
మోసగించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 1,200 ఎకరాల్లో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్‌ఎస్ రజతోత్స సభ ఏర్పాట్లను ఆమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, నాయకులు నాగుర్ల వెంకన్న, భరత్‌కుమార్, రాకేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చితకిలపడిపోయిందన్నారు. నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానంద, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్, మండల సురేందర్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, మాజీ సర్పంచ్‌లు కుర్ర సాంబమూర్తి, దుగ్యాని సమ్మయ్య, జూపాక జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి
సత్యవతి రాథోడ్