
ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చాలి
గోవిందరావుపేట: ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలో చేర్చాలని ముదిరాజ్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు సదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు చేపట్టిన ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర మూడోరోజు మండల కేంద్రానికి ఆదివారం చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ముదిరాజ్‌ల ఐక్యత కోసం పాదయాత్ర చేపట్టిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ముదిరాజ్‌లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే కార్పొరేషన్‌కు ప్రతిఏటా రూ.1000కోట్లు కేటాయించాలని, 75శాతం సబ్సిడీతో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 50ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందించాలన్నారు. 18ఏళ్లు నిండిన వారందరికీ సభ్యత్వం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, రవీందర్, వేణు, సురేష్, హరికుమార్, అనిల్, పెద్దన్న, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
సంఘం జిల్లా అధ్యక్షుడు సదయ్య