Mulugu District Latest News
-
‘రామప్ప’ను సందర్శించిన ఆర్కియాలజీ విద్యార్థులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఇనిస్టిట్యూబ్ ఆఫ్ ఆర్కియాలజీ (2023–25 బ్యాచ్) కు చెందిన 22 మంది విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. గ్రేటర్ నోయిడాలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు శిక్షణలో భాగంగా కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. శుక్రవారం రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం రామప్ప ఆలయ విశిష్టత, కాకతీయుల చరిత్ర, రామప్ప ఆలయ నిర్మాణశైలి, ఆలయ ప్రత్యేకతలు పురావస్తుశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆశీష్ రంజన్ సాహూ, సీనియర్ ఫొటోగ్రాఫర్ సుభాష్ చంద్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ, వరంగల్ ఇన్చార్జ్ నవీన్‌కుమార్, గార్డెన్ ఇన్చార్జ్ ప్రదీప్‌బాబు ఉన్నారు. నీటిసరఫరాపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ములుగు: గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటిసరఫరా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 5994007ను ఏర్పాటు చేసినట్లు మిషన్ భగీరథ ఇంట్రా డివిజన్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ సీహెచ్ సుభాష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నిర్మోహమాటంగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదులపై స్పందించి, సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పీడీఎస్ బియ్యం స్వాధీనం గోవిందరావుపేట: అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్టు పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామ శివారులో శుక్రవారం పస్రా ఎస్సై కమలాకర్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంతో ఓ లారీని తనిఖీ చేసి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీలో ఉన్న పీడీఎస్ బియ్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం, లచ్చగూడేకి చెందిన బత్తుల రాజుకు చెందినవిగా అదే మండలానికి చెందిన డ్రైవర్ వల్లెపు బంగారి అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. ఇల్లందు చుట్టు పక్కల గ్రామాల నుంచి తక్కువ ధరకు బియ్యం సేకరించి మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. బియ్యం విలువ సుమారుగా రూ.6,47,000 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కమలాకర్ వెల్లడించారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ ఏటూరునాగారం: మండలంలోని ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, తాడ్వాయిలోని కళాశాల, ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి, వసతి గదులు, స్టాక్ రూమ్, భోజన మెనూ పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో, వసతి గృహాల్లో విద్యుత్ సమస్యలు, ఇతర మరమ్మతులు ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కిటికీలు, దర్వాజలకు డోర్లను అమర్చాలన్నారు. వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. ఆమె వెంట డీడీ పోచం ఉన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ములుగు: ఈ నెల 27వ తేదీన జరగనున్న నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించి తగిన సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఓఎస్డీ మహేష్ బీ గీతే, ఆర్డీఓ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో పోలింగ్ స్లిప్పుల పంపిణీ 70 శాతం పూర్తికాగా.. శనివారం వరకు 100 శాతం పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 9 పోలింగ్ కేంద్రాల్లో 12 మంది పీఓలు, 12 మంది ఏపీఓలు, 12 మంది ఓపీఓలు, 11 మంది మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అధికారులు, సిబ్బందికి మొదటి, రెండో విడత శిక్షణ పూర్తి చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్లో రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మెటీరియల్ రవాణాకు రెండు రూట్లను ఏర్పాటు చేశామని అన్నారు. పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి నల్గొండ–ఖమ్మం–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 27వ తేదీన నిర్వహించే పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలు, విధులపై అవగాహ న కలిగి ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల పోలింగ్ పక్రియ భిన్నంగా ఉంటుందని అన్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ పోలింగ్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ ఉంటుందని క్యూ లో ఉండేవారికి టోకెన్లు అందించాలని అన్నారు. ఎన్నికల కేంద్రానికి వెళ్లే ముందు చెక్‌లిస్ట్ ఆధారంగా మెటిరీయల్ అందిందా.. లేదా.. సరిచూసుకోవాలని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని అన్నారు. ఎన్నికల తతంగం ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారులు నల్గొండ జిల్లాకేంద్రంలోని రిసెప్షన్ కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను భద్రత మధ్య తరలించాలని అన్నారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ హమీద్ పవర్‌పాయింగ్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, పర్యవేక్షకులు సలీం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టరేట్లో అధికారుల శిక్షణలో పాల్గొన్న కలెక్టర్ మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాలి జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం నార్కోటిక్ డ్రగ్స్‌పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయశాఖ తరఫున ప్రత్యేక నిఘాపెట్టాలని అన్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి నేతృత్వంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మత్తు పధార్థాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను విద్యార్థుల కు వివరించాలని చెప్పారు. టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు డ్రగ్స్ మూలాలపై నిత్యం నిఘా పెట్టాలని తెలిపారు. పోలీసు, ఆబ్కారీ శాఖలు సైతం డ్రగ్స్ నియంత్రణలో భాగస్వాములు కావాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీసీఆర్బీ డీఎస్పీ కిషోర్‌కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాణిని, డీఎంహెచ్ఓ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈనేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో ఉండగా.. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన సుదర్శన్‌రెడ్డి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలన్నారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పా ట్లు చేయాలన్నారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ని ఘా పటిష్టం చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని, డబ్బు, మద్యం, ఇతర ఆభరణాలు పరి కరాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడాలని, క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ వీటిని నిరోధించాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లలో అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన మేర సౌకర్యాలు ఉండేలా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. పూర్వ వరంగల్, నల్లగొండ, ఖ మ్మం జిల్లాల్లో 24,905 ఓట్లు ఉండగా.. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 6,509 పురుషులు, 4,288 సీ్త్రలు కలిపి 10,797 మంది ఓటర్లున్నారు. ఆరు జిల్లాల్లో ని 70 మండలాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధిత అధికారులు వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ నిరంతరాయంగా పని చేసేలా విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై స్థానికులతో మాట్లాడుతున్నారు. 27న జరిగే పోలింగ్ కోసం ఒక్కరోజు ముందే ఎన్నికల సామగ్రిని తరలించేలా జిల్లా కేంద్రాల్లో డిస్టిబ్య్రూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద అవసరమైన వసతులపై కసరత్తు చేస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా, ప్రతీ రెండు గంటల కు పోలింగ్ వివరాలను ప్రకటించేలా ఎన్నికల అధి కారులు, సిబ్బందిని కలెక్టర్లు సంసిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలిలా.. జిల్లా మండలాలు పోలింగ్ పురుషులు సీ్త్రలు మొత్తం కేంద్రాలుహనుమకొండ 11 15 2,884 2214 5,098 వరంగల్ 13 13 1,381 844 2,225 జనగామ 12 12 556 365 921 మహబూబాబాద్ 18 16 1,083 535 1,618 భూపాలపల్లి 07 07 211 112 323 ములుగు 09 09 394 218 612 మొత్తం 70 72 6,509 4,288 10,797ఏర్పాట్లపై కలెక్టర్లకు సీఈఓ సుదర్శన్‌రెడ్డి ఆదేశం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉమ్మడి జిల్లాలో 10,797 మంది ఓటర్లు ఈనెల 27న పోలింగ్.. వచ్చే నెల 3న లెక్కింపు ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులువేడెక్కిన ప్రచారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 23 మంది 50 సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి – స్వతంత్ర (యూటీఎఫ్ మద్దతు), గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి – స్వతంత్ర (టీచర్స్ జేఏసీ మద్దతు), పులి సరోత్తంరెడ్డి – బీజేపీ (టీపీయూఎస్ మద్దతు), శ్రీపాల్‌రెడ్డి పింగిళి – స్వతంత్ర (పీఆర్టీయూ – టీఎస్ మద్దతు), పూల రవీందర్ – స్వతంత్ర (ఎస్టీయూ మద్దతు)తో పాటు స్వతంత్రులుగా సంగంరెడ్డి సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్‌రెడ్డి ఏలె చంద్రమోహన్, చాలిక చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, తలకోల పురుషోత్తంరెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు, ప్రజావాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో ఐదు రోజులే గడువుండడంతో అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. -
దొంగనోట్ల కలకలం
ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతంలో దొంగనోట్ల కలకలం రేపింది. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ రిక్షా కార్మికుడి వద్ద రూ.100 దొంగనోటు దర్శనమిచ్చింది. అదే వంద రూపాయలు తీసుకెళ్లి ఓ కూల్‌డ్రింక్ షాపులో ఇవ్వగా షాపు యజమాని ఇది దొంగ నోటు అంటూ వెనుకకు ఇచ్చాడు. అయితే ఈ నోటు ఎలా వచ్చింది? ఎవరు ఇచ్చారనేది పూర్తిగా తెలియడం లేదు. కూలీ పనులకు వెళ్లిన వారు ఇచ్చిన డబ్బులు చేతులు మారుతుంటాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలు, మిర్చి వ్యాపారం చేసే వారి నుంచి నగదు చేతులు మారుతుంటాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యం
● గరికపాటి మోహన్‌రావు ములుగు రూరల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ, టీపీయూ బలపరిచిన వరంగల్–ఖమ్మం–నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. గతంలో గెలిసిన ఎమ్మెల్సీలు స్వార్ధప్రయోజనాలకు అధికార పార్టీలలో చేరి సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులు సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్ని కైన బలరాంను సన్మానించారు. నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ విజయచందర్‌రెడ్డి, వెన్నంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాస్కర్‌రెడ్డి, అజ్మీరా కృష్ణవేణినాయక్, కొత్త సురేందర్, బలరాం, జవహార్‌లాల్, రవీంద్రాచారి, కృష్ణాకర్, రవీందర్‌రెడ్డి, స్వరూప పాల్గొన్నారు. -
వన్య ప్రాణులకు హాని చేయొద్దు
ములుగు: వన్యప్రాణాల వేట కోసం కరెంట్ తీగలు అమర్చి వాటికి హాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా తీగలు అమర్చిన ట్లు సమాచారం అందిస్తే నగదు బహుమానం ఇస్తామని చేసిన ప్రకటనకు మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ శివారులో, 19వ తేదీ న కుమ్మరిపల్లి శివారులోని పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చినట్లు సమాచారం అందుకొని ఎస్సై వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సమాచారం అందించిన వారికి రూ.5 వేల చొప్పున రివార్డు అందించామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గతంలో విద్యుత్ తీగలు అమర్చిన వారిని గ్రామాల వారీగా గుర్తించి బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వర్‌రావులను ఎస్పీ అభినందించారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ -
మేడారానికి నిత్యం వేలాది భక్తులు
జంపన్నవాగు వద్ద డ్రెస్సింగ్ గదులు లేని చోట ఏర్పాటు చేసిన షవర్లుఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క –సారలమ్మల దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. మహాజాతర, మినీ జాతరలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నా, నిత్యం వచ్చే భక్తులు కష్టాలు తప్పడం లేదు. మేడారానికి ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ భక్తులు వందలాదిగా తరలివస్తుంటారు. సౌకర్యాలు లేమితో ఇక్కట్లు ఎదుర్కొంటున్న భక్తులు శాశ్వ త సదుపాయాలు కల్పించాలిన కోరుతున్నారు. విడిది ప్రాంతాల్లో లేని టాయిలెట్ బ్లాక్‌లు అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం శాశ్వత టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం చేపడితే ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్, చిలుకలగుట్ట, జంపన్నవాగు, ఊరట్టం క్రాస్, నార్లాపూర్ చింతల్ ప్రాంతాల్లో ఎక్కువగా భక్తులు విడిది చేస్తుంటారు. ఈ ప్రాంతాల్లో శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లను వినియోగంలోకి తీసుకొచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందని భక్తుల అభిప్రాయం. జాతర సమయంలోనే తాగు నీరు.. మహాజాతర సమయంలో మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ అధికారులు తాగునీటి కోసం బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాలను ఏర్పాటు చేస్తారు. జాతర అనంతరం వాటిని తొలగించడంతో నిత్యం మేడారానికి వచ్చే భక్తులకు తాగునీటి సమస్య జటిలంగా మారింది. ఏడాది పొడవునా తరలివచ్చే భక్తులకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి ట్యాంకుల ఏర్పాటు చేసి తాగు నీరు అందించాలని కోరుతున్నారు. మేడారానికి వచ్చే భక్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేసి వంటావార్పు, దాహం తీర్చుకోవాల్సి వస్తోంది.నిరంతర నిఘా అవసరం.. మేడారానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం పోలీస్ తరఫున నిరంతరం నిఘా ఉంచాలి. బుధ, గురు, ఆదివారాల్లో మేడారానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో.. మేడారం పరిసరాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేవాదాయ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటూ భక్తుల భద్రతకు భరోసా కల్పించాలంటున్నారు. అరకొర సదుపాయాలతో ఇక్కట్లు శాశ్వత పనులు చేపట్టాలని వేడుకోలు -
వాహనాలకు అటవీశాఖ ఫాస్టాగ్
ఏటూరునాగారం: రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు అటవీశాఖ ఆధ్వర్యంలో రుసుం వసూలు చేసే కా ర్యక్రమానికి శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి(ఎఫ్డీఓ) రమేశ్ ట్రయల్‌రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఫాస్టాగ్ తరహాలో వాహనాలకు ఆటోమెటిక్‌గా రుసుం చె ల్లించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపా రు. ఏటూరునాగారం, పస్రా, తాడ్వాయి ప్రాంతా ల్లో ఈ తరహా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా ఏటూరునాగారంలో శుక్రవారం అటవీశాఖ ఫాస్టాగ్‌ను ట్రయల్ రన్ చేపట్టి రుసుం వసూలు చేశారు. గూడ్స్ వాహనాలకు రూ.200, కార్లకు రూ.50, ఇతర వాహనాలకు వేర్వేరుగా రుసుం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్‌గా వాహనదారుడి ఖాతాల నుంచి అటవీశాఖ ఖాతాలోకి జమకావడం రాష్ట్రంలో మొదటిసారి ములుగు జిల్లాలో చేపట్టడం విశేషం. ట్రయల్ రన్ నిర్వహించిన ఎఫ్డీఓ రమేశ్ జిల్లాలో మూడు ఏర్పాటు -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
ములుగు రూరల్: పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ దివాకర అన్నారు. శుక్రవారం రాత్రి జాకారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.కలెక్టర్ దివాకర -
ఇసుక అక్రమ రవాణాకు చెక్‌పోస్ట్
ములుగు/ములుగు రూరల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం మల్లంపల్లి మండలకేంద్రంలో ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలో చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో సాయంత్రం చెక్‌పోస్టు వద్ద ఇసుక లారీలను తనిఖీ చేశారు. సమీపంలోని వేబ్రిడ్జి వద్ద కాంటా వేసి అధికలోడ్‌తో వచ్చిన లారీల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎస్పీతో పాటు ఎస్సై వెంకటేశ్వర్రావు ఉన్నారు. -
ట్యాప్స్ ఓ పక్క.. డ్రెస్సింగ్ గదులు మరో పక్క
జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునేందుకు శాశ్వతంగా మూడు డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. అందులో రెండు జంపన్నవాగు బ్రిడ్జికి దగ్గరగా నిర్మించారు. డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేస్తే జల్లు స్నానాలు చేసే మహిళలు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ గదులు వినియోగించుకోవచ్చు. కానీ, డ్రెస్సింగ్ గదులు లేని చోట షవర్ ఏర్పాటు చేయడంతో స్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. జాతర సమయంలో తాత్కాలికంగా డ్రెస్సింగ్ గదులను ఏర్పాటు చేస్తున్న అధికారులు జాతర అనంతరం వాటిని తొలగిస్తున్నారు. దీంతో శాశ్వత డ్రెస్సింగ్ గదులు ఉన్న చోట షవర్లు ఏర్పాటు చేయకపోవడం ఆ గదులు కూడా నిరుపయోగంగా మారుతుండగా.. మహిళా భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. -
కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలి
టీజీఎండీసీలో కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలని మైనింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.– 8లోuఈ ఫొటోలోని రైతు పేరు ఎల్.ఆదినారాయణ. మంగపేట మండలం పొదుమూరు గ్రామం. గోదావరి ఒడ్డు వెంట సర్వే నంబర్ 185లో 7.17ఎకరాల భూమి ఉండేది. ప్రతిఏటా వర్షాకాలంలో గోదావరి ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతూ భూమి అంతా గోదావరిలో కలిసిపోయింది. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబమంతా నేడు రోజువారీ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
పూర్తయ్యేదెప్పుడో?
మంగపేట: జిల్లాలోని మంగపేట మండల పరిధిలోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మోక్షం లభించినా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రారంభానికే పరిమతమయ్యాయి. కరకట్ట నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. మండల కేంద్రంలోని దొంగల ఒర్రె నుంచి పుష్కరఘాట్ వరకు 2.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణానికి 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.55 కోట్లు, భూ సేకరణకు రూ.55 కోట్లు మంజూరు చేసింది. కరకట్ట నిర్మాణం పనులను టెండర్ ద్వారా దక్కించుకుని ప్రభుత్వంతో అగ్రిమెంటు కుదుర్చుకున్న హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కంపెనీ కరకట్ట నిర్మాణ పనుల్లో భాగంగా 2024 జూన్‌లో గోదావరి ఒడ్డు వెంట స్లోబ్ లెవల్ పనులను ప్రారంభించింది. మంత్రి సీతక్క చొరవతోనే.. సుదీర్ఘీకాలం తర్వాత మంత్రి సీతక్క చొరవ, పట్టుదలతోనే పనులు ప్రారంభమయ్యాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట లేకపోవడంతో గోదావరి ఒడ్డు ప్రతిఏటా కోతకు గురవుతూ విలువైన సాగు భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. రైతులకు జరుగుతున్న నష్టం, ప్రతీ ఏడాది వర్షాకాలంలో గోదావరి పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు గోదావరి వరదలతో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన మంత్రి సీతక్క అసెంబ్లీ సమావేశాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. ప్రభుత్వం స్పందించే వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేయించింది. అప్పటిలాగే మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని గోదావరీ తీర ప్రాంత ప్రజలతో పాటు రైతులు కోరుతున్నారు. నాలుగు ఎకరాలు గోదావరిలో కలిసిపోయింది.. గోదావరి ఒడ్డు వెంట ఉన్న 5ఎకరాల భూమిలో 4ఎకరాలు వరద కోతకు గురై గోదావరిలో కలిసి పోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందలేదు. ఉన్న ఎకరం పొలంతో పాటు కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఎకరంలో కరకట్ట నిర్మాణానికి అర ఎకరం భూమి పోతోంది. వర్షాకాలం వరకు కరకట్ట నిర్మాణం పూర్తికాకపోతే ఉన్న భూమి కోతకు గురవుతుంది. – బొల్లె రాములు, రైతు, పొదుమూరు డిజైన్ అప్రూవల్ కాలేదు.. కరకట్ట నిర్మాణం చేపట్టేందుకు చీఫ్ ఇంజనీర్(సీడీఓ) ద్వారా డిజైన్ అప్రూవల్ కాక పోవడంతో పనులు ప్రారంభించ లేదు. డిజైన్ అఫ్రూవల్ రాగానే పనులు వెంటనే ప్రారంభిస్తాం. – రవికుమార్, ఇరిగేషన్ డీఈ●ముందుకు సాగని కరకట్ట నిర్మాణం స్లోబ్ లెవల్ పనులు ప్రారంభమై ఆగిన వైనం సమీపిస్తున్న అగ్రిమెంట్ గడువు త్వరితగతిన పూర్తిచేయాలని రైతులు, ప్రజల వేడుకోలు -
ఆడతోడు కోసం..
వాసనతో.. పదకొండు రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్దపులి ఆడపులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తుందని తెలిసింది. గోదావరి అవుతలి వైపున వేమనపల్లి మండలం నీల్వాయి అడవులకు ఓ ఆడపులి చేరి సంచరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడి మగపులి ఆడతోడు (మేటింగ్)కోసం అడవి అంతా గస్తీ చేస్తుంది. గోదావరి సరిహాద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తుందని అటవీశాఖ అధికారుల ద్వారా తెలిసింది. కొన్ని కిలోమీటర్ల మేర ఉన్న పులులు వాటి వాసనను పసిగట్టి తోడు దరిచేరుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మూత్రం, పేడ వాసనను గుర్తించి దరికి చేరుతాయి. రెండు పులుల తోడు కోసం ఏదైనా గోదావరి దాటి కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఆ దిశగా అధికారులు కూడా అన్వేషణ ప్రారంభించినట్లు తెలిసింది. కాటారం, మహదేవపూర్ మండలాల్లో దాడులు మాత్రం ఎక్కడా చేయలేదని తెలిసింది.కాళేశ్వరం: పదకొండు రోజులుగా అటవీశాఖను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి పలుగుల నుంచి బీరాసాగర్కు ప్రయాణం ప్రారంభించింది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి నుంచి మొదలైన పులి సంచారం వీరాపూర్ గుడూర్, గుండ్రాత్‌పల్లి, కుదురుపల్లి, బీరాసాగర్, అన్నా రం మీదుగా మహదేవపూర్ మండలం మద్దులపల్లి, పలుగుల వరకు కలియ తిరిగింది. గారెకుంట ఒర్రెలో మకాంవేసి గురువారం ఉదయం మళ్లీ పలు గుల మీదుగా అటవీప్రాంతం గుండా కాళేశ్వరం సమీపంలోని గ్రావిటీ కెనాల్ రోడ్డుపై పులి నడచుకుంటూ వెళ్లిన పాదముద్రలు స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. బీరాసాగర్లో కెమెరాలు.. మహదేవపూర్ రేంజ్ అధికారులు నాలుగు బృందాలతో పాటు ఎనిమల్ ట్రాకింగ్ టీంలతో కలిసి అన్వేషణ ప్రారంభించారు. సాయంత్రం వరకు బీరాసాగర్ అడవిలో పాదముద్రలు లభించారు. దీంతో అక్కడా ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోదావరితీరం, సమ్మక్క–సారలమ్మ గద్దెలు, నీటికుంటల వద్ద ఆరు కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంద్రావతి టు గోదావరితీరం.. పులుల సంచారం ఇంద్రావతి రిజర్వుఫారెస్టులో ఎక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్ వైపున మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో పులుల గణన జరుగలేదని తెలిసింది. అక్కడి నుంచి ఇంద్రావతి దాటి గోదావరి తీరం వైపునకు ప్రయాణం చేసినట్లు వాదనలు వినిపిస్తుంది. ఇంద్రావతి వద్ద పలిమెల, మహదేవపూర్ మీదుగా కాటారం నుంచి మళ్లీ బీరాసాగర్ చేరిన పులి అటు వెళ్లడానికి ప్రయత్నించిందా అనే అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే పెద్దపులిని ప్రత్యక్షంగా చూశారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కలేదు. దీంతో సంచారం భయంతో ప్రజలు రాత్రిపూట ప్రయాణాలు చేయడం లేదు. ఎఫ్ఎస్ఓ ఆనంద్‌ను సంప్రదించగా బీరాసాగర్కు పులి వచ్చినట్లు పాదముద్రలు సేకరించినట్లు తెలిపారు. అడవి మొత్తం సంచరిస్తుందని, ఒక్క దగ్గర నిలకడగా ఉండడం లేదని తెలిపారు.మంచిర్యాల జిల్లా నీల్వాయికి ఆడ పులి రాక ఆ వాసనతోనే అడవిలో తచ్చాడుతున్న మగపులి పదకొండు రోజులుగా మకాం -
నాణ్యమైన విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: వేసవి కాలం సమీస్తున్న దృష్ట్యా విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ముందస్తు కార్యచరణ చర్యలు చేపట్టామని ఎస్ఈ మల్చూరు నాయక్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం ట్రాన్స్‌ఫర్మర్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎస్ఈ మాట్లాడారు. వేసవిలో ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టంచేశారు. ఎస్ఈ వెంట డీఈ పాపిరెడ్డి, డివిజన్ అధికారులు ఉన్నారు.ఎస్ఈ మల్చూరు నాయక్ -
నర్సిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి
ఏటూరునాగారం: ఈ నెల 27న జరగనున్న వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు అన్నారు. మండల పరిధిలోని యూటీఎఫ్ మండల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరేళ్లుగా నిజమైన ఉపాధ్యాయ ప్రతినిధిగా వ్యవహరించారని తెలిపారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వివరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పోడెం సమ్మయ్య, మండల అధ్యక్షులు కిరణ్, ప్రసాద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయంలో ఈ నెల 26నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌శాఖ తరఫున ములుగు డీఎస్పీ నలువాల రవీందర్ గురువారం పరిశీలించారు. ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, స్వామివారి కల్యాణం నిర్వహించే ప్రాంతం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను చూశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసు శాఖ తరఫున పర్యవేక్షణ చేపడతామని వివరించారు. రామప్ప చెరువులో బోటింగ్, స్నానాలకు అనుమతి లేదన్నారు. 26నుంచి 28వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఇద్దరు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 12మంది ఎస్సైలతో కలిపి 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎస్పీ వెంట సీఐ శంకర్, ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి గోవిందరావుపేట: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ విభాగం జిల్లా లీగల్ అధికారి డి.సంజీవ అన్నారు. మండల పరిధిలోని చల్వాయి కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయంతో పాటు చట్టాలపై వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయం గురించి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల స్పెషల్ ఆఫీసర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదువుకుని ఉన్నత స్థానంలోకి చేరుకోవాలన్నారు. కలాం స్ఫూర్తి యాత్ర భూపాలపల్లి అర్బన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో నిర్వహిసుత్న్న కలాం స్ఫూర్తి యాత్ర గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు అవసరమని తెలిపారు. ఈ సందర్శనలో బృందం సభ్యులు విద్యార్థులతో ఆసక్తికరంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు మధులాష్‌బాబు, దిలీప్‌కుమార్, సాయి సుబ్రమణ్యం, రోహిత్ జలగాం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పన్నుల చెల్లింపునకు సహకరించాలి భూపాలపల్లి అర్బన్: ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని 8, 10వ వార్డులో గురువారం కమిషనర్ పర్యటించారు. కాలనీ శానిటేషన్ పనులు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ, రోడ్లు శుభ్రం ఉంచటం, డ్రెయినేజీల శుభ్రత గురించి కాలనీవాసులతో మాట్లాడారు. కాలనీల్లో సమస్యలు పేరుకుపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పన్నులు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ దేవేందర్, వార్డు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామీణ రోడ్లకు మహర్దశ
ఏటూరునాగారం: ఏజెన్సీలోని ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని మట్టిరోడ్లకు మహర్దశ వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పరిస్థితిని గుర్తించిన పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క జిల్లాలోని 10మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు పంచాతీరాజ్శాఖ ద్వారా రూ. 33.25 కోట్లతో 33.26 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మాణ పనులకు శ్రీకాం చుట్టారు. ఇందుకోసం పరిపాలన అనుమతులు వచ్చాయి. ఎన్నికల కోడ్ రావడంతో టెండర్ల ప్రక్రియను తాత్కాలిక నిలిపివేసినట్లు సమాచారం. ఎ న్నికల అనంతరం పనులు మొదలుకానున్నాయి. నిధుల కేటాయింపు ఇలా.. ఏటూరునాగారం మండల పరిధిలోని ఏటూరునాగారం, ఆకులవారిఘణపురం నుంచి ఎక్కెల వరకు 3కిలోమీటర్ల రోడ్డుకు రూ.3.05కోట్లు, చిన్నబోయినపల్లి బీటీ రోడ్డు నుంచి పెద్ద వెంకటాపురం వరకు 2కిలోమీటర్ల రోడ్డుకు రూ.2కోట్లు, గోగుపల్లి నుంచి జీడివాగు వరకు 1.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.60కోట్ల నిధులు కేటాయించారు. అలాగే బూటారం నుంచి గుండెంగవాయి 6.50 కిలోమీటర్ల రోడ్డుకు రూ.6.60కోట్లు, చెల్పాక ఆర్అండ్బీ నుంచి గుర్రాలబావి గ్రామం వరకు 1.80 కిలోమీటర్లకు రూ. 1.95 కోట్లు మంజూరు అయ్యాయి. అలాగే గోవిందరావుపేట మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ముత్తాపురం వరకు 1.66 కిలో మీటర్లకు రూ.2కోట్లు మంజూరు ఇచ్చారు. అలాగే కన్నాయిగూడెం మండల పరిధిలోని బీటీ రోడ్డు నుంచి సర్వాయి గ్రామానికి 11.40 కిలోమీటర్ల రోడ్డుకు రూ.11 కోట్లు, బుట్టాయిగూడెం నుంచి ఎస్టీ కాలనీ ముప్పనపల్లి వరకు 1.20 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.45 కోట్లు, కన్నాయిగూడెం ప్రధాన రోడ్డు నుంచి బుట్టాయిగూడెం మీదుగా సర్వాయి రోడ్డు వరకు 1.20 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1.60 కోట్లు కేటాయించారు. ఏజెన్సీలోని పది గ్రామాలకు చెందిన రోడ్లను పూర్తిగా బీటీ రోడ్లుగా మార్చేందుకు రూ.33.25 కోట్ల నిధులను వెచ్చించనున్నారు. రూ.33.25కోట్ల నిధులు మంజూరు ఎన్నికల కోడ్ అనంతరం టెండర్ల ప్రక్రియ పూర్తి -
పనులను పరిశీలించిన కలెక్టర్
కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించిన క్రమంలో కలెక్టర్ టీఎస్.దివాకర 2024 జూన్ 20న సందర్శించారు. సంబంధిత ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే ఒడ్డు వెంట ఉన్న సాగు భూములు కోతకు గురికాకుండా ఉండడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతం వెంట ఉన్న లోతట్టు వరద ముంపు గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. కరకట్ట నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను దిగుమతి చేసుకుని నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కరకట్ట పనులను మంత్రి సీతక్క చేత అధికారికంగా ప్రారంభించేందుకు శిలాఫలకం వంటి తదితర ఏర్పాట్లు చేశారు. అనంతరం వర్షాల కారణంగా అంతటితో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్నా నేటి వరకు ఆ పనుల గురించి పట్టించుకున్న వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి
ములుగు: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దడిపై సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మండలాల వారీగా ఉన్న పైపులైన్లు, వాటి స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాలకు నీటి కొరత లేకుండా ఎదురుకాకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజూ నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా పైపులైన్లు లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో నీటి వనరుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు స్థానిక అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. గతేడాది జిల్లాలో నీటి సమస్య ఎదురైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా సమస్య పరిష్కారానికి ముద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. పైపులైన్ల ద్వారా నీటిని అందించలేని పక్షంలో ఆ గ్రామాలకు, కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు), ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశం, ఈఈ సుభాష్, డీపీఓ దేవరాజ్, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ అటవీగ్రామంలో పోడు చేస్తున్నారన్న సమాచారంతో గురువారం డీఆర్ఓ ఉషారాణి ఆధ్వర్యంలో ఫారెస్టు అధికారులు, సిబ్బంది రైతుల ను అడ్డుకున్నారు. దీంతో రైతులకు, ఫారెస్టు అధి కారుల మధ్య జరిగిన తోపులాటలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఫారెస్టు అధికారులు రైతులపై దాడులు చేశారని, ఈ దాడుల్లో ఇద్దరికి గాయాలయ్యాయని, లంచం ఇవ్వకుంటే దాడులు చేయించిందని ఆరోపిస్తూ.. అధికారిణిపై గురువారం భూ పాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు రైతులు చేశారు. విధులకు అటంకం కలిగించారని రైతులపై ఫారెస్టు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. రైతులు ఏమంటున్నారంటే.. ‘మేము 10 కుటుంబాలకు చెందిన వారము. గత 30ఎళ్లుగా ఆజాంనగర్లో పోడు వ్యవసాయంమీద బతుకుతున్నాం. గతేడాది జూన్ మాసంలో అధికారిణి సాగు అడ్డుకుందని, దీంతో 10 మంది రైతులం కుటుంబానికి రూ. 50వేల చొప్పున రూ. 5లక్షలు లంచం ఇవ్వడంతో పత్తి పంటసాగుకు అనుమతి ఇచ్చింది’ అని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది మరో రూ.2లక్షలు కావాలని అడిగిందని, ఇవ్వకపోవడంతో సిబ్బందితో జేసీబీలతో గుంతలు చేయడానికి భూముల మీదకు రావడంతో అడ్డుకున్నామని, అధికారులు, సిబ్బంది ఇస్టానుసారంగా తమపై దాడులు చేసి ముగ్గురిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణల్లో నిజం లేదు.. రైతుల దాడిలో ఫారెస్టు అధికారుల జీపు అద్దం ధ్వంసమైందని, ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయని, ఆరుగురు రైతులపై ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. లంచం తీసుకున్నట్లు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, తప్పుడు ఫిర్యాదు చేయించారని అధికారిణి ఉషారాణి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు ముగ్గురు రైతుల తరలింపు లంచం తీసుకున్నారని అధికారిణిపై పోలీసులకు రైతుల ఫిర్యాదు -
డిజిటల్ అరెస్టులపై అవగాహన
ములుగు: సైబర్ నేరాల్లో భాగంగా జరుగుతున్న డిజిటల్ అరెస్టులపై జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట గురువారం సేయింట్ ఆంథోనీస్ విద్యార్థినులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఖాతాదారులకు అవగాహన కల్పించారు. పరిచయంలేని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్కాల్స్లను రిసీవ్ చేసుకోవద్దన్నారు. బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలను వెల్లడించకూడదని ఖాతాదారులకు ప్లకార్డుల ద్వారా వివరించారు. బ్యాంకు ఖాతాలు, సైబర్ నేరాలపై ఎలాంటి ఇబ్బందులు వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాధు చేయాలని స్కీట్ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యేరవ కవితరెడ్డి, హెచ్ఎం కందాల రమేష్, డైరెక్టర్ వెంకటప్పారెడ్డి, బొల్లం రవి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహార లోపంతోనే కంటి సమస్యలు
ములుగు: రోజువారీగా తీసుకునే పోషకాహార లోపంతోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పాఠశాల విద్యార్థులకు బుధవారం కంటి రీ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించగా ఆయన హాజరై వైద్యులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువ సేపు టీవీల చూడడం మానుకోవాలన్నారు. మొదటి, రెండో దఫాలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల్లో 1,427 మందికి కంటి సమస్య ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ఆర్బీఎస్కే తరఫున రోజుకు 100 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చామని వెల్లడించారు. అనంతరం ఆర్బీఎస్కే వైద్యులు, ఫార్మాసిస్టులు, ఆరోగ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్ధిష్ట సమయంలో విద్యార్థులకు కంటి రీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, ఏరి యా ఆస్పత్రి ఆర్ఎంఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్బీ ఎస్కే ప్రోగ్రాం అధికారి రణధీర్, మాతా సంరక్షణ, పోషకాహార ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, వైద్యులు ఆఫ్రీన్, నరహరి, శ్రీనివాస్, మల్లికార్జున్, శ్రీలత, జయప్రద, సుజాత, వెంకటేశ్, ప్రత్యూష, తిరుపతి, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పలువురు వైద్యాధికారులతో ఆయ న జూం మీటింగ్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 30 సంవత్సరాలు పైబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల ని సూచించారు. ఈ నెల 20నుంచి మార్చి 31వరకు అసంక్రమిత వ్యాధులు హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ నిర్థారణకు టెస్టులు నిర్విహించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 76శాతం స్క్రీనింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. మిగితా వారికి ప్రత్యేక డ్రైవ్‌లో పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య మందిర్ సందర్శన వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని జవహర్‌నగర్‌లో గల ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ను బుధవారం డీఎంహెచ్ఓ గోపాల్‌రావు సందర్శించారు. ఆరోగ్యమందిర్‌లో సాగుతున్న జాతీయ నాణ్యత ప్రమాణాల ఆసెస్మెంట్ను పరిశీలించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. జాతీయ నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ పొందడం వల్ల ఆరోగ్య కేంద్రంలో సదుపాయాలు, మౌలిక వసతులు మెరుగుపడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ డీఎంహెచ్ఓ విపిన్‌కుమార్, డీపీఓ చిరంజీవి, పీహెచ్సీ వైద్యులు శ్రీకాంత్, సంఘమిత్ర, చందన, సూపర్వైజర్ పుష్పకుమారి పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్‌రావు -
ఆర్థిక ఒడిదుడుకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.... ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణ వాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74.549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం)మంది పట్నవాసం చేస్తున్నారు. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగర జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 17,684 16,181 19,877 23,868 వరంగల్ రూరల్ 12,903 13,901 16,509 18,677 జనగామ 10,939 10,353 11,672 13,875 మహబూబాబాద్ 12,244 13,092 16,317 18,245 జేఎస్.భూపాలపల్లి 12,157 10,298 11,848 11,481 ములుగు 5,695 5,382 6,147 7,583తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477లు తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317లతో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278లున్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
గోవిందరావుపేట: చట్టాలపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ అన్నారు. మండల పరిధిలోని ప్రాజెక్ట్ నగర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోటార్ వెహికల్ చట్టం, విద్యాహక్కు చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మికుల చట్టం, ఆస్తిహక్కు చట్టం, ఫోక్సో చట్టాల పట్ల అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా, గౌరవ మర్యాదలతో మెలగాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సలహాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజుకుమార్, ఏజీపీ చంద్రయ్య, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్ -
పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
ములుగు రూరల్: రైతులు పండించిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.అమ్జద్‌పాషా బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పత్తి పంట 15 వేల ఎకరాలలో సాగు చేశారని వివరించారు. సీసీఐ సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని వివరించారు. వెంటనే అధికారులు స్పందించి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలి
ములుగు: ఈ నెల 26నుంచి 28వ తేదీ వరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి మహోత్సవ వేడుకలను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు(స్థానిక సంస్థలు) సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ నలువాల రవీందర్, రామప్ప ఆలయ ఈఓతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప జాతర నిర్వహణకు అదనపు బస్సులు నడిపించడానికి ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, దేవాలయం సమీపంలో వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంపుల ఏర్పాటు, ఫైర్ ఇంజన్ సౌకర్యం, హెల్ప్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతిరోజూ శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలని తెలిపారు.అదనపు కలెక్టర్ సంపత్‌రావు -
సుడిబాకలో హైనా సంచారం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని సుడిబాక గ్రామ శివారులోని పంట పొలాల్లో హైనా సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ సెక్షన్ అధికారి దేవయ్య కథనం ప్రకారం.. గ్రామ శివారులో రైతు పూనెం సుక్రు మొక్కజొన పంట వేశాడు. అడవి జంతువులు పంటను పాడు చేయకుండా కాపలా ఉంటున్నాడు. మంగళవారం రాత్రి పెంపుడు కుక్కను చేను వద్ద మంచెకు కట్టేసి భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. అనంతరం తిరిగి చేను వద్దకు వెళ్లే సరికి కుక్క చనిపోయి ఉంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న పాదముద్రలను చూసి పెద్దపులి అడుగులు అనుకుని భయంతో గ్రామంలోకి వెళ్లి పలువురికి విషయం తెలిపారు. దీంతో బుధవారం ఉదయం గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారి వచ్చి పరిశీలించగా హైనా పాదముద్రలని ధ్రువీకరించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు -
ఆర్థిక ఒడిదుడుకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.... ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణ వాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74.549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం)మంది పట్నవాసం చేస్తున్నారు. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగర జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 17,684 16,181 19,877 23,868 వరంగల్ రూరల్ 12,903 13,901 16,509 18,677 జనగామ 10,939 10,353 11,672 13,875 మహబూబాబాద్ 12,244 13,092 16,317 18,245 జేఎస్.భూపాలపల్లి 12,157 10,298 11,848 11,481 ములుగు 5,695 5,382 6,147 7,583తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477లు తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317లతో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278లున్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
ములుగు రూరల్: రైతులు పండించిన పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.అమ్జద్‌పాషా బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పత్తి పంట 15 వేల ఎకరాలలో సాగు చేశారని వివరించారు. సీసీఐ సాంకేతిక కారణాలతో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నారని వివరించారు. వెంటనే అధికారులు స్పందించి సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
ములుగు: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దివాకర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని సూచించారు. ఎలాంటి సమప్యలు ఎదురైనా ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. ములుగు మండలం 9440814942, మల్లంపల్లి మండలం 8333923909, వెంకటాపురం(ఎం) 944 0814859, గోవిందరావుపేట 9440814857, ఎస్ఎస్ తాడ్వాయి 7901678229, ఏటూరునాగారం మండలం 9440814867, కన్నాయిగూడెం 7901678232, మంగపేట 9440814941, వాజేడు 9440159490, వెంకటాపురం(కె) 944081475 మండలంలో ఆయా సెల్ నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని సూచించారు. చిన్నబోయినపల్లి వేబ్రిడ్జి తనిఖీ ఏటూరునాగారం: మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక లారీలను తరలించకుండా ఉండేందుకు చిన్నబోయినపల్లిలో ఏర్పాటు చేసిన వేబ్రిడ్జి చెక్ పాయింట్‌ను ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకే లారీల్లో ఇసుక వెళ్లేలా వేబ్రిడ్జి సిబ్బంది చూడాలన్నారు. ఇసుక క్వారీల నుంచి వచ్చే వే బిల్లులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. వే బ్రిడ్జి సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే చ ర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక తవ్వకాలు జరిపే అవకాశం ఉన్న నదులు, వాగుల వద్ద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్, మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి, సిబ్బంది పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ అద్భుతం వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయ శిల్ప కళ అద్భుతమని అమెరికాకు చెందిన జెస్సికా, విక్కిజెండర్లు కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని వారు బుధవారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా 800 ఏళ్ల క్రితం ఎలాంటి యంత్రాలు లేకుండా ఆలయాన్ని ఇంత అద్భుతంగా నిర్మించడం గ్రేట్ అని కొనియాడారు. కాగా అమెరికాకు చెందిన విక్కిజెండర్ కూతురు జెస్సికా ఇటీవల హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన సతీష్‌ను ఈనెల 16న ప్రేమ వివాహం చేసుకుంది. రామప్పను సందర్శించిన జెస్సికా, విక్కిజెండర్లతో పాటు సతీ ష్ కుటుంబసభ్యులు రుఘునాథ్రావు, సత్యనారాయణరావు, శంకర్, ఓదేలు ఉన్నారు. న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమం వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమం చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహం ఆవరణలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల ఆదివాసీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. మండల కేంద్రంలో మార్చి 9న నిర్వహించే న్యాయ నిపుణుల సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనితి వెంకటకృష్ణ, పూనెం ప్రతాప్, బొచ్చా నర్సింహారావు, కాక శేఖర్, జయబాబు, రాజబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు
ములుగు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీరు, విద్యుత్ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, వేసంగిలో సాగునీరు, రైతు భరోసా, సంక్షేమ వసతి గృహాల తనిఖీ, ప్రజాపాలన కుటుంబ సర్వే దరఖాస్తుల ఆన్లైన్ తదితర అంశాలపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్‌తో ఆమె మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. యాసంగి పంటలకు సాగునీటి సమస్య రాకుండా ప్రాజెక్టులు చెరువుల్లో నీటి లభ్యతను పరిశీలించాలన్నారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ నీటి వాడకాన్ని అరికట్టాలని సూచించారు. యూరియా కొరత లేకుండా చూడాలని, వ్యవసాయం, తాగునీటి సరఫరాకు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశించారు. ప్రజా పాలనలో రేషన్ కార్డులకు వచ్చిన దరఖాస్తుల్లో అర్హులందరికీ అందజేయాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు. క్రమం తప్పకుండా వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. తాగునీటి కొరత వచ్చిన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, స్థానిక వనరులను గుర్తించడంతో పాటు లీకేజీలను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, పీఆర్‌ఈఈ, డీసీఎస్ఓ, డీఏఓ, ట్రాన్స్‌కో డీఈ తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
నేడు తిరుగువారం పండుగ
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క–సారలమ్మ పూజారులు నేడు (బుధవారం) తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి తిరుగువారం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవార్ల వస్త్రాలు, పూజా సామగ్రిని భద్రపరుస్తారు. అమ్మవార్లకు యాట నైవేద్యంగా సమర్పించనున్నారు. తిరుగువారం పండుగ రోజు పూజారుల కుటుంబీకులు, స్థానిక గ్రామస్థులు ఇళ్లను శుద్ధి చేసుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. తిరుగువారం పండుగతో మినీజాతర (మండమెలిగె) పండుగ పూజా కార్యక్రమాల ముగియనున్నాయి. సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఏటూరునాగారం: సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని పీఎం ఎస్ఆర్ఐ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ లక్ష్మణ్ తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 130 మంది మంగళవారం హనుమకొండలోని ఎన్ఐటీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య, శాసీ్త్రయ విద్య పెంపొందించేందుకు స్టెమ్ సంస్థ ద్వారా స్టడీ టూర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ టూర్లో పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య, రాజు, రజిని, రజిత పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తం ములుగు రూరల్: విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సర్కిల్ డీఈఈ(టెక్నికల్) వెంకటేశం, ములుగు డీఈఈ నాగేశ్వర్‌రావులు సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని జగ్గన్నపేట రైతులకు మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కెపాసిటర్లు బిగించడం వల్ల కలిగే లాభాలను వివరించారు. విద్యుత్ పరికరాలను తడి చేతులతో ముట్టుకోకూడదని, చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడకూడదని సూచించారు. విద్యుత్ సర్వీస్ వైరు నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఏడీఈ వేణుగోపాల్, ఏఈ బానోత్ రవి, ఏఎల్ఎం కమలాకర్, రైతులు పాల్గొన్నారు. ‘పది’ ఫలితాలపై ప్రత్యేక దృష్టి వెంకటాపురం(కె): పదో తరగతి విద్యార్థులు ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏటీడీఓ క్షేత్రయ్య ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉన్న ఉపాధ్యాయులు, సిలబస్ పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమపాఠశాల సందర్శన వాజేడు: మండల పరిధిలోని పేరూరు ఆశ్రమ పాఠశాల, హాస్టల్‌ను డీఎంహెచ్ఓ గోపాల్‌రావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లోని వంటశాలను పరిశీలించి పలు సూచనలను చేశారు. దోమలు లోపలికి రాకుండా కిటికీలకు జాలీలను ఏర్పాటు చేయడంతో పాటు దోమ తెరలను వాడాలని సూచించారు. విద్యార్థుల సిక్ రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పేరూరులోని సోయం వినీత్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి విద్యార్ధి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం వాజేడు వైద్యశాలను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. -
రోజుకో చోట..
కాటారం/కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామ అటవీప్రాంతంలో మంగళవారం పెద్దపులి కనిపించింది. పదిరోజులుగా పెద్దపులి కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్టవేసి అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఫిబ్రవరి 10న కాటారం మండలం నస్తూర్‌పల్లి శివారులో ఓ రైతు పులి పాదముద్రలు(పగ్మార్క్) చూసి భయాందోళనకు గురయ్యాడు. మహదేవపూర్ మండలం అన్నారం, బీరాసాగర్, కుదురుపల్లి అడవిలో రెండు రోజులు సంచరించింది. దీంతో అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి మాత్రం కెమెరాల్లో చిక్కడం లేదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా.. నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు(ప్లగ్ మార్క్స్) గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి కదలికలపై దృష్టి సారించారు. మొదటి రోజు కాటారం, మహదేవపూర్ రేంజ్ పరిధిల్లోని అటవీ ప్రాంతం మొత్తాన్ని అధికారులు, సిబ్బంది జల్లెజ పట్టారు. పులి ఆనవాళ్లు కానరాకపోవడంతో నస్తూర్‌పల్లి, వీరాపూర్, అన్నారం, బీరాసాగర్, మహదేవపూర్ అటవీప్రాంతాల్లో ఝెనిమల్ ట్రాకర్ నిపుణులతో కలిసి ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరు బృందాలుగా విడిపోయి అటవీశాఖ అధికారులు పులి జాడను కనుక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ పులి ఎక్కడ కూడా ట్రాకింగ్ కెమెరాలకు చిక్కకుండా సంచరిస్తుంది. గారెకుంటలో నీరుతాగి.. మంగళవారం ఏకంగా మహదేవపూర్ మండలం పలుగుల ఎస్సీకాలనీ పక్కన నీలగిరి వనంలో పులి సంచారం చేసింది. అదేగ్రామానికి చెందిన నిట్టూరి బాపు అనే రైతు ఎడ్లబండితో పత్తిచేనుకు వెళుతున్నాడు. కొంత దూరం నడిచిన ఎద్దులు ముందుకు నడిచేందుకు వెనుకడుగు వేశాయి. రైతు ఎద్దులను దబాయించినా ముందుకు సాగలేదు. దీంతో రైతు పరీక్షించి చూడడంతో ముందు పెద్దపులి నడుచుకుంటూ వెళ్తోంది. దీంతో రైతు భయానికి గురై వెంటనే ఎడ్ల బండిని వెనుకకు తిప్పి ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పులికోసం చెట్టు, పుట్ట, వాగు, వంకల్లో ముమ్మరంగా అన్వేషించారు. గారెకుంట పొచమ్మ కుంట వద్ద పులి నీరుతాగి వెళ్లినట్లు పాదముద్రలను అధికారులు సేకరించారు. అక్కడి నుంచి కాళేశ్వరం వైపున నల్లవాగుకు చేరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పెద్దపులి రోజుకో చోట కనిపిస్తుండటంతో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి సమీపంలోని పంట పొలాల వద్దకు వెళ్లడానికి అన్నదాతలు జంకుతున్నారు. పలుగుల అటవీప్రాంతంలో పెద్దపులి.. 10రోజులుగా కాటారం, మహదేవపూర్ అడవుల్లో తిష్ట ట్రాకింగ్ కెమెరాలకు చిక్కని ౖటైగర్ అటవీశాఖ అధికారులకు ముప్పు తిప్పలు -
ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి
వాజేడు/గోవిందరావుపేట: ఉపాధ్యాయులు సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అకాడమి మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండలాల ఉపాధ్యాయులకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ట్రైనింగ్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. రానున్న కాలంలో ఇంటర్నెట్ ప్రభావం మరింత పెరిగి దానికి అనుగుణంగా పనులు జరుగుతాయన్నారు. దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణలో ఇచ్చే సూచనలు పాటించి విద్యార్థులకు బోధిస్తే మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఎంఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాట్ ప్యానెల్ గురించి తెలుసుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాజేడు ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు, హిందీ రీసోర్స్ పర్సన్స్ స్వరూప్ సింగ్, జాకీర్ అలి లఖావత్ బాలాజీ, అశోక్, రమేష్, సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అథిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులంతా ఈ విషయాన్ని గుర్తించి నూతన సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గొంది దివాకర్, శ్యాంసుందర్ రెడ్డి, షేక్ హాజీ నూరానీ, పాడ్య రవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి మల్లారెడ్డి -
సమస్యలపై పోరాడే వ్యక్తిని గెలిపించాలి
ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడే వ్యక్తి పులి సరోత్తంరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్ కోరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శాసన మండలి ఎన్నికలపై ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరంగల్–ఖమ్మం–నల్లగొండ బీజేపీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిని గెలిపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘ కాలంగా ఆయన పోరాటం చేస్తన్నారని తెలిపారు. సరోత్తం రెడ్డి గెలిస్తే ఉపాధ్యాయుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు సరోత్తం రెడ్డికి వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, విశ్వనాథ్, రాజ్‌కుమార్, నాగరాజు, దేవేందర్‌రావు, రవిరెడ్డి, రాకేష్‌యాదవ్, సురేష్, రాకేష్‌రెడ్డి, టీపీఎస్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్రవర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాటాల్డారు. ఎమ్మెల్సీగా సరోత్తం రెడ్డికి ఉపాధ్యాయులు ఓటువేసి గెలిపిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప ల్లా బుచ్చయ్య, సురేందర్, రవీందర్, జనార్ధన్, స మ్మక్క, సంగీత, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ గోడే నగేశ్ వనదేవతలకు పూజలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి విజయం సాధించేలా సమ్మక్క సారలమ్మలు దీవించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి పక్షాన ప్రచారం చేసేందుకు జిల్లాకు వచ్చిన సందర్భంగా సరోత్తంరెడ్డితో కలిసి అయన మంగళవారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పూజాలు చేశారు. అమ్మవార్ల ఆశీస్సులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. -
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి/మంగపేట: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లాలోని నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక లారీలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీల నుంచి ఇసుక తొలగించారు. వాజేడు, మంగపేట, వెంకటాపురం, మండలాల్లోని ఇసుక క్వారీల నుంచి వచ్చే లారీలను తనిఖీ చేసేందుకు పకడ్బందీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను కేటాయించింది. ఇసుక లారీల్లో అధిక లోడు, జీరో బిల్, డబుల్ నంబర్లు, ఇతరత్రా అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం స్పెషల్ క్రైం బ్రాంచ్ పోలీసులు, రెవెన్యూ, స్థానిక పోలీసులు, జీపీ సిబ్బందిని ప్రత్యేక క్యాంప్‌లకు కేటాయించింది. దీంతో ఆయా శాఖల అధికారులు ఉదయం 6నుంచి సాయంత్రం 6వరకు తనిఖీలను చేపడుతున్నారు. ఇసుక క్వారీల్లో టీఎస్ఎండీసీ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడి ఇసుక రీచ్ రేజింగ్ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి అక్రమ వ్యాపారం సాగిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. దీంతో ములుగు, ఏటూరునాగా రం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి, మంగపేట మండల పరిధిలోని కమలాపురం, ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కాటాపూర్ క్రాస్ వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. దీంతో ఆయా చెక్ పోస్టుల వద్ద అధికారులు ఇసుక లారీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న లారీలను అనుమతిస్తున్నారు. సరైన పత్రాలను లేని లారీలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు ఇసుక లారీలు సీజ్ చర్ల మండలం వీరాపురం నుంచి అధికలోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు ఇసుక లారీలను సీజ్ చేసినట్లు రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ గంపల శంకర్ తెలిపారు. ఏటూరునాగారం మండల పరిధిలోని చిన్నబోయినపల్లి వద్ద సీసీఎస్, కానిస్టేబుల్, రెవెన్యూ అధికారుల టీం ఇసుక లారీలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పరిమితికి మించి ఇసుక ఉండడంతో దానిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు శంకర్ వెల్లడించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులను సంప్రదించగా వివరాలు వెల్లడించలేదు. అక్కడ నింపుడు.. ఇక్కడ తీసుడు.. టీఎస్ఎండీసీ అధికారులు ఇష్టారీతిన ఇసుక రీచ్‌లలో లారీల్లో ఇసుక నింపుతుండగా వేబ్రిడ్జిల వద్ద అదనంగా ఉందని ఇసుక తీస్తూ ఇబ్బంది పెడుతున్నారని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లి, కమలాపురం వే బ్రిడ్జిల వద్ద అధికారులు కాంటా పెట్టి అదనంగా ఉన్న ఇసుకను తీసివేస్తేనే పాసింగ్ ఆర్డర్‌తో వే బిల్లులను ఇస్తామని నిబంధనలు విధించారు. దీంతో ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఆయా వేబ్రిడ్జీల వద్ద లారీలు క్యూ కట్టాయి. అక్కడ అదనంగా నింపుడు ఎందుకు ఇక్కడ నింపిన ఇసుక తీయించడం ఎందుకని అధికారుల తీరుపై లారీ డ్రైవర్లు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఇసుక క్వారీల వద్దనే వేబ్రిడ్జిని ఏర్పాటు చేసి అనుమతి మేరకు లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు. జిల్లాలో నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు తనిఖీల కోసం అధికారుల కేటాయింపు -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. రాత్రి చలిగా ఉంటుంది.రెండు పంటలు పండిస్తున్నా.. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 20 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. 200 అడుగుల నుంచి బోరు బావులకు నీరు పడుతుండడంతో నేను కూడా బోరు వేయించాను. రెండు పంటలకు పుష్కలంగా నీరు అందుతోంది. పంటల సాగుకు ఎలాంటి డోకా లేదు. ప్రభుత్వం స్పందించి రైతుల కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. – భూక్యా లచ్ము, భాగ్యతండా రైతులకు సూచనలు చేస్తున్నాం.. ప్రతీ ఏడాది భూపాల్‌నగర్, రామచంద్రాపురం క్లస్టర్ ఏరియాల్లో రెండు పంటలు పండుతున్నాయి. భూగర్బ జలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతోపాటు నిమ్మనగర్ వద్ద దేవాదుల నీటి సరఫరా పాయింట్ ద్వారా సమీప చెరువులకు నీళ్లు అందుతున్నాయి. ఈ ప్రాంతంలో వరితోపాటు, మొక్కజొన్న ప్రధాన పంటగా సాగు అవుతోంది. – కావ్య, ఏఈఓ, భూపాల్‌నగర్ క్లస్టర్ -
స్వచ్ఛమైన పెట్రోల్ అందిస్తాం
జైళ్ల శాఖ ద్వారా స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ అందిస్తామని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా తెలిపారు.– 8లోuపంపుసెట్ నుంచి పంట పొలంలోకి పారుతున్న నీరు200 అడుగుల నుంచే పుష్కలంగా నీరు రామచంద్రాపురం, భూపాల్‌నగర్ పరిధిలోని గుర్తూరు తండా, యాపలగడ్డ, భాగ్యతండా, రహీంనగర్, రావోజీ తండా, సాంక్రు తండా, కొడిశల కుంట, చంద్రుతండా, మాన్సింగ్ తండా, రామచంద్రాపురం, పందికుంట, శివతండా, వెంకటేశ్వర్లపల్లి, నౌశ్యతండా, ముద్దునూరుతండా, దేవనగర్ గ్రామాల్లో మొక్కజొన్నతో పాటు వరిసాగు ప్రత్యేక ఆధార పంటగా రైతులు సాగుచేస్తారు. ఇక్కడి రైతులు కాలనుగుణంగా పంటల సాగు చేపడడంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. గతేడాది ఈ ప్రాంతంలో జనవరి మాసం వరకు భూగర్భ జలాలు 6.92 మీటర్ల అడుగులో నీరు ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు 7.42 మీటర్ల అడుగులో భూగర్భ జలాలు నిల్వ ఉన్నాయి. -
ప్రజాసమస్యలపై పోరాడేందుకే పోటీ
హన్మకొండ: ‘ప్రజాసమస్యలపై పోరాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. బీజేపీకి సానుకూల వాతావరణం ఉంది.. గెలుస్తాం’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేధ బాంక్వెట్ హాల్లో విలేకరులతో, సత్యం కన్వెన్షన్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ విత్ టీచర్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నదని, పార్టీకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నదని చెప్పారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో అసంతృప్తి మూటగట్టుకుంటే.. కాంగ్రెస్ ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని అన్నారు. గ్యారంటీలు, హామీల అమలులో.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సభ్యులందరినీ మూకుమ్మడిగా తమ పార్టీలో చేర్చుకుని శాసన మండలి ఉద్దేశాలను దెబ్బతీశారని అన్నారు. నల్లగొండ–వరంగల్–ఖమ్మం ఉపాధ్యాయ స్థానం నుంచి పులి సరోత్తంరెడ్డి, మెదక్–కరీంనగర్–నిజామాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ స్థానం నుంచి కొమురయ్య, పట్టభద్రుల స్థానం నుంచి అంజిరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, అందరూ విజయం సాధించి తీరుతారని పేర్కొన్నారు. సరోత్తంరెడ్డికి ఉపాధ్యాయుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని సంఘాలు అభిమానించే వ్యక్తి అని చెప్పారు. జేఏసీలోని సంఘాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు, ఆర్.పి.జయంత్‌లాల్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, గుజ్జ సత్యనారాయణ, చాడా శ్రీనివాస్‌రెడ్డి, చాడా సరిత, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి -
కార్పొ‘రేట్’ వేట
భూపాలపల్లి అర్బన్: కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థుల కోసం ఇప్పటినుంచే వేట మొదలుపెట్టాయి. టెన్త్ వార్షిక పరీక్షలు ప్రారంభం కాకముందే పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థులను కళాశాలల్లో చేర్చుకునేలా కార్యాచరణను ముమ్మరం చేశాయి. పాఠశాలల యాజమాన్యాలకు భారీగా ముడుపులు అందించి ఏఏ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారో వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో చదువు బాగుందని, ఇక్కడ చదవిన వారు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్‌లు అయ్యారని ప్రచారం చేస్తున్నారు. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల్లో పీఆర్ఓల సందడి కనిపిస్తుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పలు కార్పొరేట్ కళాశాలల గురించి వివరాలు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులతో పాటు మొదటి సంవత్సరం నుంచి ఇంజనీరింగ్, మెడిసిన్, ఎయిమ్స్ సూపర్ 60, ఇంజనీరింగ్‌లో ఐఐఐటీలతో పాటు గ్రూప్స్‌కు సంబంధించిన శిక్షణ ఇస్తామని చెబుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి వివరాల సేకరణ కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమ సంస్థల తరఫున పీఆర్ఓలకు ఏర్పాటు చేసుకున్నాయి. వారి ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు నజరానాలు ప్రకటించి, విద్యార్థుల వివరాలు సేకరించుకొని ఏ ప్రైవేట్ పాఠశాలలో ఎంత మంది ఉన్నారో, వారు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అన్న విషయాలను ఆరా తీస్తున్నాయి. సుమారు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు పీఆర్ఓలకు నజరానాలు ఇచ్చి విద్యార్థుల వివరాలను సేకరించి ఆ వివరాల ఆధారంగా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ఆదేశాలు బుట్టదాఖలు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కోసం ఎవరూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు గతంలోనే జారీ చేశారు. అయినా వాటిని బేఖాతరు చేసి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు పీఆర్ఓలను రంగంలోకి దింపి విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఎన్నికలను ప్రచారానికి మించి ప్రచారం చేయిస్తున్నాయి.టెన్త్ విద్యార్థుల కోసం ప్రైవేట్ కళాశాలల అన్వేషణ మెడికల్, ఇంజనీరింగ్‌లో శిక్షణ ఇస్తామని ఎర ప్రైవేట్ పాఠశాలలకు ప్రత్యేక నజరానా రహస్యంగా విద్యార్థుల వివరాల సేకరణ పీఆర్ఓలను నియమించుకున్న సంస్థలురూ.10వేలు అడ్వాన్స్ ప్రైవేట్ కళాశాలల్లో సీట్ కావాలంటే కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.10వేలను అడ్వాన్స్‌గా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కుడా సీట్ దొరకదేమోనన్న ఆత్రుత, ఫీజులో రాయితీ ఉంటుందో అన్నదానితో పీఆర్ఓలు వచ్చిన వెంటనే ఏ కళాశాల, బోధన ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకొని సీట్ బుక్ చేసుకుంటున్నారు. ఏసీ బుకింగ్ అయితే మరో రూ.10వేల నుంచి రూ.30వేల వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. -
తప్పిపోయిన చిన్నారి అప్పగింత
ఎస్ఎస్ తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం మేడారానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. నర్సంపేటకు చెందిన రాజు తన కుటుంబ సభ్యులతో దర్శనానికి రాగా తన కుమార్తె హఫియా తప్పిపోయింది. ఈ విషయాన్ని రాజు వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమైన వాకీటాకీల ద్వారా సమన్వయంతో చిన్నారి అచూకీ కనుగొన్నారు. డీఎస్పీ రవీందర్ సమక్షంలో హఫియాను తల్లిదండ్రులకు అప్పగించారు. తన కుమార్తె సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక ఏటూరునాగారం: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఏటూరునాగారం గ్రామానికి చెందిన క్రీడాకారులు సాయిరాం, నరేంద్ర చారి, సంజయ్, రామయ్య, ప్రేమ్‌సాగర్, అర్జున్‌లు ఎంపికై నట్లు కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. ఈ మేరకు ఆదివారం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్, గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా కోచ్ మాట్లాడుతూ ఈ నెల 17నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. క్రీడాకారులను గ్రామ పెద్దలు డాక్టర్ వరప్రసాద్, చిటమట రఘు, ఎల్లయ్య, మల్లయ్య, ప్రభాకర్, శ్రీనివాస్‌లు అభినందించారు. ఎన్ఎంఎంఎస్లో విద్యార్థుల ప్రతిభ ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పెద్దపల్లి హర్షిత, అజ్మీరా సాయిరాం, పత్తి తన్మయిలు నవంబర్ –2024లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్కాలర్షిప్కు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నెలకు రూ.1000 చొప్పున స్కాలర్ షిప్ అందుతుందని పేర్కొన్నారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్ ఆవిష్కరణ ములుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన, గ్రీన్ ఇండియా చాలెంజ్ పోస్టర్‌ను ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ములుగు ఇన్చార్జ్ ప్రవీణ్, మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గరిగె రఘు, వేములపల్లి రఘుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గొర్రె సమ్మయ్య, ఎండీ యూనిస్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బొమ్మినేని సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి భూపాలపల్లి అర్బన్: పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని నియంత్రిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని హెచ్‌పీసీఎల్ సెల్స్ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అధికంగా వినియోగిస్తున్నారని తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. ఎలక్ట్రికల్, సోలార్ వైపు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీలర్లు గండ్ర హరీశ్‌రెడ్డి, శ్యామ్, అశోక్‌రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
మేము సైతం..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శించుకునే భక్తులు పలువురు జంపన్నవాగు సమీపంలో కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామానికి దేవేంద్ర, తాడ్వాయి గ్రామానికి చెందిన ఉమలు తలనీలాలు తీసే పనిలో తామేమీ తక్కువ కాదంటూ వచ్చి పనిలో నిమగ్నమయ్యారు. కులవృత్తిలో భాగంగా మహిళలు అందరితో సమానంగా కల్యాణకట్టలో కూర్చుని భక్తుల తలనీలాలు తీశారు. పుట్టవెంట్రుకలు సమర్పించే చిన్నారుల తల్లిదండ్రులు ఎక్కువగా వారి వైపునకు వెళ్లి తలనీలాలు తీయించారు. పురుషులతో సమానంగా పాల్గొని పనిచేసిందుకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
వాజేడు: అడవిలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది కొన్ని చోట్ల మంటలను ఆర్పారు. మండల పరిధిలోని దూలాపురం రేంజ్లో ఉన్న పెనుగోలు గుట్టలపై ఆదివారం మంటలు చెలరేగాయి. ఫైర్ పాయింట్స్ ఆధారంగా మంటలు చెలరేగినట్లు గుర్తించిన డిప్యూటీ రేంజర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో లలిత, వాసు, హతీరామ్, సంతోష్, ఫైర్ వాచర్స్ పెనుగోలు గుట్టలపైకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో నేరేడు బండ వద్దకు చేరుకోగానే మంటలు కనిపించడంతో ఆర్పారు. సమయం లేకపోవడంతో పెనుగోలు గుట్టపైకి వెళ్లలేదని బాలకృష్ణ వివరించారు. -
భక్తులకు మెరుగైన సేవలందించాం..
మేడారం మినీజాతరలో భక్తులకు మెరుగైన సేవలందించాం. పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా జాతరకు 10 రోజుల ముందు, జాతర నాలుగు రోజుల్లో 400 మంది కార్మికులు నిత్యం విధుల్లో ఉంటూ మెరుగైన సేవలందించారు. తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తాం. డీఎల్పీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టిగా పనిచేయడంతో భక్తులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు ఎక్కడా కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. – దేవరాజ్, డీపీఓ -
మేడారం క్లీన్..
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ● మినీ జాతరలో ఐదు వేల టన్నుల చెత్త సేకరణ ● తిరుగు వారం వరకు విధుల్లో 400 మంది కార్మికులుఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక–సారలమ్మ మినీజాతరలో పారిశుద్ధ్య కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. జాతర వారం రోజుల ముందు నుంచి స్థానిక పారిశుద్ధ్య కార్మికులతోపాటు రాజమండ్రి నుంచి కార్మికులను అధికారులు రప్చించారు. దీంతో జాతరలో సుమారు 400 మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పడేసిన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. తిరుగువారం వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగనున్నాయి. 10 ట్రాక్టర్లలో చెత్త తరలింపు.. జాతర ముందు, జాతర నాలుగు రోజుల్లో సుమారు 5వేల టన్నుల చెత్త సేకరించారు. ఈ చెత్తను కార్మికులు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ ప్రాంతాలకు తరలించారు. జాతరలో రోజుకు 10 ట్రాక్టర్ల ద్వారా రెండు షిప్టుల వారీగా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తిరుగువారం పండుగ వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. తిరుగువారం అనంతరం పారిశుధ్ధ్య పనులను స్థానిక గ్రామ పంచాయతీ అధ్వర్యంలో చేపట్టనున్నట్లు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో భక్తులు వేసే బంగారం (బెల్లం), కొబ్బరినీళ్లు, ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, ఇతర వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు కార్మికులను జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో నియమించారు. వీరు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు గద్దెల వద్ద చెత్తాచెదారం తొలగిస్తున్నారు. -
సింగరేణి కార్మికుడి మృతి
భూపాలపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూపాలపల్లి ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు పూజారి అనిల్(31) మృతిచెందాడు. మంచిర్యాలలో వివాహ వేడుకకు పట్టణానికి చెందిన నలుగురు కారులో వెళ్లివస్తున్నారు. ఈ క్రమంలో కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అనిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అనిల్ ఏరియాలోని కేటీకే 5వ గనిలో జనరల్ మజ్ధూర్‌గా పని చేస్తున్నారు. అదే గనిలో పని చేస్తున్న మరో ముగ్గురు అండర్ మేనేజర్లు రాము, సంజయ్, దేవేందర్‌లకు ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. -
నష్టపోతున్న ‘ఇసుక మేట’ బాధిత రైతులు
ప్రకృతి వైపరీత్యాలతో వరదలు ఉప్పొంగి పంటలు సాగు చేసే భూముల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో కొన్నేళ్లుగా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో అటు కౌలు రాక, ఇటు పంటలు లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇసుక మేటలను తొలగించడానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సంవత్సరాల తరబడి మేటలు పొలాలను కప్పి ఉన్నాయి. ఇసుక మేటలు వేసి పంటలు పండక రైతులు ఒకవైపు నష్టపోతుంటే, ఇసుక భూములకు రైతు భరోసా తొలగిస్తున్నామని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక మేటలు వేసిన భూముల్లో సర్వే చేస్తున్న అధికారులు(ఫైల్)మండలాల వారీగా తొలగింపు వివరాలు (ఎకరాల్లో..) ఏటూరునాగారం 49.36 గోవిందరావుపేట 28.05 కన్నాయిగూడెం 24.18 మంగపేట 152.39 ములుగు 1087.02 తాడ్వాయి 252.25 వెంకటాపురం(ఎం) 61.27 వెంకటాపురం(కె) 98.14 వాజేడు 140.31 -
ప్రత్యేక పూజలకు ఉపయోగించే సామగ్రి తయారీకి ప్రసిద్ధి నడికూడ
మాకు ఇదే జీవనాధారం నేను మా పూర్వీకుల నుంచి గజ్జల లాగుపోయడమే వృత్తిగా ఎంచుకున్నా. ఒక్కొక్క గజ్జెల లాగు తయారు చేయడానికి ఐదు రోజుల నుంచి వారం రోజుల సమయం పడుతుంది. చేతి పని ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఇదే జీవనాధారం ఆదాయం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ దేవుడిపై భక్తితో ఈ వృత్తిని కొనసాగిస్తున్నాం. – బుర్ర రవీందర్, నడికూడ 20 ఏళ్లుగా వస్తున్నాను.. ఏ పట్నం వేయాలన్నా కావాల్సిన పూజా సామగ్రి కోసం నడికూడకు రావాల్సిందే. నేను 20 ఏళ్లుగా వచ్చి తీసుకుని వెళ్తున్నాను. రూ.12వేల నుంచి రూ.15 వేలలో నాణ్యమైన గజ్జెల లాగు సెట్టు దొరుకుతుంది. – రామ్మూర్తి, కేసముద్రం కొత్తకొండ ఈరన్న.. కొమురెల్లి మల్లన్న.. ఎములాడ రాజన్న.. ఓదెల, ఐనవోలు మల్లికార్జున స్వామి.. ఇలా దేవాలయాలు, జాతరలు ఏవైనా శివసత్తులు, పోతరాజులుంటేనే భక్తజన సందోహం. చిన్నపట్నం, పెద్దపట్నం, అమ్మవారి బోనాలు.. పూజా కార్యక్రమాల్లో పరవశించిన శివసత్తుల శిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఈరకోల ఆటలు.. మేకపోతులు, కోడిపుంజులను గావుపట్టే పూనకాలు భక్తులను మైమరిపిస్తాయి. ఆయా ఉత్సవాలకు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువుల తయారీ, సరఫరా కేంద్రం హనుమకొండ జిల్లా నడికూడలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర.. ప్రాంతాల్లోని పేరున్న దేవాలయాల్లో శివసత్తులు, పోతరాజులు, భక్తులకు సుమారు 60 ఏళ్లుగా గజ్జెల లాగులు మొదలు ఈరకోలలు, పట్నాల గొంగడి, ఢమరుకం, శూలం.. వరకు ప్రతి ఒక్కటీ నడికూడ నుంచే సరఫరా అవుతున్నాయి. ఇరవై కుటుంబాలు సుమారు 200 మంది నిరంతరం శ్రమిస్తూ ఉపాధి పొందుతుండగా.. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి మార్చి వరకు నడికూడకు వచ్చి వస్తువులను కొనుగోలు చేస్తారు. -
ఆలయం తరలిస్తారా..?
ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా ములుగు బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ ఆలయ తరలింపుపై పట్టణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోచమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి కదిపితే ఉరుకునేది లేదని పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు పట్టుబడుతున్నాయి. కలెక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణకు పోచమ్మ ఆలయం అడ్డంకిగా మారిందని కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో హిందూపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌కు వినతిపత్రతం అందించి, పోచమ్మ ఆలయాన్ని తరలించకూడదని కోరారు. అయినప్పటికీ కలెర్టర్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అందరి సమక్షంలో పోచమ్మ ఆలయానికి వేరేచోట స్థలాన్ని కేటాయిస్తామన్ని తెలిపినట్టుగా సమాచారం. దీనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికులు శనివారం ఆలయం ఎదుట జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాత, ముత్తాల నుంచి ఉన్న పోచమ్మ గుడిని తరలిస్తామంటే ఉరుకునేది లేదని తెలిపారు. రూ.5.11 కోట్ల నిధులు మంజూరు జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరణ(మోడల్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.5.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఏరియాను సర్వే చేసి డిజిటల్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మ్యాప్‌ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు అందజేశారు. ములుగు చుట్టుపక్కన ఉన్న జిల్లాలకు ప్రత్యేక బస్‌స్టేషన్ పాయింట్లతో డిజిటల్ మ్యాప్‌ను సిద్ధం చేసి అందించారు. సానుకులంగా స్పందించిన సీతక్క వెంటనే పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం జిల్లాకేంద్రంలోని అన్ని వర్గాల అభిప్రాయం మేరకే పోచమ్మ గుడి తరలింపుపై నిర్ణయం తీసుకుంటాం. జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, ఇతరత్రా అంశాలలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి ప్రయాణ సౌకర్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని వర్గాలకు పోచమ్మ ఆలయం తరలింపు అడ్డంకిగా మారుతుందని తెలుస్తుంది. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీపుకుంటాం. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. – టీఎస్ దివాకర, కలెక్టర్ పోచమ్మ గుడి తరలింపుపై ఉత్కంఠ తరలించొద్దంటున్న పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు -
భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం..
గజ్జెల లాగులు కొనడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తాం. వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది. – రావుల సుమలత, నడికూడ నడికూడకు రావాల్సిందే.. ఇక్కడ భక్తిశ్రద్ధలతో తయారు చేస్తారు. పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న ఏ జాతరైనా మా తాతల కాలం నుంచే గజ్జెల లాగుల కోసం నడికూడకు వచ్చేవారు. ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. – రాజ్‌కుమార్ యాదవ్, సిరిసేడు, కరీంనగర్ జిల్లా -
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సామగ్రికి ప్రసిద్ధి.. తెలంగాణ జానపద సంస్కృతిలో నిర్వహించే పూజల్లో భాగంగా ధరించే గజ్జెల లాగుల తయారీకి నడికూడ గ్రామం ప్రసిద్ధి. కొమురెల్లి మల్లన్న, ఐనవోలు, బోనాలు, సమ్మక్క–సారలమ్మ జాతరలో, పట్నాలు, పెద్ద పట్నం, గట్టు మల్లన్న జాతరల్లో ఈ గజ్జెల లాగులు, పసుపుపచ్చని అంగీలు ధరిస్తారు. వేములవాడ, కొండగట్టు, శ్రీశైలం, హైదరాబాద్, రంగారెడ్డి, విజయవాడ తదితర తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చి సామగ్రిని తీసుకెళ్తారు. గజ్జల లాగులకు బ్రాండ్‌గా నడికూడ గ్రామం నిలుస్తోంది. వీటిని ధరించే వారు ఎంత నిష్టగా ఉంటారో.. తయారు చేసేవారూ అంతే నిష్టతో ఉంటారు.పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే సరఫరా.. ● వీటి తయారీని నమ్ముకున్న 200 మంది ● 60 ఏళ్లుగా ఉపాధి పొందుతూ..న్యూస్‌రీల్ -
సెట్టు రూ.13వేల వరకు..
శివసత్తులు, పోతరాజులు, భక్తులు ధరించే ప్రత్యేక దుస్తులు, వస్తువులు 10–12 రకాలను ఒక సెట్టుగా విక్రయిస్తారు. అవసరాలను బట్టి విడివిడిగా కూడా అమ్ముతారు. ఒక సెట్టులో ఎల్లమ్మ గవ్వలు, ఈరకోల, ఢమరుకం, వల, ప్రతిమలు, కాళ్ల గజ్జలు, తౌతులు, శూలం, గొంగళి, కుల్ల(గవ్వల టోపీ), నిలువు ప్యాంట్లు ఉంటాయి. నాణ్యతను బట్టి ఈ సెట్టును రూ.6వేల నుంచి రూ.13 వేల వరకు విక్రయిస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరింత ఆకర్షించేలా మెషిన్ ఎంబ్రాయిడరీతో గజ్జెల లాగుల తయారీ వస్త్రాలపై దేవతల నమూనాలను కూడా వేస్తున్నారు. పూజకు కావాల్సిన ప్రతీ సామగ్రి ఇక్కడ లభిస్తుండడంతో జాతరల సీజన్లో వివిధ ప్రాంతాల భక్తులు నడికూడ బాట పడుతున్నారు. ఎల్లమ్మ గవ్వల బుట్ట -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, చింతామణి జలపాతం, వనదేవత(దైత) అమ్మవారి ప్రాంత పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి హేమాచల కొండపైకి చేరుకున్నారు. స్వయంభు స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం నిర్వహించారు.సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
గజ్జెల లాగులు.. గవ్వల కుల్లలు
గజ్జెల లాగుశివుడిని అమితంగా ఇష్టపడే కొందరికి గజ్జెల లాగు అంటే బహు ప్రీతి.. అత్యంత పవిత్రంగా చూస్తారు.. నీసు తగలనివ్వరు.. తల స్నానం చేయనిదే తాకనైనా తాకరు.. మట్టి రేణువులు కూడా లాగును తాకొద్దని నేలపై సంచులు పరిచి విప్పుతారు.. మిగతా వస్త్రాలతో కాకుండా వేరుగా శుభ్రం చేస్తారు.. భక్తులు అంత పవిత్రంగా భావించే ఆ లాగుల్ని తయారు చేస్తున్నాయి నడికూడ మండలకేంద్రానికి చెందిన కొన్ని కుటుంబాలు. ఆ గజ్జెల సవ్వడే భక్తుల నాదమవుతోంది. శివరాత్రి సమీపిస్తున్న సందర్భంలో శిగాలెత్తే శివభక్తుల అలంకరణ వస్తువులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షిప్రతినిధి, వరంగల్/నడికూడదేవతల ప్రతిమలు,ఢమరుకం● -
త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఇవ్వాలని ఆందోళన
వాజేడు : తమ కాలనీకి త్రీఫేజ్ విద్యుత్ లైన్ ఇవ్వాలని కోరుతూ పెనుగోలు కాలనీ ఆదివాసీలు శనివారం ఆందోళన చేపట్టారు. నిరంతరం విద్యుత్ లైట్లు వెలిగేలా చూడాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామం వరకు త్రీఫేజ్ విద్యుత్ లైన్ వేసి తమ కాలనీకి ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జంగాలపల్లి వరకే త్రీఫేజ్ లైన్ వచ్చిందని పెనుగోలు కాలనీకి త్రీఫేజ్ లైన్ మంజూరు కాగానే లైన్ వేస్తామని రాజేందర్ వారికి తెలిపారు. బంజారాల ఆరాధ్యుడు సేవాలాల్ ములుగు : సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్యదైవం అని సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పోరిక శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో సేవాలాల్ 286 జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎస్టీయూ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్ హాజరై బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. పాల్తీయ సారయ్య, సోమా, జయరాం, కసన్సింగ్, కుమార్ పాడ్య, రవి, సర్దార్ సింగ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపే లక్ష్యంగా.. ●ములుగు రూరల్ : బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పులి సరోత్తం రెడ్డి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సూచించారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రేమేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డిని గెలిపించాలని జిల్లాలోని ప్రతీ ఓటరు ఉపాధ్యాయులను అభ్యర్థించాలని, గెలుపు కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. నియోజకవర్గ కన్వీనర్ వెన్నెంపల్లి పాపన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కృష్ణవేణి నాయక్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్ కొత్త సుధాకర్ రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి శ్రీమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షు డు కృష్ణాకర్ రావు, నాయకులు పాల్గొన్నారు. అంతిమయాత్రకు అరిగోస ● దహన సంస్కారాలకు వెళ్లేందుకు దారి ఏది?వెంకటాపురం(కె) : మండలంలోని ఉప్పెడువీరాపురం పంచాయతీ పరిధిలోని వెంగళరావుపేటలో ఎవరైనా మృతిచెందితే అంతిమయాత్ర చేసేందుకు దారి లేక అరిగోస పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇసుక పాయకు వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు మార్గం (దారి) ఏర్పాటు గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి చెందిన మాదాల రాంబాబు శనివారం మృతిచెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు దారిలేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేందుకు గ్రామస్తులు వాపోయారు. 30ఏళ్ల నుంచి గ్రామంలో ఎవరైనా చనిపోతే ఇసుక పాయకు తీసుకు వెళ్లేందుకు ఉన్న దారిని మూసేసి మిర్చి పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ఎవరైనా చనిపోతే శవాన్ని తీసుకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని ఆరోపించారు. దళిత కుటుంబాలు ఉండే గ్రామం నుంచి చాలా వెడల్పుతో దారి ఉండేదని ప్రస్తుతం కనీసం నడిచి వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి గతంలో ఉన్న విధంగా రోడ్డును ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మేడారం జాతర భద్రత సక్సెస్
ములుగు : మినీ మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎన్.రవీందర్ ఆధ్వర్యంలో భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని 1,000 మంది పోలీసులకు ఆయా ప్రాంతాల్లో భద్రత కోసం విధులు కేటాయించారు. బుధవారం నుంచి శనివారం వరకు జరిగిన జాతర రెండు చైన్స్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, సీసీ కెమెరాల ఆధారంగా సీసీఎస్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బందిని కేటాయించి అప్పటికప్పుడు వాటిని ఛేదించారు. దీంతో పాటు మంచిర్యాలకు చెందిన దొంగల ముఠాను గుర్తించి వారి నుంచి ఆటో, కారుతో పాటు రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన పర్యాటకురాలు పద్మ మినీ జాతరకు వచ్చి బ్యాగ్‌తో పాటు పాస్‌పోర్ట్ పోగొట్టుకోగా స్పందించిన పోలీసులు అరగంటలో ఛేదించి ఆమెకు పాస్‌పోర్టు అందజేశారు. ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి ఓఎస్డీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఎలాంటి తొక్కిసలాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క గద్దెల మీదుగా ఆర్టీసి బస్టాండ్ కి వెళ్లే దారిలో, చిలుకలగుట్టకు వెళ్లే దారిలో ప్రతి క్షణం ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్ అయ్యారు. పస్రా సీఐ జి.రవీందర్ గత మేడారం అనుభవం జాతరలో చాలా ఉపయోగపడింది. -
డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్‌లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం -
రైతులకు ‘భరోసా’
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు భూ భారతిలో నమోదైన వ్యవసాయ పంటసాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందుతుందని ప్రకటించింది. డైరెక్టర్ బెనిఫిషరి ట్రాన్స్ఫర్(డీబీటీ) విధానంలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ మేరకు ఎకరాకు రూ.12వేల చొప్పున రెండు దఫాలుగా రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మేరకు మొదటి దఫా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. జిల్లాలో 33,280 మందికి భరోసా జిల్లాలోని 10మండలాల్లో రైతు భరోసా కింద 33,280 మంది రైతుల ఖాతాల్లో రూ.23.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. దీంతో రైతులకు కష్టకాలంలో ఈ డబ్బులు పంటల పెట్టుబడికి చేదోడువాదోడుగా నిలిచాయి. మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నగదు జమ చేసింది. ఆపై భూమి ఉన్న వారికి రైతు భరోసా అందుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.మండలాల వారీగా రైతు భరోసా వివరాలు మండలం రైతుల నగదు జమ సంఖ్య రూ.లక్షల్లోఏటూరునాగారం 2,786 రూ.17.65 గోవిందరావుపేట 3,157 రూ.26.31 కన్నాయిగూడెం 1,736 రూ.11.04 మంగపేట 2,879 రూ.26.36 ఎస్ఎస్ తాడ్వాయి 1,616 రూ.11.13 వాజేడు 2,629 రూ.13.39 ములుగు 9,058 రూ.57.05 వెంకటాపురం(కె) 6,879 రూ.58.29 వెంకటాపురం(ఎం) 2,540 రూ. 14.14మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు
ములుగు రూరల్: పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ వెంకటేశ్వర్లకు ఆయన వినతిపత్రం అందించి మాట్లాడారు. సీసీఐ ద్వారా ఎకరా పట్టా భూమి ఉన్న రైతుకు 12 క్వింటాలు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాల ద్వారా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. దళారులు ఎకరం ఉన్న రైతులకు 10ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి మార్కెట్‌శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విజిలెన్స్ అధికారులచే విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రచారి, కృష్ణాకర్, నాగరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా భక్తులకు సేవలు ఏటూరునాగారం: మండల పరిధిలోని బస్టాండ్ ప్రాంతంలో మేడారం జాతరకు వెళ్లే భక్తులు, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిస ప్రత్యేక శిబిరంలో మూడు రోజుల పాటు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సీడీపీఓ ఆర్టీసీ బస్టాండ్‌లోని క్యాంప్‌లో చిన్నారులకు బాదంపాలు, స్నాక్స్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టీచర్లు, ఆయాలు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు గ్రూపులుగా సేవలు అందజేశారన్నారు. అంతేకాకుండా ఎవరు కూడా అనారోగ్య బారిన పడకుండా తగు సూచనలు, సలహాలను ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు లలితకుమారి, భవాని, ఆయాలు రోజా, దీనమ్మ, నాగమణి, వెంకటరమణ, జ్యోతి, సరోజన, స్వరూప, శకుంతల తదితరులు పాల్గొన్నారు. కోడిగుడ్లు, రాగిజావ అందించడం సాధ్యంకాదు వెంకటాపురం(కె): మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, రాగి జావ అందించడం సాధ్యం కాదని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. యూనియన్ మండల కమిటీ సమావేశాన్ని కుడుముల సమ్మక్క అధ్యక్షతన శుక్రవారం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలల్లో వంటలు చేస్తున్న కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయన్నారు. మార్కెట్ ధరలకు, ప్రభుత్వం ఇస్తున్న మెనూ చార్జీలకు పొంతన లేదన్నారు. ఈ కారణంగానే కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరగతితో సంబంధం లేకుండా ప్రతీ విద్యార్థికి రూ.25 చెల్లించాలన్నారు. చిన్నా, చితక కారణాలను చూపుతూ 24ఏళ్ల సర్వీసు ఉన్న వంట కార్మికులను తొలగించకుండా జీవో విడుదల చేయాలన్నారు. అల్పాహారం బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. -
డీసీసీ పీఠాలపై ఎవరు..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లపై కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కమిటీలుండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ ఏడాదంతా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. మరోవైపు ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా ఎన్నికల నిర్వహించేందుకు వీలుగా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఎమ్మెల్యేలు లేదంటే సీనియర్లు.. టీపీసీసీ, అధిష్టానం సంకేతాల మేరకు త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షులు రానున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సమన్వయం చే యగలిగే వ్యక్తులను ఎంపిక చేయాలని ఆలోచిస్తు న్న అధిష్టానం.. ఆర్థికంగా బలంగా ఉండే వాళ్లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను గానీ, సీనియర్లను గానీ ఈసారి నియమించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నా యి. హనుమకొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్‌లో ముగ్గురు, మహబూబాబాద్‌లో ఇద్దరు అధికార పా ర్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామలో ఇద్దరు, ము లుగు, జేఎస్ భూపాలపల్లిలో ఒక్కరేసి ఉన్నారు. ● హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి కొనసాగాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని అధిష్టానం కోరుతున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్, తనకు అనుచరుడిగా ఉండే ఇద్దరు పేర్లు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలని కొందరు.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలని మరికొందరు సూచించినట్లు సమాచారం. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్‌రెడ్డిల నిర్ణయం ఫైనల్ కానుంది. ● మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల నిర్ణయం కీలకంగా కానుంది. ● జేఎస్ భూపాలపల్లి అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నందున.. అయననే కొనసాగించాలా? మార్చాలా? అన్న విషయమై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో టీపీసీసీ చర్చించింది. ● ములుగు జిల్లా నుంచి మళ్లీ పైడాకుల అశోక్‌కే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ● జనగామ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడుతోంది. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని కొనసాగించలేని పరిస్థితి వస్తే ఎలా? అన్న చర్చపై ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అత్త, పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరును ఆ జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు ప్రచారం ఉంది. అనివార్యంగా మారిన డీసీసీ అధ్యక్షుల నియామకం.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల తర్వాత రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డీసీసీ కమిటీలను ప్రకటించారు. రెండు విడతల్లో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. మొదటి విడతలో నియమితులైన అధ్యక్షుల పదవీకాలం రెండేళ్లు దాటిపోగా.. రెండో విడత డీసీసీలకు రెండేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానానికి కొత్త కమిటీల ఏర్పాటు అనివార్యంగా మారింది. 2022, డిసెంబర్ 10న హనుమకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా నాయిని రాజేందర్ రెడ్డి, నల్లెల కుమారస్వామి, జె.భరత్చంద్రారెడ్డిలను నియమించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ములుగు జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి అనారోగ్యంతో మృతిచెందాడు. 2023, మే 16న కుమారస్వామి స్థానంలో పైడాకుల అశోక్‌ను ములుగు అధ్యక్షుడిగా.. వరంగల్‌కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, జేఎస్ భూ పాలపల్లికి ఎ.ప్రకాష్‌రెడ్డిలను నియమించారు. జనగామ జిల్లా అధ్యక్షుడి నియామకం అప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిల మధ్య వివాదంగా మారినా.. చివరకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డినే నియమించారు. ఆ తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది రేవంత్‌రెడ్డి సీఎం కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు.జిల్లా కాంగ్రెస్ కమిటీలపై టీపీసీసీ కసరత్తు ‘స్థానిక’ఎన్నికలే లక్ష్యంగా కొత్త కమిటీలు జిల్లా అధ్యక్షుల నియామకంపై అభిప్రాయ సేకరణ ఎమ్మెల్యేలు, సీనియర్లతో అధిష్టానం సంప్రదింపులు అవకాశం రాని సీనియర్లకు టీపీసీసీలో స్థానం నెలాఖరులో కొలిక్కి వచ్చే అవకాశం -
నైపుణ్యంతోనే గుర్తింపు
ఏటూరునాగారం: జూట్ బ్యాగుల తయారీ శిక్షణలో నైపుణ్యం ప్రదర్శించినప్పుడే గుర్తింపు వస్తుందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. ఐటీడీఏ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో 13 రోజుల పాటు జూట్‌బ్యాగుల శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం ట్రైనింగ్ సెంటర్‌ను పీఓ సందర్శించి అభ్యర్థులతో మాట్లాడారు. ఆసక్తితో ఇష్టంగా జూట్ బ్యాగులు, ఇతర తయారీ వస్తువులపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు. 35మంది గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ శిక్షణని చక్కగా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. వీరికి సర్టిఫికెట్లు అందజేసిన తర్వాత స్వయం ఉపాధి పొందే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ సురేష్‌బాబు, జేడీఎం కొండల్రావు, ట్రైనర్ తౌటినాయుడు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
వచ్చేనెల 8న జాతీయ లోక్ అదాలత్
ములుగు: వచ్చే నెల 8వ తేదీన జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఎస్వీపీ సూర్య చంద్రకళ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోర్టు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బార్ అసోసియేషన్ సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. జాతీయలోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా అసోసియేషన్ సభ్యులు సహకరించాలని సూచించారు. రాజీపడే కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహాయాన్ని అందించాలన్నారు. న్యాయ సలహాల విషయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్య లాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మస్రగాని వినయ్ కుమార్, న్యాయవాదులు బానోత్ స్వామిదాస్, రాచార్ల రాజ్ కుమార్, బాలుగు చంద్రయ్య, తొండి రవీందర్, మేకల మానస, రాజేందర్, సూర్యం తదితరులు పాల్గొన్నారు. కోర్టు ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేయగా జడ్జి సూర్య చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరిగిన కారణంగా కోర్టుకు వస్తున్న కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.జిల్లా జడ్జి సూర్య చంద్రకళ -
జాతరలో సకల సౌకర్యాలు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని ఐలాపూర్‌లో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో సకల సౌకర్యాలు కల్పించినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఐలాపూర్ జాతరకు శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలతో చేరుకుని మేకపోతుతో మొక్కు సమర్పించుకున్నారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఐలాపూర్ జాతరకు నిధులు సరిగా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జాతరకు రూ.85లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. జాతరలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, గుడి ప్రాంగణంలో జాలి కంచె ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మండల ఇన్చార్జ్ జాడి రాంబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న నాయకులు ప్లీ భాస్కర్, తిరుపతి, సురేష్, రాంబాబు పాల్గొన్నారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో ఈనెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కొమురవెల్లి మల్లన్న ఆలయ నిర్మాణ కమిటీ వ్యవస్థాపకులు గోగు మల్లయ్యజ్యోతి, కొమురవెల్లి మల్లన్న పట్నాల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను శుక్రవారం ఐలాపూర్‌లో మంత్రి సీతక్క ఆవిష్కరించారు. కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
భక్తులకు పౌష్టికాహారం పంపిణీ
ఏటూరునాగారం: ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం గ్రామంలో ఈనెల 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సీడీపీఓ ప్రేమలత తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో మంగళవారం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాల సిబ్బందితో 6నెలల నుంచి ఆరేళ్ల బాల బాలికలకు, గర్భిణులు, బాలింతలకు బాలామృతం, స్కాక్స్, బాదంపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారానికి తల్లిదండ్రులతో వెళ్లే చిన్నారులు జాతరలో నీరసానికి గురికాకుండా ఈ పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేడారంతో పాటు ఐలాపూర్‌లో ఏర్పాటు చేసిన జాతరలో తప్పిపోయిన భక్తులను పునరావాస కేంద్రాల వద్దకు చేర్చి బంధువులకు సమాచారం చేరవేసే విధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆఫ్రీన్, పుష్పలతతో పాటు చైల్డ్ హెల్ప్‌లైన్ చంటి, అంగన్వాడీ టీచర్లు భవాని, లలిత, ఆయాలు పాల్గొన్నారు.సీడీపీఓ ప్రేమలత -
‘మండమెలిగె’కు పూజారులు సిద్ధం..
ఎస్ఎస్ తాడ్వాయి : జిల్లాలోని ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలో గల మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతర (మండమెలిగె) పండుగ నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాలు, గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతర మొదటి రోజు (బుధవారం) మేడారం, కన్నెపల్లిలోని అమ్మవార్ల ఆలయాల్లో మండమెలిగె పండుగను సమ్మక్క–సారలమ్మ పూజారులు నిర్వహించనున్నారు. ముందుగా సమ్మక్క గుడి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆడపడుచులు రంగవల్లులు వేసి ముస్తాబు చేస్తారు. డోలు వాయిద్యాలతో తూర్పు, పడమర పొలిమేర్లలో ధ్వజస్తంభాలు (దిష్టి తగలకుండా) మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ముందుగా పూజారులు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు చేస్తారు. అనంతరం గుడికి చేరుకొని అమ్మవారికి దీప, ధూపాలతో పూజలు నిర్వహించి యాటతో నైవేద్యం సమర్పిస్తారు. రాత్రి సమయంలో పూజారులు అమ్మవారి పూజాసామగ్రి, పసుపు, కుంకుమలను తీసుకొని డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు వెళ్లి అమ్మవారి గద్దె వద్ద కూడా పూజలు చేస్తారు. అలాగే, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కూడా సారలమ్మ పూజారులు అమ్మవారికి పూజలు నిర్వహించి రాత్రి సమయంలో గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద కలుసుకొని శాకాహానం (ఇప్పపువ్వు సారా) ఇచ్చి పుచ్చుకొని రాత్రంతా గద్దెల వద్ద డోలు వాయిద్యాలతో జాగారం చేస్తూ సంబురాలు జరుపుకుంటారు.ముస్తాబైన గద్దెల ప్రాంగణం...దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని శుభ్రం చేసి విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల క్యూలైన్లపై చలువ పందిళ్లు వేశారు. మంచినీటి సౌకర్యం కల్పించారు. హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో పాటు అమ్మవార్ల గద్దెలు జిగేల్మనేలా సాలాహారం చుట్టూ విద్యుత్ దీపాలను అలంకరించారు. మధ్యాహ్నం సమయంలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాంగణంలో కాళ్లు కాలకుండా కూల్ పెయింట్ వేశారు. -
ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం
కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు: నేటినుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని ములుగు కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నల్లాలు, మహిళా భక్తులు దుస్తులు మార్చుకునే గదులను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారని, వైద్యశాఖ తరఫున శిబిరాలు ఏర్పాటుచేసినట్లు వివరించారు. అమ్మవారి గద్దెల ప్రాంగణంలో, క్యూలైన్ వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఏటూరునాగారం మండలం కొండాయి, ఐలాపూర్ మినీ మేడారం జాతరలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ తరఫున చిన్నబోయినపల్లి నుంచి కొండాయి వరకు, ఊరట్టం నుంచి కొండాయి వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ములుగు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు మొదటి దశ శిక్షణ తరగతులను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని 174 గ్రామపంచాయతీల్లో 87ఎంపీటీసీ స్థానాలు, 10 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా ముందుకుసాగాలని సూచించారు. ఆర్ఓలు నోటిఫికేషన్ జారీ చేసి మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను చేపట్టాల్సి వస్తుందని తెలిపారు. తదుపరి అన్ని రకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. బ్యాలెట్ పేపర్‌ను అభ్యర్థుల పేర్లపై అక్షర క్రమంగా ముద్రించాల్సి ఉంటుందని వివరించారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ప్రతిరోజూ రిపోర్ట్‌ను అందించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ, విత్‌డ్రాలను వీడియో చిత్రీకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఎంపీడీఓలు, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. ‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి వచ్చే నెల 21వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ ఫలితాల కోసం ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. డీఈఓ పాణిని ప్రతిరోజూ అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వార్షిక పరీక్షలకు తమ చిన్నారులను పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేలా చూడాలనే విషయాన్ని వివరించాలన్నారు. 40 రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి సూర్యనారాయణ, ఏసీజీ అప్పని జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ కేటాయించి పక్కా భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్హాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ములుగు జిల్లా 3వ మహాసభలను పురస్కరించుకుని మంగళవారం జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుందన్నారు. ములుగు జిల్లాకిచ్చిన గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీంతో పక్క భవనాల నిర్మాణం ఎలా జరుగుతుందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలన్నారు. 8నెలలుగా మెస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టీఎల్.రవి, ఉపాధ్యక్షుడు సాదు రాకేష్, మోర లక్ష్మణ్, రవితేజ, బాలేశ్వర్, భరత్, రంజిత్, స్వామి తదితరులు పాల్గొన్నారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ -
ఒక నామినేషన్ తిరస్కరణ
● సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించిన ఎన్నికల అధికారులు నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సమర్పించిన నామినేషన్లలో ఒక నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించగా.. మొత్తం 23 మంది నామినేషన్లు సమర్పించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం (స్క్రూట్నీ) నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి తండు ఉపేందర్ నామినేషన్ పత్రంపై సంతకం పెట్టకుండా సమర్పించడంతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మిగిలిన 22 మంది నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
మేడారంలో వాటర్ ప్లాంట్
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మినీజాతర సందర్భంగా దేవాదాయ శాఖ తరఫున మినరల్ వాటర్ అందించేందుకు వాటర్ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చారు. గత మహాజాతర సందర్భంగా ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురాలేదు. మినీ జాతరను పురస్కరించుకొని వాటర్ ప్లాంట్‌కు షెడ్ నిర్మాణంతో పాటు వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎండోమెంట్ కార్యాలయంలో భోజనాలు చేసే పోలీస్ అధికారులు, దేవాదాయశాఖ అధికారులు, సిబ్బంది, మీడియా, భక్తులకు ఈ వాటర్ ప్లాంట్ నీరు అందించనున్నారు.జాతరలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులుములుగు: మినీ మేడారం జాతరలో పంచాయతీరాజ్ శాఖ తరఫున పటిష్టమైన పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. పక్షం రోజులుగా రాజమండ్రి నుంచి వచ్చిన 300 మందితో పాటు స్థానికంగా ఉన్న 100మంది కార్మికులతో రోజుకు 12గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తున్నారు. జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, కొంగల మడుగు, రెడ్డిగూడెం, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం, చింతల్‌క్రాస్, రెడ్డిగూడెం, కొత్తూరు, ఇంగ్లిష్‌మీడియం, చిలుకలగుట్ట, ఊరట్టం, వీవీఐపీ పార్కింగ్ ప్రాంతాలలో మరుగుదొడ్లు, పేరుకుపోయిన చెత్తాచెదారం ఏరి వేస్తున్నారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో నిత్యం బ్లీచింగ్ పౌడర్‌ను చల్లిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తను ఏరివేయడానికి, మాంసం దుకాణాల నుంచి వేస్టేజ్‌ను తరలించడానికి సిబ్బందిని కేటాయించారు. కార్మికులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు భోజన వసతి కల్పిస్తున్నారు. మినీ మేడారం జాతరను మూడు జోన్లు, 21 సెక్టార్లుగా విభజించారు. వచ్చే 5 రోజుల పాటు 40మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీఓలు, 10మంది కారోబార్లు, డీపీఓ పనిచేయనున్నారు.వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలివెంకటాపురం(ఎం): జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపునకు వైద్యసిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని జవహర్‌నగర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్‌ను డీఎంహెచ్ఓ మంగళవారం తనిఖీ చేశారు. జాతీయ నాణ్యత ప్రమాణాల గుర్తింపు పొందేందుకు చేస్తున్న మౌలిక ఏర్పాట్లపై ఆరా తీశారు. సెంటర్ పరిసరాలను పరిశీలించి ఆవరణలో నాటిన ఔషధ మొక్కలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. మందుల నిల్వల వివరాలను సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంఘమిత్ర, ఏఎన్ఎంలు ఫాతిమున్నీసా, స్వర్ణలత పాల్గొన్నారు.అడవికి నిప్పు.. పర్యావరణానికి ముప్పువాజేడు: అడవిలో నిప్పు పెడితే పర్యావరణానికి ముప్పు తప్పదని దూలాపురం రేంజ్ ఇన్చార్జ్ రేంజర్ బాలకృష్ణ అన్నారు. మండల పరిధిలోని ఘనపురం గ్రామస్తులకు అడవి సంరక్షణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవుల సంరక్షణతోనే స్వచ్ఛమైన గాలితో పాటు పండ్లు లభిస్తాయని తెలిపారు. అడవికి నిప్పు పెడితే జీవరాసులకు నీడ, ఆహారం కరువై అంతరించి పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఇప్పపువ్వు, చీపురు సేకరణకు వెళ్లినప్పుడు అడవికి నిప్పు పెట్టకూడదన్నారు. ఇప్పచెట్ల కింద పరదాలు పరిచి పువ్వులను సేకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు వాసు, ఆదిలక్ష్మి, లలిత, హతీరామ్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. -
ఓటర్లు@2,45,015
ములుగు: జిల్లాలోని 10 మండలాల్లో 10 జెడ్పీటీసీ స్థానాలు, 87 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను మంగళవారం రాత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ ఆఫీసర్ సంపత్‌రావు వివరాలను వెల్లడించారు. జిల్లాలో 400వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ స్టేషన్లు 117, 400నుంచి 500మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 165, 501 నుంచి 750 మంది వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలు 210గా గుర్తించగా మొత్తం 492 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2,45,015 మంది ఓటర్లు ఉండగా 1,18,572 మంది పురుషులు, 1,26,418 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 25 మంది ఉన్నారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలుమండలం ఎంపీటీసీ పోలింగ్ మొత్తం స్థానాలు కేంద్రాలు ఓటర్లు ములుగు 13 73 38,910 మల్లంపల్లి 5 25 13,462 వెంకటాపురం(ఎం) 9 58 28,350 గోవిందరావుపేట 9 64 25,490 ఎస్‌ఎస్‌తాడ్వాయి 7 38 18,389 ఏటూరునాగారం 9 41 24,590 మంగపేట 14 77 39,689 వాజేడు 7 41 19,411 కన్నాయిగూడెం 5 21 9,943 వెంకటాపురం(కె) 9 54 26,781 మొత్తం 87 492 2,45,015వివరాలు వెల్లడించిన అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ అథారిటీ ఆఫీసర్ సంపత్‌రావు -
జాతరకు సిద్ధం
ముగింపు దశకు చేరుకున్న మినీ మేడారం పనులు● రేపటినుంచి 15వ తేదీ వరకు జాతర● నిత్యం అధికారుల పర్యవేక్షణ అడుగడుగునా నిఘా.. మేడారంలో భక్తుల రద్దీ కారణంగా దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా నిత్యం పర్యవేక్షించేందుకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ఆర్టీసీ వై జంక్షన్, మేడారం ఐలాండ్ ప్రాంతం, గద్దెల ప్రాంగణం, జంపన్నవాగు, తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న సీసీ కెమెరాలను మరమ్మతులు చేయించారు. అన్నింటినీ మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. ఫుటేజీలను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న జాతరకు వచ్చే భక్తుల సేవల కోసం అన్ని ఏర్పాట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్టీసీ కూడా బస్టాండ్ కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేసింది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు మేడారం ఎండోమెంట్ కార్యాలయంలో ఒక ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచారు. -
జాతరకు వచ్చే భక్తులకు వైద్యసేవలు
ఏటూరునాగారం: కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల పరిధిలోని ఐలాపూర్, కొండా యి గ్రామాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే జాతరలకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. సోమవా రం ఐలాపూర్ జాతర కోసం ఆ గ్రామంలో ఏర్పా టు చేసిన కంటైనర్ అదనపు ఆరోగ్య ఉపకేంద్రం, కొండాయిలోని సబ్ సెంటర్లను క్రాంతికుమా ర్ వైద్యులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేయడంతో పాటు మందులు సైతం అందుబాటులో ఉంచామని తెలిపారు. గర్భి ణులు, రోగుల కోసం ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి అభినవ్, ప్రణీత్‌కుమార్, ఎన్హెల్త్ మిషన్ మేనేజర్ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ -
మళ్లీ పులి సంచారం..!
కాటారం/కాళేశ్వరం: మండలంలోని నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం ప్రకంపనలు సృష్టిస్తుంది. అడవి ప్రాంతంలో తప్పిపోయిన ఎద్దు కోసం వెళ్లిన వ్యక్తికి పులి కనిపించినట్లు బయటకు రావడంతో అటు దిశగా విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులకు ఆనవాళ్లు కనిపించాయి. కాటారం మండలం నస్తూర్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి ఎద్దు తప్పిపోవడంతో సోమవారం తెల్లవారుజామున ఎద్దు జాడ కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఎద్దు ఆచూకీ లభించడంతో తిరిగి వస్తున్న క్రమంలో పులి వెళ్లడం గమనించినట్లు పలువురు గ్రామస్తులకు తెలిపారు. దీంతో అటవీశాఖ అధికారులకు సమాచారం చేరడంతో అటవీ ప్రాంతానికి చేరుకొని పులి సంచారంపై విచారణ చేపట్టారు. మహారాష్ట్ర టు చెన్నూర్.. రెండేళ్ల క్రితం డిసెంబర్, జనవరి మాసంలో మండలంలో పులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించి పూర్తి నిఘా పెట్టారు. కానీ పులి మండలంలో పలు ప్రాంతాల్లో తిరిగాడి చివరగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లా చెన్నూర్ వైపుగా వెళ్లినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి మహదేవపూర్ అటవీప్రాంతం మీదుగా మండలంలోకి ప్రవేశించిన పులి ఒడిపిలవంచ, జాదారావుపేట, దామెరకుంట లేదా విలాసాగర్ మీదుగా చెన్నూర్ అటవి ప్రాంతంలోకి చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని అటవిలో నీటి వనరులు, శాఖాహార జంతువుల సంఖ్య తక్కువగా ఉండటంతో పులి నిలకడగా ఉండే పరిస్థితి లేదంటున్నారు. పులి అలజడి మొదలవడంతో అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట అటవి ప్రాంతంలోకి వెళ్లొద్దని ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు. పాదముద్రలు సేకరించాం.. నస్తూర్‌పల్లి గ్రామానికి సమీపంలో అటవీప్రాంతంలో పులిని చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడంతో సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. పలుచోట్ల పులి పాదముద్రలను గుర్తించి సేకరించాం. మరింత సమాచారం సేకరిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై విచారణ జరిపి పులి ఎటు వెళ్లిందో తెలుసుకుంటాం. – రాజేశ్వర్, డిప్యూటీ రేంజర్, మహదేవపూర్అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు -
అక్రమాలపై విచారణ చేపట్టాలి
వెంకటాపురం(కె): వెంకటాపురం(కె) ఐసీడీఎస్ కార్యాలయం పరిధిలో అక్రమంగా బిల్లులు చేసిన వాటిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాననాయకులు సోమవారం అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. చిన్నారులకు మెరుగైన విద్యను బోధించడంతో పాటు పౌష్టికాహారం అందించాలన్నారు. ఐసీడీఎస్ సూపర్వైజర్, డీడబ్ల్యూఓ 2023 నుంచి 2024 వరకు వెంకటాపురం ప్రాజెక్ట్ పరిధిలో చేసిన అక్రమ బిల్లులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పర్శిక సతీష్, తాటి రాంబాబు, నాగరాజు, సురిటి నవదీప్, బొగ్గుల రాజ్‌కుమార్, సోర్లం మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యతవాజేడు: అడవులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని వాజేడు రేంజర్ చంద్రమౌళి అన్నారు. మండల పరిధిలోని కృష్ణాపురం, కోయవీరాపురం గ్రామాల్లోని ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పుపెడితే జీవకోటికి ప్రమాదం ఉంటుందని తెలిపారు. అడవులు లేకపోతే సమస్త ప్రాణులకు ఆక్సిజన్ అందకపోవడంతో పాటు వర్షాలు కురవవని తెలిపారు. అదే విధంగా ఏడ్జర్లపల్లి బీట్‌లో ఎఫ్ఎస్ఓ నాగమణి ఆ గ్రామస్తులకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు నారాయణ, నాగమణి, భిక్షపతి, బీట్ ఆఫీసర్లు రాంమూర్తి, పున్నమయ్య, గంగా భవాని, పద్మ, ప్రసాదరావు, మనీషా తదితరులు పాల్గొన్నారు.రేపటి నుంచి బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ ములుగు: నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో రేపటి(12వ తేదీ)నుంచి ములుగు బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించనున్నట్లు ఆ కేంద్రం వలంటీర్ నవీన్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12, 13వ తేదీలలో యువకులకు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్ పోటీలు ఉంటాయని వెల్లడించారు. వివరాలను నమోదు చేసుకోవడానికి ఫోన్ నంబర్ 9502126384, 9505496034లలో సంప్రదించాలని సూచించారు. విజేతలకు ఎలాంటి నగదు బహుమతి ఉండదని, ప్రశంస పత్రాలు, మెడల్స్ మాత్రమే అందిస్తామని వివరించారు. తాడిచర్లలో క్షుద్రపూజల కలకలం మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు. బొమ్మల కొలువు భూపాలపల్లి అర్బన్: మంజూర్‌నగర్‌లోని ఇల్లందు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి ఏరియాలో బొమ్మల కొలువు నిర్వహించారు. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి దేవాలయం నమూనాతో ఏర్పాటు చేసిన బొ మ్మల కొలువు ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి సీఎండీ సతీ మణి శారద బలరాం హాజరై సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి, లేడీస్ క్లబ్ సభ్యులు హాజరయ్యారు. -
కామేశ్వరాలయ పనులు ప్రారంభం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆవరణలోని కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కామేశ్వరాలయ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.11కోట్ల నిధులను మంజూరు చేయడంతో గత డిసెంబర్ నెలలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ప్లేట్లోడ్ టెస్టును నిర్వహించి ఆలయ నిర్మాణం చేపడితే శిల్పాల బరువును భూమి ఎంతమేరకు తట్టుకుని నిలబడుతుందోనని పరీక్షలు నిర్వహించారు. ముందుగా కామేశ్వరాలయం చుట్టూ వాల్ నిర్మించేందుకు వారం రోజులుగా కందకం తవ్వకాలు చేపడుతున్నారు. రామప్పలో నిర్మించిన ఆలయాలు కేవలం ఇసుకనే పునాదిగా చేసి నిర్మించారు. కాలక్రమేణా ఇసుకను చీమలు తోడేస్తుండడంతో ఆలయం కుంగిపోయే ప్రమాదం ఉండడంతో ఆలయం చుట్టూ పది అడుగుల మేర కందకం తవ్వి రాయితో వాల్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తులో ఆలయ పునాదిలోకి చీమలు, ఎలుకలు వెళ్లి ఇసుకను తోడే ప్రమాదం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
ఐలాపూర్ పనులు త్వరగా పూర్తిచేయాలి
కన్నాయిగూడెం: ఐలాపూర్ సమ్మక్క–సారలమ్మ జాతర పనులను త్వరితగతిన పూర్తిచేసి జాతరను విజయవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి ఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణ అన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి ఐలాపుర్ సమ్మక్క గుడి ప్రాంగణంలో చేస్తున్న పనులను పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో చేస్తున్న శానిటేషన్ తో పాటు వివిధ పనులపై ఆరా తీశారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలన్నారు. ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో ఇంజనీరింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి డీఈ శరత్‌బాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఏపీఓలు సురేష్, సాజిత, ఆర్ఐ గణేశ్, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.– వివరాలు 8లోuఈజీఎస్ ఏపీడీ వెంకటనారాయణభద్రత.. భారీగా జాతర విధులకు వెయ్యి మంది సిబ్బంది బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనున్న భద్రత -
జోరుగా ‘ఉపాధ్యాయ’ నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి చివరిరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులనుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు వేయగా.. మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి దాఖలు వేశారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో మంగళవారం వాటి పరిశీలన జరగనుంది. వాటిల్లో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తరువాత పోటీలో ఉండే అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. భారీగా సమావేశాలు, ర్యాలీలు ఇంతకుముందే నామినేషన్లు వేసిన వారు కూడా సోమవారం పెద్దఎత్తున సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మరోసెట్ దాఖలు చేశారు. అందులో ప్రధాన సంఘాల మద్దతు కలిగిన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్‌రెడ్డి, పులి సరోత్తమ్‌రెడ్డి, పూల రవీందర్, ఎస్.సుందర్రాజు యాదవ్ తదితరులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పూల రవీందర్ బహుజన వాదంతో పెద్దఎత్తున ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయగా, పీఆర్టీయూ–టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి కూడా ఎన్జీ కాలేజీ నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థిగా, టీపీయూఎస్ మద్దతుతో పులి సరోత్తంరెడ్డి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. సుందర్రాజు యాదవ్ వాహనాల్లో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. సుందర్‌రాజుయాదవ్, పూల రవీందర్ నామినేషన్ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి గతంలోనే పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక చివరి రోజు కూడా హర్షవర్ధన్‌రెడ్డి తరఫున ఆయన కూతురు హేమంత సంధ్యారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా మొత్తంగా 23 మంది 50 సెట్ల నామినేషన్లు వేశారు. 13 వరకు ఉపసంహరణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 13వ తేదీన 3 గంటల్లోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి చివరి రోజున 18 మంది నామినేషన్ మొత్తంగా 23 మంది 50 సెట్లు దాఖలు భారీ ర్యాలీలతో హోరెత్తిన నల్లగొండ నేడు నామినేషన్ల పరిశీలనఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య 25,797 నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు పెరిగారు. డిసెంబరు 30న ప్రకటించిన జాబితా ప్రకారం ఉపాధ్యాయ ఓటర్లు 24,905 మంది ఉన్నారు. అయితే నామినేషన్ల వరకు కూడా ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో మరో 892 మంది ఓటర్లు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. తుది ఓటరు జాబితాకు ఈ సప్లిమెంటరీ జాబితా జత చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,797 మంది ఓటర్లు ఉన్నారు. -
నేతకానీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
ఏటూరునాగారం: నేతకాని కులస్తులకు ప్రత్యేక కేటగిరి కల్పించడంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కుల గణన వివరాల్లో ఎస్సీ నేతకాని సామాజిక వర్గం 1,33,000 జనాభా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవంగా 18లక్షల పైచిలుకే జనాభా ఉంటుందని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రీ సర్వే చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణలో ప్రత్యేక కోటాతో పాటు కేటగిరి కల్పించి బడ్జెట్ కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో బక్కయ్య, కాంతారావు, చంద్రబాబు, పోచయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు -
ఉత్తమ సేవలు
భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపెరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్‌తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.