Mulugu
-
అగ్ని ప్రమాదాలకు చెక్
టోల్ ఫ్రీ నంబర్ 101కి ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తాం..విస్తృత అవగాహన రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చాలా గ్రామాలు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో అగ్ని ప్రమాదాలు చోటు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో నేటి (సోమవారం) నుంచి 20వ తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఇందులో ముఖ్యంగా గృహాల్లోని ఆల్మారాలు, సెల్ఫ్‌లను సక్రమంగా ఉంచుకోవడం, చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, బాణసంచా అందుబాటులో లేకుండా చేయడం, కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను అందుబాటులో ఉంచకుండా చూడడం, వంట గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవడం, గ్యాస్ లీకేజీ కాకుండా తీసుకునే జాగ్రత్తలు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లో ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన చోట ఏర్పాట్లు చేయడం, సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించడం, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే రెండో దారి ద్వారా బయటికి రావడం వంటి అంశాలపై ప్రజలకు స్వయం ప్రదర్శన చేయనున్నారు.● ప్రజలకు అగ్ని మాపకశాఖ తరఫున అవగాహన ● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ● జిల్లాలో ములుగు, ఏటూరునాగారంలో స్టేషన్లు ● ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరత ములుగు: వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాలతో ఆందోళన చెందకండి.. కాస్త కుదుటపడి 101 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయండి.. సకాలంలో వివరాలు అందిస్తే కొద్ది సమయంలోనే అందుబాటులోకి వస్తాం.. జరిగే నష్టాన్ని మా వంతుగా కొంతమేర ఆపగలుగుతాం అంటున్నారు.. అగ్ని మాపకశాఖ అధికారులు, సిబ్బంది. ‘అగ్ని సురక్షిత భారతదేశాన్ని ప్రజ్వలించడానికి ఏకం కండి’ అనే థీమ్‌తో ఈ ఏడాది వారోత్సవాల నిర్వహణకు అగ్రిమాపక శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం కేంద్రాల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగిన కసరత్తు చేసి సిద్ధంగా ఉన్నట్లుగా ములుగు ఫైర్‌స్టేషన్ అధికారి కె.కుమారస్వామి తెలిపారు. ఫైర్ అధికారులు, కార్యాలయాల ఫోన్ నంబర్లు -
ప్రజలకు అవగాహన కల్పిస్తాం
సోమవారం నుంచి 20వ తేదీ వరకు చేపట్టనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రోజూవారీ షెడ్యూల్లో భాగంగా పట్టణాలతో పాటు గ్రామాల్లో వంట గదులు, స్కూల్స్, కాంప్లెక్స్, హాస్పిటల్స్, గోదాములు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో తీసుకునే జాగ్రత్తలను సూచిస్తాం. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందిస్తే సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి వస్తాం. – స్టేషన్ ఫైర్ ఆఫీసర్, కుమారస్వామి ● -
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్‌ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్‌పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి. – డాక్టర్.బి.కేశవులు, ఎండీ సైకియాట్రిస్ట్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం, వాటిని నిర్వహించడం చట్టరీత్యా నేరం. చర్యలు ఉంటాయి. యువత ఇటీవల ఆన్లైన్ గేమ్స్‌పై ఆసక్తి చూపుతోంది. ఇది సరైనది కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు.. ఏ ఆటలాడుతున్నారో గమనించాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. – కొత్త దేవేందర్ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ● -
ఇంటిపై పడిన తాటిచెట్టు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో నివాసం ఉంటున్న కై ంసర్తి ప్రేమలత ఇంటిపై ఆదివారం కురిసిన భారీ వర్షానికి తాటిచెట్టు విరిగి ఇంటిపైకప్పు పై పడింది. దీంతో ఇల్లు దెబ్బతింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మట్టల ఆదివారం వేడుకలు వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని సెటినరీ మెథడిస్టు చర్చిలో ఆదివారం క్రైస్తవులు ఘనంగా మట్టల ఆదివారం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం చర్చి ఫాస్టర బాలరాజు మాట్లాడుతూ ఈస్టర్ పండుగను గుర్తుంచుకుని ఆయన అనుభవించిన శ్రమ దినాలకు గుర్తుగా 40రోజుల పాటు ఉపవాసం ఉంటారని తెలిపారు. ఈ ఉపవాస దీక్షలు చివరి వారంలోకి చేరుకున్నాయని తెలిపారు. సరస్వతీ పుష్కరాల పనుల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15నుంచి 26వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల పనులను రాష్ట్ర దేవాదాయశాఖ ధార్మక సలహాదారు గోవిందహరి పరిశీలించారు. ఆదివారం ఆయన ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఆయనను ఈఓ మహేష్ శాలువాతో సన్మానించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వీఐపీ ఘాటు వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాటు, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.శాంతి చర్చలు జరపాలి భూపాలపల్లి రూరల్: మావోయిస్టులతో శాంతిచర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనిగరం తిరుపతయ్య విజ్ఞపి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలని సూచించారు. -
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
● బీజేపీ జిల్లా అధ్యక్షులు బలరాం ఏటూరునాగారం: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల కేంద్రంలోని వైజంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏటూరునాగారంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన ఆర్టికల్స్‌ను తూచ తప్పకుండా కాపాడుతున్నా ఏకై క పార్టీ బీజేపీయే అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలామంతుల రవీంద్రచారి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ భూక్యా జవహర్, గిరిజన మోర్చా రాష్ట్ర అధికారప్రతినిధి గుగులోత్ స్వరూప, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రామరాజు, బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బుచ్చయ్య, నాయకులు జనార్ధన్, చక్రవర్తి, సతీష్, లక్ష్మణ్, హరిబాబు, ప్రణయ్ పాల్గొన్నారు. -
మాకూ కావాలి ‘స్లాట్ బుకింగ్’
కాజీపేట అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన స్లాట్ బుకింగ్ పద్ధతి తమకు కుడా కావాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు ఆయా పరిధి భూక్రయవిక్రయదారులు కోరుకుంటున్నారు. భూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అడుగుపెడితే ఏ సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తవుతుందో.. సబ్ రిజిస్ట్రార్ ఎప్పుడు పిలుస్తాడో తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియతో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవడంతోపాటు మరో 15 నిమిషాల్లో దస్తావేజులు చేతికందుతున్నాయి. దీంతో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు అన్ని కార్యాలయాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి వరంగల్ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10న ప్రారంభించిన స్లాట్ బుకింగ్ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కోరుకున్న సమయానికి.. కోరుకున్న రోజు రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో భూక్రయవిక్రయదారులతో పాటు రుణాల కోసం బ్యాంకులకు వెళ్లే వారు సమయానికి దస్తావేజులు చేతికి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ ఆర్వో, భీమదేవరపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, పరకాల, కొడకండ్ల, మహబూబాబాద్, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు స్లాట్ బుకింగ్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నాయి. తగ్గనున్న పనిభారం నాన్ స్లాట్ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న తరుణంలో సబ్ రిజిస్ట్రార్లు త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఆస్కారం లేక ఒక్కోరోజు రాత్రి 8 గంటల వరకు సైతం కార్యాలయాల్లో ఉండాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని సమయాలతో సబ్ రిజిస్ట్రార్లకు పనిభారం తగ్గడంతో పాటు భూక్రయవిక్రయదారులకు సమయం కలిసి వస్తుంది. రోజుకు 53 స్లాట్ బుకింగ్స్.. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 చొప్పున స్లాట్ బుకింగ్స్ కల్పించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్ బుకింగ్స్ ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంతో రిజిస్టేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్‌తో మెరుగైన సేవలు..భూక్రయవిక్రయదారులు తాము ఎంచుకున్న రోజు, సమయానికి దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు స్లాట్ బుకింగ్ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మెరుగైన, త్వరితగతిన సేవలు అందుతాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉండాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని సరైన సమయానికి వస్తే చాలు. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారికి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక సమయం కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తవు. – ఆనంద్, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ఆర్వో15 నిమిషాల్లో ప్రక్రియ పూర్తి ఎదురుచూస్తున్న 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తగ్గనున్న పనిభారం, సమయాభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజువారీ జరిగే రిజిస్ట్రేషన్లు ఇలా... భీమదేవరపల్లి : 20 నుంచి 30 స్టేషన్‌ఘన్‌పూర్ : 25 నుంచి 30 జనగామ : 40 నుంచి 55 కొడకండ్ల : 7 నుంచి 15 మహబూబాబాద్ : 45 నుంచి 60 ములుగు : 10 నుంచి 20 వరంగల్ ఆర్వో : 70 నుంచి 110 వరంగల్ రూరల్ : 25 నుంచి 35 వరంగల్ఫోర్ట్ : 25 నుంచి 40 వర్ధన్నపేట : 6 నుంచి 15 నర్సంపేట : 20 నుంచి 35 పరకాల : 15 నుంచి 25 భూపాలపల్లి : 20 నుంచి 30 -
అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను ప్రజలకు వివరించాలి
● మాజీ ఎంపీ సీతారాంనాయక్ ములుగు రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కీర్తి ప్రతిష్టలను ప్రజలకు వివరించాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా కన్వీనర్ కొత్త సురేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రేపు అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అంబేడ్కర్ జయంతి రోజున జిల్లా కేంద్రంలో 500బైక్‌లతో ర్యాలీ నిర్వహించాలన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిఒక్కరూ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బలరాం, జవహర్లాల్, రవీందర్‌రెడ్డి, కృష్ణాకర్, రవిరెడ్డి, నాగరాజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం కృషితోనే రామప్పకు గుర్తింపు వెంకటాపురం(ఎం):కేంద్ర ప్రభుత్వం కృషితోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని మహబుబ్‌బాద్ మాజీ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆనంతరం రామప్ప ఆలయ ఆవరణలోని చెత్తాచెదారాన్ని బీజేపీ నాయకులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించడానికి పార్లమెంటులో రామప్ప ఆలయ చరిత్రను తెలియజేసి పలుమార్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పాలంపేటలో మండలాధ్యక్షుడు పైడాకుల మల్లేష్ అధ్యక్షతన బూత్ పదాదికారులతో సమావేశం నిర్వహించగా మాజీ ఎంపీ సీతారాంనాయక్ పాల్గొన్నారు. -
భవిత.. భరోసా
దివ్యాంగులకు అండగా నిలుస్తున్న సెంటర్లు ఏటూరునాగారం: శారీరంగా, మానసికంగా మందబుద్ధితో బాధపడుతున్న దివ్యాంగులకు భవిత సెంటర్లు భరోసాగా నిలుస్తున్నాయి. ఈ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రత్యేకంగా నెలకొల్పింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగులను గుర్తించి ఈ భవిత సెంటర్ల చేర్చి విద్యతో పాటు భోజనం, మానసికంగా ఎదిగేందుకు ప్రత్యేకమైన టీచర్లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా గ్రహణం ముర్రి, గ్రహణ శూల వంటి వారికి కూడా ఉచిత ఆపరేషన్లను కార్పొరేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ప్రతీ ఏడాది మే నెలలో ఇంటింటి సర్వే చేపట్టి దివ్యాంగులను గుర్తిస్తున్నారు. దివ్యాంగులై సదరన్ సర్టిఫికెట్లు లేని పిల్లలను కూడా గుర్తించి వారికి అవగాహన కల్పించి సర్టిఫి కెట్లు వచ్చే విధంగా ఐఆర్పీలు కృషి చేస్తున్నారు. 21 రకాల అంగవైకల్యం 2016 చట్టం ప్రకారం 21రకాల అంగవైకల్యం కలిగిన విద్యార్థులను గుర్తించారు. వారిని సెంటర్లో చేర్చి ఒక్కో సెంటర్లో 16మంది విద్యార్థులకు ఇద్దరు ప్రత్యేక టీచర్లను మాత్రమే కేటాయిస్తారు. ఇందులో ఒక్కో ఐఆర్‌పీకి 8మంది విద్యార్థులను కేటాయిస్తారు. ఐఆర్పీలు వ్యక్తిగత ప్రణాళికతో విద్యను ఆటపాటలతో బోధిస్తారు. అంతేకాకుండా భోజన వసతి కూడా కల్పిస్తారు. ఇదే కాకుండా ప్రతీ శనివారం ఇంటి వద్ద మంచంలో ఉండే పిల్లల వద్దకు వెళ్లి విద్యతో పాటు వ్యక్తిగత నైపుణ్యాలను నేర్పిస్తారు. బ్రెషింగ్, ఈటింగ్, కోంబింగ్, వాకింగ్‌తో పాటు దినచర్య అలవాట్లను తల్లిదండ్రుల సమక్షంలో నేర్పిస్తారు. దీనివల్ల మంచంలో ఉన్న పిల్ల లకు దినచర్యలు అలవాటు కావడంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు దివ్యాంగులకు ఉచితంగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్పీలు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిత సెంటర్‌కు తీసుకొస్తున్నారు. ప్రత్యేక అలవెన్సులు భవిత కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సులు, భవిత సెంటర్లకు రాలేని విద్యార్థులకు గ్రామాల్లోని తల్లిదండ్రుల సహాయంతో బడికి వెళ్లే పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్సులు, దివ్యాంగులైన ఆడపిల్లలకు ఉపకార వేతనాలను ప్రభుత్వం అందిస్తోంది. అదేకాకుండా ప్రతీ ఏడాది మెడికల్ క్యాంప్‌లు, ఉపకరణాలు వీల్‌చైర్స్, చెవి, మూగ వారికి వినికిడి యంత్రాలు, ఆర్థో వారికి క్యాలిపర్స్, క్రచ్చస్ లాంటివి అలిమ్కో క్యాంప్ ద్వారా అందజేస్తారు. పిల్లలకు ఫిజియోథెరిపీ, స్పీచ్ ఽథెరపీ వైద్యులతో ప్రత్యేక థెరపీ సర్వీస్‌లను అందిస్తారు. జిల్లాలో 12 మంది ఐఆర్పీలు జిల్లాలోని 10 మండలాల్లో 3 భవిత సెంటర్లు ఉండగా 7నాన్ భవిత సెంటర్లు ఉన్నాయి. 12మంది ఐఆర్పీలు(విలీన విద్యా ఉపాధ్యాయులు)ఉన్నా రు. ఈ సెంటర్లు ఎంఈఓల పర్యవేక్షణతో నడుస్తాయి. జిల్లాలోని దివ్యాంగుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు భవిత సెంటర్లను పరిశీలించి మరింత మెరుగుపరుస్తారు.భవిత సెంటర్లలోని విద్యార్థుల వివరాలు విద్యతో పాటు భోజన వసతి ప్రతీ ఏడాది ఉపకరణాల పంపిణీ -
దేవునిగుట్టపై సౌకర్యాలు కల్పించాలని వినతి
ములుగు రూరల్: కొత్తూరు దేవునిగుట్టపై ఉన్న పురాతన ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీ చైర్మన్ వీరమనేని కిషన్‌రావు అన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శని, ఆది వారాలలో గుట్టపై నెలకొన్న లక్ష్మీనర్సింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు గుట్టపై తాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామం నుంచి గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. గుట్టపైకి వెళ్లే మార్గంలో రాతి మెట్లు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించారని వాటిపై కాంక్రిట్ వేయించాలని కోరారు. ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవీందర్రావు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి వెంకటాపురం(ఎం): భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలకు కార్మికులు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో బండి నర్సయ్య అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికులతో శనివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికుల పోరాటాల ఫలితంగానే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు అయిందని తెలిపారు. ఈనెల 16న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ద్వితీయ మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొక్కుల రాజేందర్, తోట సంపత్, దేవేందర్, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అడవికి నిప్పు పెట్టొద్దుఎస్ఎస్తాడ్వాయి: తునికాకు కొమ్మకొట్టే సమయంలో లేబర్లు అడవిలో నిప్పు పెట్టొద్దని తునికాకు కాంట్రాక్టర్లు గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు. మొట్లగూడెం యూనిట్ పరిధిలోని ముత్తాపురం, ఎనగందుల తోగు, వెంగ్లాపూర్, గొన్నెపల్లి, ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల్లో పరిసరాల్లోని అడవుల్లో నిప్పు పెట్టొద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందుకు గ్రామాల్లోని ప్రజలకు వారు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యానాల సిద్ధారెడ్డి గ్రామాల్లోని ప్రజలను కలిసి మాట్లాడుతూ కొమ్మకొట్టే సమయంలో బీడీ, చుట్ట, సిగరేట్ వెంట తీసుకెళ్లొద్దని సూచించారు. అడవులకు నిప్పు పెడితే అటవి సంపద కాలిపోతుందన్నారు. నిప్పు పెట్టకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మోదీ చిత్రపటం ఏర్పాటు చేయాలి ములుగు రూరల్: రేషన్ షాపుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శనివారం చలో గావ్ అభియాన్ చలో బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ములుగు, పంచోత్కులపల్లిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు 5కిలోల బియ్యం అందిస్తుందన్నారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా రైతులకు రూ. 6వేలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్య జవహర్లాల్, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, కృష్ణాకర్, రవీందర్‌రెడ్డి, రవిరెడ్డి, నాగరాజు, గాదం కుమార్, పాపిరెడ్డి, శ్రీహరి, ప్రశాంత్, రాజేష్, సురేష్ పాల్గొన్నారు. -
అవసరమైతే బ్లాక్ లిస్టులోకి..
హన్మకొండ: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫరా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలపై శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీతక్క మాట్లాడుతూ పనులు దక్కించుకోవడంలో చూపుతున్న శ్రద్ధ సకాలంలో పూర్తిచేయడంపై కాంట్రాక్టర్లు చూపడం లేదన్నారు. ఇప్పటికీ మొదలుపెట్టని పనులకు తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఏళ్లుగా పనులు మొదలు పెట్టని, పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి పూర్తిచేయించే బాధ్యత ఎస్ఈలదే అని, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేయాలన్నారు.టెండర్లకు సిద్ధంగా ఉన్న రోడ్లకు వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సకాలంలో పనులు పూర్తి చేయించాలని చె ప్పారు. నిధుల కొరత లేదని, పీఎంజీఎస్‌వై నిఽధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చిందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలను బలో పేతం చేయాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రా కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం లేదు.. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినవి ఇప్పటికీ పూర్తి చేయలేదని, తన పదవి కాలంలోపైనా పూర్తి చేస్తారా అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారుల ను ప్రశ్నించారు. తమ నియోజకవర్గాల్లో రోడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, రాంచంద్రునాయక్.. మంత్రి, ఈఎన్సీ కనకరత్నం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తి చేయించడంలో అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని, తాను ప్రతిపాదనలు పంపిన రోడ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక్కరే ఉన్నారని, అప్పుడు మీకు ప్రభుత్వం ఎంతగానో సహకరించిందని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఒక్కడినే ఉన్నానని, నిష్పక్షపాతంగా నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేయాలని మ ంత్రి సీతక్కకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఎంపీ బలరాంనాయక్ కలుగజేసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తే తాము చెల్లిస్తున్నామన్నారు. దీంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయడం మంచిది కాదని, రాజకీయాలు బయట చూసుకుందామన్నా రు. సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.పనుల్లో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథపై హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటున్నాయని అధికారులపై అసహనంబాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి బాల్య వివాహాల నిర్మూలనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతి వెస్లీతో కలిసి ఉమ్మడి జిల్లాలోని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలోని మారుమూల గ్రామమైన రాయినిగూడెంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఇష్టంగా తినే ఆహారంపై దృష్టి పెట్టాలన్నారు. బాల్య వివాహాలు జరుగకుండా చూడడమే అందరి లక్ష్యం కావాలన్నారు. ‘అమ్మమాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామన్నారు. -
కోలాహలంగా బీరమయ్య జాతర
వాజేడు: మండుటెండల్లో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్ట గండి వద్ద కొండలపైన గిరిజనుల ఆరాధ్య దైవమైన బీరమయ్య (భీష్మశంకరుడు) జాతర కోలాహలంగా ప్రారంభమైంది. శనివారం రాత్రి నుంచి ప్రారంభమైన ఈ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చింది. సరిహద్దు గుట్టల నడుమ ఆకులు లేని ఎతైన చెట్లు ఒక పక్క హొయలొలికిస్తున్న గోదావరి నది మరో పక్కన ఉన్నాయి. సుమారుగా 4 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు గుండా గుట్టపైకి చేరుకున్న వెంటనే భక్తులు హర హర (భీరమయ్య) అంటూ పులకించి పోయారు. కొలువుదీరిన దేవరలు మండల పరిధిలోని కడేకల్ గ్రామం నుంచి లక్ష్మీదేవర, పెద్ద గంగారం నుంచి సారలమ్మ, టేకుల గూడెం నుంచి ముత్యాలమ్మ, పోషమ్మ దేవరను పూజారులు, గిరిజనులు వారి ఆచార, సాంప్రదాయాల ప్రకారం శనివారం సాయంత్రం గుట్టకు చేర్చి ప్రతిష్టించారు. ఈ జాతరకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నేడు బీరమయ్య–రేఖలమ్మ కల్యాణం జరగనుంది. ఆదివారం ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. గద్దెలకు చేరిన సారలమ్మ, ముత్యాలమ్మ, పోషమ్మ, లక్ష్మీదేవర భారీగా తరలివచ్చిన భక్తులు -
మీసేవ.. సర్వర్ డౌన్
● బారులుదీరిన దరఖాస్తుదారులు వెంకటాపురం (కె) : రాజీవ్ యువ వికాస పథకం కోసం నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు రాగా మీసేవ కేంద్రంలో శుక్రవారం సర్వర్ డౌన్ సమస్య తలెత్తింది. దీంతో దరఖాస్తు దారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సోమవారం ఒక్కరోజే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో దరఖాస్తులు చేస్తుడడంతో కేంద్రం నిర్వాహకులు రాత్రి 9గంటల వరకు సర్వర్ పని చేస్తే ఆన్లైన్లో నమోదు చేస్తామని చెబుతున్నారు. చేసేదేమి లేక పూర్తి చేసిన అన్ని పత్రాలను ఇచ్చి వెళ్లాలని మీసేవ సిబ్బంది తెలుపుతున్నారు. దరఖాస్తుకు రెండ్రోజుల గడువు ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుకు గడువు పెంచాలని వారు కోరుతున్నారు. -
నల్లబ్యాడ్జీలతో నిరసన
మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌కు 500మీటర్ల పరిధిలోని పెద్దతాడిచర్ల డేంజర్ జోన్ నిర్వాసితులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాడిచర్ల, కాపురం జెన్కో భూ నిర్వాసితుల సాధన కమిటీ అధ్యక్షుడు కేసారపు రవి మాట్లాడుతూ.. డేంజర్ జోన్ భూముల సేకరణపై స్పష్టత లేకుండానే ఓపెన్‌కాస్ట్ ఏఎమ్మాఆర్ కంపెనీ అధికారులు 100 మీటర్ల పరిధిలో మట్టిని డంపింగ్ చేయడానికి ప్రయత్నించడంతో అడ్డుకొని వెనక్కి పంపించినట్లు తెలిపారు. దీనికి నిరసనగా తాడిచర్ల చింతలకుంట వద్ద ఉపాధి పనులు చేస్తున్న డేంజర్ జోన్‌కు సంబంధించిన ఉపాధి కూలీలతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధి హామీ కూలీలు పనిచేయడం భూ నిర్వాసితుల ఐక్యతను నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా అధికారులు, ప్రభుత్వం స్పందించి డేంజర్ జోన్ ఇళ్లను సేకరించి, నష్టపరిహారం, పునరావాస కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఓపెన్‌కాస్టు తవ్వకాలను అడ్డుకుంటాం
భూపాలపల్లి అర్బన్: గడ్డిగానిపల్లి గ్రామంలో మూడు రోజుల్లో అధికారులు కూల్చేసిన రేకులషెడ్లు, పెంకుటిళ్లకు నష్టపరిహారం చెల్లించకుంటే కేటీకే–2 ఓపెన్ కాస్ట్ గని తవ్వకాలను అడ్డుకుంటామని బాధితులు తెలిపారు. కూల్చేసిన ఇళ్ల వద్ద శుక్రవారం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం భూనిర్వాసితులకు నష్టపరిహారం సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేయటంలో తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు చల్లూరి సమ్మయ్య, సెగ్గం సిద్ధూ ఆరోపించారు. 2008లో ఓసీపీ–2 కోసం గడ్డిగానిపల్లి గ్రామంలో భూములను పూర్తిగా సింగరేణి స్వాధీనం చేసుకుని, గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తామని అధికారులు చెప్పి ఏళ్లు గడుస్తున్నాయన్నారు. ఇంతవరకు వేరే ఏరియాకు తరలించకపోవడం వల్ల ఓపెన్‌కాస్ట్ నుంచి ఏర్పడుతున్న దుమ్ము ధూళితో గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తులు కొందరు వారి పట్టా భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటే రాత్రి పూట సింగరేణి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు వచ్చి కూల్చేయడం సరైంది కాదన్నారు. ఈ మేరకు అడ్డుకున్న కొంతమంది మహిళలను అధికారులు బెదిరించడంతో పాటు సెల్ఫోన్లు బలవంతంగా తీసుకుని, మొత్తం 65 ఇళ్లను నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. -
ఇంటి పైకప్పు ధ్వంసం
వాజేడు : మండల పరిధిలోని టేకులగూడెం గ్రామంలో శుక్రవారం వీచిన గాలి దుమారానికి ఇంటి పైకప్పు లేచి ధ్వంసమైంది. ఆర్ఐ కుమార స్వామి తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని టేకులగూడెనికి చెందిన వనపర్తి సురేష్ ఇంట్లో ఒక్కసారిగా వీచిన గాలిదుమారంతో పైకప్పు లేచిపోయింది. సుమారుగా రూ.10వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్ఐ కుమారస్వామి తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్‌తో గేదెలు మృతి ములుగు రూరల్ : బండారుపల్లి గ్రామానికి చెందిన గూడెపు శంకర్‌కు చెందిన మూడు గేదెలను గురువారం రాత్రి షెడ్లో కట్టివేశాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పాడి గేదెలు మృతి చెందాయి. కాగా బాధిత కుటుంబానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని మృతిచెందిన గేదెలను పరిశీలించారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ..విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. నాయకులు కుక్కల నాగరాజు, ఆంగోత్ వంశీ, రాజన్న, రాకేష్, తదితరులు ఉన్నారు. పనుల అడ్డగింత కాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కాటారం మండలం గారెపల్లిలో చేపడుతున్న రిజర్వాయర్ బండ్ పనులను శుక్రవారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోయి ఏళ్లు గడుస్తున్నా తమకు నష్టపరిహారం అందలేదని నిర్వాసిత రైతులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. భూమి కోల్పోయి, పంట నష్టపరిహారం అందక తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించేంత వరకు పనులు సాగనివ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రాజెక్ట్ డీఈఈ ఉపేందర్, తహసీల్దార్ నాగరాజు, ఎస్సై శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. సమస్య సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రైతులతో సమావేశం ఏర్పాటు చేసేలా చూస్తామని పేర్కొన్నారు. నిర్వాసిత రైతులు రాజు, రాజయ్య తదితరులు ఉన్నారు. భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలికాటారం: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రధాన కాల్వల నిర్మాణం కోసం చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియలో వేగంపెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ భూ సేకరణ విభాగం అధికారులకు సూచించారు. కాటారం మండలం గుమ్మాళ్లపల్లి, గూడూరు గ్రామాల్లో కొనసాగుతున్న భూ సేకరణ సర్వేను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. భూ నిర్వాసిత రైతులతో మాట్లాడారు. పలువురు నిర్వాసిత రైతులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. భూ సేకరణకు అధికారులకు రైతులు సహకరిస్తే కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని.. తద్వారా సాగు నీరందుతుందని తెలిపారు. పోక్సో కేసులో ఒకరికి జైలు, జరిమానా రేగొండ: పోక్సో కేసులో ఓ నిందితుడికి న్యాయస్థానం 55 రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఎస్సై సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన కౌటం రాజేందర్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి ఫొటోలు తీసి ప్రేమించాలని వెంబడిస్తూ ఆ యువతి ఫొటోలను సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు చేశాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు శుక్రవారం వాయిదాకు రాగా, పూర్వపరాలు పరిశీలించాక నేరం రుజువు కావడంతో నిందితునికి 55 రోజుల శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్ఙి నారాయణ బాబు తీర్పు చెప్పారు. -
పూర్తిస్థాయి మందులు నిల్వ ఉండాలి
ములుగు/ములుగు రూరల్ : ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మందుల నిల్వలు ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాకారం, ములుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని మందుల నిల్వలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు, వృద్ధులకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. ఓఆర్ఎస్, జింక్ కార్నర్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మందుల నిల్వల రిపోర్టులను రోజు వారిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రాల మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ జితేందర్, నవ్య, సూపర్వైజర్ దేవమ్మ, ఆరోగ్య కార్యకర్తలు తిరుమల, నర్సమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు -
నివేదిక ఆధారంగా నష్టపరిహారం
ములుగు : అకాల వర్షంలో నష్టపోయిన ప్రతి రైతుకు అధికారుల నివేదిక ఆధారంగా పరిహారం అందుతుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ పేర్కొన్నారు. అలాగే రైతులకు అండగా ఉంటానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టంపై సర్వే చేసి వెంటనే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని చెప్పారు. ఈదురుగాలులతో కూలిపోయిన ఇళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్, పౌడాల ఓం ప్రకాశ్, కూనూరు అశోక్‌గౌడ్, ముసినపల్లి కుమార్‌గౌడ్, కక్కెర్ల అశోక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్‌రెడ్డి, నెల్లుట్ల రాజన్న, అనిల్, నూనేటి శ్యాం, మైనార్టీ సెల్ నాయకుడు ఎండీ షర్పోద్దీన్, వీరస్వామి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుంటోజు పావని నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్ -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ఏటూరునాగారం : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డివిజినల్ అధికారి సత్తయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌డ్రిల్ నిర్వహించి, అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. మంటలకు మరింత తోడునందించే పదార్థాలు ఏమైనా ఉంటే వెంటనే వాటిని దూరంగా పడేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే కర్ర సాయంతో తొలగించాలన్నారు. కరెంట్ సరఫరా ఉన్న వస్తువులపై వెంటనే నీరు పోయొద్దని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగితే 101, 87126 85772 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సత్తయ్య వివరించారు.ఈ కార్యక్రమంలో లీడ్ ఫైరింగ్ ఆస్పత్రి రవికుమార్ పాల్గొన్నారు.డివిజినల్ అధికారి సత్తయ్య -
సామాజిక వేత్త జ్యోతిబాపూలే
ములుగు : సామాజిక వేత్త మహాత్మా జ్యోతిబాపూలే అని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంపత్ రావు ముఖ్య అతిథిగా హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన మహానీయుడని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డెపల్లి సారంగపాణి, సీపీఐ జిల్లా అధ్యక్షుడు జంపాల రవీందర్, సేవాలాల్ సేన రాష్ట్ర అ ధ్యక్షుడు పోరిక రాహుల్, భద్రయ్య, సంజీవయ్య, స్వామి, బుచ్చన్న, పైడి, రవి పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవనంలో.. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సామాజిక న్యాయ వేదిక జిల్లా కార్యదర్శి బాదావత్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి పోరే రవియాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొమురయ్య, డప్పు కళాకారుడు దూడపాక రాజేందర్, రత్నం రాజేందర్, మేకల సాంబయ్య, రాజయ్య ఉన్నారు.అదనపు కలెక్టర్ సంపత్ రావు -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ములుగు రూరల్ : అమ్మకాలకు తీసుకువచ్చే ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అబ్బాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం విక్రయించి సన్న ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 బోనస్ పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం గోవింద్చౌహాన్, ఏపీఎం జవహార్, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్‌రెడ్డి, అసోసియేషన్ కోశాధికారి మోహన్, సెంటర్ నిర్వాహకులు సరిత, స్రవంతి, అక్షయ, పద్మ, రైతులు పాల్గొన్నారు. -
బీరమయ్య.. శరణమయ్యా
వాజేడు : దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టపై వెలసిన బీరమయ్య జాతర వేడుకలు నేటినుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన లొట్టిపిట్ట గండి వద్ద శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజుల పాటు బీరమయ్య (భీష్మ శంకరుడు) జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండల పరిధిలోని టేకులగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం జాతర వేడుకను ప్రారంభిస్తారు. నేడు (శనివారం) ఉదయం నుంచి సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు తమ దేవర్లను ఊరేగింపుగా జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. రాత్రి 8 గంటలకు గిరిజనులు తమ ఆచారాల ప్రకారం నృత్యాలను చేస్తారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గంగ స్నానాలు ఆచరించి బీరమయ్య దేవుడిని ప్రతిష్ఠిస్తారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కాగా సోమవారం తమ తమ దేవర్లను తీసుకుని ఎవరి ఇళ్లకు వారు పయనమవుతారు. దీంతో జాతర వేడుక ముగుస్తుంది. ముమ్మరంగా ఏర్పాట్లు బీరమయ్య జాతర శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో టేకులగూడెం గ్రామస్తులు అందుకు తగిన ఏర్పాట్లను చేపట్టారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు భక్తులు గుట్టపైకి వెళ్లే దారిలోని రాళ్లను, ముళ్లపొదలను తొలగించి ముగ్గులు పోశారు. బీరమయ్య గుడి వద్ద భక్తుల సౌకర్యార్థం చలువా పందిర్లను ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి తాగునీటి ఏర్పాట్లను చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టారు. శనివారం రాత్రి నుంచి జాతర తంతు మొదలు కానుంది. కాగా తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తుల తరలి రానున్నారు. నేటినుంచి బీరమయ్య (భీష్మ శంకర) జాతర మొక్కులు చెల్లించనున్న రెండు రాష్ట్రాల భక్తులు -
ములుగు: ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
సాక్షి, ములుగు జిల్లా: జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట 22 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగి పోయారు. లొంగి పోయిన వారిలో ముగ్గురు డిప్యూటీ దళ కమాండర్లు, ఒకరు పార్టీ దళ సభ్యులు ఉన్నారు. మిగతా 18 మంది మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు. డిప్యూటీ దళ కమాండర్‌కు నాలుగు లక్షల రివార్డు ఉంది. పోరు కన్నా ఊరు మిన్న.. ఊరికి తిరిగి రండి అంటూ పోలీసులు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.కాగా, మావోయిస్ట్ పార్టీ, శాంత పేరున కర్రెగుట రక్షణ కోసం బాంబులు పెట్టామంటూ ప్రకటన చేయడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించిన సంగతి తెలిసిందే. నక్సల్స్.. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు ఎవరికి భయపడొద్దని.. పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని ఎస్పీ తెలిపారు. నక్సల్స్ అడవులలో ఉండి సాధించేదేమీ లేదని.. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఎస్పీ పిలుపునిచ్చారు. -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల పరిధిలోని ఏటూరునాగారం, పస్రా, ఎస్ఎస్ తాడ్వాయి రేంజ్ పరిధిలో అడవిలో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అటవీశాఖ తొలగించే కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది టీంలుగా ఏర్పడి ప్లాస్టిక్, ఇతర వస్తువులను ఏరి పారేసినట్లు తెలిపారు. రోడ్ల వెంట పర్యాటకులు చెత్తాచెదారం వేసి పర్యావరణాన్ని దెబ్బతినేలా చేస్తున్నారని వివరించారు. అడవిలో ప్లాస్టిక్, మద్యం సీసాలను వేయడం వల్ల జంతువులు ప్లాస్టిక్‌ను తిని మరణించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. సీసపెంకులతో వన్యప్రాణులకు ముప్పు ఉందన్నారు. అడవిలో మద్యం, నిప్పు వంటి వస్తువులను వినియోగించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. 1500 కిలోల ప్లాస్టిక్‌ను ఒక రోజులో సేకరించామన్నారు.ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ -
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuకాజీపేట అర్బన్/ఖిలావరంగల్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ నిమిత్తం వెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న దస్తావేజులు చేతికందడానికి రెండు మూడు రోజులు పట్టేది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేయగా అందులో ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. గురువారం స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ ప్రారంభించి మ్యుటేషన్, దస్తావేజులను యజమానులకు అందజేశారు. స్లాట్ బుకింగ్ షెడ్యూల్ ఇలా..ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు 24 స్లాట్స్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 24 స్లాట్స్ మెరుగైన సేవలు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రవేశ పె ట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో వినియోగదారులకు మె రుగైన సేవలు అందిస్తున్నాం. తొలి రోజు 48 స్లాట్స్ అందుబాటులో ఉండగా.. 26 మంది భూమి రిజిస్ట్రేషన్‌కు స్లాట్స్ బుక్ చేసుకున్నారు. వారు ఎంచుకున్న సమాయానికి కార్యాలయానికి రాగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆన్లైన్లో ప్రింట్ తీసి దస్తావేజులు అందజేశాం.వృద్ధులు, దివ్యాంగులు, పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 స్లాట్స్ 15 నిమిషాల్లో దస్తావేజులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ సదుపాయంతో భూక్రయవిక్రయదారులు తాము కోరుకున్న రోజు.. కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 53 స్లాట్ బుకింగ్స్ కల్పించారు. 15 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి మరో 15 నిమిషాల్లో మ్యుటేషన్ కాపీతో పాటు దస్తావేజులు అందజేశారు. ● వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 36 ● వరంగల్ ఫోర్ట్ కార్యాలయంలో 25 దస్తావేజులకు తొలిరోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రక్రియను ప్రారంభించిన జిల్లా రిజిస్ట్రార్ప్రతీరోజు రెండు కార్యాలయాల్లో 106– జి.నరేందర్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్ట్ వరంగల్ -
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
ఏటూరునాగారం: యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ రేణుక అధ్యక్షతన డ్రగ్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి డ్రగ్స్‌పై అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్పీ శబరీశ్ ఆదేశాల మేరకు కళాశాల, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ సరఫరా చేయడం, వాటిని తీసుకోవడం ద్వారా సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని తెలిపారు. యువత చెడు మార్గంలో పయనించి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రణాళికతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సీఐ అనుముల శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్, కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, డాక్టర్ సుమలత, ఎస్సై తాజుద్దీన్లు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ సీహెచ్.వెంకటయ్య, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
నేడు డయల్ యువర్ డీఎం
ములుగు రూరల్: జిల్లా పరిధిలో నేడు(శుక్రవారం) నిర్వహిస్తున్న డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వరంగల్–2డిపో మేనేజర్ జోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ సమస్యలపై శుక్రవారం మధ్యాహ్నాం 12నుంచి ఒంటిగంట వరకు సెల్ నంబర్ 9959336048కు ఫోన్ చేసి తెలపాలని వివరించారు. ప్రయాణికులు సలహాలు, సూచనలు అందించాలని కోరారు. నేడు విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు ములుగు: మల్లంపల్లి మండలకేంద్రంలోని 35/11కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో నేడు(శుక్రవారం) విద్యుత్ వినియోగదారుల లోకల్ కోర్టు నిర్వహిస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం వరంగల్ చైర్పర్సన్ ఎన్వీ.వేణుగోపాలచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టం పెంపుదల, లోపాలు ఉన్న మీటర్లు మార్చడం, నూతన సర్వీసుల మంజూరు, అదనపు లోడ్ క్రమబద్ధీకరణ, సర్వీస్ పేరు, కేటగిరి మార్పు, సర్వీసు రద్దు అంశాలపై వినియోగదారులు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎదిర పీహెచ్సీ పరిశీలన వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఎదిర వైద్యశాలతో పాటు చొక్కాల, వెంకటాపురం సబ్ సెంటర్లను గురువారం జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, క్వాలిటీ మోనిటర్ సాయిచంద్‌లు పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలపై ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహారెడ్డి, పవన్, సిబ్బంది యాకలక్ష్మి, రామలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు. ‘మహాసభలను విజయవంతం చేయాలి’ కన్నాయిగూడెం: ఆదివాసీల హక్కుల పోరాట మహాసభలను విజయవంతం చేయాలని సంఘం డివిజన్ అధ్యక్షుడు పొడెం శోభన్ గురువా రం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 12,13,14 తేదీల్లో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే మహాసభలకు ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఉచిత కంటి పరీక్షలు కన్నాయిగూడెం: మండల పరిధిలోని ముప్పనపల్లి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి పరీక్షలు చేయించారు. ముప్పనపల్లిలోని 1,2,3,4 అంగన్ వాడీ కేంద్రాల్లోని 6ఏళ్ల లోపు పిల్లలకు కంటి పరీక్షలు చేయించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పవతి తెలిపారు. పిల్ల లకు దృష్టిలోపం, బరువు, పోషక లోపం వంటివి గుర్తించి తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో కంటి వైద్యులు తిరుపతి, ఆర్బీఎస్కే నోడల్ అధికారి నరహరి, ఫార్మసిస్ట్ భాస్కర్ పాల్గొన్నారు. -
సౌకర్యాలు నిల్..!
మంగపేట: జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. హడావిడిగా కేంద్రాలను ప్రారంభించిన అధికారులు ఆయా కేంద్రాల వద్ద వసతుల కల్పనపై దృష్టి సారించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయంలో అరగంట సేపు ఉండే అధికారుల కోసం టెంటు, కూల్ వాటర్ వంటి వసతులు కల్పించే నిర్వాహకులు ధాన్యం తేమశాతం వచ్చే వరకు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబెట్టే రైతులు, కూలీలకు నీడ, తాగునీటి వసతులు కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. వసతుల కల్పనలో నిర్లక్ష్యం రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ద్వారా ఆదాయం పొందుతున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు సదుపాయాలు కల్పించడంలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ధాన్యం ఆరబోసిన తర్వాత నీడ వసతి లేకపోవడంతో ఎక్కడ నిలబడాలో అర్ధం కావడం లేదని రైతులు వాపోతున్నారు. తాగునీరు సైతం లేకపోవడంతో మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరిట 5నుంచి 10కేజీల కోత సన్నరకం ధాన్యం పండించి రైతులకు ప్రభుత్వం చెల్లించే బోనస్ డబ్బులను కాజేసేందుకు దళారులు చూస్తున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ డబ్బులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొందరు వ్యాపారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క రైతుల నుంచి ధాన్యాన్ని క్వింటాకు రూ.100 నుంచి 150వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తరుగు పేరిట 5నుంచి 10కేజీల కోత విధిస్తున్నారు. అదే ధాన్యాన్ని బినామీల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్ డబ్బులను కాజేసే ప్రయత్నంలో ఉన్నారు. గత వర్షాకాలంలో ఇదే విధంగా దళారులు, కొందరు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల ఖాతాల్లో పడాల్సిన బోనస్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేసుకున్నట్లు సమాచారం. సన్నరకం బియ్యం ధరలు పెరగుతుండడంతో ఇప్పటికే కొందరు దళారులు రైతుల నుంచి పచ్చి ధాన్యం క్వింటా రూ2వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అన్ని మండలాల్లో కేంద్రాల ఏర్పాటు యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 145వరకు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మంగపేట, వెంకటాపురం(ఎం), వెంకటాపురం(కె), ఏటూరునాగారం, ములుగు మండలాల్లో కేంద్రాలను ప్రారంభించాం. తేమశాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోళ్లు ఇంకా షురూ కాలేదు. కేంద్రాల్లోనే రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. అన్ని కేంద్రాలకు సరిపడా ప్లాస్టిక్ బరకాలు, గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంటుంది. ఫైజల్ హుస్సేన్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు..క్వింటా ధాన్యం ధర ఇలా..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు రైతులకు తప్పని తిప్పలు పట్టించుకోని అధికారులు, నిర్వాహకులు -
ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలి
ములుగు: విద్యార్థులకు ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలని కలెక్టర్ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గల సమావేశ మందిరంలో జిల్లాలోని 54 ప్రాథమిక పాఠశాలల్లో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు దిశ ఫౌండేషన్, ఈఎల్ఎఫ్ సహకారంతో 80రోజుల పాటు నిర్వహించిన లెర్న్టురీడ్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవడం, రోల్‌ప్లే, సంభాషణ చూసి కలెక్టర్ విస్తుపోయారు. దిశ ఫౌండేషన్ కృషిని కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెమెంటోతో పాటు సర్టిఫికెట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇంగ్లిష్ బోధన కార్యక్రమాన్ని ఎనిమిది దశల వరకు నిర్వహించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, సెక్టోరల్ అధికారి అర్షం రాజు, సాంబయ్య, దిశ ప్రతి నిధులు ఐశ్వర్య, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షంపై అవగాహన కల్పించాలి పోషణ పక్షం–2025 కార్యక్రమంపై గ్రామాల వారీగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గ్రామస్థాయి సిబ్బంది తగిన కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 640అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష, డీఎంహెచ్ఓ గోపాల్‌రావు, డీపీఆర్వో రఫీక్, తహసీల్దార్ విజయభాస్కర్, సూపర్ వైజర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక
ములుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల ఉత్సవ కమిటీని దళిత సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు మడిపెల్లి శ్యాంబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా చంటి భద్రయ్య, గౌరవ అధ్యక్షుడిగా ఇరుగుపైడి మాదిగ, ఉపాధ్యక్షుడిగా ముంజాల భిక్షపతిగౌడ్, కార్యదర్శిగా రొంటాల భిక్షపతి, గౌరవ సలహాదారుడిగా గుగ్గిళ్ల సాగర్, ప్రచార కమిటీ సభ్యులుగా సుకుమార్, నక్క భిక్షపతి, చుంచు రవి, మాట్ల సంపత్, వట్టెం జనార్ధన్, బొమ్మకంటి రమేష్ వర్మ, బీట్ల కొంరయ్య, నక్క రాజు, కర్ణాకర్మాదిగ, మరాఠి రవీందర్మాదిగ, రాహుల్‌నాయక్, కాకి రవిపాల్, కార్తీక్ మాదిగ, వావిలాల స్వామి, చెన్నం స్వామి, తోకల శివ తదితరులను ఎన్నుకున్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తీర్మాణం చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యం
ములుగు రూరల్: విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యమని భూపాలపల్లి, ములుగు ఎస్ఈ మల్చూర్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ములుగు, మల్లంపల్లి, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా నూతన కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. విద్యుత్ ఉద్యోగులు లైన్ మరమ్మతులు, పోల్‌పై పనిచేసే ముందు, తర్వాత ఫొటోలను, సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఎల్సీ ఇచ్చేముందు ఏఈతో సమన్వయం చేస్తూ పనిచేసే విధంగా యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రతీ పనిని ఆన్లైన్ చేసిన తర్వాతనే చేయాలని సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈలు మల్లేశం, నాగేశ్వర్రావు, ఏడీఈ వేణుగోపాల్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్ఈ మల్చూర్‌నాయక్ -
వాతావరణం
కవి కష్టజీవి పక్షానే ఉండాలి కవి ఎప్పుడూ కష్టజీవి పక్షానే ఉండాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్యనవీన్ అన్నారు. జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తీవ్రమైన ఎండ, వేడిగాలులు ఉంటాయి. రాత్రి చలిగా ఉంటుంది.– 8లోuత్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన వరంగల్ రూరల్, వరంగల్ఫోర్ట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 61 దస్తావేజులకు రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. వారం పదిరోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది. భూక్రయవిక్రయదారులు స్లాట్ బుకింగ్‌పై ఆసక్తి కనబరిచారు. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆనందం వ్యక్తం చేశారు. -
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
సాక్షి, ములుగు జిల్లా: మావోయిస్ట్ పార్టీ, శాంత పేరున కర్రెగుట రక్షణ కోసం బాంబులు పెట్టామంటూ ప్రకటన చేయడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించారు. నక్సల్స్.. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు ఎవరికి భయపడొద్దని.. పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని ఎస్పీ తెలిపారు. నక్సల్స్ అడవులలో ఉండి సాధించేదేమీ లేదని.. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఎస్పీ పిలుపునిచ్చారు.వెంకటాపురం (నూగూరు) కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్టు మావోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట విడుదలయిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కొందరు వ్యక్తులు పోలీసుల మాటలు నమ్మి, డబ్బుకు ఆశపడి ఇన్ఫార్మర్లుగా మారి షికారు పేరుతో గుట్టవైపు వస్తున్నారంటూ మంగళవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. తమ రక్షణ కోసం అమర్చిన బాంబుల వల్ల ఇతరులు గాయపడుతున్నారని, పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇటువైపు రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. -
ఆధార్‌లోని పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ సరిపోలక ఇబ్బందులు
● జిల్లాలో ఇప్పటి వరకు 61.9శాతం నమోదు ● అపార్‌తో ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నిక్షిప్తంములుగు రూరల్: ప్రతీ విద్యార్థికి అపార్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న రెండో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియను అధికారులు చేపట్టారు. విద్యార్థుల వివరాల నమోదు సమయంలో తలెత్తుతున్న సమస్యల కారణంగా లక్ష్యం చేరుకోలేక పోతున్నారు. విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకేచోట నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన అపార్ నమోదులో పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు తదితర తప్పిదాల కారణంగా అవస్థలు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయడం సాధ్యం కాకపోవడంతో నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. ఆధార్– యూడైస్ వివరాల్లో తేడా.. అపార్ నమోదులో ప్రధానంగా పాఠశాలలో విద్యార్థికి సంబంధించిన వివరాలతో పాటు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. యూడైస్‌లో విద్యార్థుల వివరాలు ఇప్పటికే ఉన్న విద్యార్థుల పర్మనెంట్ ఎన్రోల్మెంట్ నంబర్ వివరాలకు ఆధార్ వివరాలు సరిపోలకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా మంది విద్యార్థుల వ్యక్తిగత వివరాలకు ఆధార్ వివరాల్లో తేడాలు ఉండడంతో ఆధార్ కార్డులో పేరు మార్పు, అక్షరాల తప్పులను సరి చేయాల్సి వస్తోంది. ఆధార్ వివరాలను సరిచేయడం కోసం ధ్రువీకరణ పత్రాలను జత చేయడం తప్పనిసరిగా మారింది. ఈ విషయంలో టెన్త్ మార్కుల మెమో, బోనోఫైడ్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆధార్‌కార్డులో మార్పులు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల వివరాలు, అంగీకార పత్రాలు సకాలంలో అందించకపోవడంతో అపార్ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోంది. 61.9శాతం పూర్తి జిల్లాలోని తొమ్మిది మండలాల్లో ఇప్పటి వరకు అపార్ నమోదు 61.9శాతం పూర్తి అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 42,486 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 30,523 మంది విద్యార్థులు ఉండగా ప్రైవేటు పాఠశాలల్లో 11,963 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు అపార్ నమోదు 18,709 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 7,594 విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదు అయ్యాయి. జిల్లాలో ఆధార్ కార్డుల్లో పేర్లు తప్పుగా నమోదైన విద్యార్థులు 6,125, పుట్టిన తేదీ సరిపోలక 5,513, లింగబేధంతో 1,231, విద్యార్థుల తల్లిదండ్రుల అంగీకార పత్రాలు ఇవ్వకుండా ఉన్న 4,817 మంది విద్యార్థులను విద్యాశాఖ గుర్తించింది. జిల్లాలోని విద్యార్థుల వివరాలుమండలం విద్యార్థుల అపార్ సంఖ్య నమోదుములుగు 11,636 6,743 వెంకటాపురం(ఎం) 3,465 2,130 గోవిందరావుపేట 4,362 2,867 ఎస్‌ఎస్‌తాడ్వాయి 3,233 2,011 ఏటూరునాగారం 5,554 2,969 మంగపేట 5,760 4,073 కన్నాయిగూడెం 1,427 887 వెంకటాపురం(కె) 4,495 2,686 వాజేడు 2,554 1,937ప్రతిఒక్కరూ నమోదు చేసుకోవాలి అపార్ నమోదు ప్రతీ విద్యార్థి తప్పని సరిగా చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 61.9శాతం నమోదు పూర్తి అయింది. విద్యార్థుల ఆధార్ వివరాలు సరిపోలక ఆలస్యం అవుతోంది. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ అంగీకార పత్రాలు ఇవ్వలేదు. అపార్‌తో విద్యార్థుల పూర్తి వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తంగా ఉంటాయి. ప్రభుత్వాలు అందించే స్కాలర్షిప్లు నేరుగా అందేందుకు వీలుంటుంది. – పాణిని, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
ములుగు: ఈ నెల 20నుంచి నిర్వహించనున్న ఇంటర్, టెన్త్ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇంటర్, 10వ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఇతరులు ఎవరూ ఉండ వద్దన్నారు. గుర్తింపు పొందిన వారిని మాత్రమే అనుమతించాలని సూచించారు. ఇంటర్ పరీక్షలకు జిల్లాలో మూడు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 712 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పదో తరగతి పరీక్షలకు మూడు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 521 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా వైద్య శిబిరాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీసులను డ్యూటీలో కేటాయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ పాణిని, డీఎంహెచ్ఓ గోపాల్‌రావు, జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణ అధికారి జయదేవ్, పంచాయతీరాజ్, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యా, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ మహేందర్‌జీ -
ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ బూరుగు రవి కోరారు. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యోగుల పెండింగ్‌లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించేలా ముఖ్యమంత్రితో మాట్లాడాలని కోరినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయడంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉద్యోగులతో సదస్సు, రాష్ట్రస్థాయిలో మహాధర్నాకు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అంతకుముందు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ నూతన చైర్మన్‌గా బూరుగు రవి, ప్రధాన కార్యదర్శిగా శైలజ, అడిషనల్ సెక్రెటరీ జనరల్‌గా రేగురి సుభాకర్‌రెడ్డి, దశరథ్, సందాని, భార్గవ్, ప్రవీణ్, కోకన్వీనర్లుగా శంకరయ్య, సేవానాయక్, రఘువీర్, కిరణ్, వివిధ విభాగాలకు కన్వీనర్లను నియమించారు. టీజీ జేఏసీ జిల్లా కన్వీనర్ రవి -
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ములుగు రూరల్: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. చలో గావ్ అభియాన్ చలో బస్తీ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతీ క్రియాశీల సభ్యుడు గ్రామాలను ఎంపిక చేసుకొని పర్యటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, రవీందర్‌రెడ్డి, కృష్ణాకర్, రవిరెడ్డి, వెంకన్న, మహేందర్, విజేందర్, గట్టయ్య, సిద్దు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం -
నలుగురిపై వైల్డ్‌లైఫ్ యాక్ట్ కేసులు
ఏటూరునాగారం: అడవిలో నిబంధనలకు విరుద్ధంగా నిప్పు, వంట, ఆల్కాహాల్ సేవించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినందుకు నలుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం(వైల్డ్‌లైఫ్ యాక్ట్)1972 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి డిప్యూటీ రేంజ్ అఫీసర్లు పి.ప్రహ్లాద్, పి.నరేందర్‌లు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నబోయినపల్లి సమీపంలోని అడవికి వెళ్లగా దుమ్మని శ్రీకాంత్, అడ్డూరి సుమంత్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, ఖలీల్‌పాషాలు మద్యం సేవించడంతో పాటు వంట వండి అగ్గిపెట్టలను ఉపయోగించి అలాగే వదిలేయడంతో పాటు వంట వండి మంటలు ఆర్పక పోవడంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం రేంజ్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు: గ్రామ పరిపాలనాధికారులుగా పని చేయడానికి మాజీ గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు(వీఆర్ఓ, వీఆర్ఏ) దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ దివాకర బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్వయంగా సంతకం చేసిన కాపీని కలెక్టరేట్లోని పరిపాలనాధికారికి సమర్పించాలని తెలిపారు. పని స్వభావం, నియమ నిబంధనల కోసం నిర్ధేశించిన వెబ్సైట్లో చూడాలని సూచించారు. 17న ఆదివాసీ తుడుం దెబ్బ బహిరంగ సభ వెంకటాపురం(ఎం): ఈ నెల 17న ఇల్లందులో నిర్వహించనున్న ఆదివాసీ తుడుం దెబ్బ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని నాయకపోడ్ గూడెంలో బుధవారం బహిరంగసభ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకపోడ్ జిల్లా ఇన్చార్జ్ గాలి సమ్మయ్య, నాయకులు సారయ్య, మేకల మల్లయ్య, కౌసల్య, రమ, శ్రీను, విజయ్, జనార్ధన్, సాయి, సంపత్, ఎంఎస్పీ నాయకులు నెమలి నర్సయ్య, కాడపాక శ్యాం తదితరులు పాల్గొన్నారు. 24న ఉచిత ప్రవేశ పరీక్ష ఏటూరునాగారం: ఈ నెల 24వ తేదీన పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఎస్ యూటీఎఫ్ సహకారంతో హైదరాబాద్‌లోని పాఠశాలలో చేరేందుకు ప్రవేశ పరీక్ష ఏటూరునాగారంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోదెం సమ్మిరెడ్డి, వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో 4, 5, 6, 7 చదివే విద్యార్థులు ప్రవేశం పొందనున్నట్లు తెలిపారు. 80మార్కులతో ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. తెలుగు, గణితం, ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం నుంచి ప్రశ్నలు వస్తాయని తెలిపారు. ఈ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు ట్రస్ట్ వారు ప్రవేశం పొందిన నాటి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యతో పాటు హాస్టల వసతి కల్పిస్తారని వివరించారు. ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ములుగు: జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించినట్లు ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్ తెలి పారు. ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినో త్సవం సందర్భంగా కేక్‌కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్ఎస్యూఐ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ ఐ నాయకులు భూస గణేశ్, మంద రాహుల్, సురేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ సంపాదన పేరుతో మోసం రేగొండ: సైబర్ మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.54 వేలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని రంగయ్యపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లికి చెందిన బండి హృషికీర్తన్ అనే వ్యక్తికి నంబరు +8801340–462002 నుంచి టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం వచ్చింది. ఆన్లైన్లో పనులను పూర్తి చేసి డబ్బు సంపాదించమని అందుకు ముందుగా కొంత డిపాజిట్ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. దీంతో బాధితుడు సైబర్ నేరగాళ్లకు వేర్వేరు యూపీఐ ఐడీలకు రూ.54,098 డిపాజిట్ చేశాడు. కానీ, తిరిగి డబ్బును సంపాదించలేకపోయాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
ములుగు రూరల్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం సన్నధాన్యానికి అందిస్తున్న క్వింటాకు రూ.500బోనస్‌ను పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఇంచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాదం ప్రవీణ్‌కుమార్, కూనూరు అశోక్, భరత్, వైస్ చైర్మన్ సాంబయ్య, తిరుపతి, వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా నాణ్యమైన భోజనాన్ని అంది స్తుందన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, నల్లెల్ల భరత్, వంశీ, అభినయ్ పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
ట్రేడ్స్మెన్లను నియమించాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని ఓపెన్ కాస్ట్లో ట్రెడ్స్మెన్లను నియమించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్– 2లోని గని మేనేజర్ కృష్ణప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఓసీ 3కి ఎవరిని డిప్యూటేషన్‌పై బదిలీ చేయొద్దని, హెల్పర్లను ఇవ్వాలని, కాలం చెల్లిన యంత్రాలను తొలగించాలని కోరారు. రిటైర్మెంట్ అయిన టెక్నీషియన్ల స్థానాలను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. ట్రేడ్స్మెన్లపై అధికారులు అగౌరవంగా, అవమానకరంగా వ్యవహరించొద్దని అన్నారు. కార్యక్రమంలో ట్రేడ్స్మెన్లు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, బీఎంఎస్ నాయకులు మధుకర్‌రెడ్డి, రాజేందర్, ఏబూసి ఆగయ్య, సుజేందర్, రఘుపతి, సమ్మిరెడ్డి, శ్రీనివాస్, చేరాలు, నారాయణ, కృష్ణ రవీందర్, పర్వతాలు పాల్గొన్నారు. -
ప్రైవేట్ అభ్యర్థులకు ఐటీఐ పరీక్షలకు అర్హత
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో ప్రైవేట్ అభ్యర్థిగా పరీక్షలు రాసేందుకు అర్హత కల్పిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళా శాల ప్రిన్సిపాల్ జూమ్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ట్రెడ్‌లో అభ్యర్థులు 3 సంవత్సరాలపైబడి సర్వీస్, నైపుణ్యత కలిగి ఉండాలని తెలిపారు. వారు పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణపత్రం, సంస్థ ఐడీ కార్డుతో వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకుల కార్యాలయంలో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేలవాలిన అరటితోటల పరిశీలనచిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్ శివారులో సోమవారం వీచిన గాలిదుమారానికి అరటి పంటలు పూర్తిగా నేలవాలాయి. స్పందించిన ఉద్యాన శాఖ డివిజనల్ అధికారి సునీల్ బుధవారం ఆకుల సతీష్, గంపల మధుకర్, సూర సుధాకర్, క్యాతం భద్రయ్య, క్యాతం రాజయ్యలకు చెందిన అరటి పంటలను పరిశీలించారు. రెండు రోజులుగా వీస్తున్న గాలుల ప్రభావంతో అరటి తోటల్లో నష్టం వాటిల్లిందన్నారు. నష్టతీవ్రతపై ప్రాథమికంగా అంచనా వేసి జిల్లా అధికారులకు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. -
‘రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలి’
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మంద సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్‌పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని, పంటలు పండించిన రైతులకు రైతు భరోసాను సత్వరమే అందించాలన్నారు. పహానీ నకల్ ఆధారంగా రుణాలు పొందిన రైతులకు మాఫీ వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని సులభతరం చేయాలని కోరారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు.. లింగాపూర్, జవహర్‌నగర్ గ్రామాలలో రెవెన్యూ, అటవీశాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి కాస్తు కబ్జాలో ఉన్న రైతులకు పట్టాలు అందించాలని కోరారు. కాశిందేవిపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, అన్నంపల్లి గ్రామాల రైతులకు దేవాదుల పైపులైన్ నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, బండి నర్సయ్య, బోడ రమేష్, వెంకటస్వామిరెడ్డి, స్వామి, మహేందర్, లక్ష్మీనారాయణ, మనోహర్, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
● మంత్రి సీతక్క ములుగు: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పంట నష్టంపై సంబంధిత శాఖల అధికారులతో అంచనా వేసి అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అధికారులతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ఆర్ఎంపీపై కేసు నమోదు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్న ఆర్ఎంపీ మనోజ్‌పై కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మేడారంలో కొంత కాలంగా మనోజ్ అనే ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అనుమతి లేకుండా అక్రమంగా మందులు నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు స్థానికుల సమాచారం మేరకు మంగళవారం దాడులు నిర్వహించి తనిఖీ చేసి, పీజిషియన్ శాంపిల్‌తోపాటు పలు రకాల మందులు లభించినట్లు గుర్తించినట్లు తెలిపారు. మందులను సీజ్ చేసి ఔషధ నియంత్రణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని తెలిపారు. అనుమతులు లేకుండా ఆర్ఎంపీలు మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గొత్తికోయ గూడెంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంకటాపురం(ఎం): మండలంలోని ఊట్లతోగు గొత్తికోయ గూడెన్ని ఆర్డబ్ల్యూఎస్ డీఈ సునీత, ఏఈ ప్రవీణ్ మంగళవారం సందర్శించారు. మంత్రి సీతక్క ఆదేశానుసారం గూడెన్ని సందర్శించి గూడెంలో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలిపారు. గొత్తికోయగూడెల్లో తాగునీటి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. కోనంపేట సమీపంలో పులి సంచారం కాటారం: మహాముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పులి అడుగులను పోలిన గుర్తులను గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో పులి అడవిలో ఉందనే వార్త గ్రామం మొత్తం చుట్టేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీ లించారు. అవి పులి అడుగులు కావని పులిని పోలిన హైనా వంటి అటవీ జంతువు పాదముద్రలు అని రేంజ్ అధికారి ఉష తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలిభూపాలపల్లి అర్బన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ గ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని మండిపడ్డా రు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రోజువారి కూలీ వేతనం పెరగక అనేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ తెలిపా రు. శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, అస్లాం, హరీశ్, శివకృష్ణ, శేఖర్, లావణ్య, వనిత పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
గోవిందరావుపేట: వడగండ్లవానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతుల పంట పొలాలు, ఇళ్లను ఆ పార్టీ మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో నాగజ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడగండ్ల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.50 వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కూలిపోయిన ఇళ్లకు రూ.5 లక్షల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, మానవతా ధృక్పథంతో రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, పూర్ణ చందర్, మల్లేష్ గౌడ్, ఐలయ్య, తిరుపతమ్మ, మల్లమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ నాగజ్యోతి -
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య
కాటారం: ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్పొరేట్ స్థాయిలో విద్యార్థులకు విద్య అందుతుందని.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలో చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి డీఈఓ రాజేందర్‌తో కలిసి ప్రారంభించారు. డీఈఓ, ఉపాధ్యాయులతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందన్నారు. విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
మంగపేట: వడగండ్లవానతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ దివాకర అన్నారు. మండలంలో సోమవారం కురిసిన వడగండ్ల వర్షంతో తీవ్రనష్టం జరిగిన నర్సింహాసాగర్, మల్లూరు, గాంధీనగర్ గ్రామాల్లోని పంట పొలాలను అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏఓ చేరాలు, తహసీల్దార్ రవీందర్‌తో కలిసి కలెక్టర్ దివాకర మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లూరు, నర్సింహాసాగర్, చుంచుపల్లి, తిమ్మంపేట, బాలన్నగూడెం, తిమ్మంపేట రెవెన్యూ పరిధిలోని సుమారుగా 2,500 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగినట్లు అధికా రులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలిపారు. నష్టం జరిగిన అన్ని రకాల పంటలకు పరిహారం అందించనున్నట్లు తెలిపారు. పట్టా లేని, పోడు భూములు, కౌలు రైతులు పరిహారం పొందేందుకు పంట సాగుచేసినట్లు తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుని సర్వే బృందాలకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ దేవరాజు, ఎంపీడీఓ భద్రు, ఎంపీఓ మమత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, నాయకులు సోమ య్య, శివప్రసాద్, తదితరులు ఉన్నారు. బ్రహ్మోత్సవాలపై కలెక్టర్ ఆరా మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మే నెలలో జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ సత్యనారాయణను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈఓతో కలిసి ఆలయ పరిసరాలు, చింతామణి జలపాతం తదితర ప్రాంతాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దు ఏటూరునాగారం: అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దని అడిషనల్ కలెక్టర్ సంపత్ (స్థానిక సంస్థల) అన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం మండలంలోని అల్లంవారిఘణపురం, శంకరాజుపల్లి, రొయ్యూర్, చెల్పాకలో ముళ్లకట్ట తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న వరిపంటలను ఆయన సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షం వల్ల వరిపైరు పూర్తిగా నేలమట్టం కావడంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. ఏ ఏ ప్రాంతాల్లో వరి ఎక్కువ నష్టపోయిందో గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయించడం జరుగుతుందన్నారు. నివేదిక ప్రకారం పూర్తి జాబితాను ప్రభుత్వానికి పంపించి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. అంతేకాకుండా రేకులు గాలికి ఎగిరిపోయిన ఇళ్లను, దెబ్బతిన్న గుడిసెలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాంపతి, తహసీల్దార్ జగదీష్, ఆర్ఐ కిరణ్, ఎంపీఓ కుమార్, ఏఓ వేణుగోపాల్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకుంటాం.. గోవిందరావుపేట: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు, గాలిదుమారంతో కూలిపోయిన ఇళ్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. పూర్తి నివేదిక వచ్చాక నష్ట పరిహారం అంచనా వేసి రైతులకు న్యాయం చేకూరేలా చేస్తామన్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జవహార్‌రెడ్డి, తహసీల్దార్ సృజన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు ఉన్నారు. రైతులకు ప్రభుత్వ అండ ఉంటుంది.. ములుగు రూరల్: ఈదురుగాలుల బీభత్సవానికి పంటలు నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లి, రాంచంద్రాపూర్, భూ పాల్‌నగర్, ముద్దునూరుతండా, శ్రీనగర్ గ్రామాల్లో నెలవాలిన మొక్కజొన్న పంటలను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఎకరాను వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో చాంద్‌పాషా, భరత్, శ్యాం, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
దంచికొట్టిన వడగండ్ల వాన
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 8లోuఏటూరునాగారం/వెంకటాపురం(కె)/మంగపేట: ఏజెన్సీలో వడగళ్లవాన దంచికొట్టింది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) మండలాల పరిధిలో సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయింది. రాళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంట నీటి పాలవుతుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూర్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ స్థాయిలో పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు అంధకారంలోనే ఉన్నారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని టేకులబోరు గ్రామ సమీపంలో గాలివాన బీభత్సానికి ఓ భారీ చింతచెట్టు నేలకూలి విద్యుత్ లైన్లపై పడడంతో మూడు స్తంభాలు విరిగిపోయాయి. 300ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం మంగపేట మండలంలోని వాడగూడెం, పాలాయిగూడెం, చుంచుపల్లి, కొత్తమల్లూరు, మల్లూరు, తిమ్మంపేట, నర్సింహాసాగర్, పూరేడుపల్లి తదితర గ్రామాల్లో రాళ్లవర్షం కురిసింది. దీంతో వాడగూడెంలోని గోదావరి ఇసుక తిన్నెలపై ఆరబోసిన వందల క్వింటాళ్ల మిర్చి, బస్తాలో తొక్కి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200కు పైగా మిర్చి బస్తాలు తడిసిపోయినట్లు రైతులు వాపోయారు. 70ఎకరాల్లోని మిర్చి పంట ధ్వంసమైనట్లు తెలిపారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో కోత దశలో ఉన్న 300కు పైగా ఎకరాల్లోని వరి పంట రాళ్ల వర్షం దాటికి ధాన్యం రాలిపోయిన పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ములుగు రూరల్/గోవిందరావుపేట: అకాల వర్షంతో ములుగు మండల పరిధిలోని అంకన్నగూడెం –సర్వాపూర్ గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు విగిరిపోయాయి. కొత్తూరు– రాయినిగూడెం గ్రామాల మధ్య విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సర్వాపూర్ వెళ్లే దారిలో రహదారిపై చెట్టు విరిగిపడిపోయింది. కాశిందేవిపేటలో నాగదేవత గుడి పై రేకులు ఎగిరిపోయి రోడ్డుపై పడ్డాయి.అదే విధంగా గోవిందరావుపేట మండలంలోని పస్రా– నాగారం ఎస్సీ కాలనీ వద్ద మేడారానికి వెళ్లే రహదారిలో గాలివానకు రోడ్డుపై అడ్డుగా చెట్టు పడిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం నెలకొంది. స్పందించిన పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ రోడ్డు పై పడిపోయిన చెట్టును సిబ్బంది సహాయంతో తొలగించారు. రోడ్డు పై వర్షానికి విరిగిపడిన చెట్టును తొలగిస్తున్న పస్రా ఎస్సై కమలాకర్ నర్సింహా సాగర్‌లో రాళ్ల వానకు రాలిపోయిన ధాన్యం గాలివాన బీభత్సం.. కల్లాల్లో తడిసి ముద్దయిన మిర్చి, ధాన్యం రాళ్లవానతో నేలరాలిన ధాన్యం గింజలు -
పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలని డీసీడీఓ రమాదేవి అన్నారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, బండారుపల్లి మోడల్ పాఠశాలలను ఆమె సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలని వివరించారు. చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలోని సమస్యలను తమకు తెలియజేయాలన్నారు. బోధన సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆమె వెంట కేజీబీవీ ఎస్ఓ జీవనప్రియ, సిబ్బంది ఉన్నారు. గ్రూప్స్ విజేతలకు సన్మానం ఎస్ఎస్ తాడ్వాయి: ఇటీవల విడుదలైన గ్రూప్స్‌లో విజయం సాధించి ఉద్యోగాలకు ఎంపికై న మండల పరిధిలోని కాటాపూర్‌కు చెందిన బెల్లంకొండ నవీన్, సెంట్రల్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కరుణాకర్ గ్రూప్ 2లో ర్యాంకు సాధించి ప్రస్తుతం జూనియర్ లెక్చరర్‌గా ఎంపికయ్యారు. సోమవారం వీరిని బతుకమ్మ కమిటీ సభ్యులు గ్రూప్స్ విజేతలతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాటాపూర్‌కు చెందిన నవీన్, కరుణాకర్ ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. వారి విజయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కారు పల్టీ.. ముగ్గురికి గాయాలు గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గుండ్లవాగు కార్నర్ సమీపంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సత్తేంద్ర వరంగల్ వైపునకు కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు కింద పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. -
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: మే 15నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ నది పుష్కరాల అభివృద్ధి నిర్మాణ పనులను మే 4వరకు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ముందుగా జ్ఞానసరస్వతి (వీఐపీ)ఘాటు వద్ద నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్‌ను పరిశీలించి ఈఈ తిరుపతిరావుతో మాట్లాడారు. సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటుకు జరుగుతున్న నిర్మాణ పనులను, శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. ప్రధాన ఘాట్ వద్ద జరుగుతున్న మరుగుదొడ్ల పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, స్వాగత తోరణం పనులు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, నిర్మాణ పనులను ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నిర్మిస్తున్న తాగునీటి ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కొన్నిచోట్ల శాశ్వత ప్రాతిపదికన పనుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మరుగుదొడ్లు, తాగునీరు, పుష్కరఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు ఈఓ మహేష్, డీపీఓ నారాయణరావు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీఐ రామచందర్‌రావు, స్థానికులు శ్రీనివాసరెడ్డి, అశోక్ ఉన్నారు. చెట్లను తొలగించాలా! వద్దా! కాళేశ్వరంలోని ఆర్చీగేటు నుంచి వీఐపీ ఘాటు వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. ఎడమ వైపున భారీ వృక్షాలు ఐదారు వరకు ఉన్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్‌శర్మ పనుల పరిశీలనకు రాగా కాంట్రాక్టర్లు వృక్షాలు తొలగిస్తామని చెప్పారు. ఆయన స్పందించి వృక్షాలను తొలగించవద్దని చెప్పారు. కలెక్టర్ రాహుల్‌శర్మ దేవస్థానం కార్యాలయంలో సమీక్ష -
ఆరు ఎకరాల మామిడితోట దగ్ధం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామక్రిష్ణాపూర్ పరిధిలో గల మోకిరాల తిరుపతిరావుకు చెందిన మామిడి తోటకు సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు రెండు వేల చెట్లు కాలిపోయాయి. చెల్పూరుకు చెందిన తిరుపతిరావు రామక్రిష్ణాపూర్ పరిధిలో ఆరు ఎకరాల్లో హిమయిత్, దశరి రకంకు చెందిన 8 ఏళ్ల వయస్సు గల రెండు వేల మామిడి చెట్లను సాగు చేస్తున్నాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్లుగా క్రాప్ వస్తుందని తిరుపతిరావు పేర్కొన్నారు. మామిడితోట వద్ద వర్కర్లు కాపలా ఉంటున్నారు. సోమవారం ఉదయం కొంతమంది వ్యక్తులు మామిడితోట వైపునకు వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే తోటలో మంటలు చేలరేగడంతో వర్కర్లు నాలుగు మోటార్ల సహాయంతో మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అయినా అదుపులోకి రాలేదు. పంట చేతికి వచ్చేదశలో మామిడిచెట్లు కాలిపోవడంతో పాటు డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తిరుపతిరావు తెలిపారు. రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతి రూ.20 లక్షల నష్టం -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ములుగు/ఏటూరునాగారం: శ్రీతమ భూ సమస్యలు పరిష్కరించండి తిరగలేకపోతున్నాం.. ఉపాధి కల్పించండి పని చేసుకుంటాం..ఐటీడీఏ పరిధిలో బోరువెల్ మంజూరు చేయాలని..ఇసుక క్వారీ రద్దు చేయాలని.. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలనిశ్రీ.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజలు గ్రీవెన్స్, గిరిజన దర్బార్‌లో తమ గోడు వెలిబుచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ టీఎస్.దివాకర, ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఎస్ఓ రాజ్‌కుమార్ వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో 35 దరఖాస్తులు రాగా గిరిజన దర్బార్‌లో పీఓ చిత్రామిశ్రా లేకపోవడంతో మూడు వినతులు మాత్రమే వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి.. హమాలీల సంక్షేమానికి హమాలీ బోర్డును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. అధికారంలోకి రాగానే హమాలీ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కార్మికులకు ఉపాధి కల్పన కరువైందని తెలిపారు. కొంతమంది పక్క రాష్ట్రాలకు చెందిన హమాలీ కార్మికులను తక్కువ జీతానికి తీసుకొచ్చి స్థానిక కార్మికుల పొట్టకొడుతున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ●గ్రీవెన్స్‌లో వచ్చిన వినతుల వివరాలుభూ సమస్యలపై : 12 గృహ నిర్మాణ శాఖ : 02 పెన్షన్ : 03 ఇతర శాఖలకు.. : 18 కనీస సౌకర్యాలు కల్పించాలి..వెంకటాపురం (కె) మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల కనీస సౌకర్యాలు కల్పించాలి. పాఠశాల భవనం అసంపూర్తిగా ఉంది. విద్యార్థులకు వసతి, తాగునీరు, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి. బర్లగూడెం గ్రామా పంచాయతీలో వసతిగృహం, పాఠశాల వేర్వేరుగా ఉన్నాయి. పాఠశాల భవనం పూర్తి అయితే రోజు వారీగా విద్యార్థులు సుమారు 500మీటర్ల మేర నడిచే సమస్య తీరుతుంది. 2014–15 విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక సిబ్బందితో పాఠశాలను నెట్టుకొస్తున్నారు. తక్షణమే రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని కలెక్టర్‌కు వినతిని విన్నవించారు. చేల నవీన్, చిరుతపల్లి, స్థానికుడుఈ ఫొటోలోనిది వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన రైతులు. 1999లో వన సంరక్షణ సమితి సంఘాన్ని అటవీశాఖ ఏర్పాటు చేసింది. ఆ సంఘంలో 33మంది సభ్యులుగా ఉన్నారు. అంతకు ముందు 1980నుంచి పేరూరు గ్రామ పంచాయతీలోని రాంపురం గ్రామం వెనుకాల ఉన్న ప్రభుత్వ భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నారు. ఆనాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ భూమిని పట్టా చేయించుకోలేక పోయారు. అదే సమయంలో అటవీశాఖ జామాయిల్ మొక్కలు ఉచితంగా ఇస్తామని చెప్పి ముందుకు వచ్చింది. సంఘం తరఫున 50ఎకరాల్లో మొక్కలను పెంచారు. ఇప్పుడు ఆ చెట్లను పెంచిన వారికి వాటిపై ఎలాంటి హక్కు లేదని అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. ఈ విషయంలో అటవీ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి పట్టాలు ఇప్పించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్ఓ రాజ్‌కుమార్ మొత్తంగా 38 దరఖాస్తుల స్వీకరణ పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు -
ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలి
వెంకటాపురం(ఎం): ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పిలుపునిచ్చారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. గుట్కా, సిగరెట్, పొగాకు తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికావడమే కాకుండా బంగారు భవిష్యత్తును యువత కోల్పోతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ కౌన్సిల్ రాజ్‌కుమార్, స్టాఫ్‌నర్స్ మణెమ్మ పాల్గొన్నారు. -
రణదివే ఆశయాలను కొనసాగించాలి
ములుగు రూరల్: కార్మిక ఉద్యమనాయకుడు, సీఐటీయూ అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే ఆశయాలను కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. జిల్లాకేంద్రంలో రణదివే 35వ వర్ధంతి ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1970లో ఐక్యత, పోరాటం అనే నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్(సీఐటీయూ) ఏర్పడిందని తెలిపారు. కులం, మతం, లింగ బేధం తేడాలతో విడిపోవడం వల్ల కార్మికులు నష్టపోతారని ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలాదేవి, సద్దాం హుస్సేన్, నారాయణ, ప్రవీణ్, రవీందర్, రాజు, రజిత, రమ, జ్యోత్న్స తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
రాజ్యాంగంపై అవగాహన పెంచడమే లక్ష్యం
భూపాలపల్లి రూరల్/ రేగొండ: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రం, కొత్తపల్లిగోరి మండలాల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం పలు వురు మేధావుల ఆలోచనలతో ఏర్పడిన పవిత్ర గ్రంథామన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కాలని చూస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు సూదనబోయిన ఓంప్రకాశ్, దుగ్యాల రాజేశ్వరరావు, చిగురుమామిడి కుమార్, వెంకటేష, వీరబ్రహ్మం, శ్రీని వాస్, ప్రభాకర్, సంతోష్ రాజయ్య, పాల్గొన్నారు. నాపాక ఆలయం సందర్శన చిట్యాల: మండలంలోని నైన్పాక గ్రామంలో వెలిసిన నాపాక శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు. అనంతరం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలలో పాల్గొని పూజలు చేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని కళాకారులకు బహుమతులు అందజేశారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్ర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఇందులో భాగంగా లిల్లీపూలతో అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేదపండితులు, వేదపాఠశాల విద్యార్థులు లిల్లీపూలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి ఓదెల సంపత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. రాత్రి 8గంటలకు సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.షెడ్యూల్లో చేరిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం మొగుళ్లపల్లి: తమిళనాడు తరహాలో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేరిస్తేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జీఓల ద్వారా నిలువవన్నారు. 1962 నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల పెంపుపై ఎన్ని జీఓలు, చట్టాలు వచ్చిన అమలు కాలేదన్నారు. బదిలీలు నిలిపేయాలని మంత్రికి వినతి కాటారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్లో బదిలీల ప్రక్రియ నిలిపేయాలని కోరుతూ ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబుకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాటారం సబ్‌డివిజన్ పరిధిలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో మంథని నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొంత డబ్బు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేశారన్నారు. రెండేళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కొరత ఉందని వారు మంత్రికి విన్నవించారు. బదిలీల కారణంగా కార్యదర్శులకు అందాల్సిన బకాయిలపై పలు అంశాలు ప్రభావితం చేస్తాయని తమ సమస్యలను అర్థం చేసుకొని బదిలీలు నిలిపివేయాలని మంత్రిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సబ్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు భూపాలపల్లి రూరల్: పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ విజన్‌తో రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు బట్టు రవి, పార్లమెంట్ కో– కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, నాయకులు దొంగల రాజేందర్, దాసరి తిరుపతిరెడ్డి, పెండ్యాల రాజు, వేణు, రఘునాథరెడ్డి, మునీందర్, కుమార్, విప్లవ రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు. -
లీకేజీలను గుర్తించిన ఇంజినీర్లు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజినీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నీటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజినీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు.టన్నెల్లోకి దిగిన మెగా సిబ్బంది -
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
ములుగు రూరల్: దండకారణ్యంలో మావోయిస్టులపై సాగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు బొమ్మెడ సాంబయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజాధర్నా వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన హక్కుల రక్షణకు రాజ్యాంగంలో పొందుపరిచిన షెడ్యూల్లోని చట్టాలను ప్రధాని మోదీ, అమిత్‌షాలు కాలరాస్తున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపదను దోచిపెట్టేందుకే అమాయకపు గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీ ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న హత్యాకాండను నిలిపివేయాలని కోరారు. రేపు(8వ తేదీ)హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు చౌక్ వద్ద చేపడుతున్న ప్రజాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్, రాజేందర్, బాలరాజు, నర్సింహరావు, కుమార్, బుచ్చన్న, రమేష్, చిరంజీవి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.న్యూడెమోక్రసీ నాయకుడు సాంబయ్య -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్‌కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ(ఫీడర్లలో విద్యుత్ సరఫ రా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యే క యాప్‌ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకు న్న ఉద్యోగికి, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు మాత్రమే తెలిసేది. ఈయాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. పొరపాట్లకు తావులేకుండా.. ఎల్సీ(లైన్ క్లియర్) తీసుకోవాలనుకున్న లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని సంబంధిత ఏఈకి విన్నవించుంటే అతను పరిశీలించి ఆ ఫీడర్లో ఎల్సీ ఇవ్వొచ్చా లేదా? అత్యవసరాలు ఏమైనా ఉన్నాయా.. అప్పటికే షెడ్యూల్ చేయబడిన పనులు ఉన్నాయా.. మరే ఇతర షెడ్యూల్ చేసిన పనులు ఉన్నాయా? అని పరిశీలిస్తాడు. ఏఈ నిర్ణయం మేరకు ఎల్సీ అనుమతి ఆధారపడి ఉంటుంది. ఎల్సీకి అనుమతిస్తే లైన్మెన్, సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా సబ్ స్టేషన్ యాప్‌లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీని ద్వారా పొరపాటు జరగుకుండా ఉంటుంది. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్‌లు వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్‌కు వేరే ఫీడర్‌తో అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్‌లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరలా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్‌స్టేషన్ ఆపరేటర్‌కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. భద్రతా ప్రమాణాలు పెంచడానికి యాప్.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. – పి.మధుసూదన్‌రావు, ఎస్ఈ, హనుమకొండ ఆన్లైన్లో సులభంగా విద్యుత్ లైన్ క్లియరెన్స్ నూతన యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు, ఉద్యోగులకు శిక్షణ -
రామప్పను సందర్శించిన సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు. టూరిజం గైడ్ వెంకటేశ్ వారికి ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై సతీష్ పాల్గొన్నారు. వైద్యులు అంకితభావంతో పనిచేయాలి వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, అధికారులు విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని జిలా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చిరుతపల్లిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని శనివారం పరిశీలించారు. అనంతరం ఎదిర వైద్యశాలను సందర్శించి వైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. వైద్యశాలలో రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అఽధికారులు తదితరులు పాల్గొన్నారు. కిరాణా దుకాణాల్లో తనిఖీలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల కిరాణా దుకాణాల్లో నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు నిర్వహించినట్లు వెంకటాపురం ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా ముందస్తుగా షాపుల్లో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పాలంపేట రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. -
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల్లో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞానతీర్థం’ ఎఫ్ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏమిటంటే..పూర్వం కాకి నదిలో స్నానం చేసి హంసలాగా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాటు రెయిలింగ్‌ను కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు. పుష్కరఘాట్‌కు కాకి, హంస, మకరం చిత్రాలతో కూడిన రాయి రెయిలింగ్ -
బడుగుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్
ములుగు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జగ్జీవన్‌రామ్ 118వ జయంతి వేడుకలకు అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి లక్ష్మణ్‌నాయక్ ఆధ్వర్యంలో కులసంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ అనుసరించాలన్నారు. బిహార్‌లో పుట్టి ఉప ప్రధానిగా ఆయన పనిచేయడం గొప్ప విషయం అన్నారు. ఆహార సంక్షోభాన్ని నివారించడానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఘనుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ తుల రవి, జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఆయా సంఘాల నాయకులు ఇరుగు పైడిమాదిగ, బుర్రి సతీశ్మాదిగ, మడిపెల్లి శ్యాం, జన్ను రవి, నద్దునూరి రమేష్, మురుకుట్ల నరేందర్, సునార్కాని రాంబాబు, రామునాయక్, చింత కృష్ణ, ముంజాల భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లాకేంద్రంలో పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. తొలి పార్లమెంట్లో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సూపరిండెంట్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్సై జగదీశ్, ఉమెన్ ఆర్ఎస్సై నిర్మల, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్పతి, జిల్లా హెడ్‌క్వార్టర్స్ సూపరింటెండెట్ డాక్టర్ జగదీశ్వర్లు బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళితవర్గాల అంటరానితనం నిర్మూలన కోసం, సమానత్వం కోసం పోరాడారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ తిరుపతయ్య, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
రామప్ప శిల్పాలతో కీ చైన్ల ఆవిష్కరణ
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని నిర్మించి 812సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం రామప్ప గార్డెన్లో రామప్ప శిల్పాలతో కూడిన కీ చైన్లను రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు పాండురంగారావు, ఉమ్మడి జిల్లా టూరిజం అధికారి శివాజీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సోసైటీ అధ్యక్షుడు కుసుమ సూర్యకిరణ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల కళావైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. 812 ఏళ్ల క్రితం నిర్మించినా రామప్ప ఆలయం చెక్కు చెదరకుండా ఉందని, యునెస్కో గుర్తింపుతో ప్రపంచ పటంలో రామప్ప ఆలయానికి గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం గైడ్స్ విజయ్‌కుమార్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులకు అండగా ఉంటాం..
వెంకటాపురం(కె): మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయిన బాధిత రైతులకు అండగా ఉండి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ చిరుతపల్లిలో ఆయన శనివారం పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న మొక్కజొన్న రైతులు చందర్రావు, మధు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు ఇచ్చిన బాండ్ మొక్కజొన్న కంపెనీలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. అనంతరం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, గిరిజన రైతులు, అన్ని శాఖల జిల్లా, మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో బాండ్ మొక్కజొన్న సాగు చేసి రైతులు నష్టపోయి పోరాటాలు చేస్తుంటే వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులు నష్టపోయేలా చేసిన కంపెనీ ఆర్గనైజర్లు ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో బాండ్ మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు బృందాలుగా పర్యటించి ప్రతీ రైతు ఇంటికి వెల్లి వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 950మంది రైతులు పంట నష్ట పోయారని వివరించారు. ఇంకా ఎవరైనా రైతులు పంట నష్టపోయి ఉంటే ఈ నెల 10వ తేదీ వరకు సంబంధిత వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. రైతులకు నష్టపరిహారం అందించే దిశగా కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించామని త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో నేరుగా పంట నష్ట పరిహారం పడే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ వెంకటేశ్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, విద్యుత్ శాఖ అధికారి నాగేశ్వరావు, సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ -
‘పట్టు’ కోల్పోయింది..!
గోవిందరావుపేట: ఏజెన్సీలోని పట్టు పరిశ్రమ ఒకప్పుడూ సిబ్బందితో కళకళలాడుతూ ఉండేది. మల్బరీ తోట, పట్టు పురుగుల పెంపకం కేంద్రంతో పాటు పట్టు సేకరణతో ఆ ప్రాంతమంతా బిజీబిజీగా ఉండేది. సెరికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన విద్యార్థులు శిక్షణ పొందడానికి వివిధ కళాశాలల నుంచి పట్టు పరిశ్రమకు వచ్చేవారు. అయితే ఆ వైభవం నేడు కనుమరుగైంది.. మల్బరీ తోటలో పట్టు పురుగుల పెంపకంతో పాటు దసలి పట్టు తయారీ కేంద్రంగా పేరొందిన పట్టు పరిశ్రమ కొన్నేళ్ల క్రితం మూతపడగా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో గల బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే పట్టు పురుగుల పెంపకం కేంద్రం ఉంది. అప్పటి ప్రభుత్వం భవనాలతో పాటు పురుగుల పెంపకానికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలంలో మల్బరీ చెట్ల పెంపకానికి నీటి వసతికి బావి, రెండు బోరు పాయింట్లను ఏర్పాటు చేసింది. చాలా ఏళ్లు పరిశ్రమ బాగా నే నడిచింది. నిత్యం ఐదుగురు కూలీలు పనిచేసేవా రు. ఇద్దరు అధికారుల పర్యవేక్షణలో పట్టు పరిశ్రమ నడిచేది. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకురాలేకపోవడంతో పాటు నిధులు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం తదితర కారణాలతో పరిశ్రమ ఎనిమిదేళ్ల క్రితం మూతపడింది. నిధులు నిలిచిపోవడంతో.. పట్టు పరిశ్రమలో పనిచేస్తున్న వారు కొందరు బదిలీపై వెళ్లడం, ఇంకొందరు పదవీ విరమణ చేయడంతోపాటు నిధులు రాకపోవడంతో పరిశ్రమ మూతపడింది. ఏళ్లు గడుస్తుండడంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో పాటు అందులో ఉన్న పరికరాలు తుప్పుపట్టి పోతున్నాయి. ప్రస్తుతానికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టు పరిశ్రమ కార్యాలయం స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఓ టెక్నికల్ అసిస్టెంట్‌ని నియమించింది. మద్దిచెట్లు పెంచి దసలి పట్టు తయారీ అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా సాగు చేసే దసలి పట్టును సైతం పట్టు పరిశ్రమలో పండించేవారు. అందుకోసం ఈ పరిశ్రమలో మద్దిచెట్లను పెంచారు. గుడ్ల నుంచి పురుగులు బయటకు రాగానే మద్దిచెట్ల పై విడిచి పెట్టేవారు. ఆ పురుగులు ఆ చెట్లపై గుడ్డు ఆకారంలో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలా మారిన గూళ్లను తీసుకొచ్చి లోపల ఉండే పురుగులను నిర్జీవం చేసి రీలింగ్ ద్వారా పట్టు దారం తీసేవారు. దసలి పట్టు వస్త్రాలకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పుణ్యక్షేత్రాల్లో ఉపయోగించడం వీటి ప్రత్యేకత. మూతపడిన మల్బరీ, దసలి పట్టు పరిశ్రమ శిథిలావస్థకు చేరుకున్న భవనాలు తుప్పుపట్టిన పరికరాలు -
కామేశ్వరాలయ పునాది మట్టి తొలగింపు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయం పక్కన ఉన్న కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆలయ ప్రదేశంలో ఉన్న మట్టిని జేసీబీ, ట్రాక్టర్లతో తొలగిస్తున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం ఆలయం అడుగుభాగాన పోసే ఇసుక కొట్టుకుపోకుండా ఆలయం చుట్టూ రెండు మీటర్ల లోతు నుంచి రాయితో గోడను నిర్మించారు. ఆలయం అడుగుభాగంలో ఉన్న లూజ్ మట్టిని తొలగించి లెవలింగ్ పనులు చేస్తున్నారు. మట్టి తొలగించిన అనంతరం ఆలయ అడుగుభాగంలో పెద్దరాళ్లను పేర్చి ఇసుకతో నింపనున్నారు. సాండ్ బాక్స్ టెక్నాలజీ ద్వారానే కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించేందుకు పురావస్తుశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ వేగవంతం చేయాలి ములుగు: సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం సీఎస్ శాంతికుమారితో కలిసి ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీఎస్ దివాకర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 222రేషన్ దుకాణాలు ఉన్నాయని అన్నారు. 91,563 రేషన్ కార్డులు ఉండగా 2,57,841 మంది లబ్ధిదారులకు 1702.096 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం రాంపతి, జిల్లా అధికారి ఫైజల్ హుస్సేని, అధికారులు పాల్గొన్నారు. నేటినుంచి శ్రీరామనవమి వేడుకలు ● మూడు రోజుల పాటు ఉత్సవాలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం అనుబంధ దేవాలయం శ్రీరామాలయంలోని శ్రీసీతారామ చంద్రస్వామివార్ల ఆలయంలో శనివారం నుంచి సోమవారం వరకు శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల (నేడు) 5న శనివారం సాయంత్రం 4గంటలకు అధ్యాయనోత్సవం, ప్రబంద పారాయణం, రాత్రి 8గంటలకు ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. 6న ఆదివారం ఉదయం 10.31గంటలకు రామాలయం కల్యాణ మండపం వద్ద ఉత్సవమూర్తులకు కల్యాణం నిర్వహిస్తారు. రాత్రి 7గంటలకు హవనం, బలిహరణం జరిపిస్తారు. 7న సోమవారం ఉదయం 11గంటలకు పూర్ణహుతి, సాయంత్రం 5గంటలకు శ్రీపుష్పయాగం, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు తరలి రానున్నారు. విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి భూపాలపల్లి అర్బన్: విద్యా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సర్వ శిక్ష జిల్లా మానిటరింగ్ అధికారి కాగితపు లక్ష్మణ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు పదోన్నతి పొందిన బయాలజీ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు ఆయా పాఠశాలల్లో తరగతి గదిలో అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందన్నారు. జీవశాస్త్రపు ఉపాధ్యాయులు విద్యా సామర్‌ాధ్యల ఆధారంగా బోధన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు. ఆశించిన ఫలితాలను రాబట్టాలని చెప్పారు. రిసోర్స్ పర్సన్లు డాక్టర్ మార్క వీణావాణి, కుర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల ప్రకారం విద్యార్థులకు బోధన చేసి విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంపొందించాలన్నారు. ప్రయోగాత్మక పద్ధతి, కృత్యాదార బోధనల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయులు కామిడి సతీష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సారంగపాణి, జ్యోతి, సరిత పాల్గొన్నారు. -
రజతోత్సవ మహాసభకు తరలిరావాలి
ములుగు: ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, రజతోత్సవసభ ములుగు ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు అధ్యక్షతన జరిగిన ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశానికి పెద్ది ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని 10 మండలాల్లో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కంకణబద్ధులు కావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయి నుంచి ఎండగట్టే ప్రయత్నం చేయాలని చెప్పారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ములుగు గడ్డపై గులాబీజెండా ఎగరడం ఖాయమని చెప్పారు. రైతులకు బోనస్ పేరుతో మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్, నాయకులు భూక్య జంపన్న, గండ్రకోట సుధీర్, విజయ్‌రాంనాయక్, పాలెపు శ్రీనివాస్, కోగిల మహేష్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి -
అకాల వర్షంతో ఆందోళన
మంగపేట: అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మండలంలో గురువారం సాయంత్రం గాలులతో భారీ వర్షం పడింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ గాలులతో గంటన్నర పాటు భారీ వర్షం దంచి కొట్టింది. అయినప్పటికీ వాతావరణ శాఖ రెండు రోజుల ముందు నుంచే అకాల వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో రైతులు ముందస్తుగా తగిన జాగ్రతలు పాటించడంతో పెద్దగా ఎక్కడ కూడా నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. మిర్చి కల్లాల్లో ఉన్నప్పటికీ రైతులు వర్షానికి తడవకుండా కవర్లు కప్పి ఉంచడంతో నష్టం జరుగలేదు. ఆడ మగ వరి సాగు చేసిన రైతులకు కొంతమేర నష్టం కలిగించిందని రైతులు తెలిపారు. -
ఆర్థిక సంక్షోభం ఉన్నా పథకాల అమలు
కాటారం: బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్‌లో శుక్రవారం సన్న బియ్యం ఉచిత పంపిణీ పథకాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కడుపునింపడం కోసం ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం ప్రాధాన్యత తక్కువ ఉన్న దొడ్డు బియ్యం పంపిణీ చేసిందని తెలిపారు. దీని ఫలితంగా రీసైక్లింగ్ జరిగి కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. సన్నబియ్యం వినియోగం పెంచి దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టడానికి రేషన్‌దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వంలో రేషన్ డీలర్లు భాగస్వాములని ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎస్ఓ శ్రీనాథ్, డీఎం రాములు, డీఆర్డీఓ నరేశ్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు -
ఇప్పపువ్వు సేకరణపై అవగాహన
వెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ యాకూబ్ జానీ, ఎఫ్ఎస్ఓ రాజేశ్వరి, ఎఫ్‌బీఓలు రజిత, స్వర్ణలత, రూప్‌కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
రెండవ రోజు పాదయాత్ర
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు. -
ఇప్పపువ్వు సేకరణపై అవగాహన
వెంకటాపురం(ఎం): ఇప్పపువ్వు సేకరణపై మండలంలోని బండ్లపహాడ్, ఊట్ల గొత్తికోయ గ్రామాల్లో గిరిజనులకు అటవీశాఖ అధికారులు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పపూవ్వు సేకరణ సమయంలో ఇప్పచెట్ల కింద క్లీనింగ్ కోసం నిప్పు పెట్టవద్దని, గ్రీన్ షాడో నెట్లను ఉపయోగించాలన్నారు. ఇప్పచెట్ల కింద ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడం వల్ల మంటలు వ్యాపించి ఇతర చెట్లు కాలిపోయే ప్రమాదముంటుందన్నారు. ఇప్పచెట్ల కింద చెత్తను తొలగించి గ్రీన్నెట్లను వాడుతున్నవారికి అటవీశాఖ తరఫున బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎఫ్ఆర్ఓ యాకూబ్ జానీ, ఎఫ్ఎస్ఓ రాజేశ్వరి, ఎఫ్‌బీఓలు రజిత, స్వర్ణలత, రూప్‌కుమార్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధి హామీ కూలీలను పెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఉపాధి హామీ పనులకు కూలీలను పెంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఎంపీడీఓలను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం పనులు, సెర్ప్ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్, డీఆర్డీఓ, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ మండల ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్దఎత్తున చేపట్టేందుకు కూలీలను మొబలైజ్ చేయాలని ఎంపీడీఓలకు సూచించారు. మూడు నెలలు అత్యంత కీలకమని.. మూడు నెలల్లో 80 రోజుల పని దినాలు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూలి రేటు రూ.300 నుంచి రూ.307లకు పెంచినట్లు తెలిపారు. డిమాండ్‌కు తగినట్లు పనులు జరిగేలా కార్యాచరణ తయారు చేయాలన్నారు. మహదేవపూర్, మహాముత్తారం, పలిమెల మండలాల్లో 5వేల మంది రైతుల భూముల్లో వెదురు పెంపకం చేపట్టేందుకు ఈ నెల 15వ తేదీ వరకు రైతులను ఎంపిక చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 50 శాతం మహిళా సంఘాలకు కేటాయించాలని, మహిళా సంఘాల జాబితా తయారు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఎంపిక చేసిన సంఘాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. చేయూత (వృద్ధాప్య పింఛను) పొందుతున్న వ్యక్తి భర్త లేదా భార్య మరణిస్తే వారిలో జీవించి ఉన్న ఒకరికి పింఛను మంజూరు చేసేందుకు మున్సిపల్, మండల స్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లో మహిళా స్వయం సహాయ సంఘాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటుకు భూమి కేటాయింపు చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 559 పనులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించేందుకు ఈ నెల 11వ తేదీ వరకు అన్ని బిల్లులు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాటారం డివిజన్లో మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివేదిక అందజేయాలన్నారు. మంజూరైన ఇండ్ల పనులు చేపట్టేందుకు తక్షణమే మార్కింగ్ చేయాలని ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన ఇండ్లు ప్రగతి వివరాలను ఎంపీడీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ అధికారి సిద్ధార్థ, జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఆర్డీఓ రవి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ఎకో పార్కును మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకానికి 4,479 దరఖాస్తులు వచ్చాయని, ప్రజలకు తెలిసేలా గ్రామ, గ్రామాన విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్‌ను పరిశీలించారు. -
ప్రభుత్వవైద్యంపై నమ్మకం కలిగించాలి
ములుగు: ప్రభుత్వవైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రి సమీక్ష సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి శుక్రవారం వైద్యులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశానికి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించి భరోసా ఇవ్వాలని అన్నారు. రోగులతో ప్రేమగా మాట్లాడుతూ సానుకూలంగా స్పందించాలని అన్నారు. ప్రభుత్వ కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని అన్నారు. ములుగు, ఏటూరునాగారం ఆస్పత్రుల్లో వైద్యులు 24గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వైద్య సిబ్బంది జవాబుదారీతనంగా ఉండాలని చెప్పారు. ప్రతి మండలంలో 108 వాహనం ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని పరిస్థితిని తెలుసుకోవాలని అన్నారు.కీ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, వైద్యులు పాల్గొన్నారు.మంత్రి సీతక్కపలువురికి మంత్రి పరామర్శ గోవిందరావుపేట: మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, వారి కుటుంబాలను మంత్రి సీతక్క శుక్రవారం పరామర్శించారు. మండల పరిధిలోని అమృతండా గ్రామంలో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న బానోత్ సమ్మయ్య, ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొద్దులగూడెం గ్రామానికి చెందిన బర్ల లక్ష్మారెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రి వెంట పార్టీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, నాయకులు ఉన్నారు. -
రెండవ రోజు పాదయాత్ర
భూపాలపల్లి రూరల్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారా యణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో 12, 13 వార్డుల్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేవన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు మహాత్మా గాంధీని, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అప్పం కిషన్, పిప్పాల రాజేందర్, స్వామి, రవీందర్, అశోక్, పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మంగపేట/కన్నాయిగూడెం/ఏటూరునాగారం/ములుగురూరల్: రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మంగపేట, కమలాపురం గ్రామాల్లో సీతక్క గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా కమలాపురం, మంగపేటలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు, కల్యాణి లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పేదలకు సన్నబియ్యం పథకం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో వరివేస్తే ఉరే అన్న చందం నుంచి నేడు వరి పండిస్తేనే సిరి అనే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేడ్కర్, కొమురం భీమ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు పైడాకులు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం కులమతాలలో చిచ్చు పెట్టి భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మంత్రి సీతక్క కన్నాయిగూడెం మండల పరిధిలోని ఏటూరు, చింతగూడెం, బుట్టాయిగూడెం, సర్వాయి గ్రామాల్లో పర్యటించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బుట్టాయిగూడెంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. ఏటూరునాగారం మండలంలోని 1వ వార్డులోని రేషన్ షాపులో, అలాగే ములుగు మండల పరిధిలోని జంగాలపల్లిలోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాలి ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు చదువుతో పాటు సంస్కారాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్‌ను ఇల్లులాగా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలకు చేరుకున్న మంత్రికి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రేవతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుహాసిని, వార్డెన్ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
సన్న బియ్యం.. నేతలు రాక ఆలస్యం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకానికి ప్రొటోకాల్ సమస్య తప్పలేదు. వాస్తవానికి ఉగాది కానుకగా ప్రకటించిన ఈ పథకాన్ని ఈ నెల 1న అన్ని గ్రామాల్లో ప్రారంభించాల్సి ఉంది. వివిధ కారణాలు, ప్రభుత్వ పరమైన కార్యక్రమాల వల్ల ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల హాజరు కాలేదు. దీంతో కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు కూడా ప్రారంభించే సాహసం చేయలేదు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు అధికారికంగా ప్రారంభించాకే పంపిణీ చేయాలనుకుంటున్నట్లు అధికారులు పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకటి, రెండు రోజుల ఆలస్యంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు కాగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల ఎదుట బారులుదీరి తీసుకెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 2,315 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 20,958 మెట్రిక్ టన్నుల బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఉగాది నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల లబ్దిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రేషన్‌షాపుల ఎదుట సందడే సందడి.. గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్లతోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నబియ్యం కోసం లబ్దిదారులు ఉదయం నుంచే రేషన్‌షాపులకు చేరుకుంటున్నారు. మంగళవారం నుంచి గురువారం రేషన్‌దుకాణాల్లో అధికారికంగా పంపిణీ ప్రారంభం కాగా.. ఉదయం 8 గంటల నుంచే రేషన్‌షాపుల వద్ద భారీ సంఖ్యలో లబ్ధిదారులు క్యూలలో నిల్చుంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద ఈ తరహాలో సందడి చూసి చాలా రోజులైందన్న ఆశ్చర్యాన్ని డీలర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు లేదా సన్నబియ్యం స్టాక్ ఉన్నంత వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. సంతోషంగా ఉంది ప్రభుత్వం మాలాంటి నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు స న్నబియ్యం ఇస్తుండటం సంతో షంగా ఉంది. రేషన్ షాప్‌ల ద్వా రా అందిస్తున్న సన్న బియ్యం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. దొడ్డు బియ్యం తినాలంటే ఇబ్బంది పడేవాళ్లం. చాలాఏళ్ల నుంచి ఇస్తామని చెబుతున్నా ఇప్పటికి అమల్లోకి రావడం సంతోషం. – నామని కనక లక్ష్మి, శాయంపేట జిల్లాల వారీగా రేషన్ దుకాణాలు, కార్డులు, బియ్యం పంపిణీ ఇలా.. రెండు రోజులపాటు కొనసాగిన ప్రారంభవేడుకలు లబ్ధిదారులు బారులు.. రేషన్ దుకాణాల వద్ద సందడి ఉమ్మడి వరంగల్‌లో 32.61లక్షల మంది కార్డుదారులు 2,315 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ.. కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యవేక్షణజిల్లా దుకాణాలు కార్డులు లబ్ధిదారులు బియ్యం పంపిణీ (మె.టన్నుల్లో) హనుమకొండ 414 2,28,143 6,75,246 4,051.476 వరంగల్ 509 2,66,429 7,94,087 5,014.541 జనగామ 335 1,61,472 4,85,164 3,094.690 మహబూబాబాద్ 558 2,41,012 7,03,550 4,511.000 జేఎస్‌భూపాలపల్లి 277 1,23,508 3,50,527 2,276.520 ములుగు 222 91,737 2,52,348 1,650.000 -
ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలి
మంగపేట: ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఐకేపీ(సెర్ప్) ఆడిషనల్ డీఆర్డీఓ బాలరాజు అన్నారు. మండల పరిధిలోని తిమ్మంపేట, కమలాపురం, గంపోనిగూడెం, తిమ్మంపేటలో ఆయా గ్రామాల గ్రామైఖ్య సంఘాల సభ్యులకు కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు. స్థానిక కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.2,320, దొడ్డురకం ధాన్యం క్వింటాకు రూ. 2,300 ప్రభుత్వ మద్దతు ధరను పొందాలన్నారు. ఽసన్నరకం ధాన్యం క్వింటాకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా చెల్లిస్తుందన్నారు. కొనుగోలు విషయంలో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఐకేపీ అడిషనల్ డీఆర్డీఓ బాలరాజు -
ఉపాధి లక్ష్యంగా..
రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగుల దరఖాస్తులుమంగపేట: నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు నిరుద్యోగులకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆయా యూనిట్ విలువను బట్టి 100నుంచి 70శాత సబ్సిడీ మంజూరును ప్రకటించింది. దీంతో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్లకు దరఖాస్తులు వెల్లువలా చేసుకుంటున్నారు. తొలుత మార్చి 31వ తేదీ వరకు చివరి గడువు ప్రభుత్వం విధించింది. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ వరకు గడువు పొడిగించింది. మీ సేవ కేంద్రాలకు బారులు జిల్లాలోని 10మండలాల్లో మీ సేవ కేంద్రాలకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు కోసం నిరుద్యోగులు బారులు తీరుతున్నారు. వందల సంఖ్యలో నిరుద్యోగులు వస్తుండడంతో సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా సర్టిఫికెట్లు పొందిన నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకం పొందేందుకు ఆన్లైన్ చేసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. భారీగా నిరుద్యోగులు వస్తుండడంతో రూ.100 నుంచి 150వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఇలా.. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 14వరకు పెంపు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
వాజేడు/వెంకటాపురం(కె): ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. వాజేడు మండల కేంద్రంలోని రేషన్ దుకాణంలో గురువారం ఆయన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే హాస్టళ్లలోని విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని తెలిపారు. రేషన్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ సన్నబియ్యం అందుతాయని తెలిపారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వివరించారు. యువవికాసం పేరుతో నిరుద్యోగులకు సైతం అండగా నిలుస్తుందని తదితర వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూగూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మూతపడిన శివాలయాన్ని సందర్శించారు. గుడి పున ప్రారంభానికి తగిన సహకారం అందించాలని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అలాగే స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటి నిర్మాణానికి రూ.8లక్షలతో నిర్మాణం చేస్తున్నట్లు ఎంపీడీఓ విజయం తెలిపారు. అలాగే సుందరయ్య కాలనీకి చెందిన అల్లి సాయిప్రకాశ్ హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా వెంకటాపురం(కె)మండల పరిధిలోని చిరుతపల్లి గ్రామంలో బాండ్ మొక్కజొన్న సాగు చేసి పంట నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ బెస్తగూడెం గ్రామ శివారులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ -
అకాల వర్షం.. ఆగమాగం
వెంకటాపురం(కె):మరికాలలో గోదావరిలో ఆరబోసిన మిర్చిపై టార్పాలిన్ కప్పుతున్న రైతులు వెంకటాపురం(కె)/వాజేడు/కన్నాయిగూడెం: జిల్లాలో గురువారం సాయంత్రం పలుచోట్ల గాలిదుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు ఆగమాగం అయ్యారు. వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలో కలాల్లో ఆరబోసిన పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పారు. మరికొంతమంది మిర్చిని రాశులుగా పోసి టార్పాలిన్లు కప్పారు. అలాగే పలుచోట్ల కోతకు దశకు చేరుకుంటున్న వరి పంట సైతం నేలవాలింది. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని వాజేడు తహసీల్దార్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సైతం తగ్గే అవకాశం ఉందని వివరించారు.కన్నాయిగూడెంలో.. -
ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలి
ఏటూరునాగారం: విద్యార్థులకు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థుల ఆరోగ్య, స్వస్థతలో భాగంగా ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ సంయుక్తంగా పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. భవిష్యత్ సమాజానికి విలువలతో కూడిన విద్యార్థులను అందించాలని సూచించారు. ఈ శిక్షణలో పోషణ, వ్యక్తిగత, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, లింగ సమానత్వం, మానసిక ఆరోగ్య, హింస, కౌమార దశలో వచ్చే మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పై విషయాలపై ఉపాధ్యాయులకు సమగ్రంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలత, నవీన్, వెంకటేష్, తదితర మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
టార్గెట్.. 2.50 లక్షల మంది
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : వరంగల్ వేదికగా ఈ నెల 27న బీఆర్ఎస్ మరోసారి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించేందుకు బుధవారం అంకురార్పణ జరిగింది. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభా పర్యవేక్షకులు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు తదితరులు భూమి పూజ చేశారు. అంతకుముందు మంగళవారం ఎర్రవెల్లిలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన అధినేత కేసీఆర్.. సభావేదిక, జనసమీకరణ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. 10 లక్షల మందికితో బహిరంగసభ నిర్వహించాలని, దీనికి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలని టార్గెట్ పెట్టారు. జనసమీకరణకు ఇన్‌చార్జ్‌ల నియామకం.. కేసీఆర్ ఆదేశాలతో 2.50 లక్షల మంది జనసమీకరణకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు అధినేత.. సభ ఏ ర్పాట్లు, జన సమీకరణకు సంబంధించి ముఖ్యనేతలకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. పాలకుర్తి, వర్ధన్నపేటకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా వ్యవహరించనుండగా.. వరంగల్ పశ్చిమను మాజీ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌కు అప్పగించారు. వరంగల్ తూర్పును నన్నపునేని నరేందర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి, భూపాలపల్లిని గండ్ర వెంకటరమణారెడ్డికి, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలకు పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. అదేవిధంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చూడనుండగా, పరకాలను చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్‌ను సత్యవతి రాథోడ్, శంకర్‌నాయక్, డోర్నకల్‌ను రెడ్యానాయక్, మాలోత్ కవితకు అప్పగించారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర బాధ్యతలు నిర్వహించే హైదరాబాద్‌కు చెందిన పార్టీ రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు వరంగల్ నగరంలోనే మకాం వేయనున్నారు. నేటి నుంచి మరింత వేగంగా పనులు.. సభకు మరో 24 రోజులే గడువు ఉండటంతో గురువారం నుంచి సభా కోసం చేపట్టే పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు బహిరంగసభకు సిద్ధం చేసిన 1,213 ఎకరాల స్థలంలో.. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉంటుందని, పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించినట్లు వెల్లడించిన బీఆర్ఎస్ నేతలు, మరో మూడు, నాలుగు వందల ఎకరాలు కూడా సేకరించనున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి జన సమీకరణ జన సమీకరణకు ఇన్చార్జులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే కేసీఆర్‌తో భేటీ అయిన ముఖ్య నేతలు -
ప్రజలకు పాలనా సౌలభ్యం కల్పించాలి
పోరాటానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మల్లంపల్లి మండలం ఏర్పాటు చేయడం సంతోషకరం. నూతన మండల కేంద్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని సకాలంలో భవనాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేస్తారని భావిస్తున్నాం. ములుగు జిల్లా కేంద్రం నుంచి పాలనను కొనసాగించడం ఇబ్బందిగా ఉంది. ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, మండల పరిషత్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. – గోల్కొండ రాజు, మండల సాధన సమితి అధ్యక్షుడు● -
అర్హులందరికీ సన్నబియ్యం
ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి/గోవిందరావుపేట/వెంకటాపురం(ఎం): రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లాలోని ములుగు, మల్లంపల్లి, ఎస్ఎస్ తాడ్వాయి, వెంకటాపురం(ఎం) మండల కేంద్రాల్లో, గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా, చల్వాయిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించి మాట్లాడారు. పేదలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. సన్నరకం ధాన్యం క్వింటాకు బోనస్‌గా రూ.500 చొప్పున రైతులకు అందించినట్లు వివరించారు. సన్నాలకు బోసస్ అందిస్తున్నా ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లాకేంద్రంలో తోపుకుంటను ఆహ్లాదకర ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలో ఒక్క రైతుకు కూడా బోనస్ డబ్బులు బాకీ లేమని వివరించారు. గత పాలకులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఒక వైపు అప్పులకు వడ్డీలు కడుతూనే మరో వైపు ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇప్పటికే మహిళా గ్రూప్‌లకు ఇచ్చిన హామీ మేరకు వడ్డీ రూపాయలను బ్యాంక్‌లలో జమ చేసినట్లు వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులకు ఆయా మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్హులకు సన్నబియ్యం పంపిణీ చేయడమే కాకుండా గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం పథకానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ డీలర్లు ఎవరైనా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి ఫైసల్ హుస్సేని, తహసీల్దార్ విజయభాస్కర్ పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి మహనీయుల పోరాటం పీడిత ప్రజల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన మహనీయుల సేవలను మరచిపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్లో బుధవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్ధార్ సర్వాయి పాపన్న 315వ వర్థంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. అదే విధంగా మల్లంపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ కై లాస్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జైబాపు–జైభీం–జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయుల సేవలు మరిచిపోవద్దు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
పోక్సో కేసు నమోదు
వెంకటాపురం(కె): మండల పరిఽధిలోని బెస్తగూడెం గ్రామ శివారులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బెస్తగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వద్దకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలు పనికోసం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గతనెల 31మంచినీటిని తెచ్చుకునేందుకు బాలిక బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రాజశేఖర్ (బీజేపీ మండల అధ్యక్షుడు) తన ద్విచక్రవాహనంపై రైతు ఇంటికి తీసుకెళ్తానని చెప్పి బాలికను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్తున్నాడు. గమనించిన బాలిక బైక్‌పై నుంచి దూకి రైతు ఇంటికి చేరుకుంది. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.హైస్కూల్ ఎదుట క్షుద్ర పూజలువెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల ఎదుట ముగ్గు వేసి పసుపు, కుంకుమ పెట్టి నిమ్మకాయలు, ఎండు మిర్చి పెట్టారు. బుధవారం పదో తరగతి సాంఘీకశాస్త్రం పరీక్ష ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంకటాపురం ఎస్సై సతీష్ సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గును చెరిపివేశారు. మూఢ నమ్మకాలను నమ్మవద్దని ఎస్సై పిలుపునిచ్చారు.భూముల అమ్మకాల నిర్ణయం విరమించుకోవాలిములుగు రూరల్: హెచ్‌సీయూ భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ప్రజా సంఘాల భవన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.యూనివర్సిటీలో ధర్నా నిర్వహించకూడదని ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకూడదని హెచ్చరించారు. అదే విధంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన భూమి ని అమ్మాలనుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ, గణేశ్, వీరబాబు, కృష్ణబాబు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా గడపాలిభూపాలపల్లి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి, విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై పోరిక లాల్ సింగ్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ సత్కరించి, కానుక అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి రిమార్కులు లేకుండా సర్వీసును పూర్తి చేసి పదవీ విరమణ పొందడం అభినందనీయం అన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ప్రజలకు సేవలు అందించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1987వ సంవత్సరంలో లాల్ సింగ్ పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలోకి అడుగుపెట్టి దాదాపు 38 సంవత్సరాలపాటు సేవలు అందించారని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయమని కొనియాడారు.డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూకేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ (అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ తీరును కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, ఆ కాలేజీ పరీక్షల నియంత్రణాధికారి సుధీర్ అధ్యాపకుడు సాయిచరణ్ పరిశీలించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు కొన సాగాయి. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
గోవిందరావుపేట: వైద్యం కోసం వచ్చే రోగులను ఆప్యాయతతో పలకరించి మెరుగైన వైద్య సేవలను అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్ రావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీ, దుంపెల్లిగూడెం ఉప కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ కోల్డ్ పాయింట్, వ్యాక్సిన్ నిల్వలు, టెంపరేచర్ రిజిస్టర్, ఐస్ ఫ్యాక్స్, వ్యాక్సిన్ వీవీఎంను పరిశీలించారు. డ్యూలిస్ట్ ప్రకారము వ్యాక్సిన్‌ను ఉప కేంద్రాలకు పంపిణీ చేయాలని ఫార్మసిస్ట్‌లకు తెలిపారు. అనంతరం మండల వైద్యాధికారి చంద్రకాంత్, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు సమయానుగుణంగా ఇవ్వాలన్నారు. టీకాలు ఇచ్చే కేంద్రం వివరాలను ఒకరోజు ముందుగానే ఆశ కార్యకర్తలు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఉపాధిహామీ పనులు జరుగుతున్న వివరాలను తెలుసుకుని కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి చంద్రకాంత్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో గొడవ
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేసుకున్న ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో రెండు వర్గాల మధ్య గొడవ మరింత ముదిరింది. తాజాగా బుధవారం ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన లారీలను ఎరువుల బస్తాలను అన్లోడ్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా ఎత్తుగడ్డ ఎఫ్‌సీఐ గోదాం ప్రాంతంలో అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన గీసుకొండ ఎస్సై ప్రశాంత్‌బాబు అక్కడికి చేరుకుని సమస్యలు ఉంటే మామునూరు ఏసీపీ వద్ద మాట్లాడుకోవాలని వారికి నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్ క్లియర్ అయినా సాయంత్రం వరకు వైరి వర్గం వారు లారీల్లోని బస్తాలను అన్లోడ్ చేయకుండా అడ్డుకున్నారు. గతంలో లారీ ఓనర్స్ అసోసియేషన్‌ను ఏనుమాముల ప్రాంతంలో నిర్వహించేవారు. కొన్ని సంవత్సరాల క్రితం కొత్త బీట్‌బజార్ పక్కన ఏర్పాటు చేసుకున్నారు. అసోసియేషన్‌లో ఓ వర్గం వారు ఏళ్లుగా పెత్తనం చెలాయిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, లారీల కిరాయి ద్వారా వచ్చిన రూ.కోటికి పైగా డబ్బు లెక్కలు చూపించడం లేదని అడిగితే అసోసియేషన్ ఎన్నికల తర్వాత లెక్కలు చూపిస్తామంటూ దాట వేస్తూ బెదిరిస్తున్నారని మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ వర్గం వారు పోలీసు అధికారులతో మాట్లాడేందుకు వెళ్తే, మరో వర్గం వారు తమకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లోడ్ లారీలను వెళ్లనీయకుండా అడ్డుకున్న ఓ వర్గం అసోసియేషన్ లెక్కలు చూపించాలంటున్న మరో వర్గం -
వన్యప్రాణులకు నీటి వసతి
అభయారణ్యంలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ చర్యలు ● ప్రత్యేక సాసర్ పీట్స్, నీటి కులాయిల నిర్మాణం ● దట్టమైన అడవిలో 100సోలార్ బోర్లుఏటూరునాగారం: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో అడవిలోని వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటాయి. వాటి దాహాన్ని తీర్చి సంరక్షించేందుకు అటవీశాఖ అధికారులు అభయారణ్యంలో నీటి వసతికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అభయారణ్యంలో నెమళ్లు, కోతులు, కొండెంగలు, అడవి దున్నలు, దుప్పులు, జింకలు, గుడ్డేలుగులు వంటి జంతువులు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. వాటి ఆవాసాలను ప్రత్యేకంగా గుర్తించిన అటవీశాఖ అధికారులు వాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. -
గ్రూప్–1 ఫలితాల్లో మేఘనకు 22వ ర్యాంక్
ములుగు: జిల్లా కేంద్రంలోని ప్రేమనగర్‌కు చెందిన శీలం రఘువీర్–శ్రీదేవిల కుమార్తె మేఘన గ్రూప్–1 ఫలితాల్లో స్టేట్ 22వ ర్యాంక్, జోనల్లో 12వ ర్యాంక్ సాధించింది. ఎంతో కష్టపడి తన కూతురు గ్రూప్–1లో మంచి ర్యాంక్ సాధించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానికులు మంగళవారం మేఘనను అభినందించారు.‘ప్రజా పంపిణీ బియ్యం అందించేది కేంద్రమే’ములుగు రూరల్: రాష్ట్ర ప్రజలకు ప్రజా పంపిణీ బియ్యం ఒక్కొక్కరికి 5 కేజీలు అందించేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2014నుంచి ఉచిత బియ్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని ఇక్కడి నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రతీ ఏడాది రూ.10వేల కోట్లు వెచ్చించి ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వ వాటాయే ఎక్కువగా ఉందని బలరాం వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, నాయకులు భూక్య జవహర్లాల్, రాజ్‌కుమార్, లవన్‌కుమార్, కుమారస్వామి, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.బెట్టింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలిభూపాలపల్లి: అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లు, ఐపీఎల్ బెట్టింగ్‌లకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే భ్రమలో యువత, ప్రజలు, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్, గేమింగ్ కట్టడికి జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్‌ల డౌన్లోడ్ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం, అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. -
రవాణాకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో..
ఎస్ఎస్ తాడ్వాయి మండలం జనగలంచ వద్ద సోలార్ ప్యానెల్, బోరును అమర్చుతున్న సిబ్బందిరవాణాకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో సోలార్ బోర్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దట్టమైన అడవిలో నీటి బోర్లను దింపి సోలార్ పంపుసెట్లు అమర్చి మోటార్లకు సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో మోటార్లతో నీటిని ఎత్తిపోయించి పక్కనే ఉన్న కుంటలను నింపుతున్నారు. వాగుల ద్వారా నీరు దిగువకు పోకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించి నీటిని నిల్వ చేస్తున్నారు. దీనివల్ల విద్యుత్ బారం, ట్యాంక్‌ల ద్వారా నీటిని తరలించే ఇబ్బంది లేకుండా సజావుగా వన్యప్రాణులకు నీరు అందే అవకాశాలున్నాయి. ఏటూరునాగారం, ఎస్ఎస్ తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం, గోవిందరావుపేట, వాజేడు మండలం దూలాపురం ప్రాంతాల్లో సుమారుగా 100 సోలార్ బోర్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. అదే విధంగా బీట్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, బేస్‌క్యాంపు సిబ్బంది ప్రతిరోజూ ఫారెస్ట్ వాచ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. -
సన్నబియ్యం పంపిణీ
ములుగు/ఏటూరునాగారం: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మంగళవారం నుంచి జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు సన్న బిఇయ్యం పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో డీలర్ సర్వర్ లెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యాన్ని అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నబియ్యం పంపిణీ చేయడంపై రేషన్‌కార్డు లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి జీసీసీ సేల్స్ డిపోలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తరలివచ్చి బియ్యం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ సేల్స్ మేనేజర్ సుధీర్, నాయకులు వినయ్, రవి, ఠాగూర్, మౌలానా పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని షాపు నంబర్ 14లో సన్న బియ్యాన్ని డీలర్ సుమనశ్రీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. -
● రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్‌రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు. -
ఉత్పత్తిలో వెనుకంజ
భూపాలపల్లి అర్బన్: గడిచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో భూపాలపల్లి ఏరియా కాకతీయ గనుల్లో సింగరేణి యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించకుండా వెనుకంజలో ఉంది. 49.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 37.02లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేసి 75శాతంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 46.54 లక్షల ఉత్పత్తి లక్ష్యంగా టార్గెట్ విధించారు. గతేడాది కంటే సుమారు 3లక్షల టన్నుల టార్గెట్‌ను తగ్గించారు. భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులు, రెండు ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. ఈ ఏడాది మిగిలిన 12,57,708 లక్షల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయలేకపోయారు. ఈ మేరకు ఇప్పటినుంచి నిర్ధేశించిన ఉత్పత్తిని సాధించేందుకు అధికారులు ఏరియాలోని ప్రతి గనికి నెలలు, రోజు వారీగా విభజించి కేటాయించారు. వెలికితీసిన బొగ్గు ఉత్పత్తిలో 33.66లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశారు. లక్ష్యానికి దూరంగా ఓసీ–3 భూపాలపల్లి ఏరియాలో నాలుగు భూగర్భ గనులకు 9.60లక్షలు, రెండు ఓపెన్‌కాస్టులకు 40 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. వాటిలో భూగర్భ గనుల నుంచి 6,93,013, ఓపెన్‌కాస్ట్ 2–ప్రాజెక్ట్‌లో 15లక్షల టన్నుల టార్గెట్గాను 14,67,133, ఓసీ–3లో 25లక్షల టన్నులకు కేవలం 15,42,146 టన్నులు మాత్రమే సాధించి 62శాతంలో నిలిచింది. ఓపెన్‌కాస్టుల ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గును వెలికితీయాలనే ఉద్దేశం ఏర్పాటు చేశారు. ఓపెన్‌కాస్టు 3 ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా పూర్తిస్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయడం లేదు. భూగర్భ గనులతో సమానంగా ఓపెన్‌కాస్టులో కూడా ఉత్పత్తి తగ్గడంతో భూపాలపల్లి ఏరియా ఉత్పత్తిలో వెనుకబడింది. కారణాలెన్నో.. గనుల్లో ఉత్పత్తి తగ్గడానికి అధికారులు అనేక కారణాలు చూపిస్తున్నారు. భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉండటం, సర్ఫెస్ కార్మికుల సంఖ్య ఎక్కువగా పెరగడం కారణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఽఅధికంగా వర్షాలు కురవడంతో ఓపెన్‌కాస్టుల్లో రోజుల తరబడి ఉత్పత్తిని నిలిచిపోయింది. దీంతో ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 75 శాతం బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాదికి ఉత్పత్తి లక్ష్యం 46.53లక్షల టన్నుల బొగ్గు నష్టాల్లో భూపాలపల్లి ఏరియాఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు భూపాలపల్లి ఏరియాలో భూగర్భగనులు, ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యం నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాఽధించేందుకు ఇప్పటి నుంచే కావాల్సిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. -
భక్తిశ్రద్ధలతో ఈద్–ఉల్–ఫితర్
ములుగు: మత సామరస్యానికి ప్రతీక అయిన ఈద్–ఉల్–ఫితర్(రంజాన్) వేడుకలను జిల్లాలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని జామా మసీద్‌లో ఉదయం ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లిం సోదరులు అంతా పెట్రోల్ బంక్ సమీపంలోని ఈద్గాకు చేరుకుని అల్లాహ్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేసి పితృదేవతలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక సందేశం ఇచ్చారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ క్రమంలో పలువురు నిరుపేదలకు ముస్లింలు తోచిన సాయం అందించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్, ఎస్సై లక్ష్మారెడ్డిలు ముస్లిం సోదరులతో అలయ్ బలయ్ చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ కుత్బొద్ధీన్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ● ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు ● జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు -
వనదేవతలను దర్శించుకున్న అధికారులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను నిజామాబాద్ సెంట్రల్ జైలు ఎస్పీ కూన ఆనందరావు, రాష్ట్ర సెక్రెటియేట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పుట్ట దేవిదాస్‌లు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, రమేష్‌లు డోలు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని అమ్మవార్ల పట్టువస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. వారి వెంట నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకుడు కూన శివరాం, ఎస్ఎస్ తాడ్వాయి మండల అధ్యక్షుడు గుండ్ల రాజు, మండల యూత్ అధ్యక్షుడు కోడి సతీష్ పాల్గొన్నారు. -
4వేల మంది క్రమబద్ధీకరణకు అనాసక్తి
2020లో దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారుగా 4వేల మంది ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మార్చి 31వ తేదీ వరకు చెల్లించే వారికి 25శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినా ప్రజలు ముందుకురాలేదు. ఇదిలా ఉండగా గతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మిగతా వారికి అమ్ముకోవడం, కొంత మంది ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా అనుమతులు తీసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా అధికారుల సర్వేలో తేలింది. ఇంకొంత మంది గడువు తేదీని పెంచడంతో పాటు ప్రభుత్వం మరికొంత రాయితీ శాతాన్ని పెంచి మరో అవకాశం కల్పిస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. -
ఉద్యోగికి ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా ఇంజనీర్ పి.రామకృష్ణారెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ పొందగా ఏరియా అధికారులు ఘనంగా సన్మానించారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, భిక్షమయ్య, రవికుమార్, ప్రసాద్, మారుతి పాల్గొన్నారు. 8వ గనిలో.. ఏరియాలోని కేటీకే 8వ గనిలో విధులు నిర్వరిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరెల్లి లాలయ్యను గని మేనేజర్ భానుప్రసాద్, గని అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. బొగ్గు ఉత్పత్తికి లాలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోని కార్మికులు పని చేయాలని భానుప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అధికారి సాయికృష్ణ, కార్మిక సంఘాల నాయకులు శంకర్, సమ్మయ్య, విజేందర్, రాజేష్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 ర్యాంకర్‌కు ఏఎస్పీ సన్మానం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌కుమార్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో 105వ ర్యాంకు సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తన కార్యాలయంలో సోమవారం ప్రవీణ్‌ను ఘనంగా సన్మానించారు. ఉన్నత పదవుల్లో చేరి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రవీణ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రవీణ్‌కుమార్ నిరూపించాడని గ్రామస్తులు, ప్రజలు అభినందించారు. -
ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే!
5,022 ప్లాట్లకు 1,020మంది మాత్రమే రుసుం చెల్లింపు ములుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు జిల్లాలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారి నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ములుగు, మల్లంపల్లి, జంగాలపల్లి, ఇంచర్ల, వెంకటాపురం(ఎం), పస్రా, జాకారం, ప్రేమ్‌నగర్, మదనపల్లి, బండారుపల్లి, జీవంతరావుపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లను తీసి విక్రయించారు. భవిష్యత్‌లో ప్లాట్లు, ఇంటి నిర్మాణం, డీటీసీపీ అనుమతుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు రూ.వెయ్యి చొప్పున దరఖాస్తు రుసుము సేకరించగా జిల్లా తరఫున 2020లో మొత్తం 5,022 ప్లాట్ల కోసం ఫీజులు చెల్లించారు. 1,020 మంది మాత్రమే రుసుము చెల్లింపు తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 1వ తేదీ నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల తరఫున మూడంచెల్లో సర్వే చేయించింది. అధికారులు ఎల్1, ఎల్2, ఎల్3 దరఖాస్తుల ఆధారంగా సదరు ప్లాట్ల యజమానులతో కలిసి ఫిజికల్ సర్వే చేశారు. వివరాలను సంబంధిత ఆన్లైన్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు వచ్చిన 5,022 దరఖాస్తుల్లో కేవలం 1,020 మంది మాత్రమే ఆన్లైన్ రుసుము చెల్లించారు. ప్రాంతాల వారీగా ఉన్న భూమి విలువల ఆధారంగా ప్రజలు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయం సోమవారం సాయంత్రం వరకు రూ. 2.7కోట్లుగా తేలింది. సోమవారం రాత్రి వరకు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.గ్రామాల వారీగా అవగాహన కల్పించాం.. ఎల్ఆర్ఎస్పై మండలాల వారీగా అవగాహన కల్పించాం. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ వరకు రుసుము చెల్లిస్తే 25శాతం రాయితీ ఉంటుందని ప్లెక్సీలు ఏర్పాటు చేశాం. అధికారుల తరఫున అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాం. సోమవారం వరకు 1,020 మంది ఆన్లైన్ ద్వారా ప్రాంతాల వారీగా జనరేట్ అయిన రుసుమును చెల్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. – సంపత్‌రావు, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)● సోమవారం సాయంత్రం వరకు రూ.2.7కోట్ల ఆదాయం రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం క్రమబద్ధీకరణకు ముందుకు రాని యజమానులు -
నిరుపయోగంగా శానిటేషన్ వాహనం
పరకాల : లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన శానిటేషన్ వాహనం మర మరమ్మతుకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.85 లక్షలతో కొనుగోలు చేసిన వాహనం మూడు నెలల క్రితం రిపేరుకు వచ్చింది. మున్సిపల్ వద్ద ఎలాంటి నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేయించలేదు. దీంతో ప్రధాన రహదారులపై చెత్త, చెదారం పేరుకపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్లపై పేరుకపోయిన దుమ్ము వాహనదారుల కళ్లలో పడుతూ తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు మున్సిపల్ శానిటేషన్ వాహనానికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. -
జాతరను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: ములుగు జిల్లాలోని రామంజపురంలో త్వరలో నిర్వహించనున్న నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాలని ఆదివాసీ ఎరుకల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కేతిరి సుభాష్, ఉపాధ్యక్షుడు దుగ్యాల రాములు అన్నారు. మహదేవపూర్ మండలంలో ఎరుకల ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతరకు ఎరుకలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎరుకల నాయకులు సుల్తాన్ సుధాకర్, సుల్తాన్ సారయ్య, శ్రీరామ రమేష్, సుల్తాన్ లడ్డు, దుద్యాల పోషం, సుల్తాన్ తిరుపతి, సుల్తాన్ పున్నం, సుల్తాన్ ప్రభాకర్, కేతుర్ రాకేష్‌లు పాల్గొన్నారు. -
నష్టాల్లో మిర్చి రైతులు
వెంకటాపురం(కె): మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో ఈ సంవత్సరం ఆశించిన మేర దిగుబడి రాలేదు. దినికి తోడు మద్దతు ధర లేక పోవటంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ఈ సంవత్సరం దాదాపు రెండు వేల ఎకరాల్లో మిర్చి పంటను రైతులు సాగు చేశారు. గత సంవత్సరం మిర్చి పంటకు క్వింటాకు రూ.22 వేల వరకు ధర ఉండడంతో ఈ సారి మిర్చి సాగు విస్థీర్ణం పెరిగింది. తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధర లేక పోవంటతో రైతుల్లో ఆందోళన నెలకోంది. సాగు సమయంలో క్వింటా మిర్చి ధర రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ధర పలకడంతో రైతులు మురిసిపోయారు. దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మార్కెట్లో రూ.12 వేల వరకు పలుకుంతోంది. దీంతో స్థానిక వ్యాపారులు రూ.9 వేల నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన వ్యయం మిర్చి పంట కాతకు వచ్చే సమయానికి తెగుళ్లు ఆశించడంతో పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. సంబంధిత శాఖ అధికారులు రైతులకు పంటల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించక పోవడంతో రైతులు పురుగు మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగి పోయింది. దుక్కి దున్నడం, ఎరువులు, పైమందులు, తదితర పనులకు ఎకరానికి సుమారు రూ.లక్ష యాభై వేల వరకు పెట్టుబడి అయిందని రైతులు తెలుపుతున్నారు. మిర్చి కోతల సమయంలో కూలీలు దొరకడం లేదని వస్తున్న కూలీలకు రూ.400 చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. మిర్చి ధర పెరిగితేనే పెట్టిన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కరువు స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. మార్కెట్ సౌకర్యం 140 కిలో మీటర్ల దూరంలో ఉన్న వరంగల్ మార్కెట్‌కు లేదా 230 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం మార్కెట్‌కు లేదా ఆంధ్రలో ఉన్న గుంటూరు మార్కెట్‌కు రైతులు తమ మిర్చి పంటను తరలించి విక్రయాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు ప్రస్తుతం ఉన్న మిర్చి రేటుకు అంత దూరం మిర్చి పంటను తరలించలేక స్థానికంగా తక్కువ ధరకు దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్ట పోతున్నారు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.పెట్టుబడి పెరిగింది..నేను ఆరు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. ఈ సంవత్సరం మిర్చి పంటకు తెగుళ్లు సోకడంతో ఎక్కువ మొత్తంలో మందలు కొట్టాల్సి వచ్చింది. దీంతో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. అలాగే మిర్చి కోతకు కూలీలకు గతంలో రూ.300లు ఉండగా ప్రస్తుతం రూ.400 చెల్లించాల్సి వస్తోంది. దినికి తోడు మిర్చి ధర లేక తగ్గడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కొప్పుల కృష్ణ, రైతు కూలీలు దొరకడం లేదు..నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి సాగు చేస్తే పంట చేతికి అందే సమయంలో కూలీలు దొరకడం లేదు. దీంతో కూలీల రేట్లు పెరిగిపోయాయి. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని అనిపిస్తుంది. – కోటేశ్వర్రావు, రైతు తెగుళ్లతో పెరిగిన పెట్టుబడి, తగ్గిన దిగుబడి మద్దతు ధర లేక రైతుల విలవిల -
వైభవంగా ఉగాది వేడుకలు
ములుగు రూరల్: మండల వ్యాప్తంగా ఉగాది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని కుటుంబసమేతంగా పండుగ చేసుకున్నారు. ఆలయాల్లో వేదపండితులు నూతన సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నాయకులు ఉగాది వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బలరాం ఆధ్వర్యంలో శివాలయం పూజా రి శివాచార్యులు పంచాంగాన్ని చదివి వినిపించారు. వాజేడు: మండలంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవడంతో రద్దీ పెరిగింది. ఇళ్లల్లో పిండి వంటలను చేసుకోవడంతో పాటు సహపంక్తి భోజనాలను చేసి ఆనందంగా గడిపారు. ఐదురోజుల ఉగాది విశ్వకర్మలు ఐదురోజుల ఉగాది పండుగను మడి బట్టలతో ప్రారభించారు. ఉదయం నాలుగు గంటల నుంచే పండుగ సంబరాలను చేపట్టారు. ఇంట్లో పెరుమాల్‌లు(పందిరి)ని కంక పుల్లలతో వేసి, మోదుగ పూలు, మామిడాకు తోరనాలను కట్టారు. తమ కుల వృత్తికి సంబంధించిన పని ముట్లను పూజలో ఉంచారు. ఏటూరునాగారం: మండలంలోని ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పాల్గొని పూజలు చేశారు. వెంకటాపురం(కె): మండలంలో ఉగాదిని మండల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా కొందరు రైతులు ఏరువాక సాగారు. ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉగాది పచ్చడ తయారు చేశారు. సాయంత్రం మండల కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయంలో పండితులు పంచాంగ శ్రవణం చేశారు. రేగొండ: మండలంలోని పలు గ్రామాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా మండల ప్రజలు ఉగాది పచ్చడితో పాటు బక్షాలు చేసుకుని పండుగను ప్రత్యేకంగా చేసుకున్నారు. అలాగే పురోహితులచే శ్రవణ పంచాంగాన్ని విన్నారు. కోటంచలో.. మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో అర్చకులు బుచ్చమచార్యులు, శ్రీనాధచార్యులు భక్తులకు శ్రవణ పంచాంగాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, ఆలయ సిబ్బంది రవిందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మల్హర్: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారు జామునే లేచి సాన్నాలు ఆచరించి, పూజలు నిర్వహించారు. తాడిచర్ల స్థానిక వెంకటేశ్వర ఆలయం, పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. కుటుంబ సభ్యులందరూ కలసి ఆరు రుచులతో కలిగిన ఉగాది పచ్చడి సేవించి శుభాక్షాంక్షలు తెలుపుకున్నారు. సాయంత్రం సమయంలో వెంకటేశ్వర ఆలయ పూజారి పంచాంగ శ్రవణం గావించారు. మొగుళ్లపల్లి/టేకుమట్ల: మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో ఉగాది నూతన పంచాంగాన్ని పురోహితులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలతో పాటు, నాయకులు పాల్గొన్నారు. చిట్యాల: మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఉగాది పచ్చడి చేసి తాగారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పాడిపంటలు పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర లక్ష్మన్ నాయకులు గుర్రపు తిరుపతి గౌడ్, దర్శనం, ఉయ్యాల రమేశ్, పెరుమాండ్ల రవీందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో విశ్రాంత ఉద్యోగుల సంఘం మండలశాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు మాట్లాడుతూ.. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి అమృత పానియం లాంటిదని, ఆరోగ్యానికి మేలు చేస్తుందనే నమ్మకంతో ఉగాది పచ్చడి సేవిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు ఆరెందల అంకన్న,శంకర్ సింగ్,విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. -
మతసామరస్యానికి ప్రతీక రంజాన్
రేగొండ: మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని భాగిర్థిపేట మజీద్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని మతాలు ఒకటేనని ప్రజలంతా సోదర భావంతో ఉండాలన్నారు. మజీద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాయినేని సంపత్‌రావు, పున్నం రవి, పట్టెం శంకర్, షాబీర్ అలీ, మైస భిక్షపతి, క్రాంతి, ముదురుకొల్ల తరుణ్, పున్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని జామా మసీదులో కాంగ్రెస్‌పార్టీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు లేతకరి రాజబాపు ఆధ్వర్యంలో ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. అంతకు ముందు ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మతపెద్దలను శాలువాలతో సన్మానించారు. సమద్, షేక్ జానీ, ఇక్భాల్, మక్సూద్,అమీన్, శకీల్లతో పాటు నాయకులు పవన్‌శర్మ, మంగాయి లక్ష్మణ్, శంకరయ్య, ఫరీద్, హైదర్, అరుణ్, సంతోష్, సంతు, రాజబాపు,నగేష్, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు -
చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
టేకుమట్ల: ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పా టు చేయడం అభినందనీయమని ఎస్సై దాసరి సు ధాకర్ అన్నారు. మండలంలోని గర్మిళ్లపల్లిలో ర మేశ్ వైండింగ్వర్క్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా దాసారపు రమేశ్ చలివేద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సై దాసరి సుధాకర్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. చలివేద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లబెల్లి రవీందర్, మాజీ ఎంపీటీసీ లచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్సై దాసరి సుధాకర్ -
డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు!
రేగొండ: తహసీల్దార్ కార్యాలయాల్లో డబ్బులిస్తేనే కులం ఆదాయం సర్టిఫికెట్లు వస్తున్నాయని మండలంలోని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేస్తామని ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం తాజాగా పొందాలనే నిబంధనతో ఆశావాహులు వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో మండల వ్యాప్తంగా మీసేవ కేంద్రాలన్ని కిటకిటలాడుతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల నుంచి ఆ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉండటంతో దరఖాస్తుదారులంతా తహసీల్దార్ కార్యాలయాలకు పరుగుపెడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాలల్లో సాధారణ సమయంలో రోజుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 50 వరకు దరఖాస్తులు అందేవని, ప్రస్తుతం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. కుప్పలు తెప్పలుగా అందుతున్న దరఖాస్తుల వివరాలను సంబంధిత వెబ్సైట్లో నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వివరాల నమోదులో జాప్యం అవుతుందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ‘రాజీవ్ యువ వికాసం’కి కులం, ఆదాయం అవసరం రెవెన్యూ కార్యాలయాల్లో పెరిగిన దరఖాస్తులు ఇదే అదనుగా దళారుల దోపిడీపలువురు అధికారులే దళారులుగా.. ప్రభుత్వ సాయం కోసం చేసే దరఖాస్తుకు రెవెన్యూ సర్టిఫికెట్లు అవసరముండటంతో ఇదే అదునుగా కొంత మంది అధికారులు దళారుల అవతారమెత్తుతున్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఇస్తామని చెబుతూ ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. చేసేది ఏమి లేక కొంతమంది వారు అడిగినంత ముట్ట చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఒక రోజులోనే సర్టిఫికెట్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. సర్వర్ బిజీ, నెట్ రావడం లేదంటూ రోజుల తరబడి వారి సర్టిఫికెట్లను పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి పలువురు అధికారులు చేపడుతున్న అవినీతిని కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజలను చైతన్యం చేయాలి
భూపాలపల్లి రూరల్: కవులు, కళాకారులు తమ నైపుణ్యంతో ప్రజలను చైతన్యం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని పుష్పగార్డెన్లో వివేకనంద సేవా సమితి వ్యవస్థాపకుడు కొల్గూరి సంజీవరావు అధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై కవులు, కళాకారులను పురస్కారాలతో సత్కరించారు. కవి సమ్మేళనం కార్యక్రమాలు భవిష్యత్‌లోనూ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ సంపత్‌రావు, హాస్యనటుడు ఆర్ఎస్ నందా తదితరులు పాల్గొన్నారు. ఉగాది శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ నుంచి ప్రభుత్వం రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషకరమన్నారు.కవి, కళాకారులను సత్కరించిన ఎమ్మెల్యే గండ్ర -
కల్యాణ మహోత్సవానికి పందిరి పూజ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయంలో వచ్చే నెల 6న శ్రీసీతారాముల కల్యాణం ఉండడంతో పచ్చని పందిరి ముహూర్త కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావు శర్మ, ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్ నిర్వహించారు. పాలకర్రకు కుంకుమ, పసుపుతో అలంకరించి కంకణాలను కట్టి కొబ్బరికాయలను కొట్టి కల్యాణ వేడుకల పందిళ్ల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో స్వామివారి కల్యాణ మహోత్సవం తిలకించేందుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు వేయనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. అనంతరం లగ్న పత్రికను రాసి సీతాదేవి, రాములవారి తరఫున కమిటీ సభ్యులు, గ్రామస్తులు నిలబడి లగ్న పత్రికను సంపద్రాయబద్ధంగా స్వీకరించారు. నూతన వస్త్రాలను కప్పుకొని శుభాకాంక్షలు తెలిపుకున్నారు. కల్యాణ మహోత్సవ వేడుకలను ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడదాసు శివ, పిట్టల శివ, గార మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
ములుగు
శుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025Iవసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి. చివరి తేదీ : 29–03–2025 -
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
ఏటూరునాగారం: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ తెలిపారు. మండల పరిధిలోని అభయారణ్య ప్రాంత సందర్శనలో భాగంగా గురువారం అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన వనదర్శిని కార్యక్రమానికి వరంగల్ జవహర్ నవోదయ విద్యార్థులు రాగా వారికి అడవుల సంరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణకు అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అడవుల్లో సంచరించే జంతువులకు వేసవిలో నీటి వసతికి అడవుల్లో అక్కడక్కడా నీటి సాసర్ బెడ్స్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. అడవులు అగ్నికి కాలిపోకుండా తీసుకుంటున్న చర్యలతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్ -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ములుగు: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెలలో నమోదైన కేసుల వివరాలపై పోలీస్ స్టేషన్ల వారీగా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలన్నారు. గొంగతనాలు, ఆర్థిక నేరాలలో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పొగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలన్నారు. పాత కేసుల దర్యాప్తులో పురోగతిని పరిశీలించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో సెలవులపై వెళ్లే సమయంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున సురక్షితమైన చర్యలు తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. యువత ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మోసపోకుండా స్టేషన్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదేశాల మేరకు డీఎస్పీ నర్సింగరావు ఆధ్వర్యంలో నియమ నిబంధనలపై వివరించారు. ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ రమేష్, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రం ఆదాయం రూ.6.67 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలోని హుండీల కానుకల లెక్కింపు ద్వారా రూ.6.67లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ తెలిపారు. హేమాచల క్షేత్రంలోని 8హుండీలను ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో గురువారం లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ప్రధాన ఆలయంతో పాటు వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 8హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.6,67,933ఆదాయం సమకూరినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, కై ంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, శేషు, లక్ష్మినారాయణ, సిబ్బంది, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం శ్రీవారి భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. -
కరపత్రాల ఆవిష్కరణ
ములుగు: 2025–2026 విద్యా సంవత్సరానికి గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశ కరపత్రాలను కలెక్టర్ దివాకర తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. గత విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యాపోటీ పరీక్షల్లో సాధించిన విజయాలతో రూపొందించిన కరపత్రాన్ని సైతం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, న్యాక్ కో ఆర్డినేటర్ కవిత, దోస్త్ కన్వీనర్ శంకర్, సభ్యురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు. రమేష్‌కు డాక్టరేట్ ములుగు రూరల్: ఉస్మానియా యూనివర్సిటీలో వృక్షశాస్త్రంలో ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన పోరిక రమేష్ డాక్టరేట్ సాధించారు. వృక్షశాస్త్ర విభాగంలో మాలిక్యలర్జెనిటిక్స్ అండ్ బయోటెక్నాలజీ లేబోరేటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో స్టడీస్ అన్ పైటోకెమికల్ ప్రొపైలింగ్ అండ్ దేర్ బయోలాజికల్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గిరియో క్యూనియాటా(విల్డ్) కెర్గావ్ల్ అంశంపై పరిశోధన సాగించారు. ఈ అంశంపై సమర్పించిన గ్రంధానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ అందుకున్నారు. రమేష్ డాక్టరేట్ సాధించడంతో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, తోటి పరిశోధకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌శాఖ ఏఈ రవి అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని బండారుపల్లిలో అధికలోడ్‌తో ఉన్న 63కేవీఏ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో 100కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను గురువారం బిగించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొలంబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ప్రమాదాలపై ఆయన మాట్లాడారు. కెపాసిటర్ బిగించడం వల్ల కలిగే లాభాలను, ఎలక్ట్రికల్ పరికరాల ఎర్తింగ్ పద్ధతులపై రైతులకు వివరించారు. వ్యవసాయ బావుల వద్ద అటోమెటిక్ స్టార్టర్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను, విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యత, ప్రామాణికతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వేణుగోపాల్, వెంకట్‌రెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వన్యప్రాణులను వేటాడిన వ్యక్తి అరెస్ట్ ములుగు రూరల్ : వన్యప్రాణులను వేటాడి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని ములుగు అటవీశాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ డోలి శంకర్.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన ధనసరి సాంబయ్య వన్యప్రాణి మాంసాన్ని విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు తనిఖీ చేయగా మాంసం లభించింది. అనంతరం విచారించగా పస్రా రేంజ్ పరిధిలోని బుస్సాపూర్ అటవీప్రాంతంలో ఉచ్చులు అమర్చగా సాంబార్ (కనుసు పిల్ల) పడడంతో తల , కాళ్లు అక్కడే కాల్చి తిన్నారు. చర్మం అక్కడే వదిలేసి మాంసం కన్నాయిగూడెం తీసుకొచ్చాడు. నిందితుడి సమాచారం మేరకు బస్సాపూర్ అటవీ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి మాంసం, చర్మంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. దాడుల్లో డీఆర్ఓ శోభన్, బీట్ ఆఫీసర్ చైతన్య, ఎఫ్బీఓ శ్యాంసుందర్, రూప్‌కుమార్, శివక్రిష్ణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎట్టకేలకు నీటి విడుదల
హసన్‌పర్తి/ధర్మసాగర్: దేవాదుల ప్రాజెక్ట్ మూడవ దశలో భాగంగా దేవన్నపేట వద్ద నిర్మించిన పంస్హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన మూడు మోటార్లలో ఒక మోటార్‌ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీఽనివాస్రెడ్డిలు ప్రారంభించారు. 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి వదిలారు. అరగంటపాటు వెయింటింగ్.. వారం రోజుల క్రితం ధర్మసాగర్ చెరువులోకి నీటిని విడుదల చేయడానికి వచ్చిన మంత్రులు మోటార్లలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఆన్ కాకపోవడంతో తిరిగి వెళ్లారు. రెండు రోజుల క్రితం ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో గేట్‌వాల్వ్‌లు పడిపోయాయి. ప్రత్యేక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. రెండోసారి గురువారం సాయంత్రం మోటార్లు ఆన్ చేయడానికి వచ్చినా... మళ్లీ సాంకేతిక సమస్య కారణంగా అరగంట పాటు వెయిట్ చేశారు. టెక్నీషియన్లు సమస్య పరిష్కరించిన తర్వాత మంత్రులు లాంఛనంగా మోటార్ ఆన్ చేశారు. పూజలు..సన్మానాలు మొదట దేవన్నపేటకు చేరుకున్న మంత్రులకు కలెక్టర్ ప్రావీణ్య, నాయకులు పూలబొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. వారు తొలుత శిలాఫలకాన్ని సందర్శించారు. అనంతరం పంప్‌హౌస్ వద్దకు చేరుకోగా, వారికి ఇంజనీర్లు నీటిపంపింగ్ విధానాన్ని కంప్యూటర్లో చూపించారు. నీరు ఎక్కడినుంచి ఎలా వెళ్తుందో వివరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి మూడో దశ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే నీరు రిజర్వాయర్‌లోకి వస్తుండగా పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేశారు. నీటిలోకి సారె వదిలారు. ఈ సందర్భంగా మంత్రులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాలువాలు కప్పి సన్మానించారు. అక్కడే మంత్రులు రెండు నిమిషా లు మాట్లాడి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, యశ్వసినిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, నగర కమిషనర్ అశ్వినీ తాజాజీ వాకడే, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్ నర్సింహారెడ్డి, ఈఎన్సీ అనిల్‌కుమార్, సీఈ అశోక్‌కుమార్, ఎస్ ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాంనాయక్, డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..దేవాదుల మూడో దశ మోటార్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధర్మసాగర్ రిజర్వాయర్‌లోకి 600 క్యూసెక్కులు దేవన్నపేట పంప్‌హౌజ్‌తో 5,22,522 ఎకరాలకు సాగు నీరు వరంగల్, కాజీపేట, హనుమకొండతోపాటు జనగామకు తాగునీరురెండు భాగాలుగా నీటి పంపిణీ – మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదుల పంప్‌హౌస్‌నుంచి వచ్చే నీటిని రెండు భాగాలుగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ కేంద్రంగా ప్రారంభించిన దేవన్నపేట పంప్‌హౌజ్‌తో 5,22,522 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 17,545 ఎకరాలకు ఉత్తర భాగం ప్రధాన కాలువ ద్వారా, అదే విధంగా దక్షిణభాగం కాలువ గుండా స్టేషన్ ఘన్పూర్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 1,58,948 ఎకరాలతోపాటు ధర్మసాగర్ తరువాత బొమ్మకూర్, తపాసుపల్లి, గండిరామా రం, అశ్వారావుపల్లి పరిధిలోని 3,46,029 ఎకరాలకు నీరు అందించనున్నట్లు వెల్లడించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు నగరాలతోపాటు జనగామ పట్టణానికి తాగునీరు అందించేందుకు దోహదపడుతుందన్నారు. -
సెర్ప్ లక్ష్యాల సాధనకు చర్యలు
ములుగు: సెర్ప్ సంస్థ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టుమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ సూచించారు. ఈ మేరకు సెర్ప్ సీఈఓ దివ్యతో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సంపత్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయనున్న ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 33శాతంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50శాతానికి పెంచేలా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. నూతన కేంద్రాల ఏర్పాటును సైతం స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే నడిచేలా చూడాలన్నారు. ఐకేపీ కేంద్రాలకు అవసరమైన తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామగ్రిని సకాలంలో అందించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల మహిళా సభ్యులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. కుటుంబంలో ఎవరైనా వృద్దాప్య పింఛన్ తీసుకుంటూ మృతిచెందితే జీవిత భాగస్వామి అర్హతను బట్టి పింఛన్ మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మల్లేశం, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, అడిషనల్ డీఆర్డీఓ బాలస్వామి, డీఈఓ పాణిని, ఏటూరునాగారం డీడీ పోచం, డీడబ్ల్యూఓ శిరీష, ఆర్ఎం డాక్టర్ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ -
భక్తుల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ కోసం డిజైన్ల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన స్టూడియో వన్ ఆర్కిటెక్చర్ల డిజైనర్ల బృందం గురువారం మేడారంలో పర్యటించింది. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనుల కోసం డిజైన్లను రూపొందించనున్నారు. 2026లో జరిగే మహాజాతర వరకు మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులపై డిజైన్లను రూపొందించనున్నారు. అభివృద్ధి పనుల ప్రాంతాల పరిశీలన మేడారానికి వచ్చిన డిజైనర్ల బృందం మేడారం ఈఓ రాజేంద్రంతో కలిసి సర్వే చేశారు. మేడారం జంపన్నవాగు పరిసర ప్రాంతాలు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, దేవాదాయశాఖకు కేటాయించిన స్థలాన్ని, అమ్మవార్ల గద్దెల ప్రాంగణం, మేడారం ఐలాండ్ ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులకు డిజైన్ రూపాందించేందుకు సర్వే చేశారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు ఎంత మంది భక్తులు హాజరువుతారనే తదితర అంశాలను దేవాదాయశాఖ అధికారులను డిజైనర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల సేకరణ మేడారంలో ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు కావాల్సిన అభివృద్ధి పనుల వివరాలను డిజైనర్లు దేవాదాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈఓ రాజేంద్రంతో పాటు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పనుల వివరాలను బృందానికి వివరించారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో కొబ్బరి కాయలు, బెల్లం నిల్వ చేసేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు, అమ్మవార్ల ఆలయ విస్తరణ, రెడ్డిగూడెం లోలెవల్ కాజ్వే నుంచి చిలకలగుట్ట వరకు జంపన్నవాగు స్నానఘట్టాల పొడవునా బ్యూటీఫికేషన్ పనులు చేయాలని తెలిపారు. అలాగే సత్రాల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ గదులు, అమ్మవార్ల గద్దెల చుట్టూ వాచ్ టవర్ల నిర్మాణం, సమ్మక్క ప్రధాన ద్వారం ఎదుట మండపం, పూజారులకు గదుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, దేవాదాయశాఖకు కేటాయించిన 28 ఎకరాల్లో శృతి వనం ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనుల వివరాలను బృందానికి వివరించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిజైనర్ల బృందం మేడారం అభివృద్ధి పనులపై డిజైన్లు రూపొందించి ప్రభుత్వానికి, దేవాదాయశాఖకు త్వరలో అందిస్తుందని ఈఓ రాజేంద్రం తెలిపారు. డిజైన్ల విడుదల అనంతరం నిధుల మంజూరు నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. మేడారంలో పర్యటించిన డిజైనర్ల బృందం అభివృద్ధి పనుల డిజైన్ రూపకల్పనకు సర్వే -
ఆశ వర్కర్ల నిర్బంధం సరికాదు
ములుగు రూరల్: ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలుదేరిన ఆశ వర్కర్లను ప్రభుత్వం నిర్బంధించడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆశ వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ఈ నెల 24వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఆశాలు వెళ్లకుండా నిర్బంధించారని తెలిపారు. హైదరాబాద్ చేరుకున్న కొందరిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. ఆశ వర్కర్లు బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం రూ.18 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, మంజూల, యశోద, రమ, పద్మ, కవిత, రజిత, స్వప్న, లక్ష్మీ, విజయ, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
పేరూరు పీహెచ్‌సీకి ఛత్తీస్‌గఢ్ మందులు
వాజేడు: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తాళ్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మండల పరిధిలోని పేరూరు పీహెచ్‌సీకి మలేరియా మందులను పంపిణీ చేశారు. వాజేడు మండలంలో మలేరియా జ్వరాల తీవ్రత లేకపోవడంతో మలేరియా మందులు రావడం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన కూలీలకు మలేరియా జ్వరాలు ఉంటుండటంతో వారికి వైద్యం అందించడానికి ఇబ్బందులు తలెత్తు తున్నాయి. పేరూరు వైద్యశాల పరిధిలో వలస కూలీలు సుమారుగా 5వేల మంది వరకు ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ వివరాలను అంతర్రాష్ట్ర ఆస్పత్రుల సమన్వయంలో భాగంగా పేరూరు హెచ్ఈఓ వేణుగోపాల కృష్ణ సరిహద్దున ఉన్న తాళ్లగూడెం ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి సత్యనారాయణకు సమస్యను వివరించగా ఆయన స్పందించి మందులను అందించారు. -
పతకాలు సాధించడం అభినందనీయం
భూపాలపల్లి రూరల్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ అంకితభావంతో సాధన చేస్తే సాధించలేదని ఏదీలేదన్నారు. క్రీడలతో పాటు విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలని కోరారు. అలాగే వీరికి స్విమ్మింగ్ నేర్పించిన కోచ్ పాక శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎం క్రాంతి కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, కోచ్ రాజమౌలి తదితరులు పాల్గొన్నారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలపగా జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అధికారులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్టూఓ జీఎం కవింద్ర, అధికారులు సురేఖ, శ్రావణ్ కుమార్, ఏరియా అధికార ప్రతినిధి కావూరి మారుతి తదితలరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లే ఫైనల్..!
సాక్షిప్రతినిధి, వరంగల్/ఎల్కతుర్తి : బీఆర్ఎస్ ఉద్యమాలకు సెంటిమెంట్‌గా భావించే ఓరుగల్లులోనే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభను నిర్వహించాలన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నాయకులు స్థల పరిశీలన చేశారు. మొదట గ్రేటర్ వరంగల్ పరిధిలోని హంటర్‌రోడ్డు, లేదా ఉనికిచర్లలో నిర్వహించాలని ఈ నెల 10న మాజీ మంత్రి, సభ ఇన్చార్జ్ టి.హరీశ్‌రావు స్థల పరిశీలన చేశారు. ఆ తర్వాత హసన్‌పర్తి మండలం దేవన్నపేట అయితే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉంటుందని భావించి అక్కడ కూడా పర్యటించారు. ఇదే సమయంలో ఈసారి సభను వరంగల్ కాకుండా హైదరాబాద్ శివారులో పెట్టాలన్న చర్చ పార్టీలో జరిగినట్లు ప్రచారం జరిగింది. వేసవి ఎండలు తీవ్రమయ్యే సమయంలో వరంగల్ కంటే హైదరాబాద్ శివారు ప్రాంతమైతే బాగుంటుందని భావించినట్లు సమాచారం. ఘటకేసర్లో సభావేదికను ఎంచుకున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, వొడితెల సతీష్‌కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హస్నాబాద్ నియోజకవర్గ పరిధి ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేశారు. ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు గోపాల్పూర్, మడిపల్లి, చింతలపల్లి శివార్లు.. ఎల్కతుర్తి – భీమదేవరపల్లి మధ్యన కుడి, ఎడమల స్థలాలను కూడా పరిశీలించారు. ఈ మేరకు రైతులనుంచి అంగీకారపత్రాలు కూడా తీసుకున్నారు. ఎల్కతుర్తి సభాస్థలిపై కేసీఆర్‌కు నివేదిక.. నేడో, రేపో నిర్ణయం.. సభావేదిక వివరాలను గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌కు అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. సుమారు 15లక్షల మంది వరకు హాజరయ్యే రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇదే విషయమై ఎల్కతుర్తి మండలంలో నిర్వహించేందుకు పరిశీలించిన రెండు, మూడు స్థలాల వివరాలు, మ్యాప్‌లను పార్టీ అధినేత కేసీఆర్ సమర్పించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. కేసీఆర్‌తో చర్చించి ఆయన నిర్ణయం మేరకు సభావేదికపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రజతోత్సవ సభపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్.. నేడో, రేపో ఉమ్మడి వరంగల్ నేతలతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.డ్రోన్ల ద్వారా సభావేదిక మ్యాపింగ్.. ఎల్కతుర్తి మండల కేంద్రంలో అనువైన ప్రదేశాన్ని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు బుధవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ముల్కనూర్ రోడ్డు, చింతలపల్లి రోడ్డు సమీపంలో గల అనువైన ప్రదేశాన్ని చూసి అనువుగా భావించిన వారు.. డ్రోన్ కెమెరా ద్వారా ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయించారు. ఈ భూమికి సంబంధించిన రైతులతో మాట్లాడగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా ఎల్కతుర్తికి వచ్చే దారులవెంట కిలోమీటర్ దూరంలో గల ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం చూశారు. వారి వెంట పార్టీ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్, మాజీ వైస్‌ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ ఎంపీటీసీ కడారి రాజు, శేషగిరి, రవిందర్, చిట్టిగౌడ్ ఉన్నారు.ఇక్కడే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేసీఆర్ సై తాజాగా ఎల్కతుర్తిలో స్థల పరిశీలన చేసిన నేతలు డ్రోన్ కెమెరాలతో సభాస్థలి, పార్కింగ్ స్థలాల మ్యాపింగ్ కేసీఆర్ దృష్టికి మ్యాప్‌లతో సహా అన్ని వివరాలు వేదిక దేవన్నపేటా? ఎల్కతుర్తా.?.. నేడో, రేపో తేల్చనున్న అధినేత -
లింగాపూర్ సమీపంలో పులి సంచారం
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లింగాపూర్ జాతీయ రహదారి శివారులోని నందిపాడు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పులి సంచరిస్తున్నట్లు గొత్తికోయలు గమనించి లింగాపూర్ గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ములు గు ఎఫ్ఆర్ఓ శంకర్ అటవీశాఖ సిబ్బందితో కలిసి పులి సంచరించిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. ఆ ప్రదేశంలో పులి సంచరించినట్లు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శంకర్ మాట్లాడుతూ పస్రా రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు వెల్లడించారు. లింగాపూర్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన కూడా పులి సంచరించినట్లు వివరించారు. పులి పాదముద్రల ఆధారంగా ట్రేస్ చేస్తున్నామన్నారు. ప్రజలు, మేకల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు -
ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఈఓకు వినతి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన భోజరావు, ఉపాధ్యక్షుడు అలం వెంకటేశ్‌లు బుధవారం మేడారంలో ఈఓ రాజేంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనార్థాలపై మేడారంలోని వ్యాపారస్తులకు, అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఈఓ రాజేంద్రం మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనకు వ్యాపారస్తులు, భక్తులు, గ్రామస్తులు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో గాలి, అడవులు, భూమి, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదమన్నారు. దేవా దాయ శాఖ తరఫున తమవంతుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. -
మొక్కలను జాగ్రత్తగా పెంచాలి
వెంకటాపురం(ఎం): నర్సరీలోని మొక్కలు చనిపోకుండా ప్రతీ మొక్కను జాగ్రత్తగా పెంచాలని ములుగు ఏపీడీ వెంకటనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. మండల పరిధిలోని నల్లగుంట, లక్ష్మీదేవిపేట, వెంకటాపురం మండల కేంద్రంలోని నర్సరీలను ఆయన బుధవారం పరిశీలించారు. మొక్కల వివరాలు, రిజిస్టర్లను పరిశీలించి ఈజీఎస్ సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ఎలా నడుస్తున్నాయని ప్రశ్నించారు. పనుల వద్ద కూలీలకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నారగోని సునిత, ఈసీ సురేష్, ప్లాంటేషన్ మేనేజర్ కిశోర్, పంచాయతీ కార్యదర్శులు దామోదర్, రమేష్, ప్రసాద్, ఎఫ్‌ఏలు రామాచారి, సునీత, రాధిక, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ఏపీడీ వెంకటనారాయణ -
చలివేంద్రం ప్రారంభం
ములుగు: జిల్లాకేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో కాంప్లెక్స్ వ్యాపారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం డీఎస్పీ నలువాల రవీందర్ ప్రారంభించారు. ఎస్సై వెంకటేశ్వర్రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎండత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లాకేంద్రానికి రోజువారీగా వచ్చే ప్రయాణికులు, వస్తువుల కొనుగోలుకు వచ్చే వారు, పోలీస్ స్టేషన్ పనుల నిమిత్తం వచ్చే వారికి చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎండాకాలం పూర్తి అయ్యేంత వరకు చలివేంద్రాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాట్ల బద్రి, రియాజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘రూరల్ ఇండియా’ సేవలు అభినందనీయం
భూపాలపల్లి: రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నందకుమార్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి పలు పుస్తకాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ గ్రామాలతో పాటు ఎంపిక ప్రాతిపదికన 19 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, స్పోర్ట్స్ కిట్లను సంస్థ వ్యవస్థాపకుడు పూణేకు చెందిన ప్రదీప్ లోకండే అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి నితీన్కుమార్, ఎస్పీ సీసీ ఫసియొద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ కిరణ్ ఖరే -
ఇంటింటికీ తాగునీరు
100 శాతం శానిటేషన్ పాటిస్తాం..ములుగు: జిల్లాలోని వేసవిలో ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఒంటేరు దేవరాజ్ అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానికులు తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీలు, దోమల బెడద వంటి సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన డీపీఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ప్రశ్న: మిషన్ భగీరథ నీటిలో మురుగు వస్తోంది. అధికారులు పట్టించుకోవడం లేదు. – గొంది సీత, వాజేడు జవాబు: ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకును బ్లీచింగ్‌తో శుభ్రం చేయిస్తాం. ప్రజలు రోజు అవసరాలు తీర్చుకోవడంతో పాటు తాగడానికి వీలుగా శుభ్రమైన నీటిని అందిస్తాం. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి మరో సారి ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: డ్రెయినేజీ నీళ్లు రోడ్లపైకి పారుతున్నాయి. వ ర్షాకాలం వస్తే మురుగునీరంతా ఇళ్లలోకి వస్తుంది. – మహేష్, మల్లంపల్లిజవాబు: నూతనంగా చేపట్టనున్న పనుల ప్రతిపాదనలో డ్రెయినేజీ పనులకు ఎస్టిమేషన్ వేయిస్తాం. మోడల్ కాలనీలో సీసీ రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించి పక్కన ఏర్పాటు చేసేలా విద్యుత్ అధికారులతో మాట్లాడతాను. మురుగునీరు ఇంట్లోకి రాకుండా అక్కడక్కడా ఇంకుడుగుంతలు నిర్మిస్తాం. ఉన్న కాల్వలను శుభ్రం చేయిస్తాం. ప్రశ్న: సినిమా టాకీస్ ఎదురుగా డ్రెయినేజీ లేక మురుగునీరు రోడ్లపైకి పారుతుంది. పన్ను వసూలు చేసేటప్పుడు ఆన్లైన్ రశీదులు ఇవ్వడం లేదు. – శంకర్భవాని, ఏటూరునాగారం జవాబు: ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో అవసరం ఉన్న చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం. వచ్చే బడ్జెట్‌తో నిర్మాణాలు చేపట్టి మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం. పన్ను వసూలు విషయంలో ఆన్లైన్ రశీదులు ఇవ్వడం లేదనే విషయంపై కార్యదర్శితో మాట్లాడి ఎంకై ్వరీ చేయిస్తాను. ప్రశ్న: చెత్తాచెదారం తొలగించడానికి ట్రాక్టర్ రావడం లేదు. డ్రెయినేజీలు పూడుకుపోయాయి. – సత్యనారాయణ, మల్లూరు జవాబు: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తాం. పూడుకుపోయిన డ్రెయినేజీలను శుభ్రం చేయిస్తాం. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ సెక్రటరీ స్థానంలో రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సెక్రటరీని నియమిస్తాం. ప్రశ్న: శానిటేషన్ పనులు చేపట్టడం లేదు. చెత్తాచెదారం తీయడం లేదు. – లక్ష్మణ్‌రావు, బర్లగూడెం జవాబు: బర్లగూడెంలో సమస్య ఉందని నా దృష్టికి వచ్చింది. స్థానిక పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేస్తాం. స్పందించని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటాం. శానిటేషన్ పనులు, డ్రెయినేజీలు శుభ్రం చేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రశ్న: ట్రాక్టర్ రిపేర్ ఉందని చెత్త తీయడం లేదు. రోడ్ల వెంబడి చెత్తాచెదారం పేరుకుపోయింది. – మల్లేశ్, బాలాజీనగర్ జవాబు: ట్రాక్టర్‌ను వెంటనే రిపేర్ చేయిస్తాం. కూలీలను ఏర్పాటు చేసి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తాం. ప్రజలు అధైర్య పడొద్దు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం అవుతాయి. ప్రశ్న: డ్రెయినేజీలు శుభ్రం చేయించండి. దోమలు పెరిగిపోతున్నాయి. – రాహుల్, ములుగు జవాబు: జిల్లాకేంద్రంలో రోజువారీగా ఈఓతో పాటు సిబ్బంది శానిటేషన్ పనులను దగ్గరుండి చూస్తున్నారు. అయినా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తాం. దోమలు బాగా ఉన్న ప్రాంతంలో రె గ్యులర్‌గా ఫాగింగ్ చేపడుతాం. పంచాయతీ సి బ్బందితో మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం.ప్రశ్న: గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. డ్రెయినేజీలో మురుగునీరు పేరుకుపోయింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదు. – చేలా నవీన్, బర్లగూడెం జవాబు: అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుతాను. వారం రోజుల్లో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించకపోతే అక్కడి నుంచి కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేసి వేరే వారిని నియమిస్తాం. సమస్య ఏది ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్ సాక్షి ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన -
గోదావరి జలాలతో విగ్రహాల శుద్ధి
వాజేడు: మండల కేంద్రంలోని అన్నపూర్ణ విశ్వేశ్వరస్వామి దేవాలయంలోని విగ్రహాలను బుధవారం గ్రామస్తులు గోదావరి జలాలతో శుద్ధి చేశారు. శివాలయం పునఃప్రతిష్టించాలని గ్రామస్తులు ధర్మకర్తతో కలిసి ఇప్పటికే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆలయంలోని విగ్రహాలపై దుమ్ముధూళి చేరి ఉంది. గుడి పునఃప్రతిష్ఠాపనకు ముందే ఆలయాన్ని శుద్ధి చేయాలని పూజారి సలహా మేరకు గ్రామంలోని మహిళలు బిందెలతో గోదావరి జలాలను తీసుకొచ్చి విగ్రహాలను శుద్ధి చేశారు. రామప్పను సందర్శించిన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ గిరిబాబు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆనంతరం రామప్ప సరస్సుకు చేరుకొని బోటింగ్ చేసి సరస్సు అందాలను తిలకించారు. ఆయన వెంట ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, నాయకులు ఉన్నారు. సెలూన్ షాపుల బంద్ సంపూర్ణంభూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న కార్పొరేట్ సెలూన్తో పాటు కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా నాయీబ్రాహ్మణులు బుధవారం చేపట్టిన సెలూన్ షాపుల బంద్ సంపూర్ణమైంది. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ సెలూన్ వ్యవస్థలో వెనక్కి తగ్గకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతంచేస్తామన్నారు. నాయీబ్రాహ్మణులకు జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పందిళ్ల రమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బాక సంపత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ గిరి సమ్మయ్య, మండల అధ్యక్షుడు మంతెన భూమయ్య, నాయకులు వంగపల్లి సుదర్శన్, మురహరి శంకర్, జంపాల తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి ఆరోగ్య కేంద్రానికి జాతీయస్థాయి సర్టిఫికెట్ కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధి బ్రాహ్మణపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి జాతీయ ప్రమాణాల సర్టిఫికెట్ గుర్తింపు లభించినట్లు వైద్యాధికారి డాక్టర్ సుప్మిత తెలిపారు. బుధవారం జాతీయ ఆరోగ్య వ్యవస్థ వనరుల కేంద్రం, జాతీయ హెల్త్ మిషన్ మినిస్ట్రీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో ఏడు జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ ఎస్సెస్‌మెంట్‌లో భాగంగా బ్రాహ్మణపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు లభించింది. మార్చి 10న ఎన్హెచ్యూఆర్సీ, ఎన్ఆర్ఎం ఇండియా అధికారులు వర్చువల్‌గా ఆరోగ్య ప్రమాణాలు, పబ్లిక్ హెల్త్ స్కీం ఫెసిలిటీని పరిశీలించిన విషయం విధితమే. జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో డీఎంహెచ్ఓ మధుసూదన్ ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు. -
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025జిల్లాలో 62 సన్నాలు, 83 దొడ్డు రకం కేంద్రాలునేడు డీపీఓతో ఫోన్ ఇన్– 8లోuములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చెరువులు, బోరుబావుల కింద జిల్లాలోని 10మండలాల్లో ఈ సారి 55వేల ఎకరాల్లో వరిపంట సాగు అయ్యింది. మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మరో 15 రోజుల్లో అక్కడక్కడా పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కసరత్తును ప్రారంభించిన సివిల్ సప్లయీస్ శాఖ క్షేత్రస్థాయిలో కేంద్రాలకు అనుకూలమైన ప్రదేశాలను అన్వేషిస్తోంది. 145 కేంద్రాల ఏర్పాటు యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సారి మొత్తం 145 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్నాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సన్నాలకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వ ప్రకటన ప్రకారం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రభుత్వం ఇవ్వనుండడంతో కొనుగోలు, ధాన్యం తరలింపు విషయంలో అవాంతరాలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. సన్నాలకు 62 కేంద్రాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు 83 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రెండు రకాల ధాన్యం సాగుచేసిన రైతుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కపక్కనే కేంద్రాలు ఉండేలా చూస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. అధికారులకు మూడు రోజుల అవగాహన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధి కారులు, కేంద్రాల నిర్వహకులకు మంగళవా రం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు(బుధవారం)ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని రైతు వేదికలో గోవిందరావుపేట, ఎస్ఎస్ తాడ్వా యి మండలాలకు, గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ములుగు, వెంకటాపురం(ఎం) మండలాలకు చెందిన అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సమావేశం జరగనుంది. టార్పాలిన్ల కొరత 145 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వచ్చే సమయంలో వాతావరణ ఇబ్బందులు ఎదురైతే వినియోగించేందుకు టార్పాలిన్ కవర్ల కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది. జిల్లాలో 2,900 టార్పాలిన్ కవర్లు అవసరం ఉన్నట్లుగా నివేదిక సిద్ధం చేశారు. 2,239 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా 661టార్పాలిన్ కవర్లు అవసరం ఉన్నట్లు అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే ఆటోమెటిక్ ప్యాడీ క్లినర్లు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు 145కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడైనా వరి కోతలు ప్రారంభమైతే అక్కడ కేంద్రాన్ని నడిపించి కొనుగోలు చే స్తాం. సన్నాలకు, దొడ్డు రకానికి వేర్వేరుగా కేంద్రాలు ఉంటాయి. మరో 15నుంచి 20 రోజుల్లో కోతలు ముమ్మరం అవుతాయని అనుకుంటున్నాం. ఇప్పటి కే కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నడుచుకుంటాం. వచ్చే నెల 2వ తేదీన పే రూరు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తాం. – రాంపతి, సివిల్ సప్లయీస్ డీఎంసమయం : ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తేదీ : 26–03–2025(బుధవారం) ఫోన్‌నంబర్ : 9848792788జిల్లాలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లు, పరికరాల వివరాలు..న్యూస్‌రీల్ మూడు రోజుల పాటు అధికారులకు అవగాహన పేరూరు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ ఏర్పాటు -
తరాలపల్లి నుంచి దండకారణ్యం వరకు..
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట అర్బన్ : అంకేశ్వరపు సారయ్య అలియాస్ సుధీర్, ఎల్లన్న, సుధాకర్.. హనుమకొండ జిల్లా తరాలపల్లి ముద్దుబిడ్డ.. రెండు పదుల వయస్సులో ఆయిడిసి, బాయిడిసి అడవిబాట పట్టిన మావోయిస్టు నేత. దళసభ్యుడినుంచి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడి వరకు ఎదిగిన సారయ్య అలియాస్ సుధీర్ 35 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు దంతెవాడ జిల్లా బీజాపూర్ ప్రాంతంలోని గీడం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గిర్సాపర, నెల్గోడ, బోడ్గా, ఇకెలి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఎస్పీ గౌరవ్రాయ్ మంగళవారం ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మృతిచెందగా.. మృతుల్లో సారయ్య ఉన్నట్లు వెల్లడించారు. బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య మృతి చెందాడన్న వార్తతో తరాలపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిదశ నుంచే ఉద్యమాలు.. తరాలపల్లి గ్రామానికి చెందిన సారయ్య కొండపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. 1982లో 10వ తరగతి చదువుతున్న తరుణంలోనే నాడు మావోయిస్టులు ఇచ్చిన ‘గ్రామాలకు తరలండి’ పిలుపునకు ఆకర్షితుడై, తరాలపల్లి విలేజ్ ఆర్గనైజర్ బండి ఆశాలు, హనుమకొండ సిటీ ఆర్గనైజర్ తిప్పారపు రాములు అలియాస్ తాత సారథ్యంలో తరాలపల్లి గ్రామ అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభించాడు. అంచెలంచెలుగా మావోయిస్టు పార్టీలో ఎదుగుతున్న తరుణంలో 1990లో బీఎస్ఎఫ్ సిబ్బంది గ్రామాల్లోకి రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993లో జరిగిన ఎన్కౌంటర్లో సిటీ ఆర్గనైజర్ తాత చనిపోవడంతో.. అజ్ఞాతంలోకి వెళ్లిన సారయ్య నేటి వరకు గ్రామానికి తిరిగి రాలేదు. అమరుల పల్లె తరాలపల్లి.. కాజీపేట మండలం తరాలపల్లి ఉద్యమాలకు కేరాఫ్. ఎందరో ఈ గ్రామంనుంచి విప్లవోద్యమాల వైపు ఆకర్షితులై ఎన్కౌంటర్లలో అసువులు బాశారు. 1991లో వేల్పుల జగదీశ్ అలియాస్ ఉప్పలన్న, 1992లో బండి ఆశాలు అలియాస్ శ్రీను పగిడేరు ఎన్కౌంటర్లో చనిపోయారు. 1998 నుంచి గాజుల శ్రీకాంత్, ముప్పిడి నాగేశ్వర్రావు అలియాస్ విశ్వనాథ్, చిరబోయిన సదానందం అలియాస్ కౌ ముదీ, సంపత్, కొత్తపల్లి సాంబయ్య అలియాస్ ఉప్పలన్నలు మృతిచెందగా.. మంగళవారం ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా బుధ వారం ఆయన మృతదేహం తరాలపల్లికి రానుంది.ముగిసిన అంకేశ్వరపు సారయ్య ఉద్యమ ప్రస్థానం 35 ఏళ్ల అజ్ఞాతవాసం... దళసభ్యుడి నుంచి డీకేఎస్జడ్సీ వరకు దంతెవాడ ఎన్కౌంటర్లో అసువులు బాసిన సుధీర్ విషాదంలో తరాలపల్లి.. నేడు గ్రామానికి మృతదేహం -
అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలి
వెంకటాపురం(కె): జీసీసీ రేషన్ షాపుల డీలర్లు, అధికారులు అటవీ ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలని జీసీసీ ఏటూరునాగారం డీఎం ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం ఆవరణలో జీసీసీ 10వ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆర్థిక లావాదేవీలపై నివేదికను వినిపించారు. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై ప్రణాళికలను రూపొందించున్నారు. జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌లో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉంచాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎం దృష్టికి సభ్యులు తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అటవి ఉత్పత్తుల సేకరణపై దృష్టి సారించాలన్నారు. అదే విధంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ స్వామి, నర్సింహారావు, బాబు తదితరులు పాల్గొన్నారు.జీసీసీ డీఎ ప్రతాప్‌రెడ్డి -
ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రైతు వేదికలో రబీ 2024–25 సీజన్లో ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏఓలు, ఏఈఓలు, వరికోత మిషన్ యజమానులకు ఒక రోజు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ పైసల్ హుస్సేన్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా 40ప్యాడీ క్లినర్స్ వచ్చాయని తెలిపారు. తేమశాతం పరీక్షించే మిషనరీని అందుబాటులో పెట్టుకుని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల్లో లోడ్ చేసి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ సర్దార్ సింగ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డీఆర్డీఓ గోవింద్ చౌహన్, మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఐదు మండలాల ఏఈవోలు, ఎంఏవోలు, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ రామచందర్ పాల్గొన్నారు. -
యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు కృషి
సైన్స్ ఎగ్జిబిట్స్ను పరిశీలిస్తున్న న్యాయ నిర్ణేతలు ఏటూరునాగారం: విద్యార్థులు, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసే వేదికగా నెహ్రూ యువకేంద్రం మై భారత్ కృషి చేస్తుందని తెలంగాణ గిరిజన గురుకులాల ములుగు రీజినల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ ఆధ్వర్యంలో మంగళవారం యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు విద్యా సంబంధమైన అంశాలతో పాటుగా ఇతర అంశాల్లోనూ నైపుణ్యాలు కలిగి ఉండాలని సూచించారు. యువతీ యువకులు ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవా లని సూచించారు. యువత చదువుతో పాటుగా పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాసం అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. డీసీఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లోని విజేతలకు సర్టిఫికెట్లు ప్రదా నం చేశారు. ఈ సందర్భంగా చేసిన నృత్యాలు, సైన్స్ ఎగ్జిబిట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీఓ శ్రీధర్, సీడీపీఓ ప్రేమల త, కళాశాల ప్రిన్సిపాల్ రేణుక, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ఐసీడీఎస్, ఐసీపీఎస్, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఐసీడీఎస్ ద్వారా చిన్నారులకు, కిశోర బాలికలకు అందుతున్న సేవలను వివరించారు. ఐసీపీఎస్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలనతో పాటు తదితర అంశాలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తున్న చికిత్సలు, సర్వేలతో పాటు తదితర అంశాలను విద్యార్థులకు, యువతీ యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.గిరిజన గురుకులాల రీజినల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ హరిసింగ్ -
ఖాతాల్లో పరిహారం జమచేయాలి
ములుగు: జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల్లో బాండ్ మొక్కజొన్న పేరుతో జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు నేరుగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో పరిహారాన్ని జమ చేయాలని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి ధనసరి సీతక్క ఆదేశాలు, కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం ఆయా కంపెనీల ప్రతినిధులు, అర్గనైజర్లు, రైతు ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొదండ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ఆయా మండలాల్లో పర్యటించి బాండ్ మొక్కజొన్న ఆకులు, కంకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారని తెలిపారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఈ నెల 12, 13 తేదీలలో సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను అందించారని తెలిపారు. దీంతో పాటు డాట్ సెంటర్ శాస్త్రవేత్త దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కజొన్న దిగుబడి తగ్గింపుపై పూర్తిస్థాయి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారని వివరించారు. మూడు మండలాల్లో 959మంది రైతులు 20,168 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టపోయినట్లు నివేదిక అందించారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ వెంకటేశ్ ఆధ్వర్యంలో సీడ్ కంపెనీ ప్రతినిధులు, ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించి నష్టపరిహారంపై చెల్లింపుల విషయంలో వారు సానుకూలంగా స్పందించారని వివరించారు. కానీ ఆర్గనైజర్లు రైతులకు అనధికారికంగా అధిక వడ్డీలకు అప్పులిచ్చిన విషయంలో మని లెండింగ్ యాక్ట్ కింద తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాధించినట్లు తెలిపారు. అలాగే రైతుల ఆరోగ్య విషయంలో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో కమిటీ వేసి బాండ్ మొక్కజొన్న పంట వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ మొక్కజొన్న విత్తన పంట వైఫల్యంపై కంపెనీలు నష్టపరిహారం చెల్లించాలని, ఏజెన్సీలో అధిక వడ్డీ రుణాల దోపిడీని నిరోధించాలని కమిషన్ సభ్యులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం గిరిజన రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వివరించారు. బాండ్ మొక్కజొన్న విషయంలో జరిగిన విత్తన వైఫల్యంపై తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డితో పాటు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, మామ్రెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, వెంకన్న యాదవ్‌లు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న బాధిత రైతు కుటుంబాల సభ్యులు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు సమీక్ష జరుగుతున్నంత సేపు చెట్ల కింద సేద తీరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, కమిషన్ అడ్వైజర్లు నర్సింహారెడ్డి, రామాంజనేయులు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ సుచరిత, ఆర్డీఓ వెంకటేశ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ వ్యవసాయ రైతుసంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి -
ఎంటీబీ జాతీయస్థాయి సైక్లింగ్ కోచ్‌గా ఆనంద్
ములుగు రూరల్: ఎంటీబీ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు రాష్ట్ర టీంకు కోచ్, మేనేజర్‌గా ములుగు మండల పరిధిలోని మదనపల్లి గ్రామానికి చెందిన చిలపాక ఆనంద్ ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 28నుంచి 31వ తేదీ వరకు హర్యానాలో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. అండర్ 16, 18 విభాగాలలో సైక్లింగ్, ఎంటీఎం జాతీయ స్థాయి మౌంటేన్ బైక్ 2024–25 పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరుపున క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. చోరీ కేసులను ఛేదించిన పోలీసులు ములుగు/ములుగు రూరల్ : ఈ నెల 15న రాత్రి గట్టమ్మ ఆలయం రూ. 52వేల నగదు, వెండి, ఇత్తడి వస్తువులు, 21న మల్లంపల్లిలోని మహంకాళి వైన్స్‌లో జరిగిన రూ. 24వేల చోరీ కేసులను ము లుగు ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఛేదించారు. ఈ మేరకు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్సై కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన ముంజల విష్ణు, కోడి నాగమణిలు 15న మేడారం వెళ్లి తిరుగుప్రయాణంలో గట్టమ్మ ఆలయం వద్ద ఆగారు. అమ్మవారి హుండీపై, విలువైన నగలపై కన్నేసి దొంగిలించారు. ఈ విషయంలో ఆలయ పూజారి కొత్త సదయ్య ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి దొంగిలించిన వస్తువులను రికవరీ చేశారు. వైన్స్‌లో చెన్నూరుకు చెందిన చింతకింది సతీశ్ తాళం పగులగొట్టి నగదును దొంగిలించాడు. షాపు యజమాని ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి సొమ్మును రికవరీ చేసినట్లు వివరించారు. 27నుంచి గిరిజన ఇసుక సొసైటీల గ్రామసభలు మంగపేట : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లోని గోదావరిలో గిరిజన ఇసుక లేబర్ సొసైటీల్లో పెసా నిబంధనల మేరకు మెజారిటీ సొసైటీలను ఎంపిక చేసేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆదేశాల మేరకు ఈనెల 27, 28, 29 తేదీల్లో గ్రామ సభలను నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బానోత్ భద్రు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న మల్లూరుపరిధిలోని రెండింటికి ఉదయం 10గంటలకు, 28న కత్తిగూడెంలో మూడో ఇసుక క్వారీ సొసైటీలకు ఉదయం 9గంటలకు, రమణక్కపేటలోని గొల్లగూడెం రెండో సొసైటీకి ఉదయం 9గంటలకు, 29న చుంచుపల్లిలో 12గంటలకు, వాడగూడెంలో రెండు సొసైటీలకు 9గంటలకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సొసైటీల ఎంపికకు రెండు రోజుల ముందు గ్రామాల్లో టాంటాం వేయించి గ్రామ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జీపీల అధికారులను ఆయన ఆదేశించారు. -
దరఖాస్తులు అందించాం..పరిష్కరించండి
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో 42 దరఖాస్తులుఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని కారుపాటు పౌర్ణమి. దివ్యాంగురాలు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన సారయ్య కుమార్తె. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తల్లి చనిపోవడంతో నానమ్మ, తండ్రి బాగోగులు చూసుకుంటున్నారు. గతంలో చేసిన అభ్యర్థన మేరకు అధికారులు బ్యాటరీ ట్రైసైకిల్ అందించారు. అయితే గత కొన్ని నెలల క్రితం అది మరమ్మతులకు గురైంది. ఇంటి నుంచి పాఠశాల కిలోమీటర్ ఉండడంతో రోజువారీగా వెళ్లే వీలులేక చదువు మధ్యలోనే ఆగిపోయింది. ఉపాధ్యాయులు ఇంటికి వచ్చిన సమయంలో ఇదే విషయం చెప్పారు. దీంతో గ్రామస్తుల సూచన మేరకు గ్రీవెన్స్ సెల్లో మరో బ్యాటరీ ట్రైసైకిల్ ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.● పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సిఫారసు● స్వీకరించిన అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, పీఓ చిత్రామిశ్రాములుగు/ఏటూరునాగారం:కలెక్టరేట్, ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో పలు రకాల సమస్యలపై దరఖాస్తులు అందించిన ప్రజలు పరిష్కారం చూపాలని అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో 27దరఖాస్తులు రాగా వాటిని అదనపు కలెక్టర్లు పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. అదే విధంగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. గిరిజన దర్బార్‌లో 15 వినతులు రాగా పరిశీలించిన పీఓ తక్షణమే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. వినతుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల వివరాలు భూ సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది, ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఒకరు, పింఛన్ అందించాలని ఒకరు, బ్యాటరీ ట్రైసైకిల్ అందించాలని ఒకరు, బ్యాంకు రుణం అందించాలని ఒకరు ఇలా పలు రకాల సమస్యలపై 27 వినతులు సమర్పించారు. గిరిజన దర్బార్‌లో.. ● వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామానికి చెందిన పాయం రాందాస్ పెట్రోల్ బంక్ మంజూరు చేయాలని వేడుకున్నారు. ● గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన బానోతు గోపిచంద్ వ్యవసాయ భూమిలో బోరు వేయించి మోటారు ఇప్పించాలని కోరారు. ● వెంకటాపురం(కె) మండలంలోని ఎదిర పీహెచ్సీలో కాంటింజెంట్ వర్కర్‌గా ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన దీపిక పీఓకు మొరపెట్టుకున్నారు. అలాగే సాయిలక్ష్మి ఎదిర పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టు ఇప్పించాలని విన్నవించారు. ● కన్నాయిగూడెం మండలం గంగుగూడెం ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాలని పొడెం బాబు వినతిపత్రాన్ని అందజేశారు. అదే మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణారావు మూడు ఎకరాల్లో వరిపంట నీళ్లు లేక ఎండిపోతుందని.. బోరు వేయించి నీరు అందించాలని విన్నవించారు. ● ఐటీడీఏ గిరిజన భవనం నిర్వహణ కోసం వట్టం నర్సింహరావును నియమించాలని పీఓను పొడెం బాబు కోరారు. ● ఏటూరునాగారం మండలం రాయిబంధం ప్రాంతానికి చెందిన పద్దం జోగయ్య ఇందిర జలప్రభ కింద బోరు వేసి స్తంభాలు వేశారు కానీ విద్యుత్ తీగలు అమర్చి విద్యుత్ సరఫరా చేయాలని వేడుకున్నారు. అలాగే చిన్నబోయినపల్లి ప్రాంతానికి చెందిన పద్దం పొజ్జయ్య తన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములను నీలమ్మ పేరుపైకి అక్రమంగా మార్చిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● భూపాలపల్లి జిల్లాలోని పోస్టుమెట్రిక్ హాస్టల్లో ఖాళీగా ఉన్న ఎంపీహెచ్‌డబ్ల్యూ పోస్టు ఇప్పించాలని అదే ప్రాంతానికి చెందిన జయప్రద వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే మహబూబాబాద్ స్కూల్(ఏహెచ్ఎస్) స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ ఇప్పించాలని సుగుణ విన్నవించారు. సిబిల్ స్కోర్ లేదని లోన్ ఇవ్వడం లేదు.. గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవల పీఎం విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష రుణం మంజూరు అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు ఖాతా ఉంది. ఆదాయం ఎక్కువగా లేకపోవడంతో లావాదేవీలు జరగలేదు. దీంతో సిబిల్ స్కోర్ లేదని బ్యాంకు మేనేజర్ రుణం ఆపివేశారు. అధికారులు నాకు లోన్ ఇప్పించి ఆదుకోవాలి. – ఎనగందుల సతీశ్, చింతకుంట, ములుగు మనువరాలు 27గుంటల భూమిని పట్టా చేయించుకుంది.. నాకు ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు శంకర్ కుమార్తె నా మనుమరాలు రాధిక నా పేరు మీద ఉన్న 27గుంటల వ్యవసాయ భూమిని పట్టా చేయించుకుంది. రైతుబంధు కూడా తానే తీసుకుంటుంది. ఈ విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలో అడిగించగా నా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నా కూతురు దొంగరి స్వరూప నాకు ఇళ్లు కట్టించి బాగోగులు చూసుకుంటుంది. నా భూమి నాకు ఇప్పించి న్యాయం చేయాలి. –వంగరి నర్సమ్మ, నర్సాపూర్, వెంకటాపురం(ఎం)● -
రామప్పను సందర్శించిన రష్యా దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం రష్యా దేశస్తులు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. హిందూ మతం స్వీకరించి ఆలయాలను వారు సందర్శిస్తున్నట్లు వెల్లడించారు. 210 చలివేంద్రాలు.. 360 నీటితొట్లు ములుగు: వేసవిలోని వేడిగాలులు, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లా పంచాయతీశాఖ తరఫున వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రధాన కూడళ్లు, రహదారులు, షాపింగ్ ప్రాంతాలు, ఆస్పత్రుల వద్ద 210 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఆవరణలు, గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశాలు, నర్సరీలు, రహదారి వెంబడి పక్షులు, మూగజీవాలు, కోతులు నీళ్లు తాగే విధంగా 360ప్లాస్టిక్ టబ్స్, తాగునీటి తొట్లు ఏర్పాటు చేశారు. డీపీఓ ఒంటేరు దేవరాజ్ సూచనల మేరకు చిన్న గ్రామ పంచాయతీల్లో ఒకటి, మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు నుంచి 5 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. -
క్షయవ్యాధి అంతమే లక్ష్యం
ములుగు: క్షయవ్యాధి అంతమే లక్ష్యంగా ముందుకుసాగాలని జిల్లా వైద్యశాఖ అధికారి గోపాల్‌రావు వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఎదుట సోమవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్‌తో కలిసి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు మాట్లాడుతూ క్షయవ్యాధిని ధ్వేషించాలే తప్పా రోగిని కాదన్నారు. సమగ్రమైన చికిత్సను తీసుకోవడం ద్వారా వ్యాధిని నిర్మూలించవచ్చని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామసభలు, విలేజ్ న్యూట్రిషన్ కమిటీ, శానిటేషన్ కమిటీ, విలేజ్ జాస్ కమిటీ సమావేశాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి సంవత్సరానికి 10మందికి వ్యాప్తి చేయగలడని తెలిపారు. జ్వరం, ఛాతినొప్పితో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడడం, బరువు తగ్గడం లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. నిర్ధారణ అయితే నిర్మూలనకు కోర్సును అందిస్తారని వివరించారు. క్షయ వ్యాధి బాధితులు ఆల్కహాల్, సిగరెట్ తాగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి చంద్రకాంత్, వైద్యులు రాధిక, అనిల్, శ్రవణ్‌కుమార్, ఆర్ఎంఓ ప్రేమ్‌సింగ్, రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, దుర్గారావు, పూర్ణసంపత్రావు, సురేష్‌బాబు, వెంకట్‌రెడ్డి, సమ్మయ్య, రాజు, రమేష్, చంద్రమౌళి, దేవేందర్, నిర్మలమేరి, సిబ్బంది పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించాలి
వెంకటాపురం(కె): మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు అమాయక ఆదివాసీ ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కేసులలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతి పరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని అదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కమెండ్ కంట్రోల్ రూమ్‌లో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, తదితరులు ఉన్నారు.ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని ధర్నా
ములుగు రూరల్: మండల పరిధిలోని లక్నవరం ముంపు గ్రామాల్లో సాగు చేసిన పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు అందించాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఏజెన్సీ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు గ్రామాలు రాయినిగూడెం, పంచోత్కులపల్లి, లాలయగూడెం, జగ్గన్నగూడెం, అంకన్నగూడెం, కొత్తూరు, దుబ్బగూడెం, సర్వాపూర్, కన్నాయిగూడెం గ్రామాలలో యాసంగి వరి పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందక పంట ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. యాసంగి సాగు చేసిన రైతులకు 20 రోజుల పాటు ఎస్సారెస్పీ నీళ్లు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తవిటి నారాయణ, కృష్ణ, సాంబయ్య, పాపయ్య, నాగయ్య, సమ్మయ్య, స్వామి, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేల సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల షెవర్ల కింద స్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవార్ల గద్దెలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం, చీరసారె కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓ ఎన్నారై కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు పూజలు చేశారు. డీజె సౌండ్ నృత్యాలతో పలువురు భక్తులు సందడి చేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని భోజలు చేశారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘అమ్మవార్ల చరిత్ర గొప్పది’ మేడారం సమ్మక్క– సారలమ్మ చరిత్ర చాలా గొప్పదని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వనదేవతల చరిత్ర నలుదిశలా వ్యాపించేలా తమకున్న వనరులతో పుస్తకాలను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చూస్తామన్నారు. సమ్మక్క– సారలమ్మ జాతరకు జాతీయస్థాయి గుర్తింపును తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ప్రజల మనో భావాలను గుర్తించాలన్నారు. వనదేవతలను దర్శించుకున్న వారిలో ప్రొఫెసర్లు గోవాకు చెందిన ప్రకాశ్‌దేశాయ్, తమిళనాడుకు చెందిన లక్ష్మణన్, కేరళ రాష్ట్రానికి చెందిన జోష్జార్జి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అంజిరెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీనివాసులు, కాకతీయ యూనివర్సిటీకి చెందిన సత్యనారాయణ, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంకిళ్ల శంకర్, కలిపిండి వినోద్, చేరాల శివప్రసాద్, అట్ల రాజిరెడ్డి ఉన్నారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
అక్రమంగా మట్టి తవ్వకాలు
కాటారం: మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గడ్డగూడెం సమీపంలోని ఎర్రకుంట చెరువులో ఆదివారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయి. కొందరు వ్యక్తులు జేసీబీ సహాయంతో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి రవాణా చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత శాఖ అధికారుల నుంచి స్పందన లేదు. అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ మట్టి దందా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. -
అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దు
మంగపేట: మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న గొత్తికోయలు అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇవ్వొద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని తిమ్మాపురం ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 60కుటుంబాలు, ప్రాజెక్టునగర్‌లో 22, శాంతినగర్ 18, కేశపురం 20, పాయిగూడెం 18, రాళ్లగుంపు 20, ఎస్టీ కాలనీకి చెందిన 4కుటుంబాలను ఆయన ఆదివారం సందర్శించి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రాబిన్ ఫుడ్, సీజేఐ వారి సహకారంతో ఆయా గూడేల్లోని గొత్తికోయలకు సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరుకూడా మావోయిస్టులకు సహకరించవద్దన్నారు. గూడేలకు ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మిర్చి కూలీల ముసుగులో మావోయిస్టులు వచ్చి విధ్వంసాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు. గూడేలకు అపరిచిత వ్యక్తులు వచ్చినా, అటవీ ప్రాంత పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్నా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మావోయిస్టులకు ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, స్థానిక ఎస్సై సూరి, రాబిన్‌హుడ్, సీజేఐ సిబ్బంది, ట్రెయినీ ఎస్సైలు మహేష్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
నాంచారమ్మ జాతరలో సౌకర్యాలు కల్పించాలి
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో మే12న జరిగే నాంచారమ్మ జాతరలో ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు కోరారు. ఎరుకల నాంచారమ్మ జాతర ప్రదేశాన్ని ఆయన ఆదివారం సందర్శించి నాంచారమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 8 ఏళ్లుగా నాంచారమ్మ జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతరలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. జాతరలో భక్తుల సౌకర్యార్ధం మౌలిక వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం నాయకులు కోనేటి రాజు, కేతిరి భిక్షపతి, రాజశేఖర్, పల్లకొండ భాస్కర్, సుభాశ్, ప్రశాంత్, రమేష్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు -
రేపు యువజనోత్సవాల పోటీలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలో రేపు ఐటీడీఏలో గల గిరిజన భవన్లో యువజనోత్సవాల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం యూత్ అండ్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వరంగల్ వారు జిల్లాలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన అంశం పంచ్ ప్రాన్ అనే కార్యక్రంలో భాగంగా పద్య రచన, డ్రాయింగ్, ప్రకటన పోటీలు, ఫోక్ డ్యాన్స్ గ్రూప్, ఫోక్ డ్యాన్స్ సింగిల్, సైన్స్ మేల్ సింగిల్, సైన్స్ మేల్ గ్రూప్ ఈ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9908069469లో సంప్రదించాలని కోరారు. జాతీయ కౌమార విద్యా సదస్సుకు డాక్టర్ రామయ్య ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్సీఈఆర్టీ) బోపాల్‌లో నేడు(సోమవారం), మంగళవారం జరగనున్న జాతీ య కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు. జాతీయ మెంటర్, జాతీయ, రాష్ట్ర రీసోర్స్ పర్సన్‌గా మనో విజ్ఞానశాస్త్రంతో పాటు భావో ద్వేగ ప్రజ్ఞ, ఒత్తిడి, ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు, మంత్రణం, మార్గదర్శనం అంశాలపై పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతీయ కౌమార విద్యా సదస్సుకు ఎంపికై న రామయ్య ను డీఈఓ పాణిని, ఏఎంఓ మల్లారెడ్డి, హెచ్ఎం భాస్కర్ తదితరులు అభినందించారు. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగించాలి ములుగు రూరల్: భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జక్కుల శరత్‌కుమార్ అన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వద్ద వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు వీరోచితంగా పోరాడి ఉరికంబం ఎక్కిన మహోన్నత వ్యక్తులను వారి సేవలను కొనియాడారు. నేటి సమాజంలో విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారులు భగత్‌సింగ్‌కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
రామప్పలో యూరప్ దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆదివారం యూరప్‌కు చెందిన జెయో, ఇలోనాలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు సైతం రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేయూలో రెండు రోజుల సెమినార్ ముగించుకొని అమ్మవార్ల దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. -
బోర్లు వేయడాన్ని అడ్డుకోవడం సరికాదు
గోవిందరావుపేట: రైతులు తమ పంటపొలాలను కాపాడుకునేందుకు బోర్లు వేసుకుంటుంటే పస్రా ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మార్పీస్, ఎంఎస్పీ జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి అన్నారు. మండల పరిధిలోని మొద్దులగూడెం– రాంపూర్ సమీపంలోని సర్వే నంబర్ 41, కర్లపల్లిలోని సర్వే నంబర్లు 91, 175, 94, 171లో ఉన్న 400 మంది రైతులకు చెందిన పంట పొలాలను ఆదివారం పైడి ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బాధను మంత్రి సీతక్క అర్ధం చేసుకుని ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. పస్రా ఫారెస్ట్ అధికారులు 400మంది రైతులను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. వరి పంట పొట్టదశలో ఉందని తెలిపారు. గుండ్లవాగు ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రైతులు బోర్లు వేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా మంత్రి సీతక్క స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జాతీయ కార్యదర్శి పైడి -
మద్యపాన ప్రియులతో సమాజ సేవ
మలుగు: ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపిన వారికి జిల్లా కోర్టు సివిల్ జడ్జి కన్నయ్యలాల్ వినూత్నంగా జరిమానా వేశారు. సుమారు నాలుగు గంటలపాటు సమాజ సేవ చేయాలని ఆదేశించారు. ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్‌లో ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్న ప్లాిస్టిక్ కవర్లు, చెత్తా చెదారం, పిచ్చి మొక్కల తొలగింపు పనులను చేయించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తాగి వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సూచించారు. చట్టాలపై అవగాహన ఉండాలిటేకుమట్ల: మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ హెల్ఫ్‌లైన్ జిల్లా అధికారి కళావతి అన్నారు. శనివారం మండలంలోని రామకిష్టాపూర్(టి) అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు చట్టాలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం సుకన్య సమృద్ధియోజన, బేటీ బచావో–బేటీ పడావో, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్, సఖి కేంద్రాలను నిర్వహింస్తుందని అన్నారు. బాలికల చదువు అనంతరం వివాహానికి సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. బాలికలే భవిష్యత్‌కు పునాదులుగా బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం కొనసాగిస్తున్నారని అన్నారు. బాలికలు సమాజంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఇబ్బందులకు గురయితే చైల్డ్ హెల్ప్‌లైన్ తోడ్పాటునందిస్తుందన్నారు. మహిళలు కుటుంబ పరంగా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సఖి కేంద్రం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్పారు. చైల్డ్ హెల్ప్‌లైన్, బాలికల సమస్యల కోసం 1098, వృద్ధుల సమస్యల కోసం 14567, మహిళల సమస్యల కోసం 181 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరోజన, సఖి గాయత్రి మిషన్ శక్తి కో ఆర్డినేటర్ అనూష, మమత, అంగన్వాడీ టీచర్లు స్వరూప, వనిత, నిర్మల, విమల పాల్గొన్నారు. సోలార్‌తో రైతులకు ఆదాయంభూపాలపల్లి రూరల్: సోలార్ ఏర్పాటు చేసుకోవడం వలన రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఉర్జ సురక్ష ఈవం ఉత్తన్ మహా అభియాన్) పథకం కింద కలెక్టరేట్లో శనివారం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం దరఖాస్తు చేసుకున్న భూపాలపల్లి, ములుగు జిల్లా రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకం వివరాలు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో 115, ములుగు జిల్లాలో 49 దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఒక మెగావాట్ ప్లాంట్‌కు సంవత్సరంలో సుమారు రూ.57లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు, భూపాలపల్లి ఎస్ఈ మల్చూర్ నాయక్, టీజీ రెడ్కో డీఎం హైదరాబాద్ పండారి, డివిజనల్ ఇంజనీర్ భూపాలపల్లి పాపిరెడ్డి, ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ భూపాలపల్లి వెంకటేశం పాల్గొన్నారు. -
రామప్పలో విద్యార్థుల సందడి
విద్యార్థులకు ఆలయ విశిష్టతను వివరిస్తున్న గైడ్ వెంకటేశ్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మ క రామప్ప దేవాలయంలో శనివారం విద్యార్థుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం రామలింగేశ్వరున్ని త్రిశూలం, ఓంకారం ఆకారంతో ప్రత్యేకంగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీష్‌శర్మ తెలిపారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు. -
రేంజ్ అధికారి బాలరాజు అరెస్ట్
ఏటూరునాగారం: తునికాకు కూలీల బోనస్‌లో అవినీతి జరిగిందని అర్హులైన కూలీలు 2023 ఆగస్టులో సీసీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే అటవీశాఖలో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్, మిగతా ఆరుగురు వాచర్స్ ఖాతాల్లో కూలీలకు చెందిన తునికాకు బోనస్ డబ్బులు పడినట్లు ప్రత్యేక టీం గుర్తించింది. వారి రిపోర్ట్ మేరకు ఇటీవల అటవీశాఖ రేంజ్ అధికారి అఫ్సరున్నీసా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సీఐ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు విచారణను ముమ్మరం చేశారు. దీంతో కిషన్, వాచర్స్ వైకుంఠం, కన్నాయిగూడెంకు చెందిన మధుకర్, మహబూబ్, భిక్షపతి, నర్సింహులు, ప్రసాద్ అనే ఏడుగురి ఖాతాల్లో నగదు జమ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో బాధితులు సాక్షిని సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో సాక్షిలో ‘అటవీశాఖ రేంజ్ అధికారి మోసం’ అనే శీర్షికన ఈనెల 19న కథనం ప్రచురితమైంది. బాధితులకు జరిగిన నష్టాన్ని వివరించగా పోలీసులు కథనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. మరుసటిరోజు బాధితులు.. బాలరాజు వద్దకు వెళ్లి డబ్బులు మీరే వేయించి మీరే డ్రా చేయించారని చెప్పగా నాకు ఎలాంటి సంబంధం లేదు.. అంటూ బుకాయించాడు. ఆధారాలున్నా యా.. అంటూ దిక్కరించారు. దీంతో 20వ తేదీన ‘తునికాకు బోనస్‌లో చేతి వాటం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. దీంతో టాస్క్ ఫోర్స్, ఇంటలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేయగా రేంజ్ అధికారి బాలరాజు హస్తం ఉందని తేలింది. దీంతో బాధితుల నుంచి పోలీసులు వాంగ్మూలాన్ని సేకరించి శనివారం బాలరాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. అసలు నిందితుడు దొరకడంతో ఈ ఏడుగురిపై కేసును తొలగించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ ఘటనలో ఇంకెవరి ప్రమేయమైన ఉందా.. అనేది తెలియాల్సి ఉంది. పేదలకు అండగా నిలిచిన సాక్షి మండల కేంద్రానికి చెందిన పలువురు అటవీశాఖలో పనిచేస్తున్నారు. వారిపై అక్రమ కేసు నమోదు చేయించి తప్పించుకోవాలని చూసిన అధికారి విషయాన్ని బట్టబయలు చేసిన సాక్షికి కృతజ్ఞతలు. పేదలను ఈ కేసు నుంచి తప్పించి ఆదుకోవాలి. – ఇర్సవడ్ల సంతోష్, గ్రామస్తుడు, ఏటూరునాగారం తునికాకు కూలీల బోనస్ డబ్బుల స్వాహా రూ.2.70 లక్షల దుర్వినియోగం కేసు నుంచి బయటపడ్డ ఏడుగురు.. ‘సాక్షి’కి అభినందనలు