
హైదరాబాద్: రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచుల పార్టీ అయితే, మరొకటి చెప్పులు మోసే పార్టీ అంటూ ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏప్రిల్, మే నెలల్లో కూడా మానేరు ఓ సజీవధారగా ప్రవహించదన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక చిన్న పర్రె పడితే బద్నాం చేశారని బీజేపీ, కాంగ్రెస్ పై మండిపడ్డారు.
ఎస్ఎల్పీసీలో ఎనిమిది చనిపోతే, సుంకిశాల కూలిపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు రాదని ప్రశ్నించారు.భూకంపం వచ్చినా తట్టుకుని నిలబడింది కాళేశ్వరమని, మేడిగడ్డకు ఇప్పటికైనా నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ సీయూ భూములపై స్వయానా కుదవ పెడితే.. మరో మంత్రేమో ఏం లేదంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మీదీ కాని భూమిని తనఖా పెట్టడం తప్పు కాదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
