Vintalu Visheshalu
-
KK Garg: రిటైర్డ్ రైల్వే ఇంజనీర్ ఘనత ట్రాక్టర్ స్కూల్
భారతీయ రైల్వే (Indian Railways) ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పంజాబ్ అంతటా పర్యటించిన కెకె గార్గ్ (KK Garg) ఎన్నో ప్రాంతాలలో, చదువుకు దూరమైన ఎంతోమంది పిల్లలను చూశాడు. రైల్వే ట్రాక్‌ల పక్కన మురికి వాడల్లో వందలాదిమంది చిన్నారులు పేదరికంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రిటైర్మెంట్ తరువాత మొబైల్ పాఠశాలను ప్రారంభించాడు గార్గ్.పంజాబ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో ట్రాక్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. తన నైపుణ్యాలను ఉపయోగించి ఒక ట్రాక్టర్ ర్యాలీని మొబైల్ స్కూల్‌గా మార్చాడు గార్గ్. పైపింగ్‌తో వాటర్ ప్రూఫ్ ప్ల్యానల్స్ రూపొందించాడు. వేడిని బయటకు పంపడానికి అవసరమైన ఏర్పాటు చేశాడు.లైట్లు, ఫ్యాన్, బ్లాక్‌బోర్డ్ లాంటివి మొబైల్ స్కూల్లో ఉంటాయి.బఠిండాలోని ఎన్జీఒ ‘గుడ్‌విల్ సొసైటీ’ సహకారంతో ‘మొబైల్ స్కూల్’ పట్టాలకెక్కింది.స్కూల్ ట్రాలీలు బఠిండాలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తాయి.మురికివాడలు, బడులు అందుబాటులో లేని ప్రాంతాలు, స్కూల్ డ్రాపవుట్ రేటు ఎక్కువగా ఉన్నప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి మొబైల్ క్లాస్‌రూమ్‌లో ప్రాథమిక అభ్యాసన సామాగ్రి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.చదవండి: స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్క్లాసులో విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. స్టోరీ టెల్లింగ్, ఇంటరాక్టివ్ గేమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం వందలాది వలస కుటుంబాలు బఠిండాకు వచ్చి పోతుంటాయి. చాలామంది పిల్లలకు పాఠశాలల్లో చేరడానికి అవసరమైన డాక్యుమెంట్లు ఉండవు. మొబైల్ స్కూల్ ఈ సమస్యను పరిష్కరించింది. మొబైల్ స్కూల్స్ ద్వారా సుమారు వెయ్యిమంది పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఏడాది చదువు తరువాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంలో మొబైల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ‘పిల్లల తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది’ సంతోషంగా అంటున్నాడు గార్గ్.ఇదీ చదవండి: Pahalgam : ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్నిపిండేసే వీడియోలు -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్‌స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్‌లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం -
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్‌వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు. -
క్రేజీ.. కరెన్సీ నెంబర్లు : ఫ్యాన్సీ కరెన్సీ నంబర్ల గురించి తెలుసా?
చార్మినార్ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల మాదిరిగానే.. కరెన్సీ నోట్ల ఫ్యాన్సీ నెంబర్లకూ ప్రజల్లో క్రేజ్ ఉంది. కేవలం క్రేజ్ మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్సీ నెంబర్లకు గణనీయమైన ఆఫర్లు.. రేట్లు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో వీటికి ఖరీదు ఎక్కువ. పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూఘర్‌లో అంతర్జాతీయ పురాతన నాణేలు, కరెన్సీ ఎగ్జిబిషన్ సోమవారం ప్రారంభమైంది. పది లక్షల నోట్లలో ఒకటి, రెండు ఫ్యాన్సీ నోట్లు ఉంటాయని.. ఇవి అరుదుగా లభిస్తుండడంతో మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 000786, 786786 నెంబర్లతో పాటు 444444, 666666 నెంబర్లకు భారీ డిమాండ్ ఉందన్నారు. వీటి ఖరీదు వేలల్లో ఉందని, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 23 వరకూ కొనసాగనుందని తెలిపారు. తమ వద్ద పురాతన నాణేలు, కరెన్సీని ఎగ్జిబిషన్లో విక్రయించవచ్చని.. అదే విధంగా ఖరీదు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. నోరూరించే.. మ్యాడ్ ఓవర్ డోనట్స్ డోనట్స్ ప్రియులకు 24 రకాల ఎగ్‌లెస్ డోనట్స్ అందుబాటులోకి వచ్చాయి. సోమవారం కొత్తగూడలోని శరత్‌సిటీ క్యాపిటల్ మాల్లో మ్యాడ్ ఓవర్ డోనట్స్ స్టోర్‌ను ఆ సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, సీఈఓ తారక్ భట్టాచార్య ప్రారంభించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డోనట్లలో మ్యాడ్ ఓవర్ డోనట్స్ (ఎంఓడీ) ఒకటి. బబుల్టీ, బ్రైనీలు, బైట్స్‌తో పాటు చేతితో తయారు చేసిన 24 రకాల ఎగ్‌లెస్ డోనట్లను రుచి చూడవచ్చు. పుట్టిన రోజులు, ప్రమోషన్లు, స్నేహితుల కలయికకు ఎంఓడీ వేదిక కానుంది. సర్కిల్ ఆఫ్ హ్యాపీనెస్లో చేరడానికి ఆహ్వానిస్తున్నట్లు తారక్ భట్టాచార్య ప్రకటించారు. -
Mukesh Ambani Birthday ముఖేష్ అంబానీ బర్త్‌డే బాష్, ఇదే హైలైట్!
భారతీయ వ్యాపార దిగ్గజం అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు రిలయన్స్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani. రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industties) చైర్మన్‌గా, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరుగా ఎదిగారు. ఏప్రిల్ 19న 68వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కోసం నీతా అంబానీ (Nita Ambani) గ్రాండ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడిగా మారింది.ముఖేష్ అంబానీ బర్త్‌డే (Ambani birthday) వేడుకలను అంబానీ కుటుంబం అత్యంత ఘనంగా నిర్వహించింది. అంబానీ అప్డేట్ అనే అభిమానుల పేజీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో రంగోలి రంగులు ,పువ్వులతో తీర్చిదిద్దిన అంబానీ జంట ఫోటోల ప్రత్యేకమైన రంగోలి హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీ నారింజ రంగు చీరలో అందంగా కనిపించారు. వేడుకల్లో భాగంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda) ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్దా ఇన్‌స్టాగ్రామ్‌లో రిలయన్స్ బాస్‌కి చక్కటి పుట్టినరోజు సందేశాన్ని పంచుకున్నారు. ఆసియాలో అత్యంత ధనవంతుడైనప్పటికీ, అంబానీ ఎంత "ది డౌన్ టు ఎర్త్" ఉంటారంటూ ప్రశంసించింది. కొన్ని దశాబ్దాలుగా అంబానీ కుటుంబ వేడుకల్లో వీణా మెహిందీ ఉండాల్సిందే. 0 సంవత్సరాల క్రితం జరిగిన తన వివాహంలో ముఖేష్ అంబానీ సోదరి దీప్తి సల్గావ్కర్ మొదలు 2024లో, అనంత్-రాధికల గ్రాండ్ వెడ్డింగ్ వేడుకదాకా అందర్నీ మెహందీడిజైన్స్‌తో అలంకరించింది. కాగా ముఖేష్ అంబానీ దివంగత ధీరూభాయ్ అంబానీ ,కోకిలాబెన్ అంబానీ దంపతుల పెద్ద కుమారుడు. 1957, ఏప్రిల్ 19, యెమెన్‌లో జన్మించారు. 2002లో ధీరూభాయ్ అంబానీ మరణించిన తర్వాత, సోదరులు ముఖేష్,అనిల్ అంబానీ మధ్య వైరం కారణంగా కుటుంబ సామ్రాజ్యం చీలిపోయింది. తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ముఖేష్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా వివిధ రంగాలకు విస్తరించారు. ఆయిల్ నుంచి జియో ద్వారా టెలికాం సేవలు, రిలయన్స్ రిటైల్ రంగ సేవలతో విప్లవాత్మక మార్పులతో ఆసియా బిలియనీర్‌గా ఎదిగారు. ముఖేష్ సంతానం ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ కూడా కుటుంబ వ్యాపారంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2025 ఏప్రిల్ నాటికి ముఖేష్ అంబానీ ఆస్తి విలువ. దాదాపు రూ. 7.1 లక్షల కోట్లు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 15 ధనవంతుల్లో ఒకరుగా అంబానీ ఉన్నారు. -
మా కల ఇన్నాళ్లకు తీరింది : అమెరికా దంపతులపై నెటిజన్ల ప్రశంసలు
ఆడపిల్లలంటే మన సమాజంలో చిన్నచూపు. ఇక అరుదైన వైకల్యంతో పుట్టిన చిన్నారి పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలివేశారు. కానీ భారతదేశంలో నివసిస్తున్న అమెరికాకు చెందిన దంపతులు పెద్ద మనసు చేసుకున్నారు. రెండేళ్లుగా అనాథాశ్రమంలో ఉంటున్న చిన్నారి నిషాని ఇంటికి తెచ్చుకున్నారు. ఎంతో ప్రేమగా ఒక బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక అందమైన పోస్ట్‌ద్వారా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకు న్నారు. ప్రస్తుతం ఈ కథ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) భారతదేశంలో నివసిస్తున్న ఒక అమెరికన్ జంట క్రిస్టెన్, టిమ్ ఫిషర్ శ్రీమతి ఫిషెర్. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలున్నారు. నాలుగో కుమార్తెగా రెండేళ్ల నిషాను దత్తత తీసుకున్నారు. నిషాను పరిచయం చేస్తూ ఒక వీడియోలో ఆనందకరమైన క్షణాన్ని పంచుకున్నారు. 2023 అక్టోబర్‌లో దత్తత ప్రక్రియను ప్రారంభించి, 2024 సెప్టెంబర్‌లో నిషా తమకు నచ్చిందని, 2025 ఏప్రిల్ నాటికి దత్తతను పూర్తి చేశామంటూ ఈ వీడియోలో వివరించారు. ఇది నిజంగా బిగ్ న్యూస్.. ఇన్నాళ్లూ ఈ రహస్యాన్ని దాచిపెట్టాం. ఈ రోజుకోసం ఎంతగానో కలలు కన్నాం. మజీవితంలో ఈ ప్రత్యేకమైన అమ్మాయి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లకు మా కల ఫలించిందంటూ ఫిషర్ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) అనేక కారణాల వల్ల స్పెషల్ నీడ్స్ బేబీని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. ప్రధానంగా బేలేట్రల్ లోయర్ లింబ్ వైకల్యం (bilateral lower limb deformities) బిడ్డకు కొత్త జీవితాన్ని ఇవ్వాలను కున్నాము. పాపాయి చిరునవ్వు, ఆనందం, సంతోషంతో ఎంతో అందంగా ఉంటుంది. ఇంత కాలం ఆమె నిర్లక్ష్యానికి గురైనా, ఆమె ఈ ప్రపంచానికి చాలా అవసరం అంటూ రాశారు. ఫిషర్స్ దత్తత ప్రకటన చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది. ప్రత్యేక అవసరాలున్న ఆడబిడ్డ నిషాను దత్తత తీసుకోవడానికి ఈ జంట తీసుకున్న నిస్వార్థ నిర్ణయాన్ని చాలా మంది ప్రశంసించారు. "మాటల్లో వర్ణించలేం. ఆమెకు శాశ్వత ఇల్లు ఇచ్చినందుకు మీ కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు! నిజంగా మీరు చాలా అభినందనీయులు!" అన్నారొకరు. ‘‘అద్భుతం , మీమాది అపారమైన గౌరవం ఏర్పింది అభినందనలు!" అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. కాగా 2021లో భారతదేశానికి మకాం మార్చారు క్రిస్టెన్, ఫిషెర్ దంపతులు. వారి అనుభవాలను పంచు కోవడం ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఇపుడు ముగ్గురు అమ్మాయిలున్న ఈ దంపతులు భారతీయ అమ్మాయిని అదీ స్పెషల్లీ నీడ్ బేబీని దత్తత తీసుకోవడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
Bella J Dark వావ్.. ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!
ఐదేళ్ల వయసుండే పిల్లలు ఆటపాటల్లో గడుపుతారు. స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. కానీ బెల్లా మాత్రం అవేవీ చేయలేదు. పుస్తకం రాసి ప్రచురించింది. ఇప్పుడు దానికి కొనసాగింపు గా మరో పుస్తకం రాయబోతోంది. అందరూ తన ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు. బెల్లా.జె.డార్క్ అనే పాప యూకేలోని వేమౌత్ ప్రాంతంలో పుట్టింది. చిన్ననాటి నుంచే అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగింది. చిన్నారుల కోసం ప్రచురించే పుస్తకాలు చదివి, వాటి మీద ఆసక్తి పెంచుకున్న తను సొంతంగా కథలు రాయాలని ఐదేళ్ల వయసులో నిశ్చయించుకుంది. కానీ ఏ అంశం మీద రాయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ సమయం లో తను గీసిన ఓ పిల్లి బొమ్మను చూసి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అక్షరరూపంలో పెట్టేసింది. ఆ కథే The Last Cat (ది లాస్ట్ క్యాట్).ఐదు రోజులపాటు ఆ కథ రాసిన బెల్లా దానికి తనే సొంతంగా బొమ్మలు కూడా వేసింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి ఎలాంటి ఇబ్బందులు పడింది, తిరిగి ఎలా తన ఇంటికి చేరిందనేది ఇందులోని కథ. ఈ కథే ఎందుకు రాశావని బెల్లాని అడిగితే, ‘పిల్లలు అలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అస్సలే వెళ్లకూడదు. ఆ విషయం అందరికీ చె΄్పాలనే ఈ కథ రాశాను’ అంటోంది. 2022 జనవరి 31న ఈ కథ పుస్తకంగా ప్రచురితమయ్యేనాటికి బెల్లాకు ఐదేళ్ల 211 రోజులు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ ప్రతినిధులు ‘అతి చిన్న వయసు రచయిత్రి’ అంటూ రికార్డు అందజేశారు. ‘ది లాస్ట్ క్యాట్’ పుస్తకం ఇప్పటికి వేల కాపీలు అమ్ముడు΄ోయింది. ఈ పుస్తకం చదివి అనేకమంది బెల్లాకు మెయిల్స్ చేస్తున్నారు. తను రాసిన కథను మెచ్చుకుంటున్నారు. ఆ సంతోషంతో ఆ కథకు కొనసాగింపుగా మరో కథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం తనకు ఇష్టమని అంటోంది బెల్లా.ఉల్ఫ్ కింగ్ సూపర్ యానిమేటెడ్ సిరీస్ హాయ్ కిడ్స్... ఈ హాలిడేస్‌లో మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా... అయితే ఎప్పుడూ మూవీసేనా ఒక్కోసారి సిరీస్‌లు కూడా చూడాలి. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఓ సూపర్ యానిమేటెడ్ సిరీస్ మీ ముందుకు తీసుకువచ్చాం. దాని పేరే ‘ఉల్ఫ్ కింగ్’. ఇదో సూపర్ యాక్షన్ స్టోరీ. డ్రూ ఫెర్రాన్ అనే కుర్రాడి కథ. ఉల్ఫ్ జాతికి చెందిన డ్రూ ఫెర్రాన్ ఆ ఫ్యామిలీలో ఆఖరివాడు. అతనికి ఉల్ఫ్ నుండి వచ్చే సూపర్ ఫాంటసీ పవర్స్ ఉంటాయి. కాని ఈ విషయం తనకు తెలియదు. డ్రూ ఫెర్రాన్ రాజ్యాన్ని సింహరాజులు అటాక్ చేసినపుడు, వాళ్ళతో ఫైట్ చేసేటపుడు తనలోని ఉల్ఫ్ పవర్ తెలుస్తుంది. ఆ పవర్స్‌తో డ్రూ ఫెర్రాన్ ఎలా ఫైట్ చేసి తన రాజ్యాన్ని తిరిగి సం΄ాదించుకున్నాడనేది మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ అయిన ఉల్ఫ్ కింగ్ చూసేయండి. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ సూపర్బ్‌గా ఉంటుంది. అంతేకాదు ఓ రాజ్యంలో రాజులకు సంబంధించిన సీక్రెట్స్, ఫైట్స్ అలాగే ఛేజింగ్స్‌తో ఈ సిరీస్ మొత్తం ఓ అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్. ఇంకెందుకాలస్యం... గ్రాబ్ ది రిమోట్ టు క్రూస్ ఫర్ ది అడ్వెంచరస్ జర్నీ ఆఫ్ ఉల్ఫ్ కింగ్. – హరికృష్ణ ఇంటూరు -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అబ్రకదబ్ర.. అంటే ఏంటో తెలుసా?
పిల్లలూ! మీరేదైనా మ్యాజిక్ షోకి వెళ్లినప్పుడు స్టేజీ మీద ఉన్న మెజీషియన్ తప్పకుండా ‘అబ్రకదబ్ర’ అనే మాట వాడటం వినే ఉంటారు. చాలాసార్లు మ్యాజిక్ షోలలో ఈ పదం వాడుతుంటారు. దీనికి అర్థమేమిటో, ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా? ఈ పదం ఎప్పుడు, ఎవరు, ఎలా పుట్టించారో కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ రెండో శతాబ్దానికి చెందిన రోమన్ వైద్యుడు సెరెన్ సమ్మోనికస్ రాసిన గ్రంథాల్లో ఈ మాట ఉంది. కాబట్టి ఇది చాలా పురాతనమైన మాట అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. జ్వరం తగ్గిపోవడానికి చిట్కాగా ఆయన తన గ్రంథంలో ‘అబ్రకదబ్ర’ అనే పదాన్ని వాడారు. ఈ పదానికి హిబ్రూ భాషలో ‘నేను చెప్పినట్లే సృష్టిస్తాను’, అరేబిక్ భాషలో ‘నా మాట ప్రకారం సృష్టి జరుగుతుంది’ అనే అర్థాలున్నాయంటారు. హిబ్రూ భాషలోని ‘హ బ్రఖా దబరా’ (ఆశ్వీరాదం పొందినవారు) అనే వాక్యం నుంచి ఈ పదం వచ్చి ఉంటుందని డాన్ స్కీమర్ అనే చరిత్రకారుడు అంచనా వేశారు. ఇవన్నీ అంచనాలే తప్ప ‘అబ్రకదబ్ర’ అనే పదానికి స్పష్టమైన అర్థాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఈ పదానికి చాలా శక్తి ఉందని, ఇది పఠిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని రకరకాలుగా ప్రచారం చేశారు. అనంతరం 1800 నుంచి మెజీషియన్లు దీన్ని తమ షోల్లో వాడటం మొదలుపెట్టారు. ఏదైనా ఒక మ్యాజిక్ ట్రిక్ చేసే ముందు ఈ పదాన్ని వాడి, ఆ ట్రిక్ చేయడం ద్వారా ఈ పదానికి మహత్వం ఉందని అందరూ అనుకునేవారు. నేటికీ అది కొనసాగుతోంది. తెలుగువారి కీర్తిపతాకం.. భోగరాజు పట్టాభి సీతారామయ్య పిల్లలూ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఎందరో మహనీయులు పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పుట్టిన ఓ మహనీయుడి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయనే భోగరాజు పట్టాభి సీతారామయ్య. సీతారామయ్య 1880 నవంబర్ 24 న కృష్ణా జిల్లా గుండుగొలను అనే ఊరిలో జన్మించారు. చిన్ననాటి నుంచి వైద్యుడిగా మారాలన్న ఆలోచనతో మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చేరి ఎంబీసీఎం డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం మచిలీపట్నంలో వైద్యుడిగా సేవలందించడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తన పని వదిలేసి స్వాతంత్రో ద్యమంలో చేరారు. 1923లో ఆంధ్రాబ్యాంకు స్థాపించారు. అందుకే ఆంధ్రాబ్యాంకు ప్రధాన భవనానికి ‘పట్టాభి భవన్’ అని పేరు పెట్టారు. దీంతోపాటు ఆయన ఆంధ్రా ఇన్సూరెన్స్సంస్థను కూడా స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగిన సీతారామయ్య మహాత్మాగాంధీకి సన్నిహితుడిగా మారారు. 1935లో ‘ది హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్’ పుస్తకం రాశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన్ని మూడేళ్లపాటు అహ్మద్ నగర్ జైల్లో ఉంచారు. అక్కడున్నరోజుల్లో ‘ఫెదర్స్ అండ్ స్టోన్స్’ పేరుతో తన జైలు అనుభవాలు రాశారు. ఆపై ‘గాంధీ అండ్ గాంధీయిజం’ పుస్తకాన్ని రాశారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం తొలి గవర్నర్‌గా వ్యవహరించారు. తెలుగువారి కీర్తిపతాకంగా నిలిచారు. దేశానికి నలేని సేవలందించిన ఆయన 1959 డిసెంబర్ 17న మరణించారు. -
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్‌లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్‌లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్‌ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్‌డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్‌యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు) -
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
సనత్‌నగర్: నగరంలో రోజురోజుకు కాలుష్య ప్రమాణాలు పెరుగుతున్న దృష్ట్యా పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండగా ఆ కాలనీవాసులు మాత్రం కాలుష్యానికి దూరంగా ఉండేలా ఏడు దశాబ్దాల క్రితమే పచ్చదనానికి పచ్చజెండా ఊపారు. ఒకటి కాదు...రెండు కాదు...ఏకంగా 56 ఉద్యానవనాలు ఆ కాలనీ సొంతం. ఏ రోడ్డు కెళ్ళినా పార్కులు దర్శనమిస్తాయి. గజం జాగ కనిపిస్తే కాంక్రీట్‌మయంగా మార్చే ప్రస్తుత తరుణంలో 56 పార్కు స్థలాలను కేటాయించడం ఒక వంతైతే...వాటిని కబ్జా కాకుండా కాలనీవాసులంతా సమష్టిగా కాపాడుకోవడం మరో వంతు. కార్మికగడ్డగా పేరొందిన సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీకి వెళితే ఆయా పార్కుల అందాలను ఆస్వాదించవచ్చు. ఎస్ఆర్టీ కాలనీవాసులే కాకుండా పక్క కాలనీలైనా జెక్కాలనీ, రాజరాజేశ్వరీనగర్, తులసీనగర్, సౌభాగ్యనగర్, నాగరాజేశ్వరీనగర్, అల్లావుద్దీన్కోఠి, సుభాష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఆయా పార్కులకు వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఆరోగ్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోన్న ఇక్కడి పార్కుల అభివృద్ధి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. సగం వరకు ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రాగా...మరికొన్ని క్రీడామైదానాలుగా వినియోగిస్తున్నారు. వాటికి నలువైపులా సైతం పచ్చదనాన్ని పెంపొందింపజేస్తున్నారు. ఇంకొన్ని అభివద్ధి దశలో ఉన్నాయి. సనత్‌నగర్ పారిశ్రామికవాడ సాక్షిగా... స్వాతంత్ర్యానంతరం తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి నిజామ్ పరిపాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని 1948లో విలీనం చేసిన విషయం తెలిసిందే. విలీనం అనంతరం సనత్‌నగర్ ప్రాంతంలో అల్లావుద్దీన్ కేంద్ర ప్రభుత్వం నుంచి 408 ఎకరాల భూమిని అప్పటి ప్రప్రథమ రాష్ట్రపతి ద్వారా తన పేరిట రిజి్రస్టేషన్ చేయించుకున్నారు. తదనంతరం కేంద్ర కార్మిక సంస్థ ఇక్కడి దాదాపు 150 ఎకరాల్లో చిన్నతరహా పరిశ్రమలు నిరి్మంచుకోవడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అల్లావుద్దీన్న్ నుంచి భూమిని సేకరించింది. అలా సేకరించినదే సనత్‌నగర్ పారిశ్రామికవాడగా నామకరణం జరిగింది. ‘సనత్’ అంటే పరిశ్రమగా పేర్కొంటారు. అందుకే మొట్టమొదటి పారిశ్రామికవాడ కావడంతో సనత్‌నగర్‌గా ఈ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి చేతుల మీదుగా సనత్‌నగర్ పారిశ్రామికవాడ ప్రారంభమైంది. అదే పారిశ్రామికవాడ ఎదురుగా దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆనాటి కార్మికుల ఆవాసం కోసం ఏర్పాటు చేసినదే నేటి సనత్‌నగర్ ఎస్ఆర్టీ కాలనీ. ఎస్ఆర్టీ (సింగిల్ రూమ్ టెనెంట్స్) పేరిట 1500 క్వార్టర్స్ ఇళ్ళ నిర్మాణం జరిపారు. ఆరు వేల జనాభా ఉన్న ఆ కాలనీలో పార్కుల కోసం 56 ఖాళీ ప్రదేశాలను విడిచిపెట్టారు. కాలక్రమంలో వాటిని కాపాడుకుంటూ అభివద్ధిపరుచుకుంటూ వస్తున్నారు. ఒక్కో పార్కు 1500 గజాల నుంచి మొదలుకొని ఎకరాల వరకు విస్తరించి ఉన్నాయి. చెట్లు,పూలమొక్కలతో ఆహ్లాదంగా... ఆయా పార్కుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో చెట్లు, పూలమొక్కలతో కాలనీవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరితవనం పార్కు, మార్కెట్ ఉద్యానవనం, భగత్‌సింగ్ గ్రౌండ్, వినాయక గ్రౌండ్, బాస్కెట్‌బాల్ మైదానం, నవ వనాల పార్కు, ఇండస్ట్రీయల్ పార్కు, నెహ్రు పార్కు, ఎస్ఆర్టీ–80, ఎస్ఆర్టీ–87, ఎస్ఆర్టీ–495 తదితర పార్కులు ప్రధానమైనవిగా నిలుస్తున్నాయి. క్రీడా స్థలాలను మినహాయిస్తే సుమారు 30 వరకు ఉద్యానవనాలు చెట్లు, పూల మొఇక్కలు, పచ్చికతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యానవనంలో 300 పైచిలుకు వృక్షాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కమిటీలను ఏర్పాటుచేసి వాటి పరిరక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యానవన సంక్షేమ సంఘం, వినాయక సంక్షేమ సంఘం, భగత్‌సింగ్ ఉత్సవ కమిటీ, సనత్నగర్యువజన సంక్షేమ సంఘం వంటి వాటిని ఏర్పాటుచేసుకున్న కాలనీవాసులు ఈ ఉద్యానవనాలను ఆక్రమణదారుల పాలుకాకుండా కాపాడుకుంటున్నారు. -
స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్
అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు భోజనం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనే కుతుహలం అందరికి ఉంటుంది. అయితే ఇటీవల సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల పుణ్యమా అని అంతరిక్షంలో వ్యోమగాముల కష్టాలు, భోజనం ఎలా ఉంటుదనేది తెలిసింది. ఎందుకంటే ఎనిమిది రోజుల యాత్రకని బయలుదేరి ఏకంగా తొమ్మిదినెలలు అంతరిక్షంలోనే చిక్కుకుపోవడంతో వాళ్ల ఆర్యోగపరిస్థితి..వాళ్ల భోజనం ఎలా.. అనే వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటించడంతో ప్రజలకు తెలిసింది. అదీగాక భారరహిత స్థితిలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫుడ్ బెటర్ అనేది ప్రముఖ నిపుణులు పలు దఫాలుగా కేర్ తీసుకుని మరీ ప్యాక్ చేస్తారని విన్నాం. మరీ వాటి టేస్ట్ ఎలా ఉంటయనేది మనం వినలేదు కదా..అదెలా ఉంటుంది, ఎవరు దాన్ని పరీక్ష ఇస్తారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.వ్యోమగాములకు అందించే భోజనాలను ఎలా టెస్ట్ చేస్తారో Axiom స్పేస్ షేర్ చేసింది. వచ్చే నెల మేలో ప్రారంభం కానున్న ఆక్సియం మిషన్ 4 (Ax-4) కోసం సన్నాహాలు వేగవంతం కావడంతో వ్యోమగాములకు అందించే ఆహారం టేస్ట్ సెషన్ ఎలా ఉంటుందో వివరించింది. ఈ రుచి సెషన్ ట్రయల్‌లో భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. ఈ ఏడాది మేలో ఈ ఆక్సియం మిషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఆక్స్-4 సిబ్బందికి ఇచ్చే స్పేస్ ఫుడ్ టెస్ట టెస్ట్ ఎలా ఉంటుందో కళ్లకటినట్లుగా చూపించింది Axiom స్పేస్. ఈ ట్రయల్ సెషన్ మైసూరులో డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL)లో నిర్వహించారు. ముందుగా వ్యోమగాములకు అందించే ఫుడ్ నమునాలను ఆ సెషన్లో పాల్గొన్న వాళ్లు రుచి చూసి రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఫుడ్‌ని వ్యోమగాములు 14 రోజుల మిషన్ సమయంలో తినేందుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ తాము టేస్ట్ చేసి..నచ్చినా నచ్చకపోయినా వాటికి స్కోర్లు ఇవ్వక తప్పదని అన్నారు శుక్లా. ఆ తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని ఐఎస్ఎస్కి పంపుతారని అన్నారు.ట్రయల్‌లో ఏం వంటకాలు ఉంటాయంటే..ట్రయల్ సమయంలో వడ్డించే ఆహారంలో దాల్ చావల్, రాజ్మా, కిచ్డి మరియు వెజిటబుల్ బిర్యానీ వంటి ప్రసిద్ధ కంఫర్ట్ వంటకాలు సుమారు 50 ఉన్నాయి. శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తూనే భారతీయ వంటకాల ప్రామాణిక రుచిని పోకుండా కేర్ తీసుకుంటారట.ఇదిలా ఉండగా..ఈ మిషన్ కారణంగా శుభాన్షు శుక్లా ISSకి ప్రయాణించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏఎక్స్4 మిషన్‌లో పోలాండ్‌కు చెందిన సావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు తదితరులు ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సినా ఆ సమయంలో తమకు ఆహారం చాలా ముఖ్యమని, అది తమకు ఓదార్పునిస్తుందన్నారు శుక్లా.కాగా, భారత వైమానిక దళ పైలట్, గగన్‌యాన్ మిషన్‌కు వ్యోమగామి అయిన శుభాన్షు శుక్లా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో పైలట్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఈ మిషన్ ఆక్స్-4లో శాస్త్రీయ ప్రయోగాలు, ఔట్రీచ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయట. We're counting down to the #Ax4 crew launch, expected no earlier than May this year. In our new astronaut training video series, you'll learn what it takes to prepare for a mission, from the crew's arrival in Houston all the way to launch day.Ever wondered what it takes to… pic.twitter.com/wqzcspiMuV— Axiom Space (@Axiom_Space) April 15, 2025 (చదవండి: ఆవేశం అదే క్షణం.. ఆవేదన జీవితాంతం..) -
బట్టల మిషనా? బంగాళదుంపల మిషనా? వైరల్ వీడియో
వంట చేయడం కంటే.. ప్రిపరేషన్‌కే ఎక్కువ టైం పడుతుంది. కూర వండాలంటే..చిక్కుడు కాయలు, బీన్స్ గిల్లడం, దొండకాయలు, బెండకాయలు కట్ చేయడం అబ్బో పెద్దపనే కదా. అలాగే బంగాళాదుంపలను తొక్క తీసి శుభ్రం చేయడం అంటే అదో పెద్ద పని. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన మహిళ కేవలం రెండు నిమిషాల్లో వాషింగ్ మెషిన్ సహాయంతో బంగాళాదుంపలు తోలు తీయడం అందర్నీ ఆకర్షించింది.‘ఆమె వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లింది. ఆ తరువాత ఏం చేస్తుంది?’ అనే ప్రశ్నకు ఎవరైనా ఇచ్చే జవాబు....‘బట్టలను వాషింగ్ మెషిన్లో వేస్తుంది’ అయితే సదరు మహిళ మాత్రం బట్టలను కాదు బంగాళదుంపలను వేసింది. మన ఆశ్చర్యాన్ని మరింత పెంచేలా మెషిన్ ఆన్ చేసింది. ఆ తరువాత ఏమిటి అనే విషయానికి వస్తే..... తొక్క రహిత బంగాళదుంపలు కనిపించాయి! వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘భేష్’ అని కొందరు కితాబు ఇవ్వగా చాలామంది మాత్రం ‘ఇది సరికాదు’ అని విమర్శించారు. మరికొందరు ‘ఇది ఫేక్ వీడియో’ అన్నారు. बढ़ती हुई तकनीक ने बहुत कामों को बहुत सरल बना दिया है।ये देखो आलू को छीलने वाली मशीन।एक मिनट में कितने सारे आलू छील दिए हैं। pic.twitter.com/gpwu6Y5KG0— kuldeep kumar (@kdgothwal1) April 6, 2025ఎండలను చల్లపుచ్చండి వేసవిలో ఎదురయ్యే సమస్యలలో డీ హైడ్రేషన్ ఒకటి. డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా పుచ్చకాయ తింటే మంచిది. పుచ్చకాయతో లాభాలునీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ ఒంట్లోని టాక్సిన్స్‌ను తొలగిస్తుందినీరసం, నిస్సత్తువ లేకుండా చేస్తుంది. చెమట రూపంలో కోల్పోయిన నీరు భర్తీ అవుతుంది. పుచ్చలో అమైనో ఆమ్లం ‘సిట్రులిన్’ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.ఎండలో కమిలిన చర్మానికి పుచ్చపండు గుజ్జు రాస్తే మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం లేకుండా చేస్తుంది.కండరాల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.పుచ్చకాయలో ఎక్కువగా ఉండే ఎ విటమిన్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. -
Indian railways marks 172nd anniversary: భారతీయ రైల్వే @173
153లో ముంబై నుంచి తొలి రైలు పరుగులు..బుధవారంతో 172ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైల్వే విజయ వంతంగా 172 సంవత్సరాలు (Indian railways marks 172nd anniversary) పూర్తిచేసుకుని 173వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టరి్మనస్, థానేలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రయాణికుల అసోసియేషన్స్ సభ్యులు కేకులు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎంపీ నరేష్ మస్కే థానే స్టేషన్ మాస్టర్ కేశవ్తావడేతోపాటు రైల్వే అధికారులు, ప్రయాణికుల సంఘటన పదాధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఆలోచనతో... దేశ ఆరి్థక రాజధానిగా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగర అభివృద్ధికి అనేక కారణాలున్నప్పటికీ వాటిలో రైల్వేవ్యవస్థది ప్రధానపాత్ర. 1843లో మొదలై నేటి వరకూ రైల్వే దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మోనో, మెట్రో రైళ్ల ప్రవేశం రైల్వే విస్తరణలో కీలక ముందడుగు. వీటితో పాటు ఇటీవలే ప్రారంభించిన అత్యాధునిక వందేభారత్ రైలు, త్వరలో ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్రైలు రైల్వే కిరీటంలో కలికితురాళ్లు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన లోకల్ రైళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది 1843వ సంవత్సరం. ఏదో పని నిమిత్తం సైన్–భాండూప్ రోడ్డుపై వెళ్తున్న బ్రిటీష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్‌కు హఠాత్తుగా ముంబైలోని ద్వీపాలన్నింటిని కలుపుతూ ఒక రైల్వే లైన్‌ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభించారు. కేవలం పదేళ్లలో పనులు పూర్తిచేశారు. పట్టాలెక్కిన తొలి రైలు... 1853 ఏప్రిల్ 16వ తేదీ మొట్టమొదటి రైలు ముంబై నుంచి ఠాణేకి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవంతంగా బయలుదేరింది. అప్పటినుంచి రైల్వే ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబై రవాణాలో బెస్ట్ బస్సులతో పాటు సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇవి ‘ముంబై లైఫ్‌లైన్’లుగా పేరుపొందాయి. ఇక్కడ ప్రజలు నిరంతరం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటారు. వారి జీవన విధానానికి తగ్గట్లుగా లోకల్ రైళ్ల వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి అయిదు నిమిషాల తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి రోజు సుమారు 65 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నాలుగింటికి అదనంగా మరో 2 ట్రాక్‌లు.. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, ట్రాన్స్ హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్‌తోపాటు మోనో, మెట్రో రైల్వే మార్గాలలో రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇతర నగరాలలో మామూలుగా ఒకటి వెళ్లేందుకు, మరోటి వచ్చేందుకు ఇలా అప్, డౌన్ మార్గాలు (రైల్వేట్రాకులు) ఉంటాయి. కానీ లోకల్ రైలు సేవల కోసం మాత్రం ప్రత్యేకంగా నాలుగు ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో స్లో, ఫాస్ట్ ఇలా రెండు రకాల లోకల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు పెద్ద అంతరాయం లేకుండా పోయింది. అదే విధంగా లోకల్ రైళ్ల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అయిదు, ఆరో ట్రాక్‌లు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా లోకల్ రైళ్లన్నీ డైరెక్ట్ కరెంట్ (డిసి)పై నడుస్తాయి. తరువాతి కాలంలోనుంచి ఆల్టర్నేట్ కరెంట్ (ఎసి)కి మార్చారు. ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్చారిత్రక ఘట్టాలు... ప్రారంభంలో ముంబై ప్రజలు రైళ్లను ‘బకరా గాడీ’లని పిలిచేవారు. 1853లో మొదటి రైలు ప్రారంభం తర్వాత 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1886 నుంచి ఫ్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై–కళ్యాణ్ రెండు వైపుల రైల్వే సేవలను ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టరి్మనస్ ‘నేటి ఛత్రపతి శివాజీ టరి్మనస్)ను 1889లో, 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. సరీ్వసులను మరింత వేగవంతం చేసేందుకు 1929లో ముంబై–కళ్యాణ్‌ల మధ్య రైల్వేలైన్లను విద్యుదీకరించారు. చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన -
'దయ'కు అసలైన అర్థం..! హృదయాన్ని తాకే ఘటన..
అందరివి బిజీ లైఫ్‌లు అయిపోయాయి. ఈ హడావిడి జీవితంలో జాలి, దయ దాక్షిణ్యాలకు చోటే లేకుండాపోయింది. ఎవరి స్వార్థం వారిది. అలా లేకపోతే వెనుకబడిపోతాం అనే ఫీల్కి వచ్చేశారు జనాలంతా. మన పొరిగింటివాడితోనే నాలుగు మాటలు కదపని వాళ్లం. ఇక ఇలాంటి వాటి ప్రసక్తే ఏం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే..ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తించే జంతువులు కూడా విచక్షణ జ్ఞానంతో మసులుకుంటాయాని తెలుస్తోంది. అంతలా దాడి చేయాలనుకుని ఒక్క క్షణం సంయమనంతో వ్యవహరించిన తీరు చూస్తే..ఆహా అడవిలో పెరిగినా.. ప్రకృతి ధర్మానికి కట్టుబడ్డాయి కదూ అనిపిస్తుంది. ఏం జరిగిందంటే..ఒక పెద్ద ఏనుగు ఒక గడ్డి మైదానంలో పిల్లలతో సేద తీరి ఉన్న సింహాన్ని చూసి దాడి చేసేందుకు వస్తుంది. అది చూసి సింహం ఆశ్చర్యపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎందుకంటే దాని వద్ద ఉన్న చిన్న పిల్లలను వదిలి ఎలా వెళ్లాలో తెలియక ఒక్క నిమిషం అలా షాక్‌లో ఉండిపోతుంది. కొద్ది వ్యవధిలోనే తేరుకుని బాధతో ముగ్గురు పిల్లల్లో ఒక్క పిల్లనే నోట కరుచుకుని పారిపోతుంది. అయితే ఆ ఏనుగు కూడా అంత కోపంతో దాడి చేయడానికి వచ్చిందల్లా ఆ సింహం పిల్లలను చూసి కోపాన్ని తమాయించుకుని ఆగిపోయి వెనక్కి టర్న్ అవుతుంది. ముక్కుపచ్చలారని చిన్న పిల్లల జోలికి పోకూడదన్న ఆ ఏనుకు విచక్షణ తీరుకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. దయ అనే పదానికి ఇది కదా అసలైన అర్థం అనిపిస్తుంది. మనుషుల తప్ప పశుపక్షాదులు, జంతువులు వీటిని పాటిస్తాయని పలు ఉదంతాలు నిరూపించాయి కూడా. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి. Elephant attacks the lioness but spares cubs pic.twitter.com/0pU8uIi7BQ— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) April 6, 2025 (చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?) -
కావు కావు కాదు... హాయ్ హాయ్ : మాటలు నేర్చిన కాకి
సాధారణంగా చిలక పలుకులు అంటూ ఉంటాం కదా. రామచిలక మనిషి మాటలను అనుకరించడం మనకు తెలిసిందే. పెంపుడు పక్షి చిలుకు ముద్దార మాటలు నేర్పిస్తే చక్కగా పలుకుతుంది. తేనెలూరు ఆ మాటలు విని తెగ మురిసిపోతారు యజమానులు. ఇపుడు మాకేం తక్కువ అంటూ ఈ జాబితాలోకి వచ్చేసిందో కాకి. కాకి చేష్టలు, కారు కూతలు కావు... చక్కగా హాయ్.. హల్లో అంటూ పలకరిస్తూ.. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. సరైన శిక్షణ ఇస్తే.. ముద్దార నేర్పింపన్.. అన్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది. పదండి ఆ విశేషాలేంటో చూద్దాం.అద్భుతమైన సామర్థ్యంతో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోందీ కాకి. కుటుంబ సభ్యులను పేరు పెట్టి పిలుస్తుంది. మరాఠీలో మాట్లాడేస్తుంది. ఈ కాకి కావు కావు కాదు... హాయ్ హాయ్ అని అరుస్తుంది! అయితే మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఒక కాకి మనిషి మాటలను అనుకరిస్తూ అందరినీ బోలెడు ఆశ్చర్యపరుస్తోంది. వాడా తాలూకాలోని పాల్ఘర్కు చెందిన తనూజ ముక్నే అనే మహిళ తన తోటలో గాయపడిన కాకిని చూసి సపర్యలు చేసింది. కొన్ని రోజులు తరువాత కోలుకున్న కాకి తనూజ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. అంతేకాదు... మనుషులు మాట్లాడే మాటలను అనుకరించడం మొదలు పెట్టింది. ‘పపా’ ‘బాబా’ మమ్మీ’ అంటూ వరుసలు పెట్టి పిలవడం మొదలుపెట్టింది. దీంతో ఈ కాకి లోకల్ సెలబ్రిటీగా మారింది! View this post on Instagram A post shared by PUNE PULSE (@punepulse) -
జర్నీ చేస్తూ కూడా నగదు పొందొచ్చు..! ఎలాగంటే..
ప్రస్తుతం ప్రజలంతా నగదు రహిత లావాదేవీలే చేస్తున్నారు. డిటిటల్ పేమెంట్లకు అలవాటుపడ్డారు కూడా. ఇది వరకటిలా నగదు కోసం బ్యాంక్‌ల వద్ద బార్లు తీరాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే వీధికో ఏటీఏం ఉండటంతో క్షణాల్లో పనైపోతుంది. ఈ సదుపాయం బస్సు, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఉంది. కానీ జర్నీ చేస్తున్నప్పుడూ..ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే సమయంలో నగదు పొందాలంటే మాత్రం కష్టమే. ఆయా స్టేషన్లలో ఆగితేగానీ సాధ్యం కాదు. అయితే ఆ ఇబ్బంది కూడా లేకుండా జర్నీ టైంలో కూడా ఈజీగా డబ్బుని పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. ఆ సౌకర్యాన్ని అందిస్తోంది ఇండియన్ రైల్వే సంస్థ. ఏ రైలులో ప్రారంభించారంటే.. ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్-ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్ (INFRIS)లో భాగంగా ఈ సదుపాయన్ని అందిస్తోంది. రైలు కదులుతున్నప్పుడూ ప్రయాణికులు నగుదు పొందేలా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని పంచవటి ఎక్స్‌ప్రెస్ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇది భారతదేశంలోనే తొలి ఏటీఎం రైలుగా మారింది. అది ఎలా పనిచేస్తుందనే ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఈ ఏటీఎం నుంచి రైలు కదులుతున్నప్పుడూ నగదు పొందే వెసులుబాటు ఉంది. ఇదంతా ఇండియన్ రైల్వేస్ భూసావల్ డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో విజయవంతమైనట్లు రైల్వే అదికారుల తెలిపారు. ఈ సరికొత్త రైల్వే ఏటీఎం జర్నీ అంతటా సజావుగానే పనిచేస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఇగత్పురి, కసారా ప్రాంతాల మధ్య సొరంగాలు, తగిన నెట్వర్క్ అందుబాటులో ఉండదు కాబట్టి ఆప్రాంతాల్లో నగదు పొందడం కాస్త సమస్యాత్మకంగా ఉండొచ్చని అన్నారు. అలాగే యంత్రం పనితీరును పర్యవేక్షిస్తూనే ఉంటామని అన్నారు భుసావల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పాండే. తాము ఈ ఆలోచనను INFRIS సమావేశంలో ప్రతిపాదించామని అన్నారు. ఆ తర్వాత అదెలా కార్యరూపంలోకి తీసుకురావాలనే దానిపై తమ బృందం పనిచేయడం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏటీఎం పంచవటి ఎక్స్‌ప్రెస్‌లోని 22 కోచ్‌ల ప్రయాణికులకు మాత్రమే కాదు ముంబై-హింగోలి జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులకు కూడా అందుబాటులో ఉంటుందట. ఎందుకంటే ఈ రైలు ఒక బోగిని పంచవటి ఎక్సప్రెస్ పంచుకుంటుందట. అలాగే ఈ ఏటీఎం భద్రతను నిర్థారించేలా ప్రత్యేక షట్టర్ సిస్టమ్ తోపాటు 24 గంటలు సీసీటీవీ పర్యవేక్షణ తదితరాలు ఉంటాయన్నారు. అయితే ప్రయాణికులు ఈ సేవను ఆదరిస్తే గనుక త్వరలో మరిన్ని రైళ్లకు దీన్ని విస్తరించే అవకాశం ఉంటుందని రైల్వే అదికారులు వెల్లడించారు. (చదవండి: టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్‌గా పైలట్ అనౌన్స్మెంట్) -
మొబైల్ పోయిందా డోంట్ వర్రీ! కొత్త టెక్నాలజీతో ఇట్టే ..!
వికారాబాద్: మనిషి జీవితంలో సెల్‌ఫోన్ భాగమైపోయింది. నేడు మొబైల్ ఫోన్ లేని ఇళ్లంటూ లేదు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణాల వరకు వీటి వాడకం భారీగా పెరిగిపోయింది. 90 శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ఒక్కో మొబైల్ కోసం రూ.10 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ల దొంగతనాలు కూడా ఎక్కువైపోయాయి. ఐదేళ్లుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించిన కేంద్ర టెలీకామ్ మంత్రిత్వ శాఖ నూతన టెక్నాలజీ (సీఈఐఆర్ పోర్టల్)ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా జిల్లా పోలీసు విభాగం మంచి పురోగతి సాధించింది. భారీగా రికవరీ గత ఏడాది జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధి లో 3,647 ఫోన్లు చోరీకి గురయ్యాయి. కొన్ని చోట్ల బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా.. మరికొన్ని చోట్ల సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మోమిన్‌పేట్, కుల్కచర్ల, తుంకిమెట్ల, మర్పల్లి ప్రాంతాల్లో సంతలు నిర్వహించే సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. దీంతో పోలీసులు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా ప్రకటించారు. జిల్లాలో చోరీకి గురైన ఫోన్ల రికవరీ బాధ్యతను ఎస్పీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సీఈఐఆర్ టెక్నాలజీని వినియోగించి దాదా పు రూ.2 కోట్ల విలువ చేసే 1,250 సెల్ ఫోన్లను రికవ రీ చేశారు.తెలంగాణ జిల్లాలతోపాటు పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి వీటిని స్వాదీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన కొందరు జిల్లాలో సెల్ ఫోన్లను చోరీ చేస్తు న్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం మైనర్లేనని పోలీసులు గుర్తించారు. ఫోన్ పోతే ఏం చేయాలి? సెల్‌ఫోన్ పోయినా.. చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మూడు పద్ధతులు ఉంటాయి. బాధితులు తమ ఫోన్ ద్వారా www.ceir.gov.in వెబ్ సైట్లో నేరుగా నమోదు చేసుకోవచ్చు. లేదా మీసేవా కేంద్రంలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రెండూ కాకుండా ఫోన్ ఎక్కడ పోయిందో అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఐఎంఈ నంబర్, ఫోన్ నంబర్, మొబైల్ కొన్న సమయంలో పొందిన బిల్, అడ్రస్ తదితర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. మనం ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే చోరీకి గురైన ఫోన్ స్టేటస్ చూసుకోవటానికి వీలుంటుంది. దాన్ని ఎవరు.. ఎక్కడ వాడుతున్నారు. అసలు వాడుతున్నారా..? లేదా..? అదే నంబర్‌ను వినియోగిస్తున్నారా..? వేరే నంబర్ వాడుతున్నారా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలుపడుతుంది. పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. ఏడాది క్రితం వరకు చోరీకి గురైన ఫోన్ల రికవరీ పోలీసులకు పెద్ద సవాల్‌గా ఉండేది.. దొంగ దొరికితే తప్ప కేసులు కొలిక్కి వచ్చేవి కాదు.. కానీ ఇప్పుడాపరిస్థితి లేదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కేసుల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.. నేరం చేసిన వారితోపాటు.. చోరీకి గురైన కోట్ల రూపాయల విలువ చేసే సెల్ఫోన్లను సైతం స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కడున్నా దొరికిపోతాయిసీఈఐఆర్ టెక్నాలజీతో దొంగిలించన ఫోన్లు ఎక్కడున్నా కనిపెట్టవచ్చు. కొందరు చోరీ చేసిన మొబైల్స్‌ను గుర్తించకుండా స్పేర్ పార్ట్స్‌గా మార్చి విక్రయిస్తున్నారు. అయినా దొరికిపోతారు. ఫోన్ ఏ రూపంలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా గుర్తించడాని సీఈఐఆర్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంత ఆలస్యం కావచ్చు అంతే.. – నారాయణరెడ్డి, ఎస్పీ -
టైంకి ఇంటికి చేరుకోకపోతే ఆమె నన్ను..! వైరల్‌గా పైలట్ అనౌన్స్మెంట్
విమానంలో వెళ్లేటప్పుడూ..ప్రయాణికులు సేఫ్టీ కోసం పైలట్లు, అక్కడ సిబ్బంది మనకు కొన్ని సూచనలిస్తుంటారు. అలాగే జర్నీ పూర్తి అవుతుందనగా.. సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రకటనలు చేస్తుంటారు. అయితే అలానే ఇక్కడొక పైలట్ కూడా ఒక ప్రకటన వెల్లడించాడు. అయితే అది ఎంత ఫన్నీగా ఉందంటే..జర్నీ బడలిక అంత ఉఫ్‌మని ఎగిరిపోయినంత ఆహ్లాదంగా ఉంది. ఇంతకీ అతడేం అనౌన్స్మెంట్ ఇచ్చాడంటే..ఇదంతా డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. సురక్షితమైన ల్యాండింగ్ కోసం ప్రయాణికులకు భరోసా ఇచ్చేలా అనౌన్స్మెంట్ చేస్తుంటారు పైలట్లు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఈ పైలట్ ఇచ్చిన అనౌన్స్మెంట్ అత్యంత విభిన్నంగా నవ్వు తెప్పించేలా ఉంది. సదరు పైలట్ మాట్లాడుతూ.."నాకు పెళ్లై 33 సంవత్సరాలు. భార్య, నలుగురు పిల్లలు, రెండు కుక్కలు, ఎనిమిది కోళ్లు ఉన్నాయి. నాబార్య ఈ చలిలో వాటిని చూసుకుంటూ అలిసిపోతుంది. అందువల్ల కచ్చితంగా శుక్రవారం సాయంత్రం కల్లా నేను ఇంటికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ కోళ్లను చూసుకోవాల్సింది నేనే కాబట్టి. అదీగాక నేను గనుక ఇంటికి సమయానికి చేరుకోకపోతే ఆమె నన్ను చంపేస్తుంది అందువల్ల మనం కచ్చితంగా సేఫ్‌గా ల్యాండ్ అవుతామని హామీ ఇస్తున్నా..! అని అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ ప్రకటన విన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యి..ఏం అనౌన్స్మెంట్ అంటూ అందరి ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు మెరిశాయి. జర్నీ చేసిన అలసట కూడా ఎగిరిపోయి ఉత్సాహంతో ఉన్నారంతా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఏం చెప్పాడబ్బా..! అంటూ పైలట్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Liz Chan (@liz.chann) (చదవండి: Sachin Tendulkar: ఇంత స్వచ్ఛంగా ఉంటే ఫిల్టర్లు ఎందుకు? సచిన్ మనుసుదోచిన గ్రామం..) -
Telugu Theatre Day నటి ఝాన్సీ ఇంట్రస్టింగ్ పోస్ట్
గొప్ప రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 16న ఆయన గౌరవార్థం తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ కొన్ని ఫోటోలను షేర్ చేశారు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా మె నాటకరంగం తనకున్న అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు. . ఈ సందర్భంగా కళాకారులకు శుభాకాంక్షలందించారు. యాంకర్ ఝాన్సీ ఇన్‌స్టా పోస్ట్: రేడియో నాటకంతో మొదలైన నా ప్రయాణం, టీవీ, సినిమాల నుంచీ రంగస్థలం వైపుకి రావడం చాలా మందికి విడ్డూరంగా తోచవచ్చు.నా తపన నాటక ప్రక్రియని ప్రేమించే వాళ్లకి మాత్రం అర్ధం అయితే చాలు.నేను నాటకానికి క్రొత్త..కానీ సమకాలీన నాటక రంగంలోని సరి క్రొత్త ఒరవడిలో ఒక కెరటాన్ని కావాలని ఆకాంక్ష. తెలుగు నాటకరంగాన్ని పరిపుష్టం చేసిన మహామహులందరినీ తలుచుకుంటూ, తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు.ఇదీ చదవండి: మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్కాగా కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన రచనల ద్వారా జాతి వివక్ష , అనేక ఇతర సామాజిక దురాచారాలపై అవిశ్రాంత పోరు సలిపారు. ఆయన రచించిన అనేక అభ్యుదయ నాటకాలు, నవలలు, సామాజిక వ్యంగ్య రచనలు తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా, వితంతు పునర్వివాహాలకోసం ఆయన చేసిన కృషి స్త్రీజాతికి ఎంతో మేలు చేసింది.చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! -
నాన్న అంటే అంతేరా...! వైరల్ వీడియో
టాలాంట్ చూపించడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్లు మామూలోళ్లు కాదు. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే. సూటిగా సుత్తిగా లేకుండా విషయంలోకి వెళ్లిపోదాం. తెలుగు రాపర్ రోల్ రిడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇపుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. View this post on Instagram A post shared by Roll Rida (@rollrida) ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే పిల్లలను వెనకి కూర్చోబెట్టుకుని ఝాం అంటూ వెళ్లి పోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు. ఇక్కడే ఉంది అసలు కత అంతా... సాధారణంగా సీటుపై కూర్చొంటే వింతేముంది. కోడి, ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట ( పౌల్ట్రీ క్యారియర్) లాంటిది దాంట్లో వీల్ళద్దర్నీ కూర్చోబెట్టాడన్నమాట. ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. జస్ట్ కిడ్..డ్డింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రిడా "ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుంది" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్తతో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కమెంట్లు చేస్తున్నారు. "కోళ్ల సమాజం హర్ట్ భయ్యా" అంటూ ఒకరు ఫన్నీగా కమెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివ్ ఆవిష్కరణను మెచ్చుకోగా, "అమ్మ కంటే నాన్న ఎప్పుడూ భిన్నంగా ఆలోచిస్తాడు" అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బైక్‌గా భావిస్తున్నప్పటి, ఇది ఎక్కడిది అనేది ఖచ్చితమైన తెలియదు. -
వ్యాపారవేత్తతో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్ : ఫోటోలు వైరల్
ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్ న్యూస్ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్ పాపులర్ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ విషయాన్ని ప్రకటించింది. తన నిశ్చితార్థం చిత్రాలను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు అభినందనలు వెల్లువెత్తాయి. ‘సీతారామ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది వైష్ణవి గౌడ. సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకకు సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రముఖ కన్నడ నటి అమూల్య గౌడ, ప్రెజెంబర్ చైత్ర వాసుదేవన్, పూజా లోకేష్, రీతూ సింగ్, జ్యోతి కిరణ్ తదితరులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నిశ్చితార్థ వేడుక కోసం, వైష్ణవి గౌడ భారీగా ఎంబ్రాయిడరీ చేసిన క్రీమ్ అండ్ గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. సీక్విన్, బీడ్‌వర్క్, సున్నితమైన జరీతో కూడిన సంక్లిష్టంగా అలంకరించబడిన బ్లౌజ్ ధరించింది. ఇంకా పచ్చరంగు రాళ్ల స్టేట్మెంట్ చోకర్ నెక్లెస్‌ను కూడా జత చేసింది. ఇంకా మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టీకా, స్టేట్మెంట్ కడాతన లుక్‌ను మరింత ఎలివేట్ చేసింది. మరోవైపు అనుకూల్ మిశ్రా క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఐవరీ షేర్వానీలో రాయల్ లుక్‌లో అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Vaisshnavi (@iamvaishnavioffl) వైష్ణవి గౌడ గురించి మరిన్ని వివరాలువైష్ణవి గౌడ 1995, ఫిబ్రవరి 20, 1995న జన్మించారు. ఆమె కన్నడ నటి అమూల్యకు ప్రాణ స్నేహితురాలు. భరతనాట్యం, కూచిపూడి లాంటి క్లాసికల్ డ్యాన్సర్. అంతేకాదు బెల్లీ డాన్సర్ కూడా. గత పదేళ్లకుపైగా టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తోంది. 2011లో 16 సంవత్సరాల చిన్న వయసులో వైష్ణవి తన మొదటి షో 'దేవి' చేసింది. ఇందులో టైటిల్ రోల్ పోషించిని వై ష్ణవి వరుస ఆఫర్లను దక్కించుకుంది. అయితే, ఆమె 2013 షో 'అగ్నిశాక్షి' బాగా పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఆమె బిగ్ బాస్ కన్నడ సీజన్ 8లో కూడా పాల్గొంది. -
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ డైమండ్ల గురించి తెలుసా?
ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటి గోల్కొండ నీలి వజ్రం (Golconda Blue) వేలానికి రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14వ తేదీన జెనీవాలో జరిగే క్రిస్టీన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్ లో వేలానికి రానుంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారి వేలానికి రానుంది .23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి రంగు వజ్రాన్ని గోల్డ్ రింగ్‌లో అత్యంత అందంగా పొదిగారు. అత్యంత అరుదైన ఈ రత్నానికి రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులుఅంచనా . జెనీవాలో మే 14న జరగనున్న క్రిస్టీస్ ‘మెగ్నిఫిసెంట్ జువెల్స్’ వేలం నిర్వహించనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విలువైన వజ్రాల గురించి తెలుసుకుందామా.విలువైన వజ్రాలు, వివరాలుది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా (కల్లినన్ I) - 1905 లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ 530.4 క్యారెట్ల వజ్రం ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద కఠినమైన వజ్రం. కుల్లినన్ వజ్రం నుండి దీన్ని తయారు చేశారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగం. రాణికి చెందిన రాజదండంపై అమర్చారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద క్లియర్-కట్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి.ది ఓర్లోఫ్ - ది గ్రేట్ మొఘల్ డైమండ్ అని కూడా పిలువబడే అదే వజ్రంగా పరిగణించబడే ఓర్లోవ్ ప్రస్తుతం మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో భాగంగా ప్రదర్శించబడుతోంది. 1774లో, దీనిని రష్యన్ ఎంప్రెస్ కేథరీన్ ది గ్రేట్ ఇంపీరియల్ స్కెప్టర్లో పొదిగించారు.[1] భారతదేశంలోని విష్ణు విగ్రహం నుండి దొంగిలించబడినట్లు భావిస్తున్న 300 క్యారెట్ల వజ్రం.సెంటెనరీ వజ్రం - 1986 లో దక్షిణాఫ్రికా ప్రీమియర్ మైన్‌లో గుర్తించిన ఈ 273.85 క్యారెట్ల వజ్రం దాని దోషరహిత స్పష్టత మరియు అసాధారణమైన తేజస్సుకు ప్రసిద్ధి చెందింది.ది రీజెంట్ - 17 వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొనబడిన ఈ 140.64 క్యారెట్ల వజ్రం ఒకప్పుడు నెపోలియన్ బోనపార్టే కత్తిలో భద్రపరిచారు. ఇది ఇప్పుడు లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శించబడింది.కో-ఇ-నూర్ (కోహినూర్) : ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాలలో ఒకటి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ 105.6-క్యారెట్ల వజ్రం పెర్షియన్, ఆఫ్ఘన్ ,భారతీయ పాలకుల గుండా ప్రయాణించి బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుని క్రౌన్ జ్యువెల్స్‌లో ఉంది.ఐడల్స్ ఐ - 70.2-క్యారెట్ల వజ్రం ఐడల్స్ ఐ కూడా గోల్కొండ వజ్రమే. 1600లో దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్‌లో దీన్ని గమనించారు. పురాణాల ప్రకారం, ఈ వజ్రం మొదట పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత అతను అప్పులు తీర్చడానికి దానిని తన రుణదాతలకు ఇచ్చాడు. ఈ వజ్రం జూలై 14, 1865న లండన్‌లో క్రిస్టీస్ వేలంకోసం ఉంచడంతో ఇది ఉనికిలోకి వచ్చింది. టేలర్-బర్టన్ డైమండ్ - 69.42-క్యారెట్ల పియర్ ఆకారపు వజ్రం, నటి ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్ యాజమాన్యంలో ప్రసిద్ధి చెందింది.సాన్సీ డైమండ్ - రాజ సంబంధాలతో కూడిన 55.23-క్యారెట్ల వజ్రం, ఒకప్పుడు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ చక్రవర్తుల యాజమాన్యంలో ఉంది.హోప్ డైమండ్ - 45.52-క్యారెట్ల లోతైన నీలి వజ్రం. ఇది కూడా భారతదేశంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో చోరికి గురైందనీ, ఆ తరువాత హెన్రీ ఫిలిప్ హోప్ చేత కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీన్ని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉంచారు.హార్టెన్సియా డైమండ్ - ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్‌లో భాగమైన 20-క్యారెట్ లేత గులాబీ వజ్రం. -
సీటుకు రూ. 50వేలు తగలేశాం, ఎయిరిండియాపై కమెడియన్ ఫైర్
విమానయాన సంస్థల సేవాలోపాలకు సంబంధించి అనేక కథనాలు,ఫిర్యాదులు గతంలో అనేకం చూశాం. కొన్ని వివాదాల్ని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్‌లైన్ ఎయిరిండియా మరో వివాదం నెట్టింట హల్చల్ చేస్తోంది. అదీ ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది. హాస్యనటుడు వీర్ దాస్ ఎయిరిండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు రూ.50 వేలు పోసి ఒక్కో టికెట్ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్లు విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్ గా మారింది. అలాగే తన భార్య కాలు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీసు బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్‌చైర్ రాలేదని దాస్ ఆరోపించారు. Dear @airindia Please reclaim your wheelchair. I’m a lifetime loyalist. I believe you’ve got the nicest cabin crew in the sky, this post pains me to write. My wife and I book Pranaam and a wheelchair because she’s got a foot fracture that’s still healing. We’re flying to delhi.…— Vir Das (@thevirdas) April 14, 2025 "ప్రియమైన ఎయిరిండియా,ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్‌చైర్‌ను మీరు తీసుకొండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుడిని." అన్నారు. ఇదే పోస్ట్‌లో ఇంకా "విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు దుర్భరమైన ప్రయాణమని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం రెండు గంటలు ఆలస్యం.. ముందుగానే వీల్‌చైర్ , ఎన్‌కామ్ (విమానాశ్రయాలలో మీట్-అండ్-గ్రీట్ సేవలు) ముందుగానే బుక్ చేసుకున్నాం అయినా ఫలితం లేదు. దాని గురించి అడగడానికి అసలక్కడ ఎవరూ లేరు" అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. నాలుగు బ్యాగులు మోస్తూ, సాయం చేయమని సిబ్బందిని అడిగితే, క్యాబిన్ సిబ్బందిగానీ, గ్రౌండ్ సిబ్బందిగానీ అస్సలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్లాడర్ ఉపయోగించి దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి.. కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవలసి వచ్చింది.అలా భార్యను లగేజ్ క్లెయిమ్‌కు తీసుకెళ్లి, అక్కడినుంచి పార్కింగ్‌కు వెళ్లామని వివరించాడు. అలాగేఎయిర్పోర్ట్లో సెకండ్‌ఫ్లోర్‌లో మీ వీల్ చైర్ ఉంది తెచ్చుకోండి అంటూ ఎయిరిండియాకు సూచించారు. దాస్ పోస్ట్‌పై ఎయిరిండియా స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సంబంధింత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. -
సింగపూర్ ఎన్నికల్లో సత్తా చాటనున్న భారతీయులు: హింటిచ్చిన పీఎం
సింగపూర్‌లో ( Singapore ) సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ (Lawrence Wong) తన పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (PAP) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలపబోతున్నామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఆదివారం భారతీయ యువతతో సింగపూర్ ప్రధానమంత్రి ముచ్చటించారు. భారతీయ సమాజం చిన్నదే అయినా ప్రభావం చాలా గొప్పదని, పీఎం అన్నారు. మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారనీ, అది ప్రభావంతమైందన్న వాంగ్ వ్యాఖ్యలను ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో భారతీయులకు చోటు దక్కలేదని గుర్తు చేసిన ఆయన ఈ సారి 30కంటే ఎక్కువమంది భారతీయులు కూడా ఉంటారన్నారు. ది ఇటీవలి చరిత్రలో అతిపెద్దదని పీఎం వాంగ్ వ్యాఖ్యానించారు. వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అయితే, PM వాంగ్ గత శనివారం వెల్లడించిన ఎనిమిది కొత్త ముఖాల్లో భారత సంతతికి చెందిన వైద్యుడు హమీద్ రజాక్ కూడా ఉన్నారని ది స్ట్రెయిట్ టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వారు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారో వెల్లడించలేదు.చదవండి: Amarnath Yatra 2025 రిజిస్ట్రేషన్లు షురూ! త్వరపడండి!సింగపూర్ నివేదికల ప్రకారం. 2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు. 2024 డేటా ప్రకారం, ఆగ్నేయాసియా దేశ జనాభాలో వరుసగా 15శాతం, 75శాతం మంది మలేషియన్లు , చైనీయులు ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 93 స్థానాల్లో 83 స్థానాలను గెలుచుకుని, ఎన్నికలను కైవసం చేసుకుంది. వీరిలో 27 మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా. వీరిలో భారతీయులెవ్వరూ లేరు. ఇది పార్లమెంటులో సమాజ ప్రాతినిధ్యంపై విమర్శలకు తావిచ్చింది. అమెరికా, కెనడా రాజకీయాల్లో భారతీయ సంతతి అభ్యర్తులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామాలతో ఎంతమంది భారత సంతతి వారు గెలుపు గుర్రాలుగా నిలవనున్నారో చూడాలి. -
మునకానందం..మహదారోగ్యం..!
ప్రకృతి సృష్టించిన కొన్ని అందాలను ఎంత చూసినా తనివి తీరదు. ఒకింత ఆనందం, ఒకింత ఆశ్చర్యం కలగలిసిన అద్భుతాన్ని మనసారా ఆస్వాదించాలంటే, తప్పకుండా ‘ది టర్కోయిస్ పూల్స్’కి వెళ్లాల్సిందే అంటారు పర్యాటకులు. టర్కీలోని డెనిజ్లీ ప్రావిన్స్ పముక్కలేలో కనిపించే అందమైన నీలిరంగు కొలనులు ఆహ్లాదానికే కాదు, ఆరోగ్యానికీ ఉత్తమమట! ‘పముక్కలే’ అంటే, ‘పత్తి కోట’ అని అర్థం. ఈ ప్రదేశంలో కాల్షియం కార్బొనేట్ సహా అరుదైన ఖనిజాలతో నిండిన నీరు కొండల మీదుగా నెమ్మదిగా జారుతూ, తెల్లటి సున్నపురాతి కొండలను తొలచడంతో అక్కడక్కడా కొలనుల్లాంటి వేడినీటి బుగ్గలు ఏర్పడ్డాయి. ఈ వేడినీటిలో స్నానం చేస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలో పురాతన హియెరాపోలిస్ నగరం ఉంది. దాంతో అక్కడ పురాతన శిథిలాలు, థియేటర్లు ఇతర చారిత్రక కట్టడాలను చూడవచ్చు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: ఛీ..య్యాక్..! ఆఫీస్ బాత్రూమ్నే ఇల్లుగానా..!) -
సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు
మలబార్ హిల్ పరిసరాల్లో ఇటీవల ప్రారంభించిన ‘వాక్‌వే’కు పర్యాటకులు, ముంబైకర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభించిన వారం రోజుల్లోనే 10 వేలకుపైగా పర్యాటకులు ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా రాకపోకలు సాగించి ప్రకృతి అందాలను ఆస్వాదించగా కొందరికి టెకెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నారు. మరో రెండు వారాల వరకు బుకింగ్ ఫుల్ కావడంతో ఈ వాక్‌వే సందర్శనకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. టికెట్లు ఆన్లైన్లో తప్ప నేరుగా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల్లో 300మందికి పైగా పర్యాటకులు మలబార్ హిల్ అందాలను చూడకుండానే తిరిగి వెళ్లిపోయారు. ఒక్క చెట్టుకూ హాని కలగకుండా.. నిర్మాణం మలబార్ హిల్ ప్రాంతంలో కొండపై కమలా నెహ్రూ పార్క్ ఉంది. దీనికి కూతవేటు దూరంలో బూట్ (షూ) బంగ్లా ఉద్యాన వనం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చిన దేశ, విదేశీ పర్యాటకులు కచి్చతంగా ఈ రెండు ప్రాంతాలను సందర్శిస్తారు. దీంతో ఇక్కడికి వచి్చన పర్యాటకులను మరింత ఆహ్లాదాన్ని పంచాలన్న ఉద్దేశ్యంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సింగపూర్‌లోని ‘ట్రీ టాప్ వాక్’తరహాలో నైసర్గిక ఎలివేటెడ్ మార్గాన్ని నిరి్మంచింది. ఇలాంటి మార్గాన్ని ముంబైలోని ఉద్యానవనంలో నిర్మించడం ఇదే ప్రథమం. అందుకు బీఎంసీ దాదాపు రూ.30 కోట్లకుపైనే ఖర్చు చేసింది. వందలాది చెట్ల మధ్యనుంచి ఈ మార్గాన్ని నిర్మించినప్పటికీ ఒక్క చెట్టుకు కూడా హాని కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. రూ.25తో మానసికోల్లాసం.. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలివేటెడ్ మార్గం తెరిచి ఉంటుంది. ఒక్కొక్కరూ రూ.25 చెల్లించి చెట్ల మధ్యలోంచి ఈ మార్గం మీదుగా వెళుతూ ఉద్యాన వనంలో ఉన్న వివిధ రకాల జంతువులు, పక్షులు చూడవచ్చు. అదేవిధంగా కొండ కిందున్న అరేబియా సముద్ర తీరం అందాలను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలలు, చరి్నరోడ్ (గిర్గావ్) చౌపాటి, క్వీన్ ¯ð నెక్లెస్ (మెరైన్ డ్రైవ్)లను తిలకించవచ్చు. దీంతో శని, ఆదివారాల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ చోటుచేసుకుంటోంది. ‘ఆన్లైన్’మాత్రమే ఎందుకు? అయితే సందర్శకులు ఆఫ్‌లైన్‌లో టికెట్లు లభించకపోవడంపై ఇక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంచడంపై నిలదీస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, చదువుకోని వారు ఆన్లైన్లో టికెట్లు ఎలా పొందగలరని ప్రశి్నస్తున్నారు. నేరుగా టికెట్లు కొనే వీలు లేక చాలా దూరం నుంచి వచి్చన పర్యాటకులు వెనుదిరుగుతున్నారని, ఇలాంటి వారికోసం ఆఫ్‌లైన్‌లో కొన్ని టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పర్యాటకుల క్షేమంకోసమే.. ఈ వాక్‌వేపై మొబైల్లో ఫొటోలకు అనుమతి లేదు. దీని వల్ల ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కొంతమంది యువతీ యువకులు ఈ నిబంధనను అతిక్రమించి ఎలివేటెడ్ మార్గంపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. రీల్స్ పేరుతో ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఈ కారణంగా రద్దీ ఏర్పడి పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ఇందువల్లే మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎంసీ సిబ్బంది తెలిపారు. View this post on Instagram A post shared by MANISH DEO | Travel Photographer (@deomanish) -
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్ప్రైజ్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్‌గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి! అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్‌డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్ కట్ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్ చూపించిన ఆప్యాయత, సర్ప్రైజ్ అందరినీ ఆకర్షించింది. నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్‌డే బోయ్‌కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అంబానీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలుఅనంత్కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.“నా అనంత్‌కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’ -
ఎక్స్ట్రీమ్ టాలెంట్ : ఇతను చాలా రిచ్ గురూ!
జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్ అంటే ఎవరికీ తెలియదు. ‘మిస్టర్ బీస్ట్’ (MrBeast) అనండి... వెంటనే గుర్తుపట్టేస్తారు. అతను ప్రఖ్యాత యూట్యూబర్. ప్రపంచవ్యాప్తంగా 383 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగిన యూట్యూబ్ ఛానెల్ ‘MrBeast’ ని అతనే నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న బీస్ట్ ప్రపంచంలోని అనేకమంది ధనవంతులను మించిపోతున్నాడు. అతని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా?మిస్టర్ బీస్ట్ పుట్టింది 1998 మే 7న. అమెరికాలోని కాన్సస్‌లో పుట్టి, ఉత్తర కరోలినాలోని గ్రీస్విల్లేలో పెరిగారు. 2012 నుంచి యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. ఐదేళ్ల తర్వాత, 2017లో అతను చేసిన ‘కౌంటింగ్ టు 1,00,000’ వీడియో కొన్ని రోజుల్లోనే 10 వేల దాకా వ్యూస్ సాధించి, అతని ఛానెల్‌కి ప్రాచుర్యం తీసుకొచ్చింది. అలా మెల్లగా అతని వీడియోలకు వీక్షకులు పెరిగారు. విచిత్రమైన విన్యాసాలు, కొత్త కొత్త ప్రయోగాలు వంటివి మిస్టర్ బీస్ట్ ఛానెల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఫోర్బ్ నివేదిక ప్రకారం, మిస్టర్ బీస్ట్ 2023–2024లో సంపాదించిన మొత్తం 85 మిలియన్ డాలర్లు(సుమారు రూ.732 కోట్లు). ఇంత ఆదాయం కలిగిన మరొక యూట్యూబర్ ప్రపంచంలో మరెవరూ లేరు. యూట్యూబ్ వీడియోల ద్వారా అతను నెలకు సుమారు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.430 కోట్లు) సంపాదిస్తున్నాడని అంచనా. ఛానెల్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఆయన మరికొన్ని వ్యాపారాలను ప్రారంభించారు. వాటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. అన్నీ కలిపి అతణ్ని అత్యంత ధనవంతుణ్ని చేశాయి. ఇదీ చదవండి: రోజులో 7 గంటలు దానికే : శాపమా, వరమా?! -
మనువాడిన మామిడి చెట్లు
సారంగాపూర్: సాగు చేస్తున్న మామిడితోటలో కాపుకొచ్చిన చెట్లకు రైతు దంపతులు పెళ్లి చేశారు. వ్యవసాయంతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఓగుల అనిల, అజయ్ దంపతులు ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నారు.నాలుగేళ్ల తరువాత మొదటి కాత (పంట) వచ్చింది, దీంతో కాత కాసిన రెండు చెట్లకు పెళ్లి చేయాలని నిశ్చయించి బంధువులను సైతం ఆహ్వానించారు. బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అర్చకుడు వొద్దిపర్తి మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు నూతన వస్త్రాలు ధరింపజేసి, జీలకర్ర, బెల్లం ఉంచి మాంగళ్యధారణ గావించారు. కార్యక్రమానికి గ్రామంలోని పలువురు రైతులు హాజరుకాగా.. మామిడితోటలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఆడెపు రమ్య, మహేశ్, సత్తెన్న, మమత దంపతులు పెళ్లి పెద్దలుగా హాజరయ్యారు. -
రోజా పూలను ఈ పేపర్లో చుట్టి పెడితే..
సహజ పూల అందమే వేరు. అతిథులకు, ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపే పుష్పగుచ్ఛాల్లో రంగు రంగుల కట్ ఫ్లవర్స్ (Cut Flowers) మెరుస్తూ మురిపిస్తూ ఉంటాయి. అయితే, త్వరగా వాడిపోవటం వీటి ప్రధాన సమస్య. దీనిని అధిగమించటానికి మైసూరులోని కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) సరికొత్త పేపర్‌ను తయారుచేసింది. రోజా పూలను ఈ పేపర్లో చుట్టి పెడితే సాధారణంకంటే రెట్టింపు కాలం తాజాగా ఉంటాయని సంస్థ చెబుతోంది.విదేశాలకు కట్ ఫ్లవర్స్ ఎగుమతిచేసే సమయంలో త్వరగా వాడిపోవటం వల్ల 20 నుంచి 25 శాతం వరకు నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని నివారించడానికి కేంద్ర శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఫ్లోరీకల్చర్ మిషన్‌ను ప్రారంభించింది. అందులో భాగంగానే (సీఎఫ్టీఆర్ఐ) ఈ పేపర్‌ను తయారుచేసింది. దీనిపై పేటెంట్ (Patent) కూడా పొందింది. 2020లో ప్రపంచ కట్ ఫ్లవర్ మార్కెట్ విలువ 1,761 కోట్ల డాలర్లు. ఇది 2027 నాటికి 2,668 కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఫ్లోరీకల్చర్ మార్కెట్లో మన దేశ వాటా 2020లో రూ.18,760 కోట్లు. 2026 నాటికి ఇది రూ. 54,640 కోట్లకు పెరుగుతుందని అంచనా. కట్ రోజెస్ (Cut Roses) ఎగుమతిలో మన దేశం 15వ స్థానంలో ఉంది.కొత్త పేపర్ ప్రయోజనాలు ఇవీ.. ⇒ పర్యావరణహితంగా తయారైన ఈ పేపర్లో రోజా కట్ ఫ్లవర్స్‌ను చుట్టి పెడితే చాలు. ⇒ ప్యాకింగ్‌లో ఖరీదైన, విషతుల్యమైన రసాయనాలు వాడనవసరం లేదు. ⇒ సాధారణ ప్యాకింగ్‌లో కన్నా రెట్టింపు రోజులు పూలు తాజాగా ఉంటాయి. చదవండి: ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి.. ఇదేం లొల్లి!⇒ గులాబీ రేకులు, ఆకులు వాడిపోకుండా, రాలకుండా ఉంటాయి.⇒ రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారుల ఆదాయం పెరుగుతుంది. ⇒ ఈ పేపర్ రసాయన రహితమైనది. త్వరగా కుళ్లిపోతుంది.⇒వ్యాక్యూమ్ ప్యాక్‌లో ఈ పేపర్లు ఉంటాయి. ప్యాకెట్ విప్పిన తర్వాత నెల రోజుల్లోపు వాడుకోవాలి. - సాక్షి స్పెషల్ డెస్క్ -
తగ్గే ప్రసక్తే లే..! చిరుతకు చెమటలు పట్టించిన శునకం..!
వంగపండు ‘ఏం పిల్లడో’ పాటలో ‘పులుల్ని మింగిన గొర్రెలున్నయట’ అనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటలో‘చిరుతకు చెమటలు పుట్టించిన కుక్కలున్నయట’ అనే మాటను చేర్చవచ్చు. ఈ కథనం ఊళ్లోకి ప్రవేశించిన చిరుతపై తీవ్రంగా కన్నెర్ర చేసిన శునకం గారి గురించి. ఒక అర్ధరాత్రి... ఊరంతా గుర్రు పెట్టి నిద్రపోతోంది. చిన్న అలికిడి కూడా లేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక చిరుత పులి వీధిలోకి వచ్చింది. ఆ తరువాత ఒక ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు... ‘భౌభౌ’ అనే శబ్దం వినిపించింది. మామూలుగానైతే.... ‘నన్ను బెదిరించేంత సీన్ నీకు లేదు’ అని ఆ ఇంటి కాపలా కుక్కపై చిరుత కన్నెర్ర చేయాలి.అయితే సదరు చిరుత మాత్రం కుక్క అరుపులు విని వెనక్కి తిరిగి చూడకుండా పరుగో... పరుగు!సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 3.5 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతోంది. ఇది ఏ ప్రాంతానికి చెందిన వీడియో క్లిప్ అనేది తెలియదుగానీ నెట్‌వాసులు జోక్‌లు విపరీతంగా పేలుస్తున్నారు. View this post on Instagram A post shared by Ranthambore National Park (@ranthamboresome) (చదవండి: ఆయన ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!) -
ఇదేం పెళ్లిరా నాయనా!
వన్ ప్లస్ వన్ ఆఫర్ గురించి మనందరికీ తెలుసు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకటి కొంటే ఒకటి ఉచితమని వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఇలాంటి వింత ‘ఆఫర్’ను సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే ఇది వస్తువులకు సంబంధించిన ఆఫర్ కాదు. మనుషుల పెళ్లికి సంబంధించిన ఆఫర్! ఇద్దరు మైనర్ బాలికలను ఒకే ముహూర్తానికి ఒకే వేదికపై పెళ్లాడటానికి రెడీ అయ్యాడో ప్రబుద్ధుడు. విషయం అధికారులకు తెలియడంతో పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.వరుడు ఒక్కడే.. వధువులిద్దరు!పెళ్లికి వధువు దొరకక ఎందరో యువకులు నిరాశతో జీవనం సాగిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరు మైనర్ బాలికలను వివాహం (Wedding) చేసుకునేందుకు రెడీ అయిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన యువకుడు, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ఈనెల 10న పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. 16 ఏళ్ల తన అక్క కూతురిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే చిన్న మేనకోడలు (15) కూడా మేనమామనే పెళ్లి చేసుకుంటానని, అలా చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని మొండికేసింది. దీంతో ఇద్దరు అమ్మాయిలనూ అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని బంధువులు నిర్ణయించారు.అధికారుల వార్నింగ్గోరంట్లలోని రంగమహల్ ఫంక్షన్ హాల్లో ఈనెల 10న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి శుభలేఖ (Wedding Card) వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడంతో విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే స్పందించిన అధికారులు మంగళవారం ఇరువర్గాల తల్లిదండ్రులు, బంధువులతో పాటు ఫంక్షన్ హాల్ నిర్వహకుడిని గోరంట్ల పోలీస్ స్టేషన్‌కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి పెళ్లి చేస్తే చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిత, సీఐ శేఖర్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించారు.కేసు నమోదుపెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, కనీసం ఒక అమ్మాయితోనైనా పెళ్లి జరిపిస్తామని వధువు, వరుడు (Groom) తరపువారు అధికారులను వేడుకున్నారు. మైనర్ బాలికకు పెళ్లి చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని అధికారులు గట్టిగా హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. కాగా, చివరిలో ఇరువర్గాలు మాట వినకపోవడంతో ఐసీడీఎస్ (ICDS) సూపర్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ శేఖర్ తెలిపారు. మరి రేపు ఉదయం ముహుర్తం సమయానికి పెళ్లి జరుగుతుందా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: ఆంధ్రా అబ్బాయి.. అమెరికా అమ్మాయి లవ్స్టోరీబాల్య వివాహాలు వద్దుసోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వ్యవహారంపై జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిన్నవయసులో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. బాల్యవివాహాలను అడ్డుకునే విషయంలో అధికారులు సమర్థవంతంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం యంత్రాంగం పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. -
సినిమాని తలపించేలా ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి లవ్‌స్టోరీ..!
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది. తాను ఆంద్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్‌స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్లో సవివరంగా వెల్లడించింది. చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్‌ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Jaclyn Forero (@jaclyn.forero) (చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..) -
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
వివాహ వంటకాల్లో విందులు ఓ రేంజ్లో ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్లైతే భోజనంలో లెక్కపెట్టలేనన్ని వెరైటీలతో అతిథులను ఆశ్చర్యపరుస్తారు. కానీ ఇలా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకునే విధంగా ఆతిథ్యం ఇవ్వడం గురించి విన్నారా..?. అలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశారు పశ్చిమబెంగాల్లోని ఓ కుటుంబం. తమ ఇంట జరిగే వివాహ వేడుకలో పాల్గొనే అతిథులంతా అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావించారో ఏమో..! గానీ భలే అద్భుతంగా మెనూ అందించి విందు ఏర్పాటు చేశారు. వచ్చినవారంతా వారెవవ్వా..ఏం ఉంది ఈ మెనూలో వాటి వివరణ అని మెచ్చుకుంటున్నారు.ప్రస్తతం ప్రజలంతా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలా పడితే అలా తినేందుకు ఇష్టపడటం లేదు. ఏది ఎంతవరకు తింటే మంచిదో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఇలాంటి వివాహ వేడుకలో కూడా వారి డైట్‌కి ఇబ్బంది గలగకుండా జాగ్రత్త తీసుకుంటూ తాము అందించే వంటకాల కేలరీలను సవిరంగా మెనూలో అందించారు. అంతేగాదు ఈ విందులో నచ్చినవన్నీ తినండి..అలాగే అధిక కేలరీలను బర్న్ చేసుకునేందుకు ఈ వేడుకలో ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్వంటి కార్యక్రమాల్లో పాల్గొనండి చాలు. జీఎస్టీ ఏం ఉండదూ కూడా అంటూ చమత్కారంగా రాశారు. ఇక్కడ ఆ మెనూలో ఆరోగ్య స్ప్రుహ తోపాటు, ఆహారం వృధాను నివారించేలా విందును ఆస్వాదిద్దాం అని పిలుపునివ్వడం విశేషం. ఇంకో విషయం కూడా జత చేశారు..ఎంజాయ్ చేద్దామనే వచ్చాం కాబట్టి..దాన్ని మిస్ చేసుకోకుండా కంఫర్ట్‌గా ఉండమని మెనూ చివరలో సూచించారు. అందుకు సంబంధించిన విషయాలను రెడ్డిట్ వినియోగదారుడు నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లంత ఇది వివాహ మెనూ కాదు..'కేలరీల మోమో' అంటూ ప్రశంసిస్తున్నారు.(చదవండి: 65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?) -
రామభక్తుడు తయారు చేసిన 25 అడుగుల అగరబత్తి చూశారా?
శ్రీరామనవమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పల్లివీధికి చెందిన రామభక్తుడు నరసింహమూర్తి 25 అడుగుల అగరబత్తీని తయారు చేసి ఆశ్చర్యపరిచారు. సర్వే కర్ర, అగరబత్తి పౌడర్‌ను ఉపయోగించి తయారు చేసిన ఈ బత్తీకి వారం సమయం పట్టిందని, సుమారు 48 కిలోల బరువు ఉందని ఆయన తెలిపారు.పలాసలోని సీతారామాలయం ఎదుట ఆదివారం ఈ అగరబత్తీని (incense stick) వెలిగించగా, సుమారు గంటన్నరసేపు ప్రాంగణంతోపాటు, చుట్టుపక్కల సువాసన వ్యాపించి అందరినీ ఆకట్టుకుంది. కోవా సారె కనువిందుడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అక్విడెక్టు వద్ద ఉన్న పట్టాభి రామాలయంలో సీతారాముల కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతుల ఆధ్వర్యాన జరిగిన స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.ఈ సందర్భంగా సత్యవాణి దంపతులు కోవాతో తయారు చేయించిన 108 రకాల స్వీట్లు, పిండి వంటలను శ్రీరాముని తరఫున సీతమ్మకు సారె (కంత)గా సమర్పించారు. చదవండి: జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం!రామతీర్థంలో వైభవంగా సీతారాముల కల్యాణంసాక్షి ప్రతినిధి, విజయనగరం/సింహాచలం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి స్వామివారి కల్యాణ ఘట్టం ప్రారంభమైంది.పట్టువ్రస్తాలతో సీతారాములను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణానికి సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఉత్సవ విగ్రహాల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. తరువాత వేద మంత్రోచ్ఛారణల నడుమ కన్నుల పండువగా కల్యాణం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సింహాచలం నుంచి వచ్చిన పట్టు వ్రస్తాలను సమర్పించారు. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా స్వామివారికి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.రాములోరికి అప్పన్న పట్టువ్రస్తాలు రామతీర్థం రాములోరికి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించింది. ఈ కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున సింహాచలం దేవస్థానం పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు (mutyala talambralu) సమర్పించడం ఆనవాయితీ. దీన్లోభాగంగానే దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, అర్చకులు, అధికారులు పట్టువ్రస్తాలు, తలంబ్రాలను తీసుకెళ్లారు. -
కరాటే కింగ్ బొంతూరి రమేష్ సక్సెస్ స్టోరీ
వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపురం ఇప్పాయిగూడేనికి చెందిన బొంతూరి రమేష్ కుటుంబసభ్యులు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. రమేష్ గోల్కొండలో 9వ తరగతి చదువుతున్నప్పుడే కరాటేపై ఆసక్తి పెంచుకున్నాడు. పదో తరగతి పాసైనా ఆర్థిక పరిస్థితి సహకరించక మధ్యలోనే చదువు ఆపేశాడు. బ్రూస్లీ సినిమాలు చూసి 12వ యేట నుంచే కరాటే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు, గ్రాండ్ మాస్టర్ ఆర్కే కృష్ణ ప్రోత్సాహంతో కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు. అనంతరం కిక్‌బాక్సింగ్ నేర్చుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం మాస్టర్ రమేష్ జవహర్గర్ పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, కానిస్టేబుళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాడు. ఇప్పటి వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో రన్వీర్ తైక్వాండో అకాడమీ ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చినట్లు రమేష్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా కరాటే విద్యనందించి బీపీ, షుగర్, మానసిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక యోగా శిక్షణ అందిస్తున్నాడు. ఇప్పటికే పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకునేలా కృషి చేస్తున్నాడు. వేసవికాలంలో మరింత మంది విద్యార్థులకు కరాటే విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. 2011 బెంగళూరులో నేషనల్ గోల్డ్ మెడల్ 2016లో అక్షయ్‌కుమార్ ఇంటర్నేషనల్ గోల్డ్‌మెడల్ వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 220 గోల్డ్, సిల్వర్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ -
అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?
అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి అలాంటి పనిచేసే కటకటాల పాలయ్యాడు. అంతేగాదు తన గర్ల్‌ఫ్రెండ్‌కి మరింత అసహ్యం కలిగేలా చేసుకున్నాడు.ఈ ఘటన తైవాన్‌లో చోటుచేసుకుంది. 57 ఏళ్ల కోళ్ల పెంపకందారుడు ఎల్వీ 48 ఏళ్ల టాంగ్ అనే మహిళతో రిలేషన్షిప్లో ఉన్నాడు. వాళ్ల బంధం 15 ఏళ్లు కొనసాగింది. అయితే ఎల్వీ ప్రవర్తన సరిగా లేకపోవడం, కుటుంబ తోడ్పాటుకు ఎటువంటి సహకారం లేకపోవడంతో విసిపోయిన టాంగ్ అతడితో బంధానికి స్వస్తి చెప్పింది. అప్పటి నుంచి ఆమె వేరుగా జీవిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని ఎల్వీ, టాంగ్ని పదే పదే బెదిరింపులకు గురి చేయడం ప్రారంభించాడు. అక్కడితో ఆగక ఇక ఆమెను ఎలాగైనా.. తన వద్దకు రప్పించుకుని, కలిసే జీవించేలా చేద్దామనే దురుద్దేశంతో దురాగతానికి తెరతీశాడు. ఆమె తండ్రి సమాధి వద్ద ఉండే చితాభస్మాన్ని దొంగలించి ఆమె మనోవ్యధను కలిగిస్తే..కచ్చితంగా తన వద్దకు తిరిగి వచ్చేస్తుందని భావించాడు. కానీ అతడు ఒకటి తలిస్తే..విధి మరొకటి తలిచింది. అయితే ఇదంతా టాంగ్‌కు తెలియదు. అతడు తన తండ్రి చితాభస్మం నా దగ్గర ఉందని చెప్పినా..టాంగ్ అవన్నీ బెదిరింపులే అనుకుని కొట్టిపారేసింది. నమ్మను కూడా నమ్మలేదు. అయితే ఎలా దొంగలించానో..ఫోటోలతో సహా వివరంగా పంపించాడు. అప్పుడే ఆమె తన తండ్రి స్మశాన వాటికను సందర్శించి అసలు విషయం తెలుసుకుంది. ఇక టాంగ్ అతడిని క్షమించకూడదన్న పట్టరాని కోపంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక వాళ్లువెంటనే రంగంలోకి దిగి విచారించగా..అతడే టాంగ్ తండ్రి చితాభస్మాన్ని అపహరించాడని తేల్చారు. అయితే అప్పటికే ఎల్వీ మనీలాండరింగ్‌కి సంబంధించిన కేసులో జైల్లో ఉన్నాడు. ఇక ఈ ఘనకార్యంతో ఎల్వీపై మరిన్ని అబియోగాలు మోపి అరెస్టు చేశారు. అలాగే అతడి నుంచి ఆమె తండ్రి చితాభస్మాన్ని కూడా స్వాధీన పర్చుకుని టాంగ్కి అప్పగించారు. ప్రేమతో మన నుంచి దూరమైన వాళ్ల మనుసుని గెలుచుకోవాలే గానీ ఇలాంటి పనులతో బలవంతంగా రప్పించుకుంటే..విధి సైతం సహకరించదు అంటే ఇదే కదూ..!.(చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?) -
ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?
ఊసరవెల్లుల్లా రంగులు మార్చే ఈ చెట్లు ‘ఉప్ప’చెట్లు. ఈ చెట్లు ఏడాదికి రెండుసార్లు రంగులు మార్చుకుంటాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలం దుర్గం గ్రామ పంచాయతీ బంగారం గరువు సమీపంలోని ఉప్ప గ్రామంలో ఈ చెట్లను చూడవచ్చు. దాదాపు పదహారువేల ఎకరాల విస్తీర్ణంలోని వనంలో ఈ చెట్లు ఉన్నాయి. ఇవి దాదాపు ఇరవై మీటర్ల ఎత్తులో గుండ్రంగా పెరుగుతాయి. వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో ఉంటాయి. ‘సపోటసీ’ కుటుంబానికి చెందిన ఈ వృక్షాన్ని ‘ఇండియన్ బటర్ ట్రీ’ అని పిలుస్తారు. ఉప్ప చెట్ల వనంలో నెమళ్లు సహా రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. ఇక్కడ దోమలు, గబ్బిలాలు మాత్రం కనిపించవు.ఏడాదికి రెండుసార్లు రంగుల మార్పుఈ చెట్ల ఆకులు ఏడాదికి రెండుసార్లు రంగులు మారుతాయి. సాధారణం ఇవి మిగిలిన ఆకుల్లా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మరోసారి రంగులు మారుతుంటాయి. తొలుత తెలుపుగా, తర్వాత లేతగులాబిగా మారి, చివరకు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్ల పువ్వులు నాగమల్లి పూలలా తెల్లగా, అందంగా ఉంటాయి. వీటి పరిమళాలు చాలా దూరం వరకు గుబాళిస్తుంటాయి.పిక్కలకు ఓ లెక్కుంది!ఉప్ప కాయలను పగలగొడితే లోపల పిక్కలుంటాయి. సాదాగా ఉంటే మగ పిక్కలని, త్రికోణాకారంలో ఉంటే ఆడ పిక్కలని గిరిజనులు నమ్ముతారు. విద్యుత్తు సౌకర్యం లేని రోజుల్లో– కిరోసిన్ కూడా అందుబాటులో లేనప్పుడు పిక్కకు రంధ్రం చేసి ఒత్తి గుచ్చి వెలిగించేవారు. లేదంటే సన్నని ఇనుప తీగతో పిక్కలను దండలా గుచ్చి వెలిగించేవారు. ఈ పిక్కలను మెత్తగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెను తలకు రాసుకోవడానికి, దీపం పెట్టడానికి, శరీరంపై దద్దుర్లు వస్తే పైపూతగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడతారు. బీజం ఎక్కడ పడింది!ఉప్ప చెట్లు శ్రీలంకలో ఎక్కువగా ఉంటాయి. ఇది వారి జాతీయ వృక్షం. మన దేశంలో హిమాలయాల చుట్టుపక్కల, బిహార్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దక్షిణాదిన అల్లూరి జిల్లాలోనే తారసపడతాయి. ఈ చెట్ల పుట్టుక గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 17వ శతాబ్దంలో ఒక సాధువు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్లి అన్నం పెట్టాలని అడిగాడట! వారు తిరస్కరించగా, కొంత దూరం ప్రయాణించి మరో ఇంటికి వెళ్లి వేడుకున్నాడు. ఆ ఇంట్లో భోజనం పెట్టగా, తిని సంతృప్తి చెంది, ఆ ప్రాంతంలో బంగారం పండుతుందని ఆశీర్వదించి, అన్నం పెట్టని చోట ఉప్ప చెట్లు పెరుగుతాయని శాపం పెట్టినట్లు గిరిజనం చెబుతున్నారు. అవే బంగారం గరువు, ఉప్ప గ్రామాలు అయ్యాయని ప్రతీతి. జయపురం రాజా విక్రమ్దేవ్వర్మ ఈ ప్రాంతంలో ఉప్ప విత్తులు జల్లించారన్నది మరో కథనం. గిరిజనులు ఈ చెట్లను అతి పవిత్రంగా చూసుకుంటారు. ఈ తోటలో ఎవరైనా మలమూత్రాదులు విసర్జిస్తే శిక్షిస్తారు. ఈ మేరకు హెచ్చరిక బోర్డులు పెట్టారు. చెట్లను కొడితే కఠిన శిక్షలు అమలుచేస్తారు. ఈ వనాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మార్చారు. ఈ చెట్ల రక్షణ బాధ్యత గ్రామ దేవత గుణాలమ్మ తల్లి చూసుకుంటుందని నమ్ముతారు. అరవై ఏళ్ల కిందట గ్రామదేవతకు గుడి నిర్మించారు. ఏటా ఇక్కడ ఘనంగా జాతర జరుపుతారు.ఎలా చేరుకోవాలంటే...పాడేరుకు 30 కిలోమీటర్లు, అరకు నుంచి 39 కిలోమీటర్ల దూరంలో ఉప్ప గ్రామం ఉంది. విశాఖపట్నం నుంచి 130 కిలోమీటర్ల దూరాన ఉంది. సబ్బవరం మీదుగా పాడేరు–అరకు మార్గంలో ఉప్ప గ్రామానికి చేరుకోవచ్చు. కార్లు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లవచ్చు. ఈ మార్గంలో వచ్చేవారు వాహనాల్లో ఇంధనం నింపుకోవాలంటే డుంబ్రిగుడలో మాత్రమే పెట్రోల్ బంకు ఉంది. ఉప్ప తోటల్లో పర్యాటకులు సెల్ఫీలు తీసుకుని సంబరపడుతుంటారు. ఇటీవలి కాలంలో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు విరివిగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సత్యదేవ్ నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ -
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకరంగం దూసుకునిపోతున్న వేళ.. ఇప్పటికీ కొన్ని దేశాలు పర్యాటక ఆంక్షలు వీడటం లేదు. వాటిలో ఉత్తరకొరియా, సౌదీ అరేబియా, భూటాన్, తుర్క్మెనిస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం ఉత్తరకొరియా. ఇక్కడ పర్యటించడానికి చాలా కఠినమైన నిబంధనలున్నాయి. కేవలం కొన్ని ప్రత్యేక పర్యటనలకు మాత్రమే అనుమతిస్తారు. సౌదీ అరేబియాలో విదేశీ పర్యాటకం చాలా పరిమితంగా ఉండేది. ఆ దేశం 2019లో పర్యాటక వీసాలు జారీ చేయడం ప్రారంభించినా, ఇప్పటికీ, కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యాటకులు వెళ్లడానికి అనుమతించడంలేదు. తుర్క్మెనిస్థాన్లో పర్యటించడానికి వీసా పొందడం చాలా కష్టం. ఇక భూటాన్ తమ దేశ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాల పర్యాటకుల సంఖ్యను పరిమితం చేస్తోంది. (చదవండి: పరీక్ష భయాన్ని ఓడించే టెక్నిక్స్) -
అగ్గిపెట్టె కనిపెట్టింది ఎప్పుడో తెలుసా?
ఇప్పుడంటే నిప్పు వెలిగించడానికి అగ్గిపెట్టె వాడుతున్నాం. అగ్గిపెట్టె (Matchbox) లేని కాలంలో నిప్పు పుట్టించడం చాలా టఫ్ విషయం అని మీకు తెలుసా? రాళ్లను మరో రాళ్లతో కొట్టి, కర్రలను మధించి నిప్పు పుట్టించేవారు. ఒకరి ఇంట్లో నిప్పు (Fire) కావాలంటే పక్కింట్లో నుంచి నిప్పు కణికల్ని తీసుకెళ్లేవారు. అగ్గిపెట్టె వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తీరాయి.క్రీస్తుశకం 577 నుంచే చైనాలో రాజవంశానికి చెందిన స్త్రీలు నిప్పు కోసం కొన్ని ప్రత్యేకమైన కర్రల్ని వాడేవారని, వాటికి రసాయనాలు పూసి నిప్పు పుట్టించేవారని చరిత్రకారులు అంటున్నారు. చరిత్రలో అవే తొలి అగ్గిపుల్లలని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో అప్పటి శాస్త్రవేత్తలు గ్యాస్ (Gas) ఆధారంగా నిప్పు పుట్టించే ప్రయోగాలు చేశారు.1832లో లండన్‌లో తొలిసారి సిగార్లు వెలిగించుకునేందుకు కర్రతో పుల్లలు తయారు చేసి వాటి చివరన రసాయనాలను అంటించారు. ఇవి చాలా ఉపయోగకరంగా ఉండటంతో వీటిపై మరిన్ని ప్రయోగాలు జరిగి, చివరకు ఇవాళ మనం చూస్తున్న అగ్గిపెట్టెలు అవతరించాయి. భలే ఉందిగా అగ్గిపెట్టె పుట్టుక. -
బబుల్ గమ్కాదు..చెక్క నమిలితే మెదడుకు చాలా మంచిది : కొత్త స్టడీ
జీర్ణక్రియ, పోషకాల శోషణకు నమలడం ప్రయోజనకరమని చాలామందికి తెలుసు. కానీ నమలడం వల్ల మెదడుపై కూడా ఆశ్చర్యకరమైన ప్రభావం ఉంటుందని తెలుసా? అదీ కలప వంటి గట్టి ఆహారాలను నమలడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఒక కొత్త అధ్యయనం ద్వారా తెలుస్తోంది.ఫ్రాంటియర్స్ ఇన్ సిస్టమ్స్ న్యూరోసైన్స్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం మృదువైన ఆహారాలను నమలడంతో పోలిస్తే , గట్టి ఆహారాలను నమలడం అనేది మెదడుకి, జ్ఞాపకశక్తికి చాలా మంచిదని తేలింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం గట్టి పదార్థాలను నమలడం వల్ల మెదడులో కీలకమైన గ్లూటాథయోన్ (GSH) లెవల్స్ గణనీయంగా పెరిగాయి.ఈ అధ్యయనం ఎలా జరిగిందిమెదడు తనను తాను రక్షించుకోవడానికి కొన్ని యాంటీఆక్సిడెంట్లను ఉపయోగిస్తుంది. వాటిలో ఒకటి గ్లూటాథయోన్. ఈ అధ్యయనంలో పరిశోధకులు దక్షిణ కొరియాకు చెందిన పరిశోధకులు 52 మంది ఆరోగ్యవంతమైన విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహానికి చెందిన వారికి పారాఫిన్ వాక్స్ గమ్ నమలమని, చెక్కతో చేసిన టంగ్ డిప్రెసర్లను నమలాలని మరో గ్రూపునకు చెప్పారు. ముప్పై సెకన్లు నమలడం, స్వల్ప విరామం, మళ్లీ నమలడం ఇలా ఐదు నిమిషాల పాటు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి నమలడానికి ముందు, ఆ తర్వాత అంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (అభిజ్ఞాన నియంత్రణకు ముఖ్యమైన మెదడు ప్రాంతం)లో గ్లూటాథయోన్ స్థాయిని, అభిజ్ఞాన పనితీరును అంచనా వేశారు. దీని ప్రకారం చెక్కను నమిలిన గ్రూపులో గ్లూటాథయోన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. చూయింగ్ గమ్ నమిలిన గ్రూపులో పెద్దగా మార్పు కనిపించలేదు. ఇది ఒక రకంగా మెదడు కణాలకు రక్షక కవచంగా, మెరుగైన జ్ఞాపకశక్తి పనితీరుకు పనిచేస్తుందట.మొత్తంగా ఈ అధ్యయనం రెండు ప్రధాన ఫలితాలను ఇచ్చిందనీ మొదటిది కలప నమలడం సమూహం మెదడు గ్లూటాథియోన్ స్థాయిలు పెరగడం, రెండోది మెదడు పనితీరుతో మెరుగుపడటం జరిగిందన్నారు. మెదడు GSH స్థాయిలను పెంచడానికి ప్రస్తుతం మందులు లేదా నిర్దేశిత పద్ధతులేవీ లేనందున, గట్టి పదార్థాన్నినమలడం అనేది ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగ పడుతుందనిపరిశోధనలు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వృద్ధులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి, అభిజ్ఞా పనితీరును కాపాడుకోవడానికి బాగా నమలగలగడం చాలా ముఖ్యం. నిజానికి, దంతాల నష్టం అల్జీమర్స్ వ్యాధికి ఒక ప్రధాన ప్రమాద కారకం. బయోమెడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ ప్రకారం, నమలడం అనేది హిప్పోకాంపస్, ప్రిఫ్రంటల్ కార్టెక్స్తో సహా అభిజ్ఞా ప్రక్రియకు అవసరమైన అనేక మెదడు ప్రాంతాలను సక్రియం చేస్తుంది. నమలడం వల్ల మెదడు కార్యకలాపాలను, రక్తప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. మెదడుకు చక్కటి ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది. నోట్ : ఇది పరిమితంగా నిర్వహించిన పరిశోధన మాత్రమే అని గమనించగలరు. బలపాలు, సున్నం,బియ్య లాంటి వాటిని అసాధారణంగా తినడాన్ని అనారోగ్యానికి చిహ్నం. ఆహార పోషకాలు లోపాలు, ఒత్తిడి కారణంగా ఇలాంటి అలవాట్లు వస్తాయి. అలాగే చెక్కను నమలడం, లిగ్నోఫాగియా అని కూడా పిలుస్తారు. చెక్కను నమలడం వల్ల దంతాలు దెబ్బతింటాయి . ఇది బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఎక్కువ. పైగా కొన్నిమొక్కలు విషపూరితంగా కూడా ఉంటాయి. ఇదీ చదవండి: ‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య -
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్ భార్య
జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025 -
Sri Rama Navami టీటీడీ నిర్లక్ష్యం : అయ్యో... ఆంధ్రావాల్మీకి!
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రామదాసు.. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు వావికొలను సుబ్బారావు. అయితే వావికొలనును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామభక్తుడైన వావికొలను సుబ్బారావు సేవలపై కథనం. ఒంటిమిట్ట(రాజంపేట): భద్రాచలంలో రామయ్య గుడి కట్టించిన భక్తరామదాసు కీర్తి ప్రతిష్ణలు తెలంగాణా ప్రభుత్వం ఇనుమడింప చేసే విధంగా ముందుకెళుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక రామాలయం నిర్మాణానికి సూత్రధారి అయిన అపరరామదాసు, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావికొలను సుబ్బారావు గురించి పట్టించుకోవడం లేదు.టీటీడీ వావికొలను సుబ్బారావు కీర్తిప్రతిష్టలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎటు వంటి అడుగువేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుబ్బారావు బోటు(గుట్ట)ను టీటీడీ అభివృద్ధి చేయలేదు. ఇటీవల ఒంటిమిట్టకు వచ్చిన ప్రభుత్వ బృందం దృష్టికి వావికొలను అంశం వెళ్లినట్లు తెలిసింది. వావికొలను జీవితమిలా.. ఆంధ్రావాల్మీకి వావికొలను సుబ్బారావు జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు1, 1936లో మద్రాసులో పరమపదించారు. టెంకాయచిప్పను చేతిలో ధరించి.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేశారు. దీంతో ఒంటిమిట్ట రామయ్యకు నైవేద్యం కూడా పెట్టలేని స్థితికి ఆలయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఉద్ధరించడానికి వావికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. వచ్చిన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్పలో ఎంత డబ్బు పడినా.. ఏదీ ఉంచుకోలేదు. అంతా ఆలయ అభివృద్ధికే ఇచ్చారు. అలాగే రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్రవిజయం, దండకత్రయం, టెంకాయ చిప్పశతకం లాంటి ఎన్నో రచనలు కూడా వావికొలను చేశారు. వానప్రస్ధం 1920లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితునిగా పనిచేశారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కాని ఊరిలో కొందరు స్వార్ధపరులు కుళ్లు రాజకీయాలతో ఆయన్ను అవమానించారు. ఆలయంలోకి రానివ్వకుండా చేశారు.ఊరిలో నిలువలేని పరిస్ధితులును కల్పించారు. వావికొలను దుఖించి, ఆ ఊరిని వీడి. మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ, అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉన్నారు. ఈయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కొనసాగుతోంది. ఆంధ్రావాల్మీకిగా.. సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలను)108సార్లు పారాయణం చేయటం వల్ల ఆయనకు అందులోని నిగూఢ అర్థాలు స్ఫురించాయి. ఆయన రాసిన రామాయణాన్ని మహాసభమద్యలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.శృంగిశైలాన్ని అభివృద్ధి చేయాలి రామాలయం నిర్మాణంæ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన వావి కొలను సుబ్బారావుకు స్మారకమందిరం నిర్మించాలి. ఆయన నివసించిన శృంగిశైలం (సుబ్బారావుబోటు)ను అభివృద్ధి చేయాలి. – గానుగపెంట హనుమంతరావు, సాహితివేత్త, కడపవావికొలను సుబ్బారావును టీటీడీ మరవరాదు ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గురించి టీటీడీ మరవ రాదు. ఆయన నివాసం ఉన్న గుట్ట అభివృద్ధికి నోచుకోలేదు. ఆయన పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి –ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పోరేషన్, ఒంటిమిట్ట -
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో
పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్ డే రోజున డైమండ్ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్(ట్విటర్)లో షేర్ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం. -
జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది. -
రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్‌ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..) -
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్‌లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్‌తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్‌లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్‌తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్‌పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..) -
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్‌నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్‌నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్‌నగర్‌లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్‌వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్‌గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందట. ఇది లండన్‌తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్ స్టోరీ వైరల్!
గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పిన మలైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.కుమార్ సంగక్కరగా పాపులర్ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించు కున్నాడు. చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించిఅనూహ్యంగా క్రికెట్ కరియర్లోకి1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్‌లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్‌గా, శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్‌పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర 1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్కు చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ, తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు.(సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)ప్రేమకథ ఎలా మొదలైందంటేసంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్‌వుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్‌తో సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యెహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమపక్షులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్‌లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్రస్తుత సీజన్‌కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది. -
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్‌లాండ్, మయన్మార్లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు, వీల్చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..) -
'విల్ పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..!
మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైన పక్కకు వెళ్లిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్‌పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేశ్‌లో తన కంపెనీ ఉద్యోగి వీల్‌చైర్ తోపాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశారు. "చాలామంది దీనిని థ్రిల్ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్ అయిపోవాల్సింది. దానిముందు ఏ అడ్డంకి నిలువలేవు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో గౌతమ్ అదానీ. కాగా, గత నెల పిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమల కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని అన్నారు గౌతమ్ అదానీ. అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్కరం రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేగాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్ ప్లస్‌లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు, వారి కోసం పాటుపడేవారి కోసం ఏదైనా చేయొచ్చేగా అని ఒక ఎపిసోడ్లో సూచించారు కూడా. Most people do it for the thrill. Kay Mehta, our own Adanian, did it to make a statement. From the heights of Rishikesh, strapped in his wheelchair, Kay took a leap that told the world: no odds, no fear, can stop willpower. Kay, you don’t just inspire us - you redefine what it… pic.twitter.com/n1CTvFKtsQ— Gautam Adani (@gautam_adani) March 27, 2025 (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. -
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్. -
‘ఇనుములో ఓ మనిషే మొలిచెనే'..!
‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నట్లు ఇప్పుడు ఇనుములో ఓ మనిషే మెులిచాడు. అమెరికన్ కంపెనీ ‘క్లోన్ రోబోటిక్స్’ మనిషిని పోలిన శరీరంతో ‘ప్రోటోక్లోన్’ పేరుతో రోబోను రూపొందించింది. ఇతర రోబోల మాదిరి కాకుండా ఇది వెయ్యి కృత్రిమ కండరాలు, 206 ఎముకలు, చర్మం, కీళ్లు వంటి ఇతర భాగాలతో నిజమైన మానవుడిలా పనిచేసే శరీరంతో ఉంటుంది. ఇందులో అమర్చిన 500పైగా సెన్సర్ల సాయంతో ఈ రోబో శ్వాస తీసుకోటం, వదలడం, చెమటలు పట్టడం, వణకడం, భయపడటం, నవ్వడం, ఏడ్వటం ఇలా మరెన్నో భావాలను వ్యక్తపరచగలదు.(చదవండి: ఏకంగా ఆన్లైన్లో మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?) -
Round Egg: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..!
ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఈ విషయం వింటే..ఇది జోక్ ఏమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయమే అలాంటిది మరి.. అందులోనూ ఓ కోడి గుడ్డు వేలానికి వెళ్లడమే విడ్డూరం అనుకుంటే..ఇక ఆ వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందో వింటే నోరెళ్లబెడతారు. ప్చ్..! ఇదెలా అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించొద్దు..ఆలస్యం చేయకుండా అసలు కథేంటో చదివేయండి మరీ.. సాధారణంగా కోడిగుడ్డులు అండాకారం లేదా ఓవెల్ ఆకృతిలోనే ఉంటాయి. అందరికీ తెలిసింది. కానీ ఓ గుడ్డు మ్రాతం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా..!. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని సోమర్సెట్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్‌లో చోటు చేసుకుంది. ఆ ఫామ్‌లో ఎన్నోఏళ్లుగా పనిచేస్తున్నా అలిసన్ గ్రీన్ అనే మహిళ అలా గుండ్రంగా ఉన్న కోడిగుడ్డుని చూసి అవాక్కయ్యింది. ఆ విధంగా ఆ గుడ్డు వేలానికి వెళ్లింది. అయితే అది ఏకంగా రూ. 43000లకు అమ్ముడైంది. ఆ డబ్బుని అఘాయిత్యాలకు గురైన బాధిత మహిళల కోసం పాటుపడే స్వచ్ఛంద సంస్థ డెవాన్ రేప్ క్రైసిస్‌కు అందివ్వనున్నట్లు పేర్కొంది అల్లిసన్. ఈ మేరకు అల్లిసన్ మాట్లాడుతూ..మూడేళ్లుగా ఫెంటన్ ఫామ్‌లో పనిచేస్తున్నా..ఇప్పటి వరకు దాదాపు 42 మిలయన్ల గుడ్లను సేకరించా..కానీ ఇలాంటి గుండ్రని గుడ్డుని మాత్రం చూడలేదని అన్నారు. ఇది తనను ఎంతగానో ఆకర్షించిందని..అందువల్లే వేలంలో పెట్టి వచ్చిన డబ్బు దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని అనుకున్నట్లు పేర్కొంది. అందుకు తమ ఫామ్ యజమాని కూడా ఒప్పుకోవడంతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చింది అలిసన్.(చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయొద్దు..! కొంచెం చూసి తిందామా..) -
ఇది ఓయో కాదు.. దూరం ప్లీజ్ : క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్
ప్రేమికులు ప్రైవసీ కోసం పార్క్‌లు, సినిమా థియేటర్లను వెతుక్కుంటారు. కాసేపు అచ్చిక బుచ్చికలు, మాటా ముచ్చట కావాలంటే ఇదొక్కటే మార్గం. ఆశ్చర్యకరంగా ఇపుడు ఈ జాబితాలో ప్రైవేట్ క్యాబ్‌లు కూడా చేరాయి. అటు భార్యాభర్తలకు కూడా మనసు విప్పిమాట్లాడుకునేందుకు ఇదో బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది హద్దు మీరనంతవరకు ఏదైనా బాగానే ఉంటుంది కానీ మరికొంతమంది మితి మీరుతున్నారు. తాజాగా ఒక క్యాబ్ డ్రైవర్ పెట్టిన నోటు దీనికి ఉదాహరణగా ని లుస్తోంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్అవుతోంది. తన క్యాబ్‌లో ప్రేమికుల వ్యవహారాలతో విసిగిపోయాడో ఏమోగానీ బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన కారులో ఒక నోట్ పెట్టాడు. జంటలను నో రొమాన్స్.. దూరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి ఒకరికొకరు దూరం పాటించాలని హెచ్చరించారు. "హెచ్చరిక!! నో రొమాన్స్.. ఇది క్యాబ్, ప్రైవేట్ ప్లేసో, OYO కాదు.. సో దయచేసి దూరంగా, కామ్‌గా ఉండండి." అంటూ ఒక నోట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. ఆలోచన రేకెత్తించింది. డ్రైవర్ ముక్కుసూటి తనం తెగ నచ్చేసింది నెటిజనులకు. హ్హహ్హహ్హ.. పాపం ఇలాంటివి ఎన్ని చూసి ఉంటాడో అని ఒకరు, డ్రైవర్లను తలచుకుంటే జాలేస్తోంది. కొంతమంది జంటలు క్యాబ్‌లో గొడవలు పెట్టుకోవడం, కొట్టుకోవడం గురించి విన్నాను.. అని ఒకరు వ్యాఖ్యానించగా, కనీసం ఇంటికి లేదా హోటల్‌కు చేరుకునే వరకు వేచి ఉండండ్రా బాబూ మరొకరు వ్యాఖ్యానించారు. బెంగళూరులోని డ్రైవర్లు క్యాబ్‌లో ఏదైనా రొమాంటిక్ ప్లాన్లను పునరాలోచించుకునేలా చేసే విషయాలను చూశారు. ఇది పూర్తిగా భిన్నమైన పట్టణ జీవితం!" అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. భారతదేశ స్టార్టప్ రాజధాని బెంగళూరు నగరంలో మాత్రమే జరిగే ఇలాంటి ఉదంతాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఆన్లైన్ మీమ్‌లకు కేంద్రంగా ఉంటాయి. -
ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది!
ఐడియా ఉండాలే గానీ, వేస్ట్ నుంచి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకొంచెం క్రియేటివ్‌గా ఆలోచిస్తే ఎందుకూ పనికి రాదు అనుకున్న వాటి ద్వారా కోట్లకు పడగలెత్తవచ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే. ఇక అది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అయితే ఇక తిరుగే లేదు.జపాన్‌లోని ఒసాకాకు చెందిన 38 ఏళ్ల హయాటో కవమురా ఇదే నిరూపించాడు. ఆయన బుర్రలో తట్టిన ఒక ఐడియా ఆయన జీవితాన్నే మార్చేసింది. పాడుబడిన ఇళ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని రీమోడలింగ్ చేసి అందంగా తీర్చి దిద్దాడు. ఆ తరువాత వాటిని రెంట్‌కు ఇచ్చాడు. ఇలా ఎంత సంపాదించాడో తెలుసా? ఒకటీ రెండూ కాదు ఏకంగా ఎనిమిది కోట్లు సంపాదించాడు.‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపిన వివరాల ప్రకారం..హయతో కవాముర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి వివిధ ఆకారాల్లో నిర్మించిన ఇళ్లంటే మహా ఇష్టం. అంతేకాదు నగరంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లి పైనుంచి కింద ఉన్న వివిధ రకాలైన ఇళ్లను గమనిస్తుండేవాట. 200 పాతబడిన ఎవరూ పట్టించుకోని,శిథిలావస్థలో ఉన్న ఇళ్లు హయాటో కళ్ల బడ్డాయి. అంతే రంగంలోకి దిగాడు. వాటిని అందంగా మలిచి, వాటికి అద్దెకు ఇవ్వడం ద్వారా 8.2 కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు.చిన్నప్పటి రియల్ ఎస్టేట్ పట్ల మక్కువ ఉండేది. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు డబ్బు లేకపోయినా, తన స్నేహితురాలితో డేటింగ్లో భాగంగా సందర్శించే వాడు. చదువు తరువాత జాబ్‌లో చేరాడు. అయితే సీనియర్ మేనేజ్మెంట్తో వివాదం రావడంతో సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనే కోరిక పెరిగింది. ఉపాధి నుండి వైదొలగాలనే అతని కోరిక పెరిగింది. ప్రమోషన్లు సామర్థ్యంమీద ఆధారపడి ఉండవు, పై అధికారి మన్నలి ఇష్టపడుతున్నారా లేదా అనే దానిపై ఆధార పడి ఉంటుందని కవామురాకి అర్థమైంది రిస్క్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నాడు.రియల్ ఎస్టేట్ ఏజెంట్లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకునే కవామురా సామర్థ్యం కూడా అతని విజయంలో కీలక పాత్ర పోషించింది. అతని సంబంధాలు ఇతరుల కంటే ముందుగా విలువైన ఆస్తి సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సాయపడ్డాయి. 2018లో, అతను తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన సొంత రియల్ ఎస్టేట్ సంస్థ మెర్రీహోమ్ను స్థాపించి ఘన విజయం సాధించాడు. మారుమూల, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను బాగు చేసి అద్దెకు ఇవ్వగలిగాడు. 23 సంవత్సరాల వయసులో, వేలంలో 1.7 మిలియన్ యెన్ (10.1 లక్షలు) కు ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. అద్దె ద్వారా ఆదాయం. రూ. 2 లక్షలు. రెండేళ్ల తరువాత దీన్ని రూ. 25.6 లక్షలకు విక్రయించాడు. “రాత్రికి రాత్రే ధనవంతుడవుతానని అస్సలు ఊహించలేదు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు రావాలంటే అపెట్టుబడులకు దీర్ఘకాలికంగా ఉండాలి. దీనికి ఓపిక , జాగ్రత్తగా శ్రద్ధ అవసరం అంటాడు కవామురా. అతని దూరదృష్టి ప్రశంసలు దక్కించుకుంది. భవిష్యత్తులో గొప్ప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయంటూ మెచ్చుకున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట సందడి చేస్తోంది. -
World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
‘ఆ రోజుల్లో’ ‘మా రోజుల్లో’ అంటూ పిచ్చుకలను తలచుకుంటూ బాధపడితే ఏం లాభం? సొంత లాభం కొంత మానుకొని ‘నా ఇల్లు... నా పక్షులు’ అనుకుంటే పిచ్చుకలు పూర్వకళతో సందడి చేస్తాయి. పిచ్చుకలు కనిపించడం అరుదైన దృశ్యం కావడం హైదరాబాద్‌కు చెందిన భావన శ్రీనివాస్‌ను బాధించింది. ఆ బాధే పిచ్చుకల సంరక్షణను ఉద్యమ స్థాయిలో చేసేలా చేస్తోంది. సమాజంలో పర్యావరణం పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యం భావన శ్రీనివాస్‌ను ఆలోచనలో పడవేసింది. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనే ‘జాగృతి అభ్యుదయ సంఘం’కు బీజం వేసింది. ఈ సంస్థ పక్షుల సంరక్షణ, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలాంటి అంశాలపై పనిచేస్తుంది.ప్రతి ఇంటికి ఒక గూడుఇంటి చుట్టుపక్కల, తోటల్లో, రహదారుల పక్కన కనిపించే పిచ్చుకలు ఇప్పుడు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్లు కొట్టివేయడం, ఆధునిక నిర్మాణాల వల్ల వాటికి గూళ్లు లేకుండా పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని భావన శ్రీనివాస్ ‘పిచ్చుక గూళ్ల సంరక్షణ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఇంట్లో కనీసం ఒక మట్టిగూడు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మట్టి గూళ్లను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.విద్యార్థులే వెన్నెముకగా...గూళ్ల తయారీని గ్రామీణ మహిళలకు అప్పగించి వారికి ఉ పాధి కల్పిస్తున్నారు. వేసవికాలంలో పిచ్చుకలు దాహంతో బాధపడకుండా, ప్రతి ఇంటిముందు చిన్న నీటి తోగులు (నీటి గిన్నెలు) పెట్టేలా అవగాహన కలిగిస్తున్నారు. చెట్లు, బడులు, వృద్ధాశ్రమాలలో కూడా ఈ తోగులను ఏర్పాటు చేస్తున్నారు. పిచ్చుకల ప్రాముఖ్యతపై బడులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఒక ఇంట్లో ఒక గూడు’ అనే ఉద్యమాన్ని విద్యార్థుల సహకారంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వేలాది కుటుంబాలు పక్షుల సంరక్షణ ఉద్యమంలో భాగమయ్యాయి. చదవండి : Sunita William Gujarat Home: పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియోపిచ్చుకలు ఎందుకు కనిపించడం లేదో తెలుసా?నగరీకరణ: కొత్త కాంక్రీట్ భవనాల నిర్మాణం, చెట్ల కొట్టివేత వల్ల పిచ్చుకలకు గూళ్లు కట్టుకునే అవకాశం తగ్గిపోయింది.ప్లాస్టిక్ వినియోగం: మనం విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలలో పక్షులు చిక్కుకుని మరణించడం పెరిగిపోయింది.రసాయనాల ప్రభావం: వ్యవసాయ రంగంలో అధికంగా ఉపయోగించే రసాయనిక ఎరువుల వల్ల పురుగులతో పాటు చిన్నపాటి పక్షులు చనిపోతున్నాయి.నీటి కొరత: ప్రత్యేకించి వేసవిలో పిచ్చుకలకు తాగేందుకు నీరు దొరకక పోవడం వాటి మనుగడకు కష్టంగా మారింది.అవిగో పిచ్చుకలు! రకరకాల కారణాల వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతోంది. వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పక్షి విభాగం శాస్త్రవేత్త వాసుదేవరావుతో మాట్లాడాను. అట్టపెట్టెలతో చేసిన పిచ్చుక గూళ్లు ఇచ్చారు. మంచి మట్టితో తయారుచేసిన గూళ్లు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అనే ఆలోచనతో ఒక కుమ్మరి కళాకారుడికి నా కాన్సెప్ట్ చెప్పాను. అతను చేసి ఇచ్చాడు. సక్సెస్ అవుతామా లేదా తెలుసుకోడానికి ముందు మా ఇంట్లోనే పెట్టాము. సూపర్ సక్సెస్ అయ్యాం. ఇప్పుడు మా ఇంటి చుట్టూ వెయ్యి వరకు పిచ్చుకలు ఉన్నాయి. పిచ్చుకలను ఎవరు తీసుకెళ్లినా ఇతరులలో స్ఫూర్తి నింపడానికి ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపులో పెట్టండి అని చెబుతుంటాను. – భావన శ్రీనివాస్ – శిరీష చల్లపల్లి -
ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..!
పెర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్‌కి సాటిలేదు ఏదీ..!. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే.."ప్రేమ" గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్‌స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పెర్ఫ్యూమర్ జాక్వెస్ గెర్లైన్. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్‌గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్‌ని ఈ పెర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్‌కి షాజహాన్ లవ్‌స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్‌ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్‌ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్‌ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్‌తో ఈ పెర్ఫ్యూమ్‌నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్‌ని బాకరట్ క్రిస్టల్‌తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్ డెకరేషన్ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్‌గా రికార్డులకెక్కింది. (చదవండి: లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..! వైరల్‌గా ఐఐటీ స్టూడెంట్ పోస్ట్) -
Sai Divesh Chowdary : అమెరికాలో హైదరాబాద్ కుర్రాడికి రూ. 3 కోట్ల ప్యాకేజీ
హైదరాబాదీ కుర్రోడు బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియాలో భారీ వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండు కాదు ఏకంగా 3 కోట్ల రూపాయలం ప్యాకేజీతో ఉద్యోగాన్ని సంపాదించాడు. హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్ చిత్రా లేఅవుట్‌కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి (Gude Sai Divesh Chowdary) కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. చిప్‌మేకర్ ఎన్విడియాలో ఉద్యోగం సాధించిన సాయిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పట్టుదలకు, మారుపేరుగా నిలిచి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువు చదివిన సాయి దివేశ్ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. తల్లి రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్‌గా పదేళ్ల పాటు పనిచేశారు. చిన్నప్పటినుంచీ చదువులో అద్భుత ప్రతిభ కనబరిచేవాడు సాయి దివేశ్. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు.ఇంటర్లో అత్యుత్తమ స్కోర్ సాధించి, ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఈ సమయంలోనే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అయితే ఉన్నత చదువు చదవాలనే లక్ష్యంతో లాస్ఏంజెల్స్లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు. ఎన్విడియా కంపెనీలో డెవలప్మెంట్ ఇంజీనీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేవలం చదువు మాత్రమే కాదు క్రీడలు, పలు పోటీ పరీక్షల్లో ఎపుడూ ముందుండేడట. అత్యాధునిక టెక్నాలజీల్లో నైపుణ్యం పొందిన దివేశ్, ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. విశేషమైన ప్రతిభతో, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దివేశ్ సత్తా చాటుకోవాలంటూ నెటిజన్లు శుభాకాంక్షలందించారు.కాగా 2025లో టాప్ ఏఐ చిప్ తయారీ కంపెనీల్లో టాప్‌లో ఉందీ కంపెనీ 530.7 బిలియన్ల డాలర్ల మార్కెట్ క్యాప్తోప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించింది ఎన్విడియా. ఇది A100 ,H100 వంటి శక్తివంతమైన GPUలకు ప్రసిద్ధి చెందింది. ఏఐ సృష్టిస్తున్న విప్తవాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించింది. వివిధ అప్లికేషన్లలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడం , అమలు చేయడం కోసం వీటిని వినియోగిస్తారు. -
ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టు
ఏనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతికి నష్ట పరిరహారం చెల్లింపు విషయంలో నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. బాధిత మహిళకు రూ.5 కోట్ల తుది సెటిల్మెంట్ క్లెయిమ్‌ను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఇన్నేళ్లుగా బాధితురాలు నిధి, ఆమె కుటుంబం పడిన బాధను, ఏ విధంగానూ భర్తీ చేయలేం. అందుకే మానవతా దృక్పథంలో ఆలోచించి ఇక దీనికి ముగింపు పలకడం సముచితమని కోర్టు పేర్కొంది. అసలేంటి కేసు? వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో.2017, మే 28 నిధి రాజేష్ జెఠ్మలానీ (వయసు అప్పటికి 17) మెరైన్ ప్లాజా హోటల్ ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 12వ తరగతిలో అడ్మిషన్ కోసం కేసీ కాలేజీకి వెళుతుండగా, పశ్చిమ రైల్వేకు చెందిన కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిధి మెదడు తీవ్రంగా దెబ్బతింది. దాదాపు కోమా(vegetative state) లాంటి పరిస్థితిలో మంచానికే పరిమితమై పోయింది. ఈ కేసు ముంబైలోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఫిబ్రవరి 2021లో ఆమెకు రూ.69.92 లక్షలు వడ్డీతో పాటు రూ.1.5 కోట్ల కార్పస్‌ను మంజూరు చేసింది. వడ్డీని ఆమె భవిష్యత్తు వైద్య , ఇతర ఖర్చులకు ఉపయోగించాలి తీర్పుచెప్పింది. అయితే దీనిపై రైల్వే శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో2022లో పశ్చిమ రైల్వే కోర్టులో డిపాజిట్ చేసిన రూ. 1.15 కోట్లను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు తండ్రికి అనుమతి ఇచ్చింది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద బాదిత ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిధి జెఠ్మలానీకి రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు రైల్వే మంత్రిని కోరింది. ఆమె పరిస్థితి తీవ్రత దృష్ట్యా కోర్టు దీనిని 'చాలా అరుదైన' కేసుగా పేర్కొంది. తాజాగా రూ. 5 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని హైకోర్టు భావిస్తోంది. మార్చి6న దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ, న్యాయమూర్తులు గిరీష్ కులకర్ణి , అద్వైత్ సేథ్నా మాట్లాడుతూ, "ఈ ప్రభావం చాలా భయంకరమైనది. సంతోషంగా, ఎన్నో ఆశలతో ఉన్న అమ్మాయి ఫోటోలు, ప్రస్తుత స్థితి ఎవరికైనా చాలా దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. ఇక తల్లిదండ్రులు/కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏమిటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిధి బాధ, తల్లిదండ్రుల కష్టాలను డబ్బు తీర్చలేదు. నిజానికి వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటే, ఇది ఖచ్చితంగా సరిపోదు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు నిధి పరిస్థితిని దివంగత అరుణ షాన్‌బాగ్ పరిస్థితితో పోల్చారు. చదవండి: మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్బాధితురాలు మాత్రమే కాకుండా ఆమె కుటుంబం మొత్తం అనుభవించిన బాధ ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఈ విషయంలో ప్రతివాది (WR) సంబంధిత అధికారులు మంత్రిత్వ శాఖ (రైల్వే మంత్రి) అత్యున్నత స్థాయిలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు అభ్యర్థించారు. తదుపరి విచారణను మార్చి 20కి వాయిదా వేశారు. మరోవైపు నిధి తండ్రి గతంలో చెల్లించిన మొత్తాలను మినహాయించి రూ. 5 కోట్లకు సెటిల్మెంట్ చేసుకునేందుకు అంగీకారం తెలిపారు.చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
బినితా చెట్రీ.. వయసు ఎనిమిదేళ్లు. కాని ఇవాళ దేశమంతా పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ షో (Britain's Got Talent). ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల టాలెంట్‌ను ఆహ్వానించి గుర్తింపునిచ్చే ఈ షోలో పాల్గొనాలని ఎందరికో కల. అలాంటి షోలో బినితా తన డ్యాన్స్‌తో అందర్నీ స్టన్ చేసింది. చురుకైన స్టెప్స్‌తో, చిరుతలాంటి మెరుపుతో బినితా చేసిన డ్యాన్స్, హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.బినితా (Binita Chhetry) స్వస్థలం ఈశాన్య రాష్ట్రమైన అస్సామ్. షోలోకి అడుగుపెట్టిన వెంటనే బినితా తనను తాను పరిచయం చేసుకుంటూ ‘నేను భారతదేశం నుంచి వచ్చాను. బ్రిటన్స్ గాట్ టాలెంట్ నా కలల వేదిక’ అని చెప్పింది. ఇక్కడ గెలవడం తన లక్ష్యం అని, తాను పింక్ ప్రిన్సెస్ హౌస్ (pink princess house) కొనాలని అనుకుంటున్నానని చెప్పి అందరి మనసుల్నీ కొల్లగొట్టింది. తన ముద్దు మాటలతో జడ్జీలను సమ్మోహనపరిచింది. అనంతరం ఆ స్టేజీ మీద చేసిన డ్యాన్స్ చూసి ప్రేక్షకులంతా తన్మయంతో చప్పట్లు కొట్టారు.ఇంత చిన్నవయసులో శివంగిలా చేస్తున్న డ్యాన్స్ చూసి జడ్జీలు, ప్రేక్షకులందరూ లేచి మరీ తనకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో వైరల్ (Video Viral)గా మారి, తన గురించి దేశమంతా చెప్పుకునేలా చేసింది. నిరంతర సాధన, పట్టుదల, అనుకున్నది సాధించేదాకా ఆగిపోని దీక్షే తన విజయ రహస్యం అంటోంది బినిత. తన వయసులోని ఎంతో మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రశంసల వర్షంతన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్న బినితా చెట్రీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు మంత్రులు బినితాను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బినితా చెట్రీ అనుకున్నది సాధించాలని వారంతా ఆకాంక్షించారు.From Assam to UK: Assam's talent shines at Britain's Got Talent Little Binita Chhetry makes the judges of @BGT go all 'Awww' as she presents a powerful performance and moves to the next round.My best wishes to the little one and hope she is able to buy a pink princess house… pic.twitter.com/G6xk5MEy3M— Himanta Biswa Sarma (@himantabiswa) March 2, 2025 ఎవరీ బినితా చెట్రీ?అస్సాంలోని బోకాజన్లోని అమరాజన్ ప్రాంతానికి చెందిన బినితా చెట్రీ.. రాజస్థాన్‌లోని జైపూర్‌లో చదువుతోంది. బ్రిటన్స్ గాట్ టాలెంట్ షో కంటే ముందు ఆమె డాన్సీ ఐకాన్ 2 వైల్డ్ఫైర్లోనూ పాల్గొంది. 2024, ఆగస్టులో ఆల్-స్టైల్ డ్యాన్స్ కాంపిటీషన్ (సోలో)లో బినిత మొదటి రన్నరప్‌గానూ నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బినితకు లక్షకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్స్ వీడియోలకు ఫుల్ క్రేజ్ ఉంది.చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే! -
స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..
ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అందరూ మరిచిపోతున్న వాటిని గుర్తుచేశాడు ఈ స్టూడెంట్ అంటూ అందరూ అభినందించారు. అతడు చెబుతున్నంత సేపు అంతా ఉత్కంఠగా చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మరీ ఇంతకీ ఈ ఆ విద్యార్థి దేనిపై ప్రసంగించాడంటే..పాఠశాల వార్షిక కార్యక్రమంలో ఓ నేపాలీ విద్యార్థి ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అభిస్కర్ రౌత్ అనే విద్యార్థి పాఠశాల 24వ వార్షిక కార్యక్రమంలో ప్రసంగిస్తూ..హిమాలయ దేశం నేపాలలోని రాజకీయ, ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తూ చక్కటి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ప్రసంగంలో అతడు.."ఈ రోజు, నేను కొత్త నేపాల్‌ను నిర్మించాలనే ఆశయంతో ఉన్నాను. ఆశ, ఆకాంక్షల జ్వాల నాలో భగభగమంటోంది. కానీ ఈ కల జారిపోతున్నందున నా హృదయంతో బాధతో బరువెక్కింది. మనలో అలుముకుంటున్న అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి వెలుగుని నింపేందుకే ఇక్కడ నించున్నా. స్మారక మార్పుతో చరిత్ర గమనాన్ని అమరత్వం చేసేందుకే తానిలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా.. మన గడ్డ అయినా నేపాల్ మాత(దేశానికి)కి పౌరులుగా న్యాయంగా ఇవ్వాల్సినది తిరిగి ఇస్తున్నారా. మనకు జన్మనిచ్చిన ఈనేపాల్ దేశం మన తల్లి. మనల్ని పోషిస్తున్న ఈ దేశం రుణం తీర్చుకుంటున్నామా..? అనే ప్రశ్నను లెవనెత్తాడు. మనం ఆ మాతకు ఇవ్వాల్సింది కేవలం కృషి, సహకారం, నిజాయితీలే. కానీ మనం ఏం చేస్తున్నాం. నిరుద్యోగంతో అలమటిస్తున్నాం.. రాజకీయ పార్టీల స్వార్థపూరిత ఆటలో చిక్కుకుంటున్నాం. అవినీతి మన భవిష్యత్తు వెలుగులను ఆర్పేసేలా వల అల్లింది అంటూ భావోద్వేగంగా మాట్లాడాడు అభిస్కర్ రౌత్. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆస్టూడెంట్ ధైర్యాన్ని అత్మవిశ్వాసాన్ని ప్రశంసించగా. మరికొందరూ..ఇది వార్షికోత్సవం ఇవేందకంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఏదీ ఏమైన ఓ స్టూడెంట్ దేశ పౌరుడుగా తన చుట్టు ఉన్న పరిస్థితులు మనపై ఎలా ప్రభావితం చేస్తాయనేది గమనించాల్సిన బాధ్యత ఉందనే విషయం తన ప్రసంగంతో గుర్తుచేశాడు. కాగా,హిందూ రాచరికం తిరిగి రావాలని సాధారణ నేపాల్ పౌరులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ విద్యార్థి ప్రసంగం అందరనీ ఆలోచింప చేసేలా ఉండటం విశేషం. ప్రస్తుతం అక్కడ రాజకీయ అస్థిరత, అవినీతి, జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. Speech by this Nepali student is killing internet today pic.twitter.com/huGGFqmjdy— Ra_Bies 3.0 (@Ra_Bies) March 14, 2025 (చదవండి: ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..) -
వెరైటీ పండుగ: ‘లాస్ ఫల్లాస్' బొమ్మలను తయారు చేసి మరీ..!
ప్రపంచ బొమ్మల ప్రియులకు ‘లాస్ ఫల్లాస్’ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది స్పెయిన్ లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగలో ప్రధానంగా భారీ కార్టూన్లాంటి బొమ్మలను తయారు చేసి, వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడివారు ‘ఫల్లాస్’ అని పిలుస్తారు. పండుగ చివరిరోజున ఈ బొమ్మలను తగలబెడతారు.ఫల్లాస్ల తయారీనే ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెరోఫోమ్ వంటి మండే పదార్థాలతో, స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి, వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే ఐదురోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కనుల విందుగా బాణసంచా కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని ‘లా క్రెమా’ అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి, తర్వాత పిల్లల బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనమైందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, వీథుల్లో పలు బృందాల కవాతులు.. అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. (చదవండి: ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..! శాస్త్రవేత్తలకే అంతుపట్టని మిస్టరీ అది..) -
ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..!
గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే ‘గేట్ టు హెల్’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది. (చదవండి: ∙ -
Success Story రూ.90 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి కోట్ల ఆదాయం
జీవితంలోపైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ తన చుట్టూ ఉండేవారి బాధలు, అనారోగ్యాలను చూసి చలించిపోయి వ్యాపారం ప్రారంభించే వారు చాలా తక్కువ. అదీ అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరీ ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ (Mohit Nijhawan) అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం అంత ఈజీకాదు. ఇందుకు పూర్తి విశ్వాసం, కృషి పట్టుదల ఉండాలి. చండీగఢ్‌కు చెందిన మోహిత్ నిజవాన్ బయో కెమిస్ట్రీలో పీజీ చేశాడు. ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. రూ.90 లక్షల వేతనం. అయితే తన బంధువుల్లో చాలా కేన్సర్ బారిన పడటం, వారిలో చాలా మందికి వైద్య ఖర్చులుగా భారీగా ఉండటం, ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు. ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతుండటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు తన కళ్ల ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఈ కేన్సర్ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి , డైటరీఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని గుర్తించాడు. అంతే సంచలన నిర్ణయంతీసుకున్నాడు. 2020లో ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రోగ్రీన్స్ (microgreens) పెంచాలని నిర్ణయించుకున్నాడు.తన స్నేహితుడితో కలిసి 21వ శతాబ్దపు వెజ్జీ స్టార్టప్‌గా చెప్పుకునే మైక్రోగ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవి చూశాడు. మరోవైపు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని కూడాఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మోహిత్ పట్టువీడలేదు. View this post on Instagram A post shared by GREENU: LIVE MicroGreens - A product by Embryonic Greens (@greenu_microgreens) మోహిత్ 2022 సంవత్సరంలో రూ. 30 వేల పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. 500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోకలీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చండీగఢ్‌కు చెందిన ఒక ఆంకాలజిస్ట్‌కు విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్ తినిడం వల్ల కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్‌కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు. గ్రీను బ్రాండ్ పేరుతో మైక్రోగ్రీన్లను విక్రయిస్తోంది. బీట్రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, రెస్టారెంట్లు, జిమ్‌లు, కేఫ్‌లు ఈ కంపెనీ కస్టమర్లలో భాగం.చదవండి: చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలుఔత్సాహికులకు శిక్షణమోహిత్ మైక్రోగ్రీన్లను అమ్మడమే కాకుండా, వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా నెలకు రూ.12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు, అంటే ఏటా దాదాపు రూ.1.44 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ.5 లక్షలు. అలాగే ప్రతీ ఏటా రూ.60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు.ఇదీ చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?విత్తనాలను మట్టి లేకుండా, కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత (7 -10 రోజులలోపు), చిన్న చిన్న మొలకలుగా ఉన్నపుడే సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు. వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40 శాతం ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, కేన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి, పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. -
చాక్లెట్లు అంటే పిచ్చి : కట్ చేస్తే.. ఏడాదికి కోటి రూపాయలు
సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ కొండమీది కోతినైనాకిందికి దింపవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడుకావచ్చు. ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారితీసింది. స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్ సక్సెస్ గురించి తెలుసుకుందాం.కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్డౌన్ అయింది. చాలా మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లిగవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు, కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తరువాత బిజినెస్‌గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో ‘సారామ్’ అనే బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. కట్ చేస్తే దిగ్విజయ్ బిజినెస్ కోటి రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా చాక్లెట్లను విక్రయిస్తోంది. సారామ్లో కుల్ఫీలు, కుకీలు కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాడు.ఉదయ్‌పూర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూవిభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్‌లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ విజయానికి బాటలు వేసింది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్‌ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచనను తన సోదరుడు మహవీర్ సింగ్‌తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు గానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్‌ను ఆశ్రయించాడు. పలు సార్లు విఫలమైన తర్వాత పట్టుసాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్లు తమ కస్టమర్లకు ప్రతి కార్ సేల్‌లో ఒకే చాక్లెట్ బాక్స్‌ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి హోటల్ యజమానులు, కార్ షోరూమ్‌లను సంప్రదించాడు.తొలి ఆర్డర్అలా 2021లో దిగ్విజయ్ ఒక కార్ షోరూమ్ నుంచి వెయ్యి రూపాయల చాక్లెట్ల మొదటి ఆర్డర్‌ను అందుకున్నాడు. ఇక అంతే అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. సారామ్ ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్‌గా మారిపోయింది. 2023 నాటికి, సారామ్ రెండు టన్నులకు పైగా చాక్లెట్‌ను విక్రయించింది. ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు. కేరళ ,తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్ ఐస్ ఆపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు."నాకు చాక్లెట్టు అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పాడు. క్లాసెస్ ఆన్లైన్లో ఉండటంతో చాలా సమయం దొరికింది. వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే YouTube ట్యుటోరియల్ ద్వారానే ఇది సాధించాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు. -
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్‌జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్‌తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్‌జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా విమానంలో స్పైస్‌జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్‌జెట్‌లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
పాతికేళ్ల బంధం, ఒక్కసారి లే నేస్తమా : వైరల్ వీడియో
మనుషులైనా, జంతువులైనా మనసుంటుంది. అనుబంధాలు, అప్యాయతలు ఉంటాయి. అపురూపమైన ఆ అనుబంధం (Friendship) తెగిపోతే.. కలకాలం తోడునీడగా ఉన్న ఆత్మీయ నేస్తం.. అందనంత దూరం వెళ్లిపోతే.. మనుషులైతే గుండె పగిలేలా రోదిస్తారు. మరి మూగజీవి ఏం చేస్తుంది. మూగగానే రోదిస్తుంది. ఈ మాటలకు అక్షర సత్యం అనేలా ఒక వీడియో నెట్టింట పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది. అసలేంటీ కథ.. తెలుసుకుందాం..పాతికేళ్ల బంధాన్ని వీడిన శాశ్వతంగా కన్నుమూసిన తన భాగస్వామిని ఒక ఏనుగు (elephant) చలించి పోయింది. ఎలాగైనా దాన్ని తట్టి లేపాలని ప్రయత్నించింది. తొండంతో గుండెలకు హత్తుకోవాలని తపించిపోయింది. కానీ తనవన్నీ వృధా ప్రయత్నాలనీ, ఇకలాభం లేదని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ సమయంలో పశువైద్యులను దగ్గరకు రానీయలేదు.బాజా వార్తా సంస్థ అందించిన వివరాల ప్రకారం జెన్నీ, మాగ్డా అనే ఏనుగులు రష్యాలోని ఓ సర్కస్ కంపెనీలో ఉండేవి. 25 సంవత్సరాలకు ఇవి రెండూ పార్టనర్స్‌గా ఉండేవి. వివిధ ఫీట్లు చేస్తూ జనాలను అలరించేవి. వయసుమీద పడటంతో సర్కస్ వర్క్‌నుంచి విముక్తి లభించింది. ఈ వారం జెన్నీ కన్నుమూసింది. దీంతో తన నేస్తం అలా నిర్జీవంగా పడి ఉండటం మాగ్డా తట్టుకోలేకపోయింది. దాన్ని లేపేందుకు విశ్వప్రయత్నం చేసింది. గంటల తరబడి దాని చుట్టూ తిరిగింది. కన్నీరు పెట్టుకుంది. ఆఖరికి వెటర్నరీ వైద్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. చివరికి జెన్నీకి కన్నీటి వీడ్కోలు(Mourns) పలికింది. ఇది చూసి సర్కస్ సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. వారు దృశ్యాలను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు హృదయాలను తాకింది. ఏనుగు దుఃఖం చూసి నెటిజన్లు కూడా విషాదం వ్యక్తం చేస్తున్నారు.😢💔 An elephant mourns her deceased friendIn occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp— Based & Viral (@ViralBased) March 14, 2025 -
ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!
#Continuum: జిమ్‌లో చేరాలంటే నెలకు ఎంత కడతాం? మిగిలిన చోట్ల ఎంత ఉన్నా, న్యూయార్క్ (NewYork) లోని గ్రీన్విచ్కి దగ్గరలోని ఒక గ్రామంలో కొంటినూమ్ (Continuum )అనే వెల్నెస్ సోషల్ క్లబ్లో జిమ్ చేయాలంటే అక్షరాలా 8000 పౌండ్లు కట్టాలి. గత ఏడాది ఏప్రిల్‌లో ఆరంభం అయిన ఈ జిమ్‌లో లగ్జరీ లాంజ్ ఉంది. సభ్యులకు ఫిట్నెస్ పెంచుకోవడం కోసం టాప్‌క్లాస్ జిమ్ తరగతులు జరుగుతుంటాయి. 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ వెల్నెస్ సెంటర్ 250 మంది సభ్యులకు మాత్రమే పరిమితం. చిత్రం ఏమిటంటే, కళ్లు తిరిగేటంత సభ్యత్వ రుసుము కండలు పిండి మరీ వసూలు చేస్తున్నా కూడా ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారి జాబితా చాలానే ఉందట. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఇక్కడ చేరి శారీరక దృఢత్వాన్ని పెంచుకుంటున్న వారందరికోసం ఇంటి దగ్గర ఉండి మరీ కసరత్తులు చేసేందుకు ఆన్లైన్లో ప్రత్యేకమైన హోమ్ వర్క్ (వర్కవుట్లు చేయిస్తారట) కూడా ఇస్తారట. డబ్బు కట్టగానే ఇక్కడ సభ్యులకు పూర్తి వివరాలతో కూడిన ‘ఆన్‌బోర్డింగ్ అసెస్మెంట్’ ఉంటుంది. శరీరంలోని ప్రతి పార్ట్నూ స్కాన్ చేసి, ఉండవలసిన దానికన్నా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే పరీక్షించి, వాటిని బ్యాలన్స్ చేసుకునేందుకు తగిన స్పెషల్ వర్కవుట్లు చేయిస్తారు. అంతేకాదు, శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, నిద్ర నాణ్యత ఎలా ఉంది... వంటి పరీక్షలన్నీ చేసి అందుకు తగ్గట్టు జిమ్ చేయిస్తారట. ఏమైనా.. పిండికొద్దీ రొట్టె అన్నట్టు మనం చెల్లించిన డబ్బుకు తగ్గట్టు వర్కవుట్లు చేయించి మన ఫిట్నెస్ను పరిరక్షిస్తారన్నమాట! -
చేప కొరికితే అంతలానా..! పాపం అతడికి ఏకంగా..
కుక్క లేదా ఇతర జంతువులు కొరికితే వెంటనే భయపడతాం, ఇంజెక్షన్లు చేయించుకుంటారు. అదే చేప, పీత లాంటివి అనగానే కొందరూ లైట్ తీసుకుంటారు. ఎందుకంటే అవి విషపూరితం కాదనే ఫీలింగ్. అలానే ఈ వ్యక్తి కూడా చేపే కదే అని చాలా లైట్ తీసుకున్నాడు. చివరికి అది అతడి ఊహించిన బాధనే మిగిల్చింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదని వాపోతున్నాడు. ఇంతకీ అతడికి ఏం జరిగిందంటే..కేరళలోని కన్నూర్ జిల్లాలోని థలస్సెరీ ప్రాంతానికి చెందిన టి.రాజేష్ అనే రైతు తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న నీటిగుంటని క్లీన్ చేశాడు. సరిగ్గా ఆ సమయంలో కడు అనే జాతికి చెందిన చేప(క్యాట్ ఫిష్ జాతికి చెందింది) అతడి వేలిని కొరికింది. దాంతో అతడు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. నయం అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాడు. అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. కానీ రానురాను భాధ ఎక్కవై చెయ్యి కదిలించాలంటేనే నొప్పితో విలవిల్లాడిపోయే పరిస్థితికి దిగజారిపోయింది. ఇక ఆ బాధకు తాళ్లలేక దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు అతడికి ఎందువల్ల ఇలాంటి పరిస్థి వచ్చిందన్నది అంచనా వేయలేకపోయారు. దాంతో ఆ వైద్యులు కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బేబీ మెమోరియల్ వైద్యులు రాజేష్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. చేతి వేళ్లను తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి.. మరింత ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చేతివేళ్లను తొలగించారు వైద్యులు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ఇన్ఫెక్షన్ అరచేయి అంతా వ్యాపించేసింది. దీంతో వైద్యులు పూర్తిగా ఆ అరచేతి మొత్తాన్ని తొలగించారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..బురద నీటిలో నివశించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా బాడీలోకి ప్రవేశించి కణాలపై దాడి చేసి..ఇన్ఫెక్షన్ని మెదడు వరకు వ్యాప్తి చేసి ప్రాణాంతకంగా మారుస్తుంది. ఇక్కడ ఈ రైతు రాజేష్ కేసులో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడటానికి అరచేతిని తొలగించడం తప్పమరో అవకాశం లేదు. బురదలో ఉండే ఆ చేప కారణంగానే ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించిందని చెప్పుకొచ్చారు వైద్యులు. (చదవండి: ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా ప్రమాదమే..! హెచ్చరిస్తున్న న్యూట్రిషన్లు) -
వారెవ్వా..! ఏం సందేశం ఇది..!
కొన్ని అడ్వైర్టైస్మెంట్లు ఆలోచనాత్మకంగానూ, సందేశాత్మకంగానూ ఉంటాయి. మరికొన్ని విదాస్పదంగా కూడా ఉంటాయి. అందుకే మీడియాలోనూ, ఇలాంటి మార్కెటింగ్ అడ్వర్టైస్మెంట్లలో ఏమరపాటు పనికిరాదని అంటారు నిపుణులు. ఇప్పుడిదంతా ఎందుకంటే నెట్టింట తెగ వైరల్ అవుతున్నఈ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్ చూస్తే ఏం ఉందబ్బా అని అనుకుండా ఉండలేరు. ఒక్కసారిగా భాషా అతర్యం పెద్ద సమస్యకాదని చిటికెలో తీసిపారేసింది. నెటిజన్ల మనసు దోచుకున్న ఆ డైరీ మిల్క్ అడ్వర్టైస్మెంట్లో ఏముందంటే..డైరీ మిల్క్ కొత్త అడ్వర్టైస్మెంట్లో ఉత్తర దక్షిణ భారతదేశ భాషల ఆంతర్యంపై ఆలోచనాత్మక సందేశాన్ని అందించింది. ఒక ఇంటిపై హిందీ మాట్లాడే మహిళల గుంపు కూర్చొని ఉంటుంది. వారి మధ్యలోని చెన్నైకి చెందిన పోరుగింటామె కూడా వారి సంభాషణలో చేరుతుంది. అయితే ఆమెకు హిందీ రాక ఇబ్బందిపడుతుంది. అక్కడ తన ఉనికే ప్రశ్నార్థకంగా ఉంటుంది. దాంతో ఆమె మిగతా మహిళలు సంభాషణను వింటూ మౌనంగా ఉండిపోతుంది. అయితే మరో మహిళ కల్పించకుని మాట్లాడమని సైగ చేస్తుంది. తనకు హిందీ కొంచెం కొంచెమే వచ్చు అని చెబుతుంది. దాంతో అవతల మహిళ వచ్చిరాని ఇంగ్లీష్‌లో జరిగింది వివరిస్తుంది. ఆ తర్వాత తనకు కూడా ఇంగ్లీష్ కొంచెం కొంచెమే వచ్చు అనేసి..డైరీ మిల్క్ ఇస్తుంది. అయినా మనుషులతో కలవాలని ఉంటే చాలు ..భాషతో సమస్య ఏం ఉందని నవ్వేస్తుంది. ఆ తర్వాత ఇరువురు ఆ డైరీ మిల్స్‌ని షేర్ చేసుకుని ఆస్వాదించడంతో ఆ యాడ్ ముగిసిపోతుంది. ఇక్కడ ఇందులో మన భాషలు వేరైతేనేం ఈ తియ్యటి చాక్లెట్‌తో కనెక్ట్ అవుదాం అన్నట్లుగా ఉంది. అందరం ఏదో ఒక సమయంలో లేదా ఏదో ఒక టైంలో ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉంటాం కదా. నెట్టింట వైరల్అవుతున్న ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకోవడమే గాక..ఎంత అందంగా భాషభేధం పెద్ద సమస్య కాదని చెప్పిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. (చదవండి: కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లినా.. నొప్పి తెలియదట ఆమెకు..! వైద్యనిపుణులకే అంతుపట్టని కేసు.) -
ఇరాన్ బీచ్‌లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్‌తో ఎరుపు పెయింట్‌ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ఆ చెఫ్ హస్తకళ అదుర్స్..! ఆహా బంగాళదుంపతో ఇలా కూడా..
పాకశాస్త్ర నిపుణులు చేతులు అద్భుతమైన వంటలే కాదు..హస్తకళకు పెట్టింది పేరు అనొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్లలో చెఫ్‌లు కేవలం వండటానికే పరిమితం కారు. వండిన ఐటెమ్స్‌ని అందంగా ప్లేటులో పెట్టడం కూడా ఓ కళ. అది ఉంటేనే మంచి చెఫ్‌గా పేరు తెచ్చుకోగలరు, ఆ రంగంలో రాణించగలరు. అయితే ఇదంతా ఎందుకంటే.?..చెఫ్‌లు కూరగాయలతో భలేగా అందమైన ఆకృతులు మలిచి మరీ ఫుడ్‌ని సర్వ్ చేస్తారని తెలిసిందే. ఆ కళా నైపుణ్యంతోనే ఈ చెఫ్ ఏకంగా జ్యువెలరీనే డిజైన్ చేశాడు. దేనితోనో తెలుసా..?..అందరూ ఇష్టంగా తినే ఆలుతో ఈ ఫ్రెంచ్ చెఫ్ బ్రాస్లెట్ మాదిరి ఆకృతిని తయారు చేశాడు. చక్కగా టీ తాగేటప్పుడు చిప్స్‌లా తినే ఆలుతో చక్కగా ధరించే ఆభరణాన్ని డిజైన్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ చెఫ్ ఆ బంగాళ దుంపను చెక్కి..చక్కగా దీర్ఘచతురస్రాకార ఆకృతులను చేశాడు. ఆ తర్వాత వాటిని లింక్ చైన్ మాదిరిగా రూపొందించాడు. అది ఆశాంత చూసేంత వరకు జ్యువెలరీ అని తెలియదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ చెఫ్ హస్తకళా నైపుణ్యానికి ఫిదా అవుతూ..ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరీ.. View this post on Instagram A post shared by LEROY. SAITO. LE SQUER. (@lsltoronto) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..) -
మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..!
చరిత్రలో చాలావరకు మగవాళ్లు కట్టిన అద్భుత స్మారక కట్టడాల గురించే కథలు కథలుగా చదివాం. అలాంటి అద్భుత కళా నైపుణ్య కట్టడాలకు మహిళలు కూడా అంకురార్పణ చేశారనే విషయం తెలుసా..!. ఆ మహిళలు తమ ప్రేమ, భక్తి, ఆశయాలకు చిహ్నంగా వాటిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవికూడా యూనెస్కో గుర్తింపుని దక్కించుకున్నాయి. ఆ అద్భుత స్మారక చిహ్నలు ఎక్కడున్నాయి..? వాటిని నిర్మించిన ఆ శక్తిమంతమైన నారీమణులు ఎవరు..?కట్టడ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఆ మహిళల చొరవను బట్టి స్త్రీలు ఆనాడే తమ వ్యక్తిత్వం, భావాలను, గుర్తింపు వ్యక్తపరిచారని సుస్పష్టంగా తెలుస్తోంది. వారంతా ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్‌ని నిర్మించిన షాజహాన్ వలే తన భర్తలపై ఉన్నప్రేమ, అభిలాష, వారి విజయాల గుర్తుగా ఈ అద్భుత స్మారక కట్టడాలను నిర్మించారు. వాటి నిర్మాణ తీరు, శిల్పకళా సంపద, మలిచిన విధానం ఆ మహిళ సృజనాత్మకతకు, అభిరుచికి ప్రతిబింబంగా ఉన్నాయి. తొలి గార్డెన్ సమాధి(హుమయూన్ సమాధి, ఢిల్లీ)..ఇది 16వ శతాబ్దపు అద్భుతమైన కట్టడం. మొఘల్ సామ్రాజ్ఞి బేగా బేగం తన భర్త మొఘల్ చక్రవర్తి హుమయూన్ జ్ఞాపకార్థం నిర్మించింది. పెర్షియన్ వాస్తు శిల్పులు దీన్ని అద్భుతంగా నిర్మించారు. భారతదేశంలోని తొలి గార్డెన్ సమాధి. మొఘల్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన కట్టడం ఇది. చుట్టూ ఒక మాదారిగా కనిపించేలా పాలరాతితో నిర్మించారు. పచ్చని తోటల మధ్య కొలువుదీరిని అద్భుత కట్టడంలా పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఈ స్మారక చిహ్నం యునెస్కో గుర్తింపును కూడా పొందింది. రాణి కి వావ్, గుజరాత్పాట్న రాణి కి వావ్ 11వ శతాబ్దంలో భర్త రాజు భీమా జ్ఞాపకార్థం నిర్మించింది. హిందూ దేవతలు, పౌరాణిక వ్యక్తులు, ఖగోళానికి సంబంధించిన అద్భుతాలు తదితరాలను వర్ణించేలా శిల్పాల గ్యాలరీ ఉంటుంది. ఇది సెవెన్ స్టెప్‌వెల్ ఆర్కిటెక్చర్. అంటే ఇది ఏడు మెట్ట నుయ్యి మాదిరిగా ఉంటుంది. ఒక్కో మెట్టు దిగుతూ ఉంటే శిల్పాల గ్యాలరీ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒకరకంగా ఇది నీటి పరిరక్షణ కోసం ఆనాడే అద్భతంగా తీర్చిదిద్ధిన నుయ్యిలా ఉంటుంది.విరూపాక్ష ఆలయం, కర్ణాటకభారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ విరుపాక్ష ఆలయం. దీన్ని ఏడవ శతాబ్దంలో లోకమహదేవి రాణి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ దేవాలయ అభివృద్ధికి ఆమె ఎంతగానో తోడ్పాటును అందించింది. లోకమహదేవి ఈ ఆలయాన్ని తన భర్త రాజు విక్రమాదిత్య II శత్రురాజులపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించింది. ఇక్కడ హంపీ శిల్పాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయం ముందు నిర్మించిన గ్రాండ్ గోపురం, వివరణాత్మక శిల్పాలు, క్లిష్టమైన స్థంభాల నిర్మాణం చూపురులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయంలోని ఆచారాలు, అక్కడే నివాసం ఉండే ఏనుగుల సందడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇతిమాడ్-ఉద్-దౌలా, ఆగ్రామొఘల్ రాణి ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ఎదురుగా ఇతిమాద్-ఉద్-దౌలా కట్టడం ఆభరణంలా ఉంటుంది. దీన్ని మొఘల్‌ని దశాబ్దం పైగా పాలించిన శక్తిమంతమైన మహారాణి నూర్ జహాన్ నిర్మించింది. ఆమె తన తండ్రి మీర్జా ఘియాస్ బెగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. యమునా ఒడ్డున నిర్మించిని సుందరమైన స్మారక చిహ్నం ఇది. ఇది ఆమె నిర్మాణాత్మక దృష్టిని, రాజకీయ శక్తిని ప్రతిబింబిస్తుంది.తాజ్-ఉల్-మస్జిద్, భోపాల్భోపాల్ బేగం కేవలం పాలకురాలేకాదు, కళ, వాస్తుశిల్పానికి పోషకులు కూడా. తాజ్-ఉల్-మస్జిద్ మసీదుల కీరీటంగా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఏళ్లతరబడి నిర్మించి అద్భుత కట్టడం ఇది. పింక్ ఇసుకరాయి గోపురాలు, అత్యున్నత మినారెట్స్, విశాలమైన ప్రాంగణంతో అందంగా తీర్చిదిదదారు. ఇది బారతదేశంలో ఉన్న అతిపెద్ద మసీదులలో ఒకటి. దాని స్కైలైన్ ఆకృతి మహిళా పాలకురాలి ప్రత్యేక చరిత్రకు సాక్షిగా నిలిచింది.మిర్జన్ కోట, కర్ణాటకఈ కోట నిర్మాణం మనోహరంగా ఉంటుంది. దీన్ని 16వ శతాబ్దంలో రాణి చెన్నాభైరదేవి పాలనలో నిర్మించారు. మసాలా వాణిజ్యంలో ఆధిపత్యం కారణంగా ఆమెను "పెప్పర్ క్వీన్" అని పిలుస్తారు. ప్రస్తుతం పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ..ఆ కర్ణాట రాణి గొప్ప చరిత్రకు గుర్తుగా ప్రజల మనసులో నిలిచిపోయింది.దక్షణేశ్వర్ కాళి ఆలయం, కోల్‌కతా19వ శతాబ్దంలో రాణి రష్మోని నిర్మించిన దక్షిణేశ్వర కాళి ఆలయం. కాళి దేవత ఆరాధన కోసం హుగ్లీ నదితీరాన నిర్మించిన పుణ్యక్షేత్రం. చరిత్రలో రాజులు అధికారం లేదా విజయం కోసం ఇలాంటి దేవాలయాలను నిర్మించినట్లు విన్నాం. అయితే ఆ రాజుల మాదిరిగా కాకుండా రాణి రష్మోని పరోపకార బుద్ధితో ఆధ్యాత్మిక స్థలాలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మించింది. ఆలయ నిర్మాణం అత్యంత విలక్షంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భోధనలకు అర్థం పట్టేలా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణం. కోలకతా అనగానే గుర్తొచ్చే కాళిమాత ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి తరలివస్తున్న గొప్ప క్షేత్రంగా అలరారుతోంది.(చదవండి: 'ఎగ్ ఫ్రీజింగ్' అంటే..? ఉపాసన, నటి మెహ్రీన్ , తానీషా ముఖర్జీ అంతా..!) -
ఆ ఏనుగు హెయిర్ స్టైల్ వేరేలెవెల్..!
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే. ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట. అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!) -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది. ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
మానవ సేవే.. మాధవ సేవగా... మహ్మద్ నజీబ్ సేవలు!
మానవ సేవే మాధవ సేవ.. అనే నానుడిని ఒంటబట్టించుకున్నారు.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీబ్. సరిగ్గా అదే తలంపుతో గత 18 ఏళ్లుగా పేదల కోసం నిరంతరాయం శ్రమిస్తూ.. నిరుపేదలకు, వలస కూలీలకు సేవలందిస్తున్నారు. తాను స్థాపించిన తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ ద్వారా పేదల కుటుంబాల్లో తలెత్తే తగాదాలను పరిష్కరిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరోవైపు వలస కూలీలు, నిరుపేదలకు వైద్య సహాయం, నిత్యావసరాలు అందజేస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మహ్మద్ నజీబ్ షేక్‌పేట ఫ్రెండ్స్ కాలనీలో ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం వంద కిలోల బియ్యంతో వంట చేస్తూ లేబర్ అడ్డాలు, ఆస్పత్రుల వద్ద భోజన ప్యాకెట్లు అందించారు. – గోల్కొండ నజీబ్ చిన్ననాటి స్నేహితులతో కలిసి గోల్కొండలోని షేక్ పేటలో నిరంతరాయంగా నిరుపేదలకు సేవలందిస్తున్నాడు మహ్మద్ నజీబ్. స్థానిక ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి వారి సమస్యలను గుర్తిస్తూ.. తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నాడు. స్థానికులకు, పేదలకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా లేబర్ అడ్డాల వద్ద ఒక్కపూట భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నాడు. కాలనీలో ప్రత్యేకంగా ఓ వంట శాలను సైతం ఏర్పాటు చేశాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి ప్రతినిత్యం భోజన ప్యాకెట్లను అందించాడు. పలువురు బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందించాడు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల సహాయంతో స్థానికులకు వైద్య సేవలను అందించాడు. కుటుంబ కలహాలు చక్కబెడుతూ.. టోలిచౌకీలోని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రధాన కార్యాలయంలో స్థానికుల కుటుంబ తగాదాలు, భార్యా భర్తల కలహాలకు పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 15 యేళ్లగా చిన్న చిన్న తగాదాలతో విడాకులు తీసుకోడానికి తనవద్దకు వచి్చన వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వారి కలహాలకు పరిష్కారం చూపుతున్నాడు. ఇప్పటి వరకూ దాదాపు 350 మంది దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించి, వారిని ఏకం చేస్తున్నాడు. మరోవైపు నిరుపేద విద్యార్థులకు ఆర్గనైజేషన్ ద్వారా తామున్నామంటూ అండగా ఉంటూ ఫీజులకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. చదువు మధ్యలో వదిలేసిన వారిని చదువు కొనసాగించేలా ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి యేటా తాము 8 మంది నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకుంటున్నామని, పదో తరగతి వరకూ ఉచితంగా చదువుకునేలా వారికి అండగా నిలబడుతున్నాడు. ప్రస్తుతం ఆర్గనైజేషన్ కార్యకలాపాలు తెలంగాణ జిల్లాలకు కూడా విస్తృతం చేస్తున్నట్లు నజీబ్ తెలిపారు. -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!
ఇంటిని మరింత పర్యావరణ అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని చేసే ఆలోచనల్లో లైటింగ్ ఒకటి. అందుకు సరైన ఉపకరణాలను వాడటం, సరైన వెంటిలేషన్‌ను నిర్ధారించడం వంటి సాధారణ మార్పులు, ఇంధన శక్తిని పొదుపు చేయడానికి పాటించాల్సిన పద్ధతులు పెద్ద తేడాను కలిగిస్తాయి. ఇంధన స్పృహ కలిగిన ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణానికి, మరింత సౌకర్యవంతమైన జీవనశైలికి దోహదం చేస్తుంది. పాతకాలం బల్బుల కంటే ఎల్ఈడీ లైట్లు 80 శాతం వరకు తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తాయి. ఎక్కువ కాలం వెలుగునిస్తాయి. దీంతో బల్బులను త్వరగా మార్చనక్కర్లేదు. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.రోజూ కరెంట్‌తో నడిచే పరికరాలను వారంలో రెండు, మూడుసార్లు విరామమిచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.ఇంటికి కరెంట్ వాడకం ఎంత అవసరం అనేది ముందు ఒక అంచనా వేసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ఇంటిలో లైట్ల వాడకం అంతగా ఉండదు. దీని వల్ల కరెంట్ వినియోగాన్ని సగానికి సగం తగ్గించవచ్చు.కరెంట్ వినియోగం ఎక్కువ ఉండే వంట గదిని పరిశీలించండి. ఏ ఎలక్ట్రికల్ వస్తువును ఉపయోగిస్తున్నాం, ఆ వస్తువు లేకుండా మరో విధంగా పనులు పూర్తి చేయగలమా, బామ్మల కాలం నాటి పద్ధతులను అమలు చేయగలమా.. అని ఆలోచన చేయడమే కాకుండా, ఆచరణలో పెట్టవచ్చు.గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపివేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో కుటుంబ సభ్యులకూ అవగాహన కల్పించాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ విద్యుత్తును ఆదాచేయడంలో ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేలా మన ప్రవర్తన ఉండాలి. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం వల్ల ఇతర ఇంధన శక్తిని కొనుగోలును తగ్గించవచ్చు. సోలార్, గ్యాస్ ఆధారిత వాటర్ హీటర్లను ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించినవారవుతారు. కార్బన్ ఫుట్ ప్రింట్స్‌ను తగ్గిస్తూ, చిన్న చిన్న మార్పులతో పర్యావరణ అనుకూలంగా ఉంటే డబ్బు, సమయాన్ని ఆదాచేయడమే కాదు రేపటి తరాలకు కూడా మేలు చేసినవారవుతారు. -ఎన్.ఆర్(చదవండి: -
భారీ కీటకం.. దాంతోనే వంటకం..!
చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్ వార్స్’ సినిమాల్లో విలన్ అయిన ‘డార్త్ వాడర్’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. వియత్నాం ఫుడ్మార్కెట్లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్’ జాతికి చెందిన జెయింట్ ఐసోపాడ్ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు. -
'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!) -
గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!) -
వాలుజడతో ఊరికే పేరుతెచ్చారు..! ఆ మహిళలెవరంటే..
ఈ రోజుల్లో జుట్టు పొడవుగా ఉండటం అత్యంత అరుదు. ఏవేవో ఫ్యాషన్లతో భుజాల వరకే ఉండేలా జుట్టు ఫ్రీగా వదిలేయడం ట్రెండ్‌గా మారింది. పైగా లాంగ్ జుట్టు మెయింటైన్ చేయడం మావల్ల కాదని చెప్పేస్తోంది నేటి యువత. అలాంటి ఈ కాలంలో పొడవు జుట్టుతో అందర్నీ ఆకర్షిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు ఈ గ్రామం అమ్మాయిలు. అంతేగాదు ఆ వాలు జడతో తమ ఊరి పేరు వార్తల్లో నిలిచేలా చేశారు. అంతలా ఆ మహిళలందరి జుట్టు ఎలా పొడవుగా ఒత్తుగా ఉంది..? అందుకోసం వాళ్లే ఏం చేస్తారనే సందేహాలు కచ్చితంగా వస్తాయి. అయితే ఆ మహిళలున్న గ్రామంలో కనీస సదుపాయాలేం లేవు. కటిక పేదరికం. కేవలం ఆ పొడవాటి జుట్టు కారణంగా ప్రపంచంలోనే ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది అంతే..మరీ ఆమహిళలెవరు..? ఎక్కడుందా గ్రామం..? ఆ పొడవాటి కురుల సీక్రెట ఏంటి తదితరాల గురించి తెలుసుకుందామా..!.చైనాలోని గుయ్లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో హుయాంగ్లుయో అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని మహిళలు జుట్టే అత్యంత పొడవుగా ఉంటుంది. అలాంటి కురులు కేవలం అమ్మాయిలకే సొంతం కాదు..అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ కూడా వాలుజడతో హోయలు పోతుంటారట..!.రెడ్ యావో తెగకు చెందిన ఈ మహిళలందరూ పొడవైన ఆరోగ్యకరమైన జుట్టుకి పేరుగాంచినవారు. వీళ్లంతా జుట్టుని పొడవుగా ఉంచుకోవడమే గాక అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు. అయితే పెళ్లి కానీ అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకి హంగులద్దితే..పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారట!. ఆ కురుల సీక్రెట్ ఏంటంటే..రెడ్ యావో మహిళలు తమ శిరోజాల సంరక్షణ కోసం సహజసిద్ధమైన వాటినే ఉపయోగిస్తారట. అదే వారి కేశ సంపద రహస్యమట. ఈ మహిళలంతా లాంగ్షెంగ్ రైస్‌తో తయారు చేసిన ప్రత్యేక షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకుంటారట, అలాగే జుట్టుని నది నీటితోనే కడుగుతామని చెబుతున్నారు ఆ తెగ మహిళలు.తమ జుట్టు సంరక్షణలో భాగంగా పులియబెట్టిన బియ్యం నీటిని ఉపయోగిస్తారట. ఆ మహిళలంతా చెక్క దువ్వెనలనే ఉపయోగిస్తారట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే..80 ఏళ్లకు చేరకున్న ఏ మహిళ జుట్టు కూడా తెల్లబడదట. ఈ చిట్కాల తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్నూ తరచూ ఆహారంలో తీసుకుంటారట. ఇలా పొడవాటి జుట్టుతో పేరుతెచ్చుకున్నారు ఈ యావో మహిళలు. ఆ ప్రత్యేకతతోనే వారి గ్రామానికి గుర్తింపు కూడా వచ్చింది. గిన్నిస్‌లోనూ చోటు!ఈ యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండేళ్ల క్రితం జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చైన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్’గా ఇది గిన్నిస్ రికార్డులకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తులు ధరించి.. ‘లాంగ్ హెయిర్ బల్లాడ్’ అంటూ పాటలు పాడుతూ మరీ పాల్గొనడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అయితే ఈ తెగ తమ జీవన విధానాన్ని కాపాడుకోవటానికి చాలా సవాళ్లు ఎదుర్కొంటుంది. పెళ్లికాని స్త్రీ జుట్టును కిందకి వదులుగా ఉండగా ఏ పురుషుడైనా చూస్తే..అతడు ఆమెతో మూడేళ్లు కలిసి ఉండాల్సిందేనట. అయితే ప్రస్తుతం వారు ఆ ఆచారాన్ని పాటించటం లేదట. పర్యాటకుల ముందు తమ జుట్టుని ప్రదర్శించి డబ్బులు సంపాదించి బతుకుతున్నామని ఆ యావో తెగ మహిళలు ఆవేదనగా చెబుతున్నారు. View this post on Instagram A post shared by SheThePeople (@shethepeopletv) (చదవండి: డెన్మార్క్ రాణి 1800ల నాటి అరుదైన కిరీటం..! 140 ఏళ్లుగా..) -
వెక్కిరింపులను లెక్క చేయలే.... కానీ కొట్టాడు వరల్డ్ రికార్డ్!
లావుగా ఉన్నవాళ్లు సన్నగా రివటలా మారాలని ఆరాట పడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కాస్తంత బొద్దుగా ఉంటే బావుండు అని నిట్టూరుస్తూ ఉంటారు. ఇక రింగు, రింగులు జుట్టు ఉన్నవాళ్లలో కొంతమంది స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ చూసి మురిసిపోతుంటారు. నాకూ అలా ఉంటే బావుండు అని అనుకుంటూ ఉంటారు. ఇది సహజమే కానీ అసహజమైన, వింత సిండ్రోమ్‌తో బాధపడుతున్న భారతీయ బాలుడు తన పరిస్థితి గురించి బాధపడ లేదు..ఆత్మవిశ్వాసంతో గిన్నిస్ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. ఎవరా బాలుడు? అతనికున్న సిండ్రోమ్ ఏంటి? తెలుసుకుందాం.మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ తనకున్న విపరీతమైన జుట్టుతో బాధపడేవాడు. అవమానపడేవాడు. కానీ దైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఇపుడు అతని జుట్టే అతడికి రికార్డు తెచ్చి పెట్టింది. చదరపు సెంటీమీటర్‌కు 201.72 వెంట్రుకలతో రికార్డు సృష్టించాడు. హైపర్ట్రికోసిస్ అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా అతని ముఖంలో 95 శాతానికి పైగా వెంట్రులున్నాయి.మధ్య యుగాల నుండి ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 50 కేసుల్లో పాటిదార్ కూడా ఒకడని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.అయితే మొదట్లో తాను సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తరువాత అందరూ తనను అర్తం చేసుకున్నారని అన్నాడు. ఇపుడు చాలా మంది దయతో ఉంటారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎవరైనా వెంట్రుకలను తొలగించుకోవాలని సూచించే వారికి ఇది మామూలే..దీని గురించి పెద్దగా పట్టించుకోను అని చెబుతాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటం నాకిష్టం...నా రూపాన్ని మార్చుకోవాలనుకోవడం లేదని’ చెప్పాడు."నాకు మాటలు రావడం లేదు, ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన లలిత్ పాటిదార్ పుట్టినప్పటి నుండి అరుదైన ''వేర్వోల్ఫ్ సిండ్రోమ్'తో బాధపడుతున్నాడు. 'వేర్వోల్ఫ్ సిండ్రోమ్' లేదా హైపర్ట్రికోసిస్ తల నుండి కాలి వరకు జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉండటం వల్ల మధ్య యుగాల నుండి కేవలం 50 మందికి మాత్రమే ఇది సోకిందట. లలిత్ శరీరం మొత్తం పూర్తిగా జుట్టుతో కప్పబడి ఉంది. లలిత్ పాటిదార్‌ను ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. స్కూల్లో పిల్లలు ఎగతాళి చేశారు. మంకీ బాయ్ అంటూ మరికొంతమంది ఏడిపించేవారు. "కొరుకుతాడేమో" అని భయపడేవారు. రాళ్ళు విసిరేవారు. మరికొంతమంది హనుమంతుడి అవతారంగా భావించేవారు. లలిత్ తండ్రి రైతు , అతని తల్లి గృహిణి. ప్రస్తుతం, ముఖం 95 శాతానికి పైగా వెంట్రుకలతో నిండిపోయి ఉన్న లలిత్‌కు తల్లితండ్రులు తొలుత గుండు చేయించారు. కానీ పరిస్థితిలో మార్పు లేదు. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. దీన్ని హైపర్ట్రైకోసిస్ అంటారని, ప్రస్తుతానికి దీనికి చికిత్స లేదని వైద్యులు చెప్పారు. అయితే వయసు పెరిగిన తరువాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని చెప్పారు.లలిత్‌కు ఇన్స్టాగ్రామ్, తన యూట్యూబ్ ఛానెల్లో ఫాలోయింగ్‌కు కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాలో 2 లక్షల 65 వేలు, యూట్యూబ్‌లో లక్షకు పైగా ఫాలోయర్లున్నారు. ఇటీవల ఇటలీలోని మిలన్ టెలివిజన్ షో లో కనిపించాడు. కుటుంబం ఇస్తున్న మద్దతు, ప్రోత్సాహతో ప్రపంచాన్ని చుట్టి రావాలని భావిస్తున్నాడు. విభిన్న సంస్కృతులను అన్వేషించాలనే కల సాకారం దిశగా సాగుతున్నాడు లలిత్. -
హెయిర్‌కట్‌లో తలపండింది
టోక్యో: శతాధిక వృద్ధులు సాధారణంగా త మ పని తాము చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ఒంట్లో పటుత్వం తగ్గి పోయి లేచి నడవడానికి, గాజు వస్తువులను పగలకుండా జాగ్రత్తగా పట్టుకెళ్లడానికి ఎంతో కష్టపడుతుంటారు. ఇక కత్తెర పట్టుకుని జుట్టు కత్తిరించమంటే వాళ్లు చేసే కటింగ్ దెబ్బకు హెర్స్టయిల్ (Hair Style) ఎటు పోతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది ఏకంగా 108 ఏళ్ల వయసులో కూడా ఓ బామ్మ ఎంచక్కా కత్తెరను ఒడుపుగా చురకత్తిలాగా ఝుళిపిస్తూ చక్కటి తలకట్టు తీర్చిదిద్దుతోంది. ఆమె పేరే షిట్సూయ్ హకోయ్‌షీ. 9 దశాబ్దాలుగా హెయిర్‌స్టయిల్ వృత్తిలో.. ఈశాన్య టోక్యోలోని టొచిగి జిల్లాలోని నకగవా పట్టణంలోని బామ్మ షిట్సూయ్కు బార్బర్ దుకాణం(Barber Shop) ఉంది. మొదటి ప్రపంచయుద్దకాలంలో అంటే 1916 నవంబర్ పదో తేదీన రైతు కుటుంబంలో ఈమె జన్మించారు. హెయిర్ కటింగ్ (Hair Cut) అంటే ఈమెకు చాలా ఇష్టం. ‘‘టోక్యోలో ఉద్యోగం ఉంది. కావాలంటే అక్కడికెళ్లి జాయిన్ అవ్వు’’అని స్నేహితురాలి తల్లి ఇచ్చిన సలహాను షిట్సూయ్ పాటించారు. టీనేజీలో ఉండగానే 14 ఏళ్ల వయసులోనే ఒంటరిగా టోక్యో సిటీకి వెళ్లి బార్బర్ అప్రైంటిస్గా చేరారు. 20 ఏళ్ల వయసులో బార్బర్‌గా లైసెన్స్ సంపాదించారు. 24 ఏళ్ల వయసులో జెరోను పెళ్లాడారు. తర్వాత భర్తతో కలిసి బార్బర్ షాప్ ప్రారంభించారు. వీళ్లకు ఇద్దరు సంతానం. 1937లో జపాన్‌పై చైనా జరిపిన యుద్ధంలో ఈమె భర్త ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు అంటే 1945 మార్చి పదో తేదీన టోక్యోపై అమెరికా జరిపిన బాంబు దాడిలో ఈమె బార్బర్ దుకాణం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పిల్లలు, కట్టుబట్టలతో ఈమె నగరాన్ని వీడి టొచిగి జిల్లాలో ని వేరే ప్రాంతానికి తరలిపోయారు. తర్వాత ఎనిమిదేళ్లకు 1953లో సొంతూరు నకగవాకు చేరి అక్కడ తన పేరు మీద ‘రిహాట్సు హకోయ్‌షీ అని బార్బర్ దుకాణం ప్రారంభించారు. అప్పట్నుంచీ అదే దుకాణంలో దశాబ్దాలుగా కటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. రిహాట్సు అంటే జపనీస్ భాషలో బార్బర్ అని అర్థం. కస్టమర్లే నా దేవుళ్లు 108 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగుతున్న ఈమెకు గత బుధవారం గిన్నిస్ ప్రపంచ రికార్డ్ (Guinness World Record) నిర్వాహకులు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు. ఇన్నాళ్లూ అమెరికాలో 107 ఏళ్ల వయసులోనూ బార్బర్‌గా కొనసాగిన ఆంటోనీ మాన్సినెల్లీ అనే తాతకు గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సర్టిఫికేట్ ఉండేది. ఆయన 2018లో మరణించడంతో అప్పట్నుంచీ ఎవరికీ ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు. బామ్మ విషయం తెల్సి తాజాగా ఈమెకు ఆ రికార్డ్ కట్టబెట్టారు. చదవండి: గుడ్లు తేలేస్తున్న అమెరికా‘‘108 ఏళ్ల వయసు బామ్మ వణుకుతూ కటింగ్ ఎలా చేస్తుందో అన్న భయం, అనుమానం లేకుండా నామీద నమ్మకంతో వస్తున్న కస్టమర్లే నాకు దేవుళ్లు. వాళ్ల సంతోషమే నాకు అమితానందాన్ని ఇస్తుంది. వయసులో సెంచరీ దాటినా నేను నా వృత్తిని వదులుకోను. కత్తెరలను పక్కనబెట్టే ప్రసక్తే లేదు. ఓపిక ఉన్నంతకాలం కటింగ్ చేస్తా. ఈ ఏడాది 109వ పుట్టినరోజు జరుపుకోబోతున్నా. ఓపిక తగ్గితే 110 ఏళ్ల వయసులో కటింగ్‌ను ఆపేస్తా’’అని బామ్మ నవ్వుతూ చెప్పారు. -
ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..!
ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకున్న ఒక్క రోజుల్లోనే పెటాకులు అవుతున్నాయి. కనీసం మూన్నాళ్లైన కలిసి ఉండటమే గగనం అన్నట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి పెళ్లిళ్లల్లో రికార్డు సృష్టించాడు. అతడి ఇల్లే ఓ గ్రామంలా తలిపించేలా ఉంటుందట. ఎవరా వ్యక్తి అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడో చూద్దామా..!.ఆఫ్రికా దేశమైన టాంజానియాలోని ఒక చిన్న గ్రామంలో నివసించే కపింగా (మ్జీ ఎర్నెస్టో ముయినుచి కపింగా) అనే వ్యక్తి వరుస పెళ్లిళ్లతోనే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తి సుమారు 20 పెళ్లిళ్లు చేసుకోగా.. కొన్ని కారణాలతో నలుగురు భార్యల్లో కొందరు చనిపోగా, కొందరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు ఉన్నారు. అలాగే.. 144 మంది మనవళ్లు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. అంతా ఒకేచోట ఆనందంగా కలిసి మెలిసి జీవిస్తున్నారు.చెప్పాలంటే అతడి ఇల్లే..ఓ గ్రామంలా మారిపోయింది. వాళ్లింట్లో వంటలు చేస్తే..ఏదో వేడుక జరుగుతుందేమో అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అంతమందికి భారీస్థాయిలో వంటలు చేయాల్సి ఉంటుంది. అయితే అంతా కలసే వండుకుని ఒకే చోట కూర్చొని తింటారట. మరీ కపింగ ఇన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే మాత్రం విస్తుపోతారు..ఇన్ని పెళ్లిళ్లు ఎందుకంటే..కపింగ తన తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. తాను 1961లో మొదటి వివాహం చేసుకున్నానని, తన భార్య మొదటి బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు తన తండ్రి నువ్వు ఒక్క పెళ్లి కాదు మరిన్ని పెళ్లిళ్లు చేసుకోవాలి, మన కుటుంబం పెద్దదిగా ఉండాలి అని చెప్పాడట. నువ్వు మరో పెళ్లి చేసుకుంటే..వచ్చే కట్నం డబ్బులు నీకే ఇస్తానని చెప్పాట. తండ్రి కోరిక మేరకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడట. అయితే అందులో ఐదు వివాహాలకు తన తండ్రే డబ్బు ఖర్చు పెట్టాడట. మిగతావి తానే చేసుకున్నానని చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..16 మంది భార్యల్లో ఏడుగురు కపింగ సోదరిమణులే. కానీ వాళ్లు అతడి భార్యలలాగే జీవిస్తున్నారు. వాళ్లంతా సవితి పోరు లేకుండా హాయిగా కలిసిమెలిసి ఉండటం విశేషం. మరీ ఇంతమంది ఆయన్నే ఎలా పెళ్లి చేసుకున్నారు అనే సందేహం కూడా వస్తోంది కదూ..? అయితే అందుకు అంతా చెబుతున్న కారణం ఒక్కటే..అది కపింగ మంచితనమేనట. అతడు చాలా మంచివాడని, అతడి భార్యగా ఉండటం అదృష్టంగా భావిస్తారట వారంతా. అలాగే తన కుటుంబ సభ్యులంతా ఎలాంటి గొడవులు లేకుండా ప్రశాంతంగా జీవించడానికి తన భార్యలే కారణమని అంటాడు కపింగ. ఏ సమస్య అయినా సాధ్యమైనంత వరకు తన వరకు రాకుండా పరిష్కరించుకుంటారని..ఒక్కోసారి తన వద్దకు వచ్చినా.. అక్కడితో సమస్యను పరిష్కరించి ఎలాంటి గొడవలు తలెత్తకుండా చూసుకుంటామని చెబుతున్నాడు. వారంతా స్వయం సమృద్ధి విధానంతో జీవిస్తున్నారని చెప్పాడు. మొత్తం కుటుంబం అంతా వ్యవసాయంపై ఆధారపి జీవిస్తుందట. అందరూ పంటలు పండిస్తూ, పశువులును మెపుతూ..తమ ఆహార అవసరాలను తీర్చుకుంటారట. అయితే కపింగా ఇంత పెద్ద కుటుంబ కారణంగా దాదాపు 50 మంది పేర్లే గుర్తుంటాయట. తక్కిన వారందర్నీ వాళ్ల ముఖం చూసి గుర్తుపట్టి మాట్లాడతానని చెబుతున్నాడు.(చదవండి: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
స్వజనులకు అక్షర భిక్ష : సిడాం మారూమాస్టారు గురించి తెలుసా?
తాను వెలుగుతూ చుట్టూరా కమ్మిన చీకట్లను తరిమేయడమే దీపం సుగుణం. అలాంటివారే మారూ మాస్టారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి అవసరమైన చైతన్యాన్ని వారిలో నింపారు. 1925 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గడల్ పల్లి ఏజెన్సీ గూడెంలో జన్మించిన సిడాం మారూ 1962లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తొలి ఆదివాసీ. రాజ్ గోండ్ తెగకు చెందిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ జాతిలో వెనుక బాటుతనాన్ని పోగొట్టాలంటే కనీస అక్షర జ్ఞానం నింపాలని భావించారు. దీనికి తోడు అప్పటి నైజాం ప్రభుత్వంలో గిరిజన జాతులపై పరిశ ధన చేస్తున్న ఆంత్రొపాలజిస్ట్ ప్రొ.హైమండార్ఫ్ ప్రోత్సహించడంతో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారు. చదవండి: మొబైల్భూ వాస్తవాల విస్మరణే ప్రమాదానికి కారణం బాహ్య ప్రపంచమే తెలియని అదిమ తెగలైన రాజ్ గోండ్, పర్దాన్, నాయకపోడు, తోటి, కోయ గిరిజను లను చేరదీసి మాతృభాషలో బోధించేవారు. 1940లో నిజాం సాయుధ దళాలతో జరిగిన జోడె ఘాట్ పోరాటంలో క్షత గాత్రులైన తమ వారిని దాచిపెట్టి, అవసరమైన సపర్యలు చేసిన మానవీయుడు, దయా మయుడు. 1983లో ఉపాధ్యాయ వృత్తి నుండి పదవీ విరమణ పొందిన మారూ మాస్టారు వెనువెంటనే ఉట్నూరులోని సమగ్ర గిరిజనా భివృద్ధి సంస్థ (ఐటీడీఏ) తరఫున ఆదివాసీ అభివృద్ధి నిర్వాహకుడిగా నియమితులయ్యారు. ఐటీడీఏ ప్రవేశ పెట్టిన పలు పథకాలను, ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని గిరిజనులందరూ అభివృద్ధి చెందాలని చైతన్యం కలిగించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గిరిజనులకు అండగా నిలబడి గిరిజనాభివృద్ధిలో ఆదివాసు లను భాగస్వాములుగా చేస్తూ హైమండార్ఫ్ స్థాపించిన ‘రాయ్ సెంటర్ల’ను పునఃప్రారంభించడానికి తగు కృషి చేశారు మారూ మాస్టారు. తుదకు 2000, మార్చి 6న ప్రకృతి ఒడిలోకి చేరారు. ఆదివాసీల మదిలో మారూ జ్ఞాపకం మరువ లేనిది. – గుమ్మడి లక్ష్మీనారాయణ, సామాజిక రచయిత (నేడు మారూ మాస్టారు వర్ధంతి) -
ఒకే కులం పెళ్లిళ్లతోనూ వ్యాధులు
సాక్షి, హైదరాబాద్: ‘బంధువుల అమ్మాయే. అన్నీ కుదిరాయి. అందుకే చేసుకుంటున్నాం.. మా కులపువాళ్లే. అమ్మాయి బాగుంటుంది. సంబంధం ఖాయం చేశాం.. పెళ్లిళ్ల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు, ఒకే కులంలో పెళ్లిళ్ల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది.ఒకే కులం (Same Caste)లో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం (కులాలతో పాటు చిన్నచిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది) వల్లనే ఆయా కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. నాలుగు వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యు క్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చ తెలిపారు.కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు/మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్‌కు ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA& B27:04 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో ఒక సామాజికవర్గం వాళ్లలో ఈ స్పాండిలైటిస్ (spondylitis) ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పని చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ దివ్య తేజ్ పేర్కొన్నారు. చదవండి: పాపం శిరీష.. ఆడపడుచు కపట ప్రేమకాటుకు బలైంది -
ఇంటి గుట్టు : దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
మోసగాళ్లు మనకు తెలియకుండానే మన చుట్టూ వైఫైలా ముసిరేసి ఉంటారు. ఏ మాత్రం గుట్టు జారినా, ఆదమర్చి ఉన్నా భారీ నష్టం తప్పదు. అలా ఒక బాలిక అమాయకంగా ఇంట్లోని కొన్ని ఆర్థిక విషయాలు షేర్ చేసినందుకు గాను ఆమె కుటుంబం చిక్కుల్లోపడింది. ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టు అయి పోయింది. 15 ఏళ్ల పాఠశాల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి రూ.80 లక్షలు దోచుకున్న వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టోరీ ఏంటంటే.. గురుగ్రామ్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక బాలిక గొప్పగా చెప్పిందో, అమాయకంగా చెప్పిందో కానీ తన అమ్మమ్మ ఖాతాలో భార మొత్తంలో సొమ్ము ఉందని ఫ్రెండ్స్‌కి చెప్పింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక అమ్మమ్మ( 75) తనకున్న ఆస్తిని అమ్మి తన ఖాతాలో రూ.80 లక్షలు జమ చేసింది. ఈ వివరాలతోపాటు, అమ్మమ్మ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కూడా తనకుందని తొలుత పదో తరగతి అబ్బాయికి చెప్పింది. అతను తన అన్నయ్యకు చెప్పాడు. వాడు తన స్నేహితుడికి చెప్పి ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఆ అమ్మాయికి బెదిరింపులు మొదలయ్యాయి. మార్ఫ్ చేసిన చిత్రాలతోఆమెను బ్లాక్మెయిల్ చేసి, వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తామని, అలా చేయకుండా ఉండాలంటే, సొమ్మును ముట్టచెప్పాలని బాలికను బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన బాలిక ఒకటీ రెండు సార్లు పలుదఫాలుగా నిందితుడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు రూ. 80 లక్షలను బదిలీ చేసింది. ఇలా అమ్మమ్మ ఖాతాలోని మొత్తం డబ్బులన్నీ డిసెంబర్ 21 నాటికి స్వాహా అయిపోయాయి.అయినా బెదింపులు అగలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, క్లాస్‌లో ముభావంగా ఉన్న బాలికను గమనించిన టీచర్ గట్టిగా నిలదీయడంతో విషయమంతా టీచర్‌కు చెప్పింది. అలా అసలు సంగతి కుటుంబానికి చేరింది. దీంతో అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివిధ అకౌంట్ల ద్వారా, డబ్బును తమకు బదిలీ చేయించుకున్నారు. ఇలా కొట్టేసిన సొమ్మంతా దాదాపు పార్టీలకు ఖర్చు చేశారు.గత ఏడాది డిసెంబర్లో నమోదైన ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ కుమార్ గత రెండు నెలలుగా పరారీలో ఉన్నాడని పోలీసులు మంగళవారం తెలిపారు. నవీన్ కుమార్ (28) గురుగ్రామ్‌లోని గర్హి హర్సారులోని న్యూ కాలనీ నివాసి. సోమవారం రాత్రి అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని పోలీసు అధికారి రాంబీర్ సింగ్ తెలిపారు. అలాగే నిందితుడి నుంచి రూ.5.13 లక్షలు, బాధితురాలి ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
వారి కోసం జుకర్‌బర్గ్ ఫ్యావరెట్ హుడీ వేలం : మార్క్ డ్యాన్స్ వైరల్ వీడియో
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకెంతో ఇష్టమైన పాత హుడీని వేలం వేశారు. తద్వారా వచ్చిన సొమ్మును టెక్సాస్ పాఠశాల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం, ఈ ప్రియమైన హూడీతోపాటు బిడ్ దక్కించుకున్న వ్యక్తికి జుకర్‌బర్గ్ స్వయంగా చేతితో రాసిన నోట్ కూడా దక్కింది. దీనిని ఫేస్బుక్ స్టేషనరీలో రూపొందించారట.2019లో తరచుగా ధరించే నల్లటి హూడీ లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేలంలో భారీ ధరకు అమ్ముడు బోయింది. జూలియన్స్ ఆక్షన్స్ వారి "స్పాట్లైట్: హిస్టరీ అండ్ టెక్నాలజీ" సిరీస్‌లో భాగంగా గత గురువారం ఈ వేలం నిర్వహించింది. దీనికున్న పర్సనల్ టచ్, క్రేజ్ అభిమానులను స్పష్టంగా ఆకట్టుకున్నాయి. దీంతో చాలా వేగంగా బిడ్డింగ్ జరిగింది. దాదాపు 22 బిడ్లు వచ్చాయి. చివరకు రూ.13 లక్షల కంటే ఎక్కువ ధర పలికింది. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) ఇది తన ఆల్-టైమ్ ఫేవరెట్లలో ఒకటిగా అభివర్ణించారు జుకర్‌బర్గ్. , "నేను తొలినాళ్లలో దీన్ని ఎప్పుడూ ధరించేవాడిని. దాని లోపల మా అసలు మిషన్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయి ఉంది" అని గుర్తు చేసుకున్నారు. ఈ హూడీ 2010 నాటిది. ఇదే ఏడాది జుకర్‌బర్గ్ టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మను టెక్సాస్‌లోని పాఠశాల పిల్లలకు మద్దతు ఇవ్వడానికి అంకితం చేస్తామని మార్క్ ప్రకటించారు. దీంతోపాటు పాటు ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ధరించిన సిగ్నేచర్ బో టై కూడా వేలంలో అమ్ముడైన ఇతర ప్రసిద్ధ వస్తువులలో ఒకటిగా దాదాపు రూ. 31 కోట్లకు బిడ్దక్కించుకుంది. దీని అసలు ధర వెయ్యి డాలర్లుమాత్రమే.మార్క్ డ్యాన్స్, భార్య ఫిదా మరోవైపు మార్చి 1న, భార్య ప్రిస్సిల్లా చాన్ పుట్టినరోజు సందర్భంగా జుకర్‌బర్గ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ టక్సేడోలో పార్టీలో ఎంట్రీఇచ్చి టక్సేడోను చింపేసి మరీ, ఒక్క ఉదుటున స్టేజ్‌పైకి అద్భుతమైన నీలిరంగు జంప్‌సూట్‌లో పాట పాడి, డ్యాన్స్ చేశాడు. దీంతో చాన్ ఫిదా అయిపోయింది. తెగ వైరలవుతోంది. 2025 గ్రామీ అవార్డుల వేడుకలో బెన్సన్ బూన్ బ్యూటిఫుల్ థింగ్స్ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ధరించిన జంప్‌సూట్ కూడా ఇలాంటిదేనట. -
ఆదిలాబాద్ కా అమితాబ్.. ఎంత పొడుగున్నాడ్రా బాబూ!
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ కా అమితాబ్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బడిలో చదివే విద్యార్థుల ఎత్తు సాధారణంగా 5 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ఏకంగా 6.8 అడుగుల ఎత్తుతో ఆకర్షణగా నిలిచాడు. ఆదిలాబాద్ పట్టణం (Adilabad Town) బొక్కల్‌గూడకు చెందిన వన్నెల సుజాత, వినోద్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు హేమంత్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (Govt School) నంబర్–2లో పదో తరగతి చదువుతున్నాడు.ఈ విద్యార్థి తాత నందు 6.5 అడుగుల ఎత్తు, తల్లి సైతం అంతే ఎత్తులో ఉంటారు. హేమంత్ చెల్లి పదో తరగతి చదువుతోంది. హేమంత్ (Hemanth) 7వ తరగతిలో 5 అడుగుల ఎత్తులో ఉండగా, 8వ తరగతిలో 6 అడుగులు, 9వ తరగతిలో 6.5, ప్రస్తుతం పదో తరగతిలో 6.8 అడుగుల ఎత్తుకు పెరిగాడు. దీంతో స్నేహితులతోపాటు ఇంటి చుట్టుపక్కల వారు, బంధువులు హేమంత్‌ను జూనియర్ అమితాబ్‌గా పిలుస్తున్నారు. చివరి బెంచీలో కూర్చుంటా..అందరికంటే పొడవుగా ఉండటంతో తరగతి గదిలో చివరి బెంచీలో కూర్చుంటాను. ఆటోలో కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. శుభకార్యాలకు వెళ్లినప్పుడు నాతో బంధువులు, మిత్రులు సెల్ఫీలు దిగుతున్నారు. – హేమంత్ఈఏపీ సెట్‌కు తొలిరోజు 5,010 దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం మొదలైంది. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చినట్టు సెట్ కోకన్వీనర్, జేఎన్టీయూహెచ్ రెక్టార్ కె.విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి 3,116, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ విభాగానికి 1,891, రెండు విభాగాలకు రాసే వారి 3 దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించారు. ఓయూలో ముగిసిన పీహెచ్డీ దరఖాస్తుల స్వీకరణ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్–2025 దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. కేవలం 456 సీట్లకు 9000 మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.2000 అపరాధ రుసముతో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల సంఖ్యను పెంచి.. నెలరోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించాలని తెలంగాణ డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జి.విజయ్ నాయక్ శనివారం పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డికి వినతి పత్రం అందజేశారు. చదవండి: ఊరు, ఇల్లు వదిలి.. అక్కడ అందరిదీ అదే పరిస్థితికాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగినా.. పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారంతో ముగిసినా పీహెచ్డీ సీట్ల పెంపుపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!
గూడు.. మనుషుల నుంచి జంతువులు, పక్షుల వరకూ ఎంతో అవసరం. అయితే ఒక్కో జీవిది ఒక్కో తరహా నిర్మాణ శైలి. ఆయా జీవుల అవసరాలను తీర్చేదిగా నిర్మాణం ఉంటుంది. వీటిల్లో మరీ ముఖ్యంగా చెప్పుకోదగిన నిర్మాణ శైలి పక్షులదే.. వాటి నిర్మాణాలు పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్లను సైతం ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. అయితే నగరీకరణలో భాగంగా పక్షుల జాడలు, వాటి గూళ్ల సంఖ్య రాను రాను కనుమరుగవుతున్నాయి. నగర శివార్లు, పల్లెటూళ్లు, అడవులకే పరిమితమైన వీటి గూళ్లు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని హెచ్‌సీయూలో సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. నగరంలో నివసించే నేటి తరం యువతకు పక్షులను జూ లోనో, పార్కుల్లో సందర్శించి ఆనందించడం అలవాటు. ఇక వాటి గూళ్ల సంగతి, వాటి నిర్మాణ శైలి చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి పక్షుల గూళ్లు పదుల సంఖ్యలో హెచ్‌సీయూ కేంద్రంగా కనిపిస్తుండడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. అనేక రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారిన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పక్షి గూళ్లకు నిలయంగా మారింది. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో దాదాపు 233 రకాల పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో వాటి గూళ్లను విద్యార్థులు తమ ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తున్నారు. క్యాంపస్‌లో వృక్ష సంపద పరిరక్షణే పక్షుల సంఖ్య పెరుగుదలకు కారణమని విద్యార్థులు, పలువురు సందర్శకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సైకిల్ సవారీ..ఆరోగ్యం, పర్యావరణంపై పెరుగుతున్న అవగాహన..!) -
అనంత్-రాధిక అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : మికా సింగ్ వ్యాఖ్యలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ,నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) రాధికా మర్చంట్ (Radhika Merchant) వివాహం అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ప్రపంచంలోనే అతిఖరీదైన వివాహంగా పేరు గాంచింది. దీనిపై ప్రముఖ గాయకుడు మికా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఈ కార్పొరేట్ వెడ్డింగ్‌పై మికాసింగ్ (Mika Singh) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక చాలా మందికి ఒక ఆశీర్వాదకరమని వ్యాఖ్యానించారు. అనంత్, రాధికా అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ పై విమర్శలను మికా సింగ్ ప్రస్తావించారు. వారిపెళ్లిపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు తాను ఎందుకు భావిస్తున్నానో కూడా వివరించాడు. ఆ ఒక్క పెళ్లి వల్ల లక్షల మందికి ఉపాధిలభించిందని, అందుకే అది బ్లెస్సింగ్ అన్నానని చెప్పుకొచ్చాడు. అంతమాత్రాన తానేమీ చెంచిగిరీ చేయడం లేదంటూ వివరణ ఇచ్చాడు. ఇలాంటి గ్రాండ్ వెడ్డింగ్స్ అనేక ఉపాధి అవకాశాలను అందిస్తాయనేది జనం అర్థం చేసుకోలేకపోతున్నారని మికా సింగ్ వ్యాఖ్యానించాడు. క్యాటరర్లు, డెకరేటర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంగీతకారులు, భద్రతా సిబ్బంది, మళ్లీ వీరినుంచిమరికొంతమందికి లాభం చేకూరుతుందన్నాడు. అంతేకాకుండా, అనేక మంది కళాకారులు, సెలబ్రిటీలు తమ తమ ప్రదర్శన ఇచ్చే అవకాశం పొందుతారంటూ ఉదాహరణలతో చెప్పుకొచ్చాడు. తద్వారా అంబానీ కుటుంబం ఆడంబర వివాహంతో డబ్బు వృధా చేసిందన్న వ్యక్తులకు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఇటువంటి గ్రాండ్ వెడ్డింగ్స్ వాటి నుండి సంపాదించే చాలా మందికి ఒక వరం అని పేర్కొన్నాడు.భారతదేశంలో అత్యంత ప్రియమైన గాయకులలో మికా సింగ్ ఒకరు. ఆయన తన ప్రత్యేకమైన స్వరం, ఆకట్టుకునే శైలితో అనేక మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సుబా హోనే నా దే, ఆంఖ్ మారే, మౌజా హి మౌజా, పార్టీ తో బన్తీ హై లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన పాటలతో పాపులరయ్యాడు. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల గ్రాండ్ వివాహ వేడుకలో ప్రదర్శనకు ఆహ్వానించారు.కాగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహంగత ఏడాది జూలైలో ముంబై నగరంలో జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. 2024లో జరిగిన అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. రెండు డెస్టినేషన్ ప్రీ-వెడ్డింగ్, ముంబైలో ఆరు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా జరిగాయి. ప్రపంచ దేశాల ప్రముఖులతో పాటు, దేశీయంగా అనేక మంది వ్యాపార, రాజకీయ, సినీ, క్రీడా రంగ ప్రముఖులు హాజరైన సంగతి తెలిసిందే. -
జీనియస్ : 14 ఏళ్ల మానవ కాలిక్యులేటర్
పందొమ్మిదో ఎక్కం చెప్పమంటే తల గీరుకునే పిల్లలు ఉంటారు. చిన్న చిన్న కూడికలకు కాలిక్యులేటర్ వైపు చూసే వారూ ఉంటారు. ఇక పెద్ద లెక్కలంటే కాలిక్యులేటర్ కావాల్సిందే. కాని ఆర్యన్ నితిన్‌కు అది అక్కర్లేదు. ఎందుకంటే అతడే ఒక కాలిక్యులేటర్. అతని వయసు 14 ఏళ్లు. ఎంత పెద్ద నెంబర్లతో లెక్కలు ఇచ్చినా సరే అవలీలగా చేసేస్తాడు.ఆర్యన్ ది మహారాష్ట్ర. ఆరేళ్ల వయసు నుంచే మనసులో లెక్కలు వేయడం, సమాధానాలు కనుక్కోవడం చేసేవాడు. అతని ఉత్సాహం చూసి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆర్యన్ రోజూ ఐదారు గంటల΄ాటు కష్టమైన లెక్కలు సాధన చేసేవాడు. ఎవరు ఎంత పెద్ద లెక్క చెప్పినా మనసులోనే చేసి, టక్కున సమాధానం చెప్పేవాడు. దీంతో అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. 2021లో ‘మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ మెంటల్ కాలిక్యులేషన్’ వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి, ఆ ఘనత పొందిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. 2022లో జర్మనీలో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో పాల్గొని మొదటిస్థానంలో నిలిచాడు. అంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు. దీంతో గ్లోబల్ మెంటల్ కాలిక్యులేటర్స్ అసోసియేషన్(జీఎంసీఏ)లో అతణ్ని ఫౌండింగ్ బోర్డు సభ్యుడిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రపంచ వేదికలపై తన సత్తా చాటాడు. 14 saal ke Aryan Shukla ne sirf 1 din mein banaye 6 Guinness World Record.Bharat ke Aryan Shukla ne apni kamaal ki pratibha dikhate hue ek hi din mein 6 Guinness World Record tod diye! Itni kam umar mein itni badi uplabdhi desh ke liye garv ki baat hai. Unki safalta naye yuvaon… pic.twitter.com/pA8dnoGj1O— Kashmir Watcher (@KashmirWatcher) February 19, 2025 గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాలన్న ఆకాంక్షతో దుబాయ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఒకటి, రెండు కాదు.. ఒకేరోజు ఆరు ప్రపంచ రికార్డులను అతను సాధించాడు. 30.9 సెకండ్లలో 100 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, ఒక నిమిషం 9.68 సెకండ్లలో 200 నాలుగు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం, 18.71 సెకండ్లలో 50 ఐదు అంకెల నెంబర్లను కలిపి సమాధానం చెప్పడం.. ఇలా అతను చేసిన మేధోవిన్యాసాలు చూసి గిన్నిస్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 2024లో మరోసారి మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్‌లో మొదటిస్థానంలో నిలిచాడు. క్రమం తప్పకుండా రోజూ సాధన చేస్తే ఎలాంటి కష్టమైన విషయమైనా మన సాధించగలమని, మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వదలకూడదని అంటున్నాడు ఆర్యన్. -
Maha Kumbh: 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మహా కుంభమేళా. ఇది ఎందరెందరో మహమహులు, సాధువులు, సెలబ్రిటీలు ప్రముఖులను ఒక చోట చేర్చి అంత ఒక్కటే అనే భావన కలగజేసిన గొప్ప కార్యక్రమం. ఈ కుంభమేళ సాధువులుగా మారిన గొప్ప గొప్ప మేధావులను పరిచయం చేసింది. యూట్యూబ్ పుణ్యమా అని సాదాసీదా వ్యక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను అందుకున్నారు. అంతేగాదు ఈ వేడుక ఎన్నో గొప్ప విషయాలకు నెలవుగా మారింది. తాజాగా ఏళ్ల నాటి స్నేహబంధాన్ని హైలెట్ చేసింది. ఎప్పుడో చదువుకుని విడిపోయిన స్నేహితులను కలిపి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది ఈ సంబరం. వాళ్లెరవంటే..వారే సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తాలు. ఇద్దరు ఒకే కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 1988 బ్యాచ్ విద్యార్థులు. ఎప్పుడో 37 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ మహాకుంభమేళా కారణంగా కలుసుకున్నాం అని చెబుతున్నారు ఆ స్నేహితులు. సంజీవ్ కుమార్ అగ్నిమాపక అధికారిగా ఈ మహాకుంభమేళలో విధులు నిర్వర్తిస్తుండగా, అతడి స్నేహితురాలు రష్మి లక్నోలోని ఒక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ మేరకు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన స్నేహితుడు చాలా సైలెంట్ అని, మాట్లాడటం చాలా అరుదని అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం అతడి వ్యక్తిత్వం పూర్తిగా భిన్నంగా ఉందంటూ నవ్వేశారామె. అనుకోకుండా ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తాను ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాట్లు మాకు ఎంతగానే సహాయపడ్డాయని అన్నారు. ఇక సంజీవ్ కుమార్ రష్మిని ఎగతాళి చేస్తూ..రష్మీ, వాళ్ల గ్యాంగ్ తనతో మాట్లాడేందుకు తెగ ట్రై చేసేదంటూ మాట్లాడారు. అలాగే ఆమె చెప్పింది కూడా నిజేమనని, తాను నిజంగానే అప్పుడు అంతగా ఎవరితో ఫ్రీగా కలిసేవాడిని కానని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రితో చివరి స్నానం ముగిసింది. ఈ మేళా అనేక లక్షలాదిమంది ప్రజలను ఒక చోట ఏకం చేసిన గొప్ప దైవ కార్యక్రమం.Pehle log Kumbh me kho jate the.Fire officer Sanjeev Kumar Singh 1988 ke baad MahaKumbh me apni classmate se mile.Such a cute conversation! pic.twitter.com/WQzSa35nsd— Swami (@Swami_65) February 26, 2025(చదవండి: అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారిణి..! ఆమె వికాస్ దివ్యకీర్తి.) -
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
డీఆర్డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్‌టెన్షన్‌తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్‌డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్‌గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్‌ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే. -
రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీ
ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకుని లబ్ది పొందాలని చూసింది మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్కైంది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే..దారిద్ర్య రేఖకు దిగవున ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతోపాటు, సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు రూ.35 వేల ఆర్థిక సాయం,ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హసన్‌పూర్‌లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతోంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో ఊహంచని పరిణామం ఎదురైంది.ఈ పథకాన్ని ఉపయోగించుకొని రూ. 35 కొట్టేయాలని చూసిన అస్మా , ఆమె సమీప బంధువు బావ జాబర్ అహ్మద్‌తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు, వరుడి కోసం రెండు జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకుని, బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటివారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బులు ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసి కొట్టింది.అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం మూడేళ్ల క్రితమే నూర్ మొహమ్మద్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్యా ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మ గారి ఇంట్లోనే ఉంటోంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటివాళ్లు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆస్మా మామగారు ఆస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నవించాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. చివరికి ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమం, మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డు కున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. -
జంతురూపాల్లోని 'మనుషుల జూ'..!
జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే! కాని, తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషుల ప్రదర్శనశాలను ఎక్కడైనా చూశారా? ఈ ఫొటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. ‘మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే, ఇక్కడకు రండి’ అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు రెండుసార్లు మాత్రమే తెరిచే ఈ జూను చూడటానికి చాలామంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతోపాటు, మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే, ఒక నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్లు (అంటే రూ. 27 వేలు) వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేస్తానని టోకో చెబుతున్నాడు. (చదవండి: వామ్మో ఇదేం బిజినెస్? విలనీజం వ్యాపారమా..!) -
వామ్మో ఇదేం బిజినెస్? విలన్ కావాలా..!
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్‌ను చావగొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది. మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్‌కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్లా నటిస్తాడు. మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు. సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది. (చదవండి: జనరల్ మోటార్స్ డైట్..! దెబ్బకు బరువు మాయం..) -
నేను బాషా.. ఒక్కసారి రాస్తే 400 భాషల్లో రాసినట్టు!
మీకు ఎన్ని భాషలొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీషు.. ఇంకా? ఈ మూడేనా? నాలుగైదు భాషలు మాట్లాడేవారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? మాట్లాడటం సరే, వాళ్లు ఆ భాషలు రాయగలరా? అసాధ్యం అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు చెన్నైకి చెందిన మహమూద్ అక్రమ్. అతను ఎన్ని భాషల్లో రాయగలడో తెలుసా? అక్షరాలా 400 భాషలు. అంతేకాకుండా, సుమారు 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. ఈ ఘనతలతో అతను ఇప్పటికి మూడు ప్రపంచ రికార్డులు సాధించాడు.అక్రమ్ తండ్రి షిల్బీ మొళిప్పిరిన్. ఉద్యోగరీత్యా రకరకాల దేశాలు ప్రయాణించేవారు. ఆ సమయంలో అక్కడి స్థానిక భాష అర్థంకాక, వారితో మాట్లాడలేక ఇబ్బంది పడేవారు. దీంతో మెల్లగా ఆ భాషలు నేర్చుకోవడం మొదలుపెట్టి 16 భాషల్లో మాట్లాడే స్థాయికి వచ్చారు. తండ్రిని చూస్తూ పెరిగిన అక్రమ్ కూడా అలా రకరకాల భాషల మీద ఆసక్తి పెంచుకున్నాడు.. దాంతో తండ్రి అక్రమ్‌కు నాలుగేళ్ల వయసు నుంచే రకరకాల భాషల్లోకి పదాలు, వాటికి అర్థాలు నేర్పించేవారు. ఆరు రోజుల్లో మొత్తం ఇంగ్లీషు అక్షరాలు (English Letters) నేర్చుకున్న అక్రమ్, మూడు వారాల్లో తమిళంలోని 299 అక్షరాలను నేర్చేసుకుని ఆ చిన్నవయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఆరేళ్ల వయసొచ్చేసరికి తండ్రితో రకరకాల భాషల్లో మాట్లాడటమే కాకుండా తమిళ వాక్యాలను స్పష్టంగా చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో 50 భాషలు సాధన చేసి, వాటి మీద అవగాహన తెచ్చుకున్నాడు. కొడుకు ఆసక్తిని గమనించి, వివిధ భాషల పుస్తకాలు తెప్పించి, అతనికి ఇచ్చేవారు మొళిప్పిరిన్. కేవలం చదవడమే కాకుండా, ఆ భాషల్లో టైప్ చేయడం కూడా మొదలుపెట్టిన అక్రమ్, అతి చిన్నవయసులో వివిధ భాషలు టైప్ చేసి మొదటి ప్రపంచ రికార్డు సాధించాడు.10 ఏళ్ల వయసులో మన జాతీయ గీతం ‘జనగణమన’ను ఒక్క గంటలో 20 భాషల్లో రాసి రెండో ప్రపంచ రికార్డు సాధించాడు. 12 ఏళ్ల వయసు వచ్చేసరికి 400 భాషలు చదివి, రాసి, టైప్ చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. దీంతో మూడోసారి అతనికి ప్రపంచ రికార్డు సొంతమైంది. ఒక వాక్యాన్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియలో ఆరితేరిన అక్రమ్, అందుకుగానూ జర్మనీ దేశంలో ప్రతిష్టాత్మకమైన ‘జర్మనీ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకున్నాడు. అనువాదంలో అతని వేగం చూసి సీనియర్ అనువాదకులు సైతం ఆశ్చర్యపోయారు.చదవండి: డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్అయితే భాషల మీద ఇంత పట్టున్న అతనికి స్కూళ్ల నుంచి ప్రోత్సాహం రాలేదు. భాషల మీద కాకుండా కేవలం సబ్జెక్టుల మీదే దృష్టి పెట్టాలని అతణ్ని ఒత్తిడి చేశారు. దీంతో స్కూల్ మానేసి, ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత అతని ప్రతిభ గుర్తించి, ఆస్ట్రియాలోని డనుబే ఇంటర్నేషనల్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ ఇచ్చి మరీ తమ స్కూల్లో చేర్చుకుంది. ప్రస్తుతం అక్రమ్ యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి భాషావిభాగంలో ఒకేసారి రకరకాల డిగ్రీలు చేస్తున్నాడు. తన భాషా పరిజ్ఞానాన్ని మరింత విస్తరించుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నాడు. -
ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!
అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదిలివేసి వ్యాపారంలో స్థిరపడినవాళ్లను చూశాం. దేశానికి సేవ చేయాలన్న కతృనిశ్చయంతో ఐఏఎస్,ఐపీఎస్ ర్యాంకులను సాధించిన వారినీని చూశాం. కానీ సముద్రంపై శాశ్వతంగా ప్రయాణించేందుకు, జీవితాన్ని కొత్తగా ఆస్వాదించేం దుకు ఉద్యోగాలనూ, ఇంటినీ..అంతెందుకు సర్వస్వాన్ని వదిలేసిన ఫ్యామిలీ గురించి విన్నారా? రండి ముగ్గురు సభ్యులతో కూడిన ఇండియాకు చెందిన అరుదైన ఆ కుటుంబం గురించి తెలుసుకుందాం!రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ గౌరవ్ గౌతమ్, ఆయన భార్య మాజీ మీడియా ప్రొఫెషనల్ వైదేహి చిట్నావిస్, కుమార్తె కైయా రివా గౌతమ్. సౌరశక్తితో నడిచే పడవలో ప్రపంచాన్ని చుట్టిరావడానికి, పర్యటనల పట్ల తమకున్న మక్కువను కొనసాగించడానికి ఈ జంట తమ పూర్తికాల ఉద్యోగాలను విడిచిపెట్టారు. దాదాపు ప్రతి ఆస్తిని అమ్మేసుకున్నారు. తద్వారా తమ ఇల్లు కేవలం మ్యాప్‌లో ఏదో ఒక మూలన కాకుండా మొత్తం ప్రపంచమే చిరునామా అయ్యేలా చేసుకున్నారు. ది రివా ప్రాజెక్ట్ అనే ఇన్‌స్టా ఖాతాలో షేర్ అయిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది. వారి అద్భుతమైన ప్రయాణం నెటిజనులను ఆశ్చర్యపరిచింది.ఈ ఆలోచన ఎలా వచ్చింది?భారత నావికాదళంలో సంవత్సరాలు గడిపిన గౌరవ్‌కి సముద్రంతో విడదీయలేని సంబంధం ఉంది. మరోవైపు, వైదేహి చాలా కాలంగా సరళమైన, అర్థవంతమైన జీవన విధానం గురించి కలలు కంటోంది. ఇంతలో 2015లో గౌతమ్ కొచ్చి నుండి నార్వేకు తిరిగి వచ్చే ఇండియన్ నావల్ సెయిల్ ట్రైనింగ్ షిప్ తరంగిణికి కమాండింగ్ ఆఫీసర్‌గా నియమితుడైనప్పుడు ప్రత్యామ్నాయ జీవనశైలి గురించి ఆలోచన వచ్చింది. భార్య ,కుమార్తెతో కలిసి సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో పడవల మీద నివసిస్తున్న , ప్రయాణించే అనేక కుటుంబాలు తారపడ్డాయి. దీంతో వారి ఆలోచనలకు మరింత ప్రేరణ వచ్చింది. రెండు దశాబ్దాలకు పైగా స్థిర జీవితాన్ని గడిపిన తర్వాత, ఈ జంట చూడాల్సినవి, ఆస్వాదించ వలసినవి ఇంకా చాలా ఉన్నాయని భావించారు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం వారి కలలకు మరింత ఊపిరిపోసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతున్న బోటు ధరలు మరింత ఆకర్షించాయి. అంతే ఇక ఆలస్యం చేయదల్చుకోవలేదు వీరు. 2022లో గౌతమ్ నావీ వీఆర్ఎస్ తీసుకున్నాడు. వైదేహి కూడా మీడియా ఉద్యోగాన్ని వదులుకుంది. ఇలా మంచి జీతం ఉన్న ఉద్యోగాలను ఇద్దరూ వదిలేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ల కుమార్తెకు ఇంటి నుంచే విద్య నేర్పించాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదే ప్రత్యామ్నాయ జీవితాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తమకున్న దాదాపు ప్రతిదీ అమ్మేశారు. ఇంటి సామానును 6వేల కిలోల నుండి 120 కిలోలకు తగ్గించేశారు. పడవలో ఉంచుకోలేని వస్తువులను వెంట తీసుకెళ్లడం వృధా అనుకున్నారు. రెండు క్యాబిన్లు, వంటగది, తొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్, ఒక షవర్ , ఒక సెలూన్ కూడా ఈ ఇంటిలో అమరిపోయాయి. రివర్స్ ఆస్మాసిస్ మెషిన్ కూడా ఉంది. అది సముద్రపు నీటిని మంచినీటిగా మారుస్తుంది. అలా సాంప్రదాయ జీవనశైలిని విడిచిపెట్టి సౌరశక్తితో నడిచే 42 అడుగుల పడవ వాంకోవర్ రీవాలో నివసిస్తున్నారు. ప్రపంచంలోని వివిధ మూలల్లో ప్రయాణించడం వల్ల జీవితంపై అద్భుతమైన దృక్పథంతో ముందుకు సాగుతున్నారు.పడవపై ఎలా బతుకుతున్నారు?సంవత్సరంలో దాదాపు 70 శాతం సమయం ఏకాంత దీవుల వెలుపల లంగరు వేసి గడుపుతారు. మిగతా అన్నిసమయాల్లో పడవను నడపాల్సి ఉంటుంది కాబట్టి, వంతులవారీగా బోటు నడపటం, వంట చేయడం, విశ్రాంతి తీసుకోవడం, చదవడం, మరమ్మతులు చేసుకోవడం లాంటి పనులు చేసుకుంటారు. అప్పుడప్పు కేకులు కూడా చేసుకుంటారు. వంటలకు ఎక్కువ వేడి రాకుండా కుండల్ని వాడతారు.ఎక్కడికైనా వెళ్లి సముద్ర మీదే. అయితే వాతావరణం, నావిగేషన్ సమస్యలు వీరికి ఛాలెంజ్. మొదట్లో ఇబ్బంది పడినా కాలక్రమేణా, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యాప్‌లు, వాతావరణ హెచ్చరిక వ్యవస్థల సహాయంతో వాతావరణాన్ని అంచనా వేయడంలో రాటు దేలారు. అంతేకాదు దాదాపు 30 ఏళ్ల(1988లో దీన్ని తయారు చేశారు) పడవ నిర్వహణ ఖర్చులు, చాలా తొందరగా తుప్పు పట్టడం లాంటి సవాళ్లు కూడా ఎదురైనాయి. రీవా 760-వాట్ల సోలార్ ప్యానెల్స్‌తో ఛార్జ్ చేయబడిన 800-AH బ్యాటరీ బ్యాంక్ ద్వారా నడుస్తూనే ఉంటుంది . దీనికి విండ్ జనరేటర్ కూడా అమర్చుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో ప్రారంభమైన వీరి సముద్రయానం లంకావీ (మలేషియా), థాయిలాండ్‌కు చేరారు. దారిలో అనేక అందమైన దీవుల్లో కొన్ని వారల పాటు ఉన్నారు. ఫుకెట్ పశ్చిమ తీరం వెంబడి మయన్మార్ సరిహద్దు వరకు అందమైన తీరాల వెంబడి వారాల తరబడి గడిపారు. సముద్రంలో స్నార్కెలింగ్ , డైవింగ్ చేస్తూ,కొత్త ఇల్లు రీవా అనే సెయిల్ బోట్లో సరికొత్త అనుభవాలతో గత రెండేళ్లుగా సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా డెక్ నుండి సూర్యాస్తమయాన్ని చూడటం కేయాకు అద్భుతమైన అలవాటుగా మారిపోయింది. వీలైనన్ని ఎక్కువ దేశాలను చూడడమే దీర్ఘకాలిక ప్రణాళిక.తూర్పు మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఫిలిప్పీన్స్లను కవర్ చేస్తూ మరింత తూర్పుకు ప్రయాణించి, తరువాత 17,500 దీవులతో కూడిన ఇండోనేషియాని చుట్టేయాలని ప్లాన్. అలాగే యూట్యూబ్ ద్వారా నౌకాయాన సాహసాలను డాక్యుమెంట్ చేస్తున్నారుట .“పడవలో జీవించడం సాధ్యమేనా?” అన్న ప్రశ్నకు వీరి జీవనమే సజీవ సాక్ష్యం. వీరి ఇన్‌స్టా పేజ్‌లోని వీడియోలను చూస్తూ ఉంటే.. సమయమే తెలియదు. (వీలైతే ఒకసారి చూడండి) View this post on Instagram A post shared by Sailing Yacht Reeva | 🇮🇳 | Gogo, VC & Kay (@the_reeva_project)ప్రయాణం, ముఖ్యంగా సమయం, గమ్యం ఇలాంటి సంకెళ్లేవీ లేకుండా హాయిగా స్వేచ్ఛగా చేసే ప్రయాణాలు జీవితంపై దృక్పథాన్ని కచ్చితంగా మారుస్తాయి. ఒక విశాలమైన అవగాహనను కలిగిస్తాయి. -
Maha Kumbh : అయ్యో తల్లీ! పుణ్యానికి పోతూ ఇదేం పనిరా కొడకా!
మహాకుంభమేళా(Maha Kumbh Mela) పవిత్ర త్రివేణి సంగమంలో మూడు మునుగులు మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళా స్నానాన్ని రాజస్నానం (Holybath)గా పరిగణిస్తారు. ఇక్కడ స్నానం చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ, పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం. అందుకే ఎన్నికష్టాలకోర్చి అయినా కుంభమేళాలో స్నానం చేయడానికి వెళతారు. అంతేకాదు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వృద్ధులైన తల్లిదండ్రులను కూడా తోడ్కొని వెడతారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా సందర్భంగా ఇలాంటి దృశ్యాలెన్నింటినో మనం చూశాం కూడా. అయితే జార్ఖండ్‌లోని ఒక వ్యక్తి ఇందుకు భిన్నంగా, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. 65 ఏళ్ల తల్లిని నిర్దాక్షిణ్యంగా ఇంట్లో వదిలి మహాకుంభమేళాకు వెళ్లాడు. దీంతో ఆకలి బాధకు తట్టుకోలేక, ఆ వృద్ధతల్లి నానా యాతన పడింది. మూడు రోజుల పాటు అటుకులను ఆహారంగా సేవించింది. ఆఖరికి అవి కూడా అయిపోవడంతో ప్లాస్టిక్‌ను తినేందుకు కూడా ప్రయత్నించింది. ఈ విషయం ఎలా బయటికి వచ్చింది.జన్మనిచ్చిన తల్లి, అనారోగ్యంతో బాధపడుతోందున్న కనికరం కూడా లేకుండా ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లిపోయాడు. మూడు రోజులపాటు అటుకులతో కడుపు నింపుకుంది. ఉన్న కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఇక ఆకలి బాధకు తాళలేక ఆమె గట్టిగా కేకలు వేసింది. బిగ్గరగా రోదించడం మొదలు పెట్టింది. దీంతో ఇరుగుపొరుగు తక్షణమే స్పందించారు. చుట్టుపక్కల వారిచ్చిన సమాచారంతో పోలీసులొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు. ఆమెకు ఆహారం ఇచ్చి, సేద తీరిన తరువాత, చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుమార్తె చాందినీ దేవికి సమాచారం అందించారు.(వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) ఉద్యోగి. అయితే తల్లికి ఇంట్లో భోజనం, తదితర ఏర్పాట్లన్నీ చేసే, తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ వాదిస్తున్నాడు. అనారోగ్యంతో ఉందనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు. మరోవైపు రామ్‌గఢ్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) పరమేశ్వర్ ప్రసాద్ తల్లిని సీసీఎల్ క్వార్టర్ లోపల బంధించాడని ధృవీకరించారు. ఇదీ చదవండి: నీతా అంబానీ లుక్: వందేళ్లకు పైగా చరిత్ర, తయారీకి రెండేళ్లుకాగా మహా కుంభమేళా 40వ రోజు, సంగమంలో భక్తులు స్నానాలు ఉత్సాహంగా అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు జైలులో ఉన్న ఖైదీలు కూడా ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇప్పటివరకు 58 కోట్లకు పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం చేశారని జాతర నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీవరకు మహా కుంభమేళా జరగనుంది. -
మూడు నెలల తరువాత.... గ్రేహౌండ్స్ దొరికిందహో!
పెంచుకున్న కుక్క కనిపించకపోతే ఏం చేస్తాం? తిరగాల్సిన చోటుకల్లా తిరుగుతాం. పోలీస్ కంప్లాయింట్ ఇస్తాం. అయినా ఫలితం లేకపోతే ప్రియమైన శునకాన్ని తలచుకొని బాధ పడడం తప్ప ఏంచేయగలం? కాని గురుగ్రామ్‌కు చెందిన దీపయాన్ ఘోష్, కస్తూరి దంపతులు మాత్రం ఏమైనా సరే, ఎక్కడున్నా సరే... తప్పిపోయిన తమ పెంపుడు శునకాన్ని వెదికి పట్టుకోవాల్సిందేనని గట్టిగా డిసైడైపోయారు.శునకం కనిపించని రోజు నుంచి వారికి నిద్ర, తిండి లేవు. కుక్క జాడ చెప్పిన వారికి యాభై వేల రివార్డ్ ప్రకటించడంతో సహా ఇంటింటికీ వెళ్లి శునకం ఆనవాళ్ల గురించి చెప్పడం, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించడం, డ్రోన్ నిఘా...ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.‘ఇంత కష్టం అవసరమా?!’ అని ఎంతోమంది అన్నారు. అయినా సరే కుక్క కోసం వెదకడం ఆపలేదు. ఎట్టకేలకు వారి అలుపెరగని గాలింపుకు ఫలితం దక్కింది. తాజ్‌మహల్ సమీపంలోని అడవిలో సంచరిస్తున్న గ్రేహౌండ్స్‌ను కనుగొన్నారు. దీపయాన్, కస్తూరి దంపతులు సెలవు రోజుల్లో ఆగ్రాకు వెళ్లారు. వూఫ్, గ్రేహౌండ్స్ అనే పెంపుడు కుక్కలను కూడా వెంట తీసుకెళ్లారు. ఫతేపూర్ సిక్రీని సందర్శిస్తున్న సమయంలో....‘గ్రేహౌండ్స్ కనిపించడం లేదు’ అని తాము బస చేసిన హోటల్ నుంచి ఫోన్ వచ్చింది.ఎలాగైనా గ్రేహౌండ్స్ ఆచూకి కనుక్కోవాలని అనుకున్న దీపయాన్, కస్తూరి దంపతులు రెండు వారాలపాటు ఆగ్రాలోనే ఉండి పోస్టర్లు వేస్తూ, బ్యానర్లు కడుతూ ఎన్నో ప్రాంతాలు తిరిగారు. అయినా ఫలితం లేకుండాపోయింది. గురుగ్రామ్‌కు తిరిగి వచ్చిన తరువాత కూడా తరచు ఆగ్రాకు వెళ్లేవారు. ఆటోలపై, దుకాణాలు, మెట్రో స్టేషన్ల దగ్గర ‘కనిపించడం లేదు’ అనే ప్రకటనలు అంటించేవారు. వారి ప్రచారం సోషల్‌మీడియాకు కూడా చేరింది. దీంతో యానిమల్ రెస్క్యూ గ్రూప్‌లు, వాలెంటీర్లు కూడా రంగంలో దిగారు. ఒకానొక రోజు గ్రేహౌండ్‌ను చూసిన టూర్ గైడ్ ప్రశాంత్ జైన్ నుంచి దంపతులకు ఫోన్ వచ్చింది. అలా కథ సుఖాంతం అయింది. మూడు నెలల తరువాత గ్రేహౌండ్స్ తన పెంపుడు పేరెంట్స్ దగ్గరికి చేరుకుంది. (చదవండి: ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!) -
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్‌లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్‌పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్‌పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్‌ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్‌లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం. తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్లను ఉపయోగించి ప్రోటాన్లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలుయాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
పతి దేవుడిపై ప్రతీకారమా? బెంబేలెత్తుతున్న బట్టతల బంగారమ్స్!
కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఎపుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియదు. అనేక సామాజిక అంశాలతోపాటు, ప్రేయసీ ప్రియుల చిలిపి తగాదాలు, భార్యభర్తల సరసాలు ,ఫైటింగ్‌లు లాంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. అలా తన పతిదేవుడిపై ఒక సతీమణి ప్రతీకారం తీర్చుకున్న వైనం వైరల్‌గా మారింది. ప్రతీకారం అంటే అదేదో హింసా, ప్రతి హింస అనుకునేరు. చదవండి మరి!తనకు చపాతి కావాలని అడిగాడు ఓ భర్త. ‘హే...పో.. ఇపుడెవరు చేస్తారు’ అంది భార్యామణి విసుగ్గా. నేనేమైనా మణులు, మాణిక్యాలు అడిగానా, చపాతియేగా..నాకోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు భర్త. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. ముందు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసిన భార్య చివరికి చపాతీ తయారీకి రంగంలోకి దిగింది. ‘‘ఇగో.. నేను చపాతీ చేయాలంటే నువ్వు సాయం చేయాలి మరి అంది గోముగా.. ఓ..దానిదేముంది చేసేద్దాం అన్నాడు భార్యామణి అసలు ప్లాన్ తెలియని భర్త.అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. బాగా పిసికి మెత్తగా పిండిని రెడీ చేసేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో, చపాతీలు కాల్చేందుకు కట్టెల పొయ్యి సిద్ధం చేసింది. ఇది చూసి ఇంకా ఉత్సాహంతో రంగంలోకి దిగాడు భర్త. మాంచిగా మఠం వేసుకుని కూర్చున్నాడు. మరి చపాతీలు చేయడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె పీటా, గీటా లేదని చెప్పింది. ‘‘అదేమిటోయ్..పీట లేకుండా చపాతీ ఎలా చేసేది’’ అంటూ భార్యమీద గుర్రుమన్నాడు. అప్పుడు తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్యామణి అటు ఇటు చూసిన ఆమె మీ గుండుగా నున్న....గా, దాని మీద చేస్తాను అన్నది. ఓసి నీ దుంపదెగ ఇదేం పని హూంకరించాడు భర్త. అవన్నీ జాన్తా నహీ.. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. సరే అలానే కానివ్వూ అని అన్నాడు. అలా అనడం ఆలస్యం, ఇంక ఏ మాత్రం సంకోచించకుండా, నున్నటి అతగాడి గుండు మీద తన ప్రతాపన్నంతా చూపించింది (చాలా రోజులనుంచి బోడి గుండు మీదు కోపం ఉన్నట్టుంది పాపం..) చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. భర్త చక్కగా పిండిలో ముంచి ఇవ్వడం, ఆమె గుండ్రంగా చపాతీ వత్తడి, ఆ తరువాత దాన్ని ఆయనగారు తీసి పెనం మీద కాల్చడం.. ఇందులో చూడవచ్చు. గతేడాది నవంబరులో షేర్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు.అరే... ఇందేంది భయ్యా.. నవ్వి నవ్వి మేం పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కిచెన్‌లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా తీర్చుకుంటారా అన్నారు. అంతేకాదు కొంతమంది భార్యలు కూడా ఇదే ఫాలో అయితే బోడినెత్తి బంగారు బాబుల పరిస్థితి ఏంటి బాసూ అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by GUAH BOCAH BOJONGGEDE (@katababa_) -
ఎవల్యూషన్ డే’ని జరుపుకొందాం!
ఇంగ్లిష్ నేచురలిస్ట్ ఛార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది. జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్ ఎవొల్యూ షన్) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.– డా. దేవరాజు మహారాజువ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‘ -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..!
వివాహమై 40 ఏళ్లు లేదా 60 ఏళ్లు అవ్వొచ్చు. మరీ ఎక్కువ కాలం ఇరువురు బతికుంటే దగ్గర దగ్గర 66 ఏళ్లు కూడా అవ్వొచ్చు. అంతేగానీ అన్నేళ్లు ఇరువురి జీవనయానం సాగించడం అంత ఈజీ కాదు. మధ్యలో ఎవరో ఒకరు కాలం చెందడం సర్వసాధారణం. అందులోనూ నేటి యువత పెళ్లై పట్టుమని రెండేళ్లు కూడా కలిసి ఉండటం లేదు. అలాంటి జంటల సంఖ్య వేళ్లతో లెక్కించలేనంత మంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో..దగ్గర దగ్గర సెంచరీకి సమీపం వరకు అన్నేళ్లు కలిసి సహచర్యం చేసిన జంటగా రికార్డు దక్కించుకుంది ఈ వృద్ధ జంట. వారిక ఏకంగా వందమంది పైగా మనవరాళ్లు, మనవళ్లు ఉన్నారు. ఇక ఆ వృద్ధ దంపతుల వయసు ఎంత ఉండొచ్చు, పెళ్లి ఎప్పుడైంది వంటి విశేషాల గురించి తెలుసుకుందామా..!.పెళ్లై 84 ఏళ్లు గడిచిన వృద్ధులుగా ఈ బ్రెజిలియన్ జంట నిలిచింది. సుదీర్ఘ కాలం అన్యోన్య దాంపత్య జీవితం గడిపిన జంటగా రికార్డు సృష్టించింది. ఆ దంపతుల పేర్లు మనోయల్ ఏంజెలిమ్ డినో, మరియా డి సౌసౌ డినో. వారి ప్రేమ కథ అత్యంత విచిత్రంగా జరిగింది. ఇద్దరు తమ కుటుంబాల పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవారు. ఇరువురు ఆ వ్యవసాయ వృత్తి ద్వారానే ఇరువురికి పరిచయం ఏర్పడింది. అయితే మళ్లీ విధి అనుకోకుండా మరోసారి ఎదురపడేలా చేసింది. ఇక అప్పుడే ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇక మనోయల్ కూడా తన మనసులోని మాటను మరియాకి చెప్పేశాడు. అందుకు సుమఖత వ్యక్తం చేసింది. అలా ఇద్దరు 1940లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరూ పోగాకు చుట్టడాన్ని జీవనోపాధిగా చేసుకుని బతుకు సాగించేవారు. ఇప్పుడు మనోయల్ వయసు 105 ఏళ్ల, మరియాకి 101 ఏళ్లు. ప్రస్తుతం ఇరువురు విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇన్నాళ్లు తమ వైవాహిక జీవితంలో ఇంతలా కలిసి ఉండటానికి కారణం ఒక్కటే ప్రేమ. అది తమ ఇద్దరి మధ్య మరొకరు వచ్చి అగాథం సృష్టించ లేనంత నమ్మకం, ప్రేమ వంటివి స్ట్రాంగ్ ఉన్నాయని చెబుతోంది ఈ జంట. "ఇరువురం అనుకోకుండా భార్యభర్తలమయ్యాం. మంచో చెడో వివాహ బంధంతో ఒక్కటయ్యాం. కడదాక నిలుపుకోవాలనుకున్నాం. మా ఇరువరి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ కారణంగా సుదీర్ఘకాలం అన్యోన్యంగా ఉండగలగాం." అని అంటున్నారు ఈ దంపతులు. అంతేగాదు ఎలాంటి పొరపాటు, తప్పు జరిగినా దాన్ని లేవనెత్తడం, ఆరోపణలు చేసుకోవడం వంటి వాటికి తావివ్వకోపోడం వల్లే తమ బంధం దృఢంగా ఉందని అన్నారు. అదే తమ సుదీర్ఘకాల ఆరోగ్య రహస్యానికి కారణం కూడా అని చెబుతోంది ఈ వృద్ధ జంట. నిజమే కాదు వ్యక్తిగత జీవితం ఆహ్లాదంగా ఏంటేనే కదా..మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండేది. -
పాతబస్తీ కుర్రాడు సైక్లింగ్‌లో ఇంటర్నేషనల్ లెవెల్..!
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్.. ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని సూపర్‌హిట్ డైలాగ్.. అలాగే హైదరాబాద్ చార్మినార్‌లోని పాతబస్తీకి చెందిన ఓ విద్యార్థి పారా సైక్లింగ్‌లో నేషనల్ లెవెల్ దాటుకొని ఇంటర్నేషనల్‌కు చేరాడు. చిన్ననాటి నుంచి చదువుతో పాటు సమయం దొరికినప్పుడల్లా క్రీడలపై మక్కువ చూపుతుండేవాడు. జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతున్న 13వ ఏషియన్ పారా రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు శాలిబండ సైక్లింగ్ క్లబ్ విద్యార్థి ఆశీర్వాద్ సక్సేనా.. పాతబస్తీ బేలా కాలనీకి చెందిన ఆశీర్వాద్ సక్సేనా కుటుంబం వ్యాపార రంగంలో ఉండగా చిన్ననాటి నుంచి క్రీడలంటే ఇష్టం ఉండటంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఎప్పుటికప్పుడు తన కోచ్‌ల ద్వారా మెళకువలు నేర్చుకుంటూ సైక్లింగ్‌లో ప్రతిభ కనబర్చాడు. మెల్బోర్న్లోని డాకిన్ యూనివర్సిటీలో ఎక్సైర్సైజ్ అండ్ స్పోర్ట్స్ సైన్స్‌లో డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూనే సైక్లింగ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఓవైపు విద్యాభ్యాసం.. మరోవైపు సైక్లింగ్‌లో పాల్గొంటూ పతకాల వేట కొనసాగిస్తున్నాడు. థాయిలాండ్‌లో కొనసాగుతున్న 13వ ఏషియన్ పారారోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్–2025లో పాల్గొనేందుకు నగరం నుంచి తన కోచ్‌లతో కలిసి వెళ్లాడు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు సాధించిన ఆశీర్వాద్ సక్సేనా థాయిలాండ్‌లో మెడల్ సాధిస్తాడని పలువురు క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 38వ జాతీయ ఆటల పోటీలలో..ఉత్తరాఖాండ్‌లో నిర్వహించిన 38వ జాతీయ పోటీల్లో 120 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ రోడ్ రేస్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా.. రాష్ట్రం తరఫున కాంస్యం సాధించిన ఆశీర్వాద్ సక్సేనాను తెలంగాణ స్టేట్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.విజయ్‌కాంత్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.దత్తాత్రేయ తదితరులు అభినందించారు. ఆశీర్వాద్ సక్సేనాను ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ ఆఫ్ హైదరాబాద్‌గా పిలుస్తున్నామని కె.దత్తాత్రేయ పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని నా కోరిక. విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ఓ వైపు ఉన్నత విద్యాభ్యాసం చేస్తూనే.. మరోవైపు ఇష్టమైన సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాను అని చెబుతున్నాడు ఆశీర్వాద్ సక్సేనాసాధించిన మెడల్స్..2019లో మహారాష్ట్రలో జరిగిన ఇండియన్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలో కాంస్యం 2021లో జైపూర్‌లో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో వెండి, కాంస్య పతకాలు 2022లో గౌహతిలో ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు వెండి పతకాలతో పాటు రెండు కాంస్య పతకాలు 2022లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా ట్రాక్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో మెల్బోర్న్లో అండర్–23 విభాగంలో క్రిటేరియం సైక్లింగ్ రేస్‌లో కాంస్యం 2024లో కర్ణాటకలో జరిగిన నేషనల్ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం 2024లో చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు వెండి పతకం సాధించారు. (చదవండి: భారత నారీమణుల మరో అరుదైన సాహసం..ప్రమాదాలకు కేరాఫ్ అయినా..!) -
పూసల దండలు అమ్మే అమ్మాయి నగల షాపు ఓపెనింగ్‌కి గెస్ట్‌గా..!
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయినిగుర్తు పట్టారా? కేరళలో ఒక నగల షాపుకు ఓపెనింగ్‌కు వచ్చింది. అంటే డబ్బు ఇచ్చి పిలిపించి ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. తమాషా చూడండి. రోడ్డు మీద కూచుని పూసల దండలు అమ్మే అమ్మాయి బంగారు ఆభరణాల షోరూమ్‌కు రిబ్బన్ కత్తిరించడం. సోషల్ మీడియా గొప్పతనం అలా ఉంది. మీకర్థమైంది కదా.. ఈ అమ్మాయి మోనాలిసా. మెడలో పూసలు వేసుకుని తిరిగే అమ్మాయి అదే మెడలో ఖరీదైన నెక్లెస్‌ను కాసేపటి కోసమైనా ధరించగలనని ఊహిస్తుందా? అదే జరిగింది. అదే మేజిక్.కుంభమేళాకు పూసలమ్ముకోవడానికి వచ్చిన 16 ఏళ్ల మోని భోంస్లే తన అందమైన కళ్లతో ప్రపంచాన్నే ఆకర్షించింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియా తోపాటు ప్రొఫెషనల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. ‘మోనాలిసా’ పేరుకు రాత్రికి రాత్రి ఇన్‌స్టాలో ఆమె ఫాలోయెర్లు కోట్లకు పెరిగారు. ఇండోర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన మోని భోంస్లే ఇప్పుడు సెన్సేషన్. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా కోసం ఆమె 21 లక్షల పారితోషికానికి సైన్ చేసిందని వార్త. ఇక ఇప్పుడు షోరూమ్‌ల ప్రాంరంభానికి కూడా ఆహ్వానాలు అందుకుంటోంది. కేరళ కోజికోడ్‌కు చెందిన జ్యువెలరీ షోరూమ్‌ను వాలెంటైన్స్ డే రోజున మోని భోంస్లే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. దాని యజమాని బాబీ చెమ్మనూర్ ఒక ఖరీదైన నెక్లెస్‌ను కాసేపు మెడలో వేసి ఆమెను సంతోషపెట్టారు. ఆమెను చూడటానికి జనం విరగబడ్డారు. ఆమెరాకతో ప్రచారం బ్రహ్మాండంగా దొరికింది. బదులుగా ఆమెకు మంచి పారితోషికం లభించింది. విమానాలలో, లగ్జరీ కారుల్లో ఇప్పుడు మోని భోంస్లే తిరుగుతోంది. సోషల్ మీడియా ఎవరి జాతకాన్ని ఎలా మారుస్తుందో ఊహించలేము. టాలెంట్ ఉంటే జనానికి చేరడానికి సోషల్ మీడియా ఉంది. దానిని సరిగ్గా ప్రదర్శించాలి. అయితే ఇదే సోషల్ మీడియాలో మెజారిటీ సెంటిమెంట్స్‌కు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే పాతాళానికి పడిపోతాము. కనుక ఆచితూచి వ్యవహరించాలి. ఇటీవల నంబర్ 1 యూట్యూబర్ రణ్వీర్ అహ్లాబాదియా మాట తూలి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. మరో విషయం ఏమిటంటే వ్యక్తిగత వివరాలు, చిరునామాలు వెల్లడి చేయకుండా సోషల్ మీడియాలో కేవలం మన టాలెంట్‌ను, కళను, ప్రతిభను చూపాలి. స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం కలిసొస్తే మోనాలిసా లాంటి ఫేమ్ పెద్ద కష్టం కాదు. View this post on Instagram A post shared by boche (@dr.boby_chemmanur) (చదవండి: కోళ్ల అందాల పోటీలు..!) -
కోళ్ల అందాల పోటీలు..!
కోడి పందేల్లోనే కాదు, అందాల పోటీల్లోనూ తగ్గేదేలే అంటున్నాయి కోళ్లు. కోళ్లకు అందాల పోటీలేంటని ఆశ్చర్యపోకండి, అందం ఎవరి సొంతం కాదని, కోడి పందేల మాదిరే, ఇరాక్‌లోని కుర్దిస్తాన్ జిల్లా, సులేమానిలో ఓ ప్రైవేటు సంస్థ ఇటీవల కోళ్లకు అందాల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో, దాదాపు వందకుపైగా కోళ్లు పోటీ పడగా, ఇరాక్‌కు చెందిన గరీబ్ మహమ్మద్ పెంచుకున్న కోడి, 96 పాయింట్లతో విజయం సాధించింది. కోడి శరీర పరిమాణం, రంగు, జాతి, ఈకల నాణ్యత, శరీర అకృతి ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, పోటీ న్యాయనిర్ణేతలు దీనికి ఈ పాయింట్లను ఇచ్చారు. ఇక ఈ విషయమై మహమ్మద్ మాట్లాడుతూ ‘నేను నా రెండు కోళ్లను కేవలం ప్రదర్శన కోసం మాత్రమే పెంచాను. వాటి ఆరోగ్యం, ఆహారం విషయంలో మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంకా చెప్పాలంటే, నా పిల్లల కంటే నా కోడినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను’ అని చెప్పాడు. (చదవండి: సునామీలో సర్వం కోల్పోయారు..కానీ ఆ అక్కా చెల్లెళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా..) -
డొల్ల విలాస్
పైన పటారం, లోన లొటారం అంటే అచ్చం ఇలాగే ఉంటుంది. 1987లో ఉత్తర కొరియా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ది ర్యుంగ్యాంగ్ హోటల్(The Ryungyang Hotel)’ అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటి. ‘ది హోటల్ ఆఫ్ డూమ్’( The Hotel of Doom) అని పిలిచే ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు ఆరువందల మిలియన్ల పౌండ్లు (అంటే రూ.6,330 కోట్లు) ఖర్చు చేసింది.తాజాగా, ఈ హోటల్‌కెళ్లిన యూట్యూబర్ కాకెరల్, ‘వెయ్యి అడుగుల ఎత్తు, 105 అంతస్తులతో పిరమిడ్ ఆకారంలో, బయటకు అందంగా కనిపించే ఈ హోటల్ లోపల అంతా డొల్ల్ల. చుట్టూ సిమెంట్ గోడలతో, చేసింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి, అతిథుల కోసం లగ్జరియస్ సదుపాయాలు, మూడువేల గదులతో డిజైన్ చేసిన ఈ హోటల్‌ను ఇప్పటి వరకు తెరవలేదు.వనరుల లోపం కారణంగా మధ్యలోనే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. అప్పటి నుంచి కేవలం చూడటానికి మాత్రమే అందంగా కనిపిస్తుంది కాని, ఇప్పటి వరకు ఈ హోటల్ ఒక్క అతిథికి కూడా ఆతిథ్యం ఇవ్వలేదు. ఇంకా నిర్మాణ దశలో ఉన్న హోటల్ ఇలాగే ఉంటుందని కొందరు అంటుంటే, మరికొందరు, కేవలం చూడటానికే ఈ హోటల్‌ను నిర్మించినట్లు ఉన్నారని సెటైర్లు వేస్తున్నారు. -
ప్రపంచం అంతమయ్యేది అప్పుడే..! వెలుగులోకి న్యూటన్ లేఖ..
ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతమవ్వడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్థారించారనేది కూడా పరిశోధనలో వివరించారు.చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ ఐజాక్ న్యూటన్ 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ప్రపంచం అంతం అవ్వడాన్ని ముందుగా అంచనా వేయడాన్ని డూమ్స్‌డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు. ఇక న్యూటన్ తన డూమ్స్‌డే ప్రవచనాన్ని బైబిల్ పొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ఆర్మగెడానా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్థారించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతుంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆ లేఖలో తెలిపారు. ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందపాటు ఊహలను ఆపడం, వారి అంచనాలు సరైన కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లేఖలో వివరించారుఅదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు. అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1,260 సంవత్సరాలకు మళ్లీ రీసెట్ అవుతుందని లేఖలో తెలిపారు. ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పే రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కడించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు. 1260 రోజుల కాలం, ముగ్గురు రాజులు AC 800 పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ 2060తో ముగుస్తుందట.ఇలాంటే డూమ్స్ డే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సామీప్యతలోకి రావచ్చని అంచనా వేశారు.(చదవండి: కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..) -
పిజ్జా సువాసన గల పెర్ఫ్యూమ్..!ఎక్కడ దొరకుతుందంటే..
పిజ్జా అంటే ఇష్టపడేవాళ్లకు నచ్చుతుందేమో ఈ పెర్ఫ్యూమ్. ఆహార పదార్థాల ఘుమ ఘుమల వాసనతో కూడిన ఫెర్ఫ్యూమ్ ఏం బాగుంటుందనే సందేహం అందిరలోనూ కలుగుతోంది. కానీ పిజ్జాలకు ప్రస్ధిగాంచిన డొమినోస్ మాత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఈ వెరైటీ పెర్ఫ్యూమ్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. పైగా తన పిజ్జా కస్టమర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుందని ధీమాగా చెబుతోంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే..ఈ వాలెంటైన్స్ డేకి పిజ్జా దిగ్గజం.. పెప్పరోని పిజ్జా లాంటి వాసన వచ్చే పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. పిజ్జా బాక్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందట. ఈ ఫెర్ఫ్యూమ్ లాంఛ్‌కి సంబంధించిన వీడియోడని కూడా నెట్టింట షేర్ చేసింది డొమినోస్. అంటే ఇది పిజ్జా లాగిద్దామనే కోరిక పెంచుతుందేమో మరీ..!. ఇది తినాలనే కోరికను కలిగించేలా ఉంటుందే తప్ప ప్రేమికుల రోజున ఆహ్లాదాన్ని అందించి, ఒక్కటయ్యేలా ఫీల్‌ని ఎలా తెప్పిస్తుందని నెటిజన్లు సందేహాలు లేవెనెత్తారు. అయితే డొమినెస్ మాత్రం ఈ పెర్ఫ్యూమ్ని పెప్పరోని ప్యాషన్ పిజ్జా నుంచి ప్రేరణ పొందినట్లు తెలుపుతోంది. ఈ పెర్ఫ్యూమ్ స్పైసీ, పెప్పరీ నోట్స్ , వెచ్చని వుడీ అండర్టోన్లతో రూపొందించారట. ఇది పేరుకి తగిన విధంగా పిరమిడ్ ఆకారపు బాటిల్లో పిజ్జా ముక్కలను పోలి ఉంటుంది. అయితే ఇది కొనుగోలుకు అందుబాటులో లేదట. డొమినోస్ ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు దీన్ని 65 మంది లక్కీ విన్నర్స్కి గిఫ్ట్‌గా ఇవ్వనుందట. వారంతా ఆ 30 ఎంఎల్ పిజ్జా సెంట్‌ని బహుమతిగా పొందుతారట. ఇది కేవలం యూకే, ఐర్లాండ్‌ల్లో ఉండే ప్రజలకే ఈ అవకాశం దక్కుతుందని పేర్కొంది. నెటిజన్లు మాత్రం ఇదేం వెర్రీ ఇలాంటి పెర్ఫ్యూమ్లను లాంఛ్ చేస్తారా..? అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేగాదు డొమినెస్లో పనిచేసేవాడికి ఆ సువాసన ఎల్లప్పుడూ ఉచితంగానే దొరుకుతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Luke Debono 🇲🇹 (@lukedebono1) (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి రియల్ లవ్ స్టోరీ..!
చరిత్రలో విషాదకరంగా మిగిలిన ఎన్నోప్రేమ కథలను చూశాం. అయితే అవే కాకుండా మన చుట్టు పక్కలే జరిగిన యదార్థ ప్రేమ సంఘటనలు ప్రాచుర్యం లేక కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వాటిని ఒక్కసారి పరికించి తెలుసుకునే యత్నం చేస్తే హృదయం ద్రవించిపోతుంది. అలాంటి రియల్ లవ్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది చరిత్ర గుర్తించని 500 ఏళ్ల నాటి యదార్ధ ప్రేమ గాథ. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఈ తరానికి తెలియకుండా మసకబారుతున్న శతాబ్దల నాటి ఆ అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.కదిరి నరసింహా దేవాలయంలో చిగురించి ఈ ప్రేమకథ. ఇరాన్ దేశం నుంచి మోహియార్ అనే యువకుడు వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అనంతపురం జిల్లాకు చేరుకున్నాడు. ఆ సమయంలో కదిరి నరసింహ దేశాలయంలో కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగరాయల కూతురైన చంద్రవదన స్వామివారిని దర్శనం కోసం వచ్చింది. అప్పుడు ఆ యువతిని చూసిన మెహియర్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. చంద్రవదన కూడా పేరుకు తగినట్లుగా పున్నమి నాటి చంద్రుడిలా ముగ్ధమనోహరంగా ఉంటుంది. ఇక అప్పటి నుంచి మెహియర్ ఆమెను అనుసరిస్తూ..ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్తుండేవాడు. దీన్ని గమనించిన చంద్రవదన కూడా ఆ యువకుడిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కదిరి పట్టణం వాసుల గారాల పట్టి కావడంతో ఇరువురు కలుసుకోవడం అత్యంత కష్టంగా ఉండేది. దీంతో ఇద్దరు తమ స్నేహితుల ద్వారా ఒకరికొకరు సందేశాలు పంపుకునేవారు. చివరికి తమ ప్రేమ విషయం పెద్దలకు తెలియజేస్తారు. వారి సమ్మతితోనే పెళ్లిచేసుకోవాలనే భావిస్తారు. అందుకు పెద్దలు అంగీకరించారు. పైగా ఆ ప్రేమికులు ఇద్దరిని కలుసుకోనివ్వకుండా కట్టుదిట్టం చేస్తారు. దీంతో విరహవేదనను భరించలేక మెహియర్ పూర్తిగా నిద్రహారాలు మానేస్తాడు. అలా మెహియర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణించాడు. తన కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రియుడిని తలుచుకుంటూ చంద్రవదన కూడా తుదిశ్వాస విడుస్తుంది. ఈ ఘటనతో కదిరి గ్రామం వాసుల ప్రజలు తామెంతో తప్పు చేశామని బాధపడతారు. కనీసం మరణంలోనైన ఇరువురు కలిసి ఉండాలని భావించి ఇరువురు సమాధులను ఒకచోటే ఏర్పాటు చేస్తారు గ్రామస్తులు. ఈ ప్రాంతంలోని అనేకమంది తమ పిల్లలకు మెహియార్ అనే పేరులు పెట్టుకుని ఆ అమర ప్రేమికులను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నారు. అంతేగాదు వారి సమాధిని దర్శిస్తే తమ ప్రేమ ఫలిస్తుందనేది ప్రేమికుల నమ్మకం కూడా. దీంతో ఈ సమాధులను దర్శించుకునేందుకు ప్రేమికుల తాకిడి కూడా గట్టిగానే ఉండేది. అయితే రాను రాను తర్వాతి తరాలకు తెలియకుండా మసకబారడం మొదలైంది. దాంతో సందర్శకుల తాకిడి నెమ్మదిగా తగ్గిపోయింది.(చదవండి: 'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
'అంతులేని ప్రేమ కథ': 50 ఏళ్లు గర్ల్‌ఫ్రెండ్ కోసం నిరీక్షించాడు..!
యధార్థ ప్రేమ కథ ఇది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మి పది, పన్నేండేళ్లు కాదు ఏకంగా జీవితాంతం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు అలానే ఉండిపోరు. ఆమె వస్తుందని చివరి శ్వాస వరకు ఎదరుచూసిన గొప్ప ప్రేమ పిపాసి.ఆ వ్యక్తే మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళాతపస్వీ కెకీ మూస్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ ఆయన అంతులేని ప్రేమ కథను వివరించారు. ఆయనిచ్చిన సమాచారం ప్రకారం..1912 అక్టోబర్ 2న ముంబైలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు. కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్గావ్ స్టేషన్‌కు సమీపంలో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.ముంబైలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు. కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వం పొందారు. అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.ప్రేమ చిగురించింది..ఆయన ముంబైలో చదువుతుండగా నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు. దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.అయితే, నీలోఫర్ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెకీతో కలిసి చాలిస్గావ్ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కెకీ ముంబై నుంచి చాలిస్గావ్ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు. అది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మార్చారు. నీలోఫర్ కైకీకి వీడ్కోలు పలుకుతూ..ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్లో చాలిస్గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని మాటిచ్చారు. ఆ ఒక్క మాట కోసం ఆయన తన చివరి శ్వాస వరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఎంతలా ఎదురు చూశారంటే..ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవన్నీ మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు. తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు. ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు. అలా చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలా పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన చివరి డిన్నర్ డిసెంబరు 31, 1989 వరకు అలానే చేశారు. ఆ రోజూ కూడా పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే భోజనం చేసి పడుకున్నారని, ఇక లేవలేదని సావంత్ చెప్పుకొచ్చారు.చిన్న ట్వీస్ట్ ఏంటంటే..కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని ఆర్ట్ గ్యాలీరీ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ సామంత్ తెలిపారు.ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. అయితే కేకీ ఆ ఉత్తరాలను ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు. ఎన్నింటిలో ప్రావిణ్యం ఉందంటే..కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి. ఆయనకు పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా తెలుసు. అంతేగాదు మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు. అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది. View this post on Instagram A post shared by Yatin Pandit (@sculptor.yatinpandit) (చదవండి: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!) -
Valentines Day 2025: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!
ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. అవి వింటుంటేనే మనసు అదొలా అయిపోతుంటుంది. మరీ ఈ వాలెంటైన్స్‌డే సందర్భంగా చరిత్ర ముడిపడి ఉండి, అజరామరంగా నిలిచిపోయిన అందమైన లవ్ స్టోరీలను గురించి తెలుసుకుందామా..!మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా:చరిత్రకారులను బాగా ఆకర్షించిన ప్రేమ కథల్లో ఒకటి మార్క్ ఆంటోనీ- క్లియోపాత్రా కథ. జూలియస్ సీజర్ మరణం తరువాత, రోమన్ సామ్రాజ్యాన్ని ముగ్గురు వ్యక్తులు పరిపాలించారు. వారే మార్క్ ఆంటోనీ, ఆక్టేవియస్ సీజర్, లెపిడస్. మార్క్ ఆంటోనీ తూర్పు మధ్యధరాను శాసిస్తూ ఈజిప్టులో నివసిస్తున్నాడు. అతను ఈజిప్ట్ రాణి క్లియోపాత్రాతో కూడా ప్రేమలో పడ్డాడు. ఆంటోని తన భార్య ఫుల్వియా మరణం, తన తోటి పాలకుడు ఆక్టేవియస్ సీజర్‌పై పాంపే తిరుగుబాటు తదితరాల వల్ల ఆంటోనీ రోమ్కు వెళ్లవలసి వస్తుంది. అతను తన స్నేహితుడు ఎనోబార్బస్తో కలిసి ప్రయాణిస్తాడు. అయితే ఆంటోనీకి తన స్నేహితుడు ఆక్టేవియస్ సీజర్‌కి కొన్ని కారణాల వల్ల మనస్పర్థలు వస్తాయి. దీంతో వీటిని రూపుమాపుకునేలా సీజర్ సోదరి ఆక్టేవియస్ని రాజకీయ వివాహం చేసుకుంటాడు. ఈ వివాహంతో లెపిడస్‌తో సహా పాలకులు తిరుగుబాటుదారుడైన పాంపేతో శాంతి ఒప్పందం ఏర్పరుచుకుంటాడు ఆంటోని. అయితే ఆంటోని మాటతప్పి మళ్లీ క్లియోపాత్ర వద్దకు వెళ్లిపోతాడు. దీంతో విసిగిపోయిన ఆక్టేవియస్ సీజర్ తాము ఏర్పరచుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకుని మార్క్ ఆంటోని, క్లియోపాత్రలపై యుద్ధం చేసేందుకు దిగుతాడు. అయితే ఈ యుద్ధంలో ఆంటోని ఓటమిని చవి చూడాల్సి వస్తుంది. ఓపక్క తన ప్రాణ స్నేహితుడు ఎనోబార్బస్ సైతం ఈ కష్టకాలంలో వదిలి దూరంగా వెళ్లిపోతాడు. మరోవైపు క్లియోపాత్రకు ఆంటోని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని దూరం జరిగే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే క్లియో పాత్ర సైనికులు ఆంటోనికి సహకరించకుండా పారిపోవడం జరుగుతుంది. దీంతో ఆంటోనికి క్లియోపాత్ర తనను మోసం చేసిందన్న కోపం ఎక్కువవ్వుతుంటుంది. కానీ క్లియోపాత్ర అతడి ప్రేమను పరీక్షించే నిమిత్తం తన సహచర చెలికెత్తలతో తాను మరణించినట్లుగా వార్త పంపిస్తుంది. ఈ వార్త విని ఆంటోని కుంగిపోయి తన కత్తితో పొడుచుకుని చనిపోతాడు. వెంటనే అతడిని క్లియోపాత్ర పరిచారికలు అతడిని ఆమె వద్దకు తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఆంటోని ఆమె చేతిలోని ప్రాణాలు వదిలేస్తాడు. మరోవైపు ఆక్టేవియస్ సీజర్ దండయాత్ర చేసుకుంటూ రోమ్ వైపుకి వచ్చేస్తుంటాడు. దీంతో ఆమె ఒక విషపాముతో కరిపించుకుని మరీ ప్రాణాలు వదిలేస్తుంది. ఇక్కడ ఇరువురు ఎంతో గాఢంగా ప్రేమించుకునన్నారు చిన్న మనస్పర్థ ఒకరినొకరు దూరం చేసుకునేందుకు కారణమైంది. అయితే వారికి ప్రాణాలు కోల్పోయిన టైంలో తమది నిజమైన ప్రేమ అని గుర్తించడం బాధకరం.ముంతాజ్ మహల్- షాజహాన్: !అర్జుమంద్ బాను బేగంగా జన్మించిన ముంతాజ్ మహల్ యువరాజు ఖుర్రామ్(షాజహాన్ ) హృదయాన్ని దోచుకుంది. ఆమె కేవలం ఖుర్రామ్కి రాణి మాత్రమే కాదు నమ్మకమైన సలహాదారు, సహచరురాలు. అయితే ముంతాజ్ విషాదకరంగా 1631లో తన పద్నాలుగో బిడ్డకు జన్మినిస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో షాజహాన్ ఏళ్ల తరబడి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆమె జ్ఞాపకార్థం కట్టించిన స్మారక చిహ్నమే తాజ్ మహల్. ఏడు వింతల్లో ఒకటిగా నిలవడమే గాక యునెస్కో గుర్తింపును కూడా పొందింది. ఏటా లక్షలాదిమంది ఈ మహల్‌ని చూసేందుకు రావడమే గాక శాశ్వత ప్రేమకు చిహ్నంగా కీర్తిస్తారు. రోమియో - జూలియట్:ఈ ప్రేమ కథ వెరోనా నగరంలో జరిగింది. ఇరువురి కుటుంబాల నేపథ్యం వేరు. దీంతో వీరిద్దరిని కలవనిచ్చేవారు కాదు బంధువులు. అయినప్పటికి వాళ్ల కళ్లుగప్పి కలుసుకుంటూనే ఉండేవారు. తమ ప్రేమను ఎలాగైన నిజం చేసుకోవాలని ఇరువురు ఆరాటపడ్డారు. అయితే రోమియో అనుకోకుండా జూలియట్ బంధువు టైబాల్ట్‌ను క్షణికావేశంలో చంపడం జరుగుతుంది. ఈ నేరం కారణంగా రోమియోను వెరోనా నగరం నుంచి బహిష్కరిస్తారు. దీంతో ఇరువురూ ఒకరినొకరు చూసుకోలేనంత అగాథం ఏర్పడుతుంది. అయితే రోమియోకి జూలియట్ చనిపోయినట్లు నమ్మించేలా ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు చూపిస్తారు ఆమె బంధువులు. దీంతో జూలియట్ లేకుండా జీవించలేనంటూ ప్రాణం తీసుకుంటాడు. ఇంతలో మెల్కొన్న జూలియంట్ రోమియో చనిపోవడం దుఃఖంతో గట్టిగా విలపిస్తుంది. అలా ఏడుస్తూనే ప్రాణాలు వదిలేస్తుంది. అప్పడు గానీ వారి స్వచ్ఛమైన ప్రేమను గుర్తించరు అక్కడి ప్రజలు.షిరిన్- ఫర్హాద్: ఇది పర్షియన్ ప్రేమ కథ. అందమైన ఆర్మేనియన్ యువరాణి షిరిన్. ఆమె అందం ససానియన్ రాజు ఖోస్రో II దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే ఫర్హాద్ శిల్పి, రాతికట్టడాలను నిర్మించడంలో నేర్పరి. ఇరువురి మధ్య హోదాల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. అయినా వాటన్నింటిని పక్కన పెట్టి ఒకరినొకరు విడిచి ఉండలేనంత గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిని ఎలాగైన విడదీయాలన్న ఉద్దేశ్యంతో యువరాజు ఖోస్రో ఫర్హాద్కి కష్టమైన పనులన్నీ అప్పగించేవాడు. అన్నింటిని అలవోకగా చేసేయడంతో చివరికి షిరిన్ చనిపోయినట్లు అబద్ధం చెబుతాడు. ఆ వార్త వినడంతోనే కుప్పకూలిపోతాడు ఫర్హాద్. ఆవేదనతో తమ ప్రేమను ఏ పర్వతంపై చెక్కాడా అక్కడకే వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు. ఫర్హాద్ మరణవార్త విని అతడున్న చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది షిరిన్. ఆమె కూడా అక్కడ నుంచే దూకి చనిపోతుంది.లైలా-మజ్నున్: పర్షియన్, అరబిక్ సాహిత్యంలో భావితరాల కోసం భద్రపరచబడిన గొప్ప ప్రేమ కథ లైలా-మజ్నులది. మజ్నుగా పిలిచే ఖైస్ కవి. అతడు సంపన్న కుటుంబానికి చెందిన లైలాతో ప్రేమలో పడతాడు. లైలా అందం, తెలివిలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అయితే మజ్ను ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందువల్ల లైలాకు అతడు తగిన జోడి కాదని ఇరువురి కుటుంబాలు వారి ప్రేమను నిరాకరిస్తాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా తమ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో చూపించాలాని భావిస్తారిద్దరు. విధి మరోలా వారిప్రేమను పరీక్షించింది. ఇక్కడ లైలా తండ్రి మరో సంపన్న వ్యక్తితో పెళ్లి చేసి పంపేస్తాడు. లైలా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న విరహంతో పిచ్చి వాడైపోతాడు మజ్ను. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా.. ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం బారినపడి లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్, లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చిందని అంటారు చరిత్రకారులు. ఎందుకంటే "మజ్ను లైల" అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. వారిప్రేమ విషాదంగా ముగిసినా..ఇప్పటికీ ప్రేమికులు వారిని తలుచుకుంటూనే ఉంటారు. అలాగే "ప్రేమ" అనగానే ఆ ఇరువురే గుర్తు వచ్చేలా చిరస్మరణీయంగా నిలిచిపోయారు.(చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
జేడీ వాన్స్ పిల్లలకు ‘మోదీ మార్క్’ గిఫ్ట్‌లు
ప్రధాని నరేంద్ర మోదీ ఏఐ యాక్షన్ సమ్మిట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అమెరికాలో అడుగుబెట్టారు. అలాగే మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుమారుని పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ పిల్లలకు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఇచ్చిన బహుమతులు హాట్‌టాపిక్‌గా మారాయి. మోదీ మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టేలా, పర్యావరణ హితమైనవి బహుమతులగా వారికి ఇవ్వడం విశేషం. మరీ ఆ గిఫ్ట్‌ల విశిష్టత ఏంటో చూద్దామా..!.టాయ్ ట్రైన్, ఆల్ఫాబెట్ సెట్‌ని అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ పిల్లలకు ఇచ్చారు మోదీ. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు డోక్రా ఆర్ట్‌వర్క్ - రాతి పనితో కూడిన సంగీతకారులను బహుమతిగా ఇచ్చారు. మోదీ పర్యావరణ అనుకూలంగా.. చెక్కతో చేసిన వర్ణమాల సెట్‌ని జేడీ వ్యాన్స్ కుమార్తె మిరాబెల్ రోజ్ వాన్స్‌కు బహుమతిగా ఇచ్చారు. ఇది పిల్లలకు మంచిగా అక్షరాలను గుర్తుపట్టేలా చేసి తొందరగా నేర్చుకునేందుకు దోహదపడుతుంది. ఇది ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా, హానికరమైన రసాయనాలు లేని బహుమతి. అంతేగాదు పర్యావరణ పరిరక్షణకు తాము పెద్ద పీట వేస్తాం అనేలా పరోక్షంగా చెప్పినట్లుగా ఉన్నాయి ఆ బహుమతులు. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కి ఇచ్చిన డోక్రా ఆర్ట్ వర్క్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మా దేశ సంస్కృతి, హస్త కళా నైపుణ్యం ఎట్టిదో తెలియజేస్తున్నట్లుగా ఉంది. చేతల ద్వారా తామెంటన్నది చెప్పడమే మన నాయకులు గొప్పతనం కాబోలు. కాగా ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మోదీ మూడు రోజులు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఇక అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, శక్తి, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, ప్రపంచ టెక్ CEOల సమావేశం అయిన AI యాక్షన్ సమ్మిట్‌కు ఆయన సహ అధ్యక్షత వహించారు. ఫ్రాన్స్ పర్యటన అనంతరం బుధవారం సాయంత్రం అమెరికాలో పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ రెండొవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాలో చేసిన తొలి పర్యటన ఇది. అక్కడ మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఈ నెల 12 నుంచి 13 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడ బ్లెయిర్ హౌస్‌లోనే బస చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రేమకు ప్రతిరూపమైన అమ్మను ప్రేమిద్దామిలా..!) -
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్‌వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్‌వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్‌వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
చిన్నారుల బర్డ్ వాక్: పక్షులతో గడిపే ఛాన్స్..!
పక్షులను చూడటం అంటే ప్రకృతితో మమేకమై గొప్ప ఆనందాన్ని పొందే అరుదైన క్షణం. ముఖ్యంగా చిన్నారులకు ఇది తెలియజేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వారిలా నిశితంగా గమనించడం పెద్దలకు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వారికి ప్రతీది అద్భుతంలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫౌండేషన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ పేరుతో బర్డ్ వాక్‌లు ఏర్పాటు చేసి చిన్నారులు వాటితో నేరుగా గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఏటా గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ ఈవెంట్ ఫిబ్రవరిలో నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఏడాది అలానే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భారతదేశంలోని మొత్తం ఎనిమిది నగరాల్లో ఎనిమిది బర్డ్ వాక్‌లు నిర్వహించనుంది. ఇది ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్లోఇన ప్రధాన నగరాలైన బెంగళూరు (కర్ణాటక), దిమాపూర్ (నాగాలాండ్), హలోల్ (గుజరాత్), జైపూర్ (రాజస్థాన్), మంగళూరు (కర్ణాటక), రాంచీ (జార్ఖండ్), త్రివేండ్రం (కేరళ), ఉజ్జయిని (మధ్యప్రదేశ్) నగరాల్లో జరగనుంది. వీటిని ఎర్లీ బర్డ్ అండ్ అటవీ బర్డ్ ఫౌండేషన్ నిర్వహిస్తాయి. ఇది అనుభవజ్ఞులైన పర్యావరణవేత్తల నేతృత్వంలో ఈ బర్డ్ వాక్ జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పక్షులను నేరుగా వీక్షించి, గడిపే అరుదైన అవకాశం లభిస్తుంది. గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్ అనేది ఒక గ్లోబల్ సిటిజన్ సైన్స్ ప్రాజెక్ట్. ఈ పేరుతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులు ప్రజలు పక్షులను గమనిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ప్రపంచ పక్షుల జనాభా గురించి, వాటి విశేషాల గురించి పంచుకుంటారు. ఈ ఏడాది భారత్ అనేక నగరాల్లో దీన్ని నిర్వహించనుంది. ప్రస్తుతం నిర్వహించనున్న '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు' మాత్రం చిన్న పిల్లల కోసం ఒక ప్రత్యేక ఎడిషన్. గతేడాది వైల్డ్‌లైఫ్ వీక్ సందర్భంగా, ఆరుగురు ప్రకృతి విద్యావేత్తల ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 8, 2024 తేదీలలో మొత్తం ఆరు వేర్వేరు నగరాల్లో బర్డ్ వాక్‌లను నిర్వహించారు. (చదవండి: ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాలివే..భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..
ప్రంపచంలోనే అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేస్తుంది. దీన్ని నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం.. ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ఈ అవినీతి (పీపీఐ) ర్యాంకులు ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి అనేది అతిపెద్ద ప్రమాదకరమైన సమస్యగా మారిందని పేర్కొంది. ఈ జాబితాలో డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అయితే భారత్ 96వ స్థానంలో ఉంది. ఈ అవినీతి సూచిక దాదాపు 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ అవినీతిని సున్నా నుంచి వంద మార్కుల స్కోరు ఆధారంగా నిర్థారిస్తుంది. సున్నాని అత్యంత అవినీతిని సూచించగా, వంద అనేది అవినీతి రహితం నిర్ణయించి ర్యాంకులు ఇవ్వడం జరగుతుంది.అయితే ఈ ఏడాది అవినీతి అవగాహన సూచిక (CPI) ప్రకారం..చాలా దేశల్లో ఈ విషయంలో మంచి మార్పు కనిపించిందని పేర్కొంది. ఇక ఆ జాబితా ప్రకారం 2024లో భారతదేశం మొత్తం స్కోరు 38 కాగా, 2023లో 39, 2022లో 40. అయితే గతేడాది 39 స్కోరుతో 93 స్థానంలో నిలివగా ఈ ఏడాది మరో మూడు స్థానాలకు పడిపోయింది. అలాగే భారత్‌కి పొరుగున్న ఉన్న దేశాలు పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149వ స్థానాలతో త్యంత అవినీతి గల దేశాలుగా నలిచాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కంటే తక్కువ అవినీతి గల దేశంగా 76వ స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 69 పాయింట్ల నుంచి 65కి పడిపోయింది. ఇదే క్షీణతలో ఉన్న ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లుతో 67 మార్కులతో ఐదు స్థానాలకి పడిపోయి 25వ స్థానంలో నిలిచింది. ఇక జర్మని మూడు పాయింట్లు తగ్గి 75 స్కోరుతో 15వ స్థానంలో నిలిచింది. అలాగే దశాబ్దానికి పైగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనిజులా వంటి దేశాలు అవినీతి సూచికలో అత్యంత చెత్త ప్రదర్శనను కనిబర్చినట్లు వెల్లడించింది. అలాగే ప్రధాన అవినీతి కేసుల్లో న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో కూడా ఐదు పాయింట్లు తగ్గి 26కి స్కౌర్ చేసిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. చివరిగా అత్యంత అవినీతి దేశాలుగా దక్షిణ సూడాన్ కేవలం ఎనిమిది పాయింట్లతో ఇండెక్స్‌లో అట్టడుగుకు పడిపోగా, సోమాలియా స్కోరు తొమ్మిదికి పడిపోయింది. గతంలో అత్యంత అవినీతి దేశంగా తొలి స్థానంలో ఉన్న సోమాలియా స్థానాన్ని దక్షిణ సూడాన్ ఆక్రమించిందివాటి తర్వాత స్థానాల్లో వెనిజులా 10, సిరియా 12 మార్కులతో అత్యంత అవినీతి దేశాల జాబితాలో నిలిచాయి. కాగా, 2024లో "ప్రపంచ అవినీతి స్థాయిలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నప్పటికీ, 148 దేశాలు అత్యంత అధ్వాన్నంగా ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల మంచి పురోగతి సాధించేలా మరింతగా ఆయా దేశాలు కృషి చేయాల్సి ఉందని పేర్కొంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ .(చదవండి: అరవై రోజుల అద్భుతం 'నవార'!) -
బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్‌ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్‌లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్‌కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్‌కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు. As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది. -
కనువిప్పు కలిగించే సలహ..! పోస్ట్ వైరల్
ప్రస్తుతం అందరివి బిజీ బిజీ జీవితాలే. క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా పరుగులు.కనీసం వేళకు తిండి తిప్పలు లేకుండా బతికేస్తున్నాం. పైగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు ఫోజులు కొడుతుంటాం. మన స్థాయి కంటే చిన్నవాళ్లు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు అద్భుతమైన సలహలిస్తుంటారు. వాటిని విన్నప్పుడు ఒక్క క్షణం నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయానా..? అనిపిస్తుంది. మంచి ఆలోచనలనేవి ఉన్నత స్థితి నుంచి కాదు, అంతకుమించిన ఉన్నతమైన మనసు ఉన్నవారికేనని అర్థమవుతుంది. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ మహిళకు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది.ముంబైకి చెందిన మహిళ(Mumbai woman) ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. అది వచ్చేలోపే అక్కడే కొబ్బరిబొండాలు అమ్ముకునే వ్యాపారి(Coconut Seller) వద్దకు వెళ్లి..కొబ్బరి బొండం ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె ఉబర్ఆటో వచ్చేస్తుందని తొందరగా కొబ్బరి బొండం కొట్టివ్వమని చెబుతుంది. దీంతో అతడు మేడమ్ ప్రజలంతా డబ్బు సంపాదించడానికే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు గానీ ఆ సంపాదన కాసేపు నిశ్చంతంగా తినడానికి తాగడానికి అవకాశం ఇవ్వలేప్పుడు వేస్టే కథా మేడమ్ అంటాడు. దీంతో ఆ మహిళకి అతడి మాటలు ఏదో మంత్రం చల్లినట్లుగా అనిపిస్తాయి. నిజమే కదా..అనే భావన కలిగుతుంది ఆమెలో. తానెందుకు ఇలా ఆలోచించలేకపోయాను, ఒక సాధారణ వీధి వ్యాపారి చెబితేగానీ తెలుసుకోలేకపోయానా అని ఫీలవుతుంది. పని.. పని..అంటూ పరుగులు పెట్టేస్తాం. కానీ పనిని కాసేపు వదిలేసినా అలాగే ఉంటుంది. అంతేతప్ప ఏం కాదు. కనీస ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ తర్వాత పని కాదు కదా..మనల్ని చూసుకునేవాడు కావాల్సిన దుస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి వచ్చేలోపే మేల్కొంటే మంచిది అంటూ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరికొందరూ కూడా తమ అనుభవాలను షేర్ చేస్తూ..మన గురించి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం అంటూ తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. కాబట్టి మనం క్షణ తీరిక లేని బిజీ లైఫ్‌తో అనారోగ్యం పాలవ్వడం కంటే..ముందుగానే మేల్కొని కొద్ది సమయమైన మనకోసం కేటాయించడం బెటర్ కదూ..!.told bhaiya to cut my coconut fast because my uber was on the way & man casually said “itna paisa kyu kamate ho? kaam toh chalta rahega lekin khane peene ko time dena chahiye” nice grounding advice pic.twitter.com/wz66mFqnUn— gargi (@archivesbygargi) February 7, 2025 (చదవండి: పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!) -
పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!
ఎంత పెద్ద ఫేమస్ సింగర్ అయినా ఒక్కోసారి ఊహించని చేదు అనుభవాలు ఎదురవ్వుతుంటాయి. ముందుగా ప్లాన్ చేసుకుని, పర్మిషన్ తీసుకున్నా ఒక్కోసారి అవమానపాలుకాక తప్పదనేలా ఉంటాయి పరిస్థితులు. హుందాగా, నిజాయితీగా వ్యవహరించినా..అధికార దర్పం ముందు తలవంచక తప్పదేమో ఒక్కసారి. ఇదంతా ఎందుకంటే..నాలుగుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకుని, పాప్ ఐకాన్‌గా పేరుగాంచిన సింగర్‌కి బెంగళూరులో అనుకోని పరిణామాన్ని చవిచూశాడు. ఏం జరిగిందంటే.. బ్రిటిష్ గాయకుడు-గేయ రచయిత ఎడ్ షీరన్ బెంగళూరులో చర్చి స్ట్రీట్‌లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ ఎదురుగా ప్రదర్శన ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రదేశంలో ఒకటికి మించి రెండు పాటలతో అలరించబోతున్నా అంటూ మొదలు పెట్టారాయన. షీరన్ ముందుగా మొటి పాట అనగానే ఒక పోలీసు ఎంట్రీ ఇచ్చి ప్రదర్శనను అడ్డుకున్నారు.ఆయన ప్రదర్శన జరగకుండా స్పీకర్లను కూడా డిస్కనెక్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, ఎడ్ షీరన్ మాత్రం ముందుస్తు ప్రణాళికతోనే ఈ ప్రదర్శన ప్లాన్ చేశామన్నారు. ఇలా రోడ్డుపై ప్రదర్శన ఇచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. తామేమి అకస్మాత్తుగా అప్పటికప్పుడూ ఇలా ప్రదర్శన ప్లాన్ చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు. కాగా, షేప్ ఆఫ్ యు, థింకింగ్ అవుట్ లౌడ్, పర్ఫెక్ట్ అండ్ కాజిల్ ఆన్ ది హిల్ వంటి హిట్ పాటలకు పేరుగాంచిన పాప్ రాక్ ఐకాన్ ఎడ్ షీరన్. అతని ఆల్బమ్‌లు హాటకేక్లా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది అమ్ముడైపోయాయి. ఆయన జనవరి 30 నుండి ఫిబ్రవరి 15 వరకు భారత్‌లో పర్యటించనున్నారు.A police officer pulled the plug when Ed Sheeran surprised everyone on Church Street😂😭😭😭 pic.twitter.com/cMIRoLC7Mk— Naai sekar (@snehaplsstop) February 9, 2025 (చదవండి: దటీజ్ సుధీర్..! దూషించే పదాన్నే లగ్జరీ బ్రాండ్‌గా మార్చి..) -
రహస్యగదిలో బంగారు నిధి
అమెరికాలోని ఒక పురాతన చర్చి లోపల ఉన్న రహస్యగదిలో శతాబ్దాల నాటి బంగారు నిధిని తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చర్చి లోపలి గోడల్లో చిన్న అల్మరాలా కనిపించే ఒక గదిలో సుమారు 500 సంవత్సరాల నాటి పోలండ్, లిథువేనియా చక్రవర్తుల కిరీటాలు బయటపడ్డాయి. ఈ గదిలో నాణేలు, గొలుసులు, కిరీటాలు, శవపేటిక ఫలకాలు, రాజదండం వంటి ఇతర అమూల్యమైన వస్తువులు కూడా ఉన్నాయి.మొత్తం 59 పురాతన వస్తువులు, కళాఖండాలు ఇందులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటితోపాటు, వస్తువులను చుట్టిన ఒక వార్తాపత్రిక ఉంది. ఇది జర్మనీపై బ్రిటన్ యుద్ధం ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత, 1939 సెప్టెంబర్ 7వ తేదీ నాటిది. దీని ఆధారంగా ‘అప్పట్లో సైనిక దాడుల నుంచి రాజసంపదను కాపాడటానికి ఈ రహస్య గదిని నిర్మించి, ఇందులో వీటిని భద్రపరచి ఉండచ్చు’ అని పురావస్తు శాస్త్రవేత్త విద్మంతస్ బెజారస్ తెలిపారు. -
చుక్కలు పాడిన చక్కటి పాట..!
బిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’ వరల్డ్ టూర్‌తో హల్చల్ చేస్తోంది, మన దేశంలోనూ ప్రదర్శన ఇచ్చింది. ఒకప్పటి ‘యూనివర్శిటీ కాలేజ్ లండన్’ మిత్రులు ‘కోల్డ్ ప్లే’గా సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు.సేఫ్టీ, యెల్లోలాంటి ఆల్బమ్‌లతో శ్రోతలకు దగ్గరయ్యారు. లైవ్ పెర్ఫార్మెన్స్లో తమదైన ప్రత్యేకత చాటుకున్నారు.ఇటీవల అహ్మదాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ ‘కోల్డ్ ప్లే’ హిట్ సాంగ్ ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ పాడి నెటిజనుల చేత వారెవా అనిపించుకున్నాడు. కొందరైతే ‘కోల్డ్ ప్లే తదుపరి కచేరిలో ప్రత్యేక స్థానానికి ఇతడు అర్హుడు’ అని ప్రశంసించారు.‘నేను కోల్డ్ ప్లేకు వీరాభిమానిని’ అంటున్నాడు ఆటోడ్రైవర్. ‘స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్’ మనం కూడా ఒకసారి పాడుకుందాం....కాజ్ యూ ఆర్ ఏ స్కై/ కాజ్ యూ ఆర్ ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్ఐయామ్ గొన్నా గివ్ యూ మై హార్ట్/ కాజ్ యూ లైట్ అప్ ది పాఐ డోన్ట్ కేర్ కాజ్ యూ ఆర్ ఏ స్కై View this post on Instagram A post shared by Navendu (@chasing.nothing) (చదవండి: బ్రకోలి ఆరోగ్యానికి మంచిదని కొనేస్తున్నారా..?) -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
సడెన్‌గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్‌పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్‌గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్‌ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్‌గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025 (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!
కోట్లు ఖరీదు చేసే హోటల్ కచ్చితంగా అంతకు మించిన ధరలో అమ్ముడుపోతుంది. అది పక్కా..!. పోనీ అలా కాదనుకుంటే.. కనీసం దాని విలువకు దగ్గరదగ్గరగా లేదా కొద్దిపాటి తేడాతో మంచి ధరలోనే అమ్ముడవుతుంది. కానీ ఇక్కడ కోట్లు ఖరీదు చేసే హోటల్ జస్ట్ వందల రూపాయల్లోనే అమ్ముడైతే..ఎవ్వరికైనా ఏంటిది అనే డౌటు వచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు అంత తెలివతక్కువగా ఎవడ్రా అమ్మింది అనుకుంటారు. కానీ అలా ఎందుకు అమ్ముతున్నారో వింటే శెభాష్ అని ప్రశంసించకుండా ఉండలేరు.ఇంతకీ అమ్మడానికి కారణం ఏంటంటే..అమెరికా కొలరాడోలోని డెన్వర్‌లో మాజీస్టే ఇన్ మోటెల్ హోటల్ విలువ ఏకంగా రూ. 75 కోట్లు ఉంటుంది. అంత ఖరీదుకే డెన్వర్ నగరం ఈ హోటల్ని కొనుగోలు చేసింది కూడా. అయితే ప్రస్తుతం దాన్ని నగరం కొద్దిపటి మరమత్తులు చేసి అమ్మేయాలనుకుంది. ఎంతకో తెలిస్తే కంగుతింటారు. కేవలం రూ. 875లకే అమ్మేస్తారట. కానీ వాళ్లుపెట్టే షరతులకు అంగీకరిస్తే అంత తక్కువ ధరలో అంత ఖరీదు చేసే హోటల్ని సొంత చేసుకోగలరని చెబుతున్నారు డెన్వర్ నగరం డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఆ షరతులేంటంటే..దీన్ని 99 ఏళ్లపాటు ఆదాయ నిరోధిక గృహంగా ఉంచాలట. అలాగే నిరాశ్రయులకు సహాయ గృహంగా ఉండాలనే షరతులకు అంగీకరిస్తే గనుక ఈ హోటల్ని తక్కువ ధరకే అమ్ముతామని చెప్పారు డెన్వర్ హౌసింగ్ స్టెబిలిటీ ప్రతినిధి డెరెక్ వుడ్బరీ. ఈ హోటల్ని పునరుద్ధరించి నిరాశ్రయలుకు నివాసంగా మారుస్తున్నాని అంగీకరిస్తేనే.. ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేయగలరన్నారు. మరీ ఇంతకు ఎవరూ దీన్ని పునరుద్ధరించి కొనుగోలు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది అందుకోసం దరఖాస్తు చేసుకున్నారని, వాటిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు వుడ్బరీ. ఆ ప్రతిపాదిత డెవలప్పర్ ఆమోదం నగర్ కౌన్సిలో చేతిలో ఉంటుందట. నిరాశ్రయులైనవారికి చక్కటి వసతిని కల్పించడమే లక్ష్యంగా ఈ వినూత్న డీల్‌ని తీసుకొచ్చినట్లు వివరించారు వుడ్బరీ. అంతేగాదు భవనాన్ని యథాతథంగా అమ్ముతామని కూడా చెబుతున్నారు. మరీ ఎవరు దీన్ని కొని ఈ మహత్తర కార్యక్రమానికి పూనుకుంటారనేది వేచి చేసి చూడాల్సిందే. (చదవండి: మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!) -
ఎవరీ అనన్య రాజే సింధియా..? 400 గదులు, 560 కిలోల బంగారంతో..
భారతదేశంలో రాజులు, రాజుల కాలం ముగిసినప్పటికీ వారి వంశస్థులు తమ వాసత్వ సంపద్రాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా జీవిస్తున్నాయి. అలా వారసత్వాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రాజవంశమే గాల్వియర్‌లోని సింధియా కుటుంబం. ఈ కుటుంబం రాజరికానికి పర్యాయ పదంగా ఉంటుంది. ఆ కుటుంబం వేరెవరో కాదు మన ప్రధాని మెదీ ప్రభుత్వంలోని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుటుంబమే. అలాంటి వ్యక్తి కుమార్తె అనగానే ఏ రేంజ్లోఉంటుదని సర్వత్రా కుతుహలంగా ఉంటుంది. అయితే ఆమె మాత్రం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఆమె నివశించే రాజదర్బారు లాంటి ప్యాలెస్‌కి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరీ ఆ విశేషాలేంటో చూద్దామా..!.ఆ రాకుమార్తె ఎవరంటే ..జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia), మహారాణి ప్రియదర్శిని రాజే(Maharani Priyadarshini Raje)ల ముద్దుల తనయే అనన్య రాజే సింధియా(Ananya Raje Scindia,). అందంలో ఆమె తల్లిని మించి అందంగా ఉంటుందని అంతా అనుకుంటుంటారు. అంతేగాదు అనన్య ప్రపంచంలోని 50 మంది అందమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది కూడా. రాజవంశానికి చెందినదైనా..జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా లోప్రొఫైల్ని కలిగి ఉంది. ఇక మంత్రి జ్యొతిరాదిత్య సింధియాకి కుమార్తె అనన్య తోపాటు కుమారుడు ప్రిన్స్ మహానార్యమన్ కూడా ఉన్నాడు. కుమార్తె ప్రిన్సెస్ అనన్య రాజే సింధియాకి తన రాజకుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా సాహస క్రీడలు, గుర్రపుస్వారీ, ఫుట్‌బాల్ వంటి వాటి పట్ల మక్కువ. ఇక ప్రాథమిక విద్యను ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో పాఠశాలలో పూర్తి చేయగా, ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది. ఇంతటి విలాసవంతమైన కుటుంబంలో జన్మించినప్పటికీ తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశ్యంతో స్నాప్‌చాట్(Snapchat)లో ఇంటర్న్‌గా పనిచేసి, ఆ తర్వాత ఆపిల్ కంపెనీ(Apple)లో డిజైనర్ ట్రైనీగా పనిచేస్తుందామె. ఆమె 2018లో ప్రతిష్టాత్మక పారిస్ ఫ్యాషన్ ఈవెంట్ 'లే బాల్'లో పాల్గొన్నప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. కేవలం 16 ఏళ్ల వయసులో తన సోదరుడు మహానార్యమన్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు ప్రశంసనీయంగానూ చర్చనీయాంశగానూ మారాయి. వాళ్లుండే ప్యాలెస్..సింధియా కుటుంబ రాజ నివాసం జై విలాస్ ప్యాలెస్. ఇవి వారి వారసత్వానికి చిహ్నం. ఈ అత్యద్భుత నిర్మాణానికి ఎవ్వరైన ఫిదా అవ్వుతారు. ఎందుకంటే సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 400 గదులు కలిగిన విలాసవంతమైన ఫ్యాలెస్. ఇందులోని గ్రాండ్ దర్బార్ హాల్ దాని ఐశ్వర్యానికి ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాలెస్ మొదటి అంతస్తు టస్కాన్ నిర్మాణ శైలిని, రెండో అంతస్తు ఇటాలియన్ డోరిక్ శైలి, మూడవ అంతస్తులో కొరింథియన్లో నిర్మించారు. దీని ఖరీదు వచ్చేసి..దగ్గర దగ్గర రూ. 4 వేల కోట్టు పైనే ఉంటుందట. దీన్ని 1874లో మహారాజా జయజీరావు సింధియా నిర్మించారు. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో అత్యంత బరువైన 3,500 కిలోగ్రాముల షాన్డిలియర్ లైటింగ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందట. దీన్ని ప్యాలెస్ పైకప్పు తట్టుకోగలదో లేదని ఏకంగా పది ఏనుగుల చేత పదిరోజుల పాటు నడిపించి పరీక్షించారట. అలాగే గ్రాండ్ దర్బార్ హాల్లో 560 కిలోగ్రాముల బంగారంతో అలంకరించిన గోడ కళ్లు చెదరిపోయేలా ఉంటుందట. దీంతోపాటు ఇందులో ఉండే విలాసవంతమైన భోజనశాలలోని వెండిరైలు టేబుల్‌పై వంటలను వడ్డించడం అత్యంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది. అంతేగాదు ఈ ప్యాలెస్‌లో ఉండే 35 గదులను రాజమాతా విజయ రాజే సింధియా, జివాజిరావ్ సింధియా జ్ఞాపకార్థం మ్యూజియంలుగా మార్చారు. దీన్ని హెచ్.హెచ్. మహారాజా జివాజిరావ్ సింధియా మ్యూజియం అని పిలుస్తారు ప్రజలు. గాల్వియర్‌లో తప్పక చూడాల్సిన పర్యాటక స్పాట్ కూడా ఇదే.(చదవండి: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!) -
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వి
తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి అతి పిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రాంత కళా పిపాసిగా చేసింది. 1897, మార్చి 8న జన్మించిన రామారావు రెండు పదుల వయసు నిండకుండానే ముంబైలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపాల్‌గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్డ్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన ‘సౌత్ ఇండియన్ అవర్’ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడివి బాపిరాజులతో బాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకిత మిచ్చారు. ప్రఖ్యాత కవి పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్లవారి గురించి ఇలా అన్నారు: ‘జీవముల వోసి, బొమ్మల జేసెనొకడు/బొమ్మలు గీసి జీవమును వోసేనొకడు/ రాముడాతడు, దామెర్ల రాము డితడు/ లేవు కాలావధులు చిత్ర లీలలందు.’ రవీంద్రనాథ్ టాగోర్‌ను కలిసిన పది నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసిచ్చారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన టాగోర్ ‘ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకరుడివి కాగలవు’ అని దీవించారట.అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు ‘తూర్పు కనుమల్లో గోదావరి’ చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనేయడమే కాక, ‘స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటు న్నాను చూడండి’ అని చమత్కరించారట. అశ్లీలతకు తావులేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు నవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే ‘సత్యవాణి’ అనే చిత్రకారిణిని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణిగారే ‘మోడల్’గా ఉండేవారు. స్వదేశంలోనే కాక పారిస్, లండన్, టోరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయ్. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ళ అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925, ఫిబ్రవరి 6న అకాల మరణం చెందారు. రామారావు చిత్రించిన ‘సిద్ధార్థ రాగోదయం’, ‘పుష్పాలంకరణ’, ‘నంది పూజ’, ‘గోపికాకృష్ణ’, ‘బావి వద్ద’, ‘అజంత’, ‘ఎల్లోరా’, ‘పట్టిసీమ’, ‘మెయిడ్స్ ఆఫ్ కథియావాడ్’... వంటి అత్యద్భుత కళాఖండాల్ని ఎన్నింటి గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925 లోనే ఆ రెంటినీ సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలని చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న ‘దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించు కోవలసిన విశేషమైన కళా సంపదలే. – గౌరవ్ ‘ సాంస్కృతిక కార్యకర్త (నేడు దామెర్ల రామారావు శతవర్ధంతి) -
మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!
వాతవరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఇప్పటికే పలు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ప్రేమికులు వాటిన సంరక్షించేందుకు పలు విధాలు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు ఆ అంతరించిపోతున్న జాతుల పరీరక్షణకు మార్గం సుగమం చేసేలా తొలిసారిగా మానవ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించారు. దీని సాయంతో అంతరించిపోతున్న జాతుల పిండాలను విజయంతంగా సృష్టించి సరికొత్త పరిష్కారానికి నాంది పలికారు. ఇంతకీ ఈ ఐవీఎఫ్‌ని ఉపయోగించి ఏ జంతు పిండాలను సృష్టించారంటే..ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు(Australian Scientists) తొలిసారిగా ఐవీఎఫ్‌ని ఉపయోగించి అంతరించిపోతున్న మార్సుపియల్ జాతి కంగారు పిండాలను(kangaroo embryos) విజయవంతగా సృష్టించారు. ఇలా మానవ ఐవీఎఫ్ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్(marsupial species) అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్తర్న్ హెయిరీ-నోస్డ్ వొంబాట్స్, లీడ్బీటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ(Queensland University) పరిశోధకుడు డాక్టర్ ఆండ్రీస్ గాంబిని( Andres Gambini,) తెలిపారు. తమ పరిశోధనా బృందం మానవ IVFలో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ద్వారా 20 కి పైగా కంగారూ పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు. ఈ ఐవీఎప్కి బూడిద రంగు కంగారులే అనువైనవని గాంబిని చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) జాతుల పరిరక్షణకు, సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు. దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యువైవిధ్యాన్ని ప్రవేశ పెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి ఐవీఎఫ్‌ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది. అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించాలే చూడటానికి ఈ జన్యువైవిధ్యం తప్పనిసరని అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీరదాల క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది. (చదవండి: -
కుంగ్ ఫూ శిక్షణ..ఆత్మరక్షణ కుర్రకారులో భారీ క్రేజ్
ఆత్మ రక్షణ క్రీడలైన కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ పై నగర వాసులకు ఆసక్తి పెరుగుతోంది. నగరంలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్స్ వేదికగా అభ్యాసన చేస్తున్నారు పలువురు క్రీడాకారులు. దీంతో పాటు పతకాలు సాధిస్తూ కొందరు.. స్ఫూర్తిగా మరికొందరు ఈ మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు నగరవాసులు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. – సనత్‌నగర్ నగరంలో ఇటీవలికాలంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు ఆదరణ పెరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ పట్ల పెరుగుతున్న అవగాహనే ఇందుకు కారణం. పైగా చిన్నతనం నుంచి ఇటువంటి శిక్షణలో పాల్గొనడంతో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్న మాట. దీంతో చిన్నారులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకునేందుకు కఠోర దీక్షతో అభ్యాసన చేస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ గ్రౌండ్స్‌లో నిర్వహించే శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుంటూ రాటుదేలుతున్నారు. ఆ‘శక్తి’ని గమనించి.. కోచ్‌లు సైతం పిల్లల్లోని ఆ‘శక్తి’ని గమనించి కుంగ్‌ఫూలో ఉన్నత శిక్షణను అందిస్తూ వివిధ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. బేగంపేట ఓల్డ్ పాటిగడ్డలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, బ్రాహ్మణవాడీ, మాసబ్ ట్యాంక్, విజయనగర్ కాలనీల్లో కుంగ్ ఫూ – మార్షల్ ఆర్ట్స్‌లో గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్, డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ కళ్యాణ్, జీహెచ్ఎంసీ కోచ్ చందు నిరంతరం శిక్షణను అందిస్తున్నారు. 2010 జనవరి 1 నుంచి వీరు శిక్షణ కొనసాగిస్తుండగా ఇప్పటి వరకూ వందలాది మంది కుంగ్ ఫూలో శిక్షణ పొందారు. చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే! పలు పోటీల్లో... నగరంలో ఎల్బీ స్టేడియం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి స్టేడియం, సరూర్‌నగర్, బాలయోగి స్టేడియం తదితర ప్రాంతాల్లో ఎక్కడ పోటీలు జరిగినా ఇక్కడి చిన్నారులు పాల్గొంటూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఒక్క నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని వరంగల్, సిర్పూర్ కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఖాజీపేటతో పాటు ఒడిస్సా, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలను సాధించారు. నాలుగేళ్ల చిన్నారుల నుంచి.. మానసిక, శారీరక దృఢత్వం, ఏకాగ్రత కోసం నాలుగేళ్ల చిన్నారి నుంచి 23 ఏళ్ల యువకుల వరకూ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది వెళ్లిపోగా, ప్రస్తుతం ఆయా కేంద్రాల వేదికగా 70 మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. చిన్నతనం నుంచే కుంగ్ ఫూలో శిక్షణ పొందడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని మాస్టర్లు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి : లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!కుంగ్ ఫూతో మేలు.. కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. శారీరక, మానసిక దృఢత్వం పెరిగి, ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. మా చిన్నారులు ప్రతిభ కనబరుస్తూ.. పతకాలు సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. – కంటేశ్వర్, కళ్యాణ్, చందు, కంగ్ ఫూ మాస్టర్లు మాస్టర్ల ప్రోత్సాహమే.. కుంగ్ ఫూలో నేను బ్లాక్ బెల్ట్ సాధించాను. మాస్టర్లు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఇప్పటి వరకూ ఎన్నో పోటీల్లో పాల్గొన్నాను. మొత్తం 30 బంగారు, 25 వెండి, 15 కాంస్య పతకాలను సాధించానంటే.. అది వారి శిక్షణ ఫలితమే. – వాసు, కుంగ్ ఫూ క్రీడాకారుడు -
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
స్టార్ డాక్టర్ కిల్లర్‌గా మారితే ఇంత ఘోరంగా ఉంటుందా..!
వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా "వైద్యో నారాయణో హరి:" అని అంటారు. అలాంటి వైద్య వృత్తికి కళంకం వచ్చేలా చేశాడో వ్యక్తి. ప్రాణాలు కాపాడతాడని ఆశతో వచ్చిన వాళ్లందరిని పొట్టనబెట్టుకున్నాడు. తామెందుకు చనిపోతున్నామో తెలియకుండానే ఎందరో అమాయకులు ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి. కనీసం చిన్న క్లూ దొరక్కుండా పక్కాప్లాన్‌తో చంపేశాడు. సీరియల్ కిల్లర్‌కి మించిన కిరాతకుడు. ఒక్క హత్య మాత్రం అతడి ఆగడాలకు చెక్‌పెట్టి దొరికపోయేలా చేసింది. చివరికి ఆ దారుణాలు పశ్చాత్తాపంతో కుమిలిపోయి చనిపోయేలా చేసింది. అయితే అతడు ఎందుకు ఈ హత్యలన్నీ చేశాడన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది.డాక్టర్ డెత్‌గా పిలిచే ఈ వైద్యుడి పేరు హెరాల్డ్ షిప్‌మ్యాన్. బ్రిటన్‌కి చెందిన వ్యక్తి. అతడికేసు పోలీసులకు అర్థంకానీ మిస్టరీలా మిగిలింది. అతడు పోలీసులకు పట్టుబడినప్పుడు 50 మంది రోగులు చనిపోయారని తెలియగా..దర్యాప్తులో మాత్రం ఏకంగా 200 మందిని హతం చేసినట్లు తేలింది. వారిలో అత్యంత చిన్న బాధితుడు నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండడం అత్యంత విషాదకరం. అయితే అతడి టార్గెట్ అత్యంత వృద్ధులే. వారి అయితే ఎలాంటి అనుమానం రాకుండా చంపేయొచ్చనేది అతడి ఆలోచన కావొచ్చనేది పోలీసుల అనుమానం. ఇక ఈ హెరాల్డ్ షిప్మాన్ డాక్టర్ అయిన వెంటనే వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉద్యోగం పొందాడు. అతను ప్రిమ్రోస్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు కూడా. ఇంత మంచి జీవితాన్ని ఇలా ఎందుకు చీకటి మయం చేసుకున్నాడనేది అర్థంకానీ చిక్కుప్రశ్న.స్టార్ డాక్టర్ నుంచి కిల్లర్‌గా..1972లో, అతను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు న్యుమోనియాతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలికను చికిత్స పేరుతో హతం చేశాడు. బాలిక తల్లిని టీ తీసుకురమ్మని చెప్పి..హతమార్చాడు. అయితే ఆమె కూడా అనుమానించలేకపోయింది. ఎందుకంటే ఆమె అనారోగ్యంతోనే బాధపడటంతో ఆ ఆలోచనే ఆమెకు తట్లలేదు.ఎప్పుడైతే ఈ డాక్టర్ పట్టుబడ్డాడో అప్పుడామె తాను కూడా బాధితురాలినంటూ కోర్టు మందు ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. అతడు వైద్యుడిగా వెస్ట్ యార్క్‌షైర్‌లో ఉన్న సమయంలో అతని సహచరులు పెద్ద మొత్తంలో నొప్పి నివారిణి పెథిడిన్ కనిపించకుండా పోయిందని గమనించడం ప్రారంభించారు. అయితే ఇక్కడ హెరాల్డ్ మంచి డాక్టర్‌గా గుర్తింపు ఉండటంతో ఎవ్వరూ అతడిని అనుమానించే సాహసం చేయలేకపోయారు. ఈ డాక్టర్ మొదట అక్కడ పేషెంట్ల నమ్మకం పొందాక...తన ప్రణాళికను అమలు చేయడం మొదలు పెడతాడు. వృద్ధులనే టార్గెట్ చేసుకుని హత్యలకు పాల్పడుతాడు. ఒక్కొసారి వారిని ఇంటికి రమ్మని పిలచి మరీ హతమారుస్తుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోగికి కూడా వైద్యుడే తమను చంపుతున్నాడన్న విషయం తెలియదు. అయితే అతడితో చికిత్స పొందిన రోగులంతా చివరగా విపరీతమైన దగ్గుతో లేదా అంబులెన్స్‌కి ఫోన్ చేస్తూ మరణించినవారే..!. అలా 1998 వరకు ఇలాంటి దారుణాలకే పాల్పడుతూ వచ్చాడు.పట్టించిన కేసు..1998లో, అతను హైడ్ మాజీ మేయర్ కాథ్లీన్ గ్రండి (81)కి చికిత్స చేశాడు. ఆమె అత్యంత చురుకైన వ్యక్తి, మంచి ఆరోగ్యవంతురాలు, ధనవంతురాలు కూడా. అయితే ఆమె చెవులకు సంబంధించిన సమస్యతో అతడి వద్దకు వెళ్లింది. అతడిని సందర్శించిన నాలుగంటల్లోనే చనిపోయింది. ఇక్కడ కాథ్లీన్ గ్రండి కూతురు ఏంజెలా వుడ్రఫ్కి తన తల్లి మరణం సహజమైనది కాదనేది ఆమె అనుమానం. ఆ దిశగానే ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే ఆమె తల్లి అంత్యక్రియలు పూర్తి అయ్యిన నెలకు ఆమె వీలునామా గురించి ఆరా తీసింది. అందులో మొత్తం ఆస్తి అంతా డాక్టర్ హెరాల్డ్‌కి కట్టబెట్టినట్లుగా ఉండటంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. అదీగాక ఇక్కడ వుడ్రప్ లాయర్ కావడంతో పోలీసులతో కలిసి తన తల్లి హత్య కేసుని చేధించడం చాలా తేలికయ్యింది. ఆ క్రమంలోనే డాక్టర్ హెరాల్డ్ పట్టుబట్టాడు. అతడి శస్త్రచికిత్స చేసే రూమ్‌లో టైప్రైటర్ని గుర్తించారు పోలీసులు. అలాగే వీలునామాలో కూడా కాథ్లీన్ గ్రండి సంతకాన్ని పోర్జరీ చేసినట్లు తేలుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వుడ్రఫ్ని డాక్టర్ హెరాల్డ్ ఆమె తల్లిని దహనం చేయమని కోరాడు. అయితే అందుకు వుడ్రఫ్ వ్యతిరేకించి తమ మతానుసారం ఖననం చేస్తుంది. ఎప్పుడైతే డాక్టరే నేరస్తుడని తేలిందో.. అప్పుడే వుడ్రఫ్కి ఈ సంభాషణ గుర్తుకొస్తుంది. ఆ రోజు హెరాల్డ్ ఎందుకని తన తల్లిని దహనం చేయమన్నాడన్న అనుమానంతో.. తన తల్లి సమాధి నుంచి అవశేషాలను వెలికి తీసి మరీ పోస్ట్‌మార్ట్ చేయిస్తుంది. నివేదికలో కాథ్లీన్ శరీరంలో ప్రాణాంతకమైన మార్ఫిన్ పెద్ద మొత్తంలో ఉన్నట్లు తేలుతుంది. దీంతో పోలీసులు సదరు వైద్యుడు హెరాల్డ్‌ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తే 50 మంది రోగులను చంపినట్లు తేలుతుంది. కానీ పోలీసుల దర్యాప్తు ఆ సంఖ్య 200కి చేరుకుంటుంది. ఇంతమందిని పొట్టనబెట్టుకున్నాడా అని పోలీసులే విస్తుపోతారు. అయితే కోర్టు అతడు ఇంత మందిని హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి..? అతడి మనోస్థితి ఏంటో చెప్పాల్సిందిగా మానసిక నిపుణులను కోరింది. అయితే మానసిక నిపుణులు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పారు. ఒకరు అతడి తల్లి చిన్నతనంలో కేన్సర్‌తో బాధపడుతూ..ఆ నొప్పిని భరించలేక మార్ఫిన్ ఇంజెక్షన్లు తీసుకుందని అయినా ఫలితం లేక మరణించినట్లు తెలిపారు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసి ఇలా చేస్తున్నట్లు చెప్పారు. మరికొందరూ నిపుణులు తనను తాను దేవుడిగా ఊహించుకుని మరణాన్ని శాసించాలన్న ఉద్దేశ్యంతో చేశాడని చెప్పుకొచ్చారు.అయితే హెరాల్డ్ మాత్రం కోర్టు ముందు హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు కానీ ఎందుకు చేశాడన్నది వివరించలేదు. చివరికి ఆ కిరాతకు వైద్యుడు హెరాల్డ్‌కి 2000 సంవత్సరంలో జీవిత ఖైదు విధించింది కోర్టు. అయితే రెండేళ్లకే తన 58వ పుట్టిన రోజునాడు తన జైలు గదిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఆ డాక్టర్ అందమైన తన జీవితాన్ని ఎందుకు చేజేతులారా నాశనం చేసుకున్నాడనేది ఎవరికీ అర్థకానీ మిస్టరీలా మిగిలిపోయింది.(చదవండి: 'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!) -
'రియల్ లైఫ్ పరాన్నజీవి'..ఏడేళ్లుగా ఇంటి పాత యజమాని..!
పరాన్నజీవులు గురించి విన్నాం. ఇతరులను ఆశ్రయించి బతికే వాటిని పరాన్నజీవులు అనిపిలుస్తాం. పందులు, ఇతర జంతువులు ఆశ్రయించి ఉండే బద్దేపురుగులు, వైరస్‌లను ఇలా పిలుస్తాం. అయితే మనుషుల్లో కూడా కొందూ ఇతరులపై ఆధారపడి జీవనం సాగించేవారిని కూడా ఇలా పోలుస్తు తిడుతుంటారు. కానీ అచ్చం అలానే రియల్ లైఫ్ పరాన్నజీవిలా జీవనం సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పైగా దొరికిపోయి కూడా అడ్డంగా బుకాయించే యత్నం చేసిందామె. ఈ విషయం కాస్తా కోర్టుదాక చేరుకుంటే గానీ ఆమె తిక్క కుదరలేదు. అసలేం జరిగిందంటే..తూర్పు చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్‌లో నివశిస్తున్న లీ అనే వ్యక్తి ఒక రోజుల తన ఇంటిని శుభ్రపరుస్తున్నాడు. సరిగ్గా ఆసమయంలోనే తన ఇంటి బేస్మెంట్(Basement)లో ఒక గది ఉండటం చూసి విస్తుపోతాడు. అక్కడ ఒక మనిషి జీవనం సాగిస్తున్నట్లు అన్ని వసతులు ఉంటాయి. ఇదేంటని ఆశ్చర్యపోతూ..క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత అక్కడ నిజంగానే ఒక వ్యక్తి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఆమె ఎవరా అని ఆలోచించగా.. ఈ ఇంటి పాత యజామని(Former Homeowner) జాంగ్‌గా గుర్తించి కంగుతింటుంది. వెంటనే లీ తనకు ఈ ఇల్లుని కొనుగోలు చేసిన మాజీ యజమానురాలు జాంగ్ని గట్టిగా నిలదీస్తుంది. అయితే ఆమె తెలివిగా ఇంటి గురించి పూర్తి సమాచారం ఇచ్చానే గానీ కింద బేస్మెంట్ మీకు చెందుతుందని ఒప్పందంలో లేదంటూ మాట్లాడుతుంది. కానీ లీ తనకు అమ్మకం సమయంలో ఇంటి బేస్మెంట్ గురించి రహస్యంగా ఉంచి మళ్లీ ఇలా దబాయిస్తుందని మండిపడతాడు. పైగా ఇల్లు అమ్మేశానే కానీ బేస్మింట్ కాదని తేల్చి చెప్పింది పాత యజమానురాలు జాంగ్. పైగా విరామ సమయంలో ఇలా ఆ బేస్మెంట్లో సేదతీరుతానని కరాఖండీగా చెప్పింది. అయితే ఇక్కడ లీ గమనించకుండా జాంగ్ ఎలా ఆ బేస్మెంట్లోకి వెళ్లి వస్తుందన్నది అస్పష్టంగా ఉంది. ఈ స్టోరీ అచ్చం చైనాలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రం పారాసైట్ కథలా ఉంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి బేస్మెంట్లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. కాగా, దీనిపై చాలా సీరియస్‌గా ఉన్న లీ వెంటనే ఈ విషయమై కోర్టు(court)ని ఆశ్రయించి గట్టిగా పోరాడతాడు. చివరికి మాజీ ఇంటి యజమానిపైకేసు గెలిచి నష్టపరిహారం కూడా అందుకుంటాడు లీ.(చదవండి: ఈ డివైజ్‌తో చిన్నారులను నిద్రపుచ్చడం చాలా ఈజీ..!) -
ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!
కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!. ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది. కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే ఈ డ్యాన్స్ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!)