Hanamkonda
-
డిమాండ్‌కు అనుగుణంగా సదుపాయాలు
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించేందుకు సమాయత్తం కావా లని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి టీజీ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్ కో డైరెక్టర్, సీఈలు, 16 సర్కిళ్ల ఎస్ఈలతో రాబోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రా బోయే 5, 10 సంవత్సరాల కాలానికి సంబంధించి ట్రాన్స్ కో, డిస్కం పరిధిలో కొత్తగా నెలకొల్పే సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త పవర్ టాన్స్ఫార్మర్ల ఏర్పాటుపై ట్రాన్స్‌కో సీ ఈలు, ఎస్ ఈలను అడి గి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సబ్ స్టేషన్లకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొత్తగా సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి సెక్షన్ ఏఈ వారానికోసారి పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. త్వరలోనే డాష్ బోర్డు ప్రారంభించే డాష్ బోర్డు ద్వారా ప్రతి ఒక్కరూ సమగ్ర సమాచారాన్ని చూసుకునే సౌకర్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ట్రా న్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు అశోక్ కుమార్, సదర్ లాల్, మధుసూదన్, ట్రాన్స్‌కో సీఈలు శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, డిస్కం సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికం సింగ్, ఎస్ఈలు పాల్గొన్నారు. -
జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్చార్జ్ డీన్‌గా వెంకన్న
విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, చిత్రవాణి స్టూడియో ఇన్చార్జ్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం వెంకన్నను వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇన్చార్జ్ డీన్‌గా (పీఠాధిపతి)నియమించారు. ఈ మేరకు అక్కడినుంచి బదిలీ చేస్తూ గురువారం ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వెంకన్న అక్కడే రిజిస్ట్రార్ కె.హనుమంతురావుకు జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఈనెల 25నుంచి వరంగల్‌లో గిరిజన విజ్ఞాన పీఠంలో విధులను నిర్వర్తించనున్నారు. వరంగల్ గిరిజన విజ్ఞాన పీఠాధిపతిగా ఇప్పటివరకు బాధ్యతలను నిర్వర్తించిన ప్రొఫెసర్ బాబురావును శ్రీశైలంలోని చరిత్ర, సాంస్కృతిక పురావస్తు శాస్త్ర పీఠాధిపతిగా బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వాగ్దేవి కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాల విడుదల
హన్మకొండ: కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్) పీజీ ఒకటో సెమిస్టర్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించగా.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హరీందర్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామిషన్స్ సి.దత్తాత్రేయ గురువారం హనుమకొండ నయీంనగర్‌లోని కళాశాలలో ఫలితాలను విడుదల చేశారు. వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో మొత్తం 112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 95 మంది (84.82% ) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఎంకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎమ్మెస్సీ (న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్)లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఎమ్మెస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 97.06 శాతం, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) 87.50 శాతం, ఎమ్మెస్సీ (డేటా సైన్స్) 85.71 శాతం, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ) 84.62 శాతం ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ శేషాచలం అభినందనలు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీలో పాలమూరు సాహితీవేత్తలు కేయూ క్యాంపస్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 22మంది తెలుగు సాహితీవేత్తలు గురువారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. వరంగల్‌లోని ప్రముఖ సాహిత్యకారుల జన్మస్థలాలు, నివాసస్థలాల సందర్శనలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొదటి ప్రిన్సిపాల్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రాయపోలు సుబ్బారావు పనిచేసిన చోటును సందర్శించినట్లు వారు తెలిపారు. సాహిత్యకారుల వెంట మాజీ ప్రిన్సిపాల్, రిటైర్డ్ ఆచార్యులు బన్న అయిలయ్య, సాహితీవేత్తలు రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, ఉన్నారు. ఆర్ట్స్ కాలేజీ గొప్పతనాన్ని బన్న అయిలయ్య వారికి వివరించారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి విద్యాకేంద్రమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందన్నారు. అంతకుముందు పాలమూరు సాహితీవేత్తలకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ ఆదిరెడ్డి, డాక్టర్ హరికుమార్ తదితరులు ఉన్నారు. -
అఫ్లియేషన్ కోసం తనిఖీలు నిర్వహిస్తాం
● కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లోని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు 2025–26 విద్యాసంవత్సరానికి అఫ్లియేషన్ ఇచ్చేందుకు కమి టీలతో తనిఖీ చేయిస్తామని కేయూ వీసీ ప్రతాప్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల కళాశాలల కరస్పాండెట్లు, ప్రిన్సిపాల్స్‌తో క్యాంపస్‌లోని పరి పాలనాభవనం సెనెట్హాల్లో గురువారం అఫ్లియేషన్, అకాడమిక్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలల్లో ల్యాబ్స్, లైబ్రరీ, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. కళాశాల విద్యార్థులకు ‘ఆపార్ ఐడీ’ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పోతే పోండి.. తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ గత మూడేళ్లుగా ఇవ్వలేదని అందుకే పరీక్షల ఫీజులు చెల్లించడంలేదని ఈనెల 28నుంచి నిర్వహించనున్న డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలను వాయిదావేయాలని ప్రైవేట్ కళాశాలల యాజామాన్యాలు కోరాయి. ఈ సమావేశం కేవలం అఫ్లియేషన్ కోసం అకడమిక్ పరంగా విషయాలను మాట్లాడేందుకే నిర్వహిస్తున్నామని ప్రతాప్‌రెడ్డి చెప్పడంతో.. తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రైవేట్ యాజమాన్యాల బాధ్యులు అన్నారు. దీంతో వీసీ ప్రతాప్‌రెడ్డి స్పందిస్తూ పోతే పొండి.. ఉన్నవారితోనే మాట్లాడుతానని అన్నారు. దీంతో సమావేశం రసాభాసాగా మారింది. రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోయేషన్ బాధ్యుడు ఒకరు కలుగజేసుకుని సమావేశం నిర్వహించాలని కోరడంతో అంతాసద్దుమణిగింది. పరీక్షలు జరగనివ్వం.. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేవరకు ఫీజులు చెల్లించకపోగా.. పరీక్షలు సైతం నిర్వహించనివ్వమని ప్రైవేట్ కళాశా లల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. దీంతో స్పందించిన కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కే యూ పరిధిలో లక్షా 70 వేలకుపైగా డిగ్రీ విద్యా ర్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుందని వారికి ఇ బ్బంది కలగనీవొద్దని కోరారు. టైంటేబుల్ ప్రకారం పరీక్షల ఫీజులు చెల్లించిన కళాశాలలకు పరీక్షలకు నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సీడీసీ డీన్ వరలక్ష్మి, అకడమిక్ డీన్ హనుమంతు పాల్గొన్నారు. -
ఇంటర్ తర్వాత ఎటు..
ఇంజనీరింగ్.. ఇంటర్లో ఎంపీసీ చదివిన వారు ఇంజనీరింగ్ కోర్సుకు అర్హులు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులు/ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం లభిస్తుంది. ప్రధానంగా ఈసీఈ, కంప్యూటర్స్ సైన్స్ విభాగాలు మేలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌తో కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయంటున్నారు.పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రుల ఆలోచన ● కోర్సుల ఎంపికపై తర్జనభర్జన ● విద్యార్థుల ఆసక్తి, ప్రణాళిక ముఖ్యమంటున్న నిపుణులు ● అందుబాటులో రెగ్యులర్‌తోపాటు పలు వృత్తి విద్యా కోర్సులుకామర్స్.. ప్రస్తుతం కామర్స్ కోర్సులకు మంచి భవిష్యత్ ఉంది. ఇంటర్లో ఎంఈసీ, సీఈసీ చదివిన వారు బీకాం కంప్యూటర్స్, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో చేరొచ్చు. దేశంలోని వివిధ ప్రైవేట్ కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఎన్నో జాతీయ బహుళ జాతి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఈ కోర్సుతో మెండుగా ఉన్నాయి.ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో ఇకపై ఏ కోర్సులు చదివిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనలో పడ్డారు తల్లిదండ్రులు. రెగ్యులర్ కోర్సులకు భిన్నంగా వృత్తి విద్య లేదా.. మరేదైనా కోర్సు.. మొత్తానికి తమ పిల్లలు తక్కువ సమయంలో అభివృద్ధిలోకి వచ్చేలా చదువు ఉండాలని తల్లిదండ్రుల ఆలోచన.. ఇలాంటి సమయంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కోర్సులు ఉంటాయి.. ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అంశాలపై ప్రత్యేక కథనం. – ఖిలా వరంగల్బీఎస్సీ డిగ్రీ.. ప్రస్తుతం బీఎస్సీ డిగ్రీ చదివే వారికి క్యాంపస్ ఎంపికల ద్వారా మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇందులో ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంపీఈ, ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీ జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సులు ఉన్నాయి. ఇవి పూర్తి చేసిన వారు సులభంగా ఉద్యోగాలు సాధించొచ్చు. వైద్య కోర్సులు.. ఇంటర్లో బైపీసీ చదవిన వారు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా వైద్య కోర్సులో ప్రవేశం పొందొచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఫార్మసీ, బీహెచ్ఎంఎస్, నర్సింగ్ వంటి కోర్సులు చేయొచ్చు. ఈకోర్సుల్లో చేసిన వారికి వివిధ ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉన్నాయి. సాంకేతిక కోర్సుల్లో మంచి మార్కులు పొందిన వారు ట్రిపుల్ ఐటీ, జేఈఈ, ఎన్ఐటీ రాసేందుకు అర్హులు. బిట్స్ పిలానిలో ప్రవేశం కోసం బీట్శాట్ రాయాలి. స్పేస్ సైన్స్ అభ్యసించాలంటే శాట్ రాయాల్సి ఉంటుంది. న్యాయ కోర్సులు ఇంటర్లో ఏ గ్రూపు చదివిన వారైనా ఐదేళ్ల లా కోర్సుకు అర్హులే.. లా సెట్ ద్వారా ఇందులో ప్రవేశం ఉంటుంది. ప్రస్తుతం వివిధ కంపెనీలు లా చదవిన వారిని ప్రాధాన్యతనిచ్చి కొలువులు కల్పిస్తున్నాయి. లీగల్ అడ్వైజర్స్‌గా కంపెనీల్లోనూ అవకాశం ఉంది. సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.కోర్సుల ఎంపికే కీలకం విద్యార్థుల భవితకు కోర్సుల ఎంపిక కీలకం. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనుకోవడం తల్లిదండ్రులు తప్పుకాదు. కానీ, పిల్లల ఆసక్తి తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. ఎక్కువశాతం తమకు అందుబాటులో ఉన్న కోర్సుల్లో పిల్లలను చేర్పిస్తున్నారు తప్పితే.. భిన్నమైన కోర్సుల్లో జాయిన్ చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులు భవిష్యత్‌లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున ఇంటర్ తర్వాత విద్యార్థులు చదవాల్సిన కోర్సులపై కొంత పరిశోధన చేయడం లేదా విద్యావంతుల సలహాలు తీసుకోవడం మేలు.వ్యవసాయ కోర్సులు.. వ్యవసాయ శాఖతోపాటు, వెటర్నరీ పరిశోధన రంగాల్లో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు ఇంటర్ బైపీసీ చేసిన విద్యార్థులు ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఏబీఎస్సీలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, అక్వాకల్చర్, సిరి కల్చర్, డెయిరీ టెక్నాలజీ, డెయిరీ మేనేజ్మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాలు పొందొచ్చు. ఒకేషనల్ కోర్సులు పలు ఒకేషనల్ (వృత్తి విద్య) కోర్సులు సైతం ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ చేయడం ద్వారా త్వరగా స్థిరపడే అవకాశం ఉంది. దీంతోపాటు యానిమేషన్, గ్రాఫిక్స్, మీడియా, జర్నలిజం, తదితర కోర్సుల ద్వారా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. కాగా, హైదరాబాద్, హనుమకొండ వంటి నగరాల్లో ఈ ఒకేషనల్ కోర్సులను అందించే కళాశాలలు, ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి.విద్యార్థుల ఆసక్తి ముఖ్యమే..విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది ఇంటర్ తర్వాత చదివే కోర్సు. ఈసమయంలో కోర్సు ఎంపిక, విద్యార్థుల ఆసక్తి ముఖ్యం. ఏ రంగం ఎంచుకుంటే భవిష్యత్ బాగుంటుందో ముందే నిర్ణయించుకోవాలి. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అంచనా వేసుకుని అడుగువేయాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. – సత్యనారాయణ, నవోదయ రిటైర్డ్ ప్రిన్సిపాల్, వరంగల్ బీఏ డిగ్రీ.. పోటీ పరీక్షలకు బీఏ కోర్సు తోడ్పాటునిస్తుంది. సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు బీఏలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్, చరిత్ర, స్పెషల్ తెలుగు వంటి కోర్సుల ఎంతగానో తోడ్పడతాయి. డైట్ సెట్ ద్వారా డీఈడీ చేయొచ్చు. ఇంటర్ తర్వాత సీఏ, సీఎస్ (కంపెనీ సెక్రటరీ)లకు వాణిజ్య వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. పలు రకాల బ్యాంకు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఆర్ఆర్బీ ( రైల్వే), గ్రూపు–4, పోలీస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలను పొందొచ్చు. బ్యాంకుల చేయూత ప్రతిభావంతులకు ఆర్థిక అడ్డంకులు తొలగించేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఉన్నత విద్యకు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. విదేశాల్లో చదువుకోవాలనే వారికి రూ.25 లక్షల వరకు రుణ సదుపాయం ఉంది. థర్డ్‌పార్టీ హామీతో రూ.7 లక్షలు, ఎటువంటి హామీ లేకుండా రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.● -
ఆక్రమణల నియంత్రణకు ముళ్లకంచెలు
● బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ● ఎల్లాపూర్ నర్సరీ ఆకస్మికంగా తనిఖీవరంగల్: నగర పరిధిలోని గ్రీన్‌ల్యాండ్స్ ఆక్రమణల నియంత్రణకు ఇనుప ముళ్లకంచెలు ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. బల్దియా పరిధిలోని హసన్‌పర్తి ఎల్లాపూర్లోని జీడబ్ల్యూఎంసీ నిర్వహిస్తున్న నర్సరీని కమిషనర్ గురువారం సందర్శించారు. నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని నగర పరిధిలోని 12 నర్సరీల్లో 10 లక్షల మొక్కలను లక్ష్యంగా పెట్టుకొని పెంచుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా పండ్లు, పూల మొక్కలను పెంచేలా ఆదేశించామన్నారు. ఎండలు గరిష్ట ఉష్ణోగ్రతలను చేరుతున్న క్రమంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు దఫాలుగా నీటిని అందించి మొక్కలను ఎండిపోకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నగర పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ ఆక్రమణలకు గురికాకుండా టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, ఇంజనీరింగ్ విభాగాలు సమన్వయం చేసుకుంటూ వాటి చుట్టూ ముళ్ళకంచెను (ఇనుముతో చేసిన) ఏర్పాటు చేసి సంరక్షించాలని కమిషనర్ అన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేసవి తీవ్రతతో మార్కెట్ వేళల్లో మార్పు ● 30వ తేదీ నుంచి ప్రతి బుధవారం బంద్ వరంగల్: వేసవి ఎండల తీవ్రత పెరగడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో నిర్వహించే బీటు సమయాల్లో మార్పులు చేసినట్లు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28(సోమవారం నుంచి 11జూన్ తేది వరకు) మిర్చి బీటు ఉదయం 7–05 గంటలకు, పత్తి బీటు ఉదయం 8–05గంటలకు, పల్లికాయ ఉదయం 8–15, పసుపు బీటు 8–30లకు, అపరాలు, ధాన్యం బీటు ఉదయం 8–45 గంటలకు ఉంటుందని తెలిపారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరంగల్ గ్రేయిన్ మార్కెట్ గుమస్తా సంఘం కోరిక మేరకు 30–04–2025 బుధవారం నుంచి 11–06–2025 బుధవారం వరకు వచ్చే ప్రతి బుధవారం మార్కెట్ యార్డ్‌కు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మార్పులను రైతులు, అడ్తి వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
నూతన ఆవిష్కరణలు చేపట్టాలి
● ఎస్సార్ వీసీ డాక్టర్ దీపక్‌గార్గ్ హసన్‌పర్తి: సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేపట్టాల ని ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ దీపక్‌గార్గ్ అన్నారు. నగ ర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో యంత్ర–25 ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ దీపక్‌గార్గ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ‘వివిధా హబ్’ ప్రాజెక్ట్ భవిష్యత్‌లో కంటెంట్ గ్లోబలైజేషన్ను నిర్ధేశం చేస్తోందన్నారు. ప్రపంచ అవసరాలకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు ఉండేలా ప్రోత్సహించాలన్నారు. జ్యూరీ అధ్యక్షుడు నాగేంద్రకుమార్ మా ట్లాడుతూ ‘వివిధా హబ్’ను మెరుగు పరిచి పాఠశాలలు, యూ నివర్సిటీలు, సామాజిక సేవా సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వమిది..
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 16 నెలలు గడుస్తున్నా నేటికీ చిన్న కార్యక్రమం కూడా చేపట్టిని చేతకాని దద్దమ్మ ప్రభుత్వమని తేలిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత అన్నారు. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆమె గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు. మమ్మల్ని, మా కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి పలు కార్యక్రమాలు రూపొందించే స్థాయికి మాపార్టీ ఎదిగిందని అన్నా రు. తెలంగాణ ప్రజల ఆశ్వీరాదంతో దేశ వ్యాప్తంగా సేవలు కొనసాగించేందుకు బీఆర్ఎస్గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. ఒల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. రా బోయే రోజుల్లో బీఆర్ఎస్ మహిళా నాయకత్వాన్ని పటిష్ట పరుస్తామన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ భావితరా లకు ప్రజలకు, యువతకు తమ పార్టీ ఉద్యమం కొ సాగింపు విషయాలపై దిశానిర్దేశం చేసేందుకు ప్రజ లు సభకు రాబోతున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభు త్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, నరేందర్, రవిశంకర్, మాలోతు కవిత, చంద్రావతి, లలితా యాదవ్, శ్రీదేవి, హరిరమాదేవి, సుశీలారెడ్డి, రుద్ర రాధ, మాధవి, ప్రసన్న, చారులత, శాలిణి, స్వప్న, హర్షిణి, వసంత, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. రజతోత్సవ సంబురాల ఏర్పాట్లను గురువారం సాయంత్రం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిలు పరిశీలించారు. సభాస్థలిని పరిశీలించిన సీపీ రజతోత్స సభా స్థలాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఏర్పాట్లు, బారీకేడ్లు, హెలీప్యాడ్, వీఐపీ పార్కింగ్, వాహనాల పార్కింగ్ రూట్లు, ప్రధాన వేదిక తదితర విషయాలను బీఆర్ఎస్ నాయకులు సీపీకి మ్యాప్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ రూట్లను ఏర్పాటు చేసుకోవాలని, అంబులెన్స్‌లు, అందుబాటులో ఉంచుకోవాలని సీపీ సూచించారు. ఆయన వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఏఆర్ అడిషనల్ ఎస్సీ సురేష్, ఏఆర్ ఏసీపీ అనంతయ్య, కాజీపేట ఏసీపీ తిరుమల్ ఉన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత -
సజావుగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలకు ఇప్పటివరకు 179 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 22,624 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆమె వెల్లడించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఎస్ఓ కిష్టయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. భూనిర్వాసితులతో సమావేశం.. జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన పర్వతగిరి మండలం చింతనెక్కొండ, ఏనుగల్ గ్రామాల రైతులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని తెలిపారు. -
జిల్లాలో తగ్గిన మద్యం విక్రయాలు
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లోuకాజీపేట అర్బన్ : భానుడి ప్రతాపానికి మద్యంప్రియులు మందు తాగాలంటే వెనుకాముందు ఆలోచిస్తున్నారు. సూర్యుడు సుర్రుమంటుండగా నో చీర్స్ అంటున్నారు. దీంతో ఆబ్కారీ శాఖకు ఆదాయం తగ్గింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 65 వైన్స్, 104బార్ల నుంచి గతేడాది మార్చి, ఏప్రిల్ కంటే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసంలో రూ.4 కోట్ల ఆదాయం తగ్గడమే ఇందుకు నిదర్శనం. రేట్లు పెరగడమూ ఓ కారణమా? వేసవి తాపాన్ని తగ్గించేందుకు మందు బాబులు ఎండాకాలంలో ఎక్కువగా చిల్డ్ బీర్స్‌కు చీర్స్ చెబుతుంటారు. కానీ, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నా.. బీర్లకు చీర్స్ చెప్పడం లేదు. ఇందుకు బీర్ల రేట్లు పెరగడం ఓ కారణంగా భావిస్తున్నారు. ప్రతీ బీరుపై రూ.20అదనంగా పెరగడంతో ఆసక్తి తగ్గినట్లు చెబుతున్నారు. హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ పరిధిలో మార్చి, ఏప్రిల్ నెలలో (వరంగల్ అర్బన్ జిల్లా) అమ్మకాలు ఎకై ్సజ్‌శాఖకు రెండు నెలల్లో రూ.4 కోట్ల ఆదాయం లాస్2025–2024లిక్కర్ (కాటన్లు)బీర్లు (కాటన్లు)న్యూస్‌రీల్ -
డీసీసీలకు కొత్త సారథులు
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని జిల్లా కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్‌గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్‌కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్‌కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్‌కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మ ల్లయ్య, కైలాశ్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. డీసీసీ పీఠం కోసం పోటాపోటీ.... ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాల నుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డిలు ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజు, నమిండ్ల శ్రీనివాస్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కూ చన రవళి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. ● మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీ పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి కీలకం కానున్నారు. ● ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌నే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ● మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తు తం ఉన్న జె.భరత్‌చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబా బాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. ‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టిసారించిన అధిష్టానం వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు... ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులు -
మే 5 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్
వరంగల్ లీగల్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 5 నుంచి 19వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ (ప్రీ లోక్ అదాలత్) నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయవాసేవాధికార సంస్థ చైర్పర్సన్ నిర్మలా గీతాంబ తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులే, చిట్‌ఫండ్ సంస్థల ప్రతినిధులతో న్యాయమూర్తి నిర్మలా గీతాంబ గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణంగా చెల్లని చెక్కులకు సంబంధించి క్రిమినల్, సివిల్ కేసులు రెండు దాఖలు చేస్తారని, ఏదైనా ఒకదానిలో రాజీపడితే రెండు కేసుల నుంచి కక్షిదారులకు విముక్తి లభిస్తుందన్నారు. చెక్ బౌన్స్ కేసుల్లో ముద్దాయి కోర్టుకు రాకుంటే కోర్టులు అరెస్ట్ వారంటూ జారీ చేస్తాయని, ఈ కారణంగా ముద్దాయి జైలుకు వెళ్లినప్పటికీ, అతడు డబ్బు చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేడని తెలిపారు. బ్యాంకులు, చిట్‌ఫండ్, తదితర కంపెనీలు దాఖలు చేసిన చెల్లని చెక్కుల కేసులకు సంబంధించి రుణ గ్రహీతతో రాజీపడే విషయాన్ని పరిశీలించాలని కోరారు. న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి, మధ్యవర్తిత్వం ద్వారా కేసును ప్రత్యేక లోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే, ఇలాంటి కేసుల పరిష్కారం కోసం జూన్ 9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్ కూడా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, వరంగల్ జిల్లా న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్‌బాబు, జూనియర్, సీనియర్ న్యాయవాదులు, బ్యాంకు, చిట్‌ఫండ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హనుమకొండలో... హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్వర్యంలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, చిట్‌ఫండ్స్, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు పాల్గొని మాట్లాడారు. మే 5 నుంచి మే 5 నుంచి 19వ తేదీ వరకు చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ (ప్రీ లోక్ అదాలత్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో రాజీ కుదుర్చుకోగలిగే ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాజీమార్గంలో చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవాలి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ -
డాగ్ షెడ్ పనులు పూర్తి చేయండి: మేయర్ సుధారాణి
వరంగల్: డాగ్ షెడ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. హసన్‌పర్తి చింతగట్టులో జీడబ్ల్యూఎంసీ నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) కేంద్రాన్ని గురువారం మేయర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా డాగ్ షెడ్ ఆవరణను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రతిరోజూ 20 కుక్కలకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికితోడుగా నిర్మిస్తున్న అదనపు డాగ్షెడ్లో సివిల్ పనులు పూర్తయినందున ఆపరేషన్ థియేటర్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే మరో 20 కుక్కలకు అదనంగా ఆపరేషన్లు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని కుక్కల కోసం నగర వ్యాప్తంగా ఉన్న పార్కులు, కుక్కల అధిక సంచార ప్రాంతాల్లో సుమారుగా 300 నీటి తొట్టెలను ఏర్పాటు చేసేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, వెటర్నరీ డాక్టర్ డా.గోపాల్‌రావు, ఈఈ సంతోశ్‌బాబు, డీఈ రవికిరణ్, ఏఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ రజతోత్సవ సభను బహిష్కరించాలి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట: జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన రజతోత్సవ బహిరంగ సభను ప్రజలు బహిష్కరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాజీపేట చౌరస్తాలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సోమిడి రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాజీపేట మీడియా పాయింట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలుగా విధ్వంసం చేసి ఉనికిలేకుండా చేసిన బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పశ్చిమ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్‌ను నాలుగు దఫాలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ వెనుకబాటుతనానికి గురిచేశాడని విమర్శించారు. దోపిడీ ముఠా ఈ విషయంపై బహిరంగ చర్చకు వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ అంకూస్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
తెలంగాణ యాసకు జీవం పోసిన కేసీఆర్
హన్మకొండ: తెలంగాణ యాసకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవం పోశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం హనుమకొండ సుబేదారిలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి రూపొందించిన ‘ఎగిసెర బలే ఎగిసెర సారే రావాలంటూ ఓరుగల్లు పిలిచెర‘ అనే పాటను, అలాగే రిటైర్డ్ తహసీల్దార్ మహమ్మద్ సిరాజుద్దీన్ రచించిన పాటను, చిందు కళాకారుడు, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, రాకేష్‌రెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కవిత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు మనం మన తెలంగాణ యాసలో మాట్లాడితే హేళనగా చూసేవాళ్ళన్నారు. 2001లో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టి మైకందుకుని తెలంగాణ యాస మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ మన యాసను సగర్వంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాయకుడు మానుకోట ప్రసాద్, జాగృతి రాష్ట్ర నాయకుడు దాస్యం విజయ్ భాస్కర్, రజినీసాయిచంద్, సిరాజుద్దీన్ పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి పూజలు ఎమ్మెల్సీ కవిత నగరంలోని శ్రీభద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతించగా, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రజతోత్సవ పాటల సీడీ ఆవిష్కరణ -
పూడికతీత పనుల్లో వేగం పెంచండి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆశ్విని తానాజీ వాకడే సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ పరిశీలించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడికతీత లక్ష్యం కాగా ఇప్పటి వరకు చెరువులో రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీసినట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు. నిర్దేశిత గడువులోగా పూడికతీత పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ‘కుడా’ ప్రాజెక్టు అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్జులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్‌నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈనెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటల్లోపే చేరుకుంటారని, ఆలోగా.. ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జన సమీకరణపై ఆరా.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జులు పాల్గొన్న ఈ సమీక్షలో జన సమీకరణపై ఇప్పటి వరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈమేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బంది పడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్చా ర్జ్ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కు చెందిన పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జన సమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించనున్నట్లు, ఆందరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. సభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్షలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లులో ప్రతీ ఇంటి నుంచి జనం కదలాలే.. సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు.. రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష.. కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలు -
ట్యాంకర్ల ద్వారా సరఫరా..
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఎల్ఎండీ నుంచి సరఫరా చేసే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వ నీరు నిలిచిపోయింది. గోదావరి జలాలు అడుగంటిపోగా.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ధర్మసాగర్ చెరువులో జూన్ మొదటి వారం వరకు నీటి నిల్వలు ఉన్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరిగితే చెరువులో నీళ్లు ఆవిరయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో అక్కడి నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి, ఫిల్టర్ బెడ్ల ద్వారా నగరానికి అయ్యే నీటి వాటా సరఫరా తగ్గనుంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పలు కాలనీలకు ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. రానున్న రోజుల్లో తాగునీటి గండం పెరిగే అవకాశం ఉన్నందున పాలకవర్గం ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వరంగల్ సమ్మయ్యనగర్‌లో సన్నటి ధారతో పోస్తున్న నల్లాలీకేజీలను అరికట్టాలి.. ఓవర్‌హెడ్ ట్యాంకుతోపాటు పైప్ లైన్లు, గేట్‌వాల్వ్‌ల లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. ఎగువ ప్రాంతాలకు అందడం లేదు. మున్సిపల్ అధికారులు స్పందించి లీకేజీలన్నింటికి మరమ్మతులు చేయించాలి. రెండు, మూడు రోజులకోసారి కాకుండా రోజూ తాగునీటిని విడుదల చేయాలి. – నాగేశ్వర్రావు, కాజీపేటఅడుగున మట్టి పేరుకుంటోంది.. తాగునీటిని పట్టుకున్నాక, గంట తర్వాత చూస్తే బిందె అడుగున మట్టి పేరుకుంటోంది. నల్లా నీటిని పట్టుకునేప్పుడు ఎంత వడగట్టినప్పటికీ మట్టి పేరుకుపోతోంది. తాగాలంటే భయమేస్తోంది. మినరల్ వాటర్ క్యాన్ కొనుక్కోవాల్సి వస్తోంది. – తోహెద, న్యూరాయపుర, హనుమకొండ తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం.. తాగునీటి కోసం అరిగోస పడుతున్నాం. పైపులైన్ ద్వారా రెండ్రోజులకోసారి రెండు బిందెల కన్నా ఎక్కువ రావడం లేదు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అధికారులు సమయానికి ఎక్కువసేపు నీరు విడుదల చేయాలి. – కీసర లక్ష్మి, విద్యానగర్ కాలనీ, వరంగల్ సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర ప్రజలకు తాగునీటి గండం పొంచి ఉంది. అడుగంటిన జలాశయాలు, భూగర్భజలాల కారణంగా నీటి తిప్పలు తప్పేట్లు లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోనూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పూడికతీత కోసం వరంగల్ భద్రకాళి చెరువును ఆరు నెలల క్రితం ఖాళీ చేశారు. పూడికతీత పనులు నత్తనడకన సాగుతుండగా.. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. పూడికతీత కోసం నీరు ఖాళీ చేయడంతో భద్రకాళి చెరువుపై ఆధారపడిన 150 కాలనీల్లో బోర్లు, బావులు ఎండిపోయాయి. హనుమకొండ పెద్ద వడ్డేపల్లి, కాజీపేట బంధం చెరువు, వరంగల్ దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువులో నీటి నిల్వలు తగ్గడంతో పాటు చుట్టు పక్కల కాలనీల్లో భూగర్భ జలమట్టం పడిపోతోంది. 42 విలీన గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పైపులైన్ ద్వారా విడుదల చేయాలి.. వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంతో ప్రధాన పైపులైన్ల ధ్వంసమయ్యాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. స్థానిక ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నాం. తాత్కాలికంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పైపులైన్ల మరమ్మతులు చేసి తాగునీటిని పునరుద్ధరించాలి. – బత్తుల సంధ్యారాణి, 34వ డివిజన్, శివనగర్, వరంగల్ న్యూస్‌రీల్ -
‘గ్రేటర్’కు నీటి సరఫరా ఇలా...
వరంగల్ ప్రజలకు ప్రధాన తాగు నీటి వనరు గోదావరి నది. దేవాదుల, లోయర్ మానేరు డ్యాంల నుంచి నీటిని వరంగల్ నగరానికి సరఫరా చేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ అవసరాలను తీర్చేందుకు 4 ఫిల్టర్ బెడ్లలో ప్రతీ రోజు 219.78 ఎంఎల్డీ (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీటి శుద్ధి జరుగుతోంది. ఈతాగునీటి సరఫరా కోసం 960 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఉంది. దీనికి తోడు స్లమ్, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రతీ ఇంటికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సుమారు 32 ప్రాంతాల్లో భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. -
పెరుగుతున్న ఎండలు.. తస్మాత్ జాగ్రత్త!
ఎంజీఎం : ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్నందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు తగ్గించాలని, ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్లకూడదని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన నగరవాసులకు, జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. సూచనలు ఇలా.. ● మంచినీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత మంచినీరు తాగాలి. అదేవిధంగా కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవపదార్థాలు తీసుకోవచ్చు. ● వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు బయట ఆడడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. వారిని ఉదయం లేదా సాయంత్రం పూటనే ఆడుకోవడానికి అనుమతించాలి. ● ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా చెవులకు వేడి గాలి తగలకుండా తలకు నిండుగా రుమాలు కానీ, ఖర్చీఫ్ కానీ చుట్టుకోవాలి. ● గొడుగు, టోపీ, రుమాలు లేదా.. ఇతర రక్షణ చర్యలు తీసుకోకుండా ఎండలో పనిచేసేవారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. సన్నని, వదులుగా, లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. ● వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం, నాలుక ఎండిపోవడం పాక్షిక లేదా అపస్మారక స్థితికి లోనయ్యే అవకాశం ఉంటుంది. పొడిచర్మం, చిరాకు, తలనొప్పి, శ్వాస పెరగడం, వికారం, వాంతులు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే చల్లటి ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో ముంచిన గుడ్డతో శరీరాన్నంత తరచూ తుడుస్తూ ఉండాలి. వారికి కొబ్బరి నీళ్లు లేదా ఓఆర్ఎస్ ద్రావణం లేదా కొంచెం ఉప్పు కలిపిన మజ్జిగను తాగిస్తూ ఉండాలి. పరిస్థితి గమనిస్తూ అవసరమైతే 108 వాహనం ద్వారా దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తప్పకుండా తీసుకువెళ్లాలి. ● ఉపాధి హామీ కార్మికుల విషయంలో సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉదయం లేదా సాయంత్రం నాలుగు తర్వాతనే వారితో పని చేయించాలి. వారికి అవసరమైన మంచినీరు, సేద తీరడానికి నీడ వసతి ఏర్పాటు చేయాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య -
హనుమకొండ జిల్లా జడ్జి పట్టాభిరామారావు బాధ్యతల స్వీకరణ
వరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, రవి నేతృత్వంలో కా ర్యవర్గం.. న్యాయమూర్తి పట్టాభి రామారావు కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వేయిస్తంభాల ఆలయంలో పూజలుహన్మకొండ కల్చరల్: హనుమకొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.పట్టాభి రామారావు బుధవారం రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. న్యాయమూర్తి దంపతులు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది మధుకర్, అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్‌శర్మ పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి..హన్మకొండ చౌరస్తా: ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శ్రద్ధతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్‌లో ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డులతో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్విహించారు. ఈసమావేశంలో ముందుగా సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పరిపాలనా విభాగాధికారులను అడిగి తెలుసుకుని, సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ విభాగంలో ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది చాలా కీలకమన్నారు. మీకు శాఖాపరమైన లేదా వ్యక్తిగత సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీలైనంత వరకు సదరు అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని, పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటారని సూచించారు. ఈసమావేశంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్, ఏఎస్పీ మనన్‌భట్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నాగయ్య, అనంతయ్య, సురేంద్ర, ఆర్లు పాల్గొన్నారు. జూన్ 6నుంచి పీజీ సెకండి యర్ రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల (నాన్‌ప్రొఫెషనల్) సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) జూన్ 6వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాఽధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య బుధవారం తెలిపారు. ఈనెల 26 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. రీషెడ్యూల్ చేస్తూ బుధవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. జూన్ 6, 9, 11, 13, 16, 18 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల పరీక్షలు వరకు నిర్వహిస్తారని వారు తెలిపారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంచాలివిద్యారణ్యపురి: విద్యార్థుల్లో జాతీయ భావం పెంచాలని జిల్లా సెక్టోరియల్ అధికారి బద్దం సుదర్శన్‌రెడ్డి అన్నారు. ‘ఏక్‌భారత్, శ్రేష్ట్ భారత్’ ఛాయ చిత్ర ప్రదర్శనను హనుమకొండలోని జూలైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆపాఠశాల హెచ్ఎం భాస్కర్‌రెడ్డితో కలిసి సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మణసుధాకర్, ప్రేమలతారెడ్డి, అపూర్వరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!
సంగెం/కాజీపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను ప్రత్యేక విపత్తుగా పరిగణించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ వడదెబ్బతో చనిపోయిన వారి వివరాల నివేదికను కలెక్టర్‌కు పంపిస్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఇటీవల ఆ మొత్తాన్ని రూ. 4 లక్షలకు పెంచింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవగాహన లోపంతో పరిహారానికి దూరం.. వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, రైతులు, హమాలీలు, ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి చెందుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్భందు పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించేది. అధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా అర్హుల జాబితా వరుస క్రమంలో నిధుల లభ్యతను బట్టి సాయం అందించేవారు. ఆపద్భందు పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా, వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు దరఖాస్తులు చేసుకునేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయిందనే చెప్పొచ్చు. సాయం అందకపోవడం, పరిహారం తక్కువ ఉండడం, పోస్టుమార్టం వ్యయప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబసభ్యులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కాగా, వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి పేరిట రైతుబీమా ఉంటే రెండింటిలో ఒక పరిహారం పొందే అవకాశం ఉంటుంది. మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు గతంలో రూ. 50 వేలు.. ప్రస్తుతం రూ.4లక్షలు పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి మృతిపై సమాచారం అందించాలి త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా పరిహారం చెల్లింపులుఇవీ నిబంధనలు... వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందించడం మృతుల కుటుంబాలకు కాస్త ఊరట కలిగించే అంశమే. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలోకి తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణిస్తే తహసీల్దార్, వైద్యాధికారి, ఎౖస్సైతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి. మృతుల కుటుంబ సభ్యులు ముందు ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీస్ శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందు వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించాలి. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీసుస్టేషన్‌కు అందజేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యాధికారి పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది.వడదెబ్బపై అవగాహన కల్పిస్తున్నాంవడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పరిహారం పెంచింది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. వైద్యశాఖ ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే త్రిసభ్య కమిటీకి తెలపాలి. నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తాం. –గనిపాక రాజ్‌కుమార్, తహసీల్దార్, సంగెం -
దక్షిణ మధ్య రైల్వే జోన్లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను హైదరాబాద్‌లోని రైలు నిలయంలో బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య కలిశారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కాజీపేట బస్టాండ్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, అమృత్‌భారత్ పథకం కింద వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రైల్వే క్రూలింక్‌ల తరలింపు విషయంలో వివరణ, రైల్వే యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించాలని జీఎంను కోరారు. మూడు రోజుల్లో నాయకులతో సమావేశం కానున్నట్లు జీఎం చెప్పారని ఎంపీ తెలిపారు. కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోనకు బదిలీ చేయడం, కాజీపేటలో కొత్త పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై జీఎంను వివరణ కోరినట్లు తెలిపారు. కాజీపేటలో 709 మంది ఉద్యోగులకు 526మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, రన్నింగ్‌స్టాఫ్‌లో 184 కొత్త పోస్టింగ్‌లు మంజూరైన పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలూ లేవని, దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతుందని జీఎంకు వివరించారు. 2022 జూలై 14న రైల్వే అధికారులతో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో రైల్వే అథారిటీ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి కృష్ణా, ఎల్టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల ను కాజీపేట నుంచి విజయవాడ డిపోనకు తరలిస్తున్నారన్నారు. కాజీపేట డివిజన్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని జీఎంను కోరినట్లు తెలిపా రు. ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. ఎంపీలు రఘురాంరెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.కోర్టు ప్రాంగణంలో సూట్‌కేస్ కలకలంవరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని సబ్ కోర్టు ఎదుట బుధవారం అ నుమానాస్పదంగా ఉ న్న ఓ సూట్‌కేస్ కలకలం రేపింది. ఎవరిదో తెలియకపోవడంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో బాంబు అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది సూట్‌కేస్‌ను పరిశీలించారు. దానిని తెరిచి చూడగా ఏమి లేకపోవడంతో కోర్టు యంత్రాంగం, న్యాయవాదులు, కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ లైంగిక దాడి కేసులో బాధితురాలు విచారణ నిమిత్తం బుధవారం కోర్టుకు హాజ రైంది. సదరు బాధితురాలు వికలాంగురాలు కావడంతో వెంట తెచ్చుకున్న సూట్‌కేస్‌ను సబ్ కోర్టు ఎదుట కింద ఉంచి పై అంతస్తులో ఉన్న హనుమకొండ మొదటి జిల్లా అదనపు కోర్టులో విచారణకు హాజరైంది. ఈ క్రమంలో గంటల తరబడి సూట్‌కేస్ వద్ద ఎవరూ లేకపోవడంతో అనుమానించిన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈనెల 4న కోర్టు ప్రాంగణంలో బాంబ్‌లు అమర్చినట్లు ఉభయ జిల్లాల అధికారికి, ఈ మెయిల్‌కు తమిళనాడు లిబరేషన్ ఆర్మీ పేరున మెయిల్ అందిన విషయం తెలిసిందే. -
గురిపెట్టి సివిల్ కొట్టారు..
ఖిలా వరంగల్: బాల్యంనుంచే సివిల్స్ ప్రాధాన్యత, ఆ పోస్టులో దక్కే గౌరవాన్ని వరంగల్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తండ్రి అతని కుమారుడికి వివరించారు. తండ్రి మాటలను శాసనంగా తీసుకున్న ఆ కుమారుడు కష్టపడి చదివాడు. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 814 ర్యాంకు సాధించాడు. హనుమకొండ రాంనగర్ గోగుల్ నగర్‌కు చెందిన జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ గంగాధరి సుదర్శన్, అరుణ దంపతుల మొదటి కుమారుడు విక్రమ్ కాకతీయ యూనివర్సిటీలో 2016లో బీటెక్ పూర్తి చేశాడు. 2023లో ఐబీ ఇన్స్పెక్టర్గా ఎంపికై నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో మెరుగైన ర్యాంకు రావడంతో డీఎస్పీ లేదా అడిటర్ అధికారిగా వచ్చే ఆవకాశం ఉంది. కాగా, ఐబీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఉండగా ఢిల్లీలో లాంగ్‌టర్మ్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నారు. వరుసగా రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా విక్రమ్ అధైర్యపడలేదు. మూడో ప్రయత్నంలో ఆలిండియాలో 814వ ర్యాంక్ సాధించి తన సత్తా చాటారు. ఈ మేరకు బుధవారం వరంగల్ రైల్వేస్టేషన్లో ఆయన తండ్రి రాజును పలువురు అధికారులు కలిసి అభినందించారు. సత్తా చాటిన జీఆర్పీ కానిస్టేబుల్ కుమారుడు మూడో ప్రయత్నంలో 814 ర్యాంక్ సాధించిన విక్రమ్ ప్రస్తుతం నెల్లూరులో ఐబీ ఇన్స్పెక్టర్గా విధులు గ్రూప్–1లోనూ ర్యాంకు.. -
ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించాం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతోపాటు ఐఐటీ, జేఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుధవారం 55వ డివిజన్ కోమటిపల్లిలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నాయన్నారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కళాశాలకు చెందిన జె. అంజనా 997 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఎంపీసీ విభాగంలో కె. రుత్విక్ 996 మార్కులు, సేవితా 994 మార్కులు, కీర్తన 994 మార్కులు, జి.వర్షిణి 993 మార్కులు, సాత్విక 992 మార్కులు, పల్లవి 992 మార్కులు, గాయత్రేణి 992 మార్కులు, కె. హాసిని 992 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో జి. తరుణ్ 468 మార్కులు, ఎ.నిచిత 468 మార్కులు, కె. సహస్ర 467 మార్కులు, శ్రీవర్షిణి 467 మార్కులు, పి.సిరిచందన 467 మార్కులు, దేషిమి 467 మార్కులు, కె.వర్షిత 467 మార్కులు, సాత్విక 467 మార్కులు, కె. శ్రీకాంత్ 467 మార్కులు, బన్ని 467 మార్కులు, ఎ.ధీరజ్ 467 మార్కులు, కె. గీతాంనిహారి 467 మార్కులు, హాసిని 467 మార్కులు, సాయినాథ్ 466 మార్కులు, బైపీసీ విభాగంలో తారీమ్ 438 మార్కులు, సామఫి రాధోస్ 438 మార్కులు, హాసిని 437 మార్కులు, మస్విని 436 మార్కులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి -
ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి : కలెక్టర్
సాక్షి, వరంగల్: జిల్లాలో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కింద ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ త్వరగా జారీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్, భూగర్భ జలాల పరిరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవితో కలిసి బుధవారం ఆమె సమీక్ష చేశారు. 25 శాతం రాయితీతో ఈనెల 30 వరకు చివరి గడువు ఉన్నందున ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరించాలి.. జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా ప్రతి 200 చదరపు మీటర్లకు పైన ఉన్న ఇళ్ల్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఇంకుడు గుంతల వివరాలు సేకరించి నివేదికలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలిపారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల్ల వెరిఫికేషన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స హాల్లో ఇందిరమ్మ ఇళ్ల్ల వెరిఫికేషన్ అధికారులకు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఐడీ కార్డులు, క్యాపులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11 మండలాలతో పాటు మున్సిపాలిటీలకు 86 మంది వెరి ఫికేషన్ అధికారులను నియమించినట్లు తెలిపారు. మాట్లాడుతున్న వరంగల్ కలెక్టర్ సత్యశారద -
వడదెబ్బతో ముగ్గురి మృతి
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలోని బస్టాండ్‌లో బుధవారం ఓ గుర్తుతెలియని వృద్దుడు వడదెబ్బతో మృతి చెందాడు. రైల్వే పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలకు 87126–85122 నంబర్‌కు ఫో చేయాలని సీఐ కోరారు. తిమ్మంపేటలో మహిళ .. దుగ్గొండి: వడదెబ్బతో ఓ మహిల మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన నాంపల్లి రవళి అలియాస్ కల్పన (35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన ఇంటి పెరటితోటలో పనులు చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చిన కొద్ది సమయం తర్వాత అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేందర్, ఇద్దరు కూతుళ్లు జ్యోతిప్రియ, లక్ష్మీప్రసన్న ఉన్నారు. ఘన్‌పూర్‌లో మరో మహిళ.. స్టేషన్‌ఘన్‌పూర్: వడదెబ్బతో ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన పులి రమ(50) మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. రమ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. దీంతో కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సుబేదారిలో కారు బోల్తా.. యువకుడి దుర్మరణం
● సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండగా ఘటన వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్ మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాననే ఆనందంలో నమిండ్ల అభిషేక్ (18).. సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకుని స్నేహితులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. -
రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. వృద్ధుడి మృతి
లింగాలఘణపురం: కారు.. బైక్ ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపం కాటన్‌మిల్లు వద్ద జరిగింది. ఎస్సై శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారపల్లికి చెందిన తీగల సోమనర్సయ్య(80), తన భార్య అన్నపూర్ణ, కుమారుడు శ్రీధర్, కోడలు ప్రణీతతో కలిసి కారులో తుంగతుర్తిలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో కారు నెల్లుట్ల సమీపంలో జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న రఘునాథపల్లి మండలం బాంజీపేటకు చెందిన హరీశ్‌ను ఎ దురుగా ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సోమనర్సయ్యతోపాటు కుటుంబ సభ్యులు, ద్విచక్రవాహనదారుడు హరీశ్ గాయపడగా 108 సిబ్బంది నరేశ్, బిల్లా రాజు జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమనర్సయ్య మృతి చెందాడు. గాయాలైన అన్నపూర్ణ, శ్రీధర్, ప్రణీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హరీశ్ జనగామ ఏరియా ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ వివరించారు. కాగా, జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల పరిధిలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. -
ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలి
హన్మకొండ: రాజీవ్ యువ వికాసం అమలులో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దాదాపు రూ.63 కోట్ల ద్వారా జిల్లాలో వివిధ యూనిట్లను నెలకొల్పేందుకు అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మండల స్థాయి ఎంపిక కమిటీ మే 10 నాటికి ఎంపిక చేసి జాబితా సమర్పించాలన్నారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, బీసీ వెల్ఫేర్ డీడీ రామ్‌రెడ్డి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మురళీధర్‌రెడ్డి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ప్రేమకళ, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మహిళా శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో పోషణ పక్షం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ప్రావీణ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రీ స్కూల్ విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమాధికారి జె.జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, ఆయుష్ వైద్యుడు డాక్టర్ మహేందర్, జిల్లా న్యూట్రీషన్ స్పెషలిస్ట్ డాక్టర్ సరళ, సీడీపీఓలు విశ్వజ, స్వరూప, స్వాతి, పోషణ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ టి.సుమలత, జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ వి.వెంకట్రాం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం అర్హులకు బ్యాంకు ద్వారా రాయితీ అందించాలి హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య -
విద్యా కార్యక్రమాలు, ప్రగతిపై సమీక్ష
విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వరంగల్ నగరంలో బుధవారం పర్యటించారు. పలు విద్యాసంస్థలను పరిశీలించిన అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రావీణ్య, డీఈఓ వాసంతి, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న విద్యాకార్యక్రమాలు, ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది అధికారులనుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. నాణ్యమైన విద్యను అన్ని సదుపాయాలతో అందించేలా ఓ మోడల్‌గా ‘పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది విద్యాకమిషన్ ప్రతిపాదించిందని, ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఆ స్కూల్స్ ఎలా ఉంటాయో మోడల్‌గా పలు అంశాలను ఆయన వివరించారు. అధికారులనుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వసతుల పరిశీలన.. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్పీజీ కళాశాల, జూనియర్ కాలేజీలను ఆకునూరు మురళి సందర్శించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి సరిపోవడం లేదని, అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం చరిత్ర విభాగం జాతీయ సదస్సు పరిశోధన పత్రాల ఐఎన్ఎస్ ఎన్యూ జీసీ కేర్ జర్నల్ను మురళీ చేతులమీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా హనుమకొండలోని వడ్డెపల్లిలోని ప్రభుత్వ హైస్కూల్‌ను సందర్శించారు.పేరెంట్, టీచర్స్ మీటింగ్‌లో తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఉపాధ్యాయలు చేసిన ఎస్ఏ –2 పరీక్షల జవాబుపత్రాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, ఎంఈఓ నెహ్రూ, పింగిలి ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. అధికారులతో సమావేశమైన విద్యాకమిషన్ చైర్మన్ మురళి అంతకుముందు పాఠశాల, కళాశాలల తనిఖీ -
పుష్కరాల పనుల్లో వేగం పెరగడం లేదు
కాళేశ్వరం: ఆశించిన స్థాయిలో పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెరగడం లేదని, పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. బుధవారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరంలో పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద పుష్కర ఘాట్ విస్తరణ పనులు చూశారు. గోదావరి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్న కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. -
రజతోత్సవానికి ముస్తాబు
భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల పండుగకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి – చింతలపల్లి శివారులో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, సభకు హాజరయ్యే జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేందుకు బారికేడ్లు అమర్చారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్ శివార్లలో 1,200 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసమే కేటాయించారు. వేదికకు ఇరువైపులా కేసీఆర్, కేటీఆర్ నిలువు కటౌట్లతో రజతోత్సవ చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
వరంగల్ క్రైం: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డిపై బెదిరింపుల హనుమకొండ సుబేదారి పోలీ స్స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్ప డుతూ దౌర్జన్యంగా, అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తూ బూతులు తిడుతున్నాడని, తనతో ప్రాణ హాని ఉందని వ్యాపారవేత్త కట్ట మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి మంగళవారం సుబేదారి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు కౌశిక్‌రెడ్డిపై కేసు నమో దు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో మనోజ్‌రెడ్డి నుంచి కౌశిక్‌రెడ్డి రూ. 25 లక్షలు తీసుకున్నాడని, మరోసారి డబ్బులు కావాలని బెదిరింపులకు పాల్పడుతూ, ఫోన్లో బూతులు తిడుతున్నట్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. క్వారీ యజమానిపై ఫిర్యాదుకమలాపూర్: మండలంలోని గుండేడు గ్రామస్తులు క్వారీ యజమాని మనోజ్‌రెడ్డిపై కమలాపూర్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. క్వారీ యజమాని మనోజ్‌రెడ్డి గ్రామ దేవాలయాల కోసం రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని, ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మనోజ్‌రెడ్డికి ఫోన్ చేయగా మనోజ్‌రెడ్డి ఎమ్మెల్యేతో అసభ్యంగా మాట్లాడి అవమానించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక సీఐ హరికృష్ణను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
కేజీబీవీల్లో 88.5 శాతం ఉత్తీర్ణత
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని 9 కేజీబీ వీల్లో 339 మంది విద్యార్థినులు ఇంటర్ సెకండియ ర్ పరీక్షలు రాయగా.. 300 మంది (88.5 శాతం) ఉత్తీర్ణత సాఽఽధించారని జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ సునీత తెలిపారు. ఆత్మకూరు కేజీబీవీ విద్యార్థిని ఎస్.హర్షిణి ఎంపీసీలో 1000 మార్కులకు 967 మా ర్కులు సాధించింది. ఐనవోలు కేజీబీవీ విద్యార్థిని ఎస్.నర్మద బైపీసీలో 1000 మార్కులకు 984 మా ర్కులు, సెకండియర్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో బి.సాగరిక 1000 మార్కులకు 984 మార్కులు సాధించా రని పేర్కొన్నారు. ఫస్టియర్‌లో 85 శాతం ఉత్తీర్ణత ఇంటర్ ఫస్టియర్‌లో 463 మంది విద్యార్థినులు ప రీక్షలకు హాజరుకాగా 384 మంది ఉత్తీర్ణత (85శా తం)సాధించారు. కమలాపూర్ కేజీబీవీ విద్యార్థిని సీహెచ్.దివ్య ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులు, ఐనవోలు కేజీబీవీ విద్యార్థిని అశ్విని బైపీసీలో 440 మార్కులకు 431 మార్కులు సాధించారు. హసన్‌పర్తి కేజీబీవీ విద్యార్థిని జె.సాయిప్రియ ఫస్టియర్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకు 497 మార్కులు సాధించారని తెలిపారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముకప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
సివిల్స్‌లో మెరిశారు..
ఐదోసారి ఐఏఎస్ కొట్టాడు.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకులు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి పోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబయిలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియా 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య..
వరంగల్ క్రైం : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోపాటు తనను గతంలో సస్పెండ్ చేయించాడనే కోపంతో సామాజిక కార్యకర్త ఛిడం సాయిప్రకాశ్‌ను హత్య చేసిన కేసులో ఓ కానిస్టేబుల్‌తో సహా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ (ఎం) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బాషబోయిన శ్రీనివాస్ గతంలో వెంకటాపూర్ (కె) పోలీస్ స్టేషన్లో విధులు నిర్వరిస్తున్న క్రమంలో భూమి విషయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతం నిర్మలతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై నిర్మల భర్తతో కలిసి మృతుడు సాయి ప్రకాశ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌ను సస్పెన్షన్ చేశారు. ఫోన్ సమాచారంతో కిడ్నాప్.. హత్య ఈనెల 15వ తేదీన నిందితురాలు నిర్మల, ఆమె భర్తతో కలిసి మృతుడు సాయిప్రకాశ్ తన కారులో ఆస్పత్రికి వచ్చారు. ఈ విషయన్ని నిర్మల.. నిందితుడు శ్రీనివాస్‌కు ఫోన్లో తెలియజేయడంతో ప్రణాళిక ప్రకారం కారును వెంబడించి రాత్రి 11.30 గంటల సమయంలో గోపాల్‌పూర్‌లోని బేబిసైనిక్ స్కూల్ వద్ద కారును ఆటోతో ఢీకొట్టించాడు. అనంతరం సాయి ప్రకాశ్‌ను కారులోనే కిడ్నాప్ చేసి హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి శాలువతో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ పీఎ స్ పరిధిలోని జిల్లేడగడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావి లో పడేశారు. అనంతరం వేలేరు మండలం మీదుగా హనుమకొండ ఏషియన్ మాల్ దగ్గర కారు నిలిపి వెళ్లారు. నిందితుల అరెస్ట్.. ప్రధాన నిందితుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్‌తో పాటు ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన డేవిలిసాయి, హనుమకొండకు చెందిన అలోతు అరుణ్‌కుమార్ అలియాస్ పండు, బాదావత్ అఖిల్ నాయక్, బాదావత్ రాజు, వాజేడు వెంకటాపూర్‌కు చెందిన చింతం నిర్మలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఓ కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ఫోన్లు, పిస్టోల్‌ను స్వాఽధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. అధికారులకు అభినందనలు.. సామాజిక కార్యకర్త సాయి ప్రకాశ్ హత్య కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్, హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి, హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీశ్, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. సాయిప్రకాశ్ హత్య కేసులో కానిస్టేబుల్‌తో సహా ఆరుగురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ సన్‌ప్రీత్‌సింగ్ -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు. -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్‌రెడ్డి అభినందించారు. -
భీమారం– సీతంపేట వరకు ఫోర్‌లేన్
హసన్‌పర్తి : భీమారం నుంచి సీతంపేట క్రాస్ వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే. ఆర్.నాగరాజు తెలిపారు. హన్మకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి తహసీల్ కార్యాలయం నుంచి పెద్ద చెరువు వరకు ప్రమాదకర ఏరియాలను బల్దియా మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఎ మ్మెల్యే పరిశీలించారు. ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయా విభాగాల అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం విస్తరణ, తాత్కాలిక డివైడర్లు, ఇరువైపులా వీధి దీపాల కోసం రూ.2 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మే యర్ గుండు సుధారాణి మాట్లాడుతూ పది రోజుల్లో రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు వేస్తామన్నారు. కుడా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ జంక్షన్ల అభివృద్ధికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఐదేళ్లలో 45 మృతి చెందారు ఐదేళ్ల కాలంలో ఈ రోడ్డులో 45 మంది మృతి చెందినట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉందన్నారు. పదేళ్ల కాలంలో పాలకులు మాత్రం అభివృద్ధి కోసం ఏమీ పట్టించుకోలేదన్నారు. అయితే కొంతమంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీకీ ఎలాంటి అనుమతి లేదన్నారు. కమిటీ చెల్లదన్నారు. వారి వెంట కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకటస్వామి, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఉన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాం ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 1, 2, 3, 14, 43వ డివిజన్ పరిధిల్లో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను మంగళవారం హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్లు మేర్గు రాజేష్, గోపాల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, మాజీ సర్పంచ్ అనిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెద్దన్న, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు క్షేత్రస్థాయిలో రోడ్డు పరిశీలన -
55 మంది హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్
ఎంజీఎం: వ్యాక్సినేషన్‌తో హజ్ యాత్రికులకు ఎ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. ఐఎంఏహా ల్లో హజ్ యాత్రికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ సర్వర్ ఘాజీ సహకారంతో హజ్ యాత్రికులకు మంగళవారం వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 55 మంది కి వ్యాక్సినేషన్ చేశామని, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి వచ్చిన నలుగురు హజ్ యాత్రికుల కు వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్, వైద్యులు ఆచార్య, జునైద్‌ఖాన్, కిరణ్, భరత్‌కుమార్, రహేలా తన్వీర్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, విద్యాసాగర్, రవీందర్, నితిన్‌రెడ్డి, సంజీవ్, సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ డాక్టర్‌పై కేసు నమోదు రామన్నపేట: తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రార్ డాక్టర్ బాలయ్య, చైర్మన్ మహేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు నకిలీ డాక్టర్ బి.జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. తెలంగాణ వైద్యమండలి అధికారుల తని ఖీ సమయంలో రామన్నపేటకు చెందిన ఆర్ఎంపీ జ్ఞానేశ్వర్ అర్హత లేకుండా ప్రజలకు స్టెరా యిడ్లు, యాంటీబయోటిక్స్‌ను అఽధికంగా ఇస్తున్న ట్లు గు ర్తించారు. ఎన్ఎంసీ చట్టం 34,54, టీఎస్‌ఎంపీఆర్ చట్టం 22కి ఈ చర్యలు వ్యతిరేకంగా ఉండడంతో మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు మెడికల్ కౌ న్సిల్ ప్ర జాసంబంధాల కమిటీ చైర్మన్ వి.నరేశ్ తెలిపారు. -
విజయభేరి మోగించిన ఆర్డీ కళాశాల
నయీంనగర్ : ఇంటర్ ఫలితాల్లో ఆర్.డి. కళాశాల విజయభేరి మోగించింది. ఎంపీసీ సెకండియర్ ఫలితాల్లో 992 మార్కులు, బైపీసీలో 991 మార్కులు సాధించడంతో పాటు, 8 మంది 980 మార్కులకు పైగా సాధించారని కళాశాల యాజమాన్యం తె లిపింది. గత రెండు దశాబ్దాలుగా ఆర్.డి కళాశాల ఇంటర్ ఫలాతాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధిస్తూ తన స్థానం ఉన్నతంగా నిలుపుకుందని తెలిపారు. ఎంపీసీ ఫస్టియర్‌లో 467, 466, 466, 466 అత్యుత్తమ మార్కులు సాధించారు. బైపీసీ ఫస్టియర్‌లో 429, 425 మార్కులు సాధించారు. అద్భుత విజయాలను సా ధించిన విద్యార్థులను, అంకితభావంతో పనిచేసిన అధ్యాపకులను, సహకరించిన విద్యార్థుల తల్లితండ్రులను యాజమాన్యం డాక్టర్ కోడూరి రామమూర్తి, బండి మల్లేశం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంపీసీ సెకండియర్‌లో జి.సునందత 992, జి.సాక్షిత 985, బి.స్వాతి 981, సిహెచ్.మిన్ను–980. బీపీసీలో కె.అక్షయ–991, ఈ.యశ్వంత్ 988, బి.రాధిక 984, జి.స్పూర్తి 980 మార్కులు సాధించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో పి.మోక్షిత–467, కె.అమూల్య–466, ఎం.ఇందు–466, ఎం.శ్రీజ–466. బీపీసీ ఫస్టియర్‌లో బి.శ్రావ్య– 429, పి.సాక్షిత–425 మార్కులు సాధించారు. -
సత్తా చాటిన ధృవ కళాశాల విద్యార్థులు
వరంగల్ : వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ధృవ బాలికల జానియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించి ప్ర భంజనం సృష్టించారు. ఎంపీసీ ఫస్టియర్‌లో ఆయేషా 467 , హిబ్బాఖాన్ 466, సాఫియా హన్నన్ 466, కల్వచెర్ల భార్గవీ 465, బైపీసీ ఫస్టియర్‌లో తైసీన్ 435, చిందం ప్రణతీ 430, సీఈసీలో ఆయేషా మిర్జా 491, దొడ్ల రమ్య 487, ఎంపీసీ సెకండియర్‌లో శ్రీపాద అనుష్క 982, తంగపండి ఉదయ 980, బైపీసీలో జువేరియా ఫాతీమా 987, భూక్య సింధు 986, ఉమేజియా హఫ్సా 982 మార్కులు సాధించారు. సీఈసీలో రిదా మహీన్ 981, టస్కీన్ 980 లు ఉత్తమ ఫలితాలు సాధించారు. కళాశాల చైర్మన్ అకుల శ్రీనివాస్, డైరెక్టర్లు డాక్టర్ అకుల సంపత్, సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన అధ్యాపక బృందాన్ని, అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. -
గ్రేటర్ వరంగల్
(హనుమకొండ – వరంగల్)బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 20259ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురి ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల వాసి హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్‌నాయక్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్‌కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్ పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికరెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – వివరాలు 10లోu -
ఇంటర్ ఫలితాల్లో ‘షైన్’ ప్రభంజనం
హన్మకొండ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ జూని య ర్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా ఫలితాలను సాదించారని షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగుల కుమార్ యాదవ్, డైరెక్టర్లు మూగల రమ, పి.రాజేంద్రకుమార్, షైన్ రెసిడెన్షియల్ స్కూల్ క్యాంపస్ డైరెక్టర్ జె.శ్రీనివాస్, ఐఐటీ కో–ఆర్డినేటర్ మూగల రమేష్ యాదవ్ తెలిపారు. షైన్ విద్యాసంస్థలు మొదటి నుంచి ఇంటర్మీడియట్ విద్యలో అ త్యుత్తమమైనటువంటి శిక్షణను వరంగల్ కేంద్రంగా అందిస్తున్నామన్నారు. ఎంపీసీ ఫస్టియర్‌లో ఎం.దీక్షిత 468 మార్కులు, కె.యశస్విని కుమారి 467, కె.నిశాంత్ 467 మార్కులు, 11 మంది విద్యార్థులకు 466 మార్కులు, 23 మంది విద్యార్థులకు 465 మార్కులు సాధించారని వివరించారు. బీపీసీ ఫస్టియర్‌లో అకిబ్ అలీ– 437, సి.హెచ్.కీర్తన, సి.హెచ్.అజిత్ రెడ్డి 435, ఎండీ.సాదుద్దిన్ 435, ఎంపీసీ సెకండియర్‌లో డి.అనువర్షిణి 992, జి.వికాస్ 991, భార్గవి వీరారెడ్డి 991, ఎం.వరుణ్ సందేశ్ 991, ఎం.రక్షిత 990 మార్కులు సాధించారు. బీపీసీ డి.ఇందు 991, కె.సహస్ర 991, వెంకట శివాణి 989, ఎం.రమ్య 989, టి. హాసిని 987 మార్కులు సాధించారని వివరించారు. వీరితో పాటు ఎంపీసీలో 970 మార్కులకు పైగా 66 మంది విద్యార్థులు, బీపీసీలో 960 కి పైగా 31 మంది విద్యార్థులు, అలాగే ఫస్టియర్ ఎంపీసీలో 460కి పైగా మార్కులు 67 మంది, బీపీసీలో 430కి పైగా 10 మంది విద్యార్థులు మార్కులు సాధించారని వివరించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. కళాశాలల ప్రిన్సిపాల్స్ మారబోయిన రాజు గౌడ్, కె.శ్రీనివాసన్, సంధ్య, ప్రశాంత్ పాల్గొన్నారు. -
‘వైబ్రంట్ అకాడమీ’ విద్యార్థుల ప్రభంజనం
హన్మకొండ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని వైబ్రంట్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మంగళవారం విడుదల చేసిన ఫలి తాల్లో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వైబ్రంట్ అకాడమీ చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరక్టర్ సి.హెచ్.రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫస్టియర్ ఎంపీసీలో వి.సాయిచంద్ర 467 మార్కులు, ఎన్.నిహాల్ 467, పి.శ్రీ మహార్ష 467, జి.జాహ్నవి 466, ఎం.రాంచరణ్ 466, ఎం.కార్తీక్ రెడ్డి 466, బీపీసీలో బి.వినాయక్ 435 మార్కులు, ఎ.హర్షిత 431, కే.సాయి 431 మార్కులు సాధించారని వివరించారు. ఎంపీసీలో 85 మంది విద్యార్థులు 400లకు పైగా, బీపీసీలో 15 మంది 350కి పైగా మార్కులు సాధించారని వివరించారు. రాజస్థాన్ కోటాకు చెందిన వైబ్రంట్ అకాడమీని వరంగల్‌లో స్థాపించి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, యోగా, మోటివేషన్‌తో విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమి ప్రిన్సిపాల్ టి. శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి.రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆస్తుల సంరక్షణకే వక్ఫ్ చట్టం
హన్మకొండ చౌరస్తా: ఆస్తుల సంరక్షణకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చిందని సీబీఐ రిటైర్డ్ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. హనుమకొండ కాకాజీకాలనీలోని ఓ ఫంక్షన్హాల్లో వక్ఫ్ చట్టంపై మంగళవా రం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ దేశంపై దండయాత్ర చేసిన ఘోరీ మొదటిసారి భారత్‌లో వక్ఫ్ తయారు చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత వక్ఫ్ పేరుతో ఔరంగజేబు చాలా ఆస్తులు సంపాదించి పెట్టారని వివరించారు. ట్రి పుల్ తలాక్ చట్టాన్ని తెచ్చినప్పుడు సైతం దే శంలో వ్యతిరేకత వచ్చిందని, తర్వాత తమ మేలుకోసమే చట్టమని గుర్తించిన వారందరూ స్వాగతించారని తెలిపారు. గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి, ప్రజ్ఞా భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సీనియర్ పాత్రికేయుడు సుధాకర్, గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చామర్తి ప్రభాకర్, నిర్వాహకులు డాక్టర్ సమ్మిరెడ్డి, రాంచందర్, ఏపీ మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ రాజేశ్వర్‌రావు, బీజేపీ నాయకులు ప్రదీప్‌రావు, రావు పద్మ, ప్రేమేందర్‌రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొన్నారు. నేడు ఎస్ఈతో ఫోన్ ఇన్ హన్మకొండ: విద్యుత్ సరఫరా, నూతన వి ద్యుత్ సర్వీస్‌ల మంజూరుపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతమ్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారులు 7901628362 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు అందించాలన్నారు. సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ -
ఇంటర్ ఫలితాల్లో ‘ఏకశిల’ విజయకేతనం
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ 2024–25 ఫలితాల్లో హనుమకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా రు. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో పి.కావ్య 470 మా ర్కులకు 468, పి.సాయిగణేష్ 466, డి.సాయిరాజ్ 466, ఎం.గణేష్ 466 మార్కులు సాధించారు. బైపీసీలో టి. లాహిత 440 మార్కులకు 437, పి.అర్చన 437, పి.హాసిక 436, ఇ.అర్చన 436 మార్కులు సా ధించారు. సీఈసీలో ఎండీ.సానియా 500 మార్కులకు 488, ఎ.రష్మిక 487 సాధించగా ఎంఈసీలో టి.అశ్విత 495 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీలో జే.ప్రతీశ్వర్ 1000 మార్కులకు 993, ఇ.మనోజ్ఞ 990 మార్కులు, బైపీసీలో డి.లక్ష్మీవైష్ణవి 990, సీఈసీలో సుమైయ తన్వీర్ 974 మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్బంగా ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలతో పాటు పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్ 2025, నీట్, ఎంసెట్ ఫలితాల్లో అత్యత్తమ ఫలితాలను సాధించామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సుధాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డి, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. -
వేసవి జాగ్రత్తలకు చర్యలు
వరంగల్ : వేసవి వడగాలుల నుంచి రక్షణకు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ కలెక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివి ధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చే యాలని అన్నారు. జూలై వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జాగ్రత్తలను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. తాగునీటి సరఫరాకు జాగ్రత్త వ హించాలన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంస్కృతిక సారధి కళాకారులతో వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి, జిల్లా సహకార అధికారి నీరజ, ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
ఇంటర్లో బాలికల హవా
సెకండియర్‌లో 73.42% విద్యారణ్యపురి: ఇంటర్లో బాలికల హవా కొనసాగింది. హనుమకొండ జిల్లాలో ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 18,397 మంది విద్యార్థులు హాజరు కాగా 12,857 మంది (69.89 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9,600 మందికి 6,084 మంది (63.38 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 8,797 మందికి 6,773 మంది (76.99 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్, సెకండియర్‌లో హనుమకొండ జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానం సాధించింది. గత ఏడాది ఇంటర్ ఫస్టియర్‌లో 62.41 శాత మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 7.48 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఫస్టియర్ ఒకేషనల్‌లో.. ఒకేషనల్ ఫస్టియర్‌లో 1,146 మంది విద్యార్థులకు 744 మంది (64.92 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 533 మందికి 301 మంది (56.47 శాతం), బాలికలు 613 మందికి 443 మంది (72.77 శాతం) ఉత్తీర్ణత సాధించారని హనుమకొండ డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ జనరల్‌లో.. ఇంటర్ సెకండియర్ జనరల్ విభాగంలో మొత్తం 17,587 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 12,912 మంది (73.42 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 9,047 మందికి 6,180 మంది (68.31 శాతం), బాలికలు 8,540 మందికి 6,732 మంది (78.83 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలదే పైచేయి ఉంది. గత ఏడాదిలో 73.23 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈఏడాది కూడా 73.42 శాతం స్వల్పంగా ఉత్తీర్ణత పెరిగింది. సెకండియర్ ఒకేషనల్‌లో.. సెకండియర్ ఒకేషనల్ కోర్సుల్లో 892 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 689 మంది ఉత్తీర్ణత (77.24 శాతం) సాఽధించారు. బాలురు 419 మందికి 297 మంది (70.88 శాతం), బాలికలు 473 మందికి 392 మంది ఉత్తీర్ణత (82.88 శాతం) సాధించారు. వరంగల్ జిల్లాలోనూ బాలికల పైచేయి.. ఇంటర్ ఫలితాల్లో వరంగల్ జిల్లాలోనూ బాలికలదే పేచేయిగా ఉంది. ఇంటర్ ఫస్టియర్‌లో రాష్ట్రస్థాయిలో 19వ స్థానం, సెకండియర్‌లో 14వ స్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో జనరల్ విభాగంలో 4,967 మంది పరీక్షలకు హాజరుకాగా 2,890 మంది (58.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 1978 మందికి 851 మంది ఉత్తీర్ణత (43.02 శాతం) సాధించారు. బాలికలు 2,989 మందికి 2,039 మంది (68.22 శాతం) ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్ కోర్సుల్లో.. ఇంటర్ ఫస్టియర్‌లో ఒకేషనల్‌లో 847 మందికి 478 మంది పరీక్షలకు హాజరయ్యారు. 56.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ జనరల్‌లో.. సెకండియర్ జనరల్‌లో 4,743 మంది పరీక్షలు రాయగా 3,292 మంది (69.41 శాతం) ఉత్తీర్ణత సాఽఽధించారు. బాలురు 1,866 మందికి 1.029 మంది (55.14 శాతం) ఉత్తీర్ణత సాఽధించారు. బాలికలు 2,877 మందికి 2,263 మంది (78.66 శాతం) పాస్ అయ్యారు. బాలురకంటే బాలికలదే పైచేయి ఉంది. సెకండియర్ ఒకేషనల్‌లో.. వరంగల్ జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 658 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా అందులో 417 మంది ఉత్తీర్ణత ( 63.37 శాతం) సాధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చును. ఈనెల 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహిస్తారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు ఈనెల 23 నుంచి 30 వరకు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఫస్టియర్‌లో 69.89% హనుమకొండ జిల్లాలో గత ఏడాది కంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణతసంవత్సరం ఫస్టియర్ సెకండియర్2016 48 58.58 2017 61 70.7 2018 66 64.8 2019 66 64.33 2020 67 68.77 2021 51 – 2022 74 77.2 2023 71.6 73.73 2024 62.41 73.23 2025 69.89 73.42 -
గ్రావిటీ కళాశాల విజయఢంకా
కాజీపేట అర్బన్ : ఇంటర్ ఫలితాల్లో గ్రావిటీ జూ నియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మా ర్కుల ను సాధించి విజయఢంకా మోగించినట్లు కళాశాల చైర్మన్ మహేష్ మంగళవారం తెలిపారు. హనుమకొండ ప్రశాంత్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తా దగ్గర వద్ద గ్రావిటీ జూనియర్ కళాశాలలో విద్యార్థులను అభినందించి చైర్మన్ మాట్లాడారు. ఫస్టియర్ ఎంపీసీలో కె.అభినాష్ 470 మార్కులకు 467 మార్కులు, కె.అమూల్య, డి.రోహిణి, జి.చైతన్యలు 466 మార్కులు సాధించగా 30 మందికి పైగా విద్యార్థులు 460కిపైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. బీపీసీ ఫస్టియర్‌లో 440 మార్కులకు కె.శ్రావ్య 436 మార్కులు, ఆర్.వైష్ణవి, ఈ.భార్గవసాయిలు 430 మార్కులు సాధించినట్లు తెలిపారు.సెకండియర్ ఎంపీసీలో కీర్తన 1000 మార్కులకు 995, సిహెచ్.సౌమ్య 992, బీపీసీలో జి.రాజేష్ నాయక్ 992 మార్కులను సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, డైరెక్టర్లు సందీప్, అమరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
విజన్ కళాశాల విజయదుందుభి
కాజీపేట అర్బన్ : ఇంటర్ ఫలితాల్లో హనుమకొండలోని విజన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విజయదుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ఎల్.నవనీతరావు మంగళవారం తెలిపారు. ఎంపీసీ సెకండియర్‌లో బొ మ్మిడేని వైష్ణవి 992, ఎ.సాయిరోహన్రాజు 989, బి.శ్రీరాజ్ 989, జి.ఆదిత్య 988, పి.స్నీతిక 979, మోక్షిణి 970, బీపీసీలో మొహసీనా అబ్రార్ 984, నాయిల్లా కౌసర్ 982, ధాత్రిక భరద్వాజ 975, ఫస్టియర్‌లో వైనాల లాస్య 466, కోడాతి హరిణి 465, పసునూరి దీక్షిత 464, కె.జెస్రాజ్ 463, లెస్లీ వెరోనికా సాయి 459 మార్కులను సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
ఐదో ప్రయత్నంలో ఐఏఎస్..
హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికైన జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోరి్నయాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా..
హన్మకొండ చౌరస్తా : ‘నీళ్లు తెమ్మంటే తీసుకురావా రా.. నాకే ఎదురు సమాధానం చెబుతావా’ అంటూ జూనియర్ పై ఓ సీనియర్ విద్యార్థి దాడికి పాల్ప డ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హనుమకొండలోని ఇందిరానగర్ ఎస్సీ హాస్టల్లో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన రాజబాబు, పవన్‌కల్యాణ్, రణధీర్, మధుకర్ హనుమకొండ 8వ డివిజన్లోని ఇందిరానగర్‌లో గల ఎస్సీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం ఇదే హాస్టల్లో ఉంటూ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న రంజిత్ వాటర్ బాటిల్లోని నీరును రాజబాబు తాగాడు. విషయం తెలుసుకున్న రంజిత్ ‘నా వాటర్ బాటిల్లోని నీరు తాగి మళ్లీ తీసుకురాకుండా వెళ్తావా’ అంటూ గద్దించాడు. దీంతో భయపడిన జూనియర్ విద్యార్థి రాజబాబు అన్న రూమ్‌లో ఉంటే తాగి వెళ్లిపోయానన్న నీ బాటిల్ అని తెలియదని సమాధానం ఇచ్చాడు. నీళ్లు తీసుకురాకుండా నాకే ఎదురు సమాధానం చెబుతావా, నీ సంగతి చెబుతా అంటూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హాస్టల్లో రాజబాబు ఎదురుపడినా ప్రతీసారి దూషణకు దిగేవాడు. రాజబాబు అతడి మిత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయినా రెచ్చగొట్టేలా వ్యవహరించేవాడు. ఆదివారం రాత్రి రంజిత్ హాస్టల్‌కు సంబంధం లేని కొందరి వ్యక్తులను తీసుకొచ్చి రాజబాబుపై దాడికి దిగాడు. అడ్డుకున్న అతడి మిత్రులు పవన్‌కల్యాన్, రణధీర్, మధుకర్‌ను సైతం చితకబాదారు. ఈ ఘటనలో రాజబాబుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత విద్యార్థులు తెలిపారు. ఈ విషయం పై హాస్టల్ వార్డెన్ మోతీలాల్‌ను వివరణ కోరగా గాయపడిన విద్యార్థికి చికిత్స చేయించామని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
యధావిధిగా పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు
వాయిదా వేయాలని రిజిస్ట్రార్‌కు వినతి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాలో ఈనెల 26వ తేదీ నుంచి పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు యధావిధిగా నిర్వహించనున్నామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ సోమవారం తెలిపారు. కొద్దిరోజులుగా కొందరు పీజీ కోర్సుల విద్యార్థులు ఆయా నాలుగో సెమిస్టర్ల పరీక్షలు వాయిదావేయాలని అధికారులను కోరుతూ వస్తున్నారు. సోమవారం కూడా రిజిస్ట్రార్ రామచంద్రంను కలిసి విన్నవించారని సమాచారం. ఆ తర్వాత పీజీ కోర్సుల పరీక్షలు వాయిదావేశారనే అంశం యూనివర్సిటీలో ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల పోరాట ఫలితంగా పరీక్షలు వాయిదావేశారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈనెల 26వ తేదీ నుంచి జరిగే పరీక్షలను సోమవారం వాయిదా వేయలేదన్నారు. అయితే విద్యార్థులు వాయిదావేయాలని కోరుతున్నారన్నారు. ఈవిషయంపై మంగళవారం యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల డైరెక్టర్, పరీక్షల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించి పీజీకోర్సుల నాలుగో సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించాలా.. వాయిదా వేయాలా అనే అంశం నిర్ణయిస్తామని రాజేందర్ తెలిపారు. కాజీపేట లోకోపైలెట్ డిపోపై మరో పిడుగు.. ● నాలుగు క్రూ లింక్‌ల తరలింపునకు సిద్ధం ● ఆందోళనలో లోకోపైలెట్లు కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే లైకోపైలెట్పై మరో పిడుగు పడింది.కాజీపేట క్రూ కేంద్రంగా పని చేస్తున్న కోచింగ్ క్రూ లింక్‌లలో కొన్ని లింకులు కృష్ణా, ఎల్టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ గాల డిపోనకు తరలిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే లోకోపైలెట్లు సోమవారం రాత్రి తెలిపారు. మంగళవారం నుంచి అధికారికంగా ఈ ఎక్స్‌ప్రెస్ లింక్‌లను విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు, ఇందుకు సంబంధించిన చార్ట్ తయారు చేశారని వారు తెలిపారు. గతంలో ఈ లింక్‌లను కాజీపేట డిపో వారే అప్ అండ్ డౌన్ రూట్లో నడిపేవారని పేర్కొన్నారు. 2022లో సికింద్రాబాద్ రైల్వే అధికారులు రెండు ట్రేడ్‌యూనియన్ల నాయకులతో చర్చించి కాజీపేటకు కేటాయించిన ఈ లింక్‌లను భవిష్యత్‌లో కాజీపేటలో ఉంటాయని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ నాలుగు క్రూలింక్‌లను మార్చడం కాజీపేట డిపోనకు గుదిబండగా మారిందని లైకోపైలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కాజీపేట నుంచి 185 పోస్టులను ఇతర క్రూ డిపోలకు తరలించగా ఇప్పుడు లింక్‌ల తరలింపు నిర్ణయం ఆందోళనకు గురిచేస్తుందని లోకోపైలట్లు, రైల్వే నాయకులు వాపోతున్నారు. కాజీపేట లోకోపైలెట్ డిపో నుంచి పోస్టులు, లింక్‌ల తరలింపు జరగకుండా మరోసారి ప్రజాప్రతినిధులు, రైల్వే నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని లోకోపైలెట్లు కోరుతున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్ రైల్వే అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలని లోకోపైలెట్లు వేడుకుంటున్నారు. చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఏడాది జైలు జనగామ రూరల్: చెల్లని చెక్కు ఇచ్చిన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంత గట్టు నాగారం మాజీ సర్పంచ్ ఇరుమళ్ల రాజయ్యకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి. శశి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా నర్మెట గ్రామానికి చెందిన గంగుల శ్రీనివాస్ రెడ్డికి మాజీ సర్పంచ్ ఇరుమళ్ల రాజయ్య రూ.6 లక్షల 66 వేల అప్పు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో 2016 ఆగస్టు 9వ తేదీన రాజయ్య తన అప్పును నగదుకు బదులు చెక్కు రూపేణ ఇచ్చాడు. ఈ చెక్కు చెల్లకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన మేజిస్ట్రేట్.. రాజయ్యకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 7 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు బాధితుడి తరఫున న్యాయవాది ఎలగందుల చంద్రరుషి తెలిపారు. -
సభ పేరుతో పంట పొలాలు ధ్వంసం
హసన్‌పర్తి/ఎల్కతుర్తి: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపేరుతో పంట పొలాలను ధ్వంస చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ధ్వజమెత్తారు. ఎల్కతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభ పనులను మంగళవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ పేరుతో పంట కాల్వలు, వాగులను పూడ్చివేశారన్నారు. మండలాల సరిహద్దులు తొలగించారన్నారు. అనుమతిలేకుండా చెట్లను నరికివేసినట్లు ఆరోపించారు. ఇప్పటికీ బీఆర్ఎస్ అధికార పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పారిశ్రామికవేత్తలను భయబ్రాంతులకు గురిచేస్తూ విరాళాలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు కాగా, రజతోత్సవ సభ పేరుతో బీఆర్ఎస్ నాయకులు మండలాల సరిహద్దులు తొలగించడమే కాకుండా కాల్వలు, వాగులను పూడ్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు ఇంద్రాసేనారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్నర్సింహారెడ్డి, నాయకులు పోరెడ్డి మహేందర్‌రెడ్డి, తిరుపతి, వీసం సురేందర్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు -
అర్జీలను తక్షణమే పరిష్కరించండి
వరంగల్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణీతో కలిసి జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి పలు సమస్యలపై మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. నేటి ప్రజావాణిలో అధిక మొత్తంలో రెవెన్యూ శాఖ, కలెక్టరేట్‌కి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూశాఖకు 45, కలెక్టరేట్ పరిపాలన విభాగానికి 14, హౌజింగ్‌కు 8 రాగా.. మిగతా దరఖాస్తులు వివిధ ప్రభుత్వ శాఖ లకు చెందినవి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి వేళలు మార్పు చేయాలి.. వేసవికాలంతో ఎండలు ముదరడం వల్ల ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం వేళల్లో మార్పు చేయాలని పలువురు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం తిరిగి వెళ్లాలంటే ఎండ తీవ్రతతో వడదెబ్బలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల ఈవేసవికాలం వెళ్లే దాకా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తే ఎండ తీవ్రతలు పెరగక ముందే ఇంటికి చేరుకునేందుకు బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ -
సమస్య సులువుగా గుర్తించొచ్చు
ఈదురుగాలులు, వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ లైన్లో సమస్యలు తలెత్తుతాయి. తద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతారు. ఈ నేపథ్యంలో డిజిటలైజేషన్ ద్వారా సమస్య ఎక్కడ తలెత్తిందో త్వరగా తెలుసుకోవచ్చు. బదిలీలు, నూతన నియామకాల సందర్భంగా కొత్తగా వచ్చే ఉద్యోగులు కూడా నంబరింగ్ ద్వారా సులువుగా తెలుసుకుంటారు. తద్వారా సిబ్బంది వెంటనే చేరుకుని వేగంగా సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు ఏదేనీ సమస్య గుర్తించినప్పుడు విద్యుత్ సిబ్బందికి స్పష్టమైన సమాచారం అందించేందుకు ఫోల్ నంబరింగ్ దోహదపడుతుంది. -
రైతుల సహకారంతోనే రజతోత్సవ సభ
ఎల్కతుర్తి: ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతులందరి సహకారంతోనే, వారి అనుమతితోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సోమవారం ఈ ప్రాంతానికి వచ్చి కాలువలు పూడుపుతున్నారని, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. సభకోసం 1,200 ఎకరాల స్థలంలో రైతులందరి అనుమతి తీసుకొని వారి సమక్షంలోనే పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే ప్రజలు నడుచుకుంటూ వచ్చేలా కొన్ని ప్రాంతాల్లో మొరం పోశామని, తర్వాత దానిని కూడా తీసేస్తామని చెప్పారు. భూముల హద్దులు చెరిపేశారని అంటున్నారని, ఇందుకు ముందుగానే సర్వేయర్‌తో హద్దులు తీసుకున్నామని తర్వాత వాటిని యధావిధిగా పెడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, తంగెడ నగేష్, ఎల్తూరి స్వామి, మదన్మోహన్రావు, దుగ్గ్యాని సమ్మయ్య, వినయ్‌గౌడ్, చిట్టిగౌడ్, జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ -
కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ సందర్శన
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌ను రామగుండం ట్రాఫిక్ పోలీసు అధికారులు సోమవారం సందర్శించినట్లు వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చే స్తుండడంతో, ఈ సెంటర్ నిర్వహణపై అధ్యయనం చేసేందుకు అక్కడి సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించాల్సిన రికార్డులు, డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహణ తదితర అంశాలను ఏసీపీ సత్యనారాయణ వారికి వివరించారు. కార్యక్రమంలో హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుల, మతాల పేరుతో బీజేపీ చిచ్చు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హన్మకొండ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల, మతాల పేరుతో చిచ్చు పెడుతోందని రాష్ట్ర పంచా యతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ‘బునియాదీ కార్యకర్త సమ్మేళన్’ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీలపై దాడులు పెరిగాయన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పట్టుదలతో ముందుకెళ్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు రోజు పాటు శిక్షణలో తెలుసుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరవేసి పార్టీని పటిష్టం చేయాలన్నారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ బీఆర్ఎస్, ఆర్ఎస్ ఎస్ సిద్ధాంతాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకుడు విక్రాంత్ బునియా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు. -
ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు
రాష్ట్రంలో రైతులు ● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎల్కతుర్తి: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాని, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని, దీనికి కారణం అసమర్థత పాలనేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ కు మళ్లీ అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కరెంట్ రాక.. నీళ్లు లేక పంటలు ఎండిపోయి మళ్లీ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్ ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. మళ్లీ కేసీ ఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సభా ప్రాంగణ ఏర్పాట్లును పరిశీలించారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు లింగపల్లి కిషన్‌రావు, నాగుర్ల వెంకన్న, వాసుదేవరెడ్డి, సతీశ్‌రెడ్డి, నాయకులు చింతం సదానందం, కడారి రాజు, జి.మహేందర్, ఎల్తూరి స్వామి, టి.మహేందర్, నగేశ్, పి.మహేందర్, సమ్మయ్య పాల్గొన్నారు. -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాసర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్ధూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్ధూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులోనుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్ధేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిపోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. -
కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య హన్మకొండ: పేదలను విస్మరిస్తూ కార్పొరేట్ శక్తులకు పాలకులు సంపదను దోచిపెడుతున్నారని సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ధ్వజమెత్తారు. గత 20 రోజులుగా హనుమకొండ జిల్లాలో స్థానిక సమస్యలపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో గుర్తించిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. వాహనంపై గుడిసె నమూనా వేసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. నిరసన కార్యక్రమంలో ఎస్.వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఏళ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్నా పట్టాలు ఇవ్వలేదన్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో కాలం వెళ్లబుచ్చింది తప్ప సమస్యలు పరిష్కరించలేదని దుయ్యబట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి సమస్యలతో కూడిన పత్రాలు అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, బొట్ల చక్రపాణి, రాగుల రమేష్, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, రాములు, తిరుపతి, లింగయ్య, భానునాయక్, నాయకులు పాల్గొన్నారు. -
ఐరన్, ఫోలిక్ మాత్రలతో ఎనీమియా నివారణ
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం : ఆరు నెలల వయస్సు పిల్లలనుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలందరికీ ఐరన్, ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడం ద్వారా ఎనీమియాను నివారించవచ్చని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అప్పయ్య.. ఫార్మసిస్టులకు సూచించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎనీమియా ముక్త భారత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఫార్మసిస్టులకు సోమవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ జిల్లాను ఎనీమియా రహితంగా మార్చేందుకు ప్రతీ ఆరోగ్య కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు, జిల్లా ఎమినేషన్ అధికారి మహేందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల, హెచ్‌ఈఈఓ చంద్రశేఖర్, డీడీఎం ప్రవీణ్, ఎంపీహెచ్‌ఓ రాజేశ్వర్‌రెడ్డి, ఫార్మసిస్టులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి హజ్ యాత్రకు వెళ్లే ప్రతి యాత్రికుడు తప్పకుండా వాక్సినేషన్ చేయించుకొని సర్టిఫికెట్ పొందాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సూచించారు. సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో హజ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మొత్తం 53 మందికి గాను 47 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. -
మే 2న ‘ఇందిరమ్మ’ అర్హుల జాబితా
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికకు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసి మే 2న అర్హుల జాబితా ప్రదర్శించాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హుల ఎంపిక కోసం నియమితులైన మండల స్థాయి వెరిఫికేషన్ ఆఫీసర్లకు సోమవారం కలెక్టరేట్లో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో నలుగురు అధికారులను వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. మహిళలను మాత్రమే అర్హులుగా ఎంపిక చేయాలని సూచించారు. వారి వివరాలను నమోదు చేయాలన్నారు. ఏమైనా సందేహాలుంటే ఎంపీడీఓ, హౌసింగ్ పీడీలను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెరిఫికేషన్ అధికారులకు పంచాయతీ కార్యదర్శుల సహకారం అందిస్తున్నట్లుగానే అర్బన్ ప్రాంతంలో వార్డు ఆఫీసర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గొడిశాల రవీందర్, పరకాల ఆర్డీఓ నారాయణ, గృహ నిర్మాణ సంస్థ డీఈ సిద్ధార్థనాయక్, ఎంపీడీఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలి..జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో సంబంధిత జిల్లా అధికారులతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మేన శ్రీను, రవీందర్ సింగ్, సంజీవరెడ్డి, కొమరయ్య, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. 30వ తేదీ వరకు వెరిఫికేషన్ పూర్తి చేయాలి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య -
గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు
కాజీపేట అర్బన్ : గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్‌లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మేథమెటిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబయి సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ఇందుకు ఈ వారం రోజుల వర్క్‌షాప్ వేదికగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నిట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు -
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్ల వ్యాపారం చేసే ఓ తండ్రికి చదువు రాదు. అతడి కుమారుడు ఇంటర్‌తో చదువు ఆపేశాడు. గంజాయి అలవాటైంది. తండ్రి వ్యాపారానికి సంబంధించి ఫోన్ పే, గూగుల్ పేను ఆ కొడుకు నిర్వహిస్తాడు. గంజాయికి డబ్బులు అవసరమైనప్పుడల్లా తండ్రికి తెలియకుండా కుమారుడు డబ్బులు వాడేశాడు. ఇలా వేయి, రెండు వేలు కాదు.. రూ.2.50 లక్షలు కాజేశాడు. ఈ క్రమంలో ఇటీవల పోలీసుల దాడిలో సదరు యువకుడు గంజాయి తాగుతూ దొరికాడు. గంజాయికి డబ్బులు ఎలా వస్తున్నాయని పోలీసులు కౌన్సెలింగ్ చేస్తే విషయం బయటపడింది. అసలు విషయం తెలిశాక కొడుకును ఏం అనాలో ఆ తండ్రికి అర్థంకాని పరిస్థితి. హనుమకొండ నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థికి సెకండియర్‌లో స్నేహితులతో గంజాయి అలవాటైంది. ఫైనలియర్ వచ్చేసరికి వ్యసనంగా మారింది. తండ్రి కళాశాల ఫీజు కింద ఇచ్చిన రూ.20వేలు గంజాయికి ఖర్చుపెట్టాడు. ఆ తరువాత ప్రైవేట్ లోన్‌యాప్ ద్వారా మరో రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తరువాత కళాశాల, పరీక్షల ఫీజు కోసం ఇచ్చిన మరో రూ.20 వేలు గంజాయి కోసం ఖర్చు చేశాడు. చివరకు పరీక్ష ఫీజు కట్టలేదు. పరీక్షలు రాయలేదు. ఆ విద్యార్థి ఇటీవల పోలీసులకు చిక్కగా విషయం బయటపడడంతో తండ్రి బోరున విలపించాడు. కానీ, ఆ విద్యార్థి గంజాయి మత్తునుంచి ఇంకా బయటకు రాలేదు. న్యాయమూర్తికి వీడ్కోలు సన్మానంవరంగల్ లీగల్ : హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ రమేష్‌బాబు బదిలీపై వెళ్తున్న సందర్భంగా సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబతోపాటు న్యాయమూర్తులు, రెండు జి ల్లాల బార్ అసోసియేషన్ల బాధ్యులు జడ్జి రమేష్‌బాబు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సు ధీర్, పులి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు రమాకాంత్, కొత్త రవి, బార్ కౌన్సిల్ మెంబర్ జయపాల్, న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీస్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాంవరంగల్ క్రైం : జాతీయస్థాయి క్రీడల్లో రాణించే పోలీస్ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన 18వ జాతీయ పోలీస్ షూటింగ్ (స్పోర్ట్స్) చాంపియన్ షిప్లో తెలంగాణ పోలీస్ తరఫున ప్రాతినిధ్యం వహించి 300 మీటర్ల మహిళా జట్టు విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన సుబేదారి ఏఎస్సై సువర్ణను సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఘనంగా సత్కరించారు. పరిపాలన విభాగం అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు. నేడు విద్యుత్ హనుమకొండ ఎస్ఈతో ‘ఫోన్ ఇన్’ హన్మకొండ: విద్యుత్ సరఫరా, నూతన సర్వీస్ మంజూరుపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.మధుసూదన్‌రావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు 94910 75110 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని, సమస్యలు తెలపాలని కోరారు. కొనసాగుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలువిద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 34 కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన టెన్త్ పరీక్షలకు 2,041 మంది విద్యార్థులకుగాను 1775మంది హాజరయ్యారు. 266మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 4,238మందికి 3,802మంది హాజరుకాగా, 436మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఆనగోని సదానందం తెలిపారు. రాష్ట్ర పరిశీలకులు అనురాధ, కె.విజయ్‌కుమార్ సోమవారం హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ పాఠశాల, జెడ్పీ బాలుర పాఠశాల, ఎస్ఆర్ స్కూల్ కేంద్రాలను తనిఖీచేశారు. మరో ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు ఎ.శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి, ఎ.విజయమోహన్ ములుగు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు.● ఇంట్లోవాళ్ల కళ్లు గప్పి డబ్బులు వాడేస్తున్న విద్యార్థులు ● పోలీసుల విచారణలో తెలిశాక కంగుతింటున్న తల్లిదండ్రులు ● ఆరెపల్లి రింగ్ రోడ్డు అడ్డాగా గంజాయి సరఫరా ● ద్విచక్ర వాహనాలతో స్టూడెంట్స్ అంటూ బురిడీవరంగల్ క్రైం: పెళ్లి బరాత్ అంటేనే యువతలో జోష్ నిండుకుంటుంది. తల్లిదండ్రులకు తెలియకుండా స్నేహితులతో ఓ బీర్. ఇది చాలా పెళ్లిళ్ల సమయంలో కనిపించే సీన్. కానీ రోజులు మారుతున్నాయి. బరాత్ తీరు మారుతోంది. పార్టీకి సంబంధించి స్నేహితులు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏకాంతంగా జరుపుకుంటున్నారు. తల్లిదండ్రులతోపాటు అందరి కళ్లు కప్పి మత్తులో తూగుతున్నారు. అదీ గంజాయి మత్తులో. మరి వీరికి డబ్బులు ఎలా వస్తున్నాయని ఆరా తీస్తే కళ్లు చెదిరే నిజాలు తెలుస్తున్నాయి. కాలేజీ ఫీజుల పేరుతో ఇంట్లో వారి కళ్లు గప్పి డబ్బులు వాడేసుకుంటున్న వారు కొందరైతే.. ఏకంగా లోన్‌యాప్‌లలో రుణాలు తీసుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు. ఇటీవల హసన్‌పర్తి పోలీస్ స్టేషన్లో పరిధి ఓ గ్రామంలోని ఓ గదిలో రహస్యంగా గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను నార్కోటిక్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసే వరకు వారు గంజాయి సేవించినట్లు గ్రామంలో ఎవరికి తెలియదు. ఆ ఐదుగురిలో ఓ మైనర్ ఉండడం గమనార్హం. వీరికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరేపల్లి రింగ్‌రోడ్డు అడ్డాగా.. ఆంధ్రప్రదేశ్, ఛతీస్‌గఢ్ రాష్ట్రాలనుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయి ఆరేపల్లి రింగ్ రోడ్డు నుంచి ట్రైసిటీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ద్విచక్ర వాహనా లపై గంజాయిని ఆరేపల్లి కెనాల్ మీదుగా పోచమ్మ మైదాన్, ఓఆర్ఆర్ మీదుగా ఎర్రగట్టుగుట్ట, యాదవనగర్ మీదుగా హనుమకొండ చౌరస్తా, ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతున్నా పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. స్కూటీల్లో టిఫిన్ బాక్సులను పెట్టుకుని తరలిస్తున్నారు. విద్యార్థుల మాదిరిగా స్కూటీ వాహనాలు నడుపుతూ.. బ్యాగులు ధరించి ఉండడం వల్ల పోలీస్ అధికారులు స్టూడెంట్స్ అని వదిలిపెడుతున్నారు. కానీ.. కొంత మంది విద్యార్థులే గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఇటీవల పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలను సాగిస్తున్నట్లు తెలిసింది. గంజాయి అలవాటు ఉన్నవారే డబ్బుల కోసం చిన్నచిన్న మొత్తంలో గంజాయిని పక్క రాష్ట్రాలనుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిసింది. ● రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ● డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ ● నేటినుంచి ఈనెల 24వరకు గడువు ● ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు మాట్లాడుతున్న మేయర్ గుండు సుధారాణిన్యూస్రీల్గంజాయి కొనుగోలుకు లోన్యాప్లో యువత రుణాలురుణ ఉచ్చులో యువతడిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు గంజాయి తాగటానికి డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్ లోన్‌యాప్ ఉచ్చులో చిక్కుతున్నారు. ఎం ప్యాకెట్, బడాబ్రో, క్రెడిట్ బీ, క్యాష్‌బీన్ వంటి లోన్ యాప్‌లు యువతను అకర్షిస్తున్నాయి. డిగ్రీ ఐడీకార్డును ఆప్‌లోడ్ చేస్తే రూ.20 వేల నుంచి రూ.30వేలు ఇస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు అయితే రూ.20 వేల నుంచి రూ.50 వేలు ఇస్తున్నారు. దీంతో చేతికి డబ్బులు అందడంతో గంజాయిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ఈ నెలలో పట్టుబడిన కేసులుహనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 14న గంజాయి, హాష్ ఆయిల్‌తో పట్టుబడిన కోటగిరి సాయి వినయ్, లావుడ్య రవీందర్, గుగులోత్ హరిసింగ్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.5లక్షల విలువైన గంజాయి, రూ. 2.50 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 17న పరకాల పోలీసులు రూ. 3 లక్షల విలువైన 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒడిషాకు చెందిన నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 11న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబ్బాల వద్ద ముగ్గురు యువకులను అరెస్ట్ చేసి వారినుంచి ఒక కిలో 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 8న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులతోపాటు ఓ మైనర్ బాలుడిని, మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 3న హనుమకొండ బస్టాండ్ దగ్గర ఆటోలో గంజాయితో ఉన్న గుజరాత్‌కు చెందిన గౌతమ్ భరత్సిండేను తనిఖీ చేయగా అతడి దగ్గర 16 కిలోల ఎండు గంజాయి లభించింది. -
ఎకై ్సజ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్
కాజీపేట అర్బన్: ఈనెల మొదటి వారంలో ప్రారంభించాల్సి ఉన్న హసన్‌పర్తి ఎకై ్సజ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. భవనాన్ని సైతం ముస్తాబు చేసిన సిబ్బందికి ఆదిలోనే హంసపాదు ఎదురైందని చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అబ్కారీ శాఖలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్లతో పాటు పాలనా సౌలభ్యానికిగాను మరో 14 ఎకై ్సజ్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లాలో ఇప్పటికే కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి కొంత భాగాన్ని విడదీసీ నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ప్రారంభం తాత్కాలికంగా వాయిదా పడింది. బదిలీల్లేక సిబ్బంది కొరత ఎకై ్సజ్ శాఖలో నూతనంగా ఏర్పాటు చేయనున్న హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు ప్రత్యేకంగా అధికారులను కేటాయించేందుకు తొలుత ఎకై ్సజ్ బదిలీలను చేపట్టాల్సిన అవసరం ఉంది. బదిలీలు లేకపోవడంతో సిబ్బంది కొరతతో నూతనంగా హసన్‌పర్తి ఎక్సైజ్ స్టేషన్‌కు హనుమకొండ ఎక్సైజ్ స్టేషన్ సి బ్బంది ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించాల్సి ఉంటుంది. హసన్‌పర్తి పరిధిలో ఇలా... హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో హనుమకొండ, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాలతో పాటు గ్రేటర్ వరంగల్, హనుమకొండలోని డివిజన్లు 4, 5, 6, 8, 9, 50 నుంచి 54, 57 నుంచి 60, హసన్‌పర్తి పరిధి 1, 2, 55, 56, 66, 65 డివిజన్ల పరిధిలో ఉంటుంది. నూతనంగా హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌కు హనుమకొండ మండలంలోని 4 నుంచి 10, 49, 50, 54 డివిజన్లతో పాటు హసన్‌పర్తి, కమలాపూర్ మండలాల పరిధిలో ఏర్పాటు కానుంది. అదే విధంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధి 25 వైన్స్, 41 బార్ల నుంచి సగం వరకు హసన్‌పర్తిలో కలవనున్నాయి. నిఘా పటిష్టమవుతుంది.. నూతన ఎకై ్సజ్ స్టేషన్ ఏర్పాటుతో నిఘా పటిష్టమవుతుంది. మత్తు పదార్ధాల విక్రయం, గంజాయి సరఫరాపై నిరంతర నియంత్రణకు ఉపయోగపడుతుంది. త్వరలో హసన్‌పర్తి ఎకై ్సజ్ స్టేషన్‌ను ప్రారంభిస్తాం. – చంద్రశేఖర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, హనుమకొండ జిల్లా (వరంగల్అర్బన్) ఆదిలోనే హంసపాదు బదిలీలు లేక సిబ్బంది కొరత -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
హన్మకొండ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటామని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణలో భాగంగా హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో శ్రమదానం నిర్వహించారు. కొద్ది సేపు షటిల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. కాగా అంతకు ముందు విశ్వనాథన్ భద్రకాళి అమ్మవారిని దర్శించు కున్నారు. ఆయన వెంట వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎరబ్రెల్లి స్వర్ణ, నాయకులు పాల్గొన్నారు. -
‘పట్టు’.. రాయితీ కొట్టు..
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది.వాతావరణం ఉదయం నుంచి వేడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత పెరుగుతుంది.– 8లోuమత్స్య సంఘం కార్యాలయంలో వలలు సరిచేసుకుంటున్న కొక్కు రాజమౌళి స్వగ్రామం నర్సంపేట నియోజకవర్గంలోని గురిజాల. ఈ గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి. మత్స్య సహకార సంఘంలో 20,080 మంది సభ్యులున్నారు. చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున కలుపుకొని చేప పిల్లలను పెద్ద చెరువు, పెద్దమ్మ చెరువు రంగసముద్రంలో పోసుకున్నారు. ప్రభుత్వం నుంచి అక్టోబర్‌లో 1.60 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసినా.. అవి నాసిరకం కావడంతో ఎదుగుదల లేక అందరం నష్టపోయామని అంటున్నారు. -
చిక్కుల్లో చేప
స్కూళ్లలో థర్డ్ పార్టీ సర్వేనాసిరకం చేపపిల్లలతో నష్టం.. ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలు ఆరునెలలు గడిచినా అరకిలో, ముప్పావు కిలో దశలోనే ఉన్నాయి. ఈసారి పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండటంతో పాటు అదను దాటిన తర్వాత పోయడంతో ఎదుగుదల లోపించింది. దీనికితోడు రవ్వులు, బొచ్చెలు, బంగారు తీగల పేరిట సరఫరా చేసిన ఉచిత చేప పిల్లల్లో నాసిరకం (బుర్క జాతికి చెందినవి) చేప పిల్లలు వచ్చాయి. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నాం. – తెప్ప శరత్‌కుమార్, కార్యదర్శి, మత్స్యకారుల సంఘం, కమలాపూర్ రెండు, రెండున్నర అంగుళాలే.. లక్నవరం సరస్సులో 8 లక్షల 33వేల చేప పిల్లలు వదిలాం. గతేడాది జూన్‌లో పోయాల్సిన చేప పిల్లలను ఆలస్యంగా ఆగస్టు మొదటి వారంలో పోశాం. చెరువులో వదిలేటప్పుడు చేప పిల్లలు 3 అంగుళాల మీద అర ఉండాలి. రెండు, రెండున్నర అంగుళాలే ఉన్నాయి. దీంతో సైజుతో పాటు ఒక నెల ఆలస్యంగా వదలడం వల్ల చేపలు పట్టే సమయానికి అర కేజీ నుంచి కేజీ బరువు నష్టం జరుగుతుంది. దీనితో దిగుబడి అనుకున్నంత రాకపోవచ్చు. – పి.వెంకన్న, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, లక్నవరం నగదు బదిలీ చేస్తేనే మేలు.. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేప పిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండడంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది. చిన్న పిల్లలను పెద్ద చేపలు తినడంతో మరింత నష్టం తప్పడం లేదు. నగదు బదిలీతో చేపల పంపిణీ కార్యక్రమం నడిపిస్తే.. నాణ్యమైన, కాస్త పెద్ద సైజు పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. – నీల సోమన్న, మత్స్యసొసైటీ చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్ సెప్టెంబర్‌లోనే చేప పిల్లల పంపిణీ.. గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఉచిత చేప పిల్లలు పంపిణీ చేశాం. హనుమకొండ జిల్లాలో 184 మత్స్యకార సొసైటీలు ఉండగా దాదాపు 18వేల పైచిలుకు మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వేయాల్సిన సమయం కన్నా కాస్త ఆలస్యం కావడంతో 100 శాతం పంపిణీ సాధ్యం కాలేదు. అన్నిచోట్ల నిబంధనల మేరకు నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేశాం. – నాగమణి, ఇన్చార్జ్ డీఎఫ్ఓ, హనుమకొండసాక్షిప్రతినిధి, వరంగల్: మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్ పరిధి 3,861 నీటి వనరుల్లో ఈ ఏడాది 14.07 కోట్ల చేప పిల్లలు వదలాలి. 2024 జనవరిలోనే 35–40, 80–100 మిల్లీమీటర్ల పరిమాణమున్న చేప పిల్లల సరఫరాకు టెండర్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణానికి తగినట్టుగా మెరిగలు, బొచ్చ, రవ్వులు, కట్ల, బంగారు తీగ లాంటి చేప పిల్లలను ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఏటా టెండర్లు దక్కించుకుంటున్న గుత్తేదారు సంస్థలు స్థానికంగా పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినవి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. జూన్‌లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆగస్టులో మొదలెట్టి అక్టోబర్ వరకు పంపిణీ చేశారు. ఈలోగా కొన్ని మత్స్య సహకార సంఘాల నాయకులు, సభ్యులు డబ్బులు పోగేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చాలాచోట్ల గుత్తేదార్లు సరఫరా చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండగా.. వాటిలో ఇప్పటికీ ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు. చేప పిల్లల పంపిణీ 63.11 శాతమే ఉమ్మడి వరంగల్‌లో 3,861 చెరువులు, కుంటలు ఉండగా.. 14.07 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. అయితే.. 35–40 మిల్లీమీటర్ల పిల్లలు 4.89 కోట్లు, 80–100 మిల్లీమీటర్లవి 3.99 కోట్లు.. మొత్తం 8.88(63.11 శాతం) కోట్లు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి జూన్ మొదటి వారం నుంచే చేప పిల్లలు చెరువుల్లో పోయాల్సి ఉంది. అలాగైతే ఆరేడు నెలల గడువులో ఒక్కో నెలకు పావుకిలో పెరిగినా రెండు, రెండున్నర కిలోలకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ వైపు నాసిరకం విత్తన చేపపిల్లలు, మరోవైపు ఆలస్యంగా చెరువుల్లో వదలడం.. ఎండిపోతున్న చెరువుల్లో తీవ్రమైన ఎండవేడి.. ఈ ప్రతికూల కారణాలతో చెరువులో చేప ఎదగడం లేదు. మార్చి చివరి నుంచి చేపలు పట్టే అవకాశం ఉన్నా 450–750 గ్రాముల సైజులోనే ఉండడంతో మిన్నకుండిపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్లు, దళారులతో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయకుండా వాటికి అయ్యే మొత్తాన్ని నేరుగా మత్స్య పారిశ్రామిక సంఘాల అకౌంట్లలోకి జమ చేస్తే.. నచ్చిన చేప పిల్లలను సకాలంలో కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోస్తే మంచి ఫలితాలు వస్తాయని మత్స్యకారులు, సంఘాల నాయకులు అంటున్నారు.పవిత్రమైన పండుగ ఈస్టర్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖఎదుగూ బొదుగు లేని మీనం టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం.. సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు. నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా 750 గ్రాముల బరువు దాటని చేపలు ఎండదెబ్బ.. దిగుబడిపై సన్నగిల్లిన ఆశలు నష్టపోతున్నామంటున్న మత్స్యకారులు చెరువులు, చేప పిల్లల పంపిణీ వివరాలు ఉమ్మడి జిల్లాలో చెరువులు : 3,861ఉచిత చేప పిల్లల పంపిణీ లక్ష్యం : 14.07 కోట్లు 3,462 చెరువుల్లో పోసిన చేప పిల్లలు : 8.88 కోట్లు 35 నుంచి 45 మిల్లీమీటర్ల చేపలు: 4.89 కోట్లు 80 నుంచి 100 మిల్లీమీటర్ల చేపలు: 3.99 కోట్లు పెరగాల్సిన సైజు : 1.5 కేజీ నుంచి 2.5 కేజీలు ప్రస్తుత సైజు : 450 నుంచి 750 గ్రాములు -
రజతోత్సవ సభనుంచే కాంగ్రెస్ పతనం
ఎల్కతుర్తి : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీ పతనం రజతోత్సవ సభ నుంచే ప్రారంభం కాబోతుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీష్‌కుమార్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న తదితరులతో కలిసి సభా స్థలిని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలోనే దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని ఆయన విమర్శించారు. ఏడాదిన్నర తిరగక ముందే కాంగ్రెస్‌కు ప్రజలే తద్దినం పెట్టే రోజులు దగ్గర పడ్డాయని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రజతోత్సవ సభ ప్రభుత్వ వ్యతిరేక సభగా మారనుందని తెలిపారు. గతంలో వరంగల్‌లో నిర్వహించిన సభలు రికార్డులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందని, అదే తరహాలో ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ రికార్డు సృష్టించబోతుందన్నారు. కేసీఆర్ మాటలు వినాలే..కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కుతూహలంతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ సభద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అంతకు ముందు మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి -
పుష్కరాలకు జాయ్‌రైడ్స్
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీవరకు జరిగే సరస్వతి నది పుష్కరాలను హెలికాప్టర్ల ద్వారా భక్తులు వీక్షించేందుకు టిక్కెట్ తీసుకొని ఏవియేషన్ శాఖ ప్రభుత్వం జాయ్‌రైడ్స్ ఏర్పాటు చేసింది. కానీ పుష్కరాలకు రోజులు దగ్గర పడుతుండడంతో జాయ్రైడ్స్పై సందిగ్ధత ఏర్పడినట్లు తెలిసింది. పుష్కరాలకు ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారులు కూడా హెలికాప్టర్లు తిరగడంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా, కాళేశ్వరం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామ శివారు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంపుహౌజ్కు సంబంధించిన మూడు హెలిపాడ్లు శాశ్వతంగా నిర్మాణం చేసి ఉన్నాయి. భక్తులు 12 రోజుల పాటు ఈ మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి హెలికాప్టర్ సేవలు వినియోగించుకుంటారా! లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం సమీపంలోనే హెలిపాడ్లు సిద్ధం చేస్తే జాయ్‌రైడ్స్‌కు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. గోదావరి పొడవునా.. ఈ జాయ్‌రైడ్స్‌తో హెలికాప్టర్‌తో 10–15 నిమిషాలతో అన్నారం బరాజ్ టు మేడిగడ్డ బరాజ్ వరకు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నది పొడవునా విహాంగ వీక్షణం చేయడానికి వీలు కల్పిస్తారు. ఇదే విషయంపై కాళేశ్వరం దేవస్థానం ఈఓ శనిగెల మహేష్‌ను సంప్రదించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఏవియేషన్ శాఖ ద్వారా జాయ్‌రైడ్స్ కోసం ఏర్పాట్లు జరుగుతుందని, మూడు హెలిపాడ్లు కన్నెపల్లి వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్ధంగా మూడు హెలిపాడ్లు అన్నారం టు మేడిగడ్డకు విహాంగ వీక్షణం -
‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు
జేఈఈలో ఇరువురికి ర్యాంకులు భూపాలపల్లి అర్బన్ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన తాళ్ల నిహారిక ఆల్ ఇండియా 15,625 ర్యాంక్, (93 పర్సంటైల్) సాధించగా, గుగులోత్ జ్ఞానేశ్వర్ 72వేల ర్యాంకు, (95 పర్సంటైల్) సాధించారు.దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మే లో జరిగే అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాలను శుక్రవారం రాత్రి పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హత పొందిన విద్యార్థుల వివరాలు..మాణిక్యాలు.. మానుకోట విద్యార్థులుమహబూబాబాద్ అర్బన్ : జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మానుకోటకు చెందిన ఉమ్మగాని మధు–కృష్ణవేణి కుమారుడు విశిస్ట్ గౌడ్ ఆల్ ఇండియా 7, 300 ర్యాంక్ సాధించాడు. జేఈఈలో విశిస్ట్ మంచి ర్యాంక్ రావడంతో మార్గదర్శి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్‌కుమార్, బంధుమిత్రులు హార్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ చీఫ్ ఇంజనీయర్గా ఉద్యోగ సాధిస్తానని విశిస్ట్ వివరించాడు. మానుకోటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బ్రాహ్మణపల్లి శ్రీనివాస్–సువర్ణ దంపతుల కుమారుడు హనీష్ జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా 3,553 ర్యాంక్ సాధించాడు. భవిష్యత్‌లో ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో సీటు సాధించి, సాఫ్ట్వేర్ ఇంజనీయర్ కావాలని, విదేశాలలో ఉద్యోగం చేయాలని హనీష్ తెలిపాడు.సత్తా చాటిన సాగర్రఘునాథపల్లి : మండలంలోని వెల్ది మోడల్ స్కూల్/కళాశాల విద్యార్థి మనుపాటి సాగర్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ సాధించాడు. మండల కేంద్రానికి చెందిన మనుపాటి ఎల్లయ్య–శారద కుమారుడు సాగర్ జాతీయస్థాయిలో 7,626 ర్యాంకు సాధించి, జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించాడు. శనివారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్రీధర్‌తో పాటు తల్లిదండ్రులు సాగర్‌ను అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, మల్లం శ్రీధర్, రాజు, మోహన్‌రావు, శ్రీను, రవి, సౌజన్య, ప్రియ, రుద్రమదేవి, విజయ, శశికుమారి తదితరులు పాల్గొన్నారు.మెరిసిన ‘ఏకలవ్యులు’.. కురవి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ లాలు శనివారం తెలిపారు. కళాశాలకు చెందిన బి.వినీత (85.65), బి.దీపిక (59.46), జి.సోనియా (57.84), బి.సింధు (54.93), కె.ప్రియదర్శిని(52.37) పర్సంటైల్‌తో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అర్హత సాధించారు.అర్జున్ అత్యుత్తమ ప్రతిభ దేవరుప్పుల : జేఈఈ మెయిన్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన బిట్ల అర్జున్ 16,816 ర్యాంకు (97.07 పర్సంటైల్) సాధించాడు. మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో తొమ్మిది వరకు, ఆపై హైదరాబాద్‌లో చదివాడు. నిట్‌లో అనుకున్న సీటు లభిస్తుందని అర్జున్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
మతతత్వ పార్టీని అడ్డుకునేది కాంగ్రెస్సే
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండ : మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్లోమూడ్రోజుల పాటు జరిగే బునియాదీ కార్యకర్తల సమ్మేళన్ శిక్షణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, విప్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, మురళీ నాయక్ జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కొండా సురేఖ పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ శిక్షణ తరగతులు మూడు దశల్లో జరుగుతున్నాయన్నారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలు ఏకమైతేనే బీజేపీని తరిమికొట్టగలుగుతామన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..మణిపూర్ మారణహోమంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదప లేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఏఐసీసీ శిక్షణ తరగతుల కన్వీనర్ రాహుల్ బాలే, శిక్షణ తరగతుల ఇన్‌చార్జ్‌లు చంద్రకళ, గుగులోత్ రవీందర్‌నాయక్, నాయకులు రవళి, అనిల్, రాజేష్ నాయక్ పాల్గొన్నారు. -
శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ : జేఈఈ మెయిన్స్‌లో శ్రీచైతన్య స్కూల్ 2022–23 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. 50 లోపు ర్యాంకులు ముగ్గురు, 100 లోపు ర్యాంకులు నలుగురు, 500 లోపు ర్యాంకులు ఐదుగురు, 5వేల లోపు ర్యాంకులు 13 మంది సాధించారని వివరించారు. బండారి రుషికాంత్ 31వ ర్యాంకు, ఎస్.సాయి రిషాంత్ రెడ్డి 39, గొర్రె నితిన్ రెడ్డి 44, శాగంటి త్రిశూల్ 66, ఉప్పుల భావాప్రిత 273వ ర్యాంకు సాధించారని వివరించారు.టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం ● ధ్వంసమైన టోల్ క్యాబిన్.. సిబ్బందికి గాయాలురఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాతీయ రహదారిపై కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద శనివారం లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ సరాసరి టోల్‌ప్లాజా క్యాబిన్లో దూసుకెళ్లాడు. దీంతో క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది ఒకరు గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన లారీ డ్రైవర్ మక్కల శంకర్ హైదరాబాద్ నుంచి లారీతో హనుమకొండకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద రెండో నంబర్ క్యాబిన్లోకి లారీతో దూసుకెళ్లగా, క్యాబిన్ ధ్వంసమైంది. విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బంది బండి శ్రీనాథ్‌గౌడ్ గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టగా దెబ్బతింది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ శంకర్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లు తేలిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు
● ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ కాజీపేట రూరల్ : ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ పేర్కొన్నారు. కాజీపేట 48వ డివిజన్ దర్గాలో శనివారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో ముఖ్య అతిథిగా విశ్వనాథ్ పెరుమాళ్ మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ఎంతకై నా తెగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, స్థానిక కార్పొరేటర్లు సర్తాజ్బేగం, సయ్యద్ విజయశ్రీరజాలి, జక్కుల రవీందర్‌యాదవ్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్, రహిమున్నీసాబేగం, మిర్జా అజిజుల్లా బేగ్, తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ‘భూభారతి’తో రైతు సమస్యలు దూరం హన్మకొండ : భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు దూరమవుతాయని, ఇక నుంచి రైతులు తమ భూ సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్లి రవి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి 10,954 మంది గ్రామ పాలన అధికారులను తీసుకుంటున్న క్రమంలో ముందుగా జీఓ 129కి సవరణ చేసి పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలిపారు. -
జేఈఈలో మెరిసిన ఎస్ఆర్ విద్యార్థులు
విద్యారణ్యపురి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో వి.నాగసిద్ధార్ధ 5వ ర్యాంకు, పాటిల్సాక్షి 48వ ర్యాంకు, ఎం.అరుణ్ 60వ ర్యాంకు, ఎం.రవిచంద్రారెడ్డి 65వ ర్యాంకు సాధంచినట్లు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వై.భరణి శంకర్ 88వ ర్యాంకు, బాదావత్ సురేష్ 98, దాసరి ఫణీంద్ర 116, మోదెల్లా వెంకట కౌసిక్ 141, ఈర్ల బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌రెడ్డి 190, భూక్య వినోద్ 246, సీహెచ్ షణ్ముఖ సాయి 274, బి.ధనషన్ముఖ శ్రీ 410, కాగితపు దీపక్ 491, పుత్తూరు ఉజ్వల్ 509వ ర్యాంకు సాధించారని వారు వివరించారు. మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ కు ఇప్పటివరకు 3,556 మందికి పైగా విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించారని రాష్ట్రంలో ఎస్ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వారు తెలిపారు. ఓపెన్, అన్ని కేటగిరీలు కలిపి జాతీయస్థాయిలో 528, 567, 584, 647, 687, 707, 726, 740, 777, 826, 844, 969 ర్యాంకులను విద్యార్థులు సొంతం చేసుకున్నట్లు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావాన్ని వ్యక్తపర్చారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు. -
రెజోనెన్స్ విజయకేతనం
హన్మకొండ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వరంగల్‌లోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అద్భుత ఫలితాలతో నంబర్–1 కోచింగ్ తమ కళాశాల నిలిచిందని వరంగల్ రెజోనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. కళాశాలలకు చెందిన 11 మంది విద్యార్థులు 99పైగా పర్సంటైల్ సాధించగా, 64 మంది 95 పైగా, 161 మంది 90కి పైగా పర్సంటైల్ సాధించి అత్యున్నత ఫలితాలు సాధించారని వివరించారు. జాతీయ స్థాయిలో 13, 236, 306, 949, 988 ర్యాంకులు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఎ.నంది 100 పర్సంటైల్, ఎం.చరణ్ తేజ 99.89, సీహెచ్. సాయిదత్తు 99.77, బి.శ్రీహర్ష 99.69, బి.వెంకట్ జశ్వంత్ 99.66, జి.అనిరుద్ 99.64, ఎండీ రహమాన్ 99.58, కే.శిత్తిజ్ 99.56, వి.సాయి కౌశిక్ 99.48, వి.వి.ఫణి హర్షిత్ 99,26, వి.రాజశేఖర్ 99.25 పర్సంటైల్ సాధించారని వివరించారు. హనుమకొండలోని రెజోనెన్స్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అలుపెరగని కృషి, తల్లిదండ్రుల సహకారం, అత్యుత్తమ బోధనతో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీ.ఏ.ఓ లెక్కల రమ్య రెడ్డి, అకడమిక్ డీన్ బీ.ఎస్.గోపాలరావు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో ధాన్యం కొనాలి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హన్మకొండ: ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సమస్యలపై చర్చించారు. సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కొమరయ్య, సివిల్ సప్లైస్ డీఎం మహేందర్, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లానుంచి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి శంకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తదితరులు పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21 నుంచి జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్షల ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్ రోల్స్‌ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని రాజేందర్ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహింస్తారనేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. బస్సు అదుపు తప్పి ఆరుగురికి గాయాలుహసన్పర్తి: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆరుగురికి గాయాలయ్యాయి. వరంగల్–2 డిపోనకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు శుక్రవారం రాత్రి వేములవాడ నుంచి వరంగల్‌కు బయల్దేరింది. మార్గమధ్యలోని అన్నాసాగరం సమీపంలోకి రాగానే అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆప్రాంతంలో ఘటన జరిగితే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పార్లమెంట్ దృష్టికి న్యాయవాదుల సమస్యలువరంగల్ ఎంపీ కడియం కావ్య హన్మకొండ: న్యాయవాదుల సమస్యలు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండలోని జెడ్పీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కావ్య మాట్లాడుతూ.. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ బార్ అసోసియేయన్ల ఎన్నికల్లో గెలిచిన న్యాయవాదులను ఎంపీ కావ్య సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వీరదాసు వెంకటరత్నం, ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి లావుడే సిద్ధునాయక్, హనుమకొండ బార్ అసోసియేషన్ కార్యదర్శి రవి, మాజీ అధ్యక్షుడు మాతంగి రమేశ్‌బాబు, న్యాయవాదులు కొండపాకల కృష్ణ, నాగభూషణం, బండి మొగిలి, భాగ్యమ్మ, ముఖేశ్ రమేశ్‌నాయక్ పాల్గొన్నారు. -
రైతులకు న్యాయం చేస్తాం..
వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఏనుగల్, తీగరాజుపల్లి గ్రామాల్లో హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్లో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నేషనల్ హైవే యాక్ట్‌ను అనుసరించి రైతులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి తదితరులున్నారు. -
భూ భారతితో రైతులకు మేలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మడికొండ: భూ భారతి చట్టం ద్వారా, రైతులకు, ప్రజలకు మేలు చేకూరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం మడికొండలోని ఆర్ఎన్ఆర్ గార్డెన్లో భూ భారతి చట్టంపై వర్ధన్నపేట నియోజకవర్గ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన చేసి దానిలోని లొసుగులను తొలగించి భాభారతి చట్టం తీసుకువచ్చారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున, 26మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, కిసాన్‌సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంరెడ్డి, బిల్లా ఉదయ్‌రెడ్డి, సారంపల్లి శ్రీనివాసరెడ్డి, నీలం రజీని వేణుయాదవ్, గుర్రం జ్యోతి అమర్నాథ్, బిల్ల రవీందర్, పైడిపాల రఘుందర్, శంకర్, కుర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో భూ సమస్యలు పరిష్కారం..
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ: భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని, ఈ చట్టం రైతులకు చుట్టం వంటిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలోని వీఆర్ బాంక్వెట్ హాల్లో భూభారతి చట్టంపై హనుమకొండ మండల స్థాయి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. పలువురు రైతులు తమ సమస్యలను చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతులు, భూ యజమానులు ఇబ్బందులు పడ్డారని, ఆ ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందరూ సహకరించాలని కోరారు. కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ భూ సమస్యలను హెల్ప్ డెస్క్‌లో అందజేయవచ్చన్నారు. ఈసందర్భంగా భూ భారతి చట్టం వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఆమెను రైతులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్ఎస్లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా. – ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు పలు రంగాల్లో అవగాహన కల్పించాలి.. పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. – చింత శ్యాంసుందర్, హనుమకొండ పిల్లల్ని ప్రోత్సహిస్తా.. నాకు ఇద్దరు కుమారులు. గతంలో జిల్లా రంగ స్థల ఐక్యవేదిక వారు ఏర్పాటుచేసిన నటనలో ఉచిత శిక్షణ శిబిరం శిక్షణకు పంపించాను. బాబు కౌశిక్రాజ్ నాటక ప్రదర్శనలో అద్భుతంగా రాణించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు. – మాలి వాణి, గృహిణి, వరంగల్ -
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోuపుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్‌ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్‌లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్ల లను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని జూపార్కు, సైన్స్‌సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేధను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్‌రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.క్రీడల్లో శిక్షణ..న్యూస్రీల్పిల్లలు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలిసజీవ కళ చిత్రలేఖనం.. వారికి ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. సెల్‌ఫోన్‌ను దూరం పెట్టాలి.. పుస్తకాల్ని చేరువ చేయాలి ఆ బాధ్యత తల్లిదండ్రులదే.. పుస్తక పఠనం..భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ -
పూడికతీత పక్కా ప్రణాళికతో చేపట్టండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్: మహానగరం వరద ముంపునకు గురవకుండా నాలల పూడికతీత ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, అధికారులతో వర్షాకాలంలో మహా నగరం వరద ముంపునకు గురవకుండా నివారణ నిమిత్తం ముందస్తుగా చేపట్టాల్సిన నాలాల పూడికతీత తదితర చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధి అన్ని డివిజన్లలో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రధాన నాలాలు పరిశీలించి పూడికతీత కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వడ్డేపల్లి, భద్రకాళి, నయీంనగర్, బొందివాగు, సాకరాశికుంట ప్రధాన నాలాలతో పాటు 33 ప్రధాన నాలాలు, యూటీలు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల పూడికతీత పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాసరావు, రవికుమార్, సంతోశ్‌బాబు, మాధవి, డీఈలు రాజ్‌కుమార్, రంగారావు, సారంగం, కార్తీక్‌రెడ్డి, ముజమ్మిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
హనుమకొండ జిల్లా: అత్యాశ కొంపకు చేటు అన్నట్లు.. ఓ రామచిలుక జ్యోతిష్యుడు చేసిన పని అతడి ఉపాధికి ఎసరు తెచ్చింది. చినికి చినికి చిలుక పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ చిలుక పంచాయితీ వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ క్రాస్ సమీపంలో దాస్ అనే ఓ బైక్ మెకానిక్ దుకాణం వద్దకు వారం క్రితం రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్ జోస్యం చెప్పించుకునేందుకు ఒప్పుకోవటంతో, చిలుక తీసిన బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు. అయితే పొద్దున్నే గిరాకీ కాలేదని, తర్వాత రమ్మని దాస్ చెప్పి జ్యోతిష్యుడిని పంపించేశాడు. ఆ జ్యోతి ష్యుడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్ టైరు పేలటంతో, ఆ శబ్ధానికి భయపడి అది తుర్రుమని ఎగిరి సెల్‌టవర్‌పై వాలింది. చిలుక పారిపోయిందని జ్యోతి ష్యుడిని దాస్ నిద్ర లేపడంతో, అతడు ఒక్కసారిగా లేచి సెల్ టవర్ వద్దకు పరుగెత్తాడు. కానీ, మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు. జ్యోతి ష్యుడి బాధ చూడలేక దాస్ అతడిని ఓ వైన్స్ వద్దకు తీసుకెళ్లి రూ.500తో మద్యం కొనిచ్చాడు. అయితే, తన చిలుకను దాస్ మాయం చేశాడని అతడి ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు. మూడు రోజుల క్రితం దాస్‌పై పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాస్‌ను పిలిచి జ్యోతిష్యుడి రామచిలుక ఏమైందని ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు చిలుక పంచాయితీ జరిగినా, ఎటూ తెగకపో వడంతో ‘నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం’అని జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించేశారు. -
19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం
హన్మకొండ: హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బునియాడీ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ డెలిగేట్లు పాల్గొంటారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ మండలం నుంచి ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. యువకుడిపై పోక్సో కేసు నమోదువరంగల్: మూడేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎంఎ.షుకూర్ తెలిపారు. బుధవారం రాత్రి గిర్మాజీపేటలో కిరాయికి ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన నానమ్మ వద్ద అన్నం తిని ఇంటి ఆవరణలో అన్నయ్యతో ఆడుకుంటోంది. వీరు ఉంటున్న ఇంట్లోనే పైఅంతస్తులో కిరాయికి ఉంటూ పెయింటింగ్ వర్క్ చేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లల్లు రంజాన్.. ఇద్దరు పిల్లలను బయటకు తీసుకెళ్లి బిస్కెట్లు కొనిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి బాలికలను పైఅంతస్తులోని తన గదికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తన నానమ్మతో చెప్పగా కుటుంబ సభ్యులు రంజాన్‌ను నిలదీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రంజాన్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వడగళ్ల వానతో పండ్ల తోటలకు నష్టం ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వడగళ్ల వానకు పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు రాలిపోగా, అరటి, బొప్పాయి, మునగ తోటలు నేలవాలాయి. జిల్లాలో మొత్తం 502 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ఇందులో 37 ఎకరాల మామిడి, 33 ఎకరాల అరటి తోటలు, రెండు ఎకరాల బొప్పాయితోపాటు మిగిలినవి ఇతర పంటలు ఉన్నాయి. బుధ, గురువారం వివరాలు సేకరించామని జిల్లా ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. -
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20నుంచి 26వతేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ డి వాసంతి, ఉమ్మడి వరంగల్జిల్లా కోఆర్డినేటర్ ఎ. సదానందం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.అయితే పరకాలలోని జిల్లా పరిషత్ (బాలుర) హైస్కూల్ పరీక్ష కేంద్రానికి అనుబంధంగా ఆ పరీక్ష కేంద్రానికి దగ్గరలోనే ఎస్ఆర్ స్కూల్లో కూడా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరకాల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో హాల్‌టికెట్ నంబర్ 2412130037 నుంచి 2412130187 వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సింటుందని తెలిపారు. పరకాలలోని ఎస్ఆర్ స్కూల్ పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్ నంబర్ 2412130188 నుంచి 2412130380వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఆయా విద్యార్థులు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారించుకోవాలని వారు సూచించారు. 20న అండర్–7 జిల్లా స్థాయి చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–07 చదరంగ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హ నుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూ ల్లో ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు జనవరి01, 2018, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను మే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్‌కు 90595 22986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. మిర్చి కొనుగోళ్ల వివరాలు సేకరణ వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు చేసిన కమీషన్ వ్యా పారుల వివరాలను జీఎస్టీ అధికారులు సేకరిస్తున్నారు. గురువారం జీఎస్టీ అధికారులు శ్రీధర్, గోపి మార్కెట్ కార్యాలయానికి వచ్చి కార్యదర్శి జి.రెడ్డితో భేటీ అయ్యారు. మార్కెట్ ఫీజులు చెల్లించిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకపోవడం, ఏమేరకు సరుకులు ఖరీదు చేశారన్న వివరాలు తెలియకపోవడంతో అధికారులు కార్యాలయానికి వచ్చినట్లు తెలి సింది. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన సరుకులకు ఒక శాతం మార్కెట్ ఫీజులు చెల్లించారు. ఈ ప్రకారం వ్యాపారులు తాము విక్రయించిన సరుకులకు 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందిన వెంటనే సదరు వ్యాపారులకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలిసింది. స్తంభాన్ని ఢీకొన్న లారీ ● ధర్మారంలో ఐదు గంటలపాటు నిలిచిన విద్యుత్ సరఫరా గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం శివారులోని వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని గురువారం లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగిపోగా.. గొర్రెకుంట సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు 5 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొర్రెకుంట సబ్‌స్టేషన్ ఏఈ దిలీప్ తన సిబ్బందితో కలిసి తీగలను సరి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. స్థానిక శివ రోలర్ ఫ్లోర్మిల్లులోకి లోడ్లతో వచ్చిపోయే లారీలు తరచు స్తంభాలను ఢీకొనడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని స్థానికులు పేర్కొన్నారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు. నిర్వాహకురాలు, ముగ్గురు విటుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ -
గంజాయి ముఠా అరెస్ట్
● రూ.3.5 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనం పరకాల: సిగరెట్లలో గంజాయి పెట్టి విక్రయించాలనే ఆలోచనతో ఒడిశా నుంచి సరుకు దిగుమతి చేసి పరకాలలో విక్రయించేందుకు సిద్ధమైన ముఠాను పరకాల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ క్రాంతికుమార్ కథనం ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పశువుల సంతలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతోపాటు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమానితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా రూ.3లక్షల 5వేల విలువైన 6.11 కిలోల ఎండుగంజాయి లభ్యమైంది. దీంతో ఒడిశాకు చెందిన శంకుభర సగారియా(మేసీ్త్ర), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దరగోపాల్ యాదవ్(మేసీ్త్ర), పరకాలలోని మల్లారెడ్డిపల్లెకు చెందిన ఓంటేరు రాజ్‌కుమార్(ల్యాబ్‌టెక్నీషియన్)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శివక్రిష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు టి.సర్వర్, ఎస్.నరసింగం, డి.నాగరాజు, ఎస్.నాగరాజు, ఎ.శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
నిరంతరం కష్టపడితేనే విజయం
కేయూ క్యాంపస్ : నిరంతరం కష్టపడితేనే విజయం వరిస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో గురువారం యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన యూనివర్సిటీ కాలేజీ వార్షిక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేలో వీసీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టించే తత్త్వం, పట్టుదల, అకడమిక్‌పై పట్టు, పెద్ద లక్ష్యం, జీవన నైపుణ్యాలు విజయమార్గాన్ని సుగమం చేస్తాయన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థి దశలో అవసరమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ సినీ గేయ రచయత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ విద్యార్థులతోనే సమాజ మార్పు సాధ్యమన్నారు. రైతులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల కృతజ్ఞతభావం ఉండాలన్నారు. మరో గౌరవ అతిథి, ఇండియన్ కబడ్డీ టీం పూర్వపు హెడ్ కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదువుకు టాలెంట్‌కు సంబంధం లేదు అన్నారు. చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి. సురేశ్ లాల్, ఎన్. సుదర్శన్, బి. రమ, బి. సుకుమారి, ఎం.నవీన్, చిర్రరాజు, కె. అనితారెడ్డి, పుల్లూరి సుధాకర్, కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, క్యాంపస్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మమత వందన సమర్పణ గావించారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
ఎల్సీ యాప్‌తో ప్రమాదాల నివారణ
హన్మకొండ: ప్రమాదాల నివారణ, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎల్సీ యాప్‌ను రూపొంచిందని కంపెనీ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతం రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఆజంజాహి మిల్ సబ్ స్టేషన్లో ఎల్సీ యాప్‌ను ప్రారంభించి అమలు చేశారు. విద్యుత్ సంబంధ మరమ్మతులు చేస్తున్న క్రమంలో లైన్ క్లియర్ తీసుకుంటామని, ఒక్కోసారి సమాచార లోపంతో ప్రమాదాలు జరిగేవన్నారు. వీటిని అరికట్టేందుకు ఎల్సీ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎల్సీ తీసుకోవాలంటే సంపూర్ణ సమాచారం పొందుపరుచాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారాన్ని పరిశీలించి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టడం ద్వారా ప్రమాదాల నివారించొచ్చన్నారు. ఇప్పటి నుంచి వరంగల్ టౌన్ డివిజన్లో ఎల్సీ యాప్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి యాప్ ద్వారానే ఎల్సీ తీసుకోవాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో డీఈలు ఎ.ఆనందం, ఎస్.మల్లికార్జున్, ఏడీ బి.కిశోర్, ఏఈ సి.హెచ్.సాయి కృష్ణ, సబ్ ఇంజనీర్లు సురేశ్, విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి -
రజతోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాతికేళ్ల పండుగ వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అవతరించి 25 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఈ రజతోత్సవ వేడుకలను నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపం చింతలపల్లి శివారులో ఈ నెల 27న భారీ సభ నిర్వహిస్తోంది. పది లక్షల మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి ‘పబ్లిక్ మీటింగ్’ నిర్వహించడానికి మార్చి 28న కాజీపేట ఏసీపీకి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరగడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పోలీసుల అనుమతి కూడా లభించింది. పాతికేళ్ల పండుగ వేడుకల నిర్వహణకు ఇంకా పది రోజులే ఉండటంతో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది, పనులు ఎంతవరకు.. ఆరా తీస్తున్న అధినేత కేసీఆర్.. రజతోత్సవ వేడుకల సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజూ ఆరా తీస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సభావేదిక ఏర్పాట్ల కోసం మొదట మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా.. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఉమ్మడి జిల్లా నేతలు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఓ సారి, సాయంత్రానికోసారి సభావేదిక ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. ఎల్కతుర్తి, గోపాల్పూర్, బావుపేట, ఎల్లాపూర్, కొత్తపల్లి శివార్లలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాల చదును పూర్తయ్యింది. సుమారు 50 వేల వాహనాల వరకు వస్తాయని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. ఆ మేరకు ఇంకా పార్కింగ్ స్థలాలను పెంచుతున్నారు. ఇదిలా ఉండగా జనసమీకరణకు ఇదివరకే ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓ వైపు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నే.. మరోవైపు జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ‘ప్రచార రథం’లు కూడా రోడ్డెక్కాయి. కాగా, సభకు మరో పది రోజులే గడువు ఉండటంతో రెండు రోజుల్లో కీలక కమిటీలు వేయడంతోపాటు శనివారం ఉమ్మడి వరంగల్ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. సమావేశ స్థలం కంటే పార్కింగ్‌కే అధికం..ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ వేడుకల కోసం ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్ శివార్లలో 1,159 ఎకరాల భూసేకరణ చేశారు. ఇందుకోసం రైతులు స్వచ్ఛందంగా అనుమతి పత్రాలు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పోలీసులకు అనుమతి కోసం చేసిన వినతిపత్రంలో సమావేశానికి 159 ఎకరాలు, పార్కింగ్ కోసం 1000 ఎకరాలు సేకరించినట్లు స్పష్టం చేశారు. వరంగల్ – కరీంనగర్, సిద్దిపేట – వరంగల్, యాదాద్రి భువనగిరి – ఆరెపల్లి (భూపాలపట్నం)... మూడు జాతీయ రహదారులకు కేంద్రంగా ఉన్న ఎల్కతుర్తి, దాని పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న చింతలపల్లి శివారులో సభావేదిక, సమావేశానికి హాజరయ్యే ప్రజల కోసం కుర్చీలు, షామీయానాలను వేసేందుకు భూమి చదును పనులు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. లక్షల్లో జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున నిఘా కోసం తగినన్ని సీసీ కెమెరాలు, పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎల్కతుర్తిలో భారీ సభ కోసం మొత్తం 1,159 ఎకరాలు పార్కింగ్ స్థలాలు, సభావేదిక మైదానాల చదును పాతికేళ్ల వేడుకల సభకు మరో పది రోజులే... రోడ్డెక్కిన ప్రచార రథాలు ఆవిర్భావ సభ సక్సెస్‌కు నేడో, రేపో కీలక కమిటీలు ఏర్పాట్లపై రోజు రెండుసార్లు అధినేత కేసీఆర్ ఆరా ఉమ్మడి వరంగల్ నేతలతో రేపు కేసీఆర్ భేటీ...? -
నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రతీకారమే
హన్మకొండ చౌరస్తా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రతీకారానికి దిగుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీల పేర్లు చార్జీషీట్లో నమోదు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గురువారం హనుమకొండలోని అశోకా జంక్షన్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ఇతర అగ్రనేతలపై చార్జీషీట్ దాఖలు చేయడమంటే ప్రభుత్వం తన అధికారాలను దుర్వినియోగం చేయడమేనన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన విపక్ష పార్టీపై దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, విజయశ్రీరజాలీ, మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు పాల్గొన్నారు. -
చార్జ్‌షీట్ నుంచి పేర్లు తొలగించాలి
● కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఖిలా వరంగల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ చార్జ్‌షీట్‌లో నమోదు చేయడం సరికాదని ఆమె అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు గురువారం వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ జంక్షన్లో కాంగ్రెస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. చార్జ్‌షీట్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లు వెంటనే తొలిగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్వర్ణ మాట్లాడుతూ పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందిన రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకులు అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీషశ్రీమాన్, నాయకులు దామెర సర్వేశం, బిల్లా శ్రీకాంత్, దూపం సంపత్, జన్ను రవి, జన్ను అరుణ్, పరమేశ్, ఎండీ సలీం, రాజనాల శ్రీహరి, గోరంటల రాజు, చాగంటి శ్రీనివాస్, బాలరాజు, యాదగిరి, బాబు, చంద్రమౌళి, ఇమ్రాన్, కొమురయ్య, చిరంజీవి, సతీశ్, ఉమేందర్, ప్రభాకర్,కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిళల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి
హన్మకొండ చౌరస్తా: మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూలే–అంబేడ్కర్ యాదిలో–మహిళల హక్కుల పరరిరక్షణ యాత్ర గురువారం హనుమకొండకు చేరుకుంది. ఈబస్సు యాత్రకు ఐద్వా జిల్లా కమిటీ, వివిద ప్రజా సంఘాల బాధ్యులు వేయిస్తంభాల గుడి వద్ద బోనాలు, డప్పుచప్పుళ్లు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. వేయి స్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా సాగిన ప్రదర్శనలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ సీ్త్ర, పురుషుల మధ్య అసమానత్వం కొనసాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీ్త్రల హక్కుల కోసం పోరాటాలు సాగిస్తామన్నారు. ‘ఐద్వా’ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశాలత, రత్నమాల, సాయిలీల, రామతార, శ్వేత, రాధికారాణి, అనిత, రాధ, పుష్ప, సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఉప్పలయ్య, చక్రపాణి, రజిత, గిరిజన సంఘం నాయకులు వీరన్న, మత్స్యకార్మిక సంఘం నాయకులు వెంకట్, కేవీపీఎస్ బాధ్యులు సాంబయ్య, సంపత్, డీవైఎఫ్ఐ బాధ్యులు కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
పకడ్బందీగా ఎల్ఆర్ఎస్ అమలు
వరంగల్: వరంగల్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎల్ఆర్ఎస్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 41,754 దరఖాస్తులు రాగా.. 24, 699 దరఖాస్తులకు మంజూరు చేశామని చెప్పారు. 5,787 మంది రూ.107.61 కోట్ల ఫీజులు చెల్లించగా.. 382 మందికి ప్రొసీడింగ్‌లు అందజేశామని పేర్కొన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీఏఓ అనురాధ, డీటీసీపీ జ్యోతి, అధికారులు పాల్గొన్నారు. -
దక్కన్ క్వీన్ అందాలు జిగేల్..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ ఎదుట రైల్వే చరిత్ర తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మొద టి తరం రైల్వే స్టీమ్ లోకోమోటివ్ను (కాజీపేట జంక్షన్ ఎదుట ఏర్పాటు చేసినప్పుడు లోకోకు చేసిన నామకరణం హెరిటేజ్ దక్కన్ క్వీన్) రైల్వే అధికారులు గురువారం సుందరీకరించారు. శు క్రవారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా డీజిల్లోకోషెడ్ సీనియర్ డీఎంఈ ఎన్. వి.వెంకటకుమార్, డీఎంఈ అనికేత్ కాడే పర్యవేక్షణలో 15 మంది రైల్వే సిబ్బంది పెయింటింగ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి స్టీమ్ లోకోను సుందరంగా అలంకరించినట్లు ఏఆర్టీ ఎస్ ఎస్ ఈ పి.చంద్రశేఖర్ తెలిపారు. స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా భారతీయ రైల్వే చరిత్ర, స్టీమ్లోకోమోటివ్ విశేషాలను ప్రదర్శించగా ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. కాగా, విద్యుత్ కాంతుల మధ్య దక్కన్ క్వీన్ జిగేల్ మంటోంది. దీంతో ప్రయాణికులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. దక్కన్క్వీన్ కొత్త అందాలతో కాజీపేట జంక్షన్ శోభాయమానంగా మారింది. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ముస్తాబు పెయింటింగ్, లైటింగ్స్‌తో కలర్పుల్గా స్టీమ్లోకో.. ప్రొజెక్టర్ ద్వారా రైల్వే చరిత్ర ప్రదర్శన -
సాదా బైనామాలకు అవకాశం
● హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ● ‘భూభారతి’ చట్టంపై అవగాహనహసన్పర్తి: భూభారతి చట్టం–25లో సాదా బైనామాలకు అవకాశం కల్పించిన ట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. భూ భారతి చట్టం–25పై గురువారం హసన్‌పర్తి మండలం ఎర్రగట్టు క్రాస్‌లోని బాలాజీ గార్డెన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. 2014.. జూన్ కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని సాదాబైనామా కింద కొని 2020 నవంబర్‌లో క్రమబద్ధీరణకు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆర్డీఓ విచారణ జరిపి వారి నుంచి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారని తెలిపారు. ధరణిలో అప్పీలుకు అవకాశం ఉండేది కాదని, భూభారతి చట్టంలో అప్పీలు చేసుకునేందుకు రెండంచెల వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు. ‘భూభారతి’తో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే నాగరాజు భూభారతి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారవుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించి లక్షలాది ఎకరాల భూములను కబ్జా చేసిందని, బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు. భూభారతిలో రూపొందించిన మార్గదర్శకాలను ఆర్డీఓ రమేశ్ రాథోడ్ పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మేర్గు రాజేశ్, కార్పొరేటర్ దివ్యారాణి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి, వీసం సురేందర్‌రెడ్డి, వెంకటస్వామి, రత్నాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మదన్, అనిల్, జీవన్‌రెడ్డి, భగత్, కనపర్తి కిరణ్, పొన్నాల రఘు, రవీందర్ పాల్గొన్నారు. -
మండుతున్న ఎండలు.. రోడ్లపైనే జనాలు
ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్డు పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద బస్ షెల్టర్ లేదు. ఖమ్మం, తొర్రూరు, నెక్కొండ, వర్ధన్నపేట వైపు వెళ్లాలంటే ఆరు డివిజన్లకు చెందిన ప్రజలు ఇక్కడే బస్ ఎక్కుతారు. షెల్టర్ లేక కూర్చోలేని, నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన గ్రామీణ ప్రాంత ప్రజలు తిరుగు ప్రయాణంలో అండర్‌బ్రిడ్జి జీప్ అడ్డా వద్ద బస్సులు ఎక్కి వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రయాణికులు ఎండలో నిలబడి బస్సుల కోసం ఎదురు చూస్తుంటారు. ఎండలు మండుతుండడంతో రోడ్లపై నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ డీఎస్ఏ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ శిబిరాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్ గురువారం ఇండోర్ స్టేడియం వద్ద దరఖాస్తులు స్వీకరించారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా 23 క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అశోక్‌కుమార్ తెలిపారు. 4 వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల వరకు క్రీడా శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాకు 20 మంది స్పౌజ్ టీచర్లువిద్యారణ్యపురి: రాష్ట్రంలో 317 జీఓ ద్వారా నష్టపోయిన స్పౌజ్ టీచర్లలో మరో 165 మందిని బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఈనెల 16న ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాకు 20 మంది స్పౌజ్ టీచర్లను వివిధ జిల్లాల నుంచి బదిలీ చేశారు. భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీల్లో భాగంగా.. ఈ బదిలీలు జరిగాయి. భార్య ఒక జిల్లాలో భర్త మరో జిల్లాలో ప్రస్తుతం ఉండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు హనుమకొండ డీఈఓకు బదిలీ అయిన స్పౌజ్ టీచర్ల జాబి తాను పంపారు. ఆయా టీచర్లు ఈనెల 22న తాము ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి రిలీవ్ అయ్యి ఈ విద్యాసంవత్సరం చివరి పనిదినమైన ఈనెల 23న హనుమకొండ జిల్లాలో కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. వివిధ జిల్లాల నుంచి హనుమకొండ జిల్లాకు బదిలీ అయిన 20 మందిలో ఎస్జీటీలు 16 మంది, ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం ఇద్దరు, ఒకరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, మరొకరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉన్నారు. సీనియర్ సివిల్ జడ్జీల బదిలీవరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సివిల్ జడ్జీలను బదిలీచేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి డి.విరోధిని వరంగల్ జిల్లా నర్సంపేటకు బదిలీ అయ్యారు. హనుమకొండ సీనియర్ సివిల్ జడ్జి జే.ఉపేందర్రావును 16వ అదనపు జడ్జిగా సిటీ సివిల్ కోర్ట్ సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎల్బీ నగర్ 3వ అదనపు సివిల్ జడ్జి జి.రామలింగాన్ని నియమించారు. భూపాలపల్లి సీనియర్ సివిల్ జడ్జి కె.జయరామ్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేయగా.. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కెనాగరాజును బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సి.సురేశ్‌ను ఫస్ట్ అదనపు జడ్జి సివిల్ సిటీ కోర్టు సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సంగారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి శాలిని శఖీలాను నియమించారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’ హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. 21నుంచి ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాలుహసన్పర్తి: ఈ నెల 21నుంచి 28వ తేదీ వరకు వారంరోజుల పాటు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ ఽఅధికారి మహేందర్ తెలిపారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాఽధికారులు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ టీకాలు ఇచ్చిన వారి వివరాలు పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అతుల్, సిబ్బంది పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ సంజీవ్ బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ బి.సంజీవ్ కరీంనగర్ కమిషనరేట్‌లోని మానకొండూరు సర్కిల్‌కు బదిలీ అయ్యారు. మల్టీ జోన్–1లో జరిగిన బదిలీల్లో మల్టీజోన్ ఐజీ దగ్గర వెయిటింగ్లో ఉన్న పైండ్ల మల్లయ్య వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చారు. -
నగరంలో రూట్లు, స్టేజీలు ఇలా..
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ చౌరస్తా సమీపంలోని ఏనుగులగడ్డ వద్ద ఎండలో రోడ్డుపైనే నిల్చున్న వీరంతా ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. భూపాలపల్లి, ఏటూరునాగారం, నర్సంపేట మీదుగా వివిధ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర సాధారణ ప్రజలు వెళ్తుంటారు. ఏనుగులగడ్డలో సుమారు 17 ఏళ్ల క్రితం వరకు ఇక్కడ బస్‌షెల్టర్ ఉండేది. అభివృద్ధి పనుల్లో భాగంగా షెల్టర్‌ను తొలగించిన అధికారులు ఆ తర్వాత నిర్మించడం మర్చిపోయారు. నడిరోడ్డుపైనే బస్సులను నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని గ్రహించి పదేళ్ల క్రితం పక్కనే బస్బేను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రయాణికులు ఎండకు, వర్షానికి ఇబ్బందులు ఎదుర్కోవడం సాధారణంగా మారింది. అధికారులు చొరవ తీసుకోవాలి.. హనుమకొండ నుంచి ఏ ఊరికి వెళ్లాలన్నా ఏనుగులగడ్డ వద్దనే బస్సు ఎక్కాలి. 20 ఏళ్ల క్రితం బస్షెల్ట ర్ను తొలగించిన అధికారులు తిరిగి నిర్మించలేదు. ఎందుకు నిర్మించడం లేదని చాలాసార్లు అధికారులను ఆరా తీశాం. ఏదో స్థల వివాదం ఉందని దాటవేస్తూ వస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని బస్‌షెల్టర్‌ను నిర్మించాలి. – గూడూరు వేణుప్రసాద్, సుధానగర్ uవరంగల్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. శరవేగంగా జనాభా పెరుగుతోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తమ పిల్లల చదువులకు, ఇతరత్రా వ్యాపారాల కోసం నగరానికి వచ్చేస్తున్నారు. దీనికితోడు రోజూ వివిధ పనుల నిమిత్తం వచ్చిపోయే వారు అనేకం. ఇక్కడ విద్యాసంస్థలు కూడా ఎక్కువే. స్థానికంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటకు వెళ్లేవారు ఎక్కువగా సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళలు దాదాపుగా బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. నగరంలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ చిరు వ్యాపారులు, ఇతరులు ఆక్రమించడం, అపరిశుభ్రంగా ఉండడంతో ప్రయాణికులు నిల్చోలేని పరిస్థితి. దీంతో కూడళ్ల సమీపంలోని దుకాణాల వద్ద, కొన్నిచోట్ల చెట్లనీడన వేచి చూస్తున్నారు. అసలే ఎండలు మండిపోతుండడంతో వారి అవస్థలు అన్నీఇన్నీ కావు. ఈనేపథ్యంలో నగరంలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్షెల్టర్లు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. – సాక్షి నెట్వర్క్రూట్లు : 04 మొత్తం స్టేజీలు 96ప్రధాన స్టేజీలు 32 రిక్వెస్ట్ స్టేజీలు 64కాజీపేట రూరల్: కాజీపేట బాపూజీనగర్‌లో హైదరాబాద్–వరంగల్ హైవే రోడ్డుపై బస్ షెల్టర్లు లేక ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బాపూజీనగర్ గాంధీ బొమ్మ వద్ద బస్టాప్ ఉంది కానీ షెల్టర్ లేదు. బాపూజీనగర్ చుట్టు పక్కల ప్రాంతాలవారు, విద్యార్థులు, వివిధ పనులకు వెళ్లే వారు ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. హనుమకొండ మార్గంలో సైతం షెల్టర్ లేదు. ప్రయాణికులు రోడ్డుపై ఎండలో, వానలో, ప్రభుత్వ పాఠశాల, దుకాణాల ఎదుట వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ బస్టాప్ ఉన్నప్పటికీ అప్పుడప్పుడు బస్‌లు కూడా ఆపడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇబ్బంది పడుతున్నాం.. నేను రాంపూర్ ఇండస్ట్రియల్‌లో పని చేస్తున్నా. రోజూ బస్సులోనే వెళ్లి వస్తా. బాపూజీనగర్‌లో బస్‌షెల్టర్ లేక ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నాం. అప్పుడప్పుడు ఇక్కడ బస్సులు ఆపడం లేదు. దీంతో డీజిల్‌కాలనీ వరకు వెళ్లి అక్కడ ఎక్కుతున్నాం. అధికారులు స్పందించి షెల్టర్ నిర్మించడంతోపాటు బస్సులు ఆపాలి. – నిర్మల, బాపూజీనగర్ నగరంలో బస్షెల్టర్లు లేక ప్రయాణికుల అవస్థలు గ్రేటర్ పరిధిలో మొత్తం బస్స్టేజీలు 92 మండుతున్న ఎండలు.. రోడ్లపైనే ఎదురుచూపులు సమీప దుకాణాలు, చెట్ల నీడే దిక్కు.. కొన్నిచోట్ల షెల్టర్లు ఉన్నా.. అనువుగా లేక కూర్చోలేని దుస్థితి పట్టించుకోని అధికారులు షెల్టర్ల నిర్మాణంలో విఫలం హన్మకొండ : వరంగల్ నగరం స్మార్ట్‌సిటీగా ఎంపికై న తర్వాత గతంలో ఉన్న బస్ షెల్టర్లను రోడ్డు వెడల్పు, డ్రెయినేజీ నిర్మాణంలో భాగంగా తొలగించారు. బస్ బేలు, బస్ షెల్టర్లు నిర్మించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో బస్ షెల్టర్ల నిర్మాణంలో అధికార యంత్రాగం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైవేపై నిలబడి.. మడికొండలో..న్యూశాయంపేట చౌరస్తాలో..ఎండలో మాడుతున్నారు.. -
కారు కిరాయి.. ఇంధనం పరాయి
సాక్షిప్రతినిధి, వరంగల్: పరకాలలోని హుజూరాబాద్ రోడ్డులో గల ఓ పెట్రోల్‌బంకులోకి గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్ పే చేస్తామని స్కాన్ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్ బంక్ మేనేజర్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపర్తిలో హెచ్‌పీ పెట్రోల్ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్ ద్వారా పేమెంట్ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్, పెట్రోల్ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సవాల్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్గడ్, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్ డ్రైవింగ్’ వాహనాలను అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్ ప్లేట్లు తీసి పెట్రోల్ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్ట్ చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కాన్ చేసినట్లు యాక్షన్.. ఇంధనం క్యాన్లతో పరారు పెట్రోల్ బంకుల సిబ్బందిని బురిడీ కొట్టించి జల్సాలు మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు -
అసంపూర్తిగా బస్ షెల్టర్
వరంగల్: వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్ రత్నా హోటల్ సమీపంలో నిర్మిస్తున్న బస్ షెల్డర్ మూడు నెలలుగా అసంపూర్తిగా మారింది. స్మార్ట్ నిధులతో నగరంలో పలు షెల్టర్లు నిర్మించిన అధికారులు దీన్ని ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదే విధంగా గోపాలస్వామిగుడి జంక్షన్‌లోని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న షెల్టర్‌ను తొలగించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీఎం నుంచి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు ఒక్క బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణీలకు నిలువ నీడ లేకుండా పోయింది. షెల్టర్లు నిర్మించాలి..నగరంలో ప్రయాణికులు బస్సుల కోసం నిరీక్షించేందుకు షెల్టర్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ రెండు ఫర్లాంగులకు ఒక షెల్టర్ ఉండేది. ఇప్పుడు వాటి స్థానాల్లో పాన్‌షాపులు, పండ్ల బండ్లు పెట్టడం వల్ల షెల్టర్లు లేక ప్రయాణించేవారు ఇబ్బందులు పడుతున్నారు. – గుత్తికొండ రవి, కాశిబుగ్గ ● -
వావ్.. వాటే ఐడియా గురూ.. ఆసుపత్రికి కొండముచ్చు కాపలా.. ఎక్కడంటే?
సాక్షి, వరంగల్: కోతుల సైర్వ విహారంతో విసుగు వేసారిన ఆసుపత్రి నిర్వాహకులకు ఓ చక్కటి ఐడియా వచ్చింది. తక్షణమే కోతుల బెడద నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు రక్షణ కల్పించేందుకు కొండముచ్చును కొని తెచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి కొండముచ్చు పహారా కాస్తోంది.ఆసుపత్రికి వచ్చే వారిపై పలుమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజనరేందర్ రెడ్డి.. రూ.30 వేలు వెచ్చించి ఏపీ నుంచి ఓ కొండముచ్చును ఆసుపత్రి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం పొందింది. ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచన పట్ల రోగులు వారి బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
టెంట్‌సిటీ నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో టూరిజంశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెంట్‌సిటీ పనులు యుద్ధప్రాతిపాదికన చేట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో జరిగిన సరస్వతీ పుష్కరాల యాప్, వెబ్‌పోర్టల్ ప్రారంభ సమీక్షలో కలెక్టర్‌తో మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద తాత్కాలిక టెంట్‌సిటీ నిర్మాణాలకు రూ.83లక్షలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. మేఘా, సింగరేణి, ఎన్టీపీసీల్లో ఏదో ఒక్క సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం. టెంట్‌సిటీ కోసం ఇప్పటికే కాళేశ్వరంలో దేవస్థానానికి సంబంధించిన గుడిమాన్యం భూమిలో ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రైతులకు కూడా పంటనష్టం అందజేశారు. కానీ నిర్మాణాలు మొదలు కాకపోవడంతో మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండు రోజుల్లో షార్ట్టెండర్స్ పిలిచి పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆలయ వర్గాల సమాచారం. వీఐపీ ఘాట్ వద్ద విగ్రహాల తొలగింపు కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి)ఘాట్ వద్ద పుష్కఘాట్ విస్తరణలో భాగంగా వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టు కింద భక్తులు ఏర్పాటు చేసిన పలు దేవతా విగ్రహాలకు బుధవారం ఉద్వాసన పూజ చేసి తొలగించారు. కాగా, ఇటీవల కలెక్టర్ రాహుల్‌శర్మ సరస్వతీనది పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించిన సమయంలో ఘాట్‌పై ఉన్న వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టును తొలగించొద్దని, దేవతా విగ్రహాలను తొలగించి ప్రత్యేకంగా మళ్లీ ఓ చోట ఏర్పాటు చేయాలని అఽధికారులకు ఆదేశించారు. దీంతో తొలగింపు పనులు చేపట్టారు. కలెక్టర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం -
వేసవిలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవి కాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవర్లు విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని ఆర్టీసీ హనుమకొండ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లకు వాటర్ క్యాన్లు, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ డ్రైవర్లు ఎండతోపాటు ఇంజన్ వేడి తట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో తగినంత తాగు నీరు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ నుంచి ఉపశమనానికి రుమాలు చుట్టుకోవాలన్నారు. డ్యూటీలో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించినా, డీ హైడ్రేషన్‌కు గరైనా వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడగాలులు, ఎండ వేడి నుంచి కొంతైనా ఉపశమనం పొందొచ్చన్నారు. ఈ క్రమంలోనే హనుమకొండ డిపోలోని ప్రతీ డ్రైవర్‌కు జ్యూట్ బ్యాగుతో కూడిన 5 లీటర్ల వాటర్ క్యాన్, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించినట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు కేశరాజు భానుకిరణ్, మహేశ్, హనుమకొండ డిపో ట్రాఫిక్ సూపర్వైజర్ నజియాసుల్తానా, మెకానిక్ సూపర్వైజర్ వి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
● ముగ్గురి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్‌రావు భూపాలపల్లి అర్బన్: గణపురం మండలం రవినగర్ సమీపంలో రూ. 5.60లక్షల విలువైన 11 కేజీల ఎండు గంజాయి పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ఆరెల్లి అఖిల్, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆముదాల కార్తీక్, హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌కు చెందిన ముస్కే రోహిత్ స్నేహితులు. తాము సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో కొద్ది రోజులుగా ఒడిశాలోని కొండప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి భూపాలపల్లి, గణపురం మండలాల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న రవినగర్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అశోక్ తన సిబ్బందితో కలిసి మంగలోనికుంట మత్తడి వద్ద మాటు వేయగా ముగ్గురు వ్యక్తులు సంచులు పట్టుకుని అనుమానాస్పందగా కనిపించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. కాగా, గంజాయిని పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన చిట్యాల సీఐ మల్లేశ్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అశోక్, సీసీఎస్ ఎస్సై భాస్కర్‌రావు, సిబ్బందిని అభినందించారు. వడదెబ్బతో మహిళ మృతి నర్సంపేట రూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘ టన నర్సంపేట మండలంలోని రాజుపేట శివారు గార్లగడ్డతండా లో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఫాల్తియా వసంత (35) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పజ్జజొన్న చేనులో పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి భర్త భద్రు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైలునుంచి జారి పడి యువకుడి మృతి ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ వద్ద ఓ యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన పెరుమాండ్ల అనిల్ (29) మంగళవారం రామగుండంలో కూలి పనికి వెళ్లి తిరిగి రైలులో సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రైలు వరంగల్ రైల్వే గేట్ సమీపాన చేరుకోగానే అనిల్ అందులోనుంచి జారిపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆటోలో ఎంజీఎం తరలించగా.. వై ద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
తెలుసుకోండి..!
కొనేముందు ఖిలా వరంగల్: బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో షాపులు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, ఏటూరునాగరం, నర్సంపేట, పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో బంగారు ఆభరణాల షాపులు ఉన్నాయి. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. వరంగల్ ట్రైసిటీలో చిన్న, పెద్ద కలిపి సుమారు 150పైగా దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని వెలుస్తున్నాయి. ప్ర స్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.బంగారంలోనే రంగులుబంగారు ఆభరణం తయారీలో నికిల్, మాంగనీస్ లేదా పల్లాడియం వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్‌గోల్డ్ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్ షేడ్‌లో కనిపిస్తుంది.స్వచ్ఛత గుర్తింపు ఇలా..ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్ యాసిడ్‌తో టెస్ట్ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారు పూత వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి.కేడీఎం అంటే..జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి.ఇవి గమనించాలి..24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్‌లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. పసిడి నాణ్యతను గుర్తించండిలా..హాల్‌మార్క్‌తోనే మోసాలకు చెక్యూనిక్ ఐడీ నంబర్‌ను బట్టి స్వచ్ఛతనాణ్యత శాతం సర్టిఫికెట్తోనేఅసలు గుర్తింపుక్యారెట్ల బట్టి స్వచ్ఛత..24 క్యారెట్ల: 99.9 శాతం స్వచ్ఛత ఇది.బిస్కెట్ రూపంలో ఉంటుంది.22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం,మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి.18 క్యారెట్ల: 75 శాతం బంగారం,మిగతా 25శాతం ఇతర లోహాలు14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం,మిగతా భాగం ఇతర లోహలు12 క్యారెట్లు: 50శాతం మాత్రమేబంగారం, మిగతా 50శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.24 క్యారెట్లు అంటే..బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు. -
దిగుమతి సుంకాలు తగ్గిస్తే పత్తి రైతులకు నష్టాలు
వరంగల్: ది సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ కోరినట్లు దిగుమతి సుంకాలను 11శాతం కంటే ఎక్కువ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దేశంలోని పత్తి రైతులు నష్టపోతారని తెలంగాణ కాటన్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మధ్యాహ్నం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అధ్వర్యంలో కేంద్ర కమిషనర్ ఆఫ్ టెక్స్టైల్స్ రూప్ రాశి.. వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించారు. ఈ వీసీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల టెక్స్టైల్స్ సెక్రటరీలు, ఫైనాన్స్ సెక్రటరీలు, సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తా, దేశంలో టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషనలతోపాటు తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని టెక్స్టైల్స్ ఇండస్ట్రీ దిగుమతి చేసుకుంటున్న దూదిబేళ్లపై దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం మినహాయింపు(తగ్గిస్తే) ఇస్తే దేశంలోకి ఇతర దేశాలనుంచి దూదిబేళ్ల దిగుమతులు ఎక్కువై సాగు చేసే రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. -
విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 16 సర్కిళ్ల పరిధిలో ప్రతీ అధికారి, ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈదురుగాలులకు చెట్లు విరిగి లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ జరిగిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పడు తమ సర్కిల్ పరిధిలోని సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాలని, అక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్‌కు సమాచారం అందించాలన్నారు. కావాల్సిన మెటీరియల్ అందుబాటలో ఉంచామని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎక్కువ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని, ఎస్ఈలు ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ, మెన్, మెటీరియల్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్, 16 సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొన్నారు. -
మోసగించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 1,200 ఎకరాల్లో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్స సభ ఏర్పాట్లను ఆమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, నాయకులు నాగుర్ల వెంకన్న, భరత్‌కుమార్, రాకేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చితకిలపడిపోయిందన్నారు. నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానంద, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్, మండల సురేందర్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, మాజీ సర్పంచ్‌లు కుర్ర సాంబమూర్తి, దుగ్యాని సమ్మయ్య, జూపాక జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
నెల రోజుల్లో ‘కిటెక్స్’ ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లోని కేరళ కేంద్రంగా ఉన్న ‘కిటెక్స్’ కంపెనీని నెల రోజుల్లో ప్రారంభిస్తామని మేనేజర్ మనోజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కంపెనీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్ మనోజ్.. కలెక్టర్, ఎమ్మెల్యేకు కంపెనీలో తయారు చేసే గార్మెంట్లు, ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, వచ్చే నెలలో ప్రధాని మోదీతో కంపెనీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, కంపెనీలో ఇప్పటికే పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల భర్తీ ప్రత్యక్షంగా, ఆన్లైన్లో కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ నిరుద్యోగులు కంపెనీ వద్దకు దరఖాస్తులతో క్యూ కడుతున్నారు. టీజీ ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, గీసుకొండ తహసీల్దార్ ఎండి. రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. 20న హజ్ యాత్రికులకు శిక్షణ న్యూశాయంపేట : పవిత్ర మక్కాలోని హజ్‌యాత్రకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా యాత్రికులకు ఈనెల 20 ఆదివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్మోహియోద్దీన్ ఘాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ ఎల్బీ నగర్‌లోని ఏ1 ఫంక్షన్హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రొజెక్టర్ ద్వారా సవివరంగా యాత్ర ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ అందిస్తారన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ ఖుష్రూపాషా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాత్రీకులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. ● కంపెనీ మేనేజర్ మనోజ్ ● పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యేకు వివరించిన మేనేజర్ -
ఒక్కడే..18 బైక్‌లు చోరీ
హసన్‌పర్తి: ఒకే యువకుడు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన 18 బైక్‌లు చోరీ చేశాడు. వాహనాల తనిఖీల్లో తప్పించుకునే క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్‌కు చెందిన గుగులోత్ చందూలాల్ కొంతకాలంగా 56వ డివిజన్ గోపాలపురంలో ఉంటున్నాడు. తన స్నేహితుడి ఐడీతో జొమాటో, స్విగ్గి, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు.అయితే ఆ ఆదాయం సరిపడక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనకు వచ్చి రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను మాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హనుమకొండ పీఎస్ పరిధిలో ఏడు, హసన్‌పర్తి పీఎస్ పరిధిలో మూడు, కేయూసీ పీఎస్ పరిధిలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో నాలుగు, భువనగిరిలో రెండు, హైదరాబాద్‌లో ఒకటిచొప్పున ఎత్తుకెళ్లాడు. ఇంటిలోనే చోరీ వాహనాలు.. హసన్‌పర్తి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసిన చందూలాల్ తప్పించుకునే క్రమంలో పట్టుకుని విచారించారు. చోరీ వాహనాలను ఫతేపూర్‌లోని తన ఇంటిలోనే భద్రపరిచినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడి ఇంటికెళ్లి 18 బైక్‌లు స్వాధీనం చేసుకున్న ట్లు ఏసీపీ తిరుమల్ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ తిరుమల్, పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, సిబ్బందిని వరంగల్ పో లీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యం.. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ -
పీఆర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
● వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి వరంగల్: జిల్లాలోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై బుధవారం సీఈఓ రాంరెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా పీఆర్‌లోని ఆఫీస్ సబార్డినేట్లకు రికార్టు అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించకుండా.. ఇతర శాఖల నుంచి వచ్చిన వారి కోసం ఖాళీగా పెట్టినట్లు విమర్శలు వస్తున్నట్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. రికార్డు అసిస్టెంట్ల పదోన్నతులతోపాటు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నాయకులు యుగేందర్, విజయపాల్‌రెడ్డి, రవికుమార్, రాజ్‌కుమార్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. కక్కిరాలపల్లిలో వ్యక్తి ఆత్మహత్య ఐనవోలు: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్‌కు మొదట మమతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. చందర్‌తో మొదటి భార్య, కుమారులు వేరుగా ఉండడంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్వేతను రెండో వివాహం చేసుకున్నాడు. చందర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. -
హాల్‌మార్క్ సర్టిఫికెట్తో కొనుగోలు చేయాలి
బంగారు ఆభరణాల కొనుగోలులో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు వ్యాపారులకు వరంగా, వినియోగదారులకు భారంగా మారాయి. రెడీమేడ్ బంగారం, వెండి ఆభరణాల్లో 60 నుంచి 70శాతం నష్టాన్ని కలిగిస్తాయి. నాణ్యతాప్రమాణాల గుర్తింపు కోసం హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తో కూడిన వస్తువునే కొనుగోలు చేయాలి. వస్తువు నాణ్యత లేనిపక్షంలో బీఐఎస్‌కు ఆన్లైన్లో లేదా వినియోగదారుల సంఘాల ప్రతినిధికి ఫిర్యాదు చేయాలి –మొగిలిచెర్ల సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షుడు, సీసీఐ -
స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్: బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం సమీపంలో సుమారు రూ.1.50 కోట్లతో చేపట్టిన స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పనులు కొనసాగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదని మేయర్ అన్నారు. పనులు త్వరితగతిన పుర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. స్విమ్మింగ్ ఫూల్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఓ రమేశ్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈ రాజ్‌కుమార్, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారితో జిల్లా అభివృద్ధి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వరంగల్: జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సంగెం మండలం తిమ్మాపూర్, గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హైవే నిర్మాణంతో భవిష్యత్‌లో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్‌ను చూడవచ్చని తెలిపారు. నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, సంగెం, గీసుకొండ, తహసీల్దార్లు రాజ్‌కుమార్, రియాజొద్దీన్, రైతులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఉమారాణి, వర్ధన్నపేటకు డీసీఓ ఎం.నీరజ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె.ప్రసన్నరాణిని నియమించింది. -
రెండు రోజుల శిక్షణలో కమిషనర్
వరంగల్: చైన్నెలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘స్పాంజ్ పార్క్ ఫ్రేమ్ వర్క్ ఫర్ రెసిలెంట్ ఓపెన్ స్పేసెస్’ కార్యక్రమంలో వరంగల్ బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే బుధవారం పాల్గొన్నారు. స్థిరమైన పట్టణాభివృద్ధి–స్మార్ట్ సిటీస్–ఐఐ (ఎస్యూడీఎస్–2) ప్రాజెక్టులో భాగంగా ఈశిక్షణ చైన్నెలో నిర్వహిస్తున్నారు. జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(బీఎంజడ్) తరఫున డ్యూయిష్ గెసెల్స్ చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామెనార్బీట్ (జీఐజడ్) మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్(ఏంఓహెచ్యుఏ) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేశారు. నగరాల్లో స్పాంజ్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం, డిజైన్ చేయడం, అమలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి పట్టణ అధికారుల సామర్థ్యాలను పెంపొందించడం ఈ శిక్షణ ప్రధాన లక్ష్యమని కమిషనర్ తెలిపారు. పట్టణాల్లో సంభవించే వరదలను తగ్గించడం, భూగర్భ జలాలను పెంపొందించడం (రీఛార్జ్ చేయడం) పురపాలికల్లో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలను అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
తెలుగు విభాగంలో ‘బదిలీ’ వివాదం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో బదిలీ వివాదం నెలకొంది. ఓ తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ బదిలీపై జరిగిన డిపార్ట్మెంటల్ సమావేశంలో విభాగాధిపతి తీరుపై మిగతా సభ్యులు అభ్యంతరం తెలుపుతూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఈ వివాదానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీ పరిధి హనుమకొండలోని ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల తెలుగు విభాగంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 13 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివ్ తనను యూనివర్సిటీ క్యాంపస్‌కు బదిలీ చేయాలని కొన్నినెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం దృష్టికి పలుసార్లు తీసుకెళ్లారు. తెలుగు విభాగం అధిపతికి కూడా వినతిపత్రం సమర్పించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి సదాశివ్‌ను బదిలీ చేయాలంటే డిపార్ట్మెంటల్ కమిటీ (డీసీ) సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. క్యాంపస్‌లోని తెలుగ విభాగం నుంచి మరో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి బదిలీ చేయాల్సి ఉంటుంది. క్యాంపస్‌లో తెలుగు విభాగంలో ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అతడిని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి, తనను క్యాంపస్‌లోని తెలుగు విభాగానికి బదిలీ చేయాలని కోరుతూ వస్తున్నారు. డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశంలో రచ్చ సదాశివ్ బదిలీపై ఇటీవల కేయూ తెలుగు విబాగం అధిపతి, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లింగయ్య డిపార్టుమెంటల్ కమిటీ(డీ.సీ) సమావేశం నిర్వహించారు. ఇందులో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ మరో రెండు విభాగాలకు విభాగాల అధిపతులు (రెగ్యులర్ మహిళా ఆచార్యులు) సభ్యులుగా పాల్గొన్నారు. తెలుగు విభాగంలో 2013లో అప్పటి డిపార్టుమెంటల్ కమిటీ సదాశివ్‌ను మహబూబాబాద్ పీజీ సెంటర్‌కు బదిలీ చేయాలని నిర్ణయించిందని, ఇప్పుడు మహబూబాబాద్ పీజీ సెంటర్‌కు బదిలీ చేద్దామనేది తెలుగు విభాగం అధిపతి లింగయ్య పేర్కొన్నారు. అప్పటి డీసీ నిర్ణయం ఇన్ని సంవత్సరాల తర్వాత అమలు చేయడం సరికాదని, నూతనంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ మనోహర్ సూచించారు. దీన్ని లింగయ్య విభేదించారు. అంతేకాకుండా మనోహర్ సూచనలను వ్యతిరేకిస్తూ అమర్యాదగా ప్రవర్తించారని, ఆయన మాటను ఖాతరు చేయకుండా విభాగాధిపతి వ్యవహరించిన తీరుతో సమావేశం నుంచి మనోహర్‌తోపాటు మరో ఇద్దరు ఆచార్యులు వెళ్లిపోయారు. లింగయ్య తీరుపై లిఖితపూర్వకంగా కేయూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈవిషయాన్ని బుధవారం ప్రొఫెసర్ మనోహర్ ధ్రువీకరించారు. తెలుగు విభాగాఽధిపతిగా ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని, తనను బదిలీ చేయడం లేదని సదాశివ్ రిజిస్ట్రార్, వీసీలను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు. సదాశివ్‌ను బదిలీ చేయడంలో తాత్సారం డీసీ మీటింగ్‌లో విభాగాధిపతి తీరుపై విస్మయం రిజిస్ట్రార్‌కు ప్రిన్సిపాల్ మనోహర్ ఫిర్యాదు -
అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు తప్పనిసరి
హన్మకొండ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఎంపిక తీరుపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో బుధవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారి ఎంపికను ఇందిరమ్మ కమిటీతో కలిసి అధికారులు చేయాలన్నారు. మే 2వ తేదీన ఎంపిక చేసిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలన్నారు. వేసవి నేపథ్యంలో.. జిల్లాలో ఎక్కడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట చేతిపంపులకు మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు, ఆవాసాలకు తాగునీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు చేపడతామని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారులు అడిగిన పలు సందేహాలకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్ వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎంపీడీఓలు, ఎంపీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuఉమ్మడి జిల్లాలో ప్రజల సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చిట్టీ డబ్బులు డిపాజిట్లుగా...తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు చిట్‌ఫండ్ కంపెనీలు ముదిరి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. కొందరు తమ చిట్‌ఫండ్ కంపెనీలో చేరిన ఖాతాదారుడికి సకాలంలో డబ్బులు చెల్లించకుండా ‘మీ డబ్బులు మా వద్ద భద్రంగా ఉంటాయి. నెలనెలా వడ్డీ ఇస్తాం’. అంటూ డిపాజిట్లు చేయించుకున్నారు. అదే సమయంలో ఖాతాదారుడికి అవసరముండి డిపాజిట్ డబ్బులు చెల్లించండి అంటే డబ్బులు లేవు తాము చేసిన వెంచర్లో ప్లాట్ తీసుకో.. లేదంటే దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులంతా కలిసి సంఘాలను ఏర్పాటు చేసుకుని చిట్స్ కార్యాలయాల ఎదుట డప్పు వాయిస్తూ నిరసన తెలపుతున్నారు. ● కట్టిన డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్న సంస్థలు ● చిట్‌ఫండ్స్ బాధితులంతా కలిసి సంఘాల ఏర్పాటు ● అయ్యా మా చిట్టీ డబ్బులు మాకు ఇప్పించండని అధికారులకు వేడుకోలు ● ఏం చేయలేమంటూ చేతులెత్తేస్తున్న యంత్రాంగం ● డబ్బులు లేవు.. ప్లాట్లు తీసుకోండంటూ నిర్వాహకుల బెదిరింపులు కాజీపేట అర్బన్ : ప్రైవేట్ వ్యక్తుల వద్ద చిట్టీలు కడితే సొమ్ముకు భద్రత ఉండదని, రిజిస్టర్డ్ చిట్‌ఫండ్స్ కంపెనీల్లో చేరితే ప్రభుత్వమే భద్రత కల్పిస్తుందని ఆశపడ్డ సామాన్య, మధ్య, తరగతి కుటుంబాలకు నిరాశే మిగిలింది. చిట్టీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా నిర్వాహకులు తిప్పుకుంటున్నారు. గట్టిగా అడిగితే ప్లాట్ అయితే ఉంది.. తీసుకుంటే తీసుకో.. లేకపోతే లేదు అంటూ బెదిరిస్తున్నారు. దీంతో ఎటూ పాలుపోని ఖాతాదారులు బాధిత సంఘంగా ఏర్పడి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఆయా చిట్‌ఫండ్ సంస్థల ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల మంది చిట్స్బాధితులు డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో చిట్స్, టర్నోవర్ ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్టర్డ్ చిట్స్ 168 బ్రాంచ్‌లు ఉన్నాయి. ఇందులో 108 చిట్స్ కంపెనీల బ్రాంచీలు మాత్రమే నేటికీ లావాదేవీలను కొనసాగిస్తున్నాయి. 60 కంపెనీలు గతంలో తాము తీసుకున్న చిట్టీల లావాదేవీలు తప్ప కొత్తవి వేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి చిట్స్ కంపెనీలు రూ.340కోట్ల టర్నోవర్‌తో నడుస్తుంటాయి. కరోనా సమయంనుంచి నేటి వరకు చిట్‌ఫండ్స్ తమకు రావాల్సిన డబ్బులను రికవరీ చేసుకుంటున్నాయి తప్ప ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాయి. ఆస్తులు, డిపాజిట్లు సీజ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలనెలా వాయిదాలు కట్టి తిరిగి చెల్లింపులకు నోచుకోని బాధితులు చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో వరంగల్ నగరంలోని పలు పేరుమోసిన చిట్‌పండ్ సంస్థల ఆస్తులు, డిపాజిట్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన డిపాజిట్ల విలువ రూ.76కోట్లు కాగా, రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డబ్బుల కోసం వెళ్లిన ఖాతాదారులకు ‘మా ఆస్తులు, డిపాజిట్లు సీజ్ చేశారు. మేం ఎలా చెల్లించాలో చెప్పండి’ అంటూ నిర్వాహకులు ఎదురు ప్రశ్నించడంతోపాటు కొన్ని సందర్భాల్లో దాడులకు సైతం దిగుతున్నారు. డబ్బులకు జవాబుదారీ ఎవరు? రిజిస్టర్డ్ చిట్‌ఫండ్ కంపెనీల ఏర్పాటు సమయంలో చిట్టీలకు తగ్గట్టుగా వందశాతం డిపాజిట్ రూపంలో జిల్లా చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. ‘కంపెనీ సకాలంలో చెల్లింపులు చేయకపోయినా, బోర్డు తిప్పేసినా మీ డబ్బులకు ఎలాంటి ఢోకాలేదు. డిపాజిట్ల నుంచి చెల్లించే అవకాశం ఉంది’ అని నమ్మబలుకుతారు. దీంతో మన సొమ్ము భద్రత ఉందని భావించి సామాన్య, మధ్య తరగతి ప్రజలు చిట్‌ఫండ్ కంపెనీల్లో చేరుతున్నారు. ఇప్పటికే పలు చిట్‌ఫండ్ కంపెనీలు డబ్బులు చెల్లించకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే మరోవైపు ఇటీవలి కాలంలో తొమ్మిది చిట్‌ఫండ్ కంపెనీలు బోర్డు తిప్పేశాయి. ఆయా బాధితులు అధికారుల దగ్గరికి వెళ్తే.. తాము ఏం చేసే పరిస్థితి లేదు. వారిని పిలిపించి మాట్లాడతాం.. లేదంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే. అక్షర చిట్స్ కార్యాలయం ఎదుట డప్పు వాయిస్తూ నిరసన తెలుపుతున్న బాధితులు (ఫైల్)న్యూస్‌రీల్ -
నీతి ఆయోగ్‌లో గంగారం బ్లాక్‌కు మొదటి ర్యాంక్
గంగారం: దేశంలో ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) మండలాల డెల్టా ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అగ్రస్థానం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండో స్థానంలో నిలిచిందని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అధికారి శ్రీనాథ్ హాల్కే వెల్లడించారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సూచన మేరకు అన్నిశాఖల సమన్వయంతో కేత్రస్థాయిలో ఐదు థీమ్‌లు, 40 సూచికల ద్వారా లోపాలను గుర్తించి మెరుగుపరచడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషీయన్, విద్య, సామాజికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో అభివృద్ధి సాధించడంతో గంగారం మండలం నీతి ఆయోగ్‌లో మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ మూడో త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) డెల్టా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోనే గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన బ్లాక్‌లలో పాలనను మెరుగుపర్చడం, జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడం లక్ష్యమన్నారు. బ్లాక్‌ల పనితీరు, సూచికల పురోగతిపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల సంబంధిత అధికారులు మరింత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని సీతక్క కోరారు. -
సుందరీమణుల సందర్శనకు ఏర్పాట్లు చేయండి
హన్మకొండ అర్బన్: వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు మే 14వ తేదీన వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అందకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాంప్లెక్స్హాల్లో సుందరీమణులు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ప్రావీణ్య మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీ పోటీల్లో పాల్గొననున్న వారిలో 30 మంది వరంగల్ పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహణతో చారిత్రక వారసత్వ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.సమావేశంలో జిల్లా ఖజానాఖాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, నెహ్రూ యువకేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్, పర్యాటక శాఖ జిల్లా మేనేజర్ శివాజీ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్రావు, హనుమకొండ ఏసిపి దేవేందర్‌రెడ్డి, ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు. నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక చేయాలి ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, పరకాల ఆర్డీఓ కె.నారాయణ, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ పాల్గొన్నారు.నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి వరంగల్: గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్‌లో ఎంపీడీఓలతో మంగళవారం వేసవి నీటి ఎద్దడి నివారణ, ఇందిరమ్మ ఇళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి మాట్లాడారు. ఈనెల 30 నుంచి మే 31 వరకు ఉష్టోగ్రతలు పెరగడం వల్ల భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంటుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాలవారీగా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి అధికారులు మరోసారి స్క్రూటీని చేయాలని అదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలను అధికారులు సమన్వయంతో ఆరికట్టాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్‌లోని శ్రీసాయి కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ జిల్లా అధికారి అనురాధ అధ్యక్షతన విత్తన, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, డీలర్లు, వ్యవసాయ అధికారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగుల మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, డీలర్ల అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏసీపీ కిరణ్‌కుమార్, ఏసీపీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మహాసభను విజయవంతం చేయాలిహన్మకొండ: తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల నాలుగో మహా సభను విజయవంతం చేయాలని ఆ ఫ్రంట్ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్ జనగాం కుమారస్వామి పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మహాసభ పోస్టర్‌ను ప్రజాఫ్రంట్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ నాలుగో జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ హరగోపాల్, పాశం యాదగిరి, ప్రొఫెసర్ కాశీం, అనిశెట్టి రజిత, గాదె ఇన్నయ్య తదితరులు ఈ సభలో ప్రసంగిస్తారని వివరించారు. కార్యక్రమంలో గొల్లూరి ప్రవీణ్ కుమార్, బి.రమాదేవి, వెంగళ్‌రెడ్డి, సుధీర్ బాబు, ఇంద్రసేనా, పాపయ్య, ఎన్.రఘుశర్మ, గాదరి ఉప్పలయ్య, సందీప్, కళ్యాణ్, డి.జ్యోతిరమణి, వెంకటేశ్వర్లు, రమేశ్చందర్, కుమార్, రాజేందర్, భిక్షపతి, తిరుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు. -
భాషాపండితులకు సన్మానం
విద్యారణ్యపురి: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందబోతున్న పలువురు భాషాపండితులను టెన్త్ స్పాట్లో సన్మానించారు. మూల్యాంకనం చేపడుతున్న ఫాతిమా హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనంలో భాగస్వాములైన భాషాపండితుల సేవలను కొనియాడారు. రాష్ట్రీయ భాషా పండిత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ భాషా పండితులు అప్‌గ్రేడ్ కోసం కృషి చేయగా పదోన్నతులు లభించాయని గుర్తుచేశారు. ఆ పరిషత్ బాధ్యులు అంకేశ్వరపు కుమారస్వామి, బి. వెంకన్న, అల్లం నర్సయ్య, సదానందం, భిక్షపతి, లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘మత్తు’ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి, హశీష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి, సుమారు రూ.25 లక్షల విలువైన 2 కిలోల హశీష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన సుధాకర్, కోటగిరి సాయివినయ్ అలియాస్ వినయ్ 2023లో తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా డొంకరాయి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ (జైలు) ములుగుకు చెందిన లావుడ్యా రవీందర్‌కు తాను గంజాయి అమ్ముకుంటానని చెప్పాడని పేర్కొంటూ ఇటీవల సుధాకర్‌పై దాడిచేయగా సాయి వినయ్‌పై హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదైంది. అనంతరం సాయి వినయ్‌ను ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించగా అక్కడ హరి, కబీర్ సింగ్ ఇద్దరు పరిచయమై సాయి వినయ్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. మూడు వారాల క్రితం హరి.. సాయివినయ్కి ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని చెప్పాడు. దీనిని సిగరెట్లకు పూసి తాగితే కిక్కు వస్తుందని, ఇది కిలో రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని చెప్పి తన అన్న రామ్మూర్తి ద్వారా ఆ ఆయిల్‌ను వరంగల్ రైల్వే స్టేషన్లో అందజేయగా సాయివినయ్ ఇంట్లో దాచాడు. పది రోజుల క్రితం ములుగు జిల్లా జగ్గన్నపేట అన్నంపల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్ లావుడ్యా రవీందర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన గుగులోత్ హరిసింగ్.. 12 కిలోల ఎండు గంజాయి తీసుకుని సాయి వినయ్‌కు ఇవ్వగా దానిని కూడా తన ఇంట్లో దాచాడు. అనంతరం సాయి వినయ్.. రవీందర్‌కు ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని తెలుపగా రవీందర్, హరిసింగ్ మంగళవారం ఆటోలో సాయివినయ్ ఇంటికి వచ్చారు. అనంతరం ఇద్దరు ఆటోలో, ఒకరు బైక్‌పై వెళ్తుండగా రెడ్డికాలనీ ప్రాంతంలో పోలీసులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా గంజాయి, హశీష్ ఆయిల్ లభించడంతో ముగ్గురిని అరెస్ట్ రిమాండ్‌కు తరలించామని, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 10 కిలోల గంజాయి, 2 కిలోల హశీష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్ సలీమా -
స్టీమ్ టు వందేభారత్..
172 వసంతాల భారతీయ రైల్వే సుదీర్ఘ ప్రయాణంలో కాజీపేట జంక్షన్ ప్రస్థానం ● ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే వారోత్సవాలు ● ప్రతిభ కనబరిచిన వారికి ఏటా అవార్డులు ● కాజీపేట జంక్షన్ నుంచి పలువురు ఎంపికకాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ను ఏప్రిల్ 21, 1973లో ప్రారంభించారు. నాటి నుంచి డీజిల్‌షెడ్ దినదినాభివృద్ధి సాధించి భారతీయ రైల్వేలో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం షెడ్లో 240 ట్రాక్షన్, డీజిల్లోకోల నిర్వహణతో 715 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ షెడ్ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర దేశాల రైల్వేకు డీజిల్‌షెడ్ కార్మికులు వెళ్తుంటారు. డీజిల్‌షెడ్ ఉత్తమ నిర్వహణ షెడ్‌గా రైల్వే జీఎం, రైల్వే బోర్డు, ఇతర రైల్వే అవార్డులను సొంతం చేసుకుంది. కాజీపేట రూరల్ : భారతీయ రైల్వేకు నేటి(బుధవారం)తో 172 వసంతాలు పూర్తయ్యాయి. దేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీన ముంబాయి–థానే మధ్య 34 కి.మీతో నడిపించారు. భారతీయ రైల్వే ప్రస్థానం మొదటి స్టీమ్ లోకోమోటివ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం డిజీల్లోకోమోటివ్, హాల్కోలోకోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్, వందేభారత్ రైళ్లతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం.. కాజీపేట మీదుగా నిజాం స్టేట్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అధికారులు సరుకు రవాణా కోసం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వరకు సింగిల్‌లైన్ నిర్మించారు. 1904లో కాజీపేట రైల్వే స్టేషన్‌ను చిన్న షెడ్డుతో ప్రారంభించారు. తర్వాత కాజీపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. 1917లో కాజీపేటలో రైల్వే స్టీమ్లోకోషెడ్ను ఏర్పాటు చేశారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగంతో 1991లో స్టీమ్లోకోషెడ్ మూతబడింది. 1923లో కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారింది. 1917లో విజయవాడ–బల్హార్షా మధ్య కాజీపేట మీదుగా డబుల్‌లైన్ ఏర్పాటైంది. కాజీపేట–బల్హార్షా మధ్య మూడో రైల్వే లైన్ కూడా పూర్తి కావొస్తుంది. కాజీపేట కేంద్రంగా 1992లో ఎలక్ట్రిక్లైన్ నిర్మాణం జరిగింది. 1970 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేతో సంయుక్తంగా ఆర్టీసీ కండక్టర్ల నియామకం చేపట్టింది. అప్పట్లో వీరి కోసం కాజీపేట జంక్షన్లో క్వార్టర్స్‌ను కూడా నిర్మించారు. కాజీపేట నుంచి రోజూ 170 రైళ్లు రాకపోకలు, 15 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ.సుమారు 12 లక్షల ఆదాయం వస్తోంది. కాజీపేట కేంద్రంగా సుమారు 5 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కాజీపేట యంత్రాంగం బల్హార్షా మాణిక్ ఘర్, విజయవాడ వద్ద కొండపల్లి, కరీంనగర్ రూట్లో జగిత్యాల, సికింద్రాబాద్ రూట్లో భువనగిరి వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీం రీ–డెవలప్మెంట్ వర్క్స్‌తో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా అత్యాధునీకరిస్తున్నారు. కొన్ని నెలల్లో కాజీపేట కేంద్రంగా నిర్మిస్తున్న రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేటలో 2004లో రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం జరిగింది. మొదట ఈ షెడ్ 100 లోకోమోటివ్ల నిర్వహణ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 205 లోకోల నిర్వహణతో సుమారు 420 మంది రైల్వే సిబ్బందితో షెడ్ నిర్వహణ జరుగుతోంది. దినదినాభివృద్ధి చెంది ఈ షెడ్ దక్షిణ మధ్య రైల్వేలో ప్రత్యేక గుర్తింపు సాధించి ఎన్నో రైల్వే అవార్డులు కై వసం చేసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టాలపైకి రైళ్లు.. సాంకేతిక విప్లవం దినదినాభివృద్ధి చెంది స్టీమ్లోకోమోటివ్ నుంచి డీజిల్లోకోమోటివ్, డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్డ్లోకోమోటివ్), తర్వాత ఎలక్ట్రిక్లోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్లో అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్‌లు వచ్చాయి. తర్వాత వందేభారత్ రైలు 130 కేఎంపీహెచ్ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు పెడుతోంది. రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్, సూపర్ఫ్టాస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. 1853, ఏప్రిల్ 16న మొదటి రైలు ప్రారంభమైనప్పటి నుంచి ఏటా రైల్వే వీక్ అవార్డుల వారోత్సవాల పేరిట విధుల్లో ప్రతిభ కనబరిచిన రైల్వే అధికారులు, కార్మికులకు అవార్డులు, నగదు పురస్కార్, ప్రశంస పత్రాలు ప్రదానం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. కాజీపేట జంక్షన్ నుంచి కూడా ఈ ఏడాది పలువురు రైల్వే అవార్డులకు ఎంపికై నట్లు అఽధికారులు తెలిపారు. -
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాళేశ్వరం: హత్యకేసులో నిందితుడికి భూపాలపల్లి జడ్జి నారాయణబాబు రూ.10వేల జరిమానా, జీవితౖఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ ఉండేవాడు. 2018లో కిశోర్ స్నేహితుడు, ఇసుక క్వారీ ఇన్చార్జ్గా పనిచేసే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన చోడవరపు నర్సింహామూర్తి మహదేవపూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన యువతి గోగుల లలితను ప్రేమ వివాహం చేసుకోవడానికి విజయనగరం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువతి తమ్ముడు గోగుల విజయ్ 2018 ఆగస్టు 26న నర్సింహామూర్తికి సహకరించాడనే కోపంతో కిశోర్‌ను గొడ్డలిలో నరికి చంపాడు. ఈ విషయమై మృతుడి తండ్రి సంగిశెట్టి దుర్గారావు మరుసటి రోజు 27న మహదేవపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్సై డి. విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా అప్పటి మహదేవపూర్ సీఐ రంజిత్ కుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత సీఐగా వచ్చిన అంబటి నర్సయ్య నిందితుడిపై చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై వివరించారు. తీర్పు వెలువరించిన జడ్జి నారాయణబాబు -
ప్రసన్నాంజనేయస్వామికి తమలపాకులతో అలంకరణ
హన్మకొండ అర్బన్: హనుమకొండ పద్మాక్షికాలనీలోని హనుమత్గిరి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం స్వామిని తమలపాకుల మాలతో అలంకరించినట్లు అర్చకుడు ఆరుట్ల రామాచార్యులు తెలిపారు. అనంతరం స్వామివారికి హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. మధ్యాహ్నం దీక్ష స్వీకరించిన స్వాములకు భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీహనుమాన్ దీక్ష సేవాసమితి అధ్యక్షుడు గందె కృష్ణ, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్, సభ్యులు కరు దశరథ్కుమార్, మాదాసు మొగిలయ్య, గండ్రతి సుధాకర్, సత్యం, సీతా సమ్మయ్య, శంకర్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కె.పట్టాభిరామారావువరంగల్ లీగల్: హనుమకొండ ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సీహెచ్.రమేశ్‌బాబు మంగళవారం భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అయన స్థానంలో రంగారెడ్డి జిల్లా మొదటి ఆదనపు జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు రానున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.నారాయణబాబు వరంగల్ జిల్లా కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బదిలీపై వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎండీ అబ్దుల్ రఫీ, జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 23 వరకు తమ నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముగిసిన ‘టెన్త్ స్పాట్’విద్యారణ్యపురి: కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో ఈ నెల 7వ తేదీనుంచి ప్రారంభమైన టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మంగళవారం సాయంత్రం ముగిసింది. అన్ని సబ్జెక్టులు, ఒకేషనల్ కోర్సుల పరీక్షలవి కలిపి 2,27,403 జవాబుపత్రాలు వచ్చాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి ఎస్ఏలు, ఎస్జీటీలను స్పాట్ విధులకు కేటాయించారు. సీఈలుగా 113మంది, ఏఈలుగా 676మంది ఎస్ఏలు, 224మంది ఎస్జీటీలు స్పెషల్ అసిస్టెంట్లుగా విధుల్లో పాల్గొన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి క్యాంపు ఆఫీసర్‌గా, 8మంది పీజీహెచ్ఎంలు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ నెల 30న లేదా మే మొదటివారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. క్యాంపస్ ఇంటర్వ్యూలు రామన్నపేట : వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమి టెడ్, హిందుస్థాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అభ్యర్థులు అర్హులుగా, 18 నుంచి 24 సంవత్సరాల్లోపు ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ప్రాంగణ నియామకాలకు 65 మంది విద్యార్థినులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. డాక్టర్ రామకృష్ణకు దళితరత్న అవార్డుహన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డు అందజేసి సత్కరించింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో రామకృష్ణకు అవార్డును ప్రదానం చేసింది. తోలు పరిశ్రమపై రామకృష్ణ చేస్తున్న పోరాటం, దళితులకు మంచి చేయాలన్న ఆశయాన్ని గుర్తించి అవార్డు అందజేసినట్లు రామకృష్ణ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి జీఓ విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని, దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. -
17 నుంచి ‘భూభారతి’ సదస్సులు
హన్మకొండ అర్బన్: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో భూ భారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్టం గెజిట్ ప్రతులు, జీఓ పత్రాలు ప్రతి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వద్ద తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈనెల 17 నుంచి ప్రతి మండలంలో భూభారతి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో నిర్వహించే సదస్సులకు స్థానిక ఎమ్మెల్యేతోపాటు భూమి హక్కులకు సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తులను, మీ సేవ కేంద్రాల ఆపరేటర్లను ఆహ్వానించాలని సూ చించారు. సందేహాల నివృత్తికి తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. నూతన చట్టంలోని పలు అంశాలపై పరకాల, హనుమకొండ ఆర్డీఓలు డాక్టర్ నారాయణ,రాథోడ్ రమేశ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. అవగాహన కల్పించాలి : వరంగల్ కలెక్టర్ సత్యశారద వరంగల్: ప్రభుత్వం అమలు చేయనున్న భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో భూభారతి చట్టంపై తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో ఈ చట్టంపై అవగాహన సదస్సులకు షెడ్యూల్ రూపొందించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రచారం నిర్వహించాలని జిల్లా పౌరసంబంధాల అధికారి అయూబ్అలీని ఆదేశించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి హెల్ప్‌లైన్ నంబర్ 040293 13999 ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలపై సమగ్రమైన నోట్స్ తయారు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య కలెక్టరేట్లో అధికారులకు అవగాహన -
మే 1 నుంచి వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు
వరంగల్ స్పోర్ట్స్: పట్టణ పరిధిలో వేసవి క్రీడాశిక్షణ శిబిరాలను మే 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్‌కుమార్ తెలిపారు. శిబిరాల నిర్వహణ, క్రీడాకారుల నమోదు అంశంపై మంగళవారం హనుమకొండ ఇండోర్ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో కోచ్‌లతో డీవైఎస్ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ శిబిరాలకు విద్యార్థులను తీసుకొచ్చేలా ఒక్కొ కోచ్‌కు 10 పాఠశాలలను అప్పగించినట్లు తెలి పారు. ఆయా కోచ్‌లు పాఠశాల హెచ్ఎంలు, ప్రిన్సి పాళ్లతో మాట్లాడి నాలుగు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు శిబిరాల్లో పాల్గొనేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులను ఇండోర్ స్టేడియంలో అందజేయాలని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా, వేసవి సెలవులను వృథా చేయకుండా ఆసక్తి గల క్రీడాంశాల్లో శిక్షణ అందించేలా చొరవ చూపాలని తల్లిదండ్రులను కోరారు. సమావేశంలో కోచ్‌లు శ్రీమన్నారాయణ, వెంకటేశ్వర్లు, విష్ణువర్ధన్, అఫ్జల్, జీవన్‌గౌడ్, ప్రభుదాస్, శంకర్, రమేశ్, ప్రశాంత్, నరేందర్, నవీన్‌కుమార్, రమేశ్ పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా రాజేందర్ ఎన్నిక
హన్మకొండ చౌరస్తా: ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఎన్నికయ్యారు. హనుమకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీఓస్ భవన్లో టీఎన్జీఓ, టీజీఓ, ఉపాధ్యాయ, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా రాజేందర్, కన్వీనర్‌గా టీజీఓ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, కోకన్వీనర్‌గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా టీజీఓ నాయకుడు ఎ.జగన్మోహన్రావుతోపాటు మిగిలిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, శ్రీహరి, శ్రీనివాస్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, సర్వర్ హుస్సేన్, శ్యాంసుందర్, గోపాల్‌రెడ్డి, రవీందర్, పెండెం రాజు, రాంబాబు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె నోటీస్
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కేయూ క్యాంపస్: తమను రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కాంట్రాక్టు ప్రొఫెసర్స్ కోఆర్డినేషన్ బాధ్యులు మంగళవారం కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డికి సమ్మెనోటీస్ అందజేశారు. తొలుత కొంతసేపు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేయూ కోఆర్డినేషన్ బాధ్యులు శ్రీధర్‌కుమార్‌లోథ్, నిరంజన్, సాధు రాజేశ్, మాదాసి కనకయ్య, జూల సత్య మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 యూని వర్సిటీల్లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈనెల 19 నుంచి సమ్మెకు వెళ్తున్నారని తెలిపారు. ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా తలపెట్టామని పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోఆర్డినేషన్ బాధ్యులు బి. సతీశ్, సంకినేని వెంకట్, ఫిరోజ్‌పాషా, ఆశీర్వాదం, అరూరి సూర్యం, గడ్డం కృష్ణ, టి.నాగయ్య, రఘువర్ధన్‌రెడ్డి, వినీత, శ్రీదేవి, సునీత, సుచిరితపాల్, భాగ్య, ఉషాకిరణ్, వాణిశ్రీ, సదాశివ్, ప్రసాద్, వెంకటేశం, సాహితి, చందూలాల్, సత్యనారాయణ పాల్గొన్నారు. కాగా, యూనివర్సిటీలో వివిధ పరిపాలన పదవులు నిర్వహిస్తున్న పలువురు కాంట్రాక్టు ప్రొఫెసర్లు తమ పదవులకు రాజీనామాలు చేసి అధికారులకు సమాచారం అందించారు.న్యూస్‌రీల్ -
టాక్సీ అడ్డా..
కళాభవనం..వరంగల్: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్ నగరంలో మంజూరు చేసిన మల్టీపర్పస్ కల్చ రల్ కాంప్లెక్స్ (మినీ రవీంద్రభారతి) నిర్మాణ స్థలం ప్రస్తుతం టాక్సీల స్టాండ్‌గా మారింది. 24–05–2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరు చేయగా.. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో హైదరాబాద్‌కు చెందిన శ్రీకో సంస్థ ప్రాజెక్టు పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటక శాఖ నుంచి కళాభవనం నిర్మాణానికి కోటి రూపాయల నిధులు విడుదల చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్తోపాటు పిల్లర్లు, జనరేటర్ రూం నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.69.88 లక్షలను చెల్లించారు. నిధులు విడుదల అయితే తప్ప మిగిలిన పనులు చేపట్టేది లేదని కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం నిర్మాణ దశలోనే ఉంది. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తిగా ఉన్న పిల్లరు ఆకాశాన్ని చూస్తున్నాయి. నిధులు లేని కారణంగానే పనులు పూర్తిచేయలేక పోతున్నామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిధులు తేవడంలో ప్రజాప్రతినిధుల విఫలం రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణ వ్యయం సుమారు రూ.100 కోట్లకు పెరిగింది. వరంగల్ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించి పూర్తి చేసి ప్రారంభించుకున్నారు. రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో జిల్లాతోపాటు తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు వస్తున్న వందల కోట్ల రుపాయలతో వృథా పనులు చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు శంకుస్థాపనలు.. వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలో మల్టీపర్సస్ కల్చరల్ కాంప్లెక్స్ (కళాభవనం)కు ఇప్పటికీ మూడుసార్లు శంకుస్థాపనలు చేసినా పూర్తికాలేదు. మినీ రవీంద్రభారతిని పూర్తిచేయాలని జిల్లాలోని కళాకారులు పలుమార్లు అధికారులు, నాయకులను కోరినా పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేయకపోవడంతో కళాభవనం నిర్మాణం బేస్‌మెంట్‌తో ఆగిపోయింది. హామీలకే హరిత హోటల్.. కళాభవనం స్థలంలో హరిత హోటల్ నిర్మించాలని మూడేళ్ల క్రితం అప్పటి తూర్పు ఎమ్మెల్యే నరేందర్ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ తూర్పులో కళాభవనం నిర్మించాలని సాంస్కృతిక కళాకారులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కళాభవనంతోపాటు హరిత కాకతీయ హోటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్‌లో లేని ఆడిటోరియాలు.. వరంగల్, హనుమకొండ జిల్లాల ఏర్పాటుతో ఆర్ట్స్ కళాశాల, నేరెళ్ల వేణుమాధవ్, పోతన ఆడిటోరియాలతోపాటు ఇటీవల రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ తూర్పులో ఆడిటోరియాలు లేకుండా పోయాయి. జిల్లా సమీక్షలు హనుమకొండ లేదా ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మెగా జాబ్‌మేళాను వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు ఫంక్షన్హాల్లో నిర్వహించారు. స్థలం సరిపోక వచ్చిన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళాభవనం పూర్తయితే జిల్లాలో తమకు ఆదరణ లభిస్తుందనే ఆశతో జిల్లాలోని కళాకారులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఈ భవన నిర్మాణ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నా యి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఈభవన నిర్మాణం కోసం కృషిచేసిన ఎమ్మెల్సీ సారయ్య సైతం అదే పార్టీలో ఉన్నారు. ఇప్పటికైనా కళాభవనం నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం.. కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా వరంగల్‌లో ప్రత్యేకంగా కళావేదిక లేకపోవడం, సంస్థలు రాకపోవడంతో కళాకారులు దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు మంజూరు చేయించి కళాభవనం నిర్మాణాన్ని పూర్తిచేయించాలి. – ఆడెపు రవీందర్, శ్రీబాలాజీ క్రియేషన్స్ అధినేత నిధులు లేక వరంగల్‌లో పూర్తికాని మినీ రవీంద్రభారతి 12 సంవత్సరాలుగా పిల్లర్లకే పరిమితం తూర్పు నియోజకవర్గ నాయకుల నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు -
ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన అంబేడ్కర్
ఖిలావరంగల్: దేశ ఔన్నత్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతూ.. రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత రూప శిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని మేయర్ గుండు సుధారాణి, స్థానిక కార్పొరేటర్ సొమిశెట్టి ప్రవీణ్‌తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకం అన్నారు. పౌరుడి నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ ఫౌండేషన్ దాత మెరుగు అశోక్, విగ్రహ దాత రేణుకుంట్ల రవీందర్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పొలేపాక నరేందర్, విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివ, నాయకులు దిడ్డి కుమారస్వామి, మీసాల ప్రకాశ్, కొత్తపెల్లి శ్రీనివాస్, శామంతుల శ్రీనివాస్, గడ్డం రవి, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్ పాల్గొన్నారు. సమసమాజ స్వాప్నికుడు.. వరంగల్: సమసమాజ స్వాప్నికుడు బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. వరంగల్ కాశిబుగ్గ జంక్షన్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి కొండా సురేఖ, బల్దియా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడతూ.. అంబేడ్కర్ ఆలోచనలు, ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమేనన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు -
నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు చనిపో..
వర్ధన్నపేట : ప్రస్తుత సమాజంలో రక్తసంబంధాలు మంటగలుస్తున్నాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్తి కోసం కన్న తండ్రి అని చూడకుండా కుమారుడు, కోడలు నిత్యం వేధింపులకు గురిచేసి అతడు బలవన్మరణానికి పాల్పడేలా కారణమయ్యారు. పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తుండగా దీనికి ఆ వృద్ధుడు ససేమిరా అంటున్నాడు. దీంతో మానసికంగా హింసిస్తున్నారు. నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు మందు తాగి చనిపో అని కోడలు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధుడు గడ్డిమందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కడారిగూడెంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాంపల్లి మల్లేశం(93)కు నలుగురు సంతానం. చిన్న కుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్ర.. గత కొద్ది రోజులుగా ఆస్తి కోసం నిత్యం వేధిస్తున్నారు. మల్లేశం పేర ఉన్న పొలం, ఇంటి స్థలాలు, ఇల్లు తమపేర చేయాలని మానసిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఎలేంద్ర ‘నువ్వు ఉండి ఏం ప్రయోజనం లేదు.. మందు తాగి చనిపో’ అని మామ మల్లేశంను వేధించింది. దీంతో మల్లేశం ఇంటి వద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన రెండో కుమారుడు చంద్రమౌళి వెంటనే 108లో ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం రాత్రి 8.20 గంటలకు మల్లేశం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కూతురు అమరావతి విజయ ఫిర్యాదు మేరకు చిన్నకుమారుడు కోటేశ్వర్, అతడి భార్య ఎలేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ సోమవారం తెలిపారు. ఆస్తి కోసం తండ్రికి కొడుకు, కోడలు మానసిక వేధింపులు ● మనస్తాపంతో గడ్డి మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య ● కడారిగూడెం గ్రామంలో ఘటన ● పోలీసులకు మృతుడి కూతురు ఫిర్యాదు.. కేసు నమోదు -
కులనిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్
హన్మకొండ: సమాజంలో అంటరానితనం, కుల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయం ఆవరణలోని స్పోర్ట్స్ క్లబ్లో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని సీఎండీ ప్రారంభించారు. అంతకు ముందు అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రాజ్యాంగం మనుగడలో ఉన్నంతకాలం అంబేడ్కర్ పేరు చిర స్థాయిలో నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎ.ఆనందం, కార్యదర్శి ఎన్.కుమారస్వామి, ఫైనాన్స్ సెక్రటరీ నర్సింహారావు, టీజీ ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, వి.తిరుపతి రెడ్డి, సీజీఆర్ఎఫ్ నిజామాబాద్ చైర్మన్ ఇ. నారాయణ, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, డి.ఈలు విజేందర్ రెడ్డి, సామ్యనాయక్, జి.సాంబరెడ్డి, ఎస్.మల్లికార్జున్, భిక్షపతి పాల్గొన్నారు.● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు కలిసి రావాలి
హన్మకొండ: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి రోజున ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడంతోపాటు గంజాయి నిర్మూలనకు కృషి చేద్దామన్నారు. సోమవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ముందుగా అంబేడ్కర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే నాయిని, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్, అతిథులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్‌తో పిల్లలుతమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఇక్కడినుంచి వీటి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డీఈ శ్రీలత, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నవీన్ కుమార్, డీపీఆర్ఓ గంగవరపు వెంకట భానుప్రసాద్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జగన్మోహన్, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ అంకేశ్వరపు రాంచందర్ రావు, వైస్ చైర్మన్ సుకుమార్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, చుంచు రాజేందర్, సింగారపు రవి ప్రసాద్, ఈవీ శ్రీనివాస్ రావు, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి -
ఎంజీఎంలో ఎక్స్‌రే కష్టాలు..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణ పేద రోగుల పెద్దది క్కు ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక్క సమస్య తలెత్తుతూనే ఉంది. ఒక రోజు మందులు ఉండవు.. మరో రోజు వైద్యులు రారు. అన్ని బాగున్నాయి.. అనుకున్న క్షణమే పరికరాల్లో సాంకేతిక లోపమంటూ సేవలు అందవు.. ఇలా ఆస్పత్రిలో ఏ విభాగంలో చూసినా ఏదో సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఫలితంగా ఎంజీఎంకు వస్తే పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందుతాయా అనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఈక్రమంలో మూడు రోజుల నుంచి ఆస్పత్రిలో అత్యంత కీలక విభాగమైనా క్యాజు వాలిటీలో ఎమర్జెన్సీ ఎక్స్‌రే సేవలు నిలిచాయి. ఈ సేవలను వెంటనే పునరుద్ధరణ చేయాల్సిన అవసరమన్నా రోజులు తరబడిగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్షతగాత్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక పక్క ప్రమాదంలో విరిగిన కాళ్లు, చేతులతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి వస్తే చికిత్స కోసం ఎక్స్‌రే పనిచేయకపోవడంతో ఇక్కడి నుంచి నుంచి ఓపీ బ్లాక్‌లో ఉన్న ఎక్స్‌రే గదికి క్షతగాత్రులను తరలించే సమయంలో వినబడుతున్న ఆర్తనాదాలు అందరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. చికిత్స కోసం తిప్పలు పడాల్సిందే.. ఎమర్జెన్సీ ఎక్స్‌రే పరికరం పనిచేయకపోవడంతో ఈ సేవల కోసం క్షతగాత్రుల బంధువులు తిప్పలు పడాల్సి వస్తోంది. క్షతగాత్రుడిని క్యాజువాలిటీ నుంచి ఓపీ బ్లాక్‌లోని 92 గదికి తరలించేందుకు వీల్ చైర్స్, స్ట్రెచర్స్ దొరకబట్టడానికి కుస్తీ పట్టాల్సిందే. ఆస్పత్రిలోని 92 గది ఎక్కడ అని తెలుసుకునేందుకు మరో ప్రయత్నం చేయాలి. చివరకు అక్కడికి వెళ్లాక ఒకే ఒక్క ఎక్స్‌రే పరికరం పనిచేస్తుండడంతో సేవల కోసం ఎదురుచూడాలి.. ఆ సమయంలో క్షతగాత్రుల రోదనలు చూడలేక సిబ్బందితో వా గ్వాదానికి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంజీఎంలో అత్యవసర సేవల కోసం వచ్చిన క్షతగా త్రుల బాధలు నిత్యం పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారు. ఉన్న ఒకే ఒక్క ఆర్ఎంఓ అన్ని పనులు చక్కబెట్టలేక చేతులేతేస్తున్న దుస్థితి. ఇప్పటికై నా ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పందించి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించాలని రోగులు వేడుకుంటున్నారు. ఆస్పత్రిలో నిలిచిన ఎమర్జెన్సీ ఎక్స్‌రే సేవలు మూడు రోజులుగా ఆ గదికి తాళం గాయాలతో క్షత్రగాత్రుల నరకయాతన, ఆర్తనాదాలు పట్టించుకోని ఆస్పత్రి ఉన్నతాధికారులుమరమ్మతులు చేస్తాం..ఎమర్జెన్సీ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎక్స్‌రే సేవలను 92 గదిలోని డిజిటల్ ఎక్స్‌రే ద్వారా అందిస్తున్నాం. ఎమర్జెన్సీ విభాగంలో ఎక్స్‌రే పరికరానికి మరమ్మతులు చేపడుతాం. –కిశోర్, సూపరింటెండెంట్ -
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు..
●వివాహిత నవ్య బలవన్మరణంపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ రోడ్లో ఆదివారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై ఆమె తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ సోమవారం రాత్రి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బ్రాహ్మణ బజార్‌కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య (21)ను ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన తాడూరి భిక్షమాచారి, సత్యవతి దంపతుల కుమారుడు రవిచంద్రాచారికి ఇచ్చి గతేడాది డిసెంబర్ 26వ తేదీన వివాహం జరిపించారు. వివాహం సమయంలో రూ.50 వేలు కట్నం ఇచ్చారు. భర్త రవిచంద్రాచారి, అత్తామామ భిక్షమాచారి, సత్యవతి తరచూ అదనపు కట్నం కోసం నవ్యను వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ క్రమంలో పలుమా ర్లు పంచాయితీలు జరగగా అదనపు కట్నం డబ్బులు తర్వాత ఇస్తామని ఆపుకుంటూ వచ్చారు. ఆది వారం సాయంత్రం నవ్య తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడుతున్నానని పక్కింటి వారికి చెప్పగా వారు హు టాహుటిన వచ్చి భర్త రవిచంద్రాచారికి చెప్పారు. అప్పటికే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఉత్తరాచారి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కు టుంబీకులకు అప్పగించారని సీఐ తెలిపారు. నేడు నగరంలో విద్యుత్ ఉండని ప్రాంతాలు హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ డీఈ జి.సాంబరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంచరకుంట, కుడా కార్యాలయం, చింతల నర్సింహుల్ బుక్ స్టాల్ ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, శాంతినగర్, సుబేదారి, పోస్టల్ కాలనీ, ఎకై ్సజ్ కాలనీ, అదాలత్ కూడలి, అడ్వొకేట్స్ కాలనీ, హంటర్ రోడ్ ప్రాంతం, జూ పార్కు, వడ్డెపల్లి, విజయపాల్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫాతిమానగర్ ప్రాంతాల్లో ఉదయం 8 నంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. వరంగల్‌లో.. వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఏఎస్ఎం కళాశాల, దుర్గేశ్వర స్వామి దేవాలయం ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. పిన్నవారి వీధి ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్, విశ్వకర్మ వీధి, జేపీఎన్ రోడ్, ఎల్లంబజార్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వివరించారు. -
కూలీకి వస్తూ కానరానిలోకాలకు..
టేకుమట్ల: కూలీకి వస్తూ ఓ మహిళ కానరానిలోకాలకు వెళ్లింది. హార్వెస్టర్ వెనక్కి వస్తుండగా దాని కింద పడి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు వరి పంటలో బెరుకుల తీసేందుకు ఆటోలో బూర్నపల్లికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆటో ముందు హార్వెస్టర్ వెళ్తుండగా.. ఎదురుగా ఆర్టీసీ బస్సు వస్తోంది. దీంతో హార్వెస్టర్ ఆపరేటర్ బస్సుకు దారి ఇచ్చేందుకు వెనక్కి తీస్తున్నాడు. ఈ క్రమంలో హార్వెస్టర్ వెనుక ఉన్న ఆటోను డ్రైవర్ కూడా వెనక్కి తీస్తుండగా అందులో ఉన్న ఇద్దరు మహిళలు భయంతో కిందికి దిగారు. అయితే హార్వెస్టర్ వారిపైకి ఎక్కింది. ఈ ఘటనలో దాసరి కనుకమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందగా, మరో కూలీ వసంతకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వసంతను చికిత్స నిమిత్తం వరంగల్ తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై దాసరి సుదాకర్ ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. అనంతరం కనుకమ్మ మృతదేహాన్ని చిట్యాల ఆస్పత్రి మార్చురీకి తరలిచారు. కన్నీరుమున్నీరైన కూలీలు.. క్షణం ముందు ప్రాణంతో అందరి మధ్య ప్రయాణించిన కనుకమ్మ రెప్పపాటు క్షణంలో విగతజీవిగా మారడంతోపాటు మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా చలించిన తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. సాయంత్రం కూలీకి రాకున్నా బతికేదేమో అని విలపించారు. ప్రాణాలు తీస్తున్న సాయంత్రం కూలీ.. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉదయం, సాయంత్రం రెండు పూటల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మండలంలోని రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మహిళా కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వెళ్లగా లారీ అదుపు తప్పి మీదపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే మొట్లపల్లి నుంచి కూలీలు సాయంత్రం వేళ పొలంలోని బెరుకులు తీసేందుకు వస్తుండగా హార్వెస్టర్ మృత్యుశకటమై కనుకమ్మను కబలించింది. హార్వెస్టర్ కింద పడి మహిళా కూలీ మృతి ఒకరికి తీవ్ర గాయాలు బూర్నపల్లి శివారులో ఘటనబావిలోడి వ్యక్తి.. నెక్కొండ: వ్యవసాయ బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని వెంకటాపురంలో జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాళ్లబండి పెద్ద రాజయ్య (56) ఈనెల 13న సాయంత్రం తన పొలం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో గ్రామానికి చెందిన కొత్తపల్లి వీరారావు వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబీకులు రాజయ్య కోసం వెతకగా సోమవారం సాయంత్రం బావిలో శవమై తేలి కనిపించాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై పేర్కొన్నారు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నామని ఎస్సై తెలిపారు. -
మోటార్లతో నీటిని తోడేశారు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లో ఏ రైతును కదిలించిన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదివా రం కురిసిన భారీ వర్షంతో 20వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసి పోగా, వరద వెళ్లే దారిలేక ధాన్యం రాశుల పక్కనే నిలిచి ముంచేసింది. నీటిలో ముని గిన ధాన్యాన్ని బయటకు తీసేందుకు రైతులు మో టార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన రైతు దండబోయిన రజిత కుటుంబం ఐదు ఎకరాలు సా గు చేయగా, 200 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రభు త్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు నా లుగు రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చారు. తేమ పేరుతో కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షం 200 బస్తాలను ముంచేసింది. 20 బస్తాలు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి 7.30 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు వరకు 180 బస్తాల ధాన్యం నీటిలోనే ఉండిపోయింది. దీంతో రైతులు ఇంట్లో వినియోగించే నీటి మోటారును తీసుకొచ్చి కుటుంబమంతా నాలుగు గంటల పాటు కష్టపడి తోడేశారు. ఒక్క అధికారి వచ్చి పలకరించలేదని, టార్పాలిన్ కవర్లు సైతం ఇవ్వలేదని మహిళా రైతు రజిత.. కన్నీరుమున్నీరుగా విలపించారు. 12 గంటలపాటు తడిసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉందని ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు. జనగామ మార్కెట్ ఐకేపీ సెంటర్లో రైతుల గోస -
పెళ్లి బాధ.. చితికి చేర్చింది..
దుగ్గొండి: ఉన్నత విద్యనభ్యసించాడు. ఎంతకూ పెద్ద ఉద్యోగం రాలేదు. చివరికి ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. వచ్చే వేతనం ఖర్చులకూ సరిపోవడం లేదు. మంచి ఉద్యోగం లేదని వచ్చిన పెళ్లి సంబంధాలు రద్దువుతున్నాయి. దీంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంగోళి రాజేశ్వర్‌రావు, పద్మ దంపతుల కుమారుడు వేణు(30) బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించి చివరికి తక్కువ వేతనానికి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అయితే వేతనం ఖర్చులకు సరిపోకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఈ విషయం తండ్రికి చెప్పడంతో వ్యవసాయం చేసుకుందామని చెప్పి ఓదార్చాడు. వ్యవసాయ పనులు చేయలేక పోయాడు. ఏ పనిచేయలేక తల్లిదండ్రులకు భారంగా మారానని మదనపడుతున్నాడు. ఇదే తరుణంలో వేణుకు అనేక పెళ్లి సంబంధాలు చూశారు. వేణు ఉద్యోగ వివరాలు తెలుసుకున్నాక పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఇలా మూడు సంబంధాలు రద్దు అయ్యాయి. ఇక తనకు పెళ్లికాదని మనస్తాపంతో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిన అనంతరం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన మృతుడి అమ్మమ్మ లచ్చమ్మ దారి వెంట వెళ్తున్న వారిని పిలిచి విషయం చెప్పి తలుపులు తీయించింది. అప్పటికే వేణు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. చేతికందొచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాజేశ్వర్‌రావు, పద్మ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధం కుదరడం లేదని యువకుడి బలవన్మరణం -
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
వరంగల్: నర్సరీల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి నగర పరిధిలోని 18 వ డివిజన్ క్రిస్టియన్ కాలనీలోని నర్సరీని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు, నర్సరీని సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బల్దియా పరిధి 9 నర్సరీల్లో 10 లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వర్షాకాలంలోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఓ లక్ష్మారెడ్డి, హార్టికల్టర్ అసిస్టెంట్ ప్రిన్సి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులైన యువతకు ఆర్వీవై ఒక మంచి అవకాశం నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాసం(ఆర్‌వైవీ) పథకం మంచి అవకాశమని కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అన్నారు. సోమవారం వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించారు. సెలవు రోజున ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరిస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆదివారం, సోమవారం స్వీకరించిన దరఖాస్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చివరి రోజైన సోమవారం సాయంత్రం 5 గంటల వరకు జీడబ్ల్యూఎంసీ పరిధిలో 10,254 దరఖాస్తులు స్వీకరించినట్లు కమిషనర్ తెలిపారు. బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే -
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అందరివాడు
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి● వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య హన్మకొండ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అందరి వాడని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ పి.ప్రావీణ్య, నగర మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి శ్రీలత, రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ ఖుస్రు పాషా, మాజీ మేయర్ ఎరబ్రెల్లి స్వర్ణ, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తమకు ఎంపీ, ఎమ్మెల్యేలుగా అవకాశాలు లభించాయన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని గ్రామాల్లోని చివరి ఇంటి వరకూ తీసుకెళ్తున్నట్లు తెలిపారు.