Singer Sunitha Son Akash Debut Sarkaru Naukari Movie First Look Poster Goes Viral - Sakshi
Sakshi News home page

Singer Sunitha Son Debut Movie: టాలీవుడ్‌లోకి మరో హీరో.. అలాంటి సినిమాతో

Published Sat, Jul 1 2023 3:27 PM | Last Updated on Sat, Jul 1 2023 3:37 PM

Singer Sunitha Son Akash Sarkaru Naukari Movie First Look - Sakshi

తెలుగు సంగీత ప్రేక్షకులకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన పేరు సునీత. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పాటలు పాడటంతోపాటు పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ చాలా ఫేమస్ అయింది. ఈమె కుమార్తె ఇప్పటికే ఓ సినిమాలో పాట పాడి గాయనిగా పరిచయమైంది. ఇప్పుడు కొడుకు ఆకాశ్ ఏకంగా హీరో అయిపోయాడు. తాజాగా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)

సునీత్ రియాక్షన్
'కంగ్రాట్స్ ఆకాశ్.. ఓ తల్లీ, కుమారుడి కల నెరవేరిన రోజు ఇది. ప్రపంచానికి నువ్వు నాకు చెప్పిన కథని చూపించడంతో, నటుడు కావాలనే సాకారం చేసుకోవడం కోసం నువ్వు పడిన శ్రమ, వృత‍్తి పట్ల నిబద్ధత, నువ్వు చేసిన త్యాగాలు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని సింగర్ సునీత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు. 

ఫస్ట్ లుక్ లో ఏముంది?
'సర్కారు నౌకరి' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో ఆకాశ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. భావన అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ బట్టి చూస్తుంటే.. 1980ల్లో జరిగిన కథలా అనిపిస్తుంది. ఓ పెద్ద చెట్టు, దానికి కండోమ్ ప్యాకెట్స్ డబ్బా, వెనక పల్లెటూరు చూస‍్తుంటే ఆసక్తి కలుగుతోంది.


(ఇదీ చదవండి: 'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement