రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

Published Wed, Apr 23 2025 8:11 AM | Last Updated on Wed, Apr 23 2025 9:01 AM

రాష్ట

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

బాలికలదే మొదటి స్థానం

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, రెసిడెన్షియల్‌ కళాశాలల్లో ఇంటర్‌ జనరల్‌ విభాగం ద్వితీయ సంవత్సరంలో మొత్తం 833 మంది బాలురు పరీక్ష రాయగా 616 మంది పాసై 73.95శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 802 మంది పరీక్ష రాయగా 694 మంది పాసై 86.53 శాతంగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,635 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,310 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఇక ఒకేషనల్‌ విభాగంలో బాలురు 56 మంది పరీక్ష రాయగా 41 మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలికలు 152 మంది పరీక్ష రాయగా 143 మంది పాసై ఏకంగా 94.08 శాతం ఉత్తీర్ణత సాధించారు. జనరల్‌, ఒకేషనల్‌ విభాగంలో బాలికలే మొదటి స్థానంలో నిలిచారు.

ఇంటర్‌ సెకండియర్‌

ఫలితాల్లో జిల్లాస్థానం

గతేడాది ఫస్టియర్‌లో ఫస్ట్‌,

ఈఏడాది 13వ స్థానం

కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ

చిత్రామిశ్రాను సన్మానించిన మంత్రి సీతక్క

ములుగు: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఈ సారి 80.12 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలిచింది. గతేడాది మొదటి సంవత్సరంలో ఇదే బ్యాచ్‌ వందశాతం ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఇంటర్మీడియట్‌ ఫలితాలపై మంత్రి సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారి వివరాలను సేకరించి జిల్లా యంత్రాంగం తరఫున వారిని సన్మానించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒకేషనల్‌ విభాగంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పెండ్యాల ప్రవళిక 984/1000 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే టి.నందిని బైపీసీ సెకండియర్‌లో 935మార్కులు సాధించగా ఎంపీసీ సెకండియర్‌లో నితీష 953మార్కులు సాధించింది. మాధవరావుపల్లిలోని కస్తూర్బాలో ఎంపీహెచ్‌డబ్ల్యూ మొదటి సంవత్సరంలో జాడి రష్మిత 468మార్కులు సాధించింది.

మొదటి సంవత్సరం ఫలితాల్లో

13వ స్థానం

ఇంటర్మీమీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో 877 మంది బాలురు పరీక్ష రాయగా 734 మంది పాస్‌ కాగా శాతం ఉత్తీ ర్ణత సాధించారు. బాలికల విభాగంలో 832 మంది పరీక్ష రాయగా 625 మంది పాసై 75.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ విభాగంలో 71 మంది బాలురు పరీక్ష రాయగా 45 మంది పాసై 63.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 170 మంది బాలికలు పరీక్ష రాయగా 151 మంది పాసై 88.82 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తానికి రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ సంవత్స రం ఫలితాల్లో జిల్లా 13 స్థానంలో నిలిచింది.

అభినందించిన మంత్రి సీతక్క

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణతలో ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి సీతక్క జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన కలెక్టర్‌ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాను శాలువాలతో సన్మానించారు. అనంతరం విద్యాభివృద్ధికి సహకరించిన మంత్రి సీతక్కను సైతం అధికారులు సన్మానించారు.

ఐఏఎస్‌ కావడమే లక్ష్యం

వాజేడు: మండల కేంద్రానికి చెందిన డెక్క వెంకటస్వామి, మాలతీల కూతురు ధరణి ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో ఎంపీసీలో 983మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. తండ్రి టీవీ మెకానిక్‌ చేస్తుండగా తల్లి టైలరింగ్‌ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన ధరణి ఐఏఎస్‌ కావడమే తన లక్ష్యమని అన్నారు. ఎంతకష్టమైన పడి అనుకున్న లక్ష్యం చేసుకుంటానని చెబుతోంది.

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌1
1/4

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌2
2/4

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌3
3/4

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌4
4/4

రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement