సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మూసీ సుందరీకరణ రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార కాంగ్రెస్ కుండబద్ధలు కొట్టి చెప్తుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్ష బీఆర్‌ఎస్ సవాల్ విసురుతోంది
ఈ తరుణంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ సుందరీకరణపై మరోసారి ట్వీట్ చేశారు. ‘మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు? మంత్రికి లీగల్ నోటీసులు పంపాము.
కాంగ్రెస్ అసహ్యకరమైన, విసుగు పుటించే రాజకీయాలు చేస్తోంది. మంత్రిని, సీఎంని మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు లేదా రీహాబిటేషన్ సెంటర్లకు ట్రీట్మెంట్‌కు పంపించాలని రాహుల్ గాంధీకి అభ్యర్థన’ అంటూ కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
మూసి మురికి అంతా వాళ్ల నోట్లోనే...
ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?
Served legal notices to the Minister; Disgusting & Nauseating politics by Congress
Request @RahulGandhi to send your Minister & CM to a mental health specialist or a rehabilitation… pic.twitter.com/cL8AI1RqHk— KTR (@KTRBRS) October 2, 2024
👉చదవండి : అక్కా.. ఎందుకీ దొంగ ఏడుపులు
Comments
Please login to add a commentAdd a comment