
దేశవ్యాప్త సమ్మెను జయపద్రం చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే 20వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.