breaking news
Hanamkonda District Latest News
-
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్..
● వ్యాపారి మృతి.. మరొకరికి గాయాలు ● కేయూ క్రాస్ సమీపంలో ఘటన హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పి ఆగి లారీని ఢీకొన్న ప్రమాదంలో ఓ కిరాణ వ్యాపారి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం కాకతీయ యూనివర్సిటీ క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన బొడిగే సదానందం(53) కిరాణంతో పాటు కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం కూరగాయలు కొనుగోలుకు బైక్‌పై అదే గ్రామానికి చెందిన ఎర్ర సురేందర్‌తో కలిసి నగరానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కేయూ క్రాస్ సమీపంలో చేరగానే బైక్ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో సదానందం అక్కడికక్కడే మృతి చెందగా, సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. -
సహాయక చర్యలు చేపట్టాలి
రామన్నపేట: రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కార్పొరేషన్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, ప్రైస్ దిలార్డ్ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు మేయర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన కాలనీల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు పోలీసుల సహకారంతో తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా మంచినీరు, పారిశుద్ధ్యం, దుప్పట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్పొరేషన్ డీఆర్ఎఫ్ మూడు బోర్డ్స్ రూఫ్స్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉన్నాయని, వీరితో పాటు అపదమిత్ర, ఎస్డీఆర్ఎఫ్ బృందం వంద మందితో సిద్ధంగా ఉన్నారని వారి సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రధాన కార్యాలయంలో 24 గంటల పాటు ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1980 మొబైల్ నెంబర్ 97099 99676 అత్యవసర సహాయార్థం సంప్రదించాలని మేయర్ కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ తదితర విభాగ అధికారులు పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయాల సందర్శన.. టెలికాన్ఫరెన్స్ సమీక్షా ఆనంతరం మేయర్ సుధారాణి మంగళవారం రాత్రి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోతన నగర్, మర్వాడీ భవన్లో, కరీమాబాద్ బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి వరద బాధితులు, నిర్వాసితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులకు భరోసా కల్పించి వర్షం తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మేయర్ వారికి హామీ ఇచ్చారు. మరో 72గంటల పాటు భారీ వర్షాలు.. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి -
సగానికిపైగా డిగ్రీ సీట్లు ఖాళీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో సీ ట్లు ఎక్కువ శాతం భర్తీకాగా మరికొన్ని కళాశాలల్లో తక్కువ భర్తీ అయ్యాయి. పలుకోర్సులకు డిమాండ్ ఉండగా కొన్నింటికీ అంతగా ఆదరణ లభించడడం లేదు. మూడు దశల్లోనూ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు కల్పించారు. ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలు కల్పించగా స్పెషల్ ఫేజ్‌లో సీట్లు కేటాయించిన వారికి రిపోర్టింగ్ కూడా మంగళవారం ముగిసింది. యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్, అటానమస్ డిగ్రీ కాలేజీలు 211 ఉన్నాయి. అందులో బీఏ, బీఎస్సీ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీబీఏ రిటైల్ పలు కోర్సులు కంప్యూటర్ బేస్డ్ తో కూడా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇందులో 97వేల 930సీట్లు ఉన్నాయి. మూడుదశల్లోనూ, స్పెషల్ ఫేజ్‌లో కలిపి ఇందులో సోమవారం వరకు 40,585 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అక్కడక్కడ కాలేజీల్లో వేళ్లమీద లెక్కపెట్టేంత మంది అడ్మిషన్లు మినహా ఇంకా సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండబోతున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు.. విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు కంటే వృత్తివిద్య, ఉపాధి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, పారా మెడికల్ తదితర కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులు డాటా సైన్స్ లైఫ్ సైన్సెస్‌తో కూడిన త దితర కోర్సులున్నప్పటికీ అంతగా ఆసక్తి చూపడంలేదు. డిగ్రీ విద్యార్థుల కోసం కొన్ని సంవత్సరాలు గా కేయూ పరిధిలో 30 వరకు గురుకుల డిగ్రీ కళా శాలలు కూడా ఏర్పాటై కొనసాగుతున్నాయి. కొందరు విద్యార్థులు గురుకుల డిగ్రీకళాశాలల్లోను నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో కూడా ప్ర భుత్వ కళాశాలల అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో మొ త్తం 1,770 సీట్లకు 1,110 మాత్రమే భర్తీ అయ్యా యి. పింగిళి మహిళా కళాశాలలో 1,200 సీట్లకు 706 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. అలాగే ఇతర డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీలకే.. డిగ్రీలో దోస్త్ ద్వారా సీట్లు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం గడువు ముగిసింది. ఆ తరువాత ఈనెల 13,14 తేదీల్లో రెండు రోజులపాటు ఇప్పటివరకు ఏఏ కళాశాలల్లో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నేరుగా తమ కళాశాలల్లో వేకెన్సీ సీ ట్లను భర్తీ చేసుకునే వీలు కల్పించింది. అయితే ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీచేసుకునేందకు అవకాశం కల్పించాలని ఆ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, ఇతర బాధ్యులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.అవకాశం ఇస్తారా లేదా అని చూడాల్సిందే.కేయూ పరిధిలో మొత్తం డిగ్రీ కళాశాలలు : 211 మొత్తం సీట్లు : 97,930భర్తీ అయిన సీట్లు : 40,585కేటాయింపులు, భర్తీ సీట్ల వివరాలు.. కేయూ పరిధిలో మొదటిదశలో డిగ్రీ కళాశాలలకు 10,652 సీట్లు కేటాయించగా 5,289 మంది రిపోర్టు చేశారు. రెండో దశలో 9,732 సీట్లు కేటాయించగా అందులో 6,550 సీట్లు భర్తీ అయ్యాయి. మూడోదశలో 21,373 సీట్లు కేటాయించగా అందులో 17,019 సీట్లు భర్తీ అయ్యాయి. స్పెషల్ ఫేజ్‌లో 12,916 సీట్లు కేటాయించగా అందులో 11,727 మొత్తంగా 40,585 సీట్లు భర్తీ అయ్యాయి. కేయూ పరిధిలో మొత్తం 97,930 సీట్లకు భర్తీ అయ్యింది 40 వేలే.. మూడు దశలు, స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు కూడా పూర్తి నేడు, రేపు ప్రైవేట్ కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు సాంకేతిక కోర్సులు అందించినా ఆదరణ కరువు -
విద్యుత్ అధికారులు హెడ్ క్వార్టర్లో ఉండాలి
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిహన్మకొండ: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఎన్పీడీసీఎల్లోని 16 సర్కిళ్ల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈ నెల 13 నుంచి 16 వరకు వరుసగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని, ఈ నేపథ్యంలో సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఇతర అధికారులు హెడ్‌క్వార్టర్‌లో ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేయాలన్నారు. ఎక్కడైనా అంతరాయాలు సంభవిస్తే వెంటనే సరఫరా పునరుద్ధరించేలా ఉద్యోగులు, మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకుని వెంటనే పనులు చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో సిబ్బంది, ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటలు విధులు కేటాయించాలన్నారు. విద్యుత్ సమస్యలుంటే వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. -
అర్ధరాత్రి.. ఆగమాగం
ఖిలా వరంగల్: భారీ వర్షానికి వరంగల్ అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు కురిసిన కుంభవృష్టితో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ అండర్ బ్రిడ్జి కింది నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. విలీన గ్రామాల్లో చెరువుల మత్తడితోనే ఈ దుస్థితి వచ్చిందని చెబుతున్నారు. ప్రధానంగా దూపకుంట, గాడిపల్లి, గుంటూరుపల్లి నుంచి పెద్ద ఎత్తున వరదనీరు తూర్పుకోటకు చేరుతోంది. దీంతో అగర్త చెరువులు నిండి వరదనీరు మైసయ్యనగర్, శివనగర్, పెరికవాడ అంతర్గత కాలనీల్లో ప్రవహిస్తోంది. మట్టికోట అగర్త చెరువు మత్తడి నీరు మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పక్క నుంచి జాతీయ రహదారి మీదుగా నాగేంద్రనగర్, కాశికుంట, విద్యానగర్, లక్ష్మీనగర్, సాకరాశికుంట, శాంతినగర్, ఎస్ ఆర్ఆర్తోట మీదుగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పలు స్వచ్ఛంద సంస్థలు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశాయి. నీటిలో కాకతీయుల రాజధాని..చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. మధ్యకోటలో పంటపొలాలు, ఆకుకూర తోటలు నీటిలో మునిగిపోయాయి. సుమారు రూ.5 లక్షల మేరకు పంట నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.వాంబేకాలనీలో వృద్ధురాలి మృతివరంగల్ 41వ డివిజన్ కాశికుంట వాంబే కాలనీకి చెందిన వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన ఆమె పడుకున్న మంచం నీటిలో మునిగింది. కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వృద్ధురాలు అప్పటికే మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసుల సహాయక చర్యలు.. మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. నీట మునిగిన కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు, గిరిప్రసాద్‌నగర్‌లో నీట మునిగిన ఓ ఇంటిలోని కుటుంబాన్ని క్షేమంగా ఇన్స్పెక్టర్ కాపాడి బయటకు తీసుకొచ్చారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదరామన్నపేట: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ప్రజలకు సూచించారు. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని సాయిగణేశ్ కాలనీ, గాంధీనగర్, డీకే నగర్, లెనిన్‌నగర్, అగర్తల చెరువు, మైసయ్యనగర్, గిరిప్రసాద్‌కాలనీ, పద్మనగర్, సాకరాశికుంటలో వర్షపు నీరు బయటకు వెళ్లే స్ట్రాం వాటర్ డ్రెయిన్లు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని, ఆహారం, మందులు అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం పిల్లలను పాఠశాలకు పంపించొద్దని, పిల్లలు చేపల వేటకు వెళ్లకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని సమాచారం అందిందని వెల్లడించారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ బాధితులకు నగరంలో 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, కార్పొరేటర్ భోగి సువర్ణ సురేశ్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీఎఫ్ఓ శ్రీధర్‌రెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ ఉన్నారు.నేడు, రేపు స్కూళ్లకు సెలవులు విద్యారణ్యపురి: భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబా బాద్ జిల్లాల్లో బుధ, గురువారాలు (రెండు రోజులు) పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు ఉత్తర్వులు అందాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విధిగా సెలవులు పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో 34.1 మిల్లీవీుటర్లు..హనుమకొండ: జిల్లాలో మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 34.1 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. హనుమకొండలో 11.37 సెంటీమీటర్లు, ఐనవోలులో 85.4 మిల్లీవీుటర్లు, కాజీపేటలో 81.6 మిల్లీవీుటర్లు, భీమదేవరపల్లిలో 12.1 మిల్లీవీుటర్లు, వేలేరులో 21.6, ఎల్కతుర్తిలో 15.1, కమలాపూర్‌లో 13.6, హసన్‌పర్తిలో 31.5, ధర్మసాగర్లో 29, కాజీపేటలో 81.6, హనుమకొండలో 113.7, ఐనవోలులో 85.4, పరకాలలో 6.6, దామెరలో 36.4, ఆత్మకూరులో 8, శాయంపేటలో 11.7, నడికూడలో 10.9 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.వరంగల్ జిల్లాలో 97.2 మిల్లీవీుటర్లువరంగల్ జిల్లాలో సగటున 97.2 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. సంగెంలో 202.7 మిల్లీవీుటర్లు, ఖిలా వరంగల్‌లో 148.5, వర్ధన్నపేటలో 122.3, పర్వతగిరిలో 107.5, వరంగల్‌లో 94.9, గీసుకొండలో 91.3, నెక్కొండలో 88.2, చెన్నారావుపేటలో 86, రాయపర్తిలో 82.8, ఖానాపురంలో 70.3, దుగ్గొండిలో 63, నల్లబెల్లిలో 55.2, నర్సంపేటలో 51.5 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది.అధికారులు అందుబాటులో ఉండాలి: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలో ని అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు స్థానికంగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.పోలీసులకు సమాచారం ఇవ్వండి : సీపీ సన్‌ప్రీత్ సింగ్వరంగల్ క్రైం: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, శిథిలావస్థ భవనాల్లోని నివాసితులు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షంలో వాహనాలపై వెళ్లే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.కంట్రోల్ రూంల ఏర్పాటుటోల్ ఫ్రీ నంబర్ : 1800 4251980వరంగల్ కలెక్టరేట్ : 97019 99676 హనుమకొండ కలెక్టరేట్ : 79819 75495 అత్యవసరమైతే సాయం కోసం ఈ నంబర్లలో సంప్రదించాలి -
శైవ క్షేత్రాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: శ్రావణమాసం సందర్భంగా శైవ క్షేత్రాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పంచారామాల దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను తెలిపారు. ఈ నెల 17న హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక పంచారామ దర్శన యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రలో భక్తులు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాలు అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీసోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర లింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి దర్శించుకోవచ్చన్నారు. ఒకే రోజు ఐదు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలు పొందొచ్చన్నారు. ఈ యాత్ర బస్సులు ఆగస్టు 17న (ఆదివారం) సాయంత్రం 6 గంటలకు హనుమకొండ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం ఉదయం హనుమకొండకు చేరుకుంటాయన్నారు. సూపర్ లగ్జరీ సర్వీస్ చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్లలకు రూ.1,400 నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి సమాచారం, టికెట్ బుకింగ్ కోసం 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభం
వరంగల్ క్రైం: ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర ప్రదేశంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తపు మరకలు, వేలిముద్రలను వాహనంలో ఆధునిక పరికరాలతో పరిశోధించి దర్యాప్తు అధికారికి ప్రాథమిక ఆధారాలను అందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, రీజినల్ ఎఫ్ఎస్ఎల్ జాయింట్ డైరక్టర్ నీరజ, ఫింగర్‌ప్రింట్ విభాగం ఇన్స్పెక్టర్లు రాజ్‌కుమార్, శ్రీధర్, ఆర్ఐలు శ్రీధర్, స్పర్జన్‌రాజ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, ఫింగర్‌ప్రింట్ ఎస్ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు అందుబాటులో ఉండాలి
● హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలో ని అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత శాఖలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు స్థానికంగా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసులకు సమాచారం ఇవ్వండి : సీపీ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, శిథిలావస్థ భవనాల్లోని నివాసితులు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షంలో వాహనాలపై వెళ్లే వారు వాహనాల కండీషన్ పరిశీలించుకోవాలని, ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
న్యూశాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్షా ల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ వీసీలో వరంగల్ జిల్లా నుంచి కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అ న్నారు. కలెక్టరేట్ నుంచి ఆమె జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు. తమ మండలాల పరిధిలో జలమయమయ్యే ప్రాంతాలను గుర్తించి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలని చెప్పారు. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని తెలిపారు. టె లికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన -
కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల సెమిస్టర్ పరీక్షల పలితాలు, దూరవిద్య కేంద్రం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 31 శాతం, రెండో సెమిస్టర్లో 30 శాతం, మూడో సెమిస్టర్లో 35 శాతం, నాలుగో సెమిస్టర్లో 39 శాతం, దూరవిద్య మొదటి సెమిస్టర్ పరీక్షల్లో 24 శాతం ఉత్తీర్ణత సాధించారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ. ఇన్‌లో చూడాలని వారు కోరారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు ఎం.తిరుమలాదేవి, జి.పద్మ, ఆసిం ఇక్బాల్, చిర్ర రాజు, వి.మహేందర్, పి.వెంకటయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, క్యాంపు ఆఫీసర్ ఎస్.సమ్మయ్య పాల్గొన్నారు. -
రజితకు కన్నీటి వీడ్కోలు..
● నివాళులర్పించిన రచయితలు, వివిధ సంఘాల ప్రతినిధులు ● మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, రిజిస్ట్రార్ రామచంద్రం ● కేఎంసీకి రజిత భౌతికకాయం దానం కేయూ క్యాంపస్ : ప్రముఖ కవి, రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రీల వేదిక జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజితకు మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హనుమకొండలోని గోపాల్ పూర్ ప్రాంతంలోనివాసం ఉండే అనిశెట్టి రజిత (67)సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం విధితమే. రజిత కేయూలో నాన్‌టీచింగ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి కొన్ని సంవత్సరాల క్రితమే ఉద్యోగవిరమణ పొందారు. ఆమె అ వివాహిత. కొంతకాలంగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. గుండెపోటు వచ్చి అపస్మారకస్థితికి చేరడంతో రచయిత శోభారమేశ్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి యజమాని నిరాకరించడంతో కేయూ తెలుగు విభాగం రిటైర్డ్ ఆచార్యులు కాత్యాయనివిద్మహే ఇంటి వద్దకు రజిత భౌతికకాయాన్ని తరలించారు. ఇక్కడ రచయితలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు.. రజితకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజిత ప్రజాస్వామిక రచయిత్రీల జాతీయ వేదిక అధ్యక్షురాలిగా అందించిన సేవలు, ఆమెతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర.. ప్రముఖ రచయిత్రీ అనిశెట్టి రజిత మృతి బాధాకరమని, తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమంలో ఆమె క్రియాశీలక పాత్ర వహించారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రజిత భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలువలతోకూడిన జీవితానికి ఆమె నిదర్శనమన్నారు. సీ్త్ర సామాజిక సమానత్వం కోసం తన రచనల ద్వారా చైతన్యం నింపారన్నారు.అనిశెట్టి రజిత తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపర్చారని కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. అనిశెట్టి రజిత మృతి ప్రజాస్వామిక రచయిత్రీల వేదికకు తీరని లోటని ఆ వేదిక జాతీయ కార్యదర్శి ఎల్లూరి మానస అన్నారు. రచయిత్రీగా రజిత తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా వెల్లడించేవారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డల లక్ష్మణ్ అన్నారు. ఘన నివాళి.. అనిశెట్టి రజిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కేంద్రసాహిత్య అకాడమీ అవా ర్డు గ్రహీత అంపశయ్యనవీన్, రచయితలు బన్నఅయిలయ్య, వీఆర్ విద్యార్థి, టి చందు, తాయమ్మరణ, శోభారమేశ్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ప్రజాఫ్రంట్ నేత బి.రమాదేవి, మహిళా సంఘం నేత సదాలక్ష్మి, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ ప్రొఫెసర్లు జ్యోతిరాణి, వి.శోభ,గిరిజారాణి, విజయలక్ష్మి, కిష్టయ్య, విరసం నేత కుమారస్వామి, ప్రముఖ అనువాద రచయిత నలిమెల భాస్కర్, బంధుమిత్రుల కమిటీ బాధ్యురాలు భారతక్క, తదితరులు ఉన్నారు. వివిధ సంఘాల బాధ్యుల సంతాపంప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత మృతి చాలా బాధకరమని, సమాజంలో మహిళల పరిస్థితిపై మహిళల హక్కులపై తన రచనలతో చైతన్యం కలిగించారని మానవ హక్కుల వేదిక బాధ్యుడు జీవన్‌కుమార్ తన ప్రగాడ సంతాపం తెలిపారు. అదేవిధంగా సహృదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు గిరిజా మనోహరబాబు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎన్చారి, సాహిత్య కార్యదర్శి మల్యాల మనోహర్‌రావు, వనం లక్ష్మీకాంతారావు, లక్ష్మణరావు, కాళోజి ఫౌండేషన్ బాధ్యుడు డాక్టర్ ఆగపాటిరాజ్కమార్ సంతాపం తెలిపారు. కేఎంసీకి రజిత భౌతికకాయం దానం సంతాపసభ అనంతరం రచయితలు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు అంబులెన్స్‌లో రజిత భౌతికకాయంతో కేయూ మొదటి గేట్ క్రాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రజితకు జోహార్లు అర్పించారు. అనంతరం ఆమె భౌతికకాయాన్ని వరంగల్ కేఎంసీకి తరలించి దానం చేశారు. అంతకు ముందు నేత్ర వైద్యులు రజిత నేత్రాలు సేకరించారు. -
డీఈఓను సస్పెండ్ చేయాలి
విద్యారణ్యపురి: వరంగల్ విద్యాశాఖలోని సమగ్రశిక్షలోని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజపై డీఈఓ జ్ఞానేశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, పీఆర్టీయూ, పీఆర్టీయూ తెలంగాణ, డీటీఎఫ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ప్రభుత్వ టీచర్స్ అసోసియేషన్, టీయూటీఎఫ్, టీజీటీయూ, హెడ్మాస్టర్స్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ల బాధ్యులు వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మంగళవారం వివిధ అకడమిక్ అంశాలపై ఎంఈఓలతో వాట్సాప్ గ్రూప్‌కాల్ జూమ్ మీటింగ్‌లో సుజన్‌తేజ మాట్లాడుతుండగా డీఈఓ జ్ఞానేశ్వర్ దుర్భాషలాడి అవమానపర్చారని ఆరోపించారు. డీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద వద్దకు వెళ్లి కలిసి డీఈఓ వైఖరిపై, జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌పై దుర్భాషలాడారని పలు ఆరోపణలు చేస్తూ చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. ఏసీపీకి ఫిర్యాదు.. వరంగల్ డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ తనపై దు ర్భాషలాడారని ఆరోపిస్తూ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్‌తేజ మంగవారం రాత్రి హనుమకొండ ఏసీపీ నర్సింహారావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ధర్నా -
29న కేయూ డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొంది ఆరో సెమిస్టర్ పరీక్షలో ఒక సబ్జెక్టు ఫెయిల్యిన విద్యార్థులకు ఈనెల 29న ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించనున్నామని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. సంబంధిత కళాశాలల నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కేయూ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్ను చూడాలని రాజేందర్ పేర్కొన్నారు. కేజీబీవీలో డీఆర్ఓ విచారణ బచ్చన్నపేట : మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. ‘టీచర్లు కొడుతున్న విషయం చెప్పొద్దు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జీసీడీఓ గౌసియాబేగం స్పందించి మంగళవారం విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటలకు కేజీబీవీకి వచ్చిన అధికారులు పాఠశాలలోని ప్రతీ విద్యార్థితో సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడారు. అలాగే, ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు. సీఈసీ సెకండియర్‌లో ఆరుగురు బాలికలకు టీసీలు ఎవరు ఇస్తామన్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే, క్రమశిక్షణతోపాటు నాణ్యమైన బోధన చేపట్టాలన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు అందిస్తామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషలాఫీసర్ గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడి రిమాండ్ కన్నాయిగూడెం: కూలి హత్య కేసులో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనువాస్, ఎస్సై వెంకటేష్ వెల్లడించారు. సీఐ శ్రీనువాస్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం స ర్వాయి గ్రామానికి చెందిన మడి రాజబాబు భ వన నిర్మాణ పనికి వెళ్లి మేసీ్త్ర కుమ్మరి బాబును కూలీ అడిగాడు. ఈ విషయంలో మేసీ్త్ర బావమరిది కోరం రంజిత్.. రాజబాబును హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేశారు. నిందితుడిని పట్టుకుని విచారించిన అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 19, 20, 21 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌కు ఏర్పాట్లు చేయాలని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం అకడమిక్ కమిటీ హాల్లో సంబంధిత కమిటీల బాధ్యులతో నిర్వహించిన సమీక్షలో వీసీ మాట్లాడారు. సైన్స్‌కాంగ్రెస్‌కు హాజరు కాబోయే అతిథులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు ఉండాలన్నారు. వర్షాల నేపథ్యంలో కూడా అందుకనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. క్యాంపస్‌లోని పలు సెమినార్హాళ్లలో పేపర్ ప్రజెంటేషన్లు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆధునిక సాంకేతిక పరికరాలను కూడా ఏర్పాటుచేయాలన్నారు.ఈ సమీక్షలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్లు మల్లారెడ్డి, ఎన్. ప్రసాద్, స్వర్ణలత, డి. రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
పింఛన్లు పెంచకుంటే గద్దె దించుతాం
పాలకుర్తి టౌన్: పింఛన్లు పెంచకుంటే సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల పెంపు కోసం సెప్టెంబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించే మహా గర్జనను విజయవతం చేయాలని కోరుతూ మంగళవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ పథకం సాధన కోసం ఎమ్మారీఎస్ ఎంతో శ్రమించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వీడాలని, గడీ నుంచి బయటకు రావాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 50 లక్షల మంది దివ్యాంగులను మోసం చేస్తోందని, దీనిపై కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ. 6 వేలు, వృద్ధులకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు పెంచి పింఛన్లు ఇస్తామని పేర్కొందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పింఛన్లు పెంచకుండా రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పింఛన్ పెంపు ఎప్పుడు అమల్లోకి వస్తుందని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని 50 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సునీల్ మాదిగ, యాదగిరి స్వామి, తాళ్లపెల్లి కుమార్, గద్దల కిశోర్, దిండిగల వెంకన్న, గుండాల రవి, రమేశ్, వలపు వెంకన్న, సుధాకర్, జలగం నరేశ్, దండు రామచంద్రం, శ్రీధర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్‌కు మందకృష్ణ హెచ్చరిక పాలకుర్తిలో నియోజకవర్గ సన్నాహక సమావేశం -
చిరు దరహాసం
‘ఆపరేషన్ స్మైల్.. ఆపరేషన్ ముస్కాన్’తో చిన్నారులకు భరోసాబాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ప్రతీ ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట 2015 నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడీడు పిల్లలు బడిలో ఉంటేనే ఆకుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాలను యజ్ఞంలా చేపడుతున్నారు. 2015 నుంచి 2016వ సంవత్సరం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా, 2017 నుంచి 2021 వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో, 2022 నుంచి 2025 సంవత్సరం వరకు హనుమకొండ జిల్లాలో 2,481 మంది చిన్నారులకు పనినుంచి విముక్తి కల్పించారు. డివిజన్‌కు 8 మంది సభ్యుల బృందం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ డివిజన్లో ఎస్సై, సహాయ కార్మికశాఖ అధికారి, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, మహిళా పోలీస్ కానిస్టేబుల్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధి కారి, చైల్డ్‌లైన్ అధికారులు బృందంగా పని చేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. చట్టాలు ఇలా.. చిన్నారులను పనిలో పెట్టుకుని శ్రమ దోపిడీకి గురి చేసే యజమానులపై బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం 1996 (సవరణ 2016లో మా ర్పు చేసి చట్టాన్ని ది చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్ యాక్ట్ 1986) జువైనల్ జస్టిస్ యాక్ట్‌లు పరిగణనలోకి వస్తాయి.బాలకార్మికులను ప్రోత్సహిస్తూ తొలి సారి పట్టుబడితే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేలు నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పిదం జరిగితే ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి లక్ష వరకు జరిమానా విధిస్తారు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజమే లక్ష్యం ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజ నిరా్మాణమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు ఇతర రాష్ట్రాల పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. – జయంతి, సీ్త్ర, శిశు సంక్షేమాధికారి, హనుమకొండ జిల్లా ‘బాలలు ఉండాల్సింది బడిలో.. పనిలో కాదు’ ఈ నినాదంతో దూసుకెళ్తున్నారు వరంగల్ కమిషరేట్ పరిధి పోలీసులు, ఇతర శాఖల అధికారులు. బాలల బంగారు భవిష్యత్‌ను రక్షిస్తూ వారి పెదాల్లో చిరునవ్వులు విరబూయిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట విస్తృత తనిఖీలు చేపడుతూ.. బాలలకు పని నుంచి విముక్తి కల్పిస్తూ బడిలో చేర్పిస్తున్నారు. – కాజీపేట అర్బన్హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇలాఆపరేషన్ స్మైల్సంవత్సరం బాలురు బాలికలు కేసులు 2022 జనవరి 96 16 2 2023 జనవరి 86 9 4 2024 జనవరి 32 3 1 2025 జనవరి 25 6 2 ఆపరేషన్ ముస్కాన్.. సంవత్సరం బాలురు బాలికలు కేసులు 2022 జూలై 86 9 4 2023 జూలై 38 9 2 2025 జూలై 36 8 4 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఈఏడాది జూలైలో 177 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 97 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. 2015 నుంచి 2,481 మంది చిన్నారులకు విముక్తి బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: పోలీసులు, అధికారులు -
ప్రజెంట్ మేడమ్..
వరంగల్ ప్రజావాణికి సమయానికి హాజరైన అధికారులు న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో గతవారం ప్రజావాణిలో సమయపాలన పాటించకుండా వచ్చిన అధికారులను కలెక్టర్ మందలించారు. దీంతో సోమవారం అధికారులు గ్రీవెన్స్‌కు నిర్ణీత సమయంలోగా(ఉదయం 10:30లోగా) కలెక్టరేట్లోని సమావేశ హాల్‌కు చేరుకున్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, హౌసింగ్ పీడీ గణపతి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 120 దరఖాస్తులు రాగా.. వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో ఎక్కువగా రెవెన్యూ 50, జీడబ్ల్యూఎంసీ 21, హౌసింగ్‌కు 12 దరఖాస్తులు రాగా మిగితావి వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. కొత్త ఒరవడి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొత్త ఒరవడి సంతరించుకుంది. అధికారులకు ఎదురుగా దరఖాస్తుదారులకు సమావేశ హాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. దరఖాస్తుదారులు సమావేశ హాల్ ఎదురుగా బయట నిరీక్షించకుండా హాల్లో సీరియల్ ప్రకారం కూర్చునేందుకు వీలుగా సీట్లు ఖాళీగా ఉంచారు. దీంతో సీరియల్ నంబర్ల వారీగా ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు రావడంతో ప్రజావాణి సాఫీగా సాగింది. ఇందిరమ్మ ఇల్లు కోసం తప్పుడు సర్వే నా భర్త చనిపోయాడు. నాకు సొంత భూమిలేదు. ఇల్లు లేదు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. సర్వేలో సర్వేయర్ నాకు ఇంతకు ముందు ఇల్లు మంజూరైందని ఎంటర్ చేశారు. తప్పుడు సమాచారంతో నాకు ఇల్ల్లు రాకుండా పోయింది. నాకు న్యాయం చేయాలి. – ఐత సంపూర్ణ, క్రిస్టియన్ కాలనీ, వరంగల్ బిల్లు మంజారు చేయండి నాకు ఇందిరమ్మ పథకం ఎల్–1 కింద ఇల్లు మంజూరైంది. ఖాళీ స్థలం ఉంది. తెలియక అధికారుల అనుమతి లేకుండా బేస్మెంట్ పిల్లర్ నిర్మించుకున్నా. క్షమించి అధికారులు మార్కింగ్ చేసి మొదటి బిల్లు మంజూరు చేయాలి. – బి.దివ్యజ్యోతి, దేశాయిపేట, వరంగల్) -
వెహికల్ ట్రాకింగ్ యాప్‌పై అవగాహన అవసరం
బల్దియా కమిషన్ చాహత్ బాజ్పాయ్రామన్నపేట : వెహికల్ ట్రాకింగ్ అప్లికేషన్‌పై శాని టరీ ఇన్స్పెక్టర్లకు అవగాహన అవసరమని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వాహనాల ట్రాకింగ్ తీరును అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ వాహనాల స్థితిగతులను నమోదు చేసుకుని పూర్తినివేదికను తనకు అందజేయాలన్నారు. అదేవిధంగా హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు. వెహికల్ షెడ్డు ప్రాంతంలో గుడిసెవాసులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శానిటేషన్ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ గీత, ఎంఈఓ నెహ్రూనాయక్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ హిమబిందు హెచ్ఎం ఉమ ల్గొన్నారు. మంచి పేరు తీసుకురావాలి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌తోపాటు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఇనిస్టిట్యూట్‌లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నూతన పీజీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్లో ఆయన మాట్లాడారు. నిట్‌లోని అత్యుత్తమ బోధనను అధ్యయనం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఎంబీ ఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎమ్మెసీలో అందజేస్తున్న విద్యాబోధన, ల్యాబ్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్‌కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రుద్రతత్వమే విశ్వశక్తిహన్మకొండ కల్చరల్ : రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడవ సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర విద్య ప్రవేశాల గడువు పొడిగింపు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సుల్లో 2025–2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి రుసుం ఆన్‌లైన్‌లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూ ఆర్ స్కాన్‌ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఎన్జీఓతో ఆర్ట్స్‌కాలేజీ ఒప్పందంకేయూ క్యాంపస్: మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా లాంచ్ గర్ల్స్ ఎన్జీఓతో ఒప్పందం చేసుకున్నట్లు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం తెలిపారు. ఈ సంస్థ మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లాంచ్గర్ల్స్ ప్రతినిధి జయవర్ధన్, కళాశాల మహిళా సాధికారిత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు. హెచ్‌పీఎస్‌లో అడ్మిషన్ కోసం డ్రాన్యూశాయంపేట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్) రామంతపూర్‌లో ఒకటవ తరగతి అడ్మిషన్ కోసం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమక్షంలో డ్రా తీశారు. డ్రాలో కందికట్ల హర్షిణి అనే విద్యార్థిని సెలక్ట్ అయ్యింది. మొదటి వెయిటింగ్ లిస్టుగా నీరటి జష్విక, రెండవ వెయిటింగ్ లిస్టులో చింత అద్వైత ఉన్నారు. హర్షిణి సామాజిక స్థితిని పరిశీలించి అడ్మిషన్ కోసం పంపించారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దని మంత్రి ఇల్లు ముట్టడి
మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్ట్ హన్మకొండ: వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన వర్కర్లు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఇంట్లోకి ప్రవేశించకుండా గేటు వేసి అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్ల మద్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి రమేశ్, నాయకులు వాణి, ప్రభాకర్, ఉపేందర్‌తో పాటు మధ్యాహ్న భోజన వర్కర్లను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్లు బైరబోయిన సరోజినీ యాదవ్, జారతి దేవి, కవిత, స్వర్ణలత, పుష్పలీల, రమ, మనెమ్మ, మల్లికాంబ, ఉమాదేవి, లక్ష్మి అనసూర్య, వనజ, సంధ్య, రీటా, సరిత, పద్మ, అరుణ, యాకలక్ష్మి, రజియా సుల్తానా, జఖియా బేగం, షంషాద్, ప్రమీల, శ్రావణి, మంజుల పాల్గొన్నారు. -
మన కుక్కల్ని ఏం చేద్దాం?
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గుంపులు గుంపులుగా తిరుగున్న కుక్కలపై ఫిర్యాదులు రాగానే అక్కడినుంచి పట్టుకెళ్లి డాగ్ షెల్టర్లకు తరలించాక కుటుంబ నియంత్రణ, రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ నగరంలోనే వదిలేస్తుండడతో కుక్కల సంఖ్య యఽథావిధిగానే ఉంటోంది. జంతు సంరక్షణ చట్టం (ఏడబ్ల్యూపీఐ) 1960 , 2023 నిబంధనల ప్రకారం ఇదంతా చేస్తున్నా జనాలు మాత్రం కుక్కలు తీసుకెళ్లి మళ్లీ ఇక్కడే వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ నగరంలో మొత్తం 28,460 వీధి కుక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఢిల్లీలో వీధి కుక్కల్ని డాగ్ షెల్టర్లకు తరలిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మన కార్పొరేషన్ పరిధిలోనూ వీధి కుక్కల్ని డాగ్ షెల్ట ర్లకు శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలనే డిమాండ్ నగరవాసుల నుంచి వస్తోంది. అదే సమయంలో జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కల పట్ల కఠినంగా ఉండొద్దని, కాటు వేసే కుక్కల్ని గుర్తించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటున్నారు. ఇటు జనాలు, అటు జంతు ప్రేమికుల మధ్యలో కార్పొరేషన్ నలిగిపోతుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ కూడా నగర శివారుల్లో డాగ్ షెల్టర్ జోన్లు పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంట్రోల్లోకి తెచ్చేందుకు మహా ప్రయత్నం వాస్తవానికి ఆరు నెలలు దాటి ఏడాది వయస్సున్న కుక్కల్ని కుటుంబ నియంత్రణకు బల్దియా అధికారులు తీసుకెళ్తున్నారు. దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు బతికే ఈ కుక్కలకు ఒక్కో ఆడ కుక్క ఏడాదికి రెండు ఈతలు.. దాదాపు 16 కుక్కపిల్లలకు జన్మనిస్తుంది. అంటే ఐదేళ్లలో ఒక్కో కుక్క 90 పిల్లల వరకు జన్మనిస్తుంది. గతేడాది 2024–25 సంవత్సరంలో రూ.68 లక్షలకుపైగా ఖర్చు చేసి 6,154 కుక్కలకు కుటుంబ నియంత్రణతో పాటు రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. మూడురోజుల పాటు సంరక్షించాక జనావాసాల్లోకి వదిలారు. కొన్ని సంవత్సరాలుగా వేలల్లో ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణతో కంట్రోల్లోకి తేగలిగామని, ఇప్పటికి వాటిపైనే దృష్టి కేంద్రీకరించామని చెబుతున్నారు. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాలతో పాటు పాఠశాలల్లో అవగాహన కల్పిస్త్తున్నామంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే.. కుక్క కాటు వేస్తే 18004251980తో పాటు ప్రజారోగ్య అధికారి ఫోన్ నంబర్ 9701999689, మున్సిపల్ ఆరోగ్య అధికారి ఫోన్ నంబర్ 97019 99639 పశువైద్యాధికారి ఫోన్ నంబర్ 97019 99701కు వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ప్రతీరోజు 12 నుంచి 15 ఫిర్యాదులొస్తున్నాయి. షెల్టర్ జోన్లకు కుక్కలను తరలించేందుకు 12మందితో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయాలి... గ్రేటర్ వరంగల్‌తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జూన్, జూలై నెలల్లోనే 712 కుక్క కరిచిన ఘటనలు నమోదయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో పట్టుబడిన వీధి కుక్కలకు శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేసి, అక్కడే ఉంచి ఆహారం, వైద్యసేవలు అందించాలి. – మండల పరశురాములు, అధ్యక్షుడు, అభ్యుదయ సేవా సమితి, వరంగల్ ‘గ్రేటర్’ పరిధిలో వీధి కుక్కల బెడద ప్రజావాణిలో ఒక్కరోజే నాలుగు ఫిర్యాదులు వీధులనుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని వినతి జంతు సంరక్షణ చట్టం నిబంధనలతోనే బల్దియాకు మహా సంకటస్థితి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కుక్కలపై సుప్రీం ఆదేశాల నేపథ్యంలో చర్చ ఇక్కడ కూడా డాగ్ షెల్టర్ జోన్లు పెంచితే మంచిదంటున్న జనం ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరీటరీతోపాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను డాగ్ షెల్టర్లకు ఎనిమిది వారాల్లో తరలించాలి. ఈనేపథ్యంలో వీధి కుక్కలను అధికారులు తీసుకెళ్లకుండా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డుకుంటే, వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’. – తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ‘కాజీపేటలోని ప్రశాంత్ నగర్, కాకతీయ కాలనీ ఫేజ్–టు, వరంగల్‌లో రంగశాయిపేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీధి కుక్కల్ని తీసుకెళ్లాలి. వరుస కాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ బెడద నుంచి కార్పొరేషన్ అధికారులు తప్పించాలి.– సోమవారంనాటి బల్దియా ప్రజావాణిలో వచ్చిన నాలుగు ఫిర్యాదులు -
అలా కడితే అప్పుల పాలవుతారు
హసన్‌పర్తి/రామన్నపేట/కాజీపేట అర్బన్: నిబంధనల మేరకు రూ.5లక్షల వరకు వ్యయంతోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని, అలా కాకుండా స్లాబ్‌ను పెంచితే అప్పుల పాలవుతారని గృహ నిర్మాణశాఖ ఎండీ వీసీ గౌతమ్ సూచించారు. హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో, గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధిలోని కాజీపేట మండలం న్యూశాయంపేటలో, 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈసందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యింది? ఇంకా ఎంత అవుతుందని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. 600 ఎస్ఎఫ్టీ మేరకు స్లాబ్‌లో గోడల నిర్మాణం చేపట్టి, మరో 300 నుంచి 400ఎస్ఎఫ్టీ వరకు స్లాబ్ బయట పెంచినట్లు గౌతమ్ గుర్తించారు. ఇలాచేస్తే ఆర్థిక భారమై అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మేరకు స్లాబ్‌తో సహా 600 ఎస్ఎఫ్టీ నిర్మాణం చేపట్టితే ఎలాంటి భారం పడే అవకాశం ఉండదన్నారు. నాణ్యమైన ఇసుక, ఇటుక, సిమెంట్, ఇనుముతో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. మడిపల్లిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు సత్వరం పూర్తి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి ప్రారంభిస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్ నాయక్, తహసీల్దార్లు ప్రసాద్, బావుసింగ్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేట్టాలి గృహ నిర్మాణశాఖ ఎండీ గౌతమ్ -
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
రామన్నపేట: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆయా విభాగాల ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా చూడాలని, 24 గంటల వ్యవధిలోగా శానిటేషన్ విభాగానికి అందిన ఫిర్యాదులు పరిష్కారం కావాలని ఆదేశించారు. గార్బేజ్ బిన్లు లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పన్నుల విభాగానికి సంబంఽధించిన స్వీకరించిన ఫిర్యాదులు వారంలోగా పరిష్కారం చూపాలన్నారు. ఈనెల 21 వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో బోనాలు పండుగలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత ఆలయాల వద్ద ఎలకి్ట్రకల్ శానిటేషన్ ఏర్పాట్లతోపాటు డస్ట్, పారిశుద్ధ్యం నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇంజనీరింగ్ 23, టౌన్ ప్లానింట్ 44, హెల్త్ – శానిటేషన్ 11లతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన మొత్తం 91 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ, సిటీ ప్లానర్లు మహీందర్ రవీందర్ రాడేకర్, సీహెచ్‌ఓలు రమేష్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాలు తొలగించాలి నగరంలోని 35వ డివిజన్ పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మగుడి జంక్షన్లో రోడ్డుకు అడ్డంగా కరెంట్ పోల్స్ ఉండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం బల్దియా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌కి వినతి పత్రం అందజేశారు. బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
నోటీసులతోనే సరి!
సాక్షి, వరంగల్: పురాతన భవనాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మీనమేషాలు లెక్కిస్తోంది. ఏటా వర్షాకాలానికి ముందే శిథిల భవనాలపై టౌన్ ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. శిథిల, ప్రమాదకర భవనాల్లో ఉన్న వారిని గుర్తించాలి. అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు వారికి ముందుగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల సమీపంలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు చు ట్టూ బారికేడ్లను అమర్చాలి. కానీ.. శిథిల భవనాల గుర్తింపు, గతంలో నోటీసులిచ్చినా భవనాల పటిష్టత, మరమ్మతు పనుల అంశాలపై సమీక్షించినా అది కూడా తూతూ మంత్రంగానే సాగిందనే విమర్శలు వస్తున్నాయి. వర్షాలకు నాని కూలిపోయే ప్రమాదం ఉండడంతో పాత భవనాలను తొలగించాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లో నగరంలోని 66 డివిజన్లలో 450 పాత భవనాలున్నట్లు లెక్క తేల్చా రు. వీటిలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న 40 పాత ఇళ్లను కూల్చారు. 122 ఇళ్లల్లో ఉంటున్న వారి ని ఖాళీ చేయించారు. మరో 288 మందికి నోటీసులు జారీ చేసిన అధికారులు ఆ తర్వాత అటువైపు చూడడం లేదన్న విమర్శలున్నాయి. ఇవి అంతకుమించి ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈనెల 7న వరంగల్‌లో 70.9 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్‌లో 65.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో ప్రమాదకర భవనాల్లోని నివాసితుల భద్రత గాలిలో దీపంలా మారింది. ఏదైనా ఘటన జరగకముందే అధికారులు అప్రమత్తమై శిథిల భవనాలపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిందే.. వానాకాల విపత్తుల నివారణలో భాగంగా శిథిల భవనాలను గుర్తించడం, పాత భవనాల పటిష్టత, భద్రతపై ఇంజనీరింగ్ విభాగాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అత్యంత ప్రమాదకర కట్టడాలను కూల్చివేసేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం సర్వే చేయాలి. ఈ డ్రైవ్‌లో భాగంగా పురాతన భవనాలపై జోన్ల వారీగా సర్వే చేయాలి. సంబంధిత భవన నాణ్యతపై పరిశీలించి ప్రమాదకర భవనాలకు నోటీసులు జారీ చేసి కూల్చివేయాలి. అయితే ఇది కొంతవరకు జరిగినా.. పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి కేంద్రీకరించలేదన్న ఆరోపణలున్నాయి. భారీ వర్షాలు కురిస్తే గ్రేటర్ వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పురాతన భవన యజమానులను ఖాళీ చేయిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడినవారవుతారు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగినా ప్రేక్షకపాత్రకే బల్దియా పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.శిథిల భవనాల యజమానులకు జారీ చేసి చేతులు దులుపుకున్న జీడబ్ల్యూఎంసీ అధికారులు గ్రేటర్ వరంగల్‌లో వందల సంఖ్యలో నివాసాలు కూలిపోయి ప్రమాదం జరిగితే ప్రాణనష్టం వర్షాకాలం కావడంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు కమిషనర్ దృష్టి సారిస్తేనే సమస్య కొలిక్కిఎక్కడెక్కడున్నాయంటే.. వరంగల్ నగరంలోని మట్టెవాడ, మండిబజార్, చార్‌బౌళి, దేశాయిపేట, రామన్నపేట, పాత బీట్‌బజార్ వ్యాపార కూడలి, వరంగల్ చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, ఎల్బీనగర్, కాశిబుగ్గ, లేబర్ కాలనీ, ఖిలావరంగల్ ఫోర్ట్ రోడ్డు, చింతల్, ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట, శంభునిపేట, తిమ్మాపూర్, మామునూరు, నక్కలపల్లి, గొర్రెకుంట, ధర్మారం, మొగిలిచర్ల, పైడిపల్లి తదితర ప్రాంతాల్లో పాత ఇళ్లను గుర్తించి నోటీసులు జారీ చేశారు. హనుమకొండలోని కుమార్‌పల్లి, కొత్తూరు జెండా, హంటర్ రోడ్డు న్యూశాయంపేట, వడ్డేపల్లి, డీజిల్ కాలనీ, కాజీపేట దర్గా, సోమిడి, బాపూజీనగర్, రైల్వే క్వార్టర్స్, పెద్దమ్మగడ్డ, హసన్‌పర్తి, చింతగట్టు, రాంపూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో శిథిల దశకు చేరుకున్న భవనాలు ఉన్నాయి. -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. తుపాకులగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయిలో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్లు ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్‌కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాసిటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు.కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంప్‌హౌస్ పరిశీలన -
నేడు డీవార్మింగ్ డే
ఎంజీఎం: జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ నేడు (సోమవారం) డీవార్మింగ్ డే సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కోసం అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 2,35,000 మంది 1–19 వయస్సు ఉన్న పిల్లలున్నారని, కలెక్టర్ సూచన మేరకు ప్రతీ అంగన్వాడీ కేంద్రం పరిధి పాఠశాల, కళా శాలకు ఒక అంగన్వాడీ కార్యకర్త, ఆశా, ఏఎన్ఎంలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో 623 మంది ఆశా కార్యకర్తలు, 201 ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, 780 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అఽధికారి మహేందర్ మాట్లాడుతూ 1, 2 ఏళ్ల వారికి సగం మా త్ర పొడి చేసివ్వాలని, 2 ఏళ్ల నుంచి ఆపై 19 ఏళ్ల వారందరికీ ఒక మాత్ర చప్పరించి లేదా నమిలి మింగించాలన్నారు. భోజనానంతరం వీరందరికీ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేపు కేయూలో లైబ్రేరియన్స్ డేకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా), యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం, టీఎస్ లైబ్రరీ అసోసియేషన్ (టీఎస్‌ఎల్‌ఏ) ఆధ్వర్యంలో ఈనెల 12న లైబ్రేరియన్స్ డే నిర్వహించనున్నారు. ఈమేరకు కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఐసాక్ ప్రభాకర్, టీఎస్‌ఎల్‌ఏ ట్రెజరర్ డాక్టర్ జి.రాజేశ్వర్‌కుమార్, కుల్పా ట్రెజరర్ ఎం.మనోహర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. క్యాంపస్‌లోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హాజరుకానున్నారు. కుప్లా అధ్యక్షుడు డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు అధ్యక్షత వహిస్తారు. ‘రోల్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ ది డిజిటల్ ఎరా’ అంశంపై లైబ్రరీ సైన్స్‌విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రమణయ్య కీలకోపన్యాసం చేస్తా రు. ‘రెలవెన్స్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్ ఇన్‌ది ఏజ్ ఆఫ్ ఐఐ’ అంశంపై కేయూ లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రాధికారాణి ప్రసంగిస్తారు. కుల్పా జనరల్ సెక్రటరీ వి.కృష్ణమాచార్య, టీఎస్‌ఎల్‌ఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఇ.సత్యనారాయణరావు పాల్గొంటారని వారు తెలిపారు. ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బీజేపీహన్మకొండ చౌరస్తా: ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ.. అధికారం కోసం బీజేపీ కొనసాగిస్తున్న తంతును బహిర్గతం చేయడమే తమ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సందేశాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు వినిపించారు. బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తూ, దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈవిషయంపై క్షేత్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సందేశాన్ని అందించారు. ఇందులో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, పసునూరి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, పోతుల శ్రీమన్నారాయణ, సయ్యద్ విజయ శ్రీ, వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు బంక సరళ, బొమ్మతి విక్రమ్, దేవేందర్‌రావు, రామకృష్ణ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామి వారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపారు. -
అవినీతిలో కూరుకుపోయిన హెచ్‌సీఏ
రామన్నపేట: పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జైపాల్ సమన్వయంతో టీసీఏ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను క్రికెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2021 జూలై బీసీసీఐ ఇచ్చి కోలాబరేషన్ ఆదేశాలను హెచ్‌సీఏ పాటించలేదని బాంబే హైకోర్టు కంటెంప్ట్ ఆదేశాల ప్రకారం 29 మార్చి 2025న జరిగిన హెచ్‌సీఏ–టీసీఏ చర్చలకు తుదిరూపం ఇవ్వకపోవడం ద్వారా హెచ్‌సీఏకి తెలంగాణ క్రికెట్ అభివృద్ధిపై చిత్తుశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. పొన్నాల జగన్, విజయ్‌చందర్‌రెడ్డి, సమీ, ఎండీ జాకీర్ హుస్సేన్, స్టీఫెన్, శరత్‌యాదవ్, ఎండీ.మోహిన్ పాల్గొన్నారు. టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి -
హర్‌ఘర్ తిరంగా వేడుకలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శనివారం హర్‌ఘర్ తిరంగా సెల్ఫీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రామప్పకు వచ్చే పర్యాటకులు, భక్తులు, విద్యార్థులు హర్‌ఘర్ తిరంగా నినాదంతో ఉన్న ఫ్లెక్సీలో నిలబడి సెల్పీలు తీసుకున్నారు. ఈ నెల 15న హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్‌లో శిక్షణ తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30వ తేదీ వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మేఘనరావు తెలిపారు. ఉర్సు విజయవంతానికి సమన్వయం అవసరంపశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కాజీపేట: అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సును విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆదేశించారు. కాజీపేట మండలం దర్గా కాజీపేట అప్జల్ బియాబానీ దర్గాలో అధికారులతో శనివారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరగనున్న దర్గా ఉత్సవాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మాజీ కార్పొరేటర్ ఎండీ.అబుబక్కర్, ఇన్స్పెక్టర్ సుధాకర్‌రెడ్డి, వెంకన్నతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. రైతుబీమాకు వివరాలివ్వాలిన్యూశాయంపేట: జిల్లా పరిధిలోని రైతులందరు రైతుబీమా చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం రైతులకు రూ.5 లక్షల బీమా చేయిస్తుందని తెలిపారు. 18–59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పట్టాదారు పాసుబుక్ ఉన్న రైతులు అర్హులన్నారు. గత సంవత్సరం బీమా చేయించుకున్న రైతులు నామిని పేరు, ఇతర సవరణలు చేసుకోవడానికి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీలోగా పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, నామినీ వివరాల జిరాక్స్ ప్రతుల వివరాలు సంబంధిత వ్యవసాయాధికారికి సమర్పించాలని ఆమె సూచించారు. శ్వేతార్క ఆలయంలో రాఖీ వేడుకలు కాజీపేట: కాజీపేట స్వయంభు శ్వేతార్క మూలగణపతి దివ్యక్షేత్రంలో రక్షా బంధన్ వేడుకలతో పాటు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలను శనివారం నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలోని సంతోషిమాతతో పాటు 29 దేవతామూర్తులకు అభిషేకాలు, అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయంలో భక్తులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఆలయ కార్యకర్తలకు మహిళా భక్తులు రాఖీలు కట్టి తమ సోదరి భావాన్ని చాటుకున్నారు. అన్నపూర్ణ కేంద్రంలో భక్తులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్వర్లు శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. -
సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా చర్యలు
వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి న్యూశాయంపేట: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ సింగరేణి సీఎండీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్‌స్టలేషన్‌పై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల వివరాలతో నిర్ణీత నమూనా ప్రకారం నివేదిక రూపొందించి వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలు సేకరించి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. -
మరో ఏడు నెలలే..!
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. భూసేకరణే అసలు సమస్య.. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకూ భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ(సీతక్క), ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్‌కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పంపింగ్ స్టేషన్‌ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్లోనే హైదరాబాద్‌కు బయల్దేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. దేవాదుల ప్రాజెక్టుదేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్‌లైన్ 2026 మార్చి నాటికి పూర్తయ్యేనా.. భూసేకరణకు అడ్డంకులు ఇప్పటికే నాలుగు పర్యాయాలు ప్రాజెక్టుపై సమీక్ష 9 శాతం పెండింగ్‌తో అసంపూర్తి... రూ.17,500 కోట్లకు అంచనా... నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా ఐదుగురు మంత్రుల రాక సమ్మక్క బ్యారేజీ పరిశీలన.. అనంతరం అధికారులతో సమీక్ష9 జిల్లాలకు ప్రయోజనం.. ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. -
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: రక్షాబంధన్, హయగ్రీవ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి రాఖీతో అలంకరించారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ వికాస్‌నగర్‌లోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో నిర్వాహకుడు ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి హయగ్రీవ స్తోత్రపారాయణం, అర్చన నిర్వహించారు. అదాలత్ వెనుక ఉన్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీవేంకశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం అర్చకులు దేశికన్ స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయక మిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రాత్రంతా జాగారం
● నగరంలో కురిసిన వర్షానికి స్తంభించిన జనజీవనం ● ముంపునకు గురైన కాలనీలు హన్మకొండ: నగరంలో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ముంపు ప్రాంత కాలనీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి వరంగల్ మహానగరంలో వరద పోటెత్తింది. ముంపు ప్రాంత కాలనీలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ఒండ్రు మట్టి పేరుకుపోయింది. ముంపు కాలనీల వాసులు నీళ్లను ఎత్తి పారబోస్తూ రాత్రంతా జాగారం చేశారు. అత్యధికంగా కాజీపేటలో 108.9 మిల్లీమీటర్లు, హనుమకొండలో 103 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో ఖిలా వరంగల్‌లో 68.2 నమోదైంది. ఈ వర్షాకాలం సీజన్లో అత్యంత భారీ వర్షంగా అధికారులు చెబుతున్నారు. -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్‌కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతుంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతి సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. న్యూస్‌రీల్ -
గృహాల్లో మొక్కలు నాటేలా చర్యలు
మేయర్గుండు సుధారాణి రామన్నపేట: గృహాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఆర్పీ (రిసోర్స్ పర్సన్)లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. శుక్రవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మెప్మాకు చెందిన ఆర్పీలకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ కలిసి చేపట్టారు. ఈసందర్భంగా.. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. సోమవారం నుంచి ప్రతీ వార్డులో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొక్కలు అందజేయాలని, ఈబాధ్య త ఆర్పీలదేనని స్పష్టం చేశారు. శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. స్థానిక కార్పొరేటర్ల సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ సూచించారు. ‘ఓపెన్’ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు గడువువిద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 2025–26 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు ఈనెల 13 వరకు గడువు ఉందని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ రెండేళ్లు, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ 10 ప్లస్ 2, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న వారు ‘డబ్ల్యూడబ్ల్యూబీఆర్ఏఓయూ.ఆన్లైన్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. పీజీ కోర్సుల్లోని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు. -
226 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
హన్మకొండ అర్బన్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని ఎంపికైన 226 మందికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం 14 మండలాలు, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని ఏడీ కార్యాలయాన్ని కేటాయించినట్లు సర్వే ల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. వీరంతా 40 పనిదినాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సర్వేయర్లు, డీఐ, ఏడీ సమక్షంలో శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే వీరికి తరగతుల నిర్వహణ పూర్తయ్యిందని, పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 226 మంది క్షేత్ర శిక్షణకు వచ్చినట్లు తెలిపారు. -
ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్‌కుమార్
హన్మకొండ చౌరస్తా: పాఠశాల క్రీడల సమాఖ్య హనుమకొండ జిల్లా కార్యదర్శిగా వెలిశెట్టి ప్రశాంత్‌కుమార్ నియమితులైనట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత్‌కుమార్ ప్రస్తుతం కాజీపేట మండలం తరాలపల్లి జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనను నియమించిన డీఈఓ వాసంతికి ధన్యవాదాలు తెలియజేయగా.. పీఈటీల సంఘం జిల్లా అద్యక్షుడు శీలం పార్థసారధి, కార్యదర్శి కె.మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగ సుధాకర్, పీడీలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, సుభాశ్, సురేశ్, నాగరాజు, రాజు.. ప్రశాంత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వినతివిద్యారణ్యపురి: జిల్లాలో అనుమతిలేకుండా నడుస్తున్న స్కూళ్లపై, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనుమతిలేకుండా మారుస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు, జనరల్ సెక్రటరీ మాడుగుల సంతోశ్‌రెడ్డి ఇతర బాధ్యులు శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌కు, డీఈఓ డి.వాసంతికి, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రంగయ్యనాయుడికి వేర్వేరుగా వినతి పత్రం అందించారు. హడుప్సా ట్రెజరర్ డి.శంకర్, చీఫ్ అడ్వయిజర్ వర్దమాను జనార్దన్, ఉపాధ్యక్షుడు టి.రాజేశ్వర్‌రావు, జిల్లా బాధ్యులు బి.వెంకటరెడ్డి, వి.మధుకర్‌రెడ్డి, ఆర్.నవీన్‌రెడ్డి, సి.రామారావు, కె.వాసుదేవరెడ్డి, అనిల్ పాల్గొన్నారు. వైద్యుడు సృజన్ సస్పెన్షన్ఎంజీఎం: వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష కేసులో ఎంజీఎం వైద్యుడు శ్రీనివాస్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమేరకు సృజన్‌ను సస్పెండ్ చేస్తూ.. డీఎంఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సృజన్ జూన్ 15న ప్రత్యూషను వేధించడంతో ఆమె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు సృజన్‌ను బీఎస్ఎన్ యాక్ట్ 108, 115(2), 292, 351(2), సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిట్‌తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్‌కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, శంకర్, కేవీఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్‌కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు. -
దోమల నియంత్రణలో భాగస్వాములవ్వాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య హన్మకొండ: దోమల నియంత్రణలో భాగస్వాములవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ సమ్మయ్యనగర్‌లోని లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సీజనల్ వ్యాధులు, దోమల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సందేశాత్మకంగా ఏర్పాటు చేసిన దోమతెర, దోమలకు ఆవాసాలైన నీటి కుండీలు, తదితర ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, వైధ్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు బాబు, విప్లవ్‌కుమార్, మరియా థామస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డ్రై డే, జ్వర సర్వే పర్యవేక్షణలో భాగంగా గోపాల్పూర్ ప్రాంతంలోని వేంకటేశ్వర కాలనీలో పర్యటింటించి దోమలు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
పన్ను వసూళ్లపై దృష్టి సారించండి
నగర మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. పీఓఎస్ మిషన్లకు ట్రాకింగ్ వ్యవస్థ ఉంటే ఐసీసీ కేంద్రానికి అనుసంధానం చేయాలన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా భువన్ సర్వే చేపట్టాలని, ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన రూ.48 కోట్ల నీటి పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాస్.. నిరక్షరాస్యత ఖల్లాస్!
విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్‌లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్‌రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్‌తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్ టీచర్లను కూడా ఎంపిక చేయనున్నారు. వలంటీర్లతో విద్యాబోధన మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతి ఏడాది మార్చి– సెప్టెబర్ నెలలో జరిగే ఎన్ఐఓఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో పరీక్ష నిర్వహిస్తాం, ఎన్ఎల్ఎం (నేషనల్ లిటరిసీ మిషన్ అథారిటీ, ఎన్ఐఓఎస్ కూడిన సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. నాలుగు నెలల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా ఉంది. – టి.రమేశ్‌రెడ్డి, వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్‌లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు. నిరక్షరాస్యులైన అతివలు అక్షరాస్యత వైపు.. స్వయం సహాయక సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ షురూ గ్రామస్థాయిలో వలంటీర్లకూ శిక్షణ వలంటీర్ టీచర్ల ద్వారానే బోధన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613 మంది నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆదిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇంకా మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే వారిని 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్ కార్యకమ లక్ష్యంగా ఉంది. -
తల్లిపాలతో ఆరోగ్యం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ పాల్గొన్నారు. పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు పంద్రాగస్టు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15న ఉదయం ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ మైదానంలో నిర్వహించే జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదిక అలంకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, అతిథులను వేడుకలకు ఆహ్వానించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, అఽధికారులు రాంరెడ్డి, సాంబశివరావు, కౌసల్యాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏనుమాముల మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాంలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని డబుల్బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. 11వ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కెమిస్ట్ భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. -
గురుదక్షిణ కోసమే నీటి పంపింగ్ చేయని సీఎం
మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య హన్మకొండ: గురు దక్షిణ ఇవ్వడానికి, ఆంధ్రా, బనకచర్ల ప్రాజెక్టుకు నీటిని వదలడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి గోదావరి జలాలను పంపింగ్ చేయడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వర్షాలు పడకున్నా రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడానికి కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు నీటి ప్రాజెక్టులను నిరుపయోగంగా మార్చిందని, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని తూర్పారబట్టారు. సాగునీటిపై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నీటి విడుదలపై కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఘోష్ కమిషన్ 660 పేజీల నివేదికలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న 60 పేజీల అంశాలను మాత్రమే బయట పెట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను జైలుకు పంపే దిశగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నాలుగు కమిషన్ల రిపోర్టులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉన్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీలో పూర్తి నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జోరిక రమేశ్, హరి రమాదేవి, దేవమ్మ, కర్ర సోమిరెడ్డి, నాగుర్ల కృష్ణమూర్తి, గుండె మల్లేశ్, పడాల సతీశ్ పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి గురువారం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్‌ల వారీగా తాగునీరు, విద్యుత్ తదితర వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణశాఖ పీడీ సిద్ధార్థనాయక్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు రావాలి.. డిమాండ్‌కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు తీసుకురావాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చేనేత కార్మికులకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు చేనేత నడక (హ్యాండ్లూమ్ వాక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి జెండా ఊపి చేనేత నడకను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 800 మంది నేత కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా చేసిందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈసందర్భంగా చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేతపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలను సన్మానించారు. చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించండిభూభారతి సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి దరఖాస్తుల విచారణ, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ ‘కుడా’ ఆఫీస్ సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన గుండల కృష్ణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో పనికి వెళ్లి తిరిగి రాత్రి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ముస్కులపల్లి బొడ్రాయి సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక ఉన్న బైక్.. లారీని ఢీకొంది. దీంతో బైక్‌పై నుంచి రోడ్డు మీద పడిన కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి గుండల అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాగా, ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్‌డీసీపీ అంకిత్ కుమార్ పరిశీలించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
రీజన్స్ లేకుండా రిజెక్టు చేయొద్దు..
జనగామ: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే కారణం లేకుండా రిజెక్ట్ చేయొద్దని.. ఒక వేళ చేసినా కారణం చెప్పాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహిసినపర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. డీసీపీ రాజమహేంద్రనాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఘనస్వాగతం పలికింది. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ప్రజల కోరిన మేరకు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆర్టీఐకి ఎప్పుడూ భయపడొద్దన్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం కోరిన 30 రోజుల వరకు సమయం ఉంటుందని, కారణం చూపకుండా గడువు దాటితే సంబంధిత అధికారి నుంచి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే అప్పీల్‌కు వెళ్లొచ్చన్నారు. గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే స్టేట్ కమిషన్‌కు ఫిర్యాదు వెళ్తుందని, మొదటి అప్పీల్ జిల్లా అప్పీలేట్, రెండో అప్పీల్ స్టేట్ కమిషన్ వద్దకు వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుడు నష్టపోతే ఆ పరిహారాన్ని పీఐఓలు భరించాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో సహచట్టం ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతో తీసుకొచ్చారో, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని చెప్పారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కుచట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మూడు, ఆరు నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి సలహాలు, సూచనలు అందించారు. అధికారులు ఆర్టీఐకి భయపడొద్దు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి -
ఆడిందే ఆట!
పూర్తిస్థాయి అధికారులతోనే.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 చిట్ఫండ్ల పర్యవేక్షణకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదు. ప్రజలకు బాధలు తీరేలా లేవు. పదోన్నతుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖలోని ఉన్నతాధికారుల పాలన ఇన్‌చార్జ్‌ల చేతుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే శాఖలో ఇన్చార్జ్ పాలనతో నిర్వహణ గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 బ్రాంచ్‌లతో కూడిన చిట్‌ఫండ్ కార్యాలయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక కింది స్థాయి అధికారుల విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఆడిందే ఆటగా కొలువులు సాగిస్తున్నారు. ప్రజల బారులు.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు చిట్స్, ఆడిటింగ్, కోర్టు కేసులు, ప్రొహిబిటెడ్, ల్యాండ్ కేసులు, డాక్యుమెంట్లలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి నిత్యం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు బారులు దీరుతుంటారు. ఇక్కడ పని చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్‌ను జూలైలో హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ నియమించారు. ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా బదిలీపై వచ్చిన యామిని రెండు నెలల కాలవ్యవధిలో విధులు చేపట్టి నాటినుంచి నేటి వరకు లాంగ్ లీవ్‌లో వెళ్లిపోవడంతో ఇన్చార్జ్ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పాలనే కొనసాగుతోంది. దీంతో చిట్స్‌లో పేరుకుపోయిన చిట్‌ఫండ్స్ లావాదేవీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్‌చార్జ్‌ల చేతుల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం పూర్తి స్థాయిలో అధికారులను నియమిస్తే సమస్యలు పరిష్కారం -
తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలి
● మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ హన్మకొండ: తీజ్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ అని అన్నారు. 9 రోజులపాటు ఆటపాటలతో అలసట నుంచి విముక్తి కావాలని, అందరు బాగుండాలని జరుపుకుంటారన్నారు. పెళ్లికాని ఆడ బిడ్డలు ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గోర్ బంజార తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బంజారాలు అందరు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తీజ్ ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లోక్‌నాయక్, బాదావత్ బాలాజీనాయక్, ధరావత్ కిషన్ నాయక్, భూక్యా రాజునాయక్, డాక్టర్ చందునాయక్, మాలోత్ రమేశ్, భిక్షపతినాయక్, కిశోర్ నాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు. -
అదనపు కట్నం వేధింపులు..
● భర్తకు ఏడాది జైలు వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేలు జరిమానా విధిస్తూ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిసోని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దొనికల అనూషకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గుడ్డేటి దిలీప్‌కుమార్‌తో 2020, నవంబర్ 11న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.40 లక్షలు, 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం కొద్ది రోజులు బాగానే చూసుకున్న దిలీప్‌కుమార్ కుటుంబీకులు తక్కువ కట్నం తెచ్చావంటూ అనూషను వేధించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా దిలీప్‌కుమార్.. భార్య అనుషాతో కలిసి 2021, జూలై 27న అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రూ. కోటి అదనపు కట్నం తీసుకురావాలని, లేనిపక్షంలో విడాకులు ఇస్తానని బెదించాడు. దీంతో అనూష.. దిలీప్‌కుమార్‌పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మందలించి వదిలేశారు. అనంతరం 2022, జూలై 30న అనూష, దిలీప్‌కుమార్ ఇండియాకు తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన దిలీప్‌కుమార్ తల్లిదండ్రులు అనూషను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో అనూష తల్లిదండ్రులు తాత్కాలికంగా ఉంటున్న ఘట్కేసర్ వద్ద ఆమెను వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అనూష ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రుల ఎదుటే ‘నీకు విడాకులు ఇస్తా’ అని చెప్పి దిలీప్‌కుమార్‌తోపాటు కుటుంబీకులు స్వగ్రామం వచ్చారు. ఈ విషయంపై అనూష తల్లిదండ్రులు పంచాయితీ నిర్వహించగా విడాకులు తీసుకుంటానని దిలీప్‌కుమార్ పెద్దల సమక్షంలో చెప్పాడు. దీంతో చేసిదేమీ లేక అనూష మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శాంతిసోని.. నేరస్తుడు దిలీప్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేల విధిస్తూ తీర్పు వెలువరించారు. -
విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
నెల్లికుదురు: నిత్యం పరిసరాలను గమనిస్తూ ఒక్కసారిగా వచ్చే మెరుపు వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదం లాంటి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కమాండర్ భూపేంద్ర కుమార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు, మదనతుర్తి, మునిగలవీడు, రావిరాల, రాజులకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి గురువారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విపత్తులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బృందం వివరించింది. కాగా, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు రావిరాలలో కొట్టుకుపోయిన రోడ్డును విపత్తు బృందం, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు బృంద సభ్యులు మురళీరాథోడ్, మోహన్‌రావు, మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందానరేశ్, ఎంపీఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ భూపేంద్ర కుమార్ -
చేతిలోనే సమస్త సమాచారం..
ఖిలా వరంగల్: భారతీయ రైల్వే ప్రయాణికులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగా ట్రైన్లో ప్రయాణించాల్సిన వ్యక్తి ఇక నుంచి రైల్వే సేవలకు అటు ఇటు వెళ్లాల్సిన పనిలేదు. కావాల్సిన సమాచారమంతా కూర్చున్న చోటు నుంచే తెలుసుకునేలా అనేక యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల ద్వారా ప్రయాణికులకు క్షణాల్లో మెరుగైన సేవలు అందుతాయి. దీనికి కావాల్సింది చేతితో స్మోర్ట్ ఫోన్ మాత్రమే. ఈ క్రమంలో ఈ రైలు యాప్‌లు ఎలాంటి సేవలు అందిస్తాయి.. ఎలా పొందాలనే అంశాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం టికెట్‌కు ఇబ్బంది లేదు.. యూటీఎస్, రైల్ వన్ యాప్‌ల నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.అంతేకాదు అత్యవసరంగా అన్ రిజర్వుడ్ టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందొచ్చు. అలాగే, యాప్‌ల ద్వారా సాధారణ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, నెలవారీ టికెట్, క్యాన్సలేషన్, టికెట్ హిస్టరీ, బుకింగ్ టికెట్ సమాచారం, ఆర్.వాలెట్, టికెట్ ప్రొఫైల్, టికెట్ ట్రాన్జాక్షన్, రైల్ లైవ్ లోకేషన్ మొత్తం యాప్‌ల ద్వారా సులభంగా తెలుసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రైళ్ల కోసం.. ఈ యాప్‌ల సేవలు అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్ వన్, యూటీఎస్ యాప్‌ల ద్వారా వెళ్లాల్సిన ప్రాంతం, ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రైన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్‌పైకి రైలు వస్తుంది, కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది.. ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రైన్ ద్వారా తెలుసుకోవచ్చు. రిజర్వేషన్ స్థితి.. ఈయాప్ల్లో టికెట్ రిజర్వేషన్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ స్థితి, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలు, రిజర్వేషన్ రద్దు, తదితర అంశాలనూ తెలుసుకోవచ్చు. సీటు వద్దకే ఆహారం.. రైలు ఎక్కగానే ప్రయాణికులకు ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ముందే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే రైలులో సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులు.. ఏమైనా సూచనలు ఇవ్వాలనుకున్నా.. రైళ్లలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదులు చేయడానికి రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కాగా, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 8వేలకు పైగా మంది ప్రయాణిస్తుంటారు. ఫలితంగా ప్రతీ రోజు రైల్వేశాఖకు రూ.6లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కూర్చున్న చోటే క్షణాల్లో వివరాలు అందుబాటులో రైల్‌వన్, యూటీఎస్ యాప్‌లు రైల్వే సమాచారం కోసం ఇక నుంచి ఎటు వెళ్లాల్సిన అవసరం లేదుడౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి.. ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజస్ట్రేషన్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది. -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో గురువారం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలిన్, కిడ్స్) పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌త్రోలో బంగారు పథకం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జనగామలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బైరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కిరణ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సుగుణాకర్, హనుమంతరావు, గజ్జెల్లి రాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. 33 జిల్లాలు.. 6వందల మంది క్రీడాకారులు జనగామ జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లె టిక్స్ పోటీలకు 33 జిల్లాల నుంచి 6 వందల మంది క్రీడాకారులు హాజరయ్యా రు. జావెలిన్ క్రీడతోపాట అండర్–8,10,12 విభాగాల్లో బాల, బాలికలకు పరుగు పందెం, అప్రోచ్ లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించారు. అండర్–8 విభాగంలో బాల, బాలికలకు 1.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 2.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–12 విభాగంలో బాల, బాలికలకు 3.60 మీటర్లు ఫైవ్ మీటర్స్ అప్రోచ్డ్ లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో బాల, బాలికలకు కిడ్స్ జావెలిన్‌త్రో, అండర్–16,18, 20 విభాగాల్లో యువతీ, యువకులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించారు. చదువుతోపాటు ఆటల్లో రాణించాలి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అట్టహాసంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం 33 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు -
ఎన్నికల హామీలు నెరవేర్చండి
● ఈ నెల 13న హైదరాబాద్‌లో మహాగర్జన ● పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ హసన్‌పర్తి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంప్ సమీపంలోని ఎంటీఆర్ గార్డెన్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్‌దారుల సన్నాహాక సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈసమావేశానికి మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలోగా 15 డిమండ్లు నెరవేర్చాలన్నారు. 13న మహాగర్జన ఎన్నికల్లో ఇచ్చిన మేరకు హామీలు పరిష్కరించకపోతే ఈనెల 13న హైదరాబాద్‌లో లక్షలాది మందితో ఎల్బీ స్టేడియంలో మహాగర్జన సభ నిర్వహిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుమార్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో ఎంపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్, హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ సోమన్న, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు పుట్ట రవి, ఆరెపల్లి పవన్, రాజారపు భిక్షపతి, వికలాంగుల సంఘం నేతలు పాల్గొన్నారు. -
స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్
హన్మకొండ: తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు అహర్నిశలు పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలోని జయశంకర్ విగ్రహానికి బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చనిపోయే వరకు తెలంగాణ కోసం పోరాడారన్నారు. భావ వ్యాప్తి ద్వారా ఉద్యమం ఉదృతంగా సాగిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడంతోపాటు ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హనుమకొండ తహశిల్దార్ రవీందర్ రెడ్డి, జయశంకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ సౌజన్య, ఏఓ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్ -
రైల్వే సమస్యలు పరిష్కరించాలి
● కేంద్ర మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి కాజీపేట రూరల్ : న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ను బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో బస్‌స్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణ, కాజీపేట అమృత్ భారత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం కాజీపేట బస్‌స్టేషన్ ఆవశ్యకతపై రైల్వే మంత్రికి వివరించి, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించారని, ప్రజారవాణా దృష్ట్యా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి ఆ అంశాలను పరిశీలించి నివేదికలు పంపించాలని అధికారులకు చెప్పారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆటోడ్రైవర్‌కు ఏడాది జైలు వరంగల్ లీగల్ : నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమమైన డ్రైవర్ మరుపట్ల తారయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ కోర్టు జడ్జి చింతాడ శ్రావణ స్వాతి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020, అక్టోబర్ 9న బీటెక్ విద్యార్థి బి.జశ్వంత్ బైక్‌పై హైదరాబాద్ నుంచి హనుమకొండ బయలుదేరాడు. మార్గమధ్యలో రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా జంక్షన్లో మడికొండ నుంచి వస్తున్న ఆటో నిర్లక్ష్యంగా కుడి వైపునకు ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియా వైపుగా మళ్లించడంతో బైక్‌కు తగిలింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, బైక్ నడుపుతున్న బి.జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో ఎంజీఎం తరలించారు. ఆటో డ్రైవర్ కాజీపేట రహమత్‌నగర్‌కు చెందిన మరుపట్ల తారయ్య అని తెలిసింది. అనంతరం జశ్వంత్ కుటుంబీకులు ఎంజీఎం వెళ్లేసరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శ్రావణ స్వాతి.. నేరస్తుడికి ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు సీఐ కిషన్, ఎస్సై కుమారస్వామి, పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్‌గా పరమేశ్వరి, కుమారస్వామి విచారణ పర్యవేక్షించారు. కానిస్టేబుల్ వీరగోని రాజేశ్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
పట్టువదలని కార్మికులు ..
జనగామ: పట్టు చీర.. మహిళలు అమితంగా ఇష్టపడే వస్త్రం. చూడడానికి హుందాగా, అందంగా కని పించే చీర. వివాహాది, ఇతర శుభకార్యాల్లో కట్టుకోవడానికి మగువలు అత్యంత ఇష్టపడే చీర. అందుకే వస్త్ర ప్రపంచంలో పట్టుచీర మకుటం లేని మహారాణి. అయితే ఆ చీర తయారీ వెనుక నేతకార్మికుల కష్టం వెలకట్ట లేనిది. పట్టుదారం నుంచి రంగులు అద్దే వరకు చేతి వేళ్లనే ఆడిస్తూ అందమైన చీరను తయారు చేస్తున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టు చీరలకు స్వర్గధామమైన పోచంపల్లి తర్వాత జనగామకు ప్రత్యేక స్థానం ఉంది. నేతకార్మికులు రోజుకు వెయ్యి పట్టు చీరలు తయారు చేస్తూ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే 30 నుంచి 45 రోజుల్లో ఎనిమిది చీరలు నేసే నేత కార్మికులకు పావలా లాభం వస్తే, రిటైల్ మార్కెట్లో వ్యాపారులు వేల రూపాయలు అర్జిస్తున్నారు. ఫలితంగా నేత కార్మికులు మాత్రం ఇంకా పూటగడవని స్థితిలోనే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వాలు సాయం చేసినా, చేయకున్నా దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) జాతీయ చేనేత దినో త్సవం. ఈ సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల వివరాలు, సొసైటీలు, మరమగ్గాలు, ప్రభుత్వం సా యం, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్‌లో బచ్చన్నపేటలోనే మొదటి మగ్గం.. ఉమ్మడి వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో 1970–71 సంవత్సరంలో మొట్టమొదటి మగ్గం ప్రారంభించారు. నేత కార్మికులు రెండు నెలల పాటు మగ్గం నేస్తూ ఎనిమిది చీరల(వార్పు)ను తయారు చేసేవారు. ఒక్కో చీరకు రూ.20 లాభం తీసుకుని రూ.120కి పోచంపల్లికి చెందిన హోల్‌సేల్ వ్యాపారు లకు అమ్ముకునే వారు. అప్పటి వరకు వివిధ రంగాల్లో పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు మగ్గం బాటపట్టారు. బచ్చన్నపేటలో మొదలైన పట్టుచీర తయారీ మండలంలోని అనేక గ్రామాలకు విస్తరించింది. ఏడాది తర్వాత జనగామలోని వీవర్స్ కాలనీ, లింగాలఘణపురం మండలం వడిచర్ల, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో మగ్గాలతో పట్టు చీరలు తయారు చేయడం మొదలు పెట్టారు. జనగామ జిల్లాలో 11 సొసైటీలు.. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం జనగామ జిల్లాలో 11 సొసైటీలుండగా, 3వేల మంది నేత, అనుబంధ కార్మికులు, 17 వందల మగ్గాలు, 450 పవర్ లూమ్స్ ఉన్నాయి. జిల్లాలో నెలవారీగా 15 నుంచి 17 వందల వరకు సెమికతాన్, రాజ్‌కోట్, పాట్లిపళ్లు, రాజ్కోట్పేటి, బార్డర్ సాదా, బార్డర్డిజైన్, కాటన్ తదితర డిజైన్లకు సంబంధించి పట్టు చీరలు త యారు చేస్తున్నారు. రూ.5,500 నుంచి రూ.13వేల వరకు హోల్‌సేల్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. రుణమాఫీకి నోచుకోని నేత కార్మికులు.. ప్రభుత్వం నేత కార్మికులకు రుణ సాయంతోపాటు నేతన్న పొదుపు, బీమా ద్వారా భరోసా కల్పిస్తోంది. జిల్లాలో రుణసాయం కోసం 679 మంది నేత కార్మికుల జాబితాతో జిల్లా కమిటీ అప్రూవల్ చేసి ప్రభుత్వానికి పంపించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల రుణమాఫీ హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. అలాగే, చేనేతబంధు పథకం అమలు కూడా అదే పరిస్థి నెలకొనడంతో కార్మికులకు ఎదురుచూస్తున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవందశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకుంటున్న నేత కార్మికులు పోచంపల్లి తర్వాత పట్టు చీరకు నిలయం జనగామ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి బచ్చన్నపేటలో మొదలైన ‘మగ్గం’ చప్పుళ్లుజనగామ జిల్లాలో నేత కార్మికుడి ఇంట్లో, షోరూంలలో పట్టు చీరల ధరలు నేత కార్మికుడి ఇంట్లో షోరూంలో.. సెమికతాన్ రూ.5,500 రూ.8,000 రాజ్‌కోట్ రూ.8,500 రూ.10,500 పాట్లిపళ్లు రూ.9,000 రూ.14,000 రాజ్కోట్పేటి రూ.9,000 రూ.16,000 బార్డర్ సాదా రూ.5,000 రూ.7,000 -
కుక్క అడ్డొచ్చి ఆటో బోల్తా..
న్యూశాయంపేట: వరంగల్ దూపకుంట రోడ్డులోని గిరిప్రసాద్ నగర్ వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో బాలికల మైనారిటీ గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీజీటీ ఉర్దూ టీచర్‌గా పనిచేస్తున్న అజ్మీరీబేగం(38) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దూపకుంట రోడ్డులోని మైనారిటీ బాలికుల గురుకులంలో పనిచేస్తున్న ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల సమయం పూర్తికాగానే ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో మహిళ కూడా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో గిరిప్రసాద్‌నగర్ వద్దకు రాగానే కుక్క ఆటోకు అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. కాగా, డ్రైవర్ పక్కన కూర్చున్న అజ్మీరీ బేగానికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్‌కు తీవ్ర, నలుగురు టీచర్లు, మరో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఎంజీఎం, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. ● గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్ మృతి ● డ్రైవర్‌తోపాటు మరో ఐదుగురికి గాయాలు -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
హన్మకొండ అర్బన్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్ పాండే అన్నారు. బుధవారం జులైవాడలో ప్రభుత్వ బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..బాలికలు చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ఆశా యూనిట్ మెంబర్ పి.శ్రీనివాస్, సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్, హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రేపు పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లురామన్నపేట: టీజీ పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 8న(శుక్రవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, టీజీ పాలిసెట్ హెల్ప్‌లైన్ సెంటర్, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లకు టీజీ పాలిసెట్–2025లో అర్హత పొందిన, పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో వివిధ కేటగిరీల్లో మిగిలి ఉన్న 28 సీట్లకు ఈ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 8న ఉదయం 10 గంటల వరకు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి వెంట టీసీ, ఎస్సెస్సీ మెమో, స్టడీ, కుల సర్టిఫికెట్స్, ఆధార్‌కార్డు, టీజీ పాలిసెట్–2025 ర్యాంక్ కార్డు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని రావాలని కోరారు. వివరాలకు http://tgpolycet.nic.in వెబ్సైట్ సందర్శించాలని వివరించారు. -
ప్రయోగాలతో సైన్స్బోధన
విద్యారణ్యపురి: విజ్ఞానశాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా బోధించినప్పుడే విద్యార్థుల్లో శాసీ్త్రయ వైఖరులు పెంపొందుతాయని హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి తెలిపారు. బుధవారం హనుమకొండలోని లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్– ఏటీఅండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో అగస్త్య ఫౌండేషన్ వారి సౌజన్యంతో విద్యార్థులకు సులభంగా బోధించే విషయంపై జిల్లాలోని ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..భౌతికశాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా సులభంగా బోధించేందుకు తక్కువ ఖర్చుతో రూ పొందించిన కృత్యాలను ఉపాధ్యాయులచే చేయించారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర ఫోరం బాధ్యులు ఎ.జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, అగస్త్య ఫౌండేషన్ ఏరియా మేనేజర్ చల్ల మౌనిక, విషయ నిపుణులు డి.వెంకట్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్లు మహేందర్, తిరుపతి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి -
ఎంజీఎంకు వైద్య పరికరాల అందజేత
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వివిధ వ్యాధులతో బాధపడే పేద రోగులకు సేవలందించడం కోసం సుబేదారిలోని కాకతీయ హైస్కూల్‌కు చెందిన 1990 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఒక డీ – ఫీబ్రీలెటర్, 12 వీల్ చైర్లను బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్, డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, ఆర్యంల సమక్షంలో ఆర్ఎంఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు సత్యనారాయణరావు, విజయకుమార్, శ్రీనివాస్, చిట్టి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
కుట్రలో భాగమే కాళేశ్వరంపై దుష్ప్రచారం
మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డిహన్మకొండ: కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకులు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడా రు. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే.. కేసీఆర్ మన తెలంగాణ కోటి ఎకరాల మాగా ణి అని రుజువు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తుంటే మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించారన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమేనని.. జడ్జిమెంట్ కాదన్నారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వ పెద్దదే బాధ్యత అయితే... సివిల్ సప్లై శాఖలో జరిగిన రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసినట్టేనా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, చెన్నం మధు, సంకు నర్సింగరావు, జనార్దన్ గౌడ్, రజినీకాంత్, హరి రమాదేవి పాల్గొన్నారు. -
లారీ, కారు ఢీ
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట సమీప వైకుంఠధామం ఎదుట 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై బి. గిరిధర్‌రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఐరన్ షాపు యజమాని బూర అశోక్‌కుమార్‌గౌడ్ (55) కారులో మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు మండలం భూపతిపేట సమీపంలోని వైకుంఠధామం వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపున వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు సగభాగం నుజ్జునుజ్జయి అశోక్‌కుమార్ గౌడ్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. ఎస్సై గిరిధర్‌రెడ్డి రెండు గంటల పాటు శ్రమించి కారు సగభాగం వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. అక్కడికక్కడే ఒకరు దుర్మరణం భూపతిపేట సమీపంలో ఘటన -
సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలి
హన్మకొండ: విద్యుత్ సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్ఏఓ, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మన్ల గద్దెలను, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ స్తంభాలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతీ వారం దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తూ పనులు పురోగతిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జీఎంలు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఆర్టీసీ పండుగల ప్రత్యేకం
హన్మకొండ: వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ పెరగనుండడంతో టీజీఎస్ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రయాణికులను సురక్షితంగా, సుఖవంతంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు ఐదు రోజులు ప్రత్యేక బస్సులు నడుపనుంది. ప్రయాణికులు ప్రైవేటు వాహనా ల్లో వెళ్లకుండా నియంత్రించడంతో పాటు ఆర్టీసీకి ఆదాయాన్ని రాబట్టుకోవడం..సురక్షితంగా ప్రయాణికులను చేరవేసేందుకు పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 8న వరలక్ష్మి వ్రతం, 9న రాఖీ పౌర్ణమి కావడంతో పాటు 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంతూళ్లకు బయలుదేరుతారు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరుగనుండడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. హనుమకొండ బస్ స్టేషన్, ఉప్పల్ పాయింట్లో ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి, అవసరాన్ని బట్టి బస్సులు సమకూర్చడానికి 24 గంటలు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్ పాయింట్లో టెంట్లు, తాగునీటి సదుపాయం, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ రూట్‌తో పాటు వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలోని బస్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీని అనుసరించి అదనపు బస్సులు నడిపేలా అధికారులు సమాయత్తమయ్యారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం. ఈ దిశగా వరలక్ష్మివ్రతం, రాఖీ పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, క్షేమంగా గమ్యస్థానా లకు చేరేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. రీజియన్ పరిధిలోని సోదరసోదరీమణులంతా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –డి.విజయభాను, ఆర్టీసీ ఆర్ఎం వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి పెరగనున్న రద్దీ నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక బస్సులు వరంగల్ రీజియన్‌లో9 డిపోల నుంచి హైదరాబాద్‌కు బస్సుల పెంపు -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీ లక్ష్మి, గార్ల -
విద్య, ఆరోగ్యంతోనే ప్రజాశ్రేయస్సు
కేయూ క్యాంపస్ : అభివృద్ధి అంటే మౌలిక వసతులు, తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తియే కాదని, విద్య, ఆరోగ్య ద్వారానే ప్రజాశ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా రాష్ట్రాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో డాక్టర్ జయశంకర్ స్మారకోపన్యాసం కార్యక్రమంలో ‘డెవలప్మెంట్ డిపార్టీస్ అండ్ ది ఫర్మార్మెన్స్ ఆఫ్ ది సోషల్ సెక్టార్ ఇన్‌ది సౌథర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వివిధ రంగాల్లో వెనుకబాటులోనే ఉందన్నారు. విద్య, వైద్య శ్రేయస్సు ద్వారానే ఉత్పాదకత పెరుగుతుందన్నారు.బాలికలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ ఉందన్నారు.డాక్టర్ జయశంకర్ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణను కలగన్నారన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్ మాట్లాడుతూ జయశంకర్ గొప్పమానవతావాది అన్నారు. తెలంగాణ స్వాప్నికుడు, విద్యావేత్త, దూరదృష్టిగల గొప్పవ్యక్తి అని కొనియాడారు. కేయూ విశ్రాంత కామర్స్ విభాగం ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్, జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎ. శంకరయ్య మాట్లాడుతూ జయశంకర్ గొప్పపరిపాలనాదక్షుడన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. హెచ్‌సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
కొడుకు హత్యకు గురయ్యాడని..
నల్లబెల్లి: కొడుకు హత్యకు గురయ్యాడనే మనస్తాపంతో తండ్రి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ కోక్యా(65), వాలి దంపతుల చిన్న కుమారుడు కొమ్మాలు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో గత ఏప్రిల్ 12న హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కోక్యా మనస్తాపానికి గురై ఆహారం మానేశాడు. దీంతో కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులతో కుమారుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. ● మనస్తాపంతో తండ్రి మృతి ● మూడు చెక్కలపల్లిలో ఘటన -
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టం చేయాలి
హన్మకొండ : బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గద్దర్ స్ఫూర్తిని ఈతరం కొనసాగించాలన్నారు. దేశ సాంస్కృతిక చరిత్రలో గద్దర్‌ది చెరగని స్థానమని, ఆయన జీవించి ఉన్నంత కాలం ప్రజల కోసమే పాటుపడ్డారన్నారు. తొలి రోజుల్లో బుల్లెట్‌ను నమ్ముకున్న గద్దర్.. తర్వాత అంబేడ్కర్ మార్గంలోకి వచ్చి బ్యాలెట్‌ని నమ్మారన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినా తన వర్గానికి కాకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ముస్లింలను చూపిస్తూ కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ పోరాటం చేసిన స్వాగతిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన గద్దర్ కృషి మరువలేనిదన్నారు. గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ వరంగల్‌తో పాటు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడ రంజిత్ కుమార్, కాడపాక రాజేందర్, రామంచ శ్రీను, ప్రొఫెసర్ వీరస్వామి, ఆస్నాల శ్రీనివాస్, బండి మొగిలి, సాయిని నరేందర్, టి.ఎన్.స్వామి, మన్నే బాబురావు, రామంచ భరత్, తాళ్ల సునీల్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య -
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఉన్న అన్ని ఆస్పత్రులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా.. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, అబార్షన్లు నిర్వహించే వారి సమాచారాన్ని తెలి యజేసేందుకు సంబంధిత ఫోన్ నంబర్ 63000 30940 ను క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ప్రతీ ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. లీగల్ వలంటీర్ల ద్వారా లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 8 సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, ఏసీపీ నరసింహారావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య, బన్ను ఆరోగ్య సేవల సొసైటీ ప్రతినిధి నీతి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మంజుల, డెమో అశోక్‌రెడ్డి, ప్రసన్నకుమార్, కళ్యాణి, పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్చెకప్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో విద్యా, సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఈఓ డివాసంతి, డీఐఈఓ ఎ.గోపాల్, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య పాల్గొన్నారు. ఇళ్ల పనులు ఇంకెన్నాళ్లు? క్రితం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు? ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు? అని కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశ్నించారు. పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించినప్పటికీ గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇసుక కూడా సరఫరా చేయలేదని లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ సిద్ధార్థనాయక్ తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ రవి, ఎంపీఓ కర్ణాకర్‌రెడ్డి, ఏఈ సరిత పాల్గొన్నారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో లైవ్‌లో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు వీక్షించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చిందన్నారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞంగా సాగునీటి ప్రాజెక్టులను మార్చిన అనుభవం ఉన్న కాంగ్రెస్ కాళేశ్వర ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసే ధైర్యం లేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో ఆయా సంస్థల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుధీర్‌కుమార్, మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరి
వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం: గర్భిణులు అన్ని పరీక్షలతోపాటు ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రసవానికి ముందు 9వ నెలలో ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుంటే మంచి ఫలితాలుంటాయని వరంగల్ జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. ఐఎంఏ హాల్లో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్, కంట్రోల్ యూనిట్ అధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, ఎయిడ్స్ నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంజీఎం, నర్సంపేట ప్రభుత్వ హాస్పిటల్, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ ప్రోగ్రాం అధికారి మోహన్‌సింగ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, అసిస్టెంట్ అకౌంటెంట్ కమలాకర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులున్నారు. -
ఐసీసీసీకి అనుసంధానం చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ రామన్నపేట: గ్రేటర్ పరిధి చెత్త తరలింపు వాహనాల సమాచారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)కి అనుసంధానం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వాహనాల పనితీరు తెలుసుకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల వారీగా కేటాయించిన వాహనాలకు ప్రత్యేక గుర్తిపు నంబర్లను కేటాయించనున్నట్లు తెలిపారు. డీసెంట్రలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ కేంద్రాలను విలీన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. కాంపాక్టర్లను పునరుద్ధరించి 3 వాట్స్ సామర్థ్యంతో ఒక్కో కాంపాక్టర్ను ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్ఫర్ స్టేషన్లపై భారం తగ్గుతుందని సిబ్బందికి సూచించారు. జవాన్లను టీమ్‌లుగా ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎన్ఫోర్స్మెంట్లలో వినియోగించేలా చూడాలని సీఎంహెచ్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఐటీ మేనేజర్ రమేశ్, ఐసీసీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్గదర్శకాలు పాటిస్తేనే అనుమతులునిర్దేశిత మార్గదర్శకాలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం నగరంలోని కాకతీయ కాలనీ ఫేజ్–2, కాశిబుగ్గ, డాక్టర్స్ కాలనీ ప్రాంతాల్లో కమిషనర్ భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన దస్త్రాలను పరిశీలించారు. కొలతలు వేసి సమర్పించిన దస్త్రాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పైడిపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్, ఏసీపీ రజిత, టీపీఓ ఏర్షాద్, ఇన్చార్జ్ ఈఈ సంతోశ్‌బాబు, డీఈ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
చదువు.. క్రీడలు..
ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో రీసెర్చ్ స్కాలర్ కృష్ణవేణి ప్రతిభకేయూ క్యాంపస్: మలేషియాలో గత నెల30, 31తేదీల్లో నిర్వహించిన ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం పరిశోధకురాలు మాచర్ల కృష్ణవేణి కాంస్య పతకం సాధించారు. భారతదేశం తరఫున పాల్గొన్న ఆమె ఇండియన్ పారా తైక్వాండో ప్రెసిడెంట్ వీణ చేతులమీదుగా పతకం అందుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన ఎల్లగౌడ్ – హైమావతి దంపతుల కుమార్తె కృష్ణవేణి. తండ్రి ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. కృష్ణవేణి హనుమకొండ సుబేదారిలోని దివ్యాంగుల హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. మరోవైపు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. తైక్వాండో పోటీలకు ఆన్లైన్లోనే ఈ.గణేష్ కోచింగ్ ఇస్తుండగా, జనగామలోని తైక్వాండో కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్థిక సహకారంతో ఏషియన్ పోటీలకు.. మలేషియాలో ఏషియన్ పారా ౖతైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు మాచర్ల కృష్ణవేణికి ఆర్థికపరమైన సమస్య ఏర్పడగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అధికారులు రూ.25వేలు అందజేశారు. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలోని ప్రవాస భారతీయులు, ఆ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎన్.శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ గిరిగౌడ్, డాక్టర్ అతికం శ్రీనివాస్‌గౌడ్ కలిపి రూ.1.40లక్షలు అందించారు. దాతల ఆర్థికసాయంతో ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రతిభ చూపి కాంస్య పతకం సాఽధించిన కృష్ణవేణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీల్లోనూ.. గతేడాది 2024లో కాంబోడియాలో నిర్వహించిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లోనూ బంగారు పతకం సాధించారు. అలాగే, గత మార్చిలో ఫస్ట్ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్లో కాంస్యపతకం సాధించారు. చిన్నప్పటినుంచి చదువుతోపాటు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొంటున్న కృష్ణవేణి పారా సిట్టింగ్ వాల్బాల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. 2021లో కర్ణాటక ఉడిపిలో జరిగిన జాతీ యస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పొటీల్లో, 2024 మా ర్చిలో రాజస్థాన్‌లో జరిగిన జాతీయస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో, తమిళనాడు ఈరోడ్‌లో జరిగిన సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ చూపారు. కృష్ణవేణి కామర్స్విభాగంలో పరిశోధకురాలు.. కాకతీయ యూనివర్సిటీలోనే కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ కోర్సు చేశాక మూడేళ్లుగా ఇదే విభాగంలో పరిశోధకురాలుగా పీహెచ్డీ చేస్తున్నారు. ‘ప్రాబ్లమ్స్ ఆండ్ ప్రాస్పెక్టివ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్విస్ట్మెంట్ ఇన్ఇండియా ఏ స్టడీ’ అనే అంశంపై ఆ విభాగం ప్రొఫెసర్ నర్సింహాచారి పర్యవేక్షణలో పరిశోధన సాగిస్తున్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణిని సోమవారం యూని వర్సిటీలో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణవేణి క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తూ విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. ఇత ర విద్యార్థులకు ప్రేరణగా నిలిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య, దివ్యాంగుల సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, తదితరులు పాల్గొన్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ -
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
అండర్–16 బాలికల విజేత హనుమకొండ ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోయేషన్ల ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు.. ఆయా జిల్లాల అథ్లెట్ల మధ్య హోరాహోరీగా సాగిన వివిధ పోటీల్లో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అండర్–18 బాలుర కేటగిరీలో మహబూబ్‌నగర్, బాలికల అండర్–18 విభాగంలో ఖమ్మం, అండర్–16 బాలుర విభాగంలో రంగారెడ్డి, అండర్–16 బాలికల విభాగంలో హనుమకొండ జిల్లా విజేతలుగా నిలిచాయి. ముగింపు వేడుకలకు ఆర్యవైశ్య సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేశ్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చాంపియన్‌షిప్ కోసం పోటీలో పాల్గొన్న ప్రతీ అథ్లెట్ విజేతే అన్నారు. పతకం సాధించలేదని ఆందోళన చెందకుండా, మరోసారి బరిలోకి దిగి లక్ష్యం సాధించాలన్నారు. -
అదుపు తప్పిన బైక్..
● ఫర్టిలైజర్ నిర్వాహకుడి దుర్మరణంహసన్పర్తి: బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామారం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన సాంబశివరావు(46) స్థానికంగా లక్ష్మీ పేరుతో ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం శనిగరంనుంచి హనుమకొండ వైపునకు బయల్దేరాడు. రామారం వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం మార్చురీలో భద్రపరిచిన సాంబశివరావు మృతదేహాన్ని ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబానికి తమ అసోసియేషన్ అండగా ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న తెలిపారు. నివాళులర్పించిన వారిలో లెక్కల పున్నంచందర్రెడ్డి ఉన్నారు. రుస్తాపూర్‌లో యువకుడు.. తుర్కపల్లి: బైక్‌పై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడి ఓ యవకుడు మృతిచెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ పట్టణానికి చెందిన దేవరకొండ రాకేశ్(28) భువనగిరి పట్టణ కేంద్రంలోని యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం తన సహ ఉద్యోగి హరీశ్‌తో కలిసి తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ కస్టమర్‌ను కలిసి అతడితో మాట్లాడి తిరిగి భువనగిరికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామ పరిధిలో అకస్మాత్తుగా గేదె రోడ్డుకు అడ్డంగా రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. బైక్‌పై వెనుక కూర్చున్న రాకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్ నడుపుతున్న హరీశ్ హెల్మెట్ ధరించడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య శ్రీజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తక్యుద్దీన్ తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మర్రిపల్లిగూడెనికి చెందిన యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమిరె నర్సింహులు పెద్ద కుమారుడు రాజ్‌కుమార్ (25) తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితులతో తిరుగుతున్నాడు. పని చేయకుండా ఎందుకు తిరుగుతున్నావని, ఏదైనా పని చేయమని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ ఆదివారం మద్యం తాగి అదే మత్తులో గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విషయాన్ని బంధువులకు చెప్పాడు. వెంటనే నర్సింహులు తన బంధువులతో కలిసి రాజ్‌కుమార్‌ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రుల గొడవతో హోంగార్డు.. దుగ్గొండి : తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని కల త చెందిన హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన దానం మల్లేశం, విజయ దంపతులు వ్యవసాయం చేస్తు జీవిస్తున్నారు. ఈ క్రమంలో పంటలు పండక రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆదివారం సాయంత్రం దంపతులు గొడవ పడ్డారు. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కుమారుడు నాగరాజు (34) ఇద్దరికి సమాధానం చెప్పలేక విరక్తి చెంది గడ్డిమందు తాగి నిద్రించాడు. సోమవారం ఉదయం శ్వాసతీసుకోవడం కష్టం కావడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో వరంగల్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, నాగరాజు దుగ్గొండి పోలీ స్స్టేషన్లో పదేళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. ఇటీవల బదిలీపై గీసుగొండకు వెళ్లాడు. మద్యానికి బానిసై.. ఉరేసుకుని.. జఫర్‌గఢ్ : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్‌చరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజు (39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఉంటున్నాడు. ఎందుకు తాగుతున్నావని తండ్రి వెంకటయ్య మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజు.. వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో పని చేయమని తండ్రి మందలించా డని గడ్డి మందుతాగి కుమారుడు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురం గ్రామంలో తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని హోంగార్డు, జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల జైలుకే
హసన్‌పర్తి : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు 11 మంది ఇంజనీర్లు జైలుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. మండలంలోని గంటూరుపల్లిలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు క మిషన్ నివేదిక ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకుని కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందన్నారు. పారదర్శకంగా ఇళ్ల మంజూరు పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు తెలిపారు. రాజ కీయాలకతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లు మంజూరు చేస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మి డబ్బులు ఇవ్వొద్దన్నా రు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు చాణిక్యారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ సర్పంచ్‌లు కిషన్‌రెడ్డి, కుమారస్వామి, సంతోష్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు -
తెల్లారేసరికి బూడిదే మిగిలింది!
టేకుమట్ల: షార్ట్ సర్క్యూట్‌తో ఓ బట్టల షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమై తెల్లారేసరికి బూడిదే మిగిలింది. దీంతో చేసేదేమీలేక బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో చోటుచేసుకుంది. ఈ ఘట నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీని వాస్ 2012లో టేకుమట్ల మండల కేంద్రంలో బట్టల షాపును ప్రారంభించి ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ క్ర మంలో ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకు విద్యుత్ స్తంభంపైకి పాము ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి షాపులో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన యజమాని శ్రీనివాస్ విద్యుత్ నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో చేసేదేమీ లేక చుట్టుపక్కల వాళ్లను పిలిచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షాపు షెట్టర్ రాకపోవడంతో జే సీబీతో తొలగించారు. అలాగే, వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికా రులు వచ్చేసరికే షాపు మొత్తం కాలి బూడిదైంది. మిగిలింది బూడిదే.. మండల కేంద్రంలో అర్ధరాత్రి మారుతి బట్టల షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏ ఒక్క వస్తువు మిగులకుండా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల నగదుతోపాటు షాపులో ఉన్న సుమారు రూ.30 లక్షల విలువైన స్టాక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. వాటితో పాటు ఫర్నిచర్, కౌంటర్ ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలి బూడిదైంది. షాపు పైఅంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో వెంటనే కిందికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో బూడిదే మిగిలిందని పొట్ట చేత పట్టుకుని మండల కేంద్రానికి వలస వచ్చిన శ్రీనివాస్‌తోపాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.. షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన మండల కేంద్రంలోని మారుతి బట్టల షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఎగసిపడిన మంటలతో ఏం చేయలేకపోయాం.. షార్ట్ సర్క్యూట్ సంభవించిన కొన్ని నిమిషాల్లోనే షాపులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మోటారు పైపు సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కళ్లముందే ఎగసిపడే మంటల్లో షాపు దగ్ధమవుతుంటే గుండెలు పగిలాయి. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేకపోయా. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి షాపు పూర్తిగా దగ్ధమైనది. ఇప్పుడు నాకు మిగిలింది బూడిదే. – శ్రీనివాస్, మారుతి బట్టల షాపు యజమాని బట్టల షాపులో అగ్నిప్రమాదం రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం అగ్ని ప్రమాదానికి కారణం పాము.. కన్నీరుమున్నీరవుతున్న బాధితులు -
దైవదర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
మహబూబాబాద్ రూరల్/శాలిగౌరారం : శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దైవదర్శనానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదా రిపై నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మా ధారంకలాన్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంతో మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండా, వినా యక తండా, పత్తిపాక ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, శాలిగౌరారం ఎస్సై సైదులు కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకతండా, బాబు నాయక్ తండా, పత్తి పాక ప్రాంతాలకు చెందిన 14 మంది తాపీ మేసీ్త్రలు ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం మల్లికార్జునస్వామివారి దర్శనా నికి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. డ్రైవర్ గుండెపాక నవీన్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టాడు. దీంతో ట్రావెల్స్ బస్సు రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న బానోత్ మంగీలాల్(42) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బానోత్ రమేశ్, బానోత్ లాలు, భూక్య సర్వం, అంబోతు శ్రీను, గుగులోత్ నరేశ్, భూక్య వీరన్కు తీవ్రగాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నల్లగొండ, నకిరేకల్, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన లచ్చిరాం, నరేశ్ మహబూబాబాద్‌కు తరలించి ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి భా ర్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై సైదులు తెలిపారు. బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి 13 మందికి తీవ్ర గాయాలు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఘటన -
21న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహకార అధికారి ఎం. వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 8,11, 12 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, 21న పోలింగ్, పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్స్ ఎన్నికల ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంక్ పాలకవర్గంలో మొత్తం 12 మంది సభ్యులకు గాను ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఒక స్థానం, మహిళా కేటగిరీకి రెండు స్థానాలు, ఓపెన్ కేటగిరీకి 9 స్థానాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఓ సిటీ రోడ్డులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏవీవీ కళాశాలలో జరుగుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. బంధువు దశదిన కర్మకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. ● చెరువులో నీటమునిగి వ్యక్తి మృతి ఎల్కతుర్తి: బంధువు దశదిన కర్మ అనంతరం స్నానం చేయడానికి చెరువులో దిగిన ఓ వ్యక్తి ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో చోటు చేసుకుంది. ఎస్సై దివ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి ఓదెలు(49) తన బంధువు ఎల్లయ్య ఇటీవల మృతి చెందగా ఆయన దశదిన కర్మ నిమిత్తం ఈనెల 3న చెరువు వద్దకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానం చేయడానికి చెరువులోకి దిగిన ఓదెలు.. నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ విషయం కుటుంబీకులు గమనించలేదు. అనంతరం ఇంటివద్దకు చేరుకుని పలు చోట్ల వెతికినా ఓదెలు ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు (4వ తేదీన) తెల్లవారుజామున చెరువులో ఓదెలు మృతదేహం తేలి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. కుటుంబీకులు సమాచారం ఇచారు. దీంతో వారు చెరువు వద్దకు వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై దివ్య సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని అయా శాఖ అధికారులను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ స్నేహ శబరీశ్ హాజరై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 205 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు పాల్గొన్నారు. సమయపాలన పాటించాలి : వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నరకే సమావేశ మందిరానికి వచ్చిన కలెక్టర్.. సమయానికి రాని అధికారులు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. ప్రజావాణికి మొత్తం 133 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించినవి 49 అర్జీలు, హౌసింగ్‌కు 34 దరఖాస్తులు రాగా, మిగితావి వివిధ శాఖలకు చెందిన వినతులు 50 వచ్చినట్లు అధికారులు వివరించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతిరోజూ ఫీల్డ్ విజిట్ చేసి, సంక్షేమ పథకాల పురోగతి పరిశీలించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నివేదికలు ఎప్పటికప్పుడు గూగుల్ ష్ప్రెడ్ సీట్లో అప్లోడ్ చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ శాఖల పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, ఆహారం అందించడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్షిప్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. మెంబర్‌షిప్‌నకు నోడల్ అధికారిగా డీసీఓ నీరజ వ్యవరిస్తారని చెప్పారు. చేనేత లక్ష్మి స్కీం పథకంలో భాగస్వాములు కావాలని సూచించారు. అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్‌రెడ్డి, టెస్కో డీఎంఓ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
వినతులు పెండింగ్‌లో ఉండొద్దు..
రామన్నపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని, పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 22, హెల్త్ అండ్ శానిటేషన్ 9’, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) 12, టౌన్‌ప్లానింగ్ 52, మంచినీటి సరఫరా 9, హార్టికల్చర్ 1, ఎలక్ట్రికల్ 6 మొత్తం 109 ఫిర్యాదులను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జి ఎస్ఈ, సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి అధికారులకు గ్రేటర్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశం వివిధ విభాగాల నుంచి 109 దరఖాస్తుల స్వీకరణ -
ముందస్తు అప్రమత్తత అవసరం
రామన్నపేట: వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు అప్రమత్తత అవసరమని, ఆ మేరకు అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ(విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ డాక్టర్ సత్యశారద, స్నేహా శబరీష్, గ్రేటర్ కమిషనర్ చాహాత్ బాజ్‌పాయ్‌తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటినుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని, సకాలంలో స్పందించకపోతే చిన్న సమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అధికారులను హెచ్చరించారు. నగరంలోని ప్రధాన నాలాల స్థితిగతులు, పూడికతీతపై సమీక్షిస్తూ వరద నీరు నిల్వకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. బయట నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా చూడాలని, కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే డీఆర్ఎఫ్, జిల్లా అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా ముంపునుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయిలో 6వ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ రూమ్ ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్ల కార్పొరేటర్లు, సంబంధిత అధికారులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్ కమిషనర్లు ప్రధాన కార్యదర్శికి వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన.. గతంలో వరద ముంపునకు గురైన నయీంనగర్ నాలా, రాజాజీ నగర్ కల్వర్టు, ప్రెసిడెన్సీ పాఠశాల నుంచి నయీంనగర్ వరకు నిర్మించిన రిటైనింగ్ వాల్, జవహర్‌నగర్, సమ్మయ్యనగర్, భద్రకాళి చెరువు, ఎఫ్టీఎల్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, ఉప కమిషనర్లు అరవింద్, పారిశుధ్య ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ డీఆర్ఎఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలి నాలాల స్థితిగతులు, పూడికతీతపై సమీక్షించుకుని ముందుకెళ్లాలి పునరావస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్లు, కమిషనర్‌తో కలిసి సమీక్ష -
లక్ష్యసాధనకు కృషి చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా అధికారులు కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా వన మహోత్సవంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. జిల్లా లక్ష్యం 31,40,272 కాగా, ఇప్పటివరకు 10లక్షల 87వేల 11 మొక్కలు నాటి, 9లక్షల 8వేల 272 మొక్కలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. 5లక్షల 61వేల 115 మొక్కలు ఇంటింటికి పంపిణీ చేసినట్లు వివరించారు. కిచెన్ షెడ్స్, అశోక, బోగెన్విలియన్, ఉసిరి, కరివేపాకు, గోరింటాకు, కలబంద ముఖ్యంగా అవకాడో, వేప, రాల చెట్టు, జామ, సీతాఫలం మామిడి తదితర చెట్లను నాటాలని చెప్పారు. తదుపరి సమావేశం నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి చికిత్సలు అందిస్తున్నాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తున్నాం. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మలేరియా, డెంగీ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమల నిర్మూలనతోనే వ్యాధుల నివారణ సాధ్యం అవుతుంది. –డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్యారోగ్య అధికారి, వరంగల్ -
వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణ సోమవారం పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలోని ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 100 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించారు. మధ్యాహ్నం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి..
శరీరంపై ఎర్రమచ్చలు రావడం, చెవుల్లో నుంచి రక్తం కారడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తం రావడం, యూరిన్‌లో రక్తం రావడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు రక్త పరీక్షలు చేసుకొని ప్లేట్లెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని భయపడొద్దు. వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే..దాదాపు దోమల బెడద నుంచి పూర్తిగా దూరమైనట్లే. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎంజీఎం ఫీవర్ వార్డులో జ్వర సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందిస్తున్నాం. –డాక్టర్ కిశోర్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పరుగుపోటీలు, త్రోబాల్, హైజంప్, లాంగ్‌జంప్ తదితర క్రీడల్లో అథ్లెట్లు పోటీపడ్డారు. ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. అండర్–16 బాలికల విజేత హనుమకొండ కై వసం చేసుకుంది. – వరంగల్ స్పోర్ట్స్ అండర్–16 బాలికల విజేత హనుమకొండ– వివరాలు 8లోu -
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 4న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. అమ్మవారిపేట 220 సబ్ స్టేషన్ విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న కారణంగా కుమ్మరిగూడెం, అయోధ్యపురం, కొత్తపల్లి, న్యూ శాయంపేట ప్రాంత వ్యవసాయ సర్వీస్‌లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండలోని భవాని నగర్, శ్రీనివాస కాలనీ, కళ్యాణి ఫంక్షన్ హాల్ ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే, వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. నర్సంపేట రోడ్డు, రాంకీ, దయానంద కాలనీ ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఎల్ఐసీ, కలెక్టరేట్, అబ్బనికుంట, అల్పాహారం, యాకూబ్పుర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, చింతల్, తూర్పు కోట, పడమర కోట, మధ్య కోట, ఆదర్శనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇకనైనా కళ్లు తెరవాలి’ హన్మకొండ: విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ విద్యాలయాల యాజమాన్యాలు ఇకనైనా కళ్లు తెరవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ స్టేటస్ కోసం, మార్కుల మోజులో, ర్యాంకుల వేటలోపడి పిల్లల మానసిక స్థితిని పరిగణలోకి తీసుకోకుండా ఒత్తిడికి గురిచేస్తున్న వాళ్లందరికీ విద్యార్థిని శివాని ఆత్మహత్య ఓ గుణపాఠం వంటిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని శివాని ఆత్మహత్య మొదటిది కాదని, అయితే, చివరిది అయ్యేలా తామంతా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లల అభిరుచి, వారి లక్ష్యాన్ని గుర్తించకుండా, పరిగణలోకి తీసుకోకుండా తల్లిదండ్రులు చేసిన ఒత్తిడితో వారు బలన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. సేవాదళ్ లోగో ఆవిష్కరణ రామన్నపేట: వరంగల్ నగరంలోని గోవిందరాజుల స్వామి దేవాలయం మెట్ల వద్ద సేవాదళ్ సభ్యులు సేవాదళ్లోగోను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లో సేవాదళ్ ఆధ్వర్యంలో చేపట్టే గోశాల నిర్వహణ, భజగోవింద, దళిత గోపాలం కృష్ణాష్టమి వేడుకలు వంటి అంశాలపై కార్యవర్గ సభ్యులు చర్చించారు. ఈ ఏడాది నిర్వహించే గోవింద రక్ష కార్యక్రమానికి వరంగల్ నగరంలోని మహిళా ప్రముఖులందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. అతి కొద్దికాలంలోనే గోవిందాద్రి సేవాదళ్‌ను హిందూ సంఘాల ఐక్యవేదిక గుర్తించడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో సేవాదళ్ గౌరవ అధ్యక్షుడు చింతాకుల అనిల్, వ్యవస్థాపక అధ్యక్షుడు రంజిత్‌కుమార్, అధ్యక్షుడు యాట ప్రతాప్, సహాయ కార్యదర్శి ధనలక్ష్మి, ఉపాధ్యక్షురాలు పట్టాబి రాజేశ్వరి పాల్గొన్నారు. గుండెపోటుతో టీచర్ మృతి విద్యారణ్యపురి: హనుమకొండ చైతన్యపురిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అలుగువెళ్లి జవహర్‌రెడ్డి (61) హఠాన్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌కు జిల్లా హుజూరాబాద్‌కు చెందిన జవహర్‌రెడ్డి (జవహర్ పటేల్) 1984లో ఎస్జీటీగా నియమితులై భీమదేవరపల్లి, ఎల్కతుర్తిలో సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల కమాన్‌పూర్ మండలం నర్సిహులపల్లికి బదిలీ అయి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆయన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతుడికి భార్య శ్రీదేవి, కుమారులు శశాంక్‌రెడ్డి, శంతన్‌రెడ్డి ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడికి అవార్డు కాజీపేట అర్బన్: కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మన్నె చంద్రయ్యకు బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవారత్న అవార్డు అందజేశారు. చంద్రయ్య సామాజిక సేవలకుగాను స్నేహితుల దినోత్సవం సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆదివారం ఉత్తమ సేవారత్న అవార్డును అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ పులి దేవేందర్, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఓవర్ లోడ్..
హసన్‌పర్తి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లారీల యజమానులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్‌తో ఇసుకను తరటిస్తున్నారు. రెండు రోజుల క్రితం విజిలెన్స్, మైనింగ్, కమర్షల్ ట్యాక్స్, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అధిక లోడ్‌తో వెళ్తున్న 16 ఇసుక లారీలను పట్టుకున్నారు. ఆరు రోజుల క్రితం 16 లారీలు ఇసుక కోసం కరీంనగర్ జిల్లా తాడిచెర్ల ఇసుక రీచ్‌కు వెళ్లాయి. వర్షం కారణంగా ఇసుక నింపడంలో ఆలస్యం జరిగింది. ఇసుక లోడ్ చేసుకున్న ఆ లారీలు రెండు రోజుక్రితం వాటి గమ్యస్థానాలకు బయల్దేరాయి. మార్గ మధ్యలో ఆర్టీఏ, విజిలెన్స్, కమర్షల్ ట్యాక్స్‌తో పాటు మైనింగ్ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీల్లో పరిమితికి మించి ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఒక్కో లారీని తూకం వేయగా, సుమారు 5టన్నుల నుంచి 6 టన్నుల వరకు ఇసుక అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ లారీలను హసన్‌పర్తి చింతగట్టు క్యాంపులోని ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. ప్రతీ డిపార్ట్మెంట్కు చలాన్ కట్టాల్సిందే.. పరిమితికి మించి ఇసుకతో పట్టుబడిన లారీలు అక్కడ తనిఖీలు నిర్వహించిన అన్ని శాఖలకు చలాన్ కట్టాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు. దాంతో లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో హెచ్చుతగ్గుల కారణంగా పరిమితికి మించి లారీల్లో ఇసుక లోడ్ అయినట్లు లారీ యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు టీజీఎండీసీ కార్పొరేషన్, సంస్థ, సదరు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓవర్‌లోడ్ అంటూ తమకు జరిమనా విధించొద్దని వేడుకుంటున్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా తనిఖీల్లో 16 లారీల పట్టివేత -
స్నేహానికి అంతరాలు ఉండవు
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంహన్మకొండ: స్నేహానికి అంతరాలుండవని కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి రిజిస్ట్రార్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి దేవేందర్ మాట్లాడుతూ స్నేహం అంటేనే పరస్పర సహకారమన్నారు. కార్యక్రమంలో వెలాసిటీ కళాశాల చైర్మన్ కొండల్ రెడ్డి, డైరెక్టర్ కొండ్రెడ్డి మల్లారెడ్డి, బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు పంతంగి భాస్కర్, పొన్నం రాజు, బోనాల రమేష్, వి.మధు, తాళ్ల రవీందర్, పులి రంజిత్ గౌడ్, రాచమల్ల రాజేందర్, గోళ్ల నరేందర్, లోకుల రఘుపతి, ఎం.పద్మ, టి.రజని, నళిని ప్రియ, వెలంగిని, సోమ నరసయ్య, శ్రీధర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, పులిపాక హరికృష్ణ, రాజు, కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
సిక్కుల అభ్యున్నతికి పాటుపడతా
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిహన్మకొండ చౌరస్తా: సిక్కుల ఆర్థిక పురోగతి, వసతుల కల్పన, మెరుగైన జీవన ప్రమాణాల పెంపునకు పాటుపడతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ 9వ డివిజన్ కాకతీయ కాలనీలో ఎమ్మెల్యే నాయిని ఆదివారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న సిక్కుల గురుద్వార్ ఆలయాన్ని పరిశీలించారు. నిర్మాణం పూర్తి కావడానికి కావాల్సిన అనుమతులు, సాంకేతిక సహాయం కోసం తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుద్వార్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకతీయ కాలనీలోని రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎండి.జాఫర్, నాయకులు బీమా వినయ్, అనిల్, గోపి, సారయ్య, ఆజాద్‌సింగ్, పూజారి సింగ్, తారుసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
● ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్రామన్నపేట: కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను తొలగిస్తూ నాలుగు లేబర్ కోడ్స్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కేంద్రం తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు నర్ర ప్రతాప్, ఆలిండియా కార్మిక సంఘం నాయకుడు గొర్రె కుమారస్వామి డిమాండ్ చేశారు. జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఈఎస్ఐ, పీఎఫ్ వంటి హక్కులు దూరమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దారపు రమేష్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, సాగర్, కన్న వెంకన్న, మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, రత్నం, రామస్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
నన్స్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
కాజీపేట: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నన్స్‌పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఫాతిమానగర్ కేథడ్రల్ చర్చి ఆవరణ నుంచి మదర్ థెరిస్సా విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నన్స్‌పై పెట్టిన కేసులను భేషరత్‌గా ఉపసంహారించుకోవాలని నినాదాలు చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయకుండే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫాదర్ విజైపాల్, బొక్క దయాసాగర్, సిస్టర్ కల్పన, ఆర్.రాజ్‌మోహన్ రావు, ఫాదర్ కాసు మర్రెడ్డి, ఫాదర్ తాటికొండ జోషఫ్, టీడీ టామి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హసన్‌పర్తి: అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. రెండో డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌లో బాలవికాస సంస్థ సహకారంతో రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉన్నట్లయితే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం 80961 07107 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎనీ టైమ్ వాటర్ కార్డులను కాలనీవాసులకు అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రవినాయక్, మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన, బాలవికాస సంస్థ డైరెక్టర్ శౌరెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, కొంక హరిబాబు, నాయకులు కుక్క తిరుపతి, మాదాసి అజయ్, కాలనీవాసులు కృష్ణ, రవికుమార్, తారమ్మ పాల్గొన్నారు. -
ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు
హసనపర్తి: హసన్‌పర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ డే వేడుకలను హసన్‌పర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొని కేక్ కట్ చేశారు. వాసవి క్లబ్ హసన్‌పర్తి అధ్యక్షుడు సండ్రు నాగేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మాధవశంకర్, వాసవి క్లబ్ జిల్లా జాయింట్ సెట్రకరీ అప్పని శంకర్, మాజీ అధ్యక్షులు భీష్మనాథం, గౌరిశెట్టి కృష్ణమూర్తి, నాగమళ్ల సుధీర్, చిదర కరంచంద్, సభ్యులు నటరాజ్, రవీందర్, భూపతి కృష్ణమూర్తి, సండ్రు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మహ్మద్ ఇబ్రహీం సేవలు మరువలేనివి
న్యూశాయంపేట: ముస్లిం సమాజానికి ఇబ్రహీం చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పూర్వ అధ్యక్షుడు మహ్మద్ ఇబ్రహీం ఇటీవల అమెరికాలో మృతిచెందారు. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సంతాప సభలో నగరానికి చెందిన పలువురు హాజరై ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా ఉంటూ విద్యా, వైద్యం, సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో మౌలానా ఫసియొద్దీన్ ఖాస్మి, రిటైర్ట్ తహసీల్దార్ ఖమరుజ్జామా, సిరాజ్ అహ్మద్, ఎంఏ.కలీం, యూసుపొద్దీన్, హమీదుద్దీన్, నాసిర్వాహిదీ, నయీమొద్దీన్, అన్వర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు. -
నిరుపేద మహిళకు చేయూత
విద్యారణ్యపురి: కమలాపూర్ గ్రామానికి చెందిన మార్గం పావనికి హనుమకొండలోని వడ్డెపల్లిలోని విద్యా ఫౌండేషన్ కార్యాలయంలో ఉచితంగా కుట్టుమిషన్‌తో పాటు రూ.5 వేల ఆర్థిక సాయాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ల మహేందర్ మాట్లాడుతూ పావని కుటుంబం చాలా దీనావస్థలో ఉందని అన్నారు. ఆమె భర్త రెండు కాళ్లు చచ్చుబడడంతో ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆ పేద కుంటుంబానికి విద్యా ఫౌండేషన్ తరఫున చేయూతనిచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ బాధ్యులు బిట్ల అంజనీదేవి, అనంతుల ఉష, వైద్యులు వాణి, రాణి, చింతల కమల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ ఖిలా వరంగల్: వరంగల్ ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బండి కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఆదివారం నోటుబుక్స్ పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ ఉమ హాజరై వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తీగల జీవన్గౌడ్తో కలిసి ఎంపిక చేసిన విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. న్యూడెమోక్రసీ నేత రాజేందర్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, నలిగంటి పాల్, పుప్పాల భీమయ్య, పుప్పాల రాజు, బండి శ్రీకాంత్ పాల్గొన్నారు. జర్నలిస్టులకు అండగా ఉంటాం కాజీపేట రూరల్: జర్నలిస్టులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ పాస్ట్రల్ సెంటర్లో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రెండో రాష్ట్ర మహాసభ సన్నాహక సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వారు హాజరై మాజీ కార్పొరేటర్ బోడ డిన్నాతో కలిసి ఈ నెల 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న మహాసభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులని అన్నారు. తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లికొండ వీరేందర్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, ప్రేమ్, గూడూరు కరుణాకర్ పాల్గొన్నారు. సీఐటీయూ కార్యవర్గం ఎన్నిక హసన్‌పర్తి: సీఐటీయూ భవన నిర్మాణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దామెర చంటి, ఉపాధ్యక్షులుగా నద్దునూరి రజనీకాంత్, మేకల సురేష్, ప్రధాన కార్యదర్శిగా దామెర పవన్‌కల్యాణ్, కార్యదర్శిగా మంద చందర్, కోశాధికారిగా దామెర ప్రశాంత్, ఆర్గనైజర్లుగా పుల్లా సిద్ధార్థ్, పరికి రాజశేఖర్‌తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు సీఐటీయూ హసన్‌పర్తి మండల కార్యదర్శి పుల్లా అశోక్ వివరించారు. -
జీపీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: గ్రామాభివృద్ధే ధ్యేయంగా సమయపాలన లేకుండా నిరంతరం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య అన్నారు. యూనియన్ జిల్లా రెండో మహాసభలు హనుమకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీఓఎస్ భవన్లో ఆదివారం జరిగాయి. తొలుత వేయి స్తంభాల గుడి నుంచి భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జెండాను జిల్లా అధ్యక్షుడు పల్లె రామన్న ఆవిష్కరించారు. సభకు వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది కార్మికులు విధి నిర్వహణలో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సభలో సీఐటీయూ నాయకులు రాగుల రమేష్, బొట్ల చక్రపాణి, గబ్బెట యాకయ్య, బండ సాంబయ్య, బోగం రమేష్, సుఖేందర్, కుమారస్వామి, సుశీల, ఏసేబు, సుందర్ పాల్గొన్నారు -
సమస్యలతో ప్రజలు సతమతం
న్యూశాయంపేట: నగర వ్యాప్తంగా ప్రజలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారు. వరంగల్ నగరంలోని ఖమ్మం హైవే శంభునిపేట జంక్షన్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ అయింది. దాంతో అక్కడ ప్రమాదకరంగా గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం వేలాది భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటారు. గుంతలో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బల్దియా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. మట్టి రోడ్డుతో ఇబ్బందులు ఖిలా వరంగల్: వరంగల్ 41వ డివిజన్ ఉర్సు ప్రతాప్‌నగర్ నాగమయ్య గుడి కమాన్ సమీపంలోని ఓ వీధి ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మట్టి రోడ్డు రోజు రోజుకు కుంచించుకుపోతోందని చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహన రాకపోకలకు ఆటంకంగా మారాయని తెలిపారు. దీనిపై బల్దియా అధికారులకు గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి రోడ్డును విస్తరించి, సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. -
గజల్ గాయని అరుణకీర్తికి సన్మానం
హన్మకొండ కల్చరల్: హనుమకొండకు చెందిన కవయిత్రి, కథా రచయిత, గజల్ రచయిత, గాయని గంపిటి అరుణకీర్తి పతాకరెడ్డిని గజల్ సాహితీ వేదిక బాధ్యులు సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, గజల్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి సమావేశ మందిరంలో కొరుప్రోజు మాధవరావు రచించిన గజల్ కావ్యమాలిక అలకనంద పుస్తకావిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గజల్ కచేరీలో గజల్ సాహితి సంస్థ అధ్యక్షుడు ఇరువైంటి శర్మ, సుప్రీ కోర్టు జడ్జి నేరెళ్ల మాల్యాద్రి, గజల్ గాయకుడు రసవిహారి తిరుపతిరెడ్డి తదితరులతో కలిసి అరుణ కీర్తిపతాకరెడ్డి పాల్గొని గజల్ వినిపించారు. కార్యక్రమం అనంతరం అరుణ కీర్తిపతాకరెడ్డిని సన్మానించి మెమోంటోతో పాటు అలకనంద పుస్తకాన్ని అందజేశారు. -
ట్రాన్స్‌కో ఉద్యోగుల సంక్షేమానికి కృషి
హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‌ఈఈయూ) –327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్‌ఈఈయూ –327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో ట్రాన్స్‌కో విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సీడీబీ ఉద్యోగుల సమస్యలపై కూడా యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీఎస్‌ఈఈయూ –327 రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.రమేష్, ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, ట్రాన్స్‌కో రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం.శ్రీనివాస్, సెక్రటరీ ఆర్.శ్రీనివాస్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మారియా, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తదితరులు పాల్గొన్నారు. -
శరణాగతి కోరుతూ ఆర్తిగా వెలువరించారు
హన్మకొండ కల్చరల్: పద్యరూపంలో దేవుని శరణాగతి కోరుతూ ఆర్తిగా ‘భక్తి మందారాలు’ పుస్తకం వెలువరించారని అష్టావధాని చేపూరి శ్రీరామ్ అన్నారు. వరంగల్ కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ లష్కర్‌బజార్‌లోని ప్రాక్టీసింగ్ స్కూల్లో ‘కవిచంద్ర’ నర్సింగోజు లక్ష్మయ్య రాసిన భక్తి మందారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. పద్యకవి డాక్టర్ ఎన్వీఎన్ చారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విశ్రాంత విద్యాశాఖాధికారి డాక్టర్ దహగం సాంబమూర్తి, విశిష్ట అతిథిగా డాక్టర్ యెల్లంభట్ల నాగయ్య, చేపూరి శ్రీరామ్ పాల్గొని పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేపూరి శ్రీరామ్ పుస్తక సమీక్షకుడిగా వ్యవహరించగా, దహగం సాంబమూర్తి మాట్లాడుతూ పద్యం ప్రాభవాన్ని కాపాడాలని కోరారు. పుస్తక రచయిత నర్సింగోజు లక్ష్మయ్య మాట్లాడుతూ నీతిని బోధిస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేశానని తెలిపారు. నేటి కాలంలో పద్యం ప్రాధాన్యతను ఎన్వీఎన్ చారి వివరించారు. కార్యక్రమంలో కవితా వేదిక నిర్వాహకులు అక్కెర కరుణాసాగర్, కొండా యాదగిరి, ప్రభాకర్, శ్రీనివాస్, ఆనందాచారి, సిద్దంకి బాబు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పద్యకవి కమ్మేళనంలో కవులు తమ కవితలను వినిపించారు. అష్టావధాని చేపూరి శ్రీరామ్ భక్తి మందారాలు పుస్తకం ఆవిష్కరణ -
చలించి.. స్నేహితున్ని చేరదీసి
హసన్‌పర్తి: కుటుంబ సమస్యల కారణంగా మానసిక వేదనకు గురైన ఓయువకుడు రెండేళ్లుగా శ్మశాన వాటికలో జీవనం సాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మిత్రులు స్నేహితుల దినోత్సవం (ఆదివారం) రోజున అతడిని శ్మశాన వాటిక నుంచి బయటికి తీసుకొచ్చి రిహబిటేషన్ సెంటర్లో చేర్పించారు. హసన్పర్తికి చెందిన వెగల్దాస్ రమేశ్‌కు తల్లిదండ్రులు మృతి చెందగా ముగ్గురు సోదరీమణులున్నారు. కుటుంబ సమస్యలు తలెత్తడంతో రెండేళ్లుగా రమేశ్ ఇంటికి రాకుండా శ్మశాన వాటికలోనే ఉంటూ ఎవరైనా మరణిస్తే వారి బంధువులు తీసుకొచ్చిన ఆహార పదార్థాలు తింటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి పరిస్థితిని గమనించిన రమేశ్ బాల్య స్నేహితులు ఆదివారం రమేశ్‌కు హెయిర్ కట్ చేయించారు. కొత్త డ్రెస్స్‌ను కొనిచ్చి సామూహికంగా భోజనం చేశారు. అనంతరం హనుమకొండలోని హెల్పింగ్ హ్యాండ్ రీ హబిటేషన్ సెంటర్లో చేర్పించారు. ఇందులో బాల్య మిత్రులు కడారి పరమేశ్వరచారి, ఆరెల్లి వెంకటస్వామి, రాజ్‌కుమార్, అహ్మద్, గుడికందుల సురేశ్, బొనగాని రమేశ్, మట్టెడ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. శ్మశానంలో జీవనం సాగిస్తున్న దోస్తుకు చేయూత ఆశ్రమంలో చేర్పించిన మిత్రులు -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు. టీటీసీ పరీక్షలకు 99.11 శాతం హాజరువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివారం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్‌బజార్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్‌బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు. శంకర్‌కు సినారె పురస్కారంకేయూ క్యాంపస్: మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఏబీఆర్ కన్వెన్షన్ బాంక్వెట్ హాల్లో ఆదివారం సినారె కళాపీఠం పలువురికి సినారె సాహిత్యపురస్కారాలు ప్రదానం చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకర్‌కు పురస్కారం అందజేశారు. కళాపీఠం అధ్యక్షుడు మట్టినేని రాములు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీవరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి, హెడ్‌కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్ఐలు నాగయ్య, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన నయీంనగర్: నగరంలోని కాళోజీ కళాక్షేత్రం, హంటర్‌రోడ్డులోని ‘కుడా’ ల్యాండ్, భద్రకాళి ఆలయ మాడవీధులు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, వరంగల్ బస్టాండ్ పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌బాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ శా ఖల అధికారుల సమన్వయంతో త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది తదితరులున్నారు. -
అదనంగా యూరియా
ఎరువుల విక్రయాలపై తనిఖీ.. ఎరువుల విక్రయాలు, సరఫరా, వినియోగంపై పారదర్శకత, అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ఎరువుల తనిఖీలకు పూనుకున్నారు. ప్రతీనెల జిల్లాలో అత్యధికంగా ఎరువులు కొనుగోలు చేసిన 20 మంది జాబితాను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. వీరు కొనుగోలు చేసిన ఎరువులు వారే వినియోగించారా..? అక్రమాలకు పాల్పడ్డారా..? వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైతులకు కాకుండా ఇతరులకు ఎరువులు విక్రయిస్తే ఆయా డీలర్లపై చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ–పాస్ మిషన్లను డీలర్లకు అందించారు. రైతు వేలిముద్ర వేస్తే ఆధార్ నంబర్‌తో సహా వివరాలు రాగానే వాటిని నమోదు చేస్తారు. దీంతో రైతుల వారీగా వివరాలు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. హన్మకొండ: యూరియా కొరత అంటూ జరిగిన ప్రచారంతో రైతులు ఎరువుల షాపుల ఎదుట కొనుగోలుకు క్యూకట్టారు. దీంతో జిల్లాలో అవసరానికి మించి యూరియా సరఫరా జరిగింది. గతేడాదితో పోలిస్తే అదనపు యూరియా రైతులకు చేరింది. వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళిక మేరకు ఎరువులు, విత్తనాలు సమకూర్చుతోంది. యూరియా కొరత అంటూ విస్తృత ప్రచారంతో రైతులు ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట వరుసకట్టారు. కొందరు నిలబడలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టడంతో యూరియా కొరత ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. సహకార సంఘాలకు తమ సభ్యులు కాని రైతులు రాకుండా నివారించేందుకు కొన్ని సంఘాలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేశాయి. అన్ని ఎరువులు కలిపి 91,877 మె.ట.గా అంచనా.. హనుమకొండ జిల్లాలో 307 ఎరువుల షాపులు, 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నారు. గతేడాది వానాకాలంతో అన్ని కలిపి 57,478 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడారు. ప్రస్తుత సీజన్లో అన్ని ఎరువులు కలిపి 91,877 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 33,523 మెట్రిక్ టన్నులు, డీఏపీ 12,416, ఎన్పీకే 31,040, ఎంవోపీ 9,932, ఎస్ఎస్పీ 4,966 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం యూరి యా 2,853.99 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. డిమాండ్ మేరకు ఎరువుల సరఫరా.. పత్తి, మొక్కజొన్న, కూరగాయల తోటలకు మాత్రమే యూరియా అవసరం. యూరియా కొరత ప్రచారంతో వరిసాగు రైతులు సైతం ముందుగానే యూరియాను సమకూర్చుకున్నారు. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుత జూలైలో 6,261 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. 1,361 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1,51,383 ఎకరాల్లో సాగైంది. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నులు.. ప్రస్తుతం 6,261 మెట్రిక్ టన్నుల సరఫరా హనుమకొండ జిల్లాలో 2,853 మెట్రిక్ టన్నుల నిల్వ అత్యధికంగా కొనుగోలు చేసిన వారి జాబితా సేకరణ రైతులకు కాకుండా ఇతరులకు విక్రయిస్తే చర్యలునానో యూరియా వాడాలి.. భూమిలో వేసే యూరియా బదులుగా నానో యూరియా వాడితే పంటలకు, రైతులకు మేలు. భూమిలో వేసే యూరియా 30శాతం మాత్రమే పంటకు చేరుతుంది. 70 శాతం వృథాగా పోతుంది. నానో యూరియా నేరుగా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు పూర్తిగా చేరుతుంది. రైతుల అవసరాల మేరకు సరఫరా చేస్తున్నాం. ఎరువుల కొరత లేదు. రైతులు ఆందోళన చెందొద్దు. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయాధికారి, హనుమకొండ -
రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహణ భేష్
అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభంహనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు హాజరయ్యారు.కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ నిర్వహణ సూపర్‌గా ఉందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాల్‌కృష్ణన్ అన్నారు. కాజీపేట జంక్షన్లో పలు విభాగాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించి, రైల్వే రన్నింగ్ రూంలో డ్రైవర్లకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టును ఏడీఆర్‌ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్లి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన రెండు క్యారం బోర్డులు ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీని అభినందించి నిర్వహణ బాగుందని పేర్కొన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే కమ్యూనిటీహాల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి కేటాయించిన ఎస్బీఎఫ్ ఫండ్‌ను మంజూరు చేయాలని, రైల్వే కమ్యూనిటీహాల్‌కు మరో డైనింగ్‌హాల్ నిర్మాణం చేయాలని, ఏసీని మరమ్మతు చేయాలని, జనరేటర్‌ను మంజూరు చేయాలని, కుషన్ స్టీల్ చైర్లు, కావాల్సిన సామగ్రి ఇప్పించాలని కమిటీ బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నూతన భవనంతోపాటు జిమ్‌కు సంబంధించిన సామగ్రి ఏర్పాటు చేయాలని, ఇన్స్టిట్యూట్లో నూతనంగా టాయిలెట్స్ నిర్మించాలని డీఆర్ఎంను కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, రైల్వే అధికారులు ప్రశాంతకృష్ణసాయి, సుధీర్‌కుమార్, ఎన్వీ వెంకటకుమార్, టి.అనికేత్కాడే, ప్రంజల్ కేశర్వాణి, రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, కమిటీ బాధ్యులు ఎం.రాజయ్య, జి.రాజేశ్వర్‌రావు, ధారవత్ రఘు, ఎస్.ప్రవీణ్, పి.రవికిరణ్, జి.భాస్కర్, బి.మల్లయ్య, ఎస్.లక్ష్మీనారాయణ, డి.వెంకటేశ్వర్లు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.– 8లోu డీఆర్ఎం గోపాలకృష్ణన్ -
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్‌లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె.వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ.. 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్‌గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు,రవీందర్‌రాజు, శ్రీధర్‌రాజు పాల్గొన్నారు. బెనిఫిట్స్ చెల్లించాలి..రిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్‌యూటీఎఫ్ హసన్‌పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్‌రాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు, మాజీ ఎంఈఓ రాంకిషన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం
హన్మకొండ/హన్మకొండ కల్చరల్: సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం అని, అలాంటి సాహిత్య సృజన చేసే వారి సంఖ్య పెరిగినప్పుడే సమాజంలో చైతన్యం వస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెండు ఉమామహేశ్వర్ కలం నుంచి జాలు వారిన ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కృషి ఉంటేనే మనిషి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడన్నారు. పుస్తక రచయిత మెండు ఉమామహేశ్వర్ తన అనుభవాల సారాన్ని మనసు–మనిషి పుస్తకంలో లిఖించారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మానవజాతి కలుషితమైపోయిందని, ఇది అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. మన జీవితాలు ఉదయం కల్తీతో ప్రారంభమై కల్తీతో ముగుస్తున్నాయన్నారు. అద్భుతాలు సృష్టించే వారంతా అతి సాధారణ కుటుంబాల నుంచే వచ్చారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మరణించిన తన సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్‌కు అంకితం ఇవ్వడం సోదరుల మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనం అన్నారు. అనంతరం రచయితను సన్మానించారు. సమన్వయకర్తగా ఆర్.లక్ష్మణ్ సుధాకర్ వ్యవహరించారు. సీనియర్ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి, శంకేశి శంకర్రావు, ప్రముఖ సైకాలజిస్ట్ జి.నాగేశ్వరరావు, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ -
స్థానికం తర్వాతే..
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్‌ను కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే.. వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే వరకు పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్‌రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యంరాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ హైదరాబాద్‌లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలంటున్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
నేడు ఫ్రెండ్షిప్ డే
లింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం..కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధూర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు211. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది84స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయ్యిందా..! 4. నీ ఫ్రెండ్‌కు ఇచ్చే స్థానం..? A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A59● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తర్వాత ఫ్రెండ్‌కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 61న్యూస్‌రీల్– సాక్షి నెట్వర్క్ -
‘గ్రేటర్’లో జంక్షన్లు మెరవాలి
రామన్నపేట: గ్రేటర్ పరిధిలోని జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి జెమిని థియేటర్, పోతన రోడ్డు జెండాప్రాంతం రామన్నపేట స్థూపం, ఉర్సు బండ వినాయక నిమజ్జనప్రాంతం, నాయుడు పెట్రోల్‌పంపు జంక్షన్, మెట్టుగుట్ట, ఫాతిమా జంక్షన్, రెడ్‌క్రాస్ సొసైటీ హనుమాన్ దేవాలయం, హనుమకొండ కలెక్టర్ నివాసం, కాళోజీ జంక్షన్, ములుగురోడ్డు జంక్షన్లలో బ్యూటిఫికేషన్, శానిటేషన్ పరిస్థితులను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..జెమిని థియేటర్ జంక్షన్‌ను విస్తరించి అభివృద్ధి చేయాలని, పోతననగర్ జంక్షన్ ప్రాంతంలో కల్వర్టు నిర్మించి గ్రీనరీ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఉర్సుగుట్ట ప్రాంతంలోని జంక్షన్ వద్ద పక్షుల బొమ్మలకు పెయింటింగ్స్ వేయించి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. స్పాంజ్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన.. నగరంలో స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్‌కు ఉన్నతా ధికారులు సూచించిన నేపథ్యంలో శనివారం ఆమె పోతన రోడ్డుతో పాటు బృందావన్ కాలనీలో స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇంచార్జి ఎస్ఈ, సిటీ ప్లానర్ మహేందర్, రవీందర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, సంతోష్‌బాబు పాల్గొన్నారు. అధికారులకు మేయర్ గుండు సుధారాణి ఆదేశం -
వయోవృద్ధులకు వైద్య సేవలందించాలి
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007పై ఎంజీఎంలో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులు, ఇతర సౌకర్యాలను కల్పించి వైద్య సేవలందించాలన్నారు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు పెద్దవారిపై ప్రేమ, గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లో పిల్లలు కూడా పెద్దవారితో ప్రేమగా మెలుగుతారని తెలిపారు. పెద్దవారి ఆస్తులను అనుభవిస్తూ వారిని అనాథ ఆశ్రమాల్లో వదిలివేయడం సరైంది కాదన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో హెల్పేజ్ ఇండియా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్యాంకుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోయేషన్ కార్యదర్శి తేరాల యుగేందర్, దామోదర్, నర్సయ్య, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులు, సిబ్బందికి సూచించారు. హనుమకొండ టీవీ టవర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (బీ), బాలసముద్రంలోని బాలికల వసతి గృహం (ఏ)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు కోసం సిద్ధం చేసిన భోజనం, కూరలను పరిశీలించారు. రిజిస్టర్లు, బియ్యం, ఇతర వంట సామగ్రిని తనిఖీ చేశారు. . విద్యార్థుల సంఖ్య, వారి హాజరుశాతాన్ని వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. మెనూ చార్ట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, ఏఎస్‌డబ్ల్యూ కృష్ణ, వార్డెన్లు పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ఆర్జేసీ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన వెంట సినీ దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఉన్నారు. వారిని ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు తమ వివాహవార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాజీపేట జంక్షన్‌కు నేడు రైల్వే డీఆర్ఎంకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ఈనెల 3న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ప్రత్యేక రైళ్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటారు. అనంతరం జంక్షన్‌లోని రైల్వే యార్డు, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్ రూంలను తనిఖీ చేస్తారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్‌ను తనిఖీతో పాటు కాజీపేట జంక్షన్లో నిర్మించిన షటిల్ కోర్టును ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హనుమకొండ డీఆర్ఓగా రాజా గౌడ్హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రాజాగౌడ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్ఓగా పనిచేసిన వైవీ గణేష్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజాగౌడ్‌కు హనుమకొండ కేటాయించారు. సోమవారం ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం. వరంగల్ విద్యార్థులకు బంగారు పతకాలుహన్మకొండ: వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అవార్డుల ప్రదానం జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఐసీఏఆర్ డైరక్టర్ జనరల్, డీఏఆర్ఈ సెక్రటరీ మంగీలాల్ జాట్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని అవార్డులు అందించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన ఆర్షియా తబస్సమ్కు నాలుగు బంగారు పతకాలు, బండెవాల శ్వేత, ఏనుగు మానసకు బంగారు పతకం అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు అభినందించారు. వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం హన్మకొండ అర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డా.పి.విజయచందర్‌రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం వృద్ధులను చేనేత టవల్స్‌తో సత్కరించారు. తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బొమ్మిరెడ్డి పాపిరెడ్డి, సభ్యులు ఈవీ శ్రీనివాస్‌రావు, వేణుగోపాల్, శేషుమాధవ్, రమణారెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జయంతి, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలు
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రులను సోమవారంనుంచి తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి అప్పయ్య తెలిపారు. హసన్‌పర్తి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం ఆయన ప్రత్యేక బృందం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీల కోసం డాక్టర్, హెల్త్అసిస్టెంట్తోపాటు 15 మందితో కూడిన బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా క్లినిక్, ఆస్పత్రి నిర్వహణకు అనుమతి ఉందా? అనుమతి ఉంటే క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం మేరకు నిర్వహిస్తున్నారా అన్న వివరాలు సేకరిస్తారన్నారు. వైద్యుల పేర్లు, వారు అందిస్తున్న వివరాల పట్టిక, పొల్యూషన్ సర్టిఫికెట్, బయో మెడికల్ సర్టిఫికెట్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అన్న అంశాలను సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. నిబంధలకు విరుద్ధంగా క్లినిక్ నిర్వహించినట్లయితే తనిఖీల్లో వెల్లడైన పక్షంలో సదరు క్లినిక్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో డాక్టర్ భార్గవ్, జిల్లా మాస్ మీడియా అధికారి డాక్టర్ అశోక్‌రెడ్డి, గణాఽంకాధికారి జి.ప్రసన్నకుమార్, డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు,సిబ్బంది పాల్గొన్నారు. ఈజేహెచ్ఎస్ తనిఖీ హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని ఈజేహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్‌ను శనివారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తనిఖీ చేశారు. మెడికల్ స్టాక్ రికార్డులు, ఓపీలో వైద్యసేవలు, ల్యాబ్ ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయనవెంట కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్, డాక్టర్లు చరణ్, సుస్మిత, చైతన్య తదితరులు ఉన్నారు. బాలింతలకు అవగాహన కల్పించాలి తల్లిపాల ప్రాముఖ్యతపై బాలింతలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సిబ్బందికి సూచించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ఇచ్చే సూచనలను తల్లులు పాటించాలన్నారు. కార్యక్రమంలో జీఎంహెచ్ సూ పరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేయూ పాలక మండలి సభ్యురాలు అనితారెడ్డి, డాక్టర్లు మహేందర్, సుబాష్, సీడీపీఓ విశ్వజ, గీత, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండ వైద్యాధికారి అప్పయ్య -
వరంగల్ జిల్లాలో ‘మిషన్ తేజస్’
విద్యారణ్యపురి: సమగ్రశిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్‌నికోలస్ అనుమతితో వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి గుండు అనిరుధ్ ఆధ్వర్యంలో మిషన్ తేజస్ (తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం) నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఆ స్కూళ్లను స్మార్ట్ ఇన్నోవేషన్‌గా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి లేదా పాఠశాల విద్యాశాఖకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండొద్దనే నిబంధనతో ఈ కార్యక్రమానికి అనుమతినిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి ఈనెల 1న ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ మిషన్ ప్రారంభదశలో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారికి జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ప్రతీ విద్యార్థి భద్రత,సైబర్ భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లభించింది. శనివారం అనిరుధ్ తన తండ్రితో కలిసి వరంగల్ జిల్లా డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్‌ను కలిశారు. త్వరలోనే 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉంది. మిషన్ రూపకర్త వరంగల్ కుర్రాడు గుండు అనిరుధ్ -
డ్రగ్స్‌పై అవగాహనకే ప్రహరీ క్లబ్‌లు
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ప్రహరీక్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు ప్రహరీక్లబ్ల ఏర్పాటు, మాదద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి భీమారంలోని స్కిల్స్టోర్క్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు..పాఠశాల హెచ్ఎం చైర్మన్‌గా, ఓ ఉపాధ్యాయుడు వైస్‌చైర్మన్‌గా, ప్రతీ తరగతి నుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రహరీ క్లబ్ కమిటీ ఉంటుందన్నారు. యాంటీడ్రగ్స్ నార్కొటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలల సమీపంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తే వెంటనే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఆచార్యులు రవికుమార్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో స్పాట్ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు 4న అవకాశం కల్పించామని డీఈఓ వాసంతి తెలిపారు. ముల్కనూరు కేజీబీవీలో 22, ధర్మసాగర్ సీఈసీలో 15, ఎల్కతుర్తిలో 48, హసన్‌పర్తి సీఈసీలో 14, శాయంపేట బీపీసీలో 20, వేలేరు కేజీబీవీలో 33 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్లో 158, కళాశాలలో 49, ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో 234, కళాశాలలో 47, కమలాపూర్ మోడల్ స్కూల్లో 311 సీట్లు, కళాశాలలో 18 సీట్లు భర్తీకి అవకాశం కల్పించామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మార్కుల జాబితాలు, ఆధార్ కార్డు, టీసీతో సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలిసి అడ్మిషన్లు పొందాలన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి -
నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం
మామునూరు: పోలీస్ అధికారులు విధుల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం లభిస్తుందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సీపీ సన్ ప్రీత్‌సింగ్ పర్యవేక్షణలో మూడు రోజులుగా నిర్వహించిన తెలంగాణ పోలీస్ 2వ డ్యూటీ మీట్–2025 శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్యమిశ్రా ముఖ్యఅతిథులుగా హాజరై డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలు, షీల్డ్‌లు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా డీజీపీ ట్రోఫీ అందజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌కు సిద్ధం కావాలని, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. పోలీస్ అధికారులు క్రమ శిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ రెండోసారి వరంగల్‌లో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్ గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు. పోటీల్లో అధికారుల సత్తా .. రాష్ట్ర స్థాయి రెండో పోలీస్ డ్యూటీ మీట్–2025లో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అందుకుంది. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు జరగగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 4 ట్రోఫీలు, 17 పతకాలు కై వసం చేసుకుంది. ఇందులో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 4 బ్రాంజ్ (కాంస్య) మెడల్స్ ఉన్నాయి. సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్విస్టిగేషన్ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, భద్రాచలం జోన్ తృతీయ స్థానం, యాంటీ సబటేజ్ చెక్‌లో ఇంటెలిజెన్స్ ప్రథమ స్థానం, సైబరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, డాగ్ స్క్వాడ్ కాంపీటిషన్‌లో సీఐడీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ (ఐఎస్‌డబ్ల్యూ) ద్వితీయ స్థానం, బెస్ట్ డాగ్లో కాళేశ్వరం జోన్ ప్రథమ స్థానం, కంప్యూటర్ అవేర్నెస్, ఫొటోగఫీ పోటీల్లో ఐటీ అండ్ సీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ద్వితీయ స్థానం, వీడియో గ్రఫీ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం సాధించి పతకాలు అందుకున్నాయి. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణనాయక్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్ జిల్లా ఎస్పీలు కిరణ్ ఖరే, సుధీర్ రామ్‌నాథ్ కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, టీజీ ఎన్పీడీజీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, బల్దియా కమిషనర్‌చాహత్ బాజ్‌పాయ్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి కఠోర సాధనతోనే విజయాలు డీజీపీ డాక్టర్ జితేందర్ ముగిసిన రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీమీట్–2025 అతిఽఽథులకు గౌరవ వందనం .. రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీ మీట్–2025 ముగింపు వేడుకల్లో 450 మంది అధికారులు, సిబ్బంది జెండాలు చేతబూని డీజీపీ జితేందర్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రాకు గౌరవ వందనం సమర్పించారు. -
అకృత్యాలను నివారించాలి
పిల్లలు, మహిళలపై విద్యారణ్యపురి: మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను వ్యతిరేకించి, వారికి సురక్షిత వాతావరణం కల్పించాలని హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ వృత్తివిద్య జూనియర్ కాలేజీలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), హనుమకొండ భరోసా సెంటర్ సంయుక్తంగా ఆ కళాశాల ప్రి న్సిపల్ శ్రీధర్ అధ్యక్షతన ‘పిల్లలు, మహిళలపై లైంగిక వేధింపులు’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅ తిథిగా హాజరైన డీఐఈవో మాట్లాడుతూ..మహిళలు, పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసను అరికట్టాలన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ నిర్వహిస్తున్న కౌన్సిలర్ సుమత పేర్కొన్నారు. కార్యక్రమంలో భరోసా సపోర్ట్ పర్సన్ కె.రజిత, కై లాష్, షేర్ ఎన్జీవో ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్.జమున, బి.జగ న్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఆర్.ప్రవీణ్‌కుమార్, సవ్వాసి శ్రీనివాస్, స్టూడెంట్ కౌన్సిలర్ డి.రవి, కె.రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ -
జ్వరంతో చిన్నారి మృతి
నర్సంపేట: జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన చెన్నారావుపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బట్టి సంతోష్, సరిత దంపతుల కూ తురు మాన్య(2) వారం రో జులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో కు టుంబీకులు చిన్నారిని న ర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తీసుకెళ్లి చికిత్స చే యించాయి. శనివారం పరిస్థి తి విషమంగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నారి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
ఎన్‌సీసీతో క్రమశిక్షణ
● కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై కేయూ క్యాంపస్: ఎన్‌సీసీతో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గత నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ క్యాంపు శనివారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొనేందుకు ఇక్కడ ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 120 మందిని ఎంపిక చేశారు. అందులో డ్రిల్, బెస్ట్ క్యాడెట్స్, కల్చరల్, ఫ్లాగ్ఏరియా విభాగాల్లో ఎంపిక చేశారు.కార్యక్రమంలో క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవిసునారే, కెప్టెన్ డాక్టర్ పి.సతీశ్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, సుబేదారిమేజర్ జైరామ్‌సింగ్, రవీందర్, సందీప్, రాధాకృష్ణ, రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యనభ్యసించాలి న్యూశాయంపేట: విద్యార్థులు విలువలతో కూడిన విద్యనభ్యసించాలని, కమిషనర్ మైనారిటీ వెల్ఫేర్, తెలంగాణ మైనారిటీ గురుకులాల (టెమ్రిస్) కార్యదర్శి బి.షఫియుల్లా అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖిరాలు అధిరోహించాలన్నారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్ఎల్సీ డాక్టర్ జంగా సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్‌అక్బర్, మక్బూల్‌పాషా, అకడమిక్ కోఆర్డినేటర్ రుహీనా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 16 గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిధి ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు మనసు – మనిషి పుస్తకావిష్కరణహన్మకొండ కల్చరల్ : వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైకాలజిస్ట్, కౌన్సెలింగ్ ఎక్ప్‌పర్ట్ మెండు ఉమామహేశ్వర్ రచించిన మనసు– మనిషి వ్యక్తిత్వ వికాస పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం 10గంటలకు హనుమకొండ కిషన్‌పుర వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో ఉంటుందని నిర్వహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయితలు పాల్గొనాలని కోరారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
హసన్‌పర్తి: పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప ట్టాభిరామారావు హెచ్చరించారు. శనివారం హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళ ఇంజినీరింగ్ కళాశాలలో పోష్(లైంగిక వేధింపుల నివారక చట్టం)–2013పై అవగా హన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పని ప్రదేశంలో మ హిళలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎలా రక్షించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకో వాలనే అనే అంశాలపై వివరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా ఽఽధైర్యంగా ఎదరించాలన్నారు. పోష్ కమిటీ చైర్మన్ అనితారెడ్డి మాట్లాడుతూ..మహిళలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యాయమూర్తి శ్రావణ స్వాతి, కళాశాల ప్రిన్సి పల్ రాజశ్రీరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి సత్యనారాయణ, ఏఓ వేణుగోపాల్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు -
ఎన్జీటీ సూచనలు అమలు చేయండి
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనలు అమలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బా జ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ము న్సి పల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్జీటీ నిబంధనల ప్రకారం వరంగల్ కోట చెరువును శుభ్రం చే యించాలని, ప్రస్తుతం ఉన్న లెగసి వ్యర్థాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలన్నారు. ఎన్జీటీ విధివిధానాల ప్రకారం 17 ఎకరాల భూమిని రాంపూర్ డంప్‌యార్డ్‌లో నిర్వహించడంతోపాటు బయోమైనింగ్ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ల్యాండ్‌కు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు, నియంత్రించడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేసేలా శిక్షణ ఇచ్చి వాటిని కొనుగోలు చేసేలా చూడాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, కా లుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో ప్రజలు, యువకులు సభ్యత్వం తీసుకొని సేవచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో రాష్ట్రపాలక మండలి సభ్యుడు శ్రీనివాస్‌రావు, డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సహకార అ ధికారి నీరజ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఐఆర్ఎస్ ఎంసీ మెంబర్ నాడెం శాంతికుమార్, కోశాధికారి రాజేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పంట మార్పిడిపై అవగాహన ఉండాలి మామునూరు: పంట మార్పిడిపై రైతులు అవగా హన కలిగి ఉండాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ఏరువాక రైతుబడి కార్యక్రమంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి పర్చువల్గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్‌తోపాటు రైతులు వీక్షించారు. జిల్లా వ్యవసా య అధికారి అనురాధ, ఉద్యానశాఖ అధికారి శ్రీని వాస్‌రావు, మండల స్పెషల్ అఫీసర్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, రైతులు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్‌కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్‌తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్‌కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్‌కు వచ్చిన అనిల్‌ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్‌కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్‌కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోంది
● బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణ దోచింది ● బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి మామునూరు: బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఆరోపించారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని అడిటోరియంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్యక్షతన తొమ్మిది జిల్లాల మండల అధ్యక్షుల శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రోజు కొనసాగాయి. ఎమ్మెల్యే అభయ్ పాటిల్ హాజరై రాష్ట్ర ఎన్నికల ప్రభారి తరగతులను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా చంద్రశేఖర్ తివారి హాజరై మాట్లాడారు. మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఎన్నికల నిర్వహణ, ప్యూహం అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత దుగ్యాల ప్రదీప్‌కుమార్, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ప్రకాష్‌బాబు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, చంద్రశేఖర్ తీవారిలు కార్యాచరణ పద్ధతి, సమావేశాలు, సంభాషణ, సోషల్ మీడియా, స్వశక్తి మండల సంకల్పం అనే అంశాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.ధర్మారావు, విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, ఓ.శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్‌రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, కుసుమ సతీష్, రత్నం సతీష్షా, డాక్టర్ వన్నాల వెంకటరమణ, డాక్టర్ విజయచందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతి రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, బండి సాంబయ్య యాదవ్, బన్న ప్రభాకర్ పాల్గొన్నారు. పారదర్శకంగా పదోన్నతులు● ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలి ● కోఆర్డినేషన్ సమావేశంలో హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను కోరారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కల్పిస్తున్న నేపథ్యంలో శుక్రవారం హనుమకొండ డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ.. ఎస్జీటీల సీనియారిటీ జాబితాలను, వేకెన్సీల జాబితాలను పారదర్శకంగా ప్రకటించాలని డీఈఓను కోరారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అప్పీళ్లను వందశాతం పరిష్కరించి ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ నష్టం కలుగకుండా చూడాలని విన్నవించినట్లు సమాచారం. గత పదోన్నతులలో రెండు పదోన్నతులు లభించినా నాన్విల్లింగ్ ఇచ్చినవారిని, అలాగే రివర్షన్ వచ్చిన వారిని ఆయా సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాల్లో నుంచి తొలగిస్తామని డీఈఓ వాసంతి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు తెలియజేశారు. విద్యార్థులకు, టీచర్లకు వందశాతం ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనన్నారు. కాగా, స్కూల్ అసిస్టెంట్ల సత్సమాన క్యాడర్ల హెచ్ఎంల పదోన్నతుల కోసం జిల్లాలో 151 వేకెన్సీలు సంబంధిత డీఈఓ వెబ్సైట్లో ప్రకటించారని సమాచారం. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్ల గ్రేడ్ 2 పదోన్నతులు కల్పించాక స్కూల్ అసిస్టెంట్ల వేకెన్సీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
సాంకేతిక పురోభివృద్ధి..
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వరుణ్ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్లైన్ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సైది.. సైఫీ.. సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైపర్.. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్ ఉద్దేశం. ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల ఏర్పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్ లింక్ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్ స్టేషన్లో సమస్య ఉంటే మరో సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. రియల్‌టైం మానిటరింగ్ సిస్టమ్.. వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు.. విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్‌ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ఇ–స్టోర్.. పేపర్ విధానంలో మెటీరియల్ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఇ–స్టోర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్ స్టాక్ ఉందో సాఫ్ట్‌వేర్‌లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్‌ను రిజర్వ్ చేసుకుంటాడు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్‌కు ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. మెటీరియల్ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్ఎంఎస్, సాప్ మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్‌కు చేరుకుని మెటీరియల్ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు..వాట్సాప్ చాట్‌బాట్ విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్ చాట్ బాట్‌ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు చాట్ చేయగానే అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్ అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుంది. ఇలా విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్‌కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్‌కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. ఇలా ఏజెంట్‌తో చాట్ చేయొచ్చు లేదా కంప్లైంట్ నమోదు చేయొచ్చు.ఎల్సీ యాప్.. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్సీ యాప్‌ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్‌సీయాప్ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. -
నైపుణ్యాలతోనే శాఖాపరమైన గుర్తింపు
ఖిలా వరంగల్: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్‌తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్‌తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు. ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్, వీడియో గ్రఫీ, సైంటిఫిక్ ఎయిడ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మోహన్ కృష్ణకు బంగారు పతకం.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు. ఆటా..పాట డ్యూటీమీట్‌లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. పోటీలతో మానసిక ఒత్తిడి దూరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ -
బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది
కేయూ క్యాంపస్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్), నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎన్బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్ఎస్కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్లో 8న జరగబోయే బీఆర్ఎస్ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగనిమల్లేశ్వర్, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్ సెక్రటరీ వడ్డెరవీందర్, ‘పాస్’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
ఆరెపల్లి పాఠశాల తనిఖీ
న్యూశాయంపేట: నగర పరిధిలోని ఆరెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, విద్యార్థుల పఠనాసామర్థ్యాలు, పాఠశాల ఆవరణ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఉండడంపై ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు తొలగించాలని, అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వాచ్‌మన్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. కలెక్టర్ వెంట వరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు ఉన్నారు. రైతులతో ఆర్బిట్రేషన్ గీసుకొండ మండలం ఊకల్ గ్రామరైతులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఆర్బిట్రేషన్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన 15 మంది రైతులతో ఫైనల్ ఆర్బిట్రేషన్ నిర్వహించి అవార్డు ప్రదానం చేశారు. ఇందులో ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, కలెక్టరేట్ పర్యవేక్షకుడు శ్రీకాంత్, హైవే మేనేజర్, రైతులు పాల్గొన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్కు చెంపపెట్టు అని, కాంగ్రెస్ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్ పెండింగ్‌లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్‌కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్, శ్రీకాంత్ చారి, మహేందర్, సతీశ్, దేవమ్మ, గౌస్‌ఖాన్, జేకే పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి
● జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావుఎంజీఎం: తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డలు మానసికంగా అభివృద్ధి చెందడతోపాటు ఎదుగుదలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బరువు తగ్గుతారని, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుందని, క్యాన్సర్లు రాకుండా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే హక్కును పొందేటట్లు చూడాలని సూచించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. -
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త వివాహేతర సంబంధమే కారణం ఏనుమాముల బాలాజీనగర్‌లో ఘటన -
34 రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. పొడిగింపు రైళ్ల వివరాలు.. ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్‌లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్‌లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు. హాల్టింగ్ స్టేషన్లు.. కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్ అండ్ డౌన్ రూట్లో ప్రయాణించే రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, నాగ్‌పూర్, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్పూర్, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమ్, కోడేమా, గయా, జెహన్‌బాద్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ల సౌకర్యం కల్పించారు. -
పరిశ్రమలకు వేగంగా అనుమతులు
హన్మకొండ అర్బన్: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వైవీ గణేశ్, డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డీపీవో లక్ష్మీరమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ ఎస్ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీటీడీవో ప్రేమలత, టీజీఐసీసీ మేనేజర్ మహేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలి.. తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రజలకు, పాలసీ నిర్ణేతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డీఎంహెచ్‌వో అప్పయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, సీడీపీవోలు విశ్వజ, స్వాతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోడిగుడ్ ..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ఆన్లైన్ ప్రక్రియ● విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ● ఉమ్మడి వరంగల్‌లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ● ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ ● అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలు ● అందుకే పాలసీ మార్చిన ప్రభుత్వం..సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు అగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీ అగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొన్న విధంగా కాకుండ తక్కువ గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్‌లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటాయించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు... హనుమకొండ, వరంగల్‌లో తక్కువ.. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధికారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కోడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు జిల్లా సరఫరా చేయాల్సిన కేటాయించిన కోడిగుడ్లు డబ్బులు (రూ.లలో) హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 జేఎస్ భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637 -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్‌కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్ తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తుచేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్‌కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్ రైటర్‌గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారిని శ్రీరుద్రేశ్వరీదేవిగా అలంకరించారు. మహాహారతి జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మ ఉదయం నుంచి ప్రభాతసేవ, గణపతికి అభిషేకాలు, పూజలు జరిపి శ్రీరుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. హన్మకొండ కల్చరల్ : వరంగల్ ఎంజీఎం ఎదురుగా గల శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో శ్రావణమాసం రెండవ శుక్రవారాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అర్చకులు ఝెల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆనంతరం దేవాలయంలోని హాలులో వరలక్ష్మీ అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. అనంతరం అన్నప్రసాదాల వితరణ చేశారు. న్యూస్‌రీల్ -
మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ దర్శించుకున్నారు. గురువారం తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–2025 సందర్భంగా మామునూరు పీటీసీకి వచ్చిన ఆమె ఐనవోలు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుడు నరేశ్ శర్మ వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో అర్చకులు సన్మానించినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రకాశ్, మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ బి. రాజగోపాల్, ఎప్హెచ్ఓ శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు మధుకర్ శర్మ, వేదపారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, నరేశ్, మధు, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు. -
గమ్యంపై గురిపెడితే విజయం..
మామునూరు: ఏకాగ్రతతో గమ్యంపై గురిపెడితే విజయం సొంతమవుతుందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్లు ఎంతో దోహదపడుతా యని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ అని కొనియాడా రు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రెండో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–20 25 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. తె లంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అ డిషనల్ డీజీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో ని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 450 మంది పైగా 18 టీమ్‌లు హాజరుకాగా.. పోలీసులు జెండాలు చేతబూని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ నేర దర్యాప్తుతోపాటు అన్ని విభాగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలవడం హర్షణీయమన్నారు. 69వ ఆలిండియా డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయం.. ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం అభినందనీయమని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణను వివరించారు. 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరు.. వరంగల్ మామునూరు పీటీసీలో గురువారం నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రా ష్ట్రంలోని ఏడు జోన్లతోపాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సీఐడీ, ఇంటెలిజె న్స్, యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీ.ఆర్.పీ, ఐటీ అండ్ టీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సైంటిఫిక్ ఎయిడ్ ఇన్విస్టిగేషన్, యాంటీ సబటేజ్ చె క్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్ కాంపీటిష న్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యా యి. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఎస్పీ రాంరె డ్డి, డీసీపీలు అంకిత్‌కుమార్, సలీమా, రాజమహేంద్రనాయక్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇ.పూజ, కమాండెంట్లు రాంప్రకాశ్, రామకృష్ణ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.జెండాను ఆవిష్కరిస్తున్న అభిలాష్ బిస్త్ విధుల్లో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ దోహదం 69 ఆలిండియా డ్యూటీ మీట్లో సత్తా చాటాలి తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అట్టహాసంగా పోలీస్ డ్యూటీ మీట్–25 ప్రారంభం -
నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడి మెడపై కత్తితో దాడి
కేసముద్రం: ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడి మెడపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతులకు మనీష్, మోక్షిత్ ఇద్దరు కుమారులున్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులైన ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, నానమ్మ (మంగమ్మ) పక్కన పడుకున్న మనీష్ అనే ఆరేళ్ల బాలుడి మెడకు ఒకవైపు, వీపుభాగంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. దీంతో ఆ బాలుడు ఏడుస్తుండగా నిద్రలేచిన మంగమ్మ తన మనుమడిని దగ్గరకు తీసుకుని చూసింది. మనీష్ మెడభాగంపై గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కలున్న వారు నిద్రలేచి మనీష్‌ను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడపై కత్తిగాటుతో పొడవుగా పడటంతో 8 కుట్లు పడ్డాయి. కాగా, ఇంటికి రెండు దర్వాజలు ఉండగా, ఒక దర్వాజ తలుపులకు బేడం లేదని, దీంతో ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ట్రైనీ ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ సర్వయ్య మానుకోట జనరల్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపేందర్, శిరీష దంపతుల చిన్నకుమారుడైన నిహన్ (యేడాదిన్నర బాలుడు) 7 నెలల క్రితం నీటిసంపులో పడి మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మనీష్‌ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. మెడభాగంలో కోసిన గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలింపు మహబూబాబాద్ జిల్లాలో ఘటన -
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టాలి
రామన్నపేట : నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం హనుమకొండ ఏషియన్ షాపింగ్ మాల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూంలను, 35వ డివిజన్ వరంగల్ పుప్పాలగుట్ట వాటర్ ట్యాంక్ వద్ద శానిటేషన్ అండర్ డక్ట్ ప్రాంతం, చింతల్ బ్రిడ్జి వద్ద గల ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుప్పాల గుట్ట ప్రాంతంలో పర్యటించి సిబ్బంది ఫే స్ అటెండెన్స్‌ను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విధులు నిర్వహించే తీ రుతోపాటు ఒక్కపూట భోజనం సరిపోతుందా..? రెండు పూటల అందించాలా..? అని అడిగి తెలుసుకున్నారు. శివనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డక్ట్‌ను పరిశీలించిన కమిషనర్ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఈలు రాజ్‌కుమార్, రంగరావు పాల్గొన్నారు. పరిశీలన.. నయీంనగర్: గ్రేటర్ పరిధిలోని ఉనికిచర్ల కుడా లే ఔట్ స్థలం, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమెవెంట పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఏపీఓ రామ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
ట్రైనీ సర్వేయర్లకు న్యాయం చేయాలి
హన్మకొండ అర్బన్: ట్రైనీ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ (ఎల్ఎస్ఎస్)కు ఇటీవల నిర్వహించిన పరీక్షలో సమయానికి మించి ప్రశ్నాపత్రం ఉండడంతో తమకు అన్యాయం జరిగిందని ట్రైనీ ఎల్‌ఎస్‌ఎస్‌లు వాపోయారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థియరీ ప్రశ్నాపత్రంలో ఇంగ్లిష్, తెలుగులో విభిన్నంగా ప్రశ్నలు రావడం, ప్రశ్నాపత్రాల్లో టోపో డిటెయిల్స్‌లో జరిగిన తప్పుల కారణంగా థియరీ ప్రశ్నాపత్రంలో సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. తాలిమ్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్) మెటీరియల్ ప్రకారం 100 శాతం థియరీ – ప్రాక్టికల్స్‌ను జిల్లా శిక్షణ కేంద్రంలో అధికారులు, అధ్యాపకులు నేర్పించారని, అయినప్పటికీ ప్రశ్నలు మెటీరియల్ నుంచి ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జవాబు పత్రాలలో పేజీలను పెంచాలని, ప్లాటింగ్‌లో ప్రింటింగ్ క్లారిటీగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. -
‘ముఖం’ చూపించాల్సిందే..!
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్ఎంలను గురువారం ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా టీచర్ల ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో నేటి(శుక్రవారం)నుంచి రాష్ట్రవ్యాప్తంగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, టీజీఆర్‌ఈఐఎస్‌లలో అమలు చేయనున్నారు. డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. అందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (డీఎస్ఈ ఎఫ్ఆర్ఎస్) యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్ఎంలు, టీచర్ల, నాన్ టీచింగ్ ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు అమలుచేయనున్నారు. హెచ్ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డీఎస్ఈ యాప్‌లో టీచర్ మాడ్యూల్ టీచర్లకు, నాన్‌టీచింగ్ మాడ్యూల్లో నాన్‌టీచింగ్ సిబ్బందికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం తదితర వివరాలు అప్లోడ్ చేయాల్సింటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది తమతమ సెల్ఫోన్లలో సంబంధిత యాప్‌లో ఇక ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవచ్చు. నేటినుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింటుంది. జియోట్యాగింగ్‌ను కూ డా ఇస్తారు. పాఠశాలలోనే ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సింటుంది. ఒకవేళ సెలవు పెడితే తప్పనిసరిగా యాప్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు డెమో ఇచ్చినట్లు సమాచారం. విద్యార్ధులకు ఇప్పటికే ముఖగుర్తింపు హాజరు తీసుకుంటున్నప్పటికి కొన్నిపాఠశాలల్లో అమలుచేయటంలేదు. ఇందుకు పలు కారణాలు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల వేళలు ఇలా పీఎస్‌లు ఉదయం 9నుంచి 4 గంటల వరకు, యూపీఎస్‌లు, హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు పనివేళలున్నాయి. టీచర్లు ఉదయం నిర్ధేశించిన సమయం కంటే ముందుగానే, సాయంత్రం విధుల సమయం ముగిశాక అంటే రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సింటుంది. డుమ్మాలకు చెక్పడినట్లేనా..? విధులకు డుమ్మాలు కొట్టే కొందరు టీచర్లకు ముఖగుర్తింపు హాజరుతో చెక్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే టీచర్లు కొందరు సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదనే ఆరోపణలున్నాయి. ఆలస్యంగా వెళ్లడం, సాయంత్రం నిర్ధేశించిన సమయం కంటే ముందే వెళ్లిపోవడంలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకేంద్రంనుంచి ఇతర జిల్లాలకు రైలు, బస్సుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలకు షటిల్ సర్వీస్ చేసే టీచర్లు ఉన్నారు. ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌తో వారికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. డీఈఓలతోపాటు హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అటెండెన్స్‌పై ప్రతీరోజు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే కలెక్టర్ ప్రతీరోజు సమీక్ష.. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే విద్యార్థులకు తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రతీరోజు సమీక్షిస్తున్నారు. హాజరు తక్కువగా ఉన్న పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ల ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను సైతం కలెక్టర్ ఏరోజుకారోజు పర్యవేక్షించే అవకాశం ఉంది. మరోవైపు డీఈఓ కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేస్తారు. డీఈఓలు కూడా టీచర్ల అటెండెన్స్‌ను పర్యవేక్షిస్తారు. నేటినుంచి పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ కొందరు ఉపాధ్యాయుల డుమ్మాలకు చెక్ పడినట్లే.. విద్యార్థులకు ఉపయోగిస్తున్న డీఎస్ఈ యాప్‌నే వినియోగం నాలుగు రోజులపాటు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ప్రభుత్వ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్‌స్కూల్స్, యూఆర్ఎస్, సాధారణ గురుకులాల్లోనూ అమలు డీఈఓ, కలెక్టర్లు ప్రతీరోజూ పర్యవేక్షణ.. హనుమకొండ జిల్లాలో ఇలా.. ప్రభుత్వ పీఎస్, యూపీఎస్, జెడ్పీ హైస్కూళ్లు 567 అన్ని కేటగిరీల టీచర్లు 2,360 కేజీబీవీలు 09 టీచింగ్, నాన్‌టీచింగ్ 495 టీజీ మోడల్ స్కూళ్లు 03 టీచర్లు 62 యూఆర్ఎస్ 01 టీచర్లు 06 టీజీఆర్‌ఈఐ 03 టీచర్లు 63వరంగల్ జిల్లాలో.. ప్రభుత్వ పీఎస్, యూపీఎస్, జెడ్పీ హైస్కూళ్లు 513 అన్ని కేటగిరీల టీచర్లు 2,767 కేజీబీవీలు 10 టీచింగ్, నాన్‌టీచింగ్ 147 టీజీ మోడల్ స్కూళ్లు 06 టీచర్లు 133 యూఆర్ఎస్ 01 టీచర్లు 06 టీజీఆర్‌ఈఐ 01 టీచర్లు 25రిజిస్ట్రేషన్‌కు నాలుగు రోజులు అవకాశం హెచ్ఎంలకు వారివారి పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల, నాన్‌టీచింగ్ సిబ్బంది డీఎస్ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నాలుగురోజులు అవకాశం ఇచ్చారు. నేటినుంచే మొదలు పెట్టాల్సింటుంది. రిజిరస్రేషన్ అయిన రోజునుంచే ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను తీసుకోవాల్సింటుంది. ఐదు రోజుల తరువాత జియోట్యాగింగ్ చేస్తారు. ఈ అటెండెన్స్‌పై డ్యాష్‌బోర్డు ద్వారా మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. – వాసంతి, హనుమకొండ డీఈఓ -
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు విజయ్, నందు, విష్ణు, పీటర్, శ్రీకాంత్, పవన్, అరవింద్, నవీన్, తరుణ్, గణేశ్, వంశీ, గోవింద్, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : భూ భారతి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే దరఖాస్తుదారులకు నోటీసులు జారీ, విచారించి వాటి పరిష్కారానికి తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో భూభారతి దరఖాస్తులపై గురువారం అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వోలతో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు పూర్తిచేసిన భూభారతి దరఖాస్తుల ప్రక్రియ, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది, దరఖాస్తుల పరిష్కారం ఎప్పటివరకు పూర్తవుతుందని తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కేటాయించామని, దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ మాట్లాడారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి. గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
ఎల్ఆర్ఎస్.. నో కి ్లయరెన్స్!
సాక్షిప్రతినిధి, వరంగల్: హసన్‌పర్తి మండలం దేవన్నపేట శివారులో హుజూరాబాద్‌కు చెందిన ఓ టీచర్‌కు 400 గజాల స్థలం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 25 శాతం రాయితీపై మార్చి 30న రూ.60 వేల పైచిలుకు డబ్బులు ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్లో చెల్లించారు. ఇప్పటికీ ఆయన ఫైల్ క్లియరెన్స్ కాకపోగా.. ఎల్–1 స్టేజీలోనే పెండింగ్‌లో చూపుతుండడంతో అధికారులను కలిస్తే రేపు, మాపు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మామునూరు శివారులోని ఓ వెంచర్లో నగరంలోని బట్టల దుకాణంలో పనిచేసే ఒకరు 220 గజాల స్థలం తీసుకున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అప్పుచేసి ఏప్రిల్ 10న రూ.31 వేల వరకు ఆన్లైన్ చెల్లించారు. ఇప్పటివరకు తన ఫైల్ ఎల్–1 దగ్గరే ‘పెండింగ్’ చూపుతుందని చెప్పారు. ... ఇలా హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీ.. గ్రేటర్ వరంగల్ చుట్టూ నాన్ లేఅవుట్ ప్లాట్లు తీసుకుని ఎల్ఆర్ఎస్ చెల్లించిన పలువురు ఇబ్బంది పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఎల్ఆర్ఎస్ చెల్లించిన రసీదులతో అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. మొదటినుంచి ఇదే కథ.. అక్రమ లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు 25శాతం మినహాయింపు ఉపయోగించుకోవాలని అనుకునే వారికి మొదటి నుంచి అవాంతరాలు తప్పడం లేదు. ప్రభుత్వం మార్చి 31 వరకు 25శాతం రాయితీ కల్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఎల్ఆర్ఎస్ ఫీజ్ చెల్లింపునకు ఓపెన్‌కాని వెబ్‌సైట్స్.. యాక్సెప్ట్ కాని ఆన్లైన్లో కష్టాలు వెంటాడాయి. చివరికి దరఖాస్తుదారులు మున్సిపల్ ఆఫీస్‌లు, మీ– సేవ సెంటర్ల చుట్టూ తిరిగి తిరిగి పనులు కానిచ్చారు. ఇదే సమయంలో మార్చి 31 డెడ్‌లైన్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో మొత్తానికి వారం, 10 రోజుల తిరిగైనా దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా రుసుం చెల్లించారు. 25శాతం మినహాయింపు డెడ్‌లైన్‌ను ఉపయోగించుకున్న చాలామంది ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించగా.. ఇప్పు డు ఆ దరఖాస్తుల ఆమోదానికి కూడా నెలలు గడుస్తుండటం ఇబ్బందికరం అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహసనంగా ఆన్లైన్ క్లియరెన్స్.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా 9 మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ కోసం 2020లో 1,58,265 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క కార్పొరేషన్ పరిధిలోనే 1,00,989 దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తుల క్లియరెన్స్ 2020 తర్వాత పెండింగ్‌లో పడగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఆ దరఖాస్తుల్లో కదలిక వచ్చింది. 25శాతం రాయితీతో మొత్తం 1,43,121 దరఖాస్తులపై ఎల్ఆర్ఎస్ చెల్లించగా, వరంగల్ కార్పోరేషన్లో 96 వేల మంది ఉన్నారు. ప్రధానంగా ఈ స్థలాలన్నీ హసన్‌పర్తి, ఖిలావరంగల్, కాజీపేట, హనుమకొండ, ధర్మసాగర్, గీసుకొండ, మామునూరు తదితర మండలాల పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిపై ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి ఐదారు నెలలు గడుస్తున్నా 40 శాతానికి పైగా దరఖాస్తులు ఆన్లైన్లో ఎల్–1 స్టేజ్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు బాఽధితులు చెబుతున్నారు. ఎల్–1 అధికారి ధృవీకరించి ఎల్–2కు సిఫారసు చేస్తే.. ఎల్–3లో ఉన్నతాధికారులు క్లియర్ చేస్తారు. ఇందుకోసం ఎల్–1 స్థాయి అధికారిని కలిస్తే స్పాట్ వెరిఫికేషన్ రేపు, మాపు అంటూ ఐదారు నెలలుగా తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి, పేర్లు చెప్పడానికి జంకుతున్నారు. ఇప్పటికై న కార్పొరేషన్, మున్సిపాలిటీల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారి ఆన్లైన్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ ఆశయం నెరవేరేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. కాగా, జీడబ్ల్యూఎంసీ అధికారులు మాత్రం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై నిబంధనల ప్రకారం ప్రాసెస్ జరుగుతోందని, దశల వారీగా అన్ని క్లియర్ చేస్తామని చెబుతున్నారు.కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఇలా..జిల్లా మున్సిపాలిటీ దరఖాస్తులు గ్రేటర్వరంగల్ కార్పొరేషన్ 1,00,989 హనుమకొండ పరకాల 3,182 వరంగల్ నర్సంపేట 5,421 వర్ధన్నపేట 522 మహబూబాబాద్ మానుకోట 12,201 డోర్నకల్ 872 మరిపెడ 2,629 తొర్రూరు 10,299 జేఎస్ భూపాలపల్లి భూపాలపల్లి 3,771 జనగామ జనగామ 18,379 మొత్తం 1,58,265 ఎక్కడి దరఖాస్తులు అక్కడే.. సగం వరకు ఆన్లైన్లోనే పెండింగ్ ఎల్–1, ఎల్–2 స్థాయి దాటని వైనం.. సాగని స్పాట్ వెరిఫికేషన్ జీబ్ల్యూఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి దరఖాస్తుదారులకు తీరని చిక్కులు.. ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: పథకాలు అందించడమే కాకుండా వాటిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో పలుశాఖల అధికారులతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పథకాల పర్యవేక్షణపై ఆయా ప్రాజెక్టుల అధికారులు దృష్టి సారించాలన్నారు. మహిళలు, పిల్లల సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పలు ప్రాజెక్టుల అమలు తీరును సమీక్షించి సమర్థ నిర్వహణకు సూచనలు చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఐఓ శ్రీధర్ సుమన్, సీడీపీఓలు మధురిమ, అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీరామన్నపేట : హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డులో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్లో చెత్త తరలింపు తీరును గురువారం మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త తరలింపు జరిగే విధానాన్ని అధికారులను అడిగి తెలుసున్నారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, నరేందర్, ఇన్స్పెక్టర్లు బాషా నాయక్, సురేశ్, శ్రీనివాస్ ఉన్నారు. -
ఎస్‌ఏలకు హెచ్ఎంలుగా పదోన్నతులు
విద్యారణ్యపురి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌లలోని స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా (గ్రేడ్–2), ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ షెడ్యూల్ జారీచేశారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 10రోజుల వ్యవధిలో పూర్తికానుంది. మల్టీజోన్–1పరిధిలో.. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ (వరంగల్) పరిధిలో మల్టీజోన్–1 ఉంటుంది. ఈ జోన్లో మొత్తం 19 జిల్లాలున్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ పరిధి లోని ఆరు జిల్లాలున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్ గ్రేడ్ 2 పదోన్నతులకు సంబంధించి 490 పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాలనుంచి ఖాళీలు, సీనియారిటీ జాబితా లను తెప్పించుకున్నారు. ఆయా జాబితాలను కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం వెల్లడించనున్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో 179మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జిల్లాలో 119మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు క్లియర్ వేకెన్సీలుండగా, 60మంది స్కూల్ అసిస్టెంట్లకు వరకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరైజింగ్ ఖాళీలు కలుపుకుని 179మందివరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. డీఈఓ కార్యాలయంలో కొద్దిరోజులుగా పదోన్నతుల ప్రక్రియకు వేకెన్సీలు, సీనియారిటీ రూపకల్పనపై కసరత్తు కొనసాగింది. షెడ్యూల్ ఇలా.. ● 2న పీఎస్, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈఓ వెబ్సైట్లో ఉంచాలి. అలాగే.. పదోన్నతుల కోసం ఎస్ఏ, ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాలి. ● 3న ఇరువురికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ● 4, 5వ తేదీన సీనియార్టీలపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవీ వెబ్సైట్లో ప్రదర్శించాలి. ● 6న గ్రేడ్–2 హెచ్ఎంల పదోన్నతి కోసం ఎస్ఏల కు వెబ్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. ● 7వ తేదీన ఎస్‌ఏలకు గ్రేడ్–2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ● 8, 9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్–2 హెచ్ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటన చేస్తారు. ● 10న ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్, 11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన టీచర్లకు ఉత్తర్వుల కాపీలు అందిస్తారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా.. పది రోజుల్లోనే ప్రక్రియ పూర్తి మల్టీజోన్–1 పరిధిలో 490 హెచ్ఎంల ఖాళీలు.. -
దరఖాస్తుల ఆహ్వానం
కాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బేగంపేట, రామాంతపూర్‌లో (ఒకటో తరగతి) ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి హేమకళ గు రువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను హెచ్‌పీఎస్ 1వ తరగతిలో ముగ్గురు బాలురు, ముగ్గురు బాలికలకు లక్కీ డ్రా ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తులను హనుమకొండలో అంబేడ్కర్ భవన్ ఎదుట గల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో టైంటేబుల్ పాటించాలి మడికొండ : ప్రతీ పాఠశాలలో ఈనెలనుంచి ఖాన్ అకాడమీ టైంటేబుల్ పాటించాలని హనుమకొండ డీఈఓ వాసంతి సూచించారు. గురువారం కాజీపేట మండలం మడికొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన బయోసైన్స్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి డీఈఓ వాసంతి హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులను పాఠ్యాంశాలను చదివించి, ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఖాన్ అకాడమీ (జేఈఈ, నీట్, ఐఐటీ, మెయిన్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కు) సంబంధించినవి అని తెలిపారు. ఎంఈఓ బండారి మనోజ్‌కుమార్, హెచ్ఎం సంధ్యారాణి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసు, బయోసైన్స్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నేటినుంచి తల్లిపాల వారోత్సవాలు కాజీపేట అర్బన్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఈనెల7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీ్త్ర,శిశు సంక్షేమాధికారి జయంతి గురువారం ‘సాక్షి’తో తెలిపారు. ఈ ఏడాది ‘తల్లిపాలకు ప్రాధాన్యత ఇవ్వండి.. స్థిరమైన మద్దతు వ్యవస్థలను నిర్మించండి’ అనే థీమ్‌తో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాల్లో ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధ్యతల స్వీకరణహన్మకొండ కల్చరల్ : భద్రకాళి ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగా వరంగల్ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఈఓగా పనిచేసిన శేషుభారతి పదవీ విరమణ చేశారు. బాధ్యతలు చేపట్టిన సునీత గతంలోను రెండు పర్యాయాలు ఈఓగా పనిచేశారు. బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభంమామునూరు : ఖిలావరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నేత పి.మురళీధర్‌రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెండ్రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్‌రెడ్డి, ఎం.ధర్మారావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ విజయ రామారావు, వన్నాల శ్రీరాములు, శిక్షణ తరగతుల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్ రావు, క్రాంతికుమార్, కొండేటి శ్రీధర్, సతీష్‌రెడ్డి, డాక్టర్ వెంకటరమణ, విజయచందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపువిద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈనెల 20వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్‌బోర్డు ఉత్తర్వులు జారీచేసినట్లు వరంగల్ డీఈఓ డాక్టర్ శ్రీధర్‌సుమన్ గురువారం తెలిపారు. జూలై 31వ తేదీతో అడ్మిషన్లు ముగియడంతో గడువును పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.