీడీపీ దారికి రాకపోతే బరిలో ఉండిపోదామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏం చేయాలన్న దానిపై అదిష్టానానికి వదిలేశారు. బీజేపీ అడుగుతున్న డివిజన్ల వివరాలను, కేటాయిస్తామన్న డివిజన్ల వివరాలను అదిష్టానానికి పంపించారు. ఇప్పుడక్కడే నిర్ణయం తీసుకోవల్సి ఉంది. -
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై క్లారిటీ ఇచ్చిన ECIL
-
పన్నువడ్డింపుపై క్లారిటీ!
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలపై వడ్డించనున్న పన్నులపై ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. రూ50 వేలు, ఆ పైన నగదు లావాదేవీలపై పన్ను విధించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. కమిటీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇంకా సంఘం సిఫారసులపై తుది అభిప్రాయాన్ని తీసుకోలేదని తెలిపింది. కమిటీ సిఫారసుల ను జాగ్రత్తగా పరిశీలించినమీదట తగిన నిర్ణయంతీసుకుంటామని ఒక ప్రకటలో మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కమిటీ రూ.50వేలకు పైన విత్ డ్రాల పై పన్ను విధించాల్సిందిగా మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై వడ్డీని రద్దుచేయాలని, తద్వారా డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది. అన్ని లావాదేవీలను పూర్తి ఉచితంగా నిర్వహించాలని, నగదు చెల్లింపులకంటే డిజిటల్ చెల్లింపులు లాభదాయకంగా ఉండేలా ప్రోత్సహించాలని కోరింది. ఎవరైనా కొంత భాగాన్ని డిజిటల్ రూపంలో ఖర్చు చేసే వినియోగదారులకు ఆ మేరకు పన్ను వెనక్కు ఇవ్వాలని సూచించింది. మెట్రో నగరాల్లోని బస్సులు, సబర్బన్ రైళ్లలో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను ప్రోత్సహించాలని సూచించాలని కోరారు. అలాగే, ఐటీ పరిధిలోకి రానివారికి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు రూ.వెయ్యి, బయోమెట్రిక్ కొనుగోలుకు రూ.వెయ్యి రాయితీ ఇవ్వాలని చెప్పింది. అప్పుడే ప్రజలు నగదు రహిత లావాదేవీలకు ఆకర్షితులవుతారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం
ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : పోలీసుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా నిర్వహించే కార్యక్రమాలను శాంతి భద్రతల రీత్యా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ స్పష్టం చేశారు. శనివారం సర్పవరం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సున్నిత అంశాలపై జిల్లాలో 1994, 1998, 2016 సంవత్సరాల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా సెక్షన్ 30 అమల్లో పెట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు అన్ని రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చేసుకునే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. తొండంగిలో నిర్మించనున్న దివీస్ కర్మాగార స్థాపనకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనను అడ్డుకోగా, కోర్టు ఉత్తర్వులతో సీపీఎం నేతలను అక్కడకు అనుమతించామన్నారు. ఈ నెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి అంతర్వేది దాకా ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తు రాలేదని, వస్తే పరిశీలిస్తామన్నారు. ఈనెల 28 నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అమలాపురం దాకా బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, ఇం దుకు అనుమతి కోరుతూ దరఖాస్తు వచ్చిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకువస్తే, ఆమోదయోగ్యం గా చట్టానికి లోబడి నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామ న్నారు. ఇది అన్ని రాజకీయపార్టీలకు వర్తిస్తుందన్నారు. తునిలో జరిగిన కాపు గర్జనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్క డ అనుకోకుండా అరాచకశక్తులు చొరబడడంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రశాంతవరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
నాకే క్లారిటీ లేదు
గవర్నర్ పదవిపై మోత్కుపల్లి నల్లగొండ రూరల్: గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేద ని, వచ్చినప్పుడు విషయం చెబుతానని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని తెలిపారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్లో కలపొద్దన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. -
ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లింపులో స్పష్టత
-
అన్నదాతకు గుబులు
రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఈనెల 15 నాటికి రైతుల ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామని చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులు పంపిన ఖాతాల్లో వివరాలు సరిగా లేవంటూ ముప్పుతిప్పలు పెడుతోంది. రోజుకో మాట.. పూటకో తీరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బద్వేలు: టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన రైతన్నకు దడ పుట్టిస్తోంది. ఏ రోజు ఏ వివరాలు అడుగుతారో.. ఎవరి పేర్లు తీసేస్తారో.. అని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకమంటూ రైతులను మభ్యపెట్టిన చంద్రబాబు ఇంకా రైతన్నలను మోసం చే సేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 5 వ తేదీ రైతుల ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామన్నారు. తరువాత అది 12వ తేదీకి, ప్రస్తుతం 15వ తేదీకి చేరింది. 15 నాటికి పూర్తవుతుందని ఆశించినా ఖాతాల పరిశీలనతో అది జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరివి తొలగిస్తారో... జిల్లాలో 3 లక్షల 32 వేల 105 మంది రైతులు రూ.2,103కోట్ల పంట రుణాలు, 2 లక్షల 18 వేల 408 మంది రైతులు బంగారు కుదువ పెట్టి రూ.2.214 కోట్ల పంట రుణాలు పొందారు. అయితే రుణభారం తగ్గించుకునే నెపంతో ఆధార్, రేషన్‌కార్డు, భూమి వంటి వివరాలను అప్లోడ్ చేయాలని బ్యాంకర్లకు జులైలో ఒక ఫార్మెట్ అందజేశారు. దీని ప్రకారం బ్యాంకర్లు 4 లక్షల 95 వేల 964 ఖాతాలను అప్లోడ్ చేశాయి. కానీ ప్రభుత్వం వీటిలో 2.25లక్షల మంది వివరాలు సరిగా లేవని గత నెల 24న తిరిగి ఆయా బ్యాంకుల శాఖలకు పంపింది. వీటిని సవరించి పంపాలని కోరగా ఈ నెల మొదటి వారంలో పూర్తి చేసి పంపారు. వారు పంపుతూనే జాబితాను ప్రకటించి వారి ఖాతాల్లో 20 శాతం నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 12వ తేదీ నగదు వేస్తామని చెప్పినా పదో తేది నాటికే మాట మార్చింది. పంపిన 4.95 లక్షల ఖాతాల్లో 3 లక్షల 08 వేల 377 ఖాతాల వివరాలు సరిగా లేవని వెనక్కి పంపింది. వీటిలో ఆధార్ కార్డు, రేషన్‌కార్డులు వివరాలిచ్చినా సరిపోలని ఖాతాలు 1లక్ష67వేల617 ఉన్నాయి. రేషన్‌కార్డు అందించని వారు 41,365, ఆధార్ అందించని వారు 14,291 మంది ఉన్నారు. ఆధార్, రేషన్‌కార్డు రెండూ ఇవ్వని వారు 85,104 మంది ఉన్నారు. వీటితో పాటు ఎలాంటి సమాచారం ఇవ్వని 26,857 ఖాతాలను నకిలీ పంట రుణ ఖాతాలుగా పేర్కొంటూ తిరస్కరించారు. అప్లోడు చేసిన 4.95 లక్షల ఖాతాల్లో తిరస్కరించిన ఖాతాలు పోను అన్ని వివరాలు సరిగా ఉన్నవి 1లక్ష60వేల730 ఖాతాలు మాత్రమే. అంటే వంద మంది రైతుల్లో కేవలం 38 మంది మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఖాతాదారులు తమ నామినీకి సంబంధించిన ఆధార్ కూడా అందించాలని ప్రభుత్వం కోరింది. మొదట్లో అడగని ప్రభుత్వం ఈ నిబంధనతో ఏమి చేస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో సాధ్యమా... ప్రస్తుతం 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ ఆయా తహశీల్దార్ కార్యాలయాలకు జాబితాలు పంపారు. వీటిని మంగళ, బుధ వారాల్లో పరిశీలించి గురువారం అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మంగళవారం కొన్ని మున్సిపాలిటీ, గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమంలో అధికారులు ఉన్నారు. మరికొన్ని చోట్ల ఆన్లైన్ సౌకర్యం సరిగా లేక జాబితాలు డౌన్లోడ్ చేయలేని పరిస్థితి ఉంది. బి.కోడూరు మండలంలో ఇంటర్నెట్ సౌకర్యం లేక బద్వేలులో జాబితాలు తీసుకున్నారు. పలు మారుమూల మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొన్ని మేజరు, పెద్ద పంచాయతీల్లో వేలాది ఖాతాలకు సంబంధించి రెండు రోజుల్లో ఇంటింటి పరిశీలన అసాధ్యం. పరిశీలన బాధ్యతను పింఛన్ల కమిటీలకు అప్పగించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో ఈ కమిటీలు 2.45 లక్షల పింఛన్లను పరిశీలించి 50 వేల మందిని అనర్హులుగా నిర్ణయించాయి. వీరిలో చాలా మంది అర్హులుండటంతో పలు చోట్ల పింఛన్‌దారులు ఆందోళన చేయడంతో పునః పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పింఛన్ల పరిశీలనలో జరిగినట్లే ఖాతాల పరిశీలనలో జరిగితే పెద్దయెత్తున అర్హులైన రైతులు అనర్హులుగా మారే అవకాశముంది. 13న పరిశీలన పూర్తయితే ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామని చెబుతున్నా అప్పటికి పరిశీలన పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వం కాలయాపన చేయడానికి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇన్పుట్ ఎప్పుడు?
పరిగి: పంటలు నష్టపోయి ఏడాది కావస్తున్నా రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ విషయంలో స్పష్టత రావటంలేదు. 2009 నుంచి గత సంవత్సరం వరకు ఉన్న పెండింగ్ నిధులతోపాటు 2013 సంవత్సరంలో జరిగిన అపార పంట నష్టానికి సంబంధించి జిల్లాకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.31 కోట్లు వచ్చాయని నాయకులు హడావిడి చేస్తుండగా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కేంద్రం నిబంధనల మేరకు హెక్టారుకు రూ.10 వేలు ఇవ్వాలని ఉండగా రాష్ట్ర నిబంధనలు ఎలా ఉన్నాయనే విషయంపై అధికారుల్లోనూ స్పష్టత లేదు. ఇన్పుట్ సబ్సిడీని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో వేశామని ప్రభుత్వం చెబుతుండగా జిల్లా ఖాతాలోకి మాత్రం ఇంకా డబ్బులు రాలేదని అధికారులు అంటున్నారు. మరో పక్క వ్యవసాయశాఖ అధికారులు గ్రామస్థాయి అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలు ఇవ్వడంతో రైతులు కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మరో 15 రోజుల వరకు ఏమీ చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది లెహర్, ఫైలిన్, హెలెన్ రూపంలో మూడు తుపాన్లు విరుచుకుపడి రైతులను అతలాకుతలం చేయగా ఏయే తుపాన్లకు ఇన్‌పుట్‌సబ్సిడీ ఇస్తున్నారనే విషయంలోనూ అధికారులు స్పష్టతనివ్వటంలేదు. తప్పని ఎదురుచూపులు.. పంటలకు నష్టం వాటిల్లి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పరిహారం అందించకుండా ప్రభుత్వం రైతులతో పరిహాసమాడుతోంది. 2013 అక్టోబర్‌లో ఫైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలతోపాటు రెండు మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న నష్టపరిహారం అందించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అటు ఈ సం వత్సరం వ్యవసాయ పంటరుణాలు అందక.. ఇటు గతఏడాది నష్టపోయిన పంట లకు పరిహారమూ అందక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎట్టకేలకు రెవెన్యూ, వ్యవసాయ, అర్థగణాంక శాఖలు సంయుక్తంగా సర్వేలు నిర్వహించి పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనాలు తయారు చేశారు. వీటిని ప్రభుత్వానికి పంపి కూడా ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ పరిహారం మాత్రం రైతులకు అందలేదు. 7,497 హెక్టార్లలో పంట నష్టం.. ఫైలిన్ తుపాన్ ప్రభావంతో పరిగి వ్యవసాయ డివిజన్లో జరిగిన పంటల నష్టం వివరాలతో కూడిన నివేదికలు అప్పట్లో పై అధికారులకు స్థానిక అధికారులు అందజేశారు. పరిగి మండలంలో వరి 120 హెక్టార్లు, మొక్కజొన్న 1520 హెక్టార్లు, పత్తి 1800 హెక్టార్లు, దోమ మండలంలో వరి 380 హెక్టార్లు, మొక్కజొన్న 900 హెక్టార్లు, కుల్కచర్ల మండలంలో వరి 1083 హెక్టార్లు, గండేడ్ మండలంలో వరి 1694 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అంటే మొత్తం వ్యవసాయ డివిజన్లో 7497 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. గతంలోలా సమస్యలు తలెత్తకుండా సర్వే వివరాలు, నష్టంపోయిన రైతుల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించారు కూడా. ఆ వెంటనే పంటనష్టం పరిహారం అందజేస్తామని పలుమార్లు చెబుతూ వచ్చిన గత ప్రభుత్వం ఎన్నికలు వచ్చే నాటికి ఆ విషయం మరిచిపోయింది. తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా పంట నష్టం పరిహారం ఊసెత్తకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి పంటనష్టానికి పరిహారం. ఇన్పుట్సబ్సిడీలను అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.