
చార్జ్‌షీట్ నుంచి పేర్లు తొలగించాలి
● కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు
ఎర్రబెల్లి స్వర్ణ
ఖిలా వరంగల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లను ఈడీ చార్జ్‌షీట్‌లో నమోదు చేయడం సరికాదని ఆమె అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు గురువారం వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ జంక్షన్‌లో కాంగ్రెస్ నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. చార్జ్‌షీట్ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పేర్లు వెంటనే తొలిగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం స్వర్ణ మాట్లాడుతూ పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొందిన రాహుల్‌గాంధీపై బీజేపీ నాయకులు అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, బస్వరాజు శిరీషశ్రీమాన్, నాయకులు దామెర సర్వేశం, బిల్లా శ్రీకాంత్, దూపం సంపత్, జన్ను రవి, జన్ను అరుణ్, పరమేశ్, ఎండీ సలీం, రాజనాల శ్రీహరి, గోరంటల రాజు, చాగంటి శ్రీనివాస్, బాలరాజు, యాదగిరి, బాబు, చంద్రమౌళి, ఇమ్రాన్, కొమురయ్య, చిరంజీవి, సతీశ్, ఉమేందర్, ప్రభాకర్,కార్యకర్తలు పాల్గొన్నారు.