పుష్కరాల పనుల్లో వేగం పెరగడం లేదు
కాళేశ్వరం: ఆశించిన స్థాయిలో పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెరగడం లేదని, పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. బుధవారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరంలో పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద పుష్కర ఘాట్ విస్తరణ పనులు చూశారు. గోదావరి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్న కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.


