
సాక్షి,హైదరాబాద్: ఫ్రీ బస్సు స్కీమ్‌కు సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం (ఆగస్టు16) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
‘గురువారం పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు’అని కేటీఆర్ ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చారు. కాగా, కేటీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఫ్రీ బస్సు స్కీమ్‌పై మాట్లాడారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.— KTR (@KTRBRS) August 16, 2024
బస్సుల్లో ఎల్లిపాయల పొట్టు తీసుకోవడం కాకపోతే కుట్లు, అల్లికలు కూడా పెట్టుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టి బబ్రేక్‌డ్యాన్సులు కూడా వేసుకోండి’ అని కేటీఆర్ అనడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.