
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జిల్లాలో పలుచోట్ల ఆర్టీసీ బస్‌షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. బస్సులు వచ్చే వరకు రోడ్లపైనే నిలబడి ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నారు. పలుచోట్ల బస్‌షెల్టర్లు ఉన్నా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీటి వసతులు లేవు. మరికొన్ని చోట్ల దుకాణాలు, చెట్ల కింద బస్సులు వచ్చే వరకు ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. – ములుగు
ఏటూరునాగారం మండల పరిధిలోని షాపెల్లి, చిన్నబోయినపల్లి, శంకర్రాజుపల్లి, రొయ్యూరులో ఆర్టీసీ బస్టాండ్‌లు లేవు. రోజువారీగా ఉద్యోగ, వ్యాపారాల కోసం వరంగల్, ములుగు, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల నుంచి పలువురు వస్తుంటారు. వచ్చే వారంతా ఆకులవారి గణపురంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉన్న పాయింట్ వద్ద దిగి ఆయా ప్రాంతాలకు వెళ్తుంటారు. కన్నాయిగూడెం, మంగపేట మండలాలకు వెళ్లే వారంతా నిలబడడానికి సైతం ఆర్టీసీ బస్‌షెల్టర్ లేదు. దీంతో చెట్ల కింద, వ్యాపార దుకాణాల్లో కొద్ది పాటి నీడన నిలబడుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లే బస్సులు వచ్చేంత వరకు దుకాణాల్లో గిరాకీ చేయడమో.. తెలిసిన వారి వద్ద గంటల తరబడి నిలబడడమో పరిపాటిగా మారింది.
న్యూస్‌రీల్
చెట్టే బస్టాప్..