సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలో హైడ్రా కూల్చి వేతలు, మూసీ సుందరీకరణతో పాటు ఇతర పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తున్నదని అన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్ట్‌కు రూ.40వేల కోట్లు ఖర్చయితే, 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు రూ.1.5లక్షల కోట్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మంత్రులకు ఏం తెలియదు
మరోవైపు మూసీ సుందరీకరణపై మంత్రులకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలి. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారు. వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదు. ఆయనకి ఏం తెలవదు. మూసీ పైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) లపై కూడా ఆయనకు అవగాహన లేదు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళణ అవుతాయి.
దొంగ ఏడుపులు ఎందుకు?
కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి. మా పార్టీ తరఫున ఆమెపై ఎవరు మాట్లాడలేదు. ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? కొండా సురేఖ గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్ళు ఏడ్వరా?ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్‌తో కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర లేదు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే సీఎం రేవంత్‌కు దడ
అందుకే యూనియన్ బడ్జెట్ మీద బట్టితో మాట్లాడించారు
మూసీ డీపీఆర్ అసలు ప్రభుత్వం దగ్గర లేదు
డీపీఆర్ గురించి భట్టిని ప్రశ్నిస్తే డీపీఆర్ చూపించలేదు
మూసీ కేవలం కాంగ్రెస్ లూటీ కోసమే
మూసీ కాంగ్రెస్ రిజర్వు బ్యాంకు లాంటిది
తెలంగాణ కరువు నివారణ కోసం కాళేశ్వరం ఏర్పడింది
కాళేశ్వరం గురించి అసెంబ్లీలో మూడు గంటలు కేసీఆర్ వివరించారు
మూసీ మీద ఒక్క నిమిషం అయినా మాట్లాడే కాంగ్రెస్ నాయకుడు ఉన్నరా
మూసీ ప్రాజెక్ట్ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ వివరించలగలదా ?
త్వరలో మూసీని మేం ఎలా సుందరీకరణ చేయాలి అనుకున్నామో ప్రజలకు నేనే వివరిస్తాను
మూసీకి అసలు రూ.1.50వేల కోట్లు ఎందుకు అవుతావో చెప్పండి
మూసీకి లక్ష 50 వేల కోట్లు అవుతాయని అభినవ గోబెల్స్ రేవంత్ చెప్పారు
అసలు మంత్రి వర్గ విస్తరణ చేసుకోలేనోడు రాష్ట్రాన్ని బాగు చేస్తా అని బయల్దేరాడు
విద్య శాఖ మంత్రి పెట్టండి అని విద్యార్థులే అడుగుతున్నారు
మూసీ బాధితుల తరపున తప్పకుండ మేమె పోరాడుతాము
మూసీ బాధితులు లంచ్ మోషన్ పిటిషన్లు వందల్లో ఉన్నయాని జడ్జి స్వయంగా చెప్తున్నారు
21 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ 23 రూపాయలు రాష్ట్రానికి తేలేదు
వరద బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు
ప్రభుత్వంలో మంత్రులకు పట్టు లేదు
సీఎంతో మంత్రులకు సమన్వయము లేదు
సీఎం ఒక మాట చెప్తే మంత్రులు ఒక మాట చెప్తారు
ఫార్మా సిటీ రద్దు అని సీఎం చెప్తారు
అధికారులేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు
ఇంతవరకు రైతు భరోసా లేదు
అందరిని ఆదుకుంటామని రైతు బందు ఎత్తేశారు
రబి సీజన్ ప్రారంభమైంది రైతు బందు పత్తా లేదు
రైతు బందూకు పైసలు లేనోళ్ళు మూసి అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పెద్ద స్కాం
నమామి గంగే ప్రాజెక్ట్ లో కిలో మీటర్‌కు రూ. 17 కోట్లు ఖర్చు చేశారు
మూసీ ప్రాజెక్ట్‌లో కిలోమీటర్‌కు రూ.2700 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు
ఈ ఒక్క విషయంతో అది ఎంత స్కాం అనేది అర్ధం అవుతుంది
ప్రభుత్వం అనుముతులు ఇస్తేనే ఇల్లు కట్టుకున్న ప్రజలకు ఇబ్బందులు పడ్తున్నారు
ఇప్పుడు బ్యాంకు ఈఎంఐలు ప్రభుత్వం కడుతుందా ?
ఒక గర్భిణీ ఇల్లు పోతుందని ఏడుస్తుంది
ఆమె ఆక్రందన ప్రజలకు పట్టదా
మూసీ ప్రాజెక్ట్ వల్ల ఒక్క రూపాయి కూడా జనాలకు ఒరిగేది కాదు
మూసీ దగ్గర వచ్చే ఒక కంపెనీ పేరు చెప్పండి
ఇల్లు కూలుతుందని గోల్నాకలో ఒకరు గుండె పోటుతో చనిపోయారు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలు అయింది
చిన్న పిల్లోడు పిలిచినా వస్తా అని చెప్పిన రాహుల్ ఎక్కడ సచ్చిండు
ఎన్నికలో హామీల పేరుతో రాహుల్ గాంధీ ప్రజలను మోసం చేస్తున్నారు
మూసీలో బ్యూటిఫికేషన్ కాదు ఇది లూటిఫికేషన్
మూసీ ప్రాజెక్ట్ కేవలం రాహుల్ గాంధీ కోసమే చేస్తున్నారు
కేంద్రకు తెలిసే గవర్నర్ హైడ్రా ఆర్డినెన్సుకు ఆమోదం వేశారు
అసెంబ్లీలో చర్చించకుండానే ఎలా ఆర్డినెన్సు తెచ్చారు
మూసీ సుందరీకరణ మేము తెచ్చిందే
కానీ మేము ఇలా దోపిడీ చేయాలనుకోలే
మూసీ ప్రాజెక్ట్ మీరు ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తెలుసు
త్వరలో ఆ కాంట్రాక్టర్ పేరు బయట పెడుతాం
Comments
Please login to add a commentAdd a comment