Hanamkonda District News
-
ఇక చెత్తకు చెక్!
వరంగల్ అర్బన్: నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో పారిశుద్ధ్యం మొదటిది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రజాధనం కోట్లు కుమ్మరిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈక్రమంలో తాజాగా.. రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు గ్రేటర్ నగరంలో లిట్టర్ ఫ్రీ జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బల్దియా ప్రజారోగ్యం అధికారులు నగరవ్యాప్తంగా ప్రధాన రహదారులు, పార్కులు, చెరువులు, పర్యాటక ప్రాంతాలు, జన సామర్థ్యం కలిగి ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చెత్త వేస్తే జరిమానా.. లిట్టర్ ఫ్రీ జోన్లో భాగంగా ఎవరైనా రోడ్లపై చెత్త, పడేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించాలనే నిబంధనలున్నాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, వ్యాపార, వాణిజ్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని భావిస్తున్నారు. వీటిని కఠినతరం చేస్తుండడంతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల్లో కమర్షియల్ భవనాల నుంచి విధిగా వాహనాల ద్వారా రోజువారీగా చెత్తను సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. గతంలో 17 ప్రధాన రహదారులకు సంబంధించిన 44 కిలోమిటర్ల లిట్టర్ ఫ్రీ రోడ్లతో పాటు మరో 6 రహదారులను పరిగణనలోకి తీసుకోనున్నారు. బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, వాహనాల డ్రైవర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహిస్తే లిట్టర్ ఫ్రీ సిటీ సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాకు 40 మంది పర్మనెంట్ ఉద్యోగులుగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 40 మంది పర్మనెంట్ ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–4 సెలక్ట్ అయిన వీరికి ఇటీవల పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ పోస్టింగ్ ఇ చ్చారు. దీంతో రెండు, మూడు రోజుల్లో విదుల్లో చే రనున్నారు. నలుగురు జూనియర్ అకౌంటెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, 30 మంది వార్డు ఆఫీసర్లను కేటాయించారు. కొద్ది నెలల కిందట 38 మంది వీఆర్ఓలు, ఆరుగురు వీఆర్ఏలు బ ల్దియాకు కేటాయించడంతో, మరికొంత మంది బ ల్దియా పర్మనెంట్ ఉద్యోగులతో కలిపి 66 డివి జ న్లకు వార్డు ఆఫీసర్లను నియమించారు. వీఆర్ఓలు, కొత్తగా చేరనున్న వార్డు ఆఫీసర్లతో బల్దియా సాధారణ పరిపాలన విభాగం బలోపేతం కానుంది. 23 లిట్టర్ ఫ్రీ జోన్ల రోడ్లు, ప్రాంతాల గుర్తింపు త్వరలో నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు రోడ్లపై చెత్త వేస్తే జరిమానా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు -
రిపబ్లిక్ డే పరేడ్‌కు కేడెట్లు
కేయూ క్యాంపస్: న్యూఢిల్లీలో జరగబోయే రిపబ్లిక్ డే పరేడ్‌కు హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎన్సీసీ కేడెట్లు బి.ప్రశాంత్, ఎం.భావన, కె.నివేదిక, దినేశ్ ఎంపికయ్యారు. వీరిని బుధవారం ఆకళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి అభినందించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు లెఫ్టినెంట్ డాక్టర్ స్వామి, ఫ్లయింగ్ ఆఫీసర్ బి.ప్రసాద్, డాక్టర్ నెహదా, డాక్టర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు. సీపీని కలిసిన హెడ్కానిస్టేబుళ్లువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్‌కు చెందిన 19 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈసందర్భంగా పదోన్నతి పొందిన పలువురు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సీపీని కలిసిన వారిలో హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, బాబు, స్వామి, దామోదర్ ఉన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు చేయూతనందించాలిఎంజీఎం: క్షయ వ్యాధిగ్రస్తులకు చేయూతనందించాలని వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. జిల్లా క్షయ నివారణ సంస్థ సిబ్బంది బుధవారం తమ సొంత ఖర్చులతో వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ సాంబశివరావు పలువురు వ్యాధిగ్రస్తులకు పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేసి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ సంస్థ అధికారి, కార్యాలయ సిబ్బంది ప్రభాకర్, రంజిత్, వేణుగోపాల్, నరేశ్, మాధవి, సుభాషిని, సంకీర్తన, నరేశ్, అశోక్, పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు జాబ్మేళాకాళోజీ సెంటర్: ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ములుగు రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం జాబ్‌మేళా నిర్వహిస్తునట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి సీహెచ్.ఉమారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్న జాబ్‌మేళాకు అర్హత, ఆసక్తిగలవారు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 70931 68464 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
సమతుల్య ఆహారం తప్పనిసరి
ఎంజీఎం : చలికాలంలో వేడివేడి ఆహార పదార్థాలతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేవి తినాలి. ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. వీటిలో ఫైబర్, మిటమి న్లు పుష్కలంగా ఉండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. º వేరుశనగ, బాదాం, జీడి పప్పు, పిస్తా, కర్జూర వంటి తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఇవి బలవర్ధకమైన ఆహారంతోపాటు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. º చలి కాలంలో యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఫైబర్ ఉంటుంది. ఇవి వేడిని ఉత్పత్తి చేస్తాయి. º వంట గదిలోని ఆవాలు, ఎండు మిర్చి, మెంతులు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, జీరా వంటి ద్రవ్యాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి సహకరిస్తాయి. జలుబు, దగ్గు, వంటి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతాయి. º శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, చక్కెర పదార్థాలు, స్వీట్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఆల్కహాల్, బేకరీ పదార్థాలకు దూరంగా ఉండాలి. º చలిగాలి వెళ్లకుండా తల, చెవుల భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి. స్వెటర్లు వేసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లినట్లు మఫ్లర్గానీ, మంకీక్యాప్ పెట్టుకోవాలి. వేడివేడి పదార్థాలు తీసుకోవాలిరవీందర్రెడ్డి, డైటీషియన్, ఎంజీఎం -
పిల్లలు, పెద్దలు జాగ్రత్త..
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024ఎంజీఎం : చలి తీవ్రత ఎక్కువైనందున పిల్ల లు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చలితో చర్మం, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు గుండె సంబంధ వ్యాధుల వారికి డిప్రెషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ● చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. న్యూమోనియా, బ్రాంకై టీస్, అస్తమా వంటి ఊపిరితిత్తుల ఇబ్బంది తలెత్తకుండా చల్లగాలిలో తిరగడం, దుమ్ము ధూళి ఉండే పరిసరా లకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. చర్మ సంరక్షణ కోసం రో జూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ● పొడి దగ్గు, పిల్లి కూతలు, ఛాతిలో బరువు ముఖ్యంగా రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే అస్తమాగా భావించాలి. ● పెద్దవాళ్లలో దగ్గు మాత్రమే ఉంటే అస్తమా కాదు. రాత్రి, ఉదయం వేళలో అధికమవుతుంది. అధిక వ్యాయామం, అలెర్జీలు, చల్లటి గాలి ద్వారా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అస్తమా మందులు వాడేవారు ఇన్హేలర్లు క్రమం తప్పకుండా వినియోగించాలి. ● శీతాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు వస్తే న్యూమోనియా, ఇన్ఫ్ల్లూంజాగా పరిగణిస్తారు. వ్యాక్సికేషన్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ● గుండె వ్యాధులు ఉన్నవారు మందులు రెగ్యులర్‌గా వాడాలి. కొందరిలో గుండె వేగం తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించాలి.జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సాయంత్రం 6 గంటలు అయ్యిందంటే చాలు జనం బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. పొగమంచు కురవడంతోపాటు చల్ల టి గాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో వివిధ పనులు చేసుకునే వారు, గ్రామాల్లో చీకటి పడగానే చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా మంచు వీడడం లేదు. చలిలో పొంచి ఉన్న వ్యాధులుడాక్టర్ ఎం.పవన్‌కుమార్ జనరల్ మెడిసిన్ ఎండి.ప్రొఫెసర్ భూపాలపల్లి -
ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు
హన్మకొండ అర్బన్: తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పరకాల ఎంపీడీఓగా పని చేస్తున్న పెద్ది ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా హసన్‌పర్తి ఎంపీడీఓ జూలూరు ప్రవీణ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓ ఎం.విద్యాలత తెలిపారు. బుధవారం జరిగిన సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా నందం విజయకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామడుగు లక్ష్మీ ప్రసన్న, కార్యవర్గ సభ్యులుగా గుండె బాబు, కమటం అనిల్‌కుమార్‌ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈనూతన కార్యవర్గం మూడేళ్ల పాటు ఉంటుందని వివరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ విద్యాలత మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర చాలా కీలకమని అందరూ కష్టపడి పని చేసి జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని కోరారు. నూతన అధ్యక్షుడు అంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికలను సహృద్భావ వాతావరణంలో సజావుగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. జిల్లా అభివృద్ధి అందరం కష్టపడి పనిచేద్దామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ బి.రవి, ఎంపీడీఓలు ఫణిచంద్ర, శ్రీనివాస్, వీరేశం, జెడ్పీ కార్యాలయ పర్యవేక్షకులు రాంబాబు, సునిల్, రామ్మోహన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులను బడికి పంపడం అందరి బాధ్యత
● ఇన్చార్జ్ కలెక్టర్ సత్య శారద ● అధికారులతో సమీక్ష హన్మకొండ అర్బన్: జిల్లాలోని 6–14 ఏళ్ల విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బడి బయటి విద్యార్థుల గుర్తింపునకు చేపట్టనున్న ప్రత్యేక సర్వేపై బుధవారం కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఒక నెల కంటే ఎక్కువ గైర్హాజరైన విద్యార్థులను బడి బయటి విద్యార్థులుగా గుర్తించాలని, 15–19 మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు చదువు ఆపేస్తే వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా విద్యాభ్యాసం కొనసాగించడానికి ప్రేరేపించాలని సూచించారు. సర్వే నిర్వహణ, అవసరమైన ప్రొఫార్మాలు, సూచనలను డీఈఓ వాసంతి ఆయా శాఖల అధికారులకు తెలిపారు. ఇటుక బట్టీలు, పని ఆవాసాలు, వలస వచ్చే కార్మికులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గుణాత్మక విద్య సమన్వయ అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి జయంతి, పోలీస్ కమిషనరేట్ నుంచి వెంకన్న, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
● ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు అజీజ్ఖాన్వరంగల్ స్పోర్ట్స్: క్రీడాకారుల సంక్షేమం, క్రీడల అభివృద్ధే సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ లక్ష్యమని ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను రెండో రోజు బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా క్రీడాకారులతో కలిసి హాకీ ఆడి సందడి చేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. రెండో రోజు రెజ్లింగ్, బాక్సింగ్, లాన్‌టెన్నీస్, వెయిట్ లిఫ్టింగ్, షూటింగ్, హాకీ, కరాటే, రోయింగ్, స్క్వాష్, అత్యపత్య, పవర్‌లిఫ్టింగ్, సాఫ్ట్‌బాల్, టేబుల్‌టెన్నీస్, సెపక్తక్రా, తైక్వాండో క్రీడాంశాలు ఎంపిక పోటీలు జరిగాయి. క్రీడాకారులకు వైద్యపరీక్షలు చేసి మందులు అందించినట్లు డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. బాక్సింగ్ క్రీడాకారుల ఆందోళన బాక్సింగ్ ఎంపికల వద్ద క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌కుమార్ పరుష పదజాలంతో దూషిస్తున్నాడని వాపోయారు. 500 గ్రాములు తక్కువగా ఉన్నారని తమను ఎంపికలకు దూరం చేశారని ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన అఖిల్, శ్రీమాన్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీలు మరో వారం రోజులు ఉన్నాయని అప్పటిలోపు అరకిలో బరువు సులువుగా పెరగొచ్చని క్రీడాకారులు అంటున్నారు. -
చిప్‌లు గట్టిపడి పనితనం మందగిస్తుంది
● మంచుకురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించొద్దు ● మయూర్, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హనుమకొండ హన్మకొండ చౌరస్తా: ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలో పడిపోయినప్పుడు కంప్యూటర్లు, మొబైళ్లు, బ్యాటరీ, ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లలో ఉండే మెటల్ కాంట్రాక్ట్‌లు ప్రభావితం అవుతాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల లోపల ఉండే చిప్‌లు మైనస్ టెంపరేచర్లో గట్టిపడి పనితనం మందగిస్తుంది. అయితే బయటి దేశాలతో పోల్చితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లోని చలితీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. దీని వల్ల ఎలక్ట్రానిక్స్ వస్తువులపై అంతగా ప్రభావం ఉండదు. అలాగని మంచు కురిసే సమయంలో బయటి ప్రదేశాల్లో ల్యాప్‌టాప్, మొబైళ్లను వాడితే తెలియకుండానే మంచు లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. నీటి తడితో విడిభాగాలు పూర్తిగా పాడవుతాయి. మంచు కురిసే ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం మంచిది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కంప్యూటర్లు, మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల విడిభాగాలపైన కొంత ప్రభావం చూపుతుంది తప్పితే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. కీప్యాడ్ మొబైళ్లు కొంత బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. మొబైల్ బాగా వేడి అయినప్పుడు స్విచ్ఆఫ్ చేయడం మంచిది. -
ముళ్ల చెట్లు తొలగించారు
మడికొండ: మడికొండలోని పలు కాలనీల్లో ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లు, పిచ్చిమొక్కలను బుధవారం తొలగించారు. సాక్షి దినపత్రిలో బుధవారం ప్రచురితమైన జనావాసాల్లో ముళ్ల చెట్లు అనే కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈమేరకు ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో భూ యజమానులు స్పందించి జేసీబీల సహాయంతో ముళ్ల చెట్లను తొలగించారు. ఈక్రమంలో సాక్షికి, అధికారులకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సన్నిధిలో కమిషనర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కుటుంబ సమేతంగా బుధవారం సందర్శించారు. ఈమేరకు ఆమెకు పర్యవేక్షకుడు అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం కమిషనర్‌కు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించి మహాదాశీర్వచనం చేశారు. -
విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకోవాలి
● వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ఖిలా వరంగల్: విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ సూచించారు. వరంగల్ ఉర్సు గుట్ట జంక్షన్‌లోని నాని గార్డెన్లో వడుప్సా వరంగల్ డివిజన్ ఆధ్వర్యంలో బొల్లం కనకయ్య అధ్యక్షతన బుధవారం పదో తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. రతన్‌టాటా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఎంఈఓలు బత్తుల ప్రసాద్, గంప అశోక్, వడుప్సా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు సీహెచ్.నాగార్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, కోశాధికారి రామ్మూర్తి, సలహాదారులు చంద్రారెడ్డి, ఆర్.రవి, సతీష్, జన్ను విలియమ్స్, సుధీర్, సుధాకర్, విద్యాసాగర్, రాజు, నసీరొద్దీన్, ఉస్మాన్, అశోక్, మాధవి, ఖలీల్, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్, ఇనాయంత్, సమీర్, గౌస్, మురళి, అవినాష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సీకేఎం ఆస్పత్రి ఏఓ సరెండర్
ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్య శారద రెండు రోజుల క్రితం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో శానిటేషన్, సెక్యూరిటీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గుర్తించిన కలెక్టర్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వెలుగుచూసిన పలు ఘటనల నేపథ్యంతో ఏఓ సాజిద్‌ను సరెండర్ చేయాలని ఆమె డీఎంఈకి సిఫారసు చేశారు. ఏఓను కలెక్టర్ ఆదేశాలు ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారాయి. లేఅవుట్ అనుమతులు మంజూరు వరంగల్: కమిటీలో చర్చించి లేఅవుట్ అనుమతులు మంజూరు చేసినట్లు కోసం కలెక్టర్ సత్య శారద తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన లేఅవుట్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన ప్రతిపాదనలను చర్చించి అనుమతి మంజూరు చేశామన్నారు. అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ రత్నకుమారి, జీడబ్ల్యూఎంసీ అదనవు కమిషనర్ జోనా, సిటీ ప్లానర్ రవీందర్, జిల్లా రోడ్లు, భవనాల అధికారి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రెడ్ క్రాస్‌లో ‘సీనియర్ సిటిజన్స్ క్లినిక్’ హన్మకొండ అర్బన్: వయోవృద్ధుల ఆరోగ్య సంక్షేమం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సుబేదారిలోని రెడ్ క్రాస్ భవన్లో సీనియర్ సిటిజన్స్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు రెడ్ క్రాస్ బాధ్యులు తెలిపారు. ఈ క్లినిక్ ద్వారా వయోవృద్ధులకు అనుభవజ్ఞులైన డాక్టర్ల ద్వారా ఉచిత కన్సల్టెన్సీలతో పాటు డయాగ్నస్టిక్ సెంటర్లో తక్కువ ధరలకే రక్త పరీక్షలు, జనరిక్ మందుల షాపులో తక్కువ ధరలకే మందులు లభించనున్నట్లు తెలిపారు. స్విమ్మింగ్ పోటీలకు ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని కేయూ క్యాంపస్: చైన్నెలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్విమ్మింగ్ పోటీలకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థిని వర్షిణిప్రియ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి తెలిపారు. ఈమేరకు ఆ విద్యార్థిని బుధవారం అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుల్లా రమేష్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కావ్యకు ప్రథమ బహుమతి హన్మకొండ కల్చరల్: భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని హనుమంతరాయ గ్రంథాలయంలో అక్కినేని కళావేదికపై జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వరంగల్ ఫ్రెండ్స్ కల్చరల్ సంస్థకు చెందిన కావ్య టింగిల్‌కార్ వీరనారి రుద్రమదేవి ఏకపాత్రాభినయ పాత్ర పోషించి ప్రథమస్థానంలో నిలిచి బహుమతి అందుకున్నారు. ‘రైతులు అధైర్యపడొద్దు’ వర్ధన్నపేట: నియోజకవర్గ వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఎవరూ అధైర్య పడొద్దని, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి అపోహలకు గురికావొద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రుణమాఫీ కాని రైతులు బ్యాంకు, పట్టా పాస్‌బుక్, ఆధార్‌కార్డు, రుణం పొందిన బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన పత్రాలను నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులకు అందజేయాలని సూచించారు. నిట్ స్పోర్ట్స్ అసిస్టెంట్‌కు డాక్టరేట్ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.రాకేష్‌కు కర్ణాటకలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందజేసింది. ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అండ్ కంటిన్యూయస్ ట్రైనింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎరోబిక్ ఎండ్యూరెన్స్ అండ్ ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ అమంగ్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై చేపట్టిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నట్లు రాకేష్ వివరించారు. లావాదేవీలను బహిర్గతం చేయాలి వరంగల్ చౌరస్తా: ప్రజల నుంచి వసూలు చేసిన రూ.75 లక్షల సొమ్ము వివరాలపై ప్రశ్నిస్తే కక్షపూరితంగా తమను సీపీఎం నుంచి వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య సస్పెండ్ చేశారని బహిష్కృత నేతలు ముక్కెర రామస్వామి, మాలోతు సాగర్ వాపోయారు. హంటర్‌రోడ్డులో ఓ కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. 30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ కష్టపడుతున్నామన్నారు. చెప్పుడు మాటలతో సరైన ఆధారాలు చూపలేక, నోటీసులు జారీ చేయకుండా ప్రకటించడం సరికాదన్నారు. సమావేశంలో ఓదెలు, ప్రత్యూష్య, జ్యోతి, దాసు, రత్నం, మాధవి, మైరున్నీసా, లావణ్య, రఘుపతి, రాఘవరెడ్డి, యాకమ్మ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. -
పొగమంచుతో అధిక ప్రమాదాలు
● రాత్రి పూట ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి ● జైపాల్‌రెడ్డి, సీనియర్ ఎంవీఐ, వరంగల్ ఆర్టీఏ ఖిలా వరంగల్: ప్రస్తుతం విపరీతమైన చలితోపాటు పొగ మంచు కురుస్తోంది. రహదారులను కమ్మేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫాడ్ లైట్లు వాడితే 25మీటర్ల వరకు స్పష్టంగా చూడొచ్చు. నాలుగు చక్రాల వాహనం ఒకే లైటుతో ప్రయాణిస్తే ఎదురుగా వచ్చే వారు ద్విచక్ర వాహనమనుకుని, పక్కనుంచే వెళ్లే అవకాశం ఉంది. రెండు హెడ్లైట్లు డిప్ చేస్తూ ప్రయాణించాలి. మూలమలుపుల వద్ద అతివేగం పనికి రాదు. వాహనాలను ఓవర్టేక్ చేయడం వల్ల ఎదురుగా వచ్చేవి కనిపించవు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి వెనుక లైట్లు వెలిగేలా చూసుకోవాలి. పొగ మంచులో కాంతి పరావర్తనం చెంది ఎదురు వాహనాలు కనిపించవు. వాహనానికి ముందు, వెనుక రేడియం స్టిక్కర్లు అతికించాలి. రహదారిని చూడగలిగే పరిస్థితులకు అనుగుణంగా వాహన వేగం ఉండాలి. ఇతర వాహనదారులు తమను గమనించేలా హజార్డ్ లైట్ వాడాలి. లోబీమ్ ఫాగ్ లైట్లు ఉండేలా చూడాలి. నేషనల్ హైవే, శివారు రహదారులపై వాహనాల మధ్య కచ్చితంగా దూరం పాటించాలి. -
వినియోగదారుల ముంగిట సీజీఆర్ఎఫ్
● చైర్మన్ ఎన్వీ.వేణుగోపాలచారిహన్మకొండ: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ (విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక)ను వినియోగదారుల ముంగిటికి తీసుకువచ్చినట్లు పరిష్కార వేదిక చైర్మన్ ఎన్వీ.వేణుగోపాల చారి తెలిపారు. హనుమకొండ గోపాల్‌పూర్‌లోని విద్యుత్ సబ్ స్టేషన్లో లోకల్ కోర్టు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమకొండ నక్కలగుట్టలోని సీజీఆర్ఎఫ్ కార్యాలయంలో నేరుగా, తపాలా ద్వారా, టీఎస్ఎన్పీడీసీఎల్ వెబ్సైట్లో, ఈ మెయిల్ ద్వారా, 9440811299, 8333923840, 9491307004 నంబర్లలో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు కె.రమేష్, ఆర్.చరణ్‌దాస్, ఎస్ఏఓ అనిల్‌కుమార్, హనుమకొండ డీఈ జి.సాంబరెడ్డి, ఏడీ రాజు, ఏఈలు తారాచంద్, లక్ష్మణ్, నవీన్, రైతులు సంజీవ రావు, గోపాల్ రెడ్డి, జంగారెడ్డి, మోహన్ రావు, ఐలయ్య పాల్గొన్నారు. -
ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం అవసరం
● అదనవు కలెక్టర్ సంధ్యారాణి వరంగల్: జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం అవసరమని వరంగల్ అదనవు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్లోలో బుధవారం జిల్లాస్థాయి డీసీసీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పంట రుణాలకు రూ.1,802.08 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు రూ.1,231 కోట్లు అందించారని వివరించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, డీసీసీ కన్వీనర్ ఎల్డీఎం యూబీఐ హవేలి రాజు, యూనియన్ బ్యాంకు డీఆర్‌హెచ్ మహేశ్, ఆర్బీఐ ఏజీఎం పల్లవి, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వ్యవసాయ అధికారి అనురాధ, పశుసంవర్థక శాఖ అధికారి బాలకృష్ణ, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేశ్ పాల్గొన్నారు. -
నీతి ఆయోగ్ సమావేశంలో రవీందర్‌రెడ్డి
వరంగల్: ‘వ్యవసాయంలో ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీం’(పీడీపీఎస్) అనే అంశంపై బుధవారం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రం నుంచి తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, వరంగల్ చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పీడీపీఎస్ స్కీంపై మొదటిసారి జరిగిన ఈకమిటీ మీటింగ్ నీతి ఆయోగ్ చైర్మన్ ప్రొఫెసర్ రమేశ్ చంద్ అధ్యక్షతన జరగగా.. నీతి ఆయోగ్ మెంబర్స్, వి విధ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కెమిస్ట్రీ బీఓఎస్‌గా సవితాజ్యోత్స్న కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్‌గా (బీఓఎస్)గా ఆ విభాగం ప్రొఫెసర్ సవితాజ్యోత్స్నను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య పి. మ ల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశా రు. ఇప్పటి వరకు ఆ బీఓఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ విభాగం ప్రొఫెసర్ ఎస్. జ్యోతి నుంచి బుధవారం సవితాజ్యోత్స్న బాధ్యతలు స్వీకరించారు. జాతీయ సదస్సుకు సతీశ్ వరంగల్ చౌరస్తా : బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న తెలుగు, కన్నడ జానపద – గిరిజన సాహిత్యం తులనాత్మకత జాతీయ సదస్సుకు శ్రీవిశ్వేశ్వర సంస్కతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సోనబోయిన సతీశ్ ఎంపికయ్యారు. ‘తెలంగాణ బోనం–సంస్కృతి పరిశీలన’ అనే అంశంపై బెంగుళూరు విశ్వవిద్యాలయంలో పత్రాలు సమర్పించానని సతీశ్ తెలిపారు. ప్రిన్సిపల్‌కు కళా శాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. -
కేయూలో హాస్టల్ విద్యార్థి న్యూసెన్స్?
హాస్టల్ నుంచి రెండువారాల సస్పెన్షన్ కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ నిర్ణయంకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతూ న్యూపీజీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థి మంగళవారం రాత్రి న్యూసెన్స్ చేశారని సమాచారం. మద్యం తాగి హాస్టల్‌కు వచ్చి న్యూసెన్స్ చేస్తుండటంతో ఇతర విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ గోలను భరించలేక పలువురు విద్యార్థులు ఆ విద్యార్థిని కొట్టారని తెలిసింది. సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేషన్ పోలీసులు.. న్యూసెన్స్ చేస్తున్న విద్యార్థిని అదుపులోకి తీసుకొని రాత్రి పోలీస్టేషన్లో ఉంచి బుధవారం ఉదయం వదివేసినట్లు సమాచారం. ఈమేరకు హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ.రాజ్‌కుమార్ చేరుకుని ఆరా తీశారు. ఆ విద్యార్థిని రెండువారాల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. మైదానంలో రెండువర్గాల మధ్య వివాదం? కాకతీయ యూనివర్సిటీలో మైదానంలో రెండు విభాగాలకు సంబంధించిన విద్యార్థుల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. రాత్రి 9గంటల సమయంలో కొంతమంది విద్యార్థులు క్యాంటీన్ ప్రాంతంలో గుమికూడి ఉండటంతో పోలీసులు యూనివర్సిటీలో పెట్రోలింగ్ చేసినట్లు తెలిసింది. -
చలిగాలి రాకుండా తడకలు ఏర్పాటు చేసుకోవాలి
● పశువులు, గొర్రెలు, మేకలకు తగిన టీకాలు వేయించుకోవాలి హన్మకొండ: చలికాలంలో పశువులు, గొర్రెలు, మేకల్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన టీకాలు వేయించుకోవాలి. రాత్రి పూట వెచ్చగా ఉండడానికి కరెంట్ బల్బులు ఏర్పాటు చేయాలి. ఇంకా చలి ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే కొన్ని జంతువులకు హీటర్లు వాడాలి. రాత్రివేళల్లో ఉండే గదుల్లోకి చల్లని గాలి ప్రవేశించకుండా గ్రీన్ నెట్లు, కొబ్బరి పీచుతో తయారు చేసిన తట్లతో కప్పు వేయాలి. తడకల ద్వారాలను మూసివేయాలి. రేకులపై కొబ్బరితో తయారుచేసిన పీచు లేదా గడ్డి పరచాలి. పడుకునే ప్రదేశంలో ఎండుగడ్డి పరిచి వెచ్చగా ఉండేలా చేయాలి. అన్ని జంతువులకు తాగడానికి గోరు వెచ్చని నీరు.. అందులో ఎలక్ట్రాల్ ఫౌడర్, దాణాలో ఖనిజ లవణ మిశ్రమాలను(అమైనో ఆసిడ్స్) ప్రతిరోజు కలపాలి. శాకాహార జంతువులకు ఉప్పు గడ్డలు కట్టాలి. వాటిని నాకడం ద్వారా లవణాలు శరీరంలోకి వెళ్లి సమతుల్యత లభిస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఈగలు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించాలి. – డాక్టర్ సి.హెచ్.ప్రవీణ్‌కుమార్, వడ్డేపల్లి పశువైద్యాధికారి -
విద్యార్థులు పరిశోధనల్లో రాణించాలి: డీఈఓ
విద్యారణ్యపురి: విద్యార్థులు జీవశాస్త్ర పరిశోధనల్లో రాణించాలని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. జీవశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, వివిధ గురుకులాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం హనుమకొండలోని రీజినల్ సైన్స్ కేంద్రంలో జిల్లా స్థాయి జీవశాస్త్ర ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఈపోటీల ముగింపు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అందించిన బహుమతులు, సర్టిఫికెట్, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, ఫోరం అధ్యక్షుడు డాక్టర్ కె.వాసు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రతినిధి శివనాగేశ్వర్రావు, ఫోరం బాధ్యులు బి.సునీత, డాక్టర్ ఎం.సారంగపాణి, సోమలింగం, కృష్ణమూర్తి, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, లింగమూర్తి, సంధ్య, శ్రీరామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు వీరే.. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో కె.అక్షయ్రామ్ (జెడ్పీహెచ్ఎస్ పంథిని), ఎస్ భరత్ (మోడల్ స్కూల్, కమలాపురం), ఎన్.సిరిచందన (లష్కర్ బజార్ బా లికల ఉన్నత పాఠశాల, హనుమకొండ), ఎన్.సిరి (కేజీబీవీ ఐనవోలు) ఉన్నారు. -
విద్యార్థులకు జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష
కాళోజీ సెంటర్: వరంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి జీవశాస్త్ర ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్ష నిర్వహించడం వల్ల బోర్డు పరీక్షల్లో అధిక మార్కులు పొందుతారని తెలిపారు. తెలంగాణ జీవశాస్త్ర ఫోరం జిల్లా, రాష్ట్రస్థాయిలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాస్థాయి విజేతలకు ఈనెల 28న రాష్ట్రస్థాయి పరీక్షలు ఉంటాయని వివరించారు. అనంతరం విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రంమలో శంభునిపేట పాఠశాల హెచ్ఎం వీర ఉపేందర్, ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు చల్లా కృష్ణ, ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్, కోశాధికారి రమేశ్, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి, ఇందిర పాల్గొన్నారు. -
అధిక పన్ను వస్తే అప్పీల్ చేసుకోవాలి
● ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ముకాంబికీవాన్వరంగల్ చౌరస్తా : అధిక ఆదాయ పన్ను వస్తే ఆప్పీల్ చేసుకుంటే వివాద్ సీ విశ్వాస్ 2–0 ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ మూకాంబికీయన్ తెలిపారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని గాయత్రీ హోటల్లో ఆదాయ పన్నుపై అవగాహన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్నుల విషయంలో వివాదాలు లేకుండా అప్పీల్‌తోపాటు అసెస్మెంట్ విధానం ప్రవేశపెట్టిందన్నారు. డిప్యూటీ కమిషనర్ రవి కిరణ్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో 1.48లక్షల మంది అధిక పన్నులపై దరఖాస్తు చేసుకుంటే 54 శాతం కేసులు పరిష్కారించడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు మహేందర్, అవినాశ్, ట్యాక్స్ బార్ అధ్యక్షుడు త్రిపురనేని గోపిచంద్, ఐసీఏఐ వరంగల్ చైర్మన్ భాగవాన్, చాంబర్ కామర్స్ కార్యదర్శి వేద ప్రకాశ్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు సంపత్ కుమార్, టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా నమ:శివాయ, తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్ సౌకర్యం కల్పించాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం క్యాంపస్‌లోని పరిపాలనభవనం వద్ద ధర్నా నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న రిజిస్ట్రార్ పి. మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పి. రాజ్‌కుమార్.. ఆందోళన చేస్తున్న విద్యార్థినుల వద్దకు వచ్చి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ హాల్లో వీసీ ప్రతాప్‌రెడ్డి.. విద్యార్థి నాయకులు, ఆయా విద్యార్థినులతో సమావేశం నిర్వహించారు. దీంతో విద్యార్థినులు తమకు హాస్టల్ వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీసీకి తెలిపారు. ఈసందర్బంగా వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ మరోఆరునెలల్లో విద్యార్థినులకు హాస్టల్వసతి కోసం కృషిచేస్తామన్నారు. బీఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జ్ కళ్లెపెల్లి ప్రశాంత్, అధ్యక్షుడు శివకుమార్, నాయకులు రాజేశ్, ధర్మేందర్, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు. కేయూలో మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల ధర్నా -
బిహార్ తాపీకూలీ దారుణ హత్య
ఖిలా వరంగల్: బిహార్ తాపీ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్యను చూస్తున్నాడనే కారణం తో భర్త.. ఓ యువకుడిపై దాడికి పాల్పడి మరో యువకుడిని ఐరన్‌రాడ్‌తో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈఘటన మంగళవారం అర్ధరాత్రి వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి సోదరుడి కథనం ప్రకారం.. బిహార్‌లోని ఖగారీయా జిల్లా పస్రహ తా నా మండలం జంజారా గ్రామానికి చెందిన ముని దూల్చంద్రకుమార్ రెండేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు వచ్చారు. ఇక్కడ అద్దెకుంటూ తాపీమేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం చంద్రకుమార్ తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్(16), మరో యువకుడు పవన్ కూడా వరంగల్ రాగా ముగ్గురు కలిసి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. పనిచేసే చోట వీరికి ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో అద్దెకుంటున్న బానోత్ నగేశ్ పరిచయమయ్యాడు. ఇటీవల నగేశ్ అత్తామామలు చంద్రకుమార్ ఉండే ఇంట్లో ఓ రూమ్‌లో అద్దెకు దిగారు. నగేశ్ భార్య తన పిల్లలను తీసుకుని తరచూ పుట్టింటికి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల నగేశ్ తన భార్యను చూస్తున్నారని అను మానంతో చంద్రకుమార్, దిల్‌ఖుషికుమార్ వద్దకు వచ్చి ‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ అంటూ బెది రించి వెళ్లిపోయాడు. మంగళవారం రాత్రి దిల్ఖుషి కుమార్ రూమ్‌కు వెళ్లగా చంద్రకుమార్ తన స్నేహితులు గుల్షాన్, బాదిల్తో కలిసి చిన్న బ్రిడ్జి ఏరియాలోని మేఘనా బార్‌కు వెళ్లారు. ఈ క్రమంలో నగేశ్, అతడి బావమరుదులు అశోక్, బన్నీ ద్విచక్రవాహనంపై అక్కడి చేరుకుని చంద్రకుమార్‌ను చితకబాది చంపేందుకు యత్నిస్తుండగా తప్పించుకున్నాడు. రాత్రి 12గంటలకు వరకు బయటే ఉండి అనంతరం భయపడుకుంటూ రూమ్‌కు వెళ్లగా తమ్ముడు ముని దిల్‌ఖుషికుమార్ రక్తమడుగులో చనిపోయి ఉన్నాడు. దీంతో నగేశ్ తన భార్యపై అనుమానంతో తనను చంపడానికి యత్నించగా తప్పించుకున్నానని, తమ్ముడు ముని దిల్ఖుషికుమార్ను కిరాయికి ఉన్న ఇంట్లోనే హత్య చేశాడని చంద్రకుమార్ మిల్స్‌కాలనీ పీఎస్‌కు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఏసీపీ నంది రామ్‌నాయక్.. ఇన్స్పెక్టర్ వెంకట రత్నం, సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా స్థలిని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీ లించి హత్యకు గల కారణాలను స్థానికుల నుంచి సేకరించారు. మృతుడి సోదరుడు చంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. నేరస్తుల కోసం గాలింపు: ఏసీపీ భార్యపై అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్నామని ఏసీపీ నందిరామ్‌నాయక్ స్ప ష్టం చేశారు. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నారని చెబుతుండడం గమనార్హం.తన భార్యను చూస్తున్నాడని చంపిన భర్త కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో ఘటన ఘటనా స్థలిని సందర్శించిన వరంగల్ ఏసీపీ నందిరామ్‌నాయక్ పోలీసుల అదుపులో నిందితులు? -
జస్టిస్ షమీమ్ అక్తర్‌కు ఘన స్వాగతం
హన్మకొండ : ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు బుధవారం హనుమకొండకు చేరుకున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌కు అధికారులు ఘనస్వాగతం పలికారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్వాగతం పలికారు. నేడు హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఎస్సీ వర్గీకరణపై వివిధ వర్గాల నుంచి వినతులు, అభిప్రాయాలు స్వీకరించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై నేడు హనుమకొండ కలెక్టరేట్లో అభిప్రాయ సేకరణ -
‘భద్రకాళి’ అంచున ఆదిమానవులు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు చుట్టూ అనేక రహస్యాలు, విశేషాలు వెలుగుచూస్తున్నాయి. వేలాది ఏళ్లుగా ఆది మానవులు, అనేక రాజవంశాలు, ఆధ్యాత్మిక పరులు మొదలుకొని నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని ఎదుర్కుంటున్న ఆధునిక మానవులను ఈ చెరువు ఆకర్షిస్తున్నది. ఇదే తరుణంలో 50 ఏళ్ల తర్వాత భద్రకాళి చెరువులో పూడిక తీత పనులు చేపట్టేందుకు నీటిపారుదలశాఖ నీటిని ఖాళీ చేసింది. దీంతో పరిశోధకుల దృష్టి చెరువులోని గుట్టలపై పడింది. బుధవారం ఈ చెరువుపై పరిశోధన జరిపిన డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి భద్రకాళి చెరువు, చెరువు చుట్టూ ఉన్న గుట్టల సౌందర్యం వర్ణణాతీతమని చెప్పొకొచ్చాడు. భద్రకాళి చెరువు అంచున ఆదిమానవులు జీవించిన గుహలు, చెరువు మధ్యలో ద్వీపంలా ఉండే గుట్టపై రాతి పనిముట్ల పరిశ్రమ, బృహత్ శిలాయుగం నాటి సమాధులు, కాకతీయుల నాటి సైనికులు కోట వెనుక నుంచి రహస్య మార్గం గుండా వచ్చి చెరువులోకి దిగడానికి వీలుగా ఉన్న మెట్ల మార్గాలను ప్రతాప్, హేమంతులతో కలిసి చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు రత్నాకర్ రెడ్డి వెల్లడించారు. జీవనం సాగించినట్లు ఆధారాలు లభ్యం చారిత్రక ఆధారాలకు సాక్ష్యం.. భద్రకాళి చెరువు తీరం చెరువు మధ్యలో ద్వీపంలా గుట్ట.. రాతి పనిముట్ల పరిశ్రమ ఆనవాళ్లు పూడికతీత పనుల కోసం చెరువు ఖాళీ.. బయటపడుతున్న రహస్యాలు పురావస్తుశాఖ సమగ్ర సర్వే చేస్తే మరిన్ని విశేషాలు : డిస్కవరీమ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి -
మిరపకు పైపాటు పోషకాలు అందించాలి
హన్మకొండ: చలికి మిరప భూమిలోని పోషకాలు తీసుకోదు. పూత, ఆకులు రాలిపోతాయి. ఈ క్రమంలో పైపాటున పోషకాలు అందించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు. సూక్ష్మ పోషకాలను పంటపై పిచికారీ చేయాలి. మిరప పూత దశలో తామర పురుగులు ఆశిస్తాయి. పూత రాలి దిగుబడి తగ్గుతుంది. పురుగు తీవ్రత, సామూహిక నివారణకు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 40–50 వరకు పంటకు ఎత్తులో ఏర్పాటు చేయాలి. రసాయన పురుగు మందులు పిచికారీ చేయొద్దు. వీటికి బదులు ఎన్ఎస్కేఈ, వేపనూనె, కానుగ నూనె, వావిలి రసం ఇందులో ఏదో ఒకటి లేదా బివేరియా బాిస్సినా, సీడోమోనాస్ ఫ్లోరెన్సెస్, బాసిల్లస్ ఆల్బస్లో ఏదో ఒకటి నిర్ణీత మోతాదులో లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చివరి అస్త్రంగా ఎసిఫేట్ 1.5 లేదా ఇథియాన్ 2.0 లేదా స్పినోసాడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. – చేరాల రాకేశ్, ఉద్యాన అధికారి(టెక్నికల్), వరంగల్