
‘ఎవరినైనా బెదిరించాలన్నా, గుండాయిజం, రౌడీయిజం వంటి విలనీ పనులు చేయాలన్నా సంప్రదించండి ‘విలన్ ఫర్ హైర్’. విలన్‌ను చావగొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దగ్గర హీరోయిజం ప్రదర్శించాలనుకుంటున్నారా? ‘విలన్ ఫర్ హైర్’ను సంప్రదిస్తే, సులువుగా మీ కోరిక తీరిపోతుంది.
మలేసియాలో ఈ సేవలు అందిస్తున్న షజాలీ సులేమాన్‌కు తగిన రుసుము చెల్లిస్తే, మీకోసం అతగాడు విలన్‌లా నటిస్తాడు. మీ గర్ల్‌ఫ్రెండ్ మీతో ఉన్నప్పుడు హఠాత్తుగా వచ్చి, ఆమెను అల్లరిపెడతాడు. అప్పుడు మీరు హీరోలా అతడితో కలబడి, అతడిని తరిమికొట్టి మీ గర్ల్‌ఫ్రెండ్ దృష్టిలో హీరోగా ఫోజు కొట్టవచ్చు.
సులేమాన్ మరికొన్ని సేవలు కూడా అందిస్తున్నాడు. బెదిరించి తగాదాలను పరిష్కరించడం, సోషల్ మీడియాలోను, సమాజంలోను ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను తీర్చడం వంటి పనులను ‘విలన్’లా ప్రవేశించి ఇట్టే పూర్తిచేస్తాడు. ఈ పనులకు అతడు వసూలు చేసే మొత్తం పనిదినాల్లోనైతే, రూ.1,975, వీకెండ్స్‌లోనైతే రూ. 2,963 మాత్రమే! ఇతడి వ్యాపారం రోజురోజుకూ బ్రహ్మాండంగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment