హిమాచల్‌ భవన్‌ జప్తు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్లు | KTR Tweet On Himachal Bhavan Attach, Telangana Congress Govt | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ భవన్‌ జప్తు.. కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ సెటైర్లు

Nov 20 2024 1:06 PM | Updated on Nov 20 2024 3:25 PM

KTR Tweet On Himachal Bhavan Attach, Telangana Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలను కాకుండా.. బదులుగా సర్కస్‌లను నడుపుతోంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. హిమాచల్‌లో రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. తన చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీసుసుకున్న అప్పును తీర్చలేక ఢిల్లీలో హిమాచల్‌ భవన్‌ను కోల్పోవాల్సి వస్తుందని విమర్శలు గుప్పించారు. గద్దెనెక్కడం కోసం అడ్డగోలు గారంటీలు ఇవ్వడం, చేతికందినన్ని అప్పులు చెయ్యడం, ఆఖరికి ఉన్న ఆస్తులు జప్తు చెయ్యించుకునే పరిస్థితికి రావడం కాంగ్రెస్‌ అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.  

మొన్న గారంటీలు అమలు చెయ్యలేక, గంజాయి కూడా అమ్మకునే పరిస్థితి హస్తానికి తలెత్తిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్‌ చెల్లించాల్సిన అప్పు తేల్చకపోతే, డిల్లీలో  హిమాచల్‌ భవన్‌ను జప్తు చేస్తాం అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. తమ హామీలకు నిధులు సమకూర్చడం కోసం చట్టబద్ధంగా గంజాయిని విక్రయించడానికి కాంగ్రెస్‌ అనుమతి కోరిందని ప్రస్తావించారు. మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఏం విక్రయిస్తారంటూ రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు.

కాగా ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌ జప్తుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. దీంతో పది గ్యారెంటీల పేరుతో రెండేళ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఛలోక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement