Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

KSR Comments On Chandrababu Singapore Tour1
చంద్రబాబూ.. మీ భుజాలు మీరే చరచుకుంటే ఎట్లా!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ టూర్‌లో చేసిన ప్రసంగాలు రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేవేనా? నిజానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌, మరో మంత్రి నారాయణ తదితరులు ఆరు రోజుల సింగపూర్‌ పర్యటన పెట్టుకోవడమే ఆశ్చర్యం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరడం వరకూ ఓకే కానీ.. ఆ సింగపూరే సర్వస్వం అన్నట్లు మాట్లాడటం వారికి క్షమాపణలు చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతిన్నదని, దాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమనడం మరీ అతిగా అనిపించింది. సింగపూర్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నారట. తాను జైలులో ఉన్నప్పుడు డెబ్బై, ఎనభై, తొంభై దేశాలలో తెలుగు వారు తమ పనులు మానుకుని నిరసనలు తెలిపారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆయన ఏ కేసులో అరెస్టు అయింది మాత్రం వివరించలేదు. సింగపూర్ అత్యంత నీతివంతమైన దేశం అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఆ దేశ మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడుగా పేరొందిన ఈశ్వరన్ అవినీతి కేసులోనే జైలుకు వెళ్లిన విషయాన్ని విస్మరిస్తే సరిపోతుందా!.సింగపూర్ అవినీతి బాగా తక్కువ ఉన్న దేశం కావచ్చు. కానీ, ఇతర దేశాల అవినీతి డబ్బుకు కేంద్రం అన్న పేరు కూడా ఉంది. సింగపూర్ కంపెనీలు అమరావతికి ఎంతవరకు వస్తాయో డౌటే అంటూనే.. సంప్రదింపులతో పాత ఒప్పందాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని చంద్రబాబు ఈ టూర్‌కు ముందు చెప్పారు. అంటే మళ్లీ సింగపూర్ కంపెనీలకు 1700 ఎకరాలు కట్టబెట్టి, ఆ భూమి అభివృద్ది కోసం ప్రభుత్వమే రూ.5500 కోట్లు వెచ్చించి, ఆ ప్లాట్ల అమ్మకానికి వారికి అప్పగిస్తారా? తద్వారా వచ్చే ఆదాయంలో 58 శాతం వారికే ఇస్తారా?. అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం సింగపూర్ కంపెనీలతో పనేముంది?. ఏపీకి సంబంధించిన పలు సంస్థలు ఈ వ్యాపారంలో ఉన్నాయి కదా!. ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంట్రాక్టులు దేశీ సంస్థలకే ఇచ్చారు కదా!. అందులో తెలుగువారి కంపెనీలు కూడా ఉన్నాయి కదా. వారు చేయలేని పని ఏదో సింగపూర్ కంపెనీలు చేస్తాయన్నట్లు చంద్రబాబు వంటి సీనియర్ నేత మాట్లాడడమే ఏపీకి పరువు తక్కువ. ఆ దేశ మంత్రితో చంద్రబాబు చర్చలు కూడా జరిపారు. అమరావతి కోసం కన్సార్షియం ఏర్పాటు చేయబోమని ఆయన స్పష్టం చేశారు కూడా. సాంకేతిక సాయం అందిస్తామని మాట వరసకు అన్నట్లు అనిపిస్తుంది. సింగపూర్ అయినా, మరో దేశం అయినా ఇక్కడ జరిగే నిర్మాణాలలో టెండర్లు వేసి పనులు దక్కించుకుంటే గౌరవం కాని, మనం వెళ్లి పిలిస్తే లోకువ అవడం లేదా!. దీనిని పక్కనబెడితే సింగపూర్ వెళ్లి కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఏమిటి?. అది ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీయడం కాదా!. నిజానికి ఏపీలో ఏడాదిన్నర కాలంగా జరిగిన పరిణామాలు రాష్ట్ర పరువును దెబ్బతీశాయి. ప్రతి నిత్యం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఎక్కడ టూర్‌కు వెళ్లినా ఆంక్షలు పెట్టడం, రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా!. ఈ తరహా నియంతృత్వం ఏపీకి పేరు తెస్తుందా?. అపకీర్తి తెస్తుందా?. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న దందాలు, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న స్కాంలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న తీరు.. ఇవి కదా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేది?. వాటిపై వివరణ ఇవ్వకుండా, జగన్‌పై ఆరోపణలు చేస్తే ఏమి లాభం?.జగన్ టైమ్‌లో విధ్వంసం జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేశారు కదా!. ఈ 14 నెలల కాలంలో అది ఏంటో ఎన్నడైనా చెప్పారా?. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఆధారాలు చూపారా?. పైగా కూటమి అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి రావడం అప్రతిష్ట కాదా!. అప్పులు పుట్టడం లేదంటూనే సుమారు రూ.1.86 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత చంద్రబాబు సర్కార్‌ది. ఆ విషయం సింగపూర్ లేదా ఇతర దేశాలలో ఉన్న తెలుగు వారికి తెలియదన్న నమ్మకంతో మాట్లాడుతున్నారా?. జగన్ తీసుకు వచ్చిన ఓడరేవులు, వైద్య కళాశాలలు, ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా తదితర సంస్థల భవనాల నిర్మాణం వంటివి ఏపీకి ఉపయోగమా? కాదా?. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఓడరేవులు ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు?. ఏపీకి వచ్చిన వైద్య కళాశాలల సీట్లను కూటమి ప్రభుత్వం ఎందుకు వదలుకుంది?.జగన్ టైమ్‌లో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటికి రెట్టింపు ఇస్తామని చెప్పి, ఇప్పుడు నోరు వెళ్లబెట్టడం, లేదా అన్నీ చేసేశాం కదా అని దబాయించడం ఏపీకి వన్నె తెచ్చిందా?. ప్రతి ప్రభుత్వం కొన్ని విధానాలు నిర్ణయించుకుంటుంది. ఆ ప్రకారం ముందుకు వెళుతుంది. జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేసింది అందరికీ తెలుసు. మరి చంద్రబాబు తన మేనిఫెస్టోని దగ్గర పెట్టుకుని ఇన్ని హామీలను ఇలా అమలు చేసి ప్రజల ముందు గర్వంగా నిలబడ్డామని చెప్పుకునే పరిస్థితి ఉందా?. అసలు పెన్షన్‌ రూ.1000 పెంచడం, ఒక గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన వాగ్ధానాలన్నిటిని ఏడాది ఎగవేసిన విషయం వాస్తవం కాదా?. అది చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిష్ట తెచ్చిందా? తన మీద కేసులు లేనట్లు, ఎదుటి వారిపైనే నిందారోపణలు చేయడం ఎంతవరకు పద్దతి అన్నది ఆలోచించుకోవాలి.సింగపూర్ అయినా మరోచోటికి వెళ్లినా, ఏపీకి ఉన్న సానుకూల అంశాలు పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా లభించే సహకారం మొదలైన అంశాలు తక్కువ మాట్లాడి, ఎక్కువ భాగం జగన్ దూషణకు కేటాయిస్తే ఎల్లో మీడియాలో బ్యానర్లుగా పనికి రావచ్చేమో కానీ.. ఏపీ ప్రజలకు మాత్రం ఉపయోగపడవు. సింగపూర్‌లో తెలుగు వారు తన వల్లే ఉద్యోగాలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం, అంతకన్నా మించి ఆయన తనయుడు లోకేశ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు శాసిస్తున్నారంటే అది చంద్రబాబు ఘనతేనని పొగుడుకోవడం ఎబ్బెట్టుగా ఉన్నాయి. తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడు కోవడం వల్ల అక్కడ ఉన్న అభిమానులు చప్పట్లు కొట్టవచ్చేమో కానీ, ఆ తర్వాత ఇలా వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారేంటి అన్న ఆలోచన వచ్చి అవహేళనకు గురవుతారని గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ ఇలాంటివి అనుభవమైనా ఈ ధోరణి మారడం లేదు. తల్లికి వందనం స్కీంను లోకేశ్‌ కనిపెట్టారని చంద్రబాబు చెప్పినప్పుడు అంతా నవ్వుకున్నారు. దానికి కారణం జగన్ అమలు చేసిన అమ్మ ఒడి స్కీమ్‌కు ఇది కాపీ కావడమే.ఇటీవల ఆయా మీటింగ్‌లో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా క్వాంటం కంప్యూటర్‌ను అమరావతిలో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తోందని చంద్రబాబు, లోకేశ్‌లు ప్రకటించగా ఎలా నవ్వులపాలైంది సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు చెబుతున్నాయి. కర్ణాటక మంత్రి బోసు రాజు ఒక ట్వీట్ చేస్తూ ఇప్పటికే కర్ణాటకలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటైందని, ఏపీలో తలపెట్టిన దానికన్నా మూడు రెట్లు శక్తిమంతమైందని, ప్రచారం చేసుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ వల్ల చంద్రబాబుకు అపఖ్యాతి వచ్చిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అబద్దమైనా, నిజమైనా తన గొప్ప తానే ఒకటికి వందసార్లు చెప్పుకుంటే జనం నమ్ముతారన్నది బాబు నమ్మిక. దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటే ఎవరైనా ఏం చేయగలుగుతారు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Marco Rubio Says India buying Russian oil Is Big Problem2
భారత్‌ కారణంగా పుతిన్‌ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: భారత్‌, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, భారత్‌.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్‌పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్‌ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్‌ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్‌ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.#BREAKING | US Secretary of State Marco Rubio calls India a "strategic partner" while also expressing concern over its continued energy imports from Russia. "Look, global trade – India is an ally. It’s a strategic partner. Like anything in foreign policy, you’re not going to… pic.twitter.com/m8OfCpHUXQ— NewsMobile (@NewsMobileIndia) July 31, 2025

Illegal Cases Against Ysrcp Leaders In Nellore District3
వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై మొదలైన అక్రమ కేసుల పర్వం

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై అక్రమ కేసుల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డితో పాటు మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు.ప్రసన్న ఇంటికి సమీపంలో వైఎస్‌ జగన్‌ కోసం ఎదురుచూస్తున్న పార్టీ శేణ్రులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జ్‌ చేశారు. దీంతో ప్రసన్న రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ మేరకు ఆయనపై మొదటి కేసు నమోదుగా కాగా.. అభిమానులను అడ్డుకునే క్రమంలో కావలి స్పెషల్‌ బ్రాంచ్‌ హెచ్‌సీ మాలకొండయ్య కిందపడడంతో ఆయన చేయి విరిగిందని.. ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌యాదవ్, మరికొందరిపై మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారంటూ కొందరు యువకులపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.కాగా, వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి సమీ­పంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి వైఎస్‌ జగన్‌ వస్తా­రని తెలియడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో­పాటు అభిమానులు, ప్రజలు అక్కడికి చేరుకు­న్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావుడి చేయకుండా వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షిస్తున్నారు.ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉద­యం 10.30 గంటలకు తన ఇంటికి వంద మీటర్ల దూ­రంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీ­సులు జోక్యం చేసుకుంటూ.. అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటు­కు వెళ్లారు. అదే సమయంలో దర్గామిట్ట సీఐ రోశయ్య, కొందరు పొలీస్‌ సిబ్బంది అకార­ణంగా ప్రసన్న­తో­పాటు పార్టీ కేడర్‌పై లాఠీచార్జ్‌ చేసి నెట్టే­శారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డి చేతికి గాయ­మైంది. పోలీసులు నెట్టేయడంతో ఆయన కిందప­డ­బోయారు. కార్య­కర్తలు పట్టుకోవడంతో ప్రమా­దం తప్పింది.పోలీ­సుల తీరుతో ప్రసన్నకు­మార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘మా అధినేత వైఎస్‌ జగన్‌ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా.. పోలీసులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. అరెస్ట్‌ చేస్తారా.. చేయండి’ అంటూ రోడ్డుపై బైఠా­యి­ంచారు. మధ్యా­హ్నం 1.15 గంటల (వైఎస్‌ జగన్‌ అక్కడికి చేరుకునే వరకు) వరకు మండుటెండలో నడిరోడ్డు­పైనే కూర్చున్నారు. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్‌ తీసుకొచ్చా­రు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించి, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

Sports Ministry to Maharashtra Online Rummy Minister: Video4
రమ్మీ ఎఫెక్ట్‌.. మాణిక్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ

సీరియస్‌గా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా.. ఓ మంత్రి సీరియస్‌గా ఫోన్‌ వంకే చూస్తూ వేళ్లు కదిలిస్తున్నారు. ఏం చేస్తున్నారా? అని చూస్తే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ మంత్రిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా.. విపక్షాలు ఆ చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి.అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మాణిక్‌రావ్‌ కోకాటేపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తొలగించింది. అదే సమయంలో ఆయనకు వేరే పోర్ట్‌ పోలియోలు అప్పగించింది. మాణిక్‌రావ్‌ కొకటేకు క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు యువజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలను కేటాయించింది ఫడ్నవిస్‌ ప్రభుత్వం. సిన్నార్‌ ఎమ్మెల్యే అయిన కోకటే.. ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన వీడియోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలూ ఆ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. “#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025ఎన్‌సీపీ(పవార్‌ వర్గం) ఎమ్మెల్యే అయిన కోకటే చర్యపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో ఆయన నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్‌ పవార్‌ వివరణ తీసుకున్నారు. గురువారం ఆ నివేదికను సీఎం ఫడ్నవిస్‌కు పంపారు. ఆ వెంటనే ఆయనకు వేరే శాఖలను అప్పగించారు. అయితే.. మంత్రి వర్గం నుంచి తప్పించుకుండా శాఖను మార్చడంపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి.మూడు నెలల్లో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఈ వ్యవసాయశాఖ మంత్రి తీరికగా చట్ట సభలో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. అలాంటి వ్యక్తిని ఇంకా మంతత్రిగా కొనసాగించడం ఏంటి? అని ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్నిఎన్సీపీ(శరద్‌ పవార్‌ వర్గం) ఎంపీ సుప్రియా సులే ప్రశ్నించారు.అయితే తాను ఫోన్‌ ఆపరేట్‌ చేస్తుండగా పాపప్‌ నోటిఫికేషన్‌ వచ్చిందని, ఉద్దేశపూర్వకంగా తాను దానిని తెరవలేదని కోకటే అంటున్నారు. ఇదిలా ఉంటే.. మరో ఎన్‌సీపీ ఎమ్మెల్యే దత్తాత్రేయ భరణేకి వ్యవసాయ శాఖను కేటాయించారు.

South Africa Champions win a thriller by 1 run5
ఉత్కంఠ పోరు.. ఒక్క ప‌రుగు తేడాతో సౌతాఫ్రికా విజ‌యం

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ అడుగుపెట్టింది. గురువారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను దక్షిణాఫ్రికా ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌(6) త్వరగా ఔటైనప్పటికి.. స్మట్స్‌(57), వాన్ వైక్(76) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్‌ సిడల్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. ఆర్చీ షార్ట్‌, బ్రెట్‌లీ, క్రిస్టియన్‌ తలా వికెట్‌ సాధించారు.పోరాడి ఓడిన ఆసీస్‌..అనంతరం లక్ష​​ చేధనలో ఆసీస్‌కు షాన్‌ మార్ష్‌(25), క్రిస్‌ లిన్‌(35) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత షార్ట్‌(33), క్రిస్టియన్‌(49) ఆసీస్‌ను గెలుపు దిశగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి.వైన్‌ పార్నల్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి క్వినీ సిక్స్‌ బాదగా.. రెండు బంతికి సింగిల్‌ తీసి క్రిస్టియన్‌కు స్ట్రైక్‌ ఇచ్చాడు. మూడో బంతికి రెండు, నాలుగు బంతికి ఒక పరుగు వచ్చింది. ఆ తర్వాత ఐదో బంతికి కూడా సింగిల్ రన్‌ మాత్రమే వచ్చింది. దీంతో చివరి బంతికి కంగారుల విజయానికి మూడు పరుగులు అవసరమవ్వగా.. డివిలియర్స్‌ అద్బుతమైన ఫీల్డింగ్‌తో ఒక్క రన్‌ మాత్రమే వచ్చింది.రెండో పరుగు తీసే క్రమంలో కౌల్టర్‌ నైల్‌ రనౌటయ్యాడు. ఒకవేళ రెండో పరుగు పూర్తి చేసి ఉంటే మ్యాచ్‌ టై అయ్యిండేది. ఇక శనివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న ఫైనల్‌ పోరులో పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. కాగా ఇండియా ఛాంపియన్స్‌ సెమీఫైనల్‌కు ఆర్హత సాధించినప్పటికి, పాకిస్తాన్‌తో ఉద్రిక్తల కారణంగా టోర్నీ నుంచి వైదొలిగారు.చదవండి: IND vs ENG 5th Test: ఆధ‌ర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవ‌ర్‌గా అంపైర్‌! ఫ్యాన్స్ ఫైర్‌

Cm Revanth Reddy Relief In Telangana High Court6
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి ఊరట లభించింది. ఆయనపై బీజేపీ కాసం వెంకటేశ్వర్లు పెట్టిన కేసును హైకోర్టు కొట్టివేసింది. నాంపల్లి స్పెషల్ కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు. రిజర్వేషన్లపై సీఎం రేవంత్ వాఖ్యలను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ క్వాష్ పిటిషన్‌ అనుమతిచ్చిన హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.కాగా, సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డికి ఊరట లభించింన సంగతి తెలిసిందే.. గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులో రేవంత్‌కి వ్యతిరేకంగా, ఎన్ పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ సోమవారం(గత నెల జులై 28) డిస్మిస్ చేసింది. అదే సమయంలో.. పిటిషన్‌లో హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై పిటిషనర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గమనించిన సీజేఐ ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.పిటిషన్ రాసిన న్యాయవాది, సంతకం పెట్టిన ఏవోఆర్‌పై చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు జడ్జిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తూనే.. పెద్దిరాజు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్, ఏవోఆర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు

AP Police Constable Results Released7
ఏపీ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఏపీలో ఎట్టకేలకు పోలీసు కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పోలీస్‌ శాఖలో ఉన్న తీవ్ర సిబ్బంది కొరతను అధిగమించేందుకు 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబర్‌లో నోటిఫికేషన్‌, 2023లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 డిసెంబర్‌లో ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. అయితే.. రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి👉 https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspxPETలో అర్హత సాధించిన 37,600 మంది అభ్యర్థులకు ఈ ఏడాది జూన్‌ 1వ తేదీన మెయిన్స్‌ రాత పరీక్ష నిర్వహించారు. అటుపై ఓఎంఆర్‌ షీట్లు జూలై 12, 2025 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచారు. ఫలితాల విడుదల న్యాయపరమైన చిక్కులు ఎదురైనట్లు SLPRB చెబుతూ వచ్చింది. ఈ తరుణంలో జూలై 30న విడుదల చేయాల్సిన ఫలితాలు.. ఆలస్యంగా ఇవాళ(ఆగస్టు 1న) విడుదలయ్యాయి.

Oscar nominated actress Insures Rs 16 Crore For A Smile8
నవ్వుకు 16.5 కోట్ల ఇన్సూరెన్స్‌!

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది మన సామెత. ‘నోరు ఆరోగ్యంగా ఉంటేనే నా కెరీర్‌ బాగుంటుంది. భవిష్యత్‌ బాగుంటుంది’ అనేది బ్రిటిష్‌ నటి, గాయని సింథియా ఎరివో మాట. ‘నవ్వే నా ఆస్తి.. నా గొంతే నా ఐశ్వర్యం’ అంటున్న సింథియా సుమారు 16.5 కోట్లకు తన గొంతును బీమా చేయించింది. మౌత్‌వాష్‌ బ్రాండ్‌ ‘లిస్టెరిన్‌’ ‘వాష్‌ యువర్‌ మౌత్‌’ క్యాంపెయిన్‌కు ఆమె ప్రచారకర్తగా ఉంది.‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా అందమైన నవ్వు, శక్తిమంతమైన స్వరం నా గుర్తింపు’ అని చెప్పే సింథియా దంత శుభ్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వేదిక ఎక్కినప్పుడల్లా బ్రష్‌ చేసుకుంటుంది. నోటికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచినట్లు చెబుతుంది.శరీర భాగాలకు బీమా చేయించడం కొత్తేమీ, వింతేమీ కాదు. కాళ్లు, వీపు, స్వరపేటిక, నాలుక...ఇలా రకరకాల శరీర భాగాలకు బీమా చేసుకున్నవారు హాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. అక్కడ ఇదొక ట్రెండ్‌గా కొనసాగుతోంది. (చదవండి: నో ఫ్యాషన్‌ డైట్‌.. జస్ట్‌ ఆరు నెలల్లో 17 కిలోలు! స్లిమ్‌గా నటి దీప్తి సాధ్వానీ)

ED summoned Anil Ambani to appear for questioning on August 59
అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్‌ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్‌ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్‌ గ్రూప్‌ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్‌ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్‌ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: రిటైర్‌ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!‘ఫ్రాడ్‌’గా వర్గీకరణరిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్‌’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వర్గీకరించింది.

Nidhhi Agerwal Upcoming Movies Details10
'వీరమల్లు' పోయింది.. నిధి అగర్వాల్‌కు మిగిలిన ఒకే ఒక్క ఆశ ఇదే

అంతన్న డింతన్నడే గంగరాజు తరహాలో కొన్ని చిత్రాల ప్రచారం జరుగుతుంది. అయితే ఆ చిత్రాలు విడుదలైన తరువాత అంచనాలు తలకిందులవుతాయి. ఆప్రభావం హీరోహీరోయిన్లు సహా యూనిట్‌ అంతటిపైనా పడుతుంది. దాని నుంచి బయట పడడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నటి నిధిఅగర్వాల్‌ పరిస్థితి అలాగే తయారైంది. ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రం హిట్‌తో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ. ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే ఏ ఒక్కటి ఆశించిన విజయాన్ని అందించలేదు. అలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్‌ నుంచి పిలుపువచ్చింది. అలా ఇక్కడ రవిమోహన్‌కు జంటగా భూమి చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్‌లో ఒక రౌండ్‌ కొట్టవచ్చుననే అందరూ అనుకున్నారు. అయితే ఆ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల అవడంతో పెద్దగా నిధి అగర్వాల్‌కు ప్లస్‌ కాలేదు. ఆ తరువాత శింబుకు జంటగా ఈశ్వరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటిస్తున్న సమయంలో శింబుతో ప్రేమ అంటూ ప్రచారం వైరల్‌ అయ్యింది. అదే సమయంలో ఈశ్వరన్‌ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌ సరసన ఒక చిత్రం చేశారు. అయినప్పటికీ నిధికి సరైన బ్రేక్‌ రాలేదు. ఆ తరువాత తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ సరసన హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఈ సారి సక్సెస్‌ గ్యారంటీ అని ఈ అమ్మడు సంతోషపడి ఉండవచ్చు. అయితే ఈ చిత్రం విడుదల కోసం ఐదేళ్లు చూశారు. ఈ చిత్రం ఫలితం నిధి అగర్వాల్‌కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈమెకు ఓకే ఒక్క ఆశ రాజాసాబ్‌. ప్రభాస్‌ సరసన నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో నిధి అగర్వాల్‌ మళ్లీ అవకాశాల కోసం పోరాటం మొదలు పెట్టారు. అందుకోసం ప్రత్యేకంగా తీయించుకున్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement