
క్షయవ్యాధిపై అవగాహన
వాజేడు: క్షయవ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పీహెచ్‌సీ వైద్యాధికారి కొమరం మహేందర్ తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో గురువారం క్షయవ్యాధిపై అవగాహన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీఎంహెచ్‌ఓ గోపాల్ రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు సర్వేలో భాగంగా గుర్తించిన 15 మంది అనుమానితులను పీహెచ్‌సీకి తీసుకొచ్చి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తెమడను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ టీఎల్‌ఎస్ రవి, హెల్త్ సూపర్ వైజర్ కోటిరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ రజనీకాంత్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆశ కార్యకర్తలు రమణమ్మ, కళావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
గర్భిణులకు సీమంతాలు
వాజేడు: మండల పరిధిలోని ఏడ్జెర్లపల్లిలో సూపర్ వైజర్ అంజమ్మ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు గురువారం గర్భిణులకు సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. పోషన్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏడ్జెర్లపల్లి క్లస్టర్‌లోని 5 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలింతలు, గర్భిణులు, చిన్నారులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ అంజమ్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పప్పులు, బెల్లం, పాలు, ఆకుకూరలు, గుడ్లు, ఐరన్‌కు సంబంధించిన ఇతర ఆహారం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రమణ, దేవి, నర్సమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
వాటర్ కూలర్ ఏర్పాటు
ఏటూరునాగారం: మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఉన్న ఫాస్టాగ్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రయాణికులు, బాటసారులకు చల్లటి నీటిని అందించడానికి వాటర్ కూలర్‌ను ఏర్పాటు చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. వేసవికాలం కావడంతో దాహం తీర్చుకోవడానికి ప్రయాణికులు, రైతులు, ఇతర కార్మికులకు ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.
లంబాడ న్యాయవేదిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాలాజీ నాయక్
ములుగు రూరల్: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన బాదావత్ బాలాజీ నాయక్‌ను లంబాడ న్యాయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు దేవా నాయక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవిని అప్పగించినందుకు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
పుష్కరాల పనులు పూర్తిచేయాలి
కాళేశ్వరం: సరస్వతి పుష్కరాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ అన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గురువారం దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 15నుంచి 26వరకు కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేయాలని సంఽబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం వీఐపీ ఘాటు, ప్రధానఘాటుల వద్ద శాశ్వత నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈఈ, డీఈ పాల్గొన్నారు.

క్షయవ్యాధిపై అవగాహన

క్షయవ్యాధిపై అవగాహన

క్షయవ్యాధిపై అవగాహన