![BRS KTR Satirical Comments On Congress Rahul Gandhi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/BRS-KTR-Satirical.jpg.webp?itok=OVK6FI3H)
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. మరోసారి బీజేపీని గెలిపించారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ మరోసారి బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. వెల్‌డన్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Congrats to Rahul Gandhi for winning the election for BJP, yet again!
Well done 👏 https://t.co/79Xbdm7ktw— KTR (@KTRBRS) February 8, 2025
ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. మూడోసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా ప్రభావం చూపించకలేకపోయింది. ఈ ఎన్నికల్లో గుండు సున్నా చుట్టేసింది. గత రెండు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment