hero
-
హీరో బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
రెండో పెళ్లి.. ఫోటోలు షేర్ చేసిన నటుడు సాయికిరణ్ (ఫోటోలు)
-
Game Changer Pre Release Event : హీరో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
హీరో వరుణ్ తేజ్ మూవీ మట్కా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కోటి రెమ్యూనరేషన్ అందుకున్న ఇండియన్ తొలి హీరో ఎవరు.. ఏ సినిమాకు? (ఫోటోలు)
-
కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల సంస్థ హీరో మోటార్స్ కంపెనీ(హెచ్ఎంసీ) పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన నుంచి వెనక్కు తగ్గింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తాజాగా ఉపసంహరించుకుంది. ఐపీవో ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత భావించింది. ఇందుకు అనుగుణంగా సెబీకి ఆగస్ట్‌లో ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయడంతోపాటు.. మరో రూ.400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేసేందుకు ప్రమోటర్లు ఆసక్తి చూపారు. అయితే కారణం వెల్లడించకుండానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ తాజాగా తెలియజేసింది. ఐపీవోలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ.250 కోట్లు, హీరో సైకిల్స్, భాగ్యోదయ్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.75 కోట్లు చొప్పున షేర్లను ఆఫర్ చేయాలని భావించాయి. కంపెనీ ప్రధానంగా ఆటోమోటివ్ దిగ్గజాలకు హైఇంజినీర్డ్ పవర్‌ట్రయిన్ సొల్యూషన్ల తయారీ, సరఫరాలో ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులుసురక్షా డయాగ్నోస్టిక్ రెడీసమీకృత డయాగ్నోస్టిక్ సేవల కంపెనీ సురక్షా డయాగ్నోస్టిక్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు వీలుగా జులైలోనే ప్రాథమిక పత్రాలను సెబీకి దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ జులైలో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో నిధులు కంపెనీ ప్రమోటర్లు, వాటాదారులకు అందనున్నాయి. వెరసి కంపెనీకి ఐపీవో నిధులు లభించవు. కంపెనీ పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్, మెడికల్ కన్సల్టేషన్ సర్వీసులు అందిస్తోంది. -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
మంచు మనోజ్- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)
-
హీరోలకు ఏమాత్రం తగ్గని ఫిజిక్.. సంచలనాల సీఈవో..
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
హీరో విజయ్ను కలిసిన రంభ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు! (ఫోటోలు)
-
నేరం అంగీకరించిన హీరో దర్శన్ !
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్‌కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. దర్శన్ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్‌లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
Rajasthan: జీరో నుంచి హీరోగా కాంగ్రెస్?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటింది. ఎన్డీఏ 288 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ 240 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఇండియా అలయన్స్ కూడా మంచి ఫలితాలను రాబడుతోంది. మొదటి రెండు గంటల్లో 211 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక్కటే 92+ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.ప్రారంభ పోకడలు పలు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీని చూపాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది. రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.రాజస్థాన్ ట్రెండ్స్ చూస్తుంటే భారీ తిరోగమనం కనిపిస్తోంది. బీజేపీకి పెద్ద దెబ్బ తగులుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 25 స్థానాలకు గానూ గతసారి బీజేపీ 24 సీట్లు గెలుచుకుంది. నాడు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే ఈసారి కాంగ్రెస్ ఊహించని రీతిలో దూసుకుపోతూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కంటే ముందుంది.గతంలో మోదీ హవాతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ దెబ్బతింది. 2014లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. 2019లో 34.22 శాతం ఓట్లు సాధించింది. అయితే ఈసారి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజ్‌సమంద్, జైపూర్, పాలి, అల్వార్ స్థానాలలో బీజేపీ ముందుంది. కరౌలి, బార్మర్, జైపూర్ రూరల్, సవాయ్ మాధోపూర్, టోంక్, భరత్పూర్ తదితర స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. -
ప్రముఖ ఫైనాన్స్ కంపెనీపై ఆర్బీఐ చర్యలు
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. రూ.3.1 లక్షల జరిమానా విధించింది.ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో హీరో ఫిన్ కార్ప్ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. హీరో ఫిన్ కార్ప్ తన కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాల చట్టబద్ధతను ఈ పెనాల్టీ ప్రశ్నించదని, రెగ్యులేటరీ మార్గదర్శకాలను పాటించడంలో లోపాలను ఎత్తిచూపుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.2023 మార్చి 31 నాటికి హీరో ఫిన్‌కార్ప్ ఆర్థిక స్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన ఆర్బీఐ.. తమ ఆదేశాలను పాటించడంలో కంపెనీ విఫలమైనట్లు నిర్దారించి హీరో ఫిన్ కార్ప్ కు నోటీసులు పంపి, ఈ లోపాలకు ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని కోరింది. దీనికి హీరో ఫిన్ కార్ప్ రాతపూర్వక, మౌఖికంగా ఇచ్చిన స్పందనను, అదనపు సమాచారాన్ని ఆర్బీఐ సమీక్షించి జరిమానా విధించింది. -
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్‌లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్‌పై మోహన్‌లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్‌లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్‌లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్‌లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్‌లో నటించలేదు.ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్‌లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్‌లాల్‌కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్‌కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
అల్లు అర్జున్‌తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్‌కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
సుహాస్ మూవీతో 'నువ్వు నేను' హీరోయిన్ రీ ఎంట్రీ (ఫోటోలు)
-
క్రేజ్ కాపాడుకోలేకపోయాడు.. ఆ తప్పు వల్ల కెరీర్, జీవితం సర్వనాశనం!
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేవాళ్లు చాలామందే కనిపిస్తారు. నిజంగానే ఒక్క ఛాన్స్‌తో అద్భుతాలు జరిగిపోతాయా? అంటే అవుననే చెప్పాలి. ఎంతోమంది తొలి సినిమాతోనే తామేంటో ప్రూవ్ చేసుకుని గొప్ప స్థాయికి ఎదిగారు. అదే సమయంలో ఫస్ట్ సినిమాతో క్రేజ్ అందుకున్నా తర్వాతి రోజుల్లో దాన్ని కాపాడుకోలేక మరుగునపడ్డ హీరోలూ ఉన్నారు. ప్రేమికుల రోజు సినిమా హీరో కునాల్ సింగ్ ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించే నేటి ప్రత్యేక కథనం.. ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కునాల్ సింగ్ నటించిన తొలి సినిమా కాదల్ దినం. ఈ మూవీ తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ అయింది. ఇందులో సోనాలి బింద్రే హీరోయిన్గా యాక్ట్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. వాలు కనులదానా, ప్రేమ అనే పరీక్ష రాసి.. , దాండియా ఆటలు ఆడ.. ఇలా అన్ని పాటలు బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్టయింది. ఇంకేముంది.. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక్కడే తప్పటడుగులు వేశాడు. హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువగా అందుకున్నాడు. అతడు సంతకం చేసిన సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. (చదవండి: Vithika Sheru: మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.. వితికా ఎమోషనల్ పోస్ట్) భార్య ఉండగా నటితో క్లోజ్.. మరికొన్ని షూటింగ్ జరిగినా విడుదలకు నోచుకోలేదు. ఐదేళ్లలోనే డీలా పడిపోయాడు. 2007లో చివరగా నంబనిన్ కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్టర్‌గా రాణించడం కష్టమని తెలియగానే అసిస్టెంట్ డైరెక్టర్ అవతారమెత్తాడు. తర్వాత నిర్మాతగానూ మారాడు. అయతే కునాల్, నటి లావిణ పంకజ్ భాటియా అత్యంత సన్నిహితంగా మెదిలేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలిసింది. దీని గురించి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవట! ప్రాణాలు తీసుకున్నాడు ఆమె కోపంతో ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్లిపోవడంతో కునాల్ మనస్తాపానికి గురయ్యాడు. 2008 ఫిబ్రవరి 7న తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఏదో సినిమా గురించి స్క్రిప్ట్ రైటర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, నటి పంకజ్‌తో తన ఇంట్లోనే చర్చలు జరిపాడు. అందరూ వెళ్లిపోయాక పంకజ్ అక్కడే ఉన్న వాష్‌రూమ్‌ను వాడుకుందామని వెళ్లి వచ్చింది. అంతలోనే కునాల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఏమీ మిగల్లేదు అయితే పంకజ్‌కు, కునాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలోనే హీరో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న పుకార్లు కూడా వచ్చాయి. ఈ కేసులో పోలీసులు పంకజ్ భాటియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ ఇది ఆత్మహత్యే అని నిర్ధారించారు. అంతకుముందు కూడా కునాల్ ఒకటీరెండు సార్లు చనిపోయేందుకు ప్రయత్నించాడట! ఒకవైపు కెరీర్ నాశనమైంది.. మరోవైపు సంసార జీవితం కూడా సవ్యంగా లేదు.. వీటికి తోడు నిర్మాతగా అప్పులపాలు అవడంతోనే అతడు తనువు చాలించాడని చెప్తుంటారు. ఏదేమైనా 31 ఏళ్ల వయసులోనే అతడు ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
స్టార్ హీరోయిన్లతో సినిమాలు.. ఇప్పుడేమో ఖరీదైన కారును అమ్మేసి!
సినిమా రంగం అంటేనే కలల ప్రపంచం. ఇక్కడ స్టార్డమ్ అనేది అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన టాలెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలా ఒక్క సినిమాతో మెరిసి.. ఇలా వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన హీరోలకు సైతం అవకాశాలు రాక ఇబ్బందులు పడినా సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ముందువరుసలో ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. జానే తూ.. య జానేనా అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేశారు. చివరిసారిగా కంగనాతో కట్టి బట్టి చిత్రంలో కనిపించారు. అంతే కాదు స్టార్ హీరో అమీర్ ఖాన్ మేనల్లుడు కూడా. 2015లో విడుదలైన చివరిసారిగా కట్టి బట్టీలో కనిపించిన ఇమ్రాన్ ఖాన్ అప్పటి నుంచి దాదాపు సినిమాల్లో కనిపించలేదు. అతను సినిమాలకు దూరమై దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. అయితే ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఇమ్రాన్ ఖాన్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు మానేశాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం తన కూతురు కోసమే సమయం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: పవర్ఫుల్ పాత్రలో ఆదా శర్మ.. మరో కాంట్రవర్సీ అవుతుందా?) ఖరీదైన కారు అమ్మేసి..సింపుల్‌గా సినిమాలు చేసే సమయంలో ఫుల్ లగ్జరీ లైఫ్‌ను అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నారు. గతంలో తాను వినియోగించిన ఖరీదైన ఫెరారీ కారును సైతం అమ్మేశారు. ప్రస్తుతం వోక్స్ వాగన్ కారును ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలోని పాలి హిల్‌లోని లగ్జరీ బంగ్లా నుంచి బయటకొచ్చారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ఓ చిన్న అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. 'నేను ఇటీవలే తండ్రిని అయ్యా. ఈ సమయం నాకు చాలా విలువైనది. నా కూతురు ఇమారా కోసం నేను సమయం కేటాయించాలని కోరుకుంటున్నా. ఇకపై నటుడిగా ఉండటం నా పని కాదని నిర్ణయించుకున్నా. నేను నన్ను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. నా కుమార్తె, నా ఫ్యామిలీతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా' అని తెలిపారు. అయితే కంగనాతో చేసిన కట్టి బట్టీ ఫ్లాప్ అయిన తర్వాత తనకు అవకాశాలు రాలేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ అప్పటికే ఆర్థికంగా నిలదొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే 30 ఏళ్లు వచ్చేసరికి డబ్బుల కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం రాలేదని వెల్లడించారు. ప్రస్తుతం కెరీర్ కోసం గతంలో మాదిరి కష్టపడేంత ఉత్సాహం ఇప్పుడు లేదని అన్నారు. కాగా.. ఇమ్రాన్ ఖాన్ మేరీ బ్రదర్ కీ దుల్హాన్, ఏక్ మైన్ ఔర్ ఏక్ తూ, ఢిల్లీ బెల్లీ, గోరీ తేరే ప్యార్ మే లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.