Mulugu District News
-
సమస్యల పరిష్కారానికి కృషి
గోవిందరావుపేట: కోయ కమ్యూనిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మండల పరిధిలోని పస్రాలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రూరల్ డెవలప్మెంట్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కోయ కమ్యూనిటీకి చెందిన 22మంది గ్రామ స్థాయి నాయకులకు బుధవారం స్వశక్తీకరణ శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్థాయి నాయకులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్‌రావు, ఎంఈఓ కేశవరావు, డిప్యూటీ తహసీల్దార్ సురేష్, నిరంజన్, సరస్వతీ, సంజీవ్, సుబ్రహ్మణ్యం, నర్సింహులు, ధనలక్ష్మీ, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
జాతీయ స్థాయి మెంటర్‌గా రామయ్య
ములుగు రూరల్: జాతీయ స్థాయి మెంటర్‌గా మండలంలోని అబ్బాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం భాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా జాతీయ మెంటరింగ్ కన్వీనర్ డాక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారని తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2022లో సాధించిన రామయ్యను జాతీయ విద్యా మండలి, జాతీయ మెంటర్ మిషన్ ఎంపిక చేయడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. రామయ్య గణిత శాస్త్ర బోధనా అధ్యయన, మనోవిజ్ఞాన శాస్త్రం, జీవ నైపుణ్యాలు, విద్య మానసిక ఆరోగ్యం, బోధన –అభ్యాసం, సాంకేతిక పరిజ్ఞానం అంశాలలో తన అనుభవాన్ని గుర్తించి జాతీయ మెంటర్‌గా ఎంపిక చేశారని వివరించారు. ఈ సందర్భంగా రామయ్యకు డీఈఓ పాణిని, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మల్లారెడ్డి అభినందనలు తెలిపినట్లు వెల్లడించారు. మైనార్టీ గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గు రుకుల పాఠశాలలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో 80 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మైనార్టీలకు 60 సీట్లు, ఇతరులకు 20 సీట్లు కేటాయింపు ఉంటుందని వివరించారు. ఇతరులను లక్కీడీప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. బీసీలకు –10, ఎస్సీ–5, ఎస్టీ–3, ఓసీ–2 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. వీటితో పాటు పాఠశాలలో 6వ తరగతిలో మైనార్టీలకు సీట్లు 26, 7వ తరగతిలో 23, 8వ తరగతిలో 15సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. టీఎంఆర్ఈఐఎస్. తెలంగాణ.జీఓవీ. ఇన్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 7995057915, 9398019134, 630 5229119లలో సంప్రదించాలని సూచించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభల ద్వారా నిరుపేదలను ఎంపిక చేసి సంక్షేమ పథకాలను అందేలా చూడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ముత్యాల రాజు, బండి నర్సయ్య, జక్కుల అయిలయ్య, శ్యామ్, సాగర్, మణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాస పోటీల విజేతలకు ప్రశంసపత్రాలుములుగు: ఇంగ్లిష్ భాషా ఉపాధ్యాయుల అసోసియేషన్(ఎల్టా), భరత స్వచ్ఛంద సేవా ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఆంగ్ల ఒలంపియాడ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందించారు. ఒలంపియాడ్ మొదటి విభాగం ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి కృష్ణ, ద్వితీయ స్థానంలో వెంకటాపురం(కె) జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి శ్రీజ, తృతీయస్థానంలో రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి సుష్మశ్రీ, నిలిచారు. విజేతలను జిల్లా కామన్ పరీక్షల నియంత్రణ అధికారి ఇనుగాల సూర్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేయనున్న దేవగిరిపట్నం స్కూల్ అసిస్టెంట్ అశోక్‌ను ములుగు జిల్లా ఆంగ్ల ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి అనిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకరయ్య సన్మానించారు. -
క్షేత్ర పర్యటనతో ప్రత్యక్ష అనుభవం
ఏటూరునాగారం: క్షేత్ర పర్యటనతోనే ప్రత్యక్ష అనుభవం ఉంటుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీఏ, బీకాం విద్యార్థులను యువ టూరిజం క్లబ్, సోషల్ సైన్సెస్, కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గల పురాతనమైన పాండవుల గుట్టను సందర్శించినట్లు తెలిపారు. ఈ పాండవుల గుట్ట చాలా పురాతనమైందని అక్కడి గుట్టపై పాండవులు వనవాసం చేసిన సందర్భంలో వారు నివసించిన గుహలు, రాతి పెయింటింగ్స్, ముంగిసగుట్ట, శిలాతోరణం, పాండవుల గుహలు, పోతిరాజు చెలిమే వంటివే గాక ప్రాక్ యుగము నుంచి చారిత్రక యుగం వరకు వేసిన రాతి చిత్రాలను విద్యార్థులకు చూపించి వాటి గురించి వివరించినట్లు వెల్లడించారు. అక్కడ వివిధ ఆకారాల్లో ఉన్న చెట్లు, కొండలు, ప్రకృతి సౌందర్యాన్ని చూసి అధ్యాపకులు విద్యార్థులు ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమంలో యువ టూరిజం క్లబ్ సమన్వయ కర్త వెంకటయ్య, అధ్యాపకులు సంపత్, రమేష్, భాస్కర్, శేఖర్, మున్ని తదితరులు పాల్గొన్నారు.డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రేణుక -
21
మరోపంచాయతీలు..!వెంకటాపురం(ఎం): ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా పంచాయతీ అధికారులు 8 మండలాల పరిధిలో కొత్తగా 21పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 174 గ్రామ పంచాయతీలు 1,556 వార్డులు ఉండగా కొత్తగా 20 పంచాయతీలు ఏర్పడితే జీపీల సంఖ్య 195కు చేరనుంది. జీపీలతో పాటు వార్డుల సంఖ్య కూడా పెరగనుంది.జిల్లాలో 195కు చేరనున్న జీపీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు 8 మండలాల పరిధిలో పెరగనున్న జీపీలు, వార్డులు21 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు జిల్లాలో 21గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా, ఓటర్లు, పాత పంచాయతీలకు కొత్తగా ఏర్పడే పంచాయతీలకు మధ్య ఉన్న దూరంతో పాటు తదితర ఆంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో 174 జీపీలు ఉండగా అదనంగా మరో 21 ఏర్పడితే గ్రామ పంచాయతీల సంఖ్య 195కు చేరనుంది. – ఒంటేరు దేవరాజు, డీపీఓ -
ప్రణాళికతో ముందుకెళ్లాలి
ములుగు: కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బుధవారం రెండో అర్ధభాగ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి కేసు అధికారులను నియమించాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో రాత్రిపూట, వీకెండ్లలో పహారా పెంచాలని సూచించారు. మద్యం తాగే బహిరంగ ప్రదేశాలను గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రమాద ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైస్పీడ్ డ్రైవింగ్‌ను నియంత్రించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు. వివాదాస్పద భూముల పరిష్కారంపై అధికారులతో సమావేశాలు నిర్వహించి, భూముల డాక్యుమెంటేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యా సంస్థలు, కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సైబర్ క్రైంపై సూచనలు చేయాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్డీపీఎస్(మాదకద్రవ్యాల) సరఫరా నెట్‌వర్క్‌పై నిఘా పెంచాలని తెలిపారు. పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ క్యూర్ కోడ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఓఎస్డీ గీతే మహేశ్బాబా సాహెబ్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీసీఆర్బీ, సివిల్ డీఎస్పీ కిశోర్‌కుమార్, రవీందర్, ఇన్స్పెక్టర్లు అజయ్, రమేశ్, శంకర్, రవీందర్, కుమార్, ఎస్సైలు వెంకటేశ్వరావు, సతీశ్, కమలాకర్, శ్రీకాంత్‌రెడ్డి, తాజుద్దీన్, సూరి, తిరుపతి, రాజ్‌కుమార్, వెంకటేశ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ శబరీశ్పదోన్నతితో బాధ్యత పెంపుపోలీస్శాఖలో పదోన్నతి ఉత్సాహంతో పాటు బాధ్యతను పెంచుతుందని ఎస్పీ శబరీశ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ నుంచి జిల్లాకు పదోన్నతిపై వచ్చిన ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలతో పాటు జిల్లాలో పదోన్నతి పొందిన మరొకరు బుధవారం ఎస్పీని తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వ ర్తిస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. -
కాళేశ్వరం చుట్టూ రాజకీయం
గర్భగుడిలో వీడియోలకు అనుమతి లేదు.. కాళేశ్వరం దేవస్థానంలో గర్భగుడిలో కాళేశ్వరుడు(యముడు), ముక్తీశ్వరుడు (శివుడు) ఒకే పానవట్టంపై కొలువైనారు. గర్భగుడిలో ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉండదు. కానీ యథేచ్ఛగా ఓ ప్రైవేట్ పాట చిత్రీకరణ జరగడంపై భక్తులను విస్మయానికి గురిచేసినట్లు విమర్శలు వచ్చాయి. ఆలయ ఆవరణలో ఫొటోలు, వీడియోలు తీయొద్దని సూచిక బోర్డులు సైతం అమర్చారు. నిబంధనలు తుంగలో తొక్కి పాట చిత్రీకరణ చేయడంపైన పలు పార్టీలు కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దేవస్థానం బాధ్యులపై, సింగర్ మధుప్రియ, పాట చిత్రీకరణ యూనిట్‌పై కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం: దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం దేవస్థానం చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట కాళేశ్వరం దేవస్థానం గర్భగుడిలో ప్రముఖ సింగర్ మధుప్రియ పాట చిత్రీకరణతో రెండు పార్టీల మధ్య వైరం రాష్టవ్యాప్తంగా దుమారం లేపింది. ఈనెల 20న మధుప్రియ ప్రైవేట్ పాటను శివుడిపై తీసేందుకు తన బృందంతో కాళేశ్వరాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చెందిన వ్యక్తులు కాళేశ్వరం దేవస్థానం ఈఓ మారుతితో ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరం ఆవరణ, గోదావరి తీరం వద్ద పాట చిత్రీకరణ చేస్తామని అనుమతి పొందారు. ఆయన కూడా అందుబాటులో లేనని బదులిచ్చారు. దీంతో ఆ బృందం సభ్యులు ఏకంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారి గర్భగుడి ద్విలింగాల ఎదుట మధుప్రియ పాట చిత్రీకరణను రెండు నిమిషాల పాటు నృత్యం చేస్తూ వీడియో తీశారు. దీనికితోడు వారివెంట కాళేశ్వరానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు ఉన్నారు. గర్భగుడిలో పాట చిత్రీకరణ జరిగిన వీడియో, ఫొటోలు బయటకి రావడంతో స్థానిక కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులు ఫొటోలు, వీడియోలను మీడియాకు అందించడంతో వివాదం రాజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రితో అభివృద్ధి ౖపైపెకి.. రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు సరస్వతి పుష్కరాలు మంజూరు చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం దేవస్థానం అభివృద్ధికోసం కృషి చేస్తూ చర్యలు చేపడుతుండగా ఆలయంలో అధికారుల బాధ్యతారాహిత్యం, ఓ వైపు రాజకీయ నాయకుల చేష్టలతో ప్రతిష్ట దెబ్బతింటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు టూర్లో.. ఫిబ్రవరిలో మూడు రోజులపాటు నిర్వహించే కుంభాభిషేకం, మే నెల 15 నుంచి 26 వరకు జరుగు సరస్వతీ పుష్కరాలకు శృంగేరి పీఠాధిపతిని ఆహ్వానించడానికి కాళేశ్వరం దేవస్థానం ఈఓ మారుతి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అర్చకులు కర్ణాటకలోని బళ్లారికి వెళ్లారు. ఈఓతో పాటు కిందిస్థాయి సిబ్బంది ఎందుకు వెళ్లడం అని భక్తులు ఆరోపిస్తున్నారు. నోటీస్‌తో సరి.. సింగర్ మధుప్రియ ఘటనపై ఈఓ మారుతి కాళేశ్వరం దేవస్థానంలో ఓ అర్చకునికి నోటీస్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. గర్భగుడిలో పాట చిత్రీకరణ జరిగితే సమాచారం ఇవ్వనందుకు అర్చకుడికి ఈఓ నోటీస్ అందజేశారు. దీనిపై పలు సంఘాలు, బీజేపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈఓతో పాటు బాధ్యులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలుగుతున్నా అధికారులు మాట్లాడడం లేదు. అనుమతి తీసుకోలేదు.. గర్భగుడిలో పాట చిత్రీకరణకు అనుమతి లేదు. కాళేశ్వరం ఆవరణలో తీసుకోవడానికి సింగర్ మధుప్రియకు సంబంధించిన వారు ఫోన్లో అనుమతి తీసుకున్నారు. గర్భగుడిలో పాట తీసిన విషయంలో అర్చకుడికి సమాచారం ఇవ్వలేదని నోటీస్ అందజేశాను. ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదించా. – మారుతి, ఈఓ, కాళేశ్వరం దేవస్థానంగర్భగుడిలో సింగర్ మధుప్రియ పాట చిత్రీకరణపై దుమారం మౌనంవీడని దేవాదాయశాఖ అధికారులు రూ.25కోట్ల నిధుల మంజూరుతో అఽధికారులు బిజీ ఓ అర్చకుడికి నోటీస్ ఇచ్చిన అధికారులు -
52.87శాతం గ్రామసభలు పూర్తి
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల అమలుకు చేపట్టిన గ్రామసభలు రెండోరోజూ పలు గ్రామ పంచాయతీల్లో కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి 52.87 శాతంగా గ్రామసభలు పూర్తి అయ్యాయి. ఈ గ్రామసభల్లో వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా దరఖాస్తులను స్వీకరించారు. జాకారం, షాపెల్లిలో నిలదీత ములుగు మండలంలోని గుర్తూరుతండా, మల్లంపల్లి, జాకారం, పత్తిపల్లి, పెగడపల్లి, సర్వాపూర్, కొత్తూరు, జంగాలపల్లి గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాకారం పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో మండల పంచాయతీ అధికారి రహీమొద్దీన్ ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితా చదువుతుండగా పలువురు గ్రామస్తులు తమ పేర్లు రాలేదంటూ అధికారులను దిగారు. పేర్లు రానివారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని షాపెల్లిలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ కుమార్ అర్హుల జాబితా చదువుతుండగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువురు అధికారులు నిలదీశారు. ఈ క్రమంలో పలువురు గ్రామస్తుల మధ్య గలాట చోటుచేసుకోగా పోలీసులు కల్పించుకుని గొడవ సద్దుమనిగేలా చూశారు.జాకారం, షాపెల్లి గ్రామసభల్లో వాగ్వాదం -
అసంక్రమిత వ్యాధులపై దృష్టి
ఏటూరునాగారం: అసంక్రమిత వ్యాధులను గుర్తించడంపై వైద్యులు, వైద్య సిబ్బంది దృష్టి సారించాలని జాతీయ హెల్త్ మిషన్ జిల్లా ప్రోగ్రాం అధికారి చిరంజీవి అన్నారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి పల్లె దవాఖానాలో నేషనల్ హెల్త్ ప్రోగ్రాం, క్వాలిటీపై వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు బుధవారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నేషనల్ హెల్త్‌మిషన్ ప్రోగ్రాం కింద 12రకాల సేవలను ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు. ఎన్సీడీ, మాతాశిశు, గర్భిణి, శిశు సంరక్షణ, కౌమారదశ, అసంక్రమిత, అంటువ్యాధులపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలకు క్షేత్ర స్థాయిలో చేరవేయాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆశ కార్యకర్తలు వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అంటు వ్యాధులు, జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి వెంటనే గుర్తించాలన్నారు. వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకొని ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు అన్మిషా, ఏఎన్ఎం పుణ్యవతి, సమ్మక్క, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.జాతీయ హెల్త్ మిషన్ ప్రోగ్రాం అధికారి చిరంజీవి -
విద్యతోనే సమాజంలో గుర్తింపు
విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి అన్నారు.– 8లోuపంచాయతీల ఏర్పాటుతోనే గ్రామాల అభివృద్ధి చిన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం మూలంగా గ్రామాలు మరింత అభివృద్ది చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 500జనాభా కలిగిన ప్రతీ పల్లెను పంచాయతీగా ఏర్పాటు చేసింది. పల్లెలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. పరిపాలన సౌలభ్యం సులభతరమై ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో ఆశావహులు సైతం నూతన పంచాయతీల కోసం ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందే తమ గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో.. జిల్లాలో 9 మండలాలు ఉండగా 8 మండలాల పరిధిలో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ములుగు మండలంలో చిన్న గుంటూరుపల్లి, శ్రీరాములపల్లి, జగ్గన్నగూడెం, చింతకుంట, గోవిందరావుపేట మండలంలో మొద్దులగూడెం, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో కొండపర్తి, బిట్టుపల్లి(కొడిశాల), పడిగాపూర్, ఏటూరునాగారం మండలంలో బూటారం, గోగుపల్లి, కన్నాయిగూడెం మండలంలో చిట్యాల, భూపతిపురం, కన్నాయిగూడెం, సింగారం, మంగపేట మండలంలో తొండ్యాల లక్ష్మిపురం, నరెందర్రావుపేట, శనిగకుంట, జబ్బోనిగూడెం, అబ్బాయిగూడెం, వాజేడు మండలంలో అరుణాచలపురం, వెంకటాపురం(కె) మండలంలో కొత్త కొండాపురం గ్రామాలు నూతన పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. వెంకటాపురం(ఎం) మండలంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. -
అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం
ములుగు: విలాసవంతమైన వస్తువులు ఇస్తాం, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, దేశీయాత్రకు పంపిస్తామని వచ్చే కాల్స్‌పై మనం చూపే అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనకు తెలియని ఏపీకే ఫైల్స్, లింకులు, యాప్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలని సూచించారు. వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితిలో అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ముఖ్యంగా పిరమిడ్, ఎంఎల్ఎం మోసాల ముప్పు పెరుగుతూ వస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ధ్రువీకరణ చేసుకోకుండా మిగతా వారి ఖాతాలలో డబ్బు జమ చేయవద్దన్నారు. ఎవరైనా మోసపోతే 1930 టోల్‌ఫ్రీ నెంబర్ లేదా వాట్సప్ నంబర్ 8712672222కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని అన్ని పీఎస్‌లలో సైబర్ వారియర్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి -
మందుల కొరత లేకుండా చూసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో టీజీఎంఎస్ఐడీసీ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాలోని అన్ని ఆస్పత్రుల ఫార్మసిస్టులు, నర్సింగ్ ఆఫీసర్లకు ఈ ఔషధిపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఎం మాట్లాడుతూ.. వార్షిక అవసరాల కోసం పెట్టే మందులు ఇండెంట్లు పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ ఔషధి అమలులో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ అధికారులు సమన్వయంగా అవసరానికి తగినట్టు వార్షిక ఇండెంట్లు పెట్టాలన్నారు. మందులు ఎక్స్పైరీ కాకుండా సకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీచింగ్ ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు వివిధ రకాల ముందులు సరఫరా చేస్తుందని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. -
అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం
ములుగు: విలాసవంతమైన వస్తువులు ఇస్తాం, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, దేశీయాత్రకు పంపిస్తామని వచ్చే కాల్స్‌పై మనం చూపే అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనకు తెలియని ఏపీకే ఫైల్స్, లింకులు, యాప్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలని సూచించారు. వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితిలో అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ముఖ్యంగా పిరమిడ్, ఎంఎల్ఎం మోసాల ముప్పు పెరుగుతూ వస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ధ్రువీకరణ చేసుకోకుండా మిగతా వారి ఖాతాలలో డబ్బు జమ చేయవద్దన్నారు. ఎవరైనా మోసపోతే 1930 టోల్‌ఫ్రీ నెంబర్ లేదా వాట్సప్ నంబర్ 8712672222కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని అన్ని పీఎస్‌లలో సైబర్ వారియర్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి -
44 గ్రామ పంచాయతీలు.. 5,394 దరఖాస్తులు
గ్రామసభల్లో అధికారులకు అందిన అర్జీలు ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాల అమలు కోసం మంగళవారం జిల్లాలోని 44 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో మొత్తంగా 5,394 దరఖాస్తులు అధికారులు, ప్రజాప్రతినిధులకు అందాయి. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పోలీసుల బందోబస్తు మధ్య గ్రామసభలు నిరసనలు.. నిలదీతల మధ్య కొనసాగాయి. ప్రత్యేక కౌంటర్లు గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డు, రైతు భరోసా దరఖాస్తులను విడివిడిగా స్వీకరించేందుకు నాలుగు ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఏ పథకం కావాలో ఆ కౌంటర్ వద్దకు వెళ్లి దరఖాస్తులను చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లను అందజేసి రిజిస్టర్లో బాధితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్కార్డులపైనే.. పోలీసుల బందోబస్తు మధ్య కొనసాగిన వైనంఅర్హులందరికీ సంక్షేమ పథకాలు కలెక్టర్ టీఎస్.దివాకర ములుగు రూరల్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం గ్రామసభలు నిర్వహించగా జీవింతరావుపల్లి గ్రామసభకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలనలో భాగంగా గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామసభల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వీకరించిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, మండల పంచాయతీ అధికారి రహీం, కార్యదర్శి దామోదర్ పాల్గొన్నారు. -
కొంగాల గ్రామసభలో రసాభాస
బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో రసాభాస చోటుచేసుకుంది. వివిధ పథకాలకు అర్హులైన వారి వివరాలను అధికారులు చదువుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పెనుమళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నాయకులు గ్రామసభ వద్దకు చేరుకుని ఆరుగ్యారంటీలను అమలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాట్ల కాళీకృష్ణ బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటని ఎదురు ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే ఎస్సై రాజ్‌కుమార్, అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గ్రామసభ యధావిథిగా కొనసాగింది. న్యూస్‌రీల్ -
ఆర్టీసీకి మహిళా సంక్రాంతి!
హన్మకొండ: సంక్రాంతి పండుగకు ఆర్టీసీలో మహిళ ప్రయాణికులే అధిక సంఖ్యలో ప్రయాణించారు. మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. వరంగల్ రీజియన్‌లో ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 48.64 లక్షల మంది ప్రయాణిస్తే ఇందులో మహిళ ప్రయాణికులు 30.40 లక్షల మంది ఉన్నారు. టికెట్ ద్వారా ప్రయాణించిన వారి సంఖ్య 18.25 లక్షలు మాత్రమే. ఇందులోనూ మహిళా ప్రయాణికులు ఉన్నారు. మొత్తం ప్రయాణికుల్లో 62.5 శాతం మంది ఉచితంగా ప్రయాణించిన వారే. టికెట్ ద్వారా 37.5 శాతం మంది ప్రయాణించారు. సంక్రాంతి పండుగకు విద్యాసంస్థలకు ఈ నెల 11 నుంచి 17 వరకు సెలవులు ఇచ్చారు. 18వ తేదీ ఒక్క రోజు పని దినం ఉన్నప్పటికీ 19వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 20వ తేదీ ఉదయం వరకు ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి నడిచాయి. విద్యాసంస్థలకు సెలవులు 11 నుంచి అయితే ఆర్టీసీ బస్సులకు ఈ నెల 9 నుంచి రద్దీ పెరిగింది. రీజియన్‌లో 660 ప్రత్యేక బస్సులు ● సంక్రాంతి పండుగకు వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ 660 ప్రత్యేక బస్సులు నడిపింది. ● సంక్రాంతి పండుగకు 12 రోజుల్లో రూ.30,30,01,000 ఆదాయాన్ని రాబట్టుకుంది. ● సాధారణంగా ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో రోజుకు సగటున రూ.2 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 12 రోజుల్లో సగటున రూ.2.52 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. కిలో మీటర్‌కు రూ.64.84 ఆర్జించింది. ● ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు 46.73 లక్షల కిలో మీటర్లు తిరిగి 48.64 లక్షల మందిని వివిధ గమ్యస్థానాలకు చేరవేసింది. ● మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ద్వారా 30.40 లక్షల మందిని చేరవేసింది. రూ.14,29,63,000 ఆదాయం వచ్చింది. ● టికెట్ ద్వారా 18.25 లక్షల మందిని చేరవేయడం ద్వారా రూ.16,00,38,000 ఆదాయం రాబట్టుకుంది. ● మహిళా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నా.. మొత్తం ఆదాయంలో ఉచిత ప్రయాణం ద్వారా 47శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ● టికెట్ ప్రయాణికుల ద్వారా 53 శాతం ఆదాయం వచ్చింది.నడిచిన సర్వీసులు 660 తిరిగిన కిలో మీటర్లు 46.73 లక్షలు ప్రయాణికుల చేరవేత 48.64 లక్షలుమహాలక్ష్మి పథకం ప్రయాణికులు 30.40 లక్షలు ఆదాయం రూ.14.29 కోట్లు టికెట్ ప్రయాణికులు 18.25 లక్షలు ఆదాయం 16 కోట్లురీజియన్లో ఇలా..టికెట్ ఆదాయమే ఎక్కువ.. 62.5 శాతం ఉచిత ప్రయాణికులకు 47 శాతం ఆదాయం రాగా, 37.5 శాతం టికెట్ ప్రయాణికుల ద్వారా 53 శాతం ఆదాయం వచ్చింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉంటాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య అధికంగా కనిపించినా ఆదాయం ఆ మేరకు కనిపించలేదు. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో చార్జీలు అధికంగా ఉంటున్నందున ప్రయాణికుల సంఖ్య తక్కువ కనిపించినా ఆదాయం అధికంగా ఉంటుంది.వరంగల్ రీజియన్‌లో 12 రోజులకు వచ్చిన ఆదాయం రూ.30.30 కోట్లు అధిక సంఖ్యలో ప్రయాణించిన మహిళలు ఈ నెల 9 నుంచి 20 వరకు రద్దీగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంకంటే టికెట్ ప్రయాణ ఆదాయమే ఎక్కువ.. -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
మంగపేట: మండలంలోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ గోపాల్‌రావు అన్నారు. మండలంలోని మంగపేట, చుంచుపల్లి, పీహెచ్‌సీలను ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ కోరం క్రాంతికుమార్‌తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయా పీహెచ్‌సీల నిర్వహణ రికార్డులు, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం పొందాలన్నారు. పీహెచ్సీలలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రులో మందులు, సిబ్బంది ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో కలిసి పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి పోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, ఐటీడీఏ ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, మంగపేట వైద్యాధికారి గౌతమ్, డాక్టర్ అఖిల, చుంచుపల్లి వైద్యాధికారి యమున, పల్లెదవాఖానా వైద్యాధికారి తరుణ్, చందా మనోజ్‌కుమార్, ఆయా పీహెచ్‌సీల సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు -
డిపోల వారీగా ఆదాయం, ప్రయాణికుల వివరాలు (లక్షల్లో)..
డిపో ఉచితం ఆదాయం టికెట్ ప్రయాణం ఆదాయం హనుమకొండ 5.58 192.92 2.56 173.95 వరంగల్–1 2.63 112.33 1.97 294.64 వరంగల్–2 2.27 127.76 2.65 388,74 పరకాల 2.98 125.93 1.82 93.21 భూపాలపల్లి 3.22 164.95 1.66 138.83 జనగామ 4.24 214.72 2.23 144.58 మహబూబాబాద్ 3.00 136.29 1.46 73.09 నర్సంపేట 3.70 162.03 2.14 134.13 తొర్రూరు 2.78 192.70 1.75 159.21 -
భూమి లేకున్నా.. గుంటన్నర ఉన్నట్లు..
నేను ఒంటరి మహిళను.. ఎలాంటి భూమి లేదు. కానీ రైతు ఆత్మీయ భరోసా పథకంలో గుంటన్నర భూమి ఉన్నట్లు వచ్చింది. దానివల్ల నాకు వచ్చే పథకం రాకుండా పోయింది. సర్వేకు వచ్చినప్పుడు భూమి లేదని చెప్పినప్పటికీ భూమి ఉన్నట్లు రాశారు. దానిని తొలగించి అర్హత కలిగిన పథకాలు వర్తింపజేయాలి. – మహ్మద్ హసీనా, చిన్నబోయిపల్లి, ఏటూరునాగారం ఇందిరమ్మ ఇల్లు కావాలి.. ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నాను. ఇంటికి సర్వేకు వచ్చిన అధికారులు పెంకుటిల్లు ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కానీ ఇందిరమ్మ ఇంటి జాబితాలో నా పేరు లేదు. ఇల్లు ఉన్న వారికే ఇల్లులు వచ్చాయి. ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది. – అప్సర్బీ, గృహిణి, చిన్నబోయినపల్లి -
ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ఆశ వర్కర్లకు పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని జంగాలపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ప్రభుత్వ పథకాల అమలులో ఆశ వర్కర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు హామీలను అమలు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాలు అందిస్తుండగా మన రాష్ట్రంలో మాత్రం పారితోసికం అందించడం సరికాదన్నారు. ఆశ వర్కర్ల సేవలు గుర్తించి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండబోయిన రవిగౌడ్, నీలాదేవి, మంజూల, సరిత, శాంత కుమారి, సత్యవతి పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
క్రీడలతో మానసికోల్లాసం
ములుగు రూరల్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మమన్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జాకారంలోని గిరిజన విశ్వవిద్యాలయంలో క్రీడోత్సవ్ –2025 వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక ధృడత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఖేలో భారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్థాయి వరకు క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయిరాం, స్వామి, కై లాసం తదితరులు పాల్గొన్నారు. కోతిని తప్పించబోయి.. ● చెట్టును ఢీకొట్టిన కారు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళ్తున్న క్రమంలో పస్రా–తాడ్వాయి మధ్యలో ఓ కారు రోడ్డుపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ బంధువులతో కలిసి భద్రాచలానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం మేడారంలోని వనదేవతల దర్శనం నిమిత్తం వెళ్తుండగా పస్రా– తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారులో ఉన్న ఐదుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. ఇదే క్రమంలో ఏటూరునాగారం నుంచి ములుగు వెళ్తున్న పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాంపతి వారిని గమనించి ఆగారు. 108కు సమాచారం అందించి గాయపడిన వారిని తన వాహనంలో పస్రా చెక్‌పోస్టు వరకు తీసుకెళ్లారు. అక్కడికి ఎదురుగా 108 అంబులెన్స్ రాగా వారిని వైద్య చికిత్స నిమిత్తం ములుగు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాంపతి మరో వాహనాన్ని పిలిపించి డీఈతో పాటు బంధువులను ఆదిలాబాద్‌కు తరలించి మానవత్వం చాటుకున్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి ములుగు రూరల్: ఈ నెల 25నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాయలంలో మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ మతోన్మాద భావజాలాన్ని పెంపొందిస్తున్న సమస్యలకు పరిష్కారంపై ఆలోచనం చేయనున్నట్లు వెల్ల డించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల అమలచేస్తామని చెప్పి కాలయాపన చేస్తుందన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు సీపీఎం అఖిల భారత కోఆర్డినేటర్ ప్రకాష్శరత్, పొలిటీకల్ బ్యూరో సభ్యులు కోఆర్డినేటర్ బృందాకారత్, బీవీ రాఘవులు, విజయ్ రాఘవన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రత్నం రాజేందర్, మండల కార్యదర్శి ఎండి గఫూర్, రత్నం ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి వెంకటాపురం(కె): రహదారి పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న రోడ్డు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. మండల కేంద్రంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజేడు నుంచి వెంకటాపురం మండలం ఎదిర వరకు రూ.44 కోట్లతో రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పనులు చేయడంలో నిర్లక్ష్యంచేస్తున్న కాంట్రాక్టర్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
‘పీఎం కుసుమ్’పై అవగాహన కల్పించాలి
ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కుసుమ్ పథకంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘కుసుమ్ దరఖాస్తులు నిల్’ కథనంపై పీఓ స్పందించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఎం కుసుమ్ పథకంపై పీఓ పెసా మొబిలైజర్లు, ఇతర అధికారులతో సమీ క్షించారు. అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు పథకం గురించి వివరించాలన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఉందన్నారు. దీనిలో భాగంగా 4 ఎకరాలు కలిగి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా లేదా రెవెన్యూ పట్టా కలిగి, సబ్‌స్టేషన్‌కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను 25 సంవత్సరాలకు లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. లీజుకు తీసుకున్న భూమికి ఎకరానికి సంవత్సరానికి రూ.12,500లు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా నెలకొల్పిన సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహణ చేపట్టి వారిని ఆర్థికంగా ఎదిగేవిధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు మరిన్ని వివరాలకు ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈనెల 25వ తేదీలోపు రైతులను గుర్తించాలని, 27న మండలాల వారీగా మరోసారి మొబిలైజర్లతో సమావేశం నిర్వహించి దరఖాస్తులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్‌కుమార్, డీటీ అనిల్, వెంకన్న, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా -
ప్రయాణికుల పాట్లు
ఏటూరునాగారం: సంక్రాంతి పండుగ తర్వాత ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరుగుప్రయాణం అయ్యారు. దీంతో ఏజెన్సీలోని ప్రజలు, విద్యార్థులు, ప్రయాణికులు పట్టణాలకు వెళ్లేందుకు సోమవారం ఏటూరునాగారం ఆర్టీసీ బస్టాండ్‌లో పడిగాపులు పడ్డారు. ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు సైతం బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు సకాలంలో లేకపోవడంతో పాటు వచ్చిన కొద్దిపాటి బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోవడంతో పాటు సీట్ల కోసం పోటీపడ్డారు. పలు ప్రైవేట్ వాహనాల్లో సైతం విద్యార్థులు తరలివెళ్లారు. -
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: మహిళల ఆర్థికాభివృద్ధికి ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు. క్యాంటీన్లో చేసిన భోజనానికి మంత్రి డబ్బులు ఇచ్చి నిర్వాహకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కార్పోరేట్ కంపెనీల భాగస్వామ్యంతో 8 గ్రామాలను దత్తత తీసుకొని రూ. 2.5 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి క్రాస్ నుంచి జీవంతరావుపల్లి క్రాస్ వరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రూ. 5.11 కోట్లతో ములుగు బస్టాండ్ పనులకు, ఏటూరునాగారంలో రూ.7కోట్లతో బస్‌డిపో నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం రోడ్డుభద్రతా మాసోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం ములుగులోని రవాణాశాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై పలు సూచనలు చేశారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలో 1.20కోట్లతో నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని, రూ.8 లక్షలతో నిర్మించిన రామాంజానేయ స్వామి దేవాలయ ప్రహరీని, రూ.5లక్షలతో నిర్మించిన లక్ష్మి దేవర టెంపుల్ ప్రహరీ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, డీపీఓ ఓంటేరు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. గోవిందరావుపేట మండల పరిధిలోని ఎల్బీనగర్లో ఓపెన్ బోర్ వెల్‌ని మంత్రి సీతక్క సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సింక్రోని, ఓపెన్ టెక్టస్ సంస్థల సహకారంతో నిర్మాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు చెందిన 130 విద్యార్థులకు మంత్రి సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లాలో కనీసం బస్సు సౌకర్యం లేని గ్రామాలు ఆర్థికంగా, నాగరికతకు దూరంగా ఉన్న గ్రామాలను వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకోవాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క -
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్‌లో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నియోకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో కలెక్టర్ దివాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ కాటాపూర్‌లో సర్వే నంబర్ 147లో 108 మంది నిరుపేద కుటుంబాలకు 75గజాల చొప్పున ఇంటి స్థలాలను మంజూరు చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఇళ్ల స్థలాలు కేటాయించినా ఇప్పటి వరకు పంపిణీ చేయలేదన్నారు. పంపిణీ చేసే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ తక్షణమే ఆ స్థలాలు పంపిణీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, మాజీ సర్పంచులు పులి నర్సయ్య, గౌరమ్మ, మాజీ ఎంపీటీసీ నర్సింగరావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగయ్య, నాయకులు హుస్సేన్, లక్ష్మీనర్సయ్య, రాంబాబు, లబ్ధిదారులు పాల్గొన్నారు.జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి -
వినతుల పరిష్కారమే లక్ష్యం
ఏటూరునాగారం: గిరిజన దర్బార్‌లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన వినతుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 24వినతులు రాగా పీఓ వినతులు స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ వినతుల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీడీ పోచం, ఐటీడీఏ ఏఓ రాజ్‌కుమార్, పెసా కో ఆర్డినేటర్ ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, బాలాజీ, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు. పలు సమస్యలపై వచ్చిన వినతులు ఇలా.. గోవిందరావుపేట మండలం బాలాజీనగర్‌లో సోలార్ బోర్ పంపు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలం భూపతిపూర్(సింగారం) గ్రామానికి చెందిన పున్నం రమేష్ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని వేడుకున్నారు. గోవిందరావుపేట మండలం సండ్రగూడెం గ్రామానికి చెందిన లావుడ్య గణేశ్ పొలానికి సాగు నీటి కోసం సోలార్ పంపు సెట్ ఇవ్వాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మహదేవపురం గ్రామానికి చెందిన సమ్మక్క, మంజూల, ఈశ్వరమ్మ కలిసి ఎంఎస్ఎంఈ పథకం ద్వారా లడ్డూ తయారీ యూనిట్‌ను మంజూరు చేయాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురానికి చెందిన తోలెం హైమ ఐటీడీఏ పరిధిలో కంటెన్జెంట్ వర్కర్‌గా ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలంలో కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తుడుందెబ్బ నాయకుడు పొడెం బాబు పీఓకు వినతి పత్రాన్ని అందజేశారు.ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాజూట్బ్యాగ్ల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఐటీడీఏ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న జూట్‌బ్యాగ్‌ల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని గిరిజన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో జూట్‌బ్యాగ్‌ల తయారీపై 13రోజుల పాటు శిక్షణ ఇస్తారని వివరించారు. ట్రైనింగ్‌లో మధ్యాహ్న భోజనం, వసతి కల్పించడంతో పాటు ఉచితంగా టూల్ కిట్‌ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కనీస విద్యార్హత 10వ తరగతి ఉండి 18నుంచి 45ఏళ్ల లోపు ఉన్న గిరిజన మహిళలు ఈ పథకానికి అర్హులని వివరించారు. తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగి కుట్టు మిషన్‌పై కొంత అనుభవం ఉన్న వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో ఈ నెల 27న సాయంత్రం 5గంటల లోపు ఐటీడీఏ కార్యాలయంలో అందించాలని పీఓ కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 8330954571లో సంప్రదించాలని తెలిపారు.