
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌లపై మరోసారి ధ్వజమెత్తారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట చేసిన మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ కు తోక పార్టీగా బీఆర్‌ఎస్ పార్టీ మారిందంటూ విమర్శించారు. చెన్నైలో డీకే శివకుమార్ తో కేటీఆర్ రెండు గంటలు పాటు సమావేశమయ్యారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంగా మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
‘ కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌ల మధ్య మద్రాసు ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్‌కు కేటీఆర్ బాడీగార్డ్. బీజేపీని అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. లోన్ ఇప్పించిందంటూ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను ప్రొటెక్ట్ చేసేందుకే బీజేపీ ఎంపీ ఉన్నారంటూ కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే పేరు బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి