భూ భారతితో రైతులకు మేలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
మడికొండ: భూ భారతి చట్టం ద్వారా, రైతులకు, ప్రజలకు మేలు చేకూరుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శనివారం మడికొండలోని ఆర్‌ఎన్‌ఆర్ గార్డెన్‌లో భూ భారతి చట్టంపై వర్ధన్నపేట నియోజకవర్గ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన చేసి దానిలోని లొసుగులను తొలగించి భాభారతి చట్టం తీసుకువచ్చారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున, 26మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావు, కిసాన్‌సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంరెడ్డి, బిల్లా ఉదయ్‌రెడ్డి, సారంపల్లి శ్రీనివాసరెడ్డి, నీలం రజీని వేణుయాదవ్, గుర్రం జ్యోతి అమర్‌నాథ్, బిల్ల రవీందర్, పైడిపాల రఘుందర్, శంకర్, కుర్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.


