
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను హైదరాబాద్‌లోని రైలు నిలయంలో బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య కలిశారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కాజీపేట బస్టాండ్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, అమృత్‌భారత్ పథకం కింద వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రైల్వే క్రూలింక్‌ల తరలింపు విషయంలో వివరణ, రైల్వే యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించాలని జీఎంను కోరారు. మూడు రోజుల్లో నాయకులతో సమావేశం కానున్నట్లు జీఎం చెప్పారని ఎంపీ తెలిపారు. కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోనకు బదిలీ చేయడం, కాజీపేటలో కొత్త పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై జీఎంను వివరణ కోరినట్లు తెలిపారు. కాజీపేటలో 709 మంది ఉద్యోగులకు 526మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, రన్నింగ్‌స్టాఫ్‌లో 184 కొత్త పోస్టింగ్‌లు మంజూరైన పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలూ లేవని, దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతుందని జీఎంకు వివరించారు. 2022 జూలై 14న రైల్వే అధికారులతో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో రైల్వే అథారిటీ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి కృష్ణా, ఎల్‌టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల ను కాజీపేట నుంచి విజయవాడ డిపోనకు తరలిస్తున్నారన్నారు. కాజీపేట డివిజన్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని జీఎంను కోరినట్లు తెలిపా రు. ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. ఎంపీలు రఘురాంరెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
కోర్టు ప్రాంగణంలో
సూట్‌కేస్ కలకలం
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని సబ్ కోర్టు ఎదుట బుధవారం అ నుమానాస్పదంగా ఉ న్న ఓ సూట్‌కేస్ కలకలం రేపింది. ఎవరిదో తెలియకపోవడంతో అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో బాంబు అండ్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది సూట్‌కేస్‌ను పరిశీలించారు. దానిని తెరిచి చూడగా ఏమి లేకపోవడంతో కోర్టు యంత్రాంగం, న్యాయవాదులు, కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ లైంగిక దాడి కేసులో బాధితురాలు విచారణ నిమిత్తం బుధవారం కోర్టుకు హాజ రైంది. సదరు బాధితురాలు వికలాంగురాలు కావడంతో వెంట తెచ్చుకున్న సూట్‌కేస్‌ను సబ్ కోర్టు ఎదుట కింద ఉంచి పై అంతస్తులో ఉన్న హనుమకొండ మొదటి జిల్లా అదనపు కోర్టులో విచారణకు హాజరైంది. ఈ క్రమంలో గంటల తరబడి సూట్‌కేస్ వద్ద ఎవరూ లేకపోవడంతో అనుమానించిన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఈనెల 4న కోర్టు ప్రాంగణంలో బాంబ్‌లు అమర్చినట్లు ఉభయ జిల్లాల అధికారికి, ఈ మెయిల్‌కు తమిళనాడు లిబరేషన్ ఆర్మీ పేరున మెయిల్ అందిన విషయం తెలిసిందే.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి

దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి