కాలనీ రోడ్లు కకావికలం | - | Sakshi
Sakshi News home page

కాలనీ రోడ్లు కకావికలం

Jun 5 2025 2:11 AM | Updated on Jun 5 2025 2:13 AM

గుంతలమయంగా

రహదారులు

చిన్నవర్షానికే గుంతల్లో నిలుస్తున్న నీళ్లు.. దీనికితోడు మురుగునీరు

ప్రమాదాలబారిన వాహనదారులు

నయీంనగర్‌/కాజీపేట రూరల్‌ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది గ్రేటర్‌ వరంగల్‌ స్మార్ట్‌ సిటీ రోడ్ల పరిస్థితి. పలు కాలనీల్లోని ప్రధాన లింక్‌ రోడ్లు పల్లెటూరు కంటే అధ్వానంగా గుంతలు తేలి ప్రమాదకరంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గుంతల్లో నీరు నిలిచిపోతోంది. వాహనదారులు గుంతలు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ 8వ డివిజన్‌ అశోక జంక్షన్‌ కాంగ్రెస్‌ భవన్‌ నుంచి మార్కెట్‌ వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. బొందలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

రైల్వే ఈఎల్‌ఎస్‌ కాలనీ రోడ్లు అధ్వానం..

కాజీపేట బాపూజీనగర్‌ నుంచి రైల్వే ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ (ఈఎల్‌ఎస్‌) కాలనీకి వెళ్లే రోడ్లు కంకర తేలాయి. బాపూజీనగర్‌ మెయిన్‌ రోడ్డు నుంచి కడిపికొండ బ్రిడ్జి కింది నుంచి ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌కు, కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లే రెండు వైపులా రోడ్లు అక్కడక్కడ దెబ్బతిని గుంతలు పడ్డాయి. ఈ రోడ్డు మార్గాల్లో వర్షాలు పడినప్పుడల్లా గుంతల్లో వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి,పగలు విధులకు వెళ్లే రైల్వే కార్మికులు, కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రజలు గుంతల మీదుగా వెళ్లడంతో వాహనాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. అదేవిధంగా కడిపికొండ బ్రిడ్జి కింద నుంచి కాజీపేట రైల్వే స్టేషన్‌ వరకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం కూడా ఇదే పరిస్థితి. గుంతలు పడడంతో ఈ మార్గం గుండా వెళ్లి రావాలంటే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కడిపికొండ బ్రిడ్జి కింద బయటి వారు చెత్త చెదారం వేయడంతో ఈ రోడ్డు మార్గం అంత దుర్గంధం వెదజల్లుతోంది. రైల్వే అధికారులు ఈ రోడ్డు మార్గం గుండా తనిఖీల నిమిత్తం రైల్వే కార్యాలయాలకు, రైల్వే కాలనీలకు వెళ్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాలనీ రోడ్లు కకావికలం1
1/4

కాలనీ రోడ్లు కకావికలం

కాలనీ రోడ్లు కకావికలం2
2/4

కాలనీ రోడ్లు కకావికలం

కాలనీ రోడ్లు కకావికలం3
3/4

కాలనీ రోడ్లు కకావికలం

కాలనీ రోడ్లు కకావికలం4
4/4

కాలనీ రోడ్లు కకావికలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement